కావ్య థాపర్ హీరోయిన్‌గా రూపొందిన ‘విశ్వం‘ చిత్రం ఇవాళ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇందులో ఈ అమ్మడి పర్‌ఫార్మెన్స్ చూసిన ప్రేక్షకులు ఫిదా అవుతున్నారు.
గోపీచంద్ హీరో శ్రీను వైట్ల దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రంలో నటన పరంగా కావ్యాకు పెద్దగా స్కోప్ లభించలేదు. కానీ, గ్లామర్ పరంగా ఆమె పెద్ద మ్యాజిక్ చేసిందని చెప్పవచ్చు.
తన అందచందాలతో మరోమారు యూత్‌ను కట్టిపడేసింది. ఈ నేపథ్యంలోనే #KavyaThapar హ్యాష్‌ట్యాగ్ నెట్టింద తెగ ట్రెండ్ అవుతోంది.
ముఖ్యంగా ‘గుంగురు గుంగురు పార్టీ’ అంటూ సాగే మాస్ సాంగ్‌లో కావ్యా దుమ్మురేపిందని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. తన అందం, డ్యాన్స్‌తో లుక్స్ తిప్పుకోనివ్వకుండా చేసిందని పోస్టులు పెడుతున్నారు.
సంగీత దర్శకుడు చేతన్ భరద్వాజ్‌ను కాదని మరో సంగీత దర్శకుడు భీమ్స్‌కు స్పెషల్‌గా పాట బాధ్యతను అప్పగించారు. భీమ్స్ పాడిన ఈ పాటకు గోపీచంద్, కావ్యా థాపర్ మాస్ స్టెప్పులు వేసి ఊర్రూతలూగించారు.
ఇటీవల వచ్చిన డబుల్ ఇస్మార్ట్‌లోనూ కావ్యా థాపర్ గ్లామర్ పరంగా మంచి మార్కులే కొట్టేసింది. రామ్‌కు పోటీగా చిందులేసి సాంగ్స్‌లో రచ్చ రచ్చ చేసింది.
మహారాష్ట్రకు చెందిన కావ్యా థాపర్ 2013లో వచ్చిన ‘తత్కాల్’ అనే షార్ట్‌ఫిల్మ్ ద్వారా నటన కెరీర్ ప్రారంభించింది.
2018లో తెలుగులో వచ్చిన ‘ఈ మాయ పేరేమిటో’ (Ee Maaya Peremito) సినిమాతో హీరోయిన్‌గా పరిచయమైంది.
2019లో ‘మార్కెట్ రాజా ఎంబీబీఎస్’ (Market Raja MBBS) తమిళ చిత్రం చేసినప్పటికీ ఈ అమ్మడికి పెద్దగా గుర్తింపు రాలేదు.
2021లో యంగ్ హీరో సంతోష్ శోభన్ పక్కన ‘ఏక్ మినీ కథ’లో నటించి హీరోయిన్‌గా మంచి మార్కులు కొట్టేసింది. అమృతగా కనిపించి తెలుగు ప్రేక్షకులను మెప్పించింది.
2022లో ‘మిడిల్ క్లాస్ లవ్’ సినిమాతో బాలీవుడ్‌లో అడుగుపెట్టింది. సైషా ఒబరాయ్ పాత్రలో మంచి ప్రదర్శన చేసినప్పటికీ సినిమా ఆడకపోవడంతో తగిన గుర్తింపు రాలేదు.
గతేడాది విజయ్ ఆంటోని సరసన ‘బిచ్చగాడు 2’లో కావ్య నటించింది. ఈ సినిమా పాజిటివ్ టాక్ సొంతం చేసుకోవడంతో కావ్యాకు తెలుగులో వరుసగా అవకాశాలు దక్కాయి.
ఈ ఏడాది రవితేజ సరసన ఈగిల్ సినిమాలో నటించింది. ఎన్నో ఆశలు పెట్టుకున్న ఈ సినిమా సక్సెస్ కాకపోవడంతో కావ్యకు నిరాశే మిగిలింది.
ఆ తర్వాత వచ్చిన ఊరు పేరు భైరవకోన, డబుల్ ఇస్మార్ట్ చిత్రాలు హిట్ కాకపోవడంతో కావ్యా థాపర్ మళ్లీ ఢీలా పడిపోయింది.
తాజాగా వచ్చిన ‘విశ్వం’ చిత్రం కామెడీ ఎంటర్‌టైనర్‌గా పర్వాలేదనిపించడంతో కావ్యా ఫ్యాన్స్ కాస్త ఊపిరి పీల్చుకుంటున్నారు.
అయితే సినిమాలతో పాటు వెబ్ సిరీస్‌లలో సైతం కావ్యా నటించింది. క్యాట్ (పంజాబీ), ఫర్జీ (హిందీ) సిరీస్‌లలో ముఖ్య పాత్రలు పోషించింది.
ఇదిలా ఉంటే తను సంస్కృతి సంప్రదాయాలకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తానని కావ్యా తెలిపారు. విశ్వం సినిమా హిట్ కావాలని నవరాత్రుల సందర్భంగా ఉపవాసం కూడా ఉంటున్నట్లు చెప్పారు.
తెలుగులో భాషలో స్పష్టంగా మాట్లాడేందుకు ప్రత్యేక శిక్షణ తీసుకుంటున్నట్లు కావ్య చెప్పింది. షూటింగ్ సమయంలో గోపిచంద్ నుంచి ఎన్నో విషయాలు నేర్చుకున్నట్లు వివరించింది.
ఓవైపు సినిమాల్లో బిజీ బిజీగా ఉంటూనే సోషల్ మీడియాలోనూ ఈ అమ్మడు రచ్చ రచ్చ చేస్తోంది. ఎప్పటికప్పుడు గ్లామర్ ఫొటోలను పంచుకుంటూ అభిమానులకు హాట్ ట్రీట్ ఇస్తోంది.
ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ ఇన్‌స్టాగ్రామ్ ఖాతాను 1.5 మిలియన్ల మంది ఫాలో అవుతున్నారు. ఆమె ఖాతా నుంచి ఏ ఫొటో వచ్చిన వెంటనే ట్రెండ్ చేస్తున్నారు.