ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో దసరా సందడి నెలకొంది. ఈ పండగను పురస్కరించుకొని తెలుగు ప్రేక్షకులను పలకరించేందుకు పలు చిత్రాలు సిద్ధమయ్యాయి. ఈ వారం బాక్సాఫీస్ వద్ద అలరించనున్నాయి. అటు ఓటీటీలోనూ పలు ఆసక్తికర చిత్రాలు, వెబ్‌సిరీస్‌లు స్ట్రీమింగ్ రాబోతున్నాయి. ఆ విశేషాలేంటో ఈ ప్రత్యేక కథనంలో తెలుసుకుందాం.
థియేటర్లో విడుదలయ్యే చిత్రాలు
వేట్టయాన్ (Vettaiyan)
తమిళ సూపర్‌స్టార్ రజనీకాంత్ (Rajinikanth) నటించిన లేటెస్ట్ చిత్రం ‘వేట్టయాన్’. ‘జై భీమ్’ వంటి సోషల్ మెసేజ్ మూవీతో ప్రేక్షకులను అలరించిన టి.జె.జ్ఞానవేల్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. లైకా ప్రొడక్షన్స్ నిర్మిస్తున్న ఈ మూవీలో అమితాబ్, ఫహద్ ఫాజిల్, రానా, మంజు వారియర్, రితికా సింగ్, దుషారా విజయన్ కీలకపాత్రలు పోషించారు. అనిరుధ్ సంగీతం అందించారు. దసరా కానుకగా అక్టోబరు 10న ఈ చిత్రం విడుదల (Vettaiyan Release Date) కానుంది. జైలర్ వంటి బ్లాక్ బాస్టర్ తర్వాత రజనీ నటించిన చిత్రం కావడంతో ప్రేక్షకుల్లో వేట్టయాన్‌పై భారీ అంచనాలు ఏర్పడ్డాయి.
విశ్వం (Viswam)
ప్రముఖ నటుడు గోపిచంద్ (Gopichand) హీరోగా శ్రీను వైట్ల (Srinu Vaitla) దర్శకత్వంలో రూపొందిన చిత్రం ’విశ్వం’ (Viswam). ఈ చిత్రాన్ని టీజీ విశ్వప్రసాద్, వేణు దోనేపూడి సంయుక్తంగా నిర్మించారు. కావ్య థాపర్ హీరోయిన్గా చేసింది. అక్టోబరు 11న (Viswam Movie Release Date) విడుదలవుతోంది. కామెడీ చిత్రాలకు కేరాఫ్‌గా మారిన శ్రీను వైట్లతో నటుడు గోపిచంద్ గతకొంత కాలంగా సరైన హిట్ లేక ఇబ్బంది పడుతున్నారు. ఈ సినిమాతో కచ్చితంగా హిట్ కొట్టాలని ధీమాతో ఉన్నారు. ఇప్పటికే విడుదలైన విశ్వం ట్రైలర్, టీజర్ ఆకట్టుకున్నాయి.
మా నాన్న సూపర్ హీరో (Maa Nanna Super Hero)
సుధీర్ బాబు (Sudheer Babu) కథానాయకుడిగా అభిలాష్ రెడ్డి కంకర దర్శకత్వంలో వస్తోన్న చిత్రం ‘మా నాన్న సూపర్ హీరో’ (Maa Nanna Super Hero). ఆర్ణ కథానాయికగా చేసింది. షాయాజీ షిండే కీలక పాత్రలో కనిపించబోతున్నారు. దసరా కానుకగా అక్టోబర్ 11న ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే విడుదలైన ప్రచార చిత్రాలు ప్రేక్షకుల్లో ఆసక్తి పెంచడంతో అంచనాలను రేకెత్తించాయి.
జనక అయితే గనక (Janaka Ithe Ganaka)
యంగ్ హీరో సుహాస్ వరుసగా చిత్రాలు రిలీజ్ చేస్తూ దూసుకుపోతున్నాడు. వైవిధ్యమైన కథలతో మంచి విజయాలను సాధిస్తున్నాడు. ఈ క్రమంలోనే అతడు నటించిన లేటెస్ట్ చిత్రం ‘జనక అయితే గనక’ ఈ వారమే ప్రేక్షకుల ముందుకు రానుంది. సంకీర్తన కథానాయక. ఈ చిత్రాన్ని దిల్‌రాజు ప్రొడక్షన్స్ సంస్థ నిర్మించింది. సందీప్ బండ్ల దర్శకత్వం వహించారు. అక్టోబరు 12న ఈ మూవీ విడుదల కానుంది.
జిగ్రా (Jigra)
అలియా భట్, వేదాంగ్ రైనా ప్రధాన పాత్రల్లో వాసన్ బాలా రూపొందించిన బాలీవుడ్ చిత్రం ‘జిగ్రా’. అక్టోబరు 11న (Jigra Release Date) థియేటర్లలోకి రానుంది. తెలుగులో ఏషియన్ సురేశ్ ఎంటర్టైన్మెంట్ పతాకంపై రానా దగ్గుబాటి విడుదల చేస్తున్నారు. యాక్షన్, ఫ్యామిలీ ఎమోషన్స్ కలయికతో వచ్చిన ఈ చిత్రం అన్నివర్గాలు ప్రేక్షకులకు తప్పక నచ్చుతుందని చిత్ర యూనిట్ చెబుతోంది. ఇప్పటికే విడుదలై ట్రైలర్ సినిమాపై అంచనాలు పెంచే విధంగా ఉంది.
మార్టిన్ (Martin)
కన్నడ నటుడు ధ్రువ సర్జా ఈ వారం మార్టిన్ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ఎ.పి. అర్జున్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. వైభవి శాండిల్య కథానాయిక.ఈ పాన్ ఇండియా చిత్రాన్ని అక్టోబరు 11న (Martin Movie Release Date) విడుదల చేస్తున్నారు. యాక్షన్ చిత్రాల ప్రేమికులను ఈ మూవీ తప్పక మెప్పిస్తుందని మేకర్స్ ధీమా వ్యక్తం చేస్తున్నారు.
ఓటీటీలో విడుదలయ్యే చిత్రాలు
లెవెల్ క్రాస్
అమలాపాల్ హీరోయిన్గా నటించిన మలయాళం మూవీ ‘లెవెల్ క్రాస్’ థియేటర్లలో రిలీజైన రెండు నెలల తర్వాత ఓటీటీలోకి వస్తోంది. సైకలాజికల్ థ్రిల్లర్ కథాంశంతో తెరకెక్కిన ఈ మూవీకి అర్ఫాజ్ అయూబ్ దర్శకత్వం వహించాడు. ఆసిఫ్ అలీ హీరోగా నటించాడు. అక్టోబర్ 11 నుంచి ఆహాలో ఈ చిత్రం ప్రసారం కానుంది. ప్లాట్ ఏంటంటే చైతాలి (అమలాపాల్) ట్రైన్ ప్రమాదంలో గాయపడుతుంది. ఆమెను రైల్వే గేట్మెన్ రఘు (ఆసిఫ్ అలీ) కాపాడుతాడు. రఘుని కలిసిన తర్వాత నుంచి చైతాలి జీవితంలో ఊహించని పరిణామాలు చోటుచేసుకుంటాయి. చైతాలి తనకు పెళ్లి అయినట్లుగా ఎందుకు భ్రమపడుతుంది? వారిద్దరికి ఉన్న సంబంధం ఏంటి? అన్నది స్టోరీ.
Title | Category | Language | Platform | Release Date |
Young Sheldon | Movie | English | Netflix | Oct 08 |
Monster High 2 | Movie | English | Netflix | Oct 10 |
Khel Khel Mein | Movie | Hindi | Netflix | Oct 09 |
Starting 5 | Series | English | Netflix | Oct 10 |
Tomb Raider: Lara Croft | Animation | English | Netflix | Oct 10 |
Lonely Planet | Movie | English | Netflix | Oct 10 |
Outer Banks 4 | Series | English | Netflix | Oct 10 |
Up Rising | Series | English/Korean | Netflix | Oct 11 |
Chucky | Movie | English | Netflix | Oct 15 |
Surfira | Movie | Hindi | Hotstar | Oct 11 |
Warie | Movie | Tamil | Hotstar | Oct 11 |
Pailan Pillaga | Movie | Telugu | ETV Win | Oct 10 |
Thatva | Movie | Telugu | ETV Win | Oct 10 |
Guter Gu | Movie | Hindi | Jio Cinema | Oct 11 |
Tea cup | Movie | English | Jio Cinema | Oct 11 |
Jai Mahendran | Movie | Malayalam | SonyLIV | Oct 11 |
Raat Jawan Hie | Movie | Hindi | SonyLIV | Oct 11 |
Celebrities Featured Articles Movie News
Allu Arjun: సీఎం రేవంత్ రెడ్డికి.. బన్నీ స్ట్రాంగ్ కౌంటర్!