• TFIDB EN
  • శివకార్తికేయన్
    జననం : ఫిబ్రవరి 17 , 1985
    ప్రదేశం: సింగంపునరి, తమిళనాడు, భారతదేశం
    శివకార్తికేయన్‌.. తమిళ ఇండస్ట్రీకి చెందిన స్టార్‌ హీరో. కెరీర్‌ ప్రారంభంలో మిమిక్రి ఆర్టిస్టుగా చేశారు. మరినా (2012) సినిమాతో తమిళ ఇండస్ట్రీలో అడుగుపెట్టారు. 'రెమో' (2016) సినిమాతో స్టార్‌ నటుడిగా మారారు. శివకార్తికేయన్‌ నటించిన పలు తమిళ చిత్రాలు తెలుగులో డబ్‌ అయ్యి హిట్‌ టాక్‌ తెచ్చుకున్నాయి. 2024 వరకూ శివకార్తికేయన్‌ 22 చిత్రాల్లో కథానాయకుడిగా చేశారు.

    శివకార్తికేయన్ వయసు ఎంత?

    శివకార్తికేయన్‌ వయసు 40 సంవత్సరాలు

    శివకార్తికేయన్ అభిరుచులు ఏంటి?

    డ్యాన్సింగ్‌, సింగింగ్‌

    శివకార్తికేయన్ ఏం చదువుకున్నారు?

    బీటెక్‌

    శివకార్తికేయన్ సినిమాల్లోకి రాకముందు ఏం చేశారు?

    మిమిక్రీ ఆర్టిస్టుగా చేశారు.

    శివకార్తికేయన్ ఏ విద్యాసంస్థల్లో చదువుకున్నారు?

    జేజే కాలేజ్‌ ఆఫ్ ఇంజనీరింగ్‌ అండ్‌ టెక్నాలజీ, తిరుచిరాపల్లి, తమిళనాడు

    శివకార్తికేయన్‌ ఇప్పటివరకూ చేసిన తెలుగు చిత్రాలు ఏవి?

    తెలుగులో నేరుగా ఒకే ఒక్క ఫిల్మ్‌ చేశారు. జాతిరత్నాలుఫేమ్‌ డైరెక్టర్‌ అనుదీప్‌ రూపొందించిన ప్రిన్స్‌చిత్రంలో శివకార్తికేయన నటించారు. తమిళ చిత్రాలతో కలిపి 2024 వరకూ 22 చిత్రాలు చేశారు.

    శివకార్తికేయన్ In Sun Glasses

    Images

    Sivakarthikeyan Images in Sunglasses

    శివకార్తికేయన్ అన్‌ కేటగిరైజ్డ్ ఇమేజెస్‌

    Images

    Sivakarthikeyan

    Viral Videos

    View post on X

    Sivakarthikeyan Viral Video

    <strong>Amaran Collections: తెలుగులో 500% లాభాలతో దుమ్మురేపిన ‘అమరన్‌’.. ఎంత వచ్చాయంటే?</strong>
    Amaran Collections: తెలుగులో 500% లాభాలతో దుమ్మురేపిన ‘అమరన్‌’.. ఎంత వచ్చాయంటే? కోలీవుడ్‌ స్టార్ యాక్టర్‌ శివకార్తికేయన్ (Sivakarthikeyan) హీరోగా తెరకెక్కిన చిత్రం అమరన్‌ (Amaran). అమరుడైన మేజర్‌ ముకుంద్‌ జీవితంలోని పలు కోణాలను ఆవిష్కరిస్తూ తెరకెక్కిన ఈ మూవీ అక్టోబర్ 31న తెలుగు, తమిళంతోపాటు వివిధ భాషల్లో గ్రాండ్‌గా విడుదలై సూపర్ హిట్ టాక్‌ తెచ్చుకుంది. విడుదలై 19 రోజులు అయినా ఇప్పటికీ అద్భుతమైన వసూళ్లు సాధిస్తూ బాక్సాఫీస్‌ వద్ద దుమ్మురేపుతోంది. అటు తెలుగులోనూ రికార్డు వసూళ్ల (Amaran Collections)ను రాబడుతూ అందర్నీ ఆశ్చర్యపరుస్తోంది. థియేటర్లలో పూర్తి స్థాయి ఆక్యుపెన్సీతో అదరగొడుతోంది. ఫలితంగా నటుడు శివకార్తికేయన్‌ తన కెరీర్‌లో మరో మైలురాయిని అందుకున్నాడు.&nbsp; రూ.300 కోట్ల క్లబ్‌లోకి.. శివ కార్తికేయన్‌ (Sivakarthikeyan) హీరోగా దర్శకుడు రాజ్‌కుమార్‌ పెరియసామి రూపొందించిన చిత్రం ‘అమరన్‌’ (Amaran). సాయి పల్లవి (Sai Pallavi) హీరోయిన్‌. దీపావళిని పురస్కరించుకుని అక్టోబర్‌ నెల 31న సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అందరి అంచనాలను అందుకుంటూ బాక్సాఫీస్‌ వద్ద అద్భుత ప్రదర్శన చేస్తోంది. తొలి 19 రోజుల్లో ఈ చిత్రం రూ.300 కోట్ల గ్రాస్‌ (Amaran Collections)ను తన ఖాతాలో వేసుకుంది. ఈ మేరకు ‘మెగా బ్లాక్‌ బాస్టర్’ అంటూ మేకర్స్‌ పోస్టర్‌ను రిలీజ్ చేశారు. శివకార్తికేయన్‌ కెరీర్‌లో ఇప్పటివరకూ ఏ సినిమా రూ.300 కోట్ల మార్క్ అందుకోలేదు. అమరన్‌తోనే అతడు ఈ ఘనత సాధించడం విశేషం.&nbsp; https://twitter.com/Dasarathan_1720/status/1858698464630063231 తెలుగులో లాభాలే లాభాలు.. ‘అమరన్‌’ చిత్రానికి తెలుగు ప్రేక్షకులు సైతం బ్రహ్మరథం పడుతున్నారు. ఈ మూవీ తెలుగు హక్కులు రూ.4 కోట్లకు అమ్ముడు పోగా బ్రేక్‌ ఈవెన్‌ టార్గెట్‌ రూ.8 కోట్లుగా నిలిచింది. అయితే తెలుగులో ఎవరు ఊహించని స్థాయిలో ఈ సినిమాకు పాజిటివ్‌ రెస్పాన్స్‌ వచ్చింది. దీంతో ఇప్పటివరకూ రూ.41 కోట్ల గ్రాస్‌ (Amaran Collections) వసూళ్లను అమరన్‌ సాధించింది. 500% లాభాలతో తెలుగు డిస్ట్రిబ్యూటర్లు ఫుల్‌ ఖుషీ అవుతున్నారు. అటు తమిళనాడులోనే రూ.143 కోట్లను ‘అమరన్‌’ తన ఖాతాలో వేసుకుంది. అలాగే కేరళలో రూ.11.50 కోట్లు, కర్ణాటకలో రూ.22 కోట్లు, రెస్ట్ ఆఫ్ ఇండియా రూ.4.5 కోట్లు, ఓవర్సీస్‌లో ఏకంగా రూ.79 కోట్లను కొల్లగొట్టింది. ఈ స్థాయి రెస్పాన్స్‌ చూసి అమరన్‌ టీమ్‌ తెగ ఖుషీ అవుతోంది.&nbsp; కలిసొచ్చిన కంగువా ఫ్లాప్‌..&nbsp; నిజానికి అమరన్‌ హిట్ అవుతుందని చిత్ర యూనిట్ భావించినా ఈ స్థాయి వసూళ్లు వస్తాయని వారు కూడా ఊహించలేదు. ఎందుకంటే సూర్య నటించిన పాన్‌ ఇండియా చిత్రం ‘కంగువా’ వల్ల తమ లాంగ్‌ రన్‌ కలెక్షన్స్ దెబ్బతింటాయని భావించారు. అయితే నవంబర్‌ 14న వచ్చిన ‘కంగువా’ చిత్రం ఎవరూ ఊహించని విధంగా ఫ్లాప్‌ టాక్‌ తెచ్చుకుంది. దీంతో సినీ లవర్స్‌ అమరన్‌ మెయిన్‌ ఛాయిస్‌గా మారిపోయింది. థియేటర్‌లో మంచి సినిమాను అస్వాదించాలని అనుకునేవారంతా కుటుంబంతో సహా అమరన్‌కు వెళ్తున్నారు. దీని కారణంగానే మూవీ వచ్చి మూడు వారాలు అవుతున్న బాక్సాఫీస్‌ (Amaran Collections) వద్ద జోరు తగ్గలేదు. ఈ వారం కూడా పెద్ద స్టార్‌ హీరోల చిత్రాలు లేకపోవడంతో కలెక్షన్స్ ఇదే రీతిలో పెరిగే ఛాన్స్ ఉందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.&nbsp; నెలాఖరులో ఓటీటీలోకి.. థియేటర్లలో వసూళ్ల సునామీ సృష్టిస్తున్న ‘అమరన్‌’ (Amaran OTT Release) ఈ నెలాఖరులో ఓటీటీలోకి రానున్నట్లు తెలుస్తోంది. ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్‌ఫ్లిక్స్‌లో నవంబర్‌ 29 నుంచి ఈ మూవీ స్ట్రీమింగ్‌లోకి రానున్నట్లు సమాచారం. ఒకవేళ వసూళ్ల (Amaran Collections) దృష్ట్యా రిలీజ్‌ డేట్‌ను పోస్ట్‌ పోన్‌ చేయాల్సి వస్తే డిసెంబర్‌ 5వ తేదీనైనా పక్కాగా ఓటీటీలోకి వస్తుందని అంటున్నారు. దీంతో ఇప్పటివరకూ థియేటర్లలో చూడని వారంతా ‘అమరన్‌’ ఓటీటీ రాకకోసం తెగ ఎదురుచూస్తున్నారు.&nbsp;
    నవంబర్ 19 , 2024
    Sai Pallavi: నాని సినిమా షూట్‌లో నరకం చూసిన సాయిపల్లవి.. అసలేం జరిగిందంటే? టాలీవుడ్‌ అగ్రకథానాయికల్లో ఒకరిగా సాయిపల్లవి (Sai Pallavi) గుర్తింపు సంపాదించింది. మలయాళం సినిమా ‘ప్రేమమ్‌’తో సినీ రంగంలోకి అడుగుపెట్టిన ఈ భామ ‘ఫిదా’తో తెలుగు ప్రేక్షకుల హృదయాలను గెలుచుకుంది. తన అద్భుతమైన నటన, మిస్మరైజింగ్‌ డ్యాన్స్‌తో తెలుగు ఇండస్ట్రీపై చెరగని ముద్ర వేసింది. రీసెంట్‌గా తమిళంలో ఆమె నటించిన ‘అమరన్‌’ (Amaran) చిత్రం పాన్ ఇండియా స్థాయిలో విడుదలై సూపర్‌హిట్‌గా నిలిచింది. ‘అమరన్‌’ సక్సెస్‌కు సంబంధించి ఓ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో సాయిపల్లవి ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. నాని (Nani)తో చేసిన 'శ్యామ్‌ సింగరాయ్‌' (Shyam Singha Roy) మూవీ షూటింగ్‌ సమయంలో ఫిజికల్‌గా, మెంటల్‌గా ఎన్నో ఇబ్బందులు పడినట్లు చెప్పుకొచ్చింది. కారణం ఏంటంటే? శివకార్తికేయన్‌ హీరోగా సాయిపల్లవి (Sai Pallavi) నటించిన ‘అమరన్‌’ చిత్రానికి పెరియసామి దర్శకత్వం వహించారు. అమరుడైన ఆర్మీ జవాన్‌ జీవత కథ ఆధారంగా రూపొందిన ఈ చిత్రం బాక్సాఫీస్‌ వద్ద రూ.180 కోట్లకు పైగా వసూళ్లు సాధించి ఘన విజయం అందుకుంది. ఈ నేపథ్యంలో తాజాగా నిర్వహించిన సాయిపల్లవి సినిమా గురించి మాట్లాడారు. అదే సమయంలో శ్యామ్‌ సింగరాయ్‌ షూటింగ్‌ సమయంలో తను పడ్డ ఇబ్బందుల గురించి ప్రస్తావించారు. రాత్రిళ్లు షూటింగ్‌ తనకు అస్సలు అలవాటు లేదని సాయిపల్లవి తెలిపింది. అయితే శ్యామ్ సింగరాయ్‌లో తన సన్నివేశాలన్నీ చాలా వరకూ రాత్రి పూటే చిత్రీకరించినట్లు చెప్పింది. దీంతో తెల్లవారే వరకూ మేల్కొనే ఉండాల్సి వచ్చేదని అన్నారు. దాదాపు 30 రోజులు ఇలాగే కొనసాగిందని పేర్కొంది. నైట్‌ షూట్‌ వల్ల తన పరిస్థితి వర్ణనాతీతంగా ఉండేదంటూ సాయిపల్లవి చెప్పుకొచ్చింది. ‘చెల్లికి చెప్పుకొని ఏడ్చేశా’ రాత్రి ‘శ్యామ్‌ సింగరాయ్‌’ (Shyam Singha Roy) షూటింగ్‌ చేస్తునే పగలు మరో మూవీ సెట్‌లో పాల్గొనేదానినని సాయిపల్లవి (Sai Pallavi) తెలిపింది. విశ్రాంతి లేకుండా పనిచేయడం వల్ల మానిసిక ఒత్తిడికి గురైనట్లు వాపోయింది. ఒకరోజు రాత్రి తనను చూడటానికి చెల్లి పూజా కన్నన్‌ వచ్చిందని, తనతో మాట్లాడుతున్నప్పుడు ఒక్కసారిగా ఏడ్చేశానని తెలిపింది. ఆ సమయంలో కన్నీళ్లు ఆగలేదని, ఒకరోజు విశ్రాంతి దొరికితే బాగుంటుందంటూ తన బాధను ఆమెతో చెప్పుకున్నానని అన్నది. ‘దీంతో నా చెల్లెలు నేరుగా శ్యామ్‌ సింగరాయ్‌ మూవీ నిర్మాత దగ్గరకు వెళ్లి ‘మా అక్క ఏడుస్తోంది. ఒక రోజైనా సెలవు ఇవ్వండి’ అని అడిగింది. ఇది విన్న నిర్మాత వెంకట్‌ బోయనపల్లి వెంటనే స్పందించారు. ‘పదిరోజులు సెలవు తీసుకో. నువ్వు ఏం చేయాలనుకుంటున్నావో చేసి, అంతా బాగానే ఉందనుకున్నప్పుడు తిరిగి షూటింగ్‌కు రావచ్చు’ అన్నారు’ అని నాటి రోజులను సాయిపల్లవి గుర్తు చేసుకుంది.&nbsp; దేవదాసిగా అదరగొట్టిన సాయిపల్లవి నాని కథానాయకుడిగా రాహుల్‌ సాంకృత్యన్‌ దర్శకత్వంలో వచ్చిన 'శ్యామ్‌ సింగరాయ్‌' (Shyam Singha Roy) చిత్రం బాక్సాఫీస్‌ వద్ద ఘన విజయం అందుకుంది. పునర్జన్మ నేపథ్యంలో వచ్చిన ఈ చిత్రంలో నాని డ్యూయల్‌ రోల్స్‌ చేశాడు. వాసు, శ్యామ్‌ సింగరాయ్‌ (1970నాటి పాత్ర) రోల్స్‌లో అలరించారు. ఇక దేవదాసి మైత్రీ పాత్రలో సాయిపల్లవి అదరగొట్టింది. తనదైన నటనతో ఆ పాత్రకు వన్నెలద్దింది. ఎమోషనల్‌ సన్నివేశాల్లో ప్రేక్షకులని కట్టిపడేసింది. డ్యాన్స్‌లో తనకు తిరుగులేదని మరోమారు నిరూపించుకుంది. మైత్రి పాత్ర నటిగా సాయిపల్లవిని మరో మెట్టు ఎక్కించదని చెప్పవచ్చు. దేవదాసిల జీవితాలను అద్దం పట్టేలా ఆమె నటించిన తీరు ఎంత పొగిడిన తక్కువే. ‘శ్యామ్‌ సింగరాయ్‌’ రిలీజ్‌ అనంతరం నానితో సమానంగా సాయి పల్లవి నటన గురించి ప్రేక్షకులు మాట్లాడుకున్నారు.&nbsp; సాయిపల్లవి ప్రాజెక్ట్స్‌ ప్రస్తుతం సాయిపల్లవి (Sai Pallavi) చందూ మొండేటి దర్శకత్వంలో ‘తండేల్‌’ (Thandel)లో నటిస్తోంది. ఇందులో నాగచైతన్య హీరోగా చేస్తున్నాడు. 'లవ్‌స్టోరీ' (Love Story) వంటి బ్లాక్‌ బాస్టర్‌ తర్వాత వీరిద్దరు మరోమారు జంటగా నటిస్తుండటంతో 'తండేల్‌'పై భారీగా అంచనాలు ఏర్పడ్డాయి. వచ్చే ఏడాది ఫిబ్రవరి 7న ఈ సినిమా రిలీజ్ కానుంది. మరోవైపు బాలీవుడ్‌లోనూ ఓ క్రేజీ ప్రాజెక్ట్‌లో సాయిపల్లవి నటిస్తోంది. నితేశ్‌ తివారి దర్శకత్వంలో రూపొందుతున్న ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ 'రామాయణ' (Ramayana)లో సీతగా ఆమె నటిస్తోంది. ఇటీవల ఆమె పాత్రకు సంబంధించిన ఫొటోలు లీకవ్వగా సీతగా సాయిపల్లవి లుక్ ఎంతగానో ఆకట్టుకుంది. ఇక రాముడిగా రణ్‌బీర్‌ కపూర్‌, రావణుడిగా యష్ చేస్తున్నారు. రెండు భాగాలుగా ఈ సినిమా రిలీజ్‌ కానుంది. తొలి పార్ట్‌ వచ్చే ఏడాది దీపావళికి ప్రేక్షకుల ముందుకు రానుంది.&nbsp;
    నవంబర్ 12 , 2024
    Sai Pallavi: సాయిపల్లవి పాత వీడియో వైరల్.. తప్పు చేశావంటూ ట్రోల్స్! టాలీవుడ్‌ అగ్రకథానాయికల్లో ఒకరిగా సాయిపల్లవి గుర్తింపు సంపాదించింది. మలయాళం సినిమా ‘ప్రేమమ్‌’తో సినీ రంగంలోకి అడుగుపెట్టిన ఈ భామ ‘ఫిదా’తో తెలుగు ప్రేక్షకుల హృదయాలను గెలుచుకుంది. తన అద్భుతమైన నటన, మిస్మరైజింగ్‌ డ్యాన్స్‌తో తన తొలి ఫిల్మ్‌తోనే చెరగని ముద్ర వేసింది. తాజాగా తమిళంలో ఆమె నటించిన ‘అమరన్‌’ చిత్రం పాన్ ఇండియా స్థాయిలో విడుదలకు సిద్ధమైంది. ఆర్మీ బ్యాక్‌డ్రాప్‌లో శివకార్తికేయన్‌ హీరోగా రూపొందిన ఈ మూవీ ట్రైలర్ ఇటీవలే విడుదలై మంచి రెస్పాన్స్‌ అందుకుంటోంది. ప్రస్తుతం ఈ మూవీ ప్రమోషన్‌లో బిజీగా ఉన్న సాయిపల్లవికి సోషల్‌ మీడియాలో ఊహించని షాక్‌ తగలింది. గతంలో ఇండియన్‌ ఆర్మీపై ఆమె చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం ట్రెండింలోకి వచ్చాయి. దీంతో నెటిజన్లు సాయిపల్లవిపై విమర్శలు గుప్పిస్తున్నారు.&nbsp; అమర జవాన్‌ బయోగ్రఫీ శివ కార్తికేయన్‌ (Sivakarthikeyan) హీరోగా దర్శకుడు రాజ్‌కుమార్‌ పెరియసామి రూపొందించిన చిత్రం ‘అమరన్‌’ (Amaran). సాయి పల్లవి (Sai Pallavi) హీరోయిన్‌. దీపావళిని పురస్కరించుకుని ఈ నెల 31న సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. పాకిస్థాన్ ఉగ్రవాదులతో పోరాడి వీరమరణం పొందిన అమర జవాన్ మేజర్ ముకుంద్ వరదరాజన్ జీవితం ఆధారంగా ఈ మూవీని రూపొందించారు. నటుడు శివకార్తికేయన్‌ ముకుంద్‌ పాత్ర పోషించగా, సాయిపల్లవి ఆయన భార్య ఇందు రెబెకా వర్గీస్‌ రోల్‌లో పోషించింది. తెలుగు, తమిళంతో పాటు పాన్‌ ఇండియా స్థాయిలో ఈ సినిమా రిలీజ్‌ కాబోతోంది. పూర్తిగా భావోద్వేగాలతో నిండిన ఈ మూవీ ట్రైలర్ ఆకట్టుకుంటోంది.&nbsp; https://twitter.com/Siva_Kartikeyan/status/1839559422332346584 సాయిపల్లవి వీడియో వైరల్‌ అమరన్ చిత్రం ఆర్మీ నేపథ్యంలో రూపొందిన సంగతి తెలిసిందే. దీంతో గతంలో భారత ఆర్మీపై సాయిపల్లవి చేసిన వివాదస్పద వ్యాఖ్యలు ప్రస్తుతం వైరల్‌గా మారాయి. ఇందుకు సంబంధించిన వీడియోను నెటిజన్లు ట్రెండ్‌ చేస్తున్నారు. విరాటపర్వం మూవీ ప్రమోషన్ సమయంలో సాయి పల్లవి ఓ యూట్యూబ్ ఛానెల్కి ఇంటర్వ్యూ ఇచ్చింది. ఉగ్రవాదం, హింస అంశాల గురించి ప్రస్తావిస్తూ ‘పాకిస్థాన్ సైనికులను మన భారతీయులం ఉగ్రవాదుల్లా చూస్తాం. అలాగే పాకిస్థాన్‍లో ఉంటున్న వారు మన భారత సైనికులను ఉగ్రవాదుల్లా చూస్తారు. వాళ్లకు మనం చేటు చేస్తామని అనుకుంటుంటారు. సమస్యల పరిష్కారానికి హింస ఏ మాత్రం పరిష్కారం కాదు కదా. ఒకప్పుడు చట్టం లేకపోవడంతో యుద్దాలు చేశారు. ఇప్పుడు ఆ అవసరం లేదు' అని ఆమె అన్నారు. దీనిపై నెటిజన్లు ఫైర్‌ అవుతున్నారు.&nbsp; https://twitter.com/ViralVidox/status/1850064411202932830 కశ్మీర్‌ హింసాకాండ పైనా.. ఇదే ఇంటర్వ్యూలో కశ్మీరి పండిట్ల హత్యాకాండపైనా సాయి పల్లవి మాట్లాడారు. ‘కొన్ని రోజుల క్రితం ది కశ్మీర్ ఫైల్స్ అనే సినిమా వచ్చింది. ఆ టైమ్‌లో ఉన్న కశ్మీరీ పండిట్లను ఎలా చంపారో చూపించారు. మనం మత ఘర్షణలా వాటిని చూస్తే రీసెంట్‌గా ఓ బండిలో ఆవులని తీసుకెళ్లున్నారని ఆ వెహికిల్‌ని నడుపుతున్న వ్యక్తి ముస్లీం అని కొంత మంది కొట్టి జై శ్రీరామ్ అన్నారు. అప్పుడు జరిగిన దానికి ఇప్పుడు జరిగిన దానికి తేడా ఎక్కడుంది’ అంటూ సాయిపల్లవి ప్రశ్నించారు. అప్పట్లో ఈ వీడియో కూడా పెద్ద ఎత్తున వైరల్ అయ్యింది. సాయిపల్లవిపై హిందు సంఘాలు పెద్ద ఎత్తున మండిపడ్డాయి. అయితే అమరన్‌ రిలీజ్ సందర్భంలో ఈ వీడియోలు మళ్లీ ట్రెండింగ్‌లోకి రావడం అనుమానాలకు తావిస్తోంది. కావాలనే సాయిపల్లవిని టార్గెట్‌ చేస్తూ ఈ వీడియోను వైరల్‌ చేస్తున్నారని ఆమె ఫ్యాన్స్ ఆరోపిస్తున్నారు.&nbsp; https://twitter.com/divya_gandotra/status/1784199470219251986 వాళ్లే టార్గెట్‌ చేస్తున్నారా? 'అమరన్‌' మూవీ ప్రమోషన్స్‌లో భాగంగా రీసెంట్‌గా సాయి పల్లవి ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది.&nbsp; బాలీవుడ్‌ నుంచి ఓ వ్యక్తి వచ్చి పీఆర్‌ ఏజెన్సీ తరపున తన ఇమేజ్‌ను మరింత పెంచుతానని అన్నారని తెలిపింది. అయితే దానిని తాను రిజక్ట్‌ చేశానని ఆమె చెప్పారు. అలాంటి అవసరం తనకు లేదని చెప్పినట్లు&nbsp; తెలిపారు. దీంతో ఇప్పుడు వారే సాయి పల్లవిని టార్గెట్‌ చేస్తున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. ‘రామాయణం’ సినిమాతో బాలీవుడ్‌కి ఎంట్రీ ఇస్తున్న నేపథ్యంలో సాయిపల్లవి పేరును డ్యామేజ్‌ చేసేందుకు వారు యత్నిస్తున్నట్లు టాక్. సీత పాత్ర నుంచి సాయి పల్లవిని తొలగించాలని కూడా వారు పెద్ద ఎత్తున కామెంట్స్ చేయిస్తున్నట్లు తెలుస్తోంది. ఇలా కావాలనే బాలీవుడ్‌ పీఆర్‌ టీమ్‌ సాయి పల్లవిని టార్గెట్‌ చేశారని ఫిల్మ్‌ వర్గాలు చర్చించుకుంటున్నాయి. https://twitter.com/bollywooddadi/status/1849561000456179910
    అక్టోబర్ 26 , 2024
    Sreeleela: బాలీవుడ్‌ స్టార్‌ హీరో కొడుకుతో శ్రీలీల.. వీడియో వైరల్‌! తక్కువ కాలంలో స్టార్‌ హీరోయిన్‌ స్టేటస్‌ సంపాదించిన కథానాయికల్లో శ్రీలీల (Sreeleela) ఒకరు. ‘పెళ్లిసందD’ మూవీతో తెలుగు తెరకు పరిచయమైన ఈ అమ్మడు తన అందం, అభినయం, డ్యాన్స్‌తో అందరి దృష్టిని ఆకర్షించింది. ఈ క్రమంలోనేే మహేష్‌, బాలకృష్ణ, రవితేజ వంటి  స్టార్ హీరోలతో సినిమాలు చేసింది. రీసెంట్‌గా 'పుష్ప 2' చిత్రంలో కిస్సిక్‌ అనే ఐటెం సాంగ్‌లో మెరిసి పాన్‌ ఇండియా స్థాయిలో అందరి దృష్టిని ఆకర్షించింది. ఇదిలా ఉంటే తాజాగా ఓ బాలీవుడ్‌ స్టార్‌ హీరో కుమారుడితో కనిపించి శ్రీలీల అందరినీ సర్‌ప్రైజ్‌ చేసింది. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.  శ్రీలీల వీడియో వైరల్‌.. బాలీవుడ్‌ అగ్ర కథానాయకుల్లో సైఫ్ అలీఖాన్‌ (Saif Ali Khan) ఒకరు. ఇటీవల ఆయన ‘దేవర’ చిత్రంతో తెలుగు ప్రేక్షకులకు సైతం పరిచయమయ్యారు. ఆయన కుమారుడు ఇబ్రహీం అలీఖాన్‌ (Ibrahim Ali Khan) కూడా ఫిల్మ్‌ ఎంట్రీకి సిద్ధమవుతున్నాడు. ఇదిలా ఉంటే తాజాగా యంగ్‌ బ్యూటీ శ్రీలీల, ఇబ్రహీం అలీఖాన్‌ ఒకే చోట కనిపించి అందరినీ సర్‌ప్రైజ్‌ చేశారు. ఓ ఆఫీసు నుంచి బయటకు వస్తూ కెమెరాలకు ఫోజులిచ్చారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతోంది. వారిద్దరు ఒకే చోట ఎందుకు ఉన్నారని నెటిజన్లు సెర్చ్ చేస్తున్నారు. ఒకవేళ వారు రిలేషన్‌లో ఉన్నారా? అన్న అనుమానాన్ని వ్యక్తం చేస్తున్నారు.  https://twitter.com/Buzzz_scrolls/status/1876588640937345167 కొత్త పెయిర్ షురూ! స్టార్ హీరోయిన్‌ శ్రీలీల త్వరలో బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇవ్వనున్నట్లు కొన్ని రోజులుగా ప్రచారం జరుగుతోంది. వాటిని నిజం చేస్తూ తాజాగా శ్రీలీల ముంబయిలో ప్రత్యక్షమైంది. సైఫ్ అలీఖాన్‌ కుమారుడు ఇబ్రహీం అలీఖాన్‌తో శ్రీలీల కనిపించడానికి కారణం త్వరలో చేయబోయే కొత్త సినిమానే అని తెలుస్తోంది. ప్రముఖ నిర్మాణ సంస్థ మడాక్‌ ఫిల్మ్స్‌ ఇబ్రహీంతో తీయబోయే సినిమాలో శ్రీలీల హీరోయిన్‌గా ఎంపికైనట్లు సమాచారం. ఈ క్రమంలో మూవీపై చర్చించేందుకు మడాక్‌ ఫిల్మ్స్‌ ఆఫీసుకు శ్రీలీల, ఇబ్రహీం వెళ్లారని టాక్‌. అలా బయటకు వస్తున్న సందర్భంలో వచ్చినదే ప్రస్తుతం వైరల్ అవుతున్న వీడియోనని బీటౌన్‌ వర్గాలు స్పష్టం చేస్తున్నాయి. వీరి కాంబోలో మూవీపై త్వరలో అధికారిక ప్రకటన రానున్నట్లు సమాచారం.  https://twitter.com/oneindiatelugu/status/1876579818495746543 మరో ప్రాజెక్ట్‌ సైతం రెడీ! ఇబ్రహీం ఖాన్‌ మూవీ కంటే ముందే శ్రీలీల బాలీవుడ్‌ ఎంట్రీ ఫిక్స్‌ అయినట్లు సమాచారం. బాలీవుడ్‌ యంగ్‌ హీరో ఆర్యన్‌ కార్తీక్‌ హీరోగా తెరకెక్కనున్న సినిమాలో హీరోయిన్‌గా శ్రీలీల ఎంపికైనట్లు పెద్ద ఎత్తున వార్తలు వచ్చాయి. ఈ లవ్‌ ఎంటర్‌టైనర్‌ను బాలీవుడ్‌ ప్రముఖ నిర్మాత కరణ్‌ శర్మ నిర్మిస్తారని సమాచారం. దీనికి సమీర్‌ విద్వాన్‌ దర్శకత్వం వహిస్తారని బీటౌన్‌లో టాక్‌. ఇదిలా ఉంటే రీసెంట్‌గా ఈ మూవీపై మాట్లాడిన ఆర్యన్‌ కార్తీక్‌ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఇప్పటికే తాను మూడుసార్లు ప్రేమలో పడి విఫలమయ్యాయని.. ఇప్పుడు మరోసారి ప్రేమలో పడబోతున్నట్లు చెప్పారు. దీంతో శ్రీలీల బాలీవుడ్ హీరో తో ప్రేమలో పడబోతుందా? ఆల్రెడీ ప్రేమలో పడిందా? అంటూ రూమర్స్‌ మెుదలయ్యాయి.  చేతి నిండా ప్రాజెక్ట్స్‌.. నితీన్‌ లేటెస్ట్‌ చిత్రం ‘రాబిన్‌హుడ్‌’లో  శ్రీలీల హీరోయిన్‌గా చేసింది. ఈ మూవీ త్వరలో రిలీజ్ కానుంది. నాగచైతన్య హీరోగా ‘విరూపాక్ష’ డైరెక్టర్‌ కార్తీక్‌ దండు తెరకెక్కించనున్న 'NC24' ప్రాజెక్టుకు ఈ భామనే ఎంపికైనట్లు సమాచారం. అలాగే పవన్‌- హరీశ్‌ శంకర్‌ కాంబోలో రానున్న ‘ఉస్తాద్‌ భగత్‌ సింగ్‌’లోనూ శ్రీలీలనే హీరోయిన్‌. రవితేజ హీరోగా నటిస్తోన్న 'మాస్‌ జాతర'లోనూ ఈ అమ్మడు నటిస్తోంది.  అలాగే కోలీవుడ్‌లో శివకార్తికేయన్ హీరోగా చేస్తున్న 'SK25' ప్రాజెక్ట్‌లోనూ శ్రీలీల నటిస్తోంది. ఇవి కాకుండా ప్రస్తుతం చర్చల దశలో మరో మూడు ప్రాజెక్ట్స్‌ ఉన్నాయి. అఖిల్ అక్కినేని అప్‌కమింగ్‌ ఫిల్మ్‌లోనూ కథానాయికగా శ్రీలీలను పరిశీలిస్తున్నట్లు సమాచారం. అలాగే నవీన్‌ పోలిశెట్టి తీయబోయే నెక్స్ట్‌ ప్రాజెక్ట్‌లోనూ శ్రీలీల నటించే ఛాన్స్ ఉందంటున్నారు. సిద్ధు జొన్నలగడ్డ హీరోగా రానున్న 'కోహినూర్‌' (Kohinur) చిత్రానికి సైతం శ్రీలీల (Sreeleela) ఎంపిక దాదాపుగా ఖరారైనట్లు టాక్‌ ఉంది.
    జనవరి 07 , 2025

    శివకార్తికేయన్ తల్లిదండ్రులు / పిల్లలు / భార్య/ భర్తకు సంబంధించిన మరింత సమాచారం

    జి.దాస్‌ (లేటు), రాజి దాస్‌ దంపతులకు శివకార్తికేయన్‌ 17 ఫిబ్రవరి, 1985లో జన్మించారు. ఆయన తండ్రి జైలు సూపరిండెట్‌గా పనిచేశారు.

    శివకార్తికేయన్ పెళ్లి ఎప్పుడు అయింది?

    2010 ఆగస్టు 27న ఆర్తి అనే యువతిని శివకార్తికేయన్‌ ప్రేమ వివాహం చేసుకున్నారు.

    శివకార్తికేయన్ కు పిల్లలు ఎంత మంది?

    శివకార్తికేయన్‌కు ఒక పాప, బాబు ఉన్నారు. అమ్మాయి పేరు ఆరాధన, అబ్బాయి పేరు గుగన్‌ దాస్‌.

    శివకార్తికేయన్ Family Pictures

    Images

    Sivakarthikeyan Family Images

    Images

    Sivakarthikeyan's Family

    శివకార్తికేయన్ ఫేమస్‌ అవ్వడానికి రీజన్‌ ఏంటి?

    రెమో(2016) చిత్రంతో శివకార్తికేయన్‌ పాపులర్ అయ్యారు.

    శివకార్తికేయన్ లీడ్‌ రోల్‌లో చేసిన తొలి తెలుగు చిత్రం ఏది?

    2012లో వచ్చిన 'మెరీనా' ఫిల్మ్‌తో శివకార్తికేయన్‌ తెరంగేట్రం చేశారు. ఆయన చేసిన పలు చిత్రాలు తెలుగులో డబ్‌ అయినప్పటికీ నేరుగా చేసిన ఫస్ట్‌ ఫిల్మ్‌ 'ప్రిన్స్‌'.

    తెలుగులో శివకార్తికేయన్ ఫస్ట్‌ హిట్‌ మూవీ ఏది?

    తెెలుగులో ఒక్క హిట్‌ కూడా లేదు. రెమో, డాక్టర్‌, ఖాకీ సత్తాయ్‌, వెలైక్కరన్‌, అయాలన్‌.. శివకార్తికేయన్‌ చేసిన హిట్‌ చిత్రాలు.

    శివకార్తికేయన్ కెరీర్‌లో అత్యత్తుమ పాత్ర ఏది?

    రెమోసినిమాలోని పాత్ర ఆయన చేసిన సినిమాల్లో అత్యుత్తమమైనది.

    శివకార్తికేయన్ బెస్ట్‌ స్టేజ్‌ పర్‌ఫార్మెన్స్‌ వీడియోలు?

    Sivakarthikeyan best stage performance

    Sivakarthikeyan stage performance

    శివకార్తికేయన్ బెస్ట్‌ డైలాగ్స్‌ వీడియోలు ఏవి?

    Sivakarthikeyan best dialogues

    Sivakarthikeyan dialogues

    శివకార్తికేయన్ రెమ్యూనరేషన్ ఎంత?

    శివకార్తికేయన్‌.. ఒక్కో సినిమాకు రూ.20 కోట్ల వరకూ రెమ్యూనరేషన్‌ తీసుకుంటున్నారు.

    శివకార్తికేయన్ కు ఇష్టమైన ఆహారం ఏంటి?

    చికెన్‌

    శివకార్తికేయన్ కు ఇష్టమైన నటుడు ఎవరు?

    శివకార్తికేయన్ కు ఇష్టమైన నటి ఎవరు?

    శివకార్తికేయన్ ఎన్ని భాషలు మాట్లాడగలరు?

    తమిళం, తెలుగు, ఇంగ్లీషు

    శివకార్తికేయన్ ఫెవరెట్ సినిమా ఏది?

    శివకార్తికేయన్ ఫేవరేట్‌ కలర్ ఏంటి?

    బ్లూ

    శివకార్తికేయన్ ఫేవరేట్‌ క్రీడ ఏది?

    క్రికెట్‌

    శివకార్తికేయన్ ఫేవరేట్‌ క్రికెట్‌ ప్లేయర్లు ఎవరు?

    ఎం.ఎస్‌. ధోనీ

    శివకార్తికేయన్ కు ఇష్టమైన పర్యాటక ప్రాంతాలు ఏవి?

    లండన్‌

    శివకార్తికేయన్ వద్ద ఉన్న లగ్జరీ కార్లు ఏవి?

    Audi Q7

    శివకార్తికేయన్ ఆస్తుల విలువ (నెట్‌వర్త్‌) ఎంత?

    శివకార్తికేయన్ ఆస్తుల విలువ రూ.120 కోట్ల వరకూ ఉంటుందని సమాచారం.

    శివకార్తికేయన్ ఇన్‌స్టాగ్రామ్‌ ఖాతాలో ఫాలోవర్ల సంఖ్య?

    7.1 మిలియన్లు

    శివకార్తికేయన్ సోషల్‌ మీడియా లింక్స్‌

    శివకార్తికేయన్ కి ఎన్ని అవార్డులు వచ్చాయి?

    • విజయ్‌ అవార్డ్స్‌ - 2013

      మరీనా (2013) - ఉత్తమ తెరంగేట్ర నటుడు

    • విజయ్‌ అవార్డ్స్‌ - 2014

      2014లో బెస్ట్‌ ఎంటర్‌టైనర్‌ ఆఫ్‌ ది ఇయర్‌ అవార్డు అందుకున్నారు.

    • సైమా అవార్డ్స్‌ - 2018

      వెలైక్కరన్‌ (2018) - ఉత్తమ నటుడు (తమిళ్‌)

    • సైమా అవార్డ్స్‌ - 2021

      నమ్మ వీట్టు పిల్లై (2021) - ఉత్తమ నటుడు (తమిళ్‌)

    • సైమా అవార్డ్స్‌ - 2022

      డాక్టర్‌ (2022) - ఉత్తమ నటుడు (తమిళ్‌)

    శివకార్తికేయన్ కు ఎలాంటి వ్యాపారాలు ఉన్నాయి?

    శివకార్తికేయన్‌ నిర్మాతగాను వ్యవహరిస్తున్నారు. తమిళంలో ఏడు సినిమాలను నిర్మించారు.

    శివకార్తికేయన్ ఎలాంటి వ్యాపార ప్రకటనల్లో నటిస్తున్నారు?

    పోతీస్‌' దీపావళి ప్రకటనలో శివకార్తికేయన్‌ నటించారు.
    శివకార్తికేయన్ వ్యక్తిగత వివరాలు, ఎత్తు, పుట్టిన ప్రదేశం, బర్త్‌ డేట్‌, వయస్సు, సాధించిన విజయాలు, అవార్డులు, వ్యాపారాలు, ఇష్టాఇష్టాలు, అభిరుచులు తెలుసుకోండి. అలాగే శివకార్తికేయన్ కుటుంబ నేపథ్యం, తల్లిదండ్రులు, తోబుట్టువులు, రిలేషన్స్‌, విద్యా నేపథ్యం, కెరీర్ మైలురాళ్లు, తాజా ప్రాజెక్ట్‌లు, అధికారిక సోషల్ మీడియా అకౌంట్స్, లేటెస్ట్‌ చిత్రాలను ఒక్క క్లిక్‌తో ఇక్కడ తెలుసుకోండి.

    @2021 KTree