అల్లూరి జిల్లాలో అద్భుతం !
ఏపీలోని అల్లూరి జిల్లాలో అద్భుతం చోటు చేసుకుంది. కూనవరం మండలం జగ్గవరంలో దుర్గమ్మను పూజిస్తుండగా అక్కడున్న గాజుల వాటంతట అవే తిరగడం వైరల్‌గా మారింది. ఇది చూసిన అక్కడి భక్తులు అమ్మవారి మహత్యం వల్లే ఇలా జరిగిందని, తమ పూజలకు మెచ్చే తమపై చల్లని ఆశీస్సులు ఇలా చూపిందని చెబుతున్నారు.