• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • ఆ హీరో దారణంగా మోసం చేశాడు: సంగీత దర్శకుడు

    హీరో శివకార్తికేయన్ తనను దారుణంగా మోసం చేశాడని సంగీత దర్శకుడు ఇమ్మాన్ ఆరోపించాడు. ఇక జీవితంలో అతడితో కలిసి పనిచేయనని తెగేసి చెప్పాడు. ‘నా వ్యక్తి గత కారణాల వల్ల నేను ఈ నిర్ణయం తీసుకున్నా. అతడు చేసిన మోసాన్ని తెలుసుకునే సరికి నాకు చాలా సమయం పట్టింది. అతడు ఏం చేశాడనేది ఇప్పుడు బయటపెట్టలేక పోతున్నా?. నాకు ఏం జరిగినా కారణం మాత్రం అతడే, శివకార్తికేయన్ ఇంతటి దారుణ మోసానికి పాల్పడతాడని అస్సలు అనుకోలేదు’. అని ఇమ్మాన్ ఆరోపణలు చేశాడు.

    కోలీవుడ్‌లో నన్ను పట్టించుకోవట్లేదు; వరలక్ష్మి

    కోలీవుడ్‌లో తనను ఎవరూ పట్టించుకోవడం లేదని హీరోయిన్ వరలక్ష్మి శరత్‌కుమార్ పేర్కొంది. తనకు అవకాశాలు ఇవ్వడానికి భయపడు తున్నారని తెలిపింది. ఎక్కువగా తెలుగు చిత్రాల్లోనే నటిస్తుండడంతో.. తమిళంలో అవకాశాలు రావడం లేదని చెప్పింది. తాను లేడీ విలన్‌గా వైవిధ్యంగా నటించానని .. కానీ తమిళ్ ఇండస్ట్రీలో ఆదరించ లేదని వాపోయింది. తనను చూసి భయపడి, ఇన్ సెక్యూర్‌గా ఫీల్ అవుతున్నారని చెప్పుకొచ్చింది. కాగా వరలక్ష్మి ‘క్రాక్’ మూవీతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది.

    ‘సీతారామం’ బ్యూటీ కోలీవుడ్ ఎంట్రీ!

    ‘సీతారామం’ ఫేమ్ మృణాల్ ఠాకూర్ కోలీవుడ్ ఎంట్రీ ఇస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. స్టార్ హీరో సూర్య సరసన ఈ బ్యూటీ ఛాన్స్ కొట్టేసినట్లు సమాచారం. శివ దర్శకత్వంలో సూర్య హీరోగా ఓ మూవీ తెరకెక్కుతోంది. ఈ చిత్రంలో దిశా పటానీ ఓ హీరోయిన్‌ కాగా.. రెండో హీరోయిన్‌గా మృణాల్‌ను తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమా ఫిబ్రవరిలో సెట్స్ మీదకు వెళ్లనుందని.. అప్పుడే మృణాల్‌ కూడా మూవీ యూనిట్‌తో జాయిన్ అవుతారని టాక్. ఇదే కనుక నిజమైతే మృణాల్‌కు కోలీవుడ్‌లో తొలి సినిమా అవుతుంది.