• TFIDB EN
  • ఆర్య
    UTelugu2h 31m
    అజయ్ గీతను ప్రేమిస్తాడు. కానీ గీత అతను చేసిన ప్రేమప్రతిపాదనను తిరస్కరించినప్పుడు బిల్డింగ్‌పై నుంచి దూకెస్తానని అజయ్ బెదిరిస్తాడు. దీంతో గీత అజయ్ లవ్‌ ప్రపోజలన్‌ను అంగీకరిస్తుంది. ఈ విషయం తెలిసి కూడా గీతకు ఆర్య లవ్ ప్రపోజ్ చేస్తాడు. ఆ తర్వాత కథ అనేక మలుపులు తిరుగుతుంది.
    ఇంగ్లీష్‌లో చదవండి
    మూవీ & ఓటీటీ అప్‌డేట్స్‌
    స్ట్రీమింగ్‌ ఆన్‌SunNextఫ్రమ్‌
    Watch
    రివ్యూస్
    How was the movie?

    తారాగణం
    అల్లు అర్జున్
    ఆర్య
    అను మెహతా
    గీతాంజలి అకా గీత
    శివ బాలాజీ
    అజయ్
    రాజన్ పి. దేవ్
    అజయ్ తండ్రి
    సుబ్బరాజు
    సుబ్బు
    సునీల్
    రైలు టిక్కెట్ ఎగ్జామినర్
    వేణు మాధవ్
    అజయ్ స్నేహితుడు
    సుధ
    గీత తల్లి
    విద్యాశాంతి
    జెవి రమణ మూర్తి
    పూజారి
    శ్రావ్య
    ఆర్య యువ స్నేహితుల్లో ఒకరు
    బబ్లూ ఆర్య స్నేహితుడు
    సంద్ర జై చంద్రన్ గీత స్నేహితురాలు
    దేవి చరణ్
    జోగి నాయుడు
    కృష్ణం రాజు
    శ్రీకాంత్ అడ్డాల
    పృధ్వీ రాజ్
    రెడ్డి (అతిధి పాత్ర)
    అభినయశ్రీ
    ఐటమ్ నంబర్ ఆ అంటే అమలాపురంలో అభినయశ్రీ
    సిబ్బంది
    సుకుమార్
    దర్శకుడు
    దిల్ రాజు
    నిర్మాత
    దేవి శ్రీ ప్రసాద్
    సంగీతకారుడు
    ఆర్. రత్నవేలు
    సినిమాటోగ్రాఫర్
    ఎడిటోరియల్ లిస్ట్
    కథనాలు
    Arya @ 20 Years: ‘ఆర్య’ చిత్రానికి 20 ఏళ్లు.. ఈ మూవీ సీక్రెట్స్‌ తెలుసా?
    Arya @ 20 Years: ‘ఆర్య’ చిత్రానికి 20 ఏళ్లు.. ఈ మూవీ సీక్రెట్స్‌ తెలుసా?
    అల్లు అర్జున్‌ (Allu Arjun) హీరోగా సుకుమార్‌ (Sukumar) డైరెక్షన్‌ తొలి సారి వచ్చిన ‘ఆర్య’ (Arya) చిత్రం అప్పట్లో ఇండస్ట్రీని షేక్ చేసింది. వన్‌ సైడ్‌ లవ్‌ అనే ఇంట్రస్టింగ్‌ కాన్సెప్ట్‌తో వచ్చిన ఈ సినిమా తొలి రోజు డివైడ్‌ టాక్ తెచ్చుకుంది. కానీ ఆ తర్వాత క్రమంగా పుంజుకొని బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల సునామీ సృష్టించింది. చాలా థియేటర్లలో 125 రోజులకు పైగా ప్రదర్శితమై విమర్శకుల ప్రశంసలు అందుకుంది. అయితే 2004 మే7న ఈ సినిమా రిలీజ్‌ కాగా, నేటితో సరిగ్గా 20 ఏళ్లు పూర్తైంది. ఈ నేపథ్యంలో ఆర్యకు సంబంధించిన తెర వెనక రహాస్యాలపై ఓ లుక్కేద్దాం. దిల్‌ సక్సెస్‌తో సుకుమార్‌కు ఛాన్స్‌ నితీన్‌ హీరోగా చేసిన ‘దిల్‌’ చిత్రానికి డైరెక్టర్‌ సుకుమార్‌ అసిస్టెంట్‌ డైరెక్టర్‌గా పని చేశారు. ఆ సమయంలో నిర్మాత దిల్‌ రాజుకు సుకుమార్‌ ‘ఆర్య’ స్టోరీ వినిపించారు. ఇంప్రెస్‌ అయిన అతడు..  ‘దిల్‌’ సినిమా సక్సెస్‌ అయితే కచ్చితంగా డైరెక్షన్‌ ఛాన్స్ ఇస్తా అని సుకుమార్‌కు మాటిచ్చారు. ఈ లోపు పూర్తి కథ సిద్ధం చేసుకో అని సూచించారు. ఆ తర్వాత రిలీజైన ‘దిల్‌’.. బ్లాక్‌ బాస్టర్‌ కావడంతో సుకుమార్‌కు డైరెక్టర్‌ ఛాన్స్ వచ్చింది. పలు దఫాల చర్చల తర్వాత ఆర్య సినిమాకు గ్రీన్‌ సిగ్నల్ పడింది.  మిస్‌ చేసుకున్న అల్లరి నరేష్‌ ఆర్య చిత్రానికి తొలుత హీరోగా అల్లరి నరేష్‌ను సుకుమార్ అనుకున్నారట. అతడ్ని దృష్టిలో పెట్టుకొనే కథను కూడా రాశారట. అయితే కొన్ని కారణాల వల్ల కథ ఆయన వరకూ వెళ్లలేదట. ఈ విషయాన్ని ఓ ఇంటర్యూలో నరేష్‌ స్వయంగా పంచుకున్నారు. ‘సుకుమార్‌ ‘100%లవ్‌’ సినిమా తీస్తున్న సమయంలో నన్ను కలిశారు. ‘‘అల్లరి’లోని మీ నటన నన్ను ఆకట్టుకుంది. ‘ఆర్య’ కథ మీ కోసం రాసుకున్నా’’ అని చెప్పారు. ఎవరికి రాసి పెట్టి ఉన్న కథ వారి వద్దకే వెళ్తుంది. ఆయన దృష్టిలో పడ్డానంటే నటుడిగా నేనేదో చేస్తున్నట్లే లెక్క. ఆర్యగా అల్లు అర్జున్‌ కంటే బాగా ఎవరూ చేయలేరు’ అని నరేశ్‌ అన్నారు.  https://twitter.com/i/status/1787548147520061468 బన్నీని అలా ఫైనల్‌ చేశారు! ఆర్య కథ సిద్ధమైన తర్వాత హీరోను ఎవరు పెట్టాలన్న సందేహం కొన్ని రోజుల పాటు దర్శక నిర్మాతలను వెంటాడిందట. హీరో కోసం వెతుకున్న క్రమంలోనే దిల్‌ మూవీ స్పెషల్‌ షో నిర్వహించారు. ఆ సమయంలో బన్నీ కూడా వెళ్లాడు. అల్లుఅర్జున్‌ చలాకీ తనం, కామెడీ టైమింగ్‌ చూసి తన కథకు బన్నీ అయితేనే సరిగ్గా సరిపోతాడని దిల్‌ రాజుతో సుకుమార్‌ అన్నాడట. వెళ్లి అల్లు అర్జున్‌తో మాట్లాడరట. గంగోత్రి తర్వాత చాలా కథలు విని విసిగిపోయిన బన్నీ రొటీన్‌ స్టోరీ అనుకొని నో చెప్పారట. ఎట్టకేలకు విన్నాక కథ బన్నీకి బాగా నచ్చిందట. అటు చిరంజీవి, అల్లు అరవింద్‌కు కూడా ఇంప్రెస్‌ కావడంతో సినిమా పట్టాలెక్కింది.  అసిస్టెంట్‌గా చేసిన స్టార్‌ డైరెక్టర్‌ కొత్త బంగారు లోకం, ముకుంద, సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు వంటి హిట్‌ చిత్రాలను డైరెక్ట్‌ చేసిన శ్రీకాంత్‌ అడ్డాల.. ఆర్య మూవీకి సహాయ దర్శకుడిగా పనిచేశాడు. అంతేకాదు ఓ సీన్‌లోనూ ఆయన కనిపించాడు. ఇక ఈ సినిమా టైటిల్‌ విషయంలోనూ తొలుత కాస్త గందరగోళం నెలకొందట. ఈ వన్‌సైడ్‌ లవ్‌ స్టోరీకి ఏ పేరు పెడితే బాగుంటుందా? అని దర్శకుడు సుకుమార్, నిర్మాత దిల్‌ రాజు తెగ ఆలోచించారట. ఈ క్రమంలో ‘నచికేత’ టైటిల్‌ పెడితే ఎలా ఉంటుదని చిత్ర యూనిట్‌ యోచించిందట. చివరకు బన్నీ పాత్ర పేరునే టైటిల్‌గా ఫిక్స్ చేశారట.  https://twitter.com/i/status/1787674074585714980 120 రోజుల్లో షూటింగ్‌ పూర్తి ఆర్య చిత్ర షూటింగ్‌ను దర్శకుడు శరవేగంగా పూర్తి చేశాడు. 2003 నవంబరు 19న ఈ సినిమా లాంఛనంగా మెుదలవ్వగా.. 120 రోజుల్లోనే  పూర్తి చేశారు. అటు సుకుమార్‌ - దేవిశ్రీ ప్రసాద్‌ కాంబోలో తొలిసారి వచ్చిన ఈ మూవీ ఆల్బమ్‌.. మ్యూజిక్‌ లవర్స్‌ను ఫిదా చేసింది. ముఖ్యంగా తెలుగు అక్షరాలమాలకు కొత్త అద్దం చెప్పే ‘అ అంటే అమలాపురం..’ పాట అప్పట్లో మాస్‌ ఆడియన్స్‌ను విపరీతంగా ఆకట్టుకుంది. ఆటోలు, ట్రాక్టర్లు, ఫంక్షన్లు, ఈవెంట్స్‌ ఇలా ఎక్కడ చూసినా ఆ పాటనే వినిపించేది.  ఆర్యతో వారికి స్టార్‌డమ్‌ ఆర్య సినిమా సక్సెస్‌.. డైరెక్టర్‌ సుకుమార్‌, హీరో అల్లు అర్జున్‌, నిర్మాత దిల్‌ రాజు, సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్‌, డీవోపీ రత్నవేలు జీవితాలను మార్చివేసింది. వారి కెరీర్‌లో మైలురాయిగా నిలిచిపోయింది. గంగోత్రి తర్వాత బన్నీ చేసిన రెండో చిత్రం ఆర్య. ఈ సినిమాలో బన్నీ స్టైల్‌, డ్యాన్స్‌, గ్రేస్‌, యాక్షన్‌ చూసి తెలుగు ఆడియన్స్‌ ఫిదా అయ్యారు. ఆర్య వచ్చి 20 ఏళ్లు పూర్తైన సందర్భంగా హీరో బన్నీ ఎక్స్‌ వేదికగా ప్రత్యేక పోస్టును సైతం పెట్టాడు. 'నా జీవిత గమనాన్ని మార్చిన ఒక క్షణం.. ఎప్పటికీ కృతజ్ఞతతో ఉంటాను' అని బన్నీ పోస్టు పెట్టాడు.
    మే 07 , 2024
    ‘అల వైకుంఠపురంలో’ రీమేక్ ఎందుకు వర్కౌట్ కాలేదు..? డిజాస్టర్‌గా కార్తీక్ ఆర్యన్ ‘షెహ్‌జాదా’ 
    ‘అల వైకుంఠపురంలో’ రీమేక్ ఎందుకు వర్కౌట్ కాలేదు..? డిజాస్టర్‌గా కార్తీక్ ఆర్యన్ ‘షెహ్‌జాదా’ 
    సౌత్ సినిమాలను హిందీలోకి రీమేక్ చేసే సంప్రదాయం ఇటీవల బాగా పెరిగింది. ఈ నేపథ్యంలోనే 2020లో విడుదలైన ‘అల వైకుంఠపురంలో’ సినిమాను ‘షెహ్‌జాదా’గా రీమేక్ చేశారు. కార్తీక్ ఆర్యన్‌కి జంటగా కృతి సనన్ నటించింది. రోహిత్ ధవన్ డైరెక్షన్ వహించారు. అయితే, ఫిబ్రవరి 17న విడుదలైన ఈ సినిమా బీ టౌన్ ప్రేక్షకులను మెప్పించలేక పోయింది. ‘షెహ్‌జాదా’పై ఎన్నో ఆశలు పెట్టుకున్న చిత్రబృందానికి ప్రేక్షకులు గట్టి షాక్ ఇచ్చారు. అసలు ఈ సినిమా ఎందుకు ఆడలేదు? ‘అల వైకుంఠపురం’ సినిమాకి, ‘షెహ్‌జాదా’కి మధ్య ప్రధాన తేడా ఏంటో చూద్దాం.  స్టోరీ లైన్, అల్లు అర్జున్ నటన, తమన్ సంగీతం, స్టైలిష్ ఫైట్స్,డ్యాన్స్ కొరియోగ్రఫీ త్రివిక్రమ్ మార్క్ టేకింగ్.. ‘అల వైకుంఠపురం’ సినిమా భారీ విజయం సాధించడానికి ప్రధాన కారణాలు. ‘నాన్ బాహుబలి’ కేటగిరీలో అత్యధిక వసూళ్లను సాధించి ‘అల వైకుంఠపురంలో’ సినిమా రికార్డులు బ్రేక్ చేసింది. అంతటి విజయవంతమైన సినిమాను రీమేక్ చేయగా కనీస స్పందన రాకపోవడం నిజంగా ఆలోచించాల్సిన విషయమే. అయితే, ‘అల వైకుంఠపురంలో’ సినిమాతో పోలిస్తే ‘షెహ్‌జాదా’లో కొన్ని వ్యత్యాసాలు ఉన్నాయి. వీటి వల్ల మాతృక సినిమా కలిగించిన అనుభూతిని షెహ్‌జాదా కల్పించలేక పోయింది. స్టోరీ లైన్‌లో మార్పు.. ఒరిజినల్ సినిమాలో బంటు(అల్లు అర్జున్) వాల్మీకి(మురళీ కృష్ణ) కుమారుడిగా పెరుగుతాడు. వాల్మీకి భార్య(రోహిణి) పాత్ర ఇందులో కీలకం. తల్లిగా తన మాతృత్వాన్ని ప్రదర్శించింది. అయితే, ‘షెహ్‌జాదా’లో వాల్మీకి భార్య పాత్రని చంపేశారు. తద్వారా హీరోకి వాల్మీకి కుటుంబాన్ని వదిలించుకోవడానికి మార్గం సులువు చేశారు. ‘అల వైకుంఠపురంలో’ సినిమాలో పెంచిన తల్లికి ప్రాధాన్యమివ్వాలా? జన్మనిచ్చిన అమ్మ వైపు మొగ్గు చూపాలా? అనే విషయాన్ని బంటు విచక్షణకే వదిలేశారు. కానీ, షెహ్‌జాదాలో పెంచిన కుటుంబం నుంచి దూరం కావడానికి హీరోకు బలమైన కారణాన్ని సృష్టించారు. ఇలా పెంపుడు తల్లి పాత్రను తీసేయడం ప్రేక్షకులకు రుచించలేదు.  ‘అల వైకుంఠపురంలో’  రాజ్‌ మనోహర్(సుశాంత్)‌కి ప్రేయసిగా నందిని(నివేతా పెత్తురాజ్) పాత్రకి తగిన ప్రాధాన్యత ఉంటుంది. అమూల్య(పూజా హెగ్డే)ని పెళ్లి చేసుకోవడంలో రాజ్ పడే ఇబ్బందికి ఇదే ప్రధాన కారణం. ‘షెహ్‌జాదా’లో నందిని పాత్రని తీసేశారు. ‘అమూల్య’ని పెళ్లి చేసుకోవడంలో రాజ్ పాత్రకి అభ్యంతరం లేకుండా చేశారు. ఇది కూడా సినిమాకు మైనస్‌గా నిలిచింది. అంతేగాకకుండా ‘రాజ్ మనోహర్’ పాత్రలో చేసిన మార్పులు ప్రేక్షకులను మెప్పించలేదు. హీరో క్యారెక్టరైజేషన్.. అల వైకుంఠపురం సినిమాలో హీరో క్యారెక్టరైజేషన్ బాగా ఎలివేట్ అయింది. అమూల్య(పూజా హెగ్డే)ని చిక్కుల్లో నుంచి విడిపించే సమయంలో తన క్యారెక్టర్‌కు అనుగుణంగా ప్రవర్తిస్తాడు. విలన్లకు కొట్టి బుద్ధి చెబుతాడు. కానీ, ‘షెహ్‌జాదా’లో ఇదే లోపించింది. ఈ సీన్‌లో తన క్యారెక్టర్‌కి విరుద్ధంగా కార్తీక్ ఆర్యన్ ప్రవర్తిస్తాడు. తనదైన శైలిలో కాకుండా సావధానంగా నచ్చజెప్పే ప్రయత్నం చేశాడు. ఇదే కాస్త అసహజంగా అనిపించింది.  ఫైట్స్ కొరియోగ్రఫీ ఫైట్ సీన్‌లను రీక్రియేట్ చేయొచ్చు. కానీ, ఒక హీరో శైలిని రీక్రియేట్ చేయలేం. చెల్లెలి దుపట్టాను ఆకతాయిలు తీసుకెళ్లిన సమయంలో హీరో చేసే ఫైట్, తాతను రక్షించడంలో వచ్చే సీన్, క్లైమాక్స్ ఫైట్‌లు అల్లు అర్జున్‌ని దృష్టిలో పెట్టుకుని డిజైన్ చేసినవి. స్టైలిష్‌గా ఈ సీన్లు సాగుతుంటాయి. ‘షెహ్‌జాదా’లో కార్తీక్ ఆర్యన్ ఈ సీన్లలో విఫలమయ్యాడు. సీన్లను ఉన్నది ఉన్నట్లుగా కాపీ కొట్టినా, తన పర్ఫార్మెన్స్‌తో కార్తీక్ ఆర్యన్ కొత్తదనాన్ని తీసుకురాలేక పోయాడు.  పాత్రలు ‘అల వైకుంఠపురంలో’ కనిపించే ప్రతి పాత్రకు నిర్దిష్టమైన ప్రాధాన్యత ఉంటుంది. ‘షెహ్‌జాదా’లో ఇది లోపించింది. పైగా, బంటు సహోద్యోగుల పాత్రలు శేఖర్(నవదీప్), రవీందర్(రాహుల్ రామకృష్ణ), సునీల్ క్యారెక్టర్‌లు రీమేక్‌లో లేవు. బోర్డ్ రూమ్‌లో జరిగే సన్నివేశం లేదు. ఇలా మార్పులు చేయడంతో ఆ మజాని ప్రేక్షకులు ఆస్వాదించలేకపోయారు. విలన్ పాత్రల్లో కూడా సహజత్వం లోపించినట్లు అనిపించింది.  సంగీతం ‘అల వైకుంఠపురం’ సినిమాకు సంగీతం పెద్ద అసెట్‌గా నిలిచింది. పాటలు, నేపథ్య సంగీతం సినిమాను మరో స్థాయికి తీసుకెళ్లాయి. బుట్టబొమ్మ, రాములో రాములా, సామజ వరగమన, టైటిల్ సాంగ్, క్లైమాక్స్‌లో వచ్చే సిత్తరాల సిరపడు, డాడీ సాంగ్.. ఇలా ఆల్బమ్ సూపర్ హిట్ అయింది. షెహ్‌జాదాలో చెప్పుకోదగ్గ సంగీతం లేదు. ఒకటి రెండు మినహా మిగతావి చప్పగా సాగాయి. ఫలితంగా సంగీత ప్రియులకు నిరాశే మిగిల్చింది. ఓవరాల్‌గా ‘అల వైకుంఠపురం’ సినిమాతో పోలిస్తే ‘షెహ్‌జాదా’ ఎక్కడా పోటీ పడలేక పోయింది. ఫలితంగా ‘డిజాస్టర్’ టాక్‌ని మూటగట్టుకుంది.  అల్లు అర్జున్ మేనియా షెహ్‌జాదా సక్సెస్ సాధించకపోవడానికి అల్లు అర్జున్ మేనియా కూడా ఒక కారణమే. గతంతో పోలిస్తే దక్షిణాది సినిమాల పరిధి పెరిగింది. ‘అల వైకుంఠపురం’ సినిమా విషయంలోనూ ఇదే జరిగింది. ఈ సినిమా తర్వాత అల్లు అర్జున్ ‘పుష్ప’తో పాన్ ఇండియా స్థాయికి ఎదిగాడు. దీంతో బీ టౌన్ ప్రేక్షకులు బన్నీ మునపటి సినిమాలను వీక్షించారు. ఇది కూడా ‘షెహ్‌జాదా’కు మైనస్‌గా మారింది. రీమేక్‌లు వర్కౌట్ అవుతాయా? గతేడాది ఐదు దక్షిణాది సినిమాలు హిందీలో రీమేక్ అయ్యాయి. ఇందులో హృతిక్ రోషన్, సైఫ్ అలీఖాన్‌ల ‘విక్రమ్ వేధ’, అక్షయ్ కుమార్ ‘కట్‌పుట్లి’ సినిమాలు ఆశించిన మేర కలెక్షన్లు సాధించలేదు. ఇక జాన్వీ కపూర్ ‘మిలీ’, రాజ్‌కుమార్ ‘హిట్- ద ఫస్ట్ కేస్’, రాధిక ఆప్టే ‘ఫోరెన్సిక్’ సినిమాలు బోల్తా కొట్టాయి. తాజాగా ఈ లిస్టులోకి ‘షెహ్‌జాదా’ చేరింది. దీంతో రీమేక్ సినిమాలు వర్కౌట్ అవుతాయా అన్న సందేహం మొదలైంది. అయితే, అజయ్ దేవ్‌గన్ ‘దృశ్యం2’ మాత్రం ఘన విజయం సాధించింది. మళయాలంలో ఈ సినిమా థియేటర్లలో విడుదల కాకపోవడం, హిందీలోకి డబ్ కాకపోవడంతో అజయ్ దేవ్‌గన్ మూవీ హిట్ అయ్యింది. దక్షిణాది భాషల సినిమా పరిధి పెరిగింది. ఇక్కడి కథలు బాలీవుడ్ మాస్ ఆడియెన్స్‌ దృష్టిని ఆకర్షిస్తున్నాయి. ఓటీటీ ప్రభావం ఎక్కువగా ఉంది. ప్రాంతీయ భాషల్లో విడుదలైన సినిమాలకు సబ్‌టైటిల్స్ ఇస్తుండటంతో హిందీలోనూ వాటిని చూస్తున్నారు. దీంతో రీమేక్ సినిమాలపై ఆసక్తి కొరవడింది. అయితే, ప్రస్తుతం మరికొన్ని రీమేక్ సినిమాలు సెట్స్‌పై ఉన్నాయి. సల్మాన్ ఖాన్ ‘కిసీ కా భాయ్ కిసీ కి జాన్’(వీరం రీమేక్), అజయ్ దేవ్‌గన్ భోళా(లోకేష్ కనగరాజ్ ఖైదీ రీమేక్) ఫలితాలు ఎలా ఉండబోతున్నాయో వేచి చూడాలి. 
    ఫిబ్రవరి 23 , 2023
    <strong>Shraddha Arya: పండంటి కవలలకు జన్మనిచ్చిన తెలుగు హీరోయిన్‌.. ఆమెను గుర్తుపట్టారా?</strong>
    Shraddha Arya: పండంటి కవలలకు జన్మనిచ్చిన తెలుగు హీరోయిన్‌.. ఆమెను గుర్తుపట్టారా?
    తెలుగు సినిమాల్లో హీరోయిన్‌గా చేసిన శ్రద్ధా ఆర్య (Shraddha Arya) పండంటి కవలలకు జన్మనిచ్చింది. ఈ విషయాన్ని ఇన్‌స్టాగ్రామ్‌లో వీడియో పోస్టు చేసి మరి తెలియజేసింది.&nbsp; https://twitter.com/indiaforums/status/1863856572520362279 నవంబర్‌ 29న ఒక అమ్మాయి, అబ్బాయికి జన్మనిచ్చినట్లు శ్రద్ధా స్పష్టత ఇచ్చింది. దీంతో అభిమానులు, నెటిజన్లు ఆమెకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.&nbsp; 2021లో నేవీ అధికారి రాహుల్‌ నగల్‌ను శ్రద్ధా పెళ్లి చేసుకుంది. ఈ ఏడాది అక్టోబర్‌లో తాను కడుపుతో ఉన్నట్లు సోషల్‌ మీడియా వేదికగా తెలియజేసింది.&nbsp; శ్రద్ధా ఆర్య (Shraddha Arya) విషయాలకు వస్తే ఆమె 1987 ఆగస్టు 17న దేశ రాజధాని ఢిల్లీలో జన్మించింది. ముంబయి యూనివర్శిటీలో ఎకనామిక్స్‌లో మాస్టర్స్‌ చేసింది. సినిమాల్లోకి రాకముందు బుల్లితెరపై శ్రద్ధా ఆర్య మెరిసింది. జీ టీవీ (హిందీ)లో వచ్చిన 'ఇండియాస్‌ బెస్ట్‌ సినీ స్టార్స్‌ కి కోజ్‌' షోలో పాల్గొని రన్నరప్‌గా నిలిచింది.&nbsp; ప్రముఖ నటుడు ఎస్‌.జే.సూర్య హీరోగా చేసిన తమిళ చిత్రం 'కల్వనిన్‌ కాదలి' (2006) సినిమాతో హీరోయిన్‌గా తెరంగేట్రం చేసింది.&nbsp; ఆ తర్వాత రామ్‌ గోపాల్‌ వర్మ తెరకెక్కించిన 'నిశబ్ద్‌' (2007) సినిమాలో నటించింది. అందులో రీతు ఆనంద్‌ పాత్రలో కనిపించి ఆకట్టుకుంది. అదే ఏడాది 'గొడవ' (Godava) అనే చిత్రంతో తెలుగు ప్రేక్షకులకు శ్రద్ధా పరిచయమైంది. ఇందులో వైభవ్‌కు జోడీగా అంజలి పాత్రలో మెరిసింది.&nbsp; ఆ తర్వాత తెలుగులో ‘కోతి మూక’ (Kothi Muka), ‘రోమియో’ (Romeo) వంటి చిత్రాల్లో శ్రద్ధా నటించింది. అయితే అవేమి పెద్దగా సక్సెస్‌ కాకపోవడంతో టాలీవుడ్‌లో అవకాశాలు రాలేదు.&nbsp; దీంతో మళ్లీ బాలీవుడ్‌కు వెళ్లి పోయిన శ్రద్ధా.. అక్కడ షాహిద్‌ కపూర్‌తో కలిసి 'పాఠశాల' (2010) సినిమా చేసింది. అందులో నటాషా సింగ్‌ పాత్రలో తళుక్కుమంది.&nbsp; ఆ తర్వాత కన్నడలో అడుగుపెట్టిన ఆమె అక్కడ 'డబుల్‌ డెక్కర్‌', 'మదువే మానే' చిత్రాలు చేసింది. పంజాబిలో 'బంజారా' (2018) ఫిల్మ్‌లోనూ నటించింది. ఓ వైపు సినిమాలు చేస్తూనే సీరియల్స్‌లోనూ శ్రద్ధా ఆర్య నటించింది. 'ష్‌ష్‌ష్‌.. పిర్‌ కోయి హై' (2008) అనే హిందీ సీరియల్‌తో బుల్లితెర ప్రేక్షకులకు పరిచయమైంది.&nbsp; 'మెయిన్ లక్ష్మీ తేరే ఆంగన్ కీ', ‘డ్రీమ్‌ గర్ల్‌’, ‘కసమ్‌ తేరే ప్యార్‌ కి’, ‘కుండలి భాగ్య’ వంటి సీరియల్స్‌లో నటించి మరింత పాపులర్ అయ్యింది.&nbsp; సినిమాలు, సీరియల్స్‌తో పాటు పలు మ్యూజిక్ ఆల్బమ్స్ సైతం శ్రద్ధా ఆర్య చేసింది. జీనా, సోనియో హిరియే, మెరీ జాన్‌, పీకే, కార్ గబ్రూ ది తదితర 10 మ్యూజిక్‌ వీడియోలు చేసింది.&nbsp; శ్రద్ధా ఆర్య వ్యక్తిగత విషయాలకు వస్తే పెళ్లికి ముందు ఆమె ఇద్దరితో ప్రేమాయణం నడిపింది. 2015లో తొలుత ఎన్నారై జయంత్‌ రట్టితో నిశ్చితార్థం చేసుకుంది. అనివార్య కారణాలతో దాన్ని రద్దు చేసుకుంది.&nbsp; ఆ తర్వాత 2019లో అలం సింగ్‌ మక్కర్‌తో రిలేషన్‌ షిప్‌లో అడుగుపెట్టింది. వారిద్దరు ‘నాచ్‌ బలియే’ (Nach Baliye) అనే డ్యాన్స్‌ షోలో కపుల్స్‌గా పోటీ చేశారు. షో పూర్తయ్యే సరికి వారి బంధం కూడా ముగిసింది.&nbsp; ప్రస్తుతం సినిమాలు, సీరియల్స్‌, టెలివిజన్ షోలకు దూరంగా ఉంటూ ఫ్యామిలీ లైఫ్‌ను శ్రద్ధా ఎంజాయ్‌ చేస్తోంది. ఇన్‌స్టాగ్రామ్‌లో తరుచూ ఫొటోలు పెడుతూ ఫ్యాన్స్‌కు టచ్‌లో ఉంటోంది.&nbsp;
    డిసెంబర్ 03 , 2024
    Saindhav Movie Review: యాక్షన్‌ సీక్వెన్స్‌లో వెంకీ మామ ఉగ్రరూపం.. ‘సైంధవ్‌’ హిట్టా? ఫట్టా?
    Saindhav Movie Review: యాక్షన్‌ సీక్వెన్స్‌లో వెంకీ మామ ఉగ్రరూపం.. ‘సైంధవ్‌’ హిట్టా? ఫట్టా?
    నటీనటులు: వెంకటేష్‌, శ్రద్ద శ్రీనాథ్‌, నవాజుద్దీన్‌ సిద్ధిఖీ, ఆర్య, రుహానీ శర్మ, ఆండ్రియా జెర్మియా, బేబీ సారా తదితరులు దర్శకత్వం: శైలేష్‌ కొలను సంగీతం: సంతోష్‌ నారాయణ్‌ నిర్మాణ సంస్థ: నిహారిక ఎంటర్‌టైన్మెంట్స్‌ బ్యానర్‌ నిర్మాత: వెంకట్‌ బోయినపల్లి శైలేష్‌ కొలను (Sailesh Kolanu) దర్శకత్వంలో విక్ట‌రీ వెంకటేశ్(Venkatesh) హీరోగా నటించిన చిత్రం ‘సైంధవ్‌’. వెంకటేష్‌ కెరీర్‌లో ఇది 75వ సినిమా (Saindhav Movie Review). బాలీవుడ్‌ నటుడు నవాజుద్దీన్ సిద్దిఖీ, తమిళ్ నటుడు ఆర్య, బేబీ సారా ఇందులో కీలక పాత్రలు పోషించారు. శ్రద్ధ శ్రీనాథ్‌ వెంకటేష్‌కు జోడీగా నటించింది. ఇప్పటికే టీజర్, ట్రైలర్స్, సాంగ్స్ సినిమాపై అంచనాలు పెంచేశాయి. కాగా, ఈ చిత్రం సంక్రాంతి కానుకగా ఇవాళ (జనవరి 13న) విడుదలైంది. మరి సినిమా ఎలా ఉంది? ప్రేక్షకులను మెప్పించిందా? వెంకటేష్‌ ఖాతాలో మరో హిట్‌ చేరినట్లేనా? ఇప్పుడు చూద్దాం. కథ సైంధవ్‌ (Venkatesh) తన పాపతో(బేబీ సారా) కలిసి చంద్రప్రస్థ అనే ఓ ఊరిలో జీవిస్తుంటాడు. ఓ రోజు పాప కళ్లు తిరిగిపడిపోవడంతో ఆస్పత్రికి తీసుకెళ్తారు. పాప ప్రాణాంతక జబ్బుతో బాధపడుతుందని తెలుస్తుంది. అదే సమయంలో చంద్రప్రస్థలో టెర్రరిస్టు క్యాంప్‌ నడుస్తుంటుంది. సైంధవ్‌ ఉగ్రవాద చర్యలకు అడ్డుతగులుతాడు. అసలు ఉగ్రవాదులకు సైంధవ్‌కు ఏంటి సంబంధం? గతంలో ఏం చేశాడు? పాపని ఎలా బతికించుకుంటాడు? వికాస్ మాలిక్ (నవాజుద్దీన్ సిద్దికీ), ఆర్య పాత్రల ప్రాధాన్యత ఏంటి? అన్నది మిగతా కథ. ఎవరెలా చేశారంటే సైంధవ్‌ పాత్రలో వెంకటేష్ (Saindhav Movie Review) అద్భుత నటన కనబరిచాడు. ఎమోషన్, యాక్షన్‌ సన్నివేశాల్లో తన మార్క్‌ నటన కనబరిచి మెప్పించాడు. ముఖ్యంగా యాక్షన్ సీక్వెన్స్‌లలో వెంకీ తన విశ్వరూపం చూపించాడు. సైంధవ్‌, పాపకు దగ్గరయ్యే పాత్రలో శ్రద్ధ శ్రీనాథ్‌ (Shraddha Srinath) ఆకట్టుకుంది. ఇక బాలీవుడ్ నటుడు నవాజుద్దీన్‌ సిద్ది (Nawazuddin Siddiqui)కి విలన్‌ పాత్రలో అదరగొట్టాడు. అతని అసిస్టెంట్‌గా, లేడీ విలన్‌గా ఆండ్రియా కూడా మెప్పిస్తుంది. తమిళ నటుడు ఆర్య పర్వాలేదనిపిస్తాడు. శ్రద్ద శ్రీనాధ్ మాజీ భర్త పాత్రలో గెటప్ శ్రీను సీరియస్‌గా కనిపించినా కామెడీని పండిస్తాడు. ఎలా సాగిందంటే&nbsp; గతాన్ని వదిలేసి దూరంగా బతుకుతున్న హీరోకి ఓ సమస్య వస్తే మళ్ళీ ఆ గతంలోని మనుషులు రావడం అనేది చాలా సినిమాల్లో చూశాము. సైంధవ్‌ సినిమా కథ (Saindhav Movie Review in Telugu) కూడా ఇంచుమించు ‌అలాంటిదే.&nbsp; ఫస్ట్ హాఫ్ అంతా సైంధవ్‌, తన కూతురు మధ్య ప్రేమ, పాపకు జబ్బు ఉందని తెలియడం, కంటైనర్లు గురించి గొడవ, సైంధవ్‌ మళ్ళీ తిరిగొచ్చాడు అంటూ సాగుతుంది. ఇక సెకండ్ హాఫ్ లో విలన్ సైంధవ్‌ కి పెట్టే ఇబ్బందులు, వాటిని తట్టుకొని సైంధవ్‌ ఎలా నిలబడ్డాడు అని ఫుల్ యాక్షన్ మోడ్ లో సాగుతుంది. చివరి ఇరవై నిమిషాలు ఓ పక్క పిల్లల ఎమోషన్ చూపిస్తూనే మరో పక్క స్టైలిష్ యాక్షన్ సీన్స్ సాగుతాయి. డైరెక్షన్ ఎలా ఉందంటే దర్శకుడు శైలేష్‌ కొలను(Sailesh Kolanu) చాలా రొటిన్‌ కథను తీసుకున్నారు. 'సైంధవ్‌' సినిమా చూస్తున్నంత సేపు ఎక్కడో&nbsp; చూసిన భావన కలుగుతుంది. కమల్‌హాసన్‌ 'విక్రమ్‌', రజనీకాంత్‌ 'జైలర్‌' సినిమాను మళ్లీ చూస్తున్న ఫీలింగ్‌ వస్తుంది. కథ, కథనం కంటే కూడా వెంకటేష్, నవాజుద్దీన్ క్యారెక్టర్లపైనే డైరెక్టర్‌ ఎక్కువగా దృష్టి పెట్టినట్లు కనిపిస్తుంది. ఆర్య, ముఖేష్‌ రుషి, రుహానీ శర్మ వంటి స్టార్‌ నటులు ఉన్నప్పటికీ ప్రతి ఒక్కరిదీ రొటిన్‌ పాత్రలాగే తీర్దిదిద్దారు డైరెక్టర్‌. సన్నివేశాల మధ్య కనెక్షన్‌ ఉండదు. దీని వల్ల ప్రేక్షకులు కథతో ప్రయాణం చేయడంలో ఇబ్బంది ఎదురువుతుంది.. అయితే యాక్షన్‌ సన్నివేశాల్లో మాత్రం శైలేష్‌ తన మార్క్‌ను చూపించాడు. వెంకీ మామ చేత విశ్వరూపాన్ని చూపించేశారు. ఓవరాల్‌గా యాక్షన్‌ ప్రియులను ఈ సినిమా ఆకట్టుకుంటుంది. కథ, లాజిక్‌ పక్కన పెడితే సైంధవ్‌ మెప్పిస్తాడు. సాంకేతికంగా టెక్నికల్‌ అంశాల విషయానికి వస్తే.. సంతోష్ నారాయణ్‌ ఇచ్చిన బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ బాగుంది. ఎమోషనల్ సన్నివేశాల్లో, బుజ్జికొండవే సాంగ్‌లో మ్యూజిక్ మనసుకి హత్తుకుంటుంది. మిగిలిన పాటలు మాత్రం పర్వాలేదనిపిస్తాయి. మణికందన్ సినిమాటోగ్రఫీ చాలా స్టైలిష్‌గా అనిపించింది. వెంకీ మామని చాలా స్టైలిష్‌గా చూపించారు. చంద్రప్రస్థ అనే ఊరిని, సముద్రం లొకేషన్స్, పోర్ట్.. అన్నిటిని చాలా చక్కగా చూపించారు. నిర్మాణ విలువలు ఉన్నతంగా ఉన్నాయి. ప్లస్‌ పాయింట్స్‌ వెంకటేష్‌ నటనభావోద్వేగ సన్నివేశాలుసంగీతం మైనస్‌ పాయింట్స్‌ కొత్తదనం లేని కథలాజిక్‌కు అందని సీన్స్‌ రేటింగ్‌: 3/5
    జనవరి 13 , 2024
    Spy Movie Review: నిఖిల్ ‘స్పై’ మూవీ ఎలా ఉందంటే? ఈసారి ఆ ఫార్మూలా బెడిసికొట్టిందా?
    Spy Movie Review: నిఖిల్ ‘స్పై’ మూవీ ఎలా ఉందంటే? ఈసారి ఆ ఫార్మూలా బెడిసికొట్టిందా?
    సినిమా- స్పై తారాగణం: నిఖిల్ సిద్ధార్థ్, ఐశ్వర్య మీనన్, జిషుసేన్ గుప్తా,  ఆర్యన్ రాజేష్, అభినవ్ గోమఠం నిర్మాణ సంస్థ: ఈడీ ఎంటర్‌టైన్‌మెంట్స్ డైరెక్టర్: గ్యారీ బీహెచ్ మ్యూజిక్: విశాల్ చంద్రశేఖర్ &amp; శ్రీచరణ్ పాకాల సినిమాటోగ్రఫీ: వంశీ పచ్చిపులుసు, మార్క్ డేవిడ్ ఎడిటర్: గ్యారీ బీహెచ్ యంగ్ హీరో నిఖిల్ సిద్ధార్థ్ నటించిన యాక్షన్ థ్రిల్లర్ మూవీ 'స్పై' ఈరోజు ప్రపంచవ్యాప్తంగా విడుదలైంది. కార్తికేయ సిరీస్‌తో పాన్‌ ఇండియా హీరోగా ఎదిగిన నిఖిల్‌ భిన్నమైన కథలను ఎంచుకుంటూ హిట్స్ సాధిస్తున్నాడు. దైవ భక్తి నేపథ్యంతో వచ్చిన కార్తికేయ సిరీస్ 1,2 మంచి హిట్ సాధించాయి. ఈసారి దేశ భక్తి కాన్సెప్ట్‌తో వచ్చిన 'స్పై'  విడుదలకు ముందే ప్రేక్షకుల మధ్య మంచి బజ్ క్రియేట్ చేసింది. మరి ప్రేక్షకుల అంచనాలను స్పై అందుకుందా? నిఖిల్ ఖాతాలో మరో హిట్ పడిందా? సినిమా ఎలా ఉందో ఓసారి సమీక్షిద్దాం. కథ:  జై(నిఖిల్) రా ఏజెంట్. విదేశాల్లో సీక్రెట్ ఆపరేషన్స్ నిర్వహిస్తుంటాడు. ఈ క్రమంలో ఓ మిషిన్‌లో పనిచేస్తూ 'రా' ఎజెంట్ అయిన సుభాష్ వర్ధన్( ఆర్యన్ రాజేష్) చనిపోతాడు. అతని చావుకు కారణం తెలుసుకోవాలని 'రా' చీఫ్ శాస్త్రి( మకరంద్ పాండే) ఆ కేసు ఫైల్స్  జైకి అప్పగిస్తారు. ఈ మిషన్‌లో భాగంగా అనుహ్యంగా  దేశభక్తుడైన సుభాష్ చంద్రబోస్ డెత్ మిస్టరీ ఫైల్స్ గురించి జైకి తెలుస్తుంది. అసలు  ఓ ఉగ్రవాది దగ్గర నేతాజీ ఫైల్స్ ఎందుకున్నాయి? నేతాజీ డెత్ మిస్టరీ చివరకు జై ఛేదించాడా? అన్న అంశాలు తెలియాలంటే సిల్వర్ స్క్రీన్‌పై చూడాల్సిందే. ఎలా ఉందంటే? స్పై మూవీ గతంలో తెలుగులో వచ్చిన గూఢచారి సినిమాలనే పోలి ఉంది. ఓ రా చీఫ్.. హీరో అయిన రా ఏజెంట్‌కు సిక్రెట్ మిషిన్ అప్పగిస్తాడు. అతడు చివరికి మిషిన్ పూర్తి చేసి విలన్ చంపే కామన్ పాయింట్‌ను స్పై చిత్రం కూడా ఫాలో అయింది. గతంలో సూపర్ స్టార్ కృష్ణ నటించి గూఢాచారి 116 నుంచి అడవి శేషు నటించిన గూఢచారి వరకు ఇదే ఫార్మూలలో వచ్చి హిట్ సాధించాయి. స్పై మూవీ సైతం ఇదే తరహాలో ఉండటంతో సినిమా చూస్తున్నంతసేపు కొత్తదనం అనిపించదు. ఫస్టాప్‌లో నిఖిల్, హీరోయిన్ వైష్ణవి లవ్ స్టోరీ, జోర్డాన్‌లో ఆయుధాల స్మగ్లింగ్ వంటి సీన్లు ఉంటాయి. నేతాజీ రిలేటెడ్ సీన్స్ బాగున్నాయి. కోర్ పాయింట్స్ ఉన్నా సీన్లకు హైప్ తీసుకురాలేదు.  అయితే ఫస్టాఫ్‌లో ఓ మంచి సీన్‌తో ఇంటర్వెల్ బ్యాంగ్ పడుతుంది. సెకండాఫ్‌ విషయానికొస్తే... ఏజెంట్ జై టీమ్‌కి నేతాజీ సుభాష్ చంద్రబోస్ డెత్ మిస్టరీ ఫైల్స్‌ గురించి తెలుస్తుంది. దాని ఆధారంగా చేసుకుని సెకండాఫ్ సాగుతుంది. సినిమాలో దేశభక్తి కోటింగ్ తప్ప.. ఆ కోర్ పాయింట్‌కు తగ్గ సీన్లు మాత్రం పడలేదు. రెగ్యులర్ స్పై మూవీలాగే కనిపిస్తుంది. కొన్ని ఓవర్ ఎలివేటెడ్‌గా అనిపిస్తాయి. యాక్షన్ సీన్లు అంతగా పండలేదు. ఎవరెలా చేశారంటే? రా ఏజెంట్‌గా నిఖిల్ సిద్ధార్జ్ బాగా సూట్ అయ్యాడు.  గతంలో చేసిన క్యారెక్టర్స్ మాదిరి ఉండటంతో చాలా ఈజీగా చేసుకుంటూ వెళ్లిపోయాడు. హీరోయిన్‌గా ఐశ్వర్య మేనన్.. ఏజెంట్ వైష్ణవి పాత్రలో పర్వాలేదనిపించింది. అభినవ్ గోమఠం.. కామెడీని పండించాడు. అతనితో యాక్షన్ సీన్ల కంటే కామెడీ సీన్లే ఎక్కువ ఉంటాయి. రానా దగ్గుపాటి కొద్దిసేపు కనిపించి అలరిస్తాడు. మిగతా క్యారెక్టర్లు పోసాని కృష్ణమురళి, ఆర్యన్ రాజేశ్, సచిన్ ఖేడ్కర్, సురేశ్, ఆర్యన్ రాజేష్ తమ పాత్రల పరిధిమేరకు నటించారు. టెక్నికల్‌గా.. స్పై సినిమా నిర్మాణ విలువలు బాగున్నాయి. టెక్నికల్ పరంగా చాలా రిచ్‌గా ఉంది. విజువల్స్ మెపిస్తాయి. యాక్షన్ సీన్లు ఇంకొంచెం బాగా తీస్తే బాగుండు అనే ఫీలింగ్ కలుగుతుంది. సినిమాలో బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ బాగున్నప్పటికీ.. సాంగ్స్ మెప్పించవు. విశాల్ చంద్ర శేఖర్ ట్యూన్స్ విషయంలో ఇంకాస్తా శ్రద్ధ తీసుకుంటే బాగుండేది. సినిమాటోగ్రఫీ ఓకే.&nbsp; గ్రాఫిక్స్ సీన్స్ మెప్పించవు. కొన్ని చోట్లు తేలిపోయాయి.యాక్షన్ కొరియోగ్రఫీ బాగుంది కానీ ఇంకా బెటర్ గా చేసి ఉండాల్సింది. స్వతహాగా ఎడిటర్ అయిన డైరెక్టర్ గ్యారీ బీహెచ్ తన కత్తెరకు పనిచెప్పడంలో పనిచెప్పలేకపోయాడు. ఫస్టాఫ్‌లో కొన్ని సీన్లు ల్యాగ్ అనిపిస్తాయి.&nbsp; చివరగా: ఓవరాల్‌గా గూఢచారి టెంప్లెట్‌లో సినిమా కావాలనుకునే వారికి 'స్పై' వినోదాన్ని అయితే పంచుతుంది. రేటింగ్: 2.25/5
    జూన్ 29 , 2023
    <strong>Rewind 2024: ఈ ఏడాది ఆడ పిల్లలకు జన్మనిచ్చిన స్టార్‌ హీరోయిన్స్‌ వీరే..</strong>
    Rewind 2024: ఈ ఏడాది ఆడ పిల్లలకు జన్మనిచ్చిన స్టార్‌ హీరోయిన్స్‌ వీరే..
    తల్లి కావాలని పెళ్లైన ప్రతీ మహిళ కోరుకుంటుంది. అమ్మదనంలోని కమ్మదానాన్ని అస్వాదించేందుకు వారు ఉవ్విళ్లురుతుంటారు. ఇందుకు స్టార్‌ హీరోయిన్స్ సైతం అతీతమేమి కాదు. ఈ క్రమంలోనే ఏటా చాలా మంది సెలబ్రిటీలు (Celebrity mothers 2024) పండంటి బిడ్డలకు జన్మనిస్తుంటారు. 2024లోనూ పలువురు స్టార్‌ హీరోయిన్స్‌ అమ్మదనంలోకి అడుగుపెట్టారు. తద్వార తమ జీవితంలో కొత్త అధ్యాయానికి శ్రీకారం చుట్టారు. అటు హీరోలు సైతం తండ్రులుగా మారి వార్తల్లో నిలిచారు. తల్లి లేదా తండ్రిగా ప్రమోషన్‌ పొందిన ఆ సెలబ్రిటీలపై ఓ లుక్కేయండి.&nbsp; రాధిక ఆప్టే (Radhika Apte) ప్రముఖ బాలీవుడ్‌ నటి రాధిక ఆప్టే ఈ డిసెంబర్‌ నెలలోనే మాతృత్వంలోకి (Celebrity mothers 2024) అడుగుపెట్టింది. ఓ ఆడ శిశువుకు జన్మనిచ్చింది. ఈ విషయాన్ని రాధిక స్వయంగా సోషల్‌ మీడియాలో ప్రకటించింది.  శ్రద్ధా ఆర్య (Shraddha Arya) తెలుగు హీరోయిన్‌ శ్రద్దా ఆర్య నవంబర్‌ 29న పండంటి కవలలకు జన్మనిచ్చింది. ఈ విషయాన్ని ఇన్‌స్టాగ్రామ్‌లో వీడియో పోస్టు చేసి మరి ఆమె తెలియజేసింది.  దీపికా పదుకొనే (Deepika Padukone) బాలీవుడ్‌ హీరోయిన్‌ దీపికా పదుకొనే ఈ ఏడాదే తొలిసారి తల్లిగా ప్రమోషన్‌ సంపాదించింది. రణవీర్ సింగ్, దీపికా పదుకొణె జంట సెప్టెంబర్‌లో ఆడ శిశువుకు జన్మనిచ్చింది. తమ పాపకు దువా అని పేరు పెట్టింది. ప్రణీత (Actress Praneetha) ప్రముఖ నటి ప్రణీత ఈ ఏడాది సెప్టెంబర్‌లో (Celebrity mothers 2024) మగబిడ్డకు జన్మనిచ్చింది. తొలిగా 2022లో ఆమె ఆడపిల్లకు జన్మనిచ్చిన సంగతి తెలిసిందే. యామి గౌతమ్‌ (Yami Gautam) బాలీవుడ్‌ నటి యామి గౌతమ్‌ ఈ ఏడాది మేలో మగబిడ్డకు జన్మనిచ్చింది. యామి - ఆదిత్య ధర్‌ దంపతులకు వేదవిద్‌ అనే బాబు పుట్టాడు. ఈ విషయాన్ని సోషల్‌ మీడియా వేదికగా యామి ప్రకటించింది.  అమలా పాల్‌ (Amala Paul) తమిళ స్టార్ నటి అమలాపాల్‌ (Celebrity mothers 2024) తెలుగు ప్రేక్షకుల్లోనూ మంచి గుర్తింపు సంపాదించింది. అమలాపాల్‌ - జగత్‌ దేశాయ్‌ దంపతులు జూన్‌లో ఓ మగ బిడ్డకు జన్మనిచ్చారు. అనుష్క శర్మ (Anushka Sharma) బాలీవుడ్‌ బ్యూటీ అనుష్క శర్మ ఈ ఏడాది రెండో బిడ్డకు జన్మనిచ్చింది. విరాట్‌ -  అనుష్క జంటకు ఫిబ్రవరి 15న బాబు పుట్టాడు. అతడికి అకాయ్‌ అని ఈ జంట నామకరణం చేసింది.  సుహాస్‌ (Suhas) టాలీవుడ్‌ యంగ్‌ హీరో సుహాస్‌ కూడా ఈ ఏడాదే తండ్రయ్యాడు. అతడి భార్య లలిత జనవరిలో మగబిడ్డకు జన్మనిచ్చింది.  నిఖిల్‌ సిద్దార్థ్‌&nbsp; (Nikhil Siddharth) టాలీవుడ్‌ హీరో నిఖిల్‌ సిద్దార్థ్‌ ఈ ఏడాదే తండ్రిగా ప్రమోషన్ పొందాడు. అతడి భార్య పల్లవి వర్మ ఫిబ్రవరి 21న మగబిడ్డకు జన్మనిచ్చింది.  మంచు మనోజ్‌ (Manchu Manoj) నటుడు మంచు మనోజ్‌ ఈ ఏడాది ఏప్రిల్‌లో తండ్రయ్యాడు. ఆయన రెండో భార్య మౌనికా రెడ్డి పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చింది. పాపకు దేవసేన శోభాగా నామకరణం చేశారు. నితిన్‌ (Nithiin) టాలీవుడ్‌ టాలెంటెడ్‌ హీరో నితీన్‌ ఈ ఏడాదే కొత్తగా తండ్రయ్యాడు. వినాయక చవితికి ఒక రోజు ముందు ఆయన భార్య షాలిని పండంటి మగబిడ్డకు జన్మనిచ్చింది. 
    డిసెంబర్ 24 , 2024
    <strong>Allu Arjun vs Sukumar: సుకుమార్‌తో విభేదాలు.. చెప్పాపెట్టకుండా వెళ్లిపోయిన బన్నీ?</strong>
    Allu Arjun vs Sukumar: సుకుమార్‌తో విభేదాలు.. చెప్పాపెట్టకుండా వెళ్లిపోయిన బన్నీ?
    ఐకాన్‌ స్టార్‌ అల్లు అర్జున్‌ (Allu Arjun), డైరెక్టర్‌ సుకుమార్‌ (Sukumar)కు ఇండస్ట్రీలో మంచి బాండింగ్‌ ఉంది. అది పలు సందర్భాల్లో నిరూపితమైంది కూడా. బన్నీ-సుకుమార్‌ కాంబోలో ఇప్పటికే మూడు చిత్రాలు (ఆర్య, ఆర్య 2, పుష్ప) రాగా అందులో రెండు బ్లాక్‌ బాస్టర్‌ విజయాలను అందుకున్నాయి. ప్రస్తుతం వీరిద్దరు కాంబోలో 'పుష్ప 2' తెరకెక్కుతోంది. కొన్ని రోజుల క్రితం వరకూ ఈ మూవీ షూటింగ్‌ శరవేగంగా సాగింది. అయితే అనూహ్యంగా ఈ మూవీ షూటింగ్‌కు బ్రేకులు పడ్డాయి. దీనికి కారణం సుకుమార్‌, అల్లు అర్జున్‌ మధ్య తలెత్తిన వివాదాలేనని ఇండస్ట్రీలో టాక్‌ వినిపిస్తోంది. దీనికి తోడు బన్నీ షూటింగ్‌ను పక్కకు పెట్టి విహారయాత్రకు వెళ్లడం ఈ అనుమానాలకు బలాన్ని చేకూరుస్తోంది.&nbsp; సుకుమార్‌ - బన్నీ మధ్య కోల్డ్‌వార్‌? 'పుష్ప: ది రూల్' షూటింగ్ విషయంలో అల్లు అర్జున్, క్రియేటివ్ జీనియస్ సుకుమార్ మధ్య కోల్డ్ వార్ జరుగుతున్నట్లు ఇండస్ట్రీలో ప్రచారం జరుగుతోంది. వాస్తవానికి ఈ చిత్రాన్ని ఆగస్టు 15న రిలీజ్‌ చేయాలని మేకర్స్‌ భావించారు. తీరా షూటింగ్‌కు మరింత సమయం పట్టే అవకాశముందని తెలిసి వాయిదా వేశారు. అయితే సినిమా వాయిదా వేసినప్పటికీ షూటింగ్‌ సక్రమంగా జరగడం లేదని బన్నీ గుర్రుగా ఉన్నారట. తను పూర్తిగా సహకరిస్తున్నా సుకుమార్‌ సరిగ్గా వినియోగించుకోవడం లేదని భావిస్తున్నారట. ఈ క్రమంలోనే షూటింగ్‌ను నిలిపేసి సుకుమార్‌ అమెరికాకు వెళ్లడంపై బన్నీలో మరింత అసంతృప్తి కారణమైందని ఫిల్మ్‌ వర్గాల్లో చర్చ జరుగుతోంది. గడ్డం తీసేసిన బన్నీ సుకుమార్ శైలి నచ్చని అల్లు అర్జున్ ఫ్యామిలీతో హాలిడేకి వెళ్లారని తెలుస్తోంది. అతడు యూరప్ వెళ్లారని టాక్ వినిపిస్తోంది. ఫ్లైట్ జర్నీ సమయంలో ఆయన్ను కొందరు వీడియో తీశారు. ఇప్పుడు ఆ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. ఈ వీడియోలో బన్నీ గడ్డం ట్రిమ్‌ చేసి కనిపించారు. వాస్తవానికి పుష్ప గాడు అంటే ఆ గడ్డం లుక్కే మెయిన్‌. గడ్డం మీద చేయి వేసి తగ్గేదేలే అని బన్నీ చెప్పిన డైలాగ్‌ దేశవ్యాప్తంగా అందరి దృష్టిని ఆకర్షించింది. దీనిపై భారీ ఎత్తున రీల్స్‌ సైతం అప్పట్లో వచ్చాయి. అటువంటిది గడ్డాన్ని బన్నీ ట్రిమ్‌ చేసి పర్యటనకు వెళ్లడం ఇండస్ట్రీలో హాట్‌ టాపిక్‌గా మారింది. సుకుమార్‌తో ఉన్న విభేదాల వల్లే బన్నీ షూటింగ్‌కు దూరం అయ్యారా? అన్న ప్రశ్న నెట్టింట వినిపిస్తోంది.&nbsp; https://twitter.com/i/status/1813405877908726058 'పుష్ప 2' మళ్లీ వాయిదా? డైరెక్టర్‌ సుకుమార్‌, అల్లు అర్జున్‌ ఇద్దరు విదేశీ పర్యటనకు వెళ్లడంతో ప్రస్తుతం 'పుష్ప 2' అటకెక్కింది. ఇంకా చాలా సన్నివేశాలు పెండింగ్‌లో ఉన్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలో ఇరువురు లేకపోవడం 'పుష్ప 2' రిలీజ్‌పై ప్రభావం చూపుతుందని సినీ విశ్లేషకులు అంటున్నారు. ఇప్పటికే రిలీజ్ డేట్‌ను ఆగస్టు 15 నుంచి డిసెంబర్‌ 6కు మార్చారు. తాజా పరిణామాల నేపథ్యంలో డిసెంబర్‌లోనైనా పుష్ప గాడిని చూస్తామా? అన్న ప్రశ్న ఆడియన్స్‌లో తలెత్తుతోంది. ప్రస్తుతం బన్నీ గడ్డాన్ని ట్రిమ్ చేసి యూరప్‌ వెళ్లారు. పుష్ప పాత్రకు తగ్గట్లు గడ్డం పెంచాలంటే కనీసం నెల రోజుల సమయం పడుతుంది. అంటే ఒక నెల రోజుల సమయం వృథా అయినట్లేనని ఫిల్మ్‌ వర్గాలు విశ్లేషిస్తున్నాయి.&nbsp; ‘పుష్ప 2’కి విలన్ కష్టాలు! మలయాళ స్టార్‌ ఫహాద్‌ ఫాజిల్‌ (Fahadh Faasil) 'పుష్ప 2'లో విలన్‌ పాత్ర పోషిస్తున్నారు. షూటింగ్ ఆలస్యం కారణంగా ఫహద్ కూడా కొంత నిరాశలో ఉన్నట్లు పరిశ్రమ వర్గాల టాక్. పైగా ఫహద్ చేతిలో 6,7 పెద్ద సినిమాలే ఉన్నాయి. దాంతో అతడు అడిగినన్ని కాల్ షీట్లు ఇచ్చేలా కనిపించడం లేదు. దాంతో అతడు ఇచ్చిన డేట్స్‌లోనే షూట్ ఫినిష్ చేయాల్సిన పరిస్థితి కనిపిస్తోంది. అదీకాక కాంబోలో ఉన్న ఆర్టిస్టులు అందరూ పెద్దవారే కావడం డైరెక్టర్‌ సుకుమార్‌కు పెద్ద సమస్యగా మారింది. ఇన్ని సమస్యలను సుకుమార్ ఎలా హ్యాండిల్ చేస్తారన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.&nbsp; నో చెప్పిన జాన్వీ కపూర్‌ పుష్ప 2లో ఐటెం సాంగ్ ఏ నటి చేస్తారన్న ప్రశ్న ఇప్పటికీ వెంటాడుతోంది. కొన్ని రోజుల క్రితం యానిమల్‌ బ్యూటీ తిప్తి దిమ్రీ పేరు వినిపించింది. ఆమెను చిత్ర యూనిట్‌ సంప్రదించగా ఐటెం సాంగ్ చేసేందుకు ఓకే చెప్పినట్లు రూమర్లు కూడా వచ్చాయి. అయితే తాజాగా ఆమెను కాకుండా జాన్వీ కపూర్‌ను ఐటెం సాంగ్‌ కోసం పరిశీలిస్తున్నట్లు తెలిసింది. ఈ విషయమై ఆమెను సంప్రదించినట్లు కూడా తెలుస్తోంది. అయితే ఎన్టీఆర్‌, రామ్‌చరణ్‌ వంటి స్టార్‌ హీరోలతో నటిస్తుండటంతో ఐటెం సాంగ్‌ చేసేందుకు జాన్వీ నో చెప్పినట్లు సమాచారం. ఇలాంటి సాంగ్స్‌ చేస్తే తన ఇమేజ్‌కు డ్యామేజ్‌ కలుగుతుందని ఆమె భావిస్తున్నట్లు తెలిసింది.&nbsp;
    జూలై 17 , 2024
    కాజల్ అగర్వాల్ గురించి ఈ ఇంట్రెస్టింగ్ విషయాలు తెలుసా?
    కాజల్ అగర్వాల్ గురించి ఈ ఇంట్రెస్టింగ్ విషయాలు తెలుసా?
    కాజల్ అగర్వాల్ దశాబ్దకాలం పాటు తెలుగులో స్టార్ హీరోయిన్‌గా వెలుగొందింది. తెలుగులో లక్ష్మీ కళ్యాణం(2007) చిత్రం ద్వారా వెండితెరకు పరిచయమైన ఈ ముంబై అందం... రాజమౌళి డైరెక్షన్‌లో వచ్చిన మగధీర చిత్రం ద్వారా గుర్తింపు పొందింది. ఈ సినిమా ఆమెకు టాలీవుడ్‌లో మంచి బ్రేక్ ఇచ్చింది. ఆ తర్వాత ఆర్య2, డార్లింగ్, బృందావనం, మిస్టర్ పర్ఫెక్ట్, బిజినెస్ మాన్, ఖైదీ 150, నేనేరాజు నేనే మంత్రి వంటి హిట్ చిత్రాల్లో నటించింది. టాలీవుడ్‌లో దాదాపు అందరు స్టార్ హీరోలతో ఈమె నటించింది. పెళ్లి చేసుకుని కొద్దికాలం సినిమాలకు విరామం ఇచ్చి తిరిగి మళ్లీ భగవంత్ కేసరి చిత్రం ద్వారా కమ్‌బ్యాక్ ఇచ్చింది. ఆమె సహజ నటనతో ప్రేక్షకుల హృదయాల్లో స్థానం సంపాదించుకున్న కాజల్ అగర్వాల్ గురించి కొన్ని(Some Lesser Known Facts About Kajal Aggarwal) ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ మీకోసం కాజల్ అగర్వాల్ ఎవరు? కాజల్ అగర్వాల్ భారతీయ నటి. తెలుగు, తమిళ్, కన్నడ, హిందీ భాషల్లో నటించి స్టార్ హీరోయిన్‌గా ఎదిగింది. కాజల్ అగర్వాల్ దేనికి ఫేమస్? కాజల్ అగర్వాల్ మగధీర, ఖైదీ150, బిజినెస్‌మ్యాన్ వంటి సూపర్ హిట్ చిత్రాల్లో హీరోయిన్‌గా నటించి గుర్తింపు పొందింది. కాజల్ అగర్వాల్&nbsp; వయస్సు ఎంత? కాజల్ అగర్వాల్&nbsp; 1985 జూన్ 19న జన్మించింది. ఆమె వయస్సు&nbsp; 38 సంవత్సరాలు&nbsp; కాజల్ అగర్వాల్&nbsp; మందన్న ముద్దు పేరు? కాజు కాజల్ అగర్వాల్&nbsp; మందన్న ఎత్తు ఎంత? 5 అడుగుల 5 అంగుళాలు&nbsp; కాజల్ అగర్వాల్&nbsp; ఎక్కడ పుట్టింది? ముంబాయి కాజల్ అగర్వాల్‌కు వివాహం అయిందా? 2020 అక్టోబర్ 30న గౌతమ్ కిచ్లూను వివాహం చేసుకుంది కాజల్ అగర్వాల్‌కు ఎంతమంది పిల్లలు? కాజల్ అగర్వాల్- గౌతమ్ కిచ్లూ ఒక మగ బిడ్డను కన్నారు. అబ్బాయి పేరు నేయిల్ కిచ్లూ కాజల్ అగర్వాల్‌కు ఇష్టమైన రంగు? వైట్, రెడ్, బ్లూ కాజల్ అగర్వాల్‌ అభిరుచులు? డ్యాన్సింగ్, ట్రావెలింగ్ కాజల్ అగర్వాల్‌కు ఇష్టమైన ఆహారం? ఎగ్స్, తియ్యని పండ్లు కాజల్ అగర్వాల్‌ అభిమాన నటుడు? జూ.ఎన్టీఆర్, పవన్ కళ్యాణ్ కాజల్ అగర్వాల్‌ తొలి సినిమా? లక్ష్మి కళ్యాణం(2007) కాజల్ అగర్వాల్‌కు గుర్తింపు తెచ్చిన సినిమాలు? మగధీర, బృందావనం, డార్లింగ్ కాజల్ అగర్వాల్‌ ఏం చదివింది? మాస్ కమ్యూనికేషన్‌లో డిగ్రీ చేసింది కాజల్ అగర్వాల్‌ పారితోషికం ఎంత? కాజల్ ఒక్కొ సినిమాకు రూ.కోటి- రూ.2కోట్ల వరకు ఛార్జ్ చేస్తోంది. కాజల్ అగర్వాల్‌ తల్లిదండ్రుల పేర్లు? వినయ్ అగర్వాల్, సుమన్ అగర్వాల్ కాజల్ అగర్వాల్‌ ఎన్ని అవార్డులు గెలుచుకుంది? కాజల్ అగర్వాల్ తెలుగులో నేనే రాజు నేనే మంత్రి చిత్రానికి గాను ఉత్తమ నటిగా సైమా అవార్డును గెలుచుకుంది. అలాగే బృందావనం చిత్రానికి గాను ఉత్తమ నటిగా సిని'మా' అవార్డును పొందింది. కాజల్ అగర్వాల్‌ మోడ్రన్ డ్రెస్సులు వేస్తుందా? కాజల్ అగర్వాల్‌ అన్నిరకాల డ్రెస్సులు వేస్తుంది.&nbsp; కాజల్ అగర్వాల్‌కు సిస్టర్ పేరు? నిషా అగర్వాల్, ఆమె కూడా హీరోయిన్‌గా పలు సినిమాల్లో నటించింది. కాజల్ అగర్వాల్‌ ఇన్‌స్టాగ్రాం లింక్? https://www.instagram.com/kajalaggarwalofficial/?hl=en కాజల్ అగర్వాల్‌ ఎంత మంది హీరోలతో లిప్ లాక్ సీన్లలో నటించింది? కాజల్ అగర్వాల్‌ తొలుత బిజినెస్ మ్యాన్ చిత్రంలో మహేష్ బాబుతో లిప్ లాక్ సీన్‌లో నటించింది. కాజల్ అగర్వాల్ బెస్ట్ ఫ్రెండ్స్ ఎవరు? రామ్ చరణ్, తమన్నా భాటియా https://www.youtube.com/watch?v=zh3DbdY0w40
    ఏప్రిల్ 27 , 2024
    Cute Love Proposal: తెలుగు సినిమాల్లో క్యూట్ లవ్ ప్రపోజల్ సీన్స్‌
    Cute Love Proposal: తెలుగు సినిమాల్లో క్యూట్ లవ్ ప్రపోజల్ సీన్స్‌
    ప్రేమ. ఈ రెండక్షరాల పదం ఒక మనిషిని మార్చగలదు. విచ్ఛిన్నం చేయగలదు. &nbsp; తెలుగు సినిమాలో కొన్ని రొమాంటిక్ లవ్ ప్రపోజల్స్‌ గురించి తెలుసుకుందాం. ఆ మరపురాని సన్నివేశాలను మరోసారి గుర్తు చేసుకుందాం.&nbsp;&nbsp; అందాల రాక్షసి - ఈ జనరేషన్‌లో వచ్చిన కల్ట్‌ క్లాసిక్‌ ప్రేమ కథల్లో అందాల రాక్షసి ఒకటి. హీరో తన ప్రేమను కవితాత్మకంగా వర్ణిస్తూ ప్రపోజ్‌ చేయటం మనసులకు హత్తుకుంటుంది.&nbsp; https://www.youtube.com/watch?v=tTKfsFq_6lM సఖి -&nbsp; మాధవన్, శాలిని మధ్య లవ్‌ ప్రపోజల్‌ సన్నివేశం తరాలపాటు గుర్తుండిపోతుంది. ఇద్దరి మధ్య ప్రేమ పుట్టించే శక్తి మణిరత్నం సంభాషణలకు ఉంది అనిపించే స్థాయిలో మాటలు ఉంటాయి.&nbsp;&nbsp; https://www.youtube.com/watch?v=NflqnPbBmOQ ఆర్య - సుకుమార్, అల్లు అర్జున్ కాంబినేషన్‌లో వచ్చిన ఆర్య సినిమాలో క్లైమాక్స్‌ గుండెల్ని పిండేస్తుంది. ఆర్యపై తనకున్న ప్రేమను తెలుసుకున్న గీత అతడి దగ్గరికి పరిగెత్తుకెళ్లటం చూస్తే కన్నీళ్లు వచ్చేస్తాయి.&nbsp; https://www.youtube.com/watch?v=UyywQrR6NvY 3 (Three)&nbsp; - ఈ చిత్రంలో రామ్‌ తన ప్రేమ గురించి జననికి చెప్పినప్పుడు ప్రేమలో స్వచ్ఛత, యుక్త వయసులో కలిగే ఫీలింగ్స్‌ను తెలుపుతాయి. ఈ మధ్య కాలంలో వచ్చిన సినిమాల్లో ఈ సన్నివేశం ఎప్పుడూ ప్రత్యేకమే. https://www.youtube.com/watch?v=p0paKJ9vaXM ఏ మాయ చేసావే - మీ భాగస్వామి పట్ల ఉన్న ప్రేమ కారణంగా గౌతమ్‌ మీనన్‌ తెరకెక్కించిన ఈ రొమాంటిక్‌ డ్రామాకు సలాం కొట్టాల్సిందే. కార్తిక్‌ ప్రేమను జెస్సీ అంగీకరిస్తూ ఇద్దరి మధ్య జరిగే సంభాషణ, ఇందులో చైతూ, సామ్‌ నటన ఆ ప్రేమ సన్నివేశాన్ని మరింత అందంగా మార్చాయి.&nbsp; https://www.youtube.com/watch?v=C3rLlWq5kLk మిర్చి - ఈ సినిమాలో ప్రేక్షకుల మనసును గెలిచే ఈ సన్నివేశం కొద్దిసేపు మాత్రమే ఉన్నప్పటికీ, సీన్‌ ప్రభావం మాత్రం బాగా ఉంటుంది. ఒక్క ఛాన్స్‌ ఇస్తావా అంటూ ప్రభాస్‌ అనుష్కకి ప్రపోజ్‌ చేసే సన్నివేశానికి విజిల్స్‌ పడ్డాయి.&nbsp; https://www.youtube.com/watch?v=Yqu04K59uuw కలర్‌ ఫొటో- తెలుగు చిత్ర పరిశ్రమలో ఊహించని ప్రయత్నం ఈ సినిమా. అమాయకత్వం, నిజాయితీ అనే భావాలను కలర్‌ ఫొటోలో చూపించారు. నిజాయితీగా తన ప్రేమను హీరోయిన్‌కు చెప్పి ఆమెను ఒప్పించే సీన్‌ ఓ అద్భుతం.&nbsp; https://www.youtube.com/watch?v=ADBaHmoWxmQ సూర్య S/O కృష్ణన్‌ - దర్శకుడు గౌతమ్‌ మీనన్‌ ఈ సినిమా ద్వారా తనలో మరో కళను బయటపెట్టాడు. చిత్రంలో తండ్రి, కుమారుడు మధ్య సమాంతరంగా జరిగే ప్రేమ సన్నివేశాలు ఎన్నో ఉంటాయి. కానీ, ‘నాలోనే పొంగెను నర్మద’ అనే పాట పాడుతూ హీరోయిన్‌కు తన ప్రేమను తెలిపే సన్నివేశం మనల్ని మరో ప్రపంచంలోకి తీసుకెళ్తుంది.&nbsp; https://www.youtube.com/watch?v=hQycQ7r_OsI మళ్లీ మళ్లీ ఇది రానీ రోజు - ప్రేమించిన వ్యక్తి పట్ల ఉండే ఫీలింగ్స్‌ గురించి సినిమా సాగుతుంది. ప్రత్యేకంగా శర్వానంద్‌, నిత్యమీనన్‌ కొన్ని సంవత్సరాల తర్వాత కలిసినప్పటికీ వారిద్దరి మధ్య అదే గౌరవం, ప్రేమ ఉండటం, ఇద్దరూ కవిత్వం ద్వారా ప్రేమను వ్యక్తపరచడం సినిమాలో అదిరిపోయే సీక్వెన్స్‌. https://www.youtube.com/watch?v=U7itGT4xajs మజ్ను నాని హీరోగా నటించిన మజ్ను.. మీ జీవితంలో రొమాంటిక్‌ రిలేషన్‌షిప్స్‌ను గుర్తు చేసే సినిమా. ఇందులోని లవ్‌ లెటర్‌ సీన్‌ ఒక మనిషి నిజంగా ప్రేమలో పడితే ఎన్ని ఎమోషన్స్‌ ఉంటాయో తెలియజేస్తుంది.&nbsp; https://www.youtube.com/watch?v=mat52aolY9g
    ఫిబ్రవరి 13 , 2024
    Allu Arjun: పుష్పరాజ్‌గా ఫస్ట్‌ మహేశ్‌ను సెలక్ట్‌ చేశారట. బన్నీ మేకప్‌కు 3గం.లు పట్టేదట.. ‘పుష్ప’ గురించి మీకు తెలియని విషయాలు..!
    Allu Arjun: పుష్పరాజ్‌గా ఫస్ట్‌ మహేశ్‌ను సెలక్ట్‌ చేశారట. బన్నీ మేకప్‌కు 3గం.లు పట్టేదట.. ‘పుష్ప’ గురించి మీకు తెలియని విషయాలు..!
    2021లో వచ్చిన పుష్ప చిత్రం (Pushpa) ఏ మేర ప్రభంజనం సృష్టించిందో అందరికీ తెలిసిందే. ‘పుష్ప అంటే ఫ్లవర్‌ అనుకుంటివా.. ఫైరు’ అన్న డైలాగ్‌ దేశవ్యాప్తంగా ఫేమస్‌ అయ్యింది. పలువురు క్రికెటర్లు, సెలబ్రిటీలు సైతం ఈ డైలాగ్‌ చెబుతూ సోషల్‌ మీడియాలో వీడియోలు సైతం పోస్టు చేశారు. దీంతో ఈ సినిమా మరింతగా సినీ ప్రేక్షకుల హృదయాల్లోకి చొచ్చుకుపోయింది. ప్రస్తుతం ఆ క్రేజే అల్లుఅర్జున్‌ (Allu arjun)కు జాతీయస్థాయిలో ఉత్తమ నటుడిగా నిలబెట్టింది. సుకుమార్‌ దర్శకత్వంలో వచ్చిన&nbsp; ‘పుష్ప: ది రైజ్‌’ చిత్రంలో బన్నీ తన విశ్వరూపాన్ని చూపించాడు.&nbsp;నటన, డైలాగ్‌ డెలివరీ, డ్యాన్స్‌ ఇలా ప్రతీదానిలో తన మార్క్‌ చూపించి భారత సినీ ప్రేక్షకులను హోరెత్తించాడు. జాతీయస్థాయిలో గుర్తింపు సంపాదించిన పుష్ప సినిమా గురించి కొన్ని ఆసక్తికర విషయాలు మీకోసం.&nbsp; పదేళ్ల తర్వాత.. 2004లో వచ్చిన ‘ఆర్య’ చిత్రం బన్నీ కెరీర్‌లో ఓ మైలురాయి వంటింది. సుకుమార్‌, అల్లుఅర్జున్‌ కాంబినేషన్‌లో వచ్చిన తొలి చిత్రం కూడా అదే. ఆ తర్వాత వీరిద్దరి కాంబినేషన్‌లో వచ్చిన ‘ఆర్య2’ యావరేజ్‌గా నిలిచింది. దాదాపు పదేళ్ల తర్వాత ‘పుష్ప’ కోసం అల్లు అర్జున్‌, సుకుమార్‌ చేతులు కలిపారు. తాజాగా దీనికి జాతీయ అవార్డు రావడంతో ఈ ఇద్దరూ ఒకరినొకరు ఆలింగనం చేసుకుని సంబరాలు చేసుకున్నారు. ఛాన్స్‌ మిస్‌ చేసుకున్న మహేశ్‌..! ‘పుష్ప’ కథను సుకుమార్‌ తొలుత మహేశ్‌బాబుకు చెప్పారట. ఆయనకు కథ నచ్చి గ్రీన్‌ సిగ్నల్‌ కూడా ఇచ్చారట. కానీ, అప్పటికే ఒప్పుకొన్న ప్రాజెక్టుల వల్ల మహేష్‌ డేట్స్‌ సర్దుబాటు చేయలేకపోయాడట. దీంతో ప్రాజెక్టు ఆగిపోయింది. అయితే మహేశ్‌కు చెప్పిన కథ ఇదే నేపథ్యమైనప్పటికీ స్టోరీ లైన్‌ వేరని సుకుమార్‌ ఆ తర్వాత తెలిపారు. ఇదిలా ఉంటే పుష్పరాజ్‌ పాత్రకు బన్నీ ప్రాణం పోశాడు. ఈ పాత్ర కోసం రెండు, మూడు గంటలు కదలకుండా మేకప్‌ వేసుకున్నాడు. ఆ కృషే పుష్పకు జాతీయ అవార్డును తెచ్చిపెట్టింది. మ్యాజిక్‌ రిపీట్‌ అల్లు అర్జున్‌, సుకుమార్‌, దేవిశ్రీ ప్రసాద్‌ ఈ ముగ్గురూ కలిస్తే ఆడియన్స్‌కు పూనకాలే అని ఇంతకు ముందు సినిమాల ద్వారా నిరూపతమైంది. ‘పుష్ప’ విషయంలోనూ అదే మ్యాజిక్‌ రిపీట్‌ అయింది. ‘శ్రీవల్లి’, ‘ఊ అంటావా మావ’, ‘సామి సామి’ పాటలు యూట్యూబ్‌లో సెన్సేషన్‌ క్రియేట్‌ చేశాయి. 2022లో అత్యంత ప్రజాదరణ కలిగిన టాప్‌-10 సాంగ్స్‌లో ఇవి నిలిచాయి. అంతేకాదు 6.2 బిలియన్‌కు పైగా వ్యూస్‌ సొంతం చేసుకున్న తొలి ఇండియన్‌ ఆల్బమ్‌గానూ రికార్డు సృష్టించాయి. ఈ పాటలకు గాను దేవిశ్రీ ఉత్తమ సంగీత దర్శకుడిగా జాతీయ అవార్డు అందుకోనున్నారు. కలెక్షన్ల సునామీ 2021 డిసెంబరు 17న ‘పుష్ప’ చిత్రం పాన్‌ ఇండియా స్థాయిలో విడుదలైంది. ప్రపంచవ్యాప్తంగా రూ.365కోట్లు (గ్రాస్‌) వసూలు చేసింది, ఒక్క హిందీలోనే రూ.108 కోట్లు (నెట్‌) కలెక్షన్లు రాబట్టడం విశేషం. 2021లో విడుదలైన చిత్రాల్లో అత్యధిక గ్రాస్‌ వసూళ్లు సాధించిన చిత్రంగా ‘పుష్ప’రాజ్‌ రికార్డు సృష్టించాడు. ఓటీటీలోనూ ప్రభంజనమే ఓటీటీలోనూ ‘పుష్ప’అదరగొట్టింది. 2022లో అమెజాన్‌ప్రైమ్‌లో అత్యధికమంది వీక్షించిన మూవీగా నిలిచింది. టెలివిజన్‌లోనూ పుష్పరాజ్‌ హవా చూపించాడు. 2022లో అత్యధిక టీఆర్‌పీ రేటింగ్‌ సాధించిన చిత్రంగా పుష్ప అలరించింది.&nbsp; రికార్డుస్థాయిలో రీల్స్‌ సోషల్‌ మీడియాను సైతం ‘పుష్ప’ ఒక ఊపు ఊపింది. 10 మిలియన్లకు పైగా ఇన్‌స్టా రీల్స్‌ క్రియేట్‌ చేశారంటే పుష్ప మేనియా ఎలాంటిదో అర్థం చేసుకోవచ్చు. ఇప్పటికీ ఈ సినిమా పాటలు, సన్నివేశాలు నెట్టింట దర్శనమిస్తూనే ఉన్నాయి. అవార్డ్స్‌లోనూ ‘తగ్గేదేలే’ గతంలో ఈ సినిమాకు ఏడు ఫిల్మ్‌ఫేర్‌లు, మరో ఏడు సైమా అవార్డులు వచ్చిన సంగతి తెలిసిందే. ఉత్తమ చిత్రం, ఉత్తమ దర్శకుడు, ఉత్తమ నటుడు, ఉత్తమ సంగీత దర్శకుడు, ఉత్తమ గీత రచయిత, ఉత్తమ సినిమాటోగ్రఫీ విభాగాల్లో ఈ చిత్రం అవార్డులను సొంతం చేసుకుంది. తాజాగా జాతీయ ఉత్తమ నటుడి అవార్డు పుష్పరాజ్‌కు రావడం విశేషం. ఫేమస్‌ డైలాగ్స్‌ పుష్ప సినిమాను ప్రజలకు మరింత చేరువ చేసిన ‌అంశాల్లో డైలాగ్స్‌ ముందు వరుసలో ఉంటాయి.‘పుష్ప’ అంటే ఫ్లవర్‌ అనుకుంటివా.. ఫైరు..’, ‘సరకు ఉంటే పుష్ప ఉండడు.. పుష్ప ఉంటే సరకు ఉండదు.. రెండింటినీ కలిపి చూడాలనుకుంటే మీరు ఎవ్వరూ ఉండరు’, ‘నేను ఇక్కడ బిజినెస్‌లో ఏలుపెట్టి కెలకడానికి రాలే, ఏలేయడానికి వచ్చా.. తగ్గేదేలే’ లాంటి డైలాగ్‌లు బాగా ఫేమస్‌ అయ్యాయి. పుష్పరాజ్‌ వచ్చేస్తున్నాడు! ‘పుష్ప’ సినిమాకు కొనసాగింపుగా ‘పుష్ప: ది రూల్‌’ (Pushpa 2) రానుంది. దీని షూటింగ్‌ శరవేగంగా జరుగుతోంది. ఇటీవల ‘పుష్ప ఎక్కడా..?’ పేరుతో విడుదల చేసిన గ్లింప్స్‌కు ప్రేక్షకుల నుంచి భారీ స్పందన వచ్చింది. ఇప్పటికే ‘పుష్ప 2’ సంబంధించి అల్లు అర్జున్‌, రష్మిక (Rashmika), ఫహాద్ ఫాజిల్‌ల ఫస్ట్‌లుక్‌లను రిలీజ్‌ చేశారు. కాగా, ఈ సినిమా వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు రానుంది.
    ఆగస్టు 25 , 2023
    Mirna Menon: టాలీవుడ్‌లో మెరిసిన మరో అందాల తార.. మిర్నా మీనన్‌ హోయలకు ముగ్దులవుతున్న ప్రేక్షకులు..!
    Mirna Menon: టాలీవుడ్‌లో మెరిసిన మరో అందాల తార.. మిర్నా మీనన్‌ హోయలకు ముగ్దులవుతున్న ప్రేక్షకులు..!
    అల్లరి నరేష్‌ తాజాగా నటించిన ‘ఉగ్రం’ మూవీలో ‘మిర్నా మీనన్‌’ హీరోయిన్‌గా నటించింది. ఇటీవల ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌లో పాల్గొన్న ఈ భామ తన అందచందాలతో ఆకట్టుకుంది. తమిళ చిత్రం ‘సంతానథెవన్‌’ చిత్రంతో మిర్నా మీనన్‌ సినీ రంగంలోకి అడుగుపెట్టింది. అయితే చిన్న సినిమా కావడంతో పెద్దగా గుర్తింపు రాలేదు.&nbsp; తన తర్వాతి చిత్రంలో ఏకంగా మోహన్‌ లాల్‌ పక్కనే ఛాన్స్‌ కొట్టేసింది ఈ భామ. బిగ్‌ బ్రదర్ చిత్రంలో ఆర్య శెట్టి పాత్రలో మిర్నా మెరిసింది ఆది సాయికుమార్ హీరోగా గతేడాది వచ్చిన ‘క్రేజీ ఫెల్లో’ సినిమా ద్వారా మిర్నా మీనన్‌ టాలీవుడ్‌లోకి అడుగుపెట్టింది. రెండో చిత్రం ఉగ్రం ద్వారా తన అదృష్టాన్ని పరీక్షించుకుంటోంది.&nbsp; ఉగ్రం సినిమాలో తన పాత్ర పూర్తి స్థాయిలో ఉంటుందని మిర్నా మీనన్ ఓ ఇంటర్యూలో చెప్పింది. నరేష్‌తో పాటే తన పాత్ర సాగుతుందని చెప్పుకొచ్చింది.&nbsp; ఉగ్రంలో పాత్ర కోసం చాలా హోంవర్క్‌ చేసినట్లు ఈ ముద్దుగుమ్మ చెప్పింది. కాలేజీ అమ్మాయిగా, భార్యగా, తల్లిగా కనిపించేందుకు ఎన్నో జాగ్రత్తలు తీసుకున్నట్లు తెలిపింది.&nbsp; ఉగ్రం సినిమా షూటింగ్‌లో 75 రోజులు పాల్గొన్నట్లు నటి చెప్పింది. అయితే అందులో 55 రోజులు నైట్‌ షూట్లేనని వివరించింది.&nbsp; కెరీర్ ఆరంభంలో ఇలాంటి పాత్ర చేయడమంటే ఏ నటికైనా సవాలేనని నటి చెప్పింది. ఆ సవాల్‌ను స్వీకరించి ఎంతో కష్టపడి చేసినట్లు చెప్పుకొచ్చింది.&nbsp; ఉగ్రంలో నరేష్‌తో పాటు తాను కూడా రియల్‌ స్టంట్స్‌లో పాల్గొన్నట్లు ఈ భామ తెలిపింది. ట్రైలర్‌లో చూపించిన కారు ప్రమాదం రియల్‌ స్టంట్‌లో భాగమేనని స్పష్టం చేసింది. కారు స్టంట్‌ చేస్తున్నపుడు నరేష్‌కు గాయమైందని మిర్నా మీనన్‌ తెలిపింది. ఆ సమయంలో తాను కూడా కింద పడిపోయినట్లు చెప్పుకొచ్చింది.
    మే 03 , 2023
    <strong>Sreeleela: బాలీవుడ్‌ స్టార్‌ హీరో కొడుకుతో శ్రీలీల.. వీడియో వైరల్‌!</strong>
    Sreeleela: బాలీవుడ్‌ స్టార్‌ హీరో కొడుకుతో శ్రీలీల.. వీడియో వైరల్‌!
    తక్కువ కాలంలో స్టార్‌ హీరోయిన్‌ స్టేటస్‌ సంపాదించిన కథానాయికల్లో శ్రీలీల (Sreeleela) ఒకరు. ‘పెళ్లిసందD’ మూవీతో తెలుగు తెరకు పరిచయమైన ఈ అమ్మడు తన అందం, అభినయం, డ్యాన్స్‌తో అందరి దృష్టిని ఆకర్షించింది. ఈ క్రమంలోనేే మహేష్‌, బాలకృష్ణ, రవితేజ వంటి  స్టార్ హీరోలతో సినిమాలు చేసింది. రీసెంట్‌గా 'పుష్ప 2' చిత్రంలో కిస్సిక్‌ అనే ఐటెం సాంగ్‌లో మెరిసి పాన్‌ ఇండియా స్థాయిలో అందరి దృష్టిని ఆకర్షించింది. ఇదిలా ఉంటే తాజాగా ఓ బాలీవుడ్‌ స్టార్‌ హీరో కుమారుడితో కనిపించి శ్రీలీల అందరినీ సర్‌ప్రైజ్‌ చేసింది. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.  శ్రీలీల వీడియో వైరల్‌.. బాలీవుడ్‌ అగ్ర కథానాయకుల్లో సైఫ్ అలీఖాన్‌ (Saif Ali Khan) ఒకరు. ఇటీవల ఆయన ‘దేవర’ చిత్రంతో తెలుగు ప్రేక్షకులకు సైతం పరిచయమయ్యారు. ఆయన కుమారుడు ఇబ్రహీం అలీఖాన్‌ (Ibrahim Ali Khan) కూడా ఫిల్మ్‌ ఎంట్రీకి సిద్ధమవుతున్నాడు. ఇదిలా ఉంటే తాజాగా యంగ్‌ బ్యూటీ శ్రీలీల, ఇబ్రహీం అలీఖాన్‌ ఒకే చోట కనిపించి అందరినీ సర్‌ప్రైజ్‌ చేశారు. ఓ ఆఫీసు నుంచి బయటకు వస్తూ కెమెరాలకు ఫోజులిచ్చారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతోంది. వారిద్దరు ఒకే చోట ఎందుకు ఉన్నారని నెటిజన్లు సెర్చ్ చేస్తున్నారు. ఒకవేళ వారు రిలేషన్‌లో ఉన్నారా? అన్న అనుమానాన్ని వ్యక్తం చేస్తున్నారు.  https://twitter.com/Buzzz_scrolls/status/1876588640937345167 కొత్త పెయిర్ షురూ! స్టార్ హీరోయిన్‌ శ్రీలీల త్వరలో బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇవ్వనున్నట్లు కొన్ని రోజులుగా ప్రచారం జరుగుతోంది. వాటిని నిజం చేస్తూ తాజాగా శ్రీలీల ముంబయిలో ప్రత్యక్షమైంది. సైఫ్ అలీఖాన్‌ కుమారుడు ఇబ్రహీం అలీఖాన్‌తో శ్రీలీల కనిపించడానికి కారణం త్వరలో చేయబోయే కొత్త సినిమానే అని తెలుస్తోంది. ప్రముఖ నిర్మాణ సంస్థ మడాక్‌ ఫిల్మ్స్‌ ఇబ్రహీంతో తీయబోయే సినిమాలో శ్రీలీల హీరోయిన్‌గా ఎంపికైనట్లు సమాచారం. ఈ క్రమంలో మూవీపై చర్చించేందుకు మడాక్‌ ఫిల్మ్స్‌ ఆఫీసుకు శ్రీలీల, ఇబ్రహీం వెళ్లారని టాక్‌. అలా బయటకు వస్తున్న సందర్భంలో వచ్చినదే ప్రస్తుతం వైరల్ అవుతున్న వీడియోనని బీటౌన్‌ వర్గాలు స్పష్టం చేస్తున్నాయి. వీరి కాంబోలో మూవీపై త్వరలో అధికారిక ప్రకటన రానున్నట్లు సమాచారం.  https://twitter.com/oneindiatelugu/status/1876579818495746543 మరో ప్రాజెక్ట్‌ సైతం రెడీ! ఇబ్రహీం ఖాన్‌ మూవీ కంటే ముందే శ్రీలీల బాలీవుడ్‌ ఎంట్రీ ఫిక్స్‌ అయినట్లు సమాచారం. బాలీవుడ్‌ యంగ్‌ హీరో ఆర్యన్‌ కార్తీక్‌ హీరోగా తెరకెక్కనున్న సినిమాలో హీరోయిన్‌గా శ్రీలీల ఎంపికైనట్లు పెద్ద ఎత్తున వార్తలు వచ్చాయి. ఈ లవ్‌ ఎంటర్‌టైనర్‌ను బాలీవుడ్‌ ప్రముఖ నిర్మాత కరణ్‌ శర్మ నిర్మిస్తారని సమాచారం. దీనికి సమీర్‌ విద్వాన్‌ దర్శకత్వం వహిస్తారని బీటౌన్‌లో టాక్‌. ఇదిలా ఉంటే రీసెంట్‌గా ఈ మూవీపై మాట్లాడిన ఆర్యన్‌ కార్తీక్‌ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఇప్పటికే తాను మూడుసార్లు ప్రేమలో పడి విఫలమయ్యాయని.. ఇప్పుడు మరోసారి ప్రేమలో పడబోతున్నట్లు చెప్పారు. దీంతో శ్రీలీల బాలీవుడ్ హీరో తో ప్రేమలో పడబోతుందా? ఆల్రెడీ ప్రేమలో పడిందా? అంటూ రూమర్స్‌ మెుదలయ్యాయి.  చేతి నిండా ప్రాజెక్ట్స్‌.. నితీన్‌ లేటెస్ట్‌ చిత్రం ‘రాబిన్‌హుడ్‌’లో  శ్రీలీల హీరోయిన్‌గా చేసింది. ఈ మూవీ త్వరలో రిలీజ్ కానుంది. నాగచైతన్య హీరోగా ‘విరూపాక్ష’ డైరెక్టర్‌ కార్తీక్‌ దండు తెరకెక్కించనున్న 'NC24' ప్రాజెక్టుకు ఈ భామనే ఎంపికైనట్లు సమాచారం. అలాగే పవన్‌- హరీశ్‌ శంకర్‌ కాంబోలో రానున్న ‘ఉస్తాద్‌ భగత్‌ సింగ్‌’లోనూ శ్రీలీలనే హీరోయిన్‌. రవితేజ హీరోగా నటిస్తోన్న 'మాస్‌ జాతర'లోనూ ఈ అమ్మడు నటిస్తోంది.  అలాగే కోలీవుడ్‌లో శివకార్తికేయన్ హీరోగా చేస్తున్న 'SK25' ప్రాజెక్ట్‌లోనూ శ్రీలీల నటిస్తోంది. ఇవి కాకుండా ప్రస్తుతం చర్చల దశలో మరో మూడు ప్రాజెక్ట్స్‌ ఉన్నాయి. అఖిల్ అక్కినేని అప్‌కమింగ్‌ ఫిల్మ్‌లోనూ కథానాయికగా శ్రీలీలను పరిశీలిస్తున్నట్లు సమాచారం. అలాగే నవీన్‌ పోలిశెట్టి తీయబోయే నెక్స్ట్‌ ప్రాజెక్ట్‌లోనూ శ్రీలీల నటించే ఛాన్స్ ఉందంటున్నారు. సిద్ధు జొన్నలగడ్డ హీరోగా రానున్న 'కోహినూర్‌' (Kohinur) చిత్రానికి సైతం శ్రీలీల (Sreeleela) ఎంపిక దాదాపుగా ఖరారైనట్లు టాక్‌ ఉంది.
    జనవరి 07 , 2025
    <strong>Tollywood Rewind 2024: ఈ ఏడాది బిగ్గెస్ట్ డిజాస్టర్‌గా నిలిచిన టాప్ 10 సినిమాలు ఇవే!</strong>
    Tollywood Rewind 2024: ఈ ఏడాది బిగ్గెస్ట్ డిజాస్టర్‌గా నిలిచిన టాప్ 10 సినిమాలు ఇవే!
    2024 సంవత్సరానికి చివరి ఘడియలు దగ్గరపడుతుండగా, ఈ ఏడాది టాలీవుడ్ సక్సెస్, ఫెయిల్యూర్స్ పైన చర్చ మొదలైంది. టాలీవుడ్‌కి పెద్ద హిట్ లను అందించిన 'కల్కి', 'పుష్ప 2', హనుమాన్ వంటి సినిమాలు ఈ ఏడాది తెలుగు సినీ పరిశ్రమను ముందుకు నడిపించాయి. కానీ, మరోవైపు కొన్ని అగ్రహీరోల సినిమాలు, యంగ్ హీరోల ప్రాజెక్టులు భారీ అంచనాల మధ్య విడుదలై ప్రేక్షకుల్ని తీవ్రంగా నిరాశపరిచాయి. ఇప్పుడు 2024లో అత్యధికంగా నిరాశపరిచిన పెద్ద సినిమాల గురించి తెలుసుకుందాం. 1. ఈగల్ మాస్ మహారాజా రవితేజ ఈ ఏడాది కూడా డిజాస్టర్ల జాబితాలో చేరారు. కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వంలో రూపొందిన 'ఈగల్' సినిమా, భారీ అంచనాల మధ్య విడుదలైనప్పటికీ ప్రేక్షకుల ఆశలపై నీళ్లు చల్లింది. డైరెక్టర్ ప్రశాంత్ నీల్ తీసిన 'కేజీఎఫ్' సినిమాల ప్రభావంతో, నేటి యువ దర్శకులు సరికొత్త కథలు తీసుకోకుండా, భారీ బడ్జెట్‌తో యాక్షన్ సన్నివేశాలు, భారీ గన్స్, విచిత్రమైన ఫ్లాష్‌బ్యాక్‌లతో సినిమాలు తెరకెక్కిస్తున్నారు. కానీ 'ఈగల్' కథపై దృష్టి పెట్టకుండా ఒక్కో సన్నివేశం మాత్రమే బాగా రావాలని ప్రయత్నించడం స్పష్టంగా కనిపించింది. భారీ బడ్జెట్ వృథాగా అయిందని చెప్పుకోవచ్చు. 2. మిస్టర్ బచ్చన్ 2024లో మరో పెద్ద డిజాస్టర్‌గా నిలిచిన చిత్రం 'మిస్టర్ బచ్చన్'. ఈ సినిమా రీమేక్ సినిమాల విషయంలో ఎలా చేయకూడదో అనిపించేలా ఉంది. ప్రేక్షకులను ఆకట్టుకునే క్రిస్టల్ క్లియర్ కథనం లేకపోవడం, క్రింజ్ కామెడీ సన్నివేశాలు సినిమాను పూర్తిగా డీలా పడేయించాయి. మంచి నటీనటుల ఫేస్ వాల్యూ వృథా అయింది. ఒక రీమేక్ సినిమాలో కథకు ప్రత్యేకత లేకుంటే ప్రేక్షకులు సులభంగా తిరస్కరిస్తారని మరోసారి రుజువైంది. 3. సైంధవ్ వెంకటేష్ తన 75వ సినిమాగా వచ్చిన 'సైంధవ్' సంక్రాంతి పండగ సందర్భంగా విడుదలైంది. శైలేష్ కొలను దర్శకత్వం వహించిన ఈ సినిమా విషయంలో భారీ అంచనాలు ఉండేవి. కానీ, కుటుంబ ప్రేక్షకులను ఆకట్టుకునే కథనం లేకపోవడంతో పండగ రోజు సినిమా థియేటర్ల నుంచి రానివ్వకుండా వెళ్లిపోయింది. నవాజుద్దీన్ సిద్ధిఖీ వంటి అద్భుతమైన నటుడు సైతం ఈ సినిమాలో ప్రాభవాన్ని చూపించలేకపోయాడు. కథలో లోపాలు, ఆర్య పాత్ర లాంటి అనవసరమైన పాత్రలు సినిమాను మరింతగా దెబ్బతీశాయి. సంక్రాంతి సందర్భంగా విడుదలైన ఈ సినిమా అభిమానులను తీవ్రంగా నిరాశపర్చింది. 4. డబుల్ ఇస్మార్ట్ పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో రామ్ పోతినేని నటించిన 'డబుల్ ఇస్మార్ట్' భారీ అంచనాల మధ్య విడుదలైంది. అటు పూరికి ఇటు రామ్‌ పొత్తినేనికి వరుస ఫ్లాప్స్ ఉండటంతో సహజంగానే ఈ సినిమాపై పెద్ద ఎత్తున హైప్ ఏర్పడింది. అయితే, ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద తీవ్ర నిరాశపరిచింది. పూరీ స్టైల్ మాస్ యాక్షన్ ఎలిమెంట్స్ సరైన ప్రామాణికతను అందించకపోవడం ఈ చిత్రానికి పెద్ద షాక్‌గా మారింది. వరుస ఫ్లాప్‌లతో రామ్‌కు ఈ సినిమా మరో పెద్ద మైనస్‌గా మారింది. 5. ఆపరేషన్ వాలెంటైన్ &amp; మట్కా మెగా ప్రిన్సెస్‌ వరుణ్ తేజ్ ఈ ఏడాది రెండు సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు – 'ఆపరేషన్ వాలెంటైన్' మరియు 'మట్కా'. కానీ ఈ రెండు సినిమాలు ప్రేక్షకుల్ని ఆకట్టుకోలేకపోయాయి. వరుణ్ తేజ్ లాంటి ప్రామాణిక నటుడు కూడా బ్యాక్ టు బ్యాక్ ఫ్లాప్‌లు ఇవ్వడం అతని కెరీర్‌పై తీవ్ర ప్రభావం చూపింది. వినూత్న కథా సామర్థ్యం లేకపోవడం ఈ సినిమాల వైఫల్యానికి ప్రధాన కారణం. 6. ఫ్యామిలీ స్టార్ విజయ్ దేవరకొండ నటించిన 'ఫ్యామిలీ స్టార్' కూడా 2024లో ప్రేక్షకులను నిరాశపరిచిన మరో సినిమా. భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ చిత్రం, తొలి వారం ఓపెనింగ్స్ బాగానే వచ్చినప్పటికీ, ఆ తరువాత బాక్సాఫీస్ వద్ద నిలబడలేకపోయింది. కామెడీ డ్రామా జానర్‌ను ప్రయత్నించినప్పటికీ, కథలో లోపాలు సినిమాను కిందికి దించాయి. 7. మనమే శర్వానంద్ నటించిన 'మనమే' కూడా ఈ ఏడాది మరో నిరాశపరిచిన మరో సినిమా. వినూత్న కథలతో ప్రేక్షకులను ఆకట్టుకునే శర్వానంద్ ఈసారి సక్సెస్ అందుకోలేకపోయాడు. సినిమా మొత్తం స్లో నేరేషన్, అర్థరహితమైన ఎమోషనల్ సన్నివేశాలు, ముఖ్యమైన పాయింట్లను సరిగా హైలైట్ చేయకపోవడం ఈ చిత్రాన్ని బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్‌గా మిగిల్చింది. 8. తిరగబడరా సామీ, బడ్డీ, శివంభజే ఇంకా యంగ్ హీరోలు అశ్విన్ బాబు, రాజ్ తరుణ్, అల్లు శిరీష్ వంటి హీరోలు కూడా నిరాశపరిచారు. అశ్విన్ బాబు నటించిన 'శివంభజే', అల్లు శిరీష్ నటించిన 'బడ్డీ', రాజ్ తరుణ్ నటించిన 'తిరగబడరా సామీ' చిత్రాలు నాటకీయ అంచనాలను తలపించి, థియేటర్లలో ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయాయి. ఈ సినిమాలు థియేటర్లలో సందడి చేయకపోవడంతో నిర్మాతలకు నష్టాలు మిగిల్చాయి. 9. అప్పుడో ఇప్పుడో ఎప్పుడో కార్తికేయ సిరీస్‌ సినిమాలతో స్టార్ హీరోగా ఎదిగిన నిఖిల్ సిద్ధార్థ్‌కు ఈ ఏడాది చేదు జ్ఞాపకాలను మిగిల్చింది. ఇటీవల విడుదలైన అప్పుడో ఇప్పుడో ఎప్పుడో చిత్రం బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్‌గా నిలిచింది. శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర ప్రొడక్షన్స్‌ బ్యానర్‌పై బీవీఎస్‌ఎన్‌ ప్రసాద్‌ నిర్మించిన ఈ సినిమాకు సుధీర్‌వర్మ దర్శకత్వం వహించారు. నిఖిల్‌, రుక్మిణి వసంత్, దివ్యాంశ కౌశిక్, హర్ష చెముడు ప్రధాన పాత్రల్లో నటించారు. 10. చిన్న సినిమాలు 2024లో చిన్న సినిమాల జాబితాలో కూడా చాలా నిరాశ ఎదురైంది. మంచి కథా బలం ఉన్నా సరైన ప్రమోషన్ లేకపోవడం, కొత్త దర్శకుల సినిమాలు సరైన కమర్షియల్ ఎలిమెంట్స్ లేకపోవడం వల్ల ప్రేక్షకులు ఈ సినిమాలను పట్టించుకోలేదు. ఈ సినిమాల వల్ల చిన్న నిర్మాతలకు ఆర్థిక నష్టాలు మిగిలాయి. 2024లో టాలీవుడ్ పెద్ద ఆశలు పెట్టుకున్న కొన్ని సినిమాలు మాత్రం ప్రేక్షకులను తీవ్ర నిరాశపరిచాయి. రవితేజ, వెంకటేష్, రామ్, విజయ్ దేవరకొండ, వరుణ్ తేజ్, శర్వానంద్ వంటి అగ్ర హీరోలు బాక్సాఫీస్ విజయాల జాబితాలో స్థానం సంపాదించలేకపోయారు. ఒక వైపు 'పుష్ప 2', 'కల్కి' వంటి బ్లాక్ బస్టర్ చిత్రాలు టాలీవుడ్‌ను ముందుకు నడిపిస్తే, మరో వైపు ఈ డిజాస్టర్లు నిర్మాతలకు భారీ నష్టాలను మిగిల్చాయి. కొత్త సంవత్సరం 2025లో వీరు తిరిగి పుంజుకుంటారా లేదా అనేది ఆసక్తికరమైన అంశం.
    డిసెంబర్ 19 , 2024
    <strong>Mufasa: The Lion King: మహేష్ బాబు వాయిస్ ఇచ్చిన ‘ముఫాసా’ గురించి ఈ సీక్రెట్స్ తెలుసా?</strong>
    Mufasa: The Lion King: మహేష్ బాబు వాయిస్ ఇచ్చిన ‘ముఫాసా’ గురించి ఈ సీక్రెట్స్ తెలుసా?
    వరల్డ్‌ మోస్ట్ వాంటెడ్‌ యానిమేషన్‌ చిత్రం 'ముఫాసా: ది లయన్‌ కింగ్‌' (Mufasa: The Lion King) మరో రెండ్రోజుల్లో వరల్డ్‌ వైడ్‌గా విడుదల కాబోతోంది. తెలుగు, హిందీ, ఇంగ్లీషు సహా పలు దక్షిణాది భాషల్లో ఈ సినిమా డిసెంబర్‌ 20న రిలీజ్‌ కాబోతోంది. ఇప్పటికే విడుదలైన ట్రైలర్‌, టీజర్‌, ప్రచార చిత్రాలు అదిరిపోయాయన్న కామెంట్స్‌ గట్టిగానే వినిపిస్తున్నారు. క్రిస్మస్‌ సెలవుల నేపథ్యంలో పిల్లలతో సహా ఈ యానిమేటెడ్‌ చిత్రాన్ని చూసేందుకు పేరెంట్స్‌ ఆసక్తి చూపిస్తున్నారు. అయితే ‘ముఫాసా: ది లయన్ కింగ్‌’ సినిమాకు ఎన్నో ప్రత్యేకతలు ఉన్నాయి. ఈ సినిమా చూసేముందుకు వాటి గురించి తప్పక తెలుసుకోవాలి. అప్పుడు మాత్రమే అసలైన మజాను ఎంజాయ్‌ చేయగలుగుతారు. అవేంటో ఈ ప్రత్యేక కథనంలో చూద్దాం.&nbsp; ‘ది లయన్‌ కింగ్‌’ (Mufasa: The Lion King) చిత్రాలకు హాలీవుడ్‌ సహా ప్రపంచవ్యాప్తంగా మంచి పేరుంది. ప్రముఖ హాలీవుడ్‌ నిర్మాణ సంస్థ డిస్నీ తొలుత దీనిని ‘ది లయన్ గార్డ్‌’ పేరుతో టీవీ సిరీస్‌గా రూపొందించింది.&nbsp; అప్పటికే బాగా పాపులర్ అయిన ‘ది లయన్‌ గార్డ్‌’ కామిక్‌ బుక్‌లోని కథలను తీసుకొని కార్టూన్స్‌ రూపంలో ఈ టెలివిజన్‌ సిరీస్‌ను డిస్నీ నిర్మించడం గమనార్హం. టెలివిజన్‌లో ‘ది లయన్ గార్డ్‌’ (The Lion Guard) సిరీస్‌కు విశేష ఆదరణ లభించడంతో దానిని ‘ది లయన్‌ కింగ్‌’ పేరుతో 1994లో కార్టూన్‌ యానిమేషన్‌ చిత్రంగా డిస్నీ తీసుకొచ్చింది. అప్పట్లో ఆ మూవీకి మంచి ఆదరణ లభించింది.&nbsp; ఆ తర్వాత 2016లో ‘ది లయన్‌ కింగ్‌’ (1994)కు రీమేక్‌గా అత్యాధునిక గ్రాఫిక్స్‌ హంగులతో కొత్త చిత్రాన్ని నిర్మించబోతున్నట్లు డిస్నీ ప్రకటించింది. అందుకు అనుగుణంగా 2019లో అదే పేరుతో&nbsp; ‘ది లయన్‌ కింగ్‌’ చిత్రాన్ని రిలీజ్‌ చేసింది.&nbsp; 'ది లయన్‌ కింగ్‌' (2019) వరల్డ్‌ వైడ్‌గా విశేష స్పందన వచ్చింది. $250 - 260 మిలియన్‌ డాలర్లతో రూపొందిన ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా ఏకంగా $1.657 బిలియన్‌ డాలర్ల వసూళ్లను రాబట్టి అందరినీ ఆశ్చర్య పరిచింది.&nbsp; ఇప్పుడు ది లయన్‌ కింగ్‌కు సీక్వెల్‌గా ముఫాసా: ది లయన్‌ కింగ్‌ చిత్రం వస్తుండటంతో సహజంగానే అందరిలోనూ ఈ సినిమాపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి.&nbsp; ‘ది లయన్‌ కింగ్‌’ (2019), ‘ముఫాసా: ది లయన్‌ కింగ్‌’ (2024) చిత్రాల్లో యానిమేటెడ్‌ జంతువులే తెరపైకి కనిపించినప్పటికీ వాటి వెనక ఎంతోమంది హాలీవుడ్‌ స్టార్స్‌ వర్క్ చేశారు.&nbsp; అరోన్‌ పీరే (ముఫాసా), డొనాల్డ్‌ గ్లోవర్‌ (సింబా), బియాన్స్‌ (నాలా), బ్లూ ఇవి కార్టర్‌ (కియారా), జాన్‌ కాని, (రఫీకీ), టిఫాని బూనే (సరాబి) వంటి స్టార్స్‌ అందులోని పాత్రలకు తమ గాత్రాన్ని అందించారు. ముఫాసా స్టోరీ విషయానికి వస్తే.. ముఫాసా (సింహం) ఓ అనాథ. చిన్నప్పుడు తనను రక్షించడంతో టాకా (సింహం) బ్రదర్‌గా దత్తత తీసుకుంటాడు. పెద్దయ్యాక వారు చేసిన సాహసాలు ఏంటి? ప్రైడ్‌ ల్యాండ్‌లోని తెల్ల సింహాల నుంచి వాటికి ఎధురైన సమస్యలు ఏంటి? అన్నది కథ. ‘ముఫాసా: ది లయన్‌ కింగ్‌’ (Mufasa: The Lion King) చిత్రాన్ని బారీ జెంకిన్స్‌ డైరెక్ట్‌ చేశాడు. ఈ యానిమేషన్‌ చిత్రం నిర్మాణానికి దాదాపు 200 మిలియన్‌ డాలర్లు ఖర్చు అయ్యింది. భారతీయ కరెన్సీ ప్రకారం దాదాపు రూ.1700 కోట్లు ఖర్చు అయ్యింది. 118 నిమిషాల నిడివితో ఈ సినిమా రాబోతోంది.&nbsp; ‘ముఫాసా: ది లయన్‌ కింగ్‌’ భారత్‌లోనూ గ్రాండ్‌గా రిలీజ్‌ కాబోతోంది. హిందీలో వెర్షన్‌లో బాలీవుడ్ బాద్ షా ఫ్యామిలీ భాగస్వామ్యం అయ్యింది. షారుఖ్ ఖాన్‌తో పాటు ఆయన కుమారులు ఆర్యన్ ఖాన్, అబ్రామ్ ఖాన్ వాయిస్ ఇచ్చారు.  2019లో విడుదలైన ‘ది లయన్ కింగ్’ మూవీలో ముఫాసా పాత్రకు షారుఖ్ ఖాన్ వాయిస్ ఇచ్చారు. ఇప్పుడు ఆయన కుమారులు కూడా గాత్ర దానం చేయడంతో హిందీలో భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఇక ముఫాసా తెలుగు వెర్షన్‌ ఈసారి మరింత హైలేట్‌ కాబోతోంది. సూపర్‌ స్టార్‌ మహేష్‌ బాబు (Mahesh Babu) ‘ముఫాసా’ పాత్రకు డబ్బింగ్‌ చెప్పారు. దీంతో మహేష్‌ అభిమానులు ఈ మూవీ కోసం ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. https://twitter.com/urstrulyMahesh/status/1859107736920969300 ‘ముఫాసా: ది లయన్‌ కింగ్‌’ చిత్రంలో స్టార్‌ కమెడియన్స్‌ బ్రహ్మానందం, అలీ కూడా డబ్బింగ్‌ చెప్పారు. పుంబా పాత్రకు బ్రహ్మీ డబ్బింగ్‌ చెప్పగా, టిమోన్‌ రోల్‌కు అలీ గాత్ర దానం చేశారు.  https://twitter.com/thetalkenti/status/1866815051316785331 2019లో వచ్చిన ‘ది లయన్‌ కింగ్‌’ చిత్రంలోనూ అలీ, బ్రహ్మీ డబ్బింగ్‌ చెప్పారు. దానికి సీక్వెల్‌గా వస్తోన్న ముఫాసాలోనూ పుంబా, టిమోన్‌ పాత్రలకు వారు డబ్బింగ్‌ చెప్పడం విశేషం.&nbsp; తమిళ వెర్షన్‌కు సైతం పలువురు స్టార్స్‌ డబ్బింగ్‌ చెప్పారు. అర్జున్‌ దాస్‌ (ముఫాసా), అశోక్‌ సెల్వన్‌ (టాకా), నాజర్‌ (కిరోస్‌), వీటీవీ గణేష్‌ (యంగ్‌ రఫీకీ), సింగం పులి (టిమన్‌) డబ్బింగ్‌ చెప్పారు.  https://twitter.com/DisneyStudiosIN/status/1868564630416855209 హైదరాబాద్‌లో ‘ముఫాసా’ అడ్వాన్స్ బుకింగ్స్ ఓపెన్ అయ్యాయి. తెలుగు, హిందీ, ఇంగ్లీషు భాషల్లో 2D, 3D వెర్షన్స్‌లో ఈ సినిమాను వీక్షించవచ్చు. ప్రస్తుతానికి ఐదు స్క్రీన్స్‌లో మాత్రమే అడ్వాన్స్‌ బుకింగ్స్‌ ఓపెన్ అయ్యాయి.
    డిసెంబర్ 18 , 2024
    <strong>Dacoit: మోసం చేశావ్ మృణాల్.. అడవి శేష్ కామెంట్స్ వైరల్</strong>
    Dacoit: మోసం చేశావ్ మృణాల్.. అడవి శేష్ కామెంట్స్ వైరల్
    టాలీవుడ్‌ నటుడు అడివి శేష్‌ (Adivi Sesh) వైవిధ్యమైన చిత్రాలతో దూసుకుపోతున్నాడు. ‘ఎవడు’, ‘మేజర్‌’, ‘హిట్‌ 2’ వంటి హ్యాట్రిక్ విజయాలతో మంచి ఊపు మీద ఉన్నాడు. ఈ క్రమంలోనే ‘డెకాయిట్‌: ఏ లవ్‌ స్టోరీ’ (Dacoit: A Love Story) అనే ఓ పాన్ ఇండియా ప్రాజెక్ట్‌ను అడివి శేష్‌ పట్టాలెక్కించారు. ఈ చిత్రానికి షానీల్‌ డియో డైరెక్షన్‌ చేస్తున్నారు. ఈ క్రమంలో తాజాగా 'డెకాయిట్‌' హీరోయిన్‌ను అనౌన్స్‌ చేశారు. ఇందులో మృణాల్‌ ఠాకూర్‌ (Mrunal Thakur) నటిస్తున్న ప్రకటించారు. దీంతో హీరో అడివి శేష్‌ తన ఇన్‌స్టాగ్రామ్‌లో ఆసక్తికర పోస్టు పెట్టాడు. మోసం చేశావంటూ రాసుకొచ్చాడు. ఆ వివరాలేంటో ఇప్పుడు చూద్దాం.  ‘ప్రేమించి మోసం చేశావ్‌’ యంగ్‌ హీరో అడివి శేష్‌ (Adivi Sesh) ప్రస్తుతం ‘డెకాయిట్‌’ (Dacoit: A Love Story) అనే చిత్రంలో నటిస్తున్నాడు. ఇందులో హీరోయిన్‌గా మృణాల్‌ ఠాకూర్‌ (Mrunal Thakur) నటిస్తున్నట్లు మేకర్స్‌ అధికారికంగా ప్రకటించారు. ఈ క్రమంలో కొత్త పోస్టర్‌ను షేర్ చేసిన అడివి శేష్‌ 'ప్రేమంచావు.. కానీ మోసం చేశావు.. విడిచిపెట్టను.. తేలాల్సిందే' అని క్యాప్షన్‌ పెట్టారు. దీనికి మృణాల్‌ ఠాకూర్‌ స్పందిస్తూ 'వదిలేశాను.. కానీ మనస్ఫూర్తిగా ప్రేమించాను' అంటూ సమాధానం చెప్పింది. అయితే ఈ వ్యాఖ్యలు సినిమాలో తమ పాత్రలకు సంబంధించి ఒకరికొకరు చేసుకున్నట్లు తెలుస్తోంది. ఇందులో మృణాల్‌ - అడివి శేష్‌ ప్రేమించుకొని, ఓ బలమైన కారణం వల్ల విడిపోతారని అర్థమవుతోంది.  https://twitter.com/AdiviSesh/status/1868899040303431969 హ్యాండ్ ఇచ్చిన శ్రుతి హాసన్‌! డెకాయిట్‌ చిత్రాన్ని అనౌన్స్‌ చేసినప్పుడే హీరోయిన్‌గా శ్రుతి హాసన్‌ నటిస్తున్నట్లు మేకర్స్‌ ప్రకటించారు. దీనికి సంబంధించిన పోస్టర్స్‌, టీజర్‌ను సైతం గతంలో రిలీజ్‌ చేశారు. ఇక సినిమాను పట్టాలెక్కించడమే తరువాయి అనుకున్న క్రమంలో ఈ ప్రాజెక్ట్‌ నుంచి అనూహ్యంగా శ్రుతి హాసన్‌ తప్పుకుంది. అయితే దీనికి గల స్పష్టమైన కారణాలు ఏంటో బయటకు రాలేదు. మూవీ టీమ్‌ కూడా ఎలాంటి అధికారిక ప్రకటన సైతం చేయలేదు. మూవీ టీమ్‌తో విభేదాల వల్లే ఆమె ఈ ప్రాజెక్ట్‌ నుంచి తప్పుకున్నట్లు నెట్టింట ప్రచారం జరిగింది. ఈ క్రమంలో ఆమె స్థానంలోకి మృణాల్‌ను మేకర్స్‌ తీసుకున్నారు. అడివి శేష్‌, మృణాల్‌ పెయిర్‌ బాగుందంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.  https://twitter.com/AnnapurnaStdios/status/1751466771436208424 డెకాయిట్‌ స్టోరీ ఇదే! ప్రముఖ సినిమాటోగ్రాఫర్ షానీల్ డియో ‘డెకాయిట్‌’ చిత్రం ద్వారానే దర్శకుడిగా పరిచయమవుతున్నారు. ఈ చిత్రాన్ని సుప్రియ యార్లగడ్డ నిర్మిస్తున్నారు. ఇందులో హీరో, హీరోయిన్లు వరుస దోపిడీలకు పాల్పడతారు. అలా దొంగతనానికి పాల్పడుతున్న సమయంలోనే ఇద్దరు ప్రేమలో పడతారు. ఓ విషయమై వారి ప్రేమలో విభేదాలు తలెత్తాయని తెలుస్తోంది. ఇక ‘డెకాయిట్‌’కు సంబంధించిన టీజర్‌ను గతేడాది డిసెంబర్‌లోనే రిలీజ్‌ చేయగా ఇందులో అడివి శేష్‌, శ్రుతి హాసన్‌ కనిపించి సర్‌ప్రైజ్‌ చేశారు. కాగా, తెలుగు, హిందీ భాషల్లో ఒకేసారి ఈ చిత్రం షూటింగ్‌ జరుపుకుంటోంది. https://twitter.com/TrackTwood/status/1737423086188925221 అడివి శేష్ ఫిల్మ్‌ జర్నీ ఇదే.. ఆర్యన్ రాజేష్ హీరోగా వచ్చిన ‘సొంతం’ (Sontham) సినిమాలో చిన్న క్యారెక్టర్‌‌ చేసిన అడివి శేష్ ‘కర్మ’ (Karma) సినిమాతో హీరోగా పరిచయం అయ్యాడు. పవన్‌ కల్యాణ్‌ (Pawan Kalyan) నటించిన ‘పంజా’ (Panja) సినిమాలో విలన్‌గా నటించి గుర్తింపు తెచ్చుకున్నాడు. ‘రన్‌ రాజా రన్’, ‘బాహుబలి’ సినిమాల్లో కీలక పాత్రల్లో నటించిన అతడు ‘క్షణం’ (Kshanam), ‘గూఢచారి’ (Guachari), ‘ఎవరు’ (Yevaru), ‘మేజర్’ (Mejor), ‘హిట్‌ 2’ (Hit 2) వంటి వైవిధ్యమైన చిత్రాలతో నమ్మదగిన హీరోగా మారిపోయాడు. ముఖ్యంగా ‘మేజర్‌’ సినిమాతో అడివి శేష్‌ మార్కెట్‌ అమాంతం పెరిగిపోయింది. ప్రస్తుతం అతడి చేతిలో గూఢచారి సీక్వెల్‌ (G2)తో పాటు, ‘డెకాయిట్’ వంటి పాన్‌ ఇండియా ప్రాజెక్ట్స్‌ ఉన్న సంగతి తెలిసిందే. 
    డిసెంబర్ 17 , 2024
    <strong>Pushpa 2: దద్దరిల్లిన కొచ్చి ఎయిర్‌పోర్ట్.. బన్నీకి ఫ్యాన్స్‌ గ్రాండ్ వెల్‌కమ్!</strong>
    Pushpa 2: దద్దరిల్లిన కొచ్చి ఎయిర్‌పోర్ట్.. బన్నీకి ఫ్యాన్స్‌ గ్రాండ్ వెల్‌కమ్!
    అల్లు అర్జున్ (Allu Arjun) హీరోగా సుకుమార్ (Director Sukumar) దర్శకత్వంలో రూపొందిన ‘పుష్ప 2’ (Pushpa 2) సినిమా మరో వారం రోజుల్లోనే రిలీజ్ కానుంది. దీంతో మూవీ టీమ్‌ ప్రమోషన్స్‌ను భారీగా చేస్తోంది. ఇప్పటికే పాట్నా, చెన్నైలో భారీ ఈవెంట్స్ నిర్వహించగా నేడు (నవంబర్‌ 27) కేరళలో మరో ఈవెంట్‌ను ప్లాన్‌ చేశారు. ఇందులో పాల్గొనేందుకు చిత్రం బృందం హైదరాబాద్‌ నుంచి స్పెషల్ ఫ్లైట్‌లో కొచ్చి వెళ్లింది. అక్కడ ఎయిర్‌పోర్టులో ల్యాండ్ అయిన బన్నీకి ఊహించని స్థాయిలో ఫ్యాన్స్‌ సాగర స్వాగతం పలికారు. దద్దరిల్లిన విమానశ్రయం.. కొచ్చి ఎయిర్‌పోర్టులో దిగిన బన్నీకి కేరళ అభిమానులు గ్రాండ్‌ వెల్‌కమ్‌ చెప్పారు. అల్లు అర్జున్‌ రాక గురించి ముందే తెలుసుకొని వారంతా పెద్ద ఎత్తున ఎయిర్‌పోర్టుకు తరలి వచ్చారు. ఎయిర్‌పోర్టు నుంచి బయటకు వస్తున్న బన్నీకి సుస్వాగతం పలికారు. తమ అభిమాన హీరోను తమ ఫోన్‌ కెమెరాల్లో బంధించేందుకు ప్రయత్నించారు. అంతేకాదు బన్నీతో ఫొటోలు దిగేందుకు కూడా&nbsp; ఎగబడ్డారు. అంచనాలకు మించి వచ్చిన ఫ్యాన్స్‌ను కంట్రోల్‌ చేయడానికి ఎయిర్‌పోర్టు సిబ్బంది, పోలీసులు బాగా కష్టపడాల్సి వచ్చింది. అభిమానుల కేరింతలకు దెబ్బకు ఓ దశలో బన్నీ తన రెండు చెవులు మూసుకోవడం గమనార్హం. రాష్ట్రం కాని రాష్ట్రంలో బన్నీ వస్తోన్న ఈస్థాయి ఆదరణ చూసి అల్లు అర్జున్‌ ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు. 'రాజు ఎక్కడ ఉన్న రాజే' అని కామెంట్స్ చేస్తున్నారు. https://twitter.com/GulteOfficial/status/1861740756030886182 https://twitter.com/IamEluruSreenu/status/1861718081313107982 కేరళలో ఎందుకంత క్రేజ్! ఐకాన్‌ స్టార్ అల్లు అర్జున్‌కు ఏపీ, తెలంగాణ తర్వాత ఆ స్థాయి ఫ్యాన్ ఫాలోయింగ్‌ ఉన్న రాష్ట్రం కేరళ. అక్కడి ప్రజలు బన్నీని ముద్దుగా మల్లు అర్జున్‌ (Mallu Arjun) అని పిలుచుకుంటారు. కెరీర్‌ తొలినాళ్లలో చేసిన ‘ఆర్య’ కేరళలో సూపర్‌ డూపర్‌ హిట్‌గా నిలిచింది. 100 రోజులకు పైగా ఆడింది. ‘ఆర్య’ నుంచి అల్లు అర్జున్‌ను కేరళ ప్రజలు ఓన్‌ చేసుకోవడం మెుదలపెట్టారు. అల్లు అర్జున్‌ హీరోగా చేసిన ప్రతీ సినిమా కేరళలో కచ్చితంగా రిలీజ్‌ అవుతూ వచ్చింది. తెలుగులో ఏ విధమైన రెస్పాన్స్‌ వచ్చేదో కేరళలోనూ అంతే స్థాయిలో ప్రేక్షకులు బన్నీ చిత్రాన్ని ఆదరించారు. బన్నీ గత చిత్రం ‘పుష్ప’ సైతం కేరళలో బ్లాక్‌ బాస్టర్‌ విజయం సాధించింది. ఈ నేపథ్యంలో ‘పుష్ప 2’ (Pushpa 2) కేరళ ఆడియన్స్‌లో మంచి అంచనాలు ఏర్పడ్డాయి. ఈ నేపథ్యంలో కొచ్చిలో ప్రమోషన్ ఈవెంట్‌ను మేకర్స్‌ ప్లాన్‌ చేశారు.&nbsp; https://twitter.com/baraju_SuperHit/status/1861742091337953731 https://twitter.com/alluarjun/status/1861737357105672266 రన్‌ టైమ్‌ లాక్‌ 'పుష్ప 2' చిత్రానికి సంబంధించి రన్‌టైన్‌ లాక్ అయినట్లు తెలుస్తోంది. సాధారణంగా సుకుమార్‌ సినిమా అంటే మూడు గంటలు కచ్చితంగా ఉంటుందని అభిమానులు ఓ అంచనాకు వచ్చేస్తుంటారు. ఆయన గత చిత్రాలు ‘రంగస్థలం’, ‘పుష్ప’ దాదాపు మూడు గంటల నిడివితో వచ్చి బ్లాక్‌ బాస్టర్లుగా నిలిచాయి. అయితే ఇప్పుడు 'పుష్ప 2' మూడు గంటలకు పైగా నిడివితో రాబోతున్నట్లు స్ట్రాంగ్‌ బజ్‌ వినిపిస్తోంది. ఈ సినిమాకు 3 గంటల 22 నిమిషాల నిడివిని డైరెక్టర్‌ సుకుమార్‌ ఫిక్స్‌ చేశారట. యూఎస్‌లో 3 గంటల 15 నిమిషాల నిడివితో ‘పుష్ప 2’ రిలీజ్‌ కాబోతున్నట్లు తెలుస్తోంది. సెన్సార్‌ బోర్డు పర్యవేక్షణ అనంతరం అఫిషియల్‌గా నిడివిని అనౌన్స్‌ చేయనున్నారు.&nbsp;
    నవంబర్ 27 , 2024
    <strong>Pushpa 2: ‘పుష్ప 2’ను ఇంకా చెక్కే పనిలోనే సుకుమార్‌.. రిలీజ్‌ డేట్‌ పోస్ట్‌పన్?</strong>
    Pushpa 2: ‘పుష్ప 2’ను ఇంకా చెక్కే పనిలోనే సుకుమార్‌.. రిలీజ్‌ డేట్‌ పోస్ట్‌పన్?
    అల్లు అర్జున్‌ (Allu Arjun) హీరోగా సుకుమార్‌ (Sukumar) దర్శకత్వంలో రూపొందిన ‘పుష్ప 2’ (Pushpa 2)పై దేశవ్యాప్తంగా బజ్‌ ఉంది. ఇటీవల పాట్నా వేదికగా రిలీజైన ట్రైలర్‌ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటోంది. మిలియన్ల కొద్ది వ్యూస్‌తో యూట్యూబ్‌లో దూసుకుపోతోంది. డిసెంబర్‌ 5న ‘పుష్ప 2’ ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. దీంతో మేకర్స్‌ చురుగ్గా ప్రమోషన్స్‌ నిర్వహిస్తూ వరుసగా అప్‌డేట్స్‌ ఇస్తున్నారు. మరోవైపు పోస్టు ప్రొడక్షన్స్ వర్క్స్‌ సైతం వేగంగా సాగుతున్నాయి. డైరెక్టర్‌ సుకుమార్‌ బెస్ట్ ఔట్‌పుట్‌ ఇచ్చేందుకు రెయింబవళ్లు కష్టపడుతున్నారు. ఇందుకు సంబంధించిన వీడియోను పుష్ప టీమ్‌ తాజాగా తమ ఎక్స్‌ ఖాతాలో పంచుకుంది. అయితే ఈ వీడియో సినీ లవర్స్‌లో కొత్త భయాలను సృష్టిస్తోంది. అందుకు గల కారణాలేంటో ఇప్పుడు చూద్దాం.&nbsp; బిగ్గెస్ట్ మూవీ కోసం శ్రమిస్తున్న సుకుమార్‌! అల్లు అర్జున్‌ - సుకుమార్‌ కాంబోలో రాబోతున్న ‘పుష్ప 2’ (Pushpa 2)పై యావత్‌ దేశం ఎదురుచూస్తోంది. రిలీజ్‌కు ఇంకా రెండు వారాల సమయమే ఉండటంతో అందరూ వెయ్యి కళ్లతో వెయిట్‌ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ‘పుష్ప 2’ టీమ్‌ ఓ ఆసక్తికర వీడియోను ఎక్స్‌లో పెట్టింది. అర్ధరాత్రి సమయంలోనూ మూవీ పోస్ట్‌ ప్రొడక్షన్ పనుల్లో సుకుమార్ బిజీగా ఉన్న వీడియోను పంచుకుంది. బిగ్గెస్ట్‌ ఇండియన్‌ ఫిల్మ్‌ కోసం ‘ఏరౌండ్‌ ది క్లాక్‌’ సుకుమార్‌ పనిచేస్తున్నారని మూవీ టీమ్‌ రాసుకొచ్చింది. వీడియోను పరిశీలిస్తే ల్యాప్‌టాప్‌లో ‘పుష్ప 2’ను పరిశీలిస్తూ టెక్నికల్‌ టీమ్‌ వ్యక్తికి సుకుమార్‌ కొన్ని సూచనలు చేస్తున్నాడు. ఇది చూసిన అల్లు అర్జున్‌ ఫ్యాన్స్‌ సుకుమార్‌ చేస్తున్న కృష్టిని ప్రశంసిస్తున్నారు. బెస్ట్ ఔట్‌పుట్‌ ఇచ్చేందుకు ఆయన అహర్నిశలు శ్రమిస్తున్నారని ఆకాశానికెత్తుతున్నారు.&nbsp;&nbsp; https://twitter.com/i/status/1860015165732978697 ఆందోళన ఎందుకంటే? ‘పుష్ప 2’ చిత్రం డిసెంబర్‌ 5న వరల్డ్‌ వైడ్‌గా రిలీజ్‌ కానున్న సంగతి తెలిసిందే. విడుదలకు సరిగ్గా రెండు వారాల సమయం మాత్రమే మిగిలి ఉంది. ఇప్పటికీ సుకుమార్‌ పోస్టు ప్రొడక్షన్‌ పనులే చేస్తూ ఉండటంతో కొందరు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రమోషన్స్‌పై ఫోకస్‌ పెట్టాల్సిన సమయంలో ఇంకా పోస్టు ప్రొడక్షన్‌ పనులను పరిశీలిస్తుండటం ఏంటని అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. పైగా నాలుగో పాట షూటింగ్‌ కూడా శుక్రవారం (నవంబర్‌ 22) నుంచి స్టార్ట్‌ చేసినట్లు ఫిల్మ్‌ వర్గాల్లో చర్చ జరుగుతోంది. దీనికి తోడు సినిమాకు సంబంధించి బ్యాక్‌ గ్రౌండ్‌ స్కోర్‌ వర్క్‌ ఇంకా పెండింగ్‌లోనే ఉన్నాయన్న టాక్‌ ఉంది. ఇటీవల థమన్ ఇచ్చిన నేపథ్య సంగీతంపై సుకుమార్ అసంతృప్తి వ్యక్తం చేశాడని కథనాలు కూడా వచ్చాయి. ఇన్ని పెండింగ్ వర్క్స్‌ పెట్టుకొని రెండు వారాల్లో సినిమాను ఎలా రిలీజ్‌ చేస్తారోనని బన్నీ ఫ్యాన్స్ సైతం అనుమానం వ్యక్తం చేస్తున్నారు. చివరి క్షణంలో సినిమా వాయిదా వేస్తున్నట్లు ప్రకటించి హ్యాండ్‌ ఇస్తారేమోనని అనుమానిస్తున్నారు.&nbsp; అదుర్స్‌ అనేలా ‘కిస్సిక్‌’ ప్రోమో దర్శకుడు సుకుమార్ తెరకెక్కించే సినిమాల్లో స్పెషల్ సాంగ్స్​కు ఓ ప్రత్యేకమైన ఫ్యాన్ బేస్ ఉంటుంది. మొదటి సినిమా 'ఆర్య'లో 'అ అంటే అమలాపురం' ఎంత పెద్ద హిట్‌ అయ్యిందో అందరికీ తెలిసిందే. 'రంగస్థలం'లో 'జిల్ జిల్ జిగేల్ రాణి' కూడా అందరినీ ఊర్రూతలూగించింది. గత చిత్రం పుష్పలోని 'ఊ అంటావా మావ ఊఊ అంటావా మావ' సాంగ్ యావత్‌ దేశాన్ని స్టెప్పులు వేసేలా చేసింది. ఇప్పుడు 'పుష్ప 2'లోనూ అలాంటి సాంగ్ ఉంది. 'కిస్సిక్‌' అంటూ సాగే ఈ పాటలో డ్యాన్సింగ్‌ క్వీన్‌ శ్రీలీల స్టెప్పులు వేసింది. నవంబర్‌ 24న ‘కిస్సిక్‌’ లిరికల్‌ సాంగ్‌ను మేకర్స్ రిలీజ్‌ చేయబోతున్నారు. ఈ నేపథ్యంలో ఈ పాటకు సంబంధించిన ప్రోమోను తాజాగా రిలీజ్‌ చేశారు. ఈ ప్రోమో చూస్తుంటే సాంగ్‌ పక్కా హిట్‌ అయ్యేలా కనిపిస్తోంది. ఓ సారి ప్రోమోను మీరూ చూసేయండి. https://www.youtube.com/watch?v=AiJZ3jLajHI ‘కిస్సిక్‌’ హైప్‌కు కారణం ఇదే డైరెక్టర్ సుకుమార్‌ తన ప్రతీ చిత్రంలోనూ ఓ ఐటెం సాంగ్‌ (Kissik Song) తప్పనిసరిగా ఉంచుతారు. అయితే ‘కిస్సిక్‌’ పాటకు వస్తున్నంత హైప్ గతంలో ఏ పాటకు రాలేదు. సుకుమార్ గత చిత్రం ‘పుష్ప’లోని ‘ఊ అంటావా ఊఊ అంటావా’కు సైతం రిలీజ్‌కు ముందు ఇంత బజ్‌ క్రియేట్‌ కాలేదు. అయితే ‘కిస్సిక్‌’కు మాత్రమే ఈ స్థాయి హైప్‌ ఏర్పడటానికి కొన్ని కారణాలు ఉన్నాయి. ‘పుష్ప’కి మించి ‘పుష్ప 2’ ఉంటుందని చిత్ర బృందం ముందు నుంచి చెబుతూ వస్తోంది. దీంతో ఇండియాను షేక్‌ చేసిన ‘ఊ ఊ అంటావా.. ఊ ఊ అంటావా’ కంటే ‘కిస్సిక్‌’ ఇంకా అదిరిపోతుందని ఆడియన్స్‌ ఓ అభిప్రాయానికి వచ్చేశారు. దానికి తోడు డ్యాన్సింగ్‌ క్వీన్‌ శ్రీలీల సాంగ్‌లో చేస్తుండటం, సమంత కంటే బెటర్‌ డ్యాన్సర్‌ కావడం, బన్నీ కూడా స్టెప్పులు ఇరగదీస్తాడని పేరుండటంతో ఈ సాంగ్‌పై అంచనాలు అమాంతం పెరిగిపోయాయి.&nbsp;
    నవంబర్ 23 , 2024
    Kissik Song: ‘ఊ అంటావా’ సాంగ్‌ను బీట్‌ చేయనున్న ‘పుష్ప 2’లోని ‘కిస్సిక్‌’ సాంగ్?
    Kissik Song: ‘ఊ అంటావా’ సాంగ్‌ను బీట్‌ చేయనున్న ‘పుష్ప 2’లోని ‘కిస్సిక్‌’ సాంగ్?
    అల్లు అర్జున్‌ (Allu Arjun) హీరోగా సుకుమార్‌ (Sukumar) దర్శకత్వంలో రూపొందిన ‘పుష్ప 2’ (Pushpa 2)పై దేశవ్యాప్తంగా బజ్‌ ఉంది. డిసెంబర్‌ 5న వరల్డ్‌ వైడ్‌గా ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఇందులో స్టార్ హీరోయిన్‌ శ్రీలీల (Sreeleela) కిస్సిక్‌ అనే (Kissik Song) ఐటెం సాంగ్‌ చేసిన సంగతి తెలిసిందే. ఈ విషయాన్ని మేకర్స్‌ స్పెషల్‌ పోస్టర్‌ వేసి మరి తెలియజేశారు. అంతకుముందు సెట్‌లో శ్రీలీల, బన్నీ డ్యాన్స్‌కు సంబంధించి ఓ ఫోటో సైతం లీకయ్యింది. దీంతో ఈ సాంగ్‌ ఏ రేంజ్‌లో ఉంటుందోనని అభిమానుల్లో భారీ అంచనాలే ఏర్పడ్డాయి. ఇదిలా ఉంటే ‘పుష్ప 2’ రిలీజ్‌కు రెండు వారాల సమయమే ఉండటంతో మూవీ టీమ్‌ వరుసగా అప్‌డేట్స్‌ ఇస్తోంది. ఈ క్రమంలోనే శ్రీలీల చేసిన ఐటెం సాంగ్‌కు సంబంధించి అదిరిపోయే అప్‌డేట్ ఇచ్చింది.  ఆ రోజు మోతమోగాల్సిందే! అల్లు అర్జున్‌ హీరోగా నటించిన ‘పుష్ప 2’ యావత్‌ సినీ లోకం ఎంతో ఆశగా ఎదురుచూస్తోంది. ఈ క్రమంలోనే పుష్ప 2 టీమ్ క్రేజీ అప్‌డేట్‌ను ప్రేక్షకులకు ఇచ్చింది. ప్రేక్షకుల్లో ఎంతో హైప్‌ క్రియేట్‌ చేసిన ‘కిస్సిక్‌’ సాంగ్‌ (Kissick Song)ను నవంబర్‌ 24న రిలీజ్‌ చేయనున్నట్లు మేకర్స్‌ అధికారికంగా ప్రకటించారు. ఆ రోజు సా.7.02 పాట విడుదల కానున్నట్లు స్పెషల్‌ పోస్టర్‌ ద్వారా తెలియజేశారు. ఇక పోస్టర్‌లో బన్నీ, శ్రీలీల లుక్‌ అదిరిపోయింది. సాంగ్‌లోని ఓ స్టెప్‌ను రిఫరెన్స్‌గా తీసుకొని ఈ పోస్టర్‌ను క్రియేట్‌ చేశారు. తాజా అప్‌డేట్‌ చూసి అల్లు అర్జున్‌ ఫ్యాన్స్‌తో పాటు మ్యూజిక్‌ లవర్స్‌ తెగ ఖుషీ అవుతున్నారు. ఈ సాంగ్‌ పక్కాగా ఆకట్టుకుంటుందని అంచనా వేస్తున్నారు.&nbsp; https://twitter.com/PushpaMovie/status/1859572237457817685 ఎందుకంత హైప్‌? డైరెక్టర్ సుకుమార్‌ తన ప్రతీ చిత్రంలోనూ ఓ ఐటెం సాంగ్‌ (Kissik Song) తప్పనిసరిగా ఉంచుతారు. ఫస్ట్ ఫిల్మ్‌ ‘ఆర్య’ నుంచి ఈ ఆనవాయితీ కొనసాగుతూ వస్తోంది. సుకుమార్ ఇప్పటివరకూ 8 చిత్రాలు చేయగా అన్నింట్లోను దుమ్మురేపే ఐటెం సాంగ్స్‌ ఉన్నాయి. అయితే ‘కిస్సిక్‌’ పాటకు వస్తున్నంత హైప్ గతంలో ఏ పాటకు రాలేదు. సుకుమార్ గత చిత్రం ‘పుష్ప’లోని ‘ఊ అంటావా ఊఊ అంటావా’కు సైతం రిలీజ్‌కు ముందు ఇంత బజ్‌ క్రియేట్‌ కాలేదు. అయితే ‘కిస్సిక్‌’కు మాత్రమే ఈ స్థాయి హైప్‌ ఏర్పడటానికి కొన్ని కారణాలు ఉన్నాయి. ‘పుష్ప’కి మించి ‘పుష్ప 2’ ఉంటుందని చిత్ర బృందం ముందు నుంచి చెబుతూ వస్తోంది. దీంతో ఇండియాను షేక్‌ చేసిన ‘ఊ ఊ అంటావా.. ఊ ఊ అంటావా’ కంటే ‘కిస్సిక్‌’ ఇంకా అదిరిపోతుందని ఆడియన్స్‌ ఓ అభిప్రాయానికి వచ్చేశారు. దానికి తోడు డ్యాన్సింగ్‌ క్వీన్‌ శ్రీలీల సాంగ్‌లో చేస్తుండటం, సమంత కంటే బెటర్‌ డ్యాన్సర్‌ కావడం, బన్నీ కూడా స్టెప్పులు ఇరగదీస్తాడని పేరుండటంతో ఈ సాంగ్‌పై అంచనాలు అమాంతం పెరిగిపోయాయి.  శ్రీలీల దెబ్బకు ఫ్లోర్లు అదరాల్సిందే! ‘పుష్ప 2’ ఐటెం సాంగ్‌ ఎలా ఉన్నా శ్రీలీల డ్యాన్స్ మాత్రం అదిరిపోతుందని చెప్పవచ్చు. ప్రస్తుత తరం కథానాయికల్లో డ్యాన్స్‌లో శ్రీలీలను కొట్టేవారే లేరనడంతో అతిశయోక్తి లేదు. ఈ భామ తన నటన కంటే డ్యాన్స్ పరంగానే ఎక్కువ మంది అభిమానులను సంపాదించుకుంది. రవితేజ 'ధమాకా' చిత్రంలో పల్సర్ బైక్‌ సాంగ్‌లో ఈ అమ్మడు ఏవిధంగా అదరగొట్టిందో అందరికీ తెలిసిందే. రీసెంట్‌గా మహేష్‌ బాబుతో 'కుర్చీని మడతపెట్టి' సాంగ్‌లో ఏకంగా తన స్టెప్పులతో విధ్వంసం సృష్టించింది. శ్రీలీలతో డ్యాన్స్ అంటే హేమా హేమీ డ్యాన్సర్లు సైతం కాస్త వెనక్కి తగ్గుతుంటారు. అటువంటి శ్రీలీలతో డ్యాన్స్‌కు కేరాఫ్‌గా నిలిచే బన్నీ జతకలిస్తే ఇక ఐటెం సాంగ్ ఏ స్థాయిలో ఉంటుందో అభిమానుల ఊహకే వదిలేయవచ్చు.  https://twitter.com/CeleBeautyHQ/status/1858330541592088786 ఏరికోరి సెలెక్ట్‌ చేసిన బన్నీ! ‘పుష్ప 2’ కిస్సిక్‌ సాంగ్‌ (Kissik Song)కు శ్రీలీలను ఎంచుకోవాలన్నది డైరెక్టర్‌ సుకుమార్ ఆలోచన కాదట. ఐకాన్‌ స్టార్‌ అల్లు అర్జున్ స్వయంగా శ్రీలీలను సజెస్ట్ చేసినట్లు తెలుస్తోంది. బన్నీ ఇంతకుముందే శ్రీలీలతో కలిసి ప్రముఖ ఓటీటీ ‘ఆహా’ కోసం ఒక యాడ్ చేశాడు. వీరిద్దరి కెమెస్ట్రీ బాగుందంటూ అప్పట్లోనే సోషల్‌ మీడియాలో కామెంట్స్‌ వచ్చాయి. మరోవైపు ఈ జనరేషన్‌ హీరోయిన్లలో శ్రీలీల బెస్ట్ డ్యాన్సర్ కీర్తింప బడుతోంది. ఈ నేపథ్యంలో బన్నీ-శ్రీలీల ఒకే వేదికపై ఆడి పాడితే ఆడియన్స్‌లో పూనకాలు రావడం పక్కా. ఇవన్నీ ఆలోచించే శ్రీలీలపై బన్నీ మెుగ్గు చూపినట్లు సమాచారం. అంతకుముందు బాలీవుడ్‌ స్టార్ హీరోయిన్స్‌ శ్రద్ధా కపూర్‌, దిశా పటానీ, త్రిప్తి దిమ్రి పేర్లు ఈ ఐటెం సాంగ్‌ పరిశీలనలోకి వచ్చినట్లు వార్తలు వచ్చాయి. శ్రీలీల పారితోషికం ఎంతంటే? అల్లుఅర్జున్‌ - సుకుమార్‌ కాంబోలో రూపొందుతున్న ‘పుష్ప 2’ చిత్రం డిసెంబర్‌ 5న వరల్డ్ వైడ్‌గా రిలీజ్‌ కాబోతోంది. ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్‌ దాదాపు రూ.500 కోట్ల బడ్జెట్‌తో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఖర్చు విషయంలో ఏమాత్రం వెనకాడకుండా సుకుమార్‌గా తమవంతు తోడ్పాటు అందిస్తున్నారు. ఈ క్రమంలో కిస్సిక్‌ ఐటెం సాంగ్‌ (Pushpa 2 Item Song)లో చేసిన హీరోయిన్ శ్రీలీలకు భారీ మెుత్తంలో పారితోషికం ముట్టచెప్పినట్లు నెట్టింట టాక్ వినిపిస్తోంది. ‘కిస్సిక్కి’ అంటూ సాగే ఈ పాట కోసం ఆమె ఏకంగా రూ.2 కోట్ల రెమ్యూనరేషన్‌ తీసుకుందని ఫిల్మ్‌ వర్గాల్లో చర్చ జరుగుతోంది. సెట్‌, హీరోయిన్‌ పారితోషికం ఇతర మొత్తం కలిపి రూ.5 కోట్లు ఖర్చు అయినట్లు అంచనా వేస్తున్నాయి.&nbsp;
    నవంబర్ 21 , 2024
    <strong>Adivi Sesh - Shruti Haasan: అడవి శేష్‌కు షాకిచ్చిన స్టార్‌ హీరోయిన్‌.. అర్థాంతరంగా ప్రాజెక్ట్‌ నుంచి క్విట్‌!</strong>
    Adivi Sesh - Shruti Haasan: అడవి శేష్‌కు షాకిచ్చిన స్టార్‌ హీరోయిన్‌.. అర్థాంతరంగా ప్రాజెక్ట్‌ నుంచి క్విట్‌!
    టాలీవుడ్‌ నటుడు అడివి శేష్‌ వైవిధ్యమైన చిత్రాలతో దూసుకుపోతున్నాడు. ‘ఎవడు’, ‘మేజర్‌’, ‘హిట్‌ 2’ వంటి హ్యాట్రిక్ విజయాలతో మంచి ఊపు మీద ఉన్నాడు. ఈ క్రమంలోనే గతేడాది డిసెంబర్‌ ఓ పాన్ ఇండియా ప్రాజెక్ట్‌కు అడివి శేష్‌ ఓకే చెప్పాడు. స్టార్‌ హీరోయిన్‌ శృతి హాసన్‌ ఇందులో హీరోయిన్‌గా నటిస్తున్నట్లు అనౌన్స్‌మెంట్‌ రావడంతో ఒక్కసారిగా అందరి దృష్టి ఆ ప్రాజెక్ట్‌పై పడింది. Sesh Ex Shruti పేరుతో స్పెషల్‌ పోస్టర్‌ సైతం రిలీజ్‌ అయ్యింది. త్వరలోనే ఈ సినిమాను సెట్స్‌పైకి తీసుకొచ్చేందుకు మేకర్స్‌ సన్నాహాలు కూడా మెుదలుపెట్టారు. క్రమంలోనే హీరోయిన్ శ్రుతి హాసన్‌ చిత్ర యూనిట్‌కు ఝలక్ ఇచ్చినట్లు తెలుస్తోంది. ప్రాజెక్ట్‌ నుంచి అర్ధాంతరంగా తప్పుకున్నట్లు స్ట్రాంగ్‌ బజ్‌ వినిపిస్తోంది. హ్యాండ్ ఇచ్చిన శ్రుతి హాసన్‌! యంగ్‌ హీరో అడివి శేష్‌, స్టార్ హీరోయిన్ శ్రుతి హాసన్‌ కాంబోలో చిత్రం అనగానే ఒక్కసారిగా ఈ ప్రాజెక్ట్‌పై అందరి దృష్టి పడింది. షానియెల్‌ దేవ్‌ దర్శకత్వంలో లవ్‌, యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా రానున్న ఈ చిత్రానికి 'డెకాయిట్: ఏ లవ్‌ స్టోరీ' అనే టైటిల్‌ను సైతం ఖరారు చేశారు. ఇక సినిమాను పట్టాలెక్కించడమే తరువాయి అనుకున్న క్రమంలో ఈ ప్రాజెక్ట్‌ నుంచి అనూహ్యంగా శ్రుతి హాసన్‌ తప్పుకున్నట్లు తెలుస్తోంది. అయితే దీనికి గల స్పష్టమైన కారణాలు ఏంటో బయటకు రాలేదు. మూవీ టీమ్‌ కూడా ఎలాంటి అధికారిక ప్రకటన సైతం చేయలేదు. మరి శ్రుతి హాసన్‌ను కన్విన్స్‌ చేసి మళ్లీ తీసుకుంటారా? లేదా కొత్త హీరోయిన్‌ను ఎంపిక చేసుకుంటారా? అన్న దానిపై ప్రస్తుతం సందిగ్దం నెలకొంది. త్వరలోనే దీనిపై స్పష్టత వచ్చే ఛాన్స్ ఉంది.&nbsp; డెకాయిట్‌ స్టోరీ ఇదే! ప్రముఖ సినిమాటోగ్రాఫర్ షానీల్ డియో డెకాయిట్‌ చిత్రం ద్వారానే దర్శకుడిగా పరిచయమవుతున్నారు. ఈ చిత్రాన్ని సుప్రియ యార్లగడ్డ నిర్మిస్తున్నారు. ఇందులో హీరో, హీరోయిన్లు వరుస దోపిడీలకు పాల్పడుతూ ఉంటారని, అలా దొంగతనానికి పాల్పడుతున్న సమయంలోనే ఇద్దరు ప్రేమలో పడతారని మూవీ టీమ్‌ తెలిపింది. డెకాయిట్‌కు సంబంధించిన టీజర్‌ను కూడా గతేడాది డిసెంబర్‌లోనే రిలీజ్‌ చేశారు. ఇందులో అడివి శేష్‌, శ్రుతి హాసన్‌ కనిపించి సర్‌ప్రైజ్‌ చేశారు. కాగా తెలుగు, హిందీ భాషల్లో ఒకేసారి ఈ చిత్రం షూటింగ్‌ జరుపుకోనుంది.&nbsp; https://twitter.com/TrackTwood/status/1737423086188925221 బాలీవుడ్‌ స్టార్‌కు గాయం అడివి శేష్ (Adivi Sesh) నటించిన 'గూఢచారి' ఎంత‌టి విజ‌యం సాధించిందో అంద‌రికీ తెలిసిందే. ప్రస్తుతం దానికి సీక్వెల్‌గా రూపొందుతున్న 'జీ 2'లో అడివి శేష్‌ నటిస్తున్నాడు. బాలీవుడ్‌ స్టార్‌ ఇమ్రాన్‌ హష్మీ ఇందులో విలన్‌గా నటిస్తున్నాడు. ప్రస్తుతం హైదరాబాద్‌లో ఈ చిత్రానికి సంబంధించిన యాక్షన్‌ సీక్వెన్స్‌ రూపొందిస్తున్నారు. ఈ క్రమంలో నటుడు ఇమ్రాన్‌ హష్మీ గొంతు వద్ద గాయమైంది. జంపింగ్ సీన్స్ తీస్తున్న స‌మ‌యంలో మెడ స్వల్పంగా కట్ అయి ర‌క్తం కారింది. దీంతో షూటింగ్ కాస్త బ్రేక్ ఇచ్చి న‌ట్టు స‌మాచారం. వెంట‌నే వైద్యులు ఇమ్రాన్‌కు చికిత్స అందించారు. వినయ్ కుమార్ సిరిగినీడి దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీలో బ‌నితా సంధు (Banita Sandhu) హీరోయిన్‌గా మ‌ధుశాలిని, సుప్రియ యార్ల‌గ‌డ్డ కీల‌క పాత్ర‌ల్లో న‌టిస్తున్నారు. శ్రీచ‌ర‌ణ్ పాకాల (Sricharan Pakala) సంగీతం అందిస్తున్నాడు. https://twitter.com/Movies4u_Officl/status/1843311804039967199 అడివి శేష్‌ సినీ ప్రస్థానం ఆర్యన్ రాజేష్ హీరోగా వచ్చిన ‘సొంతం’ (Sontham) సినిమాలో చిన్న క్యారెక్టర్‌‌ చేసిన అడివి శేష్ ‘కర్మ’ (Karma) సినిమాతో హీరోగా పరిచయం అయ్యాడు. పవన్‌ కల్యాణ్‌ (Pawan Kalyan) నటించిన ‘పంజా’ (Panja) సినిమాలో విలన్‌గా నటించి గుర్తింపు తెచ్చుకున్నాడు. ‘రన్‌ రాజా రన్’, ‘బాహుబలి’ సినిమాల్లో కీలక పాత్రల్లో నటించిన అతడు ‘క్షణం’ (Kshanam), ‘గూఢచారి’ (Goodachari), ‘ఎవరు’ (Yevaru), ‘మేజర్’ (Major), ‘హిట్‌ 2’ (Hit 2) వంటి వైవిధ్యమైన చిత్రాలతో నమ్మదగిన హీరోగా మారిపోయాడు. ముఖ్యంగా ‘మేజర్‌’ సినిమాతో అడివి శేష్‌ మార్కెట్‌ అమాంతం పెరిగిపోయింది. ప్రస్తుతం అతడి చేతిలో గూఢచారి సీక్వెల్‌ (G2)తో పాటు, ‘డెకాయిట్’ వంటి పాన్‌ ఇండియా ప్రాజెక్ట్స్‌ ఉన్న సంగతి తెలిసిందే.&nbsp;
    అక్టోబర్ 08 , 2024
    <strong>LipLock Scenes In Telugu Movies: టాలీవుడ్‌ హీరోయిన్‌ల హాట్‌ లిప్‌లాక్‌ సీన్స్‌.. ఇవి చాలా హూట్‌ గురూ!&nbsp;&nbsp;</strong>
    LipLock Scenes In Telugu Movies: టాలీవుడ్‌ హీరోయిన్‌ల హాట్‌ లిప్‌లాక్‌ సీన్స్‌.. ఇవి చాలా హూట్‌ గురూ!&nbsp;&nbsp;
    సినిమాల్లో లిప్‌లాక్‌ సీన్లకు ఎంతో క్రేజ్ ఉంటుంది. ఒక పాత్ర మరో పాత్రపై ఉన్న ప్రేమను వ్యక్తం చేసే క్రమంలో ఈ ముద్దు సన్నివేశాలు వస్తుంటాయి. అయితే ఒకప్పుడు లిప్‌లాక్‌ సీన్ అంటే ఒక సెన్సేషన్‌. కానీ ప్రస్తుత సినిమాల్లో అవి కామన్‌గా మారిపోయాయి. కథ, సిట్చ్యూయేషన్‌ డిమాండ్‌ చేస్తే లిప్‌ లాక్‌ సీన్లకు రెడీ అంటూ పలువురు స్టార్ హీరోయిన్స్‌ బహిరంగంగానే ప్రకటించారు. ఆ మాటలకు కట్టుబడి ముద్దు సన్నివేశాల్లో నటించారు కూడా. టాలీవుడ్‌లో ముద్దు సీన్లలో నటించిన స్టార్‌ హీరోయిన్స్ ఎవరు? ఏ సినిమాల్లో చేశారు? ఇప్పుడు చూద్దాం.&nbsp; [toc] సమంత (Samantha) ‘ఏమాయ చేశావే’ చిత్రంతో నటి సమంత హీరోయిన్‌గా ఇండస్ట్రీలో అడుగుపెట్టింది. అందులో నాగచైతన్య ప్రేయసి పాత్రలో ఆమె అద్భుతమైన నటన కనబరిచింది. వీరిద్దరి మధ్య వచ్చే కిస్‌ సీన్స్ అప్పట్లో యూత్‌ను కట్టిపడేశాయి. ముఖ్యంగా చైతు, సమంత మధ్య వచ్చే ట్రైన్‌ సీన్‌లో వారిద్దరు లిప్‌కిస్‌లతో రెచ్చిపోయారు. ఇటీవల విజయ్‌ దేవరకొండతో చేసిన ‘ఖుషీ’ చిత్రంలోనూ సమంత లిప్‌లాక్‌ సీన్‌లో నటించింది.&nbsp; https://youtu.be/f1felGoecKE?si=pVGUjkN0VAIctHJg https://youtu.be/0oD68xOTg3Q?si=wGwFqNyNrGrzJBSS కాజల్‌ అగర్వాల్‌ (Kajal Aggarwal) మహేష్‌ బాబుతో కాజల్‌ ఓ లిప్‌లాక్‌ సీన్‌ చేసింది. ‘బిజినెస్‌ మ్యాన్‌’ చిత్రంలోని ‘చందమామ నవ్వే’ సాంగ్‌లో కాజల్ పెదాలపై మహేష్‌ కిస్‌ చేస్తాడు. ఈ సీన్‌ అప్పట్లో సెన్సేషన్‌ క్రియేట్‌ చేసిందని చెప్పవచ్చు. ఆ తర్వాత ‘బ్రహ్మోత్సవం’ చిత్రంలోనూ మహేష్‌తో ఓ లిప్‌లాక్‌ సీన్‌ కాజల్‌ చేసింది. అలాగే ‘ఆర్య 2’లో బన్నీతో కలిసి లిఫ్ట్‌లో ముద్దుసీనులో నటించింది.&nbsp; https://youtu.be/uGsFI3FmhnI?si=NO5P0FFGoh7S5W4n https://youtu.be/5Hi1Ss8blKo?si=4TVKPCplYiPEBi8q నయనతార (Nayanthara) ‘వల్లభ’ చిత్రంలో నటుడు శింభుతో కలిసి నయనతార రెచ్చిపోయింది. లిప్‌కిస్‌ సీన్లను ఏ మాత్రం బెరుకు లేకుండా చేసింది. అప్పట్లో వారిద్దరు రిలేషన్‌లో ఉన్నట్లు వార్తలు వచ్చాయి. ఈ క్రమంలోనే ఆమె ముద్దు సీన్లలో మెుహమాటపడలేదని సమాచారం.&nbsp; https://youtu.be/GYn1g47mFZc?si=16ytg37esqYLiSsW రష్మిక మందన్న (Rashmika Mandanna) నేషనల్‌ క్రష్‌ రష్మిక మందన్న సైతం రెండు చిత్రాల్లో అదర చుంబనం చేసింది. డియర్‌ కామ్రేడ్‌ చిత్రంలో విజయ్‌ దేవరకొండతో ముద్దు సీన్లలో నటించింది. అలాగే ఇటీవల వచ్చిన ‘యానిమల్‌’ చిత్రంలో రణ్‌బీర్‌ కపూర్‌తో రెచ్చిపోయింది.&nbsp; https://youtu.be/TSyLvBis830?si=OKi8o_8mIJGrU5dE https://youtu.be/Ma8GcZXvKeM?si=NfAYyztDJ4AtkNZj నేహా శెట్టి (Neha Shetty) యంగ్‌ బ్యూటీ నేహా శెట్టి డీజే టిల్లు చిత్రంలో సిద్ధు జొన్నలగడ్డతో కలిసి కొన్ని రొమాంటిక్ సీన్స్‌ చేసింది. ముఖ్యంగా ఓ పాట చివర్లో సిద్ధూకు డీప్‌ కిస్ ఇచ్చి మతి పోగొట్టింది. అలాగే ఇటీవల వచ్చిన ‘గ్యాంగ్స్‌ ఆఫ్‌ గోదావరి’ చిత్రంలోని ఓ పాటలో విశ్వక్‌ సేన్‌ పెదాలను తాకిస్తూ ముద్దు పెట్టింది. https://youtu.be/DzegLt5UZuM?si=x8QPhZlMXzjCkUfe https://youtu.be/GpcIMmvdY9A?si=RUvpds4l1NcH9zYz రుహానీ శర్మ (Ruhani Sharma) 'ఆగ్రా' మూవీలో రుహానీ శర్మ కొన్ని శృంగార సన్నివేశాల్లో మితిమీరిపోయి నటించింది. రొమాన్స్ చేస్తూ, హావభావాల చూపిస్తూ పచ్చిగా కనిపించింది. తెలుగు సినిమాల్లో పద్దతిగా నటించిన రుహానీని అగ్రా చిత్రంలో అలా చూసి సినీ లవర్స్ షాకయ్యారు. అలాగే ‘దిల్‌సే దిల్‌’ వీడియో సాంగ్‌లోనూ లిప్‌లాక్‌ సీన్‌లో ఆమె కనిపించింది. థియేటర్‌లో వచ్చే ముద్దు సీనులో ఆమె నటించింది. https://youtu.be/ooCxCQh1dcI?si=-3Ifodd842oG9k5k కేతిక శర్మ (Ketika Sharma) యంగ్‌ బ్యూటీ కేతిక శర్మ తన ఫస్ట్‌ ఫిల్మ్ ‘రొమాంటిక్‌’ మూవీలో ముద్దు సీన్లతో మైమరపించింది. డైరెక్టర్ పూరి జగన్నాథ్‌ తనయుడు ఆకాష్‌ పూరితో బస్‌లో ముద్దుల ప్రయాణం చేసింది. అలాగే ‘రంగ రంగ వైభవంగా’ మూవీలో పంజా వైష్ణవ్‌ తేజ్‌తోనూ లిప్‌లాక్‌ సీన్‌లో నటించింది.&nbsp; https://youtu.be/vXjWi6UQDMk?si=PUQ99x3oWOqQ7Ec7 https://youtu.be/tCc3R96puEI?si=LJeyKB98VHuCCeri డింపుల్‌ హయాతి (Dimple Hayathi) విశాల్‌తో చేసిన ‘సామాన్యుడు’ చిత్రంలో హీరోయిన్‌ డింపుల్‌ హయాతి లిప్‌లాక్‌ సీన్‌లో చేసింది. థియేటర్‌లో హీరో విశాల్‌ పెదాలపై ఎంతో క్యూట్‌గా ముద్దు పెట్టింది. అలాగే రవితేజ ‘కిలాడీ’ సినిమాలో బికినీలో కనిపించడంతో పాటు ఘాటు ముద్దు సీన్లు సైతం చేసింది.&nbsp; https://youtu.be/72xq28fxAj4?si=Vlm0s1dAnS2nIK1M https://youtu.be/LWOj-SxqES4?si=CTGBapB7zFw0giPF మాళవిక మోహన్‌ (Malavika Mohanan) మలయాళ నటి మాళవిక మోహన్‌ 'యుధ్రా' సినిమాతో ఇటీవల బాలీవుడ్‌లో అడుగుపెట్టింది. హీరో సిద్ధాంత్‌ ఛతుర్వేదితో కలిసి బోల్డ్‌ సీన్స్‌లో నటించింది. గతంలో ఈ స్థాయి రొమాన్స్ మాళవిక చేయలేదు. ముఖ్యంగా స్విమ్మింగ్‌ పూల్‌ సీన్‌లో ముద్దులతో విరుచుకుపడింది.&nbsp; https://youtu.be/QpWysxpVgkg?si=dmIpGe-s9c1qXLpK https://youtu.be/apzjoosKrHM?si=61ea0jQcIRmwX7d1 తృప్తి దిమ్రి (Tripti Dimri) బాలీవుడ్‌ భామ తృప్తి దిమ్రీ పేరు ‘యానిమల్‌’ చిత్రంతో ఒక్కసారిగా మారుమోగిపోయింది. ఇందులో రణ్‌బీర్‌ కపూర్‌తో కలిసి ఆమె ఇంటిమేట్‌ సీన్‌లో నటించింది. ఘాటైన లిప్‌లాక్‌తో కవ్వించింది. అలాగే ఇటీవల హిందీలో వచ్చిన ‘బ్యాడ్‌ న్యూస్‌’ సినిమాలోనూ నటుడు విక్కీ కౌశల్‌తో కలిసి ఆమె లిప్‌లాక్‌ సీన్‌ చేసింది.&nbsp; https://youtu.be/OWBr0mtA09w?si=PYy7JvnIBwQGeS6j పాయల్‌ రాజ్‌పుత్‌ (Payal Rajput) ‘RX100’ చిత్రంతో తెలుగు తెరకు పరిచయమైన పాయల్ రాజ్‌పుత్‌ అందులో హీరో కార్తికేయతో రొమాంటిక్‌ సీన్స్‌ చేసింది. లిప్‌లాక్‌ ముద్దులతో అతడ్ని ముంచెత్తింది. ‘RDX లవ్‌’ అనే మరో సినిమాలోనూ కుర్ర హీరోతో తన పెదాలను పంచుకుంది.&nbsp; https://youtu.be/M0A073kZqOs?si=Wem1xfWcBkihcjRP https://youtu.be/p63JKf879T4?si=4FmfuopZSq25C0p3 వైష్ణవి చైతన్య (Vaishnavi Chaitanya) యంగ్ బ్యూటీ వైష్ణవి చైతన్య ‘బేబీ’ చిత్రంతో ఒక్కసారిగా అందరి దృష్టిని ఆకర్షించింది. ఇందులో ఆమె పలు రొమాంటిక్‌ సీన్స్‌లో నటించింది. నటుడు విరాజ్‌తో కలిసి పబ్‌లో లిప్‌లాక్‌ సీన్‌ చేసింది. అలాగే ఇంటిమేట్‌ సీన్‌లోనూ కనిపించి హార్ట్‌ బీట్‌ను అమాంతం పెంచేసింది. https://youtu.be/dFo8klGt58Y?si=pi-dhy59FkD9CHnu కావ్యా థాపర్‌ (Kavya Thapar) గ్లామర్‌ బ్యూటీ కావ్యా థాపర్‌ కుర్ర హీరో సంతోష్‌ శోభన్‌తో కలిసి లిప్‌లాక్‌ సీన్‌ చేసింది. ‘ఏక్‌ మినీ కథ’ చిత్రంలోని ఓ సాంగ్‌లో ఘాటైన రొమాన్స్‌ చేసింది.&nbsp; https://youtu.be/Vbnp6wIf8XY?si=bmWPAr5lWg-YgNOn అనుపమా పరమేశ్వరన్‌ (Anupama Parameswaran) ఒకప్పుడు ట్రెడిషనల్‌ పాత్రలతో ఆకట్టుకున్న అనుపమా పరమేశ్వరన్‌ ఈ మధ్య కాలంలో రొమాంటిక్‌ సీన్స్‌కు పెద్ద పీట వేస్తోంది. యూత్‌ను ఆకర్షించే క్రమంలో ‘రౌడీ బాయ్స్‌’, ‘టిల్లు స్క్వేర్‌’ చిత్రాల్లో రెచ్చిపోయింది. హీరోలను ముద్దులతో ముంచెత్తింది.&nbsp; https://youtu.be/vm8sg_Gtwf8?si=a0zPMR1VSnhROOIX https://youtu.be/-GqC3e4K4f0?si=ilK643bC0cRF8Uus https://youtu.be/ZY6U0N0jxtE?si=kZ1d5zGrK75cP-q- షాలిని పాండే (Shalini Pandey) అర్జున్‌ రెడ్డి చిత్రంతో నటి షాలిని పాండే టాలీవుడ్‌కు పరిచయమైంది. ఇందులో విజయ్‌ దేవరకొండతో కలిసి మల్టిపుల్ లిప్‌ లాక్‌ సీన్స్‌ చేసింది.&nbsp; https://youtu.be/p8OExtmSVQc?si=a7d-gIT9KwGMbW0A https://youtu.be/y9nY4xZ7d9c?si=g7NIk_s8k8M1MOm- శోభితా దూళిపాళ్ల (Sobhita Dhulipala) ప్రముఖ హీరోయిన్‌ శోభితా దూళిపాళ్ల కూడా పలు లిప్‌లాక్‌ సీన్లలో నటించింది. 'మేడ్‌ ఇన్‌ హెవెన్‌' వెబ్‌సిరీస్‌లో బోల్డ్‌ సీన్స్‌లో రచ్చ రచ్చ చేసింది. అలాగే ‘మంకీ మ్యాన్‌’ అనే హాలీవుడ్‌ మూవీలోనూ ఈ అమ్మడు ముద్దు సీన్లలో నటించింది. టాలీవుడ్‌ నటుడు నాగ చైతన్యతో శోభితాకు నిశ్చితార్థం జరిగిన సంగతి అందరికీ తెలిసిందే.&nbsp; https://youtu.be/-sZwctU1-AI?si=u7O55-nGt5lABZG4 https://youtu.be/ui5J3MMqyks?si=ORhbahScSjs_xvLu మానసా చౌదరి (Maanasa Chowdary) రోషన్‌ కనకాల హీరోగా పరిచయమైన 'బబుల్‌ గమ్‌' చిత్రంలో మానస చౌదరి హీరోయిన్‌గా చేసింది. ఈ సినిమాలో హీరో హీరోయిన్ల మధ్య లిప్‌ లాక్‌ సీన్స్‌ కాస్త ఎక్కువగానే ఉన్నాయి. ఒక్క సాంగ్‌లోనే ఏకంగా 14 లిప్‌ లాక్స్‌ ఉన్నాయి.&nbsp; https://youtu.be/ASWoafIYNpg?si=_4DmWUSQO03DibjZ https://youtu.be/jK5Yz41NqSU?si=I9juu_-cUhn2NCBU
    అక్టోబర్ 05 , 2024

    @2021 KTree