• TFIDB EN
  • అర్జున్ రెడ్డి
    ATelugu3h 2m
    అర్జున్ రెడ్డి టాలెంట్ ఉన్న ఒక యువ సర్జన్. ప్రీతి అనే యువతిని ప్రాణం కన్నా ఎక్కువగా ప్రేమిస్తాడు. అయితే ఓ సంఘటన అర్జున్ రెడ్డిని షాక్‌కు గురిచేస్తుంది. మద్యానికి బానిసవుతాడు. ఇంతకు తన ప్రేయసిని అతను తిరిగి కలుసుకున్నాడా లేదా? అన్నది మిగతా కథ.
    ఇంగ్లీష్‌లో చదవండి
    మూవీ & ఓటీటీ అప్‌డేట్స్‌
    స్ట్రీమింగ్‌ ఆన్‌Primeఫ్రమ్‌
    Watch
    స్ట్రీమింగ్‌ ఆన్‌Aha
    Watch
    రివ్యూస్
    How was the movie?

    తారాగణం
    విజయ్ దేవరకొండ
    ఒక ఆల్కహాలిక్ సర్జన్
    షాలినీ పాండే
    అర్జున్ ఆసక్తిని ప్రేమిస్తాడు
    రాహుల్ రామకృష్ణ
    అర్జున్ బెస్ట్ ఫ్రెండ్
    కమల్ కామరాజు
    అర్జున్ సోదరుడు
    కాంచన
    అర్జున్ అమ్మమ్మ
    అమిత్ శర్మ అమిత్
    భూషణ్ కళ్యాణ్సెయింట్ మేరీ కళాశాల డీన్
    ప్రియదర్శి పులికొండ
    విపుల్ (అతి అతిధి పాత్ర)
    సిబ్బంది
    సందీప్ రెడ్డి వంగ
    దర్శకుడు
    ప్రణయ్ రెడ్డి వంగనిర్మాత
    రాధన్
    సంగీతకారుడు
    హర్షవర్ధన్ రామేశ్వర్సంగీతకారుడు
    రాజ్ తోట
    సినిమాటోగ్రాఫర్
    ఎడిటోరియల్ లిస్ట్
    కథనాలు
    విజయ్ దేవరకొండ (Vijay Devarkonda) గురించి మీకు తెలియని టాప్ సీక్రెట్స్
    విజయ్ దేవరకొండ (Vijay Devarkonda) గురించి మీకు తెలియని టాప్ సీక్రెట్స్
    అర్జున్ రెడ్డి సినిమా విజయంతో రౌడీ బాయ్‌గా పేరు తెచ్చుకున్న విజయ్ దేవరకొండ.. తక్కువ కాలంలోనే ప్రేక్షకుల హృదయాలను గెలుచుకున్నాడు. గీతాగోవిందం, ఖుషి వంటి  హిట్ సినిమాలతో ఫ్యామిలీ ఆడియన్స్‌కు దగ్గరయ్యాడు. ప్రస్తుతం స్టార్ హీరోల్లో ఒకరిగా కొనసాగుతున్న  విజయ్ దేవరకొండ గురించి చాలా మందికి తెలియని ఆసక్తికరమైన సంగతులు మీకోసం.. విజయ్ దేవరకొండ అసలు పేరు? దేవరకొండ విజయ్ సాయి. అభిమానులు ముద్దుకు రౌడీ బాయ్, VDK అని పిలుచుకుంటారు. విజయ్ దేవరకొండ ఎత్తు ఎంత? 5 అడుగుల 10 అంగుళాలు విజయ్ దేవరకొండ తొలి సినిమా? నువ్విలా చిత్రం ద్వారా తొలిసారి నటుడిగా వెండితెరకు పరిచయమయ్యాడు. ఆ తర్వాత లైఫ్‌ ఈజ్ బ్యూటిఫుల్ చిత్రంలో ఓ చిన్న పాత్రలో నటించాడు. 2016లో వచ్చిన పెళ్లి చూపులు చిత్రం ద్వారా హీరోగా పరిచయం అయ్యాడు విజయ్ దేవరకొండ తొలి బ్లాక్ బాస్టర్ హిట్స్? అర్జున్ రెడ్డి చిత్రం ఇండస్ట్రీ హిట్‌గా నిలిచింది. గీతాగోవిందం, ట్యాక్సీవాలా, ఖుషి సినిమాలు హిట్స్‌గా నిలిచాయి. విజయ్ దేవరకొండ క్రష్ ఎవరు? ఖుషి సినిమాలో తనతోపాటు నటించిన సమంత తన క్రష్‌గా విజయ్ ఓ సందర్భంలో చెప్పాడు VDKకు ఇష్టమైన కలర్? తెలుపు, బ్లాక్, బ్రౌన్ విజయ్ దేవరకొండ పుట్టిన తేదీ? మే 9, 1989 విజయ్ దేవరకొండకు నచ్చిన పుస్తకం? విజయ్ దేవరకొండ పుస్తక ప్రియుడు. అతనికి 'ది పౌంటెన్ హెడ్' అనే పుస్తకం అంటే ఇష్టమని చెప్పాడు. ఈ పుస్తకంతో పాటు 'అట్లాస్ ష్రగ్ డ్', 'హూ మూవ్డ్ మై చీజ్' అనే పుస్తకాలు చదవదగినవని పేర్కొన్నాడు. విజయ్ దేవరకొండకు లవర్ ఉందా? విజయ్ దేవరకొండ, రష్మిక మంధాన ప్రేమలో ఉన్నారని చాలా వార్తల్లో వచ్చాయి. వీరిద్దరు కలిసి పలు సందర్భాల్లో కనిపించడం ఆ వార్తలకు బలానిచ్చాయి. గీతాగోవిందం, డియర్ కామ్రెడ్ వంటి హిట్ చిత్రాల్లో ఈ జోడి నటించింది. విజయ్ దేవరకొండ వ్యాపారాలు? రౌడీ బ్రాండ్ పేరుతో క్లాత్ బిజినెస్ ఉంది. ఈ బ్రాండ్ బట్టలు మింత్రా ఆన్‌లైన్‌ స్టోర్‌లో అందుబాటులో ఉన్నాయి. 'కింగ్ ఆఫ్ ది హిల్' అనే ప్రొడక్షన్ హౌస్ ఉంది. వోల్ట్స్‌ అనే ఎలక్ట్రిక్ వెహికల్ కంపెనీలో పెట్టుబడులు పెట్టాడు.  విజయ్ దేవరకొండకు ఎన్ని అవార్డులు వచ్చాయి? అర్జున్ రెడ్డి చిత్రంలో నటనకు గాను ఉత్తమ నటుడిగా అవార్డు పొందాడు. 2018 ఫోర్బ్స్ ఇండింయా సెలబ్రెటీ 100 జాబితాలో 72వ స్థానం, టైమ్స్ మోస్ట్ డిజైరబుల్ మెన్‌లో 4 వ స్థానంలో నిలిచాడు. విజయ్ దేవరకొండ సామాజిక సేవ చేస్తాడా? కొవిడ్ టైంలో మిడిల్ క్లాస్ ఫండ్ ద్వారా వంట సామాగ్రిని అందించాడు. ఇందుకోసం రూ.1.7కోట్లు ఖర్చు పెట్టాడు. ఖుషి సినిమా విడుదల సమయంలో తన రెమ్యునరేషన్‌ నుంచి రూ.కోటి ఖర్చు పెట్టి 100 మంది రైతులకు సాయం చేశాడు విజయ్ దేవరకొండ ఎన్ని సినిమాల్లో నటించాడు? విజయ్ దేవరకొండ 2024 వరకు 14 సినిమాల్లో నటించాడు.  విజయ్ దేవరకొండకు ఇష్టమే ఆహారం? చికెన్ బిర్యాని, ఇటాలియన్ పస్తా అండ్ పీజా, కాఫీ. https://www.youtube.com/watch?v=6Z_mp4t0QLU
    మార్చి 19 , 2024
    VD13: వరుసగా సమంత, శ్రీలీల, మృణాల్‌తో విజయ్ దేవరకొండ రొమాన్స్.. పెట్టి పుట్టాడు పో!
    VD13: వరుసగా సమంత, శ్రీలీల, మృణాల్‌తో విజయ్ దేవరకొండ రొమాన్స్.. పెట్టి పుట్టాడు పో!
    ‘పెళ్లిచూపులు’ అంటూ పక్కింటి అబ్బాయిలా ప్రేక్షకులను పలకరించాడు విజయ్ దేవరకొండ. వెంటనే అర్జున్ రెడ్డితో బ్లాక్ బస్టర్ హిట్‌ అందుకుని.. తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారాడు. రౌడీబాయ్ యాటిట్యూడ్‌కి ప్రత్యేక ఫ్యాన్ బేస్ ఏర్పడిందంటేనే విజయ్ స్టార్‌డమ్‌ ఏ రేంజ్‌లో పెరిగిందో అర్థం చేసుకోవచ్చు. ఈ అభిమాన గణాన్ని కాపాడుకుంటేనే పక్కాగా సినిమాలు చేస్తున్నాడు దేవరకొండ. లైగర్ బెడిసి కొట్టినా వరుస సినిమాలకు సైన్ చేసి కెరీర్‌ని పకడ్బందీగా ప్లాన్ చేసుకుంటున్నాడు.  సినిమాలో హీరోయిన్ ఎంపిక విషయంలో డైరెక్టర్, ప్రొడ్యూసర్లతో పాటు హీరోది కీలక పాత్ర. ఫలానా వారినే పెట్టుకుందామని హీరోలు సిఫార్సు చేస్తే డైరెక్టర్, ప్రొడ్యూసర్లు ఒకే చెప్పేస్తారు. అయితే, రౌడీ బాయ్ విజయ్ దేవరకొండ మాత్రం ప్రత్యేక రూటు ఫాలో అవుతున్నాడు. తెలుగులో టాప్ హీరోయిన్లతోనే రొమాన్స్ చేస్తానని అంటున్నాడు. అందుకు తగ్గట్టుగానే అప్ కమింగ్ సినిమాల్లో హీరోయిన్లను ఎంపిక చేసుకుంటున్నాడీ హ్యాండ్‌సమ్ హీరో.  సమంత మహానటి సినిమాలో పార్ట్ టైం హీరోగా నటించాడు విజయ్ దేవరకొండ. ఇందులో విజయ్‌కి తోడుగా సమంత నటించింది. కానీ, ఈ సినిమాలో వీరిద్దరి మధ్య రోమాన్స్‌కు స్కోప్ లేకుండా పోయింది.  ఖుషీ సినిమాతో మరోసారి సామ్, విజయ్ ఒక్కటయ్యారు. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ పూర్తి చేసుకుంది. కశ్మీర్ నేపథ్యంలో సాగే లవ్‌స్టోరీగా డైరెక్టర్ శివ నిర్వాణ దీన్ని తీర్చిదిద్దాడు.  సినిమాలో నుంచి ‘నా రోజా నువ్వే’ సాంగ్ విడుదలై మంచి రెస్పాన్స్‌ని రాబడుతోంది. మరి, ఇందులో సమంతతో విజయ్ ఏ మేరకు రొమాన్స్ చేశాడో వేచి చూడాలి.  శ్రీలీల తెలుగు చిత్ర పరిశ్రమలో హీరోయిన్‌గా శ్రీలీల బిజీబిజీగా ఉంది. జెర్సీ ఫేమ్ డైరెక్టర్ గౌతమ్ తిన్ననూరి సినిమాలో శ్రీలీలనే హీరోయిన్. ఈ ప్రాజెక్టు చిత్రీకరణ దశలో ఉంది. ఇప్పటివరకు శ్రీలీల లిప్‌లాక్ సీన్లలో నటించలేదు. గౌతమ్ తిన్ననూరి తొలి సినిమాలో రొమాన్స్‌ని బాగా చూపించాడు. కథ వేరే అయినప్పటికీ ఈ సీన్స్ పెట్టి ఆడియెన్స్‌ని సాటిస్‌ఫై చేశాడు.  ముఖ్యంగా, విజయ్‌లోని రొమాంటిక్ యాంగిల్‌ని చాలా మంది ఇష్టపడతారు. దీంతో ఈ సినిమాలోనూ శ్రీలీల, విజయ్ మధ్య రొమాంటిక్ సన్నివేశాలు ఉండబోతున్నాయని తెలుస్తోంది.  మృణాల్ ఠాకూర్ సీతారామం సినిమాలో అందాల భామ మృణాల్ ఠాకూర్‌ని డైరెక్టర్ హను చాలా పద్ధతిగా చూపించాడు. కానీ, మృణాల్ ఠాకూర్ తరచూ హాట్ ఫొటోలతో రెచ్చిపోతుంటుంది.  బికినీలు ధరించి సోషల్ మీడియాను హీటెక్కిస్తుంది. ఏ మాత్రం సంకోచించకుండా అందాల నిధిని బయటకు తెరుస్తుంది. ఇప్పుడు ఈ బ్యూటీ విజయ్ దేవరకొండతో జతకట్టింది.  గీతగోవిందం సినిమా ఫేమ్ డైరెక్టర్ పరషురామ్‌ ఈ సినిమాను తెరకెక్కిస్తున్నాడు. గీతగోవిందం సినిమాకు సీక్వెల్‌గా ఇది రానుంది. మరి, అటు రౌడీబాయ్, ఇటు గ్లామర్ బ్యూటీ ఏ మేరకు రెచ్చిపోతారో? అని నెటిజన్లు గుసగుసలాడుతున్నారు. వీరిద్దరి మధ్య రోమాన్స్ పండితే ఇక సినిమా బ్లాక్ బాస్టర్‌ అని కామెంట్ చేస్తున్నారు.  లవ్ స్టోరీగానే ఈ సీక్వెల్‌ని తెరకెక్కిస్తున్నట్లు తెలుస్తోంది. దీంతో రొమాంటిక్ సన్నివేశాలకు కొదవ ఉండకపోవచ్చని ఫ్యాన్స్ అంచనా వేస్తున్నారు. అలనాటి అర్జున్ రెడ్డి సినిమాను గుర్తు తెచ్చుకుంటున్నారు. 
    జూన్ 14 , 2023
    సిద్ధు జొన్నలగడ్డ (Siddu Jonnalagadda) గురించి మీకు తెలియని టాప్ సీక్రెట్స్
    సిద్ధు జొన్నలగడ్డ (Siddu Jonnalagadda) గురించి మీకు తెలియని టాప్ సీక్రెట్స్
    తెలుగు ఇండస్ట్రీలో ఎలాంటి బ్యాక్‌ గ్రౌండ్ లేకుండా అంచెలంచెలుగా ఎదిగిన హీరోల్లో సిద్ధు జొన్నలగడ్డ ఒకరు. డీజే టిల్లు సినిమా సక్సెస్‌తో యూత్‌లో మంచి గుర్తింపు పొందాడు. తనదైన స్లాంగ్, మెనరిజంతో ప్రేక్షకులకు దగ్గరయ్యాడు. మరి యూత్‌ను ఆకట్టుకున్న సిద్ధు జొన్నలగడ్డ గురించి చాలా మందికి తెలియని కొన్ని విషయాలు ఇప్పుడు చూద్దాం. సిద్ధు జొన్నల గడ్డ అసలు పేరు? సిద్ధార్థ జొన్నలగడ్డ సిద్ధు జొన్నల గడ్డ ఎత్తు ఎంత? 5’.7” (175 cms) సిద్ధు జొన్నలగడ్డ తొలి సినిమా? జోష్ చిత్రం ద్వారా సిద్ధు ఇండస్ట్రీకి పరిచయమయ్యాడు.  హీరోగా అతను నటించిన తొలి చిత్రం 'పెళ్లికి ముందు జీవితం'  సిద్ధు జొన్నలగడ్డ ఎక్కడ పుట్టాడు? హైదరాబాద్, తెలంగాణ సిద్ధు జొన్నలగడ్డ పుట్టిన తేదీ ఎప్పుడు? 1992 సిద్ధు జొన్నలగడ్డకు వివాహం అయిందా?  ఇంకా కాలేదు సిద్ధు జొన్నల గడ్డ ఫెవరెట్ హీరోయిన్? అనుష్క శెట్టి సిద్ధు జొన్నలగడ్డకు ఇష్టమైన సినిమా? అర్జున్ రెడ్డి, ఆడవారి మాటలకు అర్థాలు వేరులే, అల వైకుంఠపురములో సిద్ధు జొన్నలగడ్డకు ఇష్టమైన హీరో? వెంకటేష్ సిద్ధు జొన్నలగడ్డ తొలి హిట్ సినిమా? గుంటూరు టాకీస్ చిత్రం సిద్ధు జొన్నలగడ్డకు మంచి గుర్తింపు తెచ్చింది. అలాగే డిజే టిల్లు చిత్రం బ్లాక్ బాస్టర్ హిట్‌గా నిలిచింది. సిద్ధు జొన్నలగడ్డకు ఇష్టమైన కలర్? బ్లాక్ సిద్ధు జొన్నలగడ్డ తల్లిదండ్రుల పేర్లు? శారద, సాయి కుమార్ జొన్నలగడ్డ సిద్ధు జొన్నలగడ్డకు ఇష్టమైన ప్రదేశం? హైదరాబాద్ సిద్ధు జొన్నలగడ్డ ఏం చదివాడు? ఇంజనీరింగ్, MBA సిద్ధు జొన్నలగడ్డ అభిరుచులు బైక్ రైడింగ్, మోడలింగ్ సిద్ధు జొన్నలగడ్డ ఎన్ని సినిమాల్లో నటించాడు? సిద్ధు 2024 వరకు 13 సినిమాల్లో నటించాడు.  సిద్ధు జొన్నలగడ్డకు ఇష్టమైన ఆహారం? బిర్యాని సిద్ధు జొన్నలగడ్డ నికర ఆస్తుల విలువ ఎంత? రూ. 7కోట్లు సిద్ధు జొన్నలగడ్డ సినిమాకి ఎంత తీసుకుంటాడు? సిద్ధు ఒక్కో సినిమాకి దాదాపు 2 నుంచి 3 కోట్లు తీసుకుంటాడు . సిద్ధు జొన్నలగడ్డకు స్మోకింగ్ అలవాటు ఉందా? చాలా సందర్భాల్లో స్మోకింగ్ అలవాటు ఉందని చెప్పాడు సిద్ధు జొన్నలగడ్డ మద్యం తాగుతాడా?  అవును, వీక్లీ వన్స్ తాగుతానని ఓ ఇంటర్వ్యూలో చెప్పాడు సిద్దు జొన్నలగడ్డ నిక్‌ నేమ్‌ ఏంటి? స్టార్‌ బాయ్‌ సిద్ధూ సిద్ధు జొన్నలగడ్డకు తోబుట్టువులు ఉన్నారా? ఒక అన్నయ్య ఉన్నారు. ‌అతని పేరు చైతన్య జొన్నల గడ్డ సిద్ధు జొన్నలగడ్డ రైటర్‌గా పనిచేసిన చిత్రాలు? సిద్ధు మంచి నటుడే కాకుండా రైటర్‌, సింగర్, లిరికిస్ట్‌, ఎడిటర్‌ కూడా. 'క్రిష్ణ అండ్‌ హీస్‌ లీలా', 'మా వింత గాధ వినుమా', ‘డీజే టిల్లు’, ‘టిల్లు స్క్వేర్‌’ చిత్రాలకు రైటర్‌గా పనిచేశారు.  సిద్ధు జొన్నలగడ్డ స్వయంగా పాడిన పాటలు ఏవి? గుంటూరు టాకీస్‌ ‘టైటిల్‌ ట్రాక్‌’, నరుడా ఢోనరుడా సినిమాలో 'కాసు పైసా', 'పెళ్లి బీటు' పాటలను సిద్ధు పాడాడు. అలాగే మా వింత గాధ వినుమాలో ‘షయార్‌-ఈ-ఇష్క్‌’, డీజే టిల్లులో 'నువ్వలా' సాంగ్స్ పాడి అలరించాడు.  సిద్ధు జొన్నలగడ్డ రాసిన పాటలు ఏవి? జాణ (మా వింత గాధ వినుమ), ఓ మై లిల్లీ (టిల్లు స్క్వేర్‌) సిద్దు జొన్నలగడ్డ ఇప్పటివరకూ చేసిన ఏకైక వెబ్‌సిరీస్‌? 2018లో వచ్చిన 'గ్యాంగ్‌స్టర్స్‌' సిరీస్‌లో సిద్ధు నటించాడు. అది అమెజాన్‌ ప్రైమ్‌లో స్ట్రీమింగ్ అవుతోంది. ఆ తర్వాత సిద్ధు ఏ వెబ్‌సిరీస్‌లో చేయకపోవడం గమనార్హం. సిద్ధు జొన్నలగడ్డకు గర్ల్‌ ఫ్రెండ్ ఉందా? గతంలో ఓ అమ్మాయిని ప్రేమించినట్లు సిద్ధు ఓ ఇంటర్యూలో తెలిపాడు. అయితే అది మధ్యలోనే బ్రేకప్‌ అయినట్లు తెలిపాడు. ప్రస్తుతం సిద్దూ ఎవరితోనూ రిలేషన్‌లో లేడు.  సిద్ధు జొన్నలగడ్డ ఫేవరేట్‌ బాలీవుడ్‌ హీరో ఎవరు? రణ్‌బీర్‌ కపూర్‌ సిద్ధు జొన్నలగడ్డ హెయిల్ కలర్‌ ఏంటి? నలుపు సిద్ధు జొన్నలగడ్డ ఫేమస్‌ హెయిర్‌ స్టైల్‌ ఏది? డీజే టిల్లు కోసం అతడు యూనిక్‌ హెయిర్‌ స్టైల్‌ చేయించుకున్నాడు. దీన్ని తెలుగులో సరదాగా ‘పిచుక గూడు’ స్టైల్‌ అని అంటున్నారు. టిల్లు స్క్వేర్‌లోనూ ఇదే హెయిర్‌ స్టైల్‌లో సిద్ధూ కనిపించాడు.  సిద్ధు జొన్నలగడ్డ ఫ్యూచర్‌ ప్రాజెక్ట్స్‌ ఏవి? 'జాక్‌', 'తెలుసు కదా', 'టిల్లు క్యూబ్‌'.. సిద్ధు జొన్నలగడ్డ చేసిన టిల్లు పాత్ర ఎలా పుట్టింది? టిల్లు పాత్ర కల్పితం. హైదరాబాద్‌లోని మల్కాజ్‌గిరి, చిలకలగూడ, వారాసిగూడ, సికింద్రాబాద్‌ ఏరియాల్లో ఉన్నప్పుడు తన అనుభవాలు, ఎదురైన వ్యక్తుల నుంచి ఈ డీజే టిల్లు పాత్ర పుట్టిందని సిద్ధు ఓ ఇంటర్యూలో తెలిపారు. సిద్ధు జొన్నలగడ్డ చేసిన మోస్ట్ రొమాంటిక్ సాంగ్స్‌ ఏవి? సిద్ధు కెరీర్‌లో మోస్ట్‌ రొమాంటిక్‌ సాంగ్స్ రెండు ఉన్నాయి. అందులో ఒకటి గుంటూరు టాకీస్‌లోని ‘నీ సొంతం’ సాంగ్‌. ఇందులో యాంకర్‌ రష్మీతో కలిసి సిద్ధు చేసే రొమాన్స్‌ అప్పట్లో కుర్రకారును ఫిదా చేశాయి. అలాగే టిల్లు స్క్వేర్‌లోనూ సిద్ధూ జొన్నలగొడ్డ రెచ్చిపోయాడు. ‘ఓ మై లిల్లీ’ సాంగ్‌లో హీరోయిన్‌ అనుపమా పరమేశ్వరన్‌తో కలిసి లిప్‌ కిస్‌ సీన్లలో నటించాడు. ఆ రెండు సాంగ్స్‌పై ఓ లుక్కేయండి. https://www.youtube.com/watch?app=desktop&v=mw9Jn_BsPZE&vl=hi https://www.youtube.com/watch?v=QiKd8Iegu5g సిద్దు జొన్నలగడ్డ బెస్ట్‌ డైలాగ్స్‌ డీజే టిల్లులో రాధిక హత్య చేసిన వ్యక్తిని.. టిల్లు (సిద్ధు జొన్నలగడ్డ) పాతిపెట్టే క్రమంలో వచ్చే డైలాగ్స్‌ ది బెస్ట్ అని చెప్పవచ్చు.  రాధిక: హేయ్‌.. అక్కడ రాయి ఉంది చూస్కో టిల్లు: ఐ హావ్‌ వన్‌ సజిషన్‌ ఫర్‌ యూ.. పోయి కారులో ఏసీ ఆన్‌ చేసుకొని రిలాక్స్‌గా స్విగ్గీ ఓపెన్ చేసి ఓ ఫ్రెష్‌ వాటర్‌ మిలాన్‌ జ్యూస్‌ ఆర్డర్‌ చేసుకొని రిలాక్స్‌గా నువ్వు.  “మనం చేసేదే లంగా పని పైగా కాంట్రిబ్యూషన్‌ లేదు నీది. పైగా ఉప్పర్‌ సే బొంగులో కరెక్షన్స్ అన్ని చెబుతున్నావ్‌” “ ప్లీజ్‌ నువ్వేళ్లి రిలాక్స్‌ గా. నాకు అలవాటే ఈ శవాలు పాతిపెట్టుడు. నేను రోజూ చేసే పనే ఇది. ఫినిష్‌ చేసుకొని వస్తా.  కొద్దిసేపటి తర్వాత.. టిల్లు : ఏం చేస్తాడు ఇతను (చనిపోయిన వ్యక్తి).. సాఫ్ట్‌వేరా? రాధిక: ఫొటోగ్రఫీ.. టూ మూవీస్‌కు కెమెరామెన్‌గా పనిచేశాడు టిల్లు: చాలా అన్‌ఫార్చ్యూనెట్లీ ఇట్లా అయిపోయింది. ఏజ్ కూడా బాగా తక్కువే. హీ నెవర్‌ సీ సక్సెస్‌ బీకాజ్‌ ఆఫ్‌ యూ https://youtu.be/11iKluNP0rs?si=YoSXNG65ACZWI-zt టిల్లు స్క్వేర్‌లో సిద్దు జొన్నలగడ్డ చెప్పిన టాప్‌ డైలాగ్స్‌ ఏవి? ఈ సినిమాలో టిల్లు (సిద్ధు జొన్నలగడ్డ) తన తండ్రితో చెప్పిన ఓ డైలాగ్‌కు కూడా థియేటర్లలో మంచి రెస్పాన్స్‌ వచ్చింది. ఆ సీన్ ఏంటంటే.. డైలాగ్‌ టిల్లు తన తండ్రితో: వచ్చిండయ్యా రియల్‌ ఏస్టేట్ ఐకూన్‌ టిల్లు తల్లి : డాడీతో గట్లనా మాట్లాడేది టిల్లు : అట్లకాదు మమ్మీ.. నేనున్న ప్రెజర్‌కి పచ్చి బియ్యం తింటే అది కడుపులోకి వెళ్లాక అన్నం అయ్యేట్లు ఉంది https://twitter.com/i/status/1774992506087944622 డైలాగ్‌ ఓ సీన్‌లో...... లిల్లీ (అనుపమా పరమేశ్వరన్‌) మా పరిస్థితి అర్థం చేసుకో అని టిల్లుతో అంటుంది. అప్పుడు టిల్లూ చెప్పే డైలాగ్‌ థియేటర్లను నవ్వులతో దద్దరిల్లేలా చేసింది.  టిల్లు : నేను ఎవరి పరిస్థితి అర్థం చేసుకునే పరిస్థితిలో లేను. ప్రతీసారి మీరొచ్చి మీ శాడ్‌ స్టోరీలు చెప్పుడు.. ఆ బాధలన్ని విని నేను మీ ప్రాబ్లమ్‌ను నా ప్రాబ్లమ్‌గా ఫీల్ అయ్యి.. ఆ ప్రాబ్లమ్‌ను సాల్వ్‌ చేయడానికి టిప్పు సుల్తాన్‌ లాగా దూరి దాంట్లోకి.. మల్లా లాస్ట్‌కి నేనే ఫీలై మీకు డిస్కౌంట్ ఇచ్చి నేను షాపు మూసుకొనుడు ఏందే తూ.. https://twitter.com/i/status/1773542640488784015 డైలాగ్‌ లిల్లీ : నువ్వుమాట మీద నిలబడే మనిషివి కాదా టిల్లు? టిల్లు : నిలబడా నేను.. వేస్ట్‌. తాగకముందు 30 చెప్తా.. తాగినాక తొంబై చెప్తా నేను. నెక్స్ట్‌ డే పొద్దుగాల మర్చిపోతా. అసలు నాతోటి పెట్టుకోకండ్రి  https://twitter.com/i/status/1773655054655856994 డైలాగ్‌ లిల్లీతో టిల్లు: చెప్పు రాధిక నీకు ఏం కావాలి?. నేను నీకు ఎలా సాయపడగల్గుతాను రాధిక. ఈ సారి నా కొంప ఎట్లా ముంచబోతున్నావ్‌ చెప్పు రాధిక. లిల్లీ: రాధిక ఎవరు నా పేరు లిల్లీ  టిల్లు : “నీ పేరు లిల్లీ ఏమో గానీ.. నువ్వు మనిషివైతే 100% రాధికవు నువ్వు. ఒక రాధిక జాతికి సంబంధించిన ఆడపడుచువు నువ్వు. మీరందరూ కూడా ఒక రాధిక ఇన్‌స్టిట్యూట్ ఆఫ్‌ టెక్నాలజీలో స్టూడెంట్స్ మీరు. ఆ కాలేజీ ఈడ యాడా ఉండదు. అదెక్కడో గుట్ట మీద ఉంటది. అక్కడ రాధికలందరూ లైన్‌గా నిలబడి బైనాక్యూలర్లు వేసుకొని చూస్తుంటారు. టిల్లు లాంటి లప్పాగాళ్లు యాడున్నారు.. ఎవర్నీ హౌలా గాళ్లను చేద్దాం అని చెప్పి. చాలా పెద్ద కాలేజీ అంటగా అది.  నేను పోయినసారి నీ సూపర్ సీనియర్‌ను కలిసినా రాధిక ఆమె పేరు. చాలా బాగా ర్యాంగింగ్ చేసింది. ఎంజాయ్ చేసినా నేను. ఇప్పటికీ మాట్లాడుకుంటున్నారు.. దాని గురించి https://www.youtube.com/watch?v=e1gDD3_pKR8 టాలీవుడ్‌ సెలబ్రిటీలతో సిద్దు జొన్నలగడ్డ దిగిన ఫొటోలు సిద్దు జొన్నలగడ్డ లేటెస్ట్‌ స్టైలిష్‌ ఫొటోలు సిద్ధు జొన్నలగడ్డ లగ్జరీ  కారు కలెక్షన్స్‌సిద్ధు ప్రస్తుతం రేంజ్‌ రోవర్‌ కారు వినియోగిస్తున్నాడు. ఈ కారులోనే తన సినిమా ఫంక్షన్లకు హాజరవుతున్నాడు.  https://www.youtube.com/watch?v=8CM-HSifLsY https://www.youtube.com/watch?v=i817fCTiZ3g
    ఏప్రిల్ 27 , 2024
    Cool Smoke Shots In Telugu: టాలీవుడ్‌ను షేక్‌ చేసిన స్టార్‌ హీరోల స్మోకింగ్‌ సీన్ల గురించి తెలుసా?
    Cool Smoke Shots In Telugu: టాలీవుడ్‌ను షేక్‌ చేసిన స్టార్‌ హీరోల స్మోకింగ్‌ సీన్ల గురించి తెలుసా?
    టాలీవుడ్‌లో గత కొంత కాలంగా ఓ ట్రెండ్‌ నడుస్తోంది. స్టార్‌ హీరోలంతా దాదాపు తమ చిత్రాల్లో సిగరేట్లతో దర్శనమిస్తున్నారు. మాస్‌ ఆడియన్స్‌కు కనెక్ట్ అయ్యే ఉద్దేశ్యంతో డైరెక్టర్లు కూడా స్మోకింగ్‌ వైపు హీరో పాత్రలను ప్రోత్సహిస్తున్నారు. సిగరేట్‌ పీకను నోట్లో పెట్టించి స్టైల్‌గా హీరోల చేత దమ్ము లాగిస్తున్నారు. అటు ఫ్యాన్స్‌ సైతం తమ హీరోను మాస్‌ లుక్‌లో చూసేందుకే ఎక్కువగా ఇష్టపడుతున్నారు. అయితే సిగరేట్‌తో క్లాస్‌ ఆడియన్స్‌ను కూడా ఆకట్టుకోవచ్చని కొన్ని సినిమాలలోని సీన్లు నిరూపించాయి. వాటిలో హీరోలు నోట్లో సిగరేట్‌తో చాలా కూల్‌గా కనిపిస్తారు. అటువంటి క్రేజీ సీన్స్ ఏవో ఇప్పుడు చూద్దాం.  అర్జున్ రెడ్డి (Arjun Reddy) ఈ సినిమాలో విజయ్ దేవరకొండ ఎంట్రీ సీన్‌ చాలా క్రేజీగా ఉంటుంది. లాంగ్‌ హెయిర్‌ & గడ్డం, ముఖాన బ్లాక్‌ కళ్లద్దాలు.. నోట్లో సిగరేట్‌తో ఓ అమ్మాయి వద్దకు వెళ్లే సీన్‌ అదిరిపోతుంది.  https://youtu.be/fguH-dGjfVs?si=lOjPlRybnmb-RZkp యానిమల్‌ (Animal) యానిమల్‌ సినిమాలో రణ్‌బీర్‌ కపూర్‌ (Ranbir Kapoor) సైతం పదే పదే సిగరేట్లు తాగుతూ కనిపిస్తాడు. ముఖ్యంగా సూట్‌లో లాంగ్‌ హెయిర్‌తో రణ్‌బీర్‌ సిగరేట్‌ తాగుతూ నడవడం ఫ్యాన్స్‌కు గూస్‌బంప్స్‌ తెప్పించింది. అలాగే నోట్లో సిగరేట్‌తో రణ్‌బీర్‌ ఎంట్రీ సీన్‌ చాలా క్లాసిక్‌గా అనిపిస్తుంది. https://youtu.be/jeQYEIQ6eHw?si=9frMB1-0RO0Wx8p4 సలార్‌ (Salaar) సినిమాల్లో ప్రభాస్‌ (Prabhas) చాలా రేర్‌గా స్మోక్‌ చేస్తూ కనిపిస్తాడు. కానీ, రీసెంట్‌గా వచ్చిన ‘సలార్‌’లో మాత్రం డార్లింగ్‌.. సిగరేట్‌ తాగుతూ ఫ్యాన్స్‌ను సర్‌ప్రైజ్‌ చేశాడు. ముఖ్యంగా ఓ ఫైట్‌ సీన్‌లో రౌడీలను చితకబాదిన ప్రభాస్ ఆ తర్వాత కూల్‌గా సిగరేట్‌ తాగడం ఆకట్టుకుంటుంది.  https://twitter.com/i/status/1734970904613126484 రెబల్‌ (Rebel) రెబల్‌ సినిమాలో ప్రభాస్‌ సిగరేట్‌ తాగే స్టైల్‌ చాాలా యునిక్‌గా ఉంటుంది. ఓ సీన్‌లో విలన్లు అటాక్‌ చేయడానికి రాగా.. ప్రభాస్‌ ఏ మాత్రం బెరుకు లేకుండా చాలా స్టైల్‌గా సిగరేట్‌ తాగుతూ ముందుకు వెళ్తాడు.  https://youtu.be/LUWy8Kv-SuU?si=EpInRjYM0ukrR-1u గుంటూరు కారం (Guntur Kaaram) గుంటూరు కారం చిత్రంలో మహేష్‌ బాబు (Mahesh Babu) ఎంట్రీ సీన్‌ అదరహో అనిపిస్తుంది. నోట్లో బీడితో కారు నుంచి మహేష్‌ దిగే ఎంట్రీ సీన్‌ ప్రేక్షకుల చేత విజిల్‌ వేయిస్తుంది.  https://youtu.be/DAa3crqj5-c?si=0IXCK7j_-kwXYdNv ఒక్కడు (Okkadu) ఒక్కడు సినిమాలో మహేష్‌ బాబు (Mahesh Babu)  స్మోకింగ్‌ స్టైల్‌ చాలా డిఫరెంట్‌గా ఉంటుంది. ముఖ్యంగా ఓ సీన్‌లో మహేష్‌ సిగరేట్‌ వెలుగించుకొని దాన్ని ఆస్వాదించిన తీరు అద్భుతంగా మెప్పిస్తుంది.  https://youtu.be/cPDWfvdj0ug?si=MU_TQkIlEWb9nnuf పుష్ప (Pushpa) పుష్ప సినిమాలో అల్లుఅర్జున్‌ బీడీ తాగే యాటిట్యూడ్‌ ఆకట్టుకుంటుంది. ముఖ్యంగా ఓ సీన్‌లో మంగళం శ్రీను (సునీల్‌) అగ్గిపెట్టే అవసరం అవుతుంది. సరిగ్గా అప్పుడే పుష్ప చాలా స్టైల్‌గా అగ్గిపుల్లను కాల్చి తన బీడీని వెలుగించుకుంటాడు. ఆ తర్వాత కొంత మంగళం శ్రీనుకు కొంత దూరంలో కాలుతున్న అగ్గిపుల్లను పెట్టగా అతడు వంగి సిగరేట్‌ వెలుగించుకునే సీన్‌ హైలెట్‌ అనిపిస్తుంది.  https://youtu.be/31woB__nwHU?si=yMBs9-OdpbLRTIBr అంతపురం (Anthahpuram) ఈ సినిమాలో హీరో జగపతి బాబు (Jagapathi Babu)కు సిగరేట్‌ అంటే అమితమైన ఇష్టం. క్లైమాక్స్‌లో ఒంటి నిండా గాయాలతో రైలు పట్టాల పక్కన కదలలేని స్థితిలో కూర్చుండిపోతాడు. అప్పుడు సిగరేట్‌ తాగుతూ అతడు ఇచ్చే ఎక్స్‌ప్రెషన్స్ నెవర్‌ బీఫోర్ అన్నట్లు అనిపిస్తాయి. https://youtu.be/TqU-51z0ct4?si=_T7lNiqeWgM5YSlL రక్త చరిత్ర (Rakta Charitra) రక్త చరిత్ర సినిమాలో ఓ సీన్‌లో వివేక్‌ ఓబరాయ్‌ రౌడీలందర్నీ ఇంటికి పిలిపిస్తాడు. తన ఏరియాలో ఇకపై ఎవరూ నేరాలు చేయడానికి వీల్లేదని సిగరేట్‌ తాగుతూ చాలా ప్రశాంతంగా వార్నింగ్‌ ఇస్తాడు. ఈ సీన్‌ సినిమాకే హైలేట్‌.  https://youtu.be/Qw7fa7583_0?si=QJXZqptCp4jeYOPm వీరసింహా రెడ్డి (Veera Simha Reddy) గతేడాది సంక్రాంతికి రిలీజైన ఈ చిత్రంలో బాలయ్య ఇంట్రడక్షన్‌ సీన్ మెప్పిస్తుంది. సుమో నుంచి సిగర్‌ తాగుతూ బాలయ్య బయటకు వచ్చే ఫ్యాన్స్‌కు ఎప్పటికీ గుర్తుండిపోతుంది.  https://youtu.be/YUAhLONLVs8?si=hFjdcNcUWR_lw2jP ‘వి’ (V) హీరో నాని (Nani) ఇప్పటివరకూ చేసిన చిత్రాల్లో ది బెస్ట్‌ ఎంట్రీ సీన్‌ ఈ సినిమాలోనే లభించిందని చెప్పవచ్చు. నోటి నుంచి వచ్చే సిగరేట్‌ పొగతో నాని ఇచ్చే క్లాసిక్‌ ఎంట్రీ వాహ్వా అనిపిస్తుంది.  https://youtu.be/hNgs0iFDhik?si=P8rZK2EtBXNk6-Ym కొదమ సింహం (Kodama Simham) ఈ సినిమాలో మెగాస్టార్‌.. కౌబాయ్‌ డ్రెస్‌లో సిగర్‌ తాగుతూ చాలా సీన్లలో కనిపిస్తాడు. ముఖ్యంగా ఓ క్లబ్‌లో సిగర్‌ తాగుతూ కూల్‌గా పేకాట ఆడే సీన్‌ ఫ్యాన్స్‌కు ఎప్పటికీ గుర్తుండిపోతుంది.  https://youtu.be/ldmg-QK0bYM?si=ZNdkNWLUjlMPRQhx
    మార్చి 01 , 2024
    5 YEARS FOR BHARAT ANU NENU: వెండితెరపై CMలుగా బాక్సాఫీస్‌ను షేక్ చేసిన టాలీవుడ్ హీరోలు
    5 YEARS FOR BHARAT ANU NENU: వెండితెరపై CMలుగా బాక్సాఫీస్‌ను షేక్ చేసిన టాలీవుడ్ హీరోలు
    సినీ హీరోలు రాజకీయ నాయకుడి పాత్ర పోషిస్తున్నారంటే జనాలకు ఎక్కువ ఆసక్తి. ఎందుకంటే ఆ ప్రాంతాల్లో ఉన్న పరిస్థితులను ప్రతిబింబించేలా చెప్పే డైలాగులు, సన్నివేశాలు ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటాయి. మహేశ్‌ బాబు లాంటి స్టార్ హీరో ముఖ్యమంత్రి పాత్రలో మెప్పించిన చిత్రం భరత్‌ అనే నేను. ఈ సినిమా వచ్చి ఐదేళ్లు పూర్తయ్యింది. ఈ క్రమంలో వెండితెరపై ఏ హీరోలు ముఖ్యమంత్రి రోల్స్‌ చేశారో ఓ సారీ చూద్దాం. ఒకే ఒక్కడు దర్శకుడు శంకర్‌, అర్జున్ కాంబినేషన్‌లో వచ్చిన చిత్రం ఒకే ఒక్కడు. ఇందులో హీరో అనుకోకుండా ఒక్క రోజు ముఖ్యమంత్రిగా పనిచేస్తాడు. ఉన్న సమయంలోనే ఎన్నో మంచి కార్యక్రమాలు చేసి ప్రజలను మెప్పిస్తాడు. ఈ కోణంలో తెరకెక్కించిన సినిమా అప్పట్లో సంచలన సృష్టించింది. బాక్సాఫీస్‌ వద్ద కలెక్షన్ల వర్షం కురిపించడంతో పాటు 100 రోజులు ఆడింది సినిమా. ఈ కథను మెుదట రజినీకాంత్, కమల్‌ హాసన్‌కు వినిపించినా వాళ్లు బిజీగా ఉండటంతో అర్జున్‌తో తెరకెక్కించినట్లు చెప్పాడు శంకర్.  భరత్‌ అనే నేను పక్కా కమర్షియల్ మాస్ రోల్స్ చేసే మహేశ్‌ బాబు.. భరత్‌ అనే నేను సినిమాలో ముఖ్యమంత్రిగా నటించి మెప్పించాడు. కొరటాల శివ దర్శకత్వం వహించిన ఈ చిత్రం సూపర్ హిట్ కొట్టింది. నేటికి ఐదేళ్లు పూర్తయ్యింది. ఈ పవర్‌ఫుల్‌ రోల్‌లో సూపర్‌ స్టార్‌ చెప్పిన డైలాగ్స్‌ బాగా పేలాయి. చాలామందికి స్ఫూర్తి కలిగించాయి. సినిమాను నిర్మించేందుకు రూ. 65 కోట్లు ఖర్చు చేయగా…రూ. 225 కోట్ల వరకు కలెక్షన్లు సాధించింది. ఇందులో I Don't know అనే పాటను బాలీవుడ్ హీరో ఫర్హాన్ అక్తర్‌ పాడాడు. అంతేకాదు, ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు ముఖ్య అతిథిగా జూనియర్ ఎన్టీఆర్ హాజరయ్యాడు.  లీడర్‌ దగ్గుపాటి రానా ఏకంగా మెుదటి సినిమాతోనే ప్రయోగం చేశాడు. శేఖర్ కమ్ముల దర్శకత్వంలో వచ్చిన లీడర్ చిత్రంలో సీఎం రోల్‌లో మెరిశాడు రానా. ఈ సినిమా విమర్శకుల ప్రశంసలు అందుకుంది. తండ్రి మరణానంతరం సీఎం అయిన కుమారుడు.. అవినీతి నిర్మూలన దిశగా ఎలా అడుగులు వేశాడనే కథతో సినిమా తెరకెక్కించారు. సినిమా కథ దాదాపు వైఎస్‌ రాజశేఖర్ రెడ్డి, జగన్‌కు సంబంధించిలా కనిపిస్తుంది. కానీ, కొద్దిపాటి మార్పులు చేశారని అప్పట్లో టాక్ నడిచింది. రూ. 9 కోట్లతో తెరకెక్కించగా… రూ. 16 కోట్ల వరకు కలెక్షన్లు వచ్చాయి.  నేనే రాజు నేనే మంత్రి విలక్షణ చిత్రాల దర్శకుడు తేజ తెరకెక్కించిన నేనే రాజు నేనే మంత్రి చిత్రంలో రానా మరోసారి రాజకీయ నాయకుడిగా కనిపించాడు. వడ్డీ వ్యాపారిగా జీవితం ప్రారంభించి ఎమ్మెల్యేగా ఎదిగి సీఎంలా ఎలా అయ్యాడనే పవర్‌ఫుల్ కథతో సినిమా తీశారు. రూ. 12 కోట్లతో నిర్మించగా.. రూ. 45 కోట్లు వసూళ్లు చేసింది. సినిమా కథను చెప్పేందుకు వెళ్లినప్పుడు జరిగిన ఆసక్తికర విషయాన్ని తేజ పంచుకున్నాడు. కథలో మార్పులు చేయమంటే ఇటే వెళ్లిపోతానని డోర్ దగ్గర నిల్చుని చెప్పినట్లు వెల్లడించాడు. నోటా  పెళ్లి చూపులు, అర్జున్ రెడ్డి వంటి ప్రేమకథా చిత్రాల్లో నటించిన విజయ్ దేవరకొండ…కెరీర్ తొలి నాళ్లలోనే ముఖ్యమంత్రి పాత్రలో నటించాడు. నోటా సినిమా ద్వారా సీఎంగా తన నటనను చూపించాడు. అయితే, సినిమా పెద్దగా ఆడలేదు. కానీ, రూ. 12 కోట్లతో నిర్మించామని.. రూ. 25 కోట్లు వసూళ్లు సాధించామని నిర్మాత చెప్పారు. వెట్టాట్టమ్ అనే నవల ఆధారంగా చిత్రాన్ని రూపొందించారు.  కథానాయకుడు ఎన్టీఆర్ బయోపిక్ ఆధారంగా క్రిష్ దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా కథానాయకుడు. ఇందులో బాలకృష్ణ సీఎంగా కనిపించారు. నిజ జీవితంలో నందమూరి తారకరామ రావు ముఖ్యమంత్రి జీవితంలో జరిగిన సంఘటనల్లో అచ్చుగుద్దినట్లుగా నటించారు. కానీ, సినిమాకు ఆశించిన స్థాయిలో ఆదరణ లభించలేదు. రూ.50 కోట్లు పెట్టి తీశారు. రూ. 70. కోట్లు వచ్చాయి. బాలకృష్ణ సహానిర్మాతగా వ్యవహరించారు.  యాత్ర మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖర్ రెడ్డి జీవిత చరిత్ర ఆధారంగా రూపొందించిన చిత్రం యాత్ర. మళయాలం నటుడు మమ్ముట్టి ఇందులో లీడ్‌ రోల్‌ పోషించాడు. వైఎస్ పాదయాత్ర, పథకాల ఆలోచనకు మూలం ఏంటి? సీఎంగా ఎలాంటి పనులు చేశారు? ఇలా వివిధ అంశాలను ప్రస్తావిస్తూ తీర్చిదిద్దారు. వైఎస్ క్యారెక్టర్‌లో మమ్ముట్టి జీవించారు. ఆయన నటకు మంచి మార్కులు పడ్డాయి. రూ. 12 కోట్లు పెట్టి తీస్తే ఏకంగా రూ. 40 కోట్ల వసూళ్లు సాధించింది. 
    ఏప్రిల్ 20 , 2023
    Sai Pallavi In Bollywood: ఆమిర్ ఖాన్ కొడుకుతో  సాయి పల్లవి రొమాన్స్!
    Sai Pallavi In Bollywood: ఆమిర్ ఖాన్ కొడుకుతో  సాయి పల్లవి రొమాన్స్!
    స్టార్ హీరోయిన్ సాయి పల్లవి బాలీవుడ్ ఎంట్రీ కన్ఫామ్ అయింది. ఇన్నాళ్లు దక్షిణాది సినిమాలకే పరిమితమైన ఈ హైబ్రిడ్ పిల్ల.. బాలీవుడ్‌కు దారులు తెరిచింది. బాలీవుడ్ విలక్షణ నటుడు ఆమిర్ ఖాన్ కుమారుడు జునైద్ ఖాన్‌తో నటించనున్నట్లు తెలిసింది. ఈ సినిమాను సునీల్ పాండే డైరెక్ట్ చేయనున్నారు. పాన్ ఇండియా సినిమాల ప్రభావంతో భారత చిత్ర పరిశ్రమ ఏకమైంది. సౌత్ నార్త్ తేడా లేకుండా హీరో, హీరోయిన్లు అక్కడా ఇక్కడా నటిస్తున్నారు. ఇన్నాళ్లు హిందీ సినిమాల గురించి పెద్దగా పట్టించుకోని దక్షిణాది హీరోయిన్లు ఒక్కొక్కరుగా బాలీవుడ్ బాట పడుతున్నారు. ఫ్యామిలీ మ్యాన్ 2 వెబ్‌సిరీస్‌ ద్వారా తనలోని బోల్డ్ యాంగిల్‌ను సమంత చూపించి అక్కడ క్లిక్ అయింది.  పుష్ప క్రేజ్‌తో రష్మిక ఒక్కసారిగా నేషనల్ క్రష్‌గా మారింది. ఇప్పటికే పలు బాలీవుడ్ ప్రాజెక్టులపై ఆమె సైన్ చేసింది. తాజాగా ఈ లిస్ట్‌లోకి సాయి పల్లవి కూడా చేరిపోయింది.  టాలీవుడ్‌లో విరాటపర్వం తర్వాత సాయి పల్లవికి అవకాశాలు సన్నగిల్లిపోయాయి. ఆ చిత్రంలో ఆమె నటనకు విమర్శకుల నుంచి ప్రశంసలు అందాయి. కానీ ఆ చిత్రం బాక్సాఫీస్‌ వద్ద బోల్తా పడింది. భోళాశంకర్‌లో చిరంజీవి చెల్లెలుగా నటించే అవకాశం వచ్చినా.. ఈ ముద్దుగుమ్మ తిరస్కరించింది. నటనకు ప్రాధాన్యం ఉన్న పాత్రలనే చేస్తానని అప్పట్లో బాహాటంగానే చెప్పింది. గ్లామర్ షోలకు తాను దూరంగా ఉంటానని చెప్పుకొచ్చింది. కథల ఎంపికలో జాగ్రత్తలు పాటింటే సాయి పల్లవి.. మరి బాలీవుడ్‌లో ఏలాంటి కంటెంట్‌కు ఓకే చెప్పిందో అంటూ పలువురు చర్చించుకుంటున్నారు. బాలీవుడ్ అంటేనే గ్లామర్ షోకు పెద్ద పీట వేస్తుంది. మరి సాయి పల్లవి మడి కట్టుకోకుండా అందాల ఘాటు పెంచుతుందా? లేక దక్షిణాదిలో నటనకు ప్రాధాన్యం ఉన్న పాత్రల్లోనే నటిస్తుందా? అనేది తెలియాల్సి ఉంది.  ఆమిర్ ఖాన్‌ కొడుకు జునైద్ ఖాన్‌తో సాయిపల్లవి చేసే సినిమా మంచి లవ్ స్టోరీగా సునీల్ పాండే తెరకెక్కించనున్నట్లు సమాచారం. ఈ చిత్రంలో హీరోయిన్ క్యారెక్టర్‌కు ఇంపార్టెన్స్ ఉండటంతో  సాయి పల్లవి కథ వినగానే ఓకే చెప్పిసిందని టాక్. ఈ చిత్రం ఆమిర్ ఖాన్ రేంజ్‌కు తగ్గట్టుగా భారీ బడ్జెట్‌తో నిర్మించనున్నట్లు తెలిసింది. ఇప్పటికే ప్రీ ప్రొడక్షన్ పనులను చిత్ర యూనిట్ ప్రారంభించింది. త్వరలోనే ఈ సినిమా సెట్స్‌ పైకి వెళ్లనుంది. ప్రస్తుతం జునైద్ ఖాన్ యాశ్ రాజ్ ఫిల్మ్స్‌ నిర్మాణంలో వస్తున్న మహారాజా అనే చిత్రంలో నటిస్తున్నాడు. ఇదే జునైద్‌ ఖాన్‌కు ఫస్ట్ సినిమా. ఈ సినిమా రొమాంటిక్ డ్రామాగా తెరకెక్కుతోంది. ఈ చిత్రంలో అర్జున్ రెడ్డి ఫేమ్ షాలిని పాండే హీరోయిన్‌గా నటిస్తోంది.  తొలి సినిమా రిలీజ్‌ కాకముందే బాలీవుడ్‌లో లవర్‌ బాయ్‌గా స్థిరపడేందుకు సాయి పల్లవితో మరో లవ్ స్టోరీకి జునైద్ ఖాన్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. మరి ఈ సినిమా ఎలా ఉండబోతుందో అన్న ఆసక్తి అటు బాలీవుడ్ ఇటు టాలీవుడ్ వర్గాల్లో నెలకొంది.
    సెప్టెంబర్ 14 , 2023
    Top 5 Upcoming Movies in 2023: రూ.500 కోట్ల వసూళ్లపై కన్నేసిన సినిమాలు.. బాక్సాఫీస్ షేక్ కావాల్సిందేనా..!  
    Top 5 Upcoming Movies in 2023: రూ.500 కోట్ల వసూళ్లపై కన్నేసిన సినిమాలు.. బాక్సాఫీస్ షేక్ కావాల్సిందేనా..!  
    ‘వంద కోట్లు కొల్లగొట్టిన సినిమా రా అది’ అని జనరల్‌గా మాట్లాడుకుంటుంటాం. సినిమా విజయం సాధించిందని చెప్పడానికి కలెక్షన్లు ఒక ప్రామాణికత. ఏ సినిమాకు ఎన్ని కోట్లు వచ్చాయ్? వసూళ్లెంత? అనే డిస్కషన్ ఎప్పుడూ నడుస్తూనే ఉంటుంది. కలెక్షన్ల కౌంట్ ఎగబాకిన కొద్దీ సినిమా సక్సెస్ స్థాయి పెరుగుతుంది. ప్రతి ఇండస్ట్రీలోనూ ఇదే సంప్రదాయం ఉంటుంది. ఎన్నో సినిమాలు హిట్టవుతాయి. కానీ, కొన్నే ల్యాండ్‌మార్క్ వసూళ్లను అందుకుంటాయి. రానున్న సినిమాలపై కూడా ఈ అంచనాలు ఏర్పడుతున్నాయి. మరి, ఈ ఏడాది రూ.500 కోట్లకు పైగా కలెక్షన్లను వసూలు చేయగల సినిమాలేంటో చూద్దాం.  జవాన్(JAWAN) షారూక్ ఖాన్, విజయ్ సేతుపతి, దీపిక పదుకొణె, నయనతార.. ఇలా ప్రధాన తారాగణం నటించిన సినిమా ఇది. క్రియేటివ్ డైరెక్టర్ అట్లీ ఈ సినిమాను తెరకెక్కించాడు. సెప్టెంబర్‌ 7న సినిమా రిలీజ్ కానుంది. ఇప్పటికే విడుదలైన ట్రైలర్.. చిత్రంపై భారీ హైప్‌ని క్రియేట్ చేసింది. షారూక్ ఖాన్‌ని గుండుతో చూపించడం ప్రత్యేక ఆసక్తిని రేకెత్తిస్తోంది. తెలుగు, తమిళ, హిందీ, మళయాల, కన్నడ భాషల్లో సినిమా రిలీజ్ కానుంది. నటీనటుల మార్కెట్‌, కంటెంట్‌ని బట్టి ఈ సినిమా రూ.500 కోట్ల పైచిలుకు వసూళ్లను సాధించగలదని ట్రేడ్ పండితులు అంచనా వేస్తున్నారు.  https://www.youtube.com/watch?v=k8YiqM0Y-78 సలార్(SALAAR) మోస్ట్ ఆంటిసిపేటెడ్ మూవీగా ప్రభాస్ సలార్‌ తరచూ వార్తల్లో నిలుస్తోంది. కేజీఎఫ్ సిరీస్ అనంతరం, ప్రశాంత్ నీల్ డైరెక్ట్ చేస్తుండటంతో భారీ హైప్ క్రియేట్ అయ్యింది. పైగా, సినిమాలోని నటీనటులు మూవీ గురించి గొప్పగా చెబుతుండటం మరింత ఆసక్తిని పెంచింది. కేజీఎఫ్2కి, దీనికి లింక్ ఉన్నట్లు టీజర్‌లో స్పష్టంగా కనిపించింది. ఫ్రెండ్‌షిప్ సెంటిమెంట్‌తో సినిమా వస్తోంది. రెండు పార్ట్‌లుగా వస్తున్న ఈ మూవీకి హొంబలే ఫిల్మ్ భారీగానే ఖర్చు చేస్తోంది. సెప్టెంబర్ 28న రిలీజ్ అవుతున్న ఈ సినిమా కూడా రూ.500 కోట్లకు పైగా కలెక్షన్లపై కన్నేసింది. సినిమా టాక్ బాగుంటే ప్రభాస్ మార్కెట్‌కి ఇది సాధ్యమే.  https://www.youtube.com/watch?v=bUR_FKt7Iso లియో(LEO) ‘విక్రమ్’ మూవీ బ్లాక్‌బస్టర్ అనంతరం లోకేష్ కనగరాజ్ తీస్తున్న చిత్రమే ‘లియో’. దళపతి విజయ్ నటిస్తున్నాడు. లోకేష్ కనగరాజ్ యూనివర్స్‌లో భాగంగా ఈ మూవీ తెరకెక్కుతోంది. దసరా కానుకగా అక్టోబర్ 18న సినిమా విడుదల కానుంది. ఇప్పటికే ప్రీ రిలీజ్ బిజినెస్ భారీగా జరిగింది. తెలుగు రాష్ట్రాల్లో థియేట్రికల్ హక్కులను ‘సితార ఎంటర్‌టైన్‌మెంట్స్’ సొంతం చేసుకుంది. రూ.20 కోట్లకు దీనిని దక్కించుకున్నట్లు టాక్. దీంతో విడుదలకు ముందే సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. కమల్ హాసన్ ఇందులో కనిపించనున్నారట. LEO - Bloody Sweet Promo | Thalapathy Vijay | Lokesh Kanagaraj | Anirudh యానిమల్(ANIMAL) రణ్‌బీర్ కపూర్ కెరీర్‌లోనే మోస్ట్ వైలెంట్ సినిమాగా ఇది తెరకెక్కుతోంది. ‘అర్జున్ రెడ్డి’ ఫేమ్ సందీప్ రెడ్డి వంగా ఈ మూవీని డైరెక్ట్ చేస్తున్నాడు. సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. ఇప్పటికే విడుదల చేసిన గ్లింప్స్ సినిమా ఎలా ఉండబోతోందో రుచి చూపించింది. ఈ మూవీ కూడా 5 భాషల్లో విడుదల అవుతోంది. తొలుత ఆగస్టు 11న విడుదల చేయాలని భావించినా కొన్ని కారణాలతో సినిమా రిలీజ్ ఈ ఏడాది డిసెంబర్‌ 1కి వాయిదా పడింది. రష్మిక మందన్న హీరోయిన్‌గా నటిస్తోంది.  https://www.youtube.com/watch?v=EywX_uxreYA డంకీ(DUNKI) రాజ్ కుమార్ హిరాణీ సినిమాల గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. 3 ఇడియట్స్, మున్నాభాయ్ ఎంబీబీఎస్, పీకే, సంజూ వంటి సినిమాలను తీశాడు. యూనిక్ కంటెంట్‌తో ప్రేక్షకులను అలరించగలడు. ఇప్పుడు షారూక్ ఖాన్‌ని ‘డంకీ’(DUNKI)గా చూపించబోతున్నాడు. పూర్తి కామెడీ చిత్రంగా రాజ్‌కుమార్ హిరాణీ ఈ మూవీని తెరకెక్కిస్తున్నాడు. తాప్సీ పన్ను హీరోయిన్‌గా నటిస్తోంది. సినిమాను డిసెంబర్ 22న విడుదల చేయనున్నారు. ఈ మూవీ సైతం రూ.500 కోట్లకు పైగా వసూళ్లపై కన్నేసింది.  https://www.youtube.com/watch?v=aNxd01VzJsw&t=1s
    ఆగస్టు 10 , 2023
    Tollywood Trend: తెలంగాణం పెట్టు.. బ్లాక్‌బస్టర్‌ కొట్టు! 
    Tollywood Trend: తెలంగాణం పెట్టు.. బ్లాక్‌బస్టర్‌ కొట్టు! 
    టాలివుడ్‌ ట్రెండ్‌ మారుతోంది. ఒకప్పుడు కామెడీ పాత్రలు, విలన్‌ రోల్స్‌కు మాత్రమే పరిమితమైన తెలంగాణ భాష, యాస ఇప్పుడు లీడ్‌ రోల్స్‌కు చేరింది. తెలంగాణ సంస్కృతి, యాస ఉంటే చిన్న సినిమాలు కూడా బ్లాక్‌బస్టర్లు అవుతున్నాయి. భారీ సినిమాలో పాత్రలకు తెలంగాణ పల్లె యాస ఉందంటే సెన్సేషనల్‌ అవుతోంది. స్టార్‌ హీరోలు సైతం సినిమాలోనే గాక వేదికలపై తెలంగాణ యాసలో మాట్లాడుతున్నారు. తెలంగాణ యాస, కట్టూ, బొట్టూ  వెండితెరపై వెలుగులీనుతున్నాయి. బలం చూపిన ‘బలగం’ వెండితెరపై తెలంగాణం చేసే అద్భుతాన్ని ఇటీవల చూపించిన సినిమా ‘బలగం’. వేణు ఎల్దండి దర్శకత్వంలో ప్రియదర్శి ప్రధాన పాత్రలో తెరెకెక్కిన ఈ సినిమా బాక్సాఫీస్‌ వద్ద సంచలనం సృష్టించింది. తెలంగాణ పల్లెల్లో అంత్యక్రియల సంస్కృతి, పరిస్థితులు కళ్లకు కట్టినట్లు అత్యంత భావోద్వేగంగా చూపించారు. అంతర్జాతీయ వేదికపైనా సత్తా చాటింది. లాస్‌ ఏంజెల్స్‌ సినిమాటోగ్రఫీ అవార్డ్స్‌లో రెండు అవార్డులు సొంతం చేసుకుంది. గుండు గుత్తగా బాక్సాఫీస్ కొల్లగొట్టిన ‘దసరా’ శ్రీకాంత్‌ ఓదెల దర్శకత్వంలో నాని, కీర్తి సురేశ్‌ ప్రధాన పాత్రల్లో మార్చి 30న విడుదలైన దసరా బాక్సాఫీస్‌పై దండయాత్ర కొనసాగిస్తోంది. నాని కెరీర్‌లోనే ఎన్నడూ లేనంతగా… తొలిరోజే రూ.38 కోట్లు వసూలు చేసి  ఈ సినిమా సంచలనం సృష్టించింది. సింగరేణి బొగ్గు గనుల్లో ఒక్కప్పుడు ఉన్న పరిస్థితులను శ్రీకాంత్‌ ఓదెల వెండితెరపై కళ్లకు గట్టాడు. తెలంగాణ భాష పరిమళంతో  బ్లాక్‌బస్టర్‌ను కొట్టాడు. చిన్న సినిమాలతో మొదలై.. అప్పట్లో వెకిలి పాత్రలకే పరిమితమై తెలంగాణ యాసను పూర్తి స్థాయిలో సినిమాలో చూపించడం చిన్న సినిమాలతోనే మొదలైంది. విజయ్‌ దేవరకొండ హీరోగా తరుణ్ భాస్కర్‌ తెరకెక్కించిన ‘పెళ్లి చూపులు’ ఎంత ఘన విజయం సాధించిందో తెలిసిందే. అందులో తెలంగాణ యాసలోనే మాట్లాడిన విజయ్‌… బయట కూడా అదే తీరుతో అందరి మనసులూ ఆకట్టుకున్నాడు. ప్రియదర్శి కూడా ఆ సినిమాలో మెప్పించాడు. ఆ తర్వాత ‘అర్జున్ రెడ్డి’ సృష్టించిన సంచలనం అందరికీ తెలిసిందే. ఇండియన్‌ సినిమాలోనే ఓ నయా ట్రెండ్‌కు ‘అర్జున్‌ రెడ్డి’ తెరలేపింది. ఇలా తెలంగాణ యాస, సంస్కృతితో హిట్ కొట్టిన టాప్‌ మూవీస్‌ చాలానే ఉన్నాయి. ఫిదా లేడీ సూపర్‌ స్టార్‌ సాయి పల్లవి హీరోయిన్‌గా వరుణ్‌ తేజ్‌ హీరోగా శేఖర్‌ కమ్ముల తెరకెక్కించిన సినిమా ‘ఫిదా’. సినిమా షూటింగ్‌ మొదలుకుని టైటిల్‌ దాకా అంతా తెలంగాణమే. తెలంగాణ యాసలోనే రాసిన ‘వచ్చిండే’ పాట మొత్తం యూట్యూబ్‌నే షేక్‌ చేసింది. తెలంగాణ ప్రకృతి సౌందర్యాన్ని, పల్లెల అందాన్ని తెరమీద ఆవిష్కరించిన సినిమా ఇది. తొలుత ఈ సినిమాకు ‘ ముసురు’ అనే టైటిల్‌ అనుకున్నారట. ఈ నగరానికి ఏమైంది? పెళ్లి చూపులు తర్వాత తరుణ్‌ భాస్కర్‌ తెరకెక్కించిన ఈ సినిమా ఓ నూతన ఒరవడికి శ్రీకారం చుట్టిందనే చెప్పాలి. పక్కా హైదరాబాదీ కుర్రాళ్లు నలుగురిని తీసుకుని సింపుల్‌గా ఉండే ఈ సినిమా థియేటర్లలో నవ్వుల పువ్వులు పూయించింది. విశ్వక్‌ సేన్‌, అభినవ్‌ పాత్రలు చాలా అద్భుతంగా పండాయి. డీజే టిల్లు 2022లో వచ్చిన డీజే టిల్లు గురించి అయితే అందరికీ తెలిసిందే. సిద్ధు జొన్నలగడ్డను స్టార్‌ను చేసింది. ఇందులో ప్రతి డైలాగ్‌ అదిరిపోయాయి. విమల్‌ కృష్ణ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా రెండో పార్ట్‌ కూడా త్వరలోనే రాబోతోంది. మల్లేశం ఆసుయంత్రం కనిపెట్టిన చింతకింది మల్లేశం జీవితం ఆధారంగా తెరకెక్కిన ‘మల్లేశం’ సినిమాలో ప్రియదర్శి తెలంగాణ మాండలికాన్ని మనసుకు హత్తుకునేలా పలికించాడు. చేనేతల జీవన స్థితిగతులను వెండితెరపై అద్భుతంగా ఆవిష్కరించిన సినిమా ఇది. లవ్‌ స్టోరీ శేఖర్‌ కమ్ముల తెరకెక్కించిన మరో సినిమా ‘లవ్‌ స్టోరీ’. తెలంగాణ పల్లెటూరి పేదోళ్ల పరిస్థితితో పాటు కొన్ని సున్నితమైన విషయాలను స్పృశిస్తూనే శేఖర్ కమ్ముల మరోసారి  తెలంగాణ పరిమళాన్నివెండితెరపై వెలుగులీనేలా చేశాడు. ఇస్మార్ట్ శంకర్‌ పూరి జగన్నాథ్‌, రామ్‌ పోతినేని కాంబినేషన్‌లో వచ్చిన ఇస్మార్ట్‌ శంకర్‌ పూరీకి కమ్‌బ్యాక్‌ మూవీ అయ్యింది. రామ్‌ తెలంగాణ మాండలికంలో అదరగొట్టాడు. వరంగల్‌ పిల్లగా హీరోయిన్‌ నభా నటేశ్‌ అమితంగా ఆకట్టుకుంది. విరాట పర్వం నక్సలిజం ఉన్నప్పుడు తెలంగాణలో ఉన్న పరిస్థితులను కళ్లకు కట్టిన సినిమా ‘విరాటపర్వం’. రానా, సాయిపల్లవి ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా కూడా విమర్శకుల ప్రసంసలు అందుకుంది. NBK108లోనూ.. నందమూరి నట సింహం బాలయ్య, అనిల్ రావుపూడి కాంబినేషన్‌లో వస్తున్న NBK108లోనూ.. తెలంగాణ సంస్కృతినే కథ నేపథ్యంగా తీసుకున్నట్లు తెలిసింది. ఈసారి తెలంగాణ యాసలో బాలయ్య అలరించనున్నారు. ఆస్కార్‌ స్థాయికి పెద్ద సినిమాలు, పెద్ద హీరోలు కూడా తెలంగాణ యాసలో పలుకుతున్నారంటే తెలుగు సినిమా ట్రెండ్‌ ఎలా మారుతుందో తెలుస్తోంది. అంతర్జాతీయంగా సంచలనం సృష్టించిన RRRలో ఎన్టీఆర్‌ తెలంగాణ యాసలోనే మాట్లాడతాడు. ఆస్కార్ సాధించిన ‘నాటు నాటు’ సాహిత్యం కూడా తెలంగాణమే. ‘ఎర్రజొన్న రొట్టెలోన మిరపతొక్కు కలిపినట్టు’ అంటూ చంద్రబోస్‌ తెలంగాణ జీవన విధానాన్ని చెప్పాడు. ఒకప్పుడు ‘తొక్కు’ అంటేనే వెక్కిరించి చూసే స్థాయి నుంచి అదే మాటతో ఉన్న పాటకు ఆస్కార్‌ వచ్చే స్థాయికి తెలంగాణం తెలుగు సినిమాలో చేరింది. నాటు నాటు మాత్రమే కాదు ఇటీవల తెలుగు సినిమాలో తెలంగాణ సాహిత్యానికి ప్రాధాన్యత పెరిగిందనే చెప్పాలి. ‘బలగం’లో కన్నీరు పెట్టించిన పాటలన్నీ కాసర్ల శ్యామ్ రాసినవే. కాసర్ల శ్యామ్‌ ఇప్పుడు టాప్‌ లిరిసిస్ట్‌గా ఎదుగుతున్నాడంటే మన యాసకు పెరుగుతున్న ప్రాధాన్యతే.
    ఏప్రిల్ 01 , 2023
    Most Powerful Hero Roles in Telugu: ఈ సినిమాల్లో హీరో పాత్రలు ఉంటాయి భయ్యా.. నెవర్‌బీఫోర్ అంతే!
    Most Powerful Hero Roles in Telugu: ఈ సినిమాల్లో హీరో పాత్రలు ఉంటాయి భయ్యా.. నెవర్‌బీఫోర్ అంతే!
    సాధారణంగా ప్రతీ సినిమాకు హీరో పాత్రనే కీలకం. కథానాయకుడి క్యారెక్టరైజేషన్‌పైనే దాదాపుగా ఆ సినిమా ఫలితం ఆధారపడుతూ ఉంటుంది. హీరో రోల్‌ ఎంత పవర్‌ఫుల్‌గా ఉంటే ఆ సినిమా సక్సెస్‌ రేట్ అంతగా పెరుగుతుంది. ఎందుకంటే తమ హీరోను చాలా అగ్రెసివ్‌గా, దృఢంగా చూసేందుకే ఫ్యాన్స్ ఇష్టపడుతుంటారు. అయితే టాలీవుడ్‌లో ఇప్పటివరకూ కొన్ని వందల చిత్రాలు రిలీజు కాగా బలమైన ఇంటెన్సిటీ ఉన్న హీరో పాత్రలు కొన్నే వచ్చాయి. ఇంతకీ ఆ  పవర్‌ఫుల్‌ హీరో పాత్రలు ఏవి? అందులో నటించిన స్టార్‌ హీరోలు ఎవరు? ఈ ప్రత్యేక కథనంలో చూద్దాం.  బాహుబలి (Baahubali) బాహుబలిలో ప్రభాస్‌ పాత్ర చాలా పవర్‌ఫుల్‌గా ఉంటుంది. యుద్ధరంగంలోకి దిగితే శత్రువులకు ఇక చుక్కలే అన్నట్లు ఆ రోల్‌ ఉంటుంది. ముఖ్యంగా కాలకేయతో యుద్ధం, బాహుబలి 2 క్లైమాక్స్ సీన్స్‌లో ప్రభాస్‌ చాలా అద్భుతంగా చేశాడు.  https://youtu.be/mRAi0lTRiMc?si=tIPOoBp8Tq_SjknN శివ (Siva) హీరో అక్కినేని నాగార్జున (Akkineni Nagarjuna) ఈ సినిమాలో చాలా ఇంటెన్సిటీతో కనిపిస్తాడు. కాలేజీ స్టూడెంట్‌గా క్లాస్‌గా కనిపిస్తూనే రౌడీలకు తన విశ్వరూపం చూపిస్తాడు. ముఖ్యంగా ఆ సైకిల్‌ చైన్‌ తెంపే సీన్‌ ఇప్పటికీ చాలా ఫేమస్‌.  https://youtu.be/jqwh3PgW4dE?si=eSViXQpf7DJ6SW4g ఆర్ఆర్‌ఆర్‌ (RRR) ఆర్‌ఆర్‌ఆర్‌ సినిమాలో రామ్‌చరణ్‌(Ram Charan) పాత్రను దర్శకధీరుడు రాజమౌళి అద్భుతంగా తీర్చిదిద్దాడు. ముఖ్యంగా చరణ్‌ ఇంట్రడక్షన్‌ సీన్‌ ప్రతీ ఒక్కరికీ గూస్‌బంప్స్‌ తెప్పిస్తుంది. వందలాది మంది ఆందోళన కారుల్ని రామ్‌చరణ్‌ ఒక్కడే కంట్రోల్ చేస్తాడు. అలాగే క్లైమాక్స్‌లోనూ బ్రిటిష్‌ వారిపై విశ్వరూపం చూపిస్తాడు.  https://www.youtube.com/watch?si=-3losZAoAU0zUG-2&v=Y8rREdo1LqU&feature=youtu.be సలార్‌ (Salaar) ఇందులో హీరో ప్రభాస్‌ (Prabhas) తన కటౌట్‌కు తగ్గ యాక్షన్ సీక్వెన్స్‌తో ఫ్యాన్స్‌ను ఊర్రూతలుగించాడు. బాహుబలి తర్వాత ఆ స్థాయి ఇంటెన్సిటీ ఉన్న పాత్రలో డార్లింగ్ అలరించాడు. ఇంటర్వెల్‌ ఫైట్‌, కాటేరమ్మ ఫైట్‌, క్లైమాక్స్ యాక్షన్‌ సీన్స్‌లో ప్రభాస్‌ దుమ్మురేపాడు.  https://youtu.be/aniqM3iKskM?si=aAVsDePkCn0z8IID యానిమల్‌ (Animal) అర్జున్‌ రెడ్డి ఫేమ్‌ సందీప్‌ రెడ్డి వంగా (Sandeep Reddy Vanga) ఈ సినిమాను చాలా వైలెంట్‌గా తెరకెక్కించాడు. బాలీవుడ్‌ స్టార్ రణ్‌బీర్‌ కపూర్‌ (Ranbir Kapoor) తన కెరీర్‌లోనే ఇలాంటి పవర్‌ఫుల్‌ పాత్రను పోషించలేదు. తన తండ్రిని చంపేందుకు యత్నించిన వారిపై రణ్‌బీర్‌ రీవెంజ్‌ తీర్చుకునే విధానం చాలా క్రూరంగా ఉంటుంది.  https://youtu.be/6DfaBq2rVoE?si=tZXe7295t9MYMmit సింహాద్రి (Simhadri) ఈ సినిమాలో ఒక డిఫరెంట్‌ ఎన్టీఆర్‌ను చూడవచ్చు. అంతకుముందు ‘ఆది’లో ఫ్యాక్షనిస్టుగా కనిపించినప్పటికీ సింహాద్రిలో దానికంటే పవర్‌ఫుల్‌గా తారక్‌ రోల్ ఉంటుంది. ముఖ్యంగా ఇంట్రవెల్‌కు ముందు వచ్చే ఫైటింగ్‌ సీన్‌ అదరహో అనిపిస్తాయి. కేరళలో నడిరోడ్డుపై రౌడీలను నరికేసే సీన్‌ విజిల్స్ వేయిస్తాయి.  https://youtu.be/u0PlQ1J6EHo?si=9Rqa8abQvN1jzYRS విక్రమార్కుడు (Vikramarkudu) స్టార్‌ హీరో రవితేజను ఈ సినిమాలో చూసినంత అగ్రెసివ్‌గా ఎందులోనూ చూసి ఉండరు. ముఖ్యంగా విక్రమ్‌ రాథోడ్‌ పాత్రలో పరకాయ ప్రవేశం చేసి మరి నటించాడు. ఇంట్రవెల్‌కు ముందు వచ్చే ఫైట్‌ సీన్‌ మాత్రం నెవర్‌ బీఫోర్‌ అన్నట్లుగా ఉంటుంది.  https://youtu.be/G3ojv3yp03s?si=O1YYFEFiPUm53_WY కర్తవ్యం (Karthavyam) టాలీవుడ్‌లో పవర్‌ఫుల్‌ ఫీమేల్‌ పాత్ర అనగానే ముందుగా కర్తవ్యంలో విజయశాంతి (Vijayashanti)  చేసిన రోల్‌ గుర్తుకు వస్తుంది. ఇందులో లేడీ శివంగిలా ఆమె నటించింది. పవర్‌ఫుల్‌ పోలీసు ఆఫీసర్‌ పాత్రలో నేరస్తులకు చుక్కలు చూపిస్తుంది.  https://youtu.be/8mnwQLH4Src?si=Ukzv6Q6IZYQmSChg అంకుశం (Ankusam) హీరో రాజశేఖర్‌ సూపర్‌ హిట్‌ సినిమా అనగానే ముందుగా ‘అంకుశం’ మూవీనే మదిలో ప్రత్యక్షమవుతుంది. ఇందులో నిజాయతీ గల పోలీసు అధికారిగా అతడు కనిపించాడు. నేరస్తులపై ఉక్కుపాదం మోపి అలరించాడు.  https://youtu.be/BQW-c1yEpoc?si=X3IFaKaJ7BFjJgA_ గ్యాంగ్ లీడర్ (Gang Leader) మెగాస్టార్‌ చిరు (Chiranjeevi)ను మాస్ ఆడియన్స్‌కు మరింత దగ్గర చేసిన చిత్రం ‘గ్యాంగ్‌ లీడర్‌’. ఇందులో చిరు పాత్ర చాలా రఫ్‌గా ఉంటుంది. ‘చేయి చూడు ఎంత రఫ్‌గా ఉందో రఫ్పాడించేస్తా’ అన్న డైలాగ్‌ ఈ సినిమా ద్వారా చాలా ఫేమస్‌ అయ్యింది.  https://youtu.be/g1ajziOPdJ8?si=BeDHUUGnDRNZfT2C అర్జున్ రెడ్డి (Arjun Reddy) యంగ్‌ హీరో విజయ్‌ దేవరకొండ (Vijay Devarakonda) కెరీర్‌ను మలుపు తిప్పిన చిత్రం ‘అర్జున్‌ రెడ్డి’. ఇందులో విజయ్ చాలా అగ్రెసివ్‌గా కనిపిస్తాడు. ప్రేమించిన అమ్మాయి కోసం ఎంత దూరమైన వెళ్లే ప్రియుడిగా అదరగొట్టాడు. ఈ పాత్రకు యూత్‌ చాలా బాగా కనెక్ట్‌ అయ్యారు. అందుకే ఈ సినిమా చాలా పెద్ద హిట్‌ అయ్యింది.  https://youtu.be/tdQWGkTiWd4?si=EFo1pe0NlqpTEP0J ఇస్మార్ట్‌ శంకర్‌ (Ismart Shankar) టాలీవుడ్‌లోని క్లాసిక్‌ హీరోగా ‘రామ్‌ పోతినేని’ (Ram Pothineni)కి పేరుంది. అటువంటి రామ్‌ను కూడా ఇస్మార్ట్‌ శంకర్‌ (Ismart Shankar) ద్వారా చాలా వైలెంట్‌గా చూపించాడు దర్శకుడు పూరి జగన్నాథ్‌ (Puri Jagannadh). ఈ సినిమా కోసం రామ్‌ తొలిసారి సిక్స్‌ ప్యాక్‌ చేయడం విశేషం.  https://youtu.be/xYb2-OLUQ-U?si=gAXIB9okHto4iH1a పోకిరి (Pokiri) ఎక్కువగా కుటుంబ కథా చిత్రాల్లో కనిపించే మహేష్‌ బాబు (Mahesh Babu).. పోకిరి (Pokiri) సినిమాతో వచ్చి అప్పట్లో అందర్ని సర్‌ప్రైజ్‌ చేశాడు. సినిమాలో చాలా వరకూ గ్యాంగ్‌స్టర్‌గా కనిపించి విలన్లను ఏరివేస్తాడు. క్లైమాక్స్‌తో అతడు పోలీసు అని తెలియడంతో ఆడియన్స్‌ సర్‌ప్రైజ్‌ అవుతారు. ఈ తరహా పాత్ర టాలీవుడ్‌లో ఎప్పుడు రాలేదు.  https://youtu.be/KzQOoyoAGKo?si=5IhFm-wK-PYeIneq
    మార్చి 28 , 2024
    Tollywood Cult  Movies: శివ To దసరా.. తెలుగు ప్రేక్షకుడ్ని మీసం మెలేసేలా చేసిన సినిమాలు ఇవే! 
    Tollywood Cult  Movies: శివ To దసరా.. తెలుగు ప్రేక్షకుడ్ని మీసం మెలేసేలా చేసిన సినిమాలు ఇవే! 
    ఒకప్పుడు టాలీవుడ్‌ అంటే దేశంలోని సినీ ఇండస్ట్రీలలో ఒకటిగా ఉండేది. తెలుగు సినిమాలంటే నార్త్‌ ఇండియన్స్‌ పెద్దగా ఆసక్తి చూపేవారు కాదు. మన డైరెక్టర్లు కూడా కేవలం సరిహద్దులు గీసుకొని కేవలం తెలుగు ఆడియన్స్‌ కోసమే సినిమా రిలీజ్‌ చేసేవారు. కానీ ఇప్పుడు పరిస్థితి పూర్తిగా మారిపోయింది. జాతీయ అవార్డు ఫంక్షన్లకు ఆహ్వానం లభించని స్టేజీ నుంచి ఆస్కార్‌ వేడుకల్లో పాల్గొనే స్థాయికి మన డైరెక్టర్లు ఎదిగారు. అంతర్జాతీయ బహుమతులను దేశానికి అందిస్తూ ప్రతీ ఒక్కరినీ గర్వపడేలా చేస్తున్నారు. ఇదిలా ఉంటే 1990 నుంచి ఇవాళ్టి దసరా వరకూ ఎన్నో కల్ట్‌ సినిమాలు టాలీవుడ్‌ గతిని మార్చాయి. తెలుగు ఇండస్ట్రీని రేంజ్‌ను ఎప్పటికప్పుడు పెంచుతూనే ఉన్నాయి. కల్ట్ మూవీ అంటే? కల్ట్ మూవీకి పర్యాయ పదంగా ట్రెండ్ సెట్టర్ సినిమా అని కూడా సినీ విశ్లేషకులు పిలుస్తారు. విభిన్న కథాంశం. విడుదలయ్యాక ఆ మూవీ పెద్దఎత్తున ఫ్యాన్ బేస్ సంపాదించడం, ఆ చిత్రం పంథాను కొన్నేళ్లపాటు మరికొన్ని సినిమాలు అనుసరించి రావడం, ఆ సినిమా డైలాగ్స్.. ఇప్పటికీ జనాల నాలుకలపై నానడం వంటి లక్షణాలు కలిగి ఉండాలి. అలాగే బాక్సాఫీస్ వద్ద పెద్ద ఎత్తున కలెక్షన్ల వర్షం కురిపించే సినిమాలు ఈ కోవలోకే వస్తాయి. 90వ దశకం నుంచి యాక్షన్ కల్ట్ మూవీలు శివ(1989) ఎలాంటి అంచనాలు లేకుండా 1989లో రిలీజైన 'శివ' మూవీ ఇండస్ట్రీ కల్ట్ గా నిలిచింది. అప్పటి వరకు సామాజిక ఆర్థిక అంశాలే ప్రధానం రూపొందిన చిత్రాల పంథాను ఒక్కసారిగా మార్చింది. పక్క యాక్షన్ మూవీగా తెరకెక్కిన శివ నాగార్జునకు స్టార్ డామ్ తెచ్చిపెట్టింది. ఆయన కెరీర్ గ్రాఫ్‌ను అమాంతం పెంచేసింది. నాగార్జున పట్ల యూత్‌లో విపరీతమైన క్రేజ్ ఏర్పడింది. సైకిల్ చైన్ లాగే మెనరిజాన్ని అప్పట్లో యూత్ పిచ్చిగా ఫాలో అయ్యేవారు. ఈ సినిమా తర్వాత రామ్ గోపాల్ వర్మతో మూవీలు చేసేందుకు స్టార్ హీరోలు క్యూ కట్టారు. అంతే కాదు శివ యాక్షన్ సిక్వెన్స్‌ను అనుసరిస్తూ చాలా చిత్రాలు వచ్చాయి. గాయం(1993) 1993లో రామ్ గోపాల్ వర్మ డైరెక్షన్ లోనే  వచ్చిన 'గాయం' సైతం మంచి యాక్షన్ కల్ట్‌ గా నిలిచింది. ఈ మూవీని యార్లగడ్డ సురేంద్ర నిర్మించారు. అప్పటి వరకు ఫ్యామిలీ హీరోగా పెరొందిన జగపతి బాబు ఈ సినిమాతో ఒక్కసారిగా మాస్ లుక్ లోకి మారిపోయారు. దుర్గ క్యారెక్టర్ లో ఒదిగిపోయారు. జగపతి బాబు సరసన రేవతి, కోటా శ్రీనివాస్ రావు, సిరివెన్నెల సితారామశాస్త్రి ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ మూవీలోని 'నిగ్గదీసి అడుగు ఈ సిగ్గు లేని జనాన్ని' అనే పాట ఎంత ప్రజాదరణ పొందిందో అందరికి తెలిసిందే. భారతీయుడు(1996) శంకర్ డైరెక్షన్‌లో వచ్చిన భారతీయుడు ఆల్ టైమ్ యాక్షన్ కల్ట్ చిత్రంగా పేరొందింది. రొటీన్ మూవీలకు భిన్నంగా అవినీతికి వ్యతిరేకంగా సరికొత్త కథాంశంతో శంకర్ తెరకెక్కించాడు. సేనాపతి పాత్రలో కమల్ హాసన్ అద్భుతంగా నటించాడు. ఈ మూవీ తర్వాత ఇదే తరహా కథాంశాలతో వచ్చిన రమణ, ఠాగూర్, మల్లన్న చిత్రాలు సక్సెస్ అయ్యాయి. ఈ చిత్రంలో కమల్ హాసన్ డ్యూయల్ రోల్‌లో మెప్పించాడు. మనీషా కోయిరాలా, ఊర్మిళ, సుకన్య ప్రధాన పాత్రధారులుగా నటించారు. ఎ.ఆర్.రెహ్మాన్ సంగీతం అందించాడు. సమరసింహా రెడ్డి(1999) నందమూరి నట సింహం బాలకృష్ణ నటించిన 'సమరసింహా రెడ్డి(1999), నరసింహా నాయుడు(2001) యాక్షన్ ఎంటర్ టైన్మెంట్‌కు కొత్త నిర్వచనం అందించాయి. రాయలసీమ ఫ్యాక్షనిస్ట్ బ్యాక్ గ్రౌండ్ లో ఈ చిత్రాల్ని డెరెక్టర్ బీ గోపాల్ అద్భుతంగా తెరకెక్కించాడు. పరుచూరి బ్రదర్స్ రాసిన డైలాగ్స్  బాగా పేలాయి. ఈ చిత్రాల్లో బాలయ్య డైలాగ్ డెలివరీ ప్రేక్షకులను మళ్లీ మళ్లీ థియేటర్లకు రప్పించేలా చేసింది. ఈ రెండు సినిమాలను అనుకరిస్తూ వచ్చిన చాలా చిత్రాలు వచ్చాయి. ఫాక్షనిస్ట్ బ్యాక్ గ్రౌండ్ లో వచ్చిన ఇంద్ర, ఆది, యజ్ఞం మూవీలు హిట్ కొట్టాయి. పోకిరి(2006) తెలుగులో వచ్చిన బిగ్గెస్ట్ యాక్షన్ కల్ట్ మూవీ పోకిరి(2006). అప్పటివరకు తెలుగు తెరకు పరిచయం లేని గ్యాంగ్ స్టర్ స్టోరీ లైన్ తో పూరి ముందుకొచ్చాడు. పోకిరి దెబ్బకు అన్ని రికార్డులు దాసోహం అయ్యాయి. హీరో మేనరిజం, డెలాగ్స్, చిత్రీకరణ విలువలు, మణిశర్మ మ్యూజిక్  ప్రతి ఒక్కటీ వేటికవే ప్రత్యేకంగా నిలిచాయి. ఈ సినిమా తర్వాత మహేష్ బాబుకు మాస్ ఆడియన్స్ లో విపరీతమైన క్రేజ్ ఏర్పడింది. టాలీవుడ్ లో వచ్చిన చాలా సినిమాలు పోకిరి యాక్షన్ సిక్వెన్స్ ను ఫాలో అయ్యాయి.    మగధీర(2009) రాజమౌళి డైరెక్ట్ చేసిన మగధీర క్లాసిక్ కల్ట్ గా చరిత్ర సృష్టించింది. అప్పటి వరకు ఉన్న టాలీవుడ్ బాక్సాఫీస్ రికార్డులను మగధీర బ్రేక్ చేసింది. పూర్వ జన్మ నేపథ్యంలో వచ్చిన ఈ మూవీ చాల ఏళ్ల తర్వాత మళ్లీ పౌరాణిక వాసనను తెలుగు తెరకు గుర్తు చేసింది. కత్తులు, యుద్ధం వంటి యాక్షన్ డ్రామాతో ఆకట్టుకుంది. ఈ సినిమాతో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కు మంచి బ్రెక్ ఇచ్చింది. నటించిన రెండో సినిమాతోనే చరణ్ కు స్టార్ హోదా దక్కింది. ఈ చిత్రం పోలికలతో కొన్ని సినిమాలు వచ్చినప్పటికీ ఆశించినంత విజయం సాధించలేదు.   అర్జున్ రెడ్డి(2017) కొత్త దర్శకుడు సందీప్ రెడ్డి డెరెక్ట్ చేసిన 'అర్జున్ రెడ్డి(2017)' టాలీవుడ్ ఇండస్ట్రీలో సరికొత్త ట్రెండ్ సెట్ చేసింది. వివాదాల మధ్య విడుదలైన ఈ చిత్రం పెద్దఎ త్తున ఫ్యాన్ బేస్ సంపాదించింది.  విజయ్ దేవరకొండ కేరీర్ గ్రాఫ్ ఒక్కసారిగా మారిపోయింది. ఊహించని సక్సెస్ అందుకున్నాడు. ఈ సినిమాను హిందీ, తమిళ్ ఇండస్ట్రీల్లో రీమేక్ చేశారు. యూత్ లో ఫుల్ జోష్ ను నింపింది. అర్జున్ రెడ్డిగా నటించిన విజయ్ ని రౌడీ బాయ్ అంటూ అభిమానులు పిలవడం మొదలు పెట్టారు. బాహుబలి-2(2017) రాజమౌళి తెరకెక్కించిన అద్భుత కావ్యం 'బాహుబలి-2(2017)' భారత చలనచిత్ర గతినే మార్చింది. అన్ని భాషలను ఏకం చేసి పాన్ ఇండియా ఇమేజ్ ను క్రియేట్ చేసింది. ప్రభాస్ ను పాన్ ఇండియా స్టార్ ను చేసింది. అప్పటి వరకు హాలీవుడ్ చిత్రాల్లోనే సాధ్యమనుకునే  భారీ యాక్షన్ సీక్వెన్స్ ను ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీకి పరిచయం చేసింది. భారత చలన చిత్ర పరిశ్రమలో అత్యధిక వసూళ్లు సాధించిన దంగల్ రికార్డును బ్రేక్ చేసింది. బాక్సాఫీస్ రికార్డులే కాదు సౌత్ సినిమాలను పెద్దగా ఆదరించని నార్త్ ఆడియన్స్ మనసులను సైతం కొల్లగొట్టింది. సౌత్, నార్త్ కాదు మన సినిమా ఇండియన్ సినిమా అనే స్థాయికి ఇండస్ట్రీ వర్గాలను తీసుకొచ్చింది. ఈ మూవీ తర్వాత పలువురు బాలీవుడ్ డైరెక్టర్లు పాన్ ఇండియా మూవీలు తీసేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. రంగస్థలం (2018) ఒకేరకమైన కథలతో వెళ్తున్న టాలీవుడ్‌కు రంగస్థలం సినిమా కొత్త మార్గాన్ని చూపించింది. ఎలాంటి హంగులు ఆర్భాటాలు లేకుండా పక్కా పల్లెటూరు కథతోనూ హిట్‌ కొట్టొచ్చని డైరెక్టర్ సుకుమార్‌ ఈ తరం దర్శకులకు చూపించారు. ఇందులో రామ్‌ చరణ్, సమంత నటన మూవీకే హైలెట్‌ అని చెప్పాలి. రామ్‌చరణ్‌లోని కొత్త నటుడ్ని ఈ సినిమా ఆవిష్కరించింది. ఈ సినిమా స్ఫూర్తితో ప్రస్తుతం చాలా మంది దర్శకులు పల్లెటూరి కథలో దృష్టిసారిస్తున్నారు. ప్రస్తుతం టాలీవుడ్‌లో షేక్‌ చేస్తున్న దసరా, బలగం సినిమాలకు ఈ సినిమానే స్ఫూర్తి అని చెప్పొచ్చు.  పుష్ప(2022) పాన్ ఇండియా మూవీగా వచ్చిన 'పుష్ప' భారీ విజయాన్ని సాధించింది. సుకుమార్ డైరెక్షన్ లో వచ్చిన ఈ మూవీ  అల్లు అర్జున్ కెరీర్ లో బిగ్గేస్ట్ హిట్ గా నిలిచింది. ఈ సినిమా డైలాగులను రాజకీయ నాయకులు మొదలు క్రికెటర్లు, WWE స్టార్ల వరకు వల్లవేస్తున్నారు. ఉత్తర్ ప్రదేశ్ ఎన్నికల ప్రచారంలో అయితే.. రాజకీయ నాయకులు 'తగ్గేదేలే'.. 'ఏ బిడ్డా ఇది నా అడ్డా' అంటూ ప్రత్యర్థి పార్టీ నేతలకు కౌంటర్ ఇచ్చే వరకు వెళ్లింది. ఆర్‌ఆర్‌ఆర్‌ (2022) దర్శకధీరుడు రాజమౌళి ఆర్‌ఆర్‌ఆర్‌ చిత్రం ద్వారా తెలుగు సినిమా ఖ్యాతిని అమాంతం పెంచేశాడు. టాలీవుడ్‌ శక్తి సామర్థ్యాలను అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లాడు. ఈ సినిమాలో నాటు నాటు పాట ఏకంగా ఆస్కార్‌ అవార్డును సాధించింది. తద్వారా భారతీయుల హృదయాలను ఉప్పొంగేలా చేసింది. ఒకప్పుడు జాతీయ అవార్డులు రావడమే గగనంగా ఉన్న పరిస్థితి నుంచి తెలుగు సినిమా ఆస్కార్‌ స్థాయికి ఎదిగింది. కథానాయకులు రామ్‌చరణ్‌, ఎన్‌టీఆర్‌లు కూడా RRRలో ఎంతో అద్భుతంగా నటించారు. సినిమా విజయంలో కీలక పాత్ర పోషించారు.  బలగం (2023) సరైన కంటెంట్‌తో వస్తే చిన్న సినిమా అయిన ఘనవిజయం సాధిస్తుందని బలగం సినిమా నిరూపించింది. ఏమాత్రం అంచనాలు లేకుండా తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా రిలీజ్‌ తర్వాత ప్రభంజనే సృష్టించింది. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలు, ప్రేమానురాగాలను డైరెక్టర్‌ వేణు చక్కగా చూపించాడు. పక్కా పల్లెటూరు నేపథ్యంతో తెరకెక్కిన ఈ సినిమా అంతర్జాతీయ అవార్డులను సొంతం చేసుకుంది.  దసరా (2023) టాలీవుడ్‌ రేంజ్‌ను దసరా చిత్రం మరింత పెంచింది. దర్శకుడు శ్రీకాంత్‌ ఓదెల తన తొలి సినిమాతోనే రూ.100 కోట్ల మార్క్‌ అందుకున్నాడు. ఈ సినిమా కూడా పల్లెటూరు కథాంశంతో తెరకెక్కి పాన్‌ ఇండియా స్థాయిలో ప్రేక్షకుల ఆదరణ పొందింది. ముఖ్యంగా హీరో నాని ఈ సినిమా తన నటా విశ్వరూపమే చూపించాడు. ఇప్పటివరకూ చేసిన సినిమాలకు పూర్తి భిన్నంగా ఊరమాస్‌గా ఇరగదీశాడు. హీరోయిన్‌ కీర్తి సురేష్‌ కూడా తనదైన నటనతో ఆకట్టుకుంది. మహానటి తర్వాత కీర్తి అత్యుత్తమ నటనను ఈ సినిమాలో చూడొచ్చు.
    ఏప్రిల్ 12 , 2023
    Trending Telugu Movies 2024: గూగుల్‌లో అత్యధికంగా వెతికిన టాప్ 60 తెలుగు సినిమాలు ఇవే!
    Trending Telugu Movies 2024: గూగుల్‌లో అత్యధికంగా వెతికిన టాప్ 60 తెలుగు సినిమాలు ఇవే!
    నెట్టింట ఏదైనా సమాచారాన్ని వెతకాలంటే వెంటనే గూగుల్ చేస్తాం. అలా ప్రతి సమాచార శోధనకు గూగుల్ సెర్చ్ ఇంజిన్ కేరాఫ్ అడ్రస్‌గా మారింది. అయితే, ఈ ఏడాది గూగుల్‌లో అత్యధికంగా వెతికిన సినిమాల జాబితాను ఇక్కడ ఇవ్వడం జరిగింది. అయితే విచిత్రంగా బ్లాక్ బాస్టర్ సూపర్ డూపర్ హిట్లను తలదన్నీ మన తెలుగు ప్రేక్షకులు చక్కని కథనం, ఫీల్ గుడ్, కామెడీ, ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌లకు పట్టం కట్టడం విశేషం. మరి గూగూల్‌లో ఎక్కువ మంది వెతికిన టాప్ 60 సినిమాల లిస్ట్‌ను మీరు చూడండి. [toc] Drushyam దృశ్యం చిత్రం వచ్చి 10 సంవత్సరాలైనా ఆ సినిమాకు ఉన్న క్రేజ్ ఏమాత్రం తగ్గలేదు. ఇప్పటికీ టాప్‌లో ట్రెండ్ అవుతోంది. పెద్ద పెద్ద చిత్రాలను తలదన్ని ఆశ్చర్యకరంగా గూగుల్‌లో అత్యధికంగా వెతుకుతున్న చిత్రాల్లో ఈ సినిమా మొదటి స్థానంలో నిలిచింది. ఈ సినిమాను చూసేందుకు ప్రేక్షకులు ఎక్కవగా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ఈ చిత్రంలో భావోద్వేగాలు.. సస్పెన్స్ థ్రిల్లర్ కథాంశం, వెంకటేష్ నటన ఈ సినిమాను ప్రత్యేకంగా నిలిపాయి.ఇక సినిమా కథలోకి వెళ్తే.. రాంబాబు (వెంకటేష్‌) ఊరిలో కేబుల్‌ నెట్‌వర్క్‌ పెట్టుకొని కుటుంబంతో హాయిగా జీవిస్తుంటాడు. ఓ రోజు ఐజీ గీత ప్రభాకర్‌ (నదియా) కొడుకు కనిపించకుండా పోతాడు. కానిస్టేబుల్‌ వీరభద్రం కారణంగా ఆ కేసులో రాంబాబు, అతని ఫ్యామిలీ ఇరుక్కుటుంది. ఆ కేసుకి రాంబాబు ఫ్యామిలీకి ఏంటి సంబంధం? అన్నది కథ. Karthikeya 2 ఎలాంటి అంచనాలు లేకుండా వచ్చిన కార్తీకేయ చిత్రం ఎంతటి ఘనవిజయం సాధించిందో అందరికీ తెలిసిందే. ఈ సినిమా దేశవ్యాప్తంగా ప్రేక్షకుల హృదయాలను గెలుచుకుంది. ఇక ఈ చిత్రాన్ని ప్రేక్షకులు పదే పదే చూసేందుకు ఇష్టపడుతున్నారని గూగుల్ ట్రెండ్స్‌ బట్టి తెలుస్తోంది. అత్యధిక మంది వెతుకుతున్న చిత్రాల్లో ఈ సినిమా రెండో స్థానంలో ఉంది. ఈ సినిమాను చూసేందుకు నెటిజన్లు పెద్ద సంఖ్యలో ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ఇక ఈ సినిమా కథలోకి వెళ్తే… కార్తికేయ (నిఖిల్‌)కు ప్రశ్నలకు సమాధానం వెతకడం అంటే ఇష్టం. తల్లితో పాటు కార్తికేయ ద్వారక వెళ్లగా అక్కడ ఓ ఆర్కియాలజిస్ట్ హత్యకు గురవుతాడు. దాని వెనక కారణాల్ని వెతుకుతూ కార్తికేయ చేసే సాహసోపేతమైన ప్రయాణమే అసలు కథ. Bichagadu 2 ఆశ్చర్యకరంగా ఈ సినిమా తెలుగులో ట్రెండ్ అవుతున్న సినిమాల్లో మూడో స్థానంలో నిలవడం విశేషం. విజయ్ ఆంటోని నటించిన బిచ్చగాడు సినిమా బ్లాక్ బాస్టర్ హిట్ కావడంతో దానికి సీక్వెల్‌గా వచ్చిన బిచ్చగాడు 2 సైతం మంచి విజయం సాధించింది. తల్లి కొడుకుల మధ్య చక్కని సెంటిమెంట్, చక్కని పాత్రల చిత్రణ ఈ సినిమాను ప్రేక్షకుల హృదయాల్లో నిలిపింది. అందుకే ఈ చిత్రం టాప్ ట్రెండింగ్ చిత్రాల్లో ఒకటిగా నిలిచింది. ఈ సినిమాను చూసేందుకు నెటిజన్లు ఎక్కువగా ఆసక్తి చూపారు. ఇక ఈ సినిమా కథలోకి వెళ్తే.. విజయ్ గురుమూర్తి (విజయ్ ఆంటోని) భారతదేశంలోని 7వ అత్యంత సంపన్నుడు. అతని సహోద్యోగి మరియు స్నేహితుడు అరవింద్ (దేవ్ గిల్), అతని గ్యాంగ్‌తో కలిసి, అతని సంపద కోసం విజయ్‌ని చంపి, అతని మెదడును బిచ్చగాడు సత్య (విజయ్ ఆంటోని) మెదడుతో మారుస్తాడు. అయితే సత్య వారిని చంపి తన ప్రతీకారం తీర్చుకుంటాడు. యాంటీ బికిలీ ప్రాజెక్ట్‌ను ప్రారంభిస్తాడు. యాంటీ బికిలీ ప్రాజెక్ట్ అంటే ఏమిటి? సత్య అరవింద్ ఇంతకు ఆ గ్యాంగ్‌ను ఎందుకు చంపాడు? ఇంతకు సత్య వెనుక ఉన్న కథ ఏమిటి? అన్నది మిగతా కథ F2 2019 సంక్రాంతికి వచ్చిన ఈ చిత్రం సూపర్ డూపర్ హిట్‌గా నిలిచింది. వెంకీ-వరుణ్ తేజ్‌ల జోడీ ప్రేక్షకులను కడుపుబ్బ నవ్వించింది. ఈ సినిమా వచ్చి ఏళ్లు గడుస్తున్నా క్రేజ్ మాత్రం తగ్గలేదు. ఇప్పటికీ ఈ సినిమాను చూసేందుకు నెటిజన్లు ఆసక్తి చూపిస్తారు. గూగుల్ సెర్చ్‌లో టాప్‌లో ట్రెండ్‌ అవుతున్న సినిమాల్లో ఈ చిత్రం ఒకటి. ఇక ఈ సినిమా కథలోకి వెళ్తే.. వెంకీ(వెంకటేష్) MLA దగ్గరా పీఏ పనిచేస్తుంటాడు. ఆత్మగౌరవం, మొగుడుపై పెత్తనం చలాయించే వ్యక్తిత్వం ఉన్న తమన్నాను వెంకీ పెళ్లి చేసుకుంటాడు. కొద్దిరోజులు వీరి కాపురం బాగానే సాగినా.. ఇగోల వల్ల సమస్యలు వస్తాయి. దీంతో తమన్నా ఫ్యామిలీ వెంకీని టార్చర్ పెడుతుంది. ఈక్రమంలో తమన్నా చెల్లెలు హాని(మెహరీన్) వరుణ్‌(వరుణ్‌ తేజ్‌)ను ప్రేమించి పెళ్లి చేసుకుంటుంది. తమన్నా ఫ్యామిలీ దెబ్బకు వరుణ్ సైతం బాధితుడిగా మారుతాడు. అప్పుడు వెంకీ- వరుణ్ కలిసి ఏం చేశారు? తమ ఇగో సమస్యలను ఎలా పరిష్కరించుకున్నారు అనేది కథ. Ante Sundaraniki గూగుల్ సెర్చ్‌లో అత్యధికంగా వెతుకుతున్న తెలుగు సినిమాల జాబితాలో ఈ చిత్రం కూడా ఒకటి. నాని మార్క్ కామెడీ, నజ్రియా నదియా క్యూట్ నెస్, వల్గారిటీ లేని కామెడీ ఈ చిత్రాన్ని ప్రత్యేకంగా నిలిపాయి. అందుకే నెటిజన్లు ఈ సినిమా చూసేందు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ఇక కథలోకి వెళ్తే..బ్రాహ్మణ కుటుంబానికి చెందిన సుందర్‌ (నాని) ఇంకో మతానికి చెందిన లీల (నజ్రియా నజీమ్‌)ను ప్రేమిస్తాడు. భిన్నమైన సంప్రదాయాలు కలిగిన ఈ జంట పెళ్లి కోసం కుటుంబ సభ్యులతో అబద్దం ఆడతారు. దాని వల్ల ఎలాంటి ఇబ్బందులు పడ్డారన్నది కథ. Tholiprema ఈ చిత్రం వచ్చి 25 ఏళ్లు దాటినా ఇప్పటికీ ఎప్పటికీ ప్రేక్షకులను అలరిస్తూనే ఉంది. ఈ క్లాసిక్ చిత్రాన్ని చూసేందుకు ప్రేక్షకులు ఇప్పటికీ ఆసక్తి చూపిస్తున్నారు. పవన్ కళ్యాణ్ యాక్టింగ్, కీర్తి రెడ్డి మెస్మరైజింగ్ బ్యూటీ, చక్కని లవ్ స్టోరీ ఈ సినిమాను ప్రేక్షకుల హృదయాల్లో చిరస్మరణీయం చేశాయి. గూగుల్ సెర్చ్‌లో అధికంగా వెతుకుతున్న సినిమాల్లో ఈ సినిమా ఒకటిగా నిలిచింది. ఇక కథలోకి వెళ్తే.. అమెరికా నుంచి వచ్చి తన తాత ఇంటికి వెళ్తున్న అనూను బాలు ఓ ప్రమాదం నుండి కాపాడతాడు. దీంతో అను అతడితో స్నేహం చేస్తుంది. ఈ ప్రయాణంలో బాలు అనూని ఇష్టపడతాడు. కానీ, ఆమెకు చెప్పలేకపోతాడు. వీరి ప్రేమ కథ చివరికి ఏమైంది? అన్నది కథ. Pelli Choopulu తరుణ్ భాస్కర్ దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రం జాతీయ స్థాయిలో ఉత్తమ ప్రాంతీయ చిత్రంగా నిలిచింది. ఈ సినిమాలో విజయ్ దేవరకొండ నటన ఆకట్టుకుంటుంది. ఇక కథలోకి వెళ్తే..పెళ్లి చూపుల్లో ప్రశాంత్‌ (విజయ్‌ దేవరకొండ)ను చిత్ర (రీతు వర్మ) రిజెక్ట్‌ చేస్తోంది. ఓ కారణం వల్ల హీరోయిన్‌ పెట్టే ఫుడ్‌ ట్రక్‌ బిజినెస్‌లో హీరో భాగమవుతాడు. ఈ ఇద్దరి ప్రయాణం తర్వాత ఏయే మలుపులు తిరిగింది? అన్నది కథ. ఓటీటీ సన్ నెక్ట్స్ Spyder స్పైడర్ చిత్రం బాక్సాఫీస్ వద్ద విజయం సాధించనప్పటికీ.. మంచి స్టోరీ లైన్‌తో వచ్చింది. ఈ సిని సస్పెన్స్ థ్రిల్లర్‌గా అలరించింది. ఈ సినిమా చూసేందుకు ఇప్పటికీ చాలా మంది నెటిజన్లు ఆసక్తి చూపిస్తున్నారు. ఇక కథలోకి వెళ్తే… ఇంటెలిజెన్స్ అధికారి అయిన శివ, అత్యవసరమైన పరిస్థితుల్లో ఉన్నవారి ట్రాక్ చేయడంలో సహాయపడే ఫోన్ సాఫ్ట్‌వేర్‌ను అభివృద్ధి చేస్తాడు. ఒక సీరియల్ కిల్లర్ అమాయకులను హత్య చేస్తున్న క్రమంలో అతడి ఆగడాలను అరికడుతాడు. ఇంతకు ఆ హత్యలు చేస్తుంది ఎవరు? అతన్ని శివ పట్టుకోవడంలో ఎలాంటి సమస్యలు ఎదుర్కొన్నాడు అనేది మిగతా కథ. ఓటీటీ- నెట్‌ఫ్లిక్స్ Raja The Great రవితేజ చేసిన బెస్ట్ కామెడీ చిత్రాల్లో రాజా ది గ్రేట్ ఒకటని చెప్పవచ్చు. ఈ సినిమా చూసేందుకు నెటిజన్లు ఆసక్తి చూపిస్తున్నారు. కంటి చూపులేని రాజా.. ఆసాధారణ ప్రతిభకలవాడు. ఓ యువతి ఆపాదలో ఉన్నప్పుడు ఆమెకు సాయం చేయాలనుకుంటాడు. ఆమెను రక్షించే క్రమంలో ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొన్నాడు అన్నది మిగతా కథ.ఓటీటీ: ఆహా Ori Devuda వెంకటేష్- విశ్వక్ సేన్ మేయిన్‌ లీడ్‌లో నటించిన ఈ చిత్రం మంచి ఫీల్ గుడ్ సినిమా. ఈ సినిమా అత్యధికంగా వెతుకుతున్న తెలుగు సినిమా జాబితాలో పదో స్థానంలో నిలిచింది. అర్జున్ (విశ్వక్‌ సేన్‌), అను (మిథిలా పాల్కర్) పెళ్లి చేసుకుంటారు. అర్జున్‌ని అను అనుమానిస్తూనే ఉంటుంది. దీంతో పెళ్లి తర్వాత స్వేచ్చ కోల్పోయినట్లు అతడు భావిస్తాడు. పెళ్లి విషయంలో తనకు సెకండ్ ఛాన్స్ ఇవ్వమని దేవుడ్ని మెురపెట్టుకుంటాడు. కొన్ని షరతులతో దేవుడు (వెంకటేష్‌) అందుకు అంగీకరిస్తాడు. ఆ తర్వాత ఏమైందన్నది కథ.ఓటీటీ: ఆహా Bichagadu ఒక ధనవంతుడైన వ్యాపారవేత్త తల్లి ప్రమాదానికి గురై కోమాలోకి వెళ్లిపోతుంది. వైద్యులు ఆమెకు నయం చేయలేమని చెబుతారు. అయితే, ఒక పూజారి ఆ వ్యాపారవేత్త బిచ్చగాడుగా జీవిస్తే ఆమె కోలుకుంటుందని స్పష్టం చేస్తాడు.ఓటీటీ: ప్రైమ్ వీడియో Jalsa సంజయ్‌ చిన్నప్పుడు ఎదుర్కొన్న పరిస్థితుల కారణంగా నక్సలైట్‌గా మారతాడు. ఓ పోలీసాఫీసర్‌ కారణంగా ప్రజా జీవితంలోకి వస్తాడు. అయితే అనుకోకుండా ఆ పోలీసు అధికారి కూతుర్లనే రెండు పర్యాయాలలో ప్రేమిస్తాడు. ఓటీటీ: ఆహా Nenu అల్లరి నరేష్‌లో అద్భుతమైన నటనను ఆవిష్కరించింది ఈ చిత్రం. మానసిక రోగి పాత్రలో అతని యాక్టింగ్ సూపర్బ్‌గా ఉంటుంది. అందుకే ఈ సినిమా వచ్చి 20 ఏళ్లు గడిచినా క్రేజ్ మాత్రం తగ్గలేదు. కథలోకి వెళ్తే..మానసిక రోగి అయిన వినోద్ తన స్నేహితురాలిగా భావించే ఒక అమ్మాయితో ప్రేమలో పడతాడు. అయితే ఆ యువతి వెరొకరితో ప్రేమలో ఉంటుంది. ప్రేమను గెలిపిస్తాననే నెపంతో ఆ యువతిని వినోద్ అడవిలోకి తీసుకెళ్లడంతో కథ మలుపు తిరుగుతుంది. ఓటీటీ: సన్ నెక్ట్స్ Sye Raa Narasimha Reddy భారీ బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద విజయం సాధించనప్పటికీ… ఈ సినిమా ప్రేక్షకుల హృదయాల్లో నిలిచిపోయింది. కథలోకి వెళ్తే.. భారతదేశాన్ని ఆక్రమించుకునే క్రమంలో బ్రిటిష్ సైన్యాన్ని ఎదురించలేక పాలెగాళ్లు అందరూ లొంగిపోతారు. అయితే రేనాడు ప్రాంతానికి చెందిన రాజు ఉయ్యాలవాడ నరసింహా రెడ్డి బ్రిటిష్ సైనికులకు ఎదురుతిరిగి వారు దోచుకున్న భూమిని సంపదను అడ్డుకుని ప్రజలకు అండగా నిలబడతాడు. తోటి పాలెగాళ్ళలో మార్పు తెచ్చి వారితో కలిసి దేశ స్వాతంత్ర్యం కోసం ఉద్యమాన్ని నిర్మిస్తాడు? ఈ క్రమంలో ఆయన ఎదుర్కొన్న సమస్యలు ఏమిటి? అసలు యుద్దానికి దారి తీసిన అంశాలు ఏమిటి? అన్నది మిగతా కథ Hari Hara Veera Mallu పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న ఈ చిత్రం ఇంకా విడుదల కాలేదు. కానీ ఈ సినిమా కోసం నెటిజన్లు ఆసక్తి కనబరుస్తున్నారు. ఈ సినిమా ఎప్పుడు విడుదలవుతుందని ఎదురు చూస్తున్నరు. ఇక ఈ సినిమా మొగల్స్ కాలం నాటి పరిస్థితుల ఆధారంగా తెరకెక్కుతోంది. Bharat Ane Nenu సీఎం అయిన తండ్రి చనిపోవడంతో భరత్‌ (మహేష్‌) ఆ పదవిలోకి వస్తాడు. బాధ్యతగా ప్రజలకు మంచి చేయాలనుకుంటాడు. ఈ క్రమంలో అతడికి ఎదురైన సమస్యలు ఏంటి? సొంత పార్టీ నేతలు చేస్తున్న కుట్రలకు ఎలా చెక్‌ పెట్టాడు? అన్నది కథ.ఓటీటీ: ఆహా Ye Maaya Chesave ఈ చిత్రం 15 ఏళ్లు గడిచినా ఈ క్లాసిక్ సినిమాపై ఇంకా క్రేజ్ పోలేదు.ఇంజినీరింగ్‌ విద్యార్థి అయిన కార్తీక్‌కి ఫిల్మ్ డైరెక్టర్ కావాలని కోరిక. ఈక్రమంలో అతను తన ఇంటి యజమాని కూతురు జెస్సీతో ప్రేమలో పడతాడు. ఇద్దరు మతాలు వేరుకావడంతో ఆమె తండ్రి వారి ప్రేమను వ్యతిరేకిస్తాడు. మరి కార్తీక్ తన ప్రేమను గెలిచేందుకు ఏం చేశాడు అన్నది మిగతా కథ. ఓటీటీ: జీ5, ప్రైమ్ Baahubali: The Beginning మాహిష్మతి రాజ్యంలో, శివుడు అనే ధైర్యవంతుడైన యువకుడు… ఒక యువ యోధురాలుతో ప్రేమలో పడతాడు. ఆమెను ప్రేమిస్తున్న క్రమంలో అతని కుటుంబం, తన నిజమైన వారసత్వం గురించి తెలుసుకుంటాడు. ఆ తర్వాత అతను ఏం చేశాడు అనేది కథ. ఓటీటీ: హాట్ స్టార్ Businessman ముంబయిని ఏలాలన్న లక్ష్యంతో సూర్య నగరానికి వస్తాడు. లోకల్‌ గ్యాంగ్‌స్టర్లతో కలిసి పవర్‌ఫుల్‌ బిజినెస్‌మ్యాన్‌గా ఎదుగుతాడు. ఇంతకీ ఆ యువకుడు పెట్టిన బిజినెస్ ఏంటి? చిత్ర-సూర్యల లవ్‌స్టోరీ ఏంటి? అన్నది కథ. ఓటీటీ: హాట్ స్టార్, ప్రైమ్ Good Luck Sakhi బంజార యువతి సఖి (కీర్తి సురేష్‌) అంటే గోలి రాజు (ఆది పినిశెట్టి)కి ఎంతో ఇష్టం. సఖి గురిపై రాజుకు మహా నమ్మకం. ఆమెను షూటింగ్‌ వైపు వెళ్లేలా ప్రోత్సహిస్తాడు. ఇందుకోసం ఊరికి వచ్చిన కల్నల్ (జగపతిబాబు) సాయం తీసుకుంటాడు. షూటింగ్‌లో ఎదిగే క్రమంలో సఖికి ఎదురైన సవాళ్లు ఏంటి? అన్నదే కథ. ఓటీటీ: ప్రైమ్, ఆహా Oxygen అరవింద్ కృష్ణ తాను ప్రేమించిన అమ్మాయిని పెళ్లి చేసుకునేందుకు ఇండియాకు వస్తాడు. కానీ ఆ అమ్మాయి కుటుంబాన్ని కొంతమంది చంపుతారు. ఇలాంటి పరిస్థితుల్లో అరవింద్ కృష్ణ ఏం చేశాడు అన్నది కథ ఓటీటీ: సన్ నెక్ట్స్ Adipurush ఆదిపురుష్ సినిమా కథ వాల్మికి రామాయణంలోని యుద్ధకాండ నుంచి ప్రారంభం అవుతుంది. తండ్రి దశరథుడి ఆజ్ఞపై రాఘవ (ప్రభాస్) తన భార్య జానకి (కృతి సనన్) – శేషు (సన్ని సింగ్)తో కలిసి వనవాసానికి వెళ్తాడు. తన సోదరి శూర్పణఖకు జరిగిన అవమానం తెలిసిన రావణ (సైఫ్ అలీ ఖాన్) మారు వేషంలో వచ్చి జానకిని తీసుకు వెళ్తాడు. స్త్రీలోలుడైన రావణ.. జానకిపై ఆశ పడుతాడు. ఆ తర్వాత జానకిని రావణుడి చర నుంచి జానకిని ఎలా కాపాడాడు అనేది కథ ఓటీటీ: సన్ నెక్ట్స్ SR Kalyanamandapam కల్యాణ్‌ (కిరణ్‌ అబ్బవరం) వారసత్వంగా వస్తున్న ఎస్‌.ఆర్‌. కళ్యాణ మండపం నిర్వహణ బాధ్యతలను తీసుకుంటాడు. ఇంజనీరింగ్‌ చదివే కల్యాణ్‌ గిరాకీ లేని కల్యాణ మండపాన్ని నడపించాలని ఎందుకు అనుకున్నాడు? దానికి పూర్వ వైభవం తీసుకొచ్చాడా లేదా? తండ్రి (సాయికుమార్‌)తో మాట్లాడకపోవడానికి కారణమేంటి? అన్నది కథ. ఓటీటీ: ఆహా Disco Raja భయంకమైన మాఫియా బ్యాక్‌గ్రౌండ్ ఉన్న డిస్కో రాజా బాడీని హిమాలయాల్లో శాస్త్రవేత్తల బృందం కనిపెడుతుంది. అతనికి చికిత్స చేయడంతో మాములు మనిషిగా మారుతాడు. తన గతం గురించి తెలుసుకున్న డిస్కో రాజా ఏం చేశాడు. అసలు డిస్కో రాజా హిమాలయాల్లో ఎందుకు కూరుకు పోయాడు అనేది మిగతా కథ ఓటీటీ: సన్ నెక్స్ట్ Goutham Nanda మల్టీ బిలియనీర్ కొడుకైన గౌతమ్, ఓ కంపెనీలో ఉద్యోగి అయిన నందాతో జీవితాన్ని మార్చుకోవడం ద్వారా తన ఆస్తిని విడిచిపెట్టి సాధారణ జీవితం గడపాలని నిర్ణయించుకుంటాడు. ఓటీటీ: ప్రైమ్ Kirrak Party కృష్ణ(నిఖిల్) అనే ఇంజినీరింగ్ విద్యార్థి తన స్నేహితుల బృందంతో కలిసి సంతోషంగా జీవిస్తుంటాడు. అతను తన సీనియర్ మీరా(సిమ్రాన్)తో ప్రేమలో పడతాడు. అంతా సవ్యంగా సాగుతున్న క్రమంలో.. ఒక విషాద సంఘటన కృష్ణ జీవితాన్ని తలకిందులు చేస్తుంది. ఆ తర్వాత కృష్ణ ఏం చేశాడన్నది మిగతా కథ ఓటీటీ: ప్రైమ్ Teja తేజ ( తరుణ్ ) పుట్టుకతోనే మేధావి. 6 వ తరగతి చదువే అతను 10 వ తరగతికి సిద్ధమవుతుంటాడు. భౌతికశాస్త్రం, కంప్యూటర్లు, రోబోల పట్ల ఆసక్తి కలిగి ఉంటాడు. ఓ రోజు ప్రిన్సిపాల్ భర్త ఓ మహిళను హత్య చేయడం చూసి ఫొటోలు తీస్తాడు. తేజ సాక్ష్యంతో కోర్టు ప్రిన్సిపల్ భర్తకు ఉరి శిక్ష విధిస్తుంది. జైలు నుంచి తప్పించుకున్న అతను తేజపై ప్రతీకారం తీర్చుకోవాలనుకుంటాడు. ఆ తర్వాత ఏం జరిగింది అనేది కథ. Pelli Sandadi శ్రీకాంత్‌ తాను పెళ్లి చేసుకోబోయే అమ్మాయి చెల్లెలు అని తెలియక స్వప్నతో ప్రేమలో పడతాడు. సోదరి పెళ్లి విషయం తెలుసుకున్న స్వప్న తన అక్క సంతోషం కోసం ప్రేమను త్యాగం చేసేందుకు సిద్ధపడుతుంది. ఆ తర్వాత ఏం జరిగింది? ఇంతకు శ్రీకాంత్ పెళ్లి ఎవరితో జరిగిందనేది మిగతా కథ. ఓటీటీ:యూట్యూబ్ Swathi Muthyam బాలమురళీ కృష్ణ (బెల్లంకొండ గణేష్) భాగ్యలక్ష్మీ(వర్షా బొల్లమ్మ)ని చూడగానే ప్రేమలో పడతాడు. వారికి పెళ్లి జరుగుతుండగా చంటిబిడ్డతో శైలజ (దివ్య శ్రీపాద) ప్రత్యక్షం అవుతుంది. ఆ బిడ్డకు తండ్రి బాలమురళీ కృష్ణ అని చెబుతుంది. మరి భాగ్యలక్ష్మీ స్పందన ఏంటి? ఆ శైలజ ఎవరు? అనేది కథ. ఓటీటీ: జియో టీవీ Dhruva ఐపీఎస్‌ అధికారి అయిన ధ్రువ (రామ్‌చరణ్‌).. సిద్ధార్థ్‌ అభిమన్యూ (అరవింద స్వామి) నడిపే అక్రమ వైద్య నెట్‌వర్క్‌ను ఎలా ధ్వంసం చేశాడు? అన్నది కథ. ఓటీటీ: సన్ నెక్స్ట్ KGF 2 రాకీ గరుడను చంపి KGFని స్వాధీనం చేసుకుంటాడు. కొద్దికాలంలోనే సూపర్ పవర్‌గా ఎదుగుతాడు. కానీ అతనికి అధీర (సంజయ్ దత్) రూపంలో అడ్డంకులు వస్తాయి. ఇదేక్రమంలో రాకీని అణిచివేసేందుకు ప్రధాన మంత్రి ఆదేశాలు జారీ చేస్తుంది. మరి రాకీ, అధీరను, రాజకీయ శక్తిని ఎలా ఎదుర్కొన్నాడు? చివరకు వీరిపై విజయం సాధించాడా? లేదా? అన్నది మిగతా కథ. Baadshah ఓ యువకుడు తన తండ్రికి గ్యాంగ్‌స్టర్‌తో ఉన్న సంబంధాల కారణంగా పోలీస్ ఫోర్స్‌లో ఉద్యోగం పొందడంలో విఫలమవుతాడు. ఓ మాఫియా బాంబు దాడిలో అతని స్నేహితుడు చనిపోవడంతో వారిపై ప్రతీకారం తీర్చుకోవాలని నిర్ణయించుకుంటాడు. ఓటీటీ: యూట్యూబ్ Pushpa పుష్ప (అల్లుఅర్జున్‌) ఎర్రచందనం కూలీ. కొండా రెడ్డి (అజయ్‌ ఘోష్‌) సోదరులకు స్మగ్లింగ్‌లో సలహాలు ఇచ్చే స్థాయికి అతడు వెళతాడు. అక్కడ నుంచి సిండికేట్‌ను శాసించే రేంజ్‌కు పుష్ప ఎలా ఎదిగాడు? మంగళం శ్రీను (సునీల్‌)తో ఉన్న గొడవేంటి? అన్నది కథ. ఓటీటీ: ప్రైమ్ Nannaku Prematho హీరో తండ్రిని ఓ వ్యాపారవేత్త మోసం చేస్తాడు. ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్‌ అయిన తండ్రి ద్వారా హీరో ఈ విషయాన్ని తెలుసుకుంటాడు. ఆ తర్వాత హీరో ఏం చేశాడు? తన తండ్రి కోసం విలన్‌పై ఎలా ప్రతీకారం తీర్చుకున్నాడు? అన్నది కథ. ఓటీటీ: సన్‌ నెక్స్ట్ Ala Modalaindi లవ్‌ ఫేయిల్ అయిన ఓ వ్యక్తి ఒక అమ్మాయిని కలుస్తాడు. ఆమెతో ప్రేమలో పడతాడు. అయితే, ఆమెకు అప్పటికే నిశ్చితార్థం జరిగిందని తెలియగానే కథలో ట్విస్ట్‌ మొదలవుతుంది. ఓటీటీ: జీ5, ప్రైమ్ Sir బాలగంగాధర్ (ధనుష్ ) ఒక జూనియర్ మ్యాథ్స్ లెక్చరర్. సిరిపురం అనే గ్రామంలోని జూనియర్ కళాశాలకు మ్యాథ్స్ చెప్పడానికి వెళ్తాడు. అక్కడ ఉన్న స్టూడెంట్స్ అందరూ పాస్ అయ్యేలా చదువు చెబితే.. సీనియర్ మ్యాథ్స్ లెక్చరర్‌గా ప్రమోషన్ ఇస్తానని కాలేజీ యాజమాన్యం చెబుతుంది. అయితే, అక్కడ పరిస్థితులు బాలుకి అనుకూలంగా ఉండవు. అయినా, తన మాటలతో, చేతలతో ఆ సిరిపురం స్టూడెంట్స్‌ను ప్రభావితం చేస్తాడు. అనంతరం జరిగిన కొన్ని నాటకీయ పరిణామాల వల్ల బాలు జీవితంలో కొన్ని మార్పులు జరుగుతాయి. ఆ మార్పులు ఏమిటి అనేది మిగతా కథ ఓటీటీ: నెట్‌ప్లిక్స్ Jersey అర్జున్(నాని) మాజీ రంజీ ఆటగాడు, అతను తన భార్య సారా(శ్రద్ధా శ్రీనాథ్) కొడుకు నానితో సాధారణం జీవితం గడుపుతుంటాడు. ఈక్రమంలో అతని ఉద్యోగం పోతుంది. చేచడానికి ఎలాంటి పనిలేక ఖాళీగా తిరుగుతుంటాడు. జీవితంలో ఏదోఒకటి చేయాలన్న తపన ఉన్న అర్జున్ తన కొడుకు కోసం ఓ కీలక నిర్ణయం తీసుకుంటాడు. ఇంతకు అతను తీసుకున్న నిర్ణయం ఏమిటి? తాను అనుకున్న లక్ష్యాన్ని సాధించాడా లేదా అన్నది కథ. ఓటీటీ: జీ5 Hit: The First Case ఇన్‌స్పెక్టర్ విక్రమ్ తన లవర్ నేహా మిస్‌కావడంతో గందరగోళంలో ఉంటాడు. ఇదే సమయంలో తన లవర్ మిస్సింగ్ కేసుతో సంబంధం ఉన్న ప్రీతీ అనే అమ్మాయి మిస్సింగ్ కేసులో ఇన్వెస్టిగేటివ్ ఆఫీసర్‌గా విక్రమ్ అపాయింట్ అవుతాడు. ఈ కేసు దర్యాప్తులో కొన్ని షాకింగ్ విషయాలు తెలుసుకుంటాడు. ఆ తర్వాత విక్రమ్ ఏం చేశాడు అనేది కథ. ఓటీటీ: ప్రైమ్ Aditya 369 అనుకోని పరిస్థితుల్లో ఓ సైంటిస్ట్ కనిపెట్టిన టైం మిషన్ ఎక్కిన కృష్ణకుమార్ (బాలకృష్ణ) అతని ప్రేయసి మోహిని(హేమ)… గతంలోకి శ్రీకృష్ణదేవరాయల కాలంలోకి వెళ్తారు.. అప్పుడు అక్కడ ఎలాంటి పరిస్థితులు ఎదుర్కొన్నారు. ఆ తర్వాత భవిష్యత్‌ కాలంలోకి ఎలా ప్రయాణించారు? తిరిగి వారు ప్రస్తుత కాలానికి వచ్చారా? లేదా అనేది మిగతా కథ ఓటీటీ: ప్రైమ్, యూట్యూబ్ Aha Naa Pellanta ఒక ధనిక పారిశ్రామిక వేత్త కొడుకై కృష్ణ మూర్తి, పరమ పిసినారి అయిన లక్ష్మిపతి కూతురు పద్మతో ప్రేమలో పడతాడు. అయితే లక్ష్మిపతిని తమ పెళ్లికి ఒప్పిస్తానని కృష్ణమూర్తి తన తండ్రితో ఛాలెంజ్ చేస్తాడు. ఈక్రమంలో అతను ఎలాంటి సమస్యలు ఎదుర్కొన్నాడు? చివరకు తాను చేసిన ఛాలెంజ్‌లో గెలిచాడా లేదా అన్నది కథ. ఓటీటీ: యూట్యూబ్ Vikram Vedha వేదా అనే గ్యాంగ్ స్టర్‌ను కనిపెట్టడానికి విక్రమ్ అనే పోలీస్ ఆఫీసర్ బయలుదేరాడు. వేద స్వచ్ఛందంగా తనకు తాను లొంగిపోతాడు. ఆ తర్వాత విక్రమ్‌కు అతను మూడు కథలు చెప్తాడు.దీంతో విక్రమ్ మంచి, చెడుపై ఉన్న తన అభిప్రాయాన్ని మార్చుకుంటాడు. ఇంతకు వేదా.. విక్రమ్‌కు ఏం చెప్పాడు అనేది మిగిలిన కథ. ఓటీటీ: ప్రైమ్ Bro మార్క్( సాయి ధరమ్ తేజ్) ఎప్పుడూ తన ఉద్యోగంతో బిజీగా ఉంటాడు. దేనికి టైం లేదు టైం లేదు అంటుంటాడు. కుటుంబం మొత్తం అతని సంపాదన మీదే ఆధారపడి ఉంటుంది. చివరకు తన ప్రేయసి రమ్య( కేతిక శర్మ)తో సమయం గడిపాడు. ఓ రోజు అకస్మాత్తుగా మార్క్ ప్రమాదం చనిపోతాడు. అతని ఆత్మ టైం గాడ్‌(పవన్ కళ్యాణ్‌)ను కలుస్తుంది. తన బాధ్యతలు నిర్వర్తించేందుకు తనకు రెండో ఛాన్స్ ఇవ్వాలని కోరగా.. టైం గాడ్ 90 రోజులు సమయం ఇస్తాడు. ఆ తర్వాత మార్క్ ఏం చేశాడు అనేది మిగతా కథఓటీటీ: నెట్‌ఫ్లిక్స్ Khaidi ఒక పేద రైతు కొడుకు సూర్యం, ఓ క్రూరమైన భూస్వామి కూతురుతో ప్రేమలో పడుతాడు. దీంతో ఆ భూస్వామి, సూర్యం కుటుంబాన్ని, అతని జీవితాన్ని చిద్రం చేస్తాడు. ఓటీటీ: యూట్యూబ్ Uppena మత్స్యకార కుటుంబానికి చెందిన ఆశీ (పంజా వైష్ణవ్‌ తేజ్‌) గొప్పింటి కుటుంబానికి చెందిన బేబమ్మ (కృతి శెట్టి)ను ప్రేమిస్తాడు. విషయం తెలుసుకున్న తండ్రి(విజయ్ సేతుపతి) ఏం చేశాడు? ప్రేమను దక్కించుకునే క్రమంలో ఆశీ ఏం కోల్పోయాడు? చివరకూ ఆ జంట ఎలా ఒక్కటైంది? అన్నది కథ. ఓటీటీ: నెట్‌ఫ్లిక్స్ Geetha Govindam గోవింద్‌ (విజయ్‌ దేవరకొండ) గుడిలో గీత (రష్మిక)ను చూసి తొలిచూపులోనే ఇష్టపడతాడు. విజయ్‌ ఊరు వెళ్లేందుకు బస్సు ఎక్కగా అతడి పక్క సీటులోనే గీత కూర్చుంటుంది. ఆమె నిద్రిస్తున్న క్రమంలో ముద్దు పెట్టేందుకు యత్నించి గీత దృష్టిలో విజయ్‌ రోగ్‌లా మారిపోతాడు. ఆ తర్వాత ఏం జరిగింది? విజయ్‌ ఆమె ప్రేమను ఎలా గెలుచుకున్నాడు? అన్నది కథ. ఓటీటీ: జీ5 Acharya బసవ(సోనూసూద్) పాలనలో ఉన్న ధర్మస్థలిలో అధర్మం రాజ్యమేలుతుంటుంది. ఆ సమయంలో ఆచార్య(చిరంజీవి) అక్కడకి వస్తాడు. బసవ, అతని మనుషులు చేసే అరాచకాలను ఆచార్య ఎలా ఎదురించాడు. అసలు ధర్మస్థలికి ఆచార్య ఎందుకు వస్తాడు? పాదఘట్టం సంరక్షకుడిగా ఉన్న సిద్ధకు ఆచార్యకు మధ్య సంబంధం ఏమిటి అనేది మిగిలిన కథ Rang De అను (కీర్తి సురేష్), అర్జున్ (నితిన్) ఇద్దరు చిన్ననాటి స్నేహితులు. ఒకరంటే ఒకరికి పడదు. అను అర్జున్‌ని ప్రేమిస్తుంది కానీ అతను ఆమెను ద్వేషిస్తాడు. కానీ ఓ సంఘటన వల్ల అర్జున్‌ అనును పెళ్లి చేసుకోవాల్సి వస్తుంది. ఆ తర్వాత ఏం జరిగింది? అను ప్రేమను అర్జున్ అర్థం చేసుకున్నాడా? లేదా? అన్నది మిగతా కథ.ఓటీటీ: జీ5 ఓటీటీ: ప్రైమ్ Induvadana వాసు (వరుమ్‌ సందేశ్‌) ఫారెస్ట్‌ పోలీసాఫీసర్‌. గిరిజన యువతి ఇందు (ఫర్నాజ్‌ శెట్టి)తో ప్రేమలో పడతాడు. కులం పేరుతో వారి పెళ్లిని పెద్దలు నిరాకరిస్తారు. ఈ క్రమంలోనే ఇందు హత్యకు గురవుతుంది. ఆ తర్వాత ఏం జరిగిందన్నది కథ. ఓటీటీ: యూట్యూబ్ Maharshi మహర్షి అనేది వంశీ పైడిపల్లి దర్శకత్వం వహించిన 2019 భారతీయ తెలుగు భాషా యాక్షన్ డ్రామా చిత్రం మరియు దీనిని శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్, వైజయంతీ మూవీస్ మరియు PVP సినిమా నిర్మించాయి. ఇందులో మహేష్ బాబు, అల్లరి నరేష్, పూజా హెగ్డే నటించారు. దేవి శ్రీ ప్రసాద్ సంగీతం సమకూర్చారు. ఈ చిత్రం 9 మే 2019న విడుదలైంది. ఓటీటీ: ప్రైమ్, ఆహా Aakaasam Nee Haddhu Ra సూర్య (మహా) గుంటూరులోని ఓ చిన్న కుగ్రామంలోని పోస్ట్ మాస్టర్ కొడుకు. తన తండ్రి వల్ల ఆ ఊరుకి కరెంట్ వస్తోంది. అలాంటి తండ్రి పెంపకంలో పెరిగిన మహా వల్ల ఆ ఊరికి రైలు వస్తోంది. అయితే ఆ తరువాత జరిగిన కొన్ని నాటకీయ పరిణామాల అనంతరం పేదవాడు కూడా ఫ్లైట్ లో ప్రయాణించగలగాలనే లక్ష్యంతో మహా 'డెక్కన్ ఎయిర్ లైన్' ప్రారంభిస్తాడు. కానీ ఈ మధ్యలో తన ఫ్లైట్ ఎగరడానికి మహా ఎలాంటి కష్టాలు ఎదుర్కొన్నాడు? అసలు చివరకు తాను కన్న కలను సాధించగలిగాడా ? లేదా ? అన్నది మిగతా కథ ఓటీటీ: ప్రైమ్ Ala Vaikunthapurramuloo బంటు(అల్లు అర్జున్) తన పెంపుడు తండ్రి అవమానాల మధ్య పెరిగి పెద్దవాడవుతాడు. కానీ తన నిజమైన తల్లిదండ్రుల గురించి తెలుసుకుని వారికి దగ్గర కావాలని నిర్ణయించుకుంటాడు. ఈ క్రమంలో బంటు నిజమైన తండ్రి కుటుంబానికి ఓ సమస్య వస్తుంది. ఆ సమస్యను బంటు ఎలా పరిష్కరించాడు? తన కుటుంబంలో ఎలా చేరాడు అనేది మిగతా కథ. ఓటీటీ: నెట్‌ఫ్లిక్స్ Munna కాలేజీ స్టూడెంట్ అయిన మున్నా.. తన తల్లి, సోదరిని చంపిన కాకా అనే గుండాను చంపాలనే లక్ష్యాన్ని కలిగి ఉంటాడు. ఈ ప్రక్రియలో కాకా గురించి మున్నా ఓ నిజాన్ని తెలుసుకుంటాడు. మున్నా తెలుసుకున్న నిజం ఏమిటి? కాకాతో మున్నాకు ఉన్న సంబంధం ఏమిటి? అన్నది మిగతా కథ. ఓటీటీ: యూట్యూబ్ RRR నిజాం రాజును కలిసేందుకు వచ్చిన బ్రిటిష్ అధికారి గోండు పిల్లను తమ వెంట ఢిల్లీకి తీసుకెళ్తారు. ఆ గోండు జాతి నాయకుడైన భీమ్(జూ.ఎన్టీఆర్) ఆ పిల్లను వెతుక్కుంటూ ఢిల్లీకి వస్తాడు. ఈ విషయం తెలిసిన బ్రిటిష్ ప్రభుత్వం అతన్ని పట్టుకునేందుకు రామరాజు(రామ్‌చరణ్‌)ను ప్రత్యేక అధికారిగా నియమిస్తుంది. ఈక్రమంలో ఓ సంఘటన వల్ల భీమ్- రామరాజు ఒకరికొకరు తెలియకుండానే ప్రాణ స్నేహితులుగా మారుతారు. కానీ కొన్ని పరిణామాల వల్ల ఒకరిపై ఒకరు దాడి చేసుకోవాల్సి వస్తుంది. ఇంతకు గోండు పిల్లను బ్రిటిష్ చర నుంచి భీమ్ విడిపించాడా? అసలు రామరాజు బ్రిటిషర్ల దగ్గర ఎందుకు పనిచేశాడు అనేది మిగతా కథ. ఓటీటీ: నెట్‌ఫ్లిక్స్, జీ5 Bommarillu సిద్ధూ తండ్రి అతనికి ఓ ధనవంతుడి కూతురితో పెళ్లి ఖాయం చేస్తాడు. అయితే సిద్ధూ తన తండ్రి తెచ్చిన సంబంధాన్ని కాదని హాసిని అనే యువతితో ప్రేమలో పడటంతో కథ ఆసక్తికరమైన మలుపు తిరుగుతుంది. ఓటీటీ: యూట్యూబ్ Dear Comrade స్టూడెంట్ లీడర్ అయిన బాబీ(విజయ్ దేవరకొండ).. స్టేట్ లెవల్ క్రికెటర్ అయిన లిల్లీతో ప్రేమలో పడుతాడు. అతని దుడుకు స్వభావం వల్ల లిల్లీ అతనికి దూరం అవుతుంది. ఈ క్రమంలో లిల్లీ ఓ సమస్యలో చిక్కుకుంటుంది. లిల్లీ సమస్యను బాబీ ఏవిధంగా పరిష్కరించి తిరిగి ఆమెకు ఎలా దగ్గరయ్యాడు అనేది కథ. ఓటీటీ: ప్రైమ్ Jathi Ratnalu మంచి ఉద్యోగాల కోసం తమ ఊరి నుంచి హైదరాబాద్ వచ్చిన ముగ్గురు యువకులు ఓ అపార్ట్‌మెంటులో దిగుతారు. అక్కడ పిలువని పార్టీకి వెళ్లి మర్డర్ అటెంప్ట్ కేసులో ఇరుక్కుంటారు. ఆ తర్వాత కేసు నుంచి ఎలా బయటపడ్డారనేది కథ. ఓటీటీ: ప్రైమ్ Dirty Hari హరికి హైదరాబాద్‌లో కోటీశ్వరురాలైన వసుధతో ప్రేమలో పడుతాడు. వారి ప్రేమ సాగుతున్న క్రమంలో వసుధ అన్న గర్ల్‌ఫ్రెండ్ అందానికి ఆకర్షితుడవుతాడు. ఒకరికి తెలియకుండా ఒకరితో సంబంధాన్ని కొనసాగిస్తాడు. ఆ తర్వాత ఏం జరిగిందనేది కథ ఓటీటీ: ఆహా Arjun Reddy అర్జున్ రెడ్డి టాలెంట్ ఉన్న ఒక యువ సర్జన్. ప్రీతి అనే యువతిని ప్రాణం కన్నా ఎక్కువగా ప్రేమిస్తాడు. అయితే ఓ సంఘటన అర్జున్ రెడ్డిని షాక్‌కు గురిచేస్తుంది. మద్యానికి బానిసవుతాడు. ఇంతకు తన ప్రేయసిని అతను తిరిగి కలుసుకున్నాడా లేదా? అన్నది మిగతా కథ. ఓటీటీ: ఆహా, ప్రైమ్ Rangasthalam ఊరి ప్రెసిడెంట్‌గా 30 ఏళ్ల నుంచి ఫణీంద్ర భూపతి (జగపతిబాబు) ప్రజలను పీడిస్తుంటాడు. అతడి అన్యాయాలకు హీరో అన్న కుమార్‌బాబు (ఆది పినిశెట్టి) ఎదురు తిరుగుతాడు. ఫణీంద్ర భూపతికి పోటీగా నామినేషన్‌ వేస్తాడు. ఈ క్రమంలోనే కుమార్‌బాబు అనూహ్యంగా హత్యకు గురవుతాడు. అన్న చావుని చూసిన చిట్టిబాబు (రామ్‌చరణ్‌) ఎలా రివేంజ్‌ తీర్చుకున్నాడన్నది కథ. ఓటీటీ: ప్రైమ్
    జూన్ 25 , 2024
    Allu Sneha Reddy: అల్లు అర్జున్ భార్య స్నేహా రెడ్డి గురించి ఈ టాప్ సీక్రెట్స్ మీకు తెలుసా?
    Allu Sneha Reddy: అల్లు అర్జున్ భార్య స్నేహా రెడ్డి గురించి ఈ టాప్ సీక్రెట్స్ మీకు తెలుసా?
    అల్లు అర్జున్ భార్యగా అల్లు స్నేహా రెడ్డి (Allu Sneha Reddy) తెలుగు ప్రేక్షకులకు సుపరిచితం. ఐకాన్ స్టార్‌ అల్లు అర్జున్‌తో వివాహ బంధంలోకి స్నేహరెడ్డి అడుపెట్టి నేటికి 13 వసంతాలు పూర్తయ్యాయి. టాలీవుడ్‌లో ఎంతో మంది సెలబ్రెటీల చేత ఐకానిక్ జంటగా స్నేహ రెడ్డి- బన్నీ జంట గుర్తింపు పొందింది. కేవలం ఓ స్టార్ హీరో భార్యగా మాత్రమే  కాకుండా స్నేహా రెడ్డి తనకంటూ  ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. ఫ్యాషన్‌పై తనకున్న అభిరుచి ఇతర దృక్కొణాలు ఆమెను లేడీ ఐకానిక్ స్టార్‌గా నిలిపాయి. ఈక్రమంలో స్నేహా రెడ్డి గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలు ఇప్పుడు చూద్దాం. ఫాలోయింగ్‌లో తగ్గేదేలే  స్నేహరెడ్డి సోషల్ మీడియాలో చాలా యాక్టివ్. ఇన్‌స్టాగ్రాంలో స్నేహాకు ఏకంగా  9.1 మిలియన్ల ఫాలోవర్లు ఉన్నారు.  అందంలోనూ టాప్ ప్రస్తుతం స్నేహారెడ్డి వయసు 38. హీరోయిన్లకు ఏ మాత్రం తీసిపోని అందం తనది. ఇద్దరు పిల్లలకు జన్మనిచ్చినా ఇప్పటికీ స్నేహా రెడ్డి ఫిట్‌గా ఉంటారు.  రోజూ సాయంత్రం కేబీఆర్ పార్కులో రన్నింగ్ ఆమె డైలీ హ్యాబిట్ ఫ్యాషన్ ఐకాన్ ఏ సెలబ్రెటీతో పోల్చినా ఫ్యాషన్‌లో ఓ మెట్టు పైనే ఉంటుంది. ఇటీవలే సిల్వర్ ఆకులతో ఎంబ్రాయిడరీ చేయించిన చీరను స్నేహా రెడ్డి ధరించింది. దీని ధర సుమారు రూ.1.45కోట్లు ఉంటుందని అంచనా  ప్రతిరోజు యోగా చేయడం స్నేహ దినచర్య. యోగా మెళకువలు, ఫ్యాషన్ టిప్స్ అప్పుడప్పుడూ ఫ్యాన్స్‌తో పంచుకుంటుంటుంది. యాక్టివ్ రెస్పాన్స్ ఫుడ్, ట్రావెల్ అంటే స్నేహా రెడ్డికి మక్కువ. ఎప్పుడూ వీటికి సంబంధించిన అంశాలను తను షేర్ చేస్తూ ఉంటుంది. ఫ్యాన్స్ అడిగిన ప్రశ్నలకు సమాధానమిస్తూ ఉంటుంది. సినిమాల్లోకి స్నేహరెడ్డి? ఇంత అందం, ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న స్నేహా రెడ్డి త్వరలో మేకప్ వేసుకోనున్నట్లు తెలుస్తోంది. దీనికి బన్నీ కూడా ఒకే చెప్పినట్లు సమాచారం. మలయాల సినిమాతో స్నేహా రెడ్డి ఎంట్రీ ఉంటుందట. ఓ స్టార్ హీరో సరసన నటించనున్నట్లు సమాచారం. మలయాళంలో అల్లు అర్జున్‌కి క్రేజ్ ఎక్కువ. అందుకే తన డెబ్యూ సినిమాకు అక్కడ ప్లాన్ చేసినట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. స్నేహా రెడ్డి తెరంగేట్రం చేస్తే మరింత అభిమానాన్ని సొంతం చేసుకోగలదు.
    మార్చి 06 , 2024
    Allu Arjun : వైసీపీ ఎమ్మెల్యేకు మద్దతు పలికిన అల్లు అర్జున్.. పవన్‌ కళ్యాన్‌కు గట్టి షాక్!
    Allu Arjun : వైసీపీ ఎమ్మెల్యేకు మద్దతు పలికిన అల్లు అర్జున్.. పవన్‌ కళ్యాన్‌కు గట్టి షాక్!
    ఏపీ ఎన్నికల ప్రచారంలో శనివారం (మే 11) ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. ఐకాన్ స్టార్‌ అల్లు అర్జున్ (Allu Arjun), మెగా పవర్‌ స్టార్‌ రామ్‌ చరణ్‌ (Ram Charan) ఎలక్షన్‌ క్యాంపెయిన్‌లో ప్రత్యర్థులుగా మారారు. ముఖ్యంగా బన్నీ.. వైకాపా అభ్యర్థి తరపున ప్రచారం నిర్వహించి మెగా ఫ్యాన్స్‌కు, జన సైనికులకు షాకిచ్చాడు. సీఎం జగన్‌ నిలబెట్టిన అభ్యర్థిని గెలిపించాలంటూ అభ్యర్థించాడు. మరోవైపు అదే సమయంలో చిరు తనయుడు రామ్‌చరణ్‌.. పవన్‌ కల్యాణ్‌ పోటీ చేస్తున్న పిఠాపురంలో పర్యటించి బాబాయి గెలుపునకు కృషి చేస్తున్నాడు. ప్రస్తుత ఈ రెండు ఘటనలు టాలీవుడ్‌లో చర్చనీయాంశంగా మారాయి. ఏపీ ఎన్నికల వేళ మెగా ఫ్యామిలీ రెండు విడిపోయిందా? అన్న కామెంట్లు వినిపిస్తున్నాయి. ఫ్రెండ్‌ కోసం బన్నీ! నంద్యాల వైసీపీ అభ్యర్థి శిల్పా రవికి  మద్దతు  తెలపడానికి ఐకాన్‌ స్టార్‌ అల్లుఅర్జున్‌ నంద్యాలకు వెళ్లాడు. దీంతో బన్నీ వ్యవహార శైలి ఏపీలో చర్చనీయాంశంగా మారింది. శిల్పా రవి భార్య నాగిని రెడ్డి.. అల్లు అర్జున్ భార్య స్నేహ రెడ్డి క్లాస్ మెట్స్. అలా శిల్పా రవితో బన్నీకి పరిచయం ఏర్పడి స్నేహాంగా మారింది. 2019 ఎన్నికల సమయంలో శిల్పా రవికి బన్నీ ట్విటర్‌ ద్వారా ‘ఆల్‌ ది బెస్ట్‌’ తెలిపి ఊరుకున్నారు. ఆ ఎన్నికల్లో ఆయన భారీ మెజార్టీతో విజయం కూడా సాధించారు. ఈసారి కూడా వైకాపా తరపున శిల్పా రవి బరిలో ఉండటంతో బన్నీ నేరుగా రంగంలోకి దిగాడు. మామయ్య పవన్‌ కల్యాణ్ గెలుపును కాంక్షిస్తూ ఇటీవల ట్విటర్‌లో పోస్టు మాత్రమే పెట్టిన బన్నీ.. పవన్‌ ప్రత్యర్థి పార్టీకి చెందిన అభ్యర్థి కోసం స్వయంగా రావడం పొలిటికల్‌ వర్గాల్లో హాట్‌ టాపిక్‌గా మారింది. కాగా, నంద్యాలలో కూటమి అభర్థిగా టీడీపీ నేత ఫరూఖ్‌ బరిలో ఉన్నారు.  https://twitter.com/i/status/1789232102518444087 బన్నీకి ఘన స్వాగతం భార్య సతీమణితో కలిసి నంద్యాల వచ్చిన బన్నీకి వైకాపా అభ్యర్థి శిల్పా రవి దంపతులు గజ మాలతో ఘన స్వాగతం పలికారు. అంతకుముందు బన్నీ రాక గురించి తెలుసుకున్న ఫ్యాన్స్‌ పెద్ద ఎత్తున నంద్యాల రోడ్లపైకి చేరుకున్నారు. అతడి రేంజ్‌ రోవర్‌ కారును చుట్టుముట్టారు. వేలాది అభిమానుల మధ్య శిల్ప ఇంటికి చేరిన బన్నీ.. బాల్కనీ నుంచి ఫ్యాన్స్‌కు అభివాదం చేశాడు. ఇందుకు సంబంధించిన వీడియోలు ప్రస్తుతం వైరల్‌గా మారాయి. అవి చూసిన జనసైనికులు బన్నీ చర్యపై మండిపడుతున్నారు. బన్నీ నిజస్వరూపం బయటపడిందంటూ ఘాటుగా పోస్టులు పెడుతున్నారు.  https://twitter.com/i/status/1789223801865359728 చంద్రబాబు రియాక్షన్‌ నంద్యాలలో బన్నీ పర్యటనపై తెలుగు దేశం అధినేత చంద్రబాబు స్పందించాడు. స్నేహితుడని భావించి అల్లు అర్జున్‌ వైకాపా అభ్యర్థి ఇంటికి వెళ్తే దాన్ని కూడా రాజకీయం చేస్తున్నారని మండిపడ్డారు. ఈ అంశాన్ని పట్టుకొని వైకాపా చౌకబారు రాజకీయాలు చేస్తోందంటూ విమర్శించారు. జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ తమ వెంట ఉన్నాడన్న విషయాన్ని ఈ సందర్భంగా చంద్రబాబు గుర్తు చేశారు. ప్రస్తుతం చంద్రబాబు వ్యాఖ్యలకు సంబంధించిన వీడియో కూడా నెట్టింట వైరల్‌ అవుతోంది.  https://twitter.com/SumanthOffl/status/1789218767366652109 పిఠాపురంలో రామ్‌చరణ్‌ జనసేనాని పవన్‌ కల్యాణ్‌ పోటీ చేస్తున్న పిఠాపురంలో గత కొన్ని రోజులుగా తారల సందడి నెలకొండి. పవన్‌కు మద్దతు సినీ నటులు ప్రచారం చేస్తున్నారు. ఈ క్రమంలోనే తన బాబాయ్‌ కోసం తల్లి సురేఖ, మామ అల్లు అరవింద్‌తో కలిసి రామ్‌చరణ్‌ పిఠాపురం వెళ్లాడు. అంతకుముందు రాజమండ్రి ఎయిర్‌పోర్టులో దిగిన రామ్‌చరణ్‌ను చూసేందుకు పెద్ద ఎత్తున అభిమానులు వచ్చారు. కేరంతలు, ఆనందోత్సాహాల మధ్య తమ అభిమాన హీరోకు ఘన స్వాగతం పలికారు. తొలుత పిఠాపురంలో కుక్కుటేశ్వర స్వామిని దర్శించిన చరణ్‌.. పట్టణంలో పర్యటిస్తున్నారు. కాగా, నేటితో ఏపీ ఎన్నికల ప్రచారం ముగియనుంది.  https://twitter.com/i/status/1789234120356499943
    మే 11 , 2024
    HEROS WIFES : టాలీవుడ్ హీరోల భార్యలుగానే కాదు… ఈ నారీమణులకు వారికంటూ ఓ గుర్తింపు ఉంది !
    HEROS WIFES : టాలీవుడ్ హీరోల భార్యలుగానే కాదు… ఈ నారీమణులకు వారికంటూ ఓ గుర్తింపు ఉంది !
    టాలీవుడ్‌ టాప్ హీరోల భార్యలు చాలామంది సుపరిచితమే. కథానాయికల భార్యలుగా కాకుండా వారికంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించిన వాళ్లు ఉన్నారు. వ్యాపారంతో సహా వివిధ వృత్తుల్లో రాణిస్తున్నారు. వాళ్లేవరూ? ఏ పనులు చేస్తున్నారో తెలుసుకోండి.  అల్లు స్నేహా రెడ్డి అల్లు అర్జున్ భార్య స్నేహా రెడ్డి తన తండ్రి కళాశాలలో కీలక బాధ్యతలు నిర్వర్తిస్తోంది. SIT ప్లేస్‌మెంట్‌ సెల్ డైరెక్టర్‌గా ఉంది స్నేహా. అంతేకాదు, యువతను ప్రోత్సహించే దిశగా తీసుకువచ్చిన కాలేజీ మ్యాగజైన్‌కు చీఫ్ ఎడిటర్‌గాను సేవలందిస్తోంది. కళాశాలకు సంబంధించిన ప్రతి ఈవెంట్‌లో ఉత్సాహంగా పాల్గొంటుంది స్నేహా రెడ్డి. ప్రస్తుతం ఫ్యాషన్ రంగంలోనూ మెళకువలు సాధించింది. ఓ మళయాలం చిత్రంలోనూ నటిస్తుందని టాక్.  ఉపాసన కొణిదెల మెగాస్టార్‌ కోడలిగా మెగా పవర్‌ స్టార్‌కు రామ్ చరణ్‌కు భార్య అయినప్పటికీ ఉపాసన తనకంటూ ప్రత్యేకంగా గుర్తింపు తెచ్చుకున్నారు. URLIFE అనే వెల్‌నెస్‌ సంస్థను స్థాపించడంతో పాటు అపోలో ఆస్పత్రికి వైస్‌ ఛైర్‌పర్సన్‌గాను కార్యకలాపాలను కొనసాగిస్తున్నారు ఉప్సీ. జంతు సంరక్షురాలిగానూ ఆమె సేవలందిస్తున్నారు.  ప్రణతి జూనియర్ ఎన్టీఆర్ భార్య ప్రణతి వ్యాపారవేత్త కుమార్తె. వివాహం చేసుకున్న తర్వాత గృహిణిగానే ఉంటున్నారు. అయితే.. కొన్ని వ్యాపారాల్లో భాగస్వామిగా ఉన్నట్లు చెబుతున్నారు. నమ్రతా షిరోద్కర్‌ మహేశ్‌ బాబు భార్య నమ్రతా షిరోద్కర్‌ ఓ బాలీవుడ్ నటి. సినిమాల్లోకి రాకముందు మోడల్‌గాను గుర్తింపు పొందారు. తెలుగులో వంశీ, అంజి వంటి చిత్రాల్లో హీరోయిన్‌గా చేశారు. వివాహం తర్వాత సినిమాలకు దూరమైనప్పటికీ తర్వాత మహేశ్‌ బాబు చేపడుతున్న సామాజిక కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు నమ్రతా. మహేశ్‌ దత్తత తీసుకున్న ఊర్లను దగ్గరుండి బాగు చేయించారు. వివిధ ఆర్థిక వ్యవహారాలను కూడా చూసుకుంటున్నారు.  అంజనా నాని భార్య అంజనా గతంలో సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌గా పనిచేశారు. అసిస్టెంట్‌ డైరెక్టర్‌గా ఉన్నప్పుడు అంజనాని నాని పెళ్లి చేసుకున్నాడు. ఇంట్లో వాళ్లని ఒప్పించడానికి దాదాపు 5 ఏళ్లు ఆగారు. పెళ్లి తర్వాత ఆమె ఇంట్లోనే ఉంటున్నారు. కొన్ని వ్యాపారాలను చూసుకుంటున్నారని తెలుస్తోంది.  జ్యోతిక జ్యోతిక సినిమాల్లో హీరోయిన్‌గా చేశారు. సూర్యను వివాహం చేసుకున్న తర్వాత కొన్నిరోజులు దూరమైనప్పటికీ తర్వాత సెకండ్‌ ఇన్నింగ్స్ ప్రారంభించారు. ప్రస్తుతం సినిమాలకు నిర్మాతగానూ వ్యవహరిస్తున్నారు జ్యోతిక. అమల హీరోయిన్ అమల ప్రస్తుతం సినిమాల్లో పాత్రలు పోషిస్తూనే NGOకి కో- ఫౌండర్‌గా ఉన్నారు. ది బ్లూ క్రాస్‌ హైదరాబాద్‌ ఎన్జీవోకి సేవలందిస్తున్నారు. జంతువుల సంరక్షణ కోసం చాలాకాలంగా కృషి చేస్తున్నారు అమల.
    ఏప్రిల్ 18 , 2023
    20 Years Of Allu Arjun: వీడు హీరోనా అన్నారు..ఐకాన్‌ స్టార్‌ అయ్యాడు!
    20 Years Of Allu Arjun: వీడు హీరోనా అన్నారు..ఐకాన్‌ స్టార్‌ అయ్యాడు!
    ‘అల్లు అర్జున్‌’... ! పుష్ప సినిమాతో ఇండియాను షేక్‌ చేసి పాన్‌ ఇండియన్‌ స్టార్‌. ఐకాన్‌ స్టార్‌. అత్యధిక రెమ్యూనరేషన్‌ తీసుకుంటున్న నటుల్లో ఒకరు. బ్రాండ్‌ వాల్యూలో ఇండియాలో టాప్‌-25లో చోటు దక్కించుకున్న ఏకైక సౌత్‌ ఇండియన్‌ హీరో. హైయెస్ట్‌ రెమ్యూనరేషన్‌ తీసుకుంటున్న వారిలో ఒకడు. కానీ ఇదంతా ఒక్క రోజులో రాలేదు. 20 ఏళ్ల కఠోర శ్రమ, నిబద్ధత పట్టుదల, కథల ఎంపికలో వైవిధ్యత సినిమా కోసం కష్టపడే తత్వం ఇవన్నీకలిపితేనే ఐకాన్‌ స్టార్‌ అల్లు అర్జున్‌. https://telugu.yousay.tv/allu-arjun-pushpa-will-decrease-in-brand-value-allu-arjun-rashmika-and-pv-sindhu-in-top-25.html తొలి అడుగు 28 మార్చి 2003లో గంగోత్రి సినిమా వచ్చినపుడు చాలా మంది విమర్శించారు. ఇతను హీరోనా అని మాట్లాడిన వారు కూడా ఉన్నారు. కానీ అల్లు అర్జున్ వాటన్నింటికీ సమాధానం చెప్పాడు. 6 ఫిల్మ్‌ఫేర్‌ అవార్డులు, 3 నంది అవార్డులతో తనలోని నటుడిని ప్రపంచానికి చాటాడు. మరి అల్లు అర్జున్‌ను స్టార్‌ చేసిన అంశాలేంటో చూద్దాం. కథల ఎంపిక గంగోత్రి విడుదలైన నాటి నుంచి ఇప్పటిదాకా అల్లు అర్జున్‌ను స్టార్‌గా నిలిచేలా చేసింది మాత్రం అతడి స్టోరీ సెలెక్షన్‌. అల్లు అర్జున్‌ ఏ రెండు వరుస సినిమాలు కూడా ఒకే పంథాలో సాగవు. లుక్‌, మేనరిజం ఇలా ప్రతీది మారిపోతుంది. గంగోత్రితో విమర్శలు ఎదుర్కొన్నా… ఆ తర్వాత 2004లో వచ్చిన సుకుమార్‌ ‘ఆర్య’ సినిమా అల్లు అర్జున్‌ పేరు మార్మోగేలా చేసింది. అప్పటిదాకా తెలుగు సినిమా చూడని వెరైటీ లవ్‌స్టోరీని అల్లు అర్జున్‌ ఎంపిక చేసుకోవడం సాహసమనే చెప్పాలి. ఆ తర్వాత వచ్చిన సినిమాలన్నింటిలోనూ అల్లు అర్జున్ డిఫరెంట్‌గానే కనిపిస్తాడు. బన్నీ, పరుగు, దేశముదురు, ఆర్య-2, వేదం, దువ్వాడ జగన్నాథం, అల వైకుంఠపురములో ఇలా తనలోని నటుడిని సినీ ప్రపంచానికి పరిచయం చేస్తూనే వచ్చాడు. పుష్పలో అయితే ఊర మాస్‌ లుక్‌లో బాక్సాఫీస్‌ను షేక్‌ చేశాడు. డ్యాన్స్‌ మరో మాట లేకుండా ఇండియాలోని  హీరోల్లో బెస్ట్‌ డ్యాన్సర్స్‌లో అల్లు అర్జున్‌ ఒకడు. అతడి డ్యాన్స్‌కు టాలివుడ్‌లోనే కాదు బాలివుడ్‌లోనూ ఫ్యాన్స్‌ ఉన్నారు. ఆర్య-2, అల వైకుంఠపురములో, రేసు గుర్రం ఇలా ఏ సినిమా తీసుకున్నా అల్లు అర్జున్‌ డ్యాన్స్‌కు ఫిదా కావాల్సిందే. సుకుమార్ అల్లు అర్జున్‌ కెరీర్‌లో సుకుమార్‌ది కీలక పాత్ర అనడం అతిశయోక్తి కాదు. అప్పుడు ఆర్యతో అతడి కెరీర్‌ను మలుపు తిప్పాడు. అలాగే ‘పుష్ప’తో పాన్‌ ఇండియా స్టార్‌ మార్చాడు. ఇప్పుడు పుష్ప: ది రూల్‌తో గ్లోబల్‌ స్టార్‌గా ఎదిగినా ఆశ్చర్యపోవాల్సిన పనిలేదు.  https://telugu.yousay.tv/allu-arjun-passed-prabhas-in-remuneration.html అల్లు అర్జున్‌ చేసిన అద్భుతమైన పాత్రలు అల్లు అర్జున్‌ సినీ కెరీర్‌లో కథల ఎంపిక, డ్యాన్స్‌లతో పాటు కొన్ని పాత్రలు సినీ ప్రియులు మరిచిపోలేరు. అవి ఆర్య సుకుమార్‌ కల్ట్‌ క్లాసిక్‌ మూవీ ఆర్యలో ‘ఆర్య’గా అల్లు అర్జున్‌ను ఎవరూ మర్చిపోలేరు. సినిమా అంతా నవ్వించినా, నవ్వులపాలైనా చివరిలో కన్నీరు పెట్టించినా ‘ఆర్య’ పాత్ర సూపర్‌ అని చెప్పాలి. బాల గోవింద్‌ అల్లు అర్జున్‌కు మాస్‌ ఇమేజ్ తెచ్చిన సినిమా దేశముదురు. ఇందులో బాల గోవింద్‌గా అల్లు అర్జున్ పాత్ర ఊర మాస్‌ ఉంటుంది. ఇందులో బాలగోవింద్‌ డైలాగ్స్‌ ఇప్పటికీ చాలా మందికి ఫేవరెట్‌గా ఉంటాయి. గోన గన్నారెడ్డి స్టైలిష్‌ స్టార్‌గా ఉన్న అల్లు అర్జున్‌ కంప్లీట్‌ డీ గ్లామర్‌ రోల్‌లో చూపించిన సినిమా రుద్రమదేవి. ఇందులో గోన గన్నారెడ్డిగా తెలంగాణ యాసలో అల్లు అర్జున్‌ చెప్పే డైలాగులు ఎవరూ మర్చిపోలేరు. కేబుల్‌ రాజు క్రిష్‌ తెరకెక్కించిన ‘వేదం’ విమర్శకుల ప్రశంసలు అందుకున్న సినిమా. హీరోయిజంకు ఏమాత్రం అవకాశం లేకుండా కేవలం నటనా ప్రాధాన్యం ఉన్న పాత్ర కేబుల్‌ రాజు. ఎంతోమంది మిడిల్‌ క్లాస్‌ కుర్రాళ్లకు కనెక్ట్‌ అయిన పాత్ర. ఇది కూడా అల్లు అర్జున్ కెరీర్‌లో అద్భుతమైన పాత్రల్లో ఒకటి. పుష్ప ఫైనల్‌గా ‘పుష్ప’. పుష్పరాజ్‌ అంటూ అల్లు అర్జున్‌ చేసిన ఈ పాత్ర తన కెరీర్‌లో మైలురాయి. 20 ఏళ్ల కష్టానికి ఫలితాన్నిచ్చిన పాత్ర. ప్రస్తుతం పుష్ప-2 కోసం అల్లు అర్జున్‌ కష్టపడుతున్నారు. సుకుమార్‌ కూడా చాలా ప్రతిష్ఠాత్మకంగా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నాడు. ఆ తర్వాత సెన్సేషనల్‌ డైరెక్టర్‌ సందీప్‌ రెడ్డి వంగాతోనూ అల్లు అర్జున్ ఓ సినిమా చేయబోతున్నాడు. ఈ సినిమాపై కూడా భారీ అంచనాలున్నాయి. తన 20 ఏళ్ల ప్రయాణంపై అల్లు అర్జున్‌ ఎమోషనల్ పోస్ట్‌ చేశారు. ‘ఇవాళ నేను ఈ స్థాయిలో ఉన్నానంటే దానికి కారణం ప్రేక్షకులు, అభిమానులే. సదా మీకు కృతజ్ఞుడను’ అంటూ అల్లు అర్జున్‌ ట్వీట్ చేశాడు. https://twitter.com/alluarjun/status/1640581255732535296?s=20
    మార్చి 28 , 2023
    Allu Sneha Reddy: క్యూట్ కపుల్‌ అల్లు అర్జున్, స్నేహా రెడ్డి ప్రేమ పెళ్లికి 12 ఏళ్లు
    Allu Sneha Reddy: క్యూట్ కపుల్‌ అల్లు అర్జున్, స్నేహా రెడ్డి ప్రేమ పెళ్లికి 12 ఏళ్లు
    ]మరిన్ని కథనాల కోసం  మా వెబ్‌సైట్‌ చూడండి.  YouSay యాప్‌ డౌన్‌లోడ్‌ చేసుకోండి.Download Our App
    మార్చి 06 , 2023
    Allu Arjun - Atlee: తమిళ స్టార్‌ డైరెక్టర్‌తో బన్నీ సినిమా షురూ.! ముహూర్తం ఎప్పుడంటే?
    Allu Arjun - Atlee: తమిళ స్టార్‌ డైరెక్టర్‌తో బన్నీ సినిమా షురూ.! ముహూర్తం ఎప్పుడంటే?
    ఐకాన్‌ స్టార్‌ అల్లు అర్జున్ (Allu Arjun) ప్రస్తుతం తన కెరీర్‌లో టాప్‌ గేర్‌లో దూసుకెళ్తున్నాడు. సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన 'పుష్ప' (Pushpa: The Rise)తో బ్లాక్‌ బాస్టర్‌ విజయాన్ని అందుకున్న బన్నీ.. ఆ మూవీతో పాన్‌ ఇండియా స్టార్‌గా మారిపోయాడు. ఈ చిత్రానికి గాను ఏకంగా జాతీయ ఉత్తమ నటుడిగా అవార్డు అందుకొని సత్తా చాటాడు. టాలీవుడ్‌ నుంచి ఈ అవార్డు అందుకున్న మెుట్టమెుదటి హీరోగా బన్నీ చరిత్ర సృష్టించాడు. ఇదిలా ఉంటే ప్రస్తుతం బన్నీ ‘పుష్ప 2’ (Pushpa 2: The Rule) షూటింగ్‌లో బిజీ బిజీగా ఉన్నాడు. ఈ చిత్రం తర్వాత తమిళ స్టార్‌ డైరెక్టర్‌ అట్లీ (Atlee) దర్శకత్వంలో అల్లు అర్జున్‌ సినిమా ఉంటుందని గత కొంతకాలంగా ప్రచారం జరుగుతోంది. తాజాగా బన్నీ - అట్లీ సినిమాకు సంబంధించి ఓ అప్‌డేట్‌ బయటకొచ్చింది.  బన్నీ నెక్స్ట్‌ మూవీ అట్లీతోనే! ‘పుష్ప 2’ మూవీ తర్వాత అల్లు అర్జున్‌ చేతిలో పలు క్రేజీ ప్రాజెక్టులు సిద్ధంగా ఉన్నాయి. త్రివిక్రమ్ (Trivikram), సందీప్ రెడ్డి వంగా (Sandeep Reddy Vanga), బోయపాటి శ్రీను (Boyapati Srinu), అట్లీ, సురేంద్ రెడ్డి (Surender Reddy) వంటి దర్శకులతో బన్నీ సినిమాలు చేయనున్నట్లు సమాచారం.  అయితే ‘పుష్ప 2’ మూవీ తర్వాత ముందుగా డైరెక్టర్‌ అట్లీతో బన్నీ సినిమా చేయనున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమాను అల్లు అర్జున్ పుట్టిన రోజైన ఏప్రిల్ 8న అధికారికంగా ప్రకటించే అవకాశాలున్నాయి. ఈ సినిమాను కూడా అట్లీ.. పాన్‌ ఇండియా లెవల్లో భారీ యాక్షన్ మూవీగా తెరకెక్కించబోతున్నారట. ఇటీవల బాలీవుడ్‌ స్టార్‌ షారుక్‌ ఖాన్‌ (Shah Rukh Khan)తో ‘జవాన్‌’ (Jawan) తీసిన అట్లీ.. పాన్‌ ఇండియా స్థాయిలో బ్లాక్‌బాస్టర్‌ విజయాన్ని అందుకున్నాడు. ఆ చిత్రం తర్వాత బన్నీతో సినిమా తీయనుండటంతో ఇప్పటి నుంచే మూవీపై అంచనాలు మెుదలయ్యాయి.   టీమ్‌తో అట్లీ చర్చలు.. వీడియో వైరల్‌! బన్నీ - అట్లీ కాంబోలో రానున్న చిత్రానికి సంబంధించి ప్రీ ప్రొడక్షన్‌ పనులు కూడా మెుదలైనట్లు తెలుస్తోంది. తాజాగా డైరెక్టర్ అట్లీ (Director Atlee) తన టీమ్‌తో కలిసి డిస్కషన్‌ చేస్తున్న వీడియో ఒకటి బయటకొచ్చింది. ఆ డిస్కషన్‌ బన్నీ మూవీకి సంబంధించే జరిగిందని కోలీవుడ్‌ వర్గాలు పేర్కొన్నాయి. దీంతో ఆ వీడియోను బన్నీ ఫ్యాన్స్ తెగ వైరల్ చేస్తున్నారు. ఈ బన్నీ-అట్లీ కాంబోలో మూవీ కోసం తాము ఎంతగానో ఎదురు చూస్తున్నట్లు నెటిజన్లు కామెంట్స్‌ చేస్తున్నారు. ‘పుష్ప’ చిత్రానికి మించి ఈ సినిమా ఉండాలని ఆకాంక్షిస్తున్నారు.  https://twitter.com/i/status/1767966970966847605 ఆ హీరోయిన్‌గా హ్యాట్రిక్‌! అట్లీ డైరెక్షన్‌లో రానున్న ఈ చిత్రంలో బన్నీ సరసన పూజా హెగ్డే (Pooja Hegde) పేరును పరిశీలిస్తున్నారట. బన్నీకి జోడీగా పూజా సరిగ్గా సరిపోతుందని చిత్ర యూనిట్‌ భావిస్తోందట. పాత్రకు కూడా ఆమె బాగా సెట్‌ అవుతుందని అనుకుంటున్నారట. దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. కాగా, ఇప్పటికే బన్నీ - పూజా హెగ్డే కాంబోలో రెండు చిత్రాలు వచ్చాయి. 'దువ్వాడ జగన్నాథం' (Duvvada Jagannadham), 'అలా వైకుంఠపురంలో' (Ala Vaikuntapurramuloo) వీరిద్దరు జంటగా చేశారు. వీరు పెయిర్‌ బాగుందంటూ అప్పట్లో కథనాలు కూడా వచ్చాయి. ఇక సినిమాకు మ్యూజిక్‌ డైరెక్టర్‌గా అనిరుధ్‌ను ఎంపిక చేసినట్లు తెలుస్తోంది.  అట్లీకి భారీ రెమ్యూనరేషన్‌! బన్నీతో మూవీ కోసం డైరెక్టర్‌ అట్లీ.. గట్టిగానే రెమ్యూనరేషన్‌ను డిమాండ్‌ చేసినట్లు వార్తలు వస్తున్నాయి. తన రీసెంట్‌ మూవీ ‘జవాన్‌’ (Jawan) సూపర్‌ సక్సెస్‌ కావడంతో అల్లు అర్జున్‌ చిత్రం కోసం అట్లీ ఏకంగా రూ.60 కోట్లు కావాలన్నాడట. మేకర్స్‌ కూడా ఇందుకు ఓకే చెప్పినట్లు కోలీవుడ్‌లో టాక్‌ వినిపిస్తోంది. దర్శకుడికే రూ.60 కోట్లు ఇస్తే బన్నీకి ఇక ఏ రేంజ్‌లో రెమ్యూనరేషన్‌ ముట్టనుందోనని నెటిజన్లు కామెంట్స్‌ చేస్తున్నారు. 
    మార్చి 14 , 2024
    Father's Day Special: నాన్నలతో ఈ స్టార్‌ సెలబ్రిటీల అనుబంధం చూశారా?
    Father's Day Special: నాన్నలతో ఈ స్టార్‌ సెలబ్రిటీల అనుబంధం చూశారా?
    ఫాదర్స్ డే (Fathers Day 2024)ను సెలబ్రిటీలు ఘనంగా జరుపుకున్నారు. తమ కూతుళ్లు, కొడుకులు, తండ్రులతో దిగిన ఫొటోలను షేర్ చేస్తూ వారిపై తమకున్న అనుబంధాన్ని చాటుకున్నారు. మెగాస్టార్ చిరంజీవి (Megastar Chiranjeevi) తన తండ్రి వెంకట్రావుతో కలిసి ఉన్న ఓ పాత ఫొటోను షేర్ చేశారు. ‘ప్రతి చిన్నారికి తన తండ్రే తొలి హీరో. అందరికీ హ్యాపీ ఫాదర్స్ డే’ అని క్యాప్షన్‌ ఇచ్చారు.  https://twitter.com/KChiruTweets/status/1802187791251509401 మహేష్ బాబు (Mahesh Babu) కూతురు సితార (Sitara) కూడా తన తండ్రితో కలిసి ఉన్న క్యూట్‌ ఫొటోను షేర్ చేసింది. ‘హ్యాపీ ఫాదర్స్ డే నాన్నా.. ఐ లవ్ యు సో మచ్’ అని రాసుకొచ్చింది. View this post on Instagram A post shared by sitara (@sitaraghattamaneni) అల్లు అర్జున్ (Allu Arjun) భార్య స్నేహా రెడ్డి కూడా ఫాదర్స్‌ డే సందర్భంగా ఆసక్తికర పోస్టు పెట్టింది. భర్త అల్లు అర్జున్‌ తన పిల్లలతో ఉన్న ఫొటోలతో పాటు.. మామ అల్లు అరవింద్ (Allu Aravind), తన తల్లిదండ్రులతో దిగిన పిక్స్‌ను పంచుకుంది.  ‘ప్రపంచంలోని ప్రతి తండ్రికి హ్యాపీ ఫాదర్స్ డే’ అనే క్యాప్షన్ ఇచ్చింది.  View this post on Instagram A post shared by Allu Sneha Reddy (@allusnehareddy) యంగ్‌ హీరో నాగ చైతన్య (Naga Chaitanya) కూడా ఫాదర్స్‌ డే సందర్భంగా ఓ ఆసక్తికర ఫొటోను షేర్‌ చేశారు. చిన్నప్పుడు తన తండ్రి నాగార్జునతో కలిసి దిగిన ఫొటోను ఫ్యాన్స్‌తో పంచుకున్నారు. ‘ది ఓజీ’ ఈ పోస్టుకు క్యాప్షన్‌ ఇచ్చారు.  లేడీ సూపర్ స్టార్‌గా పేరొందిన హీరోయిన్‌ నయనతార (Nayanthara).. తన భర్త విగ్నేష్ శివన్, కవల పిల్లల ఫొటోను షేర్ చేస్తూ ఫాదర్స్ డే విషెస్ చెప్పింది. View this post on Instagram A post shared by N A Y A N T H A R A (@nayanthara) తమిళ సూపర్‌ స్టార్‌ రజనీకాంత్‌ (Rajanikanth) కూతురు ఐశ్వర్య.. తన తండ్రితో కలిసి ఉన్న ఫొటోను షేర్ చేసింది. ‘నా హార్ట్ బీట్, నాకు అన్నీ.. లవ్ యు అప్పా’ అనే క్యాప్షన్ ఇచ్చింది. దిగ్గజ నటుడు, తండ్రి కమల్ హాసన్‌ (Kamal Hassan)తో తాను, చెల్లి అక్షర కలిసి ఉన్న ఫొటోను నటి శృతిహాసన్‌ షేర్‌ చేసింది.  https://twitter.com/shrutihaasan/status/1802221449899610217 మెగా బ్రదర్‌, తండ్రి నాగబాబు (Naga Babu)తో సెల్ఫీ దిగుతున్న ఫొటోను యంగ్‌ హీరో ‘వరుణ్‌ తేజ్‌’ అభిమానులతో పంచుకున్నారు. ‘హ్యాపీ ఫాదర్స్ డే నాన్నా’ అని క్యాప్షన్‌ ఇచ్చారు.  కాజల్ అగర్వాల్ (Kajal Aggarwal) కూడా తన తండ్రితో పాటు భర్త, తనయుడు నీల్‌తో కలిసి ఉన్న ఫొటోలను షేర్ చేసింది. ‘బెస్ట్ పాపాస్‌కి హ్యాపీ ఫాదర్స్ డే. వి లవ్ యు’ అనే క్యాప్షన్‌ ఇచ్చింది. View this post on Instagram A post shared by Kajal A Kitchlu (@kajalaggarwalofficial)
    జూన్ 17 , 2024
    Latest OTT telugu Movies: ఈ వీకెండ్‌లో ఈ చిత్రాలను అస్సలు మిస్ కాకండి.. సూపర్బ్ థ్రిల్లింగ్ సినిమాలు
    Latest OTT telugu Movies: ఈ వీకెండ్‌లో ఈ చిత్రాలను అస్సలు మిస్ కాకండి.. సూపర్బ్ థ్రిల్లింగ్ సినిమాలు
    రీసెంట్‌గా చాలా సినిమాలు ఓటీటీల్లోకి స్ట్రీమింగ్‌కు వచ్చాయి. వీటిలో థియేటర్లలో విడుదలై రెండు వారాలు గడవకముందే ఓటీటీలోకి వచ్చిన సినిమాలు ఉన్నాయి. మరికొన్ని నేరుగా ఓటీటీల్లోకి విడుదలైన వెబ్ సిరీస్‌లు ఉన్నాయి. ఇక్కడ అందిస్తున్న లిస్ట్‌లో దాదాపు అన్నింటికీ ప్రేక్షకుల నుంచి మంచి రివ్యూలు అందుకున్నవే ఉన్నాయి. మరి వీటిలో మీకు నచ్చిన జనర్‌ను ఎంచుకుని వీకెండ్‌ను ఎంజాయ్ చేయండి లవ్ మీ ఇఫ్ యు డేర్ మీ రౌడీ బాయ్స్ ఫేమ్ ఆశిష్, బేబీ మూవీ వైష్ణవి చైతన్య జంటగా నటించిన లేటెస్ట్‌ చిత్రం ‘లవ్‌ మీ’ (Love Me). ఇఫ్‌ యూ డేర్‌ (If You Dare) అనేది ఉప శీర్షిక. ఈ చిత్రాని అరుణ్‌  తెరకెక్కించారు. దిల్ రాజు (Dil Raju) ప్రొడక్షన్స్ బ్యానర్‌లో హన్షిత రెడ్డి, హర్షిత్ రెడ్డి నిర్మించారు. దెయ్యంతో హీరో ప్రేమలో పడితే ఎలా ఉంటుందన్న కాన్సెప్ట్‌తో ఈ మూవీని రూపొందించారు. మే 25న థియేటర్లలో విడుదలైన ఈ సినిమా మిక్స్డ్‌ టాక్‌ను సొంతం చేసుకుంది. తాజాగా ఈ చిత్రం ఓటీటీలోకి అందుబాటులోకి వచ్చింది. అమెజాన్ ప్రైమ్(జూన్ 15) వీడియోలో స్ట్రీమింగ్ అవుతోంది. వీకెండ్‌లో కాస్త రొమాంటిక్ డోస్‌ కావాలనుకునే వారికి ఈ సినిమా మంచి ఛాయిస్ అని చెప్పవచ్చు. ఇక ఈ సినిమా కథ విషయానికొస్తే... అర్జున్ (ఆశిష్), ప్రతాప్(రవికృష్ణ) కలిసి ఓ యూట్యూబ్ ఛానల్ నడుపుతూ ఉంటారు. దెయ్యాలు, ఆత్మలు, స్మశానాలకు సంబంధించిన వీడియోలు చేస్తుంటారు. ప్రతాప్‌ లవర్‌ ప్రియా (వైష్ణవి చైతన్య).. దివ్యవతి అనే దెయ్యం గురించి చెప్పడంతో ఆమె ఉంటున్న పాడుబడ్డ అపార్ట్‌మెంట్‌కు అర్జున్‌ వెళ్తాడు. అలా వెళ్లిన అర్జున్‌ దివ్యవతి ఆత్మతో ప్రేమలో పడతాడు. మరి ఆ దెయ్యం కూడా అర్జున్‌ ప్రేమలో పడుతుందా? అసలు ఈ దివ్యవతి ఎవరు? సినిమా ప్రారంభంలో నిప్పంటించుకొని చనిపోయిన కపుల్‌తో ఆమెకున్న సంబంధం ఏంటి? చివరికీ ఏమైంది? అన్నది కథ. గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి విష్వక్‌ సేన్‌ (Vishwak Sen) హీరోగా డైరెక్టర్ కృష్ణ చైతన్య తెరకెక్కించిన తాజా చిత్రం ‘గ్యాంగ్స్‌ ఆఫ్‌ గోదావరి’ (Gangs of Godavari). నేహాశెట్టి హీరోయిన్‌. అంజలి కీలక పాత్ర పోషించింది. ప్రముఖ నిర్మాత సూర్యదేవర నాగ వంశీ నిర్మించారు.మే 31న  థియేటర్లలో విడుదలైన ఈ చిత్రం మిక్స్‌డ్ టాక్ సొంతం చేసుకుంది. కలెక్షన్ల పరంగా బ్రేక్ ఈవెన్ సాధించి విజయం అందుకుంది. ముఖ్యంగా విష్వక్ సేన్ మాస్ నటన ప్రేక్షకులను అలరించింది. నెహ శెట్టి, అంజలి గ్లామర్ తోడవడంతో (Gangs of Godavari Ott) ఆశించిన ఫలితం సాధించింది. అయితే థియేటర్లలో ఈ సినిమా మిస్‌ అయినవారు ఓటీటీలో వీక్షించే అవకాశం తాజాగా లభించింది. ప్రస్తుతం ఈ చిత్రం(జూన్ 14నుంచి) నెట్‌ఫ్లిక్స్ ఓటీటీ ప్లాట్‌పామ్‌లో స్ట్రీమింగ్ అవుతోంది. అప్పుడు మిస్ అయిన వారు ఈ వీకెండ్‌లో చూసి ఎంజాయ్ చేయండి.  ఇక ఈ సినిమా కథ విషాయానికొస్తే..  పని పాట లేకుండా ఖాళీగా తిరిగే లంకల రత్నం(విష్వక్‌ సేన్‌).. తమ ఊరి రాజకీయాల్లో జరుగుతున్న అన్యాయాన్ని చూస్తూ తట్టుకోలేకపోతాడు. రాజకీయాల్లోకి ప్రవేశించి ఆ వ్యవస్థను మార్చాలని నిర్ణయించుకుంటాడు. మంచి ఉద్దేశ్యంతో పాలిటిక్స్‌లోకి దిగిన అతడికి ఊహించని సవాళ్లు ఎదురవుతాయి. వాటిని ఎలా ఎదుర్కొన్నాడు? ప్రేమించిన అమ్మాయిని ఎలా సొంతం చేసుకున్నాడు? పాలిటిక్స్‌లో తన లక్ష్యాన్ని హీరో చేరుకున్నాడా? లేదా? అన్నది కథ. పారిజాత పర్వం సునీల్‌, శ్రద్ధాదాస్‌, చైతన్య రావు, మాళవిక సతీశన్‌ ప్రధాన పాత్రల్లో చేసిన చిత్రం 'పారిజాత పర్వం' (Paarijatha Parvam). సంతోష్‌ కంభంపాటి దర్శకత్వం వహించిన ఈ చిత్రానికి 'కిడ్నాప్‌ ఈజ్‌ ఏన్‌ ఆర్ట్‌' అని ఉపశీర్షిక పెట్టారు.  (ఏప్రిల్ 19న థియేటర్లలో విడుదలైన ఈ సినిమా తాజాగా ఓటీటీలోకి వచ్చింది. ఈ సినిమా ప్రస్తుతం(జూన్ 12 నుంచి) ఆహా ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లో స్ట్రీమింగ్ అవుతోంది. కామెడీ జనర్‌లో వచ్చిన ఈ సినిమా వీకెండ్‌లో చూసేందుకు మంచి ఛాయిస్‌గా చెప్పవచ్చు. ఇక ఈ సినిమా కథ విషయానికొస్తే.. చైత‌న్య (చైత‌న్య‌రావు) డైరెక్టర్ కావాలని క‌ల‌లు కంటుంటాడు. స్నేహితుడ్ని (హ‌ర్ష‌) హీరోగా పెట్టి ఓ కథతో నిర్మాత‌ల చుట్టూ కాళ్లు అరిగేలా తిరుగుతాడు. ఆ ప్రయత్నాలు సక్సెస్‌ కాకపోవడంతో చివ‌రికి తానే నిర్మాత‌గా మారి సినిమా తీయాల‌ని ఫిక్స‌వుతాడు. డ‌బ్బు కోసం శెట్టి (శ్రీ‌కాంత్ అయ్యంగార్‌) సెకండ్ సెట‌ప్‌ని కిడ్నాప్ చేయాల‌ని ప్లాన్‌ వేస్తాడు.  మ‌రోవైపు బారు శ్రీ‌ను (సునీల్‌), పారు (శ్ర‌ద్దా దాస్‌) కూడా ఆమెను కిడ్నాప్‌ చేసేందుకు స్కెచ్ వేస్తారు. మ‌రి ఈ ఇద్ద‌రిలో శెట్టి భార్య‌ని ఎవ‌రు కిడ్నాప్ చేశారు? అస‌లు బారు శ్రీ‌ను ఎవ‌రు? అతడి క‌థేంటి? చైతన్య డైరెక్టర్‌ అయ్యాడా? లేదా? అన్నది కథ.  యక్షిణి మంచు లక్షి, వేదిక ప్రధాన పాత్రల్లో నటించిన సోషియో ఫాంటసి & హారర్‌ సిరీస్‌ 'యక్షిణి'. కోటా బొమ్మాళి ఫేమ్ రాహుల్ విజయ్ హీరోగా చేశాడు. డైరెక్టర్ తేజ (Yakshini Ott) మార్ని రూపొందించిన ఈ సిరీస్‌.. నేరుగా డిస్నీ హాట్‌స్టార్‌లో జూన్ 14 విడుదలైంది. ఈ వెబ్‌ సిరీస్‌పై పాజిటివ్ సమీక్షలు అయితే వస్తున్నాయి. వీకెండ్‌లో మంచి హరర్‌ థ్రిల్లర్ సినిమా కావాలనుకునే వారు ఈ సిరీస్‌ను చూడవచ్చు. ఇక కథ విషయానికొస్తే.. యక్షిణిల రాజైన అయిన కుబేరుడు,  మాయ అనే దేవకన్యను (వేదిక)ను శపిస్తాడు. ఆమె తిరిగి అల్కపురికి వచ్చేందుకు 100 మందిని చంపాలని షరతు పెడుతాడు. దీంతో ఆమె అమాయకుడైన  కృష్ణ (రాహుల్ విజయ్)ని  ప్రేమిస్తున్నట్లు నాటకమాడి అతన్ని పెళ్లి చేసుకుంటుంది. అతన్ని చంపే క్రమంలో మహాకల్ (అజయ్) మహాకల్ అడ్డుపడుతాడు. ఇంతకు ఈ మహాకల్ ఎవరు? మాయకు ఎందుకు అడ్డుపడుతాడు? జ్వాలముఖి(మంచు లక్ష్మి) ఎలా ప్రవేశిస్తుంది? చివరకు మాయ తన స్వస్థలం అల్కాపురికి చేరుకుందా? లేదా? అనేది మిగతా కథ. పరువు నివేదా పేతురాజ్‌, నరేష్‌ అగస్య ప్రధాన పాత్రల్లో నటించిన సిరీస్‌ ‘పరువు’. సిద్దార్థ్ నాయుడు, వడ్లపాటి రాజశేఖర్ తెరకెక్కించిన ఈ సిరీస్‌లో నాగబాబు, ప్రణీత పట్నాయక్, బిందు మాధవి, అమిత్ తివారి ప్రముఖ పాత్రలు పోషించారు. జూన్ 14న ఈ వెబ్ సిరీస్ నేరుగా జీ5లో(Paruvu ott) విడుదలైంది. ఈ వెబ్ సిరీస్‌పైన మిక్స్‌డ్ రివ్యూస్ వస్తున్నాయి. పబ్లిక్ మాత్రం ఈ క్రైమ్ థ్రిల్లర్‌ను చూడొచ్చు అని అడ్వైజ్ చేస్తున్నారు. ఇక ఈ వెబ్ సిరీస్ కథ విషయానికొస్తే... పల్లవి(నివేదా పేతురాజ్), సుధీర్(నరేష్ అగస్త్య) ఒకరినొకరు ప్రేమించుకుంటారు. కులాలు వేరు కావడంతో పెద్దలు ఓప్పుకోరు. దీంతో ప్రేమ వివాహం చేసుకుంటారు. ఈక్రమంలో పల్లవి పెద్దనాన్న చనిపోవడంతో అతన్ని చూసేందుకు పల్లవి, సుధీర్ బయల్దేరుతారు. మార్గమాధ్యలో ఇద్దరు కలిసి పల్లవి బావ చందును చంపుతారు. ఇంతకు చందును వీరిద్దరు ఎందుకు చంపాల్సి వచ్చింది. ఆ తర్వాత వారికి ఎలాంటి పరిణామాలు ఎదురయ్యాయి అనేది మిగతా కథ.
    జూన్ 15 , 2024
    Love Me Movie Review: దెయ్యంతో హీరో ప్రేమాయణం.. ‘లవ్‌ మీ’ ప్రయోగం ఫలించిందా?
    Love Me Movie Review: దెయ్యంతో హీరో ప్రేమాయణం.. ‘లవ్‌ మీ’ ప్రయోగం ఫలించిందా?
    నటీనటులు : ఆశిష్‌, వైష్ణవి చైతన్య, సిమ్రాన్‌ చౌదరి, రాజీవ్‌ కనకాల, రవి కృష్ణ దర్శకత్వం : అరుణ్  భీమవరపు సంగీతం : ఎం. ఎం. కీరవాణి సినిమాటోగ్రాఫీ : పీ.సీ. శ్రీరామ్‌ ఆర్ట్ డైరెక్టర్‌ : కొల్లా అవినాష్‌ నిర్మాతలు : హర్షిత్‌ రెడ్డి, హన్షిత రెడ్డి, నాగ మల్లాది విడుదల తేదీ : 25 మే, 2024 ఆశిష్, వైష్ణవి చైతన్య జంటగా నటించిన లేటెస్ట్‌ చిత్రం ‘లవ్‌ మీ’ (Love Me). ఇఫ్‌ యూ డేర్‌ (If You Dare) అనే క్యాప్షన్‌తో రూపొందిన ఈ చిత్రానికి అరుణ్‌ దర్శకత్వం వహించారు. దిల్ రాజు (Dil Raju) ప్రొడక్షన్స్ బ్యానర్‌లో హన్షిత రెడ్డి, హర్షిత్ రెడ్డి నిర్మించారు. దయ్యంతో హీరో ప్రేమలో పడితే ఎలా ఉంటుందన్న కాన్సెప్ట్‌తో ఈ మూవీని రూపొందించారు. ఇప్పటికే విడులైన ట్రైలర్‌, టీజర్‌ సినిమాపై అంచనాలు పెంచేసింది. కాగా, మే 25న థియేటర్లలోకి వచ్చిన ఈ చిత్రం ప్రేక్షకులను మెప్పించిందా? బేబీ బ్యూటీ వైష్ణవి చైతన్య మరోమారు తన నటనతో ఆకట్టుకుందా? ఈ రివ్యూలో తెలుసుకుందాం.  కథేంటి అర్జున్ (ఆశిష్), ప్రతాప్(రవికృష్ణ) కలిసి ఓ యూట్యూబ్ ఛానల్ నడుపుతూ ఉంటారు. దెయ్యాలు, ఆత్మలు, స్మశానాలకు సంబంధించిన వీడియోలు చేస్తుంటారు. ప్రతాప్‌ లవర్‌ ప్రియా (వైష్ణవి చైతన్య).. దివ్యవతి అనే దెయ్యం గురించి చెప్పడంతో ఆమె ఉంటున్న పాడుబడ్డ అపార్ట్‌మెంట్‌కు అర్జున్‌ వెళ్తాడు. అలా వెళ్లిన అర్జున్‌ దివ్యవతి ఆత్మతో ప్రేమలో పడతాడు. మరి ఆ దెయ్యం కూడా అర్జున్‌ ప్రేమలో పడుతుందా? అసలు ఈ దివ్యవతి ఎవరు? సినిమా ప్రారంభంలో నిప్పంటించుకొని చనిపోయిన కపుల్‌తో ఆమెకున్న సంబంధం ఏంటి? చివరికీ ఏమైంది? అన్నది కథ. ఎవరెలా చేశారంటే తొలి చిత్రం రౌడీ బాయ్స్‌లో కాలేజీ కుర్రాడిగా అలరించిన ఆశిష్‌.. ఈ సినిమాలో డెవిల్స్‌ హంటర్ పాత్రలో మెప్పించాడు. తనదైన నటనతో ఆకట్టుకునే ప్రయత్నం చేశాడు. ఫన్‌ అండ్ ఎమోషనల్‌ సీన్స్‌లో చక్కగా నటించి నటుడిగా ఇంకాస్త మెరుగయ్యాడు. బేబీ హీరోయిన్‌ వైష్ణవి చైతన్య మరోమారు తన నటనతో మెప్పించింది. ఆమెకు కీలకమైన పాత్రే దక్కింది. ఆడియన్స్‌ వైష్ణవి చైతన్యకు మరోమారు కనెక్ట్‌ అవుతారు. బుల్లితెర నటుడు రవికృష్ణ పాత్ర కూడా ఆకట్టుకుంటుంది. సినిమా మెుత్తం ఈ ముగ్గురి పాత్రల చుట్టే ఎక్కువగా తిరుగుతుంది. మిగిలిన పాత్ర ధారులు తమ పరిధిమేరకు నటించారు.  డైరెక్షన్‌ ఎలా ఉందంటే దర్శకుడు అరుణ్‌.. ఒక నవల రచయిత కావడంతో సినిమా చూస్తున్నంత సేపు ఓ నవల చదువుతున్న ఫీల్‌ కలుగుతుంది. దెయ్యమే చెప్తున్నట్లుగా కథను నడిపించడం ఆసక్తికరం. తొలి భాగం అంతా అర్జున్‌ గురించి, అతడు దివ్యవతిని వెతుక్కుంటూ వెళ్లడం గురించే చూపించారు. ఇంటర్వెల్‌కు ముందు దెయ్యంతో వచ్చే సన్నివేశాలు.. ఆపై రివీల్‌ చేసే ట్విస్టు సెకండాఫ్‌పై ఆసక్తిని పెంచుతుంది. దివ్యవతి గురించి అర్జున్‌ చేసే రీసెర్చ్‌.. ప్రీక్లైమాక్స్ నుంచి ఒక్కో ట్విస్టును డైరెక్టర్‌ రివీల్‌ చేసుకుంటూ వెళ్లడం మెప్పిస్తుంది. అయితే స్క్రీన్‌ప్లే విషయంలో చాలా చోట్ల డైరెక్టర్‌ తడబడినట్లు కనిపిస్తుంది. ఐదారుగురు హీరోయిన్స్‌ను తెరపైకి తీసుకొచ్చి కథపై ఆసక్తిరేపినా.. వారి పాత్రలను సరిగా వివరించకపోవడంతో కన్ఫ్యూజన్‌ క్రియేట్ అయ్యింది. క్లైమాక్స్ కూడా పేలవంగానే అనిపిస్తుంది. అయితే ఓ లవ్‌స్టోరీకి దెయ్యం కథను జోడించి డైరెక్టర్ అరుణ్‌ చేసిన తొలి ప్రయోగం కొంతమేర ఫలించిందని చెప్పొచ్చు. టెక్నికల్‌గా   సాంకేతిక అంశాల పరంగా చూస్తే.. పీసీ శ్రీరామ్ కెమెరా పనితనం మెస్మరైజ్‌ చేస్తుంది. తన నైపుణ్యంతో అద్భుతమైన విజువల్స్‌ అందించారు. ఆస్కార్ విన్నర్‌ కీరవాణి అందించిన నేపథ్యం సంగీతం సినిమాకు బాగా ప్లస్ అయ్యింది. ఆయన తన BGMతోనే ఆడియన్స్‌ను భయపెట్టారు. ఆర్ట్‌ డిపార్ట్‌మెంట్‌ కూడా సినిమా కోసం బాగా శ్రమించింది. నిర్మాణ విలువలు బాగున్నాయి.  ప్లస్‌ పాయింట్స్ ఆశిష్‌, వైష్ణవి చైతన్యఆసక్తికరంగా సాగే కథనంసాంకేతిక విభాగం మైనస్‌ పాయింట్స్‌ కన్ఫ్యూజింగ్‌ సీన్స్‌ఏమోషన్స్‌ లేకపోవడం Telugu.youSay.tv Rating : 2.5/5   https://telugu.yousay.tv/top-secrets-you-didnt-know-about-vaishnavi-chaitanya.html
    మే 25 , 2024

    @2021 KTree