తెలంగాణలో బతుకమ్మ పండగ ఎంతో విశిష్టమైంది. తొమ్మిది రోజుల పాటు ఎంతో సంబరంగా ఈ పండగను జరుపుకుంటారు. మహిళలు పూలను అలకరించి బతుకమ్మ ఆటలు ఆడతారు. అయితే తెలంగాణ, తెలుగు ప్రజలకు మాత్రమే పరిమితమైన ఈ పండగ ఇప్పుడు దేశ వ్యాప్తంగా తెలియనుంది. పాన్ ఇండియా స్థాయిలో బతుకమ్మ క్రేజ్ పెరగనుంది. ఎందుకంటే బతుకమ్మ వైభవాన్ని సల్మాన్ వెండి తెరపై చూపించబోతున్నారు.
సల్మాన్ కథానాయకుడిగా ‘కిసీ కా భాయ్.. కిసీ కా జాన్’ చిత్రం తెరకెక్కుతోంది. ఫర్హాద్ సామ్జీ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో వెంకటేష్, జగపతి బాబు, పూజా హెగ్డే, భూమిక, షెహ్‌నాజ్ గిల్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఇదిలా ఉండగా తాజాగా చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన పాట అందరి దృష్టిని ఆకర్షించింది. తెలంగాణ సంస్కృతి ప్రతీక అయిన బతుకమ్మను ఆ పాటలో చూపించారు.
బతుకమ్మ పాటలో తెలంగాణ సంస్కృతి ఉట్టి పడింది. పూజా హెగ్డే తలపైన బతుకమ్మను మోస్తూ కనిపించారు. హెగ్డేతో పాటు వెంకటేష్, భూమికలు బతుకమ్మను తీసుకెళ్తూ కనిపించారు. భూమిక, పూజా హెగ్డే స్టెప్స్‌తో అదరగొట్టారు. పాట చివర్లో సల్మాన్ పంచలో కనిపించి అందరికీ షాక్ ఇచ్చారు. పంచ, నుదిటిన బొట్టుతో సల్మాన్ తెలుగు తనం ఉట్టిపడుతూ కనిపించారు. ప్రస్తుతం ఈ సాంగ్ యూట్యూబ్‌ను షేక్ చేస్తోంది.
బతుకమ్మ పండగ శోభ ఇప్పుడు బాలీవుడ్‌కు చేరడంపై సర్వత్రా ప్రశంసలు కురుస్తున్నాయి. సల్మాన్ సినిమాలో బతుకమ్మను చూపించడం ద్వారా ఈ పండుగ విశిష్టత మరింత మందికి తెలిసే అవకాశముంది. ఈ నేపథ్యంలో తెలంగాణ ఎమ్మెల్సీ కవిత స్పందించారు. ఈ పాటతో బతుకమ్మ క్రేజ్ పాన్ ఇండియా స్థాయికి చేరిందని పేర్కొన్నారు. బతుకమ్మ పాటపై సల్మాన్ పెట్టిన ట్వీట్‌ను రీట్వీట్ చేస్తూ కవిత ఈ వ్యాఖ్యలు చేశారు. కాగా, నటుడు వెంకటేష్ సూచన మేరకే సల్మాన్ బతుకమ్మను పాటను పెట్టినట్లు తెలుస్తోంది.
‘కిసీ కా భాయ్.. కిసీ కా జాన్’ చిత్రంలో బతుకమ్మ పాటను పెట్టడాన్ని నెటిజన్లు స్వాగతిస్తున్నారు.
‘లవ్ యూ భాయ్’ అని సల్మాన్‌ను ఉద్దేశిస్తూ కామెంట్లు చేస్తున్నారు. జై తెలంగాణ, జై బతుకమ్మ అంటూ పోస్టులు పెడుతున్నారు. తెలుగు సంప్రదాయ లుక్‌లో సల్మాన్ అదిరిపోయాడని ప్రశంసిస్తున్నారు. వరుస ఫ్లాపులతో ఇబ్బంది పడుతున్న సల్మాన్‌కు బతుకమ్మ ఆశీస్సులతో సూపర్ హిట్ లభిస్తుందని నెటిజన్లు ట్వీట్లు చేస్తున్నారు.
‘కిసీ కా భాయ్, కిసీ కా జాన్’ చిత్రాన్ని తమిళంలో సూపర్ హిట్ అయిన వీరమ్‌కు రీమేక్‌గా తెరకెక్కించారు. వీరుడొక్కడే పేరుతో తెలుగులో ఈ సినిమా డబ్ కూడా అయింది. సల్మాన్ స్వయంగా నిర్మిస్తున్న ఈ సినిమాకు దేవి శ్రీ ప్రసాద్, రవి బస్రూర్, హిమేష్ రేష్మియా సంగీతం అందిస్తున్నారు.ఈద్ సందర్భంగా ఏప్రిల్ 4న ఈ సినిమా రిలీజ్ కానుంది. ఇప్పటికే విడుదలైన ప్రచార చిత్రాలు టీజర్, పాటలు సినిమాపై అంచనాలను భారీగా పెంచాయి. అంతేగాక వెంకటేష్ నటిస్తుండటంతో తెలుగులోనూ విపరీతమైన ఎక్స్‌పెక్టేషన్స్ ఉన్నాయి.
Celebrities Entertainment(Telugu) Featured Articles
Rajendra Prasad: అల్లు అర్జున్‌ని.. “పిచ్చోడా అని అన్నాను”: రాజేంద్ర ప్రసాద్