• TFIDB EN
  • శ్రీను వైట్ల
    ప్రదేశం: కందులపాలెం, ఆంధ్ర ప్రదేశ్, భారతదేశం
    శ్రీను వైట్ల టాలీవుడ్‌కు చెందిన ప్రముఖ దర్శకుడు. 1972 సెప్టెంబరు 24న తూర్పు గోదావరిలోని కందుల పాలెంలో జన్మించారు. కెరీర్‌ ప్రారంభంలో దర్శకుడు సాగర్‌ దగ్గర అసిస్టెంట్‌ డైరెక్టర్‌గా చేశారు. 'నీకోసం' (1999) సినిమాతో దర్శకుడిగా మారారు. తన రెండో చిత్రం 'ఆనందం' (2001) బ్లాక్‌ బాస్టర్‌ విజయాన్ని అందుకోవడంతో దర్శకుడిగా ఇండస్ట్రీలో స్థిరపడ్డాడు. ఆ తర్వాత వచ్చిన సొంతం (2002), వెంకీ (2004), ఢీ (2007), రెడీ (2008), దూకుడు (2011) చిత్రాలు శ్రీనువైట్లను స్టార్‌ డైరెక్టర్‌గా మార్చాయి.

    శ్రీను వైట్ల వయసు ఎంత?

    శ్రీను వైట్ల వయసు 52 సంవత్సరాలు

    శ్రీను వైట్ల ఎత్తు ఎంత?

    5' 6'' (170cm)

    శ్రీను వైట్ల ఏం చదువుకున్నారు?

    బీఎస్సీ

    శ్రీను వైట్ల సినిమాల్లోకి రాకముందు ఏం చేశారు?

    కెరీర్‌ ప్రారంభంలో అసిస్టెంట్‌ డైరెక్టర్‌గా శ్రీను వైట్ల పనిచేశారు. డైరెక్టర్‌ సాగర్ వద్ద 'నక్షత్ర పోరాటం', 'అమ్మదొంగ' సినిమాలకు పనిచేశాడు.

    శ్రీను వైట్ల‌ ఇప్పటివరకూ చేసిన తెలుగు చిత్రాలు ఏవి?

    తెలుగులో 2024 వరకూ 17 చిత్రాలను డైరెక్ట్‌ చేశాడు.

    శ్రీను వైట్ల‌ ఇప్పటివరకూ చేసిన వెబ్‌ సిరీస్‌లు?

    వెబ్‌సిరీస్‌లు చేయలేదు.

    శ్రీను వైట్ల అన్‌ కేటగిరైజ్డ్ ఇమేజెస్‌

    శ్రీను వైట్ల తల్లిదండ్రులు / పిల్లలు / భార్య/ భర్తకు సంబంధించిన మరింత సమాచారం

    శ్రీను వైట్ల స్వస్థలం తూర్పు గోదావరి జిల్లా కందులపాలెం. వ్యవసాయ కుటుంబంలో సెప్టెంబరు 24, 1972న శ్రీను వైట్ల జన్మించారు. ఆయన తండ్రి పేరు క్రష్ణరావు వైట్ల. 2021లో చనిపోయారు.

    శ్రీను వైట్ల పెళ్లి ఎప్పుడు అయింది?

    సంతోష రూపను శ్రీను వైట్ల ప్రేమ వివాహం చేసుకున్నారు.

    శ్రీను వైట్ల కు పిల్లలు ఎంత మంది?

    శ్రీను వైట్లకు ముగ్గురు కూతుళ్లు ఉన్నారు.

    శ్రీను వైట్ల ఫేమస్‌ అవ్వడానికి రీజన్‌ ఏంటి?

    ఆనంద్‌(2001), సొంతం (2002), వెంకీ(2004) సినిమాతో శ్రీను వైట్ల పాపులర్‌ అయ్యారు.

    తెలుగులో శ్రీను వైట్ల ఫస్ట్‌ హిట్‌ మూవీ ఏది?

    నీ కోసం' (1999) దర్శకుడిగా శ్రీను వైట్లకు తొలి విజయాన్ని ఇచ్చింది. అయితే ఆ తర్వాత వచ్చిన 'ఆనందం' (2001) బ్లాక్‌ బాస్టర్‌ కావడంతో దర్శకుడిగా ఇండస్ట్రీలో స్థిరపడిపోయాడు.

    శ్రీను వైట్ల బెస్ట్‌ స్టేజ్‌ పర్‌ఫార్మెన్స్‌ వీడియోలు?

    Watch on YouTube

    Watch on YouTube

    శ్రీను వైట్ల కు ఇష్టమైన నటుడు ఎవరు?

    శ్రీను వైట్ల ఎన్ని భాషలు మాట్లాడగలరు?

    తెలుగు, హిందీ, ఇంగ్లీషు

    శ్రీను వైట్ల ఫేవరేట్‌ కలర్ ఏంటి?

    తెలుపు

    శ్రీను వైట్ల ఫేవరేట్‌ క్రీడ ఏది?

    క్రికెట్‌

    శ్రీను వైట్ల ఫేవరేట్‌ క్రికెట్‌ ప్లేయర్లు ఎవరు?

    ఎం.ఎస్‌. ధోని

    శ్రీను వైట్ల కి ఎన్ని అవార్డులు వచ్చాయి?

    • నంది అవార్డ్స్‌ - 1999

      'నీకోసం' ఉత్తమ డెబ్యూ డైరెక్టర్‌

    • నంది అవార్డ్స్‌ - 2007

      'ఢీ ' ఉత్తమ స్క్రీన్‌ప్లే రైటర్‌

    • నంది అవార్డ్స్‌ - 2011

      'దూకుడు' ఉత్తమ స్క్రీన్‌ప్లే రైటర్‌

    • ఫిల్మ్‌ఫేర్‌ అవార్డ్‌ - 2011

      'దూకుడు' ఉత్తమ డైరెక్టర్‌

    శ్రీను వైట్ల కు సంబంధించిన వివాదాలు?

    2015 అక్టోబరులో ఇతడిపై గృహహింస కేసు నమోదు అయింది. తన భర్త వేధిస్తున్నారంటూ శ్రీనువైట్ల భార్య సంతోష రూప బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. ఈ వ్యవహారం అప్పట్లో తీవ్ర వివాదాస్పదంగా మారింది.
    శ్రీను వైట్ల వ్యక్తిగత వివరాలు, ఎత్తు, పుట్టిన ప్రదేశం, బర్త్‌ డేట్‌, వయస్సు, సాధించిన విజయాలు, అవార్డులు, వ్యాపారాలు, ఇష్టాఇష్టాలు, అభిరుచులు తెలుసుకోండి. అలాగే శ్రీను వైట్ల కుటుంబ నేపథ్యం, తల్లిదండ్రులు, తోబుట్టువులు, రిలేషన్స్‌, విద్యా నేపథ్యం, కెరీర్ మైలురాళ్లు, తాజా ప్రాజెక్ట్‌లు, అధికారిక సోషల్ మీడియా అకౌంట్స్, లేటెస్ట్‌ చిత్రాలను ఒక్క క్లిక్‌తో ఇక్కడ తెలుసుకోండి.

    @2021 KTree