• TFIDB TE
  • Sarayu Mohan
    Born : July 10 , 1989
    Place: Thrippunithura, Kerala, India
    Sarayu Mohan is an Indian actress who appears in Malayalam films and television shows. She made her debut in the lead role with the movie Kappal Muthalaali in 2009.
    ‘నాటు నాటు’ సాంగ్ మాత్రమే కాదు…. MM కీరవాణి స్వరపరిచిన టాప్ 10 సాంగ్స్ లిస్ట్ ఇదే
    ‘నాటు నాటు’ సాంగ్ మాత్రమే కాదు…. MM కీరవాణి స్వరపరిచిన టాప్ 10 సాంగ్స్ లిస్ట్ ఇదే]10. పుణ్యభూమి నా దేశం- మేజర్ చంద్రకాంత్ఈ పాట మేజర్ చంద్రకాంత్ సినిమాలోని దేశభక్తి గీతం. ఇప్పటికీ జాతీయ పండగల వేళ.. తెలుగు రాష్ట్రాల్లో మార్మోగుతూ ఉంటుంది. ఈ పాటను ఎస్పీ బాల సుబ్రహ్మణ్యం ఆలపించారు.Watch Now
    February 13 , 2023
    Dhop Song Promo: ‘గేమ్ ఛేంజర్’ నుంచి ‘దోప్’ సాంగ్ ప్రోమో రిలీజ్, సూపర్బ్ రెస్పాన్స్ రామ్ చరణ్(Ram Charan) ప్రధాన పాత్రలో, శంకర్(Shankar) దర్శకత్వంలో తెరకెక్కుతున్న పాన్ ఇండియా చిత్రం ‘గేమ్ ఛేంజర్’. ఈ సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. సంక్రాంతి పండుగ సందర్భంగా జనవరి 10, 2025న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. తాజాగా ఈ సినిమా నుంచి ‘దోప్’ సాంగ్ ప్రోమో విడుదల చేయగా, ఇది ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. ‘దోప్’ సాంగ్ విశేషాలు సినిమా టీమ్ ‘దోప్’ సాంగ్ ప్రోమోను విడుదల చేయడంతో అభిమానుల్లో ఉత్సాహం రెట్టింపు అయింది. ఫుల్ సాంగ్‌ను డిసెంబర్ 22న విడుదల చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. ఈ పాటలో రామ్ చరణ్, కియారా అద్వానీ డ్యాన్స్ ఆకట్టుకునేలా ఉంది. పాజిటివ్ ఎనర్జీతో కూడిన ఈ సాంగ్, ఆడియన్స్‌ను కట్టిపడేయనుంది. మైక్రో మంత్ర అంటూ సాంగ్ లిరిక్స్ వినసొంపుగా ఉన్నాయి.  కియరా, రామ్‌ చరణ్ కెమిస్ట్రీ కనుల విందుగా ఉంది. మెకోవర్ అట్రాక్టివ్‌గా పదే పదే చూడాలనిపించే విధంగా ఉంది. https://twitter.com/SivaHarsha_23/status/1869361110325018735 కాగా.. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన పాటలు ‘జరగండి’, ‘నానా హైరానా’, ‘రా మచా మచా’ సూపర్ హిట్ కావడంతో, ఇప్పుడు కొత్తగా విడుదలైన ‘దోప్’ సాంగ్ ప్రోమోపై కూడా భారీ అంచనాలు ఏర్పడ్డాయి. https://twitter.com/BheeshmaTalks/status/1869298339730386976 రామ్ చరణ్ డ్యూయల్ రోల్ ఈ సినిమాలో రామ్ చరణ్ రెండు విభిన్న పాత్రలు పోషిస్తున్నట్లు టీజర్ ద్వారా తెలిసింది. ఒక పాత్ర పీరియాడిక్ టైమ్‌ లైన్‌కు చెందినదైతే, మరో పాత్ర (DHOP Song Promo)ప్రస్తుత కాలానికి సంబంధించినది. తండ్రి, కొడుకులుగా రామ్ చరణ్ కనిపించనున్నట్లు బిగ్‌బాస్ సీజన్ 8 ఫినాలేలో ఆయన స్వయంగా వెల్లడించారు. సంక్రాంతి బరిలో ‘గేమ్ ఛేంజర్’ ‘గేమ్ ఛేంజర్’ సంక్రాంతి సందర్భంగా విడుదల అవుతున్న మొదటి సినిమా కావడంతో మరింత ఆసక్తి పెరిగింది. జనవరి 12న నందమూరి బాలకృష్ణ ‘డాకూ మహరాజ్’(Daku Maharaj), జనవరి 14న విక్టరీ వెంకటేష్ ‘సంక్రాంతికి వస్తున్నాం’, జనవరి 10న అజిత్ నటించిన డబ్బింగ్ చిత్రం ‘విడాముయర్చి’ విడుదల కానున్నాయి. టీజర్‌కు మంచి స్పందన ఇటీవల ఈ చిత్రం నుంచి విడుదలైన టీజర్ భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. టీజర్ చూస్తుంటే ఈ సినిమా రామ్ చరణ్ కెరీర్‌లో మరో మైలురాయి అవుతుందనిపిస్తోంది. ఎస్ఎస్ థమన్ అందించిన సంగీతం, శంకర్ వినూత్న దర్శకత్వం, రామ్ చరణ్ నటన ఈ చిత్రానికి ప్రధాన ఆకర్షణలుగా నిలవనున్నాయి. ‘గేమ్ ఛేంజర్’(Game Changer) సంక్రాంతి సందర్భంగా థియేటర్లలో సందడి చేయనుంది. రామ్ చరణ్, కియారా అద్వానీ జోడీ, శంకర్ దర్శకత్వ ప్రతిభ, థమన్ సంగీతం ఈ చిత్రానికి పెద్ద ప్లస్ అవుతాయి. ‘దోప్’ సాంగ్ ప్రోమో ఇప్పటికే ట్రెండింగ్‌లో ఉండగా, ఫుల్ సాంగ్ విడుదలకు అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
    December 18 , 2024
    Batukamma Song: సల్మాన్ ఖాన్ సినిమాలో బతుకమ్మ సాంగ్.. ఆడి పాడిన సల్లు భాయ్! తెలంగాణలో బతుకమ్మ పండగ ఎంతో విశిష్టమైంది. తొమ్మిది రోజుల పాటు ఎంతో సంబరంగా ఈ పండగను జరుపుకుంటారు. మహిళలు పూలను అలకరించి బతుకమ్మ ఆటలు ఆడతారు. అయితే తెలంగాణ, తెలుగు ప్రజలకు మాత్రమే పరిమితమైన ఈ పండగ ఇప్పుడు దేశ వ్యాప్తంగా తెలియనుంది. పాన్‌ ఇండియా స్థాయిలో బతుకమ్మ క్రేజ్‌ పెరగనుంది. ఎందుకంటే బతుకమ్మ వైభవాన్ని సల్మాన్‌ వెండి తెరపై చూపించబోతున్నారు. సల్మాన్‌ కథానాయకుడిగా ‘కిసీ కా భాయ్‌.. కిసీ కా జాన్‌’ చిత్రం తెరకెక్కుతోంది. ఫర్హాద్‌ సామ్జీ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో వెంకటేష్‌, జగపతి బాబు, పూజా హెగ్డే, భూమిక, షెహ్‌నాజ్‌ గిల్‌ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఇదిలా ఉండగా తాజాగా చిత్ర యూనిట్‌ రిలీజ్‌ చేసిన పాట అందరి దృష్టిని ఆకర్షించింది. తెలంగాణ సంస్కృతి ప్రతీక అయిన బతుకమ్మను ఆ పాటలో చూపించారు.  https://twitter.com/taran_adarsh/status/1641693728367845377?s=20 బతుకమ్మ పాటలో తెలంగాణ సంస్కృతి ఉట్టి పడింది. పూజా హెగ్డే తలపైన బతుకమ్మను మోస్తూ కనిపించారు. హెగ్డేతో పాటు వెంకటేష్‌, భూమికలు బతుకమ్మను తీసుకెళ్తూ కనిపించారు. భూమిక, పూజా హెగ్డే స్టెప్స్‌తో అదరగొట్టారు. పాట చివర్లో సల్మాన్‌ పంచలో కనిపించి అందరికీ షాక్‌ ఇచ్చారు. పంచ, నుదిటిన బొట్టుతో సల్మాన్‌ తెలుగు తనం ఉట్టిపడుతూ కనిపించారు. ప్రస్తుతం ఈ సాంగ్‌ యూట్యూబ్‌ను షేక్‌ చేస్తోంది.  https://youtu.be/tdOg8X0RV9I బతుకమ్మ పండగ శోభ ఇప్పుడు బాలీవుడ్‌కు చేరడంపై సర్వత్రా ప్రశంసలు కురుస్తున్నాయి. సల్మాన్‌ సినిమాలో బతుకమ్మను చూపించడం ద్వారా ఈ పండుగ విశిష్టత మరింత మందికి తెలిసే అవకాశముంది. ఈ నేపథ్యంలో తెలంగాణ ఎమ్మెల్సీ కవిత స్పందించారు. ఈ పాటతో బతుకమ్మ క్రేజ్‌ పాన్‌ ఇండియా స్థాయికి చేరిందని పేర్కొన్నారు. బతుకమ్మ పాటపై సల్మాన్‌ పెట్టిన ట్వీట్‌ను రీట్వీట్‌ చేస్తూ కవిత ఈ వ్యాఖ్యలు చేశారు. కాగా, నటుడు వెంకటేష్‌ సూచన మేరకే సల్మాన్‌ బతుకమ్మను పాటను పెట్టినట్లు తెలుస్తోంది.  https://twitter.com/RaoKavitha/status/1641699065447710721 ‘కిసీ కా భాయ్‌.. కిసీ కా జాన్‌’ చిత్రంలో బతుకమ్మ పాటను పెట్టడాన్ని నెటిజన్లు స్వాగతిస్తున్నారు. ‘లవ్‌ యూ భాయ్’ అని సల్మాన్‌ను ఉద్దేశిస్తూ కామెంట్లు చేస్తున్నారు. జై తెలంగాణ, జై బతుకమ్మ అంటూ పోస్టులు పెడుతున్నారు. తెలుగు సంప్రదాయ లుక్‌లో సల్మాన్‌ అదిరిపోయాడని ప్రశంసిస్తున్నారు. వరుస ఫ్లాపులతో ఇబ్బంది పడుతున్న సల్మాన్‌కు బతుకమ్మ ఆశీస్సులతో సూపర్‌ హిట్ లభిస్తుందని నెటిజన్లు ట్వీట్లు చేస్తున్నారు.  ‘కిసీ కా భాయ్‌, కిసీ కా జాన్‌’ చిత్రాన్ని తమిళంలో సూపర్‌ హిట్‌ అయిన వీరమ్‌కు రీమేక్‌గా తెరకెక్కించారు. వీరుడొక్కడే పేరుతో తెలుగులో ఈ సినిమా డబ్‌ కూడా అయింది. సల్మాన్‌ స్వయంగా నిర్మిస్తున్న ఈ సినిమాకు దేవి శ్రీ ప్రసాద్‌, రవి బస్రూర్‌, హిమేష్ రేష్మియా సంగీతం అందిస్తున్నారు.ఈద్‌ సందర్భంగా ఏప్రిల్‌ 4న ఈ సినిమా రిలీజ్‌ కానుంది. ఇప్పటికే విడుదలైన ప్రచార చిత్రాలు టీజర్‌, పాటలు సినిమాపై అంచనాలను భారీగా పెంచాయి. అంతేగాక వెంకటేష్‌ నటిస్తుండటంతో తెలుగులోనూ విపరీతమైన ఎక్స్‌పెక్టేషన్స్‌ ఉన్నాయి.
    March 31 , 2023
    Blockbuster Pongal: సెన్సేషనల్ రికార్డు సృష్టించిన వెంకటేష్ పాడిన పొంగల్ సాంగ్ విక్టరీ వెంకటేష్ హీరోగా, అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘సంక్రాంతికి వస్తున్నాం’. మీనాక్షి చౌదరి, ఐశ్వర్య రాజేశ్ హీరోయిన్లుగా నటించిన ఈ సినిమా సంక్రాంతి పండుగ సందర్భంగా జనవరి 14న విడుదల కాబోతుంది. ఈ చిత్రం నుంచి ఇప్పటికే విడుదలైన ‘గోదారి గట్టు మీద’, బావా వంటి పాటలు ప్రేక్షకుల నుంచి విశేషంగా ఆదరణ పొందాయి. ఆ పాటల వల్ల సినిమాపై ఆసక్తి మరింత పెరిగింది. తాజాగా, ఈ చిత్రం నుంచి ‘బ్లాక్‌బస్టర్ పొంగల్’ అనే ఫుల్ లిరికల్ సాంగ్‌ను మేకర్స్ విడుదల చేశారు. ఈ పాటకు రామజోగయ్య శాస్త్రి లిరిక్స్ అందించగా, వెంకటేశ్ స్వయంగా ఆలపించారు. బిమ్స్‌ సిసిరోలియో సంగీతం అందించారు. సంక్రాంతి వాతావరణాన్ని తెచ్చిన బ్లాక్‌బస్టర్ పొంగల్ ‘బ్లాక్‌బస్టర్ పొంగల్’ పాటలో పండుగ వాతావరణాన్ని పండించిన విధానం ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. ఈ పాట పక్కా కుటుంబ వినోదాన్ని మేళవించి రూపొందించినట్లు తెలుస్తోంది. పాటలో వెంకటేశ్, మీనాక్షి చౌదరి, ఐశ్వర్య రాజేశ్‌ల మధ్య సన్నివేశాలు వినోదాత్మకంగా ఉన్నాయి. పాటకు తగ్గ స్టెప్పులతో హోరెత్తించారు. ముఖ్యంగా బ్లాక్‌ బాస్టర్‌ సాంగ్‌కు వెంకటేష్ గాత్రం బాగా సెట్‌ అయిందని చెప్పొచ్చు. ఈ పాటను భీమ్స్ సిసిరోలియో సంగీత సారథ్యంలో భీమ్స్, రోహిణి సొరట్, వెంకటేశ్ పాడారు. భీమ్స్ సంగీతం పాటకు కొత్త జీవం పోసింది. వినగానే మనసుకు హత్తుకునే ట్యూన్‌తో ఈ పాట ఇన్‌స్టంట్ చార్ట్‌బస్టర్‌గా నిలిచింది. ఇక ఈ సాంగ్ యూట్యూబ్‌లో ట్రెండ్ సెట్టర్‌గా నిలిచింది. విడుదలైన గంటలోనే 5 లక్షలకు పైగా వ్యూస్, 40 వేలకు పైగా లైక్స్‌ను క్రాస్ చేసి రికార్డు సృష్టించింది. https://youtu.be/S8NDIJBbd3Q?si=5dVR3Nt755rxX_v9 వెంకటేశ్-అనిల్ రావిపూడి కాంబినేషన్‌పై భారీ అంచనాలు అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కినందున, ఈ సినిమాపై ప్రేక్షకులలో భారీ అంచనాలు నెలకొన్నాయి. గత చిత్రాల విజయాలతో అనిల్ రావిపూడి కుటుంబ ప్రేక్షకులను ఆకట్టుకునే విధంగా సినిమాలు తెరకెక్కించడంలో తన ప్రత్యేకతను నిరూపించుకున్నాడు. ఈ చిత్రం నుంచి ఇప్పటి వరకు విడుదలైన ప్రోమోషనల్ కంటెంట్‌కు ట్రెమెండస్ రెస్పాన్స్ వచ్చింది. ఇకా సినిమా ఎలా ఉంటుందోనని ప్రేక్షకులంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. పక్కా కుటుంబ కథ ‘సంక్రాంతికి వస్తున్నాం’ అనేది పక్కా పండుగ సినిమా. ఈ చిత్రంలోని వినోదం, సంగీతం, కథ అన్నీ కుటుంబ ప్రేక్షకులకు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి. వెంకటేశ్ చేస్తున్న పాత్ర, ఆయన అల్లరి ఈ చిత్రానికి హైలైట్‌గా నిలవనుంది. సంక్రాంతి కానుకగా జనవరి 14న ఈ చిత్రం గ్రాండ్‌గా విడుదల కానుంది. పండుగ సీజన్‌లో కుటుంబం మొత్తం కలిసి చూడదగిన చిత్రంగా ఇది ప్రేక్షకులను ఆకట్టుకునే అవకాశం ఉందని అందరూ భావిస్తున్నారు.
    December 30 , 2024
    Discover everything about Sarayu Mohan, from personal details like height, Place of Birth, Date of Birth, and age to professional achievements, awards, business ventures, favorites, and fascinating facts. Learn about Sarayu Mohan's family background, including details about parents, siblings, and relationships. Stay updated on the latest pics, latest projects, career milestones, and educational background. Connect with Sarayu Mohan on official social media accounts and website for an exclusive peek into their life and direct interaction.

    @2021 KTree