• TFIDB EN
  • మనం
    UATelugu2h 43m
    పునర్జన్మలు - ప్రేమతో ముడిపడిన పాత్రల చుట్టు తిరిగే కథతో సినిమా రూపొందింది. ఈ భావోద్వేగ ప్రయాణంలో ఎలాంటి సంఘటనలు చోటుచేసుకున్నాయి అన్నది కథ.
    ఇంగ్లీష్‌లో చదవండి
    మూవీ & ఓటీటీ అప్‌డేట్స్‌
    స్ట్రీమింగ్‌ ఆన్‌SunNextఫ్రమ్‌
    Watch
    రివ్యూస్
    How was the movie?

    తారాగణం
    అక్కినేని నాగేశ్వరరావు
    చైతన్య
    నాగార్జున
    సీతారాముడు
    నాగ చైతన్య
    రాధామోహన్ మరియు నాగార్జున
    శ్రియా శరన్
    రామలక్ష్మి మరియు డాక్టర్ అంజలి
    సమంత రూత్ ప్రభు
    కృష్ణ వేణి మరియు ప్రియ
    బ్రహ్మానందం
    గిరీష్ కర్నాడ్
    అలీ
    లియోనార్డో డికాప్రియో
    ఎంఎస్ నారాయణ
    తండ్రి ఫ్రాన్సిస్
    జయ ప్రకాష్ రెడ్డి
    హోం మంత్రి జె.పి
    చలపతి రావు
    వ్యాపారి
    పోసాని కృష్ణ మురళి
    ఇన్‌స్పెక్టర్ ధర్మ
    శంకర్ మెల్కోటే
    ప్రేమ తండ్రి
    కృష్ణుడు
    డాక్టర్
    రామచంద్రడాక్టర్ బాబు రావు
    చిత్రం శీను
    కానిస్టేబుల్ శ్రీను
    సప్తగిరి
    నాగార్జున స్నేహితుడు
    గుండు సుదర్శన్
    వివాహ బ్రోకర్
    అంబటి శ్రీనివాస్‌హోంమంత్రి సహాయకుడు
    దువ్వాసి మోహన్
    హోం మంత్రి సహాయకుడు
    శరణ్య పొన్వన్నన్
    సీతారాముడు తల్లి
    తేజస్వి మదివాడ
    దివ్య
    సత్య కృష్ణ
    లెక్చరర్
    కౌశల్ శర్మ
    యశ్వర్ధన్ సింగ్యంగ్ బిట్టు
    అమితాబ్ బచ్చన్
    ప్రతాప్ జీ
    అఖిల్ అక్కినేని
    as Akhil
    సిబ్బంది
    విక్రమ్ కె. కుమార్
    దర్శకుడు
    Akkineni familyనిర్మాత
    అనూప్ రూబెన్స్
    సంగీతకారుడు
    పిఎస్ వినోద్
    సినిమాటోగ్రాఫర్
    ప్రవీణ్ పూడి
    ఎడిటర్ర్
    ఎడిటోరియల్ లిస్ట్
    కథనాలు
    విజయ్ దేవరకొండ, సమంత జంటగా నటించిన ‘ఖుషీ’ చిత్రం థియేటర్లలోకి రాకముందే మనం తప్పక చూడాల్సిన ప్రేమ కథా చిత్రాలు
    విజయ్ దేవరకొండ, సమంత జంటగా నటించిన ‘ఖుషీ’ చిత్రం థియేటర్లలోకి రాకముందే మనం తప్పక చూడాల్సిన ప్రేమ కథా చిత్రాలు
    ]తమిళ మూవీ ‘96’కు రీమేక్‌గా ‘జాను’ చిత్రం వచ్చింది. శర్వానంద్, సమంతలు తమ నటనతో సినిమాలోని పాత్రలకు జీవం పోశారు. అపరిమితమైన ప్రేమ కాన్సెప్ట్‌తో ఈ చిత్రం రూపుదిద్దుకుంది. నువ్వు ప్రేమించిన వారితో నువ్వు కలకాలం కలసి ఉండలేవు థీమ్‌తో సినిమా నిర్మించారు.జానుDownload Our App
    ఫిబ్రవరి 11 , 2023
    జీవితంలో తప్పక చూడాల్సిన ‘బ్రూస్ లీ’ చిత్రాలు
    జీవితంలో తప్పక చూడాల్సిన ‘బ్రూస్ లీ’ చిత్రాలు
    ]1970లో వచ్చిన బ్రూస్ లీ చిత్రాల నుంచి సన్నివేశాలను ఎన్నో దేశాలు, ఎన్నో భాషల్లో కాపీ కొట్టారు. ఏదీ ఏమైనా ఇవి ఎప్పటికీ మర్చిపోలేని సినిమాలు. ఇలాంటి చిత్రాలే లీని ఆస్థాయిలో నిలబెట్టాయి. ఈ సినిమాలు చూసిన తర్వాత కచ్చితంగా మనం బ్రూస్ లీని ప్రేమిస్తాం.ఎన్నో భాషల్లోకి..
    ఫిబ్రవరి 14 , 2023
    Kamal Hassan: ‘కల్కి’పై కమల్‌ హాసన్‌ క్రేజీ కామెంట్స్‌.. 27 ఏళ్ల తర్వాత స్టార్‌ హీరోయిన్‌ రీఎంట్రీ!
    Kamal Hassan: ‘కల్కి’పై కమల్‌ హాసన్‌ క్రేజీ కామెంట్స్‌.. 27 ఏళ్ల తర్వాత స్టార్‌ హీరోయిన్‌ రీఎంట్రీ!
    పాన్‌ ఇండియా స్టార్‌ ప్రభాస్‌ (Prabhas) హీరోగా గ్లోబల్‌ మార్కెట్‌ను టార్గెట్‌ చేస్తూ రూపొందిన చిత్రం 'కల్కి 2898 ఏడి' (Kalki 2898 AD). నాగ్‌ అశ్విన్‌ (Nag Ashwin) డైరెక్షన్‌లో వస్తోన్న ఈ చిత్రం.. యావత్‌ దేశం దృష్టిని ఆకర్షిస్తోంది. సైంటిఫిక్‌ ‌అండ్ ఫ్యూచరిక్‌ జానర్‌లో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో ప్రతినాయకుడిగా దిగ్గజ నటుడు కమల్‌ హాసన్‌ (Kamal Hassan) నటించారు. దీంతో ఆయన పాత్ర ఎలా ఉండబోతుందన్న ఆసక్తి అందరిలోనూ నెలకొంది. అయితే కల్కి గురించి ఇప్పటివరకూ పెద్దగా కామెంట్స్‌ చేయని కమల్‌.. తాజాగా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలు కల్కిపై అంచనాలను మరింత పెంచుతున్నాయి కమల్‌ ఏమన్నారంటే దేశం గర్వించతగ్గ నటుల్లో కమల్‌ హాసన్‌ ఒకరు. ఆయన యూనివర్సల్ స్టార్‌గానూ గుర్తింపు పొందారు. అటువంటి కమల్‌.. కల్కిలో ఓ ఇంపార్టెంట్‌ రోల్‌లో కనిపించనున్నారని తెలియగానే సినిమాపై అంచనాలు మరింత పెరిగాయి. అయితే తాజాగా కల్కి సినిమాపై స్పందించిన కమల్‌.. ఈ చిత్రాన్ని హవర్‌ గ్లాస్‌తో పోల్చారు. మనం ఎలా టర్న్‌ చేస్తే అలా సినిమా తిరుగుతుందని వ్యాఖానించారు. ఇలాంటి సినిమాలో నటించడం చాలా ఆసక్తికరమని చెప్పారు. ఇప్పటివరకు చేసిన 230 చిత్రాల్లో ఈ తరహా సినిమాను చేయలేదని చెప్పుకొచ్చారు. కమల్‌ చేసిన ఈ వ్యాఖ్యలు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి.  కల్కిలో భారీ కాస్టింగ్‌ ప్రతిష్టాత్మంగా రూపొందుతున్న కల్కి చిత్రంలో.. హీరో ప్రభాస్‌, కమల్‌ హాసన్‌లతో పాటు అమితాబ్‌ బచ్చన్‌, దీపికా పదుకొనే, దిశా పటానీ నటిస్తున్న సంగతి తెలిసిందే. అయితే లేటెస్ట్ బజ్‌ ప్రకారం మరింత మంది స్టార్ నటులు కల్కిలో కనిపించబోతున్నారు. గతంలో ప్రచారం జరిగిన విధంగా ఎస్‌.ఎస్‌ రాజమౌళి (SS Rajamouli), ఆర్జీవీ (RGV), విజయ్‌ దేవరకొండ (Vijay Deverakonda), హీరో నాని (Nani) ఈ సినిమాలో అతిథి పాత్రల్లో కనిపించనున్నారట. వీరితో పాటు దుల్కర్‌ సల్మాన్‌, మృణాల్‌ ఠాకూర్‌, రానాలు కూడా గెస్ట్‌ రోల్స్‌లో అలరించబోతున్నట్లు తాజాగా నెట్టింట ప్రచారం జరుగుతోంది. కాగా, ఇప్పటికే సినిమాలోని బుజ్జి అనే రోబొటిక్‌ వాహనానికి హీరోయిన్‌ కీర్తి సురేష్‌ తన వాయిస్‌ అందించింది. ఇలా ఇంతమంది స్టార్‌ నటీనటులు కల్కిలో భాగస్వామ్యం కావడంతో సినిమాపై అంచనాలు తారా స్థాయికి చేరాయి.  అలనాటి నటి గ్రాండ్‌ ఎంట్రీ! కల్కి సినిమాలో కనిపించబోయే స్టార్‌ క్యాస్టింగ్‌లలో ప్రధానంగా ఓ నటి పేరు అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. ఒకప్పటి స్టార్‌ హీరోయిన్‌ అయిన శోభన (Actress Shobana) కూడా కల్కిలో ఓ కీలక పాత్రలో కనిపించబోతున్నట్లు ఫిల్మ్‌ వర్గాల్లో టాక్‌ వినిపిస్తోంది. నటి శోభన తెలుగులో సినిమాలు చేసిన రెండు దశాబ్దాలు దాటి పోయింది. 1997 తర్వాత ఆమె తెలుగులో ఏ సినిమా చేయలేదు. ఈ క్రమంలో ఇప్పుడు కల్కిలో ఆమె రీఎంట్రీ ఇవ్వబోతున్నట్లు స్ట్రాంగ్‌ బజ్‌ వినిపిస్తోంది. సుమారు 27 ఏళ్ల తర్వాత ఆమె తెలుగు తెరపై మెరవబోతున్నారు. కాగా, ఈ సినిమాలో హాస్య నటుడు బ్రహ్మానందం కూడా ఓ ముఖ్యమైన పాత్రలో కనిపించనున్నారు. జూన్‌ రెండో వారంలో ట్రైలర్‌! విడుదల తేదీ దగ్గర పడుతుండటంతో కల్కి టీమ్‌ ప్రమోషన్స్‌ జోరు పెంచింది. ఇప్పటికే 'బుజ్జి అండ్‌ భైరవ' అనే యానిమేటెడ్‌ సిరీస్‌ను ఓటీటీలో లాంచ్‌ చేసి ప్రేక్షకుల్లో ఆసక్తిని పెంచింది. దీనికి కొనసాగింపుగా త్వరలో ట్రైలర్‌ కూడా తీసుకురావాలని మేకర్స్ భావిస్తున్నారు. ఇందుకు సంబంధించిన వర్స్క్‌ కూడా మెుదలైనట్లు ఫిల్మ్‌ వర్గాల్లో టాక్‌ వినిపిస్తోంది. జూన్‌ రెండో వారంలో ట్రైలర్‌ లాంచ్ అయ్యే అవకాశమున్నట్లు సమాచారం. విజువల్‌ వండర్‌లా ట్రైలర్‌ ఉంటుందని, అసలు కంటెంట్‌ను ఇందులో చూపిస్తారని సమాచారం. మరి ఈ ట్రైలర్ ఏ మేరకు ఆడియన్స్‌ను అట్రాక్ట్‌ చేస్తుందో చూడాలి. 
    జూన్ 04 , 2024
    #90s A Middle Class Biopic: #90s వెబ్ సిరీస్‌ ఎందుకు చూడాలంటే? ఇందులో ఉన్న గొప్ప విషయం ఏమిటి? 
    #90s A Middle Class Biopic: #90s వెబ్ సిరీస్‌ ఎందుకు చూడాలంటే? ఇందులో ఉన్న గొప్ప విషయం ఏమిటి? 
    నిన్నటి గతాన్ని భద్రపరిచి నేటి తరానికి అందిస్తూ.. ఆనాటి మంచి, చెడు, ఆనందాలు, సమస్యలు అన్నింటిని హానెస్ట్‌గా చూపించింది #90s MiddleClass Biopic. మిడ్ 2000ను ఒక కాలచక్రంలో బంధించి అందమైన పాత్రల భావోద్వేగాలను చూపిస్తుంది. వెబ్‌సిరీస్‌లో పెద్దగా చెప్పుకోవడానికి కథేమి ఉండదు. కానీ ప్రతి వ్యక్తి జీవితంలో డే టూ డే లైఫ్‌ను అద్భుతంగా తెరకెక్కించింది. సిల్లీ సండే మూమెంట్స్, పండుగలు, హాలిడే ఎంజాయ్‌మెంట్‌ను కళ్లకు అద్ధినట్లు చూపిస్తుంది. నిజానికి ఇదే కదా లైఫ్‌ అంటే. మనం బ్రతికేది ఆ మూమెంట్స్‌లోనే కదా! చాలా విషయాలు మనం ఏదొక అజెండాతో చేస్తాం. ఎలాంటి ఎజెండా లేకుండా మనం చేసే పనులే మన లైఫ్. సరిగ్గా అలాంటి విషయాలను దగ్గరకు తెచ్చినదే #90s MiddleClass Biopic. ఈ సిరీస్ చూస్తున్నంతసేపూ అన్ని సీన్లు మన నిజ జీవితంలో ఎక్కడొక్కడ మనకు తారసపడినవే. వాటినే అద్భుతంగా తెరకెక్కించాడు డైరెక్టర్ ఆదిత్య హాసన్. లెడీస్ తాలుకు సెన్సిటివ్ విషయాలను చాలా సూపర్బ్‌గా షోలో క్యారీ చేయించాడు. ఇక 90s A MiddleClass Biopic టాప్‌లో ట్రెండ్‌ అవుతోంది. ఈటీవి విన్‌ ఫ్లాట్‌ఫాం నుంచి వచ్చిన ఈ  వెబ్‌సిరీస్‌కు IMDB ఏకంగా 9.6 రేటింగ్ ఇచ్చింది. ఈ మధ్యకాలంలో ఓ వెబ్‌సిరిస్‌కు ఈ స్థాయిలో రేటింగ్ రాలేదనే చెప్పాలి. ఈ మిడిల్ క్లాస్ బయోపిక్‌లో 90వ దశకం మధ్యతరగతి వాతావరణాన్ని చాలా అద్భుతంగా చూపించారు. ప్రతి పాత్ర ఆ కాలం నాటి సాధక బాధకాలను కళ్లకు కట్టింది. ముఖ్యంగా 90sలో పుట్టినవారికి బాగా కనెక్ట్ అవుతుంది. సోషల్ మీడియాలో చాలా వరకు పోస్టులు ఈ వెబ్‌సిరీస్‌లోని ఏదొక సీన్‌తో కనిపిస్తున్నాయి. ముఖ్యంగా ఆ పాత్రలను అభిమానులు బాగా ఓన్ చేసుకున్నారు. మరి అంతలా అభిమానించే విధంగా ఆ వెబ్‌సిరీస్‌లో క్లారెక్టర్ల తాలుకు ఔచిత్యాన్ని  ఓసారి విశ్లేషిద్దాం. చంద్రశేఖర్(శివాజీ):  ఓ ప్రభుత్వ పాఠశాలలో లెక్కల మాస్టార్‌. మధ్యతరగతి మనస్తత్వం కలవాడు. భార్య రాణి (వాసుకీ), పిల్లలు రఘు (ప్రశాంత్), దివ్య (వాసంతిక), ఆదిత్య (రోహన్)తో కలిసి సాధారణ జీవితం గడుపుతుంటాడు.  ప్రభుత్వ టీచర్‌ అయినప్పటికీ పిల్లల్ని ప్రైవేటు స్కూల్లో చదివిపిస్తూ వారి చదువుల విషయంలో కఠినంగా వ్యవహరిస్తుంటాడు. 10th చదువుతున్న రఘు జిల్లా ఫస్ట్‌ వస్తాడని చంద్రశేఖర్ ఆశిస్తాడు. ఖర్చు విషయంలో ప్రతి రూపాయిని ఆచితూచి ఖర్చు పెడుతుంటాడు. పిల్లల భవిష్యత్ గురించి కలలుగంటగా పనిచేస్తుంటాడు. సినిమా చూస్తున్నంత సేపు శేఖర్ క్యారెక్టర్ 90వ దశకంలో సగటు తండ్రి ఆలోచనలకు ప్రతినిధిగా కనిపిస్తాడు. పిల్లల పట్ల అతను వ్యవహరించే తీరు నవ్వు తెప్పిస్తుంది. కొన్ని చోట్ల వారి భవిష్యత్ గురించి సగటు తండ్రిగా శేఖర్ పడే బాధ కంటతడి పెట్టిస్తుంది. ఆడ పిల్ల తండ్రి కావడంతో ఆమెకు ఏదో ఒకటి కూడ బెట్టాలన్న మధ్యతరగతి సమస్యలు కనిపిస్తుంటాయి. పిల్లల చదువు విషయంలో కఠినంగా ఉంటూనే వారికి అందించాల్సి సౌకర్యాల కోసం ఆలోచిస్తుంటాడు.  https://twitter.com/sunny5boy/status/1745383429808517544?s=20 రాణి(వాసుకీ): ఈ వెబ్‌సిరీస్‌లో సగటు మధ్యతరగతి గృహిణిగా రాణి పాత్రలో వాసుకీ ఆనంద్ అద్భుతమైన నటన కనబర్చింది. నిరంతరం కుటుంబం కోసం ఆలోచించే గృహిణి పాత్రలో ఒదిగిపోయింది. భర్త తెచ్చిచ్చే కాస్త డబ్బును పొదుపుగా ఖర్చు చేస్తుంటుంది. భర్తకు తన బాధ్యతలు గుర్తు చేస్తూ అనవసర ఖర్చులను తగ్గించేందుకు ప్రయత్నిస్తుంది. ఇక ఆడపిల్ల ఉన్న ఇంట్లో మధ్యతరగతి గృహిణి భయాలు ఆమెలో స్పష్టంగా కనిపించాయి. పిల్లల కోరికలను తీర్చుతునే... అనవసరమైన ఆశలకు ఫుల్ స్టాప్ పెడుతూ ఆనాటి జీవనగతిని కళ్లకు కట్టింది. https://twitter.com/Ga_ne_sh_5/status/1745774847375069388?s=20 ఆదిత్య: ముఖ్యంగా ఈ సినిమాకు నిజమైన హీరో మౌలి అనే చెప్పాలి. చిన్నవయసులోనే అద్భుతమైన నటన కనబరిచాడు. అతన్ని చూస్తుంటే ప్రతింట్లో ఉండే చిన్న కొడుకు మాదిరి కనిపిస్తాడు.  సాధారణంగా ఇళ్లల్లో చిన్న కొడుకు గారాభంగా పెరుగుతుంటారు. వాళ్లు చేసే అల్లరి అంతా ఇంతా కాదు. ఇంట్లో వంట నచ్చకపోతే మారం చేయడం, తోటి పిల్లలను ఆట పట్టించడం వంటి చేష్టలు హాస్యంగా కనిపిస్తాయి. మార్కులు తక్కువ వచ్చినప్పుడు అమ్మ-నాన్న దగ్గర ఆదిత్య చెప్పే అబద్దాలు కడుపుబ్బ నవ్విస్తాయి. ఇంటికి ఎవరైన చుట్టాలు వచ్చినప్పుడు వారివద్ద చిన్నపిల్లలు చేసే సరదా చేష్టలు ఆదిత్య క్యారెక్టర్ 90s కాలాన్ని గుర్తు చేస్తాయి.  ముఖ్యంగా ఆ వయసులో చిన్నపిల్లలు పడే మానసిక వ్యథ.. ఆదిత్య పాత్రలో ప్రతిబింబిస్తుంది. సోషల్ మీడియాలోనూ ఎక్కువగా ఆదిత్య- చంద్రశేఖర్ క్యారెక్టర్‌కు సంబంధించిన సీన్లు ఎక్కువగా ట్రెండింగ్‌లో ఉన్నాయి. https://twitter.com/Iharish999/status/1744674325352132686?s=20 ప్రశాంత్ &దివ్య: పదోతరగతి చదువుతున్న ప్రశాంత్ టీనేజ్ కుర్రాడి మనస్తత్వం ఎలా ఉంటుందో అలాగే ఉంటాడు. బయట ఆడుకోవాలని ఉన్నా, తన తండ్రి మాట కోసం ఎప్పుడు చదువుతూనే ఉంటాడు. 10thలో జిల్లా ఫస్ట్ రావాలనే తన తండ్రి కోరిక కోసం పరిశ్రమిస్తుంటాడు. అతని తమ్ముడు ఆదిత్యతో చేసే సరదా సన్నివేశాలు కడుపుబ్బ నవ్విస్తాయి. ఇక దివ్య మధ్యతరగతి కుటుంబంలో అమ్మాయి పుడితే ఎలా పెరుగుతుందో అలాగే కనిపించింది. తల్లిద్రండ్రుల భయాల మధ్య వారి మాటకు అనుగుణంగా పెరుగుతూ కనిపిస్తుంది. https://twitter.com/_Shivatweets/status/1745269317112119543?s=20 https://telugu.yousay.tv/90s-web-series-review-how-is-the-90s-series-a-reflection-of-middle-class-families.html
    జనవరి 16 , 2024
    Dhootha Review: జర్నలిస్టుగా నాగ చైతన్య అదుర్స్.. ‘ధూత’ సిరీస్ ఎలా ఉందంటే?
    Dhootha Review: జర్నలిస్టుగా నాగ చైతన్య అదుర్స్.. ‘ధూత’ సిరీస్ ఎలా ఉందంటే?
    నటీనటులు: అక్కినేని నాగ చైతన్య, ప్రియా భవానీ శంకర్, ప్రాచీ దేశాయ్, పార్వతి తిరువొతు, రవీంద్ర విజయ్, జయప్రకాశ్ తదితరులు రచన, దర్శకత్వం: విక్రమ్ కె కుమార్ ఛాయాగ్రహణం: మికొలాజ్ సైగుల సంగీతం: ఇషాన్ చబ్రా నిర్మాత: శరత్ మరార్  ఓటీటీ వేదిక: అమెజాన్ ప్రైమ్ వీడియో ఎపిసోడ్స్‌: 8 విడుదల తేదీ: డిసెంబర్ 1, 2023   సరికొత్త కథలతో సినిమాలను తెరకెక్కించడంలో డైరెక్టర్‌ విక్రమ్ కె కుమార్ శైలే వేరు. '13బి', 'ఇష్క్', 'మనం', '24' వంటి మెమరబుల్ ఫిల్మ్స్‌కు ఆయన దర్శకత్వం వహించారు. అటువంటి విక్రమ్‌ తొలిసారి దర్శకత్వం వహించిన వెబ్ సిరీస్ 'దూత'. ఇందులో అక్కినేని నాగ చైతన్య హీరోగా నటించడం విశేషం. '13బి' తర్వాత సూపర్ నేచురల్ జానర్ మరోసారి టచ్ చేశారు విక్రమ్ కె కుమార్. అతీంద్రియ శక్తుల నేపథ్యంలో ఆయన తీసిన 'దూత' ఎలా ఉంది? ఓటీటీ ప్రేక్షకులను మెప్పించిందా? ఈ రివ్యూలో చూద్దాం.  కథ సాగర్ వర్మ (నాగ చైతన్య) జర్నలిస్ట్. కొత్తగా ప్రారంభమైన సమాచార్ దిన పత్రికకు చీఫ్ ఎడిటర్‌గా వ్యవహరిస్తుంటాడు. ఓ రోజు ధాబాలోకి వెళ్లిన సాగర్‌కు ఓ పేపర్ కటింగ్ కనిపిస్తుంది. అందులో రాసినట్టు కారుకు యాక్సిడెంట్ జరిగి పెంపుడు కుక్క మరణిస్తుంది. ఆ తర్వాత మరికొన్ని పేపర్ కటింగ్స్ సాగర్ వర్మ కంట పడతాయి. వాటిలో రాసినట్టుగా ప్రమాదాలు జరుగుతూ ఉంటాయి. అందుకు కారణం ఏంటి? జరగబోయే ప్రమాదాన్ని ముందే పేపర్లలో రాస్తోంది ఎవరు? అతని ప్రయాణంలో భార్య ప్రియా (ప్రియా భవానీ శంకర్), పీఏ కమ్ జర్నలిస్ట్ అమృత (ప్రాచీ దేశాయ్), డీసీపీ క్రాంతి (పార్వతి తిరువొతు) పాత్రలు ఏమిటి? అనేది సిరీస్ చూసి తెలుసుకోవాల్సిందే.  ఎవరెలా చేశారంటే గ్రే షేడ్స్ ఉన్న పాత్రలో నాగ చైతన్య అదరగొట్టాడు. తన లుక్స్‌, ఎక్స్‌ప్రెషన్స్‌తో సిరీస్‌ ఆసాంతం నాగచైతన్య ఇంప్రెస్‌ చేస్తాడు. అతడి తర్వాత ఆ స్థాయిలో ఆకట్టుకునేది పార్వతి తిరువొతు నటన. ఎస్పీ క్రాంతిగా ఆమె ఒదిగిపోయారు. సహజంగా నటించారు. కథలో ప్రాచీ దేశాయ్, ప్రియా భవానీ శంకర్ పాత్రలు పరిమితమే. కానీ, ఉన్నంతలో తమ ఉనికి చూపించారు. జయప్రకాశ్ తనకు అలవాటైన నటనతో అలరిస్తారు. రవీంద్ర విజయ్, చైతన్య, రోహిణి, ఈశ్వరీ రావు, అనీష్ కురువిల్లా, జీవన్ కుమార్, కామాక్షీ భాస్కర్ల తదితరులు తమ పాత్ర పరిధి మేరకు నటించారు. ఫ్లాష్ బ్యాక్‌లో వచ్చే సీన్లలో పశుపతి, తరుణ్ భాస్కర్, తనికెళ్ళ భరణి, రాజా గౌతమ్, సత్య కృష్ణన్ మెప్పించారు. ఓ సన్నివేశంలో బ్రహ్మానందం తనయుడు రాజా గౌతమ్ నటన ఆశ్చర్యపరుస్తుంది. డైరెక్షన్ ఎలా ఉందంటే? విక్రమ్‌ కె కుమార్‌ దర్శకత్వ నైపుణ్యాలు ఈ సిరీస్‌లోనూ కనిపిస్తాయి. దూత కథ ఏమిటనేది ఐదారు ఎపిసోడ్స్‌ తర్వాత గానీ క్లారిటీ రాదు. అయినప్పటికీ వీక్షకులకు ఎక్కడా బోర్‌ కొట్టకుండా సిరీస్‌ను నడిపించారు డైరెక్టర్‌. చిన్న చిన్న చమక్కులు, మెరుపులతో ఆసక్తి సన్నగిల్లకుండా చూశారు. ఇక మీడియాపైనా కొన్ని చమక్కులు పేల్చారు డైరెక్టర్‌. రాజకీయ నాయకుల చేతిలో జర్నలిస్టులు పావులుగా మారుతున్న తీరును ఆయన చక్కగా చూపించారు. జర్నలిజంతో పాటు రాజీకయం, పోలీసు వ్యవస్థల్లోనే మంచి, చెడులను కళ్లకు కట్టారు. అయితే ఒక్కో ఎపిసోడ్‌ 40-50 నిమిషాల మధ్య ఉండటం వల్ల డైరెక్టర్‌ కథను సాగదీసిన ఫీలింగ్ కల్గుతుంది. ఓవరాల్‌గా విక్రమ్‌ కె కుమార్‌ డైరెక్షన్‌కు మంచి మార్కులే పడ్డాయి.  సాంకేతికంగా సాంకేతిక అంశాల పరంగా 'దూత' సిరీస్‌ ఉన్నత స్థాయిలో ఉంది. మికొలాజ్ సైగుల సినిమాటోగ్రఫీ పనితనం మెప్పిస్తుంది. సన్నివేశాలను చిత్రీకరించిన తీరు బాగుంది. ముఖ్యంగా వర్షంలో సన్నివేశాలను ఆయన బాగా తీశారు. అటు నేపథ్య సంగీతం కూడా మెప్పిస్తుంది. చెవులకు ఇబ్బంది కలిగించే శబ్దాలు లేవు. కథతో పాటు ఆర్ఆర్ ట్రావెల్ చేసింది. నిర్మాణ విలువలు సైతం బావున్నాయి. ప్లస్‌ పాయింట్స్‌ నాగ చైతన్య నటనసస్పెన్స్‌ & క్యూరియాసిటీనేపథ్య సంగీతం మైనస్‌ పాయింట్స్‌ ఫ్లాష్‌బ్యాక్ ఎపిసోడ్‌సాగదీత సీన్లు రేటింగ్‌: 3.5/5
    డిసెంబర్ 01 , 2023
    Fathers Day: మీ నాన్న ఈ క్యారెక్టర్లలో ఏ టైపు… ఓసారి చూసుకోండి!
    Fathers Day: మీ నాన్న ఈ క్యారెక్టర్లలో ఏ టైపు… ఓసారి చూసుకోండి!
    లోకంలో నాన్నలందరూ ఒకేలా ఉండరు. ఒక్కొకరిది ఒక్కో తీరు. ఒకరితో మరొకరికి పోలిక ఉండదు. కొందరు కుటుంబ బాధ్యతల్ని స్వయంగా చూసుకుంటారు. మరికొందరు భార్యతో పంచుకుంటారు. కొన్ని సినిమాల్లోని ఫాదర్ల క్యారెక్టర్‌ని చూస్తే.. అరెరే అచ్చం మా నాన్న లాగే ఉన్నాడే అంటూ పోల్చుకుంటారు. అయితే, కొన్ని సినిమాల్లోని తండ్రి పాత్రలు మాత్రం ఎప్పటికీ గుర్తుండిపోతాయి. నాన్న అంటే ఇలాగే ఉండాలన్న స్ఫూర్తిని కలిగిస్తాయి. ఫాదర్స్ డే(జూన్ 18) సందర్భంగా ఆ సినిమాలేంటో ఓ సారి చూసేద్దాం.  బొమ్మరిల్లు నాన్న పాత్ర అంటే మనందరికీ మొదటగా గుర్తొచ్చేది బొమ్మరిల్లు సినిమానే. ‘మీ నాన్న బొమ్మరిల్లు ఫాదర్‌రా..!’ అనేంతలా ప్రాచుర్యం పొందిందీ పాత్ర. ఇప్పటికీ ఈ సినిమా గురించి మాట్లాడుకుంటారు. సిద్ధార్థ్‌కి తండ్రి పాత్రలో ప్రకాశ్ రాజ్ జీవించాడు. కొడుకుకి ప్రతీ విషయంలో ‘ది బెస్ట్’ ఇవ్వాలని ఆరాటపడే తండ్రిగా అదరగొట్టాడు. పెంపకంలో తీసుకునే అతి జాగ్రత్తల వల్ల పిల్లలు స్వేచ్ఛ కోల్పోతారన్న వాస్తవాన్ని చివరికి అంగీకరిస్తాడు. అందుకే ఈ పాత్ర ప్రత్యేకం.  https://www.youtube.com/watch?v=GEBykGzUxk8 సుస్వాగతం సుస్వాగతం సినిమాలో తండ్రి పాత్ర ఎప్పటికీ గుర్తుండిపోతుంది. పవన్ కళ్యాణ్‌కు తండ్రిగా రఘువరన్ నటించాడు. వైద్యుడిగా, బాధ్యతాయుత తండ్రి పాత్రలో రఘువరన్ ఇరగదీశాడు. అన్ని విషయాల్లో ఎంకరేజ్ చేస్తూ కొడుకును ఇలా ప్రోత్సహించే తండ్రి ఉండాలని ఈ సినిమా చూస్తే అర్థమైపోతుంది. 1997లో ఈ సినిమా విడుదలైంది.  https://www.youtube.com/watch?v=iwdC7TGACSk ఆడవారి మాటలకు అర్థాలే వేరులే ఈ సినిమాలో తండ్రి పాత్ర నిడివి తక్కువే ఉన్నా ప్రభావం ఎక్కువగా ఉంటుంది. వెంకటేష్‌కి తండ్రిగా కోట శ్రీనివాసరావు నటించాడు. తల్లి లేని పిల్లాడికి బాధ్యతగల తండ్రిగా, ప్రభుత్వ ఉద్యోగిగా కోట జీవించేశాడు. కొడుకు కోసం అవసరమైతే ఒక మెట్టు కిందకి దిగడానికైనా తండ్రి సిద్ధంగా ఉంటాడని సినిమా చూస్తే అర్థమవుతుంది. చాలా మంది తండ్రులకి కొడుకంటే ప్రేమ ఉంటుంది. కానీ, చూపించుకోలేరు. ఈ సినిమాలో మాదిరిగా దాన్ని సందర్భానుసారంగా బయటపెడతారు. మీ నాన్న క్యారెక్టర్ కూడా ఇదే అయ్యుంటుంది కదా.  https://www.youtube.com/watch?v=bCTJZbwI5_0 ఆకాశమంత కూతురిది, నాన్నది విడదీయలేని అనుబంధం. పంచ ప్రాణాలు పణంగా పెట్టి కూతురిని కాపాడుకుంటాడు తండ్రి. ఏ చిన్న కష్టం వచ్చినా తల్లడిల్లిపోతాడు. ఆకాశమంత సినిమాలో ప్రకాశ్ రాజ్ పాత్ర ఇలాంటిదే. త్రిషకు తండ్రిగా ప్రకాశ్‌రాజ్ నటించాడు. ఓ కూతురుపై తండ్రికి ఉండే ప్రేమ, బాధ్యత ఎలా ఉంటుందో ఇందులో చూడొచ్చు. స్కూల్‌లో అడ్మిషన్ నుంచి కూతురి ప్రేమ పెళ్లిని అంగీకరించడం వరకు తండ్రి చూపించే ప్రేమకు ఇది నిదర్శనం. నిజ జీవితంలోనూ ప్రకాశ్ రాజ్ లాంటి నాన్నలు ఎంతో మంది ఉంటారు.  https://www.youtube.com/watch?v=nqGXCWmWDuU నాన్నకు ప్రేమతో ఏ తండ్రైనా కొడుకులను గొప్పగా, కష్టం రాకుండా పెంచాలని అనుకుంటాడు. బిడ్డలు అడిగిందల్లా ఇచ్చేస్తుంటాడు. ఈ సినిమాలో జూనియర్ ఎన్టీఆర్‌కు తండ్రిగా రాజేంద్ర ప్రసాద్ నటించాడు. కుమారుల ఆకలిని తీర్చడానికి తండ్రి ఎంతకైనా తగ్గుతాడనే విషయం సినిమాలోని కొన్ని సీన్లు నిరూపిస్తాయి. కష్టపడి పెంచాల్సిన అవసరం తండ్రికి ఉంటుందేమో కానీ కష్టపడి పెరగాల్సిన అవసరం బిడ్డలకు ఉండదని నిరూపిస్తాడు. బిడ్డల భవిష్యత్తు కోసం త్యాగం చేసే తండ్రులెందరో. చందమామ కృష్ణవంశీ దర్శకత్వంలో వచ్చిన చందమామ సినిమాలో మంచి ఫాదర్ సెంటిమెంట్ ఉంటుంది. ఇద్దరు ఆడపిల్లలకు తండ్రిగా నాగబాబు, హీరోలకు తండ్రిగా ఆహుతి ప్రసాద్ నటించారు. ముఖ్యంగా నాగబాబు నటన ఆకట్టుకుంటుంది. అల్లారు ముద్దుగా పెంచి పెద్ద చేసిన ఆడపిల్లలను మెట్టింటికి పంపాలంటే ఆ బాధ వర్ణణాతీతం. కూతుర్ల ప్రేమను అర్థం చేసుకునే ఔదార్యం కలిగిన తండ్రిగా నాగబాబు మెప్పించాడు. ఇలా బిడ్డల మనసులను అర్థం చేసుకునే హృదయం ప్రతి తండ్రికీ ఉంటుంది.  https://www.youtube.com/watch?v=DSCPzIUd8GE నువ్వే నువ్వే కూతురు అడిగితే చందమామనైనా తెచ్చిచ్చే తండ్రి పాత్ర ఈ సినిమాలో ఉంటుంది. నటి శ్రియకు తండ్రిగా ప్రకాశ్ రాజ్ నటించాడు. కూతురుకి నచ్చిన ప్రతి ఒక్కటి ఇచ్చే తండ్రి.. కోరుకున్న అబ్బాయిని ఇచ్చి పెళ్లి చేయడంలో మాత్రం ఎందుకు వెనకాడతాడని ఈ సినిమా చూస్తే తెలుస్తుంది. ప్రేమగా పెంచుకున్న పిల్లల భవిష్యత్తుపై తండ్రికి ఉండే ఆందోళన ఎలాంటిదో అర్థమవుతుంది. ప్రకాశ్ రాజ్ నటన అద్భుతం.
    జూన్ 16 , 2023
    Samantha: పింక్ గౌనులో ఎంత అమాయకంగా చూస్తుందో!… సామ్ రేర్ ఫొటోలు వైరల్ 
    Samantha: పింక్ గౌనులో ఎంత అమాయకంగా చూస్తుందో!… సామ్ రేర్ ఫొటోలు వైరల్ 
    టాలీవుడ్ స్టార్ హీరోయిన్లలో సమంత ఒకరు. విభిన్న సినిమాలు చేస్తూ తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంటోంది. కెరీర్‌లో, జీవితంలో ఒడిదొడుకులు ఎదురైన ప్రతీ సారి బలంగా పుంజుకుంటోందీ బ్యూటీ. గ్లామర్ పాత్రల్లోనే కాకుండా హీరోయిన్ ఓరియెంటెడ్ సినిమాల్లోనూ నటిస్తోంది.  సమంత ఫిట్‌నెస్ ఫ్రీక్. నేచర్ లవర్. తనకు సంబంధించిన ప్రతి అప్‌డేట్‌ని సోషల్ మీడియా అకౌంట్స్ ద్వారా పంచుకుంటుంది. సెట్స్ ఫొటోలు, జిమ్‌లో వర్కౌట్ చేస్తున్న దృశ్యాలను పంచుకుంటూ ఫ్యాన్స్‌కి అప్‌డేట్స్ ఇస్తుంటుంది. సమంత ఇప్పుడెలా ఉందో మనందరికీ తెలుసు. కానీ, చిన్నప్పుడు ఈ ముద్దుగుమ్మ ఎలా ఉండేదో ఊహించారా? సామ్ చిన్ననాటి ఫొటోల్లో కొన్నింటిపై ఓ లుక్కేద్దాం. ఫ్యామిలీ ఫొటో.. సామ్‌కి ఇద్దరు సోదరులు. చిన్ననాటి ఫొటోను షేర్ చేసుకుంటూ ఆనాటి జ్ఞాపకాలను గుర్తు చేసుకుంది. మేమెక్కడున్నా ఇంకా ఒక్కటిగానే ఉన్నామంటూ చెప్పుకొచ్చింది. స్కై బ్లూ కలర్‌లో ఫ్రాక్ వేసుకుని క్యూట్‌గా ఉంది.  కెరీర్ బిగినింగ్‌లో.. కెరీర్ తొలినాళ్లలో సామ్ ఎలా ఉండేదో ఈ ఫొటో చూస్తే తెలిసిపోతుంది. 2010లో ‘ఏ మాయ చేసావే’ సినిమాతో ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిందీ బ్యూటీ.  క్యూట్‌నెస్ ఓవర్‌లోడెడ్.. చిన్నప్పుడు చాలా ముద్దుగా ఉండేది. చెంపలకు, నుదుట గుండ్రటి కాటుక పెట్టుకుని ఫొటోకు పోజులిచ్చింది. కొప్పు నిండా జాస్మిన్ పూలను పెట్టుకుని ఫొటో దిగింది.  పింగ్ గౌను వేసుకుని.. పింక్ గౌను వేసుకుని ఎంత అమాయకంగా చూస్తుందో..! కుర్చీలో కూర్చుని ఏదో ఆలోచిస్తున్నట్లుగా అనిపిస్తోంది కదూ.  అమ్మ చెంతన.. తన తల్లి గురించి కొన్ని ఇంటర్వ్యూల్లో సామ్ చెప్పింది. ఫ్యామిలీ బ్యాక్‌గ్రౌండ్‌ని షేర్ చేసుకునేది. ఇదే పింక్ గౌనులో తల్లి ఎత్తుకున్న ఫొటో ఇది. అమ్మ ఎత్తుకుంటే ఆ సంతోషమే వేరు అన్నట్టుగా ముసి ముసిగా నవ్వుతోంది.   కరాటే కోసం.. సామ్ కొన్నాళ్లపాటు కరాటే కూడా నేర్చుకుంది. ఓ చేతిలో కర్ర పట్టుకుని మరొక చేతితో సమరానికి సిద్ధమంటూ పోజు పెట్టింది. వైట్ డ్రెస్ వేసుకుని రెండు జడలతో ఇలా కనిపించింది. కాలేజీ రోజుల్లో.. కాలేజీ రోజుల్లో స్నేహితులతో ఇలా దిగిన ఫొటో ఇది. పింక్ సారీ వేసుకుని సామ్ కనిపించింది. మయోసైటిస్ నుంచి కోలుకున్న సమంత వరుసగా షూటింగులకు హాజరవుతోంది. శివనిర్వాణ, విజయ్ దేవరకొండ కాంబోలో వస్తున్న ‘ఖుషి’ సినిమా చిత్రీకరణలో పాల్గొంటోంది. ఈ సినిమా సెప్టెంబర్ 1న రిలీజ్ కానుంది. మరోవైపు, సిటాడెల్ వెబ్‌సిరీస్ ఇండియన్ వెర్షన్ కోసం కాల్ షీట్స్ కేటాయించింది. 
    మే 01 , 2023
    1000Cr క్లబ్‌: భారతీయ చిత్ర పరిశ్రమలో రూ. 1000 కోట్లు కొళ్లగొట్టిన  సినిమాలు ఇవే !
    1000Cr క్లబ్‌: భారతీయ చిత్ర పరిశ్రమలో రూ. 1000 కోట్లు కొళ్లగొట్టిన సినిమాలు ఇవే !
    సినిమాలు ఎన్ని విడుదలైనా బాక్సాఫీస్ వద్ద కొన్నే గుర్తుంటాయి. సినిమా కథ ఎలా ఉన్నా ఇప్పుడు కలెక్షన్లదే లెక్క కనుక అవే మాట్లాడుకుందాం. ఓ సినిమా ప్రేక్షకులకు నచ్చిందంటే కలెక్షన్ల వర్షం కురవాల్సిందే. అందరి అంచనాలు దాటి కోట్లు కొళ్లగొడుతాయి. భారతీయ చిత్ర పరిశ్రమలో కొన్ని చిత్రాలకు ఊహించని కలెక్షన్లు వచ్చాయి. ఏకంగా రూ. 1000 కోట్లకు మించి వసూళ్ల సునామీ సృష్టించాయి. అవెంటో ఓ సారి తెలుసుకుందాం. దంగల్ అమీర్‌ ఖాన్‌ లీడ్‌ రోల్‌లో కుస్తీ నేపథ్యంలో వచ్చిన చిత్రం దంగల్‌. ఫొగాట్‌ సిస్టర్స్ జీవిత కథ ఆధారంగా తెరకెక్కించారు. దేశం కోసం గోల్డ్‌ తేవాలనుకునే తండ్రి.. కుమార్తెలను ఎలా తీర్చిదిద్దాడనే కథతో తీసిన దంగల్ చిత్రం… బాక్సాఫీస్‌పై కాసుల వర్షం కురిపించింది. కేవలం రూ. 70 కోట్లు పెట్టి తీయగా… రూ. 2000 కోట్లు సాధించింది. బాహుబలి 2 తెలుగు చిత్ర పరిశ్రమ స్థాయిని ఫస్ట్‌  టైం ప్రపంచానికి పరిచయం చేసిన చిత్రం బాహుబలి. ఈ సినిమాను ప్రేక్షకులు ఎలా ఆదరించారో మనందరికీ తెలుసు. ఇక కట్టప్ప బాహుబలిని ఎందుకు చంపాడనే ప్రశ్నతో వచ్చిన బాహుబలి 2 సినిమాకు రికార్డుస్థాయి కలెక్షన్లు వచ్చాయి. రూ. 250 కోట్లు పెట్టి నిర్మిస్తే రూ. 1810 కోట్లు వచ్చాయి.  కేజీఎఫ్‌ 2 “అదిగో పెను నిశ్శబ్దం పగలి ముక్కలవుతున్న భీకర దృశ్యం” అంటూ ఏ ముహుర్తాన రాశారో కానీ, కేజీఎఫ్‌ మేనియా అంతలా కొనసాగుతుంది. ప్రశాంత్ నీల్‌ విజువల్ పవర్‌కి నిదర్శనమే ఈ సినిమా. గోల్డ్‌ మైన్స్‌ ఇతివృత్తంతో వచ్చిన సినిమా వసూళ్ల సునామినీ ఎవ్వరూ అడ్డుకోలేకపోయారు. రూ. 100 కోట్లు పెట్టి సినిమాను తీశారు. రూ. 1200 కోట్లు కొళ్లగొట్టింది ఈ చిత్రం.  RRR భారతీయ సినిమా చరిత్రలో నిలిచిపోతుంది RRR. దర్శకధీరుడు రాజమౌళి నుంచి వచ్చిన కళాద్భుతం. ఇందులో రామ్‌ - భీమ్ చేసిన విన్యాసాలకు ప్రపంచమే సలాం కొట్టింది. ఆస్కార్‌తో అందలం ఎక్కించింది. అలాంటి చిత్రానికి కలెక్షన్లు రాకుండా ఉంటాయా?. రూ. 550 కోట్లతో తెరకెక్కించగా… రూ. 1200 కోట్లు వసూళ్లు చేసింది. పఠాన్‌ ఏళ్ల తరబడి ఒక్క విజయం కోసం ఎదురుచూస్తున్న బాలీవుడ్‌కు మాసివ్‌ హిట్‌ ఇచ్చాడు కింగ్ ఖాన్ షారుఖ్‌. దాదాపు మూడేళ్ల తర్వాత ప్రేక్షకుల్ని పలకరించి బ్లాక్‌బస్టర్‌ అందుకున్నాడు. స్పై యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా వచ్చిన చిత్రం కలెక్షన్లలో రికార్డు సృష్టించింది. ఈ సినిమాకు రూ. 225 కోట్ల బడ్జెట్ అయ్యింది. కానీ, రూ. 1000కోట్లకుపైగా వసూలు చేసింది. భజరంగీ భాయ్‌జాన్ సల్మాన్ ఖాన్ డిఫరెంట్‌ రోల్‌లో కనిపించిన చిత్రం భజరంగీ భాయ్‌జాన్‌. ఆంజనేయస్వామి భక్తుడిగా నటించాడు. ఓ చిన్నారిని తన భుజాలపై ఎత్తుకొని సల్లు భాయ్‌ వెళ్తుంటే ఎలా ఉంటుంది. అనుకోకుండా బోర్డర్‌ దాటి పాకిస్థాన్ నుంచి వచ్చిన ఓ పాపను తిరిగి స్వదేశానికి చేర్చేందుకు పడే ప్రయాసను అద్భుతంగా చూపించారు. ఎమోషనల్‌గా ప్రేక్షకులు బాగా కనెక్ట్‌ అవ్వటంతో మంచి కలెక్షన్లు వచ్చాయి. రూ. 75 కోట్లు పెట్టి తెరకెక్కించగా… రూ. 969 కోట్లు సాధించింది.
    ఏప్రిల్ 28 , 2023
    Actress Samantha : ఫ్యాన్స్‌ కొంటె ప్రశ్నలకు.. క్రేజీ ఆన్సర్స్‌ ఇచ్చిన సమంత
    Actress Samantha : ఫ్యాన్స్‌ కొంటె ప్రశ్నలకు.. క్రేజీ ఆన్సర్స్‌ ఇచ్చిన సమంత
    టాలీవుడ్‌ టాప్‌ హీరోయిన్‌ సమంత తన లేటెస్ట్‌ మూవీ శాకుంతలం సినిమా ప్రమోషన్స్‌లో బిజీ బిజీగా గడుపుతోంది. ప్రచార కార్యక్రమాల్లో చురుగ్గా వ్యవహరిస్తూ మూవీపై అంచనాలను మరింత పెంచేస్తోంది. ఈ క్రమంలో సమంత ట్విటర్‌ వేదికగా నెటిజన్లతో ముచ్చటించింది. శాకుంతలం సినిమాతో పాటు వ్యక్తిగత జీవితానికి సంబంధించిన నెటిజన్ల ప్రశ్నలకు సమాధానం ఇచ్చింది. అలాగే నటి మృణాల్‌ ఠాకూర్‌ అడిగిన దానికి కూడా సమంత ఆన్సర్‌ ఇచ్చింది. ఇందుకు సంబంధించిన పోస్టులను సామ్‌ ట్విటర్‌లో పంచుకుంది. అసలు నెటిజన్లు సామ్‌ను ఏం అడిగారు?. అందుకు సమంత ఇచ్చి క్రేజీ ఆన్సర్స్‌ ఏంటీ? ఇప్పుడు చూద్దాం.  మృణాల్‌ ఠాకూర్‌: శాకుంతలం సినిమా కోసం ఎంతగానో ఎదురు చూస్తున్నా. నువ్వు చాలా ఇన్‌స్పైరింగ్‌. నా ప్రశ్న ఏంటంటే మనం కలిసి ఎప్పుడు సినిమా చేయబోతున్నాం? సామ్‌: కాంగ్రాట్యూలేషన్స్‌.... ‘గుమ్రా’ బ్యూటిఫుల్‌ మృణాల్‌ ఠాకూర్‌. నీ ఆలోచన చాలా నచ్చింది. మనం చేద్దాం. https://twitter.com/Samanthaprabhu2/status/1645087094765932545 నెటిజన్‌: మీ నిజమైన అభిమాని కోసం ఒక్క మాటలో ఏం చెబుతారు?  సామ్‌: నిన్నటి వరకు స్ట్రేంజర్.. ఇవాళ కుటుంబ సభ్యుడు https://twitter.com/Samanthaprabhu2/status/1645082714532642816 నెటిజన్: మీకు ధైర్యం ఎక్కడ నుంచి వస్తోంది? ఎన్నో సమస్యలు ఉన్నా మీరు ఎలా మూవ్‌ ఆన్‌ అవుతున్నారు.  సామ్: ఎందుకంటే నా కథ ఎలా ముగియాలో నేను నిర్ణయిస్తాను కాబట్టి. https://twitter.com/Samanthaprabhu2/status/1645082177414246401 నెటిజన్‌: మీరు శాకుంతలం రిలీజ్‌ రోజు ఫ్యాన్స్‌ షో చూసేందుకు దేవి 70MM థియేటర్‌కు వస్తారా? సామ్: రావొచ్చేమో? రావాలా..! https://twitter.com/Samanthaprabhu2/status/1645080239582871552 నెటిజన్‌: శాకుంతలం, ఖుషి, బాలీవుడ్‌ ప్రాజెక్ట్స్‌తో  శామ్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ మాముల్గా ఉండదు సామ్‌: ఈ ఏడాది కూడా చాలా క్రేజీగా గడవబోతోంది. https://twitter.com/Samanthaprabhu2/status/1645080067968749568 నెటిజన్‌ : నువ్వు టీనేజ్ అమ్మాయిగా ఎంతో క్యూట్‌గా ఉన్నావు. ఈ లుక్‌ను ఇలాగే కొంత కాలం కొనసాగించాలని భావిస్తున్నారా? సామ్‌: గ్లాసెస్‌.. నా కొత్త బెస్ట్‌ ఫ్రెండ్‌ https://twitter.com/Samanthaprabhu2/status/1645079008026189828 నెటిజన్‌: మీ ఉద్దేశంలో ఆత్మగౌరవం, సెల్ఫ్‌ లవ్‌ అంటే ఏంటి? సామ్‌ : మీ గురించి తెలుసుకోవడానికి ఇతరులపై ఆధారపడనప్పుడు..మీరు మీతోనే సంతోషంగా ఉండగలిగినప్పుడు.. https://twitter.com/Samanthaprabhu2/status/1645078774957088774 నెజిజన్‌: మీరు వృత్తి, వ్యక్తిగత జీవితాల్లో జయపజయాలను ఎలా తీసుకుంటారు. మీ హార్ట్‌ అండ్ మైండ్‌లో ఎమోషన్స్‌ను ఎలా బ్యాలెన్స్ చేసుకుంటారు? సామ్‌: విజయాల కంటే అపజయాలే మీకు ఎక్కువ గుణపాఠాలు నేర్పుతాయి. ఓటములే మిమ్మల్ని మంచి వ్యక్తిగా మారుస్తాయి. https://twitter.com/Samanthaprabhu2/status/1645075968133050369 నెటిజన్‌ : మీరు ఓ బేబి సినిమా అప్పుడు నాకు రిప్లై ఇచ్చారు. అది హిట్ అయింది. ఇప్పుడు కూడా ఒక రిప్లై ఇవ్వండి.. శాకుంతలం బ్లాక్‌ బస్టర్ అవుద్ది. సామ్‌: వామ్మో... అలాంటప్పుడు నీతో గొడవ పెట్టుకోకూడదు(నవ్వుతూ) https://twitter.com/Samanthaprabhu2/status/1645074391871668230
    ఏప్రిల్ 10 , 2023
    Mrunal Thakur : నెటిజన్లతో మృణాల్‌ ముచ్చట్లు… సీతారామం 2 సినిమాపై క్లారిటీ..!
    Mrunal Thakur : నెటిజన్లతో మృణాల్‌ ముచ్చట్లు… సీతారామం 2 సినిమాపై క్లారిటీ..!
    సీతారామం చిత్రంలో సీతగా నటించిన మృణాల్‌ ఠాకూర్‌ తెలుగు ప్రేక్షకుల హృదయాల్లో చెరగని ముద్ర వేశారు. ఈ భామ అందం, అభినయం, నటన.. సినిమా విజయంలో కీలకపాత్ర పోషించింది. సీతారామంలో ఎంతో ట్రెడిషనల్‌గా కనిపించిన ఈ ముద్దుగుమ్మ గత కొంత కాలంగా తన హాట్‌ ఫొటోలతో సోషల్‌ మీడియాలో రచ్చ రచ్చ చేస్తోంది. బోల్డ్‌ లుక్‌లో ఉన్న మృణాల్‌ను చూసి ఆమె ఫ్యాన్స్‌ ఆశ్చర్యపోతున్నారు. ఇదిలా ఉంటే తాజాాగా మృణాల్‌ ట్విటర్‌ వేదికగా ఫ్యాన్స్‌తో ముచ్చటించింది. #askmrunal పేరుతో నెటిజన్ల ప్రశ్నలను ఆహ్వానించింది. ఈ క్రమంలో నెటిజన్లు అడిగిన ప్రతీ ప్రశ్నకు మృణాల్‌ తనదైన శైలిలో సమాధానం ఇచ్చారు. ఆ ప్రశ్నలు, సమాధానాలు ఏంటో ఇప్పుడు చూద్దాం.  ప్రశ్న: మీకు కెనడియన్‌ యాక్టర్‌ కీను రీవ్స్‌తో నటించే అవకాశం వస్తే ఎలా ఫీలవుతారు? మృణాల్‌: సంతోషం, ఆనందం, ఆశ్చర్యాన్ని తెలియజేసే ఎమోజీస్‌  https://twitter.com/mrunal0801/status/1645117683267170306 భారత్‌లో బ్రిటన్ రాయబారి: మనం రెండేళ్ల క్రితం కలిసి విమాన ప్రయాణం చేశాం. మీరు సాధించిన విజయాలకు నా అభినందనలు. మృణాల్‌: మీ నుంచి ఈ మాటలు వినడం చాలా సంతోషం. ఆ రోజు సినిమాలపై మన మధ్య జరిగిన సంభాషణ ఇప్పటికీ నాకు గుర్తింది. https://twitter.com/mrunal0801/status/1645084379264237570 ప్రశ్న: హైదరాబాద్‌లో నాని 30 సినిమా షూటింగ్‌లో మిమ్మల్ని కలిశాను. మీరు చాలా బాగా మాట్లాడారు. ఇంతపెద్ద స్టార్‌గా ఎదగడానికి మీ వినయమే కారణం అనుకుంటా. మృణాల్‌: థ్యాంక్యూ https://twitter.com/mrunal0801/status/1645078658900525056 ప్రశ్న: సీతారామంలో సీతా మహాలక్ష్మీగా మీ నటన చూసి ఫ్యాన్‌ అయిపోయా. ఆ సినిమా గురించి ఏమైన చెప్పండి. మృణాల్‌: సీతారామం నిజంగా ఓ అద్భుతం. https://twitter.com/mrunal0801/status/1645067329078804482 ప్రశ్న: బాలీవుడ్ or సౌత్‌  మృణాల్‌: ఇండియన్ సినిమా. https://twitter.com/mrunal0801/status/1645062867035496451 ప్రశ్న: తెలుగులో ఒక మాట మాట్లాడండి? మృణాల్‌: మళ్లీ మెుదలు https://twitter.com/mrunal0801/status/1645062753697103875 ప్రశ్న: సీతారామం 2 కు అవకాశం ఉందా? మృణాల్: నాకూ తెలీదు. కానీ ఉండాలని కోరుకుంటున్నా https://twitter.com/mrunal0801/status/1645028690697519104 ప్రశ్న: మీరు నటించిన గుమ్రా మూవీ చూశా. యాక్షన్‌ మూవీలో నిన్ను చూడటం చాలా ఎక్జైటింగ్‌గా అనిపించింది. కేవలం నీ కోసమే మా పేరెంట్స్‌ను సినిమాకు తెసుకెళ్లాలని అనుకుంటున్నా. మృణాల్‌: మీ తల్లిదండ్రులకు నా ప్రేమను తెలియజేయండి. వారు సినిమాను ఆస్వాదిస్తారని ఆశిస్తున్నా. https://twitter.com/mrunal0801/status/1645060359915556864 బాలీవుడ్‌లో మృణాల్‌ నటించిన గుమ్రా మూవీ ఏప్రిల్‌ 7న విడుదలై మంచి హిట్‌ టాక్‌ తెచ్చుకుంది. ఇందులో పోలీసు ఆఫీసర్‌గా మృణాల్‌ నటన ఆకట్టుకుంది. హీరో ఆదిత్య రాయ్‌ కపూర్‌కు పోటీగా నటించి మృణాల్‌ మెప్పించింది. తొలి మూడు రోజుల్లో గుమ్రా మూవీ రూ.15కోట్ల గ్రాస్‌ సాధించినట్లు మేకర్స్‌ ప్రకటించారు. 
    ఏప్రిల్ 10 , 2023
    JOHN WICK: సినిమా అంతా బ్లడ్ అండ్ వార్… కానీ జీవిత పాఠాలెన్నో..!
    JOHN WICK: సినిమా అంతా బ్లడ్ అండ్ వార్… కానీ జీవిత పాఠాలెన్నో..!
    పుస్తకాలు, రచనల నుంచే కాదు సినిమాల్లో నుంచి కూడా చాలా నేర్చుకుంటాం. హీరో చెప్పే మాటలు కావచ్చు లేదా చిత్రంలో వచ్చే సన్నివేశం అయ్యి ఉండొచ్చు కొన్ని సార్లు కదిలిస్తుంది.  హాలీవుడ్‌ ఫ్రాంఛైజీ జాన్‌ విక్‌ ఇందులో ఒకటి. సినిమా మెుత్తం గన్స్‌, బుల్లెట్స్‌తో నిండిపోయినా.. జీవితంలో కొన్ని స్ఫూర్తినిచ్చే విషయాలను నేర్పిస్తుంది.  ఇప్పుడు ఇదంతా ఎందుకని అనుకుంటున్నారా? జాన్ విక్ నుంచి నాలుగో పార్ట్ రాబోతుంది. మార్చి 24న విడుదలకు సిద్ధమయ్యింది.  2014 నుంచి 19 వరకు తెరకెక్కించిన మూడు పార్ట్‌లు కూడా కమర్షియల్‌గా మంచి విజయాన్ని సాధించాయి. ఈ సినిమాపై కూడా అంచనాలు ఉన్నాయి.  లక్ష్యం మనం ఏదైనా పనిచేయాలనుకున్నపుడు ఒక లక్ష్యాన్ని నిర్దేశించుకోవాలి. అప్పుడే మనం నడవాల్సిన మార్గంపై క్లారిటీ వస్తుంది. జాన్‌ విక్‌ నుంచి ఇది నేర్చుకోవచ్చు. నిబద్ధత జాన్‌ విక్‌ అంటే నిబద్ధతకు పెట్టింది పేరు. అతడు ఏ పని చేసినా పూర్తి నిబద్ధతతో చేస్తాడు. కఠోర శ్రమ లక్ష్యాన్ని చేరుకోవాలనుకున్నపుడు దారిలో రాళ్లు, ముళ్లూ ఎన్ని ఉన్నా దాటుకుని వెళ్లాల్సిందే. జాన్‌ తన లక్ష్యం కోసం ప్రాణాలు లెక్కచేయడు. విశ్రమించడు. నిరంతరం దానికోసం పోరాడుతూనే ఉంటాడు.  అసలేంటిది? నేరాలు చేసే ఓ వ్యక్తి అన్ని వదిలేసి సాధారణమైన జీవితం గడుపుతుంటాడు. తన భార్య చనిపోయే ముందు ఇచ్చిన కుక్కను చంపినందుకు ఎంతమందిని చంపుతాడనే కథ.  హీరో పాత్ర నుంచి చంపడం నేర్చుకోమని చెప్పట్లేదు గానీ జాన్‌విక్‌ క్యారెక్టరైజేషన్‌లోనే కొన్ని జీవిత పాఠాలుంటాయి అవేంటో చూద్దాం. నమ్మకం సినిమాలో ముఖ్యంగా ఇచ్చే సందేశం “మీపై మీకు నమ్మకం ఉండాలి. నువ్వు నమ్మిన దానిపైనే నిలబడాలి”. జాన్‌విక్‌ తాను నమ్మిన దాని కోసం పోరాడతాడు ఎంతకైనా తెగిస్తాడు. వెనుకడుగు వేయడు. మన పని చేసే ప్రతి పని మనది అనుకుంటేనే అత్యుత్తమంగా ప్రయత్నిస్తాం. మధ్యలో ఎన్నో అడ్డంకులు రావచ్చు. వాటిని విడిచిపెట్టి ముందుకెళ్లాలి. జాన్‌విక్ ఏపనినైనా తనది అన్నట్లుగా పూర్తి చేస్తాడు. తక్కువగా మాట్లాడు సినిమాలో హీరో చాలా తక్కువగా మాట్లాడతాడు. నీ వద్ద చెప్పాలనుకునే విషయం ఉన్నప్పుడు మాత్రమే మాట్లాడాలి. అప్పుడే ఆ మాటలకు అర్థం ఉంటుందనే విషయాన్ని గమనించవచ్చు. ప్లాన్ బి  చాలా పనులకు కచ్చితంగా రెండు ప్రణాళికలు ఉండాలి. అప్పుడే ఒకటి ఫెయిల్ అయినా మరొకటి ఉపయోగపడుతుంది. హీరో ఓ గ్యాంగ్‌స్టర్ అంటే కచ్చితంగా ఎత్తుకి పైఎత్తులు ఉంటాయి కదా. కుదరదు ఏదైనా నచ్చని విషయానికి నో చెప్పడానికి సంకోచించవద్దు. నో చెప్పడం అలవాటైతే ఎన్నో దురలవాట్లు, దురాలోచలకు దూరంగా ఉండొచ్చు. 
    మార్చి 21 , 2023
    <strong>Fan War : ఆ హీరోల ఫ్యాన్స్ వల్లే బలహీనపడుతున్న ఫిల్మ్ ఇండస్ట్రీ.. చెక్‌ పెట్టకుంటే ముప్పు తప్పదా!&nbsp;</strong>
    Fan War : ఆ హీరోల ఫ్యాన్స్ వల్లే బలహీనపడుతున్న ఫిల్మ్ ఇండస్ట్రీ.. చెక్‌ పెట్టకుంటే ముప్పు తప్పదా!&nbsp;
    ఒకప్పుడు భారతీయ చిత్ర పరిశ్రమ అనగానే బాలీవుడ్‌ మాత్రమే గుర్తుకువచ్చేది. హిందీ స్టార్లను మాత్రమే పాన్‌ ఇండియా సెలబ్రిటీలుగా పరిగణించేవారు. అయితే ఇప్పుడు పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. సౌత్‌ ఇండస్ట్రీ కూడా ఇండియన్‌ బాక్సాఫీస్‌ వద్ద సత్తా చాటుతూ జాతీయ స్థాయిలో అలరిస్తోంది. ముఖ్యంగా సౌత్‌ నుంచి టాలీవుడ్‌ (Tollywood), కోలివుడ్‌ (Kollywood) ఇండస్ట్రీల నుంచి మంచి కంటెంట్‌ ఉన్న పాన్‌ ఇండియా సినిమాలు వస్తున్నాయి. అవి బాలీవుడ్ ఆదిపత్యానికి చెక్‌ పెడుతున్నాయి. ఇటువంటి తరుణంలో ఏకత్రాటిపై ఉండాల్సిన సౌత్‌ ఇండస్ట్రీస్‌ అభిమానులు చేస్తోన్న ఫ్యాన్‌ వార్స్‌ కారణంగా బలహీన పడుతోంది. దీనిని కట్టడి చేయకపోతే మున్ముందు రోజుల్లో సౌత్‌ ఇండస్ట్రీకి గట్టి ఎదురుదెబ్బ తప్పదని సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.&nbsp; టాలీవుడ్‌ vs కోలీవుడ్‌ గతంలో ఫ్యాన్‌ వార్‌ అంటే ఒక ఇండస్ట్రీకి మాత్రమే పరిమితమై ఉండేది. హీరోల అభిమానులు ఒకరిపై ఒకరు పోస్టుల రూపంలో విమర్శలు చేసుకునేవారు. ప్రస్తుతం పాన్‌ ఇండియా చిత్రాల హవా కారణంగా ఇది పక్క ఇండస్ట్రీలపైకి కూడా పాకింది. తమ హీరో తీసిన సినిమా కంటే పక్క ఇండస్ట్రీ స్టార్‌ చేసిన చిత్రం ఎక్కువ కలెక్షన్స్‌ సాధించడాన్ని అభిమానులు తట్టుకోలేకపోతున్నారు. ముఖ్యంగా ఈ పోకడ సౌత్‌లో టాలీవుడ్‌, కోలివుడ్‌ ఇండస్ట్రీలో ప్రధానంగా కనిపిస్తోంది. తమిళ హీరో విజయ్‌ చేసిన చిత్రాలు రిలీజ్‌ అయితే తెలుగు ఆడియన్స్‌ పెద్ద ఎత్తున ట్రోల్స్‌ చేస్తున్నారు. అదే సమయంలో మన హీరోల సినిమాలు వచ్చినప్పుడు అంతే స్థాయిలో తమిళులు సైతం నెట్టింట యాంటీ ప్రచారం చేస్తున్నారు. https://twitter.com/iammvengence/status/1758435868799377642 https://twitter.com/RAO_Offl/status/1759121949656318267 నష్టం ఏంటంటే? కొద్దిమంది మాత్రమే చేసే ఈ ఫ్యాన్ వార్ వల్ల హీరోలకు, సినిమా ఇండస్ట్రీలకు వచ్చే నష్టం ఏముందిలే అని చాలా మంది భావించవచ్చు. కానీ అది పొరపాటు. కొద్ది మంది ఫ్యాన్స్‌ చేస్తున్న ఈ ట్రోల్స్‌ చూసి ఆయా ఇండస్ట్రీలకు చెందిన చాలా మంది ఆడియన్స్‌ ప్రభావితమవుతున్నారు. దాని వల్ల సహజంగానే పక్క ఇండస్ట్రీకి చెందిన హీరోపై వారిలోనూ తెలియకుండానే ద్వేషం ఏర్పడుతోంది. ఫలితంగా పక్క ఇండస్ట్రీ నుంచి ఏదైనా సినిమా రిలీజైనప్పుడు దానిని చూడకుండా రిజెక్ట్‌ చేస్తున్నారు. సినిమా బాగున్నప్పటికీ నెగిటివ్‌ టాక్‌ను విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. దీనివల్ల నార్త్‌లో బాగా రాణించిన సినిమాలు ఎంతో కీలకమైన సౌత్‌లో దెబ్బతింటున్నాయి. అది మూవీ ఓవరాల్‌ కలెక్షన్స్‌పై ప్రభావం చూపిస్తున్నాయి. సినిమా ఎంత బాగున్నప్పటికీ మనం చేసుకుంటున్న నెగిటివ్‌ ట్రోల్స్‌ కారణంగా ఆ సినిమా హిందీ మూవీస్‌ కంటే కలెక్షన్స్‌ పరంగా వెనకబడిపోతున్నాయి.&nbsp; ఆ సినిమాలకు దెబ్బ! త్వరలో రిలీజ్‌ అయ్యేందుకు సౌత్‌ నుంచి పలు పాన్ ఇండియా సినిమాలు సిద్ధంగా ఉన్నాయి. టాలీవుడ్‌ నుంచి ‘పుష్ప 2’, ‘గేమ్‌ ఛేంజర్‌’ రిలీజ్‌ డేట్‌ను ఫిక్స్‌ చేసుకోగా కోలీవుడ్‌ నుంచి సూర్య నటించిన ‘కంగువా’, శివకార్తికేయన్‌ నటించిన ‘అమరన్‌’ విడుదలకు సిద్ధంగా ఉన్నాయి. ఈ నాలుగు చిత్రాలు భారీ ఖర్చుతో పాన్‌ ఇండియా స్క్రిప్ట్‌తో రూపొందినవే. గతంలో లాగే ఈ సినిమాల విషయంలోనూ ఫ్యాన్స్ ఇండస్ట్రీల పరంగా విడిపోయి ట్రోల్స్‌ దిగితే గట్టి ఎదురుదెబ్బ తప్పదని సినీ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. సినిమా బాగుంటే ఇండస్ట్రీలకు అతీతంగా వాటిని ఆదరించాలని కోరుతున్నాయి. అప్పుడు మాత్రమే ఆయా చిత్రాలు మంచి వసూళ్లు సాధించి పాన్‌ ఇండియా స్థాయిలో ఘనమైన కలెక్షన్స్‌ సాధించగలుగుతాయని పేర్కొంటున్నాయి. అలా కాకుండా మళ్లీ ఫ్యాన్‌ వార్‌కు దిగితే పరోక్షంగా లాభపడేది బాలీవుడ్‌యే అని స్పష్టం చేస్తున్నాయి.&nbsp; టైటిల్స్‌ రచ్చకు చెక్‌ పెట్టాల్సిందే! సౌత్‌లో బిగ్‌ ఇండస్ట్రీలుగా ఉన్న టాలీవుడ్‌, కోలీవుడ్‌కి చెందిన దర్శక, నిర్మాతలు తమ వైఖరితో ఫ్యాన్‌ వార్‌కు ఆజ్యం పోయకుండా ఉండటం చాలా ముఖ్యం. ఇటీవల కాలంలో కోలీవుడ్‌ చిత్రాలు నేరుగా తమిళ టైటిల్స్‌తో తెలుగులోనూ రిలీజ్‌ కావడం ఎక్కువగా చూస్తున్నాం. కంగువా, వేట్టయన్‌తో పాటు అంతకుముందు వచ్చిన ‘తంగలాన్‌’, ‘రాయన్‌’, ‘వెలిమై’ తమిళ పేర్లను పెట్టడం వల్ల ఇది తెలుగు ఆడియన్స్‌లో ఆగ్రహానికి కారణమైంది. కొందరు చేసిన తప్పిదాలు కారణంగా మెుత్తం తమిళ ఇండస్ట్రీపైనే ద్వేషం వచ్చే ప్రమాదం తలెత్తుతోంది. భవిష్యత్‌లో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా తమిళ ఇండస్ట్రీ జాగ్రత్తపడాలి.&nbsp; పొలిటికల్‌ టర్న్‌ ఏపీ ఉపముఖ్యమంత్రి, సినీ నటుడు పవన్‌ కల్యాణ్ (Pawan Kalyan) ఇటీవల సనాతన ధర్మం పరిరక్షణలో భాగంగా చేసిన వ్యాఖ్యలు తమిళనాడులో ప్రకంపనలు సృష్టించాయి. తమిళనాడు ఉప ముఖ్యమంత్రి ఉదయనిధి స్టాలిన్‌ను ఉద్దేశిస్తూ పవన్‌ చేసిన పరోక్ష కామెంట్స్‌ తీవ్ర చర్చకు దారితీశాయి. పవన్‌ తరహాలోనే ఉదయనిధి స్టాలిన్‌ తమిళ నటుడు కావడంతో ఈ వివాదం తెలుగు, తమిళ ఇండస్ట్రీల మధ్య వార్‌గా కూడా మారిపోయింది. ఇరువురు అభిమానులు సోషల్‌ మీడియా వేదికగా పరస్పరం మాటల దాడి చేసుకున్నారు. పవన్‌ కల్యాణ్ సినీ కెరీర్‌తో ఉదయనిధిని పోలుస్తూ దారుణంగా ట్రోల్‌ చేశారు. అటు ఉదయనిధి విద్యార్హతను తెరపైకి తీసుకొచ్చి పవన్‌పై తమిళ నెటిజన్లు విమర్శలు చేశారు.&nbsp; https://twitter.com/i/status/1841876236840374698 పవన్‌ కల్యాణ్‌ vs అల్లు అర్జున్‌ టాలీవుడ్‌లోని అతిపెద్ద సినీ నేపథ్యమున్న కుటుంబాల్లో మెగా ఫ్యామిలీ ఒకటి. ఆ ఫ్యామిలీ నుంచి అరడజనుకు పైగా నటులు ఇండస్ట్రీలో హీరోలుగా రాణిస్తున్నారు. అయితే ఆ కుటుంబానికి చెందిన పవర్‌స్టార్‌ పవన్‌ కల్యాణ్‌, అల్లు అర్జున్‌కు అసలు పడటం లేదని గత కొన్ని రోజులుగా ప్రచారం జరుగుతోంది. ఏపీ ఎన్నికల సమయంలో(Pawan Kalyan vs Allu Arjun) పవన్‌ ప్రత్యర్థి పార్టీ అభ్యర్థికి అల్లు అర్జున్‌ మద్దతు తెలపడంతో ఈ వివాదం ఆజ్యం పోసుకుంది. అప్పటి నుంచి బన్నీని మెగా ఫ్యాన్స్ పెద్ద ఎత్తున టార్గెట్‌ చేస్తూ వస్తున్నారు. అటు అల్లు ఆర్మీ సైతం వారికి దీటుగా బదులిస్తూ తమ హీరోకు అండగా నిలుస్తోంది. అయితే ఇటీవల ఓ ప్రభుత్వం కార్యక్రమంలో మాట్లాడిన పవన్‌ కల్యాణ్‌ టాలీవుడ్‌కు చెందిన హీరోలతో పాటు అల్లు అర్జున్‌ పేరును ప్రస్తావించారు. ఆ హీరోలంటే తనకు ఎంతో గౌరవమని వ్యాఖ్యానించారు. ఈ వివాదానికి చెక్‌ పెట్టే ఉద్దేశ్యంతోనే బన్నీ పేరును పవన్‌ తీసుకొచ్చినట్లు నెటిజన్లు భావిస్తున్నారు. అయితే ఎట్టి పరిస్థితుల్లోనూ పుష్ప 2 చిత్రాన్ని ప్రమోట్ చేయమని మెగా అభిమానులు సోషల్ మీడియాలో కామెంట్ చేస్తున్నారు.&nbsp;
    అక్టోబర్ 17 , 2024
    <strong>Pawan Kalyan: ‘ఓజీ’ రిలీజ్‌ డేట్ ఫిక్స్‌? 2025లో పవన్ ఫ్యాన్స్‌కు డబుల్ ధమాకా!</strong>
    Pawan Kalyan: ‘ఓజీ’ రిలీజ్‌ డేట్ ఫిక్స్‌? 2025లో పవన్ ఫ్యాన్స్‌కు డబుల్ ధమాకా!
    పవర్ స్టార్ పవన్ కల్యాణ్ గతేడాది మూడు బ్లాక్‌ బాస్టర్‌ చిత్రాలను పట్టాలెక్కించి ఏపీ రాజకీయాల్లో బిజీ అయిపోయారు. ఏపీ ఎన్నికల దృష్ట్యా షూటింగ్స్‌ బ్రేక్‌ ఇచ్చిన పవన్‌ ఎన్నికల తర్వాత ఉప ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి మరింత బిజీగా మారిపోయారు. కొత్త ప్రభుత్వం ఏర్పాటై నాలుగు కావస్తుండటంతో ఇప్పుడిప్పుడే పవన్‌ తీరిక చేసుకొనిమరి పెండింగ్‌ ప్రాజెక్ట్స్‌పై ఫోకస్‌ పెట్టారు. ఇటీవల హరిహర వీరమల్లును సెట్స్‌పైకి తీసుకెళ్లారు. తాజాగా ఓజీ సినిమాను సైతం పట్టాలెక్కించేందుకు రెడీ అయ్యారు. వచ్చే ఏడాది ఏకంగా రెండు సినిమాలతో పవన్‌ ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. దీంతో ఫ్యాన్స్ ఆనందానికి అవధులు లేకుండా పోతోంది.&nbsp; ‘ఓజీ’ రిలీజ్‌ డేట్ ఫిక్స్‌! టాలీవుడ్‌లో భారీ ఫ్యాన్‌ ఫాలోయింగ్‌ ఉన్న హీరోల్లో పవర్‌ స్టార్‌ పవన్‌ కల్యాణ్‌ ఒకరు. ప్రస్తుతం ఆయన చేతిలో మూడు కల్ట్ ప్రాజెక్ట్స్‌ ఉన్నాయి. అందులో ఒకటైన ‘ఓజీ’ చిత్రం సుదీర్ఘ విరామం తర్వాత తాజాగా సెట్స్‌పైకి వెళ్లింది. అయితే ఈ సినిమా రిలీజ్‌ డేట్ ఫిక్స్‌ అయినట్లు నెట్టింట ప్రచారం జరుగుతోంది. 2025 సెప్టెంబర్‌ 26న ఓజీ ప్రేక్షకుల ముందుకు రానున్నట్లు స్ట్రాంగ్ బజ్‌ వినిపిస్తోంది. మరోవైపు వచ్చే ఏడాది మార్చి 28న హరిహర వీరమల్లును రిలీజ్‌ చేయనున్నట్లు మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. ఈ రెండు పాన్ ఇండియా చిత్రాలు 2025లో వస్తుండటంతో ఫ్యాన్స్‌కు డబుల్‌ ధమాకా అని చెప్పవచ్చు.&nbsp; https://twitter.com/mogali_sat77717/status/1846452019868877252 ఓజీ షూటింగ్‌ రీస్టార్ట్‌ పవన్‌ కల్యాణ్‌ పెండింగ్‌ ప్రాజెక్ట్స్‌లలో ఒకటైన ‘ఓజీ’ (OG Movie) కోసం అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. ఏపీ ఎన్నికల నేపథ్యంలో వాయిదాపడ్డ ‘ఓజీ’ షూటింగ్‌ తాజాగా తిరిగి ప్రారంభం అయింది. ఈ విషయాన్ని మూవీ టీమ్ అధికారికంగా వెల్లడించింది. షూటింగ్ లొకేషన్‍లో యూనిట్‍తో డైరెక్టర్ సుజీత్ మాట్లాడుతున్న ఓ డార్క్ ఫొటోను నిర్మాణ సంస్థ డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్ సోషల్‌ మీడియాలో పంచుకుంది. ‘అన్ని సిలిండర్లను ఫైర్ చేసి మ్యాడ్‍నెస్‍ను సృష్టించేందుకు మేం మళ్లీ ఓజీ ఫీవర్‌లోకి అడుగుపెట్టేశాం’ అంటూ పోస్టర్‌కు క్యాప్షన్‌ ఇచ్చింది. ఈ పోస్టర్‌ ఒక్కసారిగా నెట్టింట వైరల్‌గా మారింది.&nbsp; https://twitter.com/DVVMovies/status/1846206901295763648 త్వరలోనే సెట్స్‌పైకి పవన్‌! ఇటీవల హరిహర వీరమల్లు షూటింగ్‌ను ప్రారంభించారు. ఇందుకోసం విజయవాడలో మేకర్స్ భారీ సెట్‌ను సైతం వేశారు. పవర్‌ స్టార్‌ పవన్‌ కల్యాణ్‌ ఈ మూవీ షూటింగ్‌లోనూ పాల్గొంటున్నారు. ఈ మూవీని తొలుత పూర్తి చేయాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే విడుదల తేదీని సైతం హరిహర వీరమల్లు టీమ్‌ ఫిక్స్‌ చేసింది. అయితే తాజాగా ఓజీ షూటింగ్‌ను తిరిగి పునఃప్రారంభించారు సుజీత్‌. ముందుగా పవన్‌ లేని సీన్స్‌ను డైరెక్టర్‌ సుజీత్‌ షూట్‌ చేయనున్నారు. కొద్ది రోజుల్లో పవన్‌ కూడా ఈ మూవీ షూటింగ్‌ పాల్గొంటారని చిత్ర వర్గాలు చెబుతున్నాయి. ఓజీ షూటింగ్ మళ్లీ మొదలు కావడంతో పవన్ కల్యాణ్ అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. పవన్‌ షూట్‌లో పాల్గొనే రోజు కోసం ఎదురుచూస్తున్నారు.&nbsp; హైప్‌ పెంచిన థమన్‌! పవన్‌ హీరోగా సుజిత్‌ దర్శకత్వంలో 'ఓజీ' చిత్రంలో పవన్‌ గ్యాంగ్‌ స్టర్‌గా కనిపించనున్నాడు. పవన్ పాత్ర పేరు ఓజాస్ గంభీర కావడంతో ఈ మూవీకి ‘ఓజీ’ అనే టైటిల్‌ను ఫిక్స్‌ చేశారు. ఇటీవల ఈ సినిమా గురించి మ్యూజిక్‌ డైరెక్టర్‌ థమన్‌ ఎక్స్‌ వేదికగా స్పందించారు. ‘మా నుంచి ఇండస్ట్రీ హిట్ వస్తుందని నేను కచ్చితంగా చెప్పగలను. డైరెక్టర్ సుజిత్ అదరగొట్టేశాడు, కెమెరామెన్ రవిచంద్రన్ కూడా సూపర్ విజువల్స్ ఇచ్చాడు. నేను కూడా ఓజీకి బెస్ట్ ఇవ్వాలి. ఇది డివివి బ్యానర్ నుంచి వస్తున్న బిగ్గెస్ట్ సినిమా. నా ట్వీట్‌ని మీరంతా పిన్ చేసి పెట్టుకోండి. అప్‌డేట్స్‌తో మనం త్వరలోనే కలుద్దాం' అంటూ మెగా ఫ్యాన్స్‌లో థమన్‌ మరింత జోష్ పెంచారు. థమన్‌ చేసిన ఈ ట్వీట్ నెట్టింట తెగ ట్రెండ్ అయ్యింది.&nbsp; https://twitter.com/MusicThaman/status/1842245316252209456 ‘ఉస్తాద్‌ భగత్‌ సింగ్’ సంగతేంటి? గబ్బర్‌ సింగ్ వంటి బ్లాక్‌ బాస్టర్‌ తర్వాత పవన్ కల్యాణ్‌ - హరీశ్‌ కాంబోలో రాబోతున్న చిత్రం 'ఉస్తాద్ భగత్‌ సింగ్‌'. ఏపీ ఎన్నికల ముందు వరకు వరుస అప్‌డేట్స్‌తో భారీగా అంచనాలు పెంచేసిన దర్శకుడు హరీష్ శంకర్‌ గత కొంత కొలంగా సైలెంట్ అయిపోయారు. అయితే తాజాగా హరిహర వీరమల్లు, ఓజీ ప్రాజెక్ట్స్‌ తిరిగి సెట్స్‌పైకి వెళ్లడంతో ఉస్తాద్‌ను కూడా పట్టాలెక్కించాలని పవన్‌ ఫ్యాన్స్‌ కోరుకుంటున్నారు. ఇందులో పవర్ స్టార్ పవన్‌ కల్యాణ్‌ పోలీసు పాత్ర చేస్తుండటంతో ఈ ప్రాజెక్ట్ ఎంతో ఆశగా ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే ఈ మూవీకి సంబంధించి రెండు గ్లింప్స్‌ బయటకు రాగా వాటికి ఫ్యాన్స్ నుంచి విశేష స్పందన వచ్చింది. త్వరలోనే ఈ మూవీకి సంబంధించి కూడా అప్‌డేట్‌ ఉంటుందని ఇండస్ట్రీ వర్గాలు చెబుతున్నాయి. &nbsp; పవన్‌ vs విజయ్‌ దేవరకొండ! ‘హరిహర వీరమల్లు’ రిలీజ్‌ తేదీని ప్రకటించడంతో బాక్సాఫీస్‌ వద్ద పవన్‌, విజయ్‌ దేవరకొండ తలపడే పరిస్థితులు కనిపిస్తున్నాయి. విజయ్‌ నటిస్తున్న 'VD 12' చిత్రాన్ని వచ్చే ఏడాది మార్చి 28న రిలీజ్‌ చేయనున్నట్లు మేకర్స్ గతంలోనే ప్రకటించారు. అటు హరిహర వీరమల్లు టీమ్‌ కూడా అదే డేట్‌ను ఫిక్స్‌ చేసుకుంది. దీంతో బాక్సాఫీస్‌ వద్ద బిగ్‌ ఫైట్‌ తప్పదని అంటున్నారు. పవన్‌ లాంటి బిగ్‌స్టార్‌ను విజయ్‌ దేరరకొండ ఢీకొట్టక తప్పదని ఫిల్మ్‌ వర్గాలు పేర్కొంటున్నాయి. అయితే పవన్‌కు అత్యంత సన్నిహితులైన సితారా నిర్మాతలు 'VD 12'ను నిర్మిస్తున్నారు. కాబట్టి పవన్‌కు పోటీగా వారు తమ చిత్రాన్ని బరిలోకి దింపే అవకాశం లేకపోవచ్చని సమాచారం. మరో కొత్త డేట్‌ను చూసుకొని VD12ను రిలీజ్‌ చేసే ఛాన్స్ ఉందని ఇండస్ట్రీ వర్గాలు అంచనా వేస్తున్నాయి.&nbsp;
    అక్టోబర్ 16 , 2024
    <strong>OG Movie: ఒక్క ట్వీట్‌తో మెగా అభిమానుల్లో జోష్‌ పెంచిన థమన్‌.. ‘ఓజీ ఇండస్ట్రీ హిట్‌ పక్కా’!</strong>
    OG Movie: ఒక్క ట్వీట్‌తో మెగా అభిమానుల్లో జోష్‌ పెంచిన థమన్‌.. ‘ఓజీ ఇండస్ట్రీ హిట్‌ పక్కా’!
    పవర్‌ స్టార్‌ పవన్‌ కల్యాణ్‌ (Pawan Kalyan) ఏపీ రాజకీయాల్లో బిజీగా ఉన్నారు. అదే సమయంలో ఆగిపోయిన తన సినిమాలను ఇటీవలే మెుదలు పెట్టారు. ప్రస్తుతం 'హరిహర వీరమల్లు' షూటింగ్ లో పాల్గొంటున్న పవన్ కల్యాణ్ త్వరలోనే 'ఓజి' (OG) మూవీ షూటింగ్‌ను కూడా స్టార్ట్ చేయబోతున్నారు. అయితే పవన్‌ ప్రాజెక్ట్స్‌లో అన్నిటికంటే 'ఓజీ'పైనే ఫ్యాన్స్‌లో భారీగా అంచనాలు ఉన్నాయి. ఆ మూవీ అప్‌డేట్స్‌ కోసం ఫ్యాన్స్ ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలోనే మ్యూజిక్ డైరెక్టర్ థమన్‌ తాజాగా అదిరిపోయే అప్‌డేట్‌ ఇచ్చాడు. దీంతో మెగా ఫ్యాన్స్ తెగ ఖుషీ అవుతున్నారు. ఆ విశేషాలేంటో ఇప్పుడు చూద్దాం.&nbsp; థమన్ ఏమన్నారంటే? పవన్‌ హీరోగా సుజిత్‌ దర్శకత్వంలో 'ఓజీ' చిత్రం రూపొందుతోంది. గ్యాంగ్‌స్టర్ యాక్షన్‌ డ్రామాగా ఇది ప్రేక్షకుల ముందుకు రానుంది. పవన్ పాత్ర పేరు ఓజాస్ గంభీర కావడంతో ఈ మూవీకి ‘ఓజీ’ అనే టైటిల్‌ను ఫిక్స్‌ చేశారు. కాగా తాజాగా ఈ సినిమా గురించి మ్యూజిక్‌ డైరెక్టర్‌ థమన్‌ ఎక్స్‌ వేదికగా స్పందించారు. ఆయన తన ట్వీట్‌లో 'ఓజి అప్డేట్స్ గురించి అందరూ అడుగుతున్నారు. త్వరలోనే అప్డేట్స్ వస్తాయి. దానికి సంబంధించిన పనులు జరుగుతున్నాయి. అయితే మా నుంచి ఇండస్ట్రీ హిట్ వస్తుందని నేను కచ్చితంగా చెప్పగలను. డైరెక్టర్ సుజిత్ అదరగొట్టేశాడు, కెమెరామెన్ రవిచంద్రన్ కూడా సూపర్ విజువల్స్ ఇచ్చాడు. నేను కూడా ఓజీకి బెస్ట్ ఇవ్వాలి. ఇది డివివి బ్యానర్ నుంచి వస్తున్న బిగ్గెస్ట్ సినిమా. నా ట్వీట్‌ని మీరంతా పిన్ చేసి పెట్టుకోండి. అప్‌డేట్స్‌తో మనం త్వరలోనే కలుద్దాం' అంటూ మెగా ఫ్యాన్స్‌లో థమన్‌ మరింత జోష్ పెంచారు. థమన్‌ చేసిన ఈ ట్వీట్ నెట్టింట తెగ ట్రెండ్ అవుతోంది.&nbsp; https://twitter.com/MusicThaman/status/1842245316252209456 పాన్‌ ఇండియా స్థాయిలో పవన్‌ కల్యాణ్‌ ఓజీ చిత్రం పాన్‌ ఇండియా స్థాయిలో విడుదల కానుంది. ఈ సినిమాలో పవన్‌కు జోడిగా ప్రియాంక మోహన్ (Priyanka Mohan) నటిస్తోంది. బాలీవుడ్ స్టార్ ఇమ్రాన్ హష్మీ (Emraan Hashmi) విలన్‌గా నటిస్తుండగా అర్జున్ దాస్ (Arjun Das), శ్రీయ రెడ్డి (Sriya Reddy), ప్రకాష్ రాజ్ (Prakash Raj), హరీష్ ఉత్థమన్‌ (Harish Uthaman), అభిమన్యు సింగ్ (Abhimanyu Singh) కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ మూవీని తెలుగుతో పాటు హిందీ, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో రిలీజ్ చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. అంతే కాకుండా ఈ సినిమాకి జపనీస్‌తో లింక్ ఉంటుందని డైరెక్టర్‌ సుజిత్ గతంలో చెప్పడంతో అభిమానుల్లో అంచనాలు తార స్థాయికి చేరాయి. గతంలో వచ్చిన గ్లింప్స్‌ సైతం ఓజీ హైప్‌ క్రియేట్‌ చేసింది.&nbsp; https://twitter.com/tollymasti/status/1822184749072294337 అప్‌డేట్స్‌కు కేరాఫ్‌గా థమన్‌! సంగీత దర్శకుడు థమన్‌ తను పనిచేస్తున్న చిత్రాలకు సంబంధించి వరుసగా అప్‌డేట్స్‌ ఇస్తూ ఫ్యాన్స్‌ను తెగ ఖుషీ చేస్తున్నారు. ముఖ్యంగా మెగా అభిమానులకు తన వరుస అప్‌డేట్స్‌తో గ్రాండ్ ట్రీట్ ఇస్తున్నారు. మెగా పవర్‌స్టార్‌ రామ్‌ చరణ్‌ (Ram Charan) నటిస్తున్న 'గేమ్‌ ఛేంజర్‌' (Game Changer) చిత్రానికి కూడా థమన్‌ మ్యూజిక్‌ డైరెక్టర్‌గా పని చేస్తున్నారు. ఆ మూవీకి సంబంధించి వరుసగా అప్‌డేట్స్‌ ఇస్తూ దాదాపు మూవీ రిలీజ్‌ డేట్‌ను సైతం కన్ఫార్మ్‌ చేశారు. ఇప్పుడు 'ఓజీ' అప్‌డేట్స్‌ కూడా ఇచ్చి మెగా ఫ్యాన్స్‌ మరింత ఇష్టుడిగా మారిపోయారు.&nbsp; సమ్మర్‌లో గ్రాండ్‌ రిలీజ్‌ ప్రస్తుతం పవన్‌ చేతిలో ఓజీతో పాటు ‘హరిహర వీరమల్లు’, ‘ఉస్తాద్‌ భగత్‌ సింగ్‌’ (Ustad Bhagat Singh) ప్రాజెక్టులు ఉన్నాయి. వీటిలో హరిహర వీరమల్లు (Hari Hara Veera Mallu) పీరియాడిక్‌ యాక్షన్‌ అడ్వెంచర్‌గా ప్రేక్షకుల ముందుకు రానుంది. క్రిష్‌, జ్యోతికృష్ణ దర్శకత్వంలో ఇది సిద్ధమవుతోంది. రెండు భాగాలుగా ఈ చిత్రం రానుంది. తొలి భాగానికి సంబంధించి చిత్రీకరణ ముగింపుదశకు చేరుకున్న విషయం తెలిసిందే. పవన్‌ కల్యాణ్‌ ఇటీవలే ఈ మూవీకి సంబంధించిన షూటింగ్‌లోనూ జాయిన్ అయ్యారు. ఈ క్రమంలోనే ‘హరిహర వీరమల్లు’ (Harihara Veeramallu Release Date) రిలీజ్‌ డేట్‌ను చిత్రబృందం ప్రకటించింది. వచ్చే ఏడాది మార్చి 28న ప్రపంచవ్యాప్తంగా దీనిని విడుదల చేయనున్నట్లు తెలిపింది.&nbsp;
    అక్టోబర్ 05 , 2024
    <strong>Satyam Sundaram 2024 Review: దేవరకు పోటీగా వచ్చిన ‘సత్యం సుందరం’ ఎలా ఉందంటే?</strong>
    Satyam Sundaram 2024 Review: దేవరకు పోటీగా వచ్చిన ‘సత్యం సుందరం’ ఎలా ఉందంటే?
    నటీనటులు: కార్తి, అరవింద స్వామి, శ్రీవిద్య, రాజ్‌కిరణ్‌ తదితరులు రచన, దర్శకత్వం: సి.ప్రేమ్‌ కుమార్‌ సంగీతం: గోవింద్‌ వసంత సినిమాటోగ్రఫీ: మహేంద్రన్‌ జయరాజు ఎడిటింగ్‌: ఆర్‌.గోవింద రాజు నిర్మాత: జ్యోతిక, సూర్య విడుదల తేదీ: 28-09-2024 తమిళ స్టార్‌ హీరో కార్తీ హీరోగా ‘96’ వంటి ఫీల్‌ గుడ్‌మూవీని తెరకెక్కించిన సి. ప్రేమ్‌ కుమార్‌ దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘మెయ్యజగన్‌’. తెలుగులో ఈ మూవీని ‘సత్యం సుందరం’ పేరుతో తీసుకొచ్చారు. ఇందులో ప్రముఖ నటుడు అరవింద స్వామి కీలక పాత్ర పోషించారు. 2డీ ఎంటర్‌టైన్‌మెంట్‌ పతాకంపై సూర్య, జోతికలు ఈ సినిమాను నిర్మించడం విశేషం. ఇవాళ (సెప్టెంబరు 28) (meiyazhagan release date) ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం ఎలా ఉంది? ప్రేక్షకులను మెప్పించిందా? ఈ రివ్యూలో తెలుసుకుందాం.&nbsp; కథేంటి గుంటూరుకు చెందిన సత్యం (అరవిందస్వామి) ఆస్తి తగదాల కారణంగా పుట్టి పెరిగిన ఇల్లు, ఊరిని వదిలేసి వైజాగ్‌ వెళ్లిపోతాడు. ఈ క్రమంలో 30ఏళ్లు గడిచిపోతాయి. బాబాయి కూతురి పెళ్లి కోసం ఊరికి రావాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. అలా ఊరికి వచ్చిన సత్యంకి పెళ్లిలో బంధువు (కార్తీ) పరిచయమవుతాడు. బావా అంటూ సరదాగా కలిసిపోతూ బోలెడు కబుర్లు చెబుతుంటాడు. అతని మీతిమీరిన కలుపుగోలు తనం చూసి సత్యం జిడ్డులా భావిస్తాడు. అయితే కలిసి ప్రయాణం చేసే కొద్దీ అతను చూపే ఆప్యాయత, ప్రేమాభిమానాలు సత్యం మనసును కట్టిపడేస్తాయి. మరి వీళ్లిద్దరి ప్రయాణం ఏ మజిలీకి చేరింది? ఈ ప్రయాణంలో సత్యం తనని తాను ఎలా తెలుసుకున్నాడు? బావా అని పిలుస్తున్న ఆ వ్యక్తితో అతనికున్న బంధం ఏంటి? ఆఖరికి అతని పేరు సత్యంకు గుర్తొచ్చిందా? లేదా? అన్నది మిగతా కథ. ఎవరెలా చేశారంటే సత్యం పాత్రలో నటుడు అరవిందస్వామి పూర్తిగా ఒదిగిపోయాడు. తన అద్భుతమైన నటనతో ఆ పాత్రతో మనమూ ట్రావెల్‌ చేసేలా చేశాడు. సత్యం పడే బాధ, యాతన, ఇబ్బంది వంటి అన్ని ఫీలింగ్స్‌ను మనం కూడా అనుభవిస్తాం. ఇక కార్తీ తన అమాయకత్వంతో మరోసారి కట్టిపడేశాడు. ఓ వ్యక్తిపై అపరిమితమైన ప్రేమను చూపించే సగటు పల్లెటూరి యువకుడిగా అతడు నటించిన విధానం మెప్పిస్తుంది. కార్తీ కెరీర్‌లో ఈ పాత్ర ఎప్పటికీ గుర్తుండిపోతుంది. అరవిందస్వామి భార్యగా దేవదర్శిని మంచి ప్రదర్శన చేసింది. ఇప్పటివరకూ కమెడియన్‌, సపోర్టింగ్‌ రోల్స్‌ మాత్రమే చేసిన ఆమె ఎంతో డెప్త్ ఉన్న పాత్రనైనా అలవోకగా చేయగలనని ఈ సినిమాతో నిరూపించింది. శ్రీదివ్య, రాజ్‌ కిరణ్‌, జయప్రకాశ్‌ల పాత్రలు చిన్నవే అయినా కథపై ఎంతో ప్రభావం చూపాయి. మిగిలిన పాత్రలు దారులు తమ పరిధిమేరకు నటించారు.&nbsp; డైరెక్షన్ ఎలా ఉందంటే మనిషి సుఖంగా బ్రతకడానికి డబ్బు, పేరుతో పాటు మన మంచి కోరుకునే ఓ వ్యక్తి కూడా ఎంతో అవసరమని ఈ చిత్రం ద్వారా దర్శకుడు సి. ప్రేమ్‌ కుమార్‌ చెప్పే ప్రయత్నం చేశారు. సత్యం ఊరిని వదిలి వెళ్లిపోవడానికి వెనకున్న కారణాన్ని చూపిస్తూ సినిమా ఆసక్తికరంగా మెుదలు పెట్టారు. ఓ పెళ్లికోసం సత్యం తిరిగి ఊరికి రావడం, అక్కడ కార్తి పాత్ర పరిచయం, అతడి అల్లరి, కార్తీ ఎవరో గుర్తురాక సత్యం పడే ఇబ్బందులు ఇలా అన్నీ సరదాగా అనిపిస్తాయి. ద్వితియార్థాన్ని కార్తీ ఇంటికి షిప్ఠ్‌ చేసిన దర్శకుడు అక్కడ సత్యానికి ఎదురయ్యే అనుభవాలను మనసుకు హత్తుకునేలా చూపించారు. ప్రేక్షకుల్ని వెనకటి రోజుల్లోకి తీసుకెళ్లిపోయారు. ఇక కార్తి పాత్ర పేరు గుర్తురాక సత్యం పడే మానసిక సంఘర్షణ మదిని బరువెక్కిస్తుంది. క్లైమాక్స్‌ కూడా చాలా బాగా అనిపిస్తుంది. ఒక అందమైన నవలలా సినిమాను తెరకెక్కించడంలో దర్శకుడు పూర్తిగా సక్సెస్ అయ్యాడు. కమర్షియల్‌ హంగులు లేకపోవడం, కథ నెమ్మదిగా సాగడం మైనస్‌గా చెప్పవచ్చు.&nbsp; టెక్నికల్‌గా&nbsp; సాంకేతిక అంశాల విషయానికి వస్తే నేపథ్య సంగీతం కథకు అదనపు ఆకర్షణను తీసుకొచ్చింది. సినిమా మొత్తం బ్యాగ్రౌండ్‌లో పాట వినిపిస్తూ ఉంటుంది. అది కథను మరింత భావోద్వేగభరితంగా మార్చడంలో సహాయపడింది. విజువల్స్ కట్టిపడేస్తాయి. నిర్మాణ విలువలు ఉన్నతంగా ఉన్నాయి. ప్లస్‌ పాయింట్స్‌ కథ, భావోద్వేగాలుకార్తి, అరవింద స్వామి నటనసంగీతం మైనస్‌ పాయింట్స్ నెమ్మదిగా సాగే కథకమర్షియల్ హంగులు లేకపోవడం Telugu.yousay.tv Rating : 3.5/5&nbsp;
    సెప్టెంబర్ 28 , 2024
    <strong>Anthahpuram</strong><strong>: </strong><strong>సౌందర్యను రీప్లేస్‌ చేయగల సత్తా ఆ ఇద్దరి సొంతం.. డైరెక్టర్‌ కృష్ణవంశీ క్రేజీ కామెంట్స్‌!&nbsp;</strong>
    Anthahpuram: సౌందర్యను రీప్లేస్‌ చేయగల సత్తా ఆ ఇద్దరి సొంతం.. డైరెక్టర్‌ కృష్ణవంశీ క్రేజీ కామెంట్స్‌!&nbsp;
    క్రియేటివ్‌ డైరెక్టర్‌ కృష్ణ వంశీ సినిమా అంటే ఒకప్పుడు థియేటర్లలో పండగ వాతావరణం ఉండేది. కెరీర్‌లో ఎన్నో సూపర్‌ హిట్‌ చిత్రాలను తీశారు. ముఖ్యంగా అంతఃపురం చిత్రం ఆయన కెరీర్‌కు మైలురాయిగా నిలిచింది. ఇందులో దివంగత నటి సౌందర్య ఫీమేల్‌ లీడ్‌గా నటించి ఆకట్టుకుంది. ఇందులో ఆమె నటనపై సర్వత్ర ప్రశంసలు దక్కాయి. ఇదిలా ఉంటే ప్రస్తుతం కృష్ణ వంశీ ఎక్స్‌ వేదికగా తెగ యాక్టివ్‌గా ఉంటున్నారు. నెటిజన్లు అడుగుతున్న ప్రశ్నలకు ఆసక్తికర సమాధానాలు ఇస్తున్నారు. ఈ క్రమంలో అంతఃపురం సినిమాలో సౌందర్యను ఏ హీరోయిన్‌తో రీప్లెస్‌ చేయగలదని ఓ నెటిజన్‌ ప్రశ్నించారు. ఇందుకు కృష్ణ వంశీ ఇచ్చిన సమాధానం నెట్టింట వైరల్ అవుతోంది.&nbsp; కృష్ణవంశీ ఏమన్నారంటే? సౌందర్య, సాయికుమాార్‌, ప్రకాష్‌ రాజ్‌, జగపతి బాబు ప్రధాన పాత్రల్లో నటించిన అంతఃపురం చిత్రం బాక్సాఫీస్‌ వద్ద ఘన విజయం సాధించింది. ఇందులో క్రూరమైన తన మామ బారి నుంచి బిడ్డను కాపాడుకునే తల్లిగా సౌందర్య ఉత్తమ నటన కనబరిచింది. అయితే ఇప్పటి హీరోయిన్స్‌లో ‘అంతఃపురం’ ఎవరికి సెట్‌ అవుతుందని డైరెక్టర్ కృష్ణ వంశీని ఎక్స్‌ వేదికగా ఓ నెటిజన్‌ అడిగాడు. అందుకు ఆయన సమాధానం ఇస్తూ 'సౌందర్య స్థానంలో మరొకరిని ఊహించుకోలేకపోతున్నాను. కానీ ప్రస్తుతం హీరోయిన్స్‌ ఎంతో టాలెంటెడ్‌. తమ నటనతో మెస్మరైజ్‌ చేస్తున్నారు. వారిని గౌరవిస్తున్నా' అని అన్నారు. దానికి ఆ నెటిజన్‌ బదులిస్తూ నివేతా థామస్‌, శ్రద్ధా కపూర్‌లలో ఎవరు సెట్‌ అవుతారు? అని మళ్లీ ప్రశ్నించాడు. అప్పుడు కృష్ణవంశీ రిప్లే ఇస్తూ ప్రస్తుత హీరోయిన్స్‌లో సమంత, సాయిపల్లవి సౌందర్య పాత్రకు సెట్‌ కావొచ్చని అభిప్రాయపడ్డారు. ప్రస్తుతం ఈ పోస్టు నెట్టింట తెగ వైరల్ అవుతోంది. సమంత, సాయిపల్లవి ఫ్యాన్స్‌ ఇందుకు సంబంధించిన పోస్ట్‌ను తెగ వైరల్ చేస్తున్నారు.&nbsp; సౌందర్యను రీప్లేస్‌ చేయగలరా! స్టార్‌ హీరోయిన్ సమంతకు గ్లామర్‌ బ్యూటీగానే కాకుండా మంచి నటిగానూ గుర్తింపు ఉంది. తన ఫస్ట్ ఫిల్మ్‌ 'ఏమాయ చేశావే'తో ఉత్తమ నటిగా అవార్డు అందుకుంది. ఆ తర్వాత ‘మనం’, ‘అ ఆ’, ‘యూటర్న్‌’, ‘జాను’, ‘యశోద’, ‘శాకుంతలం’, ‘బేబీ’ వంటి చిత్రాలతో నటిగా తనను నిరూపించుకుంది. అటు సాయిపల్లవి యాక్టింగ్‌ స్కిల్స్‌ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ప్రేమమ్‌, ఫిదా, లవ్‌ స్టోరీ, శ్యామ్‌ సింగరాయ్‌, విరాట పర్వం, గార్గి వంటి చిత్రాలతో నటనలో తనకు సాటి ఎవరూ లేరని చాటి చెప్పింది. అటువంటి ఈ స్టార్ హీరోయిన్స్‌ అంతఃపురంలో సౌందర్య పాత్రకు కచ్చితంగా న్యాయం చేయగలరి నెటిజన్లు భావిస్తున్నారు.&nbsp; డైరెక్టర్‌గా రెండు నేషనల్ అవార్డ్స్‌ డైరెక్టర్ కృష్ణ వంశీ అసలు పేరు పసుపులేటి వెంకట బంగార్రాజు. సినిమాల్లోకి వచ్చాక కృష్ణ వంశీ అని పిలుస్తారు.రామ్ గోపాల్ వర్మ వద్ద అసిస్టెంట్ డైరెక్టర్‌గా తన కెరీర్‌ను ప్రారంభించాడు. అతను 1995లో JD చక్రవర్తి నటించిన చిత్రం ‘గులాబీ’ సినిమా ద్వారా డైరెక్టర్‌గా పరిచయం అయ్యాడు. ‘అంత:పురం’, ‘చంద్రలేఖ’, ‘నిన్నే పెళ్లాడుతా’ మురారి, ఖడ్గం, శ్రీ ఆంజనేయం, రాఖీ, చందమామ, మహాత్మ వంటి హిట్‌ చిత్రాలను తెరకెక్కించారు. రీసెంట్‌గా ‘రంగమార్తండ’ అనే ప్రేక్షకుల హృదయాలను హత్తుకునే సినిమాను తీశారు. కృష్ణ వంశీ తన కెరీర్‌లో ఉత్తమ దర్శకుడిగా రెండు జాతీయ చలనచిత్ర అవార్డులు, మూడు ఫిల్మ్‌ఫేర్ అవార్డ్స్ సౌత్, నాలుగు నంది అవార్డులు అందుకున్నాడు.
    సెప్టెంబర్ 17 , 2024
    <strong>HBD Shriya Saran: శ్రియా బర్త్‌డే స్పెషల్‌.. ఆమె అందాల ఉప్పెనలో తడిసి ముద్దవ్వండి!</strong>
    HBD Shriya Saran: శ్రియా బర్త్‌డే స్పెషల్‌.. ఆమె అందాల ఉప్పెనలో తడిసి ముద్దవ్వండి!
    తెలుగులో స్టార్‌ హీరోయిన్స్‌గా వెలుగొందిన ఒకప్పటి భామల్లో శ్రియా శరణ్‌ ఒకరు. చిరంజీవి, పవన్‌ కల్యాణ్‌, నాగార్జున, బాలకృష్ణ, వెంకటేష్‌ వంటి స్టార్‌ హీరోలతో నటించి శ్రియా అందరి దృష్టిని ఆకర్షించింది. కాగా, ఇవాళ శ్రియా (సెప్టెంబర్‌ 11) 42వ పుట్టిన రోజు. ఈ నేపథ్యంలో ఈ భామకు సంబంధించిన గ్లామరస్‌ ఫొటోలపై ఓ లుక్కేద్దాం. అలాగే శ్రియాకు సంబంధించిన సమాచారమూ తెలుసుకుందాం. శ్రియా శరణ్‌ 1982 సెప్టెంబర్‌ 11న ఉత్తరాఖండ్‌లోని హరిద్వార్‌లో జన్మించింది. ఆమె తండ్రి పుష్పేంద్ర శరణ్‌ BHEL సంస్థలో పనిచేశారు. తల్లి నీరాజ శరణ్‌ కెమెస్ట్రీ టీచర్‌గా వర్క్‌ చేశారు. 2001లో వచ్చిన 'ఇష్టం' సినిమాతో శ్రియా హీరోయిన్‌గా తెరంగేట్రం చేసింది. అందులో తన నటనతో ఆకట్టుకుంది. తద్వారా తన రెండో చిత్రమే నాగార్జునతో చేసే అవకాశాన్ని శ్రియా దక్కించింది. ‘సంతోషం’ సినిమాలో నాగార్జునకు జోడీగా నటించి మంచి మార్కులు కొట్టేసింది.&nbsp; ఆ తర్వాత బాలకృష్ణతో ‘చెన్నకేశవ రెడ్డి’ (2002), తరుణ్‌తో ‘నువ్వే నువ్వే’ (2002), ఉదయ్‌ కిరణ్‌తో ‘నేను మీకు తెలుసా’ (2003) చిత్రాల్లో నటించి ఒక్కసారిగా లైమ్‌లైట్‌లోకి వచ్చింది.&nbsp; ఆ తర్వాత మెగాస్టార్‌ చిరంజీవి సరసనే హీరోయిన్‌గా ఛాన్స్‌ కొట్టేసి అందరినీ ఆశ్చర్యపరిచింది. ‘ఠాగూర్‌’ సినిమా సక్సెస్‌తో శ్రియా స్టార్‌ హీరోయిన్‌గా మారిపోయింది.&nbsp; ఆ తర్వాత 'నేనున్నాను', ‘ఛత్రపతి’, ‘భగీరథ’, ‘శివాజీ’, ‘డాన్‌ శీను’, ‘మనం’, ‘గోపాల గోపాల’, ‘ఊపిరి’ వంటి సూపర్‌ హిట్‌ చిత్రాల్లో శ్రియా నటించి మరింత పాపులారిటీ సొంతం చేసుకుంది.&nbsp; తెలుగుతో పాటు హిందీలోనూ శ్రియా పలు చిత్రాలు చేసింది. అక్కడ కూడా మంచి మంచి చిత్రాలు తీసి బాలీవుడ్‌లో క్రేజ్ సంపాదించింది.&nbsp; రామ్‌చరణ్, తారక్‌ నటించిన బ్లాక్‌ బాస్టర్‌ చిత్రం ‘ఆర్‌ఆర్‌ఆర్‌’(RRR)లోనూ శ్రియా ఓ స్పెషల్‌ రోల్‌లో నటించింది. బాలీవుడ్‌ నటుడు అజయ్‌ దేవగన్‌ భార్యగా, రామ్‌చరణ్‌కు తల్లిగా ఆమె కనిపించింది.&nbsp; గతేడాది కబ్జ (కన్నడ), మ్యూజిక్‌ స్కూల్‌ చిత్రాల ద్వారా ప్రేక్షకులను శ్రియా పలకరించింది. అందులో తన నటనకు గాను విమర్శకుల ప్రశంసలు అందుకుంది. రీసెంట్‌గా ‘షోటైమ్‌’ అనే వెబ్‌సిరీస్‌లోనూ శ్రియా నటించింది. ఈ సిరీస్‌ ద్వారా తొలిసారి ఓటీటీ రంగంలోకి ఈ అమ్మడు అడుగుపెట్టింది. ఇందులో మందిరా సింగ్‌ పాత్రలో ఆకట్టుకుంది.&nbsp; ప్రస్తుతం తమిళ స్టార్‌ హీరో సూర్య సినిమాలో శ్రియా నటిస్తోంది. 'Suriya 44' వర్కింగ్‌ టైటిల్‌తో ఈ చిత్రం షూటింగ్‌ జరుపుకుంటోంది.&nbsp; సినిమాలతో పాటు పలు హిందీ మ్యూజిక్‌ వీడియోలలోనూ శ్రియా శరణ్‌ మెరిసింది. 'తిరకటి క్యూన్‌ హవా', 'కహిన్‌ దూర్‌', 'రంగ్‌ దే చునారియా', 'బరి బరి సాంగ్‌' ఆల్బమ్స్‌లో శ్రియా స్టెప్పులు వేసింది.&nbsp; ప్రస్తుతం శ్రియా శరణ్ అధికారిక ఇన్‌స్టాగ్రామ్‌ ఖాతాను 4.6 మిలియన్ల మంది ఫాలో అవుతున్నారు.&nbsp;
    సెప్టెంబర్ 11 , 2024
    <strong>Arshad Warsi: అర్షద్‌ వార్సీ కామెంట్లపై స్పందించిన నాగ్ అశ్విన్&nbsp;</strong>
    Arshad Warsi: అర్షద్‌ వార్సీ కామెంట్లపై స్పందించిన నాగ్ అశ్విన్&nbsp;
    పాన్‌ ఇండియా స్టార్‌ ప్రభాస్‌ (Prabhas)పై బాలీవుడ్‌ నటుడు అర్షద్‌ వార్సీ (Arshad Warsi) చేసిన వ్యాఖ్యలు జాతీయ స్థాయిలో తీవ్ర దుమరాన్ని రేపిన సంగతి తెలిసిందే. ‘కల్కి 2898 ఏడీ’ చిత్రంలో ప్రభాస్‌ పాత్రను జోకర్‌తో పోలుస్తూ అతడి చేసిన వ్యాఖ్యలను ప్రభాస్ ఫ్యాన్స్‌తో పాటు సెలబ్రిటీలు తీవ్రంగా తప్పుబడుతున్నారు. టాలీవుడ్‌ చిత్రాలు పాన్‌ ఇండియా స్థాయిలో రాణించడం చూసి తట్టుకోలేకనే బాలీవుడ్‌ ప్రముఖులు ఈ వ్యాఖ్యలు చేస్తున్నారంటూ ఆరోపణలు కూడా వస్తున్నాయి. బాలీవుడ్‌ సెలబ్రిటీల్లో టాలీవుడ్‌పై ఈర్ష్య, ద్వేషం, అసూయ మరోమారు బయటపడిందంటూ నెటిజన్లు కామెంట్స్‌ చేస్తున్నారు. ఈ క్రమంలో కల్కి డైరెక్టర్‌ నాగ్‌ అశ్విన్‌ స్పందించారు. ఎక్స్‌ వేదికగా ఆయన చేసిన పోస్టు ప్రస్తుతం హాట్‌ టాపిక్‌గా మారింది.&nbsp; ‘అర్షద్‌ హుందాగా మాట్లాడాల్సింది’ బాలీవుడ్‌ నటుడు అర్షద్‌ వార్సీ వ్యాఖ్యలపై నాగ్‌ అశ్విన్‌ తాజాగా స్పందించారు. కల్కి సినిమాలో ఓ సన్నివేశాన్ని పోస్టు చేసిన నెటిజన్‌, ఈ ఒక్క సీన్‌ బాలీవుడ్‌ ఇండస్ట్రీ మెుత్తంతో సమానమని క్యాప్షన్‌ ఇచ్చాడు. ఈ పోస్టుకు నాగ్‌ అశ్విన్‌ రిప్లై ఇస్తూ టాలీవుడ్‌, బాలీవుడ్‌ అని విడదీసి మాట్లాడొద్దని సూచించారు. ‘నార్త్‌-సౌత్‌, టాలీవుడ్‌ వెర్సస్‌ బాలీవుడ్‌ ఇలా పోలుస్తూ వెనక్కి వెళ్లొద్దు. మనమందరం ఒక ఇండస్ట్రీకి చెందినవాళ్లమే. అర్షద్‌ హుందాగా మాట్లాడాల్సింది. అయినా ఫర్వాలేదు. మేము అతడి పిల్లల కోసం కల్కి బుజ్జి బొమ్మలు పంపిస్తాం. కల్కి రెండోభాగం కోసం మరింత కష్టపడి పనిచేస్తాను. అందులో ప్రభాస్‌ను బెస్ట్‌గా చూపిస్తాను’ అని రాసుకొచ్చారు. ప్రపంచంలో చాలామంది మనల్ని ద్వేషిస్తారు. కానీ, మనం వాటిని పట్టించుకోకుండా ముందుకెళ్లాలి అని నాగ్‌అశ్విన్‌ చెప్పారు. ప్రభాస్‌ కూడా ఇదే మాట అంటుంటారని ఆయన తెలిపారు. https://twitter.com/Varun__Tweets/status/1827148108171768059 https://twitter.com/nagashwin7/status/1827177489455824930 అర్షద్‌కు నాని చురకలు ప్రభాస్‌పై అర్షద్‌ వార్సీ చేసిన వ్యాఖ్యలపై హీరో నాని కూడా తనదైన శైలిలో స్పందించారు. ప్రభాస్‌పై విమర్శలు చేయడం వల్ల అర్షద్ వార్సీకి గతంలో ఎప్పుడు లేనంత పబ్లిసిటీ లభించిందంటూ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ప్రస్తుతం ఈ కామెంట్స్ కూడా నెట్టింట వైరల్‌గా మారాయి. నాని వ్యాఖ్యలపై బాలీవుడ్ ఆడియన్స్‌, అర్షద్ వర్సీ ఫ్యాన్స్‌ తీవ్రంగా తప్పుబట్టారు. ఈ క్రమంలోనే ‘సరిపోదా శనివారం’ హిందీ వెర్షన్ ప్రమోషన్స్‌ కోసం నాని ముంబయికి వెళ్లారు. అక్కడ ఓ మీడియాతో మాట్లాడుతూ తన వ్యాఖ్యలను వెనక్కు తీసుకున్నారు. అర్షద్‌పై తాను చేసిన కామెంట్స్‌కు చింతిస్తున్నట్లు తెలిపారు. ‘మున్నాభాయ్’ సినిమాతో అర్షద్ దేశవ్యాప్తంగా అందరికీ చేరువయ్యాడని నాని గుర్తుచేశారు. అలాగే నటులుగా ఉన్నప్పుడు మాట్లాడే మాటల విషయంలో చాలా జాగ్రత్తగా అవసరమని పరోక్షంగా చురకలు వేశారు.&nbsp; 'యాంటి ఇండియన్‌ అర్షద్‌' సోషల్ మీడియా వేదికగా అర్షద్‌ వార్సీపై పెద్ద ఎత్తున ప్రభాస్‌ ఫ్యాన్స్‌ దాడి చేస్తున్నారు. అంతటితో ఆగకుండా గతంలో అర్షద్‌ చేసిన వివాదస్పద పోస్టులను వెలికి తీస్తున్నారు. ఈ క్రమంలోనే ఓ నెటిజన్‌ అర్షద్‌కు సంబంధించిన పాత కాంట్రవర్సీ పోస్టును బయటపెట్టాడు. 2012లో అర్షద్‌ చేసిన ట్వీట్‌ అది. 'నేను అఫ్గనిస్తాన్‌ ఓ మీటింగ్‌ కోసం వెళ్తున్నాను. కుదిరితే షిఫ్ట్‌ అయిపోతాను. ఇండియా కంటే అక్కడ సేఫ్‌' అంటూ అర్షద్‌ ఆ పోస్టులో రాసుకొచ్చారు. ఈ పోస్టును రిట్వీట్‌ చేసిన ఓ నెటిజన్ దానికి ఫన్నీగా బ్రహ్మీ టెర్రరిస్టు గెటప్‌లో ఉన్న ఫొటోను జత చేశాడు. దీంతో ఈ పోస్టును ప్రభాస్‌ ఫ్యాన్స్ తెగ వైరల్‌ చేస్తున్నారు. 'యాంటి ఇండియన్‌ అర్షద్‌' అంటూ ఏకిపారేస్తున్నారు. ప్రభాస్‌తో పెట్టుకుంటే ఇలాగే ఉంటుందంటూ మరికొందరు కామెంట్స్ చేస్తున్నారు.&nbsp; https://twitter.com/HailPrabhas007/status/1827033490950648044 తెలుగు హీరోల స్ట్రాంగ్‌ కౌంటర్‌ ప్రభాస్‌పై అర్షద్‌ వార్సీ చేసిన వ్యాఖ్యలపై టాలీవుడ్‌ హీరో సుధీర్‌ బాబు ఇటీవల తనదైన శైలిలో స్పందించాడు. విమర్శించడం తప్పు కాదని అయితే నోరు పారేసుకోవడం ముమ్మాటికీ తప్పే అంటూ ఎక్స్‌ వేదికగా మండిపడ్డాడు. ఇలాంటి ప్రొఫెషనలిజం లేని మాటలు అర్షద్‌ వార్సీ నోటి నుంచి వస్తాయని తాను ఎప్పుడూ ఊహించలేదని అన్నాడు. ఇలాంటి చిన్న మనస్తత్వాలు కలిగిన వాళ్లు చేసే కామెంట్స్‌ స్టాట్యూ లాంటి ప్రభాస్‌ను తాకలేవని స్పష్టం చేశాడు. అటు యువ నటుడు ఆది సాయికుమార్‌ సైతం అర్షద్‌ వ్యాఖ్యలను తప్పుబట్టాడు.&nbsp; అర్షద్‌ పేరు ప్రస్తావించకుండానే పరోక్షంగా మండిపడ్డారు. ‘ఎటువంటి అభద్రతాభావం లేని నటుడు ప్రభాస్ అన్న. ఆయన లేకపోతే అసలు కల్కి సినిమాయే లేదు. నిజానికి తన రోల్ చాలా అద్భుతంగా ఉందనిపించింది. ఆయనంటే అసూయేమో’ అని ఎక్స్‌లో రాసుకొచ్చాడు.&nbsp; https://twitter.com/isudheerbabu/status/1825746561495871657 https://twitter.com/iamaadisaikumar/status/1825250706938380360
    ఆగస్టు 24 , 2024
    <strong>Telugu Love Dialogues: తెలుగు సినిమాల్లో ఇప్పటివరకు వచ్చి బెస్ట్ లవ్ డైలాగ్స్ ఇవే!</strong>
    Telugu Love Dialogues: తెలుగు సినిమాల్లో ఇప్పటివరకు వచ్చి బెస్ట్ లవ్ డైలాగ్స్ ఇవే!
    ప్రేమ అంటే రెండు అక్షరాల కలయిక కాదు. రెండు మనసుల కలయిక. ఈ ప్రపంచంలో ప్రతి మనిషి పరితపించేది, అన్వేషించేది ప్రేమ కోసమే. మనిషి నుంచి పశు పక్ష్యాదుల వరకు ప్రేమతోనే జీవితాలు ముందుకు సాగుతుంటాయి. భూత, వర్తమాన, భవిష్యత్ కాలలతో సంబంధం లేకుండా జీవన నావా ముందుకు సాగాలంటే ప్రేమ అనే చమురు చాలా అవసం. ఒకరిపై ఎంత ప్రేమో చెప్పాలంటే మాటలు సరిపోవు. కానీ కొన్ని మనసును తాకి మనలోని ప్రేమను ధ్వనింపజేస్తాయి. తెలుగు సినీలోకంలో ప్రేమ కావ్యాలు కోకొల్లలు. ప్రేక్షకులను ప్రేమ మాయలోకి దింపిన ఆ దృశ్య కావ్యాల నుంచి మనసుకు హత్తుకునేలా చేసిన డైలాగ్స్ మీకోసం.. [toc] బేబీ “ఫస్ట్ టైమ్ లవ్ చేసినప్పుడే అనుకున్నా.. రెండోసారి, ఇంకోసారి ప్రేమ అనే మాట ఉండదని” “మీ అంత బలం లేకుండొచ్చు. గుండెల మీద కొట్టాలంటే మా కంటే గట్టిగా ఇంకెవడూ ఎవడూ కొట్టలేడు” “అమ్మాయి జీవితంలోకి వచ్చే ముందు కష్టం వస్తుందని దేవుడు ఎందుకు సిగ్నల్ ఇవ్వడు” వాన “ఈ ప్రపంచంలో నేను ప్రేమించినంతగా నిన్ను ఎవ్వరూ ప్రేమించలేరు. నువ్వు ఎక్కడున్నా.. ఎలా ఉన్నా.. నన్ను మర్చిపోయినా.. ముసలిదానివైపోయినా.. చచ్చిపోయినా నీ మీద నా ప్రేమ చావదు” మన్మథుడు “నువ్వంటే ఎందుకు ఇష్టమో చెప్పలేను.. కానీ ఎంతిష్టమో చెప్పగలను!” కంచె&nbsp; “గులాబీ పువ్వును ఇష్టపడితే కోస్తాం, ప్రేమిస్తే నీళ్లు పోస్తాం” నిన్నుకోరి “నువ్వు ఇచ్చిన ధైర్యమే ఇంత బాగుంటే… లైఫ్‌ అంతా నువ్వు నాతో ఉంటే ఇంకెంత బాగుంటుంది” ఆర్య “నీ కోసమే నా అన్వేషణ.. నీ కోసమే నా నిరీక్షణ. నిన్ను చూసే క్షణం కోసం.. కొన్ని వేలసార్లు మరణించైనా సరే.. ఒక్కసారి జన్మించడానికి సిద్ధంగా ఉన్నాను “ ఆరెంజ్‌ “ప్రేమ ఆరంభంలోనే అద్భుతంగా ఉందంటే.. ముగింపు ఇంకా అద్భుతంగా ఉండాలి. అలాంటి సముద్రమంత ప్రేమను చూడాలంటే.. జీవితపు చివరి అంచుల్లోనే చూడగలవు. అలా చూడాలంటే ఒక్కమ్మాయినే ప్రేమించాలి” ప్రేయసిరావే “ప్రవహిస్తున్న ప్రతి రక్తపు బిందువు మీద నీ పేరే ఉంటుంది. పీలుస్తున్న ప్రతి గాలి రేణువులోనూ నీ రూపమే ఉంటుంది. కదులుతున్న ప్రతి జీవ కణంలోనూ నీ జ్ఞాపకమే ఉంటుంది.” ఏమాయ చేశావె “ఈ ప్రపంచంలో ఉన్న అమ్మాయిలంతా ఇప్పటి నుంచి నా సిస్టర్సే , ఒక్క నువ్వు తప్ప.” మళ్లీ మళ్లీ ఇది రాని రోజు “కళ్లు కూడా మాట్లాడగలవని నాకు తెలియదు.. నీ కళ్లు నాతో మాట్లాడేదాకా! ప్రాణం లేకపోయినా బతకొచ్చని నాకు తెలియదు.. అది నువ్వు తీసుకెళ్లిపోయేదాకా!”&nbsp; మజిలి “పెళ్లికి ముందులాగా.. పెళ్లి తర్వాత ప్రేమ కంటికి కనబడదు. అది ఒకరి మీద ఒకరికి ఉండే హక్కులోనే ఉంటుంది. ఒకరికోసం ఇంకొకరు తీసుకునే బాధ్యతలోనే ఉంటుంది” ఊపిరి “ప్రేమ ఉన్న చోటే భయం ఉంటుంది. ప్రేమిస్తున్నామని చెబితే.. ఎక్కడ రిజెక్ట్‌ చేస్తారోనని భయం. దగ్గరయ్యాక ఎక్కడ కోల్పోతామోనని భయం. మనకి కావాల్సిన వాళ్లు దూరమైతే.. ఎలా ఉన్నారని భయం. నిజానికి భయం ఉంటే.. ప్రేమ ఉన్నట్టే” జాను “పది నెలలు మోసి కన్న మీ అమ్మకు నువ్వు సొంతమైతే.. ఇన్నాళ్లుగా మనసులో మోస్తున్న నాకు కూడా నువ్వు సొంతమే” అందాల రాక్షసి “నా ప్రేమను చాపలా పరిస్తే ఈ భూమి సరిపోదు. గాలిలో నింపితే ఈ విశ్వం బద్దలవుతుంది. నీళ్లలో కలిపితే సముద్రాలు ఇంకిపోతాయి. శివుడు విషాన్ని దాచినట్టుగా దాయగలను” "రాళ్ళను పూజించే దేశంలో రాతిని ప్రేమించడం తప్పేం కాదు." ఓయ్ “నేను పడుకోబోయే ముందు చివరి ఆలోచన, లేచాక మొదటి ఆలోచన నువ్వే” కలర్ ఫొటో “ప్రేమించిన వారిని అందనంత ఎత్తులో నిలబెట్టడమే నిజమైన ప్రేమ.” “ఆడపిల్ల ఇంట్లో ఉన్న మనిషి..ఈ సముద్రం గట్టున నిల్చున్న మనిషి ఇద్దరూ ఒకటే సముద్రం వచ్చి చల్లగా మన కాళ్లు కడుగుతోందని అనుకుంటాం. కానీ మనకే తెలియకుండా కాళ్ల కింద ఇసుకని వెనక్కి లాగేసుకుని పోతుంది. &nbsp;మొగుడి దగ్గర మనసు దాచుకోగలం.. కానీ ఒళ్లు దాచలేం.” “ఈ ప్రపంచం మొత్తమ్మీద స్వచ్ఛమైన వాటిలో రెండోది అమ్మాయి నవ్వు.మొదటిది ఓ మగాడి కన్నీళ్లు.” “నీరు పట్టిన చద్దన్నం ఆకలి తీర్చకపోవచ్చు..కానీ కుడితి కలిపి పెడితే ఆవులు ఆవురావురుమంటూ తాగుతాయి. అలాగే మురికి నీళ్లు మనకు దాహం తీర్చకపోవచ్చు..కానీ నిప్పును ఆర్పుతాయి. ప్రపంచంలో ఏదీ ఊరికే పోదు అన్నీ ఉపయోగపతడాయి.” మనం “మనుషుల్ని సృష్టించిన ఆ దేవుడే ప్రేమను, మనసును సృష్టించాడు. మనిషి ప్రాణానికి పరిమితి పెట్టగలిగిన ఆ దేవుడు.. మనసుకు, ప్రేమకు ఎందుకు ఆ పరిమితులు పెట్టలేకపోయాడు” పడిపడిలేచె మనసు మిమ్మల్ని ప్రేమించిన వాళ్లకి.. అది కష్టమైనా, నష్టమైనా చివరి వరకూ మీతోనే ఉండాలనిపిస్తుంది. హలో గురు ప్రేమకోసమే “గుర్తుంచుకోవాలి.. గుర్తుంచుకోవాలి అని చదివే చదువు మాత్రం మర్చిపోతాం. కానీ మర్చిపోవాలి... మర్చిపోవాలి అనుకున్న అమ్మాయిని మాత్రం చచ్చేదాకా మర్చిపోలేం.” తీన్‌మార్ “మనకు జ్వరమొచ్చినప్పుడు అమ్మ కావాలనిపిస్తుంది. భయమేసినప్పుడు నాన్న ఉంటే ధైర్యంగా ఉంటుంది. బాధలో ఉన్నప్పుడు పక్కన ఫ్రెండ్‌ ఉంటే బాగుంటుంది. ఆనందంగా ఉన్నప్పుడు మన పక్కన ప్రేమించిన వాళ్లుంటే బాగుంటుంది” అల వైకుంఠపురములో.. “ప్రేమిస్తే అబద్దం విలువ తెలుస్తుంది కరెక్టే.., కానీ నిజం చెపితేనే కదా, ప్రేమ ఎంత గట్టిదో తెలుస్తుంది.” “బరువు పైన ఉంటే కిందకి చూడలేం, ఎంత బరువు పెడితే అంత పైకి చూస్తావ్. ఎంత కష్టపడితే అంత పైకి లేస్తావ్.” “ఇంట్లో దీపం వెలిగితే ఒక్క కుటుంబానికే వెలుగు, అదే గుడిలో వెలిగితే ఊరంతటికి వెలుగు” “ఎప్పుడు పిల్లలు బాగుండాలి అని అమ్మ నాన్నలు అనుకోవడమేనా, అమ్మ, నాన్ననాన్నలు బాగుండాలని పిల్లలు అనుకోరా.! “ఒక యుద్ధం వచ్చిన దేశం లో ఉన్నవాళ్ళందరూ, కులం, మతం ప్రాంతం అనే తేడాలు లేకుండ కలిసిపోతారు సర్, &nbsp;ఒక కష్టం వచ్చినప్పుడే, కుటుంబంలో ఉన్న అందరూ వాళ్ల స్వార్థం, ద్వేషం, పగ, అన్ని పక్కన పెట్టి ఒకటవుతారు.”
    ఆగస్టు 23 , 2024
    Allu vs Mega Families: మెగా ఫ్యామిలీకి అల్లు అర్జున్‌ స్ట్రాంగ్‌ కౌంటర్‌? చిరు బర్త్‌డే విషెస్‌లోనూ కానరాని ఎఫెక్షన్‌!
    Allu vs Mega Families: మెగా ఫ్యామిలీకి అల్లు అర్జున్‌ స్ట్రాంగ్‌ కౌంటర్‌? చిరు బర్త్‌డే విషెస్‌లోనూ కానరాని ఎఫెక్షన్‌!
    పాలు, నీళ్లలా కలిసి ఉండే అల్లు, మెగా ఫ్యామిలీల మధ్య మనస్పర్ధలు తలెత్తినట్లు గత కొంతకాలంగా జోరుగా ప్రచారం జరుగుతోంది. ఏపీ ఎన్నికల సమయంలో పవన్‌కు వ్యతిరేకంగా వైకాపా అభ్యర్థికి బన్నీ మద్దతు తెలపడం, ఓటు వేయాలని ప్రచారం కూడా చేయడం ఈ వివాదానికి కేంద్ర బిందువుగా మారింది. అప్పటి నుంచి సోషల్‌ మీడియా వేదికగా అల్లు అర్మీ, మెగా ఫ్యాన్స్‌ ఒకరిపై ఒకరు దుమ్మెత్తిపోసుకుంటున్నారు. ఈ క్రమంలోనే ఇటీవల పవన్‌ కల్యాణ్‌ పరోక్షంగా ‘పుష్ప’ సినిమాపై విమర్శలు చేయడం కూడా చర్చనీయాంశంగా మారింది. ఈ వివాదం కొనసాగుతున్న నేపథ్యంలోనే అల్లు అర్జున్‌ తాజాగా చేసిన కామెంట్స్‌ ఇండస్ట్రీలో హాట్‌ టాపిక్‌గా మారాయి. సోషల్‌ మీడియాలో మరోమారు ఫ్యాన్ వార్‌కు కారణమయ్యాయి. దీంతో అల్లు, మెగా ఫ్యామిలీ మధ్య ఉన్న వివాదం మరోమారు బట్టబయలైందన్న ప్రచారమూ ఊపందుకుంది. ఈ దెబ్బతో రెండు కుటుంబాల మధ్య ఉన్న రిలేషన్‌ కటీఫేనా అన్న అనుమానాలను నెటిజన్లు వ్యక్తం చేస్తున్నారు.&nbsp; ‘నా మనసుకు నచ్చితే వస్తా’ రావు రమేశ్‌ ప్రధాన పాత్రలో నటించిన 'మారుతీ నగర్‌ సుబ్రహ్మణ్యం' ప్రిరీలిజ్‌ ఈవెంట్‌కు అల్లు అర్జున్‌ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఆయనతో పాటు డైరెక్టర్ సుకుమార్‌ కూడా ఈ వేడుకలో సందడి చేశారు. సుకుమార్‌ భార్య తబిత సమర్పణలో వస్తోన్న సినిమా కావడంతో వారిద్దరూ ఈవెంట్‌కు హాజరయ్యారు. ఈ క్రమంలో అల్లు అర్జున్‌ మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. పరోక్షంగా మెగా ఫ్యామిలీ, మెగా ఫ్యాన్స్‌కు చురకలు అంటించారు. ‘మారుతీ నగర్‌ సుబ్రహ్మణ్యం సినిమాని సుకుమార్‌ భార్య తబిత ప్రెజెంట్‌ చేస్తున్నారు. మేం పుష్ప 2 క్లైమాక్స్‌ షూట్‌లో ఉండగా ఆమె వచ్చి సుకుమార్‌, మిమ్మల్ని కాకుండా నేను నా సినిమా ఈవెంట్‌కు ఎవరిని పిలవగలను అని అన్నారు. ఇప్పటి వరకూ నేను నటించిన వాటిలో అతికష్టమైన క్లైమాక్స్‌ పుష్ప 2ది. అలాంటి పరిస్థితిలోనూ ఆమె ఆహ్వానించారని వచ్చా. ఇష్టమైన వారిపై మన ప్రేమ చూపించాలి. మనం నిలబడగలగాలి. నాకు ఇష్టమైతే నేనొస్తా. నా మనసుకు నచ్చితే వస్తా’ అని అన్నారు. ఈ వ్యాఖ్యలు నెట్టింట వైరల్‌గా మారాయి. వైకాపా అభ్యర్థి తరపున ప్రచారం చేసిన బన్నీ పవన్‌ కోసం కూడా చేయవచ్చు కదా అన్న విమర్శలు వినిపించాయి. ఈ నేపథ్యంలోనే బన్నీ ఈవిధంగా బదులిచ్చి ఉండొచ్చని సినీ వర్గాలు విశ్లేషిస్తున్నాయి.  https://twitter.com/i/status/1826302303244091491 ‘నా ఫ్యాన్స్‌ అంటే నాకు పిచ్చి’ ఇదే ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో తన అభిమానులైన అల్లు అర్మీ గురించి బన్నీ ప్రత్యేకంగా ప్రస్తావించారు. వారిని ఆకాశానికెత్తుతూ మాట్లాడారు. ‘మై డియర్‌ ఫ్యాన్స్‌. నా ఆర్మీ. ఐ లవ్‌ యూ. నా ఫ్యాన్స్‌ అంటే నాకు పిచ్చి. హీరోని చూసి చాలామంది ఫ్యాన్స్‌ అవుతారు. నేను నా ఫ్యాన్స్‌ని చూసి హీరో అయ్యా. నా నుంచి కొత్త సినిమా వచ్చి మూడేళ్లవుతున్నా మీరు చూపే ప్రేమ ఏమాత్రం తగ్గలేదు. ఎప్పటికీ రుణపడి ఉంటా. మరోసారి మిమ్మల్ని ఇబ్బంది పెట్టను. తప్పకుండా ఎక్కువ సినిమాలు చేస్తా. తెరపై తరచూ కనిపిస్తా' అని అన్నారు. అయితే గతంలో ఎన్నడూ ఈ స్థాయిలో ఫ్యాన్స్ గురించి బన్నీ ఎప్పుడు మాట్లాడలేదు. వైకాపా నేతకు మద్దతు తెలిపినప్పటి నుంచి బన్నీని జనసైనికులతో పాటు మెగా ఫ్యాన్స్‌ పెద్ద ఎత్తున టార్గెట్‌ చేస్తూ వచ్చారు. సోషల్‌ మీడియాలో విపరీతంగా ట్రోల్స్‌ చేశారు. ఆ సమయంలో అల్లు అర్మీ తమ హీరోకి మద్దతుగా నిలిచి గొప్పగా పోరాడింది. మెగా ఫ్యాన్స్ ఆరోపణలకు ఎక్కడికక్కడ చెక్‌ పెడుతూ వచ్చింది. ఈ నేపథ్యంలో ఫ్యాన్స్‌కు తనదైన శైలిలో ఐ లవ్ యూ చెబుతూ బన్నీ కృతజ్ఞతలు చెప్పి ఉండొచ్చు. అయితే బన్నీ స్పీచ్‌లో గమనించాల్సిన అంశం ఇంకోటి కూడా ఉంది. ఆయన గతంలో ఎప్పుడు మెగా ఫ్యాన్స్‌, అల్లు ఆర్మీని సెపరేట్‌ చేసి మాట్లాడింది లేదు. కానీ ఈ సారి అల్లు అర్మీ అంటూ బన్నీ ప్రత్యేకంగా ప్రస్తావించారు. దీంతో మెగా ఫ్యాన్స్‌లో చీలికలను బన్నీ ప్రోత్సహిస్తున్నారన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.  చిరుకి సింపుల్‌ విషెస్‌..! నేడు (ఆగస్టు 22) మెగాస్టార్‌ చిరంజీవి పుట్టిన రోజు సందర్భంగా మెగా అభిమానుల్లో సంబరాలు అంబరాన్ని అంటాయి. దాదాపు 30 ఏళ్ల పాటు తెలుగులో టాప్‌ హీరోగా నిలిచిన తమ హీరోకు అభిమానులు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. ఇదిలా ఉంటే అల్లు అర్జున్‌ కూడా మెగాస్టార్‌కు బర్త్‌డే విషెస్‌ చెప్పారు. అయితే తనకు లైఫ్‌ ఇచ్చిన చిరంజీవికి సింపుల్‌గా పుట్టిన రోజు శుభాకాంక్షలు చెప్పడం విమర్శలకు తావిస్తోంది. దీనిపై మెగా అభిమానులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. బన్నీ ఎక్స్‌ వేదికగా స్పందిస్తూ 'మన మెగాస్టార్‌ చిరంజీవి గారికి మెనీ హ్యాపీ రిటర్న్స్‌ ఆఫ్‌ ద డే' అంటూ బన్నీ పోస్టు పెట్టాడు. అయితే గతంలో బన్నీ ఈ విధంగా ట్వీట్ ఎప్పుడు పెట్టలేదు. చిరు బర్త్‌డే అంటే ఎంతో హడావిడి చేసే బన్నీ ఇలా సింపుల్‌గా విషెస్‌ చెప్పి చేతులు దులిపేసుకోవడం వెనకు ఇరు కుటుంబాల మధ్య తలెత్తిన వివాదమే కారణమై ఉండొచ్చని నెటిజన్లు భావిస్తున్నారు.&nbsp; https://twitter.com/alluarjun/status/1826438293350711467 బన్నీకి పవన్‌ చురకలు! ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌ ఇటీవల కర్ణాటకలో పర్యటించారు. ఈ సందర్బంగా నిర్వహించిన ప్రెస్‌మీట్‌లో పవన్‌ కల్యాణ్‌ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. 40 ఏళ్ల క్రితం సినిమాల్లో హీరోలు అడవులను కాపాడేవారని పవన్ కల్యాణ్‌ అన్నారు. అయితే ఇప్పటి సినిమాల్లో హీరోలు అడవుల్లో చెట్లను నరికి స్మగ్లింగ్ చేస్తున్నారని అభిప్రాయపడ్డారు. అలా పరిస్థితి మారిపోయిందంటూ పవన్ కల్యాణ్‌ చేసిన వ్యాఖ్యలు వైరల్ టాలీవుడ్‌లో వైరల్‌గా మారాయి. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన పుష్ప సినిమాను ఉద్దేశించే పవన్ కల్యాణ్‌ ఈ వ్యాఖ్యలు చేశారంటూ సోషల్ మీడియాలో చర్చ జరిగింది. దీనిపై జనసైనికులు, మెగా ఫ్యాన్స్‌ - అల్లు ఆర్మీ మధ్య పెద్ద ఫ్యాన్‌ వారే జరిగింది. 
    ఆగస్టు 22 , 2024

    @2021 KTree