GREAT: భార్యను ఎత్తుకొని తిరుమల మెట్లు ఎక్కాడు !
తూ.గోకు చెందిన సత్తిబాబు, తన భార్య లావణ్యను ఎత్తుకొని తిరుమల కొండ ఎక్కుతున్న వీడియో వైరల్ అవుతుంది. లావణ్య విసిరిన సవాలును స్వీకరించిన సత్తిబాబు ఆమెను తన భుజాలపై ఎత్తుకొని 70 మెట్లు ఎక్కాడట. తన అల్లుడు మొక్కిన మొక్కు తీర్చేందుకు తిరుమల వెళ్లిన ఈ జంటకు 1998లోనే పెళ్లైందట. అయితే ఈ వీడియో చూసిన కొందరు యువత వారిని స్ఫూర్తిగా తీసుకోవాలని అంటుండగా.. మరికొందరు దేవుని దగ్గరకు వెళ్తున్నప్పుడు సవాలేంటి అని విమర్శిస్తున్నారు.