• Cricket
 • Lifestyle
 • Health
 • Relationships
 • People
 • Recommended
 • Technology
 • Apps
 • Gadgets
 • Tech News
 • Telugu Movies
 • Hot Actress
 • Movie News
 • Reviews
 • వైట్ బాల్ కెప్టెన్‌గా హార్దిక్ పాండ్యా!

  భారత ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యాకు బీసీసీఐ పూర్తి సారథ్య బాధ్యతలు అప్పగించనున్నట్లు తెలుస్తోంది. వన్డేలు, టీ20లకు హార్దిక్ పాండ్యా పూర్తి స్థాయి కెప్టెన్సీ పగ్గాలు అందుకోనున్నట్లు బీసీసీఐ వర్గాల సమాచారం. వచ్చే ఏడాది జనవరిలో లంకతో జరగనున్న టీ20 సీరీస్‌లో పాండ్యా జట్టును నడిపించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ప్రస్తుతం రోహిత్ శర్మ చేతి వేలి గాయంతో బాధపడుతున్నాడు. ఇప్పట్లో కోలుకునే అవకాశాలు లేకపోవడంతో బీసీసీఐ ఈ నిర్ణయం తీసుకుంటున్నట్లు తెలుస్తోంది.

  12 ఏళ్ల తర్వాత జట్టులోకి రీఎంట్రీ

  బంగ్లాదేశ్‌తో రెండు టెస్టుల సీరీస్ కోసం సీనియర్ బౌలర్ జయదేవ్ ఉనద్కట్ 12 ఏళ్ల తర్వాత భారత జట్టులోకి పిలుపు వచ్చినట్లు బీసీసీఐ అధికారిక వర్గాలు వెల్లడించాయి. చివరిసారిగా ఉనద్కట్ 2010లో తన మొదటి టెస్టు ఆడాడు. ఆ తర్వాత ఇప్పటివరకు ఒక్క టెస్టు కూడా ఆడలేదు. మళ్లీ ఇప్పుడు సీనియర్ పేసర్ మహ్మద్ షమీ గాయపడడంతో అతని స్థానంలో ఉనద్కట్‌ను జట్టులోకి తీసుకున్నారు. విజయ్ హజారే ట్రోఫీలో ఉనద్కట్ అత్యుత్తమ ప్రతిభ కనబరచడంతో భారత జట్టులోకి రీ ఎంట్రీ ఇస్తున్నాడు.

  ధోనికి అసలైన వారసుడు అతడే!

  టీ20 వరల్డ్‌కప్ సెమీస్‌లో భారత్ ఘోర వైఫల్యంతో జట్టులో సమూల మార్పులు ఉండొచ్చు. ఈ క్రమంలో వికెట్ కీపర్లపై కూడా వేటు పడనుంది. దినేశ్ కార్తీక్, పంత్ ఇద్దరూ తమకు వచ్చిన అవకాశాలను ఏమాత్రం ఉపయోగించుకోలేదు. ఈ నేపథ్యంలో ధోనికి అసలైన వారసుడు అయ్యే అర్హత మాత్రం సంజూ శాంసన్‌కే ఉంది. ఎందుకంటే ఫినిషర్‌గా జట్టులో పనికొస్తాడు. ఇటీవల జరిగిన సీరీస్‌లలో విశేషంగా రాణించాడు. శాంసన్‌కు తగినన్ని అవకాశాలు ఇస్తే ధోనికి వారసుడిగా మారడం ఖాయం.

  బీసీసీఐ దిద్దుబాటు చర్యలు!

  సెమీస్ ఇంగ్లండ్‌పై ఘోర పరాజయం నేపథ్యంలో బీసీసీఐ దిద్దుబాటు చర్యలు చేపట్టింది. త్వరలో కెప్టెన్ రోహిత్ శర్మ, కోచ్ రాహుల్ ద్రావిడ్, స్టార్ బ్యాట్స్‌మెన్ విరాట్ కోహ్లీలతో బీసీసీఐ సమావేశం కానుంది. ఈ సమావేశంలో టీ20లకు హార్ధిక్ పాండ్యాను కెప్టెన్‌గా చేయడంతో పాటు, యువ ఆటగాళ్లను జట్టులోకి తీసుకోవాలని బీసీసీఐ ఆలోచిస్తోంది. కోహ్లీ, రోహిత్‌లు ఇద్దరూ 35 ఏళ్లకు చేరువలో ఉండడంతో వారి కెరీర్‌పై కూడా చర్చించనున్నారు. వీటన్నింటిపై త్వరలోనే స్పష్టత రానుంది.

  ‘జట్టులో పంత్‌నే కొనసాగించాలి’

  వికెట్ కీపర్ దినేష్ కార్తీక్ బదులు రిషభ్ పంత్‌నే జట్టులో కొనసాగించాలని భారత మాజీ కోచ్ రవి శాస్త్రి అభిప్రాయపడ్డాడు. ‘‘ బెస్ట్ ఫినిషర్‌గా పేరున్న దినేష్ కార్తీక్ విఫలమవుతున్నాడు. జింబాబ్వే మ్యాచ్‌లో పంత్‌ను ఆడించారు. ఆ మ్యాచ్‌లో పంత్ విఫలమైనా అతడినే జట్టులో కొనసాగించాలి. ఎందుకంటే ఎడమచేతి వాటం బ్యాట్స్‌మెన్ జట్టుకు అవసరం. పంత్ లెఫ్ట్ హ్యాండర్, మ్యాచ్ విన్నర్. అడిలైడ్‌లో బౌండరీలు సాధించే సత్తా పంత్‌కు ఉంది’’. అంటూ రవి శాస్త్రి పేర్కొన్నాడు. © ANI Photo © ANI Photo

  వన్డే వరల్డ్ కప్‌కు జట్టు ఎంపిక చేయడం కష్టమే !

  2023లో జరిగే వన్డే వరల్డ్ కప్‌కు భారత జట్టును ఎంపిక చేయడం కత్తిమీద సామె అని పేర్కొన్నారు భారత జట్టు తాత్కాలిక కోచ్ VVS లక్ష్మణ్. భారత రిజర్వ్ బెంచ్‌లో అద్భుతమైన ఆటగాళ్లు ఉన్నారని, వాళ్లు అద్భుతంగా రాణిస్తున్నారని పేర్కొన్నారు. ప్రస్తుతం సౌతాఫ్రికాతో ఆడుతున్న జట్టు కూడా బలంగా ఉందని, కానీ సీనియర్లు వస్తే పోటీ పెరుగుతుందని అభిప్రాయపడ్డారు. అటు కోచ్‌గా తనకు బాగానే ఉందని పేర్కొన్నారు లక్ష్మణ్.

  ‘కాలా చ‌ష్మా’ రీల్‌తో ఇండియా టీమ్ సెల‌బ్రేష‌న్స్‌

  జింబాబ్వేతో జరిగిన వన్డే సిరీస్‌లో విజ‌యం సాదించిన సంగ‌తి తెలిసిందే. ఆ త‌ర్వాత టీమ్ ఇండియా ప్లేయ‌ర్స్ డ్రెస్సింగ్ రూమ్‌లో డ్యాన్స్ చేస్తూ ఈ గెలుపును సెల‌బ్రేట్ చేసుకున్నారు. శిఖ‌ర్ ధావ‌న్, కేఎల్ రాహుల్, శుభ్‌మాన్‌గిల్ పాటు ఇత‌ర ఆట‌గాళ్లు కాలా చ‌ష్మా పాట‌కు ఫ‌న్నీగా స్టెప్పులేస్తూ అల‌రించారు. ఈ వీడియోను ధావన్ తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో పంచుకున్నాడు. దీంతో గంటలోపు దాదాపు మిలియన్ లైక్‌లను సంపాదించింది. సోష‌ల్‌మీడియాలో ఈ వీడియోను చూసి ఫ్యాన్స్ ఫుల్‌గా ఎంజాయ్ చేస్తున్నారు. https://youtube.com/watch?v=4-4RT2-wN6g

  టార్గెట్ టీ20 వరల్డ్ కప్.. భారత జట్టులో కీలక కోచ్

  ఆస్ట్రేలియాలో జరిగే టీ20 వరల్డ్ కప్ లక్ష్యంగా బీసీసీఐ ప్రణాళికలు రచిస్తోంది. అందులో భాగంగానే టీం సెలెక్షన్స్, కోచ్‌లను నియమిస్తోంది. తాజాగా ప్రముఖ మెంటల్ కండిషనింగ్ కోచ్ ప్యాడీ ఆప్టన్ మరోసారి జట్టుతో చేరాడు. 2011 ప్రపంచ కప్ ఛాంపియన్‌షిప్ భారత జట్టు సహాయక సిబ్బందిలో ప్యాడీ కూడా ఉన్నాడు. దీనిపై స్పందించిన ప్యాడీ భారత జట్టు, రాహుల్ ద్రావిడ్‌తో కలిసి పనిచేసేందుకు ఆసక్తిగా ఉన్నా అని పేర్కొన్నాడు.

  ట్రినిడాడ్ చేరుకున్న టీమిండియా టీ20 స్క్వాడ్

  వెస్టిండీస్‌తో ఈనెల 29వ తేదీ నుంచి జరగనున్న 5 మ్యాచ్ టీ20 సిరీస్ కోసం టీమిండియా ట్రినిడాడ్ చేరుకుంది. కెప్టెన్ రోహిత్, దినేష్ కార్తీక్, కుల్దీప్ యాదవ్, పంత్, అశ్విన్, భువనేశ్వర్ కుమార్‌లు హోటల్‌లో దిగుతున్న వీడియోను బీసీసీఐ ట్విట్టర్‌లో పోస్ట్ చేసింది. ఆ వీడియోను చూసేందుకు Watch On Twitter గుర్తుపై క్లిక్ చేయండి. https://twitter.com/BCCI/status/1551792712138903552?s=20&t=yXJ1kjX5CmufJSs3a0Kkjg

  ఇకపై నన్ను తీసుకోరేమో: సాహా

  ఐపీఎల్ 2022లో అదరగొట్టి టీమిండియాలోకి తిరిగి చోటు సంపాదించుకున్నాడు దినేష్ కార్తీక్. అయితే ఐపీఎల్‌లో రాణించినా.. టీమిండియా స్థానం పొందలేక సతమతమవుతున్నాడు వృద్ధిమాన్ సాహా. దీనిపై అతను తాజాగా స్పందించాడు. టీమిండియా జట్టులో ఇకపై తనను తీసుకోకపోవచ్చని, తన ద్వారం ముగిసిందని ఆవేదన వ్యక్తం చేశాడు. భవిషత్తులో తాను జాతీయ జట్టుకు ఆడతానన్న నమ్మకం తనకు లేదని పేర్కొన్నాడు ఈ 37 ఏళ్ల క్రికెటర్.