• TFIDB EN
  • వైభవి శాండిల్య
    జననం : మే 27 , 1993
    ప్రదేశం: మహారాష్ట్ర
    వైభవి శాండిల్య మహారాష్ట్రకు చెందిన నటి. 1994 మే 27న పుణెలో జన్మించింది. 2015లో వచ్చిన 'ఎక్ అల్బెలా' అనే మరాఠీ చిత్రంతో నటిగా తెరంగేట్రం చేసింది. 2017లో ఆది హీరోగా చేసిన 'నెక్స్ట్‌ నువ్వే' ఫిల్మ్‌తో తెలుగులో అడుగుపెట్టింది. తెలుగు, మరాఠి, కన్నడ, తమిళ భాషల్లో 8 చిత్రాల్లో వైభవి నటించింది.

    వైభవి శాండిల్య వయసు ఎంత?

    వైభవి శాండిల్య వయసు 31 సంవత్సరాలు

    వైభవి శాండిల్య ఎత్తు ఎంత?

    5' 4'' (162 cm)

    వైభవి శాండిల్య అభిరుచులు ఏంటి?

    ట్రావెలింగ్‌, డ్యాన్సింగ్‌, షాపింగ్‌

    వైభవి శాండిల్య ఏం చదువుకున్నారు?

    గ్రాడ్యుయేట్‌

    వైభవి శాండిల్య ఏ విద్యాసంస్థల్లో చదువుకున్నారు?

    మితిబాయ్‌ కాలేజ్‌, ముంబయి

    వైభవి శాండిల్య ఫిగర్ మెజర్‌మెంట్స్?

    32-26-34

    వైభవి శాండిల్య‌ ఇప్పటివరకూ చేసిన తెలుగు చిత్రాలు ఏవి?

    తెలుగులో 'నెక్ట్స్‌ నువ్వే' (2017) అనే ఒకే ఒక్క ఫిల్మ్‌ చేసింది. మరాఠి, కన్నడ, తమిళ భాషల్లో మరో 8 చిత్రాలు చేసింది.

    వైభవి శాండిల్య‌ ఇప్పటివరకూ చేసిన వెబ్‌ సిరీస్‌లు?

    నిషా (2019), ఛత్రసాల్ (2021)

    వైభవి శాండిల్య In Ethnic Dress

    Images

    Vaibhavi Shandilya Images in Ethnic Wear

    వైభవి శాండిల్య In Saree

    Images

    Vaibhavi Shandilya In Saree

    వైభవి శాండిల్య Hot Pics

    Images

    Vaibhavi Shandilya Hot Images

    Images

    Vaibhavi Shandilya Hot Looks

    వైభవి శాండిల్య అన్‌ కేటగిరైజ్డ్ ఇమేజెస్‌

    Images

    Vaibhavi Shandilya

    Insta Hot Reels

    View post on Instagram
     

    Vaibhavi Shandilya Insta Hot Reels

    View post on Instagram
     

    Vaibhavi Shandilya Insta Reels

    కథనాలు
    <strong>New Ott Releases This Week: దసరా స్పెషల్‌.. ఈ వారం రాబోతున్న కొత్త చిత్రాలు ఇవే!</strong>
    New Ott Releases This Week: దసరా స్పెషల్‌.. ఈ వారం రాబోతున్న కొత్త చిత్రాలు ఇవే! ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో దసరా సందడి నెలకొంది. ఈ పండగను పురస్కరించుకొని తెలుగు ప్రేక్షకులను పలకరించేందుకు పలు చిత్రాలు సిద్ధమయ్యాయి. ఈ వారం బాక్సాఫీస్‌ వద్ద అలరించనున్నాయి. అటు ఓటీటీలోనూ పలు ఆసక్తికర చిత్రాలు, వెబ్‌సిరీస్‌లు స్ట్రీమింగ్‌ రాబోతున్నాయి. ఆ విశేషాలేంటో ఈ ప్రత్యేక కథనంలో తెలుసుకుందాం.&nbsp; థియేటర్‌లో విడుదలయ్యే చిత్రాలు వేట్టయాన్‌ (Vettaiyan) తమిళ సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌ (Rajinikanth) నటించిన లేటెస్ట్ చిత్రం ‘వేట్టయాన్‌’.&nbsp; ‘జై భీమ్‌’ వంటి సోషల్‌ మెసేజ్‌ మూవీతో ప్రేక్షకులను అలరించిన టి.జె.జ్ఞానవేల్‌ ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. లైకా ప్రొడక్షన్స్‌ నిర్మిస్తున్న ఈ మూవీలో అమితాబ్‌, ఫహద్‌ ఫాజిల్‌, రానా, మంజు వారియర్‌, రితికా సింగ్‌, దుషారా విజయన్‌ కీలకపాత్రలు పోషించారు. అనిరుధ్‌ సంగీతం అందించారు. దసరా కానుకగా అక్టోబరు 10న ఈ చిత్రం విడుదల (Vettaiyan Release Date) కానుంది. జైలర్‌ వంటి బ్లాక్‌ బాస్టర్‌ తర్వాత రజనీ నటించిన చిత్రం కావడంతో ప్రేక్షకుల్లో వేట్టయాన్‌పై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. విశ్వం (Viswam) ప్రముఖ నటుడు గోపిచంద్‌ (Gopichand) హీరోగా శ్రీను వైట్ల (Srinu Vaitla) దర్శకత్వంలో రూపొందిన చిత్రం ’విశ్వం’ (Viswam). ఈ చిత్రాన్ని టీజీ విశ్వప్రసాద్, వేణు దోనేపూడి సంయుక్తంగా నిర్మించారు. కావ్య థాపర్‌ హీరోయిన్‌గా చేసింది. అక్టోబరు&nbsp; 11న (Viswam Movie Release Date) విడుదలవుతోంది. కామెడీ చిత్రాలకు కేరాఫ్‌గా మారిన శ్రీను వైట్లతో నటుడు గోపిచంద్‌ గతకొంత కాలంగా సరైన హిట్‌ లేక ఇబ్బంది పడుతున్నారు. ఈ సినిమాతో కచ్చితంగా హిట్‌ కొట్టాలని ధీమాతో ఉన్నారు. ఇప్పటికే విడుదలైన విశ్వం ట్రైలర్‌, టీజర్‌ ఆకట్టుకున్నాయి. మా నాన్న సూపర్‌ హీరో (Maa Nanna Super Hero) సుధీర్‌ బాబు (Sudheer Babu) కథానాయకుడిగా అభిలాష్‌ రెడ్డి కంకర దర్శకత్వంలో వస్తోన్న చిత్రం ‘మా నాన్న సూపర్‌ హీరో’ (Maa Nanna Super Hero). ఆర్ణ కథానాయికగా చేసింది. షాయాజీ షిండే కీలక పాత్రలో కనిపించబోతున్నారు. దసరా కానుకగా అక్టోబర్‌ 11న ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే విడుదలైన ప్రచార చిత్రాలు ప్రేక్షకుల్లో ఆసక్తి పెంచడంతో అంచనాలను రేకెత్తించాయి. జనక అయితే గనక (Janaka Ithe Ganaka) యంగ్‌ హీరో సుహాస్‌ వరుసగా చిత్రాలు రిలీజ్‌ చేస్తూ దూసుకుపోతున్నాడు. వైవిధ్యమైన కథలతో మంచి విజయాలను సాధిస్తున్నాడు. ఈ క్రమంలోనే అతడు నటించిన లేటెస్ట్‌ చిత్రం ‘జనక అయితే గనక’ ఈ వారమే ప్రేక్షకుల ముందుకు రానుంది. సంకీర్తన కథానాయక. ఈ చిత్రాన్ని దిల్‌రాజు ప్రొడక్షన్స్‌ సంస్థ నిర్మించింది. సందీప్‌ బండ్ల దర్శకత్వం వహించారు. అక్టోబరు 12న ఈ మూవీ విడుదల కానుంది.&nbsp; జిగ్రా (Jigra) అలియా భట్, వేదాంగ్‌ రైనా ప్రధాన పాత్రల్లో వాసన్‌ బాలా రూపొందించిన బాలీవుడ్‌ చిత్రం ‘జిగ్రా’.&nbsp; అక్టోబరు 11న (Jigra Release Date) థియేటర్లలోకి రానుంది. తెలుగులో ఏషియన్‌ సురేశ్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ పతాకంపై రానా దగ్గుబాటి విడుదల చేస్తున్నారు. యాక్షన్, ఫ్యామిలీ ఎమోషన్స్‌ కలయికతో వచ్చిన ఈ చిత్రం అన్నివర్గాలు ప్రేక్షకులకు తప్పక నచ్చుతుందని చిత్ర యూనిట్‌ చెబుతోంది. ఇప్పటికే విడుదలై ట్రైలర్‌ సినిమాపై అంచనాలు పెంచే విధంగా ఉంది.&nbsp; మార్టిన్‌ (Martin) కన్నడ నటుడు ధ్రువ సర్జా ఈ వారం మార్టిన్‌ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ఎ.పి. అర్జున్‌ ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. వైభవి శాండిల్య కథానాయిక.ఈ పాన్‌ ఇండియా చిత్రాన్ని అక్టోబరు 11న (Martin Movie Release Date) విడుదల చేస్తున్నారు. యాక్షన్ చిత్రాల ప్రేమికులను ఈ మూవీ తప్పక మెప్పిస్తుందని మేకర్స్‌ ధీమా వ్యక్తం చేస్తున్నారు.&nbsp; ఓటీటీలో విడుదలయ్యే చిత్రాలు లెవెల్ క్రాస్ అమ‌లాపాల్ హీరోయిన్‌గా న‌టించిన మ‌ల‌యాళం మూవీ ‘లెవెల్ క్రాస్’ థియేట‌ర్ల‌లో రిలీజైన రెండు నెలల త‌ర్వాత ఓటీటీలోకి వ‌స్తోంది. సైక‌లాజిక‌ల్ థ్రిల్ల‌ర్ క‌థాంశంతో తెర‌కెక్కిన ఈ మూవీకి అర్ఫాజ్‌ అయూబ్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించాడు. ఆసిఫ్‌ అలీ హీరోగా న‌టించాడు. అక్టోబర్‌ 11 నుంచి ఆహాలో ఈ చిత్రం ప్రసారం కానుంది. ప్లాట్‌ ఏంటంటే చైతాలి (అమ‌లాపాల్‌) ట్రైన్ ప్ర‌మాదంలో గాయ‌ప‌డుతుంది. ఆమెను రైల్వే గేట్‌మెన్ ర‌ఘు (ఆసిఫ్ అలీ) కాపాడుతాడు. రఘుని కలిసిన తర్వాత నుంచి చైతాలి జీవితంలో ఊహించని పరిణామాలు చోటుచేసుకుంటాయి. చైతాలి త‌న‌కు పెళ్లి అయిన‌ట్లుగా ఎందుకు భ్రమపడుతుంది? వారిద్దరికి ఉన్న సంబంధం ఏంటి? అన్నది స్టోరీ.&nbsp; TitleCategoryLanguagePlatformRelease DateYoung SheldonMovieEnglishNetflixOct 08Monster High 2MovieEnglishNetflixOct 10Khel Khel MeinMovieHindiNetflixOct 09Starting 5SeriesEnglishNetflixOct 10Tomb Raider: Lara CroftAnimationEnglishNetflixOct 10Lonely PlanetMovieEnglishNetflixOct 10Outer Banks 4SeriesEnglishNetflixOct 10Up RisingSeriesEnglish/KoreanNetflixOct 11ChuckyMovieEnglishNetflixOct 15SurfiraMovieHindiHotstarOct 11WarieMovieTamilHotstarOct 11Pailan PillagaMovieTeluguETV WinOct 10Thatva&nbsp;MovieTeluguETV WinOct 10Guter GuMovieHindiJio CinemaOct 11Tea cupMovieEnglishJio CinemaOct 11Jai MahendranMovieMalayalamSonyLIVOct 11Raat Jawan HieMovieHindiSonyLIVOct 11
    అక్టోబర్ 07 , 2024
    మెుదటి త్రైమాసికంలో టాలివుడ్‌, బాలివుడ్‌,కొలివుడ్‌, శాండల్‌వుడ్‌ పైచేయి ఎవరిది? కొత్త సంవత్సరం ప్రారంభమై దాదాపు 3 నెలలు పూర్తయ్యింది. తెలుగు, తమిళ్, కన్నడ, హిందీ భాషల్లో చాలా చిత్రాలు విడుదలయ్యాయి. కొన్ని చిత్రాలు బాక్సాఫీస్‌ను షేక్ చేస్తే…. మరికొన్ని అంచనాలు అందుకోలేక డిజాస్టర్లుగా మిగిలాయి. పఠాన్ వంటి ఆల్‌టైమ్‌ బ్లాక్‌ బస్టర్‌తో బాలీవుడ్‌కు పూర్వ వైభవం వచ్చింది. వీరసింహా రెడ్డి, వాల్తేరు వీరయ్య చిత్రాలు టాలీవుడ్ మేనియాను కొనసాగించాయి. తమిళ్, కన్నడ ఇండస్ట్రీలకు మంచి హిట్లే పడ్డాయి. టాలివుడ్‌ పరంపర గతేడాది ధమాకా వంటి సూపర్‌ హిట్‌తో ముగించిన టాలీవుడ్‌… ఏడాది ఆరంభంలోనే బ్లాక్‌బస్టర్లను అందుకుంది. సీనియర్ హీరోలు బాలకృష్ణ, చిరంజీవి అభిమానులు పండుగ చేసుకొనే సినిమాలను ఇచ్చారు. మైత్రీ మూవీ మేకర్స్‌ నిర్మించిన వీరసింహా రెడ్డి రూ. 110 కోట్లు పెట్టి తెరకెక్కిస్తే రూ. 134 కోట్ల వసూళ్లు వచ్చాయి. ఇదే బ్యానర్‌లో వచ్చిన వాల్తేరు వీరయ్య రూ.140 కోట్లతో రూపొందించగా.. రూ. 219 కోట్లు సాధించింది.&nbsp; చిన్న హిట్లు తెలుగు ప్రేక్షకులను చిన్న సినిమాలు కూడా అలరించాయి. సుహాస్‌ హీరోగా వచ్చిన రైటర్ పద్మభూషణ్ బాక్సాఫీస్ వద్ద క్లాసిక్ హిట్‌గా నిలిచింది. రూ.2.5 కోట్లతో తెరకెక్కించగా.. రూ. 12.5 కోట్లు వచ్చాయి. ఇదే సమయంలో చాలా రోజుల తర్వాత హిట్ అందుకున్నాడు కిరణ్ అబ్బవరం. గీతా ఆర్ట్స్‌ 2 బ్యానర్‌లో వచ్చిన వినరో భాగ్యము విష్ణు కథ సినిమా ప్రేక్షకులను మెప్పించింది. రూ.1 కోటి బడ్జెట్‌ పెట్టి నిర్మించగా.. రూ. 9.15 కోట్లు వచ్చాయి.&nbsp; భావోద్వేగాల బలగం మంచి సినిమాను తెలుగు ప్రేక్షకులు ఆదరిస్తారని బలగం సినిమాతో మరోసారి రుజువయ్యింది. కమెడియన్ వేణు దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని ప్రతి ఒక్కరూ ఆస్వాదించారు. సూపర్ హిట్‌ చేసి కలెక్షన్ల వర్షం కురిపించారు ప్రేక్షకులు. రూ. 1.5 కోట్లతో దిల్‌రాజు నిర్మించగా.. రూ. 18.65 కోట్లు వసూలు చేసింది చిత్రం. ఇంకా థియేటర్లలో అలరిస్తోంది. డిజాస్టర్లు బింబిసార వంటి ఇండస్ట్రీ హిట్‌ ఇచ్చిన కళ్యాణ్ రామ్ ఈ ఏడాది నిరాశపర్చాడు. సరికొత్త కాన్సెప్ట్‌తో అమిగోస్ అనే చిత్రం తెరకెక్కించి విఫలమయ్యాడు. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద బోల్తా పడింది. ఎప్పట్నుంచో హిట్‌ కోసం ఎదురుచూస్తున్న సందీప్ కిషన్‌కి కూడా సరైన హిట్‌ దక్కలేదు. మైఖేల్ సినిమాతో మళ్లీ ఫ్లాప్ మూటగట్టుకున్నాడు సందీప్. ఇవి మినహా తెలుగులో మంచి హిట్లే దక్కాయి.&nbsp; బాలీవుడ్‌ బాద్షా వరుస ఫ్లాప్‌లతో సతమతమవుతున్న బాలీవుడ్ పరిశ్రమకు చాలాకాలం గ్యాప్ తర్వాత వచ్చిన బాద్షా షారుఖ్ ఖాన్ ఆల్‌ టైమ్ బ్లాక్‌బస్టర్‌ను అందించాడు.ఏకంగా వెయ్యి కోట్ల కలెక్షన్లను దాటేశాడు. రూ.250 కోట్లతో తెరకెక్కిన పఠాన్ చిత్రం రూ. 1047 కోట్లు వసూలు చేసింది. బాలీవుడ్‌లో బాహుబలి పేరిట ఉన్న రికార్డును చేరిపేశాడు కింగ్ ఖాన్.&nbsp; రొమాంటిక్ హిట్ కింగ్ ఖాన్ తెచ్చిన వైభవాన్ని రణ్‌బీర్ కపూర్ కొనసాగించాడు. తూ జూటీ మై మక్కర్ వంటి రొమాంటిక్ ఫ్యామిలీ డ్రామాతో హిట్‌ కొట్టాడు ఈ కుర్ర హీరో. ఈ సినిమా రూ. 70 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కించగా.. రూ.151.35 కోట్లు వసూలు చేసింది. అయితే,&nbsp; తెలుగు రీమేక్‌గా రూపుదిద్దుకున్న షెహజాదా మాత్రం డిజాస్టర్‌గా మిగిలిపోయింది.&nbsp; షెహ్‌జాదా ఎందుకు ఫ్లాప్‌ అయింది? https://telugu.yousay.tv/why-did-the-remake-of-ala-vaikunthapuram-not-work-out-why-shehzada-is-a-disaster.html తమిళ్‌ సూపర్ స్టార్స్ కోలీవుడ్‌లో కూడా ఈ ఏడాది శుభారంభంతోనే ప్రారంభమయ్యింది. దిల్ రాజు నిర్మాణంలో దళపతి విజయ్ హీరోగా వంశీ పైడిపల్లి దర్శకత్వంలో తీసిన వారిసు ఇండస్ట్రీ హిట్‌ అయ్యింది. రూ.297 కోట్లు వసూళ్లు సాధించింది ఈ సినిమా. సంక్రాంతి బరిలో అజిత్‌ చిత్రం తునివు కూడా హిట్‌గానే నిలిచింది. కాకపోతే పెట్టిన బడ్జెట్ తిరిగి వచ్చింది అంతే. వెంకీ అట్లూరి దర్శకత్వంలో ధనుష్ నటించిన సార్ సినిమా సగటు ప్రేక్షకులను మెప్పించింది. రూ.35 కోట్లతో తీర్చిదిద్దితే రూ.115 కోట్లు సాధించింది ఈ చిత్రం. ఇంకా మెుదలుకాలేదు కన్నడలో విడుదలైన ఒకే ఒక్క పెద్ద చిత్రం కబ్జ. దాదాపు కేజీఎఫ్ రేంజ్ ట్రైలర్ చూపించినప్పటికీ సినిమా బాక్సాఫీస్‌ వద్ద పెద్దగా ఆడటం లేదు. ఇండియన్ రియల్ స్టార్ ఉపేంద్ర, కిచ్చా సుదీప్, శివన్న వంటి స్టార్లు ఉన్నప్పటికీ ప్రేక్షకులను మెప్పించలేకపోయారు.&nbsp; ఆధిపత్యం ఎవరిది? చిత్ర పరిశ్రమలన్నింటిలో హిట్లు, ఫ్లాపులు ఉన్నాయి. తెలుగులో వరుస బ్లాక్‌బస్టర్లు కొట్టాయి. తమిళ్‌ నుంచి డబ్ అయిన చిత్రాలు కూడా బాగానే ఆదరించారు. కానీ, కలెక్షన్ల పరంగా బాలీవుడ్ దూసుకుపోయింది. ఆల్‌టైమ్ ఇండస్ట్రీ హిట్‌ను కొట్టేశాయి. తమిళ్‌లోనూ రూ.100 కోట్ల క్లబ్ సినిమాలు మూడు వచ్చాయి. ఈ పరంగా చూసుకున్నట్లయితే… ఒక్కో విభాగంలో ఒక్కో ఇండస్ట్రీ టాప్‌లో నిలిచిందనే చెప్పాలి. లేదు ప్రస్తుతం కలెక్షన్లే మ్యాటర్‌ అనుకుంటే.. బాలీవుడ్‌ దే పైచేయి.&nbsp;
    మార్చి 20 , 2023
    Telugu OTT Releases: ఈ వారం (మే 8) థియేటర్లు, ఓటీటీలలో సందడి చేసే సినిమాలు ఇవే..! ఈ వారం కూడా పలు సినిమాలు, వెబ్‌సిరీస్‌లు ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమయ్యాయి. ఈ వేసవిలో ఆహ్లాదకరమైన వినోదాన్ని అందించేందుకు రాబోతున్నాయి. మే 8-14వ తేదీల మధ్య పలు సినిమాలు థియేటర్లలో సందడి చేయనున్నాయి. అలాగే ఓటీటీలో కొత్త సినిమాలు, అనువాద చిత్రాలు, వెబ్‌సిరీస్‌లు స్ట్రీమింగ్‌ కాబోతున్నాయి.&nbsp; అవేంటో ఈ కథనంలో చూద్దాం. థియేటర్‌లో రిలీజయ్యే చిత్రాలు: కస్టడీ నాగ చైతన్య (Naga Chaitanya) - కృతిశెట్టి (Krithi Shetty) జంటగా చేసిన కస్టడీ (Custody) చిత్రం ఈ వారమే థియేటర్లలో రిలీజ్ కానుంది. ఈ సినిమా మే 12 (శుక్రవారం)న తెలుగు, తమిళ భాషల్లో ఒకేసారి విడుదల కానుంది. ఇందులో చైతూ శివ అనే నిజాయతీ గల పోలీస్‌ కానిస్టేబుల్‌గా కనిపించనున్నారు. సినిమాలో యాక్షన్‌తో పాటు ప్రేమకథకు ప్రాధాన్యమున్నట్లు ప్రచార చిత్రాన్ని తీర్చి దిద్దిన తీరును బట్టి అర్థమవుతోంది. ఈ చిత్రానికి వెంకట్‌ ప్రభు దర్శకత్వం వహించగా.. శ్రీనివాస చిట్టూరి నిర్మించారు. ఇప్పటికే విడుదలైన కస్టడీ పోస్టర్లు, టీజర్‌, ట్రైలర్ సినిమాపై అంచనాలను భారీగా పెంచేశాయి. ఛత్రపతి (హిందీ) ఛత్రపతి (Chatrapathi) సినిమా ద్వారా బెల్లంకొండ శ్రీనివాస్‌ (Bellamkonda Sreenivas) బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇస్తున్నాడు. వి.వి. వినాయక్‌ దర్శకత్వం వహించిన ఈ చిత్రం కూడా మే 12 (శుక్రవారం)న రిలీజ్‌ కానుంది. ఇటీవల రిలీజైన ఈ సినిమా ట్రైలర్‌ బాలీవుడ్‌ ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. కాగా తెలుగులో రాజమౌళి తెరకెక్కించిన ఛత్రపతి సినిమాకు ఇది రీమేక్‌.  భాగ్యశ్రీ, శరద్‌ కేల్కర్‌, శివం పాటిల్‌ ఈ చిత్రంలో కీలక పాత్రలు పోషిస్తున్నారు. జయంతిలాల్‌ గడా ఈ చిత్రాన్ని నిర్మించారు.   భువన విజయమ్‌&nbsp; సునీల్ ప్రధాన పాత్రలో చేసిన భువన విజయమ్(Bhuvana Vijayam) సినిమా కూడా ఈ వారమే ప్రేక్షకులను పలకరించనుంది. మే 12 (శుక్రవారం) ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. భువన విజయమ్‌తో&nbsp; యలమంద చరణ్‌ దర్శకుడుగా పరిచయం కానున్నారు. ఈ సినిమా 30 ఇయర్స్‌ పృథ్వీ, శ్రీనివాస్‌ రెడ్డి, వెన్నెల కిశోర్‌, ధనరాజ్‌ తదితర హాస్యనటులు నటించారు. ఇప్పటికే విడుదలైన ట్రైలర్‌, టీజర్లు సినిమాపై అంచనాలను పెంచేశాయి.&nbsp; ది స్టోరీ ఆఫ్‌ బ్యూటిఫుల్‌ గర్ల్‌ ‘ది స్టోరీ ఆఫ్‌ బ్యూటిఫుల్‌ గర్ల్‌’ (The Story Beautiful Girl) సినిమా కూడా ఈ శుక్రవారమే విడుదల కానుంది. ఇందులో నిహాల్‌ కోదాటి, దృషికా చందర్‌ హీరో హీరోయిన్లుగా చేశారు. ఈ చిత్రానికి రవి ప్రకాష్ బోడపాటి దర్శకత్వం వహించగా ప్రసాద్ తిరువల్లూరి, పుష్యమి ధవళేశ్వర సంయుక్తంగా నిర్మిస్తున్నారు. లవ్, యాక్షన్‌ తో పాటు, క్రైమ్, థ్రిల్లింగ్ ఎలిమెంట్స్‌తో సినిమాను తీర్చిదిద్దినట్లు చిత్ర బృందం చెబుతోంది. కళ్యాణమస్తు శేఖర్‌ అయాన్‌ వర్మ, వైభవి రావ్‌ జంటగా తెరకెక్కిన చిత్రం ‘కళ్యాణమస్తు’ (Kalyana Masthu). ఈ చిత్రానికి సాయి దర్శకత్వం వహించారు. బోయపాటి రఘుబాబు నిర్మాత. మే 12న చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. ప్రేమతో మొదలైన ఓ జంట ప్రయాణం... పెళ్లి వరకూ ఎలా సాగిందనేది అసలు కథ అని చిత్ర యూనిట్‌ తెలిపింది. మ్యూజిక్‌ స్కూల్‌&nbsp; శ్రియ శరణ్‌, శర్మాన్‌ జోషి, షాన్‌ కీలక పాత్రల్లో నటించిన మ్యూజిక్‌ స్కూల్‌ (Music School) చిత్రం మే 12న రిలీజ్‌ కాబోతోంది. ఈ చిత్రానికి బియ్యాల పాపారావు దర్శకత్వం వహించారు. ఇళయరాజా స్వరాలు సమకూర్చారు. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ సినిమాను ప్రముఖ నిర్మాత దిల్‌రాజు తెలుగు రాష్ట్రాల్లో విడుదల చేస్తున్నారు. ఓటీటీలో స్ట్రీమింగ్‌కానున్న చిత్రాలు/వెబ్‌సిరీస్‌ న్యూసెన్స్‌ నవదీప్‌ (Navdeep), బిందు మాధవి (Bindu Madhavi) కీలక పాత్రల్లో నటించిన సరికొత్త వెబ్‌సిరీస్‌ ‘న్యూసెన్స్‌’. శ్రీ ప్రవీణ్‌ కుమార్‌ దర్శకత్వం వహించారు. పీపుల్స్‌ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై టీజీ విశ్వప్రసాద్‌ నిర్మించారు. ఇప్పటికే చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ వెబ్‌సిరీస్‌ తెలుగు ఓటీటీ వేదిక ‘ఆహా’లో మే 12 నుంచి స్ట్రీమింగ్‌ కానుంది. మీడియా, రాజకీయం ఇతివృత్తంగా చిత్తూరు బ్యాక్‌డ్రాప్‌లో ఈ సిరీస్‌ను తెరకెక్కించారు. దహాద్‌ బాలీవుడ్‌ నటి సోనాక్షి సిన్హా (Sonakshi Sinha) ప్రధాన పాత్రలో చేసిన ‘దహాద్‌’ (Dahaad) వెబ్‌సిరీస్‌ కూడా ఈ శుక్రవారమే స్ట్రీమింగ్‌ కానుంది. అమెజాన్‌ ప్రైమ్‌ వీడియో వేదికగా ఈ సిరీస్‌ వీక్షించవచ్చు. ఇందులో అంజలి భాటి అనే పోలీసు పాత్రలో సోనాక్షి సిన్హా కనిపించనుంది. పబ్లిక్‌ బాత్‌రూమ్‌లలో అనుమానాస్పదంగా చనిపోయిన కొందరు మహిళల హత్య కేసును ఛేదించడానికి అంజలి భాటి చేసిన ప్రయత్నాలు, కథలో ఊహించని మలుపులను ఇందులో ఆసక్తికరంగా చూపించనున్నారు. ఫ్లాట్‌ఫామ్‌ వారీగా ఓటీటీ విడుదలలు…&nbsp; TitleCategoryLanguagePlatformRelease DateThe Muppets Mayhemseries&nbsp;EnglishDisney+ HotstarMay 10Soppana SundariMovieTamilDisney+ HotstarMay 12AirMovieenglishAmazon PrimeMay 12Justice LeagueSeriesEnglishNetflixMay 08Spirit Rangers, season 2SeriesEnglishNetflixMay 08Documentary Now!, season 4SeriesEnglishNetflixMay 09Black Knight&nbsp;SeriesEnglishNetflixMay 12Faithfully Yours&nbsp;MovieEnglishNetflixMay 17Yakitori: Soldiers of MisfortuneSeriesEnglishNetflixMay 18SeriesHindiZee5May 12Triangle of SadnessMovieEnglishSonyLIVMay 12Vikram vedaMovieHindiJio CinemaMay 12
    మే 08 , 2023
    The GOAT Review: దళపతి విజయ్‌ తనతో తానే తలపడాల్సి వస్తే.. ‘ది గోట్‌’ గ్రేట్‌గా ఉందా? లేదా? నటీనటులు : విజయ్‌, మీనాక్షి చౌదరి, ప్రభుదేవా, ప్రశాంత్‌ త్యాగరాజన్‌, కొకిలా మోహన్‌, జయరాం, స్నేహా, వీటీవీ గణేష్‌, అరవింద్‌ ఆకాష్‌, వైభవ్ రెడ్డి తదితరులు కథ, దర్శకత్వం : వెంకట్‌ ప్రభు సంగీతం : యువన్‌ శంకర్‌ రాజా సినిమాటోగ్రఫీ : సిద్ధార్థ నూని ఎడిటింగ్‌ : వెంకట్‌ రాజన్‌ నిర్మాతలు : కల్పతి ఎస్‌. అఘోరం, కల్పతి ఎస్. గణేశ్‌, కల్పతి ఎస్‌. సురేష్‌ తమిళ స్టార్‌ హీరో విజయ్‌ (Vijay) నటించిన లేటెస్ట్‌ యాక్షన్‌ థ్రిల్లర్‌ ‘ది గోట్‌’ (ది గ్రేటెస్ట్‌ ఆఫ్‌ ఆల్‌ టైమ్‌). వెంకట్‌ ప్రభు దర్శకుడు. మీనాక్షి చౌదరి కథానాయిక. స్నేహ, లైలా, ప్రశాంత్‌, ప్రభుదేవా తదితరులు కీలక పాత్రలు పోషించారు. ఈ చిత్రం ‘డీ-ఏజింగ్‌ టెక్నాలజీ’తో రూపొందింది. విజయ్ రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చేందుకు సిద్ధమైన తరువాత చేసిన చివరి సినిమా అని ప్రచారం జరగడంతో ఈ సినిమా మీద అంచనాలు ఎక్కువగానే ఏర్పడ్డాయి. మరి ఈ సినిమా ఎలా ఉంది? ప్రేక్షకులను ఎంతవరకు ఆకట్టుకుంది? విజయ్‌కు మరో మరుపురాని విజయాన్ని అందించిందా? లేదా? ఈ రివ్యూ&nbsp; (The Greatest of All Time Telugu Review)లో తెలుసుకుందాం.&nbsp; కథేంటి గాంధీ (విజయ్) స్పెషల్ యాంటీ టెర్రరిజం స్క్వాడ్ ఆఫీసర్‌గా పనిచేస్తుంటాడు. తన టీమ్‌మేట్స్ సునీల్ ( ప్రశాంత్), అజయ్ (అజ్మల్), కళ్యాణ్ సుందరం (ప్రభుదేవా)తో కలిసి పలు విజయవంతమైమ మిషన్స్‌ నిర్వహిస్తాడు. అయితే తను చేసే పని గురించి భార్య అను (స్నేహా)కు చెప్పడు. మిషన్‌లో భాగంగా విదేశాలకు వెళ్లిన క్రమంలో అతడి ఐదేళ్ల కొడుకు మరణిస్తాడు. తన కుమారుడి మరణానికి భర్తే కారణమని భావించి గాంధీని దూరంగా పెడుతుంది. ఆ బాధతో గాంధీ ఫోర్స్‌కు దూరమవుతాడు. కొన్నేళ్ల తర్వాత ఓ పనిమీద మాస్కోకి వెళ్తాడు. అక్కడ చనిపోయాడు అనుకుంటున్న తన కుమారుడు జీవన్‌ (విజయ్‌)ను చూస్తాడు. ఎంతో సంతోషించి భారత్‌కు తీసుకొస్తాడు. అప్పటినుంచి గాంధీ సన్నిహితులు ఒక్కొక్కరిగా చనిపోతుంటారు. ఆ మరణాలకు కారకులు ఎవరు? చనిపోయిన జీవన్‌ ఎలా తిరిగొచ్చాడు? తన వాళ్ల మరణాలను గాంధీ ఎలా ఆపాడు? అన్నది తెలియాలంటే థియేటర్‌కు వెళ్లాల్సిందే.&nbsp; ఎవరెలా చేశారంటే దళపతి విజయ్‌ ఇందులో ద్విపాత్రాభినయం చేశాడు. గాంధీ పాత్రలో ఎప్పటిలాగే అదరగొట్టాడు. అయితే జీవన్‌ పాత్రలో యంగ్‌ విజయ్‌ డిజిటలైజ్డ్‌ లుక్ కాస్త ఎబ్బెట్టుగా అనిపిస్తుంది. అంత కన్విన్సింగ్‌గా ఉండదు. ఇక యాక్షన్‌ సీక్వెన్స్‌, ఎమోషనల్‌ సన్నివేశాల్లో విజయ్‌ మరోమారు తన మార్క్‌ చూపించాడు. హీరోయిన్‌గా మీనాక్షి చౌదరికి పెద్దగా ప్రాధాన్యం లేదు. ఆమెది గెస్ట్ రోల్‌లాగా అనిపిస్తుంది. స్పెషల్‌ స్క్వాడ్‌ సభ్యులుగా ప్రశాంత్‌, అజ్మల్‌, ప్రభుదేవా పర్వాలేదనిపించారు. వారికి హెడ్‌గా జయరాం తన నటనతో ఆకట్టుకున్నారు. సీనియర్ విజయ్‌కు జోడీగా చేసిన స్నేహా తన నటనతో మెప్పించింది. తమిళ యువ హీరో శివ కార్తికేయన్‌ చిన్న పాత్రలో సందడి చేశారు. త్రిష ఓ స్పెషల్‌ సాంగ్‌లో అలరించింది. మిగిలిన పాత్రదారులు తమ పరిధిమేరకు చేశారు.&nbsp; డైరెక్షన్‌ ఎలా ఉందంటే దర్శకుడు వెంకట్‌ ప్రభు రాసుకున్న కథలో కొత్తదనం కనిపించదు. రక్షణ విభాగాల్లో హీరో పనిచేయడం, హీరో కొడుకుని విలన్ పెంచి తిరిగి అతడి మీదే ప్రయోగించే సినిమాలు ఇప్పటికే చాలా వచ్చాయి. అయితే హీరో కొడుకు రివేంజ్‌ తీర్చుకునే క్రమంలో రాసుకున్న సీన్స్‌ ఆసక్తికరంగా అనిపిస్తాయి. ఫస్ట్ హాఫ్ మొత్తం హీరో క్యారెక్టర్ ఇంట్రడక్షన్‌తో పాటు ఇతర క్యారెక్టర్ల పరిచయాలకే సరిపోతుంది. ప్రీ ఇంటర్వెల్‌ వరకూ కథ అంతా ఊహించే విధంగానే సాగింది. ఇంటర్వెల్‌ సీన్‌తో సెకండాఫ్‌పై ఆసక్తి పెంచారు డైరెక్టర్‌. అయితే సెకండాఫ్‌లోనూ చాలా వరకూ ఊహకు తగ్గట్లే కథను నడిపారు. అయితే క్లైమాక్స్‌ను ఆసక్తికరంగా తెరకెక్కించడంలో డైరెక్టర్‌ సక్సెస్‌ అయ్యారు. సెకండాఫ్‌లో వచ్చే ట్విస్టులు కూడా ఆడియన్స్‌ను సర్‌ప్రైజ్‌ చేస్తాయి. కామెడీ, డైలాగ్స్‌లలో తమిళ వాసనలు నిండిపోవడం వల్ల తెలుగు ఆడియన్స్‌కు అంతగా రుచించకపోవచ్చు. అయితే విజయ్‌ ఫ్యాన్స్‌ను మాత్రం ఈ చిత్రం ఓ రేంజ్‌లో అలరిస్తుందని చెప్పవచ్చు.&nbsp; టెక్నికల్‌గా.. సాంకేతిక అంశాల విషయానికి వస్తే యువన్‌ శంకర్‌ రాజా అందించిన పాటలు పూర్తిగా తేలిపోయాయి. ఏది మైండ్‌లో గుర్తుంచుకునేలా లేదు. అయితే బ్యాక్‌ గ్రౌండ్‌ మ్యూజిక్‌ మాత్రం బాగుంది. యాక్షన్‌ సీక్వెన్స్‌లను బీజీఎం మరో రేంజ్‌కు తీసుకెళ్లింది. గ్రాఫిక్‌ డిపార్ట్‌మెంట్‌ ఇంకాస్త బెటర్‌గా పనిచేయాల్సింది. ముఖ్యంగా విజయ్ డీఏజింగ్‌ లుక్‌ విషయంలో మరింత జాగ్రత్త తీసుకుంటే బాగుండేది. ఎడిటింగ్‌ వర్క్‌ ఓకే. నిర్మాణ విలువలు ఉన్నతంగా ఉన్నాయి. ఖర్చు విషయంలో ఎక్కడా రాజీ పడినట్లు అనిపించలేదు.&nbsp; ప్లస్‌ పాయింట్స్‌ విజయ్‌ నటనయాక్షన్‌ సీక్వెన్స్‌క్లైమాక్స్‌ మైనస్‌ పాయింట్స్‌ ఊహకందే కథనంప్రథమార్ధం Telugu.yousay.tv Rating : 2.5/5&nbsp;
    సెప్టెంబర్ 05 , 2024

    వైభవి శాండిల్య తల్లిదండ్రులు ఎవరు?

    మనోజ్‌ కుమార్‌, అర్పిత దంపతులకు వైభవి శాండిల్య జన్మించింది.

    వైభవి శాండిల్య ఫేమస్‌ అవ్వడానికి రీజన్‌ ఏంటి?

    నెక్స్ట్‌ నువ్వే (2017) చిత్రంతో టాలీవుడ్‌లో పాపులర్ అయ్యింది.

    తెలుగులో వైభవి శాండిల్య ఫస్ట్‌ హిట్‌ మూవీ ఏది?

    ఇరుట్టు అరైయిల్ మురట్టు కుత్తు (2018)

    వైభవి శాండిల్య కెరీర్‌లో అత్యత్తుమ పాత్ర ఏది?

    నెక్స్ట్‌ నువ్వే (2017) చిత్రంలోని పాత్ర.

    వైభవి శాండిల్య బెస్ట్‌ డైలాగ్స్‌ వీడియోలు ఏవి?

    Watch on YouTube

    Watch on YouTube

    వైభవి శాండిల్య కు ఇష్టమైన నటుడు ఎవరు?

    వైభవి శాండిల్య కు ఇష్టమైన నటి ఎవరు?

    వైభవి శాండిల్య ఎన్ని భాషలు మాట్లాడగలరు?

    హిందీ, ఇంగ్లీషు

    వైభవి శాండిల్య ఫేవరేట్‌ కలర్ ఏంటి?

    పింక్‌

    వైభవి శాండిల్య ఫేవరేట్‌ క్రీడ ఏది?

    క్రికెట్

    వైభవి శాండిల్య ఇన్‌స్టాగ్రామ్‌ ఖాతాలో ఫాలోవర్ల సంఖ్య?

    440K ఫాలోవర్లు ఉన్నారు.

    వైభవి శాండిల్య సోషల్‌ మీడియా లింక్స్‌

    వైభవి శాండిల్య వ్యక్తిగత వివరాలు, ఎత్తు, పుట్టిన ప్రదేశం, బర్త్‌ డేట్‌, వయస్సు, సాధించిన విజయాలు, అవార్డులు, వ్యాపారాలు, ఇష్టాఇష్టాలు, అభిరుచులు తెలుసుకోండి. అలాగే వైభవి శాండిల్య కుటుంబ నేపథ్యం, తల్లిదండ్రులు, తోబుట్టువులు, రిలేషన్స్‌, విద్యా నేపథ్యం, కెరీర్ మైలురాళ్లు, తాజా ప్రాజెక్ట్‌లు, అధికారిక సోషల్ మీడియా అకౌంట్స్, లేటెస్ట్‌ చిత్రాలను ఒక్క క్లిక్‌తో ఇక్కడ తెలుసుకోండి.

    @2021 KTree