హాకీ వరల్డ్ ఛాపియన్‌గా జర్మనీ
హాకీ పురుషుల వరల్డ్ కప్ విజేతగా జర్మనీ అవతరించింది. భువనేశ్వర్‌లో జరిగిన ప్రపంచకప్ ఫైనల్లో బెల్జియంపై షూటౌట్లో 5-4 తేడాతో జర్మనీ విజయ ఢంకా మోగించింది. టైటిల్ కోసం రెండు జట్లూ చివరివరకూ హోరాహోరీగా తలపడ్డాయి. మ్యాచ్ ముగిసే సమయానికి ఇరు జట్లూ మూడేసి గోల్స్ చేయడంతో స్కోరు సమమైంది. దీంతో పెనాల్టీ షూటౌట్ నిర్వహించారు. షూటౌట్లో జర్మనీ ఆటగాళ్లు 5 గోల్స్ చేసి ప్రపంచకప్‌ను ఎగరేసుకుపోయారు. 4 గోల్స్ చేసిన బెల్జియం రన్నరప్‌గా సరిపెట్టుకుంది.