• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • Manchu Vishnu: మరో వివాదం.. అడవి పందులను వేటాడిన మంచు విష్ణు సిబ్బంది.. వీడియో వైరల్

    మంచు ఫ్యామిలీలో చెలరేగిన వివాదం రెండు రాష్ట్రాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారిన సంగతి తెలిసిందే. రాచకొండ సీపీ సుదీర్ బాబు వార్నింగ్‌తో మోహన్ బాబు, మంచు విష్ణు, మంచు మనోజ్‌తో రాజీకివచ్చారు.  అయితే అంతా సద్దుమణిగిందనుకున్న తరుణంలో మంచు విష్ణు సిబ్బంది తాజాగా మరో వివాదంలో చిక్కుకుంది. జల్‌పల్లిలోని అడవిలో అడవి పందులను  మంచు విష్ణు సిబ్బంది వేటాడి హత మార్చింది. దీంతో మంచు కుటుంబం మరోసారి వార్తల్లోకి ఎక్కింది.

    కొద్ది రోజులుగా ప్రశాంతంగా ఉంటున్న మంచు ఫ్యామిలీ మరో వివాదంలో చిక్కుకుంది. జల్‌పల్లిలోని మోహన్‌బాబు ఇంటికి సమీపంలో ఉన్న అడవిలోకి మంచు విష్ణు సిబ్బంది అక్రమంగా ప్రవేశించి అడవి పందులను వేటాడినట్లు తెలిసింది.  ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అడవి పందులను ఎందుకు వేటాడారు అన్నదానిపై స్పష్టత లేదు. 

    మంచు విష్ణు మేనేజర్ కిరణ్ ఇదంతా చేసినట్లు వార్లలు వస్తున్నాయి. ఆయన అడవిలోకి వెళ్లి అడవి పందులను వేటాడినట్లు తెలిసింది. వేటాడిన అడవి పందిని బంధించి తీసుకెళ్తున్న దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఎలక్ట్రీషియన్ దేవేంద్ర ప్రసాద్ తన భుజంపై అడవి పందిని మోసుకెళ్తున్న దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో హల్ చల్ చేస్తున్నాయి.

     రాచకొండ సీపీ సుదీర్‌ బాబు వార్నింగ్‌తో అంతా సద్దుమణిగిందనుకున్న సమయంలో… ఈ ఘటన వెలుగు చూడటం గమనార్హం. వన్య ప్రాణులను వేటాడటం చట్టరీత్యా నేరం. ఈ సంఘటనపై అటవీ అధికారులు, పోలీసులు ఎలా స్పందిస్తారన్నదానిపై ఆసక్తి నెలకొంది. 

    బిజీబిజీగా మంచు విష్ణు

    తన ప్రాజెక్ట్ కన్నప్ప మూవీ ఫైనల్ అపుట్‌పుట్ ఎడిటింగ్‌లో మంచు విష్ణు బిజీబిజీగా ఉన్నారు. ప్రస్తుతం ఆయన అమెరికాలో సినిమా పనులను స్వయంగా పర్యవేక్షిస్తున్నారు. రీసెంట్‌గా ఈ చిత్రం నుంచి హీరోయిన్‌ క్యారెక్టర్‌ను రివీల్ చేశారు. ఈ చిత్రంలో మంచు విష్ణు సరసన ప్రీతి ముకుందన్ హీరోయిన్‌గా నటించనుంది. సోమవారం ఆమె ఫస్ట్‌ లుక్ పోస్టర్‌ను విడుదల చేశారు. నెమలి అనే రాకుమారి పాత్రలో ఆమె కనిపించనుంది.

    షూటింగ్‌లో మనోజ్‌..

    ప్రస్తుతం మనోజ్‌ ‘భైరవం’ అనే మల్టీస్టారర్‌లో నటిస్తున్నాడు. ఇందులో మనోజ్‌తో పాటు నారా రోహిత్‌, బెల్లంకొండ సాయి శ్రీనివాస్‌ హీరోలుగా చేస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్‌లో మనోజ్‌ పాల్గొన్నట్లు సమాచారం. వాస్తవానికి ఈ సినిమాను క్రిస్మస్‌కు రిలీజ్‌ చేయాలని మేకర్స్‌ భావించారు. ఇటీవల నారా రోహిత్‌ తండ్రి చనిపోవడం, తాజాగా మనోజ్ ఇంట్లో వివాదం చెలరేగడంతో సినిమా విడుదలపై అనుమానాలు ఏర్పడ్డాయి. 

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv