• TFIDB EN
  • ఓరి దేవుడా
    UATelugu2h 21m
    అర్జున్ (విశ్వక్‌ సేన్‌), అను (మిథిలా పాల్కర్) పెళ్లి చేసుకుంటారు. అర్జున్‌ని అను అనుమానిస్తూనే ఉంటుంది. దీంతో పెళ్లి తర్వాత స్వేచ్చ కోల్పోయినట్లు అతడు భావిస్తాడు. పెళ్లి విషయంలో తనకు సెకండ్ ఛాన్స్ ఇవ్వమని దేవుడ్ని మెురపెట్టుకుంటాడు. కొన్ని షరతులతో దేవుడు (వెంకటేష్‌) అందుకు అంగీకరిస్తాడు. ఆ తర్వాత ఏమైందన్నది కథ.
    ఇంగ్లీష్‌లో చదవండి
    మూవీ & ఓటీటీ అప్‌డేట్స్‌
    స్ట్రీమింగ్‌ ఆన్‌Ahaఫ్రమ్‌
    Watch
    రివ్యూస్
    YouSay Review

    REVIEW: “ఓరి దేవుడా” ఆకట్టుకుందా?

    తమిళంలో సూపర్‌హిట్‌ సాధించిన ‘ఓ మై కడవులే’ రీమేక్‌గా తెరకెక్కిన సినిమా “ఓరి దేవుడా” తమిళ దర్శకుడు అశ్వత్‌ మారిముత్తు తెలుగులోనూ దర్శకత్వం వహించాడు. వి...read more

    How was the movie?

    తారాగణం
    విశ్వక్ సేన్
    అర్జున్ దుర్గరాజు; అను బెస్తీ భర్తగా మారిపోయింది
    మిథిలా పాల్కర్
    అను అర్జున్ (నీ పాల్రాజ్); అర్జున్ బెస్టీ భార్యగా మారాడు
    ఆశా భట్
    మీరా; స్కూల్‌లో సీనియర్‌గా ఉన్న అర్జున్‌పై అతనికి క్రష్ ఉంది
    వెంకటేష్
    దేవుడు పొడిగించిన అతిధి పాత్రలో కనిపించాడు
    రాహుల్ రామకృష్ణ
    గాడ్ అసిస్టెంట్
    మురళీ శర్మ
    పాల్‌రాజ్; అను తండ్రి
    నాగినీడు
    దుర్గరాజు; అర్జున్ తండ్రి
    రాజశ్రీ నాయర్ అర్జున్ తల్లి
    సంతోష్ ప్రతాప్
    మీరా మాజీ ప్రియుడు
    జయలలిత
    న్యాయమూర్తి
    జీవన్ కుమార్ విడాకుల న్యాయవాది
    పూరి జగన్నాధ్
    పూరీ జగన్నాధ్‌ స్వయంగా అతిథి పాత్రలో కనిపించారు
    సిబ్బంది
    అశ్వత్ మరిముత్తుదర్శకుడు
    పెరల్ వి. పొట్లూరినిర్మాత
    పరమ వి. పొట్లూరినిర్మాత
    లియోన్ జేమ్స్
    సంగీతకారుడు
    తరుణ్ భాస్కర్
    డైలాగ్ రైటర్
    ఎడిటోరియల్ లిస్ట్
    కథనాలు
    <strong>Young Telugu Heroes: వైవిధ్యతకు ప్రాధాన్యమిస్తున్న కుర్ర హీరోలు.. సీనియర్లు చూసి నేర్చుకోవాల్సిందే!&nbsp;</strong>
    Young Telugu Heroes: వైవిధ్యతకు ప్రాధాన్యమిస్తున్న కుర్ర హీరోలు.. సీనియర్లు చూసి నేర్చుకోవాల్సిందే!&nbsp;
    టాలీవుడ్ యంగ్ హీరోలు కథల ఎంపిక విషయంలో జాగ్రత్తగా వ్యవహరిస్తున్నారు. కథలో కొత్త దనం ఉంటేనే సినిమా చేయడానికి ఆసక్తి చూపిస్తున్నారు. లేకుంటే నిర్మొహమాటంగా తిరస్కరిస్తున్నారు. తద్వారా రొటిన్‌ స్టోరీలతో వస్తోన్న నాగార్జున, వెంకటేష్‌, రవితేజ, రామ్‌ పోతినేని, నితిన్‌, గోపిచంద్‌ వంటి సీనియర్‌ హీరోలకు పాఠాలు నేర్పుతున్నారు. యువ హీరో సుహాస్ రీసెంట్‌గా 'గొర్రెపురాణం' అనే మరో విభిన్నమైన కథతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. ఈ నేపథ్యంలో కుర్ర హీరోలు ఎంచుకుంటున్న కొత్త తరహా సబ్జెక్ట్స్‌పై మరోమారు చర్చ మెుదలైంది. ఇంతకీ కొత్త కథలతో వస్తోన్న యంగ్‌ హీరోలు ఎవరు? వారు చేసిన చిత్రాలు ఏంటి? ఈ ప్రత్యేక కథనంలో తెలుసుకుందాం.&nbsp; సుహాస్‌ (Suhas) ఇండస్ట్రీలో చిన్న చిన్న క్యారెక్టర్లు చేస్తూ నటుడిగా కొనసాగుతూ వచ్చిన సుహాస్ ‘కలర్‌‌ ఫోటో’ సినిమాతో ఒక్కసారిగా ఫేమస్ అయ్యాడు. షార్ట్‌ ఫిల్మ్స్‌ చేస్తూ వచ్చిన క్రేజ్‌తో సినిమా అవకాశాలను పట్టేశాడు. ‘రైటర్‌ పద్మభూషణ్‌’, ‘అంబాజీపేట మ్యారేజ్‌ బ్యాండ్‌’, ‘శ్రీరంగనీతులు’, ‘ప్రసన్నవదనం’ వంటి వైవిధ్యవంతమైన చిత్రాల్లో నటించి ఆడియన్స్‌లో మంచి మార్కులు కొట్టేశాడు. అంతేకాదు ‘హిట్‌ 2’ మూవీలో విలన్‌గానూ నటించి ఆకట్టుకున్నాడు. తాజాగా ‘గొర్రెపురాణం’ అనే సరికొత్త సబ్జెక్ట్‌తో శుక్రవారం (సెప్టెంబర్‌ 20) ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. తేజ సజ్జ (Teja Sajja) బాలనటుడిగా ఇండస్ట్రీలో అడుగుపెట్టిన తేజ సజ్జ ‘జాంబి రెడ్డి’ సినిమాతో హీరోగా మారాడు. తొలి చిత్రంతోనే హీరో మెటీరియల్‌గా అనిపించాడు. ఆ తర్వాత ‘ఇష్క్‌’, ‘అద్భుతం’ వంటి వైవిధ్యమైన చిత్రాలు చేసినప్పటికీ పెద్దగా పేరు రాలేదు. తిరిగి ప్రశాంత్‌ వర్మ డైరెక్షన్‌లోనే 'హనుమాన్‌' చిత్రం చేసి జాతీయ స్థాయిలో సాలిడ్‌ హిట్ అందుకున్నాడు. ఈ మూవీ సక్సెస్‌తో తేజ సజ్జ పేరు మార్మోగింది. ప్రస్తుతం 'మిరాయ్‌' అనే మరో పాన్‌ ఇండియా చిత్రంలో తేజ నటిస్తున్నాడు. ఇందులో మంచు మనోజ్‌ విలన్‌గా నటిస్తున్నాడు. ఇప్పటికే విడుదలైన ‘మిరాయ్’ టీజర్‌ గూస్‌బంప్స్‌ తెప్పించింది.&nbsp;&nbsp; నిఖిల్ సిద్దార్ధ్‌ (Nikhil Siddhartha) యంగ్‌ హీరో నిఖిల్‌ సిద్ధార్థ్‌ హ్యాపీ డేస్‌ చిత్రంతో అందరి దృష్టిని ఆకర్షించాడు.&nbsp; ఆ సినిమాలో వరుణ్ సందేశ్‌ పక్కన ఫ్రెండ్‌గా నటించి మంచి పేరు తెచ్చుకున్నాడు.ఆ తర్వాత సోలో హీరోగా పలు సినిమాలు చేసి యూత్‌కు దగ్గరయ్యాడు. ఈ క్రమంలోనే స్వామి రారా, కార్తికేయా, సూర్య వర్సెస్‌ సూర్య, ఎక్కడికి పోతావు చిన్నవాడా, కార్తికేయ, కార్తికేయ 2, స్పై వంటి డిఫరెంట్‌ జానర్ ఫిల్మ్స్‌ చేసి మినమం గ్యారెంటీ హీరోగా గుర్తింపు తెచ్చుకున్నాడు. ప్రస్తుతం రామ్‌చరణ్‌ నిర్మాణంలో స్వయంభు అనే హిస్టారికల్‌ చిత్రంలో నిఖిల్‌ నటిస్తున్నాడు. అలాగే ‘కార్తికేయ 3’ చిత్రం కూడా అతడి లైనప్‌లో ఉంది.&nbsp; విశ్వక్‌ సేన్‌ (Visvak Sen) యువ నటుడు విశ్వక్‌ సేన్‌ యూత్‌లో మాస్‌ హీరోగా గుర్తింపు తెచ్చుకున్నాడు. కెరీర్‌ ప్రారంభం నుంచి సినిమా సినిమాకు వైవిధ్యం ఉండేలా విశ్వక్‌ జాగ్రత్త పడుతున్నాడు. తొలి చిత్రం ‘వెళ్లిపోమాకే’ పెద్దగా సక్సెస్‌ కాకపోయిన ‘ఈ నగరానికి ఏమైంది’ ఫిల్మ్‌తో యూత్‌లో మంచి క్రేజ్‌ తెచ్చుకున్నాడు. ఆ తర్వాత ‘ఫలక్‌నామా దాస్‌’ పేరుతో మాస్‌ యాక్షన్‌ డ్రామా తీసి మరో విజయాన్ని ఖాతాలో వేసుకున్నాడు. ‘హిట్‌’, ‘పాగల్‌’, ‘అశోక వనంలో అర్జున కల్యాణం’, ‘ఓరి దేవుడా’, ‘దాస్‌ కా ధమ్కీ’, ‘గామి’, ‘గ్యాంగ్స్ గోదావరి’ సక్సెస్‌లతో తెలుగులో స్టార్‌ హీరోగా గుర్తింపు తెచ్చుకున్నాడు. ప్రస్తుతం ‘మెకానిక్‌ రాకీ’, ‘లైలా’ అనే డిఫరెంట్‌ జానర్‌ ఫిల్మ్‌లో విశ్వక్‌ నటిస్తున్నాడు. ‘లైలా’లో లేడీ గెటప్‌లో అతడు కనిపించనుండటం గమనార్హం.&nbsp; అడివి శేష్ (Adivi Sesh) ఆర్యన్ రాజేష్ హీరోగా వచ్చిన సొంతం సినిమాలో చిన్న క్యారెక్టర్‌‌ చేసిన అడివి శేష్ ‘కర్మ’ సినిమాతో హీరోగా పరిచయం అయ్యాడు. పవన్‌ కల్యాణ్‌ నటించిన ‘పంజా’ సినిమాలో విలన్‌గా నటించి గుర్తింపు తెచ్చుకున్నాడు. ‘రన్‌ రాజా రన్’, ‘బాహుబలి’ సినిమాల్లో కీలక పాత్రల్లో నటించిన అతడు ‘క్షణం’, ‘గూఢచారి’, ‘ఎవరు’, ‘మేజర్’, ‘హిట్‌ 2’ వంటి వైవిధ్యమైన చిత్రాలతో నమ్మదగిన హీరోగా మారిపోయాడు. ముఖ్యంగా ‘మేజర్‌’ సినిమాతో అడివి శేష్‌ మార్కెట్‌ అమాంతం పెరిగిపోయింది. ప్రస్తుతం అతడు గూఢచారి సీక్వెల్‌లో నటిస్తున్నాడు. ఈ సినిమా పాన్‌ ఇండియా రేంజ్‌లో విడుదల కానుంది. ఈ మూవీ కూడా సక్సెస్ అయితే అడివి శేష్‌కు తిరుగుండదని చెప్పవచ్చు.&nbsp; సిద్ధు జొన్నలగడ్డ (Sidhu Jonnalagadda) నాగచైతన్య హీరోగా నటించిన మొదటి సినిమా జోష్‌తోనే సిద్దు జొన్నలగడ్డ కూడా ఇండస్ట్రీలోకి వచ్చాడు. ‘భీమిలి కబడ్డీ జట్టు’, ‘ఆరెంజ్’, ‘గుంటూర్ టాకీస్’ వంటి సినిమాలలో నటించినప్పటికీ సిద్ధు కెరీర్‌‌ గ్రోత్‌ అంతగా లేదనే చెప్పాలి. అయితే ఆయా చిత్రాల్లో సిద్ధు రోల్స్ మాత్రం చాలా వైవిధ్యంగా ఉంటాయి. నటనతోపాటు రైటర్‌‌గా, ఎడిటర్‌‌గా కూడా వర్క్‌ చేస్తూ వచ్చిన సిద్ధు ‘డిజే టిల్లు’తో బ్లాక్‌ బాస్టర్‌ హిట్ అందుకున్నాడు. ఈ సినిమాకు వచ్చిన క్రేజ్‌తో సీక్వెల్‌ కూడా తెరకెక్కించి మరో సాలిడ్‌ హిట్‌ అందుకున్నాడు. ‘టిల్లు స్క్వేర్‌’ చిత్రం ఏకంగా రూ.135 కోట్లు వసూలు చేయడం విశేషం. ప్రస్తుతం ‘జాక్‌’, ‘తెలుసు కదా’ వంటి చిత్రాల్లో అతడు నటిస్తున్నాడు. వాటి తర్వాత ‘టిల్లు క్యూబ్‌’ కూడా పట్టాలెక్కనుంది.&nbsp; నార్నే నితిన్‌ (Narne Nithin) జూనియర్ ఎన్టీఆర్‌ బావ మరిది నార్నే నితిన్‌ యూత్‌ఫుల్‌ ఎంటర్‌టైనర్‌ ‘మ్యాడ్‌’తో తెరంగేట్రం చేశాడు. ఈ సినిమా బాక్సాఫీస్‌ వద్ద మంచి విజయం సాధించింది. కాలేజ్‌ బ్యాక్‌డ్రాప్‌లో రావడంతో యూత్‌ కూడా బాగా కనెక్ట్‌ అయ్యారు. ఇక నితిన్‌ తన తర్వాతి చిత్రం ‘ఆయ్‌’ను పక్కా విలేజ్‌ నేపథ్యంలో తీసుకొచ్చి వైవిధ్యం చూపించాడు. అంతేకాదు మంచి విజయాన్ని కూడా అందుకున్నాడు. మ్యాడ్‌లో కాస్త సెటిల్‌గా కనిపించిన నితీన్‌ ‘ఆయ్‌’ సినిమాలో మంచి ప్రదర్శన చేశాడు. నటన, డ్యాన్స్‌, కామెడీ ఇలా అన్ని రంగాల్లో మ్యాడ్‌తో పోలిస్తే బెటర్‌ పర్‌ఫార్మెన్స్‌ చేశాడు. భావోద్వేగాలను కూడా చక్కగా పండించి ఆకట్టుకున్నాడు.&nbsp;
    సెప్టెంబర్ 17 , 2024
    Best Love Songs 2023: యూట్యూబ్‌ను షేక్‌ చేస్తున్న టాప్‌ 10 తెలుగు రొమాంటింక్ సాంగ్స్‌?
    Best Love Songs 2023: యూట్యూబ్‌ను షేక్‌ చేస్తున్న టాప్‌ 10 తెలుగు రొమాంటింక్ సాంగ్స్‌?
    కోపం, చిరాకు, బాధ ఇలా ఏ మూడ్‌నైనా మ్యూజిక్‌ చిటికెలో మాయం చేస్తుంది. ఇష్టమైన మెలోడి సాంగ్స్‌ వింటే ఊహాల్లో విహరించాల్సిందే. ప్రస్తుతం చాలా మంది యువత తమ స్ట్రెస్‌ బస్టర్‌గా మ్యూజిక్‌నే ఉపయోగిస్తున్నారు. ఈ నేపథ్యంలో తెలుగులో ఇటీవల ఎన్నో సూపర్‌ హిట్‌ మెలోడీ సాంగ్స్‌ రిలీజ్‌ అయ్యాయి. ప్రస్తుతం ఆ పాటలకు యూట్యాబ్‌లో యమా క్రేజ్‌ నడుస్తోంది. 2023లో అత్యధిక వ్యూస్‌తో&nbsp; యూట్యూబ్‌ను షేక్‌ చేస్తున్న టాప్‌-10 తెలుగు మెలోడీ సాంగ్స్‌ ఏవో ఇప్పుడు చూద్దాం… 1. ఇంతందం, ఓ సీతా ( సీతారామం) అద్భుతమైన ప్రేమ కావ్యంగా తెరకెక్కిన సీతారామం (Sita Ramam) సినిమా.. తెలుగులో సూపర్‌హిట్‌ అందుకుంది. ఈ సినిమాలోని ప్రతీ పాట దేనికదే ప్రత్యేకం. ముఖ్యంగా ‘ఇంతందం’, ‘ఓ సీతా’ పాటలు తెలుగు ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ఈ పాటల్లో దుల్కర్‌ సల్మాన్‌ (Dulquer Salmaan), మృణాల్‌ ఠాకూర్‌ (Mrunal Thakur)&nbsp; అద్భుతంగా నటించారు. ప్రస్తుతం ఈ రెండు పాటలు యూట్యూబ్‌లో అత్యధిక వీక్షణలతో దూసుకెళ్తున్నాయి. https://youtu.be/hYFzyK9ExuM https://youtu.be/dOKQeqGNJwY 2. కళావతి (సర్కారు వారి పాట) మహేష్‌బాబు (Mahesh Babu), కీర్తి సురేష్‌ (keerthi Suresh) జంటగా చేసిన సర్కారు వారి పాట (Sarkari Vaari Paata) హిట్ టాక్‌ తెచ్చుకుంది. ఇందులోని కళావతి సాంగ్‌ మ్యూజిక్‌ లవర్స్‌ను ఎంతగానో ఆకట్టుకుంది. సిద్‌ శ్రీరామ్‌ (Sid Sriram) తన స్వరంతో ఈ పాటకు ప్రాణం పోశాడు. ప్రస్తుతం ఈ యూట్యూబ్‌లో పాట తెగ ట్రెండింగ్ అవుతోంది. ఇప్పటికే 24 కోట్ల మంది యూట్యూబ్‌లో ఈ పాటను వీక్షించారు.&nbsp; https://youtu.be/Vbu44JdN12s 3. గుండెల్లోనా (ఓరి దేవుడా) విశ్వక్‌ సేన్‌ (Vishwak Sen) హీరోగా విక్టరీ వెంకటేష్ (Venkatesh) ప్రధాన పాత్రలో నటించిన ‘ఓరి దేవుడా’ (Ori Devuda) సినిమా హిట్ టాక్ తెచ్చుకుంది. ముఖ్యంగా ఈ సినిమాలోని గుండెల్లోనా పాట ప్రేక్షకులను ఉర్రూతలూగించింది. ఫుల్‌ జోష్‌తో నిండిన ఈ పాట ప్రతీ ఒక్కరినీ ఆకట్టుకుంది. 8.4 కోట్ల వ్యూస్‌లో ఈ పాట యూట్యూబ్‌ను షేక్ చేస్తోంది.&nbsp; https://www.youtube.com/watch?v=t_aO4EMP-i0 4. కుంకుమల (బ్రహ్మస్త్ర) బ్రహ్మస్త్ర (Brahmastra) లోని కుంకుమల నువ్వే పాట మ్యూజిక్‌ లవర్స్‌ను కట్టిపడేసింది. ఎంతోమంది ఈ పాటను కాలర్‌ట్యూన్‌గా, మెుబైల్‌ రింగ్‌టోన్‌గా పెట్టుకున్నారు. సిద్‌ శ్రీరామ్‌ (Sid Sriram) తన స్వరంతో మరోమారు సంగీత ప్రియులను ఆకట్టుకున్నాడు. ప్రస్తుతం ఈ పాట కూడా 4.5 కోట్ల వీక్షణలతో యూట్యూబ్‌లో దూసుకుపోతోంది.&nbsp;&nbsp; https://youtu.be/5kzM6m33DTo 5. మెహబూబా (కేజీఎఫ్‌ 2) కేజీఎఫ్‌ చాప్టర్‌ 2 (KGF 2)లోని మెహబూబా(Mehabooba) పాట కూడా మెలోడి ప్రియుల ఫేవరెట్‌ సాంగ్. ఈ సినిమా మాస్ ఆడియన్స్‌కు ఎంత బాగా నచ్చిందో క్లాస్‌ మ్యూజిక్‌ లవర్స్‌ మెహబూబాా పాట అంతకంటే బాగా నచ్చింది. అనన్య భట్‌ పాడిన ఈ పాట ప్రతీ ఫోన్‌లోని మ్యూజిక్‌ ఆల్బమ్‌లో తప్పకుండా ఉంటుంది. యూట్యూబ్‌లో ఈ పాట 3.9 కోట్ల వ్యూస్‌ను సంపాదించింది https://youtu.be/5xwM12SOXEE 6. మాస్టారు మాస్టారు (సార్‌) సార్‌(SIR) సినిమాలోని మాస్టారు మాస్టారు సాంగ్‌ కూడా యూట్యూబ్‌లో అత్యధిక వ్యూస్‌తో దూసుకెళ్తోంది. ప్రస్తుతం చాలా మంది మ్యూజిక్‌ లవర్స్‌కు ఈ పాట ఫేవరేట్‌ సాంగ్‌గా ఉంది. సింగర్‌ శ్వేతా మోహన్‌ (Swetha Mohan) అందించిన గాత్రం సంగీత ప్రియులను విశేషంగా అలరిస్తోంది. యూట్యూబ్‌లో ఈ పాటను 3.3 కోట్ల మంది చూశారు.&nbsp; https://youtu.be/AXSm49NGkg8 7. నగుమోము తారలే (రాధేశ్యామ్‌) పాన్‌ ఇండియా స్టార్‌ ప్రభాస్‌ (Prabhas), హీరోయిన్‌ పూజా హెగ్డే (Pooja Hedgde) జంటగా చేసిన రాధేశ్యామ్‌ (Radhe Shyam) సినిమా బాక్సాఫీస్‌ వద్ద బోల్తా పడిన విషయం తెలిసిందే. ఈ సినిమాలోని నగుమోము తారలే పాట మాత్రం సూపర్‌హిట్‌గా నిలిచింది. మ్యూజిక్‌ లవర్స్‌ ఈ పాటను రిపీట్‌ మోడ్‌లో పెట్టుకొని మరి వింటున్నారు. అటు యూట్యూబ్‌లోనూ ఈ పాటను వీక్షించే వారి సంఖ్య రోజురోజుకు పెరిగిపోతోంది. ఇప్పటివరకూ ఈ పాటను 11 మిలియన్స మంది చూశారు.&nbsp; https://youtu.be/O5LW6HABcRA 8. ఏడు రంగుల వాన (18 పేజెస్‌) నిఖిల్‌(Nikhil), అనుపమ (Anupama Parameswaran) జంటగా నటించిన 18 పేజెస్‌ (18 Pages) సినిమా హిట్‌ టాక్‌ తెచ్చుకుంది. అలాగే ఈ సినిమాలోని ఏడు రంగుల వాన పాట కూడా ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. ప్రస్తుతం ఈ పాట యూట్యూబ్‌లో 1.8 మిలియన్ వ్యూస్ సంపాదించింది.&nbsp; https://youtu.be/hOLw-mkSnHs 9. ఓ రెండు ప్రేమ మేఘాలిలా (బేబి) ఆనంద్‌ దేవరకొండ (Anand Devarakonda) హీరోగా త్వరలో బేబి సినిమా రాబోతోంది. ఇప్పటికే ఈ సినిమాలోని ‘ఓ రెండు ప్రేమ మేఘాలిలా’ లిరికల్‌ వీడియో సాంగ్‌ను విడుదల చేశారు. ప్రస్తుతం ఈ పాట కూడా యూట్యూబ్‌లో ట్రెండ్‌ అవుతోంది. ఇప్పటివరకు 7.5 మిలియన్ల మంది పాటను చూశారు.&nbsp; https://youtu.be/D_SRMiIWyL4 10. ప్రియతమ (కొత్త కొత్తగా) కొత్త కొత్తగా (Kotha Kothaga) సినిమాలోని ప్రియతమ (Priyathama) పాట కూడా మ్యూజిక్‌ లవర్స్‌ను ఆకర్షిస్తోంది. అనంత శ్రీరామ్‌ (Ananth Sriram) ఈ పాటకు లిరిక్స్‌ అందించగా… శిద్‌ శ్రీరామ్‌ చాలా అద్భుతంగా పాడాడు. ఈ పాటను 14 మిలియన్ల మంది యూట్యూబ్‌లో వీక్షించారు.&nbsp; https://youtu.be/CDbuW4689fI
    ఏప్రిల్ 12 , 2023
    Telugu Heroes Cars Collections: టాలీవుడ్‌లో ఏ హీరో దగ్గర ఎక్కువ కార్లు ఉన్నాయో తెలుసా?
    Telugu Heroes Cars Collections: టాలీవుడ్‌లో ఏ హీరో దగ్గర ఎక్కువ కార్లు ఉన్నాయో తెలుసా?
    టాలీవుడ్ హీరోల స్థాయి సినిమా ఇండస్ట్రీలో ఓ రేంజ్‌లో పెరిగిపోయింది. బాలీవుడ్ హీరోలు కూడా మన హీరోల క్రేజ్‌ను అందుకోలేకపోతున్నారు. హీరోల పారితోషికంతో పాటు అనభవించే సౌకర్యాలు ఘనంగా ఉంటున్నాయి. ఒక్కో హీరో రూ.10 కోట్ల నుంచి 150 కోట్ల వరకు రెమ్యూనరేషన్ తీసుకుంటున్నారు. మరి ఈ రేంజ్‌లో వసూలు చేస్తున్న తెలుగు హీరోల లైఫ్‌స్టైల్ ఇలా ఉంటుందో ఊహించుకోవచ్చు. వారు వాడే ప్రతి వస్తువు చాలా లగ్జరీగా, లావీష్‌గా ఉంటుంది. ఇక మన హీరోలు ఎలాంటి కార్లు వాడుతున్నారు. ఏ కారు ఎంత ధర ఉంది.టాలీవుడ్ హీరోల్లో ఎవరి దగ్గర ఎక్కువ కార్లు ఉన్నాయి. అత్యధిక ధర కలిగిన కారు ఎవరి దగ్గర ఉంది అనే విషయాలను ఇప్పుడు చూద్దాం. [toc] సూపర్ స్టార్ మహేష్ బాబు సూపర్ స్టార్ మహేష్‌బాబు దగ్గర చాలా లగ్జరీ కార్లు ఉన్నాయి. మొత్తం ఆయన దగ్గర రూ.14 కోట్ల విలువ చేసే కార్లు ఉన్నాయి. రీసెంట్‌గా ఆయన గోల్డ్‌ కలర్ రెంజ్ రోవర్ కొనుగోలు చేశాడు. దీని ధర రూ.5కోట్లు. మహేష్ బాబుకు మెర్సిడెస్ కార్లంటే తెగ ఇష్టం. ఈ బ్రాండ్‌కు సంబంధించిన అనేక కార్లు ఆయన దగ్గర ఉన్నాయి. మెర్సిడెస్ బెంజ్ E క్లాస్‌తో పాటు.. మెర్సిడెస్ GL క్లాస్‌ కార్లు లగ్జరీ కార్ల జాబితాలో ఉన్నాయి. వీటితో పాటు రూ.1.90కోట్లు విలువ చేసే Audi E-Tron, రూ.2.80 కోట్ల విలువ చేసే లంబోర్గిని గాలర్డో వంటి విలాసవంతమైన కార్లు ఆయన సేకరించారు. జూనియర్ ఎన్టీఆర్ కార్ కలెక్షన్స్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ దగ్గర కూడా అదిరిపోయే లగ్జరీ కార్ల లైనప్‌ ఉంది. ఇటీవల ఆయన రెండు కార్లు కొన్నారు. మెర్సిడెస్ బెంజ్ మేబాచ్ ఎస్- క్లాస్(Mercedes-Benz Maybach S - Class) దీనిని తనకు ఇష్టమైన బ్లాక్ కలర్‌ వేరియంట్‌లో తీసుకున్నాడు. దీని ధర రూ.4.23 కోట్లు. మరో లగ్జరీ కారు హ్యూందాయ్ ఎలక్ట్రిక్ కార్ ఐయానిక్ 5&nbsp; (hyundai electric car ioniq 5 black) తీసుకున్నారు. దీని ధర రూ.55.2 లక్షలు. ఈ రెండు కార్ల ధరే దాదాపు రూ.5 కోట్లు దాటింది.&nbsp; https://twitter.com/sarathtarak9/status/1775161795440971956 వీటితో పాటు భారత దేశంలోని మొట్టమొదటి లంబోర్ఘిని ఉరుస్ గ్రాఫైట్ క్యాప్సూల్‌ను ఆయన&nbsp; రూ. 3.16 కోట్ల ధరతో ఇంటికి తీసుకొచ్చాడు. ఈ కారును 2021లో కొన్న ఎన్టీఆర్.. అప్పట్లో వార్తల్లో నిలిచాడు. మరో విషయం ఏమిటంటే ఈ కారుకు తన లక్కీ నంబర్.. 9999 రిజిస్ట్రేషన్ కోసం ఏకంగా ఆయన రూ.17 లక్షలు చెల్లించాడు. జూనియర్ ఎన్టీఆర్ దగ్గర రేంజ్ రోవర్ వోగే (Range Rover Vogue) కూడా ఉంది. దీని ధర అక్షరాల రూ.2 కోట్లు. దీనితో పాటు BMW 7 సిరీస్( రూ.1.799 కోట్లు), పోర్సే 718(Porsche 718 Cayman) దీని ధర రూ. 2.54 కోట్లు. ఇది కేవలం 3.4 సెకన్లలోనే 100 కిలోమీటర్ల స్పీడ్‌ను అందుకుంటుంది. విషేషమేటిటంటే ఈ లగ్జరీ కార్లన్నింటి నెంబర్లు 9999 కావడం గమనార్హం. ప్రభాస్ కార్ కలెక్షన్లు పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ సినిమాల్లోనే కాదు.. లగ్జరీ కార్ల విషయంలోనూ బాహుబలే. ఏ హీరో దగ్గరలేనన్ని కార్లు ప్రభాస్ దగ్గర ఉన్నాయి. వాటిలో అత్యంత ఖరీదైన కార్లను ఇప్పుడు చూద్దాం. ప్రభాస్‌ గ్యారేజ్‌లో ఇప్పటికే BMW X3 (రూ.56 లక్షలు), జాగ్వర్ XJL 3.0 (రూ.1.97 కోట్లు), రేంజ్ రోవర్ SV ఆటోబయోగ్రఫీ (రూ.1.84 కోట్లు), లంబోర్గిని అవెంటడార్ రోడ్‌స్టర్‌ (రూ.6 కోట్లు) లాంటి ఖరీదైన, ఫారెన్ బ్రాండెడ్ కార్లు ఉన్నాయి. కానీ ఇవన్నీ ప్రభాస్ కలెక్షన్​లో ఉన్న చిన్నచిన్న కార్లు మాత్రమే. వీటిని తలదన్నే అత్యంత ఖరీదైన కారు కూడా ఉంది. అది ఏంటంటే? ప్రభాస్ కలెక్షన్లలో అత్యంత ఖరీదైన కారు రూ.8 కోట్లు విలువైన రోల్స్ రాయిస్ ఫాంటమ్ ఉంది. దీని కోసం ప్రభాస్ ఏకంగా రూ.2.5 కోట్లు అదనంగా ఖర్చు చేసి, కస్టమైజేషన్ కూడా చేశారు. అంటే ప్రభాస్ సినిమాల్లోనే కాదు, కార్ల కలెక్షన్​ల్లోనూ బాహుబలే అని స్పష్టమవుతోంది. ప్రభాస్ గ్యారేజీలోని ఈ ఫ్యాన్సీ కార్లు గురించి మరింత వివరంగా ఇప్పుడు చూద్దాం. &nbsp;Rolls Royce Phantom : ప్రభాస్ దగ్గర ఉన్న లగ్జరీ కార్లలో అత్యంత విలువైనది. రోల్స్ రాయిస్ ఫాంటమ్. ఇది ప్రప్రంచంలోని ఖరీదైన కార్లలో ఒకటి. దీని ధర రూ. 8-10 కోట్ల మధ్యలో ఉంటుంది. ఇలాంటి కారు మనదేశంలో కొద్ది మంది సెలబ్రెటీల దగ్గర మాత్రమే ఉంది. అక్షయ్ కుమార్, అమితాబ్ బచ్చన్ వంటి సూపర్ స్టార్ల దగ్గర ఈ కారు ఉంది. &nbsp;Rolls Royce Ghost ప్రభాస్ గ్యారేజ్‌లో ఉన్న మరో లగ్జరీ కారు రోల్స్ రాయిస్ ఘోస్ట్. దీని ధర ఏకంగా రూ.7.95కోట్లు Jaguar XJL&nbsp; ప్రభాస్ ఇష్టమైన లగ్జరీ కార్లలో సిల్వర్ జాగ్వర్ XJLకు ప్రత్యేక స్ధానం ఉంది. ప్రభాస్ పాన్‌ ఇండియన్‌ స్టార్‌గా ఎదిగిన తర్వాత&nbsp; కొనుగోలు చేసిన తొలి విలాసవంతమైన కారు ఇదే. దీని ధర రూ.2 కోట్లు. &nbsp;Audi R8: ప్రభాస్ లగ్జరీ కార్ల జాబితాలో చేరిన మరో విలాసవంతమైన కారు ఆడి R8. దీని ధర అక్షరాల రూ.2.30 కోట్లు&nbsp; BMW X5&nbsp; ప్రభాస్ గ్యారేజ్‌లో బ్లాక్ బీఎమ్‌డబ్ల్యూ ఎక్స్5 కారు ఉంది. దీని ధర రూ.1.2కోట్లకు పైగా ఉంటుంది. 8-స్పీడ్ ZF ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్‌ను కలిగి ఉంటుంది. ఇది 255 PS పవర్, 560 Nm టార్క్‌ను జనరేట్ చేస్తుంది.&nbsp; Lamborghini Aventador Roadster&nbsp; &nbsp;లంబోర్గినీ వెంచర్‌లో ఇది ప్రత్యేకమైనది.&nbsp; ఇది లీటర్‌కు 5.0 kmpl మైలేజ్ మాత్రమే ఇస్తుంది. దీనిలో ఇంధనం నిలిపేందుకు ఇచ్చిన ట్యాంక్ సామర్థ్యం 90లీటర్లు. అతి తక్కువ గ్రౌండ్ క్లియరెన్స్‌ను కలిగి ఉంటుంది. ఈ కారు ద్వారా గంటకు 350 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించవచ్చు. దీని ధర అక్షరాల 6.5 కోట్లు ఉంటుంది. Range Rover SV Autobiography&nbsp; ప్రభాస్ లగ్జరీ లైనప్‌లో ఇది మరో సూపర్బ్ కారు. ఇది కేవలం 3 సెకన్లలోనే 100 కిలోమీటర్ల వేగం అందుకుంటుంది. దీని ధర రూ.6కోట్లకు పైనే ఉంటుంది. అల్లు అర్జున్ లగ్జరీ&nbsp; కార్ కలెక్షన్స్ పాన్ ఇండియా స్టార్‌గా ఎదిగిన ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ గ్యారెజీలో సూపర్బ్ లగ్జరీ కార్ల లైనప్‌ అయితే ఉంది వాటిపై ఓ లుక్ వేద్దాం. జాగ్వార్ XJL&nbsp; దీని ధర రూ.2 కోట్లు. ఇది బన్నీ కొన్న మొదటి లగ్జరీ కార్. ఇదే కారు ప్రభాస్ దగ్గర కూడా ఉంది. ఇది వైట్‌ కలర్‌లో ఉంటుంది. హమ్మర్ H2&nbsp; అల్లు అర్జున్ లగ్జరీ లైనప్‌లో ఉన్న మరో కారు... హమ్మర్ H2. దీని ధర రూ.75 లక్షలు. దీనిని ముద్దుగా బన్నీ 'బ్యాడ్ బాయ్‌'గా పిలుచుకుంటారు.&nbsp; వోల్వో XC90 T8 ఇది&nbsp; వోల్వో&nbsp; ఫ్లాగ్‌షిప్ SUV దీని ధర ఏకంగా రూ.1.5 కోట్లు&nbsp;&nbsp; ఇటీవల ఆయన గ్యారేజ్‌లోకి రేంజ్‌ రోవర్ చేరింది. అల్లు అర్జున్ దీనిని 'ది బీస్ట్‌గా' పిలుస్తారు. దీని ధర రూ.2.3కోట్లు.&nbsp; ఇక అల్లు అర్జున్ వెహికల్ కలెక్షన్‌లో స్టార్ హీరో వ్యానిటీ వ్యాన్. దీనిని బన్నీ ప్రత్యేకంగా కస్టమైజ్ చేయించుకున్నారు. దీని ధర రూ.7కోట్లకు పైమాటే. రామ్‌చరణ్ లగ్జరీ&nbsp; కార్ కలెక్షన్లు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ సినిమాల్లోనే కాదు.. కార్ల కలెక్షన్లలోనూ సూపర్ స్టారే.&nbsp; విలాసవంతమైన కార్లకు చెర్రీ పెద్ద అభిమాని. మరి రామ్‌ చరణ్ గ్యారేజీలో ఉన్న లగ్జరీ కార్లపై ఓలుక్కేద్దాం. Ferrari Portofino రామ్‌చరణ్ కలెక్షన్స్‌లో అత్యంత వార్తల్లో నిలిచింది ఫెరారీ పోర్టోఫినో. దీని ధర దాదాపు రూ. 3.50 కోట్లపైనే ఉంటుంది. ఇది రెడ్ కలర్‌లో ఉంటుంది. ఈకారును అప్పుడప్పుడు హైదరాబాద్ వీధుల్లో చరణ్ తిప్పుతుంటాడు. View this post on Instagram A post shared by abhi's photography📸 (@abhi__photographyy) ఈ కార్ మాత్రమే కాకుండా రామ్‌ చరణ్ దగ్గర అతి పెద్ద లగ్జరీ కార్ల వాహన శ్రేణి ఉంది. రోల్స్ రాయిస్ ఫాంటమ్ - రూ 9.57 కోట్లు మెర్సిడెస్ మేబ్యాక్ GLS 600 — రూ. 4 కోట్లు&nbsp; https://twitter.com/ManobalaV/status/1437059410321309702 ఆస్టన్ మార్టిన్ వాంటేజ్ V8 — రూ. 3.2 కోట్లు ఫెరారీ పోర్టోఫినో - రూ 3.50 కోట్లు రేంజ్ రోవర్ ఆటోబయోగ్రఫీ - రూ 2.75 కోట్లు BMW 7 సిరీస్ - రూ. 1.75 కోట్లు Mercedes Benz GLE 450 AMG కూపే — రూ. 1 కోటి ఈ లగ్జరీ కార్ల లైనప్‌తో పాటు రామ్ చరణ్ వద్ద ఓ ప్రైవేట్ జెట్‌ కూడా ఉంది. తరచుగా ఆ జెట్‌లో దూర ప్రాంతాలకు విదేశాలకు వెళ్లి వస్తుంటాడు. https://twitter.com/HelloMawa123/status/1502241248836349956 విజయ్ దేవరకొండ లగ్జరీ కార్ కలెక్షన్లు రౌడీ బాయ్ విజయ్ దేవరకొండకు&nbsp; లగ్జరీ కార్లంటే అందరి హీరోల్లాగే మక్కువ. విజయ్ దగ్గర ఉన్న లగ్జరీ కార్లలో అత్యంత ఖరీదైనది బెంట్లీ కాంటినెంటల్ జీటీ. దీని ధర సుమారు రూ.4కోట్లు. ఇదే కారు విరాట్ కోహ్లీ దగ్గర కూడా ఉంది.&nbsp; అతని దగ్గర ఆకట్టుకునే కలెక్షన్‌ ఉంది.BMW 5 సిరీస్ 520d దీని ధర సుమారు రూ.75 లక్షలు, అలాగే రూ.62 లక్షల విలువైన ఫోర్డ్ ముస్టాంగ్‌ను కలిగి ఉన్నాడు. దీనితో పాటు Benz GLS 350 వంటి హైఎండ్ కారు అతని గ్యారేజ్‌లో పార్క్ అయి ఉంది. దీని దాదాపు కోటి రూపాయలు.&nbsp; Volvo XC90 (సుమారు INR 1.31 కోట్లు), Audi Q7 దీని ధర రూ.74 లక్షలుగా ఉంది. దీంతో పాటు విజయ్ దేవరకొండకు ఒక ప్రైవేట్ జెట్‌ కూడా ఉంది.&nbsp; తరచుగా తన కుటుంబంతో చార్టర్డ్ విమానాలలో ప్రయాణిస్తుంటాడు. https://www.youtube.com/watch?v=vkS_uio8ix8 నాగచైతన్య లగ్జరీ కార్‌ కలెక్షన్లు అక్కినేని నాగ చైతన్య గ్యారేజ్‌లో పార్క్ చేసిన విలాసవంతమైన కార్లు ఓసారి చూద్దాం. ఈ కార్ల వెరియంట్ల లిస్ట్ చూస్తే అతనికి లగ్జరీ కార్లంటే ఎంత ఇష్టమో అర్ధమవుతుంది. ఫెరారీ 488GTB — (రూ. 3.88cr) నిస్సాన్ GT-R — (రూ. 2.12cr) Mercedes –Benz G-Class G 63 AMG — (రూ. 2.28cr) BMW 740 Li — (రూ. 1.30cr) నిస్సాన్ GT-R — (రూ. 2.12cr) 2X ల్యాండ్ రోవర్ రేంజ్ రోవర్ వోగ్ — (రూ. 1.18cr) MV అగస్టా F4 — (రూ. 35L) BMW 9RT — (రూ. 18.50L) View this post on Instagram A post shared by Chay Akkineni (@chayakkineni) https://twitter.com/baraju_SuperHit/status/859824197706465280 View this post on Instagram A post shared by Pinkvilla South (@pinkvillasouth) నాని లగ్జరీ కారు కలెక్షన్ నాని దగ్గర లగ్జరీ కార్‌ కలెక్షన్ ఉంది. రేంజ్ రోవర్ వోగ్‌(range rover vogue) ఉంది. దీని ధర రూ.2కోట్ల 75 లక్షలు, BMW 5 సిరీస్- దీని ధర రూ.60లక్షలు,&nbsp; టయోట ఫార్చునర్(రూ.42లక్షలు), టయోటా ఇన్నోవా క్రిస్టా(రూ.25లక్షలు) ఉన్నాయి. ఫోర్డ్ ఫియాస్టా కారు కూడా నాని గ్యారేజీలో ఉంది. ఈ కారంటే నానికి చాలా ఇష్టమని చాలా సందర్బాల్లో చెప్పాడు. https://www.youtube.com/watch?v=KuOxAHUisOg రామ్‌పొత్తినేని లగ్జరీ కారు కలెక్షన్ రామ్ పోతినేని దేవదాసుతో అరంగేట్రం చేసి మాస్‌ హీరోగా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. రెడీ, కందిరీగ, పండగ చేస్కో, నేను శైలజ, ఇస్మార్ట్ శంకర్ వంటి హిట్ చిత్రాలతో స్టార్ హీరోగా ఎదిగాడు. సినిమాల్లో ఏ రేంజ్‌లో ఉన్నాడో విలాసవంతమైన కార్లున్న హీరోల్లోనూ రామ్‌ అదే స్థాయిలో ఉన్నాడు.&nbsp; అతని కార్ కలెక్షన్లలో ప్రముఖంగా &nbsp;రూ. 2.30 కోట్ల విలువైన రేంజ్ రోవర్, &nbsp;రూ. 2.10 కోట్ల విలువైన నిస్సాన్ GTR, రూ.2.50 కోట్ల విలువైన రేంజ్ రోవర్ ఆటోబయోగ్రఫీ . రూ. 1.20 కోట్ల విలువైన పోర్సే సియానీ(porsche cayenne)-&nbsp;&nbsp; రూ. కోటి విలువైన BMW X3. https://www.youtube.com/watch?v=hnhUYoAy0PE విష్వక్ సేన్ లగ్జరీ కారు కలెక్షన్ విశ్వక్ సేన్ నటుడిగా మాత్రమే కాకుండా దర్శకుడిగాను ఆయనకు గుర్తింపు ఉంది. 'వెళ్లిపోమాకే' చిత్రం ద్వారా తెలుగు తెరకు పరిచయం అయ్యాడు. అయితే తరుణ్ భాస్కర్ డైరెక్షన్‌లో వచ్చిన 'ఈ నగరానికి ఏమైంది' చిత్రం ద్వారా ఆయనకు గుర్తింపు లభించింది. ఈ చిత్రం కమర్షియల్‌గా మంచి సక్సెస్ సాధించింది. ఇక తన స్వీయ దర్శకత్వంలో వచ్చిన 'ఫలక్‌నామాదాస్' చిత్రం సైతం మంచి విజయం సాధించింది. ఆ తర్వాత 'హిట్', 'అశోకవనంలో అర్జున కళ్యాణం', 'దాస్‌కా ధమ్కీ', 'ఓరిదేవుడా' వంటి హిట్ చిత్రాలతో ప్రేక్షకులకు దగ్గరయ్యాడు. ఇతను జూనియర్ ఎన్టీఆర్‌కు పెద్ద ఫ్యాన్. ఆయనతో సినిమాలో నటించే అవకాశం కోసం ఎదురుచూస్తున్నట్లు పలు ఇంటర్వ్యూల్లో చెప్పాడు. విశ్వక్‌కు సినిమాలంటే ఎంత ఇంట్రెస్టో లగ్జరీ కార్లంటే అంత ఇష్టం. విశ్వక్ దగ్గర రూ.90 లక్షల విలువైన రేంజ్ రోవర్ కారుతో పాటు ఇటీవల ఓ కొత్త కారును తన లగ్జరీ కార్ల లిస్ట్‌లోకి చేర్చాడు. బెంజ్ జీ క్లాస్ బ్లాక్ కలర్ వేరియంట్‌ను రూ.1.50 కోట్లకు కొనుగోలు చేశాడు. ఇది తన డ్రీమ్ కారు అంటూ అప్పట్లో చెప్పుకొచ్చాడు శర్వానంద్ లగ్జరీ కార్ కలెక్షన్ శర్వానంద్ తెలుగులో స్టార్ హీరో.&nbsp; విలక్షణ నటుడిగా గుర్తింపు పొందాడు. కెరీర్‌ ఆరంభంలో పెద్ద హీరోల సరసన చిన్న చిన్న పాత్రల్లో నటించడం వల్ల ఇతనికి గుర్తింపు లభించింది. క్రమంగా అవకాశాలు పెరిగాయి. క్రిష్ డైరెక్షన్‌లో వచ్చిన 'గమ్యం' సినిమా ఇతని కెరీర్‌కు టర్నింగ్ పాయింట్ అని చెప్పవచ్చు. ఆ తర్వాత సుజీత్ డెరెక్షన్‌లో వచ్చిన రన్ రాజా రన్ బాక్సాఫీస్ వద్ద హిట్‌గా నిలిచింది. ఆ తర్వాత 'మళ్ళీ మళ్ళీ ఇది రాని రోజు', ఎక్స్‌ప్రెస్ రాజా, క్లాస్‌మేట్స్‌, శతమానంభవతి, రాధ, 'పడి పడి లేచె మనసు', జర్నీ 'శ్రీకారం' వంటి హిట్ చిత్రాలతో&nbsp; స్టార్ హీరో స్థాయి ఎదిగాడు. ఈక్రమంలో శర్వానంద్ సెకరించిన లగ్జరీ వాహన శ్రేణిని ఓసారి చూద్దాం. రెంజ్ రోవర్ ఆటో బయోగ్రఫీ ప్రిమీయం వెర్షన్- రూ.3.34కోట్లు ఆడి Q7- రూ. 90 లక్షలు BMW 530D- రూ. 75 లక్షలు ఫోర్డ్ ఎండేవర్- రూ.36 లక్షలు నిఖిల్ సిద్ధార్థ్ లగ్జరీ కారు కలెక్షన్ &nbsp;హ్యాపీ డేస్ చిత్రంతో తెరంగేట్రం చేసిన నిఖిల్ సిద్ధార్థ.. అంచెలంచేలుగా ఎదిగాడు. ‘యువత’, ‘వీడు తేడా’ వంటి చిత్రాల్లో హీరోగా నటించినప్పటికీ కమర్షియల్ బ్రేక్ రాలేదు. కార్తికేయ(2014) చిత్రంతో కమర్షియల్‌గా సక్సెస్ అందుకున్నాడు. ఆ తర్వాత సూర్య వర్సెస్ సూర్య, శంకరాభరణం, కిరాక్ పార్టీ, కార్తికేయ 2, 18 పేజెస్ వంటి హిట్ చిత్రాలతో స్టార్ డం సంపాదించాడు. కార్తికేయ 2 చిత్రం నిఖిల్‌ కెరీర్‌లో బిగ్గెస్ట్ హిట్‌గా నిలిచింది. ఈ చిత్రం విడుదలైన అన్ని భాషల్లో విజయం సాధించింది. ఈ సినిమా ద్వారా నిఖిల్‌కు జాతీయ స్థాయిలో గుర్తింపు లభించింది. స్టార్ హీరోగా గుర్తింపు పొందిన నిఖిల్‌కు లగ్జరీ కార్లంటే చాలా ఇష్టం. ఆయన దగ్గర విలువైన వాహన శ్రేణి ఉంది. ఓసారి దానిపై లుక్కేద్దాం. రేంజ్ రోవర్ ఆటోబయోగ్రఫీ - రూ.3.43కోట్లు Fiery Red Mercedes Sports Coupe-&nbsp; దీని ధర రూ.3.33కోట్లు https://twitter.com/actor_Nikhil/status/1353350557109424128 https://twitter.com/actor_Nikhil/status/612984749645148160 రోల్స్ రాయిస్ గోస్ట్ - రూ.7.50 కోట్లు https://www.youtube.com/watch?v=HAp_5y1FSSI సిద్ధు జొన్నలగడ్డ లగ్జరీ కార్ కలెక్షన్&nbsp;&nbsp; సిద్ధు జొన్నలగడ్డ నటుడిగానే కాకుండా రచయితగాను మంచి పేరు సంపాదించాడు. ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో వచ్చిన ఎల్బీడబ్ల్యూ (లైఫ్ బిఫోర్ వెడ్డింగ్) సినిమాతో తెలుగు తెరకు పరిచయం అయ్యాడు. ఈ చిత్రానికి ముందు జోష్, ఆరంజ్, భీమిలి సినిమాల్లో సహాయ పాత్రల్లో నటించాడు. గుంటూరు టాకీస్ చిత్రం ద్వారా గుర్తింపు పొందాడు. ఈ చిత్రానికి రచయితగా వ్యవహరించాడు. ఆ తర్వాత చాలా సినిమాల్లో నటించినప్పటికీ కమర్షియల్‌గా బ్రేక్ రాలేదు. అయితే 2022లో విడుదలైన డిజె టిల్లు సినిమా బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్‌గా నిలిచింది. ఈ చిత్రంతో సిద్ధు స్టార్ డం సంపాదించాడు. సిద్దు జొన్నల గడ్డ ఇప్పుడిప్పుడే ఆర్థికంగా నిలదొక్కుకుంటున్నాడు. సిద్ధు జొన్నలగడ్డ దగ్గర.. రూ.3.43 కోట్ల విలువైన రేంజ్ రోవర్ ఆటోబయోగ్రఫీ ఉంది. ఈ కారును సిద్ధు.. డీజే టిల్లు సినిమా హిట్‌ తర్వాత కొనుగోలు చేశాడు. https://www.youtube.com/watch?v=8CM-HSifLsY
    అక్టోబర్ 22 , 2024
    <strong>Jr NTR Records: ఓటమి ఎరుగని హీరోగా తారక్‌.. ప్రభాస్‌ సైతం వెనక్కి తగ్గాల్సిందే!&nbsp;</strong>
    Jr NTR Records: ఓటమి ఎరుగని హీరోగా తారక్‌.. ప్రభాస్‌ సైతం వెనక్కి తగ్గాల్సిందే!&nbsp;
    జూ.ఎన్టీఆర్‌ హీరోగా నటించిన దేవర చిత్రం బాక్సాఫీస్‌ వద్ద ఘన విజయాన్ని అందుకుంది. తొలి మూడు రోజుల్లోనే రూ.300 కోట్లు కొల్లగొట్టిన ఈ చిత్రం ప్రస్తుతం రూ.500 కోట్ల క్లబ్‌లో చేరేందుకు వడి వడిగా అడుగులు వేస్తోంది. ఇందులో తారక్‌కు జోడీగా బాలీవుడ్‌ బ్యూటీ జాన్వీ కపూర్‌ చేసింది. విలన్‌గా బాలీవుడ్‌ స్టార్‌ సైఫ్‌ అలీఖాన్ నటించారు. అయితే ‘దేవర’ మూవీ తారక్‌కు సంబంధించిన అనేక ఆసక్తికర విషయాలను తెరపైకి తీసుకొచ్చింది. ప్రభాస్‌ వంటి గ్లోబల్‌ స్టార్‌కు సాధ్యం కానీ విజయాన్ని తారక్‌కు అందించింది. అటు ఫ్లాప్‌ దర్శకులకు తారక్‌ ఓ వరమని మరోమారు నిరూపించింది. ఆ విశేషాలేంటో ఈ ప్రత్యేక కథనంలో తెలుసుకుందాం. ఫ్లాప్‌ డైరెక్టర్లతో హిట్స్‌! టాలీవుడ్‌లోని ఫ్లాప్ డైరెక్టర్స్‌ పాలిట జూ.ఎన్టీఆర్‌ ఓ దేవుడిలా మారాడని చెప్పవచ్చు. భారీ డిజాస్టర్‌తో ఫేమ్‌ కోల్పోయిన డైరెక్టర్లు తారక్‌తో ఓ సినిమా చేస్తే మునుపటి క్రేజ్‌ను తిరిగి పొందడం ఖాయంగా కనిపిస్తోంది. రీసెంట్‌గా దేవర విషయంలోనూ ఇదే నిరూపితమైంది. దర్శకుడు కొరటాల శివ గతంలో తీసిన ‘ఆచార్య’ చిత్రం డిజాస్టర్‌ టాక్‌ తెచ్చుకుంది. అసలు కొరటాల శివ చిత్రమేనా అంటూ పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి. అటువంటి డైరెక్టర్‌కు ఛాన్స్‌ ఇచ్చి దేవరతో సాలిడ్‌ విజయాన్ని అందుకున్నాడు తారక్. అంతకుముందు ఫ్లాప్‌లతో ఉన్న పూరి జగన్నాథ్‌కు 'టెంపర్‌'తో సక్సెస్‌ ఇచ్చాడు. ‘1: నేనొక్కడినే’ పరాజయంతో ఢీలా పడిపోయిన సుకుమార్‌తో ‘నాన్నకు ప్రేమతో’ మూవీ తీసి గాడిలో పెట్టాడు. రవితేజతో ఫ్లాప్ అందుకున్న బాబీకి ‘జై లవకుశ’తో మంచి హిట్ ఇచ్చాడు. ‘అజ్ఞాతవాసి’తో భారీ డిజాస్టర్‌ అందుకున్న త్రివిక్రమ్‌కు ‘అరవింద సామెత’తో&nbsp; సక్సెస్‌ అందించాడు. ఇలా ఫ్లాప్ డైరెక్టర్లకు వరుసగా హిట్స్‌ ఇచ్చి సరికొత్త రికార్డును తారక్‌ క్రియేట్ చేస్తున్నాడు. ఒకే ఒక్క హీరోగా తారక్‌ హీరోల కెరీర్‌లో హిట్స్‌, ఫ్లాప్స్‌ అనేవి సర్వ సాధారణం. ఎంత పెద్ద స్టార్‌ హీరో అయినా తీసిన ప్రతీ సినిమాను ప్రేక్షకులు ఆదరిస్తారన్న నమ్మకం లేదు. గ్లోబల్‌ స్టార్‌ ప్రభాస్‌ సైతం బాహుబలి తర్వాత ‘సాహో’, ‘రాధేశ్యామ్‌’, ‘ఆదిపురుష్‌’ చిత్రాలతో ఫ్లాప్‌ అందుకున్న వాడే. అయితే తారక్‌ మాత్రం గత తొమ్మిదేళ్లుగా ఒక్క ఫ్లాప్‌ లేకుండా ఇండస్ట్రీలో దూసుకుపోతున్నాడు. ఆయన చేసిన గత 7 చిత్రాలు బాక్సాఫీస్‌ వద్ద బ్లాక్‌ బాస్టర్స్‌గా నిలిచాయి. ‘టెంపర్‌’, ‘నాన్నకు ప్రేమతో’, ‘జనతా గ్యారేజ్‌’, ‘జై లవకుశ’, ‘అరవింద సమేత’, ‘RRR’, ‘దేవర’ వంటి చిత్రాలు మంచి విజయాలను సాధించాయి. ఈ జనరేషన్‌ హీరోల్లో ఈ ఘనత సాధించిన ఏకైక హీరోగా తారక్‌ నిలవడం విశేషం. ఫ్యూచర్‌లో ‘దేవర 2’, ప్రశాంత్‌ నీల్‌తో ‘NTR 31’, సందీప్‌ రెడ్డి వంగాతో ఓ చిత్రం (గాసిప్‌) వంటి బిగ్‌ ప్రాజెక్ట్స్‌ ఉండటంతో తారక్ జైత్రయాత్ర ఇకపైనా కొనసాగే అవకాశముంది.&nbsp; 23 ఏళ్ల ఫ్లాప్‌ రికార్డు బద్దలు దర్శకధీరుడు రాజమౌళి (SS Rajamouli)తో సినిమా చేస్తే బ్లాక్‌ బాస్టర్ పక్కా అని అందరికీ తెలిసిందే. అదే సమయంలో జక్కన్నతో సినిమా చేసిన తర్వాత ఏ హీరో కూడా వెంటనే హిట్‌ కొట్టిన దాఖలాలు లేవు. అయితే 'దేవర'తో తారక్‌ ఈ ఫ్లాప్‌ సెంటిమంట్‌ను బీట్‌ చేశాడు. రాజమౌళితో 'RRR' చేసిన తారక్‌ వెంటనే ‘దేవర’తో సాలిడ్‌ విజయాన్ని అందుకున్నాడు. రాజమౌళి ఫస్ట్‌ ఫిల్మ్‌ ‘స్టూడెంట్‌ నెం.1’తో ఈ ఫ్లాప్ సెంటిమెంట్‌కు శ్రీకారం చుట్టిన తారక్‌ స్వయంగా తానే దీనిని&nbsp; బ్రేక్‌ చేయడం విశేషం. అది కూడా 23 క్రితం స్టూడెంట్ నెం.1 రిలీజైన రోజున దేవరను తీసుకొచ్చి రాజమౌళి సెంటిమెంట్‌ను బద్దలు కొట్టాడు. రైతు పాత్రలో తారక్‌! తారక్‌ హీరోగా ప్రశాంత్‌ నీల్‌ దర్శకత్వంలో రానున్న 'NTR 31' ప్రాజెక్ట్‌ను మైత్రీ మూవీ మేకర్స్‌, ఎన్టీఆర్ ఆర్ట్స్‌ నిర్మించనున్నాయి. ఈ సినిమాకు సంబంధించి ఓ బజ్‌ టాలీవుడ్‌లో చక్కర్లు కొడుతోంది. పీరియాడిక్‌ యాక్షన్‌ డ్రామాగా ఈ చిత్రం రూపొందనున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఈ చిత్రంలో తారక్‌ రైతుగా కనిపిస్తాడని అంటున్నారు. కథ మెుత్తం బంగ్లాదేశ్ నేపథ్యంలో సాగుతుందని చెబుతున్నారు. అక్కడ వ్యవసాయం చేసుకుంటూ జీవించే యువకుడు అనుకోని సంఘటనల కారణంగా స్థానికుల కోసం ఎలాంటి పోరాటం చేశాడన్న కాన్సెప్ట్‌తో ఇది తెరకెక్కనున్నట్లు టాక్‌. ఇందులో తారక్‌ను రెండు వేరియేషన్స్‌లో ప్రశాంత్‌ నీల్‌ చూపించనున్నట్లు తెలుస్తోంది. తారక్‌ క్యారెక్టరైజేషన్‌, పెర్ఫార్మెన్స్‌ గత చిత్రాలకు భిన్నంగా నెక్స్ట్‌ లెవల్లో ఉంటాయని ఫిల్మ్‌ వర్గాల సమాచారం.&nbsp; హీరోయిన్‌గా రష్మిక? దర్శకుడు ప్రశాంత్‌ నీల్‌ ప్రస్తుతం ‘NTR 31’ ప్రీ ప్రొడక్షన్‌ పనుల్లో బిజీగా ఉన్నారు. ప్రధాన తారాగణం కూర్పుకు సంబంధించి వర్క్‌ చేస్తున్నారు. ఇందులో తారక్‌కు జోడీగా రష్మిక మందన్నను తీసుకునే యోచనలో ప్రశాంత్‌ నీల్ ఉన్నట్లు సమాచారం. ఇదే జరిగితే తారక్‌-రష్మిక కాంబోలో రానున్న తొలి చిత్రం ఇదే కానుంది. NTR 31 చిత్రాన్ని 2026 సంక్రాంతి కానుకగా రిలీజ్‌ చేయాలని డైరెక్టర్‌ భావిస్తున్నారట. దీనికి అనుగుణంగా త్వరలోనే షూటింగ్‌ ప్రారంభించాలని ఆయన భావిస్తున్నారుట. ఈ మూవీకి రవి బస్రూర్ మ్యూజిక్ అందిస్తుండగా సినిమాటోగ్రాఫర్ బాధ్యతలు భువన్ గౌడ భుజాలకు ఎత్తుకోబోతున్నాడు.&nbsp;&nbsp;
    అక్టోబర్ 04 , 2024
    Upcoming Movies: ఈ వారం థియేటర్లు / OTTల్లో రిలీజ్ కానున్న సినిమాల లిస్ట్ ఇదే!
    Upcoming Movies: ఈ వారం థియేటర్లు / OTTల్లో రిలీజ్ కానున్న సినిమాల లిస్ట్ ఇదే!
    ఈ వారం కూడా పలు సినిమాలు, వెబ్‌సిరీస్‌లు ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమయ్యాయి.&nbsp; ఆహ్లాదకరమైన వినోదాన్ని అందించేందుకు రాబోతున్నాయి. ఆగస్టు 7 నుంచి 13వ తేదీల మధ్య పలు సినిమాలు థియేటర్లలో సందడి చేయనున్నాయి. అలాగే ఓటీటీలో కొత్త సినిమాలు, వెబ్‌సిరీస్‌లు స్ట్రీమింగ్‌ కాబోతున్నాయి. మరి ఆ సినిమాలు ఏంటి? వాటి విశేషాల ఎలా ఉన్నాయి? ఈ కథనంలో చూద్దాం. థియేటర్లలో రిలీజయ్యే చిత్రాలు జైలర్‌ రజనీకాంత్ కాంత్‌ లేటెస్ట్‌ మూవీ జైలర్‌ ఈ వారమే థియేటర్లలో రిలీజ్‌ కానుంది. నెల్సన్‌ దిలీప్‌ కుమార్‌ దర్శకత్వం వహించిన ఈ చిత్రం ఆగస్టు 10న (గురువారం) ప్రేక్షకులను పలకరించనుంది.&nbsp;ఇందులో తమన్నా కథానాయికగా చేసింది. మోహన్‌లాల్‌, శివ రాజ్‌కుమార్‌, జాకీ ష్రాఫ్‌, రమ్యకృష్ణ, సునీల్‌ కీలక పాత్రలు పోషించారు. జైలర్‌లో రజనీకాంత్‌ స్టైల్‌, యాక్షన్‌ ఎపిసోడ్స్‌ చూస్తుంటే పాత రజనీని గుర్తు చేస్తున్నాయి. అనిరుధ్‌ రవిచంద్రన్‌ అందించిన నేపథ్య సంగీతం ప్రచార చిత్రాన్ని ఓ రేంజ్‌లో ఎలివేట్‌ చేసింది. భోళాశంకర్‌&nbsp; వాల్తేరు వీరయ్యగా ఈ ఏడాది వినోదాలు పంచిన మెగాస్టార్‌ చిరంజీవి.. ‘భోళా శంకర్‌’గా మరోమారు సందడి చేసేందుకు సిద్ధమయ్యారు. మెహర్‌ రమేష్‌ దర్శకత్వం వహించిన ఈ సినిమా ఆగస్టు 11న (శుక్రవారం) ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇందులోనూ తమన్నానే హీరోయిన్‌గా చేసింది. కీర్తి సురేష్‌ చిరు చెల్లెలిగా నటించింది. ఇటీవల విడుదల చేసిన ప్రచార చిత్రాలు సినిమాపై అంచనాలను పెంచాయి. మాస్‌ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌గా ముస్తాబైన ఈ చిత్రంలో చిరు స్టైలిష్‌ లుక్‌లో కనిపించనున్నారు.&nbsp; ఓ మై గాడ్‌ అక్షయ్‌కుమార్‌ (Akshay Kumar) దేవుడి పాత్రలో నటించిన ‘ఓ మై గాడ్‌’ చిత్రం అప్పట్లో మంచి విజయం సాధించింది. ఇప్పుడు దీనికి కొనసాగింపుగా ‘ఓ మై గాడ్‌ 2’ (OMG 2) రూపొందిన సంగతి తెలిసిందే. అమిత్‌ రాయ్‌ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో పంకజ్‌ త్రిపాఠి, యామీ గౌతమ్‌, గోవింద నామ్‌దేవ్‌ కీలక పాత్రలు పోషించారు. ఇప్పటికే చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ సినిమా ఆగస్టు 11న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఉస్తాద్‌ శ్రీసింహా హీరోగా ఫణిదీప్‌ తెరకెక్కించిన చిత్రం ‘ఉస్తాద్‌’. బలగం ఫేమ్‌ కావ్యా కల్యాణ్‌రామ్‌ హీరోయిన్‌గా చేసింది. గౌతమ్‌ మేనన్‌, రవీంద్ర విజయ్‌ తదితరులు కీలక పాత్రలు పోషించారు. ఆగస్టు 12న (శనివారం) ఈ చిత్రం థియేటర్‌లలో విడుదల కానుంది. ఈ సినిమాలో శ్రీసింహా మూడు భిన్నమైన లుక్స్‌లో కనిపించనున్నారు. జోసెఫ్‌ డిసౌజా అనే పైలట్‌ పాత్రలో గౌతమ్‌ మేనన్‌ నటించారు.&nbsp; గదర్‌ 2 ప్రముఖ బాలీవుడ్‌ నటుడు సన్నీ దేవోల్‌ హీరోగా చేసిన ‘గదర్‌ 2’ చిత్రం కూడా ఈ వారమే రిలీజ్‌ కానుంది. ఆగస్టు 11 నుంచి థియేటర్లలో సందడి చేయనుంది. ఇందులో సన్నీ దేవోల్‌.. తారా సింగ్‌ పాత్రలో నటించారు. సకీనాగా అమీషా పటేల్‌ నటించింది. ఈ చిత్రానికి అనిల్‌ శర్మ దర్శకత్వం వహించారు. చరణ్‌జీత్‌గా ఉత్కర్ష్‌ శర్మ కనిపించనున్నారు. జీ స్టూడియోస్‌తో అనిల్‌ శర్మ, కమల్‌ ముకుట్‌ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఓటీటీలో విడుదలయ్యే చిత్రాలు / సిరీస్‌లివే! హిడింబ ఓంకార్‌ తమ్ముడు అశ్విన్‌ బాబు హీరోగా చేసిన రీసెంట్‌ చిత్రం హిడింబ. ఇటీవలే విడుదలైన ఈ చిత్రం మిక్స్‌డ్‌ టాక్ తెచ్చుకుంది. తాజాగా ఈ వారం ఓటీటీలోకి రాబోతోంది. ఆహా వేదికగా ఆగస్టు 10 నుంచి ఈ మూవీ స్ట్రీమింగ్ కానుంది. అనీల్‌ కన్నెగంటి దర్శకత్వం వహించిన ఈ సినిమాను శ్రీవిఘ్నేష్‌ సినిమాస్‌ బ్యానర్‌పై గంగపట్నం శ్రీధర్‌ నిర్మించాడు. అశ్విన్‌కు జోడీగా నందితా శ్వేత నటించింది. TitleCategoryLanguagePlatformRelease DateGabby's DollhouseWeb SeriesEnglishNetflixAugust 7ZombieverseWeb SeriesEnglishNetflixAugust 8Heart of StoneMovieHindiNetflixAugust 11In another world with my smartphoneMovieEnglishNetflixAugust 11Pending TrainMovieEnglishNetflixAugust 11The kashmir files unreportedDocument SeriesHindiZee 5August 11Abar ProloySeriesBengaliZee 5August 11The Jengaburu CurseSeriesHindiSonyLIVAugust 9Por ThozhilSeriesTelugu/TamilSonyLIVAugust 11Made in HeavenSeriesEnglishAmazon primeAugust 10
    ఆగస్టు 07 , 2023
    <strong>Nayanthara: భర్తతో రొమాంటిక్‌ ఫొటోలు షేర్‌ చేసిన నయనతార.. ముద్దులతో ముంచెత్తి మరి విషెస్‌!&nbsp;</strong>
    Nayanthara: భర్తతో రొమాంటిక్‌ ఫొటోలు షేర్‌ చేసిన నయనతార.. ముద్దులతో ముంచెత్తి మరి విషెస్‌!&nbsp;
    తన భర్త, దర్శకుడు విఘ్నేశ్‌ శివన్‌ (Vignesh Shivan) పుట్టినరోజును పురస్కరించుకొని నటి నయనతార (Nayanthara) తాజాగా కొన్ని స్పెషల్‌ ఫొటోలు షేర్‌ చేశారు.&nbsp; ఇందులో ఆమె ఆయన్ని ముద్దు పెట్టుకుంటూ కనిపించారు. ‘హ్యాపీ బర్త్‌డే మై ఎవ్రీథింగ్‌. నేను నిన్ను ఎంతలా ప్రేమిస్తున్నానో చెప్పడానికి మాటలు సరిపోవు. నువ్వు కన్న కలలు నిజం అయ్యేలా దేవుడు నిన్ను దీవించాలని కోరుకుంటున్నా’ అని పేర్కొన్నారు. ప్రస్తుతం ఈ ఫొటోలు నెట్టింట వైరల్‌గా మారాయి. క్యూట్‌ కపుల్‌ అని పలువురు అభిమానులు కామెంట్స్‌ చేస్తున్నారు. ‘నేనూ రౌడీనే’ సినిమా కోసం నయనతార, విఘ్నేశ్‌ శివన్‌ తొలిసారి కలిసి వర్క్‌ చేశారు. ఆ సినిమా చిత్రీకరణలోనే వీరి మధ్య స్నేహం కుదిరింది.&nbsp; ఆ స్నేహం కొద్ది కాలంలోనే ప్రేమగా మారింది. అలా సుమారు ఏడేళ్ల పాటు ఈ జంట ప్రేమించుకుంది.&nbsp; 2022లో పెద్దల అంగీకారంతో వైవాహిక బంధంలోకి అడుగుపెట్టారు. ఆ తర్వాత సరోగసి విధానంలో ఇద్దరు కవల పిల్లలకు నయన్‌ జంట తల్లిదండ్రులయ్యారు.&nbsp;ఇద్దరు మగ పిల్లలకు ఉయిర్‌ రుద్రోనిల్‌ ఎన్‌.శివన్‌, ఉలగ్‌ దైవాగ్‌ ఎన్‌. శివన్‌ అని పేర్లు పెట్టారు. ఇక సినిమాల విషయానికి వస్తే విఘ్నేశ్‌ శివన్‌ ప్రస్తుతం ‘లవ్‌ ఇన్సూరెన్స్‌ కంపెనీ’ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. ‘అన్నపూరణి’ సినిమాకు గాను నయనతార (Nayanthara) ఉత్తమ నటిగా ఇటీవల సైమా అవార్డును సొంతం చేసుకుంది.&nbsp; నయనతార ప్రస్తుతం టెస్ట్‌’, ‘డియర్ స్టూడెంట్స్‌’, ‘తన్ని ఒరువన్‌ 2’ చిత్రాల్లో నటిస్తూ బిజీ బిజీగా గడుపుతోంది.&nbsp; నయనతార వ్యక్తిగత విషయాలకు వస్తే ఆమె పుట్టుకతో మలయాళీ. మల్లువుడ్‌లో జయరాం నిర్మించిన ‘మనస్సినక్కరే’(2003) చిత్రంతో ఆరంగ్రేటం చేసింది. ఈ చిత్రం ఘనవిజయం సాధించడంతో నయన్ పేరు మార్మోగిపోయింది. ఇక అప్పటి నుంచి నయన్ వెనక్కి తిరిగి చూసుకోలేదు. తెలుగు, తమిళ, కన్నడ చిత్రాల్లో వరుస పెట్టి సినిమాలు చేసి సక్సెస్‌ అయ్యింది. అన్ని భాషల్లో తనకంటూ సెపరేట్‌ ఫ్యాన్‌ ఫాలోయింగ్‌ సంపాదించుకుంది.&nbsp; ఈ అసాధారణ నటి తన జీవితంలో అతి పెద్ద తప్పిదాలు కూడా చేసింది. నయనతార వ్యక్తిగత జీవితంలో కూడా కష్ట సమయాలు ఉన్నాయి. తొలుత తమిళ నటుడు శింబుతో ప్రేమాయణం సాగించింది. శింబు వీరిద్దరి వ్యక్తిగత ఫొటోలను బయటపెట్టడంతో మనస్తాపానికి గురై అతడిని వదిలించుకుంది. ఆ తర్వాత నటుడు, దర్శకుడు ప్రభుదేవాతో ప్రేమ వ్యవహారం నడిపింది. ‘విల్లు’ సినిమా చిత్రీకరణ సమయంలో వీరిద్దరి మధ్య ప్రేమ చిగురించింది. వీరిద్దరి వ్యవహారం ప్రభుదేవా భార్య దృష్టికి వెళ్లడం, ఆమె ప్రభుదేవా నుంచి&nbsp; విడాకులు కోరడం చకచకా జరిగిపోయాయి. ఈ క్రమంలో ప్రభుదేవా నయనతారను పక్కనబెట్టాడు. ఈ పరిణామంతో నయనతార హతాశయురాలైంది. ఇది నయన్ జీవితంలో ఒక కోలుకోలేని దెబ్బ. ప్రభుదేవాతో బ్రేకప్ అనంతరం నయన్‌ జీవితంలోకి తమిళ డైరెక్టర్ విఘ్నేశ్‌ వచ్చాడు. అప్పటి నుంచి ఈ ‌అమ్మడు సినిమాల పరంగా వ్యక్తిగతంగా వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం రాలేదు. ప్రస్తుతం దక్షిణ చలన చిత్ర పరిశ్రమలో నయనతార అత్యధిక పారితోషికం తీసుకుంటోంది. ఒక్కో సినిమాకు దాదాపు రూ.10 కోట్ల నుంచి రూ. 12 కోట్ల వరకు రెమ్యూనరేషన్ అందుకుంటున్నట్లు సమాచారం.
    సెప్టెంబర్ 18 , 2024
    Kalki 2898 AD : అశ్వత్థామగా అమితాబ్‌.. పురాణాల్లో ఆ పాత్ర గురించి ఏముందో తెలుసా?
    Kalki 2898 AD : అశ్వత్థామగా అమితాబ్‌.. పురాణాల్లో ఆ పాత్ర గురించి ఏముందో తెలుసా?
    రెబల్‌ స్టార్‌ ప్రభాస్‌ (Prabhas) హీరోగా నాగ్‌ అశ్విన్‌ దర్శకత్వంలో రూపొందుతున్న ప్రతిష్టాత్మక చిత్రం ‘కల్కి 2898 ఎ.డి (Kalki 2898 AD). బాలీవుడ్ అగ్రకథానాయకుడు అమితాబ్‌ బచ్చన్‌ ఇందులో ఓ కీలక పాత్ర పోషిస్తున్నారు. తాజాగా ఆయన పాత్రను పరిచయం చేస్తూ ఓ ప్రచార గ్లింప్స్‌ను కూడా విడుదల చేశారు. ప్రస్తుతం ఆ వీడియో సోషల్‌ మీడియాను షేక్‌ చేస్తోంది. ఈ మూవీలో అమితాబ్‌ అశ్వత్థామ పాత్ర పోషిస్తున్నాడు. దీంతో పురణాల్లో ఆ పాత్రకు ఉన్న ప్రత్యేకత ఏంటో తెలుసుకునేందు ఆడియన్స్‌ ఆసక్తి కనబరుస్తున్నారు.&nbsp; అశ్వత్థామ ఎవరంటే? ‘కల్కి 2898 ఏడీ’ చిత్రంలో అమితాబ్‌ బచ్చన్‌ నటిస్తున్నట్లు తెలిసినప్పటీ నుంచి ఆయన పోషిస్తున్న పాత్రపై ప్రతీ ఒక్కరిలోనూ ఆసక్తి పెరిగిపోయింది. పురణాల్లోని ఓ కీలక పాత్రలో ఆయన కనిపిస్తారని లీక్స్‌ కూడా వచ్చాయి. అందుకు తగ్గట్లే ఆయన ‘అశ్వత్థామ’ పాత్రలో నటించనునట్లు మూవీ టీమ్‌ అధికారికంగా ప్రకటించింది. దీంతో ఒక్కసారిగా ఈ పాత్రపై బజ్‌ ఏర్పడింది. పురణాల ప్రకారం.. మహాభారతంలో అశ్వత్థామ ద్రోణుని కుమారుడు. ద్వాపరయుగంలో శ్రీకృష్ణుడు చేత అశ్వత్థామ శపించబడతాడు. ప్రపంచం అంతమయ్యే వరకు అశ్వత్థామ.. తనకి ఉన్న గాయాలతో రక్తం, చీము కారుతూ, నిత్యం రగులుతూ బ్రతికే ఉండాలని శపిస్తాడు. ఈ శాపంతో అశ్వత్థామ ఇప్పటికి బ్రతికే ఉన్నాడని, గాయాలు నుంచి శ్రవించే రక్తం కనిపించకుండా ఒంటి నిండా బట్ట చుట్టుకొని ఉంటాడని సనాతన ధర్మ గురువులు చెబుతుంటారు. తాజాగా విడుదలైన అమితాబ్‌ లుక్స్‌ అచ్చం అలాగే ఉండటం గమనార్హం. గ్లింప్స్‌లో ఏముంది? కల్కిలో అశ్వత్థామను పరిచయం చేస్తూ ఆదివారం ఓ ఆసక్తికర వీడియోను చిత్ర యూనిట్‌ రిలీజ్‌ చేసింది. ఇందులో ‘నీకు మరణం లేదా? నువ్వు దేవుడివా? నువ్వు ఎవరు?’ అంటూ ఓ చిన్నారి అమితాబ్‌ను ప్రశ్నిస్తాడు. అప్పుడు అమితాబ్‌ తన పాత్రను పరిచయం చేస్తాడు. ‘అంతిమ యుద్ధానికి సమయం ఆసన్నమైంది. నేను గురు ద్రోణాచార్య కొడుకు అశ్వత్థామ’ అని బాలుడితో చెప్పి బిగ్ బి అదృశ్యం అవుతాడు. కాగా, ఈ గ్లింప్స్‌కు నెటిజన్లు ఫిదా అవుతున్నారు. ఈ ఒక్క వీడియోతో సినిమాపై అంచనాలు మరింత పెరిగాయని పేర్కొంటున్నారు. కాగా, అమితాబ్‌ గ్లింప్స్‌కు సంతోష్ నారాయణన్ ఇచ్చిన నేపథ్య సంగీతం చాలా బాగుంది. https://twitter.com/i/status/1782338404421927223 రాజమౌళిని ఫాలో అవుతున్న నాగ్‌! అశ్వత్థామ పాత్ర తరహాలోనే రానున్న రోజుల్లో ‘కల్కి 2898 ఏడీ’లోని ఇతర కీలక రోల్స్‌కు సంబంధించిన పరిచయ వీడియోలు కూడా విడుదల కానున్నట్లు తెలుస్తోంది. ‘బాహుబలి’ సినిమా సమయంలో దర్శకధీరుడు రాజమౌళి అనుసరించిన ఫార్మూలనే కల్కీ డైరెక్టర్‌ నాగ్‌ అశ్విన్‌ అనుసరించబోతున్నట్లు సమాచారం. బాహుబలి సమయంలో ప్రభాస్‌, రానా (భల్లాలదేవ), అనుష్క (దేవసేన) పాత్రలను రాజమౌళి ఓ ప్రత్యేక గ్లింప్స్‌ రూపంలో ఆడియన్స్‌కు పరిచయం చేశారు. ఈ తరహాలోనే నాగ్‌ అశ్విన్‌ కూడా అమితాబ్‌ బచ్చన్‌ రోల్‌ను పరిచయం చేశారు. త్వరలోనే ప్రభాస్‌ ‘భైరవ’ టీజర్‌ కూడా వస్తుందట. అలాగే దీపికా పదుకొనే, కమల్‌హాసన్‌ తదితరుల పాత్రలను కూడా ఇంట్రడ్యూస్‌ చేయనున్నట్లు చిత్ర వర్గాల్లో టాక్ వినిపిస్తోంది.&nbsp;&nbsp; దీపికా, కమల్‌ పాత్రలు అవేనా?&nbsp; ‘కల్కి 2898 ఏడీ’లో దీపికా పదుకొనే (Deepika Padukone), కమల్‌ హాసన్‌ (Kamal Haasan) చేస్తున్న రోల్స్ అవేనంటూ ఓ వార్త సోషల్‌ మీడియాలో హల్‌ చల్‌ చేస్తోంది. ఇందులో దీపికా.. ‘కౌముది’ పాత్రలో కనిపించనున్నట్లు ప్రచారం జరుగుతోంది. కమల్‌ హాసన్‌.. ‘కాళీ’ పాత్రలో కనిపిస్తారని అంటున్నారు. త్వరలోనే వీరి పాత్రలకు సంబంధించి కూడా వీడియో రావొచ్చని అంచనా వేస్తున్నారు. దీనిపై చిత్ర యూనిట్‌ క్లారిటి ఇవ్వాల్సి ఉంది.&nbsp; నిరాశలో ప్రభాస్‌ ఫ్యాన్స్‌! ‘కల్కి 2898 ఏడీ’ విడుదల తేదీకి సంబంధించి గత కొన్ని రోజుల నుంచి చర్చ జరుగుతోంది. వాస్తవానికి మే 9న ఈ సినిమాను రిలీజ్‌ చేయనున్నట్లు గతంలోనే మేకర్స్‌ ప్రకటించారు. కానీ షూటింగ్‌లో జాప్యం వల్ల ఆ రోజున ఈ సినిమా విడుదల కావడం లేదు. ఈ క్రమంలోనే కొత్త తేదీని మేకర్స్‌ పరిశీలిస్తున్నట్లు వార్తలు వచ్చాయి. ఈ నేపథ్యంలో అమితాబ్‌ పాత్రను పరిచయం చేయనున్నట్లు మేకర్స్ ముందే ప్రకటించడంతో ‘అశ్వత్థామ వీడియో గ్లింప్స్‌’లోనే విడుదల తేదీని రివీల్‌ చేస్తారని ప్రభాస్‌ ఫ్యాన్స్‌ భావించారు. అయితే ఎలాంటి డేట్‌ను లాక్‌ చేయకపోవడంతో ఫ్యాన్స్‌ నిరాశ చెందుతున్నారు.&nbsp;
    ఏప్రిల్ 22 , 2024
    Hanuman Viral Video: ‘హనుమాన్‌’ చూస్తూ థియేటర్లో మహిళ వింత ప్రవర్తన.. కారణం దైవమా? దెయ్యమా?
    Hanuman Viral Video: ‘హనుమాన్‌’ చూస్తూ థియేటర్లో మహిళ వింత ప్రవర్తన.. కారణం దైవమా? దెయ్యమా?
    సంక్రాతికి విడుదలైన హనుమాన్‌ చిత్రం విశేష ప్రేక్షకాదరణతో దూసుకెళ్తోంది. బాక్సాఫీస్‌ వద్ద పలు రికార్డులను కొల్లగొడుతూ తన జైత్రయాత్రను ఇప్పటికీ కొనసాగిస్తోంది. ముఖ్యంగా ఈ మూవీ క్లైమాక్స్ చూస్తే గూస్‌బంప్స్‌ రావడం పక్కా అని వీక్షకులు చెబుతున్నారు. సినిమాలోని చివరి 20 నిమిషాలు ప్రేక్షకులకు పూనకాలు తెప్పిస్తుందని చిత్రం విడుదలైనప్పటికీ నుంచి ఆడియన్స్‌ పేర్కొంటూ వస్తున్నారు. అయితే ఈ వ్యాఖ్యలను నిజం చేస్తూ తాజాగా ఓ వీడియో (Hanuman Viral Video) బయటకి వచ్చింది. ప్రస్తుతం నెట్టింట అది వైరల్ అవుతోంది.&nbsp; మహిళ విచిత్ర ప్రవర్తన హనుమాన్‌ క్లైమాక్స్‌ చూస్తూ ఓ మహిళ పూనకంతో ఊగిపోయింది. ఒంట్లోకి ఎవరో ఆవహించినట్లు విచిత్రంగా ప్రవర్తించింది. ఈ ఘటనతో సినిమా చూస్తున్నవారు షాకయ్యారు. ఆ మహిళను సాధారణ స్థితిలోకి తీసుకువచ్చేందుకు యత్నించారు. ఇందుకు సంబంధించిన దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతున్నాయి. https://twitter.com/i/status/1752014453342969952 ఒంట్లోకి దేవుడు వచ్చాడా? ఉప్పల్‌లోని ఏసియన్‌ మాల్‌లో ఈ సంఘటన జరిగినట్టుగా తెలుస్తోంది. హనుమాన్ సినిమా చివర్లో వచ్చే పాటను చూస్తూ ఆ మహిళ పూనకం వచ్చినట్లు ప్రవర్తించిందని స్థానికులు చెబుతున్నారు. సంబంధిత వీడియోను చూసిన నెటిజన్లు తమ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేస్తున్నారు. ఆ మహిళ ఒంట్లోకి దేవుడు పూనాడని అందుకే ఆమె అలా ప్రవర్తించి ఉండొచ్చని అంటున్నారు. గ్రామ దేవతలు ఆవహించినప్పుడు కొందరి ప్రవర్తన సరిగ్గా ఇలాగే ఉంటుందని గుర్తు చేస్తున్నారు.&nbsp; దుష్టశక్తే ఈ పని చేసిందా? మరికొందరు నెటిజన్లు మరో విధంగా తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. ఆమె శరీరంలో నెగిటివ్‌ ఎనర్జీ ఉండి ఉండవచ్చని అంటున్నారు. హనుమాన్‌ మూవీ చూస్తున్న క్రమంలో అది ఒక్కసారిగా బయటకు వచ్చిందని కామెంట్లు చేస్తున్నారు. హనుమాన్‌ దెబ్బకి ఆ దుష్టశక్తి ఆమె ఒంట్లో నుంచి వెళ్లిపోయి కూడా ఉంటుందని పోస్టులు పెడుతున్నారు. ఈ రెండు విభిన్నమైన వాదనలలో ఏది నిజమో తెలియక చాలా మంది కన్ఫ్యూజ్‌ అవుతున్నారు.&nbsp; అసలు నిజం ఇదే! ప్రస్తుతం సోషల్‌ మీడియాలో జరుగుతున్న ప్రచారంలో ఎలాంటి వాస్తవం లేదు. సినిమా చూస్తున్న క్రమంలో ఆమెకు ఒక్కసారిగా ఫిట్స్‌ వచ్చాయని మహిళ సన్నిహితుల ద్వారా తెలిసింది. అందుకే ఆమె ఊగిపోయిందని సమాచారం. కొద్ది సేపటి తర్వాత సదరు మహిళ సాధారణ స్థితిలోకి వచ్చేసిందని చెబుతున్నారు. అసలు నిజం బయటకు వచ్చేలోపే వీడియో వైరల్‌ కావడంతో విభిన్నమైన అభిప్రాయాలు బయటకొచ్చాయి.&nbsp; రూ.300 కోట్ల దిశగా పరుగులు ఇక హనుమాన్‌ సినిమా (Hanuman Collections) విషయానికి వస్తే.. ఈ చిత్రం ఇప్పటివరకూ రూ.250 కోట్లకు పైగా వసూళ్లను రాబట్టింది. ప్రస్తుతం రూ.300 కోట్ల మార్క్‌ను ‌అందుకునేందుకు చకా చకా అడుగులు వేస్తోంది. హనుమాన్‌ మ్యానియా థియేటర్లలో కొనసాగుతుండటంతో ఈ వారంలోనే రూ.300 కోట్ల గ్రాస్‌ వచ్చేస్తుందని సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. మరోవైపు డైరెక్టర్‌ ప్రశాంత్‌ వర్మ ‘జై హనుమాన్‌’ స్క్రిప్ట్‌ను రెడీ చేస్తూ సీక్వెల్‌పై ఫోకస్‌ పెట్టారు.&nbsp;
    జనవరి 30 , 2024
    <strong>Akhanda Movie Dialogues: గూస్ బంప్స్ తెప్పించే బాలయ్య పవర్ ఫుల్ డైలాగ్స్ ఇవే</strong>
    Akhanda Movie Dialogues: గూస్ బంప్స్ తెప్పించే బాలయ్య పవర్ ఫుల్ డైలాగ్స్ ఇవే
    కోవిడ్ సెకండ్ వేవ్ అనంతరం విడుదలైన అఖండ ఎంతటి భారీ విజయాన్ని అందుకుందో అందరికి తెలిసిందే. దాదాపు రెండేళ్లపాటు సినిమాలకు దూరంగా ఉన్న ప్రేక్షకులను తిరిగి థియేటర్లకు రప్పించిన చిత్రం ఇది. బోయపాటి- బాలకృష్ణ కాంబోలో వచ్చిన సెకండ్ హిట్‌గా నిలిచింది. ఈ చిత్రంలో బాలకృష్ణ అఘోరగా నటించిన తీరు ప్రేక్షుకులను మెప్పించింది. థమన్ బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్‌ సినిమా ఎలివేషన్, బాలయ్య డైలాగ్ మాడ్యులేషన్‌కు బాగా హెల్ప్ అయింది. ఆయన చెప్పే డైలాగ్స్ అభిమానుల చేత విజిల్స్ కొట్టించింది. మాస్ ప్రేక్షకులకు పునకాలు తెప్పించిందనడంలో సందేహం లేదు. ఇప్పటికీ ఈ సినిమాలోని డైలాగ్స్ అభిమానుల నాలుకల మీద నాట్యం చేస్తూనే ఉన్నాయంటే అతిశయోక్తి కాదు. మరి ఆ పవర్‌ ఫుల్ డైలాగ్స్‌ను మీరు ఓసారి చూసేయండి. “ఎదుటివాడితో మాట్లాడేటప్పుడు ఎలా మాట్లాడాలో నేర్చుకో..శీనుగారు.. మీ నాన్నగారు బాగున్నారా ? అనేదానికి శీనుగారు మీ అమ్మమొగుడు బాగున్నాడా..అనేదానికి చాలా తేడా ఉంది రా!” “ఏయ్ ..! అంచనా వేయడానికి నువ్ పోలవరం డాం ఆ ? పట్టుసీమ తోమా ? పిల్ల కాలువ .!“ “హర హర మహాదేవ! శంభో శంకర ! కాలుదువ్వే నంది ముందు..రంగు మార్చిన పంది కారుకూతలు కూస్తే కపాలం పగిలిపోద్ది.” “నాకు బురదంటింది..నాకు దురదొచ్చింది.. నాకు బ్లడ్ వచ్చింది నాకు గడ్డు వచ్చింది అని అడ్డమైన సాకులు చెబితే ..!” “విధికి, విధాతకి, విశ్వానికి సవాళ్లు విసర కూడదు.!” “ఒకసారి డిసైడ్ అయి బరిలోకి దిగితే బ్రేకులు లేని బుల్డోజర్ ని తొక్కి పార దొబ్బుతా.!” “ఒక మాట నువ్వంటే అది శబ్దం అదే మాట నేనంటే శాసనం. దైవశాసనం.” “నీకు సమస్య వస్తే దణ్ణం పెడుతారు. మేము ఆ సమస్యకు పిండం పెడుతాం. బోథ్ ఆర్ నాట్ సేమ్.” “లెఫ్ట్ ఆ, రైట్ ఆ, టాప్ ఆ , బాటమ్ ఆ , ఎటు నుంచి ఎటు పెట్టి గోకిన కొడకా ఇంచు బాడీ దొరకదు.” “ఒకసారి డిసైడ్ అయి బరిలోకి దిగితే బ్రేకులు లేని బుల్డోజర్ ని తొక్కి పార దొబ్బుతా.!” “మీరు మా అంటే సెల్‌లో వేస్తారు.. నేను డైరెక్ట్‌ హెల్‌కి పంపించా..” “మీరు ఆయువు కోసం భయపడతారు.. మేము మృత్యువుకు ఎదురెళ్తాం”. “దేవుడిని కరుణించమని అడగాలి, కనిపించమని కాదు.” “రెస్పెక్ట్&nbsp; అనేది బిహేవియర్ చూసి ఇచ్చేది, అడుక్కుంటే వచ్చేది కాదు.” “మేము ఎక్కడికైనా వెళ్తే తల దించుకోము.. తల తెంచుకుని వెళ్లిపోతాం.”
    అక్టోబర్ 26 , 2024
    <strong>Bagheera Trailer Review: ప్రశాంత్‌ నీల్‌ ‘భగీరా’ట్రైలర్‌లో ఇవి గమనించారా.. మరో కేజీఎఫ్‌ కానుందా?</strong>
    Bagheera Trailer Review: ప్రశాంత్‌ నీల్‌ ‘భగీరా’ట్రైలర్‌లో ఇవి గమనించారా.. మరో కేజీఎఫ్‌ కానుందా?
    ప్రశాంత్‌ నీల్‌ ‘భగీరా’ట్రైలర్‌లో ఇవి గమనించారా.. మరో కేజీఎఫ్‌ కానుందా?కన్నడ పరిశ్రమ నుంచి వచ్చిన ‘కేజీఎఫ్‌’ (KGF), ‘కేజీఎఫ్‌ 2’ (KGF 2) దేశవ్యాప్తంగా సెన్సేషన్‌ క్రియేట్‌ చేశాయి. కేజీఎఫ్‌ ముందు వరకూ పెద్దగా ఎవరికి తెలియని కన్నడ డైరెక్టర్‌ ప్రశాంత్‌ నీల్‌ (Prashanth Neel) ఆ రెండు చిత్రాలతో పాన్‌ ఇండియా స్టార్‌గా మారిపోయారు. ఇటీవల ప్రభాస్‌తో ‘సలార్‌’ తెరకెక్కించి బాక్సాఫీస్‌ వద్ద మరోమారు వసూళ్ల సునామి సృష్టించాడు. ముఖ్యంగా కథల విషయంలో ప్రశాంత్‌ నీల్‌ ఎంతో శ్రద్ధ వహిస్తారని పేరుంది. ఈ క్రమంలోనే ఆయన ఓ పాన్‌ ఇండియా చిత్రానికి స్టోరీ అందించారు. ‘బఘీర’ పేరుతో రూపొందిన ఈ చిత్ర ట్రైలర్ ఇవాళ విడుదలై ఆకట్టుకుంటోంది. అయితే ట్రైలర్‌లో ‘కేజీఎఫ్‌’ మార్క్ కనిపించేలా చాలా అంశాలే ఉన్నాయి.&nbsp; బ్లాక్ అండ్ వైట్ ఫ్రేమ్స్‌‌లో.. ‘కేజీఎఫ్’ చిత్రంతో దర్శకుడు ప్రశాంత్ నీల్‌‌కు, నిర్మాణ సంస్థ హోంబలే ఫిల్మ్స్‌‌కు పాన్ ఇండియా రేంజ్‌‌లో గుర్తింపు వచ్చింది. వీళ్ల కాంబినేషన్‌లో ఏ ప్రాజెక్ట్‌ రూపొందిన దానిపై అంచనాలు అమాంతం పెరిగిపోతున్నాయి. ఈ క్రమంలో ప్రశాంత్‌ నీల్‌ కథతో హోంబలే ఫిల్మ్స్‌‌ ‘బగీరా’ అనే పాన్‌ ఇండియా చిత్రాన్ని రూపొందించింది. ప్రశాంత్‌ నీల్‌ ఫస్ట్‌ ఫిల్మ్‌ 'ఉగ్రమ్‌' హీరో శ్రీ మురళి ఇందులో లీడ్‌ రోల్‌ చేశాడు. సూరి దర్శకత్వం వహించారు. తాజాగా ఈ సినిమా ట్రైలర్‌ను మేకర్స్‌ రిలీజ్‌ చేయగా అది విపరీతంగా ఆకట్టుకుంటోంది. భగీర ట్రైలర్&nbsp; చూస్తే రెండు డిఫరెంట్ గెటప్స్‌‌లో శ్రీమురళి కనిపించి ఆకట్టుకున్నాడు. ప్రశాంత్ నీల్ స్టైల్‌‌లోనే యాక్షన్‌‌తో పాటు బ్లాక్ అండ్ వైట్ ఫ్రేమ్స్‌‌లోనే ట్రైలర్ విజువల్స్ ఉన్నాయి. https://www.youtube.com/watch?v=O38mUkgL-w8 కేజీఎఫ్‌ తరహా డైలాగ్స్‌! ప్రశాంత్‌ నీల్‌ సినిమా అంటే యాక్షన్‌తో పాటు డైలాగ్స్‌ కూడా ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి. ముఖ్యంగా కేజీఎఫ్‌ సినిమాలోని డైలాగ్స్‌కు మంచి రెస్పాన్స్‌ వచ్చింది. ‘బగీరా’ ట్రైలర్‌లోనూ ఆ తరహా డైలాగ్స్‌ను మనం చూడవచ్చు. 'దేవుడు ఎందుకమ్మా రామాయణం, భారతం అంటూ ఎప్పుడో వస్తాడు. ఎందుకు ఎప్పుడూ రాడు’ అని ఓ పిల్లాడు తన తల్లిని అడుగుతున్న డైలాగ్‌తో ట్రైలర్ మెుదలవుతుంది. ‘మనిషి మృగంగా మారినప్పుడు వస్తాడు’ అంటూ అందుకు తగ్గ పరిస్థితులను ఆ తల్లి వివరిస్తుంది. ఆ డైలాగ్‌ చెప్తున్న క్రమంలోనే క్రూరమైన విలన్స్‌తో కూడిన సన్నివేశాలను చూపించారు. పోలీస్ ఆఫీసర్ అయిన హీరో తన యూనిఫామ్‌ను పక్కనపెట్టి ఓ ముసుగు మనిషిలా క్రిమినల్స్‌ను పాశవికంగా చంపడం చూపించారు. ఓ వైపు పోలీస్‌గా మరోవైపు రాక్షసులను చంపే వెపన్ గా మారె శ్రీ మురళి యాక్టింగ్ ట్రైలర్‌లో ఆకట్టుకుంది. పోలీసు ఉన్నతాధికారిగా నటుడు ప్రకాష్‌ రాజ్‌ ట్రైలర్‌లో కనిపించాడు.&nbsp; తల్లి సెంటిమెంట్‌! కేజీఎఫ్‌ సినిమాను గమనిస్తే చిన్నప్పుడే హీరో తల్లి చనిపోతుంది. చివరి క్షణాల్లో తల్లికి ఇచ్చిన మాట కోసం హీరో క్రిమినల్‌గా మారతాడు. బగీరా ట్రైలర్‌ను గమనిస్తే కేజీఎఫ్‌కు సిమిలార్‌ స్టోరీతో ఇది వస్తున్నట్లు అర్ధమవుతుంది. ఇందులోనూ తల్లి సెంటిమెంట్‌ ఉండనున్నట్లు ట్రైలర్‌ను బట్టే తెలిసిపోతోంది. చిన్నప్పుడు తల్లి చనిపోయిన ఓ పిల్లాడు అన్యాయాలను ఎదిరించేందుకు పెద్దయ్యాక పోలీసు అవుతాడు. చట్టబద్దంగా న్యాయం జరగట్లేదని భావించి ముసుగు వ్యక్తిలా మారతాడు. అలా బగీరా గెటప్‌లో క్రిమినల్స్‌ను చాలా దారుణంగా చంపుతాడు. అయితే హీరో తల్లికి క్రిమినల్స్‌ నుంచి ఇబ్బందులు ఎదురై ఉండవచ్చు. దీంతో ఆమెకు జరిగిన అన్యాయం మరొకరికి జరగకూడదన్న ఉద్దేశ్యంతో హీరో ఖాకీ ధరించి ఉంటాడని నెటిజన్లు భావిస్తున్నారు. బ్లాక్ అండ్ వైట్ ఫ్రేమ్స్‌‌, యాక్షన్‌ సీక్వెన్స్‌ చూస్తుంటే అచ్చం కేజీఎఫ్‌ను చూసిన ఫీలింగ్ కలుగుతోందని పలువురు కామెంట్స్ చేస్తున్నారు. కాగా, ఈ చిత్రం అక్టోబర్‌ 31న ప్రేక్షకుల ముందుకు రానుంది.&nbsp; ‘NTR 31’తో బిజీ బిజీ సలార్‌ వంటి బ్లాక్‌ బాస్టర్‌ తర్వాత ప్రశాంత్ నీల్‌ తన నెక్స్ట్‌ ప్రాజెక్ట్‌ను జూ.ఎన్టీఆర్‌ (Jr NTR)తో చేయబోతున్నాడు. ‘NTR 31’ వర్కింగ్‌ టైటిల్‌తో ఈ సినిమా తెరకెక్కనుంది. ఈ సినిమా బంగ్లాదేశ్‌ నేపథ్యంలో రూపొందనున్నట్లు తెలుస్తోంది. ఇందులో తారక్‌ బంగ్లాదేశ్‌ రైతుగా కనిపిస్తారని స్ట్రాంగ్ బజ్‌ వినిపిస్తోంది. త్వరలోనే ఈ ప్రాజెక్ట్ పట్టాలెక్కే ఛాన్స్ ఉంది. అయితే సీక్వెల్‌కు కేరాఫ్‌గా మారిన ప్రశాంత్‌ వర్మ 'NTR 31' ప్రాజెక్ట్‌ను సింగిల్‌ పార్ట్‌గా తీసుకొస్తున్నట్లు సమాచారం. ఇక ఈ మూవీ తర్వాత ప్రభాస్‌తో 'సలార్‌ 2' ప్రశాంత్ నీల్‌ తెరకెక్కించే అవకాశముంది. అలాగే రామ్‌ చరణ్‌తోనే ఓ ప్రాజెక్ట్‌ను ఫైనల్‌ చేసినట్లు ఇటీవల వార్తలు వచ్చాయి.
    అక్టోబర్ 21 , 2024
    <strong>Devara: </strong><strong>‘ఆర్‌ఆర్‌ఆర్‌’ స్ఫూర్తితో ‘దేవర’ టైటిల్‌.. జాన్వీ, అనిరుధ్‌పై తారక్‌ సెన్సేషన్‌ కామెంట్స్‌!</strong>
    Devara: ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ స్ఫూర్తితో ‘దేవర’ టైటిల్‌.. జాన్వీ, అనిరుధ్‌పై తారక్‌ సెన్సేషన్‌ కామెంట్స్‌!
    ఎన్టీఆర్‌ (NTR), కొరటాల శివ (Koratala Siva) కాంబోలో రూపొందిన ‘దేవర’ (Devara) చిత్రం సెప్టెంబర్‌ 27న వరల్డ్‌ వైడ్‌గా రిలీజ్‌ కానుంది. పాన్‌ ఇండియా స్థాయిలో రూపొందిన చిత్రం కావడంతో దేవర టీమ్‌ గత కొద్ది రోజులుగా బాలీవుడ్‌లో వరుస ప్రమోషన్స్‌ నిర్వహించారు. తాజాగా తమిళనాడులోనూ ఓ ఈవెంట్‌ నిర్వహించి అక్కడ కూడా దేవరపై హైప్‌ తీసుకొచ్చారు. విడుదల తేదీ దగ్గర పడుతున్నకొద్ది తారక్‌ కూడా తీరిక లేకుండా దేవర ప్రమోషన్స్‌లో పాల్గొంటున్నాడు. ఈ క్రమంలో తాజాగా నిర్వహించిన ఇంటర్యూలో దేవరతో పాటు హీరోయిన్‌ జాన్వీ కపూర్‌, మ్యూజిక్‌ సెన్సేషన్‌ అనిరుధ్‌ రవిచంద్రన్‌పై ఆసక్తికర కామెంట్స్ చేశారు. ప్రస్తుతం ఇవి వైరల్‌గా మారాయి.&nbsp; ‘ఫస్ట్‌ జాన్వీని అనుకోలేదు’ ‘దేవర’ చిత్రంలో తారక్‌కు జోడీగా బాలీవుడ్‌ బ్యూటీ జాన్వీ కపూర్‌ (Janhvi Kapoor) నటించింది. ఈ సినిమా ద్వారానే ఆమె మెుదటిసారి తెలుగు తెరకు పరిచయమవుతోంది. అయితే ‘దేవర’ సినిమాకు హీరోయిన్‌గా మెుదట జాన్వీని అనుకోలేదని తాజా ఇంటర్యూలో తారక్‌ తెలిపారు. కథ రాస్తున్నప్పుడు కథానాయికగా ఎవరిని ఎంచుకోవాలనే విషయంలో ఎలాంటి ఆలోచన లేదని చెప్పుకొచ్చారు. అలాంటి సమయంలో కరణ్‌ జోహార్‌ కాల్‌ చేసి ‘జాన్వీ మంచి నటి. ఆమెను మన సినిమాలో తీసుకుంటే బాగుంటుంది’ అని అన్నారని తారక్‌ తెలిపాడు. ‘ఆ తర్వాత కూడా మేము ఆమెను తీసుకోవాలని అనుకోలేదు. కానీ, జాన్వీకపూర్‌ ఇందులో భాగం కావాలని బలంగా కోరుకున్నారు. స్క్రిప్ట్‌ రైటింగ్‌ పూర్తయ్యే సమయానికి ఆమె టీమ్‌లోకి వచ్చారు. యాక్టింగ్‌, భాష విషయంలో జాన్వీ తొలుత ఎంతో కంగారుపడ్డారు. కానీ చక్కగా యాక్ట్‌ చేశారు. ఆమె యాక్టింగ్‌తో షాక్‌కు గురి చేశారు’ అని తారక్‌ వివరించారు. ఆర్‌ఆర్‌ఆర్‌ స్ఫూర్తితో.. ఏ సినిమాకైనా టైటిల్‌ అనేది చాలా కీలకం. అటువంటిది పాన్ ఇండియా స్థాయిలో సినిమా వస్తుందంటే టైటిల్‌కు మరింత ప్రాధాన్యత పెరుగుతుంది. అది జాతీయ స్థాయిలో అందరికీ కనెక్టింగ్‌గా అనిపించాలి. అందుకే స్టార్‌ హీరోల చిత్రాలకు టైటిల్‌ విషయంలో చాలా హోమ్‌ వర్క్‌ చేస్తుంటారు. దేవర విషయంలోనూ అదే జరిగినట్లు తారక్‌ తాజా ఇంటర్యూలో తెలియజేశారు. దేవర టైటిల్‌ను ఫిక్స్‌ చేయడం వెనకున్న కారణాన్ని కూడా తెలియజేసాడు. ఈ సినిమాకు ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ తరహాలో దేశవ్యాప్తంగా అందరికీ చెరువయ్యే టైటిల్‌ పెట్టాలని ముందే భావించినట్లు తారక్‌ తెలిపాడు. ఈ క్రమంలోనే ‘దేవర’ను ఫైనల్‌ చేసినట్లు స్పష్టం చేశారు. దేవర అంటే ‘దేవుడు’ అని అర్థమని తారక్‌ చెప్పుకొచ్చాడు. రెహమాన్‌ స్థాయికి అనిరుధ్‌ దేవర చిత్రానికి అనిరుధ్‌ సెన్సేషన్‌ మ్యూజిక్‌ అందించాడు. ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజైన ఫియర్‌, బుట్టమల్లె, దావూదీ సాంగ్స్‌ జాతీయ స్థాయిలో ట్రెండింగ్‌లో నిలిచాయి. ఈ నేపథ్యంలో అనిరుధ్‌పై తారక్‌ ప్రశంసల వర్షం కురిపించారు. ప్రస్తుతం ఆయన శకం నడుస్తోందంటూ ఆకాశానికెత్తారు. ఒక సినిమాకు సంగీతం ఎంత అవసరమో అనిరుధ్‌కు బాగా తెలుసని, అతను అద్భుతమైన వ్యక్తి అని వ్యాఖ్యానించారు. అనుకున్నవిధంగా రిజల్ట్‌ వచ్చేవరకూ కష్టపడుతూనే ఉంటాడని చెప్పుకొచ్చాడు. ఏఆర్‌ రెహమాన్‌ స్థాయికి అనిరుధ్‌ వెళ్తాడని తారక్ అభిప్రాయపడ్డాడు. అంతర్జాతీయ చిత్రాలకూ కంపోజ్‌ చేస్తాడని ఆశాభావం వ్యక్తం చేశాడు.&nbsp; తొలి ఇండియన్‌ ఫిల్మ్‌గా 'దేవర' రిలీజ్‌కు ముందే పలు రికార్డులు కొల్లగొడుతున్న ‘దేవర’ చిత్రం తాజాగా మరో అరుదైన ఘనతను తన ఖాతాలో వేసుకుంది. లాస్‌ ఏంజెల్స్‌లో నిర్వహించే ప్రతిష్ఠాత్మక బియాండ్‌ ఫెస్ట్‌ (2024 Beyond Fest)లో ప్రదర్శితం కానున్న తొలి భారతీయ చిత్రంగా నిలవనుంది. బియాండ్‌ ఫెస్ట్‌లో ఇప్పటివరకూ ఏ ఇండియన్‌ సినిమాను ప్రదర్శించలేదు. ఈ రికార్డు తారక్‌కే దక్కనుంది. సెప్టెంబర్ 25 నుంచి అక్టోబర్ 9 మధ్య ఈ ఫిల్మ్ ఫెస్టివల్‌ జరగనుంది. మరోవైపు నార్త్‌ అమెరికాలో టికెట్ల ప్రీసేల్‌ రికార్డును కూడా దేవర కొల్లగొట్టింది. ప్రీసేల్‌ ద్వారా అత్యంత వేగంగా 1 మిలియన్‌ డాలర్లు కలెక్ట్‌ చేసిన ఫస్ట్‌ ఇండియన్‌ ఫిల్మ్‌గా నిలిచింది.&nbsp;&nbsp;
    సెప్టెంబర్ 19 , 2024
    <strong>Telugu Love Dialogues: తెలుగు సినిమాల్లో ఇప్పటివరకు వచ్చి బెస్ట్ లవ్ డైలాగ్స్ ఇవే!</strong>
    Telugu Love Dialogues: తెలుగు సినిమాల్లో ఇప్పటివరకు వచ్చి బెస్ట్ లవ్ డైలాగ్స్ ఇవే!
    ప్రేమ అంటే రెండు అక్షరాల కలయిక కాదు. రెండు మనసుల కలయిక. ఈ ప్రపంచంలో ప్రతి మనిషి పరితపించేది, అన్వేషించేది ప్రేమ కోసమే. మనిషి నుంచి పశు పక్ష్యాదుల వరకు ప్రేమతోనే జీవితాలు ముందుకు సాగుతుంటాయి. భూత, వర్తమాన, భవిష్యత్ కాలలతో సంబంధం లేకుండా జీవన నావా ముందుకు సాగాలంటే ప్రేమ అనే చమురు చాలా అవసం. ఒకరిపై ఎంత ప్రేమో చెప్పాలంటే మాటలు సరిపోవు. కానీ కొన్ని మనసును తాకి మనలోని ప్రేమను ధ్వనింపజేస్తాయి. తెలుగు సినీలోకంలో ప్రేమ కావ్యాలు కోకొల్లలు. ప్రేక్షకులను ప్రేమ మాయలోకి దింపిన ఆ దృశ్య కావ్యాల నుంచి మనసుకు హత్తుకునేలా చేసిన డైలాగ్స్ మీకోసం.. [toc] బేబీ “ఫస్ట్ టైమ్ లవ్ చేసినప్పుడే అనుకున్నా.. రెండోసారి, ఇంకోసారి ప్రేమ అనే మాట ఉండదని” “మీ అంత బలం లేకుండొచ్చు. గుండెల మీద కొట్టాలంటే మా కంటే గట్టిగా ఇంకెవడూ ఎవడూ కొట్టలేడు” “అమ్మాయి జీవితంలోకి వచ్చే ముందు కష్టం వస్తుందని దేవుడు ఎందుకు సిగ్నల్ ఇవ్వడు” వాన “ఈ ప్రపంచంలో నేను ప్రేమించినంతగా నిన్ను ఎవ్వరూ ప్రేమించలేరు. నువ్వు ఎక్కడున్నా.. ఎలా ఉన్నా.. నన్ను మర్చిపోయినా.. ముసలిదానివైపోయినా.. చచ్చిపోయినా నీ మీద నా ప్రేమ చావదు” మన్మథుడు “నువ్వంటే ఎందుకు ఇష్టమో చెప్పలేను.. కానీ ఎంతిష్టమో చెప్పగలను!” కంచె&nbsp; “గులాబీ పువ్వును ఇష్టపడితే కోస్తాం, ప్రేమిస్తే నీళ్లు పోస్తాం” నిన్నుకోరి “నువ్వు ఇచ్చిన ధైర్యమే ఇంత బాగుంటే… లైఫ్‌ అంతా నువ్వు నాతో ఉంటే ఇంకెంత బాగుంటుంది” ఆర్య “నీ కోసమే నా అన్వేషణ.. నీ కోసమే నా నిరీక్షణ. నిన్ను చూసే క్షణం కోసం.. కొన్ని వేలసార్లు మరణించైనా సరే.. ఒక్కసారి జన్మించడానికి సిద్ధంగా ఉన్నాను “ ఆరెంజ్‌ “ప్రేమ ఆరంభంలోనే అద్భుతంగా ఉందంటే.. ముగింపు ఇంకా అద్భుతంగా ఉండాలి. అలాంటి సముద్రమంత ప్రేమను చూడాలంటే.. జీవితపు చివరి అంచుల్లోనే చూడగలవు. అలా చూడాలంటే ఒక్కమ్మాయినే ప్రేమించాలి” ప్రేయసిరావే “ప్రవహిస్తున్న ప్రతి రక్తపు బిందువు మీద నీ పేరే ఉంటుంది. పీలుస్తున్న ప్రతి గాలి రేణువులోనూ నీ రూపమే ఉంటుంది. కదులుతున్న ప్రతి జీవ కణంలోనూ నీ జ్ఞాపకమే ఉంటుంది.” ఏమాయ చేశావె “ఈ ప్రపంచంలో ఉన్న అమ్మాయిలంతా ఇప్పటి నుంచి నా సిస్టర్సే , ఒక్క నువ్వు తప్ప.” మళ్లీ మళ్లీ ఇది రాని రోజు “కళ్లు కూడా మాట్లాడగలవని నాకు తెలియదు.. నీ కళ్లు నాతో మాట్లాడేదాకా! ప్రాణం లేకపోయినా బతకొచ్చని నాకు తెలియదు.. అది నువ్వు తీసుకెళ్లిపోయేదాకా!”&nbsp; మజిలి “పెళ్లికి ముందులాగా.. పెళ్లి తర్వాత ప్రేమ కంటికి కనబడదు. అది ఒకరి మీద ఒకరికి ఉండే హక్కులోనే ఉంటుంది. ఒకరికోసం ఇంకొకరు తీసుకునే బాధ్యతలోనే ఉంటుంది” ఊపిరి “ప్రేమ ఉన్న చోటే భయం ఉంటుంది. ప్రేమిస్తున్నామని చెబితే.. ఎక్కడ రిజెక్ట్‌ చేస్తారోనని భయం. దగ్గరయ్యాక ఎక్కడ కోల్పోతామోనని భయం. మనకి కావాల్సిన వాళ్లు దూరమైతే.. ఎలా ఉన్నారని భయం. నిజానికి భయం ఉంటే.. ప్రేమ ఉన్నట్టే” జాను “పది నెలలు మోసి కన్న మీ అమ్మకు నువ్వు సొంతమైతే.. ఇన్నాళ్లుగా మనసులో మోస్తున్న నాకు కూడా నువ్వు సొంతమే” అందాల రాక్షసి “నా ప్రేమను చాపలా పరిస్తే ఈ భూమి సరిపోదు. గాలిలో నింపితే ఈ విశ్వం బద్దలవుతుంది. నీళ్లలో కలిపితే సముద్రాలు ఇంకిపోతాయి. శివుడు విషాన్ని దాచినట్టుగా దాయగలను” "రాళ్ళను పూజించే దేశంలో రాతిని ప్రేమించడం తప్పేం కాదు." ఓయ్ “నేను పడుకోబోయే ముందు చివరి ఆలోచన, లేచాక మొదటి ఆలోచన నువ్వే” కలర్ ఫొటో “ప్రేమించిన వారిని అందనంత ఎత్తులో నిలబెట్టడమే నిజమైన ప్రేమ.” “ఆడపిల్ల ఇంట్లో ఉన్న మనిషి..ఈ సముద్రం గట్టున నిల్చున్న మనిషి ఇద్దరూ ఒకటే సముద్రం వచ్చి చల్లగా మన కాళ్లు కడుగుతోందని అనుకుంటాం. కానీ మనకే తెలియకుండా కాళ్ల కింద ఇసుకని వెనక్కి లాగేసుకుని పోతుంది. &nbsp;మొగుడి దగ్గర మనసు దాచుకోగలం.. కానీ ఒళ్లు దాచలేం.” “ఈ ప్రపంచం మొత్తమ్మీద స్వచ్ఛమైన వాటిలో రెండోది అమ్మాయి నవ్వు.మొదటిది ఓ మగాడి కన్నీళ్లు.” “నీరు పట్టిన చద్దన్నం ఆకలి తీర్చకపోవచ్చు..కానీ కుడితి కలిపి పెడితే ఆవులు ఆవురావురుమంటూ తాగుతాయి. అలాగే మురికి నీళ్లు మనకు దాహం తీర్చకపోవచ్చు..కానీ నిప్పును ఆర్పుతాయి. ప్రపంచంలో ఏదీ ఊరికే పోదు అన్నీ ఉపయోగపతడాయి.” మనం “మనుషుల్ని సృష్టించిన ఆ దేవుడే ప్రేమను, మనసును సృష్టించాడు. మనిషి ప్రాణానికి పరిమితి పెట్టగలిగిన ఆ దేవుడు.. మనసుకు, ప్రేమకు ఎందుకు ఆ పరిమితులు పెట్టలేకపోయాడు” పడిపడిలేచె మనసు మిమ్మల్ని ప్రేమించిన వాళ్లకి.. అది కష్టమైనా, నష్టమైనా చివరి వరకూ మీతోనే ఉండాలనిపిస్తుంది. హలో గురు ప్రేమకోసమే “గుర్తుంచుకోవాలి.. గుర్తుంచుకోవాలి అని చదివే చదువు మాత్రం మర్చిపోతాం. కానీ మర్చిపోవాలి... మర్చిపోవాలి అనుకున్న అమ్మాయిని మాత్రం చచ్చేదాకా మర్చిపోలేం.” తీన్‌మార్ “మనకు జ్వరమొచ్చినప్పుడు అమ్మ కావాలనిపిస్తుంది. భయమేసినప్పుడు నాన్న ఉంటే ధైర్యంగా ఉంటుంది. బాధలో ఉన్నప్పుడు పక్కన ఫ్రెండ్‌ ఉంటే బాగుంటుంది. ఆనందంగా ఉన్నప్పుడు మన పక్కన ప్రేమించిన వాళ్లుంటే బాగుంటుంది” అల వైకుంఠపురములో.. “ప్రేమిస్తే అబద్దం విలువ తెలుస్తుంది కరెక్టే.., కానీ నిజం చెపితేనే కదా, ప్రేమ ఎంత గట్టిదో తెలుస్తుంది.” “బరువు పైన ఉంటే కిందకి చూడలేం, ఎంత బరువు పెడితే అంత పైకి చూస్తావ్. ఎంత కష్టపడితే అంత పైకి లేస్తావ్.” “ఇంట్లో దీపం వెలిగితే ఒక్క కుటుంబానికే వెలుగు, అదే గుడిలో వెలిగితే ఊరంతటికి వెలుగు” “ఎప్పుడు పిల్లలు బాగుండాలి అని అమ్మ నాన్నలు అనుకోవడమేనా, అమ్మ, నాన్ననాన్నలు బాగుండాలని పిల్లలు అనుకోరా.! “ఒక యుద్ధం వచ్చిన దేశం లో ఉన్నవాళ్ళందరూ, కులం, మతం ప్రాంతం అనే తేడాలు లేకుండ కలిసిపోతారు సర్, &nbsp;ఒక కష్టం వచ్చినప్పుడే, కుటుంబంలో ఉన్న అందరూ వాళ్ల స్వార్థం, ద్వేషం, పగ, అన్ని పక్కన పెట్టి ఒకటవుతారు.”
    ఆగస్టు 23 , 2024
    <strong>Comedian Ali Roles: ‘డబుల్‌ ఇస్మార్ట్‌’లో అలీ చేసిన రోల్ విశిష్టత తెలుసా?</strong>
    Comedian Ali Roles: ‘డబుల్‌ ఇస్మార్ట్‌’లో అలీ చేసిన రోల్ విశిష్టత తెలుసా?
    పూరి జగన్నాథ్‌ సినిమా అంటే పవర్‌ ఫుల్‌ డైలాగ్స్‌, హీరోయిజంతో పాటు హాస్య నటుడు అలీ క్యారెక్టర్లు కూడా గుర్తుకు వస్తాయి. పూరి ఇప్పటివరకూ చేసిన సినిమాల్లో అలీ కోసం ప్రత్యేకంగా కొన్ని పాత్రలను సృష్టించారు. ఆ పాత్ర తాలుకూ కామెడీ ట్రాకులు ఆయా సినిమాలకు భలే వర్కౌట్‌ అయ్యాయి. ఈ క్రమంలోనే 'డబుల్‌ ఇస్మార్ట్‌' సినిమాలోనూ అలీకి ఓ ప్రత్యేకమైన రోల్‌ను ఇచ్చాడు పూరి. ‘బోకా’ అనే విచిత్రమైన పాత్రలో అలీ కనిపించనున్నారు. ట్రైలర్‌లో అలీ పాత్రకు సంబంధించిన డైలాగ్స్‌ ఆకట్టుకున్నాయి. ఈ నేపథ్యంలో గతంలో పూరి సినిమాల్లో అలీ చేసిన ప్రత్యేకమైన పాత్రలు ఏంటో ఇప్పుడు చూద్దాం.&nbsp; బైక్‌ల దొంగ (ఇడియట్‌) రవితేజ, పూరి జగన్నాథ్‌ కాంబోలో వచ్చిన ఇడియట్‌ చిత్రం అప్పట్లో ఎంతటి సెన్సేషన్‌ క్రియేట్‌ చేసిందో అందరికీ తెలిసిందే. అయితే ఇందులో బైక్‌లను దొంగిలించే పాత్రలో అలీ కనిపిస్తాడు. హైదరాబాద్‌ నుంచి బీదర్‌కు బైక్‌పై ఇసుక మూటను తీసుకెళ్తూ పోలీసు అధికారి జీవాను ఫుల్‌గా కన్ఫ్యూజ్‌ చేస్తాడు. ఆ ఇసుకను బీదర్‌లో చల్లడానికి తీసుకెళ్తున్నట్లు పదే పదే పోలీసులకు అలీ చెప్తాడు. అయితే అంత దూరం ఎందుకు తీసుకెళ్తున్నాడో తెలియక పోలీసులతో పాటు ఆడియన్స్‌ కూడా కన్ఫ్యూజ్‌ అవుతారు. ఫైనల్‌గా అలీనే బైక్‌ దొంగతనాలు చేస్తున్నట్లు చెప్పడంతో అంతా ఒక్కసారిగా షాకవుతారు.&nbsp; స్కెచ్ ఆర్టిస్టు (సూపర్‌) నాగార్జున హీరోగా పూరి జగన్నాథ్‌ దర్శకత్వంలో వచ్చిన ఈ మూవీలో ఆర్టిస్టు జాన్‌ అబ్రహం పాత్రలో అలీ కనిపిస్తాడు. ఇందులో అతడు మంచి నైపుణ్యం గల ఆర్టిస్టు. ఒకసారి చూస్తే ఇట్టే వారి స్కెచ్‌ వేయగలడు. అలా ఓ సందర్భంలో పోలీసులు వెతుకున్న హీరోను చూస్తాడు. దీంతో పోలీసులు అతడ్ని వెంటపెట్టుకొని వెళ్తారు. ఈ సందర్భంగా బ్రహ్మానందం, అలీ మధ్య వచ్చే లై డిటెక్టర్‌ సీన్‌ ఎప్పటికీ మర్చిపోలేరు.&nbsp; బిక్షగాడు (పోకిరి) మహేష్‌, పూరి కాంబోలో వచ్చిన ‘పోకిరి’ చిత్రం బాక్సాఫీస్‌ వద్ద పలు రికార్డులను కొల్లగొట్టింది. ఇందులో బిక్షవాడి పాత్రలో అలి కనిపించాడు. బ్రహ్మానందం అతడి ఈగో హర్ట్‌ చేయడంతో పదుల సంఖ్యలో బిక్షగాళ్లతో అతడి వెంట తిరుగుతూ నవ్వులు పూయించాడు. అలీ - బ్రహ్మానందం మధ్య వచ్చే కామెడీ సీన్స్‌ ఈ సినిమా సక్సెస్‌లో ముఖ్య భూమిక పోషించాయని చెప్పవచ్చు.&nbsp; హిమాలయ బాబా (దేశ ముదురు) అల్లు అర్జున్‌ హీరోగా చేసిన దేశముదురు చిత్రంలో అలీ హిమాలయాల్లో తపస్సు చేసే బాబా పాత్రలో కనిపించాడు. తాను బాబాగా ఎందుకు మారాడో కొద్ది కొద్దిగా రివీల్‌ చేస్తూ ఆడియన్స్‌లో ఎగ్జైట్‌మెంట్‌ను క్రియేట్‌ చేస్తాడు. ప్రతీ సీన్‌ క్లైమాక్స్‌లా ఉంటుందంటూ నవ్వులు పూయించాడు. ఈ పాత్రకు సంబంధించిన సన్నివేశాలకు ఇప్పటికీ ఆడియన్స్‌లో క్రేజ్ ఉంది.&nbsp; గోలి (దేవుడు చేసిన మనుషులు) రవితేజ, పూరి కాంబోలో వచ్చిన ఈ ఫిల్మ్‌లో గోలీ అనే విచిత్రమైన పాత్రలో అలీ నటించాడు. లక్ష్మీదేవి కుమారుడిగా చెప్పుకుంటూ విపరీతంగా పూజలు చేస్తుంటాడు. లక్ష్మీదేవి (కోవై సరళ) అతడికి సాయం చేయాలని భావించి కొన్ని అవకాశాలు ఇచ్చినప్పటికీ తన తింగరితనంతో చేజేతులా వాటిని చెడగొట్టుకుంటూ నవ్వులు పూయించాడు. ఈ సినిమా బాక్సాఫీస్‌ వద్ద డిజాస్టర్‌గా నిలిచినప్పటికీ అలీ చేసిన గోలి పాత్ర మాత్రం ఆడియన్స్‌ను కడుపుబ్బా నవ్వించింది.&nbsp; నచ్చిమి (చిరుత) మెగా పవర్‌ స్టార్‌ రామ్‌చరణ్‌ ఫస్ట్‌ ఫిల్మ్‌ 'చిరుత'లో అలీ పాత్ర విచిత్రంగా ఉంటుంది. నచ్చిమిగా అలీ పాత్ర, వేషధారణ, అన్నీ ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించాయి. అప్పటివరకూ ఆయన చేసిన క్యారెక్టర్లలో భిన్నమైన పాత్రగా నచ్చిమి గుర్తింపు తెచ్చింది. ఇప్పటికీ బుల్లితెరపై నచ్చిమిగా అలీ కనిపడితే నవ్వులే నవ్వులు అని చెప్పవచ్చు.&nbsp; బోకా (ఇస్మార్ట్‌ శంకర్‌) రామ్‌ పోతినేని, పూరి కాంబోలో వస్తోన్న ‘డబుల్‌ ఇస్మార్ట్‌’ సినిమాలో బోకా అనే అడివి మనిషి తరహా పాత్రలో అలీ కనిపించనున్నాడు. ట్రైలర్‌లో అలీ పర్‌ఫార్మెన్స్‌ చూసి ఆడియన్స్‌ ఫిదా అయ్యారు. ఈ పాత్ర కూడా పక్కాగా హైలెట్ అవుతుందని పోస్టులు పెడుతున్నారు. అయితే ఈ పాత్ర ఎలా పుట్టిందో ఈ క్యారెక్టర్‌కు సంబంధించిన ఐడియా ఎలా వచ్చిందో అలీ తాజా ఇంటర్యూలో చెప్పుకొచ్చారు. మలేషియాలో బిల్లా షూటింగ్‌ సందర్భంలో చింపాజిని మేనేజర్‌గా పెట్టుకుంటే ఎలా ఉంటుందో ప్రభాస్‌కు చేసి చూపించినట్లు అలీ తెలిపారు. తన నటనకు ప్రభాస్‌తో పాటు అక్కడ ఉన్నవారంతా గంటన్నర సేపు నవ్వుతూనే ఉన్నారని చెప్పుకొచ్చారు. ఈ విషయం ఫోన్‌లో పూరికి చెప్పగానే ట్రాక్‌ బాగుంది ఏ సినిమాలోనైనా పెడదాం అన్నట్లు చెప్పారు. అలా అమెజాన్‌ ఫారెస్ట్‌ నుంచి బోకా అనే క్యారెక్టర్‌ను తీసుకున్నట్లు అలీ స్పష్టం చేశారు. తన రోల్‌కు సంబంధించిన షూటింగ్‌ను మూడు రోజుల్లోనే ఫినిష్‌ చేసినట్లు అలీ తెలిపారు.  
    ఆగస్టు 13 , 2024
    <strong>Kalki 2898 AD Top Dialogues: ‘కల్కి’ని సూపర్‌ సక్సెస్‌ చేసిన డైలాగ్స్‌ ఇవే..!</strong>
    Kalki 2898 AD Top Dialogues: ‘కల్కి’ని సూపర్‌ సక్సెస్‌ చేసిన డైలాగ్స్‌ ఇవే..!
    ప్రభాస్‌ (Prabhas).. ప్రస్తుతం ఈ పేరు యావత్‌ సినీ లోకాన్ని ఊర్రూతలూగిస్తోంది. థియేటర్లలో ‘కల్కి 2898 ఏడీ’ (Kalki 2898 AD) ప్రభజనం కొనసాగుతున్న వేళ.. అందరూ ప్రభాస్‌ గురించే మాట్లాడుకుంటున్నారు. ఈ సినిమాలో అతడి నటనపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. హాలీవుడ్‌ స్థాయి యాక్షన్‌ సీక్వెన్స్‌లో ప్రభాస్‌ అదరగొట్టాడని, ఇండియన్‌ సినిమా స్టాండర్డ్స్‌ను కల్కి టీమ్‌ గ్లోబల్‌ స్థాయికి తీసుకెళ్లిందని అంటున్నారు. మరి ముఖ్యంగా కల్కిలో ప్రభాస్‌ డైలాగ్స్‌పై అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. ప్రభాస్‌ కటౌట్‌కు తగ్గ డైలాగ్స్‌ కల్కిలో పడ్డాయని ఫ్యాన్స్‌ పోస్టులు పెడుతున్నారు. అమితాబ్‌ బచ్చన్‌ సహా కమల్‌ హాసన్‌, దీపికా పదుకొణె ఇతర ప్రధాన తారాగణం చెప్పిన డైలాగ్స్‌ను కూడా ఫ్యాన్స్‌ మెచ్చుకుంటున్నారు. ఇంతకీ ప్రేక్షకులను మిస్మరైజ్‌ చేసిన కల్కి డైలాగ్స్ ఏవి? అవి ఏ సందర్భంలో వచ్చాయి? ఈ ప్రత్యేక కథనంలో చూద్దాం.&nbsp; కల్కి మూవీ డైలాగ్స్‌ కల్కి సినిమా ప్రారంభంలో కురుక్షేత్రం ఎపిసోడ్‌ చూపిస్తారు. గర్భస్త శిశువుపై అస్త్రాన్ని వదిలి.. అశ్వత్థామ పెద్ద తప్పు చేస్తాడు. దీంతో శ్రీకృష్ణుడు అతడ్ని శపించే క్రమంలో వచ్చే డైలాగ్స్ ఆకట్టుకుంటాయి.&nbsp; అశ్వత్థామ : చంపడానికి వస్తే నన్ను చంపు కృష్ణ. నీ ఉపదేశాలు వినడానికి నేను అర్జునుడ్ని కాదు.&nbsp; కృష్ణుడు : ఈ 18 రోజులు కురు క్షేత్రంలో జరిగిన పాపాల కన్నా.. నీ అధర్మం నిష్కృతమైనది. ధ్రోణాచార్యుడి పుత్రుడివి అయ్యుండి ఇంతకు దిగజారావా? అశ్వత్థామ : నా తండ్రి పేరు పలికే అర్హత నీకు లేదు. నువ్వు అనుకుంటే అతడి మరణాన్ని ఆపగలిగేవాడివి. కృష్ణుడు : అశ్వత్థామ.. దేవుడైనా క్రురుడైనా కర్మను తప్పించుకోలేరు. గర్భస్త శిశువుపై అస్త్రం వదిలావు. నీ ఖర్మ నువ్వు అనుభవించక తప్పదు.&nbsp; అశ్వత్థామ : అయితే సంధించు చక్రం.. విధించు నీ శిక్షని. కృష్ణుడు : చావు నీ శిక్ష కాదు అశ్వత్థామ.. అది విముక్తి. కాలాంతరం పాండవులు అందరూ చనిపోతారు. నా శరీరమూ మరణిస్తుంది. ఈ యుగం అంతరిస్తుంది. కానీ, నీకు మరణం రాదు. వేలాది సంవత్సరాలు నీ గాయాలు మానక.. చావు రాక.. బ్రతకలేక.. ఎన్నో పాపాలు చూస్తూ జీవిస్తావు. ఇదే నా శాపం. అశ్వత్థామ : మరి నా శాపానికి ప్రాయిశ్చిత్తం లేదా? కృష్ణుడు : నువ్వు నన్ను చంపాలనుకున్నావ్‌.. కానీ ఒక రోజు నువ్వే నన్ను కాపాడాలి.&nbsp; అశ్వత్థామ : నేనా? కృష్ణుడు : కలియుగం వస్తుంది. కలి వస్తున్నాడు. అధర్మం పెరిగిపోయి ప్రపంచమంతా చీకటి అయినప్పుడు నేను మళ్లీ ఒక అవతారం ఎత్తాలి. ఆ యుగంలో కలి మహా శక్తిశాలి. ఎంత శక్తివంతుడు అంటే నా పుట్టుకనే ఆపగలడు. అప్పుడు నువ్వే నా గర్భ గుడికి కాపలా కాయాలి. డైలాగ్‌ కాంప్లెక్స్‌ ఒక యువకుడిపై 5000 యూనిట్స్‌ నజరానా ప్రకటిస్తుంది. అతడ్ని పట్టుకునేందుకు ఓ గ్యాంగ్ వెళ్తుంది. ఈ సందర్భంలో పారిపోతున్న ఆ వ్యక్తికి బుజ్జి (AI వెహికల్‌).. సంకెళ్లు వేస్తుంది. అప్పుడు బుజ్జిపై విలన్‌ గ్యాంగ్‌ కాల్పులు జరుపుతారు. దీంతో బుజ్జి తన బాస్‌ భైరవ (ప్రభాస్‌)ను పరిచయం చేస్తూ బైరవకు ఎలివేషన్స్ ఇస్తుంది. బుజ్జి : హేయ్‌.. స్టాప్‌. నన్ను షూట్‌ చేస్తావా. ఇప్పుడు చూడు నా బాస్‌ వచ్చి మీ అందరిని స్మాష్‌ చేస్తాడు. విలన్‌ గ్యాంగ్‌: ఎవరు మీ బాస్‌? బుజ్జి : పాత యుద్ధాల్లో సోల్జర్‌. ఇంత వరకూ&nbsp; ఒక్క యుద్ధంలో ఓడిపోలేదు. ది వన్‌ అండ్‌ ఓన్లీ భైరవ (ఈ డైలాగ్‌ తర్వాత ప్రభాస్ ఎంట్రీ ఇస్తాడు) భైరవ: ఎంట్రీ అనంతరం భైరవ నేలపై గురక పెట్టి నిద్ర పోతాడు.. బుజ్జి : భైరవ గెటప్‌.. చాలా బిల్డప్‌ ఇచ్చాను లే. భైరవ: బుజ్జి.. బుజ్జి.. ప్లీజ్‌ 5 మినిట్స్‌ పడుకుంటాను. (దీని తర్వాత ప్రభాస్‌ ఎంట్రీ ఫైట్‌ ఉంటుంది) డైలాగ్‌ సుప్రీమ్‌ యాస్కిన్‌ (కమల్‌ హాసన్‌).. కాంప్లెక్స్‌లో తన మనుషుల చేత గర్భిణి స్త్రీలపై ప్రయోగాలు చేయిస్తుంటాడు. దీంతో యాస్కిన్‌ బృందంలోని ఒక సైంటిస్టు అతడ్ని చంపడానికి యత్నిస్తాడు. యస్కిన్‌.. ఆ సెంటిస్టును చంపుతూ చెప్పే డైలాగ్స్‌ మెప్పిస్తాయి.&nbsp; సుప్రీమ్‌ యాస్కిన్‌: చావుకు నేను చాలా ప్రాణాలు ఇచ్చాను. అది నన్నేం చేయదు. నిన్ను చూస్తే జాలేస్తుంది. ఎందుకు నన్ను చంపాలనుకున్నావ్‌? సైంటిస్టు : మంచి కోసం..&nbsp; సుప్రీమ్‌ యాస్కిన్‌ : మంచి.. చరిత్రలో ఎన్ని ప్రాణాలు తీసిందో తెలుసా ఈ మంచి. రాజులు రాజ్యాలు మారుతున్న ప్రతీసారి మారుతుందీ మంచి. దాన్ని నమ్మోద్దు. ఇంతకీ నీకేం కావాలి? సైంటిస్టు : ఈ లోకాన్ని కాపాడాలి సుప్రీమ్ యాస్కిన్‌ : అదే కదా.. నేనూ చేసింది. దేవుడిని, డబ్బులని, వందల యుద్ధాలు చేసే అందరినీ ఒక్క యుద్ధంతో గెలిచాను తప్పా?. మీరు బూడిద చేస్తున్న ప్రకృతిని అందనంత దూరంలో పెట్టాను.. తప్పా? సైంటిస్టు : నీకు ఇష్టం వచ్చినట్లు చేయడానికి నువ్వు ఎవరు? సుప్రీమ్‌ యాస్కిన్‌ : మరి నాశనం చేయడానికి మీరు ఎవరు? ఎన్ని యుగాలు అయినా.. ఎన్ని అవకాశాలు ఇచ్చినా మనిషి మారడు.. మారలేడు. ఇది నీ తప్పు కాదులే. హ్యూమన్‌ బీయింగ్స్‌కు ఉన్న డిఫెక్టే అది.&nbsp; డైలాగ్‌ కల్కిని గర్భంలో మోస్తున్న సుమతి (దీపిక పదుకొణె)ని.. సుప్రీమ్‌ యస్కిన్‌ మనుషుల నుంచి కాపాడి అశ్వత్థామ శంబాలకు తీసుకు వస్తాడు. అప్పుడు శంబాలకు రక్షణాధికారిగా ఉన్న వ్యక్తి సుమతి ఎవరో తెలియక అడ్డుకుంటాడు. సందర్భంలో వచ్చే సీన్‌, డైలాగ్స్‌ హైలెట్‌గా నిలుస్తాయి. రక్షణాధికారి : ఆమెను ఇక్కడకు ఎందుకు తీసుకొచ్చావు. 5 మిలియన్ పౌండ్లు పెట్టారు ఈమె మీద. కాంప్లెక్స్‌ మాత్రమే కాదు వరల్డ్‌లో ప్రతీ ఒక్కరు ఆమె కోసం వెతుకున్నారు. ఎలా కాపాడతావు? అశ్వత్థామ : నేను కాపాడతాను రక్షణాధికారి : అసలు నువ్వు ఎవరు? పొడుగ్గా ఉంటే సరిపోదు. ఎప్పుడైనా యుద్ధం చేశావా? అశ్వత్థామ గురించి తెలిసిన బాలుడు: ఎక్స్‌క్యూజ్‌మీ.. మహాభారతంలో శ్రీకృష్ణుడితోనే యుద్ధం చేశాడు.. ఓకే. (ఇక్కడ హైలెట్‌ బీజీఎం వస్తుంది) రక్షణాధికారి : అందరికీ పిచ్చి ఎక్కిందా? ఈమె (సుమతి) ఇక్కడి రావడం వల్ల అందరికీ ఎంతో డేంజరో అర్థమవుతుందా? తను జస్ట్‌.. ల్యాబ్‌ నుంచి ఎస్కేప్‌ అయిన మామూలు ప్రెగ్నెంట్‌ ఉమెన్‌. ఏమీ స్పెషల్‌ ఉమెన్‌ కాదు. అయినా పుట్టేది దేవుడు అనడానికి ఏంటీ సాక్ష్యం. *ఆ డైలాగ్‌ అనగానే వెంటనే వర్షం మెుదలవుతుంది. అక్కడ వాన పడి చాలా కాలమే అయి ఉంటుంది. ఆమె రాకతో వర్షం పడటంతో కల్కి జన్మించేది ఆమె కడుపునే అని శంబాలా ప్రజలు నమ్ముతారు. ఈ సీన్‌ ఆడియన్స్‌కు గూస్‌బంప్స్‌ తెప్పిస్తుంది. డైలాగ్‌ మహావిష్ణువు.. కల్కిగా పుట్టేందుకు తననే ఎందుకు ఎంచుకున్నాడని సుమతి (దీపిక).. అశ్వత్థామను ప్రశ్నిస్తుంది. ఆ సందర్భంలో వచ్చే డైలాగ్స్‌ మిస్మరైజింగ్‌ చేస్తాయి.&nbsp; అశ్వత్థామ : నువ్వు ప్రాణం ఇవ్వడానికే పుట్టావ్‌ అమ్మా? సుమతి : అసలు ఏం మాట్లాడుతున్నారు. ఇంకా తొలి ఊపిరి కూడా తీసుకొని ఈ బిడ్డ కోసం ఇంకా ఎంత మంది చనిపోవాలి? అశ్వత్థామ : ప్రతీ చావుకి ఒక పరమార్థం ఉంటుంది. ప్రతీ చావు లోకానికి కొత్త ఊపిరి పోస్తుందమ్మా. సుమతి : కానీ, నేనే ఎందుకు? అశ్వత్థామ : మోయగలిగిన శక్తి ఉన్నవారికే బాధ్యతను ఇస్తాడు ఆ దేవుడు. భగవంతుడ్ని కడుపులో మోయాలంటే భూదేవి అంత ఓర్పు ఉండాలి. మీలో ఆ ఓర్పు ఉందనే మిమ్మల్ని తల్లిగా ఎంచుకున్నారు.&nbsp; అశ్వత్థామ: నువ్వు ఇప్పుడు కనబోయేది మాములు ప్రాణం కాదమ్మ.. సృష్టిని. జన్మనివ్వడం నీ ధర్మం కాపాడటం నా బాధ్యత. డైలాగ్‌ శంబలకు తీసుకెళ్లిన సుమతి తనకు కావాలని కాంప్లెక్స్‌ ప్రతినిధి చటర్జీ తన మనుషులతో అంటాడు. అన్ని డైరెక్షన్స్‌లో రైడర్స్‌ పంపాం.. త్వరలోనే పట్టుకుంటామని అతని కమాండర్ చెబుతాడు. అప్పటికే అశ్వత్థామతో యుద్ధం చేసిన ప్రభాస్‌.. ఏమి చేయలేరని అంటాడు. ఈ సందర్బంలో ఛటర్జీతో అతడి సంభాషణ ఆకట్టుకుంటుంది. భైరవ : ఆ ముసలోడు ఉన్నంతవరకూ ఏం చేయలేరు. ఛటర్జీ : ముసలోడా? భైరవ : మీ వాళ్లందరినీ కొట్టింది అతడే? ఒక్కడు కూడా వాడ్ని టచ్‌ చేయలేదు. నేను తప్పా. ఛటర్జీ : వీడెవడు అసలు? కమాండర్‌: భైరవ అని బౌంటీ ఎంటర్‌ సర్‌. మన వాళ్లని కొడితే బ్లాక్‌ లిస్ట్‌ చేశాను.&nbsp; భైరవ: ఎలాగైనా బ్లాక్‌ లిస్ట్‌ చేశావు కదా. మళ్లీ కొడతా. పాయింట్‌ ఏంటి అంటే నేను ఒక్కడినే ఆ అమ్మాయిని తీసుకురాగలను. మీకు వేరే ఆప్షన్‌ లేదు.&nbsp; ఛటర్జీ : అంత ష్యూర్‌ ఆ..&nbsp; భైరవ : రికార్డ్స్‌ చూసుకో.. ఇంతవరకూ ఒక్క ఫైట్‌ కూడా ఓడిపోలేదు. ఇది కూడా ఓడిపోను.&nbsp; డైలాగ్‌ కల్కి క్లైమాక్స్‌లో.. కమల్‌ హాసన్‌ మీద వచ్చే సీన్‌ గూస్‌బంప్స్ తెప్పిస్తుంది. శక్తిని పుంజుకున్న తర్వాత ఆయన చెప్పే 'జగన్నాథ రథచక్రాల్‌ వస్తున్నాయ్‌ వస్తున్నాయ్‌.. రథచక్ర ప్రళయఘోళ భూమార్గం పట్టిస్తాను.. భూకంపం పుట్టిస్తాను'.. అనే డైలాగ్‌ సెకండ్‌ పార్ట్‌లో తాను ఎంత విధ్వంసం సృష్టిస్తానో తెలియజేస్తుంది. అయితే ఈ డైలాగ్‌ శ్రీశ్రీ మహా ప్రస్థానం లోనిది. 44 ఏళ్ల క్రితం ఆకలి రాజ్యం సినిమాలో ఇదే డైలాగ్‌ను కమల్‌ హాసన్ చెప్తారు. మళ్లీ ఇన్నాళ్ల తర్వాత అతడి నోట శ్రీశ్రీ కవిత వినిపించడం ఆడియన్స్‌ను సర్‌ప్రైజ్‌ చేసింది.&nbsp; View this post on Instagram A post shared by TELUGU SONGS OLD (@telugu_songs_old) డైలాగ్‌ కల్కిలో అప్పటివరకూ భైరవగా ఉన్న ప్రభాస్‌.. చివరి భాగంలో కర్ణుడిగా కనిపించి అందరికీ షాకిస్తాడు. చివరి పది నిమిషాల మహాభారతం ఎపిసోడ్‌లో కర్ణుడిగా కనిపించి స్క్రీన‌ను షేక్‌ చేస్తాడు.&nbsp; ‘ఆలస్యమైందా ఆచార్య పుత్ర’ అంటూ ప్రభాస్‌ విల్లు పట్టుకుని రథంపై నిలబడగా.. థియేటర్‌ మొత్తం దద్దరిల్లిపోయింది. భైరవను కర్ణుడిగా పరిచయం చేసే సందర్భంలో వచ్చే కురుక్షేత్రంలోని డైలాగ్స్‌ విజిల్స్‌ వేయిస్తాయి.&nbsp; అర్జునుడు : అశ్వత్థామ.. తలరాతను రాసే బ్రహ్మ చేసిన గాంఢీవం ఇది. దీనిని ఎవరు అడ్డుకోలేరు. కర్ణుడు: ప్రభాస్‌ ఎంట్రీ ఇచ్చి అర్జునుడు వేసిన బాణాన్ని నిలువరిస్తాడు. ఆ సందర్భంలో ఆలస్యమైందా ఆచార్య దేవా? అని అశ్వత్థామతో అంటాడు. అశ్వత్థామ: లేదు.. సరైన సమయంలోనే వచ్చావు.&nbsp; అర్జునుడు: చూశావా.. కేశవ (కృష్ణుడు). తను నాకు సమానుడా? వాడ్ని (కర్ణుడు) అడ్డుకొని మన రథం కేవలం రెండు అడుగులు వెనక్కి వెళ్లింది. నా అస్త్రానికి అతడి రథం 10 అడుగులు వెనక్కి వెళ్లింది.&nbsp; కృష్ణుడు : ఓ ధనుంజయ.. నీ రథం అగ్నిదేవుడి వరం. కాపాడుతున్నదని జెండాపై కపిరాజు (హనుమంతుడు).&nbsp; నడుపుతున్నది ముల్లోకాలు నడిపించే నేను. అయినా రెండడుగులు వెనక్కి తోశాడంటే ఆలోచించు అర్జునా.&nbsp; కృష్ణుడు: తను (కర్ణుడు) సామాన్య యోధుడు కాదు. తన కళ్లల్లోని తేజస్సు.. తన చేతిలోని ధనస్సు.. తన పేరు.. చరిత్ర ఎప్పటికీ మర్చిపోదు. సూర్య పుత్ర వైకర్ణ.. కర్ణ. (ఈ డైలాగ్‌తో కల్కి తొలిపార్ట్‌ ముగుస్తుంది).
    జూలై 02 , 2024
    Telugu dubbed movies: ఈ సినిమాలను అస్సలు మిస్‌ కావొద్దు.. ఒక్కసారైన చూసి తీరాల్సిన చిత్రాలు!
    Telugu dubbed movies: ఈ సినిమాలను అస్సలు మిస్‌ కావొద్దు.. ఒక్కసారైన చూసి తీరాల్సిన చిత్రాలు!
    ప్రస్తుతం భారతీయ సినిమా మరింత సరళంగా మారింది. ఒక భాషలో రిలీజైన సినిమాలను మరో భాషలోని ప్రేక్షకులు చూసి ఆదరిస్తున్నారు. కంటెంట్ బాగుంటే భాషతో సంబంధం లేకుండా ప్రేక్షకులు ఆ సినిమాకు బ్రహ్మరథం పడుతున్నారు. మరి గత రెండేళ్లలో తెలుగులోకి చాలా చిత్రాలు వివిభ భాషల నుంచి డబ్ అయ్యాయి. వాటిలో సూపర్ హిట్‌ అయిన మలయాళం, తమిళ్, కన్నడ, హిందీ చిత్రాలతో పాటు అవి ఏ ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లో అందుబాటులో ఉన్నాయో ఓసారి చూద్దాం. [toc] Best malayalam movies in telugu ప్రేమలు రీసెంట్‌గా వచ్చిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద ప్రభంజనం సృష్టించింది. యూనిక్ కథాంశంతో యూత్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. ముఖ్యంగా తెలుగులో ఈ సినిమా మంచి కలెక్షన్లు రాబట్టింది. ఈ చిత్రం కథంతా హైదరాబాద్ కేంద్రంగా ఉండటంతో తెలుగు ప్రేక్షకులు బాగా కనెక్ట్ అయ్యారు. ఇక సినిమా కథలోకి వెళ్తే..స‌చిన్.. ఉన్న‌త చ‌దువుల కోసం విదేశాల‌కు వెళ్లాల‌ని క‌ల‌లు కంటాడు. వీసా రిజెక్ట్ కావ‌డంతో గేట్ కోచింగ్ కోసం హైద‌రాబాద్ వ‌స్తాడు. సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగిని రీనూతో తొలి చూపులోనే ప్రేమ‌లో ప‌డ‌తాడు. అప్ప‌టికే ల‌వ్‌లో ఫెయిలైన స‌చిన్‌.. రీనూకు త‌న ప్రేమ‌ను ఎలా చెప్పాడు? రీనూను ప్రేమిస్తున్న ఆది ఎవ‌రు? స‌చిన్‌ - రీనూ చివ‌ర‌కు కలిశారా? లేదా? అన్న‌ది క‌థ‌. మంజుమ్మెల్‌ బాయ్స్‌&nbsp; ఈ చిత్రం మంచి ఎమోషనల్ బ్యాక్‌డ్రాప్‌లో సస్పెన్స్ థ్రిల్లర్ కథాంశంతో వచ్చింది. ఈ సినిమా దేశవ్యాప్తంగా అన్ని భాషల్లో మంచి వసూళ్లు సాధించింది. ఇక ఈ సినిమా కథలోకి వెళ్తే.. కేర‌ళ‌ కొచ్చికి చెందిన కుట్ట‌న్, సుభాష్ స్నేహితులతో కలిసి కొడైకెనాల్ ట్రిప్‌లో భాగంగా గుణ కేవ్స్‌కు వెళ్తారు. అక్క‌డ సుభాష్ పొరపాటున 150 అడుగులకు పైగా లోతున్న డెవిల్స్ కిచెన్ లోయ‌లో ప‌డ‌తాడు. ఆ త‌ర్వాత ఏమైంది? పోలీసులు, రెస్క్యూ సిబ్బంది వారికి ఎందుకు సహకరించలేదు? సుభాష్‌ను కాపాడి తీసుకురావ‌డానికి తోటి మిత్రులు ఏం చేశారు? అన్నది కథ. ఆవేశం ఇటీవల మలయాళంలో బ్లాక్ బాస్టర్ అయిన ఆవేశం చిత్రం అన్ని భాషల్లోనూ అదే హవా కొనసాగించింది. ఈ చిత్రం ఏకంగా రూ.150 కోట్ల కలెక్షన్లు రాబట్టింది. కామెడీ యాక్షన్ జొనర్‌లో వచ్చి మంచి ఎంటర్‌టైనింగ్ అందించింది. ఈ సినిమా కథలోకి వెళ్తే..కేరళకు చెందిన బీబీ (మిథున్ జై శంకర్), అజు (హిప్‌స్టర్), మరియు శాంతన్ (రోషన్ షానవాజ్) ముగ్గురు స్నేహితులు బెంగళూరులోని ఒక ఇంజనీరింగ్ కళాశాలలో చదువుతుంటారు. కాలేజీలో సీనియర్లు కారణం లేకుండా కొడుతుంటారు. దీంతో వారికి బుద్ధి చెప్పాలని నిర్ణయించుకుంటారు. ఈక్రమంలో గ్యాంగ్‌స్టర్ అయిన రంగాతో(ఫాహద్ ఫాసిల్) ఫ్రెండ్‌షిప్ చేస్తారు. రంగా స్నేహం వారి జీవితాలను ఏవిధంగా మార్చిందనేది కథ. ది గోట్ లైఫ్ ఈ చిత్రం విమర్శకుల ప్రశంసలు అందుకుంది. బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని సాధించింది. ఇక కథలోకి వెళ్తే.. నజీబ్ (పృథ్వీరాజ్ సుకుమారన్) తన భార్య సైను (అమలా పాల్)తో ఆనందంగా జీవిస్తుంటాడు. తన స్నేహితుడి సలహాతో దుబాయ్ వెళ్లి డబ్బు సంపాదించాలని నిర్ణయించుకుంటాడు. దుబాయి వెళ్లిన నజీబ్.. ఖలిప్ చేతిలో ఇరుక్కుంటాడు. నజీబ్‌ను బలవంతంగా గొర్రెలను కాసేలా ఓ ఎడారిలో బంధిస్తారు. ఈక్రమంలో నజీబ్ అక్కడి నుంచి తప్పించుకోవడానికి ఎలాంటి కష్టాలు పడ్డాడు? తిరిగి తన కుటుంబాన్ని చేరుకున్నాడా? లేదా? అన్నది మిగతా కథ RDX మార్షియల్ ఆర్ట్స్ నేపథ్యంలో వచ్చిన ఈ చిత్రం మలయాళంలో బ్లాక్ బాస్టర్‌ హిట్‌గా నిలిచింది.&nbsp; 2018 కేరళ వరదల నేపథ్యంలో వచ్చిన చిత్రమిది. ఎమోషనల్ డ్రామాగా తెరకెక్కిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని సాధించింది. ఈ చిత్రాన్ని ఆంథోని జోసెఫ్‌ డైరెక్ట్ చేశాడు. కింగ్ అఫ్ కొత్త ఖన్నా భాయ్ (డ్యాన్స్ రోజ్ షబీర్) కోతా పట్టణంలో డ్రగ్స్ వ్యాపారి. సిఐ షాహుల్ హాసన్ (ప్రసన్న) పట్టణంలో డ్రగ్స్ మాఫియాను నిర్మూలించాలని కంకణం కట్టుకుంటాడు. కొన్నేళ్ల క్రితం కోతా... రాజు (దుల్కర్ సల్మాన్) నియంత్రణలో ఉందని, ఒకప్పుడు ఖన్నా భాయ్ రాజుకి ప్రియమైన స్నేహితుడని షాహుల్ తెలుసుకుంటాడు. కానీ కొన్ని కారణాల వల్ల రాజు మరియు ఖన్నా భాయ్ ఇద్దరూ విడిపోయారు. వారిని వేరు చేసింది ఏమిటి? అప్పుడు సీఐ షాహుల్ హాసన్ ఏం చేశాడు? అనేది కథ రోమాంచం రోమాంచం చిత్రం మలయాళంలో వచ్చిన కామెడీ హర్రర్ చిత్రం. ఈ చిత్రాన్ని జితు మాధావన్ తెరకెక్కించారు. ఈ సినిమా నిజజీవితంలో జరిగిన సంఘటనల ఆధారంగా తెరకెక్కింది. కథలోకి వెళ్తే…. బెంగుళూరులోని ఓ ఇంట్లో ఉండే ఏడుగురు బ్యాచిలర్ స్నేహితుల కథే ఈ చిత్రం. అందులో ఒకరు ఉద్యోగం చేస్తుంటారు, మరొకరు వ్యాపారాలు చేస్తూ విఫలమవుతుంటాడు. ఇద్దరు ఇంటర్వ్యూని క్రాక్ చేస్తారు కానీ ఇంకా ఆఫర్ లెటర్ అందదు. ఒకరు పెట్రోల్ పంపులో పనిచేస్తున్నారు. మిగిలిన ఇద్దరూ ఏమీ చేయకుండా తమ జీవితాలను సాగిస్తుంటారు. ఇలా సాగుతున్న వీరి జీవితాల్లోకి ఓ అనూహ్య పరిణామం చోటు చేసుకుంటుంది. ఇంతకీ ఎంటా పరిణామం? దాని వల్ల వీరి జీవితాలు ఎలా మారాయి అనేది కథ. భ్రమయుగం తేవన్ అనే గాయకుడు అడవిలో ప్రయాణిస్తూ ఓ పాడుబడ్డ పెద్ద భవంతికి వెళ్తాడు. అక్కడ యజమాని మమ్మూటీ (కుడుమోన్ పొట్టి), ఓ వంటవాడు ఉంటాడు. అనూహ్య పరిణామాల తర్వాత తేవన్ ఆ ఇంటి నుంచి పారిపోవాలని అనుకుంటాడు. అసలు తేవన్ ఏం చూసి భయపడ్డాడు? కుడుమోన్ పొట్టి ఎవరు? అడవిలో ఏం చేస్తున్నాడు? అన్నది కథ. అన్వేషిప్పిన్ కండెతుమ్ ఈ సినిమా మంచి సస్పెన్స్‌ను క్యారీ చేస్తూ.. ఆసక్తికరంగా కథనం సాగుతుంది.&nbsp;ఎస్సై ఆనంద్ నారాయణ్ ఓ కారణం చేత సస్పెండ్ అవుతాడు. ఓ యువతి హత్య కేసు మిస్టరీగా మారుతుంది. దీంతో ట్రాక్‌ రికార్డ్ ఆధారంగా ఆనంద్‌ను రంగంలోకి దింపుతారు. ఈ కేసును హీరో ఎలా సాల్వ్‌ చేశాడు? విచారణకు వెళ్లిన ఆనంద్‌కు ప్రజలు ఎందుకు సహకరించలేదు? అన్నది స్టోరీ. మలైకోట్టై వాలిబన్ స్వాతంత్య్రం కోసం బ్రిటీష్ వారిని ఎదురించి పోరాడిన ఓ నాయ‌కుడి క‌థ‌తో ఈ మూవీ తెర‌కెక్కింది. ఈ పోరాటంలో వాలిబాన్‌ (మోహ‌న్‌లాల్)కు ఎలాంటి అడ్డంకులు ఎదురయ్యాయి? ఆ ప్రాంత ప్రజలకు అతడు హీరోగా ఎలా నిలిచాడు? అన్నది కథ. నెరు కళ్లు కనిపించని సారా మహ్మద్‌ అనే యువతిపై ఒక బడా వ్యాపారి కొడుకు అత్యాచారం చేస్తాడు. పోలీసులు అతడ్ని అరెస్టు చేసినప్పటికీ నిందితుడు తన పలుకుబడితో వెంటనే బెయిల్‌పై బయటకొస్తాడు. దీంతో సారా తల్లిదండ్రులు లాయర్‌ విజయ్‌ మోహన్‌ (మోహన్‌లాల్‌)ని ఆశ్రయిస్తారు. అతడు సారాకు ఎలా న్యాయం చేశాడు? అన్నది కథ. మాలికాపురం ఎనిమిదేళ్ల చిన్నారి షన్ను అయ్యప్ప స్వామి భక్తురాలు. షన్ను కుటుంబంలో ఊహించని పరిణామాలు చోటుచేసుకుంటాయి. దీంతో సోదరుడు బుజ్జితో కలిసి షన్ను శబరిమలై బయలుదేరుతుంది. ఆ తర్వాత ఏం జరిగింది? పిల్లలు కిడ్నాప్‌ చేసే గ్యాంగ్‌ షన్నును ఎలా ఇబ్బంది పెట్టింది? కథలో ఉన్ని ముకుందన్ పాత్ర ఏంటి? అన్నది కథ. Best&nbsp; Tamil movies in telugu డియర్ అర్జున్‌ (జీవి ప్రకాష్‌) న్యూస్‌ రీడర్‌గా గొప్ప పేరు తెచ్చుకునేందుకు యత్నిస్తుంటాడు. అయితే నిద్రలో చిన్న శబ్దం వచ్చినా ఉలిక్కిపడి లేస్తుంటాడు. అటువంటి అర్జున్‌ లైఫ్‌లోకి భార్యగా దీపిక వస్తుంది. ఆమెకున్న గురక సమస్య.. అర్జున్‌కు ఎలాంటి ఇబ్బందులు తెచ్చిపెట్టింది? అన్నది కథ. ఓటీటీ: నెట్‌ఫ్లిక్స్ సైరన్ ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద రాణించనప్పటికీ.. విమర్శకుల ప్రశంసలు అందుకుంది. ఇక సినిమా కథలోకి వెళ్తే..భార్యను (అనుప‌మ)ను చంపిన కేసులో తిల‌గ‌న్‌ (జ‌యం ర‌వి) జైలుకు వెళ్తాడు. పెరోల్‌పై బయటకొచ్చిన తిలగన్‌.. వరుసగా పొలిటిషియన్స్‌ను హత్య చేస్తుంటాడు. పోలీస్ ఆఫీస‌ర్‌ నందిని (కీర్తిసురేష్‌) అతడ్ని పట్టుకునేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తుంటుంది. అసలు తిలగన్ ఎందుకు ఆ హత్యలు చేస్తున్నాడు? తన భార్యను తిలగన్ నిజంగానే చంపాడా? లేదా? అన్నది కథ. ఓటీటీ: హాట్‌ స్టార్ లియో హిమాచల్ ప్రదేశ్‌లోని ఓ చిన్న పట్టణంలో పార్తీబన్ (విజయ్) కాఫీ షాప్ నడుపుతుంటాడు. భార్య సత్య (త్రిష), ఇద్దరు పిల్లలతో అతడి జీవితం సంతోషంగా సాగుతుంటుంది. ఈ క్రమంలోనే ఊరి ప్రజల నుంచి హైనాను, హైనా నుంచి ఊరి ప్రజలను పార్తీబన్ కాపాడటంతో అతడి ఫోటోలు పేపర్లలో వస్తాయి. ఇదే సమయంలో ఏపీలోని ఆంటోనీ దాస్ (సంజయ్ దత్) &amp; గ్యాంగ్ హిమాచల్ ప్రదేశ్ వస్తారు. లియో దాస్‌గా ఉన్న పార్తీబన్‌ కోసం వెంటాడుతారు. ఇంతకీ లియో దాస్ ఎవరు? అతని గతం ఏమిటి? అనేది మిగిలిన కథ. ఓటీటీ:&nbsp; నెట్‌ఫ్లిక్స్ జైలర్ ఈ చిత్రం సరైన హిట్‌లేక సతమతమవుతున్న రజినీకాంత్‌కు సాలిడ్ విజయాన్ని అందించింది. బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురిపించింది. చాలా రోజుల తర్వాత వింటేజ్ రజనీకాంత్ ఈ సినిమాలో కనిపిస్తాడు. ముత్తు వేలు(రజనీకాంత్) నీతి నిజాయితి కలిగిన ఓ రిటైర్డ్ పోలీస్ అధికారి. అతని కొడుకు ఏసీపీ అర్జున్‌ తండ్రిలాగే నీతి నిజాయితి కలిగిన పోలీస్‌ ఆఫీసర్‌గా పేరు తెచ్చుకుంటాడు. ఈక్రమంలో విగ్రహాల దొంగతనం ముఠా నాయకుడు వర్మ(వినాయకన్) వల్ల అర్జున్‌ చనిపోతాడు. ఆ తర్వాత ముత్తు వేలు ఏం చేశాడు? వర్మపై ఏవిధంగా ప్రతికారం తీర్చుకున్నాడు అనేది మిగిలిన కథ. ఓటీటీ; హాట్ స్టార్ విక్రమ్ ఈ సినిమా మరోసారి వింటేజ్ కమల్ హాసన్‌ను గుర్తు తెచ్చింది. ప్రతి ఫ్రేమ్‌లోనూ కమల్ హాసన్ తన యాక్టింగ్‌తో అదరగొట్టాడు. బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా భారీ విజయం సాధించింది. ఇక కథలోకి వెల్తే.. డ్రగ్ మాఫియా కేసును విచారిస్తున్న ఏజెంట్ విక్రమ్ సస్పెండ్ అయిన తర్వాత అండర్‌ గ్రౌండ్‌కు వెళ్తాడు. ఈ క్రమంలో డ్రగ్ మాఫియా డాన్ సంతానం మిస్‌ అయిన ఓ భారీ డ్రగ్ కంటైనర్‌ కోసం వెతుకుతుంటాడు. అండర్‌గ్రౌండ్‌లో ఉన్న విక్రమ్ తన కొడుకు చావుకు కారణమైన వ్యక్తిని చంపుతాడు. అసలు విక్రమ్ కొడుకును చంపిందెవరు? డ్రగ్ కంటైనర్‌ను దక్కించుకునేందుకు సంతానం ఎలాంటి క్రూరత్వాన్ని ప్రదర్శించాడు? విక్రమ్, సంతానం మధ్య వైరం ఎందుకొచ్చింది అన్నది మిగతా కథ. ఓటీటీ; హాట్ స్టార్, జీ5 కాల్వన్ ఓ అడవిలో రాత్రి వేళ హత్యలు జరుగుతుంటాయి. కెంబన్‌ ఆ అడవి సమీపంలో అనాథలా జీవిస్తూ రాత్రి సమయాల్లో దొంగతనాలు చేస్తుంటాడు. హీరోయిన్‌ అతడి జీవితంలోకి రావడం.. కెంబన్‌ గురించి ఓ నిజం తెలుసుకోవడంతో కథ మలుపు తిరుగుతుంది. ఆ తర్వాత ఏమైంది? అన్నది కథ. ఓటీటీ: హాట్‌స్టార్ అయాలన్ భవిష్యత్‌లో ఇంధన అవసరం చాలా ఉందని గ్రహించిన ఆర్యన్‌ (శరద్‌ ఖేల్కర్‌) భూమిని చాలా లోతుకు తవ్వాలని అనుకుంటాడు. దీంతో భూమిపై ఉన్న జీవరాశులకు ముప్పు ఉందని గ్రహించిన ఓ ఏలియన్‌ భారత్‌లో ల్యాండ్‌ అవుతుంది. అలా వచ్చిన ఏలియన్‌కు ఎలాంటి పరిస్థితులు ఎదురయ్యాయి? హీరో శివకార్తికేయన్‌కు ఏలియన్‌కు మధ్య సంబంధం ఏంటి? అన్నది కథ. ఓటీటీ: సన్ నెక్ట్స్ మెర్రీ క్రిస్మస్ ఆల్బర్ట్‌ (విజయ్‌ సేతుపతి) ఏడేళ్ల తర్వాత బాంబేకు వస్తాడు. ఓ సినిమాకు వెళ్లగా అక్కడ కూతురుతో వచ్చిన మరియా (కత్రినా కైఫ్‌)తో పరిచయం ఏర్పడుతుంది. ఆమె క్రిస్మస్‌ వేడుకలకు ఇంటికి ఆహ్వానిస్తుంది. అయితే ఇంట్లో మరియా భర్త హత్యకు గురై కనిపిస్తాడు. ఆ హత్య చేసింది ఎవరు? ఆల్బర్ట్‌ గతం ఏంటి? అన్నది స్టోరీ. ఓటీటీ: నెట్‌ఫ్లిక్స్ అన్నపూర్ణి: ది గాడెస్ ఆఫ్ ఫుడ్ ఈ చిత్రం కాస్త వివాదాస్పదం అయింది. తమిళంలో హిట్ అయినప్పటికీ.. మిగతా భాషల్లో పెద్దగా ఆడలేదు. ఇక సినిమా కథలోకి వెళ్తే.. తమిళనాడులోని శ్రీరంగం ఆలయంలో రంగరాజ్ చెఫ్. ఆయన కూతురు అన్నపూరణి తండ్రిని చూసి చెఫ్ కావాలని అనుకుంటుంది. బ్రాహ్మణ కుటుంబంలో పుట్టిన ఈమె నాన్ వెజ్ ముట్టుకోవడం పాపం అని తండ్రి అంటాడు. మరి కలలు కన్నట్లు అన్నపూరణి చెఫ్ అయిందా? లేదా? అన్నది కథ. జపాన్ ఈ చిత్రం కార్తీ&nbsp; నటించిన 25వ చిత్రం. ఈ సినిమాలో పేరుమోసిన దొంగ పాత్రలో కార్తీ అద్భుతంగా నటించాడు. అతని పాత్ర హెలెరియస్‌గా ఉంటుంది. హైదరాబాద్‌లోని రాయల్ జ్యువెలరీలో రూ.200 కోట్ల విలువలైన నగలు దోపిడికి గురవుతాయి. గోల్డెన్ స్టార్ జపాన్ (కార్తీ) ఈ దొంగతనం చేశాడని అంతా అనుమానిస్తారు. జపాన్‌ను పట్టుకునేందుకు హైదరాబాద్ పోలీసులు వెతుకుతుంటారు. మరోవైపు కేరళ, కర్ణాటక పోలీసులు కూడా జపాన్‌ కోసం గాలిస్తుంటారు. తన ప్రేయసిని కలిసే ప్రయత్నంలో జపాన్ దొరికిపోతాడు. అయితే ఆ సొత్తు జపాన్ దొంగలించలేదని విచారణలో తేలుతుంది. మరి ఆ నగల దొంగతనం చేసింది ఎవరు? ఓటీటీ: నెట్‌ఫ్లిక్స్ కెప్టెన్ మిల్లర్ కథ 1930 బ్యాక్‌డ్రాప్‌లో సాగుతుంది. ఈసా (ధ‌నుష్‌) నిమ్న‌ కులానికి చెందిన యువ‌కుడు. ఊరిలోని కుల‌ వివ‌క్ష‌ను భ‌రించ‌లేక గౌర‌వ మ‌ర్యాద‌ల కోసం బ్రిటీష్ ఆర్మీలో చేరతాడు. తన పేరును కెప్టెన్ మిల్ల‌ర్‌గా మార్చుకుంటాడు. కొన్ని అనూహ్య ఘటనల నేపథ్యంలో మిల్లర్‌ దొంగల గ్యాంగ్‌లో చేరి బ్రిటిష్‌ వారికి కావాల్సిన బాక్స్‌ను ఎత్తుకెళ్తాడు. దీంతో బ్రిటిష్ ఆర్మీ అధికారి మిల్లర్‌ను పట్టుకోవడం కోసం అతడి ఊరి ప్రజల్ని బందిస్తాడు. ఆ తర్వాత ఏం జరిగింది? మిల్లర్‌ ఊరి ప్రజల కోసం తిరిగి వచ్చాడా? మిల్లర్ కొట్టేసిన బాక్స్‌లో ఏముంది? సినిమాలో శివరాజ్‌కుమార్‌, సందీప్‌ కిషన్‌ పాత్రలు ఏంటి? అన్నది కథ. ఓటీటీ: ప్రైమ్ వీడియో చిన్నా మున్సిపాలిటీలో చిన్న ఉద్యోగం చేసుకునే చిన్నా ( సిద్ధార్థ్) తన అన్న చనిపోవడంతో... అతని కూతురు చిట్టి (సహస్ర శ్రీ) బాధ్యతలు తీసుకుంటాడు. ఈ క్రమంలో చిట్టి స్నేహితురాలేన మున్ని(సబియా) లైంగిక దాడికి గురవుతుంది. లైంగిక దాడి చేసింది చిన్నానే అని ఓ వీడియో బయటకు వస్తుంది. ఇంతలో చిట్టి కనిపించకుండా పోతుంది. నిజంగా మున్నిపై లైంగిక దాడి చేసింది చిన్నానేనా? అదృశ్యమైన చిట్టిని చిన్నా ఎలా కనిపెడుతాడు? అనేది మిగతా కథ 800 ఈ చిత్రంలో తొలుత విజయ్ సేతుపతి నటించినప్పటికీ.. తమిళనాడు నుంచి పెద్దఎత్తున ఆందోళనలు రావడంతో ఆయన ఈ సినిమా నుంచి తప్పుకున్నారు. ఇక కథలోకి వెళ్తే.. తేయాకు తోట‌ల్లో ప‌నిచేస్తున్న త‌మిళ కుటుంబంలో ముత్తయ్య ముర‌ళీధ‌ర‌న్‌ జన్మిస్తారు. శ్రీలంక‌లోని కాండీలో ఆ కుటుంబం బిస్కెట్ ఫ్యాక్ట‌రీ ఏర్పాటు చేస్తుంది. ఈ క్రమంలోనే సింహ‌ళులు, త‌మిళుల మ‌ధ్య ఘ‌ర్ష‌ణ‌లు చెల‌రేగుతాయి. దాంతో ముత్తయ్య కుటుంబం ప్రాణ భయంతో దూరంగా వెళ్లి త‌ల‌దాచుకుంటుంది. 70వ దశకంలో చెలరేగిన ఘ‌ర్ష‌ణ‌ల ప్రభావం త‌న బిడ్డపై ప‌డ‌కూడ‌ద‌ని ముత్తయ్య త‌ల్లిదండ్రులు ఏం చేశారు? ముత్తయ్యకి క్రికెట్‌పై ఆస‌క్తి ఎలా ఏర్పడింది? శ్రీలంక జ‌ట్టులో ఎలా చోటు సంపాదించాడు? ఎలాంటి అవ‌మానాల్ని, స‌వాళ్లని ఎదుర్కొని ఆట‌గాడిగా నిలబడ్డాడు? అనేది మిగతా కథ. ఓటీటీ: ప్రైమ్ వీడియో మార్క్ ఆంటోనీ మార్క్ (విశాల్) మెకానిక్‌గా పనిచేస్తుంటాడు. అతని స్నేహితుడు చిరంజీవి( సెల్వ రాఘవన్) ఒక టెలిఫోన్‌ మిషన్‌ను కనుగొంటాడు. ఆ టెలిఫొన్ మెషిన్ ద్వారా భూతకాలానికి చెందిన వ్యక్తులతో మాట్లాడవచ్చు. అయితే మార్క్ చనిపోయిన తన తండ్రి ఆంటోనికి కాల్ చేయాలనుకుంటాడు. ఆ క్రమంలో మార్క్ తన తండ్రిని కొంతమంది చంపాలనుకుంటున్నారన్న విషయం తెలుసుకుంటాడు. ఓటీటీ: ప్రైమ్ నాయకుడు అణగారిన వర్గానికి చెందిన మహారాజు రామాపురం ఎమ్మెల్యే. అయితే, అతడు, అతని కుమారుడు రఘు వీరకు కొన్నేళ్ల నుంచి మాట్లాడుకోవడం మానేశారు. మహారాజు జీవితంలో జరిగిన ఒక సంఘటన తండ్రి కోసం పోరాడేందుకు రఘుని ప్రేరేపిస్తుంది. ఇంతకు ఆ సమస్య ఏమిటి? వారు ఒకరితో ఒకరు మాట్లాడుకోవడం ఎందుకు మానేశారు?చివరికి ఏమి జరిగింది అనేది మిగిలిన కథ ఓటీటీ: నెట్‌ఫ్లిక్స్ సార్ బాలగంగాధర్ (ధనుష్ ) ఒక జూనియర్ మ్యాథ్స్ లెక్చరర్. సిరిపురం అనే గ్రామంలోని జూనియర్ కళాశాలకు మ్యాథ్స్ చెప్పడానికి వెళ్తాడు. అక్కడ ఉన్న స్టూడెంట్స్ అందరూ పాస్ అయ్యేలా చదువు చెబితే.. సీనియర్ మ్యాథ్స్ లెక్చరర్‌గా ప్రమోషన్ ఇస్తానని కాలేజీ యాజమాన్యం చెబుతుంది. అయితే, అక్కడ పరిస్థితులు బాలుకి అనుకూలంగా ఉండవు. అయినా, తన మాటలతో, చేతలతో ఆ సిరిపురం స్టూడెంట్స్‌ను ప్రభావితం చేస్తాడు. అనంతరం జరిగిన కొన్ని నాటకీయ పరిణామాల వల్ల బాలు జీవితంలో కొన్ని మార్పులు జరుగుతాయి. ఆ మార్పులు ఏమిటి అనేది మిగతా కథ ఓటీటీ: నెట్‌ఫ్లిక్స్ Best Kannada movies in telugu కబ్జ ఆర్కేశ్వర (ఉపేంద్ర), భారత వైమానిక దళ అధికారి, స్వాతంత్ర్య సమరయోధుల కుటుంబంలో జన్మించాడు. అతను సంపన్నమైన అమ్మాయి అయిన మధుమతి (శ్రియా శరణ్)ను ప్రేమిస్తాడు. వీరిద్దరు పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకుంటారు. ఇదేక్రమంలో అమరాపురను తమ&nbsp; అధికారం కోసం భయంకరమైన గూండాలు మరియు రాజకీయ నాయకులు ఓ క్రైమ్ వరల్డ్‌గా&nbsp; మార్చేస్తారు. అయితే అర్కేశ్వర క్రైమ్ ప్రపంచంలోకి ప్రవేశించి ఆ ప్రాంతానికి నాయకుడు ఎలా అవుతాడు? ఈ క్రమంలో అతను ఎదుర్కొన్న సవాళ్లు ఏంటి అనేది మిగతా కథ. సప్తసాగరాలు దాటి సైడ్ బి మను (రక్షిత్ శెట్టి) జైలు నుంచి వచ్చాక ఓ ఉద్యోగంలో చేరతాడు. తాను ప్రేమించిన ప్రియ (రుక్మిణి వసంత్) జ్ఞాపకాలే గుర్తుకు వస్తుండటంతో తనని వెతుకుతాడు. ప్రియ భర్త గోపాల్ దేశపాండే వ్యాపారంలో నష్టాలు రావడంతో తాగుడికి బానిసైపోయి ఇంటిని పట్టించుకోడు. దీంతో ప్రియ కష్టపడుతూ ఇంటిని నడుపుతుంది. తాను ప్రేమించిన అమ్మాయి సంతోషంగా లేదని తెలిసిన మను ఆమెని సంతోషంగా ఉంచడానికి ఏం చేశాడు ? వాళ్ళ కష్టాలు ఎలా తీర్చాడు? అన్నది మిగతా కథ. ఓటీటీ; ప్రైమ్ వీడియో ఘోస్ట్ బిగ్ డాడీ అలియాస్ ఘోస్ట్ తన గ్యాంగ్‌తో కలిగి ఓ జైలును ఆక్రమిస్తాడు. మాజీ సీబీఐ అధికారి వామన్ శ్రీనివాస్ కిడ్నాప్ చేస్తాడు. దీంతో ఈ కేసును సాల్వ్ చేయడానికి ప్రభుత్వం చరణ్ రాజ్‌ని రంగంలోకి దించుతుంది. ఇంతకీ ఈ బిగ్ డాడీ ఎవరు ? అతని గతం ఏమిటి ? అసలు అతను ఘోస్ట్‌గా ఎందుకు మారాడు ? అన్నది మిగతా కథ. ఓటీటీ: జీ5 బాయ్స్ హాస్టల్ ఓ బాయ్స్ హాస్టల్‌లో తన ఫ్రెండ్స్‌తో కలిసి ఉండే అజిత్ (ప్రజ్వల్) ఓ షార్ట్ ఫిల్మ్ తీయాలని స్క్రిప్ట్ ప్రిపేర్ చేసుకుంటూ ఉంటాడు. తమని టార్చర్ చేసే హాస్టల్ వార్డెన్‌ను తన ఫ్రెండ్స్‌తో కలిసి చంపేసినట్లుగా స్క్రిప్ట్‌లో రాసుకుంటాడు. అయితే నిజంగానే వార్డెన్‌ చనిపోతాడు. సుసైడ్‌ నోట్‌లో అజిత్‌, ‌అతడి ఫ్రెండ్స్ పేరు రాయడంతో కథ మలుపు తిరుగుతుంది. ఓటీటీ: ఈటీవీ విన్ కాటేరా ఈ సినిమా కన్నడ నాట బాక్సాఫీస్ వద్ద మంచి విజయం సాధించింది. ఈ చిత్రం విమర్శకుల ప్రశంసలు అందుకుంది. ఇక కథలోకి వెళ్తే.. భూస్వామిని చంపిన కేసులో జైలు శిక్ష‌ అనుభ‌విస్తున్న‌ కాటేరా (ద‌ర్శ‌న్‌) పెరోల్ మీద బ‌య‌ట‌కు వ‌స్తాడు. దీంతో కాటేరాను చంపేందుకు చాలా మంది ప్ర‌య‌త్నిస్తుంటారు. వారంద‌రూ ఎవ‌రు? కాటేరా భూస్వామిని ఎందుకు చంపాడు? భూస్వాములతో కాటేరాకు ఏంటి విరోధం? అన్నది కథ. ఓటీటీ: జీ5 టోబి టోబి చిన్నప్పటి నుంచి ఎన్నో వేధింపులకు గురవుతాడు. కోపం వస్తే అందరితో దారుణంగా ప్రవరిస్తుంటాడు. నిజానికి అమాయకుడైన టోనీని ఊరిపెద్ద ఆనంద హత్యలు చేసేందుకు ఉపయోగించుకుంటాడు. తనను వాడుకుంటున్నారని తెలుసుకున్న టోబి ఏం చేశాడు? ఎలా ప్రతీకారం తీర్చుకున్నాడు? అన్నది కథ. ఓటీటీ: సోనీ లీవ్ Best Hindi movies in telugu అమర్ సింగ్ చమ్కిలా జానపద గాయకుడు అమర్ సింగ్ చమ్కిలా జీవిత కథ ఆధారంగా ఈ సినిమా తెరకెక్కింది. పేద కుటుంబంలో జన్మించిన ఆయన&nbsp; సింగర్‌ కావడాని కసితో ఎలా ఎదిగాడు? 27 ఎళ్లతో ఎంతో ఫేమస్ అయిన అతన్ని ఎవరు చంపారు అన్నది మిగతా కథ. ఓటీటీ: నెట్‌ఫ్లిక్స్ యానిమల్‌ ఈ చిత్రం సంచలన విజయం సాధించింది. సినిమాలో సన్నివేశాలపై అభ్యంతరాలు వ్యక్తమైనప్పటికీ వాటన్నింటినీ పటాపంచలు చేస్తూ ఘన విజయం సాధించింది. ఈ చిత్రం విజయంతో రణ్‌బీర్ కపూర్ మార్కెట్ దేశవ్యాప్తంగా పెరిగింది. దేశంలోని అత్యంత సంపన్నుల్లో బల్బీర్ సింగ్ (అనిల్ కపూర్) ఒకరు. ఆయన కుమారుడు రణ్ విజయ్ సింగ్ (రణబీర్ కపూర్). తండ్రి అంటే అమితమైన ప్రేమ. అయితే తన దూకుడు మనస్తత్వం కారణంగా హీరోకి తండ్రితో దూరం పెరుగుతుంది. దీంతో అమెరికా వెళ్లిపోతాడు. ఓ రోజు తండ్రిపై హత్యయాత్నం జరిగినట్లు తెలిసుకొని విజయ్‌ ఇండియాకు వస్తాడు. ఆ తర్వాత ఏం జరిగింది? బల్బీర్‌పై దాడి చేసిన వారిపై హీరో ఎలా ప్రతికారం తీర్చుకున్నాడు? అన్నది కథ. ఓటీటీ: నెట్‌ఫ్లిక్స్ మైదాన్ 1952లో జరిగిన ఒలింపిక్స్‌ పోటీల్లో భారత ఫుట్‌బాల్‌ జట్టు.. విఫలమవుతుంది. దీంతో జట్టును టార్గెట్‌ చేస్తూ విమర్శలు వస్తాయి. అప్పుడు కోచ్‌ సయ్యద్ అబ్దుల్‌ రహీమ్‌ (అజయ్‌ దేవగన్‌) ఏం చేశాడు? కొత్త ఆటగాళ్లతో తన ప్రయాణాన్ని ఎలా మెుదలుపెట్టాడు? ఒలింపిక్స్‌లో ఆ జట్టు ఎలాంటి ప్రదర్శన చేసింది? భారత జట్టు కోచ్‌గా అతడు ఏం సాధించాడు? అన్నది కథ. ఓటీటీ: నెట్‌ఫ్లిక్స్ లస్ట్ స్టోరీస్ 2 లస్ట్ స్టోరీస్ 2లో మొత్తం నాలుగు కథలు ఉంటాయి. మొదటి కథలో మృణాల్, అంగన్ బేడీ పెళ్లి చేసుకోవాలనుకుంటారు. పెద్దలు కూడా ఒప్పుకుంటారు. అయితే మృణాల్ నానమ్మ.. పెళ్లికి ప్రేమ కంటే బలమైన శారీరక సంబంధం ముఖ్యమని స్పష్టం చేస్తుంది. ఆ తర్వాత మృణాల్- బేడీ ఎం చేశారన్నది ఫస్ట్ కథ. రెండో కథలో ఓనర్ లేనప్పుడు పనిమనిషి తన భర్తను తెచ్చుకుని లైంగికానందం పొందుతుంది. అయితే వీరిద్దరిని చూసిన ఓనర్ ఏం చేసింది అనేది రెండో కథ. ఇక మూడో కథలో ఎక్స్ బాయ్ ఫ్రెండ్ అయిన విజయ్ వర్మ కొన్నేళ్ల తర్వాత తమన్నను కలుస్తాడు. వీరిద్దరు శారీరకంగా దగ్గరైన తర్వాత ఏం జరిగింది అనేది కథ. నాల్గొ కథలో కామంతో రగిలిపోతున్న తన భర్త విషయంలో కాజల్ ఏమి చేసింది అనేది కథ.. ఈ చిత్రంపై పెద్ద ఎత్తున విమర్శలు వచ్చినప్పటికీ ప్రేక్షకుల నుంచి మంచి ఆదరణ లభించిందని చెప్పవచ్చు. ఓటీటీ: నెట్‌ఫ్లిక్స్ మర్డర్ ముబారక్ రాయల్‌ ఢిల్లీ క్లబ్‌లో ఓ మృతదేహం కలకలం సృష్టిస్తుంది. ఈ మిస్టరీని ఛేదించేందుకు ఏసీపీ సింగ్‌ రంగంలోకి దిగుతాడు. క్లబ్‌లో సభ్యులుగా ఉన్న బాంబి (సారా అలీఖాన్‌), నటి షెహనాజ్‌ నూరాని (కరిష్మా కపూర్‌), రాయల్‌ రన్‌విజయ్‌ (సంజయ్‌ కపూర్‌), లాయర్‌ ఆకాష్‌ (విజయ్‌ వర్మ)లపై అనుమానం వ్యక్తం చేస్తాడు. ఇంతకీ ఆ మర్డర్‌ చేసింది ఎవరు? దర్యాప్తులో తేలిన అంశాలేంటి? అన్నది కథ. ఓటీటీ: నెట్‌ఫ్లిక్స్ భక్షక్ జర్నలిస్టు వైశాలి.. యూట్యూబ్ ఛానెల్ ద్వారా స్థానిక వార్తలు అందిస్తుంటుంది. ఊరిలోని అనాథ బాలికల వసతి గృహంలో లైంగిక దాడులు జరుగుతున్నట్లు ఆమెకు తెలుస్తుంది. అయితే దానిని రాజకీయంగా పలుకుబడి ఉన్న వ్యక్తి నిర్వహిస్తుంటాడు. అతడి దారుణాలను వైశాలి ఎలా బయటపెట్టింది? ఈ క్రమంలో ఎదురైన సవాళ్లు ఏంటి? అన్నది కథ. ఓటీటీ: నెట్‌ఫ్లిక్స్ గంగూభాయి కతియావాడి ఈ చిత్రం అలియా భట్‌ నటనకు జాతీయ స్థాయిలో గుర్తింపు తీసుకొచ్చింది. జాతీయ స్థాయిలో ఉత్తమ నటిగా ఎంపికైంది. ఇక ఈ సినిమా కథలోకి వెళ్తే.. గంగూబాయి హర్జీవందాస్‌ (అలియా భట్‌) గుజరాత్‌లోని&nbsp; ఓ పెద్ద కుటుంబంలో పుడుతుంది.&nbsp; ఆమెకు చిన్నప్పటి నుంచి సినిమాలంటే ఇష్టం. ఆ ఇష్టాన్ని ఆసరా చేసుకున్న గంగుభాయ్ లవర్ ఆమెను ముంబై తీసుకొచ్చి అక్కడ వేశ్య గృహానికి అమ్మేస్తాడు. తప్పని పరిస్థితుల్లో ఆమె వేశ్యగా కొనసాగుతుంది. కొన్ని నాటకీయ పరిణామాల తర్వాత.. గంగూబాయి ఓ కీలక నిర్ణయం తీసుకుంటుంది. ఆ నిర్ణయం ఏమిటి? వేశ్యల అభ్యున్నతి ఆమె ఏం చేసింది అనేది మిగతా కథ. ఓటీటీ; నెట్‌ఫ్లిక్స్ 83 1983 నాటి క్రికెట్ ప్రపంచకప్‌ను ఇండియా గెలుచుకున్న నేపథ్యాన్ని ఈ చిత్రం ఆవిష్కరిస్తుంది. ఆ క్రమంలో ఆటగాళ్లు ఎదురుకున్న సమస్యలు, ప్రత్యర్థుల నుంచి వచ్చిన సవాళ్ళను ఎలా అధిగమించారు ? ఎలా కప్ గెలిచారు ? అనేది మిగతా కథ ఓటీటీ; డిస్నీ హాట్ స్టార్ జవాన్ సరిహద్దుల్లో తీవ్ర గాయాలతో పడిపోయిన ఓ వ్యక్తిని తల్లి కొడుకులు రక్షిస్తారు. అతను కోమాలోకి వెళ్లగా గ్రామానికి తీసుకెళ్లి వైద్యం చేయిస్తారు. ఇదే సమయంలో ఆ ఊరిపై కొందరు పదునైన ఆయుధాలతో దాడి చేస్తారు. కోమాలో నుంచి బయటకు వచ్చిన ఆ వ్యక్తి వారిని తరిమికొడతాడు. దీంతో ఆ గ్రామ ప్రజలు అతన్ని దేవుడిలా పూజిస్తారు. అప్పుడు ఆ వ్యక్తి తాను ఎవర్ని అని వారిని ప్రశ్నిస్తాడు. దీనికి జవాబు తాను పెద్దయ్యేలోపు కనుగొంటానని కాపాడిన పిల్లోడు ప్రామిస్ చేస్తాడు. ఇంతకు ఆ వ్యక్తి ఎవరు? పిల్లాడితో అతనికి ఉన్న సంబంధం ఏమిటి అన్నది మిగతా కథ. ఓటీటీ: నెట్‌ఫ్లిక్స్ గదర్ 2 బాలీవుడ్‌లో చిత్రాలు వరుసగా ప్లాఫ్ అవుతున్న క్రమంలో వచ్చిన ఈ సినిమా విజయం ఇండస్ట్రీకి ఊపిరి పోసింది. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి విజయం సాధించింది. ఇక కథలోకి వెళ్తే.. తారా సింగ్ (సన్నీ డియోల్) భారత సరిహద్దుల్లో కనిపించకుండా పోతాడు. పాక్‌ అతడ్ని బంధించిందని భావించిన అతడి కొడుకు.. మారువేషంలో శత్రు దేశానికి వెళ్తాడు. అనూహ్యాంగా ఇంటికి తిరిగొచ్చిన తారా సింగ్‌.. కొడుకు పాక్‌లో ఉన్న సంగతి తెలుసుకుంటాడు. బిడ్డను కాపాడేందుకు పాక్‌ వెళ్తాడు. అక్కడ ఎలాంటి సవాళ్లు ఎదురయ్యాయి? అన్నది స్టోరీ. ఓటీటీ: ప్రైమ్ వీడియో
    మే 20 , 2024
    Line Man Review: హీరో దెబ్బకు ఆ గ్రామంలో కరెంటు కష్టాలు.. సినిమా ఎలా ఉందంటే?
    Line Man Review: హీరో దెబ్బకు ఆ గ్రామంలో కరెంటు కష్టాలు.. సినిమా ఎలా ఉందంటే?
    నటీనటులు : త్రిగుణ్‌, కాజల్ కుందెర్, జయశ్రీ, హరిణీ శ్రీకాంత్‌ తదితరులు.. డైరెక్టర్‌ : వి. రఘు శాస్త్రి సంగీతం: మణికాంత్‌ ఖాద్రి సినిమాటోగ్రాఫర్‌ : శాంతి సాగర్‌ హెచ్‌.జీ నిర్మాత : గణేష్‌ పాపన్న విడుదల తేదీ: 22-03-2024 యంగ్‌ హీరో త్రిగుణ్ (Trigun), కాజల్ కుందెర్ (Kaajal Kunder) జంటగా రఘు శాస్త్రి (Raghu Shastry) దర్శకత్వంలో తెరకెక్కిన తాజా చిత్రం ‘లైన్ మ్యాన్’ (Line Man Review In Telugu). పర్పల్ రాక్ ఎంటర్‌టైనర్స్ బ్యానర్‌పై ఈ సినిమాని తెరకెక్కించారు. కేరళలో జరిగిన ఓ యదార్థ ఘటన ఆధారంగా ఈ సినిమాని తెరకెక్కించినట్లు చిత్ర యూనిట్‌ తెలిపింది. ఇవాళ తెలుగు, కన్నడ భాషల్లో ఒకేసారి విడుదలైన ఈ చిత్రం ఎలా ఉంది? ప్రేక్షకులను మెప్పించిందా? లేదా? ఈ రివ్యూలో పరిశీలిద్దాం.&nbsp; కథేంటి నటరాజ్‌ అలియాస్‌ నట్టు (త్రిగుణ్‌) తండ్రి విద్యుత్‌శాఖలో లైన్‌మ్యాన్‌గా పనిచేసేవాడు. ఆయన అకస్మిక మరణంతో ఆ జాబ్‌ నట్టుకు వస్తుంది. దీంతో ఊర్లో కరెంట్‌ రావాలన్న, పోవాలన్న అంతా నట్టు చేతుల్లోకి వెళ్లిపోతుంది. ఈ క్రమంలో గ్రామంలో అందరికి పురుళ్లు పోసే దేవుడమ్మ (బి. జయశ్రీ) 100వ పుట్టిన రోజు ఘనంగా చేద్దామని నట్టు గ్రామస్తులకు సలహా ఇస్తాడు. ఇందుకు గ్రామస్తులు ఓకే చెప్పి ఏర్పాట్లు కూడా మెుదలుపెడతారు. అయితే సడెన్‌గా నట్టు కరెంటు ఇవ్వను అని చెప్పడంతో అంతా ఆశ్చర్యపోతారు. నట్టు ఎందుకు అలా అన్నాడు? దేవుడమ్మ రియాక్షన్‌ ఏంటి? కొన్ని రోజుల పాటు కరెంట్ ఆపేయడానికి కారణం ఏంటి? మళ్ళీ ఆ ఊరికి నట్టు కరెంట్ ఇచ్చాడా? లేదా? అన్నది తెలియాలంటే తెరపై చూడాల్సిందే. ఎవరెలా చేశారంటే హీరో త్రిగుణ్‌.. లైన్‌ మ్యాన్‌ (Line Man Review In Telugu) పాత్రలో చక్కగా ఒదిగిపోయాడు. పల్లెటూరు వ్యక్తిగా నేచురల్‌ లుక్‌లో కనిపించి ఆకట్టుకున్నాడు. చక్కగా హావాభావాలను పలికించి మెప్పించాడు. అటు హీరోయిన్ కాజల్‌ కుందెర్‌.. దేవుడమ్మ మనవరాలి పాత్రలో పర్వాలేదనిపించింది. ఆమె పాత్రకు పెద్దగా ప్రాధాన్యత లేదు. ఇక 99 ఏళ్ల దేవుడమ్మ పాత్రలో బి. జయశ్రీ అద్భుతంగా నటించారు. ఆమె పాత్రనే సినిమాకు కీలకం. నివిక్ష నాయుడు, హరిణి శ్రీకాంత్‌ సహా మిగిత పాత్రధారులు తమ పరిధి మేరకు నటించి ఓకే అనిపించారు. డైరెక్షన్ ఎలా ఉందంటే డైరెక్టర్‌ రఘు శాస్త్రి ఈ సినిమా కోసం ఆసక్తికర కథను ఎంచుకున్నారు. గంట సేపు కరెంటు పోతేనే తట్టుకోలేని ఈ రోజుల్లో కొన్ని రోజుల పాటు విద్యుత్ పోతే ఆ ఊరి పరిస్థితి ఏంటి అన్న కాన్సెప్ట్‌తో ఈ సినిమాను తెరకెక్కించారు. పల్లెటూరులో ఉండే మనుషులు, వారి మనస్తత్వాలను డైరెక్టర్‌ కళ్లకు కట్టారు. కరెంటు లేకుండా రాత్రి పూట పల్లెల్లో ఎలా ఉండేవారో చూపించారు. కరెంటు లేకపోయినా గ్రామస్తులు ఉండటానికి సిద్ధపడ్డారంటే అందుకు బలమైన కారణమే చూపాలి. ఆ పాయింట్‌ను డైరెక్టర్‌ ఎమోషనల్‌గా చెప్పిన తీరు బాగుంది. అయితే స్క్రీన్‌ప్లే విషయంలో కాస్త జాగ్రత్త వహించి ఉంటే బాగుండేది. కొన్ని సీన్లు మరి సాగదీతలా అనిపిస్తాయి. సినిమా నిడివి తక్కువ కావడం బాగా కలిసొచ్చింది. దర్శకుడిగా రఘుశాస్త్రి.. మొదటి ప్రయత్నంలో పర్వాలేదనిపించాడు. టెక్నికల్‌గా సాంకేతిక అంశాల విషయానికి వస్తే.. టెక్నికల్‌ టీమ్‌ మంచి పనితీరు కనబరిచింది. కెమెరామెన్‌&nbsp;శాంతి సాగర్‌ హెచ్‌.జీ.. విలేజ్‌ లుక్స్‌ను చాలా బాగా చూపించారు. మణికాంత్‌ ఖాద్రి అందించిన సంగీతం బాగుంది. ముఖ్యంగా ఎమోషనల్‌ సీన్స్‌కు ఆయన ఇచ్చిన నేపథ్య సంగీతం ఆకట్టుకుంటుంది. నిర్మాణ విలువలు కూడా ఉన్నతంగా ఉన్నాయి. బడ్జెట్‌ విషయంలో నిర్మాత ఎక్కడ రాజీపడలేదు.&nbsp; ప్లస్‌ పాయింట్స్‌ కథత్రిగుణ్‌, జయశ్రీ నటనసంగీతం మైనస్‌ పాయింట్స్‌ స్క్రీన్‌ ప్లేసాగదీత సీన్స్‌ Telugu.yousay.tv Rating : 3/5&nbsp;&nbsp;
    మార్చి 22 , 2024
    Jawan Movie Review in Telugu : మ్యాజిక్‌లు.. లాజిక్‌లు పక్కన పెట్టి చూడండి… జవాన్ బొమ్మ అదిపొయింది! 
    Jawan Movie Review in Telugu : మ్యాజిక్‌లు.. లాజిక్‌లు పక్కన పెట్టి చూడండి… జవాన్ బొమ్మ అదిపొయింది! 
    తమిళ్ డైరెక్టర్ అట్లీ మాస్ యాక్షన్ సినిమాలను తీయడంలో ధిట్ట. ఆయన మాస్ ప్రేక్షకుల పల్స్ ఇట్టే పట్టేస్తాడు. దళపతి విజయ్‌తో ఎన్నో బ్లాక్ బాస్టర్ సినిమాలను తీశాడు. సోషల్ మెసెజ్‌తో కూడిన కంటెంట్‌కు కమర్షియల్ ఎలిమెంట్స్ జోడించి తీయడంలో ఆయనకు ఆయనే సాటి. తమిళ్‌లో బిగిల్, తేరి, మెర్సల్ వంటి సినిమాలు ఈ కోవలోకే వస్తాయి. తాజాగా బాలీవుడ్ బాద్‌షా షారుక్ ఖాన్‌తో తీసిన జవాన్ చిత్రం నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. విడుదలకు ముందు ఈ చిత్రం నుంచి విడుదలైన ట్రైలర్ సినిమాపై అంచనాలను భారీగా పెంచాయి.&nbsp; అంతటా పాజిటివ్ రెస్పాన్స్‌తో దూసుకెళ్తున్న ఈ మూవీ ఇంతకు ఎలా ఉంది. అట్లీ- షారుక్ మ్యాజిక్ ఎలా ఉందో ఈ సమీక్షలో చూద్దాం. కథేంటంటే.. భారత్ సరిహద్దుల్లో తీవ్ర గాయాలతో పడిపోయిన ఓ వ్యక్తిని (షారుఖ్ ఖాన్) తల్లి కొడుకులు రక్షిస్తారు. అతను కోమాలోకి వెళ్లగా&nbsp; గ్రామానికి తీసుకెళ్లి వైద్యం చేయిస్తారు. ఇదే సమయంలో ఆ ఊరిపై కొందరు పదునైన ఆయుధాలతో దాడి చేస్తారు. కోమాలో నుంచి బయటకు వచ్చిన ఆ వ్యక్తి వారిని తరిమికొడతాడు. దీంతో ఆ గ్రామ ప్రజలు అతన్ని దేవుడిలా పూజిస్తారు. అప్పుడు షారుఖ్ ఖాన్ నేను ఎవరు అని వారిని ప్రశ్నిస్తాడు. దీనికి జవాబు తాను పెద్దయ్యేలోపు కనుగొంటానని షారుఖ్‌ ఖాన్‌ కాపాడిన పిల్లోడు ప్రామిస్ చేస్తాడు. సరిగ్గా 30 సంవత్సరాల తర్వాత విక్రమ్ రాథోడ్( షారుఖ్ ఖాన్) అనే పోలీస్ ఆఫీసర్.. ప్రభుత్వ అవినీతికి వ్యతిరేకంగా పొరాటం చేస్తుంటాడు. కాళి (విజయ్ సేతుపతి) అక్రమంగా సంపాదించిన డబ్బును పేదలకు పంచి పెడుతుంటాడు రాబిన్ హుడ్ తరహాలో. అయితే 30 ఏళ్ల క్రితం దొరికిన వ్యక్తి... విక్రమ్ రాథోడ్ ఒక్కరేనా? లేక ఇద్దరా..? ప్రామిస్ చేసిన పిల్లవాడు మాట నిలబెట్టుకున్నాడా? అసలు&nbsp; ఆ బుడ్డోడికి షారుఖ్‌ ఖాన్‌కు ఉన్న సంబంధం ఏంటి? కాళితో విక్రమ్‌ రాథోడ్‌కు ఉన్న గొడవ ఏంటి అనే అంశాలను తెరపై చూడాల్సిందే.. ఎవరెలా చేశారంటే? ఈ ఏడాది ప్రథమార్థంలో పఠాన్ సినిమాతో హిట్‌ కొట్టిన షారుఖ్ మరో బ్లాక్ బాస్టర్‌ను తన ఖాతాలో వేసుకున్నాడు. ఈ సినిమాలో షారుఖ్ నటన ఆయన ఫ్యాన్స్‌కు మంచి విందు భోజనం పంచుతుంది. షారుఖ్ ఇంట్రడక్షన్ సీన్ మునుపెన్నడూ లేని విధంగా హైఓల్టేజీలో డైరెక్టర్ అట్లీ డిజైన్ చేశాడు. ప్రతి ఫ్రేమ్‌లో షారుఖ్ లుక్స్ సూపర్బ్‌గా అనిపిస్తాయి. స్టార్టింగ్ పాయింట్ నుంచి ఇండింగ్ వరకు షారుఖ్ పర్ఫామెన్స్ నెక్ట్స్‌ లెవల్లో ఉంది. విలన్‌గా కాళి పాత్రలో విజయ్ సేతుపతి ఒదిగిపోయాడు. తనదైన నేచురల్ యాక్టింగ్‌తో అదరగొట్టాడు. కాళి పాత్రకు సూపర్బ్ మ్యెనరిజాన్ని విజయ్ జోడించాడు.&nbsp; నయనతార షారుఖ్‌తో సమానంగా నిర్ణయాత్మక పాత్రను పోషించింది. అయితే ఆమె పరిధి ఇంకొంచెం ఉంటే బాగుంటుందనిపించింది. ఆమె ప్రతి ప్రేమ్‌లో తన యాక్టింగ్ స్కిల్స్‌తో ఆకట్టుకుంది. దీపికా పదుకునే పాత్ర ఈ సినిమాకు ఎమోషనల్ కనెక్ట్. ప్రియమణి, సాన్య మల్హోత్ర, సంజీత భట్టాచార్య అందరూ తమ పరిధి మేరకు బాగా నటించారు. ఎలా ఉందంటే? డైరెక్టర్ అట్లీ మరోసారి తన స్క్రీన్ ప్లే మ్యాజిక్‌తో కట్టిపడేశాడు. స్టార్టింగ్ సీన్ నుంచి ఎండింగ్ వరకు ప్రతి సీన్‌కు ప్రేక్షకుడు కనెక్ట్ అయ్యేలా జాగ్రత్తగా రాసుకున్నట్లు తెలిసింది. ఫస్టాఫ్‌ను చాలా ఎంగేజింగ్‌ నడిపించి ఇంటర్వల్‌లో ట్విస్ట్ రివీల్ చేశాడు. యాక్షన్ సీన్స్, షారుఖ్ కామెడీ టైమింగ్ ఎక్కడా ప్రేక్షకునికి బోర్ కొట్టించదు.&nbsp; ఈ సినిమా ద్వారా సమాజంలోని అన్ని సమస్యలు స్పృశిస్తూ.. ఆర్మీలోని కొన్ని సమస్యలను బయటకు తెచ్చాడు అట్లీ.&nbsp; సెకండాఫ్‌లో షారుఖ్ ఖాన్ జాతినుద్దేశించే ఇచ్చే స్పీట్ గూస్‌బంప్స్ తెప్పిస్తుంది. క్లైమాక్స్ సీన్లు అదిరిపోయాయి. బోర్డర్ సన్నివేశాలు, యుద్ధసన్నివేశాలను కళ్లకు కట్టినట్లు అద్భుతంగా చూపించారు.&nbsp; టెక్నికల్ పరంగా జవాన్ సినిమా నిర్మాణ విలువల పరంగా సూపర్బ్‌గా ఉంది. క్వాలిటీ విషయంలో రెడ్ చిల్లీస్ ఎక్కడా రాజీ పడలేదు. యాక్షన్ సీన్స్ కోసం అంతర్జాతీయ స్థాయి ఫైట్ మాస్టర్స్ స్పిరో రజటోస్, యన్నిక్ బెన్, సనీల్ రోడ్రిగూస్ వంటి వారు పనిచేశారు. ఇక బ్యాక్ గ్రౌండ్ స్కోర్ సినిమాకు బాగా హైప్ తెచ్చాయి. ఇంట్రడక్షన్, క్లైమాక్స్ సీన్లలో వచ్చే సౌండ్ థియేటర్లలో స్పీకర్లు బద్దలయ్యేలా ఉంది. మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ పడి కష్టం సౌండ్స్‌లో రీసౌండ్ అయిందని చెప్పవచ్చు. బలాలు: షారుఖ్ నటన ఇంటర్వల్ ట్విస్ట్ క్లైమాక్స్ సీన్స్ BGM బలహీనతలు సెకాండాఫ్‌లో ముందే ఊహించదగిన సీన్లు చివరగా: జవాన్ సినిమా గురించి విమర్శకుల మ్యాజిక్‌లు లాజిక్‌లు పక్కన పెడితే... ఈ చిత్రం అభిమానులకు రియల్ షారుఖ్‌ను పరిచయం చేస్తుంది.&nbsp; రేటింగ్ 4/5
    సెప్టెంబర్ 07 , 2023
    BRO Movie Review: వింటేజ్ పవన్ కళ్యాణ్ వచ్చేశాడు.. ఫిలాసఫికల్ సినిమాతో పవన్ హ్యాట్రిక్ హిట్ కొట్టేశాడా?
    BRO Movie Review: వింటేజ్ పవన్ కళ్యాణ్ వచ్చేశాడు.. ఫిలాసఫికల్ సినిమాతో పవన్ హ్యాట్రిక్ హిట్ కొట్టేశాడా?
    నటీనటులు: పవన్ కళ్యాణ్, సాయిధరమ్ తేజ్, కేతిక శర్మ, ప్రియా వారియర్, బ్రహ్మానందం, రోహిణి, వెన్నెల కిశోర్, తదితరులు దర్శకత్వం: సముద్రఖని స్క్రీన్ ప్లే, డైలాగ్స్: త్రివిక్రమ్ శ్రీనివాస్ మ్యూజిక్: తమన్ ఎస్.ఎస్ సినిమాటోగ్రఫీ: సుజీత్ వాసుదేవ్ నిర్మాత: టీజీ విశ్వప్రసాద్, వివేక్ కూచిభొట్ల పవన్ కళ్యాణ్, సాయితేజ్ మల్టీస్టారర్‌ మూవీ ‘బ్రో’. వకీల్ సాబ్, భీమ్లా నాయక్ వంటి రీమేక్ హిట్ల అనంతరం పవన్ కళ్యాణ్ చేసిన మరో రీమేక్ ఇదే. తమిళంలో విజయం సాధించిన ‘వినోదయ సిత్తం’ సినిమాకు రీమేక్. తెలుగు నేటివిటీకి తగ్గట్టు, పవన్ కళ్యాణ్‌ని దృష్టిలో పెట్టుకుని సినిమాను మలిచారు త్రివిక్రమ్ శ్రీనివాస్. మాతృక దర్శకుడు సముద్రఖని తెలుగులోనూ చిత్రీకరించారు. మరి, ఫిలాసఫికల్ టచ్‌తో వచ్చిన ఈ మూవీ థియేటర్లలో మెప్పించిందా? టైం కాన్సెప్ట్ ప్రేక్షకుడిని కన్వీన్స్ చేసిందా? ‘బ్రో’ మూవీతో పవన్ హ్యాట్రిక్ రీమేక్ హిట్ అందుకున్నాడా? అనే విశేషాలు రివ్యూలో చూద్దాం. కథేంటంటే? మార్కండేయుడు(సాయితేజ్) ఓ బిజినెస్‌మేన్ పెద్దకొడుకు. తండ్రి చనిపోవడంతో కుటుంబ బాధ్యతలు మార్క్‌పై పడతాయి. గజిబిజి హడావుడిలో పడిపోయి అటు కుటుంబానికి, లవర్‌కి పెద్దగా టైం కేటాయించని పరిస్థితి మార్క్‌ది. ఈ క్రమంలో అనుకోకుండా రోడ్డు ప్రమాదంలో మృతి చెందుతాడు. మార్క్‌ని తీసుకెళ్లడానికి టైటాన్(పవన్ కళ్యాణ్) వస్తాడు. తాను నెరవేర్చాల్సిన బాధ్యతలు కొన్ని ఉన్నాయని, వాటిని పూర్తి చేశాక వస్తానని కాలదేవుడిని ఒప్పిస్తాడు. ఈ క్రమంలో మార్క్ చేసే ప్రతి పనిలోనూ ఎదురు దెబ్బ తగులుతుంది. మరి, చివరికి మార్క్ వాటినెలా పూర్తి చేశాడు? టైటాన్ ఏమైనా సాయం చేశారా? అనేది తెరపై చూడాల్సిందే. https://twitter.com/captain_India_R/status/1684756208845045760?s=20 ఎలా ఉంది? ‘వినోదయ సిత్తం’ మూవీ కంప్లీట్‌గా ఫిలాసఫికల్‌ మూడ్‌లో సాగుతుంది. కానీ, బ్రో ఇందుకు కాస్త భిన్నం. తత్వాన్ని బోధిస్తూనే కమర్షియల్ హంగులను అద్దుకుందీ సినిమా. దేవుడికి కూడా టైం రావాలని, దేవుడి కన్నా గొప్పది ‘టైం’ అనే విషయాన్ని చెబుతుంది. దీనినే పూర్తిగా ఫ్యాన్ మేడ్‌లా రూపొందించి కన్వే చేశారు. పవన్ కళ్యాణ్ పాత్రను దృష్టిలో పెట్టుకునే పూర్తి సినిమాను మలిచారు. పవన్ కళ్యాణ్ ఎంట్రీ నుంచే ఈ ఫ్లేవర్ కనిపిస్తుంది. అసలే ఆకలితో ఉన్న ఫ్యాన్స్‌కి పవన్ పాపులర్ సాంగ్స్‌ని మిక్స్ చేసి బిర్యానీ తినిపించారు. వింటేజ్ పవన్ కళ్యాణ్ లుక్స్, డైలాగ్స్ ఫ్యాన్స్‌ని కుర్చీలో కూర్చోనివ్వవు. ఇంట్రవెల్ పార్ట్, క్లైమాక్స్ పార్ట్ సినిమాకు అసెట్‌గా నిలుస్తాయి. సన్నివేశాలకు అనుగుణమైన బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ ఆకట్టుకుంటుంది. కథనం వేగంగా సాగుతుంటుంది. క్లైమాక్స్‌లో ఎమోషన్ పీక్స్. అప్పటిదాకా ఎంజాయ్ చేసిన సినిమాను చివరి 20 నిమిషాల్లో మర్చిపోతాం. థియేటర్ల నుంచి బయటకొచ్చేటప్పుడు ఈ క్లైమాక్స్ మాత్రమే గుర్తుంటుంది. అయితే, కొన్ని చోట్ల సీన్లు ఓవర్‌గా అనిపించడం, కుటుంబం ఎమోషన్లు ఊహించినంతగా పండకపోవడం కాస్త మైనస్. సినిమాలో ఏపీ పాలిటిక్స్‌ని ఇరికించడం రుచించకపోవచ్చు. https://twitter.com/CharanRuthless/status/1684406412892606464?s=20 ఎవరెలా చేశారు? కాలదేవుడిగా పవన్ కళ్యాణ్ ఇరగ దీశాడు. ఎంట్రీ సీన్ నుంచి సినిమాకు ఫుల్ ఎనర్జీని తీసుకొచ్చాడు. సినిమా ఆసాంతం నాటి పవన్ కళ్యాణ్‌ని గుర్తు చేసేలా నటించాడు. తన పాపులర్ సాంగ్స్‌లలో స్టెప్పులతో అలరించాడు. క్లైమాక్స్‌లోనూ ఎమోషన్స్‌ని చక్కగా పండించాడు. ఇక మార్క్‌‌పై సానుభూతి కలిగేంతలా నటించాడు సాయితేజ్. తన రియల్ లైఫ్‌కి ఇది చాలా దగ్గరగా ఉండటంతో అట్టే ఒదిగిపోయాడు. మావయ్యతో కలిసి చేసే సీన్స్‌లో చాలా ఎనర్జిటిక్‌గా కనిపించాడు. చివర్లో సాయితేజ్ ఏడిపించేస్తాడు. ఇక, కేతిక శర్మ తన పాత్రకు పరిమితమైంది. తల్లిగా రోహిణి, చెల్లిగా ప్రియా ఓకే అనిపించారు. టెక్నికల్‌గా సినిమాకు కథ ఎంతో బలాన్నిచ్చింది. రీమేక్ అయినప్పటికీ మాతృ కథలోని ఆత్మ పోకుండా ప్రజెంట్ చేయడంలో డైరెక్టర్ సముద్రఖని సఫలమయ్యాడు. ఎంత వరకు అవసరమో, ఫ్యాన్స్‌కి ఏం కావాలో అంతే చూపించాడు. ఇక, త్రివిక్రమ్ శ్రీనివాస్ డైలాగ్స్, స్క్రీన్ ప్లే ఆకట్టుకుంటాయి. ముఖ్యంగా డైలాగ్స్‌లో త్రివిక్రమ్ మార్క్ కనిపిస్తుంది. ఇక, తమన్ బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ మరోసారి ఆకట్టుకుంటుంది. శ్లోకం బీజీఎం ఒక వైబ్రేషన్‌ని క్రియేట్ చేస్తుంది. సినిమాటోగ్రఫీ బాగుంది. పవన్‌ని యంగ్‌గా చూపించడంలో సుజీత్ వాసుదేవ్ తన పనితనం చూపించారు. నిర్మాణ విలువలు సరిపోయాయి. https://youtu.be/jnzuXnj6HE0 ప్లస్ పాయింట్స్ పవన్, సాయితేజ్ మధ్య సీన్స్ పవన్ సాంగ్స్ మిక్స్ డైలాగ్స్, స్క్రీన్ ప్లే క్లైమాక్స్ మైనస్ పాయింట్స్ ఓవర్ సీన్స్ పొలిటికల్ డైలాగ్స్ చివరగా.. సినిమా చూసొచ్చాక జీవితంలో ఏదైనా చేయాలనిపిస్తుంది ‘బ్రో’ రేటింగ్: 3/ 5 https://www.youtube.com/watch?v=ArOm-GWR6Zk
    జూలై 28 , 2023
    డీగ్లామర్‌ రోల్స్‌లోనూ నటనతో అదరగొట్టిన అందాల భామలు
    డీగ్లామర్‌ రోల్స్‌లోనూ నటనతో అదరగొట్టిన అందాల భామలు
    ఒక సినిమా విజయానికి హీరో ఎంత ముఖ్యమో హీరోయిన్‌ అంతే కీలకం. కథానాయిక నటన, గ్లామర్‌, డ్యాన్స్‌ కోసమే సినిమాలకు వెళ్లే ప్రేక్షకులు ఇప్పటికీ ఉన్నారు. వెండి తెరపై తమ అందాల తార అందాలను చూసుకొని వారు మురిసిపోతుంటారు. హీరోయిన్లు కూడా గ్లామర్‌ ప్రదర్శనకు ఏమాత్రం వెనకాడకుండా థియేటర్లకు ప్రేక్షకులను రప్పించేవారు.&nbsp; అయితే ఇదంతా గతం. ఇప్పుడు డీ గ్లామరస్ రోల్‌లోనూ హీరోయిన్లు అదరగొడుతున్నారు. తెరపై గ్లామర్‌కు చోటు ఇవ్వకుండా కేవలం తమ నటనతోనే ఆడియన్స్‌ను మెప్పిస్తున్నారు. ఓ వైపు గ్లామరస్‌ రోల్స్‌ చేస్తూనే అవకాశం వచ్చినప్పుడు పల్లెటూరి పాత్రల్లో తళ్లుక్కుముంటున్నారు. మట్టివాసన వెదజల్లే క్యారెక్టర్‌లో తమదైన ముద్ర వేస్తున్నారు. డీగ్లామర్‌ రోల్‌లో కనిపించి మెప్పించిన హీరోయిన్లను ఇప్పుడు చూద్దాం. కీర్తి సురేష్‌ దసరా(Dasara) మూవీలో పల్లెటూరి అమ్మాయిగా కీర్తి సురేష్‌ (keerthi suresh) అదరగొట్టింది. వెన్నెల పాత్రలో నటించి సినిమా విజయంలో కీలక పాత్ర పోషించింది. ఇందులో కీర్తి నటన సినిమాకు చాలా బాగా ప్లస్‌ అయ్యింది. హీరో నానితో పోటీపడి మరీ నటించింది. దీంతో నానితో సమానంగా కీర్తి సురేష్‌ ప్రశంసలు అందుకుంటోంది.&nbsp; సమంత టాలీవుడ్‌ టాప్‌ హీరోయిన్స్‌లో ఒకరైన సమంత(Samantha) ‘రంగస్థలం (Rangasthalam)’ చిత్రంలో డీగ్లామరస్‌గా కనిపించింది. అచ్చం పల్లెటూరి అమ్మాయిగా మెప్పించింది. రామలక్ష్మీ పాత్రలో సమంతను తప్ప మరొకరిని ఊపించుకోలేము. ఫ్యామిలీ మ్యాన్‌-2 వెబ్‌సిరీస్‌లోనూ సమంత గ్లామర్‌కు దూరంగా ఉన్న పాత్రనే చేసింది.&nbsp; అనుష్క బాహుబలి(Bahubali) మెుదటి పార్ట్‌లో వృద్దురాలైన దేవసేనగా అనుష్క(Anushka Shetty) కనిపించింది. ఈ పాత్రలో ఆమె నటన గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. భల్లాల దేవుడిపై పగ తీర్చుకునేందుకు ఎదురు చూస్తున్న మహిళగా అనుష్క చాాాలా బాగా నటించింది.&nbsp; తమన్నా బాహుబలి పార్ట్‌-1 లోనే తమన్నా(Thamanna)&nbsp; కూడా అవంతిక పాత్రలో మెరిసింది. ఎలాంటి మేకప్‌ లేకుండా పోరాట సన్నివేశాల్లో అదరగొట్టింది. గ్లామర్‌ పాత్రలే కాదు అందానికి ప్రాధాన్యం లేని క్యారెక్టర్లు కూడా చేయగలనని తమన్నా నిరూపించుకుంది.&nbsp; ఐశ్వర్య రాజేష్‌ ‘కౌసల్య కృష్ణమూర్తి’ (Kousalya krishnamurthy), ‘వరల్డ్‌ ఫేమస్‌ లవర్‌’ (world famous lover) లాంటి చిత్రాల్లో ఐశ్వర్య రాజేష్‌ డీ గ్లామరస్‌ రోల్స్‌లో నటించారు. ఈ రెండు సినిమాల్లో పల్లెటూరి యువతిగా ఐశ్వర్య అద్భుతంగా నటించింది. అయితే కౌసల్య కృష్ణమూర్తి పాజిటివ్‌ టాక్‌ తెచ్చుకోగా.. వరల్డ్‌ ఫేమస్‌ లవర్‌లో ఐశ్వర్య పాత్రకు మంచి మార్కులే పడ్డాయి. రితికా సింగ్ వెంకటేష్‌ ప్రధాన పాత్రలో చేసిన గురు(Guru) సినిమా ద్వారా రితికా సింగ్‌ (Ritika Singh) తొలిసారి టాలీవుడ్‌కు పరిచయమైంది. తొలుత కూరగాయాలు అమ్ముకునే రాముడు పాత్రలో రితికా డీగ్లామరెస్‌గా కనిపించింది. ఆ తర్వాత బాక్సర్‌గా మారి సినిమా విజయంలో ముఖ్య భూమిక పోషించింది.&nbsp; అమ్రితా అయ్యర్‌ బుల్లితెర యాంకర్ ప్రదీప్‌ హీరోగా వచ్చి 30 రోజుల్లో ప్రేమించడం ఎలా చిత్రంలో అమ్రితా అయ్యర్‌ పల్లెటూరి అమ్మాయిగా కనిపించి మెప్పించింది. ఈ సినిమాలో ‘నీలి నీలి ఆకాశం పాట’ (Neeli Neeli Aakasam) ఎంత ఫేమస్‌ అయ్యిందో అందరికీ తెలిసిందే. సంజనా బుజ్జిగాడు సినిమాతో టాలీవుడ్‌కు పరిచయమైన సంజనా (Sanjana).. దండుపాళ్యం-2 Dandupalyam-2)లో ఓ విభిన్నమైన పాత్ర పోషించి షాక్‌ ఇచ్చింది. హత్యలు చేసే గ్యాంగ్‌లో నటించి మెప్పించింది. ఇదే సినిమాలో సంజన న్యూడ్‌గా నటించిందన్న వార్తలు అప్పట్లో షికారు చేశాయి.&nbsp;
    ఏప్రిల్ 01 , 2023
    <strong>Devara Dialogues : గూస్‌బంప్ తెప్పించిన దేవర టాప్ డైలాగ్స్ ఇవే</strong>
    Devara Dialogues : గూస్‌బంప్ తెప్పించిన దేవర టాప్ డైలాగ్స్ ఇవే
    జూ.ఎన్టీఆర్‌ (Jr.NTR) హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో రూపొందిన యాక్షన్‌ డ్రామా ‘దేవర’. జాన్వీకపూర్ (Janhvi Kapoor) కథానాయిక. జూ.ఎన్టీఆర్‌ చాలా సంవత్సరాల తర్వాత ద్విపాత్రాభినయం చేశాడు. ఇందులో ఆయన దేవర, వర పాత్రలు పోషించాడు. సైఫ్ అలీఖాన్‌ ప్రతినాయకుడిగా, ప్రకాశ్‌రాజ్‌, శ్రీకాంత్‌, షైన్‌ టామ్‌ చాకో కీలక పాత్రలు పోషించారు. సినిమా కథను కొరటాల చాలా జాగ్రత్తగా రాసుకున్నారు. ఆచార్య అనుభవాన్ని దృష్టిలో పెట్టుకుని తెరకెక్కించినట్లు తెలుస్తుంది. ముఖ్యంగా సినిమా డైలాగ్స్ చాలా ప్రభావవంతంగా ఉన్నాయి. సినిమా పూర్తైన తర్వాత కూడా ఆ డైలాగ్స్ వెంటాడుతాయి. ముఖ్యంగా జూ.ఎన్టీఆర్, ప్రకాశ్ రాజ్, సైఫ్‌ అలీఖాన్, జాన్వీకపూర్ ఆయ పాత్రలకు అనుగుణంగా చెప్పే డైలాగ్స్ విజిల్స్ కొట్టిస్తాయి. [toc] బైరా(సైఫ్ అలీ ఖాన్) డైలాగ్: “ఎర్ర సముద్రం కాడికి వచ్చి రక్తం గురించి మాట్లాడుతుండావా.. నాకు చావు గురించి చెబుతుండావా” అక్కడి నుంచి తప్పించుకున్న అజయ్, ప్రకాశ్ రాజ్ దగ్గరికి వెళ్లినప్పుడూ… ప్రకాశ్ రాజ్ డైలాగ్: కొండ మీదకొచ్చి భయపెడుదామనుకున్నావా అజయ్ : ఎవడ్రా నువ్వు ప్రకాశ్ రాజ్: సింగప్పా.. నువు దిగివచ్చిన కొండ మీద తూర్పు దిక్కున ఉంటాను అజయ్: నేను ఇక్కడికో పనిమీద వచ్చాను. పెద్దాయనవి, మీ వాళ్లకు ఓ మాట చెప్పి ఒప్పించగలవా..! సముద్రంపై పడవలో వెళ్తున్న సమయంలో వచ్చే డైలాగ్స్… అజయ్ తన డైమండ్ ఉంగరం కోసం సముద్రంలో దూకి.. లోపల ఆస్తి పంజరాలు చూసి భయపడినప్పుడు.. ప్రకాశ్ రాజ్ చెప్పే డైలాగ్ బాగుటుంది. ప్రకాశ్ రాజ్: “వజ్రపు ఉంగరం దొరికిందా? సముద్రంలో నీకు కానొచ్చిన దాని భయంతో వజ్రం గుర్తుకు రాలే.! ఈ భయమే నీలాంటి వాళ్లు ఎంత మంది వచ్చినా, ఎంత ఆశ చూపినా, ఇక్కడ ఉన్నవాళ్లు ఈ సముద్రం జోలికి మాత్రం రారు.” ప్రకాశ్ రాజ్ దేవరను పరిచయం చేస్తూ చెప్పే డైలాగ్ ఫ్యాన్స్‌తో విజిల్స్ వేయిస్తుంది. అజయ్: కళ్లు మూసినా, తెరిసినా సముద్రంలో చూసిందే కనిపిస్తోంది. అసలు ఎవరు వాళ్లంతా.. ఎవరు చేశారు ఇదంతా? ప్రకాశ్ రాజ్: “చాలా పెద్ద కథ సామీ, రక్తంతో సంద్రమే ఎరుపెక్కిన కథ“ అజయ్: ఎవరి కథ ప్రకాశ్ రాజ్: పడి పడి లేచే సముద్రం మీద పడకుండా నిలబడిన వాడి కథ.. మా దేవర కథ. “భయం పోవాలంటే దేవుడి కథ వినాలా,&nbsp; భయం అంటే ఏంటో తెలియాలంటే దేవర కథ వినాలా” ”కులం లేదు, మతం లేదు, భయం లేదు వారికి తెలిసింది ధైర్యమే” దేవర… తన కొడుకు వరంకు తన తండ్రి గురించే చెప్పే సందర్భంలోని డైలాగ్స్‌ కూడా బాగుంటాయి. (Devara Movie Dialogues) వరం(జూ.ఎన్టీఆర్): అబ్బా ఎప్పుడూ మీ నాన్న కథలు, వాళ్ల నాన్న కథలు చెబుతుంటావ్..! మా నాన్న కథ చెప్పు దేవర కథ చెప్పు నాకు! దేవర: తరువాత తరానికి చెప్పుకునేటంత కథలు కావురా.. మీ నాయనవి. మా నాయనోళ్లవి దేశం కోసం పోరాడిన వీరుల కథలు. మావీ.. ఎవ్వరికీ చెప్పుకోలేని చీకటి కథలు, బతికున్నామే గాని, భావితరాలకు కథలుగా చెప్పుకునేలా ఈ బతుకులు మారుతాయో లేదో మాకుడా తెలియదు. దేవర తొలిసారి ఆయుధ వ్యాపారులకు ఎదురు తిరిగిన సందర్భంలో వచ్చే సీన్‌లో డైలాగ్స్ పవర్‌ఫుల్‌గా ఉంటాయి. దేవర: మా ఆయుధాల లెక్కే ఇందులో కూడా ఆయుధాలు ఉన్నాయంటావ్ “మా ఆయుధాలు మంచిని చెడు నుంచి కాపాడటానికి పుట్టాయ్.. మీ ఆయుధాలు మంచిని చంపడానికి పుట్టాయ్..” విలన్: మాటలు ఎక్కువ అవుతున్నాయ్,&nbsp; సముద్రం ఎక్కాలా, సముద్రం ఎలాలా? దేవర గ్యాంగ్‌లోని కొండ ఎదురు తిరిగినప్పుడు ఎన్టీఆర్ చెప్పే డైలాగ్ సూపర్బ్‌గా ఉంటుంది. Jr Ntr Dialogues- Devara దేవర:&nbsp; “చేసే పని తప్పని తెలిసినా మన అవసరం కోసం చేస్తున్నావ్ అనుకున్నా, ఇప్పుడు అదే అలవాటుగా మారి తప్పుడు పనులు మన రక్తంలో ఇంకిపోయాయని ఇప్పుడే అర్ధం అవుతా ఉండాది.“ “మనిషికి బతికేంత ధైర్యం చాలు, చంపేంత ధైర్యం కాదు”. కాదు కూడదు అని మీరు మళ్లీ ఆ ధైర్యాన్ని కూడగడితే..ఆ ధైర్యాన్ని చంపే భయాన్ని అవుతా..! “దేవర అడిగినాడంటే.. సెప్పినాడనిఅదే సెప్పినాడంటే”… ఇంటర్వెల్ బ్యాంగ్‌కు ముందు ఎన్టీఆర్ యాక్షన్ సీక్వెన్స్ ఉంటుంది. తన మీద దాడికి వచ్చిన వారందర్ని దేవర చంపేస్తాడు. సముద్రం దేవర చంపిన వ్యక్తుల రక్తంతో ఎర్రగా మారుతుంది.అప్పుడు దేవర ఓ బండపై రాసిన డైలాగ్స్ మంచి కిక్‌ ఇస్తాయి ధైర్యం ఎక్కువై తప్పుడు పనులు చేస్తున్నా, మనోళ్లే కదా మాట చెబితే మారుతారు అనుకున్నా.. కానీ, భయం అంటే ఏమిటో తెలియని మృగాలుగా మారిపోయారు అని అర్థమై ఉండాది మీ కళ్లముందు ఉంటే భగవంతుడికి, భూతానికి కూడా భయపడరు అందుకే ఈరోజు నుంచి వాళ్లలెక్క మీ నుండి దూరంగా వెళ్లిపోయి.. కానరాని భయాన్ని అయితా.. భయం మరిచి ఎప్పుడైనా తప్పుడు పనికోసం సంద్రం ఎక్కితే… సంద్రం ఒడ్డున ఇట్టా పండబెడుతా..!”. అలాగే సైఫ్ అలి ఖాన్ డైలాగ్స్ కూడా పవర్‌పుల్‌గా ఉంటాయి. “దేవరను చంపాలంటే సరైనా సమయమే కాదు సరైన ఆయుధం కూడా దొరకాలా.. జాన్వీ కపూర్ డైలాగ్స్ తంగా(జాన్వీకపూర్) వరం(జూ.ఎన్టీఆర్) పిరికితనం గురించి చెప్పే డైలాగ్ కామెడీగా ఉంటాయి. “వాడికి వాళ్ల అయ్య రూపం వచ్చింది కాని, రక్తం రాలే.. ఎప్పుడు చూడు పిల్లతనం, పిరికితనం వాడితో ఎట్టాగే, నా మగాన్ని ఆమడ దూరం నుంచి చూసినా.. లోపల నుంచి పొంగాలా.. ఉప్పొంగాలా!! సొరచెపను చంపి ‘వర’ తీసుకొచ్చాడని ఫ్రెండ్స్ చెప్పినప్పుడు.. తంగం చెప్పే డైలాగ్ నవ్వు తెప్పిస్తుంది. “ఉందే వాడిలో .. ఉందే ఆడిలో..!నాకు తెలుసూ..ఇంతప్పటి నుంచి చూస్తుండాగాఉందే వాడిలో!! యంగ్ ఎన్టీఆర్‌ను చూసి జాన్వీ కపూర్ చెప్పే డైలాగ్‌ కూడా హెలేరియస్‌గా ఉంటుంది. ఆఆ ఆడా ఆడా.. వీరుడిలెక్క ఆ నడక చూడూ లోపల పొంగి ఉప్పొంగుతాందే..లోపల ఎన్టీఆర్, జాన్వీకపూర్ తొలిసారి ఒకరికొకరు ఎదురు పడినప్పుడు వారి మధ్య సాగే సంభాషణ రొమాంటిక్‌గా ఉంటుంది. తంగం(జాన్వీకపూర్): ఏంది ఇట్లా వచ్చినవ్ వర(ఎన్టీఆర్): రాయప్ప(శ్రీకాంత్)తో పని ఉండి వచ్చినా తంగం: అబ్బో అప్పుడే మా అయ్యతో మాట్లాడేదాక పోయినావా ఈరోజు నాకు ఊపిరి ఆగిపోయేలా ఉంది.నా వీరుడు ఆయుధ పూజకు సిద్ధమవుతున్నాడా ఆయుధ పూజలో మత్తు మందు ఇచ్చి గెలిచిన యంగ్ ఎన్టీఆర్‌ను తక్కువ చేసి విలన్(సైఫ్ అలీ ఖాన్) మాట్లాడినప్పుడు రాయప్ప(శ్రీకాంత్) చెప్పే డైలాగ్ పవర్‌పుల్‌గా ఉంటుంది. రాయప్ప &nbsp;ఏమి జరగనట్లు అందరూ అంతా మరచిపోతే మంచిది బైరా..వాళ్లు ఆడు కలిపిన మత్తు మందుకే పడినారంటే.. పొద్దునకళ్లా మత్తు దిగాలా..కానీ, వాళ్లు మంచం కూడా దిగలా..ఆయుధ పూజలో మీరు వాడి కంట్లో బెరుకునే చూసుండారు..కానీ నేను వాడి దెబ్బలో ఒడుపు చూసినా!దేవర లెక్క బలాన్ని చూసినావాడి బలం వాడికి కూడా తెలియక, ఇలా అందర్ని మత్తులో పెట్టి గెలవాలనుకోవడం వాడి పసితనంకానీ ఓ రకంగా మీ అందరికీ, అదే మంచిదిసముద్రం మీద ఒక దేవర ఉన్నాడు చాలుకొండ మీద ఇంకో దేవరను తయారు చేస్తే అది మీకే మంచిది కాదు భైరా తంగం (జాన్వీ కపూర్ డైలాగ్స్) “నావళ్ల కావట్లా, అందరికీ మత్తు మందు ఇచ్చి గెలవడం ఏంటే.అక్కా, నా మొగుడంటే..సముద్ర అల అంతా ఊహించుకున్నా నేనువాడేమో.. ఒడ్డుకు చేరే పిల్ల అల మాదిరి ఉన్నాడు” తంగం స్నేహితురాలు ఓదార్చుతూ చెప్పే డైలాగ్ నవ్వు తెప్పిస్తుంది అన్ని తెలిసిన దాన్ని చెబుతానా విను “ప్రతి ఆడదానికి… నచ్చినోడు ఒకడుంటాడువచ్చినోడు ఇంకోడుంటాడువచ్చినోడిలో నచ్చినవాడిని చూసుకునిదీపం ఆర్పేసుకుని కాపురం చేసుకుంటేబతుకు సాఫీగా సాగిపోతది” Devara Climax Dialogues క్లైమాక్స్‌లో దేవర గురించి అతని భార్య జోగుల(శ్రుతి మరాఠే)కు ప్రకాశ్ రాజ్ చెప్పే డైలాగ్స్ గూస్ బంప్స్ తెప్పిస్తాయి. “నీ పెనిమిటి అందర్ని వదిలిపెట్టి ఎప్పుడో పొయినాడు తల్లిదేవర మనల్ని విడిచిపెట్టి ఎప్పుడో చనిపోయాడుఇన్నేళ్లుగా అందర్ని సముద్రంపై తప్పు చేయకుండా భయపెడతా ఉందినీ పెనిమిటి దేవర కాదు..నీ బిడ్డ వరచిన్నప్పటి నుంచి దేవర చెప్పిన కథలు వింటూ పెరిగి ఉండాడేమో..ఈ కొండను బతికించడానికి పెద్ద కథను రాసినాడు నీ బిడ్డఆ మృగాల మాయలోపడి గొర్రె పిల్లాల పోయాడు అనుకున్నావాకాదు తల్లి, వాడిని అడ్డుపెట్టుకుని వెళ్లిన వాళ్లు గొర్రెపిల్లలుసముద్రంలో ఈపాటికి మృగాన్ని వెటాడినట్లు వెటాడుతుంటాడు నీ బిడ్డ!
    సెప్టెంబర్ 30 , 2024

    @2021 KTree