• TFIDB EN
  • సుశాంత్
    సుశాంత్ ప్రముఖ టాలీవుడ్‌ నటుడు. అక్కినేని నాగేశ్వరరావుకి స్వయానా మనుమడు. 2008లో 'కాళిదాసు' చిత్రం ద్వారా చిత్రరంగంలోకి అడుగు పెట్టాడు. కరెంట్‌, అడ్డా, ఆటాడుకుందాం రా, చిలసౌ వంటి సినిమాల్లో హీరోగా చేశాడు.
    Venkatesh Dual role Movies:  విక్టరీ వెంకటేష్ డ్యూయల్ రోల్‌లో నటించిన సినిమాలు ఇవే!
    Venkatesh Dual role Movies:  విక్టరీ వెంకటేష్ డ్యూయల్ రోల్‌లో నటించిన సినిమాలు ఇవే! టాలీవుడ్‌లో విక్టరీ వెంకటేష్ నటనకు ప్రత్యేక ఫ్యాన్ బేస్ ఉంటుంది. ఆయన నటనతో ప్రేక్షకులను కంటతడి పెట్టించిన సినిమాలు ఎన్నో. ముఖ్యంగా ఫ్యామిలీ ఆడియన్స్‌కు వెంకటేష్ సూపర్ హీరో. ఈక్రమంలో వెంకటేష్ తన సుదీర్ఘ సినీ ప్రయాణంలో డ్యుయల్ రోల్స్‌లో కనిపించి ప్రేక్షకులను అలరించాడు. మరి ఆ చిత్రాలేంటో ఓసారి చూద్దాం. కూలీ నంబర్ 1 (1991) కే రాఘవేంద్రరావు డైరెక్ట్ చేసిన ఈ చిత్రంలో వెంకటేష్ తొలిసారి డబుల్ యాక్షన్‌లో కనించాడు. రాజు, భరత్ పాత్రల్లో కనిపించాడు. కానీ ఈ సినిమాలో కూలీగా ఉన్న రాజు హీరోయిన్‌కు బుద్ధి చెప్పడానికి మారువేషంలో భరత్‌లా నటిస్తాడు. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్ అయింది. ?????????????????????????????????????????????????????????????? ముద్దుల ప్రియుడు(1994) ఈ సినిమాలోనూ వెంకటేష్ డబుల్ యాక్షన్‌లో కనిపించినప్పటికీ..  ఒకే వ్యక్తి రెండు వేర్వేరు ప్రాంతాల్లో రాముడు- రాజుగా కనిపిస్తాడు. ఈ చిత్రాన్ని కూడా కే రాఘవేంద్రరావు డైరెక్ట్ చేశారు. ఈ సినిమా మంచి విజయం సాధించింది. పోకిరి రాజా(1995) ఎ. కోదండరామిరెడ్డి డైరెక్షన్‌లో వచ్చిన ఈ సినిమాలో వెంకటేష్ తొలిసారి డ్యుయల్ రోల్‌(Venkatesh Dual role Movies)లో కనిపించాడు. చంటి, బాలరాజు పాత్రల్లో నటించి మెప్పించాడు. ఈ సినిమా సూపర్ హిట్ అయింది. ఈ చిత్రంలో వెంకటేష్ సరసన రోజా, శుభశ్రీ నటించారు. సూర్య వంశం(1998) ఈ చిత్రాన్ని బీమినేని శ్రీనివాస్ రావు డైరెక్ట్ చేశారు. విక్టరీ వెంకటేష్ ఈ సినిమాలో హరిశ్చంద్ర ప్రసాద్, భాను ప్రసాద్ క్యారెక్టర్లలో నటించారు. వెంకటేష్ సరసన రాధిక, మీనా హీరోయిన్లుగా నటించారు. ఈ చిత్రం ఇండస్ట్రీ హిట్‌గా నిలిచింది. జయం మనదేరా(2000) జయం మనదేరా సినిమా ఎన్‌ శంకర్ డైరెక్షన్‌లో వచ్చింది. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద హిట్‌ టాక్ సొంతం చేసుకుంది. మహదేవ నాయుడు, అభిరాం (రుద్రమ నాయుడు)గా(Venkatesh Dual role Movies) వెంకటేష్ ద్విపాత్రాభినయం చేశాడు. దేవీ పుత్రుడు (2001) కోడి రామకృష్ణ డైరెక్షన్‌లో వచ్చిన ఈ చిత్రంలో వెంకటేష్ మరోసారి డ్యుయల్‌ రోల్‌లో కనిపించి మెప్పించాడు. బలరాం, కృష్ణ పాత్రల్లో కనిపించాడు. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద పరాజయం పాలైనప్పటికీ మ్యూజికల్ హిట్‌గా నిలిచింది. వెంకటేష్ సరసన సౌందర్య, అంజలా జావేరి హీరోయిన్లుగా నటించారు. సుభాష్ చంద్ర బోస్ (2005) కే రాఘవేంద్రరావు డైరెక్షన్‌లో వచ్చిన 101వ చిత్రం ఇది. ఇందులో వెంకటేష్ స్వాతంత్ర్య సమరయోధుడు అమరచంద్ర , అశోక్ పాత్రాల్లో ద్విపాత్రాభినయం చేశారు. వెంకటేష్ సరసన శ్రియాసరన్, జెనిలియా నటించారు. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద సక్సెస్ కాలేదు.  నాగవల్లి(2010) ఈ చిత్రాన్ని పి.వాస్ డైరెక్ట్ చేశారు. నాగవల్లి సినిమాలో నాగభైరర, డా.విజయ్ పాత్రలో వెంకటేష్ డ్యుయల్(Venkatesh Dual role Movies) రోల్‌లో కనిపించారు. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఫ్లాప్‌గా నిలిచింది. వెంకటేష్ సరసన కమల్ని ముఖర్జి, అనుష్క శెట్టి నటించారు. ఇప్పటి వరకు విక్టరీ వెంకటేష్ మొత్తం 8 చిత్రాల్లో డ్యుయల్ రోల్స్‌లో కనిపించి అభిమానులను అలరించారు. వాటిలో ఐదు సూపర్ హిట్ సినిమాలు ఉన్నాయి.
    నవంబర్ 10 , 2023
    This Week Movies: ఈ వారం విడుదలయ్యే చిత్రాలు / సిరీస్‌లు.. ఓ లుక్కేయండి! ఎప్పటిలాగే ఈ వారం కూడా పలు విభిన్నమైన చిత్రాలు ప్రేక్షకులను పలకరించేందుకు సిద్ధమవుతున్నాయి. ఈ శుక్రవారం శివరాత్రి పండగను పురస్కరించుకొని థియేటర్లలో సందడి చేయనున్నాయి. అటు థియేటర్లలో, ఇటు ఓటీటీల్లో ఏయే సినిమాలు రానున్నాయో ఈ ప్రత్యేక కథనంలో ద్వారా పరిశీలిద్దాం.  థియేటర్లలో రిలీజయ్యే చిత్రాలు గామి విశ్వక్‌ సేన్‌ (Vishwak Sen) హీరోగా రూపొందిన అడ్వెంచర్‌ డ్రామా ఫిల్మ్‌ ‘గామి’ (Gaami). విద్యాధర్‌ కాగిత ఈ సినిమాతో దర్శకుడిగా పరిచయమవుతున్నారు. చాందినీ చౌదరి (Chandini Chowdary) హీరోయిన్‌. ‘మానవ స్పర్శ సమస్యను ఎదుర్కొంటున్న ఓ అఘోర హిమాలయాల్లో చేసే సాహసోపేతమైన ప్రయాణమే ఈ చిత్ర కథాంశం’ అని దర్శకుడు తెలిపారు. విశ్వక్‌ అఘోరాకు నటించిన ఈ చిత్రం మార్చి 8న విడుదల కానుంది. ఇప్పటికే విడుదలైన ట్రైలర్‌, టీజర్‌, ప్రచార చిత్రాలు సినిమాపై భారీగా అంచనాలను పెంచాయి.  భీమా గోపీచంద్‌ (Gopichand) హీరోగా కన్నడ దర్శకుడు ఎ. హర్ష రూపొందించిన ఫాంటసీ యాక్షన్‌ డ్రామా ఫిల్మ్‌ ‘భీమా’ (Bhimaa). మాళవికా శర్మ (Malvika Sharma), ప్రియా భవానీ శంకర్‌ (Priya Bhavani Shankar) కథానాయికలుగా చేశారు. ఫ్యామిలీ ఎమోషన్స్‌కు అధిక ప్రాధాన్యతనిస్తూ రూపొందించిన ఈ సినిమాలో గోపీచంద్‌ పవర్‌ఫుల్‌ పోలీసు అధికారిగా కనిపించనున్నారు. మార్చి 8న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. షైతాన్‌ బాలీవుడ్‌ స్టార్ హీరో అజయ్‌ దేవగణ్‌ నటించిన హారర్‌ థ్రిల్లర్‌ చిత్రం ‘షైతాన్‌’ (హిందీ) (Shaitaan). వికాస్‌ బహ్ల్‌ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో దేవగణ్‌తో పాటు ఆర్‌. మాధవన్‌, జ్యోతిక ప్రధాన పాత్రల్లో నటించారు. మార్చి 8న ప్రేక్షకుల ముందుకొస్తుంది. ప్రేమలు మలయాళంలో బ్లాక్‌ బాస్టర్‌ విజయాన్ని అందుకున్న ‘ప్రేమలు’.. ఈ వారం తెలుగులో రిలీజవుతోంది. గిరీశ్‌ ఎ.డి. దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో నస్లెన్‌ కె. గఫూర్‌ (Naslen K Gafoor), మ్యాథ్యూ థామస్‌ (Mathew Thomas), మమితా బైజూ (Mamitha Baiju) ప్రధాన పాత్రలు పోషించారు. ఈ రొమాంటిక్‌ కామెడీ మూవీని ప్రముఖ దర్శకుడు రాజమౌళి తనయుడు కార్తికేయ తెలుగులో డిస్ట్రిబ్యూట్‌ చేస్తున్నారు. ఈ చిత్రం మార్చి 8న రిలీజ్‌ కానుంది. రికార్డ్ బ్రేక్ నిహార్‌, నాగార్జున, రగ్ధా ఇఫ్తాకర్‌, సత్యకృష్ణ, సంజన, తుమ్మల ప్రసన్నకుమార్‌ ప్రధాన తారాగణంగా రూపొందిన చిత్రం ‘రికార్డ్‌ బ్రేక్‌’ (Record Break). ప్రముఖ నిర్మాత చదలవాడ శ్రీనివాసరావు ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. పాన్‌ ఇండియా స్థాయిలో ఈ సినిమా మార్చి 8న విడుదల కానుంది. వి లవ్‌ బ్యాడ్‌ బాయ్స్‌ అజయ్‌, వంశీ ఏకశిరి, ఆదిత్య శశాంక్‌ నేతి, రోమిక శర్మ ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన సినిమా ‘వి లవ్‌ బ్యాడ్‌ బాయ్స్‌’ (We Love Bad Boys). రాజు రాజేంద్రప్రసాద్‌ దర్శకత్వం వహించారు. కామెడీ ఎంటర్‌టైనర్‌గా రూపొందిన ఈ సినిమా మార్చి 8న విడుదల కానుంది. రాజు గారి అమ్మాయి - నాయుడు గారి అబ్బాయి రవితేజ నున్న, నేహా జురెల్‌ జంటగా సత్య రాజ్‌ దర్శకత్వంలో రూపొందిన తాజా చిత్రం ‘రాజు గారి అమ్మాయి - నాయుడు గారి అబ్బాయి’ (Raju Gari Ammayi Naidu Gari Abbayi). హాస్యంతోపాటు ఊహించని మలుపులతో ఈ చిత్రం ఆద్యంతం ఉత్కంఠ రేపుతుందని రవితేజ పేర్కొన్నారు. ఈ సినిమా మార్చి 9న రిలీజ్ కానుంది. ఓటీటీలో విడుదలయ్యే చిత్రాలు/వెబ్‌ సిరీస్‌లు హనుమాన్‌ ఓటీటీలోకి ఎప్పుడెప్పుడు వస్తుందా అని అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్న మూవీ ‘హనుమాన్’. సంక్రాంతికి రిలీజై సంచలన విజయం సాధించిన ఈ సినిమా.. సుమారు రెండు నెలల తర్వాత అంటే ఈ శుక్రవారం (మార్చి 8) మహా శివరాత్రినాడు ఓటీటీలోకి వచ్చేస్తోంది. ప్రముఖ ఓటీటీ వేదిక జీ5 (Zee 5) ఈ విషయాన్ని అధికారికంగా వెల్లడించింది. ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా రూ.300 కోట్లకుపైగా కలెక్షన్లు సాధించిన విషయం తెలిసిందే. లాల్ సలామ్ సూపర్ స్టార్ రజనీకాంత్ (Rajinikanth) అతిథిపాత్రలో కనిపించిన ఈ ‘లాల్ సలామ్’ (Lal Salaam) మూవీ బాక్సాఫీస్ దగ్గర బోల్తా పడింది. ఫిబ్రవరి 9న రిలీజైన ఈ మూవీ నెలలోపే నెట్‌ఫ్లిక్స్ లో అడుగుపెడుతోంది. మార్చి 8న నెట్‌ఫ్లిక్స్‌ వేదికగా స్ట్రీమింగ్‌లోకి రాబోతోంది. యాత్ర 2 యాత్ర 2 మూవీ ఫిబ్రవరి 8న థియేటర్లలో రిలీజ్ కాగా.. సరిగ్గా నెల రోజులకు ఓటీటీలోకి వస్తోంది. మాజీ సీఎం వైఎస్ చనిపోయిన తర్వాత ఆయన తనయుడు జగన్మోహన్ రెడ్డి సీఎం కుర్చీని ఎక్కిన తీరును ఈ మూవీలో చూపించారు. 2019లో వచ్చిన యాత్రకు ఇది సీక్వెల్. ఈ చిత్రం కూడా మార్చి 8న అమెజాన్‌ ప్రైమ్‌ వేదికగా స్ట్రీమింగ్‌లోకి రానుంది. వళరి ‘గురు’ ఫేమ్ రితికా సింగ్ (Ritika Singh) కీలక పాత్ర‌లో నటించిన హారర్‌ మూవీ ‘వ‌ళ‌రి’ (Valari). శ్రీరామ్‌ కీలక పాత్ర పోషించాడు. మ్రితికా సంతోషిణి దర్శకత్వం వహించిన ఈ సినిమా ఓటీటీ ‘ఈటీవీ విన్‌’ (ETV Win)లో మార్చి 6 నుంచి స్ట్రీమింగ్‌ కానుంది. మరిన్ని OTT చిత్రాలు & వెబ్ సిరీస్‌ల విడుదలల కోసం ఇక్కడ క్లిక్ చేయండి https://telugu.yousay.tv/tfidb/ott TitleCategoryLanguagePlatformRelease DateAnweshippin KandethumMovieMalayalam / TeluguNetflixMarch 08The Gentleman MovieEnglishNetflixMarch 07DamselMovieEnglishNetflixMarch 08The Backup PlanMovieEnglishNetflixMarch 08SaaguMovieTeluguAmazon / MX PlayerMarch 08Captain MillerMovieHindiAmazon March 08Show TimeMovieHindiDisney + HotstarMarch 08Maha Rani Season 2Web SeriesTelugu/HindiSony LIVMarch 07
    మార్చి 04 , 2024
    Family Star: ‘ఫ్యామిలీ స్టార్‌కు’సెన్సార్‌ బోర్డు ఝలక్..! విజ‌య్ దేవ‌ర‌కొండ (Vijay Devarakonda) హీరోగా, మృణాల్ ఠాకూర్ (Mrunal Thakur) హీరోయిన్‌గా నటించిన చిత్రం 'ఫ్యామిలీ స్టార్' (Family Star). దిల్ రాజు నిర్మాణంలో పరశురామ్ పేట్ల దర్శకత్వం వహించిన ఈ చిత్రం  మరో రెండు రోజుల్లో (ఏప్రిల్‌ 5) విడుదల కానుంది. గీతాగోవిందం లాంటి బ్లాక్‌బాస్టర్‌ తర్వాత విజయ్‌-పరుశురామ్ కాంబోలో ఈ సినిమా వస్తుండటంతో అందరిలోనూ భారీ అంచనాలే ఉన్నాయి. ఇదిలా ఉంటే తాాజాగా ఈ సినిమా సెన్సార్‌ కార్యక్రమాలను పూర్తి చేసుకుంది. అటు ప్రీ రిలీజ్‌ బిజినెస్‌ కూడా గట్టిగానే జరిగింది. ఆ విశేషాలేంటో చూద్దాం.  ప్రీ-రిలీజ్‌ బిజినెస్ ఎంతంటే? భారీ అంచనాలతో వస్తోన్న ‘ఫ్యామిలీ స్టార్‌’ చిత్రం.. గణనీయ సంఖ్యలో ప్రీరిలీజ్‌ బిజినెస్‌ చేసింది. ప్రపంచవ్యాప్తంగా రూ. 43 కోట్లకు ఈ సినిమా థియేట్రికల్‌ హక్కులు అమ్ముడుపోయాయి. ఆంధ్ర ప్రదేశ్ + తెలంగాణ కలిపి రూ. 34.50 కోట్లు నమోదు చేసింది. తెలంగాణ (నైజాం)లో రూ. 13 కోట్లు, రాయలసీమ (సీడెడ్) రూ. 4.5 కోట్లు, ఏపీలో రూ.17 కోట్లకు థియేట్రికల్‌ రైట్స్‌ను మేకర్స్ విక్రయించారు. అటు కర్ణాటక + రెస్ట్ ఆఫ్ భారత్ రూ. 3 కోట్లు, ఓవర్సీస్ రూ. 5.5 కోట్లతో కలిపి మెుత్తంగా ఈ సినిమా రూ.43 కోట్లకు అమ్ముడుపోయినట్లు ట్రేడ్‌ వర్గాలు ప్రకటించాయి. ఫలితంగా ఫ్యామిలీ స్టార్‌ బ్రేక్‌ ఈవెన్‌ టార్గెట్‌ రూ.44 కోట్లకు చేరింది.  సెన్సార్‌ ఝలక్‌! ఫ్యామిలీ స్టార్‌ చిత్రం తాజాగా సెన్సార్‌ పూర్తి చేసుకుంది. ఈ సినిమాకు సెన్సార్‌ బృందం.. యూ/ ఎ సర్టిఫికెట్ జారీ చేసింది. రన్‌ టైమ్‌ను 2గం.ల 43 నిమిషాలకు ఫిక్స్ చేసింది. అయితే సినిమాలో మొత్తం నాలుగు డైలాగ్స్‌ను మ్యూట్ చేయాలని సెన్సార్ సూచించినట్లు సమాచారం. ఇక సినిమాలో డిలీటెడ్ సీన్లు ఏమీ లేవని తెలుస్తోంది. అయితే ఓ పాటలో లిక్కర్ బాటిల్స్ వచ్చినప్పుడు ఆయా లోగోలు కనిపించకుండా చూడాలని సెన్సార్ బోర్డు చెప్పినట్లు సమాచారం. ఇవి తప్ప సినిమాలో పెద్దగా అభ్యంతరక సన్నివేశాలు ఏమీ లేవని సమాచారం. ఆ చిత్రాలతో గట్టి పోటీ! విజయ్‌ దేవరకొండ లాంటి స్టార్‌ హీరో నటించినప్పటికీ ఫ్యామిలీ స్టార్‌కు రెండు సినిమాల నుంచి గట్టిపోటీ తప్పదనిపిస్తోంది. ఒకటి ‘టిల్లు స్క్వేర్‌’ (Tillu Square) కాగా, రెండోది మలయాళం బ్లాక్‌ బాస్టర్ ‘మంజుమ్మల్‌ బాయ్స్‌’ (Manjummel Boys). గత శుక్రవారం రిలీజైన టిల్లు స్క్వేర్‌ సూపర్‌ హిట్‌ టాక్‌తో దూసుకెళ్తోంది. ఈ వారం కూడా మంచి వసూళ్లు సాధిస్తూ వీకెండ్‌ వైపు పరుగులు పెడుతోంది. రెండో వారంతం కూడా టిల్లు స్క్వేర్‌కు మంచి ఆదరణ లభించే అవకాశముంది. మరోవైపు మలయాళంలో ఇండస్ట్రీ హిట్‌గా నిలిచిన మంజుమ్మెల్ బాయ్స్‌.. ఏప్రిల్‌ 6న విడుదలవుతోంది. కలెక్షన్ల సునామీ సృష్టించిన ఈ మూవీని చూసేందుకు తెలుగు ఆడియన్స్ ఎంతో ఆసక్తిగా ఉన్నారు. దీంతో ఈ రెండు చిత్రాలను తట్టుకొని ‘ఫ్యామిలీ స్టార్‌’ ఏమేర రాణిస్తుందో చూడాలి. 
    ఏప్రిల్ 03 , 2024
    Top 10 Malayalam Movies: మీకు మలయాళ చిత్రాలంటే ఇష్టమా? అక్కడ టాప్‌-10 మూవీస్‌ ఇవే! టాలీవుడ్‌లో మలయాళ చిత్రాల హవా మెుదలైంది. ఆ ఇండస్ట్రీకి చెందిన పలు చిత్రాలు ఇటీవలే విడుదలై మంచి విజయాలను సాధిస్తున్నాయి. ఇటీవల విడుదలైన ప్రేమలు సినిమా మలయాళం నుంచి డబ్బింగై తెలుగులో కలెక్షన్ల వర్షం కురిపించింది. తెలుగులో ఏకంగా రూ.15 కోట్లకు పైగా గ్రాస్‌ సాధించి ఇక్కడ ఈ స్థాయిలో వసూళ్లు రాబట్టిన తొలి మలయాళ చిత్రంగా చరిత్ర సృష్టించింది. తాజాగా మరో మలయాళ బ్లాక్ బాస్టర్‌ ‘మంజుమ్మల్‌ బాయ్స్‌’ కూడా తెలుగులో విడుదలై సత్తా చాటేందుకు సిద్ధమవుతోంది. ఈ నేపథ్యంలో కలెక్షన్ల పరంగా మలయాళంలో వచ్చిన టాప్‌-10 చిత్రాలు ఏవో ఇప్పుడు చూద్దాం.  మంజుమ్మల్‌ బాయ్స్‌ గత నెల ఫిబ్రవరి 22న రిలీజైన ఈ (Manjummel Boys) చిత్రం మలయాళంలో సెన్సేషన్ క్రియేట్ చేసింది. సుమారు రూ.20 కోట్ల బడ్జెట్‌తో రూపొందిన ఈ చిత్రం.. ఇప్పటివరకూ రూ.214 కోట్ల గ్రాస్‌ సాధించి సంచలనం సృష్టించింది. ఈ స్థాయి కలెక్షన్స్‌ రాబట్టిన తొలి చిత్రంగా ‘మంజుమ్మల్‌ బాయ్స్‌’ నిలిచింది. 2006లో కొడైకెనాల్‌లోని గుణకేవ్‌లో చిక్కుకున్న తమ స్నేహితుణ్ణి మంజుమ్మల్‌ యువకులు ఎలా కాపాడారు? అన్న కాన్సెప్ట్‌తో ఈ సినిమా రూపొందింది. ఏప్రిల్‌ 6 తెలుగులోనూ రిలీజ్ కాబోతోంది. 2018 2018లో వచ్చిన కేరళ వరదల నేపథ్యంలో ఈ సినిమా రూపొందింది. రూ.26 కోట్ల బడ్జెట్‌తో రూపొందిన ఈ చిత్రం 2023లో విడుదలై ఏకంగా రూ.175.5 కోట్ల వసూళ్లను సాధించింది. అటు తెలుగులోనూ డబ్‌ అయ్యి ఇక్కడా కూడా హిట్‌ టాక్‌ తెచ్చుకుంది. జూడ్ ఆంథనీ జోసేఫ్‌ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో టోవినో థామస్‌, కున్‌చకో బొబన్‌, అపర్ణా బాలమురళి ముఖ్య పాత్రలు పోషించారు. ‘మంజుమ్మల్‌ బాయ్స్‌’ ముందు వరకూ మలయాళంలో అత్యధిక కలెక్షన్ల రికార్డు ఈ మూవీ పేరునే ఉండేది.  పులిమురుగన్‌ మలయాళంలోని స్టార్‌ హీరోల్లో మోహన్‌లాల్‌ (Mohan Lal) ఒకరు. ఆయన నటించిన ‘పులిమురుగన్‌’ (Pulimurugan) చిత్రం.. 2016లో విడుదలై ఏకంగా రూ.152 కోట్ల గ్రాస్‌ వసూళ్లను రాబట్టింది. రూ.25 కోట్ల బడ్టెట్‌తో రూపొందిన ఈ సినిమా.. ఆరు రెట్లు కలెక్షన్స్‌ రాబట్టి అందర్నీ ఆశ్చర్యపరిచింది. 2016-2023 మధ్య ఏడేళ్ల పాటు మలయాళంలో అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా పులిమురుగన్‌ కొనసాగింది. అటు తెలుగులోను ‘మన్యంపులి’ (Manyam Puli) పేరుతో ఈ చిత్రం విడుదలై హిట్‌ టాక్‌ దక్కించుకోవడం విశేషం. ఈ చిత్రానికి వైశాక్‌ దర్శకత్వం వహించారు.  ప్రేమలు (Premalu) నస్లేన్‌ కె. గఫూర్‌, మ్యాథ్యూ థామస్‌, మమిత బైజు తదితరులు ప్రధాన పాత్రల్లో గిరీష్‌ ఎ. డి తెరకెక్కించిన మలయాళ చిత్రం 'ప్రేమలు' (Premalu). ఫిబ్రవరి 9న మలయాళంలో విడుదలైన ఈ సినిమాకు ఆడియన్స్‌ నుంచి ఊహించని రెస్పాన్స్ వచ్చింది. కేవలం రూ.3 కోట్ల బడ్జెట్‌తో రూపొందిన ఈ సినిమా.. ఏకంగా రూ.130 కోట్ల గ్రాస్ సాధించి.. మలయాళంలో అత్యధిక వసూళ్లు సాధించిన నాల్గో చిత్రంగా నిలిచింది. అటు టాలీవుడ్‌లో ఈ సినిమాకు విశేష ఆదరణ దక్కింది. ఈ సినిమా షూటింగ్‌ ఎక్కువగా హైదరాబాద్‌లో జరగడంతో తెలుగు ఆడియన్స్‌ ఈ సినిమాను ఓన్‌ చేసుకున్నారు.   లూసిఫర్‌  2019లో మోహన్‌లాల్‌ (Mohan lal) హీరోగా వచ్చిన లూసిఫర్‌ (Lucifer) కూడా రూ.100 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టి మలయాళంలో ఈ స్థాయి కలెక్షన్స్‌ వసూలు చేసిన ఐదో చిత్రంగా నిలిచింది. ఈ సినిమాకు సలార్ ఫేమ్‌ పృథ్వీరాజ్‌ సుకుమారన్‌ దర్శకత్వం వహించాడు. రూ.30 కోట్ల బడ్జెట్‌తో ఈ మూవీ రూపొందగా.. రూ.127 కోట్ల గ్రాస్‌ వచ్చింది. ఈ సినిమానే తెలుగులో ‘గాడ్ ఫాదర్‌’ (Godfather) పేరుతో మెగాస్టార్‌ చిరంజీవి (Chiranjeevi) రీమేక్ చేయడం గమనార్హం.  నెరు  గతేడాది వచ్చిన నెరు (Neru) సినిమా మలయాళంలో బ్లాక్‌ విజయాన్ని అందుకుంది. ఈ సినిమాలో మోహన్‌లాల్‌ లాయర్‌గా నటించాడు. రూ.12 బడ్జెట్‌తో రూపొందిన ఈ చిత్రం రూ.86 కోట్ల గ్రాస్ సాధించింది. అత్యాచారానికి గురైన ఓ అంధ యువతికి ఓ లాయర్‌ అండగా నిలబడి ఎలా న్యాయం చేశాడు? అన్న కథాంశంతో దర్శకుడు జీతు జోసెఫ్‌ ఈ సినిమాను రూపొందించారు. ఈ సినిమా తెలుగు డబ్బింగ్‌ హాట్‌స్టార్‌లో స్ట్రీమింగ్‌ అవుతోంది.  భీష్మ పర్వం మమ్ముట్టి (Mammootty) హీరోగా 2022లో వచ్చిన ‘భీష్మ పర్వం’ (Bheeshma Parvam) కూడా మలయాళ ఆడియన్స్‌ను ఆకట్టుకుంది. రూ.15 కోట్ల బడ్జెట్‌తో వచ్చిన ఈ సినిమా రూ.85 కోట్లు (గ్రాస్‌) రాబట్టి ఈ జాబితాలో ఏడో చిత్రంగా నిలిచింది. ఈ సినిమాకు అమల్‌ నీరద్‌ దర్శకత్వం వహించగా మమ్ముట్టితో పాటు నదియా, అనసూయ, నెడుముడి వేణు ముఖ్య పాత్రలు పోషించారు.  ఆర్‌డీఎక్స్‌ రాబర్ట్ (R), డానీ (D), జేవియర్‌ (X) అనే ముగ్గురు స్నేహితుల్లో జీవితాల్లో జరిగిన సంఘటనల సమాహారమే ఈ చిత్రం. గతేడాది విడుదలైన ఈ సినిమా మలయాళంలో సూపర్‌హిట్‌గా నిలిచింది. రూ.8 కోట్ల బడ్జెట్‌కు గాను రూ.84.55 వసూళ్లను రాబట్టి ఆశ్చర్యపరిచింది. ఈ సినిమాకు కథ, దర్శకత్వం నిహాస్‌ హిదయనాథ్ అందించారు.  కన్నూర్‌ స్క్వాడ్‌ మమ్ముట్టి హీరోగా చేసిన్న ‘కన్నూర్‌ స్క్వాడ్‌’ (Kannur Squad) చిత్రం కూడా కలెక్షన్ల పరంగా తొమ్మిదో స్థానంలో నిలిచింది. ఈ సినిమా బడ్జెట్‌ రూ.10 కోట్లు. విడుదల అనంతరం ఈ సినిమా రూ.82 కోట్ల గ్రాస్‌ రాబట్టింది. కేరళలోని కన్నూర్‌లో జరిగిన వాస్తవ సంఘటనల ఆధారంగా దర్శకుడు రోబీ వర్గీస్‌ రాజ్‌ ఈ మూవీని రూపొందించారు. ప్రముఖ ఓటీటీ వేదిక హాట్‌స్టార్‌లో ఈ సినిమా తెలుగులో స్ట్రీమింగ్‌ అవుతోంది.  కురుప్‌ దుల్కార్‌ సల్మాన్‌ (Dulquer Salmaan) హీరోగా చేసిన ‘కురుప్‌’ (Kurup) చిత్రం.. కలెక్షన్స్‌ పరంగా మలయాళంలో టాప్‌-10లో నిలిచింది. ఈ సినిమా బడ్జెట్‌ రూ.35 కోట్లు. ఓవరాల్‌గా ఈ సినిమాకు రూ.81 కోట్ల గ్రాస్‌ వచ్చింది. కేరళలో ఫేమస్‌ క్రిమినల్‌ సుకుమార కురుప్పు జీవిత కథ ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కించారు. శ్రీనాథ్‌ రాజేంద్రన్‌ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో హీరోయిన్‌గా శోభితా దూళిపాళ్ల (Sobhita Dhulipala) నటించింది. 
    మార్చి 29 , 2024

    సుశాంత్ వ్యక్తిగత వివరాలు, ఎత్తు, పుట్టిన ప్రదేశం, బర్త్‌ డేట్‌, వయస్సు, సాధించిన విజయాలు, అవార్డులు, వ్యాపారాలు, ఇష్టాఇష్టాలు, అభిరుచులు తెలుసుకోండి. అలాగే సుశాంత్ కుటుంబ నేపథ్యం, తల్లిదండ్రులు, తోబుట్టువులు, రిలేషన్స్‌, విద్యా నేపథ్యం, కెరీర్ మైలురాళ్లు, తాజా ప్రాజెక్ట్‌లు, అధికారిక సోషల్ మీడియా అకౌంట్స్, లేటెస్ట్‌ చిత్రాలను ఒక్క క్లిక్‌తో ఇక్కడ తెలుసుకోండి.

    @2021 KTree