ఇంగ్లీష్‌లో చదవండి
మూవీ & ఓటీటీ అప్‌డేట్స్
స్ట్రీమింగ్ ఆన్Ahaఫ్రమ్
Watch
స్ట్రీమింగ్ ఆన్Youtube
Watch
Free
రివ్యూస్
How was the movie?
తారాగణం
అల్లు అర్జున్
ఆర్యకాజల్ అగర్వాల్
గీతనవదీప్
అజయ్శ్రద్ధా దాస్
శాంతిబ్రహ్మానందం
దశావతారంముఖేష్ రిషి
రాజి రెడ్డి (ఆర్‌సిఎమ్ రాజు వాయిస్ ఓవర్)సాయాజీ షిండే
కాశీ రెడ్డిఅజయ్
సుబ్బిరాధా కుమారి
రాజి రెడ్డి తల్లివేణు మాధవ్
శ్రీనివాస రెడ్డి
కృష్ణుడు
దేవి చరణ్
సిబ్బంది
సుకుమార్
దర్శకుడుఆదిత్య బాబు
నిర్మాతబివిఎస్ఎన్ ప్రసాద్
నిర్మాతదేవి శ్రీ ప్రసాద్
సంగీతకారుడుమార్తాండ్ కె. వెంకటేష్
ఎడిటర్ఎడిటోరియల్ లిస్ట్
కథనాలు
20 Years Of Allu Arjun: వీడు హీరోనా అన్నారు..ఐకాన్ స్టార్ అయ్యాడు!
‘అల్లు అర్జున్’... ! పుష్ప సినిమాతో ఇండియాను షేక్ చేసి పాన్ ఇండియన్ స్టార్. ఐకాన్ స్టార్. అత్యధిక రెమ్యూనరేషన్ తీసుకుంటున్న నటుల్లో ఒకరు. బ్రాండ్ వాల్యూలో ఇండియాలో టాప్-25లో చోటు దక్కించుకున్న ఏకైక సౌత్ ఇండియన్ హీరో. హైయెస్ట్ రెమ్యూనరేషన్ తీసుకుంటున్న వారిలో ఒకడు. కానీ ఇదంతా ఒక్క రోజులో రాలేదు. 20 ఏళ్ల కఠోర శ్రమ, నిబద్ధత పట్టుదల, కథల ఎంపికలో వైవిధ్యత సినిమా కోసం కష్టపడే తత్వం ఇవన్నీకలిపితేనే ఐకాన్ స్టార్ అల్లు అర్జున్.
https://telugu.yousay.tv/allu-arjun-pushpa-will-decrease-in-brand-value-allu-arjun-rashmika-and-pv-sindhu-in-top-25.html
తొలి అడుగు
28 మార్చి 2003లో గంగోత్రి సినిమా వచ్చినపుడు చాలా మంది విమర్శించారు. ఇతను హీరోనా అని మాట్లాడిన వారు కూడా ఉన్నారు. కానీ అల్లు అర్జున్ వాటన్నింటికీ సమాధానం చెప్పాడు. 6 ఫిల్మ్‌ఫేర్ అవార్డులు, 3 నంది అవార్డులతో తనలోని నటుడిని ప్రపంచానికి చాటాడు. మరి అల్లు అర్జున్‌ను స్టార్ చేసిన అంశాలేంటో చూద్దాం.
కథల ఎంపిక
గంగోత్రి విడుదలైన నాటి నుంచి ఇప్పటిదాకా అల్లు అర్జున్‌ను స్టార్‌గా నిలిచేలా చేసింది మాత్రం అతడి స్టోరీ సెలెక్షన్. అల్లు అర్జున్ ఏ రెండు వరుస సినిమాలు కూడా ఒకే పంథాలో సాగవు. లుక్, మేనరిజం ఇలా ప్రతీది మారిపోతుంది. గంగోత్రితో విమర్శలు ఎదుర్కొన్నా… ఆ తర్వాత 2004లో వచ్చిన సుకుమార్ ‘ఆర్య’ సినిమా అల్లు అర్జున్ పేరు మార్మోగేలా చేసింది. అప్పటిదాకా తెలుగు సినిమా చూడని వెరైటీ లవ్‌స్టోరీని అల్లు అర్జున్ ఎంపిక చేసుకోవడం సాహసమనే చెప్పాలి. ఆ తర్వాత వచ్చిన సినిమాలన్నింటిలోనూ అల్లు అర్జున్ డిఫరెంట్‌గానే కనిపిస్తాడు. బన్నీ, పరుగు, దేశముదురు, ఆర్య-2, వేదం, దువ్వాడ జగన్నాథం, అల వైకుంఠపురములో ఇలా తనలోని నటుడిని సినీ ప్రపంచానికి పరిచయం చేస్తూనే వచ్చాడు. పుష్పలో అయితే ఊర మాస్ లుక్‌లో బాక్సాఫీస్‌ను షేక్ చేశాడు.
డ్యాన్స్
మరో మాట లేకుండా ఇండియాలోని హీరోల్లో బెస్ట్ డ్యాన్సర్స్‌లో అల్లు అర్జున్ ఒకడు. అతడి డ్యాన్స్‌కు టాలివుడ్‌లోనే కాదు బాలివుడ్‌లోనూ ఫ్యాన్స్ ఉన్నారు. ఆర్య-2, అల వైకుంఠపురములో, రేసు గుర్రం ఇలా ఏ సినిమా తీసుకున్నా అల్లు అర్జున్ డ్యాన్స్‌కు ఫిదా కావాల్సిందే.
సుకుమార్
అల్లు అర్జున్ కెరీర్‌లో సుకుమార్‌ది కీలక పాత్ర అనడం అతిశయోక్తి కాదు. అప్పుడు ఆర్యతో అతడి కెరీర్‌ను మలుపు తిప్పాడు. అలాగే ‘పుష్ప’తో పాన్ ఇండియా స్టార్ మార్చాడు. ఇప్పుడు పుష్ప: ది రూల్‌తో గ్లోబల్ స్టార్‌గా ఎదిగినా ఆశ్చర్యపోవాల్సిన పనిలేదు.
https://telugu.yousay.tv/allu-arjun-passed-prabhas-in-remuneration.html
అల్లు అర్జున్ చేసిన అద్భుతమైన పాత్రలు
అల్లు అర్జున్ సినీ కెరీర్‌లో కథల ఎంపిక, డ్యాన్స్‌లతో పాటు కొన్ని పాత్రలు సినీ ప్రియులు మరిచిపోలేరు. అవి
ఆర్య
సుకుమార్ కల్ట్ క్లాసిక్ మూవీ ఆర్యలో ‘ఆర్య’గా అల్లు అర్జున్‌ను ఎవరూ మర్చిపోలేరు. సినిమా అంతా నవ్వించినా, నవ్వులపాలైనా చివరిలో కన్నీరు పెట్టించినా ‘ఆర్య’ పాత్ర సూపర్ అని చెప్పాలి.
బాల గోవింద్
అల్లు అర్జున్‌కు మాస్ ఇమేజ్ తెచ్చిన సినిమా దేశముదురు. ఇందులో బాల గోవింద్‌గా అల్లు అర్జున్ పాత్ర ఊర మాస్ ఉంటుంది. ఇందులో బాలగోవింద్ డైలాగ్స్ ఇప్పటికీ చాలా మందికి ఫేవరెట్‌గా ఉంటాయి.
గోన గన్నారెడ్డి
స్టైలిష్ స్టార్‌గా ఉన్న అల్లు అర్జున్ కంప్లీట్ డీ గ్లామర్ రోల్‌లో చూపించిన సినిమా రుద్రమదేవి. ఇందులో గోన గన్నారెడ్డిగా తెలంగాణ యాసలో అల్లు అర్జున్ చెప్పే డైలాగులు ఎవరూ మర్చిపోలేరు.
కేబుల్ రాజు
క్రిష్ తెరకెక్కించిన ‘వేదం’ విమర్శకుల ప్రశంసలు అందుకున్న సినిమా. హీరోయిజంకు ఏమాత్రం అవకాశం లేకుండా కేవలం నటనా ప్రాధాన్యం ఉన్న పాత్ర కేబుల్ రాజు. ఎంతోమంది మిడిల్ క్లాస్ కుర్రాళ్లకు కనెక్ట్ అయిన పాత్ర. ఇది కూడా అల్లు అర్జున్ కెరీర్‌లో అద్భుతమైన పాత్రల్లో ఒకటి.
పుష్ప
ఫైనల్‌గా ‘పుష్ప’. పుష్పరాజ్ అంటూ అల్లు అర్జున్ చేసిన ఈ పాత్ర తన కెరీర్‌లో మైలురాయి. 20 ఏళ్ల కష్టానికి ఫలితాన్నిచ్చిన పాత్ర.
ప్రస్తుతం పుష్ప-2 కోసం అల్లు అర్జున్ కష్టపడుతున్నారు. సుకుమార్ కూడా చాలా ప్రతిష్ఠాత్మకంగా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నాడు. ఆ తర్వాత సెన్సేషనల్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగాతోనూ అల్లు అర్జున్ ఓ సినిమా చేయబోతున్నాడు. ఈ సినిమాపై కూడా భారీ అంచనాలున్నాయి.
తన 20 ఏళ్ల ప్రయాణంపై అల్లు అర్జున్ ఎమోషనల్ పోస్ట్ చేశారు. ‘ఇవాళ నేను ఈ స్థాయిలో ఉన్నానంటే దానికి కారణం ప్రేక్షకులు, అభిమానులే. సదా మీకు కృతజ్ఞుడను’ అంటూ అల్లు అర్జున్ ట్వీట్ చేశాడు.
https://twitter.com/alluarjun/status/1640581255732535296?s=20
మార్చి 28 , 2023
Allu Arjun vs Sukumar: సుకుమార్‌తో విభేదాలు.. చెప్పాపెట్టకుండా వెళ్లిపోయిన బన్నీ?
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ (Allu Arjun), డైరెక్టర్ సుకుమార్ (Sukumar)కు ఇండస్ట్రీలో మంచి బాండింగ్ ఉంది. అది పలు సందర్భాల్లో నిరూపితమైంది కూడా. బన్నీ-సుకుమార్ కాంబోలో ఇప్పటికే మూడు చిత్రాలు (ఆర్య, ఆర్య 2, పుష్ప) రాగా అందులో రెండు బ్లాక్ బాస్టర్ విజయాలను అందుకున్నాయి. ప్రస్తుతం వీరిద్దరు కాంబోలో 'పుష్ప 2' తెరకెక్కుతోంది. కొన్ని రోజుల క్రితం వరకూ ఈ మూవీ షూటింగ్ శరవేగంగా సాగింది. అయితే అనూహ్యంగా ఈ మూవీ షూటింగ్‌కు బ్రేకులు పడ్డాయి. దీనికి కారణం సుకుమార్, అల్లు అర్జున్ మధ్య తలెత్తిన వివాదాలేనని ఇండస్ట్రీలో టాక్ వినిపిస్తోంది. దీనికి తోడు బన్నీ షూటింగ్‌ను పక్కకు పెట్టి విహారయాత్రకు వెళ్లడం ఈ అనుమానాలకు బలాన్ని చేకూరుస్తోంది.
సుకుమార్ - బన్నీ మధ్య కోల్డ్‌వార్?
'పుష్ప: ది రూల్' షూటింగ్ విషయంలో అల్లు అర్జున్, క్రియేటివ్ జీనియస్ సుకుమార్ మధ్య కోల్డ్ వార్ జరుగుతున్నట్లు ఇండస్ట్రీలో ప్రచారం జరుగుతోంది. వాస్తవానికి ఈ చిత్రాన్ని ఆగస్టు 15న రిలీజ్ చేయాలని మేకర్స్ భావించారు. తీరా షూటింగ్‌కు మరింత సమయం పట్టే అవకాశముందని తెలిసి వాయిదా వేశారు. అయితే సినిమా వాయిదా వేసినప్పటికీ షూటింగ్ సక్రమంగా జరగడం లేదని బన్నీ గుర్రుగా ఉన్నారట. తను పూర్తిగా సహకరిస్తున్నా సుకుమార్ సరిగ్గా వినియోగించుకోవడం లేదని భావిస్తున్నారట. ఈ క్రమంలోనే షూటింగ్‌ను నిలిపేసి సుకుమార్ అమెరికాకు వెళ్లడంపై బన్నీలో మరింత అసంతృప్తి కారణమైందని ఫిల్మ్ వర్గాల్లో చర్చ జరుగుతోంది.
గడ్డం తీసేసిన బన్నీ
సుకుమార్ శైలి నచ్చని అల్లు అర్జున్ ఫ్యామిలీతో హాలిడేకి వెళ్లారని తెలుస్తోంది. అతడు యూరప్ వెళ్లారని టాక్ వినిపిస్తోంది. ఫ్లైట్ జర్నీ సమయంలో ఆయన్ను కొందరు వీడియో తీశారు. ఇప్పుడు ఆ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. ఈ వీడియోలో బన్నీ గడ్డం ట్రిమ్ చేసి కనిపించారు. వాస్తవానికి పుష్ప గాడు అంటే ఆ గడ్డం లుక్కే మెయిన్. గడ్డం మీద చేయి వేసి తగ్గేదేలే అని బన్నీ చెప్పిన డైలాగ్ దేశవ్యాప్తంగా అందరి దృష్టిని ఆకర్షించింది. దీనిపై భారీ ఎత్తున రీల్స్ సైతం అప్పట్లో వచ్చాయి. అటువంటిది గడ్డాన్ని బన్నీ ట్రిమ్ చేసి పర్యటనకు వెళ్లడం ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారింది. సుకుమార్‌తో ఉన్న విభేదాల వల్లే బన్నీ షూటింగ్‌కు దూరం అయ్యారా? అన్న ప్రశ్న నెట్టింట వినిపిస్తోంది.
https://twitter.com/i/status/1813405877908726058
'పుష్ప 2' మళ్లీ వాయిదా?
డైరెక్టర్ సుకుమార్, అల్లు అర్జున్ ఇద్దరు విదేశీ పర్యటనకు వెళ్లడంతో ప్రస్తుతం 'పుష్ప 2' అటకెక్కింది. ఇంకా చాలా సన్నివేశాలు పెండింగ్‌లో ఉన్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలో ఇరువురు లేకపోవడం 'పుష్ప 2' రిలీజ్‌పై ప్రభావం చూపుతుందని సినీ విశ్లేషకులు అంటున్నారు. ఇప్పటికే రిలీజ్ డేట్‌ను ఆగస్టు 15 నుంచి డిసెంబర్ 6కు మార్చారు. తాజా పరిణామాల నేపథ్యంలో డిసెంబర్‌లోనైనా పుష్ప గాడిని చూస్తామా? అన్న ప్రశ్న ఆడియన్స్‌లో తలెత్తుతోంది. ప్రస్తుతం బన్నీ గడ్డాన్ని ట్రిమ్ చేసి యూరప్ వెళ్లారు. పుష్ప పాత్రకు తగ్గట్లు గడ్డం పెంచాలంటే కనీసం నెల రోజుల సమయం పడుతుంది. అంటే ఒక నెల రోజుల సమయం వృథా అయినట్లేనని ఫిల్మ్ వర్గాలు విశ్లేషిస్తున్నాయి.
‘పుష్ప 2’కి విలన్ కష్టాలు!
మలయాళ స్టార్ ఫహాద్ ఫాజిల్ (Fahadh Faasil) 'పుష్ప 2'లో విలన్ పాత్ర పోషిస్తున్నారు. షూటింగ్ ఆలస్యం కారణంగా ఫహద్ కూడా కొంత నిరాశలో ఉన్నట్లు పరిశ్రమ వర్గాల టాక్. పైగా ఫహద్ చేతిలో 6,7 పెద్ద సినిమాలే ఉన్నాయి. దాంతో అతడు అడిగినన్ని కాల్ షీట్లు ఇచ్చేలా కనిపించడం లేదు. దాంతో అతడు ఇచ్చిన డేట్స్‌లోనే షూట్ ఫినిష్ చేయాల్సిన పరిస్థితి కనిపిస్తోంది. అదీకాక కాంబోలో ఉన్న ఆర్టిస్టులు అందరూ పెద్దవారే కావడం డైరెక్టర్ సుకుమార్‌కు పెద్ద సమస్యగా మారింది. ఇన్ని సమస్యలను సుకుమార్ ఎలా హ్యాండిల్ చేస్తారన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.
నో చెప్పిన జాన్వీ కపూర్
పుష్ప 2లో ఐటెం సాంగ్ ఏ నటి చేస్తారన్న ప్రశ్న ఇప్పటికీ వెంటాడుతోంది. కొన్ని రోజుల క్రితం యానిమల్ బ్యూటీ తిప్తి దిమ్రీ పేరు వినిపించింది. ఆమెను చిత్ర యూనిట్ సంప్రదించగా ఐటెం సాంగ్ చేసేందుకు ఓకే చెప్పినట్లు రూమర్లు కూడా వచ్చాయి. అయితే తాజాగా ఆమెను కాకుండా జాన్వీ కపూర్‌ను ఐటెం సాంగ్ కోసం పరిశీలిస్తున్నట్లు తెలిసింది. ఈ విషయమై ఆమెను సంప్రదించినట్లు కూడా తెలుస్తోంది. అయితే ఎన్టీఆర్, రామ్‌చరణ్ వంటి స్టార్ హీరోలతో నటిస్తుండటంతో ఐటెం సాంగ్ చేసేందుకు జాన్వీ నో చెప్పినట్లు సమాచారం. ఇలాంటి సాంగ్స్ చేస్తే తన ఇమేజ్‌కు డ్యామేజ్ కలుగుతుందని ఆమె భావిస్తున్నట్లు తెలిసింది.
జూలై 17 , 2024
Tollywood Disaster Sequels: భారీ అంచనాలతో వచ్చి చతికలపడ్డ టాప్ 13 సీక్వెల్ చిత్రాలు ఇవే!
గత దశాబ్దాల కాలంలో తెలుగులో ఎన్నో సూపర్ హిట్ సినిమాలు వచ్చాయి. వీటిలో కొన్నింటికి సీక్వెల్స్ సైతం ప్రేక్షకులను పలకరించాయి. అయితే తొలి భాగంతో పోలిస్తే (Tollywood Disaster Sequels) సెకండ్ పార్ట్ ఆడియన్స్ పెద్దగా ఆకట్టుకులేకపోయాయి. తొలి సినిమా మానియాను కొనసాగించడంలో విఫలమయ్యాయి. ఎన్నో అంచనాలతో థియేటర్లకు వెళ్లిన ప్రేక్షకులను తీవ్రంగా నిరాశ పరిచాయి. ఇంతకీ ఆ సినిమాలు ఏవి? అందులో నటించిన స్టార్ హీరోలు ఎవరో ఇప్పుడు చూద్దాం.
మనీ మనీ మోర్ మనీ
జేడీ చక్రవర్తి హీరోగా చేసిన మనీ మూవీ సిరీస్‌లు ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించాయి. మనీ (1993), మనీ మనీ (1994) పేరుతో వచ్చిన ఆ చిత్రాలు మంచి హిట్‌ను సొంతం చేసుకున్నాయి. అయితే ఆ చిత్రాలకు కొనసాగింపుగా 2011లో వచ్చిన ‘మనీ మనీ మోర్ మనీ’ (Money Money More Money) మాత్రం ఆడియన్స్‌ను తీవ్రంగా నిరాశ పరిచింది. బాక్సాఫీస్ వద్ద ఘోర పరాజయాన్ని చవి చూసింది.
Money Money More Money Wallpapers
శంకర్‌దాదా జిందాబాద్
మెగాస్టార్ చిరంజీవి నటించిన సూపర్ హిట్ సినిమాల్లో శంకర్‌దాదా M.B.B.S ఒకటి. 2004లో విడుదలైన ఆ చిత్రం చిరుకి మంచి పేరు తీసుకొచ్చింది. అంతేగాక కాసుల వర్షం కురిపించింది. ఈ నేపథ్యంలో దీనికి కొనసాగింపుగా ‘శంకర్‌దాదా జిందాబాద్’ (Shankar Dada Zindabad) తెరకెక్కించారు. డిఫరెంట్ స్టోరీతో వచ్చిన ఈ సినిమా ప్రేక్షకులను నిరాశ పరిచింది.
కిక్ 2
రవితేజ కెరీర్‌లోని టాప్-5 హిట్ చిత్రాల్లో ‘కిక్’ (Kick Movie) సినిమా కచ్చితంగా ఉంటుంది. 2009లో సురేందర్ రెడ్డి దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా బ్లాక్‌బాస్టర్ హిట్ అందుకుంది. ఈ నేపథ్యంలో దీనికి సీక్వెల్‌గా 2015లో ’కిక్-2’ (Kick 2)వచ్చింది. అయితే సినిమా ఆశించిన మేర విజయాన్ని అందుకోలేకపోయింది. రవితేజ ఫ్లాపు చిత్రాల్లో ఒకటిగా మిగిలిపోయింది.
సర్దార్ గబ్బర్ సింగ్
పవన్ కల్యాణ్ హీరోగా తెరకెక్కిన ‘గబ్బర్ సింగ్’ (Gabbar Singh) చిత్రం ఎంత పెద్ద బ్లాక్ బాస్టర్ అయ్యిందో అందరికీ తెలిసిందే. ఈ సినిమాకు సీక్వెల్‌గా ఎన్నో అంచనాలతో వచ్చిన ‘సర్ధార్ గబ్బర్ సింగ్’ (Sardaar Gabbar Singh) మాత్రం ఆ స్థాయిలో ప్రేక్షకులను అలరించడంలో విఫలమైంది. 2016లో వచ్చిన ఈ చిత్రం.. పవన్ డిజాస్టర్ చిత్రాల్లో ఒకటిగా మిగిలిపోయింది.
మన్మథుడు 2
అక్కినేని నాగార్జున హీరోగా చేసిన ఎవర్‌గ్రీన్ చిత్రాల్లో ‘మన్మథుడు’ (Manmadhudu) ఒకటి. ఈ సినిమాను ఇప్పటికీ చాలామంది చూస్తుంటారు. ఇందులో నాగార్జున కామెడీ టైమింగ్‌ను, బ్రహ్మీ కాంబినేషన్‌లో వచ్చే సీన్లను ఎంజాయ్ చేస్తుంటారు. అయితే ఈ సినిమాకు కొనసాగింపుగా వచ్చిన ‘మన్మథుడు 2’ (Manmadhudu 2) మాత్రం ప్రేక్షకులను ఆకట్టుకోవడంలో దారుణంగా విఫలైంది.
గాయం 2
1993లో జగపతి బాబు హీరోగా రామ్‌గోపాల్ వర్మ దర్శకత్వంలో వచ్చిన గాయం (Gayam) చిత్రం బ్లాక్ బాస్టర్‌గా నిలిచింది. ఆరు నంది అవార్డులను సైతం కొల్లగొట్టింది. అటువంటి ఈ చిత్రానికి సీక్వెల్‌గా వచ్చిన గాయం-2 (Gayam 2) మాత్రం బాక్సాఫీస్ వద్ద చతికలపడింది. ప్రేక్షకులను ఆకట్టుకోవడంలో పూర్తిగా విఫలమైంది. 2010లో వచ్చిన ఈ సీక్వెల్ చిత్రానికి ప్రవీణ్ శ్రీ దర్శకత్వం వహించారు.
ఆర్య-2
అల్లు అర్జున్ (Allu Arjun), సుకుమార్ (Sukumar) కాంబోలో వచ్చిన మెుట్టమెుదటి చిత్రం ‘ఆర్య’ (Arya Movie). ఫీల్‌గుడ్ లవ్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిన ఈ చిత్రం.. బన్నీతో పాటు సుకుమార్‌కు మంచి పేరు తెచ్చిపెట్టింది. దీనికి సీక్వెల్‌గా వచ్చిన ‘ఆర్య 2’ (Arya 2) అదే స్థాయిలో మెప్పించలేకపోయింది. మోస్టరు టాక్ మాత్రమే తెచ్చుకుంది.
చంద్రముఖి 2 & నాగవల్లి
తెలుగులో వచ్చిన టాప్-5 హారర్ చిత్రాల్లో రజనీకాంత్ హీరోగా ‘చంద్రముఖి’ కచ్చితంగా ఉంటుంది. ఈ సినిమా అప్పట్లో విపరీతంగా భయపెట్టింది. చంద్రముఖి (Chandramukhi) పాత్రలో జ్యోతిక అదరగొట్టింది. అయితే ఈ చిత్రానికి సీక్వెల్‌గా వచ్చిన చంద్రముఖి 2 (Chandramukhi 2), నాగవల్లి (Nagavalli) చిత్రాలు మాత్రం తీవ్రంగా నిరాశపరిచాయి. నాగవల్లిలో వెంకటేష్ లీడ్ రోల్‌లో నటించగా.. చంద్రముఖి 2లో రాఘవ లారెన్స్ చేశాడు.
రోబో 2
రజనీకాంత్ హీరోగా డైరెక్టర్ శంకర్ తెరకెక్కించిన ‘రోబో’ (Robo) చిత్రం.. 2010లో ఏ స్థాయి విజయాన్ని అందుకుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అద్భుతమైన గ్రాఫిక్స్ మాయజాలంతో వచ్చిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద కనక వర్షాన్ని కురిపించింది. దీనికి అనుసంధానంగా 2018లో రిలీజైన ‘రోబో 2’ (Robo 2) అందరి అంచనాలను తలకిందులు చేసింది. ఇందులో బాలీవుడ్ స్టార్ అక్షయ్ కుమార్ విలన్ పాత్రలో కనిపించాడు.
సత్య 2
రామ్‌గోపాల్ వర్మను బాలీవుడ్‌లో స్టార్ డైరెక్టర్‌గా చేసిన చిత్రం ‘సత్య’ (Sathya). ఈ సినిమాకు సీక్వెల్‌గా వచ్చిన సత్య-2 (Sathya 2)మాత్రం ఆ స్థాయిలో విజయాన్ని అందుకోలేకపోయింది. ఇందులో శర్వానంద్ హీరోగా నటించాడు. రామ్‌గోపాల్ వర్మ దర్శకత్వం వహించాడు.
వెన్నెల 1/2
రాజా హీరోగా దేవకట్టా దర్శకత్వంలో వచ్చిన 'వెన్నెల' (Vennela) చిత్రం.. 2005లో విడుదలై మంచి విజయాన్ని అందుకుంది. ఈ సినిమా ద్వారానే వెన్నెల కిషోర్ తెలుగు ఇండస్ట్రీకి పరిచయం అయ్యాడు. అయితే ఏడేళ్ల తర్వాత ఈ సినిమాకు సీక్వెల్‌గా వచ్చిన 'వెన్నెల 1/2' (Vennela 1/2) దారుణంగా పరాజయాన్ని మూటగట్టుకుంది. అయితే ఈ సినిమాకు వెన్నెల కిషోర్ దర్శకత్వం వహించడం విశేషం.
అవును 2
విభిన్నమైన హారర్ కథాంశంతో వచ్చిన ‘అవును’ (Avunu).. చిన్న సినిమాగా విడుదలై పెద్ద విజయాన్ని అందుకుంది. డైరెక్టర్‌గా రవిబాబుకు మంచి పేరు తీసుకొచ్చింది. అయితే ఈ సినిమాకు సీక్వెల్‌గా వచ్చిన ‘అవును 2’ (Avunu 2) మాత్రం బాక్సాఫీస్ వద్ద చతికిల పడింది.
మంత్ర 2
కథానాయిక చార్మి చేసిన మరుపురాని చిత్రాల్లో ‘మంత్ర’ (Mantra). హారర్ & సస్పెన్స్ థ్రిల్లర్‌గా వచ్చిన ఈ చిత్రం మ్యాసివ్ విజయాన్ని అందుకుంది. 2007లో వచ్చిన ఈ చిత్రానికి ఓషో తులసి రామ్ దర్శకత్వం వహించాడు. అయితే దీనికి అనుసంధానంగా వచ్చిన ‘మంత్ర 2’ (Mantra 2) మాత్రం చార్మి ఆశలను అడియాశలు చేసింది.
ఫిబ్రవరి 22 , 2024
LipLock Scenes In Telugu Movies: టాలీవుడ్ హీరోయిన్‌ల హాట్ లిప్‌లాక్ సీన్స్.. ఇవి చాలా హూట్ గురూ!
సినిమాల్లో లిప్‌లాక్ సీన్లకు ఎంతో క్రేజ్ ఉంటుంది. ఒక పాత్ర మరో పాత్రపై ఉన్న ప్రేమను వ్యక్తం చేసే క్రమంలో ఈ ముద్దు సన్నివేశాలు వస్తుంటాయి. అయితే ఒకప్పుడు లిప్‌లాక్ సీన్ అంటే ఒక సెన్సేషన్. కానీ ప్రస్తుత సినిమాల్లో అవి కామన్‌గా మారిపోయాయి. కథ, సిట్చ్యూయేషన్ డిమాండ్ చేస్తే లిప్ లాక్ సీన్లకు రెడీ అంటూ పలువురు స్టార్ హీరోయిన్స్ బహిరంగంగానే ప్రకటించారు. ఆ మాటలకు కట్టుబడి ముద్దు సన్నివేశాల్లో నటించారు కూడా. టాలీవుడ్‌లో ముద్దు సీన్లలో నటించిన స్టార్ హీరోయిన్స్ ఎవరు? ఏ సినిమాల్లో చేశారు? ఇప్పుడు చూద్దాం.
[toc]
సమంత (Samantha)
‘ఏమాయ చేశావే’ చిత్రంతో నటి సమంత హీరోయిన్‌గా ఇండస్ట్రీలో అడుగుపెట్టింది. అందులో నాగచైతన్య ప్రేయసి పాత్రలో ఆమె అద్భుతమైన నటన కనబరిచింది. వీరిద్దరి మధ్య వచ్చే కిస్ సీన్స్ అప్పట్లో యూత్‌ను కట్టిపడేశాయి. ముఖ్యంగా చైతు, సమంత మధ్య వచ్చే ట్రైన్ సీన్‌లో వారిద్దరు లిప్‌కిస్‌లతో రెచ్చిపోయారు. ఇటీవల విజయ్ దేవరకొండతో చేసిన ‘ఖుషీ’ చిత్రంలోనూ సమంత లిప్‌లాక్ సీన్‌లో నటించింది.
https://youtu.be/f1felGoecKE?si=pVGUjkN0VAIctHJg
https://youtu.be/0oD68xOTg3Q?si=wGwFqNyNrGrzJBSS
కాజల్ అగర్వాల్ (Kajal Aggarwal)
మహేష్ బాబుతో కాజల్ ఓ లిప్‌లాక్ సీన్ చేసింది. ‘బిజినెస్ మ్యాన్’ చిత్రంలోని ‘చందమామ నవ్వే’ సాంగ్‌లో కాజల్ పెదాలపై మహేష్ కిస్ చేస్తాడు. ఈ సీన్ అప్పట్లో సెన్సేషన్ క్రియేట్ చేసిందని చెప్పవచ్చు. ఆ తర్వాత ‘బ్రహ్మోత్సవం’ చిత్రంలోనూ మహేష్‌తో ఓ లిప్‌లాక్ సీన్ కాజల్ చేసింది. అలాగే ‘ఆర్య 2’లో బన్నీతో కలిసి లిఫ్ట్‌లో ముద్దుసీనులో నటించింది.
https://youtu.be/uGsFI3FmhnI?si=NO5P0FFGoh7S5W4n
https://youtu.be/5Hi1Ss8blKo?si=4TVKPCplYiPEBi8q
నయనతార (Nayanthara)
‘వల్లభ’ చిత్రంలో నటుడు శింభుతో కలిసి నయనతార రెచ్చిపోయింది. లిప్‌కిస్ సీన్లను ఏ మాత్రం బెరుకు లేకుండా చేసింది. అప్పట్లో వారిద్దరు రిలేషన్‌లో ఉన్నట్లు వార్తలు వచ్చాయి. ఈ క్రమంలోనే ఆమె ముద్దు సీన్లలో మెుహమాటపడలేదని సమాచారం.
https://youtu.be/GYn1g47mFZc?si=16ytg37esqYLiSsW
రష్మిక మందన్న (Rashmika Mandanna)
నేషనల్ క్రష్ రష్మిక మందన్న సైతం రెండు చిత్రాల్లో అదర చుంబనం చేసింది. డియర్ కామ్రేడ్ చిత్రంలో విజయ్ దేవరకొండతో ముద్దు సీన్లలో నటించింది. అలాగే ఇటీవల వచ్చిన ‘యానిమల్’ చిత్రంలో రణ్‌బీర్ కపూర్‌తో రెచ్చిపోయింది.
https://youtu.be/TSyLvBis830?si=OKi8o_8mIJGrU5dE
https://youtu.be/Ma8GcZXvKeM?si=NfAYyztDJ4AtkNZj
నేహా శెట్టి (Neha Shetty)
యంగ్ బ్యూటీ నేహా శెట్టి డీజే టిల్లు చిత్రంలో సిద్ధు జొన్నలగడ్డతో కలిసి కొన్ని రొమాంటిక్ సీన్స్ చేసింది. ముఖ్యంగా ఓ పాట చివర్లో సిద్ధూకు డీప్ కిస్ ఇచ్చి మతి పోగొట్టింది. అలాగే ఇటీవల వచ్చిన ‘గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి’ చిత్రంలోని ఓ పాటలో విశ్వక్ సేన్ పెదాలను తాకిస్తూ ముద్దు పెట్టింది.
https://youtu.be/DzegLt5UZuM?si=x8QPhZlMXzjCkUfe
https://youtu.be/GpcIMmvdY9A?si=RUvpds4l1NcH9zYz
రుహానీ శర్మ (Ruhani Sharma)
'ఆగ్రా' మూవీలో రుహానీ శర్మ కొన్ని శృంగార సన్నివేశాల్లో మితిమీరిపోయి నటించింది. రొమాన్స్ చేస్తూ, హావభావాల చూపిస్తూ పచ్చిగా కనిపించింది. తెలుగు సినిమాల్లో పద్దతిగా నటించిన రుహానీని అగ్రా చిత్రంలో అలా చూసి సినీ లవర్స్ షాకయ్యారు. అలాగే ‘దిల్‌సే దిల్’ వీడియో సాంగ్‌లోనూ లిప్‌లాక్ సీన్‌లో ఆమె కనిపించింది. థియేటర్‌లో వచ్చే ముద్దు సీనులో ఆమె నటించింది.
https://youtu.be/ooCxCQh1dcI?si=-3Ifodd842oG9k5k
కేతిక శర్మ (Ketika Sharma)
యంగ్ బ్యూటీ కేతిక శర్మ తన ఫస్ట్ ఫిల్మ్ ‘రొమాంటిక్’ మూవీలో ముద్దు సీన్లతో మైమరపించింది. డైరెక్టర్ పూరి జగన్నాథ్ తనయుడు ఆకాష్ పూరితో బస్‌లో ముద్దుల ప్రయాణం చేసింది. అలాగే ‘రంగ రంగ వైభవంగా’ మూవీలో పంజా వైష్ణవ్ తేజ్‌తోనూ లిప్‌లాక్ సీన్‌లో నటించింది.
https://youtu.be/vXjWi6UQDMk?si=PUQ99x3oWOqQ7Ec7
https://youtu.be/tCc3R96puEI?si=LJeyKB98VHuCCeri
డింపుల్ హయాతి (Dimple Hayathi)
విశాల్‌తో చేసిన ‘సామాన్యుడు’ చిత్రంలో హీరోయిన్ డింపుల్ హయాతి లిప్‌లాక్ సీన్‌లో చేసింది. థియేటర్‌లో హీరో విశాల్ పెదాలపై ఎంతో క్యూట్‌గా ముద్దు పెట్టింది. అలాగే రవితేజ ‘కిలాడీ’ సినిమాలో బికినీలో కనిపించడంతో పాటు ఘాటు ముద్దు సీన్లు సైతం చేసింది.
https://youtu.be/72xq28fxAj4?si=Vlm0s1dAnS2nIK1M
https://youtu.be/LWOj-SxqES4?si=CTGBapB7zFw0giPF
మాళవిక మోహన్ (Malavika Mohanan)
మలయాళ నటి మాళవిక మోహన్ 'యుధ్రా' సినిమాతో ఇటీవల బాలీవుడ్‌లో అడుగుపెట్టింది. హీరో సిద్ధాంత్ ఛతుర్వేదితో కలిసి బోల్డ్ సీన్స్‌లో నటించింది. గతంలో ఈ స్థాయి రొమాన్స్ మాళవిక చేయలేదు. ముఖ్యంగా స్విమ్మింగ్ పూల్ సీన్‌లో ముద్దులతో విరుచుకుపడింది.
https://youtu.be/QpWysxpVgkg?si=dmIpGe-s9c1qXLpK
https://youtu.be/apzjoosKrHM?si=61ea0jQcIRmwX7d1
తృప్తి దిమ్రి (Tripti Dimri)
బాలీవుడ్ భామ తృప్తి దిమ్రీ పేరు ‘యానిమల్’ చిత్రంతో ఒక్కసారిగా మారుమోగిపోయింది. ఇందులో రణ్‌బీర్ కపూర్‌తో కలిసి ఆమె ఇంటిమేట్ సీన్‌లో నటించింది. ఘాటైన లిప్‌లాక్‌తో కవ్వించింది. అలాగే ఇటీవల హిందీలో వచ్చిన ‘బ్యాడ్ న్యూస్’ సినిమాలోనూ నటుడు విక్కీ కౌశల్‌తో కలిసి ఆమె లిప్‌లాక్ సీన్ చేసింది.
https://youtu.be/OWBr0mtA09w?si=PYy7JvnIBwQGeS6j
పాయల్ రాజ్‌పుత్ (Payal Rajput)
‘RX100’ చిత్రంతో తెలుగు తెరకు పరిచయమైన పాయల్ రాజ్‌పుత్ అందులో హీరో కార్తికేయతో రొమాంటిక్ సీన్స్ చేసింది. లిప్‌లాక్ ముద్దులతో అతడ్ని ముంచెత్తింది. ‘RDX లవ్’ అనే మరో సినిమాలోనూ కుర్ర హీరోతో తన పెదాలను పంచుకుంది.
https://youtu.be/M0A073kZqOs?si=Wem1xfWcBkihcjRP
https://youtu.be/p63JKf879T4?si=4FmfuopZSq25C0p3
వైష్ణవి చైతన్య (Vaishnavi Chaitanya)
యంగ్ బ్యూటీ వైష్ణవి చైతన్య ‘బేబీ’ చిత్రంతో ఒక్కసారిగా అందరి దృష్టిని ఆకర్షించింది. ఇందులో ఆమె పలు రొమాంటిక్ సీన్స్‌లో నటించింది. నటుడు విరాజ్‌తో కలిసి పబ్‌లో లిప్‌లాక్ సీన్ చేసింది. అలాగే ఇంటిమేట్ సీన్‌లోనూ కనిపించి హార్ట్ బీట్‌ను అమాంతం పెంచేసింది.
https://youtu.be/dFo8klGt58Y?si=pi-dhy59FkD9CHnu
కావ్యా థాపర్ (Kavya Thapar)
గ్లామర్ బ్యూటీ కావ్యా థాపర్ కుర్ర హీరో సంతోష్ శోభన్‌తో కలిసి లిప్‌లాక్ సీన్ చేసింది. ‘ఏక్ మినీ కథ’ చిత్రంలోని ఓ సాంగ్‌లో ఘాటైన రొమాన్స్ చేసింది.
https://youtu.be/Vbnp6wIf8XY?si=bmWPAr5lWg-YgNOn
అనుపమా పరమేశ్వరన్ (Anupama Parameswaran)
ఒకప్పుడు ట్రెడిషనల్ పాత్రలతో ఆకట్టుకున్న అనుపమా పరమేశ్వరన్ ఈ మధ్య కాలంలో రొమాంటిక్ సీన్స్‌కు పెద్ద పీట వేస్తోంది. యూత్‌ను ఆకర్షించే క్రమంలో ‘రౌడీ బాయ్స్’, ‘టిల్లు స్క్వేర్’ చిత్రాల్లో రెచ్చిపోయింది. హీరోలను ముద్దులతో ముంచెత్తింది.
https://youtu.be/vm8sg_Gtwf8?si=a0zPMR1VSnhROOIX
https://youtu.be/-GqC3e4K4f0?si=ilK643bC0cRF8Uus
https://youtu.be/ZY6U0N0jxtE?si=kZ1d5zGrK75cP-q-
షాలిని పాండే (Shalini Pandey)
అర్జున్ రెడ్డి చిత్రంతో నటి షాలిని పాండే టాలీవుడ్‌కు పరిచయమైంది. ఇందులో విజయ్ దేవరకొండతో కలిసి మల్టిపుల్ లిప్ లాక్ సీన్స్ చేసింది.
https://youtu.be/p8OExtmSVQc?si=a7d-gIT9KwGMbW0A
https://youtu.be/y9nY4xZ7d9c?si=g7NIk_s8k8M1MOm-
శోభితా దూళిపాళ్ల (Sobhita Dhulipala)
ప్రముఖ హీరోయిన్ శోభితా దూళిపాళ్ల కూడా పలు లిప్‌లాక్ సీన్లలో నటించింది. 'మేడ్ ఇన్ హెవెన్' వెబ్‌సిరీస్‌లో బోల్డ్ సీన్స్‌లో రచ్చ రచ్చ చేసింది. అలాగే ‘మంకీ మ్యాన్’ అనే హాలీవుడ్ మూవీలోనూ ఈ అమ్మడు ముద్దు సీన్లలో నటించింది. టాలీవుడ్ నటుడు నాగ చైతన్యతో శోభితాకు నిశ్చితార్థం జరిగిన సంగతి అందరికీ తెలిసిందే.
https://youtu.be/-sZwctU1-AI?si=u7O55-nGt5lABZG4
https://youtu.be/ui5J3MMqyks?si=ORhbahScSjs_xvLu
మానసా చౌదరి (Maanasa Chowdary)
రోషన్ కనకాల హీరోగా పరిచయమైన 'బబుల్ గమ్' చిత్రంలో మానస చౌదరి హీరోయిన్‌గా చేసింది. ఈ సినిమాలో హీరో హీరోయిన్ల మధ్య లిప్ లాక్ సీన్స్ కాస్త ఎక్కువగానే ఉన్నాయి. ఒక్క సాంగ్‌లోనే ఏకంగా 14 లిప్ లాక్స్ ఉన్నాయి.
https://youtu.be/ASWoafIYNpg?si=_4DmWUSQO03DibjZ
https://youtu.be/jK5Yz41NqSU?si=I9juu_-cUhn2NCBU
అక్టోబర్ 05 , 2024
Rashi Singh: రాశి సింగ్ గురించి టాప్ సీక్రెట్స్ మీకోసం!
యంగ్ హీరోయిన్ రాశి సింగ్ (Rashi Singh).. ‘భూతద్దం భాస్కర్ నారాయణ’ (Bhoothaddam Bhaskar Narayana) సినిమాతో ఒక్కసారిగా అందరి దృష్టిని ఆకర్షించింది. అంతేకాకుండా గత కొన్ని రోజులుగా తన అంద చందాలతో మతి పోగొడుతూ నెటిజన్లకు హాట్ ట్రీట్ ఇస్తోంది. ఎద, నాభి సోయగాలను చూపిస్తూ కుర్రకారుకి వలపు వల విసురుతోంది. దీంతో ఈ భామ గురించి తెలుసుకునేేందుకు ప్రతీ ఒక్కరూ ఆసక్తి కనబరుస్తున్నారు. ఈ నేపథ్యంలో రాశి సింగ్ సినిమాలతో పాటు ఆమె ఇష్టా ఇష్టాలు, ఆసక్తులు వంటివి ఈ కథనంలో తెలుసుకుందాం.
రాశి సింగ్ పుట్టిన రోజు ఎప్పుడు?
రాశి సింగ్.. చత్తీస్‌గఢ్‌లోని రాయ్‌పుర్‌లో జనవరి 5, 1994లో జన్మించింది. ఆమె తల్లిదండ్రులు రమేష్ సింగ్, సరితా సింగ్. రాశికి ఓ సోదరుడు కూడా ఉన్నాడు. అతడి పేరు సౌరభ్ సింగ్.
రాశి సింగ్ విద్యాభ్యాసం ఎక్కడ?
ఈ భామ ప్రాథమిక విద్యాభ్యాసం అంతా చత్తీస్‌గఢ్‌లోని భిలాయ్ పట్టణంలో గల క్రిష్ణ పబ్లిక్ స్కూల్‌లో జరిగింది. ఆ తర్వాత ముంబయిలో ఉన్నత విద్యను అభ్యసించింది.
View this post on Instagram A post shared by Rashi Singh (@rashi.real)
రాశి సింగ్ కెరీర్ ఎలా మెుదలైంది?
ఈ భామ కెరీర్‌లో ప్రారంభంలో ఎయిర్ హోస్టేస్ (Air Hostess)గా పని చేసింది. ఇండిగో ఎయిర్‌లైన్స్ (Indigo Airlines) విధులు నిర్వర్తించింది. మోడలింగ్‌లోనూ ఈ భామకు ప్రవేశం ఉంది.
రాశి సింగ్ వయసు ఎంత?
రాశి సింగ్ జనవరి 5, 1994లో జన్మించినందున ప్రస్తుతం ఆమె వయసు 30 సంవత్సరాలు.
రాశి సింగ్ ఎత్తు, బరువు ఎంత?
రాశి సింగ్ 5.5 అంగుళాల ఎత్తు, 55 కేజీల బరువు కలిగి ఉంది. ఈ భామ బాడీ కొలతలు 32-26-34.
రాశి సింగ్ సినిమాలపై ఆసక్తి ఎలా ఏర్పడింది?
చిన్నప్పటి నుంచి రాశి సింగ్‌కు సినిమాలపై ఆసక్తి ఉండేదట. హీరోయిన్ కావాలని చిన్నప్పుడే నిర్ణయించుంది. ఎంతో హార్డ్ వర్క్ చేసి సినిమాల్లో అవకాశం దక్కించుకుంది.
రాశి సింగ్ ప్రస్తుతం ఎక్కడ ఉంటున్నారు?
ఎయిర్ హోస్టేస్‌గా ఉద్యోగం చేస్తున్న సమయంలో ఆమె ముంబయిలో ఉండేది. ప్రస్తుతం తెలుగు సినిమాలపై ఫోకస్ పెట్టడంతో తన మకాంను హైదరాబాద్‌కు మార్చింది.
రాశి సింగ్ ఏ ఏ భాషలు మాట్లాడుతుంది?
రాశి సింగ్ ఇంగ్లీష్, హిందీ బాగా మాట్లాడకలదు. టాలీవుడ్‌లో సినిమా అవకాశాలు వస్తుండటంతో తెలుగు మాట్లాడటం కూడా నేర్చుకున్నట్లు ఓ ఇంటర్యూలో ఈ బ్యూటీ చెప్పింది.
రాశి సింగ్ ఎలాంటి పాత్రలు చేయడానికి ఇష్టపడతారు ?
వైవిధ్యభరితమైన పాత్రలు చేసేందుకు రాశి సింగ్ ఆసక్తి కనబరుస్తుంది. ఒకే తరహా పాత్రలు చేయడం తనకు నచ్చదని ఓ ఇంటర్యూలో చెప్పుకొచ్చింది.
రాశి సింగ్ తెలుగులో ఫేవరేట్ హీరో ఎవరు?
రాశిసింగ్ ఫేవరేట్ హీరో.. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్. ఆర్య 2 చూసి ఆమె ఆయన అభిమాని అయిపోయింది. ప్రతి సినిమాలో బన్నీ వైవిధ్యం చూపిస్తుండటం రాశిసింగ్‌కు బాగా నచ్చుతుందట.
రాశి సింగ్ మెుదటి సినిమా ఏది?
తెలుగులో జెమ్(2019) చిత్రం ద్వారా రాశి సింగ్ వెండి తెరకు పరిచయమైంది. ఆ తర్వాత పోస్టర్, రీసౌండ్ వంటి చిన్నా చితక సినిమాల్లో నటించిన పెద్దగా గుర్తింపు లభించలేదు.
రాశి సింగ్ గుర్తింపు తెచ్చిన చిత్రం?
ఈ ముద్దుగుమ్మ తాజాగా నటించిన ‘భూతద్దం భాస్కర్ నారాయణ' చిత్రం పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. ఇందులో రాశి సింగ్ నటనకు మంచి మార్కులు పడ్డాయి. దీంతో ఆమెపై దర్శక నిర్మాతల దృష్టి పడింది.
రాశి సింగ్ మద్యం సేవిస్తుందా?
లేదు.
రాశి సింగ్ సిగరేట్ దాగుతుందా?
లేదు.
రాశి సింగ్ మాంసాహారం తింటుందా?
అవును. రాశి సింగ్ చికెన్, మటన్‌తో చేసిన నాన్ వెజ్ వంటకాలను చాలా ఇష్టంగా లాగించేస్తుందట.
ఇన్‌స్టాగ్రామ్ ఖాతా లింక్?
https://www.instagram.com/rashi.real/?hl=en
ఇన్‌స్టాగ్రామ్ ఫాలోవర్లు?
ఇన్‌స్టాలో ఈ సుందరాంగికి 1మిలియన్‌కు దగ్గర్లో ఫాలోవర్లు ఉన్నారు.
మార్చి 05 , 2024
Arya @ 20 Years: ‘ఆర్య’ చిత్రానికి 20 ఏళ్లు.. ఈ మూవీ సీక్రెట్స్ తెలుసా?
అల్లు అర్జున్ (Allu Arjun) హీరోగా సుకుమార్ (Sukumar) డైరెక్షన్ తొలి సారి వచ్చిన ‘ఆర్య’ (Arya) చిత్రం అప్పట్లో ఇండస్ట్రీని షేక్ చేసింది. వన్ సైడ్ లవ్ అనే ఇంట్రస్టింగ్ కాన్సెప్ట్‌తో వచ్చిన ఈ సినిమా తొలి రోజు డివైడ్ టాక్ తెచ్చుకుంది. కానీ ఆ తర్వాత క్రమంగా పుంజుకొని బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల సునామీ సృష్టించింది. చాలా థియేటర్లలో 125 రోజులకు పైగా ప్రదర్శితమై విమర్శకుల ప్రశంసలు అందుకుంది. అయితే 2004 మే7న ఈ సినిమా రిలీజ్ కాగా, నేటితో సరిగ్గా 20 ఏళ్లు పూర్తైంది. ఈ నేపథ్యంలో ఆర్యకు సంబంధించిన తెర వెనక రహాస్యాలపై ఓ లుక్కేద్దాం.
దిల్ సక్సెస్‌తో సుకుమార్‌కు ఛాన్స్
నితీన్ హీరోగా చేసిన ‘దిల్’ చిత్రానికి డైరెక్టర్ సుకుమార్ అసిస్టెంట్ డైరెక్టర్‌గా పని చేశారు. ఆ సమయంలో నిర్మాత దిల్ రాజుకు సుకుమార్ ‘ఆర్య’ స్టోరీ వినిపించారు. ఇంప్రెస్ అయిన అతడు.. ‘దిల్’ సినిమా సక్సెస్ అయితే కచ్చితంగా డైరెక్షన్ ఛాన్స్ ఇస్తా అని సుకుమార్‌కు మాటిచ్చారు. ఈ లోపు పూర్తి కథ సిద్ధం చేసుకో అని సూచించారు. ఆ తర్వాత రిలీజైన ‘దిల్’.. బ్లాక్ బాస్టర్ కావడంతో సుకుమార్‌కు డైరెక్టర్ ఛాన్స్ వచ్చింది. పలు దఫాల చర్చల తర్వాత ఆర్య సినిమాకు గ్రీన్ సిగ్నల్ పడింది.
మిస్ చేసుకున్న అల్లరి నరేష్
ఆర్య చిత్రానికి తొలుత హీరోగా అల్లరి నరేష్‌ను సుకుమార్ అనుకున్నారట. అతడ్ని దృష్టిలో పెట్టుకొనే కథను కూడా రాశారట. అయితే కొన్ని కారణాల వల్ల కథ ఆయన వరకూ వెళ్లలేదట. ఈ విషయాన్ని ఓ ఇంటర్యూలో నరేష్ స్వయంగా పంచుకున్నారు. ‘సుకుమార్ ‘100%లవ్’ సినిమా తీస్తున్న సమయంలో నన్ను కలిశారు. ‘‘అల్లరి’లోని మీ నటన నన్ను ఆకట్టుకుంది. ‘ఆర్య’ కథ మీ కోసం రాసుకున్నా’’ అని చెప్పారు. ఎవరికి రాసి పెట్టి ఉన్న కథ వారి వద్దకే వెళ్తుంది. ఆయన దృష్టిలో పడ్డానంటే నటుడిగా నేనేదో చేస్తున్నట్లే లెక్క. ఆర్యగా అల్లు అర్జున్ కంటే బాగా ఎవరూ చేయలేరు’ అని నరేశ్ అన్నారు.
https://twitter.com/i/status/1787548147520061468
బన్నీని అలా ఫైనల్ చేశారు!
ఆర్య కథ సిద్ధమైన తర్వాత హీరోను ఎవరు పెట్టాలన్న సందేహం కొన్ని రోజుల పాటు దర్శక నిర్మాతలను వెంటాడిందట. హీరో కోసం వెతుకున్న క్రమంలోనే దిల్ మూవీ స్పెషల్ షో నిర్వహించారు. ఆ సమయంలో బన్నీ కూడా వెళ్లాడు. అల్లుఅర్జున్ చలాకీ తనం, కామెడీ టైమింగ్ చూసి తన కథకు బన్నీ అయితేనే సరిగ్గా సరిపోతాడని దిల్ రాజుతో సుకుమార్ అన్నాడట. వెళ్లి అల్లు అర్జున్‌తో మాట్లాడరట. గంగోత్రి తర్వాత చాలా కథలు విని విసిగిపోయిన బన్నీ రొటీన్ స్టోరీ అనుకొని నో చెప్పారట. ఎట్టకేలకు విన్నాక కథ బన్నీకి బాగా నచ్చిందట. అటు చిరంజీవి, అల్లు అరవింద్‌కు కూడా ఇంప్రెస్ కావడంతో సినిమా పట్టాలెక్కింది.
అసిస్టెంట్‌గా చేసిన స్టార్ డైరెక్టర్
కొత్త బంగారు లోకం, ముకుంద, సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు వంటి హిట్ చిత్రాలను డైరెక్ట్ చేసిన శ్రీకాంత్ అడ్డాల.. ఆర్య మూవీకి సహాయ దర్శకుడిగా పనిచేశాడు. అంతేకాదు ఓ సీన్‌లోనూ ఆయన కనిపించాడు. ఇక ఈ సినిమా టైటిల్ విషయంలోనూ తొలుత కాస్త గందరగోళం నెలకొందట. ఈ వన్‌సైడ్ లవ్ స్టోరీకి ఏ పేరు పెడితే బాగుంటుందా? అని దర్శకుడు సుకుమార్, నిర్మాత దిల్ రాజు తెగ ఆలోచించారట. ఈ క్రమంలో ‘నచికేత’ టైటిల్ పెడితే ఎలా ఉంటుదని చిత్ర యూనిట్ యోచించిందట. చివరకు బన్నీ పాత్ర పేరునే టైటిల్‌గా ఫిక్స్ చేశారట.
https://twitter.com/i/status/1787674074585714980
120 రోజుల్లో షూటింగ్ పూర్తి
ఆర్య చిత్ర షూటింగ్‌ను దర్శకుడు శరవేగంగా పూర్తి చేశాడు. 2003 నవంబరు 19న ఈ సినిమా లాంఛనంగా మెుదలవ్వగా.. 120 రోజుల్లోనే పూర్తి చేశారు. అటు సుకుమార్ - దేవిశ్రీ ప్రసాద్ కాంబోలో తొలిసారి వచ్చిన ఈ మూవీ ఆల్బమ్.. మ్యూజిక్ లవర్స్‌ను ఫిదా చేసింది. ముఖ్యంగా తెలుగు అక్షరాలమాలకు కొత్త అద్దం చెప్పే ‘అ అంటే అమలాపురం..’ పాట అప్పట్లో మాస్ ఆడియన్స్‌ను విపరీతంగా ఆకట్టుకుంది. ఆటోలు, ట్రాక్టర్లు, ఫంక్షన్లు, ఈవెంట్స్ ఇలా ఎక్కడ చూసినా ఆ పాటనే వినిపించేది.
ఆర్యతో వారికి స్టార్‌డమ్
ఆర్య సినిమా సక్సెస్.. డైరెక్టర్ సుకుమార్, హీరో అల్లు అర్జున్, నిర్మాత దిల్ రాజు, సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్, డీవోపీ రత్నవేలు జీవితాలను మార్చివేసింది. వారి కెరీర్‌లో మైలురాయిగా నిలిచిపోయింది. గంగోత్రి తర్వాత బన్నీ చేసిన రెండో చిత్రం ఆర్య. ఈ సినిమాలో బన్నీ స్టైల్, డ్యాన్స్, గ్రేస్, యాక్షన్ చూసి తెలుగు ఆడియన్స్ ఫిదా అయ్యారు. ఆర్య వచ్చి 20 ఏళ్లు పూర్తైన సందర్భంగా హీరో బన్నీ ఎక్స్ వేదికగా ప్రత్యేక పోస్టును సైతం పెట్టాడు. 'నా జీవిత గమనాన్ని మార్చిన ఒక క్షణం.. ఎప్పటికీ కృతజ్ఞతతో ఉంటాను' అని బన్నీ పోస్టు పెట్టాడు.
మే 07 , 2024
Rewind 2024: ఈ ఏడాది ఆడ పిల్లలకు జన్మనిచ్చిన స్టార్ హీరోయిన్స్ వీరే..
తల్లి కావాలని పెళ్లైన ప్రతీ మహిళ కోరుకుంటుంది. అమ్మదనంలోని కమ్మదానాన్ని అస్వాదించేందుకు వారు ఉవ్విళ్లురుతుంటారు. ఇందుకు స్టార్ హీరోయిన్స్ సైతం అతీతమేమి కాదు. ఈ క్రమంలోనే ఏటా చాలా మంది సెలబ్రిటీలు (Celebrity mothers 2024) పండంటి బిడ్డలకు జన్మనిస్తుంటారు. 2024లోనూ పలువురు స్టార్ హీరోయిన్స్ అమ్మదనంలోకి అడుగుపెట్టారు. తద్వార తమ జీవితంలో కొత్త అధ్యాయానికి శ్రీకారం చుట్టారు. అటు హీరోలు సైతం తండ్రులుగా మారి వార్తల్లో నిలిచారు. తల్లి లేదా తండ్రిగా ప్రమోషన్ పొందిన ఆ సెలబ్రిటీలపై ఓ లుక్కేయండి.
రాధిక ఆప్టే (Radhika Apte)
ప్రముఖ బాలీవుడ్ నటి రాధిక ఆప్టే ఈ డిసెంబర్ నెలలోనే మాతృత్వంలోకి (Celebrity mothers 2024) అడుగుపెట్టింది. ఓ ఆడ శిశువుకు జన్మనిచ్చింది. ఈ విషయాన్ని రాధిక స్వయంగా సోషల్ మీడియాలో ప్రకటించింది.
శ్రద్ధా ఆర్య (Shraddha Arya)
తెలుగు హీరోయిన్ శ్రద్దా ఆర్య నవంబర్ 29న పండంటి కవలలకు జన్మనిచ్చింది. ఈ విషయాన్ని ఇన్‌స్టాగ్రామ్‌లో వీడియో పోస్టు చేసి మరి ఆమె తెలియజేసింది.
దీపికా పదుకొనే (Deepika Padukone)
బాలీవుడ్ హీరోయిన్ దీపికా పదుకొనే ఈ ఏడాదే తొలిసారి తల్లిగా ప్రమోషన్ సంపాదించింది. రణవీర్ సింగ్, దీపికా పదుకొణె జంట సెప్టెంబర్‌లో ఆడ శిశువుకు జన్మనిచ్చింది. తమ పాపకు దువా అని పేరు పెట్టింది.
ప్రణీత (Actress Praneetha)
ప్రముఖ నటి ప్రణీత ఈ ఏడాది సెప్టెంబర్‌లో (Celebrity mothers 2024) మగబిడ్డకు జన్మనిచ్చింది. తొలిగా 2022లో ఆమె ఆడపిల్లకు జన్మనిచ్చిన సంగతి తెలిసిందే.
యామి గౌతమ్ (Yami Gautam)
బాలీవుడ్ నటి యామి గౌతమ్ ఈ ఏడాది మేలో మగబిడ్డకు జన్మనిచ్చింది. యామి - ఆదిత్య ధర్ దంపతులకు వేదవిద్ అనే బాబు పుట్టాడు. ఈ విషయాన్ని సోషల్ మీడియా వేదికగా యామి ప్రకటించింది.
అమలా పాల్ (Amala Paul)
తమిళ స్టార్ నటి అమలాపాల్ (Celebrity mothers 2024) తెలుగు ప్రేక్షకుల్లోనూ మంచి గుర్తింపు సంపాదించింది. అమలాపాల్ - జగత్ దేశాయ్ దంపతులు జూన్‌లో ఓ మగ బిడ్డకు జన్మనిచ్చారు.
అనుష్క శర్మ (Anushka Sharma)
బాలీవుడ్ బ్యూటీ అనుష్క శర్మ ఈ ఏడాది రెండో బిడ్డకు జన్మనిచ్చింది. విరాట్ - అనుష్క జంటకు ఫిబ్రవరి 15న బాబు పుట్టాడు. అతడికి అకాయ్ అని ఈ జంట నామకరణం చేసింది.
సుహాస్ (Suhas)
టాలీవుడ్ యంగ్ హీరో సుహాస్ కూడా ఈ ఏడాదే తండ్రయ్యాడు. అతడి భార్య లలిత జనవరిలో మగబిడ్డకు జన్మనిచ్చింది.
నిఖిల్ సిద్దార్థ్ (Nikhil Siddharth)
టాలీవుడ్ హీరో నిఖిల్ సిద్దార్థ్ ఈ ఏడాదే తండ్రిగా ప్రమోషన్ పొందాడు. అతడి భార్య పల్లవి వర్మ ఫిబ్రవరి 21న మగబిడ్డకు జన్మనిచ్చింది.
మంచు మనోజ్ (Manchu Manoj)
నటుడు మంచు మనోజ్ ఈ ఏడాది ఏప్రిల్‌లో తండ్రయ్యాడు. ఆయన రెండో భార్య మౌనికా రెడ్డి పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చింది. పాపకు దేవసేన శోభాగా నామకరణం చేశారు.
నితిన్ (Nithiin)
టాలీవుడ్ టాలెంటెడ్ హీరో నితీన్ ఈ ఏడాదే కొత్తగా తండ్రయ్యాడు. వినాయక చవితికి ఒక రోజు ముందు ఆయన భార్య షాలిని పండంటి మగబిడ్డకు జన్మనిచ్చింది.
డిసెంబర్ 24 , 2024
Allu Arjun: పుష్పరాజ్‌గా ఫస్ట్ మహేశ్‌ను సెలక్ట్ చేశారట. బన్నీ మేకప్‌కు 3గం.లు పట్టేదట.. ‘పుష్ప’ గురించి మీకు తెలియని విషయాలు..!
2021లో వచ్చిన పుష్ప చిత్రం (Pushpa) ఏ మేర ప్రభంజనం సృష్టించిందో అందరికీ తెలిసిందే. ‘పుష్ప అంటే ఫ్లవర్ అనుకుంటివా.. ఫైరు’ అన్న డైలాగ్ దేశవ్యాప్తంగా ఫేమస్ అయ్యింది. పలువురు క్రికెటర్లు, సెలబ్రిటీలు సైతం ఈ డైలాగ్ చెబుతూ సోషల్ మీడియాలో వీడియోలు సైతం పోస్టు చేశారు. దీంతో ఈ సినిమా మరింతగా సినీ ప్రేక్షకుల హృదయాల్లోకి చొచ్చుకుపోయింది. ప్రస్తుతం ఆ క్రేజే అల్లుఅర్జున్ (Allu arjun)కు జాతీయస్థాయిలో ఉత్తమ నటుడిగా నిలబెట్టింది. సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన ‘పుష్ప: ది రైజ్’ చిత్రంలో బన్నీ తన విశ్వరూపాన్ని చూపించాడు. నటన, డైలాగ్ డెలివరీ, డ్యాన్స్ ఇలా ప్రతీదానిలో తన మార్క్ చూపించి భారత సినీ ప్రేక్షకులను హోరెత్తించాడు. జాతీయస్థాయిలో గుర్తింపు సంపాదించిన పుష్ప సినిమా గురించి కొన్ని ఆసక్తికర విషయాలు మీకోసం.
పదేళ్ల తర్వాత..
2004లో వచ్చిన ‘ఆర్య’ చిత్రం బన్నీ కెరీర్‌లో ఓ మైలురాయి వంటింది. సుకుమార్, అల్లుఅర్జున్ కాంబినేషన్‌లో వచ్చిన తొలి చిత్రం కూడా అదే. ఆ తర్వాత వీరిద్దరి కాంబినేషన్‌లో వచ్చిన ‘ఆర్య2’ యావరేజ్‌గా నిలిచింది. దాదాపు పదేళ్ల తర్వాత ‘పుష్ప’ కోసం అల్లు అర్జున్, సుకుమార్ చేతులు కలిపారు. తాజాగా దీనికి జాతీయ అవార్డు రావడంతో ఈ ఇద్దరూ ఒకరినొకరు ఆలింగనం చేసుకుని సంబరాలు చేసుకున్నారు.
ఛాన్స్ మిస్ చేసుకున్న మహేశ్..!
‘పుష్ప’ కథను సుకుమార్ తొలుత మహేశ్‌బాబుకు చెప్పారట. ఆయనకు కథ నచ్చి గ్రీన్ సిగ్నల్ కూడా ఇచ్చారట. కానీ, అప్పటికే ఒప్పుకొన్న ప్రాజెక్టుల వల్ల మహేష్ డేట్స్ సర్దుబాటు చేయలేకపోయాడట. దీంతో ప్రాజెక్టు ఆగిపోయింది. అయితే మహేశ్‌కు చెప్పిన కథ ఇదే నేపథ్యమైనప్పటికీ స్టోరీ లైన్ వేరని సుకుమార్ ఆ తర్వాత తెలిపారు. ఇదిలా ఉంటే పుష్పరాజ్ పాత్రకు బన్నీ ప్రాణం పోశాడు. ఈ పాత్ర కోసం రెండు, మూడు గంటలు కదలకుండా మేకప్ వేసుకున్నాడు. ఆ కృషే పుష్పకు జాతీయ అవార్డును తెచ్చిపెట్టింది.
మ్యాజిక్ రిపీట్
అల్లు అర్జున్, సుకుమార్, దేవిశ్రీ ప్రసాద్ ఈ ముగ్గురూ కలిస్తే ఆడియన్స్‌కు పూనకాలే అని ఇంతకు ముందు సినిమాల ద్వారా నిరూపతమైంది. ‘పుష్ప’ విషయంలోనూ అదే మ్యాజిక్ రిపీట్ అయింది. ‘శ్రీవల్లి’, ‘ఊ అంటావా మావ’, ‘సామి సామి’ పాటలు యూట్యూబ్‌లో సెన్సేషన్ క్రియేట్ చేశాయి. 2022లో అత్యంత ప్రజాదరణ కలిగిన టాప్-10 సాంగ్స్‌లో ఇవి నిలిచాయి. అంతేకాదు 6.2 బిలియన్‌కు పైగా వ్యూస్ సొంతం చేసుకున్న తొలి ఇండియన్ ఆల్బమ్‌గానూ రికార్డు సృష్టించాయి. ఈ పాటలకు గాను దేవిశ్రీ ఉత్తమ సంగీత దర్శకుడిగా జాతీయ అవార్డు అందుకోనున్నారు.
కలెక్షన్ల సునామీ
2021 డిసెంబరు 17న ‘పుష్ప’ చిత్రం పాన్ ఇండియా స్థాయిలో విడుదలైంది. ప్రపంచవ్యాప్తంగా రూ.365కోట్లు (గ్రాస్) వసూలు చేసింది, ఒక్క హిందీలోనే రూ.108 కోట్లు (నెట్) కలెక్షన్లు రాబట్టడం విశేషం. 2021లో విడుదలైన చిత్రాల్లో అత్యధిక గ్రాస్ వసూళ్లు సాధించిన చిత్రంగా ‘పుష్ప’రాజ్ రికార్డు సృష్టించాడు.
ఓటీటీలోనూ ప్రభంజనమే
ఓటీటీలోనూ ‘పుష్ప’అదరగొట్టింది. 2022లో అమెజాన్‌ప్రైమ్‌లో అత్యధికమంది వీక్షించిన మూవీగా నిలిచింది. టెలివిజన్‌లోనూ పుష్పరాజ్ హవా చూపించాడు. 2022లో అత్యధిక టీఆర్‌పీ రేటింగ్ సాధించిన చిత్రంగా పుష్ప అలరించింది.
రికార్డుస్థాయిలో రీల్స్
సోషల్ మీడియాను సైతం ‘పుష్ప’ ఒక ఊపు ఊపింది. 10 మిలియన్లకు పైగా ఇన్‌స్టా రీల్స్ క్రియేట్ చేశారంటే పుష్ప మేనియా ఎలాంటిదో అర్థం చేసుకోవచ్చు. ఇప్పటికీ ఈ సినిమా పాటలు, సన్నివేశాలు నెట్టింట దర్శనమిస్తూనే ఉన్నాయి.
అవార్డ్స్‌లోనూ ‘తగ్గేదేలే’
గతంలో ఈ సినిమాకు ఏడు ఫిల్మ్‌ఫేర్‌లు, మరో ఏడు సైమా అవార్డులు వచ్చిన సంగతి తెలిసిందే. ఉత్తమ చిత్రం, ఉత్తమ దర్శకుడు, ఉత్తమ నటుడు, ఉత్తమ సంగీత దర్శకుడు, ఉత్తమ గీత రచయిత, ఉత్తమ సినిమాటోగ్రఫీ విభాగాల్లో ఈ చిత్రం అవార్డులను సొంతం చేసుకుంది. తాజాగా జాతీయ ఉత్తమ నటుడి అవార్డు పుష్పరాజ్‌కు రావడం విశేషం.
ఫేమస్ డైలాగ్స్
పుష్ప సినిమాను ప్రజలకు మరింత చేరువ చేసిన అంశాల్లో డైలాగ్స్ ముందు వరుసలో ఉంటాయి.‘పుష్ప’ అంటే ఫ్లవర్ అనుకుంటివా.. ఫైరు..’, ‘సరకు ఉంటే పుష్ప ఉండడు.. పుష్ప ఉంటే సరకు ఉండదు.. రెండింటినీ కలిపి చూడాలనుకుంటే మీరు ఎవ్వరూ ఉండరు’, ‘నేను ఇక్కడ బిజినెస్‌లో ఏలుపెట్టి కెలకడానికి రాలే, ఏలేయడానికి వచ్చా.. తగ్గేదేలే’ లాంటి డైలాగ్‌లు బాగా ఫేమస్ అయ్యాయి.
పుష్పరాజ్ వచ్చేస్తున్నాడు!
‘పుష్ప’ సినిమాకు కొనసాగింపుగా ‘పుష్ప: ది రూల్’ (Pushpa 2) రానుంది. దీని షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఇటీవల ‘పుష్ప ఎక్కడా..?’ పేరుతో విడుదల చేసిన గ్లింప్స్‌కు ప్రేక్షకుల నుంచి భారీ స్పందన వచ్చింది. ఇప్పటికే ‘పుష్ప 2’ సంబంధించి అల్లు అర్జున్, రష్మిక (Rashmika), ఫహాద్ ఫాజిల్‌ల ఫస్ట్‌లుక్‌లను రిలీజ్ చేశారు. కాగా, ఈ సినిమా వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు రానుంది.
ఆగస్టు 25 , 2023
Tollywood Rewind 2024: ఈ ఏడాది బిగ్గెస్ట్ డిజాస్టర్‌గా నిలిచిన టాప్ 10 సినిమాలు ఇవే!
2024 సంవత్సరానికి చివరి ఘడియలు దగ్గరపడుతుండగా, ఈ ఏడాది టాలీవుడ్ సక్సెస్, ఫెయిల్యూర్స్ పైన చర్చ మొదలైంది. టాలీవుడ్‌కి పెద్ద హిట్ లను అందించిన 'కల్కి', 'పుష్ప 2', హనుమాన్ వంటి సినిమాలు ఈ ఏడాది తెలుగు సినీ పరిశ్రమను ముందుకు నడిపించాయి. కానీ, మరోవైపు కొన్ని అగ్రహీరోల సినిమాలు, యంగ్ హీరోల ప్రాజెక్టులు భారీ అంచనాల మధ్య విడుదలై ప్రేక్షకుల్ని తీవ్రంగా నిరాశపరిచాయి. ఇప్పుడు 2024లో అత్యధికంగా నిరాశపరిచిన పెద్ద సినిమాల గురించి తెలుసుకుందాం.
1. ఈగల్
మాస్ మహారాజా రవితేజ ఈ ఏడాది కూడా డిజాస్టర్ల జాబితాలో చేరారు. కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వంలో రూపొందిన 'ఈగల్' సినిమా, భారీ అంచనాల మధ్య విడుదలైనప్పటికీ ప్రేక్షకుల ఆశలపై నీళ్లు చల్లింది. డైరెక్టర్ ప్రశాంత్ నీల్ తీసిన 'కేజీఎఫ్' సినిమాల ప్రభావంతో, నేటి యువ దర్శకులు సరికొత్త కథలు తీసుకోకుండా, భారీ బడ్జెట్‌తో యాక్షన్ సన్నివేశాలు, భారీ గన్స్, విచిత్రమైన ఫ్లాష్‌బ్యాక్‌లతో సినిమాలు తెరకెక్కిస్తున్నారు. కానీ 'ఈగల్' కథపై దృష్టి పెట్టకుండా ఒక్కో సన్నివేశం మాత్రమే బాగా రావాలని ప్రయత్నించడం స్పష్టంగా కనిపించింది. భారీ బడ్జెట్ వృథాగా అయిందని చెప్పుకోవచ్చు.
2. మిస్టర్ బచ్చన్
2024లో మరో పెద్ద డిజాస్టర్‌గా నిలిచిన చిత్రం 'మిస్టర్ బచ్చన్'. ఈ సినిమా రీమేక్ సినిమాల విషయంలో ఎలా చేయకూడదో అనిపించేలా ఉంది. ప్రేక్షకులను ఆకట్టుకునే క్రిస్టల్ క్లియర్ కథనం లేకపోవడం, క్రింజ్ కామెడీ సన్నివేశాలు సినిమాను పూర్తిగా డీలా పడేయించాయి. మంచి నటీనటుల ఫేస్ వాల్యూ వృథా అయింది. ఒక రీమేక్ సినిమాలో కథకు ప్రత్యేకత లేకుంటే ప్రేక్షకులు సులభంగా తిరస్కరిస్తారని మరోసారి రుజువైంది.
3. సైంధవ్
వెంకటేష్ తన 75వ సినిమాగా వచ్చిన 'సైంధవ్' సంక్రాంతి పండగ సందర్భంగా విడుదలైంది. శైలేష్ కొలను దర్శకత్వం వహించిన ఈ సినిమా విషయంలో భారీ అంచనాలు ఉండేవి. కానీ, కుటుంబ ప్రేక్షకులను ఆకట్టుకునే కథనం లేకపోవడంతో పండగ రోజు సినిమా థియేటర్ల నుంచి రానివ్వకుండా వెళ్లిపోయింది. నవాజుద్దీన్ సిద్ధిఖీ వంటి అద్భుతమైన నటుడు సైతం ఈ సినిమాలో ప్రాభవాన్ని చూపించలేకపోయాడు. కథలో లోపాలు, ఆర్య పాత్ర లాంటి అనవసరమైన పాత్రలు సినిమాను మరింతగా దెబ్బతీశాయి. సంక్రాంతి సందర్భంగా విడుదలైన ఈ సినిమా అభిమానులను తీవ్రంగా నిరాశపర్చింది.
4. డబుల్ ఇస్మార్ట్
పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో రామ్ పోతినేని నటించిన 'డబుల్ ఇస్మార్ట్' భారీ అంచనాల మధ్య విడుదలైంది. అటు పూరికి ఇటు రామ్ పొత్తినేనికి వరుస ఫ్లాప్స్ ఉండటంతో సహజంగానే ఈ సినిమాపై పెద్ద ఎత్తున హైప్ ఏర్పడింది. అయితే, ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద తీవ్ర నిరాశపరిచింది. పూరీ స్టైల్ మాస్ యాక్షన్ ఎలిమెంట్స్ సరైన ప్రామాణికతను అందించకపోవడం ఈ చిత్రానికి పెద్ద షాక్‌గా మారింది. వరుస ఫ్లాప్‌లతో రామ్‌కు ఈ సినిమా మరో పెద్ద మైనస్‌గా మారింది.
5. ఆపరేషన్ వాలెంటైన్ & మట్కా
మెగా ప్రిన్సెస్ వరుణ్ తేజ్ ఈ ఏడాది రెండు సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు – 'ఆపరేషన్ వాలెంటైన్' మరియు 'మట్కా'. కానీ ఈ రెండు సినిమాలు ప్రేక్షకుల్ని ఆకట్టుకోలేకపోయాయి. వరుణ్ తేజ్ లాంటి ప్రామాణిక నటుడు కూడా బ్యాక్ టు బ్యాక్ ఫ్లాప్‌లు ఇవ్వడం అతని కెరీర్‌పై తీవ్ర ప్రభావం చూపింది. వినూత్న కథా సామర్థ్యం లేకపోవడం ఈ సినిమాల వైఫల్యానికి ప్రధాన కారణం.
6. ఫ్యామిలీ స్టార్
విజయ్ దేవరకొండ నటించిన 'ఫ్యామిలీ స్టార్' కూడా 2024లో ప్రేక్షకులను నిరాశపరిచిన మరో సినిమా. భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ చిత్రం, తొలి వారం ఓపెనింగ్స్ బాగానే వచ్చినప్పటికీ, ఆ తరువాత బాక్సాఫీస్ వద్ద నిలబడలేకపోయింది. కామెడీ డ్రామా జానర్‌ను ప్రయత్నించినప్పటికీ, కథలో లోపాలు సినిమాను కిందికి దించాయి.
7. మనమే
శర్వానంద్ నటించిన 'మనమే' కూడా ఈ ఏడాది మరో నిరాశపరిచిన మరో సినిమా. వినూత్న కథలతో ప్రేక్షకులను ఆకట్టుకునే శర్వానంద్ ఈసారి సక్సెస్ అందుకోలేకపోయాడు. సినిమా మొత్తం స్లో నేరేషన్, అర్థరహితమైన ఎమోషనల్ సన్నివేశాలు, ముఖ్యమైన పాయింట్లను సరిగా హైలైట్ చేయకపోవడం ఈ చిత్రాన్ని బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్‌గా మిగిల్చింది.
8. తిరగబడరా సామీ, బడ్డీ, శివంభజే
ఇంకా యంగ్ హీరోలు అశ్విన్ బాబు, రాజ్ తరుణ్, అల్లు శిరీష్ వంటి హీరోలు కూడా నిరాశపరిచారు. అశ్విన్ బాబు నటించిన 'శివంభజే', అల్లు శిరీష్ నటించిన 'బడ్డీ', రాజ్ తరుణ్ నటించిన 'తిరగబడరా సామీ' చిత్రాలు నాటకీయ అంచనాలను తలపించి, థియేటర్లలో ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయాయి. ఈ సినిమాలు థియేటర్లలో సందడి చేయకపోవడంతో నిర్మాతలకు నష్టాలు మిగిల్చాయి.
9. అప్పుడో ఇప్పుడో ఎప్పుడో
కార్తికేయ సిరీస్ సినిమాలతో స్టార్ హీరోగా ఎదిగిన నిఖిల్ సిద్ధార్థ్‌కు ఈ ఏడాది చేదు జ్ఞాపకాలను మిగిల్చింది. ఇటీవల విడుదలైన అప్పుడో ఇప్పుడో ఎప్పుడో చిత్రం బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్‌గా నిలిచింది. శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర ప్రొడక్షన్స్ బ్యానర్‌పై బీవీఎస్‌ఎన్ ప్రసాద్ నిర్మించిన ఈ సినిమాకు సుధీర్‌వర్మ దర్శకత్వం వహించారు. నిఖిల్, రుక్మిణి వసంత్, దివ్యాంశ కౌశిక్, హర్ష చెముడు ప్రధాన పాత్రల్లో నటించారు.
10. చిన్న సినిమాలు
2024లో చిన్న సినిమాల జాబితాలో కూడా చాలా నిరాశ ఎదురైంది. మంచి కథా బలం ఉన్నా సరైన ప్రమోషన్ లేకపోవడం, కొత్త దర్శకుల సినిమాలు సరైన కమర్షియల్ ఎలిమెంట్స్ లేకపోవడం వల్ల ప్రేక్షకులు ఈ సినిమాలను పట్టించుకోలేదు. ఈ సినిమాల వల్ల చిన్న నిర్మాతలకు ఆర్థిక నష్టాలు మిగిలాయి.
2024లో టాలీవుడ్ పెద్ద ఆశలు పెట్టుకున్న కొన్ని సినిమాలు మాత్రం ప్రేక్షకులను తీవ్ర నిరాశపరిచాయి. రవితేజ, వెంకటేష్, రామ్, విజయ్ దేవరకొండ, వరుణ్ తేజ్, శర్వానంద్ వంటి అగ్ర హీరోలు బాక్సాఫీస్ విజయాల జాబితాలో స్థానం సంపాదించలేకపోయారు. ఒక వైపు 'పుష్ప 2', 'కల్కి' వంటి బ్లాక్ బస్టర్ చిత్రాలు టాలీవుడ్‌ను ముందుకు నడిపిస్తే, మరో వైపు ఈ డిజాస్టర్లు నిర్మాతలకు భారీ నష్టాలను మిగిల్చాయి. కొత్త సంవత్సరం 2025లో వీరు తిరిగి పుంజుకుంటారా లేదా అనేది ఆసక్తికరమైన అంశం.
డిసెంబర్ 19 , 2024
Pushpa 2: దద్దరిల్లిన కొచ్చి ఎయిర్‌పోర్ట్.. బన్నీకి ఫ్యాన్స్ గ్రాండ్ వెల్‌కమ్!
అల్లు అర్జున్ (Allu Arjun) హీరోగా సుకుమార్ (Director Sukumar) దర్శకత్వంలో రూపొందిన ‘పుష్ప 2’ (Pushpa 2) సినిమా మరో వారం రోజుల్లోనే రిలీజ్ కానుంది. దీంతో మూవీ టీమ్ ప్రమోషన్స్‌ను భారీగా చేస్తోంది. ఇప్పటికే పాట్నా, చెన్నైలో భారీ ఈవెంట్స్ నిర్వహించగా నేడు (నవంబర్ 27) కేరళలో మరో ఈవెంట్‌ను ప్లాన్ చేశారు. ఇందులో పాల్గొనేందుకు చిత్రం బృందం హైదరాబాద్ నుంచి స్పెషల్ ఫ్లైట్‌లో కొచ్చి వెళ్లింది. అక్కడ ఎయిర్‌పోర్టులో ల్యాండ్ అయిన బన్నీకి ఊహించని స్థాయిలో ఫ్యాన్స్ సాగర స్వాగతం పలికారు.
దద్దరిల్లిన విమానశ్రయం..
కొచ్చి ఎయిర్‌పోర్టులో దిగిన బన్నీకి కేరళ అభిమానులు గ్రాండ్ వెల్‌కమ్ చెప్పారు. అల్లు అర్జున్ రాక గురించి ముందే తెలుసుకొని వారంతా పెద్ద ఎత్తున ఎయిర్‌పోర్టుకు తరలి వచ్చారు. ఎయిర్‌పోర్టు నుంచి బయటకు వస్తున్న బన్నీకి సుస్వాగతం పలికారు. తమ అభిమాన హీరోను తమ ఫోన్ కెమెరాల్లో బంధించేందుకు ప్రయత్నించారు. అంతేకాదు బన్నీతో ఫొటోలు దిగేందుకు కూడా ఎగబడ్డారు. అంచనాలకు మించి వచ్చిన ఫ్యాన్స్‌ను కంట్రోల్ చేయడానికి ఎయిర్‌పోర్టు సిబ్బంది, పోలీసులు బాగా కష్టపడాల్సి వచ్చింది. అభిమానుల కేరింతలకు దెబ్బకు ఓ దశలో బన్నీ తన రెండు చెవులు మూసుకోవడం గమనార్హం. రాష్ట్రం కాని రాష్ట్రంలో బన్నీ వస్తోన్న ఈస్థాయి ఆదరణ చూసి అల్లు అర్జున్ ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు. 'రాజు ఎక్కడ ఉన్న రాజే' అని కామెంట్స్ చేస్తున్నారు.
https://twitter.com/GulteOfficial/status/1861740756030886182
https://twitter.com/IamEluruSreenu/status/1861718081313107982
కేరళలో ఎందుకంత క్రేజ్!
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌కు ఏపీ, తెలంగాణ తర్వాత ఆ స్థాయి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న రాష్ట్రం కేరళ. అక్కడి ప్రజలు బన్నీని ముద్దుగా మల్లు అర్జున్ (Mallu Arjun) అని పిలుచుకుంటారు. కెరీర్ తొలినాళ్లలో చేసిన ‘ఆర్య’ కేరళలో సూపర్ డూపర్ హిట్‌గా నిలిచింది. 100 రోజులకు పైగా ఆడింది. ‘ఆర్య’ నుంచి అల్లు అర్జున్‌ను కేరళ ప్రజలు ఓన్ చేసుకోవడం మెుదలపెట్టారు. అల్లు అర్జున్ హీరోగా చేసిన ప్రతీ సినిమా కేరళలో కచ్చితంగా రిలీజ్ అవుతూ వచ్చింది. తెలుగులో ఏ విధమైన రెస్పాన్స్ వచ్చేదో కేరళలోనూ అంతే స్థాయిలో ప్రేక్షకులు బన్నీ చిత్రాన్ని ఆదరించారు. బన్నీ గత చిత్రం ‘పుష్ప’ సైతం కేరళలో బ్లాక్ బాస్టర్ విజయం సాధించింది. ఈ నేపథ్యంలో ‘పుష్ప 2’ (Pushpa 2) కేరళ ఆడియన్స్‌లో మంచి అంచనాలు ఏర్పడ్డాయి. ఈ నేపథ్యంలో కొచ్చిలో ప్రమోషన్ ఈవెంట్‌ను మేకర్స్ ప్లాన్ చేశారు.
https://twitter.com/baraju_SuperHit/status/1861742091337953731
https://twitter.com/alluarjun/status/1861737357105672266
రన్ టైమ్ లాక్
'పుష్ప 2' చిత్రానికి సంబంధించి రన్‌టైన్ లాక్ అయినట్లు తెలుస్తోంది. సాధారణంగా సుకుమార్ సినిమా అంటే మూడు గంటలు కచ్చితంగా ఉంటుందని అభిమానులు ఓ అంచనాకు వచ్చేస్తుంటారు. ఆయన గత చిత్రాలు ‘రంగస్థలం’, ‘పుష్ప’ దాదాపు మూడు గంటల నిడివితో వచ్చి బ్లాక్ బాస్టర్లుగా నిలిచాయి. అయితే ఇప్పుడు 'పుష్ప 2' మూడు గంటలకు పైగా నిడివితో రాబోతున్నట్లు స్ట్రాంగ్ బజ్ వినిపిస్తోంది. ఈ సినిమాకు 3 గంటల 22 నిమిషాల నిడివిని డైరెక్టర్ సుకుమార్ ఫిక్స్ చేశారట. యూఎస్‌లో 3 గంటల 15 నిమిషాల నిడివితో ‘పుష్ప 2’ రిలీజ్ కాబోతున్నట్లు తెలుస్తోంది. సెన్సార్ బోర్డు పర్యవేక్షణ అనంతరం అఫిషియల్‌గా నిడివిని అనౌన్స్ చేయనున్నారు.
నవంబర్ 27 , 2024
Kissik Song: ‘ఊ అంటావా’ సాంగ్‌ను బీట్ చేయనున్న ‘పుష్ప 2’లోని ‘కిస్సిక్’ సాంగ్?
అల్లు అర్జున్ (Allu Arjun) హీరోగా సుకుమార్ (Sukumar) దర్శకత్వంలో రూపొందిన ‘పుష్ప 2’ (Pushpa 2)పై దేశవ్యాప్తంగా బజ్ ఉంది. డిసెంబర్ 5న వరల్డ్ వైడ్‌గా ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఇందులో స్టార్ హీరోయిన్ శ్రీలీల (Sreeleela) కిస్సిక్ అనే (Kissik Song) ఐటెం సాంగ్ చేసిన సంగతి తెలిసిందే. ఈ విషయాన్ని మేకర్స్ స్పెషల్ పోస్టర్ వేసి మరి తెలియజేశారు. అంతకుముందు సెట్‌లో శ్రీలీల, బన్నీ డ్యాన్స్‌కు సంబంధించి ఓ ఫోటో సైతం లీకయ్యింది. దీంతో ఈ సాంగ్ ఏ రేంజ్‌లో ఉంటుందోనని అభిమానుల్లో భారీ అంచనాలే ఏర్పడ్డాయి. ఇదిలా ఉంటే ‘పుష్ప 2’ రిలీజ్‌కు రెండు వారాల సమయమే ఉండటంతో మూవీ టీమ్ వరుసగా అప్‌డేట్స్ ఇస్తోంది. ఈ క్రమంలోనే శ్రీలీల చేసిన ఐటెం సాంగ్‌కు సంబంధించి అదిరిపోయే అప్‌డేట్ ఇచ్చింది.
ఆ రోజు మోతమోగాల్సిందే!
అల్లు అర్జున్ హీరోగా నటించిన ‘పుష్ప 2’ యావత్ సినీ లోకం ఎంతో ఆశగా ఎదురుచూస్తోంది. ఈ క్రమంలోనే పుష్ప 2 టీమ్ క్రేజీ అప్‌డేట్‌ను ప్రేక్షకులకు ఇచ్చింది. ప్రేక్షకుల్లో ఎంతో హైప్ క్రియేట్ చేసిన ‘కిస్సిక్’ సాంగ్ (Kissick Song)ను నవంబర్ 24న రిలీజ్ చేయనున్నట్లు మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. ఆ రోజు సా.7.02 పాట విడుదల కానున్నట్లు స్పెషల్ పోస్టర్ ద్వారా తెలియజేశారు. ఇక పోస్టర్‌లో బన్నీ, శ్రీలీల లుక్ అదిరిపోయింది. సాంగ్‌లోని ఓ స్టెప్‌ను రిఫరెన్స్‌గా తీసుకొని ఈ పోస్టర్‌ను క్రియేట్ చేశారు. తాజా అప్‌డేట్ చూసి అల్లు అర్జున్ ఫ్యాన్స్‌తో పాటు మ్యూజిక్ లవర్స్ తెగ ఖుషీ అవుతున్నారు. ఈ సాంగ్ పక్కాగా ఆకట్టుకుంటుందని అంచనా వేస్తున్నారు.
https://twitter.com/PushpaMovie/status/1859572237457817685
ఎందుకంత హైప్?
డైరెక్టర్ సుకుమార్ తన ప్రతీ చిత్రంలోనూ ఓ ఐటెం సాంగ్ (Kissik Song) తప్పనిసరిగా ఉంచుతారు. ఫస్ట్ ఫిల్మ్ ‘ఆర్య’ నుంచి ఈ ఆనవాయితీ కొనసాగుతూ వస్తోంది. సుకుమార్ ఇప్పటివరకూ 8 చిత్రాలు చేయగా అన్నింట్లోను దుమ్మురేపే ఐటెం సాంగ్స్ ఉన్నాయి. అయితే ‘కిస్సిక్’ పాటకు వస్తున్నంత హైప్ గతంలో ఏ పాటకు రాలేదు. సుకుమార్ గత చిత్రం ‘పుష్ప’లోని ‘ఊ అంటావా ఊఊ అంటావా’కు సైతం రిలీజ్‌కు ముందు ఇంత బజ్ క్రియేట్ కాలేదు. అయితే ‘కిస్సిక్’కు మాత్రమే ఈ స్థాయి హైప్ ఏర్పడటానికి కొన్ని కారణాలు ఉన్నాయి. ‘పుష్ప’కి మించి ‘పుష్ప 2’ ఉంటుందని చిత్ర బృందం ముందు నుంచి చెబుతూ వస్తోంది. దీంతో ఇండియాను షేక్ చేసిన ‘ఊ ఊ అంటావా.. ఊ ఊ అంటావా’ కంటే ‘కిస్సిక్’ ఇంకా అదిరిపోతుందని ఆడియన్స్ ఓ అభిప్రాయానికి వచ్చేశారు. దానికి తోడు డ్యాన్సింగ్ క్వీన్ శ్రీలీల సాంగ్‌లో చేస్తుండటం, సమంత కంటే బెటర్ డ్యాన్సర్ కావడం, బన్నీ కూడా స్టెప్పులు ఇరగదీస్తాడని పేరుండటంతో ఈ సాంగ్‌పై అంచనాలు అమాంతం పెరిగిపోయాయి.
శ్రీలీల దెబ్బకు ఫ్లోర్లు అదరాల్సిందే!
‘పుష్ప 2’ ఐటెం సాంగ్ ఎలా ఉన్నా శ్రీలీల డ్యాన్స్ మాత్రం అదిరిపోతుందని చెప్పవచ్చు. ప్రస్తుత తరం కథానాయికల్లో డ్యాన్స్‌లో శ్రీలీలను కొట్టేవారే లేరనడంతో అతిశయోక్తి లేదు. ఈ భామ తన నటన కంటే డ్యాన్స్ పరంగానే ఎక్కువ మంది అభిమానులను సంపాదించుకుంది. రవితేజ 'ధమాకా' చిత్రంలో పల్సర్ బైక్ సాంగ్‌లో ఈ అమ్మడు ఏవిధంగా అదరగొట్టిందో అందరికీ తెలిసిందే. రీసెంట్‌గా మహేష్ బాబుతో 'కుర్చీని మడతపెట్టి' సాంగ్‌లో ఏకంగా తన స్టెప్పులతో విధ్వంసం సృష్టించింది. శ్రీలీలతో డ్యాన్స్ అంటే హేమా హేమీ డ్యాన్సర్లు సైతం కాస్త వెనక్కి తగ్గుతుంటారు. అటువంటి శ్రీలీలతో డ్యాన్స్‌కు కేరాఫ్‌గా నిలిచే బన్నీ జతకలిస్తే ఇక ఐటెం సాంగ్ ఏ స్థాయిలో ఉంటుందో అభిమానుల ఊహకే వదిలేయవచ్చు.
https://twitter.com/CeleBeautyHQ/status/1858330541592088786
ఏరికోరి సెలెక్ట్ చేసిన బన్నీ!
‘పుష్ప 2’ కిస్సిక్ సాంగ్ (Kissik Song)కు శ్రీలీలను ఎంచుకోవాలన్నది డైరెక్టర్ సుకుమార్ ఆలోచన కాదట. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ స్వయంగా శ్రీలీలను సజెస్ట్ చేసినట్లు తెలుస్తోంది. బన్నీ ఇంతకుముందే శ్రీలీలతో కలిసి ప్రముఖ ఓటీటీ ‘ఆహా’ కోసం ఒక యాడ్ చేశాడు. వీరిద్దరి కెమెస్ట్రీ బాగుందంటూ అప్పట్లోనే సోషల్ మీడియాలో కామెంట్స్ వచ్చాయి. మరోవైపు ఈ జనరేషన్ హీరోయిన్లలో శ్రీలీల బెస్ట్ డ్యాన్సర్ కీర్తింప బడుతోంది. ఈ నేపథ్యంలో బన్నీ-శ్రీలీల ఒకే వేదికపై ఆడి పాడితే ఆడియన్స్‌లో పూనకాలు రావడం పక్కా. ఇవన్నీ ఆలోచించే శ్రీలీలపై బన్నీ మెుగ్గు చూపినట్లు సమాచారం. అంతకుముందు బాలీవుడ్ స్టార్ హీరోయిన్స్ శ్రద్ధా కపూర్, దిశా పటానీ, త్రిప్తి దిమ్రి పేర్లు ఈ ఐటెం సాంగ్ పరిశీలనలోకి వచ్చినట్లు వార్తలు వచ్చాయి.
శ్రీలీల పారితోషికం ఎంతంటే?
అల్లుఅర్జున్ - సుకుమార్ కాంబోలో రూపొందుతున్న ‘పుష్ప 2’ చిత్రం డిసెంబర్ 5న వరల్డ్ వైడ్‌గా రిలీజ్ కాబోతోంది. ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ దాదాపు రూ.500 కోట్ల బడ్జెట్‌తో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఖర్చు విషయంలో ఏమాత్రం వెనకాడకుండా సుకుమార్‌గా తమవంతు తోడ్పాటు అందిస్తున్నారు. ఈ క్రమంలో కిస్సిక్ ఐటెం సాంగ్ (Pushpa 2 Item Song)లో చేసిన హీరోయిన్ శ్రీలీలకు భారీ మెుత్తంలో పారితోషికం ముట్టచెప్పినట్లు నెట్టింట టాక్ వినిపిస్తోంది. ‘కిస్సిక్కి’ అంటూ సాగే ఈ పాట కోసం ఆమె ఏకంగా రూ.2 కోట్ల రెమ్యూనరేషన్ తీసుకుందని ఫిల్మ్ వర్గాల్లో చర్చ జరుగుతోంది. సెట్, హీరోయిన్ పారితోషికం ఇతర మొత్తం కలిపి రూ.5 కోట్లు ఖర్చు అయినట్లు అంచనా వేస్తున్నాయి.
నవంబర్ 21 , 2024
Shraddha Arya: పండంటి కవలలకు జన్మనిచ్చిన తెలుగు హీరోయిన్.. ఆమెను గుర్తుపట్టారా?
తెలుగు సినిమాల్లో హీరోయిన్‌గా చేసిన శ్రద్ధా ఆర్య (Shraddha Arya) పండంటి కవలలకు జన్మనిచ్చింది. ఈ విషయాన్ని ఇన్‌స్టాగ్రామ్‌లో వీడియో పోస్టు చేసి మరి తెలియజేసింది.
https://twitter.com/indiaforums/status/1863856572520362279
నవంబర్ 29న ఒక అమ్మాయి, అబ్బాయికి జన్మనిచ్చినట్లు శ్రద్ధా స్పష్టత ఇచ్చింది. దీంతో అభిమానులు, నెటిజన్లు ఆమెకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.
2021లో నేవీ అధికారి రాహుల్ నగల్‌ను శ్రద్ధా పెళ్లి చేసుకుంది. ఈ ఏడాది అక్టోబర్‌లో తాను కడుపుతో ఉన్నట్లు సోషల్ మీడియా వేదికగా తెలియజేసింది.
శ్రద్ధా ఆర్య (Shraddha Arya) విషయాలకు వస్తే ఆమె 1987 ఆగస్టు 17న దేశ రాజధాని ఢిల్లీలో జన్మించింది. ముంబయి యూనివర్శిటీలో ఎకనామిక్స్‌లో మాస్టర్స్ చేసింది.
సినిమాల్లోకి రాకముందు బుల్లితెరపై శ్రద్ధా ఆర్య మెరిసింది. జీ టీవీ (హిందీ)లో వచ్చిన 'ఇండియాస్ బెస్ట్ సినీ స్టార్స్ కి కోజ్' షోలో పాల్గొని రన్నరప్‌గా నిలిచింది.
ప్రముఖ నటుడు ఎస్.జే.సూర్య హీరోగా చేసిన తమిళ చిత్రం 'కల్వనిన్ కాదలి' (2006) సినిమాతో హీరోయిన్‌గా తెరంగేట్రం చేసింది.
ఆ తర్వాత రామ్ గోపాల్ వర్మ తెరకెక్కించిన 'నిశబ్ద్' (2007) సినిమాలో నటించింది. అందులో రీతు ఆనంద్ పాత్రలో కనిపించి ఆకట్టుకుంది.
అదే ఏడాది 'గొడవ' (Godava) అనే చిత్రంతో తెలుగు ప్రేక్షకులకు శ్రద్ధా పరిచయమైంది. ఇందులో వైభవ్‌కు జోడీగా అంజలి పాత్రలో మెరిసింది.
ఆ తర్వాత తెలుగులో ‘కోతి మూక’ (Kothi Muka), ‘రోమియో’ (Romeo) వంటి చిత్రాల్లో శ్రద్ధా నటించింది. అయితే అవేమి పెద్దగా సక్సెస్ కాకపోవడంతో టాలీవుడ్‌లో అవకాశాలు రాలేదు.
దీంతో మళ్లీ బాలీవుడ్‌కు వెళ్లి పోయిన శ్రద్ధా.. అక్కడ షాహిద్ కపూర్‌తో కలిసి 'పాఠశాల' (2010) సినిమా చేసింది. అందులో నటాషా సింగ్ పాత్రలో తళుక్కుమంది.
ఆ తర్వాత కన్నడలో అడుగుపెట్టిన ఆమె అక్కడ 'డబుల్ డెక్కర్', 'మదువే మానే' చిత్రాలు చేసింది. పంజాబిలో 'బంజారా' (2018) ఫిల్మ్‌లోనూ నటించింది.
ఓ వైపు సినిమాలు చేస్తూనే సీరియల్స్‌లోనూ శ్రద్ధా ఆర్య నటించింది. 'ష్‌ష్‌ష్.. పిర్ కోయి హై' (2008) అనే హిందీ సీరియల్‌తో బుల్లితెర ప్రేక్షకులకు పరిచయమైంది.
'మెయిన్ లక్ష్మీ తేరే ఆంగన్ కీ', ‘డ్రీమ్ గర్ల్’, ‘కసమ్ తేరే ప్యార్ కి’, ‘కుండలి భాగ్య’ వంటి సీరియల్స్‌లో నటించి మరింత పాపులర్ అయ్యింది.
సినిమాలు, సీరియల్స్‌తో పాటు పలు మ్యూజిక్ ఆల్బమ్స్ సైతం శ్రద్ధా ఆర్య చేసింది. జీనా, సోనియో హిరియే, మెరీ జాన్, పీకే, కార్ గబ్రూ ది తదితర 10 మ్యూజిక్ వీడియోలు చేసింది.
శ్రద్ధా ఆర్య వ్యక్తిగత విషయాలకు వస్తే పెళ్లికి ముందు ఆమె ఇద్దరితో ప్రేమాయణం నడిపింది. 2015లో తొలుత ఎన్నారై జయంత్ రట్టితో నిశ్చితార్థం చేసుకుంది. అనివార్య కారణాలతో దాన్ని రద్దు చేసుకుంది.
ఆ తర్వాత 2019లో అలం సింగ్ మక్కర్‌తో రిలేషన్ షిప్‌లో అడుగుపెట్టింది. వారిద్దరు ‘నాచ్ బలియే’ (Nach Baliye) అనే డ్యాన్స్ షోలో కపుల్స్‌గా పోటీ చేశారు. షో పూర్తయ్యే సరికి వారి బంధం కూడా ముగిసింది.
ప్రస్తుతం సినిమాలు, సీరియల్స్, టెలివిజన్ షోలకు దూరంగా ఉంటూ ఫ్యామిలీ లైఫ్‌ను శ్రద్ధా ఎంజాయ్ చేస్తోంది. ఇన్‌స్టాగ్రామ్‌లో తరుచూ ఫొటోలు పెడుతూ ఫ్యాన్స్‌కు టచ్‌లో ఉంటోంది.
డిసెంబర్ 03 , 2024
18 Years Of Bhadra: మొదట హీరో రవితేజ కాదు.. సినిమా విడుదలకు ముందు ఇన్ని జరిగాయా?
మాస్ మహారాజ రవితేజను స్టార్‌గా నిలబెట్టిన సినిమాల్లో భద్ర ముందు వరుసలో ఉంటుంది. 2005లో వచ్చిన భద్ర సినిమా ద్వారానే బోయపాటి శ్రీను డైరెక్టర్‌గా పరిచయం అయ్యాడు. 18 ఏళ్ల క్రితం సరిగ్గా ఇదే రోజున (మే 12, 2005) రిలీజైన ఈ చిత్రం ప్రభంజనమే సృష్టించింది. అప్పటికే మాస్ హీరోగా పేరు తెచ్చుకున్న రవితేజను భద్ర సినిమా ఫ్యామిలీ ఆడియన్స్‌కు చేరువ చేసింది. అలాగే దిల్‌రాజును ఇండస్ట్రీలో బలమైన నిర్మాతగా నిలదొక్కుకొనేలా చేసింది. ఈ సినిమాకు దేవిశ్రీ అందించిన పాటలు అప్పట్లో ఉర్రూతలూగించాయి. ఇప్పటికీ చాలా మంది ఫేవరేట్ ఆల్బమ్స్‌లో భద్ర సాంగ్స్ ఉన్నాయి. భద్ర సినిమా రిలీజై 18ఏళ్లు పూర్తైన సందర్భంగా ఈ సినిమాకు సంబంధించిన విశేషాలను ఒకసారి గుర్తుచేసుకుందాం.
తారాగణం
భద్ర సినిమాలో రవితేజ- మీరా జాస్మిన్ జంటగా చేశారు. సినిమాలో వీరి మధ్య కెమిస్ట్రీ చాలా బాగా పండింది. మీరా జాస్మిన్ బ్రదర్‌గా, రవితేజ ఫ్రెండ్‌గా నటుడు అర్జన్ బజ్వా నటించాడు. అలాగే ప్రకాష్ రాజ్, మురళి మోహన్, ప్రదీప్ రావత్, బ్రహ్మాజీ, సునీల్ అద్భుతంగా చేశారు. ఈ సినిమాకు ఆర్తూర్ A. విల్సన్ సినిమాటోగ్రఫీ అందించగా మాటలు కొరటాల శివ అందించారు. సిరివెన్నెల సీతారామ శాస్త్రి పాటలు రాశారు.
https://www.youtube.com/watch?v=WrW9j6DjvZs
గ్రాండ్ ఎంట్రీ
దర్శకుడిగా బోయపాటి శ్రీను సత్తా ఏంటో భద్ర సినిమా చూపించింది. మాస్, ఫ్యామిలీ ఆడియన్స్‌కు బోయపాటిని దగ్గర చేసింది. భద్ర తర్వాత బోయపాటి శ్రీను స్టార్ డైరెక్టర్‌గా మారిపోయాడు. అతని డైరెక్షన్ స్కిల్స్ చూసిన టాలీవుడ్ ప్రొడ్యూసర్లు బోయపాటితో సినిమా చేసేందుకు ఆసక్తి కనబరిచారు.
https://www.youtube.com/watch?v=rFfZZyobCdQ
కాసుల వర్షం
దిల్, ఆర్య సినిమా హిట్లతో ఊపు మీదున్న నిర్మాత దిల్ రాజుకు భద్ర సినిమా హ్యాట్రిక్ విజయాన్ని అందించింది. ఈ సినిమా ఇచ్చిన విజయంతో దిల్ రాజు ఇక వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన పని లేకుండా పోయింది. బడ్జెట్ కంటే రెట్టింపు వసూళ్లను భద్ర రాబట్టిందని అప్పట్లో వార్తలు వచ్చాయి.
నో రెమ్యూనరేషన్!
భద్ర సినిమా కోసం బోయపాటి శ్రీనుకు దిల్‌రాజు రూ. 6 లక్షలతో పాటు ఓ కారు కూడా ఆఫర్ చేశారట. అయితే తన ఫస్ట్ సినిమాకు బడ్జెట్ సమస్య రాకుండా తన రెమ్యూనరేషన్ కూడా చిత్ర నిర్మాణానికి వినియోగించాలని బోయపాటి సూచించారట.
https://www.youtube.com/watch?v=1U9yWjrXQpA
ఛాన్స్ మిస్ చేసుకున్న బన్నీ
భద్ర సినిమాకు రవితేజకు బదులు మెుదట అల్లు అర్జున్‌ను అనుకున్నట్లు అప్పట్లో ప్రచారం జరిగింది. అయితే అనివార్య కారణాల వల్ల బన్నీ చేయలేకపోయారట. రవితేజను సంప్రదించగానే ఆయన ఓకే చెప్పేశారట.
https://www.youtube.com/watch?v=5CExeYfyEG0
స్టోరీనే బలం
భద్ర సక్సెస్‌లో ఆ సినిమా స్టోరీదే కీ రోల్. అప్పటివరకూ చూసిన సినిమా కథలతో పోలిస్తే భద్ర స్టోరీలైన్ ప్రేక్షకులకు కొత్తగా అనిపించింది. లవ్, ఫ్యామిలీ, యాక్షన్, సెంటిమెంట్ ఇలా కోణాలను స్పృశిస్తూ సినిమా సాగింది.
మే 12 , 2023
Dev Mohan: సమంతను ఇంప్రెస్ చేసిన శాకుంతలం హీరో దేవ్ మోహన్‌కు ఇంత టాలెంటా?
శాకుంతలం చిత్రంలో సమంత సరసన నటించిన దేవ్ మోహన్ ప్రస్తుతం అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాడు. సినిమా ప్రమోషన్స్‌లో చురుగ్గా వ్యవహరిస్తూ ఆకట్టుకుంటున్నాడు. దీంతో అసలు ఈ నటుడు ఎవరు? మన తెలుగు వ్యక్తియేనా? ఇప్పటివరకు ఎన్ని సినిమాల్లో నటించాడు? అన్న ప్రశ్నలు సగటు సినీ ప్రేక్షకుడిలో నెలకొంది. ఈ నేపథ్యంలో దేవ్ మోహన్‌కు సంబంధించిన పూర్తి వివరాలు మీకోసం..
కేరళలోని త్రిస్సూరు చెందిన దేవ్ మోహన్ 18 సెప్టెంబర్ 1992లో జన్మించాడు. విద్యాభ్యాసమంతా త్రిస్సూర్‌లోనే చేసిన దేవ్.. ఆ తర్వాత బెంగళూరుకు చెందిన ఓ కంపెనీలో టీమ్ లీడర్‌గా పనిచేశాడు. ఉద్యోగం చేస్తూనే దేవ్ మోడల్‌గా తన అదృష్టాన్ని పరీక్షించుకున్నాడు. ఈ క్రమంలోనే 2016లో మిస్టర్ ఇండియా పోటీల్లో పాల్గొని ఫైనలిస్టుగా నిలిచాడు. 2020లో రజీనా అనే అమ్మాయిని దేవ్ పెళ్లి చేసుకున్నాడు.
2020 లో మళయాళం మూవీ 'సూఫీయుం సుజాతయుమ్' చిత్రం ద్వారా తొలిసారి దేవ్ మోహన్ సినీ రంగ ప్రవేశం చేశాడు. ఇందులో ‘సూఫీ రోల్‌లో కనిపించి దేవ్ మెప్పించాడు. ఆ తర్వాత 2021లో పులి, పంత్రండు చిత్రాల్లో నటించి అందరిని ఆకట్టుకున్నాడు. ఈ క్రమంలో డైరెక్టర్ గుణశేఖర్ కంట్లో పడ్డ దేవ్ మోహన్ శాకుంతలం చిత్రంలో కీలక పాత్రను దక్కించుకున్నాడు. ఇటీవల ఓ యూట్యూబ్ ఛానెల్‌కు ఇంటర్యూ ఇచ్చిన దేవ్ పలు ప్రశ్నలకు సమాధానం ఇచ్చారు.
ప్రశ్న: శాకుంతలం ఆఫర్ ఎలా వచ్చింది?
దేవ్: నిర్మాత నీలిమ నా ఫస్ట్ ఫిల్మ్ 'సూఫీయుం సుజాతయుమ్' చూశారు. నా నటను ఆమెకు నచ్చింది. శాకుంతలంలో దుశ్యాంత పాత్రకు నేను సరిపోతానని ఆమె ఫీలయ్యారు. దీంతో ఆమె నన్ను సంప్రదించారు. మెుదట ఏదో ప్రాంక్ చేస్తున్నారని భావించా. నీలిమ, డైరెక్టర్ గుణశేఖర్‌తో మాట్లాడిన తర్వాత నిజమని నిర్ధారించుకున్నా. ఇందులో చేయడం ద్వారా నా కల నేరవేరినట్లు భావిస్తున్నా.
ప్రశ్న: తెలుగు ఇండస్ట్రీ, గుణశేఖర్ గురించి మీకు అవగాహన ఉందా?
దేవ్: తెలుగు సినీ పరిశ్రమపై నాకు అవగాహన ఉంది. అల్లు అర్జున్ సినిమాలు మా దగ్గర (కేరళ) చాలా ఫేమస్. ఆర్య, హ్యాపీ సినిమాలు చూశాను. రీసెంట్‌గా వాల్తేరు వీరయ్య, వీరసింహా రెడ్డి చూశాను. గుణశేఖర్ గారి ఒక్కడు, రుద్రమదేవి చిత్రాలు చూశాను. ఆయనో చాలా గొప్ప దర్శకులు.
ప్రశ్న. శాకుంతలం కోసం మీరు తీసుకున్న ట్రైనింగ్ ?
దేవ్: ఈ మూవీ కోసం గుర్రపు స్వారీ నేర్చుకున్నా. రోజుకు రెండు గంటలు గుర్రపు స్వారీ చేసే వాడ్ని. తొలి రోజుల్లో చాలా కష్టంగా అనిపించింది. భుజం, వెన్ను నొప్పి వచ్చేది. క్రమంగా ఎంజాయ్ చేయడం ప్రారంభించా. గుర్రానికి బాగా కనెక్ట్ అయ్యి ట్రైనింగ్‌ను ఆస్వాదించాను.
ప్రశ్న. తెలుగులో డైలాగ్స్ చెప్పడానికి మీరు తీసుకున్న జాగ్రత్తలు?
దేవ్: డైలాగ్స్‌ను డైరెక్టర్ నాకు వాయిస్ నోట్ పంపేవారు. నేను దాన్ని విని మలయాళంలో రాసుకునే వాడ్ని. షూటింగ్‌కు ముందు రోజు డైరెక్టర్‌ను కలిసి డైలాగ్ చెప్పేవాడ్ని. ఏమైనా తప్పు ఉంటే సరిచేసుకొని షూటింగ్‌లో డైలాగ్స్ చెప్పాను.
పూర్తి ఇంటర్యూ కోసం ఇక్కడ చూడండి..
https://youtu.be/TrcHf9vOscM
అవార్డులు దాసోహం...
అరంగేట్రం సినిమాలతోనే దేవ్ మోహన్ తన సత్తా ఎంటో నిరూపించుకున్నాడు. 'సూఫీయుం సుజాతయుమ్’ మూవీకి ‘ సౌత్ ఇండియన్ ఇంటర్నేషనల్ మూవీ అవార్డ్స్’లో ఉత్తమ నూతన నటుడు అవార్డు దక్కించుకున్నాడు. సమయం మూవీ అవార్డులోనూ ఉత్తమ అరంగేట్ర యాక్టర్‌గా దేవ్ మోహన్ ఎంపికయ్యాడు. అటు 67వ ఫిల్మ్‌ఫేర్ అవార్డ్స్ సౌత్‌లో బెస్ట్ డెబ్యూట్ మేల్ పురస్కారాన్ని దేవ్ అందుకున్నాడు.
దేవ్ మోహన్, రష్మిక మందన్నా జంటగా కొత్తగా రెయిన్‌బో చిత్రం తెరకెక్కబోతోంది. అక్కినేని అమల ఈ చిత్రం షూటింగ్‌ను క్లాప్ కొట్టి ప్రారంభించారు. ఏప్రిల్ 7 నుంచి రెయిన్‌బో రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానుంది. రొమాంటిక్ ఫాంటసీగా రూపొందనున్న ఈ సినిమాకు శాంతరూబన్ నూతన దర్శకుడిగా పరిచయం అవుతున్నారు.
ఏప్రిల్ 03 , 2023
Top Whistle-Worthy Intro Scenes in Telugu Movies : తెలుగులో ఇప్పటి వరకు వచ్చిన టాప్ 15 హీరో ఎంట్రీ సీన్స్ ఇవే!
సినిమాల్లో హీరో ఎంట్రీ సీన్లతోనే… ప్రేక్షకులు ఆ చిత్రంపై ఓ అంచనాకు వస్తారు. ముఖ్యంగా స్టార్ హీరోలకైతే కచ్చితంగా ఎలివేషన్‌తో కూడిన ఇంట్రో సీన్ పడాల్సిందే. లేకపోతే ఫ్యాన్స్ నానా రచ్చ చేస్తుంటారు. తెలుగులో హీరో ఎంట్రీ సీన్ ప్రత్యేకంగా లేని సినిమాను ఊహించడం చాలా కష్టమనే చెప్పాలి. ఫ్యాన్స్ ఛాయిస్, హీరో ఇమేజ్‌కు తగ్గట్టుగా డైరెక్టర్లు ముందుగానే ఈ ఇంట్రో సీన్ల కోసం చాలా కసరత్తు చేస్తుంటారు. సినిమా డిస్సాపాయింట్ చేసినా ఫ్యాన్స్ కాస్త ఒప్పుకుంటారు కానీ... ఇంట్రో సీన్ మాత్రం బాక్స్ బద్దలవాల్సిందే అని కోరుకుంటారు. మరి తెలుగు సినిమాల్లో ఇప్పటి వరకు వచ్చిన బెస్ట్ ఇంట్రో సీన్లను ఓసారి చూద్దామా.
అతడు- మహేష్ బాబు
"ఎవరని ఎదురే నిలిస్తే తెలిసే బదులతడే
పెను తుఫాను తలొంచి చూసే
తొలి నిప్పు కణం అతడే
పెను తుఫాను తలొంచి చూసే
తొలి నిప్పు కణం అతడే... అతడే..
అంటూ ఈ సాంగ్ లిరిక్స్ సాగుతూ మహేష్ బాబు ఇచ్చే పవర్‌ఫుల్ ఎంట్రీ ఇప్పటికీ ఎవర్ గ్రీన్ అని చెప్పాలి. అతడు సినిమాలో మహేష్ బాబు ఎంట్రీ సీన్‌కు పడిన BGM సూపర్బ్‌గా ఉంటుంది. మణిశర్మ అందించిన స్కోర్ బెస్ట్ ఇంట్రో BGMలలో ఒకటిగా చెప్పవచ్చు.
https://youtu.be/HpqfxXRhlgU?si=gVE6a5dcBzFqR1lQ
పవన్ కళ్యాణ్- అత్తారింటికి దారేది
"బుల్లెట్ ఆరు అంగుళాలే ఉంటుంది కానీ మనిషిని చంపుతుంది. అదే బుల్లెట్ ఆరు అడుగులు ఉంటే ఎలా ఉంటాడో అలా ఉంటాడు నా మనవడు గౌతం నందా" అని పవన్ కళ్యాణ్ గురించి ఆయన తాతా ఇచ్చే ఎలివేషన్ పవర్ స్టార్ ఫ్యాన్స్‌కు గూస్‌బంప్స్ తెప్పిస్తాయి. ఆ తర్వాత వచ్చే BGMకు ఫ్యాన్స్ అరుపులు కేకలతో థియేటర్లు దద్దరిళ్లిపోయాయి.
https://youtu.be/uoBS4Pl6-e8?si=CGm7Tdo6myR7330K
ప్రభాస్- బాహుబలి 2
బాహుబలి2 ఇంట్రడక్షన్ సీన్ నెవర్ బిఫోర్ అని చెప్పవచ్చు. రాజ్యం సుభిక్షంగా ఉండేందుకు రాజ మాత శివగామి దేవి అఖండ జ్యోతిని తలపై పెట్టుకుని వెళ్తున్న క్రమంలో మదగజం నుంచి ఆమెను ప్రభాస్ కాపాడే సీన్ నిజంగా గూస్ బంప్స్ తెప్పిస్తుంది. తెలుగులో వచ్చిన బెస్ట్ హీరో ఇంట్రడక్షన్ సీన్లలో ఇదొకటిగా చెప్పవచ్చు. ఈ సీన్‌లో బాహుబలి బలం, ధైర్యాన్ని దర్శకుడు ఈ సీన్‌లో చెప్పకనే చెప్పాడు.
https://youtu.be/jkgaUY3VJHY?si=IKuFfqQIiA6VeL92
దసరాలో నాని
దసరా సినిమాలో నాని హీరోయిజాన్ని ఎలివేట్ చేస్తూ వచ్చిన ప్రతి సీన్ అద్భుతంగా ఉంటుంది. ముఖ్యంగా రన్నింగ్ ట్రైన్‌లో బొగ్గు దొంగతనం చేసే సీన్ ఫ్యాన్స్ చేత కేకలు పుట్టించిందని చెప్పవచ్చు.
https://youtu.be/WcOf-pvKGn0?si=xZn3a4j-BvVMyrNF
బాలకృష్ణ- లెజెండ్
నందమూరి నటసింహం బాలకృష్ణ హీరోయిజాన్ని ఎలివేట్ చేస్తూ వచ్చినన్ని ఇంట్రడక్షన్ సీన్లు మరేతర హీరోకు రాలేదని చెప్పాలి. ముఖ్యంగా లెజెండ్ సినిమాలో విలన్లను చేజ్ చేసి ఫైట్ సిక్వెన్స్, తన మార్క్ డైలాగ్స్, ఇంట్రోకు తగ్గట్టుగా ఆయన చెప్పే పవర్ ఫుల్ డైలాగ్స్ నిజంగా ఫ్యాన్స్‌కు కన్నుల పండుగ.
https://youtu.be/Ech6LOW6UQA?si=-ueNWM61P2nAq4j-
రామ్ చరణ్- చిరుత
తన తొలి సినిమా చిరుతలో పవర్‌ఫుల్ ఇంట్రో పొందాడు హీరో రామ్ చరణ్. జైళ్లో తొటి ఖైదీలు అవమానించినప్పుడు వారిపై చరణ్ తన మొహం కనిపించకుండా రివేంజ్ తీర్చుకునే సీన్.. మెగా ఫ్యాన్స్ చేత పూనకాలు పెట్టించింది.
https://youtu.be/4OgJoMj7kLo?si=u3wI9Bsm_Sd7YDby
జూ.ఎన్టీఆర్- RRR
కొమురం భీం క్యారెక్టర్ గురించి బ్రిటిష్ వారికి రాజీవ్ కనకాలా చెప్పే సీన్ నిజంగా జూ. ఎన్టీఆర్ సినిమాల్లో బెస్ట్ ఇంట్రోగా చెప్పవచ్చు. ఆ సీన్‌లో తారక్ పులితో పొరాడే సన్నివేశం అద్భుతంగా ఉంటుంది.
https://youtu.be/BN1MwXUR3PM?si=Cl7Fpcj0qc2nigQu
పవన్ కళ్యాణ్- పంజా
పంజా సినిమాలో పవన్ కళ్యాణ్ ఇంట్రడక్షన్ సీన్ సైతం ఫ్యాన్స్‌కు గూస్ బంప్స్ తెప్పిస్తాయి. బందీగా ఉన్న తనికెళ్ల భరణిని కాపాడేందుకు వెళ్లిన పవన్‌ను చంపేందుకు విలన్లు అతని కారుపై కాల్పులు జరుపుతారు. ఈక్రమంలో పవన్ చనిపోయాడని దగ్గరకు వెళ్తారు. కట్ చేస్తే... పెద్ద బాంబు పేలిన శబ్దం.. పవర్‌ఫుల్ బీజీఎంతో పవన్ ఎంట్రీ సీన్ సూపర్‌గా ఉంటుంది.
https://youtu.be/4OgJoMj7kLo?si=u3wI9Bsm_Sd7YDby
మహేష్ బాబు- పోకిరి
పోకిరి సినిమాలో మహేష్ బాబు ఇంట్రడక్షన్ సీన్ కూడా ప్రేక్షకులను విపరీతంగా అలరించింది. "మేము కాదు పండుగాడు.. రేపు పొద్దున ఇందిరా నగర్‌లో పరుగెత్తించి, పరుగెత్తించి కొడుతాడు" అని హీరో ఫ్రెండ్స్ ఇచ్చే ఎలివేషన్.. కట్ చేస్తే.. మహేష్ స్టన్నింగ్ రన్నింగ్ స్టైల్‌తో వచ్చే ఇంట్రో సూపర్బ్‌గా ఉంటుంది.
https://youtu.be/e8-GhC0gFtQ?si=PGXqB0DN34tfHaJg
అల్లు అర్జున్- ఆర్య
మ్యాన్ హోల్ పడిన కుక్క పిల్లను బన్నీ రక్షించే సీన్... హార్ట్ ఫెల్ట్‌గా ఉంటుంది. ఈలాంటి సీన్‌తో ఇప్పటి వరకు ఏ హీరోకు ఇంట్రో పడలేదని చెప్పాలి. అప్పవరకు ఉన్న మూస ధొరణి ఇంట్రోలకు సుకుమార్ తన స్టైల్ ఆఫ్ టేకింగ్‌తో ఫుల్‌స్టాప్ పెట్టాడు.
https://youtu.be/kvYePkoR6s0?si=jNeyhKqY4ARC-zRZ
సింహాద్రి- జూనియర్ ఎన్టీఆర్
సింహాద్రి అప్పన్నకు మొక్కు చెల్లించేందుకు వెళ్తున్నప్పుడు విగ్రహాన్ని కోతి దొంగిలించి విలన్లకు ఇస్తుంది. కట్ చేస్తే జూ. ఎన్టీఆర్ ఇంట్రో అదిరిపోతుంది.
https://youtu.be/P9q4u7KR9Is?si=Ftql6FN6xG8-uABE
స్టాలిన్- చిరంజీవి
మెగాస్టార్ చిరంజీవి నటించిన సినిమాల్లో వచ్చిన ఇంట్రోల్లో స్టాలిన్ ఇంట్రో వన్ ఆఫ్ ది బెస్ట్ అని చెప్పవచ్చు. అమ్మాయిని కిడ్నాప్ చేసిన విలన్లకు చిరు బుద్ది చెప్పే సీన్ ఫ్యాన్స్‌కు గూస్ బంప్స్ తెప్పిస్తుంది.
https://youtu.be/Dlc5V4Gi0So?si=Af3xz6wiuoQw5NfT
రామ్ చరణ్- మగధీర
ఈ చిత్రంలో రామ్ చరణ్ చేసే హై ఎండ్ ఎక్స్‌ట్రీమ్ బైక్ ఫీట్.. టాలీవుడ్‌లో వచ్చిన బెస్ట్ హీరో ఎంట్రీ సీన్లలో ఒకటిగా చెప్పవచ్చు.
https://youtu.be/uGh4lbLnmio?si=vsy6ox3mmaiNDg_i
ప్రభాస్- బిల్లా
హాలీవుడ్ రేంజ్ ఎలివేషన్ ఈ సినిమాలో ప్రభాస్‌కు దక్కింది. ఆయన కటౌట్‌కు తగ్గ BGM స్కోర్ సూపర్బ్‌గా ఉంటుంది. ముఖ్యంగా హీరో ఎంట్రీ సీన్ ఆ సీన్‌కు తగ్గ మణిశర్మ బీజీఎం, ప్రభాస్ యాటిట్యూడ్‌ను ఎలివేట్ చేసింది.
https://youtu.be/jq1Kr3nlOCE?si=OxJV6jjNiTTEDHta
ఘర్షణ- వెంకటేష్
ఈ చిత్రంలో వెంకటేష్ ఇంట్రో వెరైటీగా చూపించాడు దర్శకుడు గౌతమ్ మీనన్. "నా పేరు రామచంద్ర, ఐపీఎస్, నా డ్రెస్ మీద ఉన్న మూడు సింహాలే నా జీవితం, నా తపస్సు" అంటూ ఎలివేషన్‌తో వెంకీని చూపించాడు.
https://youtu.be/APNGeCwPlGQ?si=KxY7kBiopg4-6I5a
ఫిబ్రవరి 26 , 2024
Telugu Films based on the Ramayana: సీతారాములు లేకున్నా రామాయాణాన్ని గుర్తు చేసిన చిత్రాలు ఇవే!
వాల్మీకి రచించిన ఇతిహాసగాథ రామాయణాన్ని (Ramayanam) ఆధారంగా చేసుకొని ఇప్పటికే పలు చిత్రాలు తెరకెక్కి అఖండ విజయాన్ని అందుకున్నాయి. ఈ కోవలోనే తాజాగా ‘ఆదిపురుష్’ చిత్రం సైతం తెరకెక్కింది. రామాయణం గొప్పతనాన్ని ఈ తరం వారికి చాటి చెప్పే ఉద్దేశంతో ఈ సినిమాను తీశారు. అయితే రామాయణంలోని పాత్రలు లేకుండా కథను మాత్రమే ప్రతిబింబిస్తూ కమర్షియల్ హంగులతో రూపొందిన చిత్రాలు కూడా తెలుగులో వచ్చాయి. వాటిని పరిశీలనగా చూస్తే తప్ప ఆ విషయం అర్థం కాదు. అటువంటి చిత్రాలను YouSay మీ ముందుకు తెచ్చింది. ఆయా చిత్రాల్లోని రామాయణం తాలుకూ మూలాలను ఇప్పుడు పరిశీలిద్దాం.
దసరా (Dasara)
హీరో నాని రీసెంట్ చిత్రం ‘దసరా’లోనూ రామాయణం కనిపిస్తుంది. ముఖ్యంగా విలన్ పాత్రలు రావణుడి ఛాయలు కనిపిస్తాయి. హీరోయిన్‌పై కన్నేసిన విలన్.. ఆమెను సొంతం చేసుకోవడానికి కుట్రలు చేస్తుంటాడు. చివరికి హీరో అతడ్ని చంపి తన భార్యకు, ఊరికి ప్రశాంతత కల్పిస్తాడు.
ఆర్ఆర్ఆర్ (RRR)
ఆర్‌ఆర్‌ఆర్‌లోనూ తారక్ (Jr NTR) పాత్రను గమనిస్తే ఆంజనేయుడు గుర్తుకు రాక మానడు. తన గూడెం నుంచి బ్రిటిష్ వారు ఎత్తుకెళ్లిన పాప ఆచూకి కోసం తారక్ హస్తినకు వెళ్తాడు. రావణకోట లాంటి బ్రిటిష్ బంగ్లాలోకి వెళ్లి బందింపబడిన బాలికలో ధైర్యం నింపుతాడు. చివరికి పాపను రక్షించి తల్లిదండ్రుల వద్దకు చేరుస్తాడు. రాముడి వద్దకు సీతను ఆంజనేయుడు ఎలా చేర్చాడో అచ్చం అలాగే.
వర్షం (Varsham)
ప్రభాస్ - త్రిష (Trisha) జంటగా నటించిన ఈ చిత్రానికి శోభన్ దర్శకత్వం వహించారు. ఇందులో హీరో హీరోయిన్లుగా గాఢంగా ప్రేమించుకోగా వీరి మధ్యలోకి విలన్ (గోపీచంద్) ఎంట్రీ ఇస్తాడు. త్రిషను ఇష్టపడి ఆమెను దక్కించుకోవాలని అనుకుంటాడు. అతడ్ని అంతం చేసి చివరికి ప్రభాస్ (Prabhas) తన ప్రేమను గెలిపించుకుంటాడు. ఈ కథను పరిశీలిస్తే రామాయణంలో సీతపై మనసు పడ్డ రావణుడు.. అతడ్ని సంహరించిన రాముడు గుర్తుకు వస్తారు.
వరుడు (Varudu)
2010లో వచ్చిన ఈ చిత్రానికి గుణశేఖర్ (Gunasekhar) దర్శకత్వం వహించారు. అల్లు అర్జున్ (Allu Arjun), భానుశ్రీ మెహ్రా (Bhanu Sri Mehra) జంటగా నటించగా.. ప్రతినాయకుడిగా తమిళ నటుడు ఆర్య (Actor Arya) చేశాడు. కథలోకి వెళ్తే హీరో హీరోయిన్లకు పెళ్లి నిశ్చయం అవుతుంది. ఈ క్రమంలో పెళ్లి పీటలపై నుంచి కథానాయకిని విలన్ ఎత్తుకెళ్తాడు. విలన్‌ను కనిపెట్టి అంతం చేయడం ద్వారా హీరో తన భార్యను పొందుతాడు. ఈ మూవీ స్టోరీ కూడా రామాయణాన్ని ప్రతిబింబిస్తుంది.
ఒక్కడు (Okkadu)
గుణశేఖర్ దర్శకత్వంలో మహేష్ బాబు (Mahesh Babu), భూమిక (Bhumika) జంటగా నటించిన బ్లాక్‌బాస్టర్ చిత్రం ‘ఒక్కడు’. ఇందులో హీరోయిన్‌పై మనసు పడ్డ విలన్ (ప్రకాష్‌రాజ్) ఆమె కుటుంబాన్ని చంపి మరి ఆమెను పెళ్లి చేసుకోవాలని ప్రయత్నిస్తాడు. భూమిక అతడి నుంచి తప్పించుకునే క్రమంలో హీరో కంట పడుతుంది. ఈ క్రమంలో వారిద్దరూ ప్రేమలో పడతారు. విలన్‌ను అంతం చేసి హీరో తన ప్రేమను గెలిపించుకుంటాడు.
రావణన్ (Raavanan)
విక్రమ్, ఐశ్వర్యరాయ్, పృథ్వీరాజ్ ప్రధాన పాత్రలో నటించిన 'రావణన్' చిత్రాన్ని మణిరత్నం రూపొందించారు. ఇందులో రాముడు లాంటి ఎస్పీ దేవ్ (పృథ్వీ) భార్య ఐశ్వర్యరాయ్‌ను నల్లమల్ల అడవులకు విక్రమ్ తీసుకొస్తాడు. సీతలాంటి ఆమెను వెత్తుక్కుంటూ పోలీసు ఆఫీసర్ పృథ్వీ, ఆంజనేయుడి పాత్ర లాంటి అడవులు తెలిసిన కానిస్టేబుల్ కార్తిక్ వెళ్తారు. రామాయణాన్ని ఆధునీకరీస్తూ రావణుడిని హైలెట్ చేస్తూ ఈ చిత్రం వచ్చింది.
సైనికుడు (Sainikudu)
మహేష్ - త్రిష జంటగా చేసిన ‘సైనికుడు’ సినిమా కథ రామాయణానికి కాస్త ఆపోజిట్‌గా ఉంటుంది. విలన్ మంచోడని భావించిన హీరోయిన్ అతడ్ని పెళ్లి చేసుకునేందుకు సిద్ధమవుతుంది. ఓ కారణం చేత హీరోయిన్‌ను హీరో ఎత్తుకెళ్తాడు. విలన్ నిజస్వరూపం తెలుసుకున్నాక త్రిష.. మహేష్‌బాబుని ప్రేమిస్తుంది. త్రిషను బలవంతంగా పెళ్లి చేసుకోవాలని విలన్ ప్రయత్నించడంతో హీరో అతడ్ని చంపి ఆమెను సొంతం చేసుకుంటాడు.
రోబో (Robo)
రజనీకాంత్ (Rajinikanth), ఐశ్వర్యరాయ్ (Aishwarya Rai) జంటగా డైరెక్టర్ శంకర్ రూపొందించిన చిత్రం ‘రోబో’. కథలోకి వెళితే సైంటిస్ట్ వశీకర్ చిట్టి అనే రోబోను తయారు చేస్తాడు. దానిలో మనుషులకు లాగే ఫీలింగ్స్ ఉండేలా చేస్తాడు. దీంతో ఆ రోబో హీరోయిన్‌పై మనసు పడుతుంది. ఆమెను ఎత్తుకెళ్లి పోతుంది. రక్షణగా తనలాగా ఉండే వందలాది రోబోలను సైన్యంగా చేసుకుంటుంది. చివరికీ హీరో ఆ రోబోను నిర్విర్యం చేసి ప్రేయసిని దక్కించుకుంటాడు.
ఆదిపురుష్ (Adipurush)
గతేడాది ప్రభాస్ (Prabhas), కృతిసనన్ (Kriti Sanon) నటించిన ‘ఆదిపురుష్’ మూవీ కూడా రామాయణంలోని యుద్ధకాండ ఆధారంగా తెరకెక్కింది. ఈ సినిమాపై దారుణమైన విమర్శలు వచ్చినా.. రామాయణాన్ని ఈ కాలం పిల్లలకు తగినట్లుగా రూపొందించానని దర్శకుడు ఓంరౌత్ సమర్థించుకున్నాడు.
సీతారాముల కల్యాణం లంకలో
నితిన్ - హన్సిక జంటగా నటించిన ఈ చిత్రం (Seeta Ramula Kalyanam Lankalo) టైటిల్‌కు తగ్గట్లే రామయాణ కథను గుర్తు చేస్తుంది. కాలేజీలో హీరో హీరోయిన్లు ప్రేమించుకుంటారు. అయితే హీరోయిన్ కుటుంబానికి విలన్‌కు మధ్య కుటుంబ కక్ష్యలు ఉంటాయి. ఈ నేపథ్యంలో విలన్ కథానాయికను రావణాసురుడిలా మాయ చేసి ఎత్తుకెళ్తాడు. అది గ్రహించిన హీరో లంక లాంటి అతడి ఇంటికి మారు వేషంలో వెళ్లి వారితో కలిసిపోతాడు. విలన్లను మాయ చేసి తన ప్రేమను గెలిపించుకుంటాడు.
ఫిబ్రవరి 19 , 2024
This Week OTT Movies: సంక్రాంతికి దద్దరిల్లనున్న థియేటర్లు.. ఈ వారం విడుదలయ్యే చిత్రాలు ఇవే!
తెలుగు రాష్ట్రాల్లో ఈ వీకెండ్ సంక్రాంతి సందడి మెుదలు కానుంది. దీంతో ఎప్పటిలాగే కొత్త సినిమాలతో థియేటర్లు కళకళలాడబోతున్నాయి. ఈ ఏడాది కొత్త పలువురు స్టార్ హీరోలు సంక్రాంతి బరిలో నిలిచి తమ అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్నారు. అటు ఓటీటీలోనూ సరికొత్త చిత్రాలు, వెబ్‌సిరీస్‌లు ప్రేక్షకులను అలరించడానికి వస్తున్నాయి. మరి ఎవరెవరు సంక్రాంతి బరిలో ఉన్నారో ఇప్పుడు చూద్దాం.
థియేటర్లలో విడుదలయ్యే చిత్రాలు
గుంటూరు కారం
మహేశ్‌బాబు (Mahesh Babu) హీరోగా త్రివిక్రమ్ దర్శకత్వంలో రూపొందిన యాక్షన్ డ్రామా చిత్రం ‘గుంటూరు కారం’ (Guntur Kaaram). శ్రీలీల, మీనాక్షి చౌదరి హీరోయిన్లుగా నటించారు. సంక్రాంతి కానుకగా జనవరి 12న ఈ చిత్రం థియేటర్‌లలో విడుదల కానుంది. అతడు, ఖలేజా సినిమాల తర్వాత మహేష్, త్రివిక్రమ్ కాంబోలో వస్తున్న మూవీ కావడంతో సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. ఇప్పటికే విడుదల చేసిన ప్రచార చిత్రాలు, పాటలు యువతను విశేషంగా ఆకట్టుకున్నాయి.
హను-మాన్
యంగ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ.. వైవిధ్యమైన సినిమాలు తీస్తూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. తేజ సజ్జా కథానాయకుడిగా ఆయన రూపొందించిన మరో చిత్రం ‘హను-మాన్’ (Hanu Man). ఆంజనేయస్వామి కథా నేపథ్యంతో సూపర్ హీరో ఫిల్మ్‌గా దీన్ని తీర్చిదిద్దారు. ఈ చిత్రం కూడా జనవరి 12న విడుదల కాబోతోంది. ఇప్పటికే విడుదలైన టీజర్, ట్రైలర్‌లోని వీఎఫ్‌ఎక్స్ సినిమాపై అంచనాలు పెంచేసింది. చిన్నారులను సైతం అలరించేలా ఇందులో సన్నివేశాలు ఉంటాయని చిత్ర బృందం చెబుతోంది.
సైంధవ్
టాలీవుడ్ స్టార్ హీరో వెంకటేష్ ఈ ఏడాది సంక్రాంతి బరిలో నిలిచారు. శైలేష్‌కొలను దర్శకత్వంలో ఆయన నటించిన యాక్షన్ థ్రిల్లర్ ‘సైంధవ్’ (Saindhav) జనవరి 13న థియేటర్‌లలో విడుదల కానుంది. వెంకటేష్‌కి ఇది 75వ సినిమా. కూతురి సెంటిమెంట్‌తో పాటు, వెంకటేశ్ యాక్షన్ సినిమాకు హైలైట్‌గా నిలవనుంది. శ్రద్ధాశ్రీనాథ్, నవాజుద్దీన్ సిద్దిఖీ, ఆర్య కీలకపాత్రలు పోషించారు.
నా సామిరంగ
ఈ సంక్రాంతికి మరో స్టార్ హీరో ప్రేక్షకులను పలకరించేందుకు సిద్ధమవుతున్నారు. నాగార్జున (Nagarjuna) హీరోగా విజయ్ బిన్ని దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘నా సామిరంగ’ (Naa Saami Ranga) చిత్రం.. జనవరి 14న విడుదల కానుంది. అల్లరి నరేశ్, రాజ్‌తరుణ్ కీలక పాత్రలు పోషించగా.. ఆషికా రంగనాథ్ కథానాయికగా చేసింది. మలయాళంలో ఘన విజయం సాధించిన ‘పొరింజు మరియం జోసే’ చిత్రానికి రీమేక్‌గా నా సామిరంగను రూపొందించారు. తెలుగు నేటివిటీకి అనుగుణంగా కథలో మార్పులు చేశారు.
అయలాన్
సంక్రాంతికి తెలుగు చిత్రాలతో పాటు ఓ డబ్బింగ్ సినిమా సైతం విడుదల కాబోతోంది. తమిళ నటుడు శివకార్తికేయన్ ‘అయలాన్’ చిత్రంతో ప్రేక్షకులను అలరించేందుకు రాబోతున్నాడు. ఆర్.రవికుమార్ దర్శకత్వంలో రూపొందిన ఈ సైన్స్ ఫిక్షన్ మూవీలో రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్‌గా చేసింది. జనవరి 12న తమిళ, తెలుగు భాషల్లో ఈ చిత్రం విడుదల కానుంది. గ్రహాంతర వాసితో మనిషికి కుదిరిన స్నేహం ఎలాంటి పరిస్థితులకు దారి తీసింది అన్నది కథ.
ఓటీటీలో విడుదలయ్యే చిత్రాలు
ఈ వారం ఓటీటీ సినిమాల విషయానికొస్తే ఏకంగా 29 చిత్రాలు / వెబ్ సిరీసులు రిలీజ్ కానున్నాయి. థియేటర్లకు వెళ్లి కొత్త మూవీస్ చూసే ఆసక్తి లేకపోతే వీటిని ప్రిఫర్ చేయవచ్చు. ఇంతకీ ఓటీటీలో రాబోతున్న ముఖ్యమైన చిత్రాలు, వెబ్‌సిరీస్‌లు ఏవో ఇప్పుడు చూద్దాం.
ఎక్స్ ట్రా ఆర్డినరీ మ్యాన్
నితిన్ కథానాయకుడిగా వక్కంతం వంశీ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘ఎక్స్ ట్రా ఆర్డినరీ మ్యాన్’. శ్రీలీల హీరోయిన్. ఈ చిత్రం జనవరి 12న ఓటీటీలోకి రానుంది. నెట్‌ఫ్లిక్స్ వేదికగా స్ట్రీమింగ్ కానుంది. గతేడాది డిసెంబర్ 8న విడుదలైన ఈ చిత్రం పరాజయాన్ని మూటగట్టుకుంది. బాక్సాఫీస్ వద్ద విఫలమై నితీర్ కెరీర్‌లో మరో డిజాస్ ఫ్లాప్‌గా నిలిచింది. మరి ఓటీటీ ప్రేక్షకులనైనా ఈ చిత్రం ఆకట్టుకుందో లేదో చూడాలి.
కోట బొమ్మాళి P.S
శ్రీకాంత్ కీలక పాత్రలో జీఏ2 పిక్చర్స్ పతాకంపై రూపొందిన చిత్రం ‘కోట బొమ్మాళి పి.ఎస్’. వరలక్ష్మి శరత్‌కుమార్, రాహుల్ విజయ్, శివాని రాజశేఖర్ ఇతర ముఖ్యపాత్రలు పోషించారు. ఈ చిత్రం ఓటీటీ వేదికగా స్ట్రీమింగ్ అయ్యేందుకు సిద్ధమైంది. జనవరి 11వ తేదీ నుంచి ‘ఆహా’లో ప్రసారం కానుంది. నవంబరు 24న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద మంచి టాక్‌ను సొంతం చేసుకుంది.
మరిన్ని OTT చిత్రాలు & వెబ్ సిరీస్‌ల విడుదలల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
https://telugu.yousay.tv/tfidb/ott
TitleCategoryLanguagePlatformRelease DateBreak Point Season 2SeriesEnglishNetflixJan 10King Dom - 3MovieEnglishNetflixJan 10The TrustSeriesEnglishNetflixJan 10Boy Swallows UniverseSeriesEnglishNetflixJan 10Killer SoupMovieHindiNetflixJan 11LiftMovieEnglishNetflixJan 12EchoSeriesEnglishDisney + HotstarJan 11The Legend of HanumanSeriesHindiDisney + HotstarJan 12JourneyMovieTamil SonyLIVJan 12SivappuMovieTamil AhaJan 12La BreaSeriesEnglishJio CinemaJan 10TedSeriesEnglishJio CinemaJan 12Mission: Impossible – Dead Reckoning Part OneMovieTelugu/EnglishAmazon PrimeJan 11RoleplayMovieEnglishAmazon PrimeJan 12
జనవరి 08 , 2024
VARUNLAV: ఈ జంటల స్ఫూర్తితోనే వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి పెళ్లికి సిద్ధమయ్యారు!
మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ పెళ్లి పీటలెక్కబోతున్నాడు. హీరోయిన్ లావణ్య త్రిపాఠికి మనసిచ్చిన ఈ హీరో ఇప్పుడు మనువాడేందుకు రెడీ అవుతున్నాడు. గత కొద్ది కాలంగా రిలేషన్‌షిప్‌పై సైలెంట్‌గా ఉన్న వీరు ఏకంగా పెళ్లి ప్రకటన చేసి అందరినీ ఆశ్చర్యపరిచారు. కలిసి సినిమాల్లో నటించి ప్రేమ పెళ్లి చేసుకుంటున్నది వీరొక్కరే కాదు. ఈ జాబితాలో ఇప్పటికే ఎంతో మంది ఉన్నారు. ఆ జంటలేవో తెలుసుకుందాం.
https://twitter.com/tupakinews_/status/1667059120313352192?s=20
https://twitter.com/Pallavi_M_K/status/1664277523608518657?s=20
కియారా- సిద్ధార్థ్ మల్హోత్రా
బాలీవుడ్ జంట కియారా అడ్వాణీ, సిద్ధార్థ్ మల్హోత్రా 2023 ఫిబ్రవరి 7న వివాహం చేసుకున్నారు. వీరిద్దరికీ షేర్షా సినిమాతో పరిచయం. అప్పటినుంచి చెట్టాపట్టాలేసుకుని తిరిగారు. చివరికి పెద్దలను ఒప్పించి ప్రేమ పెళ్లి చేసుకున్నారు.
నయనతార- విఘ్నేష్ శివన్
లేడీ సూపర్‌స్టార్‌గా పేరు తెచ్చుకుంది నయనతార. తెలుగు, తమిళ చిత్రాల్లో తనకంటూ ప్రత్యేక స్థానాన్ని ఏర్పరుచుకున్న నయన్.. డైరెక్టర్ విఘ్నేష్ శివన్‌తో మూడు ముళ్లు వేయించుకుంది. కొంతకాలంగా నడిచిన వీరి ప్రేమాయణం పెళ్లి పీటలెక్కి మరో స్థాయికి చేరుకుంది. 2022లో వీరికి వివాహం కాగా సరోగసి విధానంలో వీరు సంతానాన్ని పొందారు.
Screengrab Instagram:nayanatara
నమ్రత- మహేశ్ బాబు
నమ్రత, మహేశ్ బాబులది ప్రేమ వివాహమే. వంశీ సినిమాతో తొలిసారి వీరిద్దరూ కలిసి పనిచేశారు. అప్పుడే మిల్క్ బాయ్ ప్రేమల్లో పడ్డాడు. ఐదేళ్ల పాటు నమ్రతతో ప్రేమాయణం నడిపి చివరికి నాన్న కృష్ణ పర్మిషన్‌తో పెళ్లి చేసుకున్నాడు. వీరిద్దరికీ ఇద్దరు సంతానం. గౌతమ్, సితార.
అలియా భట్- రణ్‌బీర్ కపూర్
బాలీవుడ్ క్యూట్ కపుల్ అలియా భట్, రణ్‌బీర్ కపూర్.. ప్రేమ ద్వారానే ఒక్కటయ్యారు. వీరిద్దరూ కలిసి చేసిన బ్రహ్మాస్త్ర సినిమాతో ప్రేమలో పడ్డారు. 2022లో ప్రేమ పెళ్లి చేసుకున్నారు. వీరిద్దరికీ కుమార్తె పుట్టింది.
విజయనిర్మల- కృష్ణ
సెలబ్రిటీ కపుల్స్‌లలో ఎప్పటికీ గుర్తుండిపోయే జంట వీరిది. వీరిద్దరూ ప్రేమ వివాహం చేసుకున్నారు. బాపూ ‘సాక్షి’ సినిమాతో వీరిద్దరి ప్రేమాయణం మొదలైంది. అలా సంవత్సరాలు గడిచాక 1969లో పెళ్లి చేసుకున్నారు. వీరిద్దరికీ ఇది రెండో వివాహం కావడం గమనార్హం.
జ్యోతిక- సూర్య
సౌత్‌లో పేరొందిన సెలబ్రిటీ కపుల్ జ్యోతిక- సూర్య. ఇద్దరికీ ఒకరిపై మరొకరికి ఎంతో అభిమానం, ప్రేమ. 2006లో వీరు పెళ్లి చేసుకున్నారు. వీరికి ఒక కూతురు(దియా), కుమారుడు(దేవ్).
అమల- నాగార్జున
తెలుగు ఇండస్ట్రీలో నాగార్జున, అమల సెలబ్రిటీల జంటకు ప్రత్యేక గుర్తింపు ఉంటుంది. 1992 జూన్‌లో వీరు వివాహం చేసుకున్నారు. ప్రేమ యుద్ధం, కిరాయి దాదా, శివ, నిర్ణయం సినిమాల్లో ఈ జంట కలిసి పనిచేసింది.
నిక్కీ గల్రానీ- ఆది పినిశెట్టి
గొడవలతోనే వీరిద్దరి ప్రేమాయణం మొదలైంది. ‘మలుపు’ సినిమా వీరి జీవితాలను మలుపు తిప్పింది. ఈ సినిమా షూటింగ్ సమయంలో వీరి మధ్య గొడవలు, మనస్పర్దలు వచ్చాయి. కానీ, ఆ తర్వాత అర్థం చేసుకుని ప్రయాణాన్ని కొనసాగించారు. అలా ప్రేమలో పడి 2022, మే నెలలో ఒక్కటయ్యారు.
జీవిత- రాజశేఖర్
జీవిత, రాజశేఖర్‌లది విచిత్ర ప్రయాణం. తలంబ్రాలు సినిమాతో వీరి మధ్య పరిచయం పెరిగి ప్రేమించుకున్నారు. ‘ఆహుతి’ సినిమా చిత్రీకరణ సమయంలో రాజశేఖర్‌కి గాయాలైతే దగ్గరుండి చూసుకుంది జీవిత. అలా తమ ప్రేమను పెద్దలతో పంచుకుని నిజ జీవితంలోనూ హీరో, హీరోయిన్లు అయ్యారు. 1991లో వీరి వివాహమైంది. వీరిద్దరికీ ఇద్దరు కూతుళ్లు. శివానీ, శివాత్మికలు హీరోయిన్లుగా చేస్తున్నారు.
షాలిని- అజిత్
బేబి షాలినిగా గుర్తింపు పొందింది షాలిని. తమిళ స్టార్ అజిత్‌తో ప్రేమాయణం పెళ్లి పీటల దాకా తీసుకొచ్చింది. వీరిద్దరూ ఒకరినొకరు ప్రేమించుకుని 2000వ సంవత్సరంలో వివాహం చేసుకున్నారు.
దీపిక పదుకొణె- రణ్‌వీర్ సింగ్
బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపిక పదుకొణె, స్టార్ హీరో రణ్‌వీర్ సింగ్ ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. బాజీరావ్ మస్తానీ సినిమాలో వీరిద్దరూ కలిసి నటించారు. అనంతర కాలంలో ప్రేమలో మునిగి తేలి 2018లో పెళ్లితో ఒక్కటయ్యారు.
ఈ జంటలు కూడా..
బాలీవుడ్ బిగ్ బీ అమితాబ్-జయా బచ్చన్, శ్రీకాంత్- ఊహ, అభిషేక్ బచ్చన్- ఐశ్వర్య రాయ్, కరీనా కపూర్- సైఫ్ అలీ ఖాన్, కత్రినా కైఫ్- విక్కీ కౌశల్, శివబాలాజీ- మధుమిత, వరుణ్ సందేశ్- వితిక, రాధిక- శరత్ కుమార్, ఆర్య- సాయేషా సైగల్ కూడా ప్రేమ వివాహం చేసుకుని అన్యోన్య దాంపత్యాన్ని కొనసాగిస్తున్నారు.
జూన్ 09 , 2023
Anni Manchi Sakunamule Review: కామెడీ, ఏమోషనల్ సీన్స్ ఓకే.. కానీ!
నటీనటులు: సంతోష్ శోభన్, మాళవిక నాయర్, రాజేంద్ర ప్రసాద్, నరేష్, గౌతమి, రావు రమేష్, వెన్నెల కిషోర్
డైరెక్టర్: B.V. నందిని రెడ్డి
సంగీతం: మిక్కీ J. మేయర్
నిర్మాత : ప్రియాంక దత్
సంతోష్ శోభన్, మాళవిక నాయర్ జంటగా చేసిన తాజా చిత్రం ‘అన్ని మంచి శకునములే’. నందిని రెడ్డి దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని స్వప్న సినిమాస్ బ్యానర్‌పై ప్రియాంక దత్ నిర్మించారు. ఇప్పటికే విడుదలైన ప్రమోషనల్ కంటెంట్‌తో పాటు పాటలు, ట్రైలర్ సినిమాపై హైప్ పెంచేశాయి. భారీ అంచనాల మధ్య ఇవాళ (మే 18) ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. సినిమా ఎలా ఉంది? నందిని రెడ్డి మరో హిట్ కొట్టారా? లేదా? శోభన్ తన నటనతో ఆకట్టుకున్నాడా? వంటి అంశాలు ఈ పూర్తి రివ్యూలో తెలుసుకుందాం.
కథ
సినిమా కథ మెటర్నిటీ ఆసుపత్రిలో ప్రారంభమవుతుంది. నరేష్, రాజేంద్ర ప్రసాద్ ఫ్యామిలీ ఫ్రెండ్స్. వీరికి పుట్టిన హీరో, హీరోయిన్లు (ఆర్య, రిషి) పొరపాటున మారిపోతారు. వైద్యులు ఒకరిబిడ్డను మరొకరికి అప్పగిస్తారు. అయితే నరేష్, రాజేంద్ర ప్రసాద్‌లకు వారి తాత ముత్తాతల నుంచి వారసత్వంగా వచ్చే ఆస్తులకు సంబంధించి వివాదం నడుస్తుంటుంది. ఆర్య, రిషిలు పెరిగి పెద్దవారైనట్లే వారి ఆస్తులకు సంబంధించిన సమస్యలు కూడా పెరిగిపోతాయి. ఆ వివాదాన్ని వారు ఎలా పరిష్కరించుకున్నారు? పిల్లలు మారిపోయిన విషయాన్ని వారు ఎలా తెలుకున్నారు? అనేది మిగిలిన కథ.
ఎవరెలా చేశారంటే
హీరో సంతోష్ శోభన్ తన కామెడీ టైమింగ్ అదరగొట్టాడని చెప్పొచ్చు. జీవితాన్ని సరదాగా గడిపే యువకుడి పాత్రలో శోభన్ చక్కగా ఒదిగిపోయాడు. గత చిత్రాలతో పోలిస్తే నటనలో శోభన్ చాలా మెరుగైనట్లు కనిపించాడు. హీరోయిన్ మాళవిక సైతం తన పరిధి మేరకు నటించి ఆకట్టుకుంది. మాళవిక, శోభన్ మధ్య సన్నివేశాలు ఆకట్టుకుంటాయి. ఈ జంట స్క్రీన్ ప్రజెన్స్ బాగుంది. ఇక సినిమాకు ప్రధాన బలం ఇతర తారాగణం అని చెప్పొచ్చు. రాజేంద్ర ప్రసాద్, రావు రమేష్, నరేష్, గౌతమి, షావుకారు జానకి వంటి అనుభవజ్ఞులైన నటులు తమ యాక్టింగ్‌తో అదరగొట్టారు. ఎమోషనల్ సీన్స్‌లో తమ నటన పాఠవాలను చాటుకున్నారు.
సాంకేతికంగా…
ఫ్యామిలీ ఎంటర్‌టైన్‌మెంట్ సినిమాకు నందిని రెడ్డి పెట్టింది పేరు. అన్నీ మంచి శకునములే సినిమా ద్వారా సింపుల్ ఫ్యామిలీ డ్రామాను ప్రజెంట్ చేయాలని భావించి నందిని రెడ్డి తడబడింది.
అనుకున్న కథను తెరపై చూపించడంతో డైరెక్టర్ విఫలమయ్యారు. కొన్ని సీన్లు మరీ నత్తనడకన సాగినట్లు అనిపిస్తాయి. ఎమోషనల్, కామెడీ సీన్స్ మినహా సినిమా అంతా బోరింగ్‌గా అనిపిస్తుంది. ప్రేక్షకుడిని ఆసక్తి కోల్పోయేలా చేస్తుంది. ఇక మిక్కీ J. మేయర్ అందించిన పాటలు కూడా ఆకట్టుకోవు. నేపథ్య సంగీతం కూడా పేలవంగానే అనిపిస్తుంది. అయితే సినిమాటోగ్రఫీ ఆకట్టుకుంటుంది. నిర్మాణ విలువలు ఉన్నతంగా ఉన్నాయి. ప్రతీ సీన్ రిచ్ లుక్‌లో కనిపిస్తుంది.
ప్లస్ పాయింట్స్
సంతోష్ శోభన్ నటనకామెడీఎమోషనల్ సీన్స్
మైనస్ పాయింట్స్
సాగదీతబోరింగ్ సీన్స్‌పాటలునేపథ్య సంగీతం
రేటింగ్: 2.5/5
మే 18 , 2023
Celebrity Couples Age Gap: ఈ సెలబ్రిటీ కపుల్స్ మధ్య ఏజ్ గ్యాప్ ఇంతనా.. అయినా సో హ్యాపీ..!
ప్రేమ ఎంతో మధురమైనది. దానికి కులం, మతం, డబ్బు, రంగుతో పని లేదంటారు. ప్రేమించిన అమ్మాయిని దక్కించుకునేందుకు ప్రేమికులు ఏ విషయాన్ని పట్టించుకోరు. ఎంతదూరమైన వెళ్లి తమ ప్రేమను గెలిపించుకుంటారు. కొందరు సెలబ్రిటీలు కూడా సరిగ్గా ఇదే చేశారు. ప్రేమకు వయసుతోనూ పనిలేదని చాటి చెప్పారు. వయసులో ఎంతో వ్యత్యాసం ఉన్నప్పటికీ భాగస్వామిని చేసుకొని సంతోషంగా గడుపుతున్నారు. ఇండస్ట్రీలో పదేళ్లకు మించి ఏజ్ గ్యాప్ ఉన్న సెలబ్రిటీ కపుల్స్ ఎవరో ఇప్పుడు చూద్దాం.
రణ్‌బీర్ కపూర్ - అలియా భట్
బాలీవుడ్ జంట రణ్‌బీర్ కపూర్ (40) - అలియా భట్ (30)ల మధ్య చాలా వ్యత్యాసం ఉంది. ఆలియా కంటే రణ్‌బీర్ 10 ఏళ్లు పెద్ద. వయసును ఏ మాత్రం పట్టించుకోని ఈ జంట పెద్దల సమక్షంలో పెళ్లి చేసుకొని వివాహ బంధంలోకి అడుగుపెట్టింది. వీరికి గతేడాది నవంబర్‌లో ఓ పాప కూడా పుట్టింది.
ఫహద్ - నజ్రియా
మలయాళం నటుడు ఫహద్ ఫాసిల్ (40) నటి నజ్రియా నజిన్ (28)ను 2014లో లవ్ మ్యారేజ్ చేసుకున్నాడు. తన కంటే ఫహద్ 12 ఏళ్లు పెద్ద అయినప్పటికీ మనసులు కలవడంతో వీరు ఒక్కటయ్యారు. పుష్ప సినిమాలో విలన్‌గా నటించి ఫహద్ ఆకట్టుకున్నాడు. అటు నజ్రియా సైతం నాని హీరోగా చేసిన 'అంటే సుందరానికి ' నటించి ఆకట్టుకుంది.
ప్రియాంక చోప్రా - నిక్ జోనాస్
బాలీవుడ్ అగ్రకథానాయికల్లో ఒకరైన ప్రియాంక చోప్రా (40) తన కంటే 10 ఏళ్లు చిన్నవాడైన హాలీవుడ్ నటుడు నిక్ జోనాస్ (30)ను ప్రేమ వివాహం చేసుకుంది. తన కంటే జోనాస్ చిన్నవాడైనప్పటికీ మనసులో మాత్రం చాలా పెద్ద వాడని ప్రియాంక ఓ సందర్భంలో పేర్కొంది. అందుకే పెళ్లి చేసుకున్నట్లు తెలిపింది. జోనాస్‌తో పెళ్లి తర్వాత ప్రియాంక క్రేజ్ బాగా పెరిగింది. హాలీవుడ్ అవకాశాలు కూడా ఈ అమ్మడిని వెతుక్కుంటూ వచ్చేసాయి.
సైఫ్ అలీఖాన్ - కరీనా కపూర్
ప్రముఖ బాలీవుడ్ సైఫ్ అలీఖాన్ కూడా తన కంటే 13 ఏళ్లు చిన్నదైన కరీనా కపూర్‌ను పెళ్లి చేసుకున్నాడు. వీరికి ఇద్దరు పిల్లలు సైతం ఉన్నారు. కరీనాను సైఫ్ అలీఖాన్ రెండో పెళ్లి చేసుకున్నాడు. అయితే సైఫ్‌కు ఆయన మొదటి భార్యకు మధ్య కూడా వయసులో చాలా వ్యత్యాసమే ఉంది. ఫస్ట్ వైఫ్ అమృతా సింగ్ సైఫ్ కంటే 12 ఏళ్లు పెద్దది. వీరికి పుట్టిన సారా అలీఖాన్ ప్రస్తుతం బాలీవుడ్ హీరోయిన్‌గా రాణిస్తోంది.
ఆర్య - సయేషా సైగల్
తమిళ హీరో ఆర్య (42).. 2019లో సయేషా సైగల్ (25) ను ప్రేమ పెళ్లి చేసుకున్నాడు. అయితే ఆర్య కంటే సయేషా వయసులో 17 ఏళ్లు చిన్నది. అయినప్పటికీ పెద్దల అంగీకారంతో ఈ జంట ఒక్కటైంది. వీరి ప్రేమకు గుర్తుగా ఓ పాప కూడా ఉంది.
ప్రకాష్ రాజ్ - పోనీ వర్మ
ప్రముఖ నటుడు ప్రకాష్ రాజ్(58) కొరియోగ్రాఫర్ పోనీ వర్మ (45) ను 2010లో వివాహం చేసుకున్నాడు. ప్రకాశ్ రాజ్ కంటే పోనీ వర్మ 13 ఏళ్లు చిన్నది. వీరిద్దరి ఓ బాబు కూడా ఉన్నాడు. 1994లో లలితా కుమారి అనే మహిళను ప్రకాష్ రాజ్ వివాహం చేసుకున్నాడు. అనివార్య కారణాల వల్ల ఈ జంట 2009లో విడాకులు తీసింది. ఆ తర్వాతి ఏడాదే ప్రకాష్ రాజ్ పోనీ వర్మను పెళ్లి చేసుకున్నాడు.
దిల్ రాజు - తేజస్విని
టాలీవుడ్ అగ్ర నిర్మాత దిల్ రాజు (52) తేజస్విని(వైఘా రెడ్డి)ని 2020లో రెండో పెళ్లి చేసుకున్నాడు. ఇరువురి మధ్య వయసు వ్యత్యాసం 19 సంవత్సరాలు. దిల్‌రాజు మెుదటి భార్య గుండెపోటుతో మరణించడంతో ఆయన రెండో పెళ్లి చేసుకున్నాడు. దిల్‌రాజు ఇప్పటివరకూ వివిధ భాషల్లో కలిపి 50కి పైగా సినిమాలు నిర్మించాడు.
అర్జున్ కపూర్ - మలైకా
బాలీవుడ్ హీరో అర్జున్ కపూర్ (45) తనకంటే 12 ఏళ్లు పెద్దదైన మలైకా అరోరా (58)తో రిలేషన్‌లో ఉన్నాడు. వీరిద్దరు త్వరలో పెళ్లి కూడా చేసుకోబోతున్నట్లు బాలీవుడ్ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ప్రస్తుతం వీరు ఎక్కడ చూసినా జంటగానే కనిపిస్తున్నారు.
మే 16 , 2023