• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • Blockbuster Pongal: సెన్సేషనల్ రికార్డు సృష్టించిన వెంకటేష్ పాడిన పొంగల్ సాంగ్

    విక్టరీ వెంకటేష్ హీరోగా, అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం సంక్రాంతికి వస్తున్నాం. మీనాక్షి చౌదరి, ఐశ్వర్య రాజేశ్ హీరోయిన్లుగా నటించిన ఈ సినిమా సంక్రాంతి పండుగ సందర్భంగా జనవరి 14న విడుదల కాబోతుంది.

    ఈ చిత్రం నుంచి ఇప్పటికే విడుదలైన ‘గోదారి గట్టు మీద’, బావా వంటి పాటలు ప్రేక్షకుల నుంచి విశేషంగా ఆదరణ పొందాయి. ఆ పాటల వల్ల సినిమాపై ఆసక్తి మరింత పెరిగింది. తాజాగా, ఈ చిత్రం నుంచి ‘బ్లాక్‌బస్టర్ పొంగల్’ అనే ఫుల్ లిరికల్ సాంగ్‌ను మేకర్స్ విడుదల చేశారు. ఈ పాటకు రామజోగయ్య శాస్త్రి లిరిక్స్ అందించగా, వెంకటేశ్ స్వయంగా ఆలపించారు. బిమ్స్‌ సిసిరోలియో సంగీతం అందించారు.

    సంక్రాంతి వాతావరణాన్ని తెచ్చిన బ్లాక్‌బస్టర్ పొంగల్

    ‘బ్లాక్‌బస్టర్ పొంగల్’ పాటలో పండుగ వాతావరణాన్ని పండించిన విధానం ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. ఈ పాట పక్కా కుటుంబ వినోదాన్ని మేళవించి రూపొందించినట్లు తెలుస్తోంది. పాటలో వెంకటేశ్, మీనాక్షి చౌదరి, ఐశ్వర్య రాజేశ్‌ల మధ్య సన్నివేశాలు వినోదాత్మకంగా ఉన్నాయి. పాటకు తగ్గ స్టెప్పులతో హోరెత్తించారు. ముఖ్యంగా బ్లాక్‌ బాస్టర్‌ సాంగ్‌కు వెంకటేష్ గాత్రం బాగా సెట్‌ అయిందని చెప్పొచ్చు.

    ఈ పాటను భీమ్స్ సిసిరోలియో సంగీత సారథ్యంలో భీమ్స్, రోహిణి సొరట్, వెంకటేశ్ పాడారు. భీమ్స్ సంగీతం పాటకు కొత్త జీవం పోసింది. వినగానే మనసుకు హత్తుకునే ట్యూన్‌తో ఈ పాట ఇన్‌స్టంట్ చార్ట్‌బస్టర్‌గా నిలిచింది.

    ఇక ఈ సాంగ్ యూట్యూబ్‌లో ట్రెండ్ సెట్టర్‌గా నిలిచింది. విడుదలైన గంటలోనే 5 లక్షలకు పైగా వ్యూస్, 40 వేలకు పైగా లైక్స్‌ను క్రాస్ చేసి రికార్డు సృష్టించింది.

    వెంకటేశ్-అనిల్ రావిపూడి కాంబినేషన్‌పై భారీ అంచనాలు

    అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కినందున, ఈ సినిమాపై ప్రేక్షకులలో భారీ అంచనాలు నెలకొన్నాయి. గత చిత్రాల విజయాలతో అనిల్ రావిపూడి కుటుంబ ప్రేక్షకులను ఆకట్టుకునే విధంగా సినిమాలు తెరకెక్కించడంలో తన ప్రత్యేకతను నిరూపించుకున్నాడు. ఈ చిత్రం నుంచి ఇప్పటి వరకు విడుదలైన ప్రోమోషనల్ కంటెంట్‌కు ట్రెమెండస్ రెస్పాన్స్ వచ్చింది. ఇకా సినిమా ఎలా ఉంటుందోనని ప్రేక్షకులంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

    పక్కా కుటుంబ కథ

    ‘సంక్రాంతికి వస్తున్నాం’ అనేది పక్కా పండుగ సినిమా. ఈ చిత్రంలోని వినోదం, సంగీతం, కథ అన్నీ కుటుంబ ప్రేక్షకులకు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి. వెంకటేశ్ చేస్తున్న పాత్ర, ఆయన అల్లరి ఈ చిత్రానికి హైలైట్‌గా నిలవనుంది.

    సంక్రాంతి కానుకగా జనవరి 14న ఈ చిత్రం గ్రాండ్‌గా విడుదల కానుంది. పండుగ సీజన్‌లో కుటుంబం మొత్తం కలిసి చూడదగిన చిత్రంగా ఇది ప్రేక్షకులను ఆకట్టుకునే అవకాశం ఉందని అందరూ భావిస్తున్నారు.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv