• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • మెుదటి త్రైమాసికంలో టాలివుడ్‌, బాలివుడ్‌,కొలివుడ్‌, శాండల్‌వుడ్‌ పైచేయి ఎవరిది?

    కొత్త సంవత్సరం ప్రారంభమై దాదాపు 3 నెలలు పూర్తయ్యింది. తెలుగు, తమిళ్, కన్నడ, హిందీ భాషల్లో చాలా చిత్రాలు విడుదలయ్యాయి. కొన్ని చిత్రాలు బాక్సాఫీస్‌ను షేక్ చేస్తే…. మరికొన్ని అంచనాలు అందుకోలేక డిజాస్టర్లుగా మిగిలాయి. పఠాన్ వంటి ఆల్‌టైమ్‌ బ్లాక్‌ బస్టర్‌తో బాలీవుడ్‌కు పూర్వ వైభవం వచ్చింది. వీరసింహా రెడ్డి, వాల్తేరు వీరయ్య చిత్రాలు టాలీవుడ్ మేనియాను కొనసాగించాయి. తమిళ్, కన్నడ ఇండస్ట్రీలకు మంచి హిట్లే పడ్డాయి.

    టాలివుడ్‌ పరంపర

    గతేడాది ధమాకా వంటి సూపర్‌ హిట్‌తో ముగించిన టాలీవుడ్‌… ఏడాది ఆరంభంలోనే బ్లాక్‌బస్టర్లను అందుకుంది. సీనియర్ హీరోలు బాలకృష్ణ, చిరంజీవి అభిమానులు పండుగ చేసుకొనే సినిమాలను ఇచ్చారు. మైత్రీ మూవీ మేకర్స్‌ నిర్మించిన వీరసింహా రెడ్డి రూ. 110 కోట్లు పెట్టి తెరకెక్కిస్తే రూ. 134 కోట్ల వసూళ్లు వచ్చాయి. ఇదే బ్యానర్‌లో వచ్చిన వాల్తేరు వీరయ్య రూ.140 కోట్లతో రూపొందించగా.. రూ. 219 కోట్లు సాధించింది. 

    చిన్న హిట్లు

    తెలుగు ప్రేక్షకులను చిన్న సినిమాలు కూడా అలరించాయి. సుహాస్‌ హీరోగా వచ్చిన రైటర్ పద్మభూషణ్ బాక్సాఫీస్ వద్ద క్లాసిక్ హిట్‌గా నిలిచింది. రూ.2.5 కోట్లతో తెరకెక్కించగా.. రూ. 12.5 కోట్లు వచ్చాయి. ఇదే సమయంలో చాలా రోజుల తర్వాత హిట్ అందుకున్నాడు కిరణ్ అబ్బవరం. గీతా ఆర్ట్స్‌ 2 బ్యానర్‌లో వచ్చిన వినరో భాగ్యము విష్ణు కథ సినిమా ప్రేక్షకులను మెప్పించింది. రూ.1 కోటి బడ్జెట్‌ పెట్టి నిర్మించగా.. రూ. 9.15 కోట్లు వచ్చాయి. 

    భావోద్వేగాల బలగం

    మంచి సినిమాను తెలుగు ప్రేక్షకులు ఆదరిస్తారని బలగం సినిమాతో మరోసారి రుజువయ్యింది. కమెడియన్ వేణు దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని ప్రతి ఒక్కరూ ఆస్వాదించారు. సూపర్ హిట్‌ చేసి కలెక్షన్ల వర్షం కురిపించారు ప్రేక్షకులు. రూ. 1.5 కోట్లతో దిల్‌రాజు నిర్మించగా.. రూ. 18.65 కోట్లు వసూలు చేసింది చిత్రం. ఇంకా థియేటర్లలో అలరిస్తోంది.

    డిజాస్టర్లు

    బింబిసార వంటి ఇండస్ట్రీ హిట్‌ ఇచ్చిన కళ్యాణ్ రామ్ ఈ ఏడాది నిరాశపర్చాడు. సరికొత్త కాన్సెప్ట్‌తో అమిగోస్ అనే చిత్రం తెరకెక్కించి విఫలమయ్యాడు. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద బోల్తా పడింది. ఎప్పట్నుంచో హిట్‌ కోసం ఎదురుచూస్తున్న సందీప్ కిషన్‌కి కూడా సరైన హిట్‌ దక్కలేదు. మైఖేల్ సినిమాతో మళ్లీ ఫ్లాప్ మూటగట్టుకున్నాడు సందీప్. ఇవి మినహా తెలుగులో మంచి హిట్లే దక్కాయి. 

    బాలీవుడ్‌ బాద్షా

    వరుస ఫ్లాప్‌లతో సతమతమవుతున్న బాలీవుడ్ పరిశ్రమకు చాలాకాలం గ్యాప్ తర్వాత వచ్చిన బాద్షా షారుఖ్ ఖాన్ ఆల్‌ టైమ్ బ్లాక్‌బస్టర్‌ను అందించాడు.ఏకంగా వెయ్యి కోట్ల కలెక్షన్లను దాటేశాడు. రూ.250 కోట్లతో తెరకెక్కిన పఠాన్ చిత్రం రూ. 1047 కోట్లు వసూలు చేసింది. బాలీవుడ్‌లో బాహుబలి పేరిట ఉన్న రికార్డును చేరిపేశాడు కింగ్ ఖాన్. 

    రొమాంటిక్ హిట్

    కింగ్ ఖాన్ తెచ్చిన వైభవాన్ని రణ్‌బీర్ కపూర్ కొనసాగించాడు. తూ జూటీ మై మక్కర్ వంటి రొమాంటిక్ ఫ్యామిలీ డ్రామాతో హిట్‌ కొట్టాడు ఈ కుర్ర హీరో. ఈ సినిమా రూ. 70 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కించగా.. రూ.151.35 కోట్లు వసూలు చేసింది. అయితే,  తెలుగు రీమేక్‌గా రూపుదిద్దుకున్న షెహజాదా మాత్రం డిజాస్టర్‌గా మిగిలిపోయింది. 

    షెహ్‌జాదా ఎందుకు ఫ్లాప్‌ అయింది?

    తమిళ్‌ సూపర్ స్టార్స్

    కోలీవుడ్‌లో కూడా ఈ ఏడాది శుభారంభంతోనే ప్రారంభమయ్యింది. దిల్ రాజు నిర్మాణంలో దళపతి విజయ్ హీరోగా వంశీ పైడిపల్లి దర్శకత్వంలో తీసిన వారిసు ఇండస్ట్రీ హిట్‌ అయ్యింది. రూ.297 కోట్లు వసూళ్లు సాధించింది ఈ సినిమా. సంక్రాంతి బరిలో అజిత్‌ చిత్రం తునివు కూడా హిట్‌గానే నిలిచింది. కాకపోతే పెట్టిన బడ్జెట్ తిరిగి వచ్చింది అంతే. వెంకీ అట్లూరి దర్శకత్వంలో ధనుష్ నటించిన సార్ సినిమా సగటు ప్రేక్షకులను మెప్పించింది. రూ.35 కోట్లతో తీర్చిదిద్దితే రూ.115 కోట్లు సాధించింది ఈ చిత్రం.

    ఇంకా మెుదలుకాలేదు

    కన్నడలో విడుదలైన ఒకే ఒక్క పెద్ద చిత్రం కబ్జ. దాదాపు కేజీఎఫ్ రేంజ్ ట్రైలర్ చూపించినప్పటికీ సినిమా బాక్సాఫీస్‌ వద్ద పెద్దగా ఆడటం లేదు. ఇండియన్ రియల్ స్టార్ ఉపేంద్ర, కిచ్చా సుదీప్, శివన్న వంటి స్టార్లు ఉన్నప్పటికీ ప్రేక్షకులను మెప్పించలేకపోయారు. 

    ఆధిపత్యం ఎవరిది?

    చిత్ర పరిశ్రమలన్నింటిలో హిట్లు, ఫ్లాపులు ఉన్నాయి. తెలుగులో వరుస బ్లాక్‌బస్టర్లు కొట్టాయి. తమిళ్‌ నుంచి డబ్ అయిన చిత్రాలు కూడా బాగానే ఆదరించారు. కానీ, కలెక్షన్ల పరంగా బాలీవుడ్ దూసుకుపోయింది. ఆల్‌టైమ్ ఇండస్ట్రీ హిట్‌ను కొట్టేశాయి. తమిళ్‌లోనూ రూ.100 కోట్ల క్లబ్ సినిమాలు మూడు వచ్చాయి. ఈ పరంగా చూసుకున్నట్లయితే… ఒక్కో విభాగంలో ఒక్కో ఇండస్ట్రీ టాప్‌లో నిలిచిందనే చెప్పాలి. లేదు ప్రస్తుతం కలెక్షన్లే మ్యాటర్‌ అనుకుంటే.. బాలీవుడ్‌ దే పైచేయి. 

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv