• TFIDB EN
  • ప్రసన్న వదనం
    UATelugu
    రేడియో జాకీగా పనిచేసే సూర్య జీవితాన్ని ఓ ప్రమాదం తలకిందులు చేస్తుంది. ఈ ఘటనతో అతడు ఫేస్‌ బ్లైండ్‌నెస్‌ బారిన పడతాడు. ముఖాలను, గొంతులను గుర్తుపట్టలేకపోతుంటాడు. ఈ క్రమంలో ఓ రోజు అతడి కళ్లెదుట హత్య జరుగుతుంది. అనూహ్యంగా ఆ కేసులో సూర్య ఇరుక్కుంటాడు. సూర్య‌ని ఇరికించింది ఎవ‌రు? సూర్య కేసు నుంచి బయటపడ్డాడా లేదా? అన్నది కథ.
    ఇంగ్లీష్‌లో చదవండి
    మూవీ & ఓటీటీ అప్‌డేట్స్‌
    స్ట్రీమింగ్‌ ఆన్‌Ahaఫ్రమ్‌
    ఇన్ ( Telugu )
    Watch
    2024 May 231 month ago
    ప్రసన్నవదనం సినిమా ఆహాలో గోల్డ్ సబ్‌స్క్రైబర్లకు అందుబాటులోకి వచ్చింది. రేపటి నుంచి అందరికీ అందుబాటులో ఉండనుంది.
    రివ్యూస్
    YouSay Review

    Prasanna Vadanam Review: నటుడిగా మరో మెట్టు ఎక్కేసిన సుహాస్‌.. ‘ప్రసన్న వదనం’ ఎలా ఉందంటే?

    సుహాస్‌ (Suhas) హీరోగా నటించిన లేటెస్ట్‌ థ్రిల్లింగ్‌ చిత్రం ‘ప్రసన్న వదనం’ (Prasanna Vadanam). అర్జున్‌ వై.కె దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రంలో పాయల్‌ ...read more

    How was the movie?

    తారాగణం
    సుహాస్
    పాయల్ రాధాకృష్ణ
    రాశి సింగ్
    నందు
    హర్ష చెముడు
    నితిన్ ప్రసన్న
    సాయి శ్వేతా
    సిబ్బంది
    అర్జున్ వై.కె.దర్శకుడు
    మణికంఠ జె ఎస్నిర్మాత
    ప్రసాద్ రెడ్డి టి.ఆర్.నిర్మాత
    విజయ్ బుల్గానిన్సంగీతకారుడు
    ఎడిటోరియల్ లిస్ట్
    కథనాలు
    Prasanna Vadanam Review: నటుడిగా మరో మెట్టు ఎక్కేసిన సుహాస్‌.. ‘ప్రసన్న వదనం’ ఎలా ఉందంటే?
    Prasanna Vadanam Review: నటుడిగా మరో మెట్టు ఎక్కేసిన సుహాస్‌.. ‘ప్రసన్న వదనం’ ఎలా ఉందంటే?
    నటీనటులు: సుహాస్‌, పాయల్‌ రాధాకృష్ణ, రాశీసింగ్‌, నందు, వైవా హర్ష, నితిన్‌ ప్రసన్న, సాయి శ్వేత, కుశాలిని తదితరులు రచన, దర్శకత్వం: అర్జున్‌ వైకే సంగీతం: విజయ్‌ బుల్గానిన్‌ సినిమాటోగ్రఫీ: ఎస్‌.చంద్రశేఖరన్‌ ఎడిటింగ్‌: కార్తిక్‌ శ్రీనివాస్‌ ఆర్‌ నిర్మాత: మణికంఠ జేఎస్‌, ప్రసాద్‌రెడ్డి టీఆర్‌ విడుదల తేదీ: 03-05-2024 సుహాస్‌ (Suhas) హీరోగా నటించిన లేటెస్ట్‌ థ్రిల్లింగ్‌ చిత్రం ‘ప్రసన్న వదనం’ (Prasanna Vadanam). అర్జున్‌ వై.కె దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రంలో పాయల్‌ రాధాకృష్ణ, రాశీ సింగ్‌ ప్రధాన పాత్రలు పోషించారు. జె.ఎస్‌ మణికంఠ, టి.ఆర్‌.ప్రసాద్‌ రెడ్డి సంయుక్తంగా నిర్మించారు. ఫేస్‌ బ్లైండ్‌నెస్‌తో బాధపడే యువకుడిగా సుహాస్ ఇందులో నటించాడు. ఇప్పటికే రిలీజ్‌ అయిన ప్రచార చిత్రాలు సినిమాపై అంచనాలు పెంచాయి. శుక్రవారం (మే 3) రిలీజైన ఈ చిత్రం ప్రేక్షకులను మెప్పించిందా? సుహాస్‌కు మరో విజయాన్ని అందించిందా? ఈ రివ్యూ తెలుసుకుందాం.  కథేంటి రేడియో జాకీగా పనిచేస్తున్న సూర్య (సుహాస్‌) జీవితాన్ని ఓ ప్రమాదం తలకిందులు చేస్తుంది. ఈ ఘటనలో తల్లిదండ్రులను కోల్పోయి ఫేస్‌ బ్లైండ్‌నెస్‌ అనే సమస్య బారిన సూర్య పడతాడు. ముఖాలను, గొంతులను గుర్తుపట్టలేకపోతుంటాడు. అయితే ఈ విషయాన్ని ఎవరికీ తెలియకుండా జాగ్రత్తపడుతుంటాడు. ఒక రోజు సూర్య కళ్లెదుట ఓ యువతి హత్య జరుగుతుంది. అది ఎవరు చేశారో స్పష్టంగా చూడలేకపోయినా పోలీసులకు తెలియజేయాలని అనుకుంటాడు. ఏసీపీ వైదేహీ (రాశి సింగ్‌) వద్దకు వెళ్లి జరిగిందంతా చెబుతాడు. ఈ క్రమంలో సూర్యపై దాడి జరుగుతుంది. అనూహ్యంగా సూర్యనే ఈ హత్య కేసులో ఇరుక్కోవాల్సి వస్తుంది. ఇంత‌కీ ఆ హ‌త్య ఎవ‌రు చేశారు? ఆ కేసులో సూర్య‌ని ఇరికించింది ఎవ‌రు? సూర్య కేసు నుంచి బయటపడ్డాడా లేదా? పాయల్‌తో హీరో లవ్ స్టోరీ ఏంటి? అన్నది తెలియాలంటే సినిమా చూడాల్సిందే.  ఎవరెలా చేశారంటే హీరో సుహాస్ ఎప్పటిలాగే తన అద్భుతమైన నటనతో ఆకట్టుకున్నాడు. ఫేస్‌ బ్లైండ్‌నెస్‌ ఉన్న వ్యక్తి పాత్రలో ఒదిగిపోయాడు. గత చిత్రాలతో పోలిస్తే నటన పరంగా సుహాస్‌ ఇంకాస్త మెరుగయ్యాడని చెప్పవచ్చు. పాత్రకు అవ‌స‌ర‌మైన చోట హాస్యాన్నీ, భావోద్వేగాల్ని పలికించి మెప్పించాడు. ఇక సుహాస్‌కు జోడీగా పాయల్‌ ఓకే అనిపించింది. వారి మ‌ధ్య వచ్చే  స‌న్నివేశాలు స‌ర‌దా స‌ర‌దాగా సాగుతాయి. పోలీసు ఆఫీసర్‌గా రాశి సింగ్‌కు మంచి పాత్రే దక్కింది. ఆ రోల్‌కు ఆమె పూర్తిగా న్యాయం చేసింది. వైవాహర్ష స్నేహితుడిగా అల‌వాటైన పాత్ర‌లో సంద‌డి చేశాడు. నందు, సాయి శ్వేత పాత్ర‌ల ప‌రిధి మేర‌కు న‌టించారు. డైరెక్షన్‌ ఎలా ఉందంటే డిజార్డర్‌ ఉన్న హీరో పాత్రలను గతంలో చాలా సినిమాల్లో చూసినప్పటికీ దర్శకుడు అర్జున్‌ వైకే ఫేస్‌ బ్లైండ్‌నెస్‌ను కథాంశంగా తీసుకోవడం కొత్తగా అనిపించింది. మంచి మ‌లుపుల‌తో ప్రేక్ష‌కుల‌కు థ్రిల్‌ని పంచ‌డంలోనూ ద‌ర్శకుడు సక్సెస్‌ అయ్యాడు. క‌థానాయ‌కుడి పాత్ర‌, దానికున్న స‌మ‌స్యపై ప్రారంభంలోనే ప్రేక్షకులకు ఓ అవగాహన తీసుకొచ్చి తదుపరి సన్నివేశాలపై ఆసక్తి రగిలించాడు. హీరోకు స్నేహితుడి మధ్య వచ్చే సన్నివేశాలతో ఫస్టాఫ్‌ సరదాగా సాగిపోతుంది. విరామానికి ముందు వచ్చే అనూహ్య మలుపుతో కథ రసవత్తరంగా మారుతుంది. సెకండాఫ్‌ కీల‌క స‌మ‌యాల్లో చోటు చేసుకునే మ‌లుపులు, ప‌తాక సన్నివేశాలతో సినిమాను మరింత ఆసక్తికరంగా మార్చాడు దర్శకుడు. అయితే అక్కడక్కడ కథనం కాస్త నెమ్మదిగా సాగినట్లు అనిపిస్తుంది. హీరో హీరోయిన్ల లవ్‌ ట్రాక్‌లో డెప్త్‌ లేకపోవడం మైనస్‌గా చెప్పవచ్చు. అలాగే దర్శకుడు క‌థ‌ని న‌డిపించిన విధాన‌ం ఓ టెంప్లేట్‌లా అనిపిస్తుంది.  సాంకేతికంగా.. టెక్నికల్ అంశాల విషయానికి వస్తే.. అన్ని విభాగాలు మెరుగైన పనితీరు కనబరిచాయి. ముఖ్యంగా చంద్రశేఖరన్‌ కెమెరా పనితనం ఆకట్టుకుంటుంది. విజయ్‌ బుల్గానిన్ అందించిన పాటలు కన్నా నేపథ్య సంగీతం సినిమాకు బాగా ప్లస్ అయ్యింది. కొన్ని సన్నివేశాలను BGM బాగా ఎలివేట్ చేసింది. ఎడిటింగ్‌ వర్క్‌ ఓకే. నిర్మాణ విలువలు కూడా ఉన్నతంగా ఉన్నాయి. ఎక్కడ రాజీపడినట్లు కనిపించలేదు. ప్లస్‌ పాయింట్స్ సుహాస్‌ నటనమలుపులుసెకండాఫ్‌ మైనస్‌ పాయింట్స్ ప్రారంభ సీన్స్నెమ్మదిగా సాగే కథనం Telugu.yousay.tv Rating : 3/5 
    మే 03 , 2024
    This Week OTT Movies: ఈ వారం ఓటీటీ, థియేటర్లలో విడుదలయ్యే చిత్రాలు ఇవే!
    This Week OTT Movies: ఈ వారం ఓటీటీ, థియేటర్లలో విడుదలయ్యే చిత్రాలు ఇవే!
    గత కొన్ని వారాలుగా చిన్న హీరోల చిత్రాలు విడుదలవుతూ థియేటర్లలో సందడి చేస్తున్నాయి. అయితే ఈ వారం కూడా చిన్న చిత్రాల హవా కొనసాగనుంది. ఈ వేసవిలో అహ్లాదకరమైన వినోదాన్ని పంచేందుకు అవి రాబోతున్నాయి. మరోవైపు ఓటీటీలోనూ కొత్త సినిమాలు, సిరీస్‌లు డబుల్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ ఇచ్చేందుకు వచ్చేస్తున్నాయి. ఆ విశేషాలేంటో ఈ ప్రత్యేక కథనంలో చూద్దాం.  థియేటర్‌లో రిలీజయ్యే చిత్రాలు ఆ ఒక్కటీ అడక్కు అల్లరి నరేష్‌ (Allari Naresh), ఫరియా అబ్దుల్లా (Faria Abdullah) జంటగా నటించిన లేటెస్ట్‌ చిత్రం ‘ఆ ఒక్కటీ అడక్కు’ (Aa Okkati Adakku). మల్లి అంకం దర్శకత్వం వహించాడు. కొన్ని సంవత్సరాల గ్యాప్‌ తర్వాత అల్లరి నరేష్‌ మళ్లీ కామెడీ సినిమాతో వస్తుండటంతో ప్రేక్షకుల్లో అంచనాలు భారీగా ఉన్నాయి. మే 3న ఈ చిత్రం థియేటర్లలోకి రానుంది. ఇప్పటికే విడుదలైన ప్రచార చిత్రాలు ఆకట్టుకుంటున్నాయి. ప్రసన్న వదనం సుహాస్‌ (Suhas) హీరోగా నటించిన లేటెస్ట్‌ థ్రిల్లింగ్‌ చిత్రం ‘ప్రసన్న వదనం’ (Prasanna Vadanam). అర్జున్‌ వై.కె దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రంలో పాయల్‌ రాధాకృష్ణ, రాశీ సింగ్‌ ప్రధాన పాత్రలు పోషించారు. జె.ఎస్‌ మణికంఠ, టి.ఆర్‌.ప్రసాద్‌ రెడ్డి సంయుక్తంగా నిర్మించారు.ఫేస్‌ బ్లైండ్‌నెస్‌తో బాధపడే సూర్య అనే యువకుడు మూడు మ‌ర్డ‌ర్ కేసుల్లో ఇరుక్కొంటాడు. మరి ఆ కేసుల్లోంచి ఎలా త‌ప్పించుకొన్నాడు? అస‌లు హంత‌కుడ్ని చ‌ట్టానికి ఎలా అప్ప‌గించాడు? అనేదే క‌థ‌. శబరి వరలక్ష్మీ శరత్‌కుమార్‌ (Varalaxmi Sarathkumar) ప్రధాన పాత్రలో అనిల్‌ కాట్జ్‌ దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘శబరి’ (Sabari). మహేంద్రనాథ్‌ కూండ్ల నిర్మించారు. ఈ చిత్రం తెలుగుతో పాటు తమిళ, మలయాళ, కన్నడ, హిందీ భాషల్లో మే 3న ప్రేక్షకుల ముందుకురానుంది. ఒక బిడ్డ కోసం తల్లి పడే తపనను సైకిలాజికల్ థ్రిల్లర్‌గా రూపొందించినట్లు చిత్ర యూనిట్‌ తెలిపింది. తెలుగులో వరలక్ష్మీ చేసిన తొలి నాయికా ప్రధానమైన చిత్రం ఇదేనని పేర్కొంది.  బాక్‌ ప్రముఖ తమిళ దర్శకుడు సుందర్‌. సి ప్రధాన పాత్రలో నటిస్తూ తెరకెక్కించిన చిత్రం ‘బాక్‌’ (Baak). తమన్నా (Tamannaah), రాశీ ఖన్నా (Raashii Khanna) కథానాయికలు.  ఖుష్బు సుందర్‌, ఏసీఎస్‌ అరుణ్‌ కుమార్‌ సంయుక్తంగా నిర్మించారు. వెన్నెల కిశోర్‌, కోవై సరళ తదితరులు ముఖ్య పాత్రలు పోషించారు. హారర్‌ కామెడీ థ్రిల్లర్‌గా రూపొందిన ఈ చిత్రాన్ని మే 3న ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. హారర్‌ కామెడీ ఫ్రాంచైజీ ‘అరణ్‌మనై’ నుంచి వస్తున్న 4వ చిత్రమిది. జితేందర్‌రెడ్డి యువ నటుడు రాకేశ్‌వర్రే హీరోగా నటించిన తాజా చిత్రం ‘జితేందర్‌రెడ్డి’. దర్శకుడు విరించి వర్మ.. 1980లో జరిగిన యథార్థ సంఘటనల ఆధారంగా ఈ మూవీని తీర్చిదిద్దారు. ఇప్పటికే చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ మూవీ మే 3నప్రేక్షకుల ముందుకు రానుంది. ఓటీటీలో విడుదలయ్యే చిత్రాలు ప్రణయ విలాసం ప్రేమలు బ్యూటీ మమితా బైజు నటించిన ప్రణయ విలాసం (Pranaya Vilasam) చిత్రం ఈ వారం ఓటీటీలోకి రానుంది. ఏప్రిల్‌ 29 నుంచి ఈ మూవీని స్ట్రీమింగ్‌లోకి తీసుకొస్తున్నట్లు ప్రముఖ ఓటీటీ వేదిక ఈటీవీ విన్‌ ప్రకటించింది. గతేడాది ఫిబ్రవరి 24న థియేటర్లలో ఈ సినిమా రిలీజైంది. చాలా తక్కువ బడ్జెట్‌తో రూపొందించిన ఈ సినిమా.. మంచి ఆదరణ సంపాదించింది. ఈ మూవీలో అర్జున్ అశోక్ మేల్ లీడ్‌ రోల్‌లో నటించాడు.  మరిన్ని OTT చిత్రాలు & వెబ్ సిరీస్‌ల విడుదలల కోసం ఇక్కడ క్లిక్ చేయండి https://telugu.yousay.tv/tfidb/ott TitleCategoryLanguagePlatformRelease DateThe Idea Of YouMovieEnglishAmazon PrimeMay 2The WheelSeries EnglishDisney + HotstarApril 30DeArMovieTelugu/TamilNetflixApril 28Boiling Point - 1SeriesEnglishNetflixApril 29Heera MandiSeriesHindiNetflixMay 1Sithan MovieHindiNetflixMay 3The A Typical FamilySeriesKorean/English NetflixMay 4Hacks 3SeriesEnglishJio CinemaMay 3VonkaMovieEnglishJio CinemaMay 3The Tattooist of AuschwitzSeriesEnglishJio CinemaMay 3Migration MovieEnglishJio CinemaMay 1Acapulco S3SeriesEnglishApple Plus TVMay 1
    ఏప్రిల్ 29 , 2024
    Telugu Movies Collections: మే నెలలో అత్యధిక వసూళ్లు రాబట్టిన చిత్రాలు ఇవే!
    Telugu Movies Collections: మే నెలలో అత్యధిక వసూళ్లు రాబట్టిన చిత్రాలు ఇవే!
    సాధారణంగా ప్రతీ మే నెల టాలీవుడ్‌ ఇండస్ట్రీకి ఎంతో కీలకమైనది. సమ్మర్‌లో భాగంగా ఏటా స్టార్‌ హీరోల చిత్రాలు ప్రధానంగా ఈ నెలలోనే విడుదలవుతుంటాయి. తద్వారా బాక్సాఫీస్‌ను షేక్‌ చేసి రికార్డులు సృష్టిస్తుంటాయి. అయితే ఈ వేసవి కాలంలో చిన్న చిత్రాలే పెద్ద ఎత్తున థియేటర్లలో సందడి చేశాయి. టాలీవుడ్‌కు చెందిన ప్రముఖ కుర్ర హీరోల సినిమాలు.. మే నెలలో విడుదలై ఆడియన్స్‌ను ఆకట్టుకునే ప్రయత్నం చేశాయి. ఇంతకీ ఆ చిత్రాలు ఏవి? బాక్సాఫీస్ వద్ద వాటి ప్రభావం ఎలా ఉంది? నిర్మాతలు లాభపడ్డారా? నష్టపోయారా? ఈ ప్రత్యేక కథనంలో పరిశీలిద్దాం.  [toc] గ్యాంగ్స్ ఆఫ్‌ గోదావరి విష్వక్‌ సేన్‌ తాజా మూవీ ‘గ్యాంగ్స్‌ ఆఫ్‌ గోదావరి’.. మే 31న విడుదలై హిట్‌ టాక్‌ తెచ్చుకుంది. ఈ సినిమా విడుదలై ఆరు రోజులు కాగా.. ఇప్పటిరవరకూ వరల్డ్‌ వైడ్‌గా రూ.18 కోట్ల గ్రాస్‌ వచ్చినట్లు ట్రేడ్‌ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. రూ.9.85 కోట్ల షేర్‌ రాబట్టినట్లు పేర్కొన్నాయి. ఈ సినిమా బ్రేక్‌ ఈవెన్‌ టార్గెట్‌ రూ.11 కోట్లుగా ఉంది. అంటే షేర్‌ పరంగా చూస్తే ఈ మూవీ ఇంకా 1.15 కోట్లు వెనకబడి ఉంది.  మూవీ ప్లాట్‌ ఏంటంటే..  కొవ్వూరు గ్రామానికి చెందిన లంకల రత్నం (విశ్వక్ సేన్) రాజకీయాల్లో ఎదిగేందుకు ఎమ్మెల్యే దొరసామి రాజు (గోపరాజు రమణ) బృందంలో చేరతాడు. ఆ తర్వాత నానాజీ (నాజర్) గ్రూపులో చేరి ఎమ్మెల్యే అవుతాడు. అయితే, అతడి ప్రవర్తన కారణంగా శత్రువులు ఏర్పడతారు. టైగర్ రత్నాకర్‌గా ఎదిగిన అతడు ఎలాంటి ప్రతికూల పరిస్థితులను ఎదుర్కొన్నాడు? ప్రత్యర్థుల ఎత్తుగడలను ఎలా తిప్పికొట్టాడు? బుజ్జి (నేహా శెట్టి)తో రత్నాకర్‌ లవ్‌ ట్రాక్‌ ఏంటి? అన్నది కథ.  భజే వాయు వేగం యంగ్‌ హీరో కార్తికేయ హీరోగా తెరకెక్కిన ఈ చిత్రం కూడా మే 31న విడుదలై హిట్‌ టాక్‌ తెచ్చుకుంది. ఈ చిత్రం గత ఆరు రోజుల్లో వరల్డ్ వైడ్‌గా రూ.7.1 కోట్ల గ్రాస్‌ రాబట్టినట్లు ట్రేడ్ వర్గాలు ప్రకటించాయి. రెండు తెలుగు రాష్ట్రాల్లో రూ.5.6 కోట్ల గ్రాస్‌ వసూలు చేసినట్లు పేర్కొన్నాయి. ఈ మూవీ బ్రేక్‌ ఈవెన్‌ పాయింట్‌ రూ. 4.5 కోట్లుగా ఉంది. తొలి ఆరు రోజుల లెక్కల ప్రకారం ఈ చిత్రం రూ. 3.5 కోట్లకు పైగా షేర్‌ రాబట్టింది.  మూవీ కథ ఏంటంటే.. తల్లిదండ్రులు చనిపోవడంతో వెంకట్‌ (కార్తికేయ) చిన్నప్పుడే అనాథగా మారతాడు. తండ్రి స్నేహితుడైన రాజన్న(తనికెళ్ల భరణి) అతడ్ని దత్తత తీసుకొని కొడుకు రాజు (రాహుల్‌ టైసన్‌)తో పాటే పెంచి పెద్ద చేస్తాడు. కొడుకులు ఇద్దరినీ ఉన్నత స్థితిలో చూడాలని రాజన్న కలలు కంటాడు. కానీ వారు సిటీలో ఉద్యోగం చేస్తున్నామని చెప్పి మోసం చేస్తుంటారు. ఓ రోజు తండ్రి ఆరోగ్యం విషమించడంతో వెంకట్‌ విలన్‌ గ్యాంగ్‌ దగ్గర బెట్టింగ్ వేసి గెలుస్తాడు. కానీ, వారు మోసం చేస్తారు. కొన్ని ఘటనల నేపథ్యంలో వారిపై పగ తీర్చుకోవాలని వెంకట్‌ నిర్ణయించుకుంటాడు. ఈ క్రమంలో అతడికి ఎలాంటి సమస్యలు ఎదురయ్యాయి? హీరోయిన్‌ ఐశ్వర్య మీనన్‌తో అతడి లవ్‌ ట్రాక్ ఏంటి? అన్నది కథ.  గం గం గణేశా స్టార్‌ హీరో విజయ్‌ దేవరకొండ సోదరుడు ఆనంద్‌ దేవరకొండ నటించిన ఈ చిత్రం.. కామెడీ ఎంటర్‌టైనర్‌గా మే 31న ఆడియన్స్‌ ముందుకు వచ్చింది. గత ఆరు రోజుల్లో ఈ సినిమా వరల్డ్‌ వైడ్‌గా రూ. 5.25 కోట్ల గ్రాస్‌ సాధించింది. తెలుగు రాష్ట్రాల్లో రూ.4.35 కోట్ల మేర వసూలు చేసింది. ఇక ఈ సినిమాకు రూ.2.41 కోట్ల షేర్ వచ్చినట్లు ట్రేడ్‌ వర్గాలు తెలిపాయి. బ్రేక్ ఈవెన్ కోసం ఇంకో రూ.3.19 కోట్ల షేర్‌ను రాబట్టాల్సి ఉందని స్పష్టం చేశాయి. ‘గం గం గణేశా’ చిత్రానికి రూ.5.3 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరిగింది. స్టోరీ ఏంటంటే..  గణేష్‌ (ఆనంద్‌ దేవరకొండ).. స్నేహితుడు శంకర్‌ (ఇమ్మాన్యుయెల్‌)తో కలిసి చిన్న చిన్న దొంగతనాలు చేస్తుంటాడు. అనూహ్య ఘటనల నేపథ్యంలో అతడికి పెద్ద దోపిడి చేయాల్సిన అవసరం ఏర్పడుతుంది. ఈ క్రమంలో శంకర్‌తో కలిసి వేసిన ప్లాన్‌ బెడిసి కొడుతుంది. దీంతో గణేష్‌కు కొత్త సమస్యలు ఎదురవుతాయి. మరోవైపు నంద్యాల ఉప ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా అధికార, ప్రతిపక్ష పార్టీలు కష్టపడుతుంటాయి. ఇంకోవైపు ముంబయిలో రెండు గ్యాంగ్‌ల మధ్య భీకర షూటౌట్‌ జరుగుతుంది. అయితే వాటికి గణేష్‌కు మధ్య సంబంధం ఏంటి? ఓ పొలిటిషన్‌, విగ్రహాన్ని దొంగతనం చేసే బ్యాచ్‌ గణేష్‌ జీవితాన్ని ఎలా ప్రభావితం చేశారు? వాటి నుంచి హీరో ఎలా బయటపడ్డాడు? హీరోయిన్‌ శ్రీవాస్తవతో అతడి లవ్‌ట్రాక్‌ ఏంటి? అన్నది కథ.  లవ్‌ మీ యంగ్ హీరో ఆశిష్‌ హీరోగా చేసిన లేటెస్ట్‌ చిత్రం 'లవ్‌ మీ'. మే 25న రిలీజైన ఈ చిత్రం థియేటర్లలో ఫ్లాప్‌ టాక్‌ తెచ్చుకుంది. అటు నిర్మాతలకు నష్టాలను మిగిల్చింది. ఈ చిత్రం ఓవరాల్‌గా రూ.6.30 కోట్ల గ్రాస్‌.. రూ.2.75 కోట్ల షేర్ మాత్రమే వసూలు చేసింది. రూ.5.5 కోట్ల బ్రేక్ ఈవెన్‌ టార్గెట్‌ను అందుకోలేక నిర్మాతలను లాస్‌లోకి నెట్టింది. కథ ఏంటంటే.. ‘అర్జున్ (ఆశిష్‌), ప్రతాప్ (రవికృష్ణ) కలిసి ఓ యూట్యూబ్ ఛానల్ నడుపుతూ ఉంటారు. దెయ్యాలు, ఆత్మలకు సంబంధించిన వీడియోలు చేస్తుంటారు. ప్రతాప్‌ లవర్‌ ప్రియా (వైష్ణవి).. దివ్యవతి అనే దెయ్యం గురించి చెప్పడంతో ఆమె ఉంటున్న పాడుబడ్డ అపార్ట్‌మెంట్‌కు అర్జున్‌ వెళ్తాడు. అలా వెళ్లిన అర్జున్‌ దివ్యవతి ఆత్మతో ప్రేమలో పడతాడు. ఆ తర్వాత ఏమైంది? దివ్యవతి ఎవరు?’ అన్నది కథ. ఫ్యూరియోసా : ఏ మ్యాడ్‌ మ్యాక్స్‌ సాగా ఈ ఏడాది మోస్ట్ అవైటెడ్‌ హాలీవుడ్‌ చిత్రంగా నిలిచిన ఫ్యూరియోసా.. కలెక్షన్ల పరంగా తీవ్రంగా నిరాశ పరిచింది. దాదాపు రూ.1,410 కోట్ల బడ్జెట్‌తో రూపొందిన ఈ చిత్రం.. వరల్డ్ వైడ్‌గా రూ.950 కోట్లు మాత్రమే వసూలు చేసింది. దేశంలో రూ.15 కోట్ల రేంజ్‌లో గ్రాస్‌ సాధించింది. కథ ఏంటంటే.. ‘ఫ్యూరియోసాను తల్లి మేరి నుంచి డెమంటస్ గ్యాంగ్‌ కిడ్నాప్‌ చేస్తుంది. ఆమె కళ్లెదుటే తల్లిని దారుణంగా హత్య చేస్తుంది. సంధిలో భాగంగా ఫ్యూరియోసాను డెమంటస్‌.. సిటాడెల్‌ రాజుకు అప్పగిస్తాడు. అక్కడ నుంచి తప్పించుకున్న ఆమె.. డెమంటస్‌పై ఎలా ప్రతీకారం తీర్చుకుంది? అన్నది కథ. కృష్ణమ్మ సత్యదేవ్‌ హీరోగా చేసిన 'కృష్ణమ్మ' చిత్రం మేలో విడుదలై బాక్సాఫీస్‌ వద్ద ఫ్లాప్‌ టాక్‌ తెచ్చుకుంది. ఆపై వారానికే ఓటీటీలోకి వచ్చేసి అందరినీ ఆశ్చర్యపరిచింది. ఈ మూవీ ఆరో రోజుల్లో వరల్డ్ వైడ్‌గారు రూ.3.9 కోట్ల గ్రాస్‌ మాత్రమే సాధించింది. ఈ సినిమా బ్రేక్‌ ఈవెన్‌ టార్గెట్‌ రూ.3.50 కాగా, షేర్‌ అంతకంటే తక్కువే రావడంతో నిర్మాతలు నష్టాలను చవిచూశారు.  కథ ఏంటంటే..  ‘భద్ర (సత్యదేవ్), కోటి (మీసాల లక్ష్మణ్‌), శివ (కృష్ణ తేజ) ముగ్గురు ప్రాణ స్నేహితులు. అనాథలు కావడంతో తోడుగా జీవిస్తుంటారు. వీరికి డబ్బు అవసరం పడి నేరం చేయాలని అనుకుంటారు. ఈ క్రమంలో ముగ్గురు చిక్కుల్లో పడతారు. వీరిలో ఒకరు చనిపోవడంతో అందుకు కారణమైన వారిపై హీరో ఎలా రివేంజ్‌ తీర్చుకుంటాడు? అన్నది కథ.  ఆ ఒక్కటి అడక్కు అల్లరి నరేష్‌ రీసెంట్‌ రీసెంట్‌ చిత్రం 'ఆ ఒక్కటి అడక్కు'.. గత నెల మేలో విడుదలై ఫ్లాప్‌ టాక్‌ తెచ్చుకుంది. ఈ చిత్రం తొలి ఏడు రోజుల్లో రూ. 5.85 కోట్ల గ్రాస్‌ మాత్రమే వసూలు చేసింది. ఏపీ తెలంగాణ రాష్ట్రాల్లో రూ.4.8 కోట్లు సాధించింది. ఈ సినిమా బ్రేక్ ఈవెన్‌ టార్గెట్‌ రూ.4.5 కోట్లుగా ఉంది.  కథ ఏంటంటే.. ‘గణపతి (అల్లరి నరేష్) పెళ్లి సంబంధాలు చూడటంలో హాఫ్ సెంచరీ కంప్లీట్ చేస్తాడు. వయసు ఎక్కువ కావడంతో అతడికి ఎవరూ పిల్లను ఇవ్వరు. ఓ రోజు మ్యాట్రిమోనీ సైట్‌లో సిద్ధి (ఫరియా అబ్దుల్లా)ని చూసి ప్రేమలో పడతాడు. అయితే ఆమె అబ్బాయిలను మోసం చేస్తోందంటూ మీడియాలో వార్తలు వస్తాయి. అందులో నిజమెంతా? వారిద్దరు ఒక్కటయ్యారా? లేదా?’ అన్నది కథ. ప్రసన్న వదనం సుహాస్‌ హీరోగా తెరకెక్కిన ‘ప్రసన్న వదనం’ చిత్రం.. మే మెుదటి వారంలో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. డిఫరెంట్‌ కాన్సెప్ట్‌తో రూపొందిన ఈ మూవీ హిట్‌ టాక్‌ తెచ్చుకుంది. ఈ సినిమా వరల్డ్‌ వైడ్‌గా తొలి 7 రోజుల్లో రూ.3.65 కోట్ల గ్రాస్‌ రాబట్టింది. తెలుగు రాష్ట్రాల్లో రూ.2.8 కోట్లు వసూలు చేసింది. ఆ తర్వాతి రోజుల్లోనూ మంచి వసూళ్లు సాధించి బ్రేక్‌ ఈవెన్‌ టార్గెట్‌ రూ. 4 కోట్లను అందుకున్నట్లు ఫిల్మ్‌ వర్గాలు తెలిపాయి. కథ ఏంటంటే..  రేడియో జాకీగా పనిచేసే సూర్య జీవితాన్ని ఓ ప్రమాదం తలకిందులు చేస్తుంది. ఈ ఘటనతో అతడు ఫేస్‌ బ్లైండ్‌నెస్‌ బారిన పడతాడు. ముఖాలను, గొంతులను గుర్తుపట్టలేకపోతుంటాడు. ఈ క్రమంలో ఓ రోజు అతడి కళ్లెదుట హత్య జరుగుతుంది. అనూహ్యంగా ఆ కేసులో సూర్య ఇరుక్కుంటాడు. సూర్య‌ని ఇరికించింది ఎవ‌రు? సూర్య కేసు నుంచి బయటపడ్డాడా లేదా? అన్నది ప్లాట్‌. 
    జూన్ 06 , 2024
    Tollywood Comedians As Heros: హీరోలుగా సత్తా చాటుతున్న ఈ తరం హాస్యనటులు వీరే..!
    Tollywood Comedians As Heros: హీరోలుగా సత్తా చాటుతున్న ఈ తరం హాస్యనటులు వీరే..!
    టాలీవుడ్‌కి చెందిన దిగ్గజ హాస్య నటులు గతంలో హీరోలుగా నటించి మంచి విజయాలు సాధించారు. బ్రహ్మానందం (Brahmandam), ‌అలీ (Ali), సునీల్‌ (Sunil), వేణుమాదవ్‌ (Venu Madhav) లాంటి సీనియర్‌ కమెడియన్లు పలు చిత్రాల్లో కథానాయకులుగా చేసి అలరించారు. తాజాగా ఈ జనరేషన్‌ కమెడియన్స్‌ కూడా వారిని ఆదర్శంగా తీసుకుంటున్నారు. కథానాయకులుగా కనిపిస్తూ ఆడియన్స్‌ను సర్‌ప్రైజ్‌ చేస్తున్నారు. సాలిడ్ కథతో వచ్చి మంచి హిట్స్‌ సైతం  సాధిస్తున్నారు. అలా రీసెంట్‌గా ఆడియన్స్‌ ముందుకు వచ్చిన వారెవరు? ఆ సినిమాలేంటి? ఇప్పుడు చూద్దాం.  సుహాస్‌ (Suhas) ప్రముఖ నటుడు సుహాస్‌.. వరుస హిట్లతో టాలీవుడ్‌లో దూసుకెళ్తున్నాడు. షార్ట్‌ఫిల్మ్స్‌తో ఫేమస్‌ అయిన సుహాస్‌.. 2018లో ‘పడి పడి లేచె మనసు’ సినిమాతో తెరంగేట్రం చేశాడు. తర్వాత ‘మజిలీ’, ‘ఏజెంట్‌ సాయి శ్రీనివాస ఆత్రేయ’, ‘డియర్‌ కామ్రేడ్‌’, ‘ప్రతిరోజూ పండగే’, ‘ఉమా మహేశ్వర ఉగ్ర రూపస్య’ చిత్రాల్లో హాస్య పాత్రలు పోషించి నవ్వులు పంచాడు. ‘కలర్‌ ఫొటో’తో తొలి ప్రయత్నంలోనే హీరోగా విజయం అందుకున్న సుహాస్‌..‘ఫ్యామిలీ డ్రామా’, ‘రైటర్‌ పద్మభూషణ్‌’ చిత్రాలతో మంచి పేరు సంపాదించాడు. రీసెంట్‌గా ‘అంబాజీపేట మ్యారేజి బ్యాండు’ (Ambajipeta Marriage Band)తో కథానాయకుడిగా తన స్థానాన్ని సుస్థిరం చేసుకున్నాడు. ప్రస్తుతం ‘కేబుల్‌ రెడ్డి’, ‘శ్రీరంగ నీతులు’, ‘ప్రసన్నవదనం’ తదితర చిత్రాల్లో సుహాస్‌ నటిస్తున్నాడు. వైవా హర్ష (Harsha Chemudu)  షార్ట్‌ఫిల్మ్స్‌ నుంచి వెండితెరపైకి వచ్చిన ప్రముఖ కమెడియన్స్‌లో వైవా హర్ష ఒకరు. ‘మసాలా’తో సినీ కెరీర్‌ ప్రారంభించిన హర్ష.. ‘ఎక్కడికి పోతావు చిన్నవాడా’, ‘రాజాది గ్రేట్‌’, ‘పక్కా కమర్షియల్‌’, ‘కార్తికేయ 2’, ‘బింబిసార’ తదితర చిత్రాల్లో నవ్వులు పూయించాడు. తాజాగా ‘సుందరం మాస్టర్‌’ (Sundaram Master) చిత్రంతో హర్ష కథానాయకుడిగా మారాడు. గతనెల ఫిబ్రవరిలో ఈ చిత్రం విడుదలై పాజిటివ్‌ టాక్ సొంతం చేసుకుంది.   అభినవ్‌ గోమటం (Abhinav Gomatam) యూత్‌లో మంచి క్రేజ్‌ సంపాదించుకున్న ఈ తరం హాస్య నటుల్లో ‘అభినవ్‌ గోమటం’ (Abhinav Gomatam) ముందు వరుసలో ఉంటాడు. షార్ట్‌ఫిల్మ్స్‌లో ప్రతిభ కనబరిచి సినిమాల్లోకి వచ్చి అభినవ్‌.. తొలి చిత్రం ‘ఈ నగరానికి ఏమైంది’తో అందరి దృష్టిని ఆకర్షించాడు. ‘మీకు మాత్రమే చెప్తా’, ‘మిస్‌ శెట్టి మిస్టర్‌ పొలిశెట్టి’ తదితర చిత్రాల్లోనూ కమెడియన్‌గా వినోదం పంచాడు. రీసెంట్‌గా  ‘మస్త్‌ షేడ్స్‌ ఉన్నయ్‌రా..’ (Masthu Shades Unnai Ra) సినిమాతో అభినవ్‌ హీరోగా మారాడు.  సుడిగాలి సుధీర్‌ (Sudigali Sudheer) ‘జబర్దస్త్‌’ వేదికగా బుల్లితెర ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించిన సుడిగాలి సుధీర్‌.. ‘అడ్డా’తో సినీ రంగంలోకి అడుగుపెట్టాడు. ‘రేసుగుర్రం’, ‘సుప్రీం’, ‘సర్దార్‌ గబ్బర్‌సింగ్’ తదితర చిత్రాల్లో సందడి చేసిన అతడు.. ‘సాఫ్ట్‌వేర్‌ సుధీర్‌’తో హీరో అయ్యాడు. తర్వాత ‘గాలోడు’, ‘కాలింగ్‌ సహస్ర’లో ప్రధాన పాత్రలు పోషించాడు. ప్రస్తుతం ‘జి.ఒ.ఎ.టి’ సినిమాతో తెలుగు ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధయ్యాడు. సత్యం రాజేష్‌ (Satyam Rajesh) సత్యం సినిమాతో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన రాజేష్‌.. ఆ మూవీ టైటిల్‌నే తన ఇంటి పేరుగా మార్చుకున్నాడు. ‘మా ఊరి పొలిమేర’ సినిమాతో హీరోగా మారిన అతడు.. మంచి విజయాన్ని సొంతం చేసుకున్నాడు. కొవిడ్‌ కారణంగా నేరుగా ఓటీటీలో విడుదలైన ఈ చిత్రానికి విశేష స్పందన వచ్చింది. దీనికి సీక్వెల్‌గా ఇటీవల వచ్చిన ‘మా ఊరి పొలిమేర 2’ గతేడాది చివర్లో థియేటర్లలో రిలీజై హిట్‌ టాక్‌ తెచ్చుకుంది.  ప్రియదర్శి (Priyadarsi) యంగ్‌ కమెడియన్‌ ప్రియదర్శి కూడా పలు చిత్రాల్లో హీరోగా నటిస్తూ మంచి గుర్తింపు సంపాదించాడు. ‘మల్లేశం’తో తొలిసారి కథానాయకుడిగా మారిన ప్రియదర్శి.. గతేడాది ‘బలగం’ (Balagam) సినిమాతో సాలిడ్‌ విజయాన్ని అందుకున్నాడు. ఇటీవల ‘మంగళవారం’  (Mangalavaram) చిత్రంలో ప్రధాన పాత్ర పోషించి అలరించాడు. దర్శకుడు మోహనకృష్ణ ఇంద్రగంటి తెరకెక్కించనున్న ఓ సినిమాకి ప్రియదర్శి హీరోగా ఎంపికయ్యాడు. వెన్నెల కిషోర్‌ (Vennela Kishore) టాలీవుడ్‌లోని స్టార్‌ కమెడియన్స్‌లో వెన్నెల కిషోర్‌ ఒకరు. తన తొలి సినిమా ‘వెన్నెల’ టైటిల్‌ను ఇంటి పేరుగా మార్చుకున్న కిషోర్‌.. ‘దూకుడు’, ‘జులాయి’ వంటి పలు సూపర్‌ చిత్రాల్లో హాస్య నటుడిగా మెప్పించాడు. ‘అతడు ఆమె ఓ స్కూటర్‌’తో కథానాయకుడిగా మారిన కిషోర్‌.. రీసెంట్‌గా  ‘చారి 111’ (Chari 111)తో మరోమారు ప్రేక్షకుల ముందుకొచ్చాడు. అయితే ప్రేక్షకులను అలరించడంలో ఈ సినిమా విఫలమైంది.  ధన్‌రాజ్‌ (Dhanraj) జబర్దస్త్‌ షో ద్వారానే మంచి గుర్తింపు తెచ్చుకున్న మరో కమెడియన్‌ ధన్‌రాజ్‌. ‘బుజ్జీ ఇలారా’ చిత్రంలో ప్రధాన పాత్రదారిగా కనిపించిన ధన్‌రాజ్‌.. ప్రస్తుతం ‘రామం రాఘవం’లో లీడ్‌ రోల్‌లో నటిస్తున్నాడు. ఈ సినిమాకు అతడే దర్శకత్వం వహిస్తుండటం విశేషం. దర్శకుడు సముద్రఖని మరో కీలక పాత్రలో కనిపించనున్నాడు. 
    మార్చి 14 , 2024
    Summer Movies 2024: ‘ఫ్యామిలీ స్టార్‌’, ‘టిల్లు స్క్వేర్‌’కి బెస్ట్ ఛాన్స్‌.. అలా జరిగితే కలెక్షన్ల సునామీనే!
    Summer Movies 2024: ‘ఫ్యామిలీ స్టార్‌’, ‘టిల్లు స్క్వేర్‌’కి బెస్ట్ ఛాన్స్‌.. అలా జరిగితే కలెక్షన్ల సునామీనే!
    సాధారణంగా సినిమా పరిశ్రమకు సంక్రాంతి (Sankranti) తరువాత సమ్మర్ సీజన్‌ (Summer Season) అత్యంత లాభదాయకంగా ఉంటుంది. ఎందుకంటే స్కూళ్లు, కాలేజీలకు వేసవి సెలవులు ఉండటంతో యూత్‌, చిన్నారుల తల్లిదండ్రులు సమ్మర్‌లో సినిమాలు చూసేందుకు ఆసక్తి కనబరుస్తారు. దీన్ని క్యాష్‌ చేసుకునేందుకు ప్రతీ సమ్మర్‌లోనూ పెద్ద హీరోల సినిమాలు రెడీగా ఉంటాయి. అయితే 2024 సమ్మర్‌లో మాత్రం ఏ స్టార్‌ హీరొ సినిమా విడుదలకు నోచుకోవడం లేదు. వాస్తవానికి ‘దేవర’ (Devara), ‘కల్కి 2898 ఏడీ’ (Kalki 2898 AD) వంటి చిత్రాలను సమ్మర్‌లో రిలీజ్‌ చేయాలని మేకర్స్ ప్లాన్‌ చేశారు. కానీ అది సాధ్యపడలేదు. దీంతో ఈ సమ్మర్‌ మెుత్తానికి ఇద్దరు యంగ్‌ హీరోల సినిమాలే దిక్కుగా కనిపిస్తున్నాయి. అవి సరైన విజయం సాధిస్తే కలెక్షన్ల పరంగా ఆ చిత్రాలకు తిరుగుండదని చెప్పవచ్చు. ఇంతకీ ఆ సినిమాలు ఏవో ఇప్పుడు చూద్దాం.  సమ్మర్‌లో ఆ చిత్రాలదే హవా! ప్రస్తుతం అందరి దృష్టిని ఆకర్షిస్తున్న అప్‌కమింగ్‌ చిత్రాలు.. ‘టిల్లు స్క్వేర్‌’ (Tillu Square), ‘ఫ్యామిలీ స్టార్‌’’ (Family Star). సిద్ధు జొన్నలగడ్డ (Siddu Jonnalagadda), అనుపమా పరమేశ్వరన్‌ (Anupama Parameswaran) జంటగా నటించిన 'టిల్లు స్క్వేర్‌' (Tillu Square Release Date) చిత్రం మార్చి 29న ధియేటర్స్‌లోకి రానుంది. అటు విజయ్‌ దేవరకొండ (Vijay Devarakonda) హీరోగా మృణాల్‌ ఠాకూర్‌ (Mrunal Thakur) హీరోయిన్‌గా చేసిన 'ఫ్యామిలీ స్టార్‌’' (Family Star Release Date) ఏప్రిల్‌ 5న థియేటర్స్‌లోకి రానుంది. ఈ చిత్రాలు మినహా మరే పెద్ద హీరో సినిమా ఈ సమ్మర్‌లో లేకపోవడంతో అందరి దృష్టి వీటిపైనే పడింది.  హిట్‌ అయితే కలెక్షన్స్‌ సునామే! ‘టిల్లు స్క్వేర్‌’, ‘ఫ్యామిలీ స్టార్‌’’ చిత్రాలు రెండూ కూడా యూత్‌ను టార్గెట్‌ చేసుకొని వస్తున్నాయి. ముఖ్యంగా సమ్మర్ లో స్టూడెంట్స్ అందరూ కూడా సెలవులతో ఉంటారు. కాబట్టి ఇవి రెండూ కూడా రిలీజ్ అనంతరం మంచి సక్సెస్ అందుకుంటే వచ్చే కలెక్షన్స్ సూపర్‌గా ఉంటాయని సినీ విశ్లేషకులు అంటున్నారు. మరి ఇవి రెండూ కూడా ఆ చక్కని అవకాశాన్ని వినియోగించుకుంటాయో లేదో చూడాలి. కాగా ‘ఫామిలీ స్టార్’ మూవీకి పరశురామ్ పెట్ల దర్శకత్వం వహించగా.. ‘టిల్లు స్క్వేర్’ను మల్లిక్ రామ్ తెరకెక్కిస్తున్నారు. హిట్‌ కాంబో రిపీట్‌ అవుతుందా? ‘టిల్లు స్క్వేర్‌’కు ముందు సిద్దు జొన్నలగడ్డ, డైరెక్టర్‌ మల్లిక్‌ రామ్‌ (Mallik Ram) కాంబోలో వచ్చిన ‘డీజే టిల్లు’ (DJ Tillu) బ్లాక్‌ బాస్టర్‌ విజయాన్ని అందుకుంది. ముఖ్యంగా ఇందులో సిద్ధు తన నటనతో, డైలాగ్స్‌తో ఆడియన్స్‌ను ఫిదా చేశాడు. తనదైన కామెడీ టైమింగ్‌తో తెలుగు ప్రేక్షకులను అలరించాడు. సిద్ధు కెరీర్‌లోనే ‘డీజే టిల్లు’ బిగ్గెస్ట్‌ హిట్‌గా నిలిచింది. మరోవైపు డైరెక్టర్‌ పరుశురామ్‌ పెట్ల, నటుడు విజయ్‌ దేవరకొండ కాంబినేషన్‌లో గతంలో వచ్చిన ‘గీతా గోవిందం’ (Geetha Govindam) ఘన విజయం అందుకుంది. రష్మిక మందన్న హీరోయిన్‌గా చేసిన ఈ చిత్రం ఫ్యామిలీ ఆడియన్స్‌ను విపరీతంగా ఆకట్టుకుంది. దీంతో ఈ సూపర్‌ హిట్‌ కాంబోలో వస్తున్న టిల్లు స్క్వేర్‌, ఫ్యామిలీ మ్యాన్‌ చిత్రాలు కూడా కచ్చితంగా విజయాన్ని సాధిస్తాయని ఫ్యాన్స్ నమ్మకంగా ఉన్నారు.  సమ్మర్‌పై కన్నేసిన ‘సుహాస్‌’ హాస్యనటుడిగా కెరీర్ ప్రారంభించి హీరోగా తనని తాను నిరూపించుకున్న నటుడు సుహాస్ (Suhas). రీసెంట్‌గా ‘అంబాజీపేట మ్యారేజీ బ్యాండు’ (Ambajipeta Marriage Band) సినిమాతో హిట్ కొట్టిన ఈ హీరో తాజాగా ‘ప్రసన్నవదనం’ (Prasanna Vadanam) అనే మూవీతో రాబోతున్నాడు. అర్జున్ వైకే ద‌ర్శక‌త్వం వ‌హిస్తున్న ఈ సినిమా.. మే 3న థియేటర్లలోకి రానుంది. ఈ సినిమాలో పాయల్ రాధాకృష్ణ, రాశీ సింగ్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఇక ఇప్పటికే ఈ సినిమా నుంచి టీజ‌ర్ విడుద‌ల చేయ‌గా.. ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ వ‌చ్చింది. ఈ నేపథ్యంలో ఈ సినిమాపై కూడా ఆడియన్స్‌లో బజ్‌ ఏర్పడింది. 
    మార్చి 21 , 2024
    Telugu dubbed movies: ఈ సినిమాలను అస్సలు మిస్‌ కావొద్దు.. ఒక్కసారైన చూసి తీరాల్సిన చిత్రాలు!
    Telugu dubbed movies: ఈ సినిమాలను అస్సలు మిస్‌ కావొద్దు.. ఒక్కసారైన చూసి తీరాల్సిన చిత్రాలు!
    ప్రస్తుతం భారతీయ సినిమా మరింత సరళంగా మారింది. ఒక భాషలో రిలీజైన సినిమాలను మరో భాషలోని ప్రేక్షకులు చూసి ఆదరిస్తున్నారు. కంటెంట్ బాగుంటే భాషతో సంబంధం లేకుండా ప్రేక్షకులు ఆ సినిమాకు బ్రహ్మరథం పడుతున్నారు. మరి గత రెండేళ్లలో తెలుగులోకి చాలా చిత్రాలు వివిభ భాషల నుంచి డబ్ అయ్యాయి. వాటిలో సూపర్ హిట్‌ అయిన మలయాళం, తమిళ్, కన్నడ, హిందీ చిత్రాలతో పాటు అవి ఏ ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లో అందుబాటులో ఉన్నాయో ఓసారి చూద్దాం. [toc] Best malayalam movies in telugu ప్రేమలు రీసెంట్‌గా వచ్చిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద ప్రభంజనం సృష్టించింది. యూనిక్ కథాంశంతో యూత్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. ముఖ్యంగా తెలుగులో ఈ సినిమా మంచి కలెక్షన్లు రాబట్టింది. ఈ చిత్రం కథంతా హైదరాబాద్ కేంద్రంగా ఉండటంతో తెలుగు ప్రేక్షకులు బాగా కనెక్ట్ అయ్యారు. ఇక సినిమా కథలోకి వెళ్తే..స‌చిన్.. ఉన్న‌త చ‌దువుల కోసం విదేశాల‌కు వెళ్లాల‌ని క‌ల‌లు కంటాడు. వీసా రిజెక్ట్ కావ‌డంతో గేట్ కోచింగ్ కోసం హైద‌రాబాద్ వ‌స్తాడు. సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగిని రీనూతో తొలి చూపులోనే ప్రేమ‌లో ప‌డ‌తాడు. అప్ప‌టికే ల‌వ్‌లో ఫెయిలైన స‌చిన్‌.. రీనూకు త‌న ప్రేమ‌ను ఎలా చెప్పాడు? రీనూను ప్రేమిస్తున్న ఆది ఎవ‌రు? స‌చిన్‌ - రీనూ చివ‌ర‌కు కలిశారా? లేదా? అన్న‌ది క‌థ‌. మంజుమ్మెల్‌ బాయ్స్‌  ఈ చిత్రం మంచి ఎమోషనల్ బ్యాక్‌డ్రాప్‌లో సస్పెన్స్ థ్రిల్లర్ కథాంశంతో వచ్చింది. ఈ సినిమా దేశవ్యాప్తంగా అన్ని భాషల్లో మంచి వసూళ్లు సాధించింది. ఇక ఈ సినిమా కథలోకి వెళ్తే.. కేర‌ళ‌ కొచ్చికి చెందిన కుట్ట‌న్, సుభాష్ స్నేహితులతో కలిసి కొడైకెనాల్ ట్రిప్‌లో భాగంగా గుణ కేవ్స్‌కు వెళ్తారు. అక్క‌డ సుభాష్ పొరపాటున 150 అడుగులకు పైగా లోతున్న డెవిల్స్ కిచెన్ లోయ‌లో ప‌డ‌తాడు. ఆ త‌ర్వాత ఏమైంది? పోలీసులు, రెస్క్యూ సిబ్బంది వారికి ఎందుకు సహకరించలేదు? సుభాష్‌ను కాపాడి తీసుకురావ‌డానికి తోటి మిత్రులు ఏం చేశారు? అన్నది కథ. ఆవేశం ఇటీవల మలయాళంలో బ్లాక్ బాస్టర్ అయిన ఆవేశం చిత్రం అన్ని భాషల్లోనూ అదే హవా కొనసాగించింది. ఈ చిత్రం ఏకంగా రూ.150 కోట్ల కలెక్షన్లు రాబట్టింది. కామెడీ యాక్షన్ జొనర్‌లో వచ్చి మంచి ఎంటర్‌టైనింగ్ అందించింది. ఈ సినిమా కథలోకి వెళ్తే..కేరళకు చెందిన బీబీ (మిథున్ జై శంకర్), అజు (హిప్‌స్టర్), మరియు శాంతన్ (రోషన్ షానవాజ్) ముగ్గురు స్నేహితులు బెంగళూరులోని ఒక ఇంజనీరింగ్ కళాశాలలో చదువుతుంటారు. కాలేజీలో సీనియర్లు కారణం లేకుండా కొడుతుంటారు. దీంతో వారికి బుద్ధి చెప్పాలని నిర్ణయించుకుంటారు. ఈక్రమంలో గ్యాంగ్‌స్టర్ అయిన రంగాతో(ఫాహద్ ఫాసిల్) ఫ్రెండ్‌షిప్ చేస్తారు. రంగా స్నేహం వారి జీవితాలను ఏవిధంగా మార్చిందనేది కథ. ది గోట్ లైఫ్ ఈ చిత్రం విమర్శకుల ప్రశంసలు అందుకుంది. బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని సాధించింది. ఇక కథలోకి వెళ్తే.. నజీబ్ (పృథ్వీరాజ్ సుకుమారన్) తన భార్య సైను (అమలా పాల్)తో ఆనందంగా జీవిస్తుంటాడు. తన స్నేహితుడి సలహాతో దుబాయ్ వెళ్లి డబ్బు సంపాదించాలని నిర్ణయించుకుంటాడు. దుబాయి వెళ్లిన నజీబ్.. ఖలిప్ చేతిలో ఇరుక్కుంటాడు. నజీబ్‌ను బలవంతంగా గొర్రెలను కాసేలా ఓ ఎడారిలో బంధిస్తారు. ఈక్రమంలో నజీబ్ అక్కడి నుంచి తప్పించుకోవడానికి ఎలాంటి కష్టాలు పడ్డాడు? తిరిగి తన కుటుంబాన్ని చేరుకున్నాడా? లేదా? అన్నది మిగతా కథ RDX మార్షియల్ ఆర్ట్స్ నేపథ్యంలో వచ్చిన ఈ చిత్రం మలయాళంలో బ్లాక్ బాస్టర్‌ హిట్‌గా నిలిచింది.  2018 కేరళ వరదల నేపథ్యంలో వచ్చిన చిత్రమిది. ఎమోషనల్ డ్రామాగా తెరకెక్కిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని సాధించింది. ఈ చిత్రాన్ని ఆంథోని జోసెఫ్‌ డైరెక్ట్ చేశాడు. కింగ్ అఫ్ కొత్త ఖన్నా భాయ్ (డ్యాన్స్ రోజ్ షబీర్) కోతా పట్టణంలో డ్రగ్స్ వ్యాపారి. సిఐ షాహుల్ హాసన్ (ప్రసన్న) పట్టణంలో డ్రగ్స్ మాఫియాను నిర్మూలించాలని కంకణం కట్టుకుంటాడు. కొన్నేళ్ల క్రితం కోతా... రాజు (దుల్కర్ సల్మాన్) నియంత్రణలో ఉందని, ఒకప్పుడు ఖన్నా భాయ్ రాజుకి ప్రియమైన స్నేహితుడని షాహుల్ తెలుసుకుంటాడు. కానీ కొన్ని కారణాల వల్ల రాజు మరియు ఖన్నా భాయ్ ఇద్దరూ విడిపోయారు. వారిని వేరు చేసింది ఏమిటి? అప్పుడు సీఐ షాహుల్ హాసన్ ఏం చేశాడు? అనేది కథ రోమాంచం రోమాంచం చిత్రం మలయాళంలో వచ్చిన కామెడీ హర్రర్ చిత్రం. ఈ చిత్రాన్ని జితు మాధావన్ తెరకెక్కించారు. ఈ సినిమా నిజజీవితంలో జరిగిన సంఘటనల ఆధారంగా తెరకెక్కింది. కథలోకి వెళ్తే…. బెంగుళూరులోని ఓ ఇంట్లో ఉండే ఏడుగురు బ్యాచిలర్ స్నేహితుల కథే ఈ చిత్రం. అందులో ఒకరు ఉద్యోగం చేస్తుంటారు, మరొకరు వ్యాపారాలు చేస్తూ విఫలమవుతుంటాడు. ఇద్దరు ఇంటర్వ్యూని క్రాక్ చేస్తారు కానీ ఇంకా ఆఫర్ లెటర్ అందదు. ఒకరు పెట్రోల్ పంపులో పనిచేస్తున్నారు. మిగిలిన ఇద్దరూ ఏమీ చేయకుండా తమ జీవితాలను సాగిస్తుంటారు. ఇలా సాగుతున్న వీరి జీవితాల్లోకి ఓ అనూహ్య పరిణామం చోటు చేసుకుంటుంది. ఇంతకీ ఎంటా పరిణామం? దాని వల్ల వీరి జీవితాలు ఎలా మారాయి అనేది కథ. భ్రమయుగం తేవన్ అనే గాయకుడు అడవిలో ప్రయాణిస్తూ ఓ పాడుబడ్డ పెద్ద భవంతికి వెళ్తాడు. అక్కడ యజమాని మమ్మూటీ (కుడుమోన్ పొట్టి), ఓ వంటవాడు ఉంటాడు. అనూహ్య పరిణామాల తర్వాత తేవన్ ఆ ఇంటి నుంచి పారిపోవాలని అనుకుంటాడు. అసలు తేవన్ ఏం చూసి భయపడ్డాడు? కుడుమోన్ పొట్టి ఎవరు? అడవిలో ఏం చేస్తున్నాడు? అన్నది కథ. అన్వేషిప్పిన్ కండెతుమ్ ఈ సినిమా మంచి సస్పెన్స్‌ను క్యారీ చేస్తూ.. ఆసక్తికరంగా కథనం సాగుతుంది. ఎస్సై ఆనంద్ నారాయణ్ ఓ కారణం చేత సస్పెండ్ అవుతాడు. ఓ యువతి హత్య కేసు మిస్టరీగా మారుతుంది. దీంతో ట్రాక్‌ రికార్డ్ ఆధారంగా ఆనంద్‌ను రంగంలోకి దింపుతారు. ఈ కేసును హీరో ఎలా సాల్వ్‌ చేశాడు? విచారణకు వెళ్లిన ఆనంద్‌కు ప్రజలు ఎందుకు సహకరించలేదు? అన్నది స్టోరీ. మలైకోట్టై వాలిబన్ స్వాతంత్య్రం కోసం బ్రిటీష్ వారిని ఎదురించి పోరాడిన ఓ నాయ‌కుడి క‌థ‌తో ఈ మూవీ తెర‌కెక్కింది. ఈ పోరాటంలో వాలిబాన్‌ (మోహ‌న్‌లాల్)కు ఎలాంటి అడ్డంకులు ఎదురయ్యాయి? ఆ ప్రాంత ప్రజలకు అతడు హీరోగా ఎలా నిలిచాడు? అన్నది కథ. నెరు కళ్లు కనిపించని సారా మహ్మద్‌ అనే యువతిపై ఒక బడా వ్యాపారి కొడుకు అత్యాచారం చేస్తాడు. పోలీసులు అతడ్ని అరెస్టు చేసినప్పటికీ నిందితుడు తన పలుకుబడితో వెంటనే బెయిల్‌పై బయటకొస్తాడు. దీంతో సారా తల్లిదండ్రులు లాయర్‌ విజయ్‌ మోహన్‌ (మోహన్‌లాల్‌)ని ఆశ్రయిస్తారు. అతడు సారాకు ఎలా న్యాయం చేశాడు? అన్నది కథ. మాలికాపురం ఎనిమిదేళ్ల చిన్నారి షన్ను అయ్యప్ప స్వామి భక్తురాలు. షన్ను కుటుంబంలో ఊహించని పరిణామాలు చోటుచేసుకుంటాయి. దీంతో సోదరుడు బుజ్జితో కలిసి షన్ను శబరిమలై బయలుదేరుతుంది. ఆ తర్వాత ఏం జరిగింది? పిల్లలు కిడ్నాప్‌ చేసే గ్యాంగ్‌ షన్నును ఎలా ఇబ్బంది పెట్టింది? కథలో ఉన్ని ముకుందన్ పాత్ర ఏంటి? అన్నది కథ. Best  Tamil movies in telugu డియర్ అర్జున్‌ (జీవి ప్రకాష్‌) న్యూస్‌ రీడర్‌గా గొప్ప పేరు తెచ్చుకునేందుకు యత్నిస్తుంటాడు. అయితే నిద్రలో చిన్న శబ్దం వచ్చినా ఉలిక్కిపడి లేస్తుంటాడు. అటువంటి అర్జున్‌ లైఫ్‌లోకి భార్యగా దీపిక వస్తుంది. ఆమెకున్న గురక సమస్య.. అర్జున్‌కు ఎలాంటి ఇబ్బందులు తెచ్చిపెట్టింది? అన్నది కథ. ఓటీటీ: నెట్‌ఫ్లిక్స్ సైరన్ ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద రాణించనప్పటికీ.. విమర్శకుల ప్రశంసలు అందుకుంది. ఇక సినిమా కథలోకి వెళ్తే..భార్యను (అనుప‌మ)ను చంపిన కేసులో తిల‌గ‌న్‌ (జ‌యం ర‌వి) జైలుకు వెళ్తాడు. పెరోల్‌పై బయటకొచ్చిన తిలగన్‌.. వరుసగా పొలిటిషియన్స్‌ను హత్య చేస్తుంటాడు. పోలీస్ ఆఫీస‌ర్‌ నందిని (కీర్తిసురేష్‌) అతడ్ని పట్టుకునేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తుంటుంది. అసలు తిలగన్ ఎందుకు ఆ హత్యలు చేస్తున్నాడు? తన భార్యను తిలగన్ నిజంగానే చంపాడా? లేదా? అన్నది కథ. ఓటీటీ: హాట్‌ స్టార్ లియో హిమాచల్ ప్రదేశ్‌లోని ఓ చిన్న పట్టణంలో పార్తీబన్ (విజయ్) కాఫీ షాప్ నడుపుతుంటాడు. భార్య సత్య (త్రిష), ఇద్దరు పిల్లలతో అతడి జీవితం సంతోషంగా సాగుతుంటుంది. ఈ క్రమంలోనే ఊరి ప్రజల నుంచి హైనాను, హైనా నుంచి ఊరి ప్రజలను పార్తీబన్ కాపాడటంతో అతడి ఫోటోలు పేపర్లలో వస్తాయి. ఇదే సమయంలో ఏపీలోని ఆంటోనీ దాస్ (సంజయ్ దత్) & గ్యాంగ్ హిమాచల్ ప్రదేశ్ వస్తారు. లియో దాస్‌గా ఉన్న పార్తీబన్‌ కోసం వెంటాడుతారు. ఇంతకీ లియో దాస్ ఎవరు? అతని గతం ఏమిటి? అనేది మిగిలిన కథ. ఓటీటీ:  నెట్‌ఫ్లిక్స్ జైలర్ ఈ చిత్రం సరైన హిట్‌లేక సతమతమవుతున్న రజినీకాంత్‌కు సాలిడ్ విజయాన్ని అందించింది. బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురిపించింది. చాలా రోజుల తర్వాత వింటేజ్ రజనీకాంత్ ఈ సినిమాలో కనిపిస్తాడు. ముత్తు వేలు(రజనీకాంత్) నీతి నిజాయితి కలిగిన ఓ రిటైర్డ్ పోలీస్ అధికారి. అతని కొడుకు ఏసీపీ అర్జున్‌ తండ్రిలాగే నీతి నిజాయితి కలిగిన పోలీస్‌ ఆఫీసర్‌గా పేరు తెచ్చుకుంటాడు. ఈక్రమంలో విగ్రహాల దొంగతనం ముఠా నాయకుడు వర్మ(వినాయకన్) వల్ల అర్జున్‌ చనిపోతాడు. ఆ తర్వాత ముత్తు వేలు ఏం చేశాడు? వర్మపై ఏవిధంగా ప్రతికారం తీర్చుకున్నాడు అనేది మిగిలిన కథ. ఓటీటీ; హాట్ స్టార్ విక్రమ్ ఈ సినిమా మరోసారి వింటేజ్ కమల్ హాసన్‌ను గుర్తు తెచ్చింది. ప్రతి ఫ్రేమ్‌లోనూ కమల్ హాసన్ తన యాక్టింగ్‌తో అదరగొట్టాడు. బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా భారీ విజయం సాధించింది. ఇక కథలోకి వెల్తే.. డ్రగ్ మాఫియా కేసును విచారిస్తున్న ఏజెంట్ విక్రమ్ సస్పెండ్ అయిన తర్వాత అండర్‌ గ్రౌండ్‌కు వెళ్తాడు. ఈ క్రమంలో డ్రగ్ మాఫియా డాన్ సంతానం మిస్‌ అయిన ఓ భారీ డ్రగ్ కంటైనర్‌ కోసం వెతుకుతుంటాడు. అండర్‌గ్రౌండ్‌లో ఉన్న విక్రమ్ తన కొడుకు చావుకు కారణమైన వ్యక్తిని చంపుతాడు. అసలు విక్రమ్ కొడుకును చంపిందెవరు? డ్రగ్ కంటైనర్‌ను దక్కించుకునేందుకు సంతానం ఎలాంటి క్రూరత్వాన్ని ప్రదర్శించాడు? విక్రమ్, సంతానం మధ్య వైరం ఎందుకొచ్చింది అన్నది మిగతా కథ. ఓటీటీ; హాట్ స్టార్, జీ5 కాల్వన్ ఓ అడవిలో రాత్రి వేళ హత్యలు జరుగుతుంటాయి. కెంబన్‌ ఆ అడవి సమీపంలో అనాథలా జీవిస్తూ రాత్రి సమయాల్లో దొంగతనాలు చేస్తుంటాడు. హీరోయిన్‌ అతడి జీవితంలోకి రావడం.. కెంబన్‌ గురించి ఓ నిజం తెలుసుకోవడంతో కథ మలుపు తిరుగుతుంది. ఆ తర్వాత ఏమైంది? అన్నది కథ. ఓటీటీ: హాట్‌స్టార్ అయాలన్ భవిష్యత్‌లో ఇంధన అవసరం చాలా ఉందని గ్రహించిన ఆర్యన్‌ (శరద్‌ ఖేల్కర్‌) భూమిని చాలా లోతుకు తవ్వాలని అనుకుంటాడు. దీంతో భూమిపై ఉన్న జీవరాశులకు ముప్పు ఉందని గ్రహించిన ఓ ఏలియన్‌ భారత్‌లో ల్యాండ్‌ అవుతుంది. అలా వచ్చిన ఏలియన్‌కు ఎలాంటి పరిస్థితులు ఎదురయ్యాయి? హీరో శివకార్తికేయన్‌కు ఏలియన్‌కు మధ్య సంబంధం ఏంటి? అన్నది కథ. ఓటీటీ: సన్ నెక్ట్స్ మెర్రీ క్రిస్మస్ ఆల్బర్ట్‌ (విజయ్‌ సేతుపతి) ఏడేళ్ల తర్వాత బాంబేకు వస్తాడు. ఓ సినిమాకు వెళ్లగా అక్కడ కూతురుతో వచ్చిన మరియా (కత్రినా కైఫ్‌)తో పరిచయం ఏర్పడుతుంది. ఆమె క్రిస్మస్‌ వేడుకలకు ఇంటికి ఆహ్వానిస్తుంది. అయితే ఇంట్లో మరియా భర్త హత్యకు గురై కనిపిస్తాడు. ఆ హత్య చేసింది ఎవరు? ఆల్బర్ట్‌ గతం ఏంటి? అన్నది స్టోరీ. ఓటీటీ: నెట్‌ఫ్లిక్స్ అన్నపూర్ణి: ది గాడెస్ ఆఫ్ ఫుడ్ ఈ చిత్రం కాస్త వివాదాస్పదం అయింది. తమిళంలో హిట్ అయినప్పటికీ.. మిగతా భాషల్లో పెద్దగా ఆడలేదు. ఇక సినిమా కథలోకి వెళ్తే.. తమిళనాడులోని శ్రీరంగం ఆలయంలో రంగరాజ్ చెఫ్. ఆయన కూతురు అన్నపూరణి తండ్రిని చూసి చెఫ్ కావాలని అనుకుంటుంది. బ్రాహ్మణ కుటుంబంలో పుట్టిన ఈమె నాన్ వెజ్ ముట్టుకోవడం పాపం అని తండ్రి అంటాడు. మరి కలలు కన్నట్లు అన్నపూరణి చెఫ్ అయిందా? లేదా? అన్నది కథ. జపాన్ ఈ చిత్రం కార్తీ  నటించిన 25వ చిత్రం. ఈ సినిమాలో పేరుమోసిన దొంగ పాత్రలో కార్తీ అద్భుతంగా నటించాడు. అతని పాత్ర హెలెరియస్‌గా ఉంటుంది. హైదరాబాద్‌లోని రాయల్ జ్యువెలరీలో రూ.200 కోట్ల విలువలైన నగలు దోపిడికి గురవుతాయి. గోల్డెన్ స్టార్ జపాన్ (కార్తీ) ఈ దొంగతనం చేశాడని అంతా అనుమానిస్తారు. జపాన్‌ను పట్టుకునేందుకు హైదరాబాద్ పోలీసులు వెతుకుతుంటారు. మరోవైపు కేరళ, కర్ణాటక పోలీసులు కూడా జపాన్‌ కోసం గాలిస్తుంటారు. తన ప్రేయసిని కలిసే ప్రయత్నంలో జపాన్ దొరికిపోతాడు. అయితే ఆ సొత్తు జపాన్ దొంగలించలేదని విచారణలో తేలుతుంది. మరి ఆ నగల దొంగతనం చేసింది ఎవరు? ఓటీటీ: నెట్‌ఫ్లిక్స్ కెప్టెన్ మిల్లర్ కథ 1930 బ్యాక్‌డ్రాప్‌లో సాగుతుంది. ఈసా (ధ‌నుష్‌) నిమ్న‌ కులానికి చెందిన యువ‌కుడు. ఊరిలోని కుల‌ వివ‌క్ష‌ను భ‌రించ‌లేక గౌర‌వ మ‌ర్యాద‌ల కోసం బ్రిటీష్ ఆర్మీలో చేరతాడు. తన పేరును కెప్టెన్ మిల్ల‌ర్‌గా మార్చుకుంటాడు. కొన్ని అనూహ్య ఘటనల నేపథ్యంలో మిల్లర్‌ దొంగల గ్యాంగ్‌లో చేరి బ్రిటిష్‌ వారికి కావాల్సిన బాక్స్‌ను ఎత్తుకెళ్తాడు. దీంతో బ్రిటిష్ ఆర్మీ అధికారి మిల్లర్‌ను పట్టుకోవడం కోసం అతడి ఊరి ప్రజల్ని బందిస్తాడు. ఆ తర్వాత ఏం జరిగింది? మిల్లర్‌ ఊరి ప్రజల కోసం తిరిగి వచ్చాడా? మిల్లర్ కొట్టేసిన బాక్స్‌లో ఏముంది? సినిమాలో శివరాజ్‌కుమార్‌, సందీప్‌ కిషన్‌ పాత్రలు ఏంటి? అన్నది కథ. ఓటీటీ: ప్రైమ్ వీడియో చిన్నా మున్సిపాలిటీలో చిన్న ఉద్యోగం చేసుకునే చిన్నా ( సిద్ధార్థ్) తన అన్న చనిపోవడంతో... అతని కూతురు చిట్టి (సహస్ర శ్రీ) బాధ్యతలు తీసుకుంటాడు. ఈ క్రమంలో చిట్టి స్నేహితురాలేన మున్ని(సబియా) లైంగిక దాడికి గురవుతుంది. లైంగిక దాడి చేసింది చిన్నానే అని ఓ వీడియో బయటకు వస్తుంది. ఇంతలో చిట్టి కనిపించకుండా పోతుంది. నిజంగా మున్నిపై లైంగిక దాడి చేసింది చిన్నానేనా? అదృశ్యమైన చిట్టిని చిన్నా ఎలా కనిపెడుతాడు? అనేది మిగతా కథ 800 ఈ చిత్రంలో తొలుత విజయ్ సేతుపతి నటించినప్పటికీ.. తమిళనాడు నుంచి పెద్దఎత్తున ఆందోళనలు రావడంతో ఆయన ఈ సినిమా నుంచి తప్పుకున్నారు. ఇక కథలోకి వెళ్తే.. తేయాకు తోట‌ల్లో ప‌నిచేస్తున్న త‌మిళ కుటుంబంలో ముత్తయ్య ముర‌ళీధ‌ర‌న్‌ జన్మిస్తారు. శ్రీలంక‌లోని కాండీలో ఆ కుటుంబం బిస్కెట్ ఫ్యాక్ట‌రీ ఏర్పాటు చేస్తుంది. ఈ క్రమంలోనే సింహ‌ళులు, త‌మిళుల మ‌ధ్య ఘ‌ర్ష‌ణ‌లు చెల‌రేగుతాయి. దాంతో ముత్తయ్య కుటుంబం ప్రాణ భయంతో దూరంగా వెళ్లి త‌ల‌దాచుకుంటుంది. 70వ దశకంలో చెలరేగిన ఘ‌ర్ష‌ణ‌ల ప్రభావం త‌న బిడ్డపై ప‌డ‌కూడ‌ద‌ని ముత్తయ్య త‌ల్లిదండ్రులు ఏం చేశారు? ముత్తయ్యకి క్రికెట్‌పై ఆస‌క్తి ఎలా ఏర్పడింది? శ్రీలంక జ‌ట్టులో ఎలా చోటు సంపాదించాడు? ఎలాంటి అవ‌మానాల్ని, స‌వాళ్లని ఎదుర్కొని ఆట‌గాడిగా నిలబడ్డాడు? అనేది మిగతా కథ. ఓటీటీ: ప్రైమ్ వీడియో మార్క్ ఆంటోనీ మార్క్ (విశాల్) మెకానిక్‌గా పనిచేస్తుంటాడు. అతని స్నేహితుడు చిరంజీవి( సెల్వ రాఘవన్) ఒక టెలిఫోన్‌ మిషన్‌ను కనుగొంటాడు. ఆ టెలిఫొన్ మెషిన్ ద్వారా భూతకాలానికి చెందిన వ్యక్తులతో మాట్లాడవచ్చు. అయితే మార్క్ చనిపోయిన తన తండ్రి ఆంటోనికి కాల్ చేయాలనుకుంటాడు. ఆ క్రమంలో మార్క్ తన తండ్రిని కొంతమంది చంపాలనుకుంటున్నారన్న విషయం తెలుసుకుంటాడు. ఓటీటీ: ప్రైమ్ నాయకుడు అణగారిన వర్గానికి చెందిన మహారాజు రామాపురం ఎమ్మెల్యే. అయితే, అతడు, అతని కుమారుడు రఘు వీరకు కొన్నేళ్ల నుంచి మాట్లాడుకోవడం మానేశారు. మహారాజు జీవితంలో జరిగిన ఒక సంఘటన తండ్రి కోసం పోరాడేందుకు రఘుని ప్రేరేపిస్తుంది. ఇంతకు ఆ సమస్య ఏమిటి? వారు ఒకరితో ఒకరు మాట్లాడుకోవడం ఎందుకు మానేశారు?చివరికి ఏమి జరిగింది అనేది మిగిలిన కథ ఓటీటీ: నెట్‌ఫ్లిక్స్ సార్ బాలగంగాధర్ (ధనుష్ ) ఒక జూనియర్ మ్యాథ్స్ లెక్చరర్. సిరిపురం అనే గ్రామంలోని జూనియర్ కళాశాలకు మ్యాథ్స్ చెప్పడానికి వెళ్తాడు. అక్కడ ఉన్న స్టూడెంట్స్ అందరూ పాస్ అయ్యేలా చదువు చెబితే.. సీనియర్ మ్యాథ్స్ లెక్చరర్‌గా ప్రమోషన్ ఇస్తానని కాలేజీ యాజమాన్యం చెబుతుంది. అయితే, అక్కడ పరిస్థితులు బాలుకి అనుకూలంగా ఉండవు. అయినా, తన మాటలతో, చేతలతో ఆ సిరిపురం స్టూడెంట్స్‌ను ప్రభావితం చేస్తాడు. అనంతరం జరిగిన కొన్ని నాటకీయ పరిణామాల వల్ల బాలు జీవితంలో కొన్ని మార్పులు జరుగుతాయి. ఆ మార్పులు ఏమిటి అనేది మిగతా కథ ఓటీటీ: నెట్‌ఫ్లిక్స్ Best Kannada movies in telugu కబ్జ ఆర్కేశ్వర (ఉపేంద్ర), భారత వైమానిక దళ అధికారి, స్వాతంత్ర్య సమరయోధుల కుటుంబంలో జన్మించాడు. అతను సంపన్నమైన అమ్మాయి అయిన మధుమతి (శ్రియా శరణ్)ను ప్రేమిస్తాడు. వీరిద్దరు పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకుంటారు. ఇదేక్రమంలో అమరాపురను తమ  అధికారం కోసం భయంకరమైన గూండాలు మరియు రాజకీయ నాయకులు ఓ క్రైమ్ వరల్డ్‌గా  మార్చేస్తారు. అయితే అర్కేశ్వర క్రైమ్ ప్రపంచంలోకి ప్రవేశించి ఆ ప్రాంతానికి నాయకుడు ఎలా అవుతాడు? ఈ క్రమంలో అతను ఎదుర్కొన్న సవాళ్లు ఏంటి అనేది మిగతా కథ. సప్తసాగరాలు దాటి సైడ్ బి మను (రక్షిత్ శెట్టి) జైలు నుంచి వచ్చాక ఓ ఉద్యోగంలో చేరతాడు. తాను ప్రేమించిన ప్రియ (రుక్మిణి వసంత్) జ్ఞాపకాలే గుర్తుకు వస్తుండటంతో తనని వెతుకుతాడు. ప్రియ భర్త గోపాల్ దేశపాండే వ్యాపారంలో నష్టాలు రావడంతో తాగుడికి బానిసైపోయి ఇంటిని పట్టించుకోడు. దీంతో ప్రియ కష్టపడుతూ ఇంటిని నడుపుతుంది. తాను ప్రేమించిన అమ్మాయి సంతోషంగా లేదని తెలిసిన మను ఆమెని సంతోషంగా ఉంచడానికి ఏం చేశాడు ? వాళ్ళ కష్టాలు ఎలా తీర్చాడు? అన్నది మిగతా కథ. ఓటీటీ; ప్రైమ్ వీడియో ఘోస్ట్ బిగ్ డాడీ అలియాస్ ఘోస్ట్ తన గ్యాంగ్‌తో కలిగి ఓ జైలును ఆక్రమిస్తాడు. మాజీ సీబీఐ అధికారి వామన్ శ్రీనివాస్ కిడ్నాప్ చేస్తాడు. దీంతో ఈ కేసును సాల్వ్ చేయడానికి ప్రభుత్వం చరణ్ రాజ్‌ని రంగంలోకి దించుతుంది. ఇంతకీ ఈ బిగ్ డాడీ ఎవరు ? అతని గతం ఏమిటి ? అసలు అతను ఘోస్ట్‌గా ఎందుకు మారాడు ? అన్నది మిగతా కథ. ఓటీటీ: జీ5 బాయ్స్ హాస్టల్ ఓ బాయ్స్ హాస్టల్‌లో తన ఫ్రెండ్స్‌తో కలిసి ఉండే అజిత్ (ప్రజ్వల్) ఓ షార్ట్ ఫిల్మ్ తీయాలని స్క్రిప్ట్ ప్రిపేర్ చేసుకుంటూ ఉంటాడు. తమని టార్చర్ చేసే హాస్టల్ వార్డెన్‌ను తన ఫ్రెండ్స్‌తో కలిసి చంపేసినట్లుగా స్క్రిప్ట్‌లో రాసుకుంటాడు. అయితే నిజంగానే వార్డెన్‌ చనిపోతాడు. సుసైడ్‌ నోట్‌లో అజిత్‌, ‌అతడి ఫ్రెండ్స్ పేరు రాయడంతో కథ మలుపు తిరుగుతుంది. ఓటీటీ: ఈటీవీ విన్ కాటేరా ఈ సినిమా కన్నడ నాట బాక్సాఫీస్ వద్ద మంచి విజయం సాధించింది. ఈ చిత్రం విమర్శకుల ప్రశంసలు అందుకుంది. ఇక కథలోకి వెళ్తే.. భూస్వామిని చంపిన కేసులో జైలు శిక్ష‌ అనుభ‌విస్తున్న‌ కాటేరా (ద‌ర్శ‌న్‌) పెరోల్ మీద బ‌య‌ట‌కు వ‌స్తాడు. దీంతో కాటేరాను చంపేందుకు చాలా మంది ప్ర‌య‌త్నిస్తుంటారు. వారంద‌రూ ఎవ‌రు? కాటేరా భూస్వామిని ఎందుకు చంపాడు? భూస్వాములతో కాటేరాకు ఏంటి విరోధం? అన్నది కథ. ఓటీటీ: జీ5 టోబి టోబి చిన్నప్పటి నుంచి ఎన్నో వేధింపులకు గురవుతాడు. కోపం వస్తే అందరితో దారుణంగా ప్రవరిస్తుంటాడు. నిజానికి అమాయకుడైన టోనీని ఊరిపెద్ద ఆనంద హత్యలు చేసేందుకు ఉపయోగించుకుంటాడు. తనను వాడుకుంటున్నారని తెలుసుకున్న టోబి ఏం చేశాడు? ఎలా ప్రతీకారం తీర్చుకున్నాడు? అన్నది కథ. ఓటీటీ: సోనీ లీవ్ Best Hindi movies in telugu అమర్ సింగ్ చమ్కిలా జానపద గాయకుడు అమర్ సింగ్ చమ్కిలా జీవిత కథ ఆధారంగా ఈ సినిమా తెరకెక్కింది. పేద కుటుంబంలో జన్మించిన ఆయన  సింగర్‌ కావడాని కసితో ఎలా ఎదిగాడు? 27 ఎళ్లతో ఎంతో ఫేమస్ అయిన అతన్ని ఎవరు చంపారు అన్నది మిగతా కథ. ఓటీటీ: నెట్‌ఫ్లిక్స్ యానిమల్‌ ఈ చిత్రం సంచలన విజయం సాధించింది. సినిమాలో సన్నివేశాలపై అభ్యంతరాలు వ్యక్తమైనప్పటికీ వాటన్నింటినీ పటాపంచలు చేస్తూ ఘన విజయం సాధించింది. ఈ చిత్రం విజయంతో రణ్‌బీర్ కపూర్ మార్కెట్ దేశవ్యాప్తంగా పెరిగింది. దేశంలోని అత్యంత సంపన్నుల్లో బల్బీర్ సింగ్ (అనిల్ కపూర్) ఒకరు. ఆయన కుమారుడు రణ్ విజయ్ సింగ్ (రణబీర్ కపూర్). తండ్రి అంటే అమితమైన ప్రేమ. అయితే తన దూకుడు మనస్తత్వం కారణంగా హీరోకి తండ్రితో దూరం పెరుగుతుంది. దీంతో అమెరికా వెళ్లిపోతాడు. ఓ రోజు తండ్రిపై హత్యయాత్నం జరిగినట్లు తెలిసుకొని విజయ్‌ ఇండియాకు వస్తాడు. ఆ తర్వాత ఏం జరిగింది? బల్బీర్‌పై దాడి చేసిన వారిపై హీరో ఎలా ప్రతికారం తీర్చుకున్నాడు? అన్నది కథ. ఓటీటీ: నెట్‌ఫ్లిక్స్ మైదాన్ 1952లో జరిగిన ఒలింపిక్స్‌ పోటీల్లో భారత ఫుట్‌బాల్‌ జట్టు.. విఫలమవుతుంది. దీంతో జట్టును టార్గెట్‌ చేస్తూ విమర్శలు వస్తాయి. అప్పుడు కోచ్‌ సయ్యద్ అబ్దుల్‌ రహీమ్‌ (అజయ్‌ దేవగన్‌) ఏం చేశాడు? కొత్త ఆటగాళ్లతో తన ప్రయాణాన్ని ఎలా మెుదలుపెట్టాడు? ఒలింపిక్స్‌లో ఆ జట్టు ఎలాంటి ప్రదర్శన చేసింది? భారత జట్టు కోచ్‌గా అతడు ఏం సాధించాడు? అన్నది కథ. ఓటీటీ: నెట్‌ఫ్లిక్స్ లస్ట్ స్టోరీస్ 2 లస్ట్ స్టోరీస్ 2లో మొత్తం నాలుగు కథలు ఉంటాయి. మొదటి కథలో మృణాల్, అంగన్ బేడీ పెళ్లి చేసుకోవాలనుకుంటారు. పెద్దలు కూడా ఒప్పుకుంటారు. అయితే మృణాల్ నానమ్మ.. పెళ్లికి ప్రేమ కంటే బలమైన శారీరక సంబంధం ముఖ్యమని స్పష్టం చేస్తుంది. ఆ తర్వాత మృణాల్- బేడీ ఎం చేశారన్నది ఫస్ట్ కథ. రెండో కథలో ఓనర్ లేనప్పుడు పనిమనిషి తన భర్తను తెచ్చుకుని లైంగికానందం పొందుతుంది. అయితే వీరిద్దరిని చూసిన ఓనర్ ఏం చేసింది అనేది రెండో కథ. ఇక మూడో కథలో ఎక్స్ బాయ్ ఫ్రెండ్ అయిన విజయ్ వర్మ కొన్నేళ్ల తర్వాత తమన్నను కలుస్తాడు. వీరిద్దరు శారీరకంగా దగ్గరైన తర్వాత ఏం జరిగింది అనేది కథ. నాల్గొ కథలో కామంతో రగిలిపోతున్న తన భర్త విషయంలో కాజల్ ఏమి చేసింది అనేది కథ.. ఈ చిత్రంపై పెద్ద ఎత్తున విమర్శలు వచ్చినప్పటికీ ప్రేక్షకుల నుంచి మంచి ఆదరణ లభించిందని చెప్పవచ్చు. ఓటీటీ: నెట్‌ఫ్లిక్స్ మర్డర్ ముబారక్ రాయల్‌ ఢిల్లీ క్లబ్‌లో ఓ మృతదేహం కలకలం సృష్టిస్తుంది. ఈ మిస్టరీని ఛేదించేందుకు ఏసీపీ సింగ్‌ రంగంలోకి దిగుతాడు. క్లబ్‌లో సభ్యులుగా ఉన్న బాంబి (సారా అలీఖాన్‌), నటి షెహనాజ్‌ నూరాని (కరిష్మా కపూర్‌), రాయల్‌ రన్‌విజయ్‌ (సంజయ్‌ కపూర్‌), లాయర్‌ ఆకాష్‌ (విజయ్‌ వర్మ)లపై అనుమానం వ్యక్తం చేస్తాడు. ఇంతకీ ఆ మర్డర్‌ చేసింది ఎవరు? దర్యాప్తులో తేలిన అంశాలేంటి? అన్నది కథ. ఓటీటీ: నెట్‌ఫ్లిక్స్ భక్షక్ జర్నలిస్టు వైశాలి.. యూట్యూబ్ ఛానెల్ ద్వారా స్థానిక వార్తలు అందిస్తుంటుంది. ఊరిలోని అనాథ బాలికల వసతి గృహంలో లైంగిక దాడులు జరుగుతున్నట్లు ఆమెకు తెలుస్తుంది. అయితే దానిని రాజకీయంగా పలుకుబడి ఉన్న వ్యక్తి నిర్వహిస్తుంటాడు. అతడి దారుణాలను వైశాలి ఎలా బయటపెట్టింది? ఈ క్రమంలో ఎదురైన సవాళ్లు ఏంటి? అన్నది కథ. ఓటీటీ: నెట్‌ఫ్లిక్స్ గంగూభాయి కతియావాడి ఈ చిత్రం అలియా భట్‌ నటనకు జాతీయ స్థాయిలో గుర్తింపు తీసుకొచ్చింది. జాతీయ స్థాయిలో ఉత్తమ నటిగా ఎంపికైంది. ఇక ఈ సినిమా కథలోకి వెళ్తే.. గంగూబాయి హర్జీవందాస్‌ (అలియా భట్‌) గుజరాత్‌లోని  ఓ పెద్ద కుటుంబంలో పుడుతుంది.  ఆమెకు చిన్నప్పటి నుంచి సినిమాలంటే ఇష్టం. ఆ ఇష్టాన్ని ఆసరా చేసుకున్న గంగుభాయ్ లవర్ ఆమెను ముంబై తీసుకొచ్చి అక్కడ వేశ్య గృహానికి అమ్మేస్తాడు. తప్పని పరిస్థితుల్లో ఆమె వేశ్యగా కొనసాగుతుంది. కొన్ని నాటకీయ పరిణామాల తర్వాత.. గంగూబాయి ఓ కీలక నిర్ణయం తీసుకుంటుంది. ఆ నిర్ణయం ఏమిటి? వేశ్యల అభ్యున్నతి ఆమె ఏం చేసింది అనేది మిగతా కథ. ఓటీటీ; నెట్‌ఫ్లిక్స్ 83 1983 నాటి క్రికెట్ ప్రపంచకప్‌ను ఇండియా గెలుచుకున్న నేపథ్యాన్ని ఈ చిత్రం ఆవిష్కరిస్తుంది. ఆ క్రమంలో ఆటగాళ్లు ఎదురుకున్న సమస్యలు, ప్రత్యర్థుల నుంచి వచ్చిన సవాళ్ళను ఎలా అధిగమించారు ? ఎలా కప్ గెలిచారు ? అనేది మిగతా కథ ఓటీటీ; డిస్నీ హాట్ స్టార్ జవాన్ సరిహద్దుల్లో తీవ్ర గాయాలతో పడిపోయిన ఓ వ్యక్తిని తల్లి కొడుకులు రక్షిస్తారు. అతను కోమాలోకి వెళ్లగా గ్రామానికి తీసుకెళ్లి వైద్యం చేయిస్తారు. ఇదే సమయంలో ఆ ఊరిపై కొందరు పదునైన ఆయుధాలతో దాడి చేస్తారు. కోమాలో నుంచి బయటకు వచ్చిన ఆ వ్యక్తి వారిని తరిమికొడతాడు. దీంతో ఆ గ్రామ ప్రజలు అతన్ని దేవుడిలా పూజిస్తారు. అప్పుడు ఆ వ్యక్తి తాను ఎవర్ని అని వారిని ప్రశ్నిస్తాడు. దీనికి జవాబు తాను పెద్దయ్యేలోపు కనుగొంటానని కాపాడిన పిల్లోడు ప్రామిస్ చేస్తాడు. ఇంతకు ఆ వ్యక్తి ఎవరు? పిల్లాడితో అతనికి ఉన్న సంబంధం ఏమిటి అన్నది మిగతా కథ. ఓటీటీ: నెట్‌ఫ్లిక్స్ గదర్ 2 బాలీవుడ్‌లో చిత్రాలు వరుసగా ప్లాఫ్ అవుతున్న క్రమంలో వచ్చిన ఈ సినిమా విజయం ఇండస్ట్రీకి ఊపిరి పోసింది. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి విజయం సాధించింది. ఇక కథలోకి వెళ్తే.. తారా సింగ్ (సన్నీ డియోల్) భారత సరిహద్దుల్లో కనిపించకుండా పోతాడు. పాక్‌ అతడ్ని బంధించిందని భావించిన అతడి కొడుకు.. మారువేషంలో శత్రు దేశానికి వెళ్తాడు. అనూహ్యాంగా ఇంటికి తిరిగొచ్చిన తారా సింగ్‌.. కొడుకు పాక్‌లో ఉన్న సంగతి తెలుసుకుంటాడు. బిడ్డను కాపాడేందుకు పాక్‌ వెళ్తాడు. అక్కడ ఎలాంటి సవాళ్లు ఎదురయ్యాయి? అన్నది స్టోరీ. ఓటీటీ: ప్రైమ్ వీడియో
    మే 20 , 2024
    This Week OTT Releases: ఈ వారం(May 5) థియేటర్లు, ఓటీటీల్లో విడుదలయ్యే సినిమాలు ఇవే..!
    This Week OTT Releases: ఈ వారం(May 5) థియేటర్లు, ఓటీటీల్లో విడుదలయ్యే సినిమాలు ఇవే..!
    అసలు సిసైలన వేసవి నెల ప్రారంభమైంది. ఈ సమయంలో థియేటర్లకు రప్పించి ప్రేక్షకులను చల్లబర్చేందుకు కొత్త సినిమాలు రెడీ అవుతున్నాయి. ఈ వారం(మే 5) బాక్సాఫీసు వద్ద పలు సినిమాలు సందడి చేయబోతున్నాయి. మరోవైపు, ఓటీటీల్లోనూ కొన్ని సినిమాలు రిలీజ్ కాబోతున్నాయి. వాటి వివరాలు చూద్దాం.  రామబాణం హీరో గోపీచంద్, డైరెక్టర్ శ్రీవాస్ కాంబోలో వస్తున్న మూడో చిత్రమిది. అన్నదమ్ముల మధ్య అనుబంధాన్ని ఈ సినిమా ద్వారా డైరెక్టర్ చూపించే ప్రయత్నం చేస్తున్నారు. లక్ష్యం తరువాత గోపీచంద్, జగపతిబాబు, శ్రీవాస్ కాంబోలో వస్తోందీ సినిమా. ఇప్పటివరకు విడుదలైన ప్రచార చిత్రాలు ఆకట్టుకున్నాయి. సక్సెస్‌ఫుల్ కాంబినేషన్ కావడంతో సినిమాపై అంచనాలు పెరిగాయి. డింపుల్ హయతీ ఇందులో హీరోయిన్‌గా నటించింది. ఖుష్బూ ప్రధాన పాత్రలో నటించింది. మే 5న సినిమా విడుదల కానుంది. ఉగ్రం నాంది హిట్ తర్వాత అల్లరి నరేష్ సరికొత్త కెరీర్‌ని పున: ప్రారంభించాడు. ఈ చిత్రానికి డైరెక్షన్ చేసిన విజయ్ కనకమేడలతో మరోసారి జతకట్టి ఈ సారి అల్లరి నరేష్ ‘ఉగ్రం’ మరో హిట్‌కు ప్రయత్నిస్తున్నాడు.ట్రైలర్ ఆసక్తిని పెంచింది. నాంది మాదిరిగానే ఇందులో మరో ప్రధాన సమస్యను డైరెక్టర్ లేవనెత్తే ప్రయత్నం చేశారు. హ్యూమన్ ట్రాఫికింగ్ కథాంశంతో ఈ సినిమా తెరకెక్కింది. ఏటా నమోదవుతున్న మిస్సింగ్ కేసులు చివరికి ఎటువైపు దారితీస్తున్నాయనే ప్రశ్నకు మే 5న ప్రేక్షకులకు జవాబు చెప్పనుంది. షైన్ స్క్రీన్ పతాకంపై ఈ సినిమా తెరకెక్కింది. ది కేరళ స్టోరీ విడుదలకు ముందే దేశవ్యాప్తంగా చర్చల్లో నిలిచిన సినిమా ఇది. సుదిప్తో సేన్ డైరెక్షన్ వహించిన ఈ మూవీ మే 5న థియేటర్ల ముందుకు రాబోతోంది. ఆదా శర్మ లీడ్ రోల్‌లో నటించింది. కేరళలో మతం మారిన మహిళలు తీవ్రవాద సంస్థల్లో చేరడం, వాటి పూర్వాపరాల గురించి దాగివున్న నిజాలను ఈ సినిమా వెలికితీయనుందని చిత్రబృందం ప్రకటించింది. దీంతో పెద్దఎత్తున విమర్శలు వెల్లువెత్తాయి. ఈ స్టోరీకి ఆధారాలు చూపితే రూ.కోటికి పైగా నజరానా ప్రకటించడం పరిస్థితి తీవ్రతను తెలియజేస్తోంది. చిత్రబృందం మాత్రం తమ సినిమాను సమర్థించుకుంది. హిందీ భాషలో ఇది తెరకెక్కింది. విరూపాక్ష(మళయాలం) తెలుగులో భారీ విజయాన్ని అందుకున్న విరూపాక్ష మిగతా భాషల్లోనూ అలరించేందుకు రెడీ అవుతోంది. మే 5న మళయాలం భాషలో ఈ సినిమాను రిలీజ్ చేస్తున్నారు. ఈ మేరకు ఏర్పాట్లు చేస్తున్నారు. మరోవైపు, చిత్రబృందం ప్రమోషన్లలో బిజీబిజీగా గడుపుతోంది. కొచ్చిలో హీరో సాయిధరమ్ తేజ్, హీరోయిన్ సంయుక్త మీనన్ ప్రత్యేకంగా ఇంటర్వ్యూలకు హాజరవుతూ సినిమా వైపు దృష్టిని ఆకర్షిస్తున్నారు. కార్తీక్ దండు దర్శకత్వం వహించాడు. శ్రీ వెంకటేశ్వర సినీ క్రియేషన్స్ పతాకంపై నిర్మితమైంది.  అరంగేట్రం కమర్శియల్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిన చిత్రమే ‘అరంగేట్రం’. శ్రీనివాస్ ప్రభన్ దర్శకత్వం వహించగా మహేశ్వరి నిర్మాణ బాధ్యతలు స్వీకరించింది. ఓ ముగ్గురు యువకులు, ఆరుగురు యువతుల మధ్య జరిగే కథగా ఇది తెరకెక్కింది. జబర్దస్త్ సత్తిపండు, రోషన్, ముస్తఫా, ఆస్కరి, శ్రీవల్లి, విజయ, సాయిశ్రీ, శ్రీనివాస్, అనిరుధ్, ఇందు, లయ తదితరులు నటించారు. విడుదలకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసుకుంది. మే 5న అదృష్టాన్ని పరీక్షించుకోనుంది.    యాద్గిరి అండ్ సన్స్ వాస్తవిక ఘటనల ఆధారంగా ‘యాద్గిరి అండ్ సన్స్’ తెరకెక్కింది. భిక్షపతి రాజు పందిరి దర్శకత్వం వహించాడు. రాజీవ్ కనకాల, మురళీధర్ గౌడ్, అనిరుధ్ తుకుంట్ల, జీవా, యశ్విని నివేదిత తదితరులు నటించారు. మే 5న సినిమా విడుదల కానుంది.  OTT విడుదలలు TitleCategoryLanguagePlatformRelease DateClifford the Big Red DogMovieEnglishNetflixMay 2Queen Charlotte a Bridgerton StoryWeb seriesEnglishNetflixMay 2SanctuaryMovieEnglishNetflixMay 4The Larva FamilyAnimated MovieEnglishNetflix May 4MeterMovieTeluguNetflix May 53MovieTeluguNetflixMay 5YogiMovieTeluguNetflixMay 5Rowdy FellowMovieTeluguNetflixMay 5ThammuduMovieTeluguNetflixMay 5AmruthamChandamamaloMovieTeluguNetflixMay 5Match FixingMovieTeluguETV WinMay 5Tu Zuti mai makkarMovieHindiNetflixMay 5FirefliesSeriesHindiZEE 5May 5Shebhash FeludaMovieBengaliZEE5May 5Corona PapersMovieMalayalamDisney HotstarMay 5Sas Bahu aur FlamingoMovieHindiDisney HotstarMay 5
    మే 02 , 2023
    Pareshan Review: కామెడీ ఓకే.. ‘పరేషాన్‌’తో మసూద హీరో హిట్‌ కొట్టినట్లేనా!
    Pareshan Review: కామెడీ ఓకే.. ‘పరేషాన్‌’తో మసూద హీరో హిట్‌ కొట్టినట్లేనా!
    నటీనటులు : తిరువీర్‌, పావని, సాయి ప్రసన్న, అర్జున్‌ కృష్ణ, మురళీధర్ గౌడ్, శ్రుతి రయాన్ దర్శకత్వం: రోనాల్డ్ రూపక్‌ సన్‌ సంగీతం: యశ్వంత్ నాగ్ సినిమాటోగ్రఫీ: వాసు నిర్మాత : సిద్ధార్థ్‌ రాళ్లపల్లి సమర్పణ: రానా దగ్గుబాటి టాలీవుడ్‌లో తెలంగాణ నేపథ్యమున్న సినిమాలు తెగ సందడి చేస్తున్నాయి. తెలంగాణ యాస, భాషతో పాటు సంస్కృతి సంప్రదాయల మేళవింపుతో వచ్చి ఘన విజయాలు సాధిస్తున్నాయి. ఫిదా, బలగం, జాతి రత్నాలు, దసరా వంటి చిత్రాలు అలా వచ్చి భారీ హిట్ అందుకున్నవే. తాజాగా రూపొందిన ‘పరేషాన్‌’ మూవీ సైతం తెలంగాణ నేపథ్యంలోనే తెరకెక్కింది. రోనాల్డ్ రూపక్‌ సన్‌ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో ‘మసూద’ ఫేమ్‌ తిరువీర్‌ హీరోగా నటించాడు. ఈ సినిమాని సిద్ధార్థ్‌ రాళ్లపల్లి నిర్మించగా, హీరో దగ్గుబాటి రానా సమర్పిస్తుండటంతో మూవీపై అంచనాలు పెరిగాయి. ఈ నేపథ్యంలో ఇవాళ (జూన్‌ 2) పరేషాన్ చిత్రం విడుదలైంది. ఈ సినిమా ఎలా ఉంది? అందరినీ ఆకట్టుకుందా? లేదా? ఇప్పుడు చూద్దాం.  కథ: ఐజాక్‌(తిరువీర్‌) ITI చదివి పనిపాట లేకుండా స్నేహితులతో ఖాళీగా తిరుగుతుంటాడు. ఫ్రెండ్స్‌తో కలిసి విపరీతంగా తాగుతూ గొడవలు పడుతుంటాడు. ఐజాక్‌ను చూసి విసిగిపోయిన తండ్రి సమర్పణం (మురళీధర్‌ గౌడ్‌) తన సింగరేణి ఉద్యోగం కుమారుడికి ఇప్పించాలని భావిస్తాడు. అందుకోసం భార్య నగలు అమ్మి లంచం డబ్బు సిద్ధం చేస్తాడు. అయితే ఆ డబ్బును ఆపదలో ఉన్న ఫ్రెండ్స్‌కు ఐజాక్ ఇస్తాడు. డబ్బు కనిపించకపోవడంతో తండ్రి కొడుకుల మధ్య గొడవ జరుగుతుంది. మరోవైపు తాను ప్రేమించిన అమ్మాయి శిరీష (పావని కరణం) గర్భవతి కావడం ఐజాక్‌ చిక్కులు తెచ్చిపెడుతుంది. అబార్షన్‌ కోసం సిద్దం చేసిన డబ్బును ఎవరో కాజేయడంతో ఐజాక్‌ కొత్త సమస్యల్లో చిక్కుకుంటాడు. దీంతో డబ్బు కోసం ఐజాక్ తెగ పరేషాన్ అవుతుంటాడు. డబ్బు కోసం ఐజాక్‌ ఏం చేశాడు? ఈ క్రమంలో ఎలాంటి పరిణామాలు చోటుచేసుకున్నాయి? అనేది మిగిలిన కథ. ఎవరెలా చేశారంటే ఐజాక్‌ పాత్రలో తిరువీర్‌ అద్భుత నటన కనబరిచాడు. సహజత్వానికి దగ్గరగా ఉన్న పాత్రలో జీవించేశాడు. మసూద తర్వాత నటనలో మరింత మెరుగైనట్లు కనిపించాడు. అటు ఫ్రెండ్స్‌ పాత్రలైన ఆర్జీవీ, మైదాక్‌, సత్తి(అర్జున్ కృష్ణ) ప్రేక్షకులను చాలా బాగా కనెక్ట్‌ అవుతాయి. డబ్బు కోసం వారు పడే బాధలు థియేటర్‌లో నవ్వులు పూయించాయి. ముఖ్యంగా సత్తి పాత్ర సినిమాకే హైలెట్ అని చెప్పొచ్చు. ఆ పాత్ర ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించింది. ఇక తండ్రి పాాత్రలో మురళీధర్‌ గౌడ్‌ ఎప్పటిలాగే తన మార్క్‌ చూపించాడు. కొడుకు ఫ్యూచర్‌ కోసం తాపత్రయపడే తండ్రిగా ‌అలరించాడు. హీరోయిన్‌ శిరీష పాత్రలో పావని తన పరిధిమేరకు నటించిం మెప్పించింది. సినిమాలో చాలావరకు కొత్తవారే ఉన్నప్పటికీ ఆ నటనలో మాత్రం చాలా అనుభవం ఉన్నట్లు చేశారు. అయితే కొన్ని సీన్లలో మాత్రం అనుభవలేమి కనిపిస్తుంది.  డైరెక్షన్ ఎలా ఉందంటే డైరెక్టర్‌ రోనాల్డ్ రూపక్‌ సన్‌ మంచి కథనే ఎంచుకున్నప్పటికీ దానిని తెరకెక్కించడంలో తడబడ్డాడు. స్క్రీన్‌ప్లే చాలా పేలవంగా ఉంది. నవ్వుల కోసమే సీన్లు చేసుకుంటూ పోయినట్లు అనిపిస్తుంది.  ఒకదానికొకటి కనెక్షన్ ఉండదు. సినిమాలో ఎక్కువ భాగం తాగుడే ఉండటం వల్ల ప్రేక్షకుడికి కాస్త విసుగ్గా అనిపిస్తుంది. అయితే ప్రధాన పాత్రల మధ్య వచ్చే కామెడీ సీన్స్‌ను మాత్రం డైరెక్టర్‌ చాలా చక్కగా తెరకెక్కించాడు. ఆ కామెడీ చాలా ఫ్రెష్‌ ఫీలింగ్‌ను తీసుకొస్తుంది. అయితే సీన్లను మరింత క్వాలిటీగా రాసుకుని మేకింగ్‌ పరంగా జాగ్రత్తలు తీసుకుంటే సినిమాకు తిరుగుండేది కాదు.  టెక్నికల్‌గా  సినిమాటోగ్రఫీ పరేషాన్‌ చిత్రానికి ప్లస్‌ అని చెప్పొచ్చు. వాసు కెమెరా పనితనం ఆకట్టుకుంటుంది. పల్లెటూరు వాతావరణాన్ని ఆయన చక్కగా తన కెమెరాతో చూపించారు. ఎడిటింగ్‌ పరంగా ఇంకా కేర్‌ తీసుకుంటే బాగుండేది. యశ్వంత్‌ నాగ్‌ సంగీతం పర్వాలేదు. అయితే BGM సో సోగా అనిపిస్తుంది. కొన్ని సీన్లకు నేపథ్య సంగీతం మరీ ఓవర్‌గా అనిపిస్తుంది. అసలు సింక్‌ అయినట్లు అనిపించదు. నిర్మాణ పరంగా మేకర్స్‌ రాజీ పడినట్లు కనిపిస్తుంది. ఆచి తూచి ఖర్చు పెట్టినట్లు కనిపిస్తోంది.  ప్లస్‌ పాయింట్స్ హీరో నటనకామెడీసినిమాటోగ్రఫీ మైనస్ పాయింట్స్‌ స్క్రీన్‌ప్లేఎడిటింగ్నేపథ్య సంగీతం రేటింగ్‌ : 2.5/5
    జూన్ 02 , 2023
    Ambajipeta Marriage Band Review: కొత్త కాన్సెప్ట్‌తో తెరకెక్కిన సుహాస్‌ చిత్రం.. హ్యాట్రిక్‌ కొట్టినట్లేనా?
    Ambajipeta Marriage Band Review: కొత్త కాన్సెప్ట్‌తో తెరకెక్కిన సుహాస్‌ చిత్రం.. హ్యాట్రిక్‌ కొట్టినట్లేనా?
    నటీనటులు: సుహాస్‌, శివానీ నగారం, గోపరాజు రమణ, స్వర్ణకాంత్‌, నితిన్‌ ప్రసన్న, శరణ్య ప్రదీప్‌ తదితరులు రచన, దర్శకత్వం: దుష్యంత్‌ సంగీతం: శేఖర్‌ చంద్ర సినిమాటోగ్రఫీ: వాజిద్‌ బేగ్‌ ఎడిటింగ్‌: కోదాటి పవన్‌ కల్యాణ్‌ నిర్మాత: ధీరజ్‌ మొగిలినేని, బన్నీవాస్‌, వెంకటేశ్‌ మహా (సమర్పణ) విడుదల: 02-02-2024 క్యారెక్టర్ ఆర్టిస్టుగా కెరీర్‌ను ప్రారంభించిన నటుడు సుహాస్‌ (Suhas).. అనతికాలంలోనే టాలీవుడ్‌లో కథానాయకుడిగా ఎదిగాడు. ‘క‌ల‌ర్‌ఫొటో’, ‘రైట‌ర్ ప‌ద్మ‌భూష‌ణ్‌’ చిత్రాల ద్వారా మంచి గుర్తింపు సంపాదించాడు. ఈ క్రమంలోనే సుహాస్‌ హీరోగా రూపొందిన మరో చిత్రం ‘అంబాజీపేట మ్యారేజి బ్యాండు’ (Ambajipeta Marriage Band Review). జీఏ 2 పిక్చర్స్ నిర్మాణంలో భాగ‌స్వామి కావడంతో పాటు ప్ర‌చార చిత్రాలు ఆస‌క్తిని రేకెత్తించ‌డంతో సినిమాపై అంచనాలు పెరిగాయి. మ‌రి చిత్రం ఎలా ఉంది? సుహాస్‌కు హ్యాట్రిక్‌ విజయాన్ని అందించిందా? ఈ రివ్యూలో తెలుసుకుందాం. కథేంటి అంబాజీపేట మ్యారేజీ బ్యాండులో మ‌ల్లి (సుహాస్‌) ఓ స‌భ్యుడు. చిర‌త‌పల్లిలో త‌న కుటుంబంతో నివ‌సిస్తుంటాడు. అక్క ప‌ద్మ (శ‌ర‌ణ్య ప్ర‌దీప్‌) స్కూల్లో టీచ‌ర్‌గా ప‌నిచేస్తుంటుంది. ఊరి మోతుబ‌రి వెంక‌ట్‌బాబు (నితిన్ ప్ర‌స‌న్న‌) వ‌ల్లే ప‌ద్మ‌కి ఉద్యోగం వచ్చిందని, వాళ్లిద్ద‌రి మ‌ధ్య అక్ర‌మ సంబంధం ఉంద‌నే ఓ పుకారు మొద‌ల‌వుతుంది. ఓ కారణం చేత వెంక‌ట్‌బాబు - మల్లికీ మ‌ధ్య వైరం మొద‌ల‌వుతుంది. అవి చిలికి చిలికి గాలివాన‌లా మార‌తాయి. ఆ త‌ర్వాత ఏం జరిగింది? ల‌క్ష్మి (శివాని నాగారం), మల్లిల ప్రేమ కథ ఏంటి? అది చివరకు ఎలాంటి మ‌లుపు తీసుకుంది? తెలియాలంటే తెర‌పై చూడాల్సిందే. ఎవరెలా చేశారంటే? ఈ సినిమాలో పాత్రలు తప్ప (Ambajipeta Marriage Band) నటీనటులు ఎక్కడా కనిపించరు. ప్రతీ ఒక్క నటుడు పాత్రల్లో పరకాయ ప్రవేశం చేసి మరి నటించారు. మ‌ల్లి పాత్ర‌లో సుహాస్ అదరగొట్టాడు. ప్ర‌థ‌మార్ధంలో అబ్బాస్‌ హెయిర్‌ స్టైల్‌తో న‌వ్వించిన అతడు, ద్వితీయార్ధంలో గుండుతో క‌నిపిస్తూ ఎంతో స‌హ‌జంగా న‌టించాడు. భావోద్వేగ స‌న్నివేశాల్లో అతడి న‌ట‌న మ‌న‌సుల్ని హ‌త్తుకుంటుంది. ఇక హీరోయిన్‌ శివానీ నాగారం.. ల‌క్ష్మి పాత్రకి 100 శాతం న్యాయం చేసింది. సుహాస్‌ ‌అక్కగా చేసిన శ‌ర‌ణ్య ప్ర‌దీప్ సినిమాకి మ‌రో హీరో అని చెప్పవచ్చు. ఆమె పాత్ర‌ని డిజైన్ చేసిన తీరు సినిమాకే హైలైట్‌. నితిన్‌, విన‌య మ‌హాదేవ్, హీరోకి స్నేహితుడిగా క‌నిపించే జ‌గ‌దీష్ బండారి పాత్ర‌లు ఆక‌ట్టుకుంటాయి. డైరెక్షన్ ఎలా ఉందంటే? డబ్బు, కులం వ్యాత్యాసం కలిగిన ప్రేమ కథలు, రివేంజ్‌ డ్రామాలతో ఎన్నో సినిమాలు వచ్చాయి. ఈ మూవీ కూడా అదే కోవకి చెందిందే. కానీ, డైరెక్టర్‌ దుష్యంత్‌ (Ambajipeta Marriage Band Review) కథకు అక్క-తమ్ముడి ఎమోషన్స్‌, ఆత్మాభిమానం అనే కాన్సెప్ట్‌ను జోడించి కొత్తదనం తీసుకువచ్చారు. కులాల మ‌ధ్య అంత‌రాల్ని,  ఆర్థిక అస‌మాన‌త‌ల్నీ స‌హ‌జంగా ఆవిష్క‌రిస్తూ ప్రేక్షకులను క‌థ‌కు కనెక్ట్ చేశాడు. ప్రథమార్థాన్ని అందమైన ప్రేమ కథ, సరదా సరదా సన్నివేశాలు చుట్టూ తిప్పిన దర్శకుడు.. విరామం ముందు వచ్చే సన్నివేశంతో సినిమాను కీలక మలుపు తిరిగేలా చేశారు. ద్వితియార్థంలో అత్మాభిమానాన్నే ప్రధాన అంశంగా తీసుకొని తనదైన శైలిలో కొత్త రివేంజ్‌ డ్రామాను ఆవిష్కరించారు. క‌థ ఊహ‌కు త‌గ్గ‌ట్టే సాగుతున్నా.. బ‌ల‌మైన స‌న్నివేశాల‌ు, డ్రామాతో ప్రేక్షకులకు ఎక్కడా బోర్‌ కొట్టించలేదు. ఓవరాల్‌గా డైరెక్టర్‌ దుష్యంత్‌ పనితనం మెప్పిస్తుంది.  సాంకేతికంగా.. సాంకేతిక విభాగాల‌న్నీ మంచి ప‌నితీరుని క‌న‌బ‌రిచాయి. శేఖ‌ర్ చంద్ర పాట‌లు, నేప‌థ్య సంగీతం, వాజిద్ బేగ్ త‌న కెమెరాతో చిర‌త‌ప‌ల్లిని ఆవిష్క‌రించిన తీరు సినిమాకి ప్ర‌ధాన‌బ‌లం. ఎడిటింగ్‌, బ‌ల‌మైన ర‌చ‌న సినిమా గ‌మ‌నాన్నే మార్చేశాయి. మేకింగ్ ప‌రంగానూ ఎంతో ప‌రిణ‌తి క‌నిపిస్తుంది. నిర్మాణం ఉన్న‌తంగా ఉంది. ప్లస్‌ పాయింట్స్‌ సుహాస్‌, శరణ్య నటనకథ, నేపథ్యంభావోద్వేగ సన్నివేశాలు మైనస్‌ పాయింట్స్ అక్కడక్కడ బోరింగ్ సీన్లు రేటింగ్‌: 3.5/5 ఓటీటీ వేదిక లాక్‌! ఇక ఈ 'అంబాజీపేట మ్యారేజీ బ్యాండు' చిత్రం అప్పుడే ఓటీటీ పార్ట్నర్‌ను కూడా లాక్‌ చేసుకుంది. ప్రముఖ స్ట్రీమింగ్ వేదిక ఆహా (Aha) ఈ సినిమా ఓటీటీ హక్కులను దక్కించున్నట్లు కన్‌ఫార్మ్‌ అయ్యింది. దీంతో థియేటర్స్‌లో రన్‌ అనంతరం ఈ సినిమా ఆహాలోనే అందుబాటులోకి రానుంది.
    ఫిబ్రవరి 02 , 2024
    Martin Luther King Movie Review: లాజిక్‌ కాస్త మిస్‌ అయినా.. కింగ్ నవ్విస్తాడు, ఆలోచింపజేస్తాడు! 
    Martin Luther King Movie Review: లాజిక్‌ కాస్త మిస్‌ అయినా.. కింగ్ నవ్విస్తాడు, ఆలోచింపజేస్తాడు! 
    హృదయకాలేయం, కొబ్బరి మట్ట వంటి చిత్రాలతో కడుపుబ్బ నవ్వించిన సంపుర్ణేష్ బాబు.. లీడ్‌ రోల్‌లో మార్టిన్‌ లూథర్ కింగ్‌ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. తమిళ్‌లో కమెడియన్ యోగి బాబు నటించిన సూపర్ హిట్ మూవీ 'మండేలా' సినిమాకు ఇది రీమేక్. ఈ చిత్రం ద్వారా పూజ కొల్లూరు డైరెక్టర్‌గా పరిచయం అయింది. సంపూర్ణేష్ బాబు చాల రోజుల గ్యాప్‌ తర్వాత సినిమా చేయడంతో మార్టిన్ లూథర్‌ కింగ్‌పై అంచనాలు ఏర్పడ్డాయి. అవుట్‌ అండ్ అవుడ్ కామెడీ సినిమా కావడంతో సినిమాపై ప్రేక్షకుల్లో ఆసక్తి పెరిగింది. మరి ఈ సినిమా మండేలా చిత్రాన్ని మించి ఉందా? ఆ టైప్‌ కామెడీని ప్రొజెక్ట్ చేయడంలో సక్సెస్ అయిందా? వంటి అంశాలను ఇప్పుడు YouSay సమీక్షలో చూద్దాం. కథ ఉత్తరం, దక్షిణ వర్గాలుగా చీలిన పడమరపాడు గ్రామంలో ఆనాథగా స్మైల్( సంపూర్ణేష్ బాబు) చెప్పులు కుట్టుకుంటూ జీవిస్తుంటాడు. చెప్పులు కుట్టగా వచ్చిన చిల్లరను కూడబెట్టి చిన్న చెప్పుల షాపు పెట్టుకోవాలన్నది అతని కల. అయితే అతను కూడబెట్టిన డబ్బుల్ని ఎవరో దోచుకుంటారు. దీంతో తన కష్టార్జితాన్ని పోస్టాఫీసులో దాచుకోవలనుకుంటాడు. ఆధార్ కార్డు, రేషన్‌ కార్డు లేని స్మైల్.. పోస్టాఫీస్‌లో పనిచేసే వసంత( శరణ్య ప్రదీప్‌) దగ్గరికి వెళ్లి సాయం చేయాలని కోరుతాడు. దీంతో స్మైల్‌కు మార్టిన్ లూథర్ కింగ్ అని ఓ కొత్త పేరు పెట్టి ఆధార్ కార్డు, రేషన్ కార్డు, ఓటర్ ఐడీ వచ్చేలా చేస్తుంది. ఈక్రమంలో పడమరపాడులో ఎన్నికలు వస్తాయి. ఉత్తరం దిక్కు నాయకుడిగా జగ్గు( నరేష్), దక్షిణం దిక్కు నేతగా 'లోకి'(వెంకటేష్ మహా) పోటీలో దిగుతారు. వీరిద్దరికీ సమాన ఓట్లు రానున్నట్లు సర్వేలో ముందే తెలుస్తుంది. ఈ క్రమంలో మార్టిన్ లూథర్‌ కింగ్‌కు ఓటు హక్కు వచ్చిందని తెలిసి.. అతన్ని ప్రసన్నం చేసుకునే పనిని ఇద్దరు మొదలు పెడుతారు. ఓటు హక్కు రావడంతో మార్టిన్ జీవితం ఎలా మారింది. జగ్గు, లోకిల వల్ల ఎలాంటి ఇబ్బుందులు ఎదుర్కొన్నాడు. ఊరికోసం తన ఓటు హక్కును ఎలా ఉపయోగించుకున్నాడు వంటి ఆసక్తికరమైన అంశాలను థియేటర్లకు వెళ్లి చూడాల్సిందే. సినిమా ఎలా ఉందంటే? సినిమా ఫస్టాఫ్ విషయానికొస్తే.. మరుగుదొడ్డి ఓపెనింగ్ సీన్, అక్కడ ఉత్తరం దిక్కు, దక్షిణం దిక్కు ప్రజలు తలపడే సీన్లు కడుపుబ్బ నవ్విస్తాయి. పడమరపాడు గ్రామంలోని విభిన్నమైన ప్రజల వ్యక్తిత్వాల్ని పరిచయం చేసిన సన్నివేశాలు బాగున్నాయి. అక్కడి నుంచి స్మైల్‌ ప్రపంచంలోకి మెల్లగా కథ వెళ్తుంది. గ్రామ ప్రజలు అతనితో మెలిగే తీరు, ఎంతో కష్టపడి అతను సంపాదించిన డబ్బును ఎవరో దొంగిలించడం, పోస్టాఫీస్‌లో వసంత పరిచయం వంటి సీన్లు ఫన్నీగా ఉంటాయి.  మార్టిన్ లూథర్  కింగ్  పాత్ర ద్వారా సమాజంలో ఉన్న అనేక అంశాలపై పంచ్‌లు వేసిన తీరు బాగుంది. ఊర్లో రాజకీయ నాయకుల మధ్య విభేదాల వల్ల  ప్రజలు ఎలా బలి అవుతున్నారో సినిమాలో చూపించారు. ఇక సెకండాఫ్‌ సీరియస్‌గా సాగుతుంది. కొంతవరకు ఎమోషనల్‌గా సాగుతుంది. తమిళ్‌లో మండేలా చిత్రం పూర్తి కామిక్‌ మార్గంలో వెళ్లి చివర్లో ఎమోషనల్ టచ్ ఇస్తుంది. అక్కడ బాగా కుదిరింది. అయితే మార్టిన్ లూథర్ కింగ్‌లో మాత్రం ఆ కన్‌క్లూజన్ కాస్త మిస్‌ అయింది. కింగ్‌కు ఓటు హక్కు రావడంతో అతని ఓటు కోసం సెకండాఫ్‌లో లోకి, జగ్గు పడే తంటాలు కొంతవరకు కామెడీ అనిపిస్తాయి. అయితే కొన్ని సీన్లు సాగదీతగా అనిపిస్తాయి. ఎంతసేపు సినిమా ఇద్దరి నాయకుల మధ్యే తిరుగుతున్న ఫీలింగ్ కలుగుతుంది. అసలు దర్శకుడు సినిమా గురించి ఏం చెప్పాలనుకున్నాడు ఓటు ప్రాధాన్యతనా? లేక రాజకీయ నాయకులను సైటైర్ చేయలనుకున్నారా? అనేది అర్థం కాదు. క్లైమాక్స్‌పై డైరెక్టర్ ఇంకాస్త దృష్టిపెడితే బాగుండేది అనిపించింది. ఎవరెలా చేశారంటే? మార్టిన్ లూథర్ కింగ్ పాత్రలో సంపూర్ణేష్ బాబు ఒదిగిపోయాడు. పాత్రకు కావాల్సిన అమాయకపు నటనతో మెప్పించాడు. క్లీన్ స్క్రీన్ ప్రజెన్స్‌తో ప్రేక్షకులను నవ్వించాడు. తనలో మంచి నటుడు ఉన్నాడని మరోసారి ఫ్రూవ్ చేశాడు. ఇక సర్పంచ్ పదవి కోసం పోటీ పడ్డ వెంకటేష్ మహా, నరేష్ తమ పర్ఫామెన్స్‌తో మెప్పించారు. నిజంగా ఊర్లోని పరిస్థితులను ప్రతిబింబింపజేశారు. ఇక సంపూర్ణేష్ బాబుకు మద్దతుగా నిలిచిన పోస్టాఫీస్ ఉద్యోగినిగా శరణ్య బాగా చేసింది. ఆ పాత్రకు న్యాయం చేసింది. పెద్దాయన పాత్ర చేసిన రాఘవన్ కూడా మెప్పించాడు. డైరెక్షన్‌ ఎలా ఉందంటే? పూజ కొల్లూరు డైరెక్టర్‌గా తనకు తొలి చిత్రమైనా... అనుభవం ఉన్న  దర్శకురాలిగా సినిమాను బాగా తీసింది. గ్రౌండ్ లెవల్లో రాజకీయాలు, అక్కడ ఉండే పరిస్థితులను గమనించి తెరకెక్కించిన తీరు బాగుంది. కామెడీ, ఎమోషనల్ సీన్లు, క్లైమాక్స్ కన్‌క్లూజన్‌పై ఇంకాస్త వర్క్‌ చేస్తే బాగుండు అనిపించింది. టెక్నికల్‌గా.. నిర్మాణ విలువల పరంగా సినిమా ఉన్నతంగా ఉంది. స్మరణ్ సాయి మ్యూజిక్ బాగుంది. అతను అందించిన బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్‌.. సినిమా ఎలివేషన్‌కు సాయపడింది. పాటలు పర్వాలేదు. ఎడిటర్‌గాను వర్క్‌ చేసిన పూజ కోల్లూరు ఇంకాస్త ట్రిమ్‌ చేయాల్సి ఉంది. సాగదీత సీన్లపై కసరత్తు చేస్తే బాగుండేది. దీపక్ యరగెర సినిమాటోగ్రఫి.. సినిమా చూస్తున్నంత సేపూ ఊర్లో ఉన్న ఫీలింగ్‌ను కలిగిస్తుంది.  బలాలు సంపూర్ణేష్ బాబు నటన ఫస్టాఫ్ కామెడీ బలహీనతలు సెకండాఫ్‌ సాగదీత సన్నివేశాలు క్లైమాక్స్ కన్‌క్లూజన్ చివరగా: లాజిక్‌లు మనసులో పెట్టుకోకుండా వెళ్తే... మార్టిన్ లూథర్ కింగ్ నవ్విస్తాడు, ఆలోచింపజేస్తాడు. రేటింగ్: 3/5
    అక్టోబర్ 27 , 2023
    Rashmika Mandanna: ‘నీ యబ్బ.. నువ్వు నా ఫ్యామిలీరా’.. రష్మిక క్లారిటీ ఇచ్చిందోచ్!
    Rashmika Mandanna: ‘నీ యబ్బ.. నువ్వు నా ఫ్యామిలీరా’.. రష్మిక క్లారిటీ ఇచ్చిందోచ్!
    వెండితెరపై మంచి జోడీగా పేరున్న జంటల్లో విజయ్‌ దేవరకొండ - రష్మిక మందన్న ముందు వరుసలో ఉంటారు. ‘గీతా గోవిందం’, ‘డియర్ కామ్రేడ్‌’ చిత్రాల్లో కలిసి నటించిన ఈ జంట.. అతి తక్కువ సమయంలోనే బెస్ట్‌ ఫ్రెండ్స్‌గా మారిపోయారు. అయితే వీరి మధ్య స్నేహానికి మించి ఇంకేదో ఉన్నట్లు గత కొంత కాలంగా ప్రచారం జరుగుతోంది. విజయ్‌ - రష్మిక డీప్‌ లవ్‌లో ఉన్నట్లు మీడియాలో కథనాలు కూడా వచ్చాయి. తాము కేవలం స్నేహితులమేనని పలు సందర్భాల్లో వీరు స్పష్టం చేసిన్పపటికీ ఈ రూమర్లకు బ్రేక్‌ పడలేదు. అయితే తాజాగా రష్మిక మందన్న చేసిన వ్యాఖ్యలు విజయ్‌, ఆమెకు మధ్య ఏదో ఉందన్న సంకేతాలు ఇచ్చాయి.  ‘నీ యబ్బ.. నువ్వు నా ఫ్యామిలీరా’ విజయ్ దేవరకొండ సోదరుడు ఆనంద్‌ దేవరకొండ నటించిన 'గం గం గణేశా'.. ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో రష్మిక మందన్న ముఖ్య అతిథిగా పాల్గొంది. ఈ వేడుకలో రష్మికను ఆనంద్‌ పలు ప్రశ్నలు అడిగాడు. ఇటీవల రష్మిక పోస్టు చేసిన పెట్‌ డాగ్‌ ఫొటోల్లో విజయ్ పెట్‌ కూడా ఉంది. ఆ ఫొటోలు చూపించి వాటిలో ఏది నీ ఫేవరేట్‌ అని అడగ్గా రష్మిక.. ఆరా (రష్మిక పెట్‌ డాగ్‌) నా ఫస్ట్‌ బేబీ, స్మార్ట్‌ (విజయ్‌ పెట్‌ డాగ్‌) నా సెకండ్‌ బేబీ అని చెప్పింది. తర్వాత నీ ఫేవరేట్‌ కో-స్టోర్‌ ఎవరు అని ఆనంద్‌ ప్రశ్నించాడు. అప్పుడు రష్మిక మైక్‌ పక్కన పెట్టి నీ యబ్బ అని సరదాగా తిట్టింది. వెంటనే మైక్‌ తీసుకొని “ఆనంద్‌ నువ్వు నా ఫ్యామిలిరా.. ఇలా స్పాట్లో పెడితే ఎలా” అని చెప్పడంతో అక్కడి వారంతా కేకలు పెట్టారు. ఫ్యాన్స్‌ వెంటనే రౌడీ, రౌడీ స్టార్‌ అని అరడవంతో రౌడీ బయ్‌ నా ఫేవరేట్ అని విజయ్‌ను ఉద్దేశించి చెప్పింది. ప్రస్తుతం రష్మిక - ఆనంద్‌ మాటలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. https://youtu.be/LGt6bCE2ZMo?si=uV2RIkLzfv8Kjj_p క్లారిటీ ఇచ్చేసినట్లేనా? రష్మిక లేటెస్ట్ కామెంట్స్‌తో విజయ్‌ దేవరకొండ ఫ్యాన్స్ ఫుల్‌ ఖుషీ అవుతున్నారు. తమ హీరోతో ఉన్న రిలేషన్‌పై ఇన్నాళ్లకు రష్మిక నోటి నుంచి ఓ క్లారిటీ వచ్చిందని అభిప్రాయపడుతున్నారు. ఆనంద్‌ దేవరకొండతో ‘మనం ఓ ఫ్యామిలీ’ అంటూ చెప్పడం ద్వారా విజయ్‌తో తన ప్రేమయాణాన్ని రష్మిక రివీల్‌ చేసిందని కామెంట్స్‌ చేస్తున్నారు. గతంలో విజయ్‌, రష్మిక విడివిడిగా పోస్టు ఫొటోలు ఒకే లోకేషన్‌వి కావడంతో వారు డేట్‌లో ఉన్నట్లు వార్తలు పుకార్లు మెుదలయ్యాయి. ఇందులో వాస్తవమేదో తెలియక అటు విజయ్‌ ఫ్యాన్స్, ఇటు రష్మిక ఫ్యాన్స్ తలలు బాదేసుకునేవారు. ఇన్నాళ్లకు తమకు కావాల్సిన సమాధానం వచ్చిందని ఇరువురు ఫ్యాన్స్‌ నెట్టింట పోస్టులు పెడుతున్నారు. విజయ్‌ - రష్మిక రీల్‌ లైఫ్‌లోనే కాదు.. రియల్‌ లైఫ్‌లోనూ చూడముచ్చటగా ఉంటుందని కామెంట్స్ చేస్తున్నారు.  మెంటల్‌ క్యారెక్టర్‌ చేయాలి: రష్మిక ఆనంద్‌ దేవరకొండకు 'బేబీ' (Baby) ద్వారా బిగ్గెస్ట్‌ హిట్‌ ఇచ్చిన డైరెక్టర్‌ సాయి రాజేష్‌ (Sai Rajesh) కూడా ఈ ఈవెంట్‌కు వచ్చారు. ఈ సందర్భంగా ఆయన గురించి రష్మిక మాట్లాడుతూ 'నేను బేబీ సినిమా చూశాను. ఆ సినిమా చూశాక మీతో సినిమా చేయాలని అనుకున్నాను. అలాంటి సినిమా చేయడం అంటే అంత ఈజీ కాదు. మీ హార్డ్‌ వర్క్‌, డెడికేషన్‌ నాకు తెలుసు. మెుదటిసారి బేబీ చూసినప్పుడు ఏడ్చేశా. ఒక నటిగా ఆ సినిమా చూశాక.. ఒక మెంటల్‌ క్యారెక్టర్‌ అయినా మీ డైరెక్షన్‌లో చేయాలనిపించింది' అని రష్మిక వ్యాఖ్యానించింది. ప్రస్తుతం ఈ వీడియో కూడా సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది.  https://twitter.com/i/status/1795146872748728505 ‘గం గం గణేశా’ రిలీజ్‌ ఎప్పుడంటే? ఇక గం గం గణేశా చిత్రానికి వస్తే.. ఈ మూవీకి ఉదయ్‌ శెట్టి దర్శకత్వం వహించారు. ఇందులో ఆనంద్‌ దేవరకొండ సరసన ప్రగతి శ్రీవాత్సవ, నయన్‌ సారిక నటించారు. ఈ సినిమాలో జబర్దస్త్‌ ఫేమ్ ఇమ్మాన్యుయేల్‌, బిగ్‌ బాగ్‌ ఫేమ్‌ ప్రిన్స్‌ యావర్‌ ప్రధాన పాత్రలు పోషించారు. ఇప్పటికే ‘గం గం గణేశా’ సినిమా నుంచి రిలీజయిన టీజర్, ట్రైలర్స్‌తో సినిమాపై మంచి అంచనాలు ఉన్నాయి. మే 31న ఈ సినిమా గ్రాండ్‌గా విడుదల కానుంది. 
    మే 28 , 2024
    <strong>Kalki 2898 AD Story: మూడు ప్రపంచాల సంగ్రామమే ‘కల్కి’.. రిలీజ్‌కు ముందే స్టోరీ రివీల్‌ చేసిన డైరెక్టర్‌!</strong>
    Kalki 2898 AD Story: మూడు ప్రపంచాల సంగ్రామమే ‘కల్కి’.. రిలీజ్‌కు ముందే స్టోరీ రివీల్‌ చేసిన డైరెక్టర్‌!
    యావత్‌ దేశం దృష్టిని ఆకర్షిస్తున్న 'కల్కి 2898 ఏడీ' (Kalki 2898 AD) చిత్రం విడుదలకు ఇంకా ఏడు రోజుల సమయమే మిగిలి ఉంది. ప్రభాస్‌ (Prabhas) కథానాయకుడిగా రూపొందుతున్న ఈ చిత్రానికి నాగ్‌ అశ్విన్‌ (Nag Ashwin) దర్శకత్వం వహించారు. రెండు భాగాలుగా ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ చిత్రం పార్ట్‌ - 1 జూన్‌ 27న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో బుధవారం ముంబయిలో గ్రాండ్‌గా కల్కి ప్రీరిలీజ్‌ ఈవెంట్‌ సైతం నిర్వహించారు. సైన్స్‌ ఫిక్షన్‌ ఫ్యూచరిక్‌ కథాంశంతో తెరకెక్కుతున్న ఈ సినిమా స్టోరీ ఏమై ఉంటుందా? అన్న ప్రశ్న గత కొంతకాలంగా ప్రతీ సినీ అభిమానిలోనూ ఉంది. దీంతో దర్శకుడు నాగ్‌ అశ్విన్‌.. 'కల్కి' కథను క్లుప్తంగా చెప్పే ప్రయత్నం చేశారు. ఈ మేరకు స్పెషల్‌ వీడియోను ఎక్స్‌ వేదికగా రిలీజ్‌ చేశారు.&nbsp; త్రీ వరల్డ్స్‌ స్టోరీ ప్రభాస్‌ (Prabhas) హీరోగా రూపొందిన 'కల్కి 2898 ఏడీ' మూవీ కథ.. మూడు ప్రపంచాల మధ్య తిరుగుతుందని డైరెక్టర్‌ నాగ్‌ అశ్విన్‌ లేటెస్ట్‌ వీడియోలో స్పష్టం చేశారు. కాశీ, కాంప్లెక్స్‌ (కాశీ పైన ఉన్న పిరమిడ్‌ లాంటి సిటీ), శంబాలా నగరాల చుట్టూ ప్రధానంగా కల్కి స్టోరీ తిరగనుందని తెలియజేశారు. ‘పవిత్ర గంగానది ఒడ్డున ఉన్న కాశీ లేదా వారణాసి ఈ ప్రపంచంలో మొదటి నగరమని అనేక పుస్తకాలు, శాసనాల్లో ఉంది. నాగరికత పుట్టుక కూడా ఇక్కడి నుంచే మొదలైందని చెబుతారు. అలాంటిది ఈ ప్రపంచంలో కాశీనే చివరి నగరమైతే ఎలా ఉంటుందన్న ఆలోచన నుంచే ఈ కథ పుట్టింది’ అని నాగ్‌ అశ్విన్‌ తెలిపారు.&nbsp; https://twitter.com/i/status/1803649632041419033 కాంప్లెక్స్‌కు వెళ్లడమే లక్ష్యం 3000 ఏళ్ల తర్వాత కాశీ నగరం ఎలా ఉంటుంది? గంగ పూర్తిగా ఎండిపోయి ప్రజలు ఎలాంటి దుర్భర పరిస్థితులు అనుభవిస్తారు? అని ఊహించి రీసెర్చ్‌ చేసి మరి కల్కిలో కాశీ నగరాన్ని సృష్టించినట్లు నాగ్‌ అశ్విన్‌ చెప్పారు. అదే సమయంలో తిరగేసిన పిరమిడ్‌ ఆకారంలో ఉండే 'కాంప్లెక్స్‌'.. ఆకాశంలో కిలో మీటర్‌ మేర ఉండి స్వర్గాన్ని తలపిస్తుంటుందని పేర్కొన్నారు. 'కాంప్లెక్స్‌లో లభించని వస్తువు, పదార్థమంటూ ఉండదు. ఒక ముక్కలో చెప్పాలంటే అదొక స్వర్గం. నీరు, ఆహారం, పచ్చదనం ఇలా ప్రతిదీ అక్కడ ఉంటుంది. కాశీ ప్రజలు ఎప్పటికైనా కాంప్లెక్స్‌కు వెళ్లి అన్నింటినీ ఆస్వాదించాలనుకుంటారు. ప్రపంచంలో ఎక్కడా లేని వనరులు కాంప్లెక్స్‌లో ఉండటంతో అవి కాశీ ప్రజలకు అందకుండా కొందరు నియంత్రిస్తుంటారు. కాంప్లెక్స్‌లోకి వెళ్లాలంటే మిలియన్ల కొద్దీ యూనిట్స్‌ (ధనం) కలిగి ఉండాలి. ఒకరకంగా అక్కడ అడుగు పెట్టడమంటే జీవితాన్ని పణంగా పెట్టడమే' అని నాగ్‌ అశ్విన్‌ పేర్కొన్నారు. శంబాలా.. ఒక శరణార్థి క్యాంపు కల్కిలోని మూడో ప్రపంచమైన 'శంబాలా' గురించి కూడా తాజా వీడియోలో నాగ్‌ అశ్విన్‌ క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు. ‘వివిధ సంస్కృతుల్లో శంబాలా పేరును వినియోగించారు. టిబెటిన్‌ కల్చర్‌లో దీన్ని షాంగ్రిలా అని పిలిచారు. శంబాలా నుంచే విష్ణు చివరి అవతారం వస్తుందని పురణాలు చెబుతున్నాయి. కాబట్టి శంబాలా ప్రజలు దేవుడి రాక ఇక్కడి నుండి ఉంటుందన్న నమ్మకంతో జీవిస్తుంటారు. అయితే శంబాలా అనేది అతి పెద్ద శరణార్థి క్యాంపులాంటిది. ప్రపంచంలో ఉన్న అన్ని మతాలు, సంస్కృతులకు చెందిన వాళ్లు.. కాంప్లెక్స్‌ సభ్యులు వేటాడి హతమార్చగా మిగిలిన వాళ్లు తలదాచుకునే ప్రదేశం. వీరిలోనే రెబల్స్‌ కూడా ఉంటారు. కాంప్లెక్స్‌ సభ్యులతో నిత్యం పోరాటం చేస్తూ ఉంటారు. ఇలా ఈ మూడు ప్రపంచాల మధ్యే నడిచే కథ వాటి మధ్య ఏర్పడే సంఘర్షణలే కల్కి కథ’ అని నాగ్‌ అశ్విన్‌ చెప్పుకొచ్చారు. ‘కల్కి’ రన్‌టైమ్‌ ఎంతంటే? గత కొన్ని రోజులు నుంచి ఈ మూవీ రన్ టైమ్​ గురించి చర్చ నడుస్తోంది. తాజాగా ఇప్పుడు అధికారికంగా రన్ టైమ్​ బయటకి వచ్చింది. ఈ సినిమాను చూసిన సెన్సార్‌ బోర్డు సభ్యులు.. మూవీకి యూ/ఏ సర్టిఫికేట్‌ ఇచ్చారు. రన్​​ టైమ్​ 180.55 నిమిషాల నిడివితో రానున్నట్లు పేర్కొన్నారు. అంటే ఈ సినిమాను మేకర్స్ 3 గంటల 55 సెకన్లకు కట్ చేశారు. మరి ఈ భారీ ట్రీట్​ను థియేటర్స్​లో ప్రేక్షకుల ఎలా ఆదరిస్తారో చూడాలి. కాగా, సినిమాలో అమితాబ్​ బచ్చన్​, కమల్​ హాసన్​, దిశాపటానీ, దీపికా పదుకొణె కీలక పాత్రల్లో నటించారు.
    జూన్ 20 , 2024
    Gaami Symbol: ‘గామి’ ట్రైలర్‌లో ఆ మిస్టరీ సింబల్‌ను గమనించారా?.. దాని వెనక ఇంత కథ ఉందా!
    Gaami Symbol: ‘గామి’ ట్రైలర్‌లో ఆ మిస్టరీ సింబల్‌ను గమనించారా?.. దాని వెనక ఇంత కథ ఉందా!
    విష్వక్‌సేన్‌ (Vishwak Sen) కథానాయకుడిగా విద్యాధర్‌ కాగిత (Vidyadhar Kagita) దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘గామి’ (Gaami). వి సెల్యులాయిడ్‌ పతాకంపై కార్తీక్‌ శబరీష్‌ నిర్మించారు. చాందిని చౌదరి కథానాయిక. ఇటీవల విడుదలైన ఈ సినిమా ట్రైలర్‌ టాలీవుడ్‌ను ఓ కుదుపు కుదిపింది. హాలీవుడ్‌ స్థాయిలో ఉన్న విజువల్స్‌ ట్రీట్‌ను చూసి ప్రతీ ఒక్కరూ ఆశ్చర్యపోయారు. ఒక్క ట్రైలర్‌తోనే ఈ సినిమా టాలీవుడ్‌ అటెంషన్‌ మెుత్తాన్ని తన వైపునకు తిప్పుకుంది. ఇదిలా ఉంటే గామి ట్రైలర్‌లో చూపించిన ఓ సింబల్‌ ప్రస్తుతం అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. ఆ సింబల్‌కు, కథకు ఏమైనా సంబంధం ఉందా? అన్న ప్రశ్న ప్రతీ ఒక్కరిలోనూ మెుదలైంది. ఇంతకి ఆ సింబల్‌ ఏంటి? దానిపై నెటిజన్లు ఎలాంటి అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు? ఈ కథనంలో చూద్దాం. అసలేంటి ఆ సింబల్‌? గామి ట్రైలర్‌ను గమనిస్తే మూడు ఆకులు ఒకదానికొకటి లింకప్‌ అయ్యి ఉన్న సింబల్‌ చాలా చోట్ల కనిపించింది. ట్రైలర్‌లో మానవ ప్రయోగాలు జరుగుతున్న ప్రాంతంలో ఈ సింబల్‌ను ప్రధానంగా చూడవచ్చు. అక్కడ బందీలుగా ఉన్న వ్యక్తుల శరీరాలపై కూడా ఇదే సింబల్‌ ముద్రించి ఉండటం గమనార్హం. తల వెనక భాగంలో మెడ కింద ఈ సింబల్‌ను మీరు చూడవచ్చు. మరోవైపు విశ్వక్‌ సేన్‌ కూడా హిమాలయ యాత్రకు బయలుదేరినప్పుడు మంచులో ఈ సింబల్‌ను రాసి దాని ముందు పెద్దగా అరవడం ట్రైలర్‌లో చూడవచ్చు. అంటే హ్యూమన్‌ ట్రైల్స్‌కు, అఘోర శంకర్‌ (విష్వక్‌ సేన్‌)కు ఏదో సంబంధం ఉన్నట్లు కనిపిస్తోంది. వాస్తవానికి ఆ తరహా సింబల్‌ను వాడుక భాషలో ‘ట్రైక్యూట్రా’ అంటారు. అటువంటి ఈ సింబల్‌కు తీసుకొని డైరెక్టర్‌ విద్యాధర్‌.. కథలో ఎలాంటి నిర్వచనం చెప్తారో చూడాలి.&nbsp; భూత- భవిష్యత్‌- వర్తమాన కాలంలో కథ సాగుతుందా? ‘గామి’ ట్రైలర్‌ను మరింత నిశితంగా పరిశీలిస్తే ఈ సినిమా.. భూత భవిష్యత్‌ వర్తమాన కాలాల్లో జరిగిన సంఘటనల చుట్టూ తిరుగుతుందని అనిపిస్తోంది. ట్రైలర్‌లో.. 'వాళ్ల గాయాలకు నువ్వు బాధలు మోస్తున్నావ్‌' అంటూ ఓ అఘోరా అనడం ఇందుకు బలం చేకూరుస్తోంది. ఆ మానవ ప్రయోగాలకు హీరో శంకర్‌కు కచ్చితంగా ఏదో సంబంధం ఉన్నట్లు కనిపిస్తోంది. శంకర్‌ గతంలో ఆ హ్యూమన్‌ ట్రైల్స్‌లో బాధితుడి అయి ఉండొచ్చని కొందరు అభిప్రాయపడుతున్నారు. ఆ చెర నుంచి తప్పించుకొని ఆ ప్రయోగాల తాలుకూ స్పర్శ సమస్య ఎదుర్కొంటూ ఉండొచ్చని అభిప్రాయపడుతున్నారు. దీని బట్టి కథ శంకర్‌ బాల్యంలో జరిగిన మానవ ప్రయోగాలు.. తన సమస్య పరిష్కారం కోసం భవిష్యత్‌లో చేస్తున్న హిమాలయ యాత్ర చూపిస్తూ పార్లర్‌గా కథ సాగవచ్చని అంచనా.&nbsp; దేవదాసితో శంకర్‌కు ఉన్న సంబంధం? అఘోరా శంకర్‌కు.. దేవదాసికి మధ్య గల సంబంధంపై ట్రైలర్‌లో ఎలాంటి క్లూస్‌ డైరెక్టర్‌ ఇవ్వలేదు. రెండు పాత్రలను విభిన్న పరిస్థితుల్లో చూపించారు. దేవదాసి బిడ్డను కనడం.. ఆమెను ఊరివారు తరిమేయడం.. ఊరికి అరిష్టమని తెలిసి తిరిగి ఆమె కోసం వెతకడం వంటి దృశ్యాలు ట్రైలర్‌లో కనిపించాయి. ఒకవేళ దేవదాసి కూతురికి హీరోయిన్‌ చాందిని పాత్రకు సంబంధం ఉండే చాన్స్ ఉందని సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. చాందిని పాత్ర అఘోర శంకర్‌కు సాయం చేయడం వెనుక కూడా ఓ బలమైన కారణం ఉండవచ్చని అంటున్నారు. అయితే ఈ ప్రశ్నలన్నింటికీ సమాధానం దొరకాలంటే మార్చి 8 వరకూ ఆగాల్సిందే.&nbsp; గామి టీమ్‌పై రాజమౌళి ప్రశంసలు ఇక ‘గామి’ ట్రైలర్‌పై సర్వత్రా ప్రశంసల వర్షం కురుస్తోంది. ఇప్పటికే పలువురు ప్రముఖులు మూవీ టీమ్‌ కృషిని అభినందిస్తూ వ్యాఖ్యలు చేశారు. తాజాగా దర్శకధీరుడు రాజమౌళి (SS Rajamouli) సైతం దీనిపై ఇన్‌స్టాలో పోస్ట్ పెట్టారు. ‘కఠోరమైన కృషి ఉంటే అసాధ్యమైన కలలు సాకారమవుతాయి. ‘గామి’ గురించి దర్శకుడు, నిర్మాత ఎంత కష్టపడ్డారో నాతో చెప్పినప్పుడు ఈ మాట గుర్తొచ్చింది. ఇందులోని విజువల్స్‌ చూస్తే నాలుగేళ్ల నుంచి వాళ్లు ఎంత కష్టపడ్డారో అర్థమైంది’ అంటూ చిత్రబృందానికి శుభాకాంక్షలు తెలిపారు.
    మార్చి 06 , 2024
    Spirit Heroine: ‘స్పిరిట్‌’లో ప్రభాస్‌కు జోడీగా ఆ స్టార్‌ హీరోయిన్‌.. 16 ఏళ్ల ఎదురుచూపులకు తెర!
    Spirit Heroine: ‘స్పిరిట్‌’లో ప్రభాస్‌కు జోడీగా ఆ స్టార్‌ హీరోయిన్‌.. 16 ఏళ్ల ఎదురుచూపులకు తెర!
    ‘అర్జున్‌రెడ్డి’తో తొలి ప్రయత్నంలోనే సంచలనం సృష్టించిన దర్శకుడు సందీప్‌ రెడ్డి వంగా (Sandeep Reddy Vanga). ఆయన తెరకెక్కించిన తాజా చిత్రం ‘యానిమల్‌’ (Animal) కూడా జాతీయ స్థాయిలో ప్రభంజనం సృష్టించింది. రణ్‌బీర్‌ కపూర్‌ (Ranbir Kapoor), రష్మిక (Rashmika Mandanna) హీరో, హీరోయిన్లుగా చేసిన ఈ చిత్రం.. ఇండియన్ బాక్సాఫీస్‌ను షేక్‌ చేసింది. దీంతో ఆయన తర్వాతి సినిమాపై అందరి దృష్టి పడింది. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్‌తో ‘స్పిరిట్‌’ సినిమా తీయబోతున్నట్లు గతంలోనే సందీప్‌ రెడ్డి ప్రకటించారు. దీంతో షూట్‌ ప్రారంభానికి ముందే వీరి కాంబినేషన్‌పై అంచనాలు భారీగా పెరిగిపోయాయి. తాజాగా ఈ సినిమాలో హీరోయిన్‌కు సంబంధించి క్రేజీ న్యూస్ బయటకొచ్చింది.&nbsp; ప్రభాస్‌ సరసన స్టార్ హీరోయిన్‌! ప్రభాస్‌ - సందీప్‌ రెడ్డి కాంబోలో రానున్న స్పిరిట్‌ చిత్రంలో హీరోయిన్‌ ఎవరన్న ప్రశ్న.. గత కొన్ని రోజులుగా ఫ్యాన్స్‌ను వెంటాడుతోంది. ఇటీవల నేషనల్‌ క్రష్‌ రష్మిక (Rashmika Mandanna) ప్రభాస్ పక్కన చేయనున్నట్లు వార్తలు వచ్చాయి. అయితే తాజాగా ‘స్పిరిట్‌’లో హీరోయిన్‌ ఎవరన్న విషయం దాదాపుగా ఖరారైనట్లు తెలుస్తోంది. ఈ చిత్రంలో ప్రభాస్‌ సరసన స్టార్‌ హీరోయిన్‌ త్రిష (Trisha) చేయబోతున్నట్లు సమాచారం. ప్రముఖ ఫిల్మ్‌ సైట్‌ IMDB.. ‘స్పిరిట్‌’ మూవీ క్యాస్ట్ విభాగంలో త్రిషను హీరోయిన్‌గా చేర్చింది. స్పిరిట్‌లో ఆమె పాత్ర పేరును ‘గీత’ పేర్కొంది. అలాగే సీనియర్‌ నటుడు అనంత నాగ్‌ కూడా ఈ చిత్రంలో కీలక పాత్ర పోషించనున్నట్లు IMDB తన సైట్‌లో పేర్కొంది. దీంతో త్రిష ఎంపిక కన్ఫార్మ్‌ అయి ఉండవచ్చని సోషల్‌ మీడియాలో ప్రచారం ఊపందుకుంది.&nbsp; గతంలోనే స్టార్‌ జోడీగా గుర్తింపు! ప్రభాస్‌ - త్రిష జంటగా నటించడం ‘స్పిరిట్‌’తోనే తొలిసారి కాదు. వారి కాంబినేషన్‌లో గతంలో మూడు చిత్రాలు విడుదలయ్యాయి. 2004లో వచ్చిన ‘వర్షం’ చిత్రం అప్పట్లో సెన్సేషన్‌ క్రియేట్‌ చేసింది. ప్రభాస్‌ - త్రిష మధ్య కెమెస్ట్రీ అద్భుతంగా కుదరడంతో మెస్మరైజింగ్‌ జోడీగా వారు గుర్తింపు పొందారు. ఆ తర్వాత పౌర్ణమి (2006), బుజ్జిగాడు (2008) సినిమాలోనూ ఈ జంట కలిసి నటించింది. బుజ్జిగాడు యావరేజ్‌ టాక్‌ తెచ్చుకోగా.. పౌర్ణమి మాత్రం ప్రేక్షకులను మెప్పించడంలో విఫలమైంది. దాదాపు 16 ఏళ్ల తర్వాత ఈ హ్యాట్రిక్‌ సినిమాల జోడి తిరిగి తెరపై కనిపించనుందని వార్తలు వస్తుండటం ఆసక్తికరంగా మారింది.&nbsp; అర్జున్‌ రెడ్డి, యానిమల్‌కు భిన్నంగా..! దర్శకుడు సందీప్‌ రెడ్డి వంగా.. ‘స్పిరిట్‌’ను విభిన్నంగా తెరకెక్కించబోతున్నట్లు తెలుస్తోంది. అర్జున్‌ రెడ్డి (Arjun Reddy), యానిమల్‌ (Animal) సినిమాల తరహాలో పెద్దింటి కుటుంబాల మధ్య కథను అల్లకుండా మధ్యతరగతి బ్యాక్‌డ్రాప్‌లో దీన్ని తీయనున్నట్లు ‘స్పిరిట్‌’ (Spirit) సినిమాకు సంబంధించిన ప్లాట్‌లో IMDB పేర్కొంది. అయితే దీన్ని చిత్ర యూనిట్‌ ధ్రువీకరించాల్సి ఉంది. మరోవైపు స్పిరిట్‌లో ప్రభాస్‌ పాత్రకు సంబంధించి గతంలోనే సందీప్‌ రెడ్డి కొన్ని వ్యాఖ్యలు చేశాడు. ప్రభాస్ ఓ పవర్‌ఫుల్ పోలీస్ ఆఫీసర్‌గా కనిపించబోతున్నాడని పేర్కొన్నాడు. స్క్రిప్ట్ వర్క్ పూర్తయిందని.. గతంలో ఎప్పుడూ చూడని ప్రభాస్‌ను ఈ మూవీలో చూడబోతున్నట్లు సందీప్‌ చెప్పడం విశేషం.&nbsp; ‘స్పిరిట్‌’ నిర్మాత ఏమన్నారంటే? స్పిరిట్‌ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత భూషణ్‌కుమార్‌ నిర్మించనున్నారు. గతంలో ఈ సినిమాకు సంబంధించి ఆయన కీలక అప్‌డేట్స్‌ ఇచ్చారు. స్పిరిట్‌ చాలా ప్రత్యేకమైన సినిమా అని ఆయన అన్నారు. ఇందులో ప్రభాస్‌ తొలిసారి ఖాకీ దుస్తులు ధరించి లాఠీ ఝుళిపిస్తారని పేర్కొన్నారు. ‘అలాగే ఈ సినిమాకు సంగీతం ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది. ఈ చిత్రం గురించి ఒక విషయం కచ్చితంగా చెప్పగలను. ఇందులో మునుపెన్నడూ చూడని ప్రభాస్‌ని చూస్తారు’ అని భూషణ్‌ కుమార్‌ చెప్పారు. ఈ వార్త విన్నప్పటి నుంచి ప్రభాస్‌ ఫ్యాన్స్ తెగ ఖుషీ అవుతున్నారు.&nbsp; భారీ ఆఫర్లతో దూసుకెళ్తున్న త్రిష! గత కొంతకాలంగా సరైన సినిమాలు లేక టాలీవుడ్‌కు దూరమైన నటి త్రిష.. తిరిగి గట్టి కమ్‌బ్యాక్‌ ఇచ్చేందుకు సిద్ధమవుతోంది. ప్రస్తుతం ఈ భామ ముగ్గురు స్టార్‌ హీరోల సరసన నటించబోతోంది! ఇప్పటికే చిరంజీవి ‘విశ్వంభర’ చిత్రంలో త్రిషను హీరోయిన్‌గా ఫిక్స్‌ చేశారు. అటు అనిల్‌ రావిపూడి దర్శకత్వంలో రానున్న ‘ఎఫ్‌ 4’ మూవీలో వెంకటేష్‌ సరసన త్రిష పేరును పరిశీలిస్తున్నట్లు ఇటీవల వార్తలు వచ్చాయి. దీనిపై త్వరలోనే అధికారిక ప్రకటన కూడా వస్తుందని అంటున్నారు. తాజాగా ప్రభాస్‌ సరసన ‘స్పిరిట్‌’లో త్రిష ఛాన్స్‌ కొట్టేసినట్లు వార్తలు వస్తుండటం ఆమె ఫ్యాన్స్‌ను సంతోషంలో ముంచెత్తుతోంది.&nbsp;
    ఫిబ్రవరి 27 , 2024
    Best Hollywood Romantic Movies: ప్రేమ లోకంలో మునిగేలా చేసే అద్భుతమైన హాలీవుడ్ చిత్రాలు!
    Best Hollywood Romantic Movies: ప్రేమ లోకంలో మునిగేలా చేసే అద్భుతమైన హాలీవుడ్ చిత్రాలు!
    సినీ ప్రియులు ఏ భాషలో కొత్త సినిమా ఉన్నా వెతుక్కుని మరి వెళ్లి చూస్తారు. ముఖ్యంగా ఈ జనరేషన్‌ యూత్‌.. తెలుగు సినిమాలతో పాటు హాలీవుడ్‌ చిత్రాలను సైతం ఎంతో ఇష్టంగా చూస్తుంటారు. అద్భుతమైన కథ, కథనంతో సాగే యాక్షన్‌ సినిమాలను చూసి వినోదాన్ని పొందుతుంటారు. అయితే హాలీవుడ్ అంటే కేవలం యాక్షన్‌ చిత్రాలు మాత్రమే కాదు. అక్కడ హృదయాలను హత్తుకునే రొమాంటిక్‌ సినిమాలు (Best Hollywood Romance Movies) కూడా ఉన్నాయి. ఇప్పటివరకూ హాలీవుడ్‌లో వచ్చిన టాప్‌ రొమాంటిక్‌ చిత్రాలు ఏవో ఇప్పుడు చూద్దాం.&nbsp; When Harry Met Sally (1989) నటి నటులు: మెగ్ ర్యాన్‌, బిల్లీ క్రిస్టల్‌ డైరెక్టర్‌ : రాబ్‌ రీనర్‌ ఒకే యూనివర్సిటీలో గ్రాడ్యుయేట్స్‌ చేసిన హ్యారీ, సాలీ.. న్యూయార్క్‌లో కలుసుకుంటారు. అప్పటికే వారు ప్రేమలో విఫలమై ఉన్నందు వల్ల ఇద్దరి మధ్య స్నేహం ఏర్పడుతుంది. అయితే ఒక పురుషుడు, స్త్రీ లైంగిక సంబంధం లేకుండా స్నేహితులుగా ఉండగలరా? అన్న ప్రశ్న వారికి ఎదురవుతుంది. దానికి వారు ఏం సమాధానం చెప్పారు? అన్నది స్టోరీ. Sleepless in Seattle (1993) నటినటులు : టామ్‌ హ్యాన్క్స్‌, మెగ్‌ ర్యాన్ డైరెక్టర్‌ : నోరా ఎప్రాన్‌ శ్యామ్‌ భార్య చనిపోవడంతో అతడు కొడుకుతో ఒంటరిగా జీవిస్తుంటాడు. ఒక రోజు అతడు ఓ టీవీ షోలో పాల్గొంటాడు. రిపోర్టర్‌ అన్నీ రీడ్‌.. అతడి మాటలకు ఆకర్షితురాలవుతుంది. ఆమెకు నిశ్చితార్థం జరిగినప్పటికీ ప్రేమికుల రోజున అతడికి ఆహ్వానం పలుకుతుంది. ఆ తర్వాత ఏమైంది? వారు కలుసుకున్నారా? లేదా? అన్నది స్టోరీ. The Notebook (2004) నటీనటులు : ర్యాన్‌ గోస్లింగ్‌, రచెల్‌ మెక్‌ ఆడమ్స్‌ డైరెక్టర్‌ : నిక్‌ క్యాసావెట్స్‌ నోహ్‌ కాల్హౌన్‌ అనే యువకుడు అల్లీ అనే సంపన్న యువతిని ప్రేమిస్తాడు. ఈ క్రమంలో రెండవ ప్రపంచ యుద్ధంలో దేశం తరపున పోరాడేందుకు యుద్ధ భూమికి వెళ్తాడు. తమ ప్రేమ ముగిసిందని భావించిన అల్లీ మరోక వ్యక్తిని ఇష్టపడుతుంది. కొన్ని సంవత్సరాల తర్వాత నోహ్‌ తిరిగి రావడంతో కథ ఊహించని మలుపు తిరుగుతుంది.&nbsp; Titanic (1997) నటినటులు : లియోనార్డో డికాప్రియా, కేట్‌ విన్‌సెల్ట్‌ డైరెక్టర్‌ : జేమ్స్‌ కామెరాన్ రోజ్‌కు సంపన్న వ్యక్తితో పెళ్లి నిశ్చయమవుతుంది. ఆమె తనకు కాబోయే భర్తతో టైటానిక్‌ షిప్‌లో ప్రయాణిస్తుండగా అక్కడ జాక్ అనే యువకుడ్ని ప్రేమిస్తుంది. ఓ ఉపద్రవం వారిద్దరినీ వేరు చేస్తుంది. రోజ్‌ కోసం జాక్‌ ప్రాణ త్యాగం చేయాల్సిన పరిస్థితి తలెత్తుతుంది. Titanic (1997) Directed by James Cameron Shown from left: Leonardo DiCaprio, Kate Winslet La la land (2016) నటీనటులు : ర్యాన్‌ గోస్లింగ్‌, ఎమ్మా స్టోన్‌ డైరెక్టర్‌ : డామీన్‌ చాజెల్లె సంగీతకారుడు సెబాస్టియన్‌, నటి మియా ఒకరినొకరు ప్రేమించుకుంటారు. తమ వృత్తుల్లో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకుంటారు. అయితే వారి కీర్తి పెరిగే కొద్ది వారి మధ్య ప్రేమ తగ్గుతూ వస్తుంది. కొందరు వ్యక్తులు వారి ప్రేమను బలహీన పరుస్తారు. చివరికి వారు ఒక్కటిగా ఉన్నారా? లేదా? Carol (2015) నటీనటులు : కేట్‌ బ్లాన్‌చెట్‌, రూనీ మారా డైరెక్టర్‌ : టాడ్ హేయ్‌నెస్‌ 1950లో ఫొటోగ్రాఫర్‌ థెరిస్‌.. కరోల్‌ అనే అందమైన అమ్మాయిని చూస్తాడు. ఆమె విచారంగా ఉండటాన్ని గమనించి కరోల్‌కు విడాకులైన విషయాన్ని తెలుసుకుంటాడు. థెరిస్‌ను రోజూ కలుస్తూ ఆమెకు దగ్గరవుతాడు. వారు ఒక్కటయ్యే క్రమంలో వారు తీవ్ర పరిణామాలు ఎదుర్కొంటారు. నైతిక పోరాటం చేస్తారు.&nbsp; Eternal Sunshine of the Spotless Mind (2004) నటీనటులు: &nbsp;జిమ్‌ క్యారీ, కేట్‌ విన్‌సెల్ట్‌ డైరెక్టర్‌ : మైఖేల్‌ గాండ్రీ జోయెల్‌, క్లెమెంటైన్‌ ఒకరినొకరు ప్రేమించుకొని కొన్ని కారణాల వల్ల విడిపోతారు. జ్ఞాపకాలను చెరిపేసుకునేందుకు ప్రయత్నిస్తుంటారు. అయితే తాము ఇప్పటికీ డీప్‌గా లవ్‌ చేసుకుంటున్నట్లు గ్రహించడంతో కథ మలుపు తిరుగుతుంది.&nbsp; The Curious Case of Benjamin Button (2008) నటినటులు: బ్రాడ్‌ పిట్‌, కేట్‌ బ్లాన్‌చెట్‌ డైరెక్టర్ : డేవిడ్‌ ఫిన్‌చెర్‌ బెంజమన్‌ బటన్‌ ఒక అరుదైన సమస్యతో జన్మిస్తాడు. పుట్టడమే వృద్ధుడి శారీరక స్థితితో జన్మించిన అతడు సంవత్సరాలు గడుస్తున్న కొద్ది రివర్స్‌లో అతడి ఏజ్‌ తగ్గుతూ వస్తుంది. బెంజమన్‌.. డైసీ అనే డ్యాన్సర్‌ను గాఢంగా ప్రేమిస్తాడు. కాలం గడుస్తున్న కొద్ది వారి వయసులు పరస్పరం విరుద్దంగా మారుతుండటంతో కథ ఆసక్తికరంగా మారుతుంది.&nbsp; 500 Days of Summer (2009) నటీనటులు : జోసెఫ్ గార్డన్‌, జూలీ డెస్‌చానెల్‌ డైరెక్టర్‌ : మార్క్ వెబ్‌ టామ్ ఒక గ్రీటింగ్ కార్డ్‌ రైటర్‌. అతడు సమ్మర్‌ తర్వాత తన ప్రేయసితో విడిపోతాడు. అయితే వేసవిలో ఆ 500 రోజులు ఆమెతో ఎలా గడిపానన్న విషయాన్ని టామ్‌ సమీక్షించుకుంటాడు. అలా చేయడం ద్వారా అతడు తన జీవిత లక్ష్యాన్ని గ్రహిస్తాడు.&nbsp; ‘Before’ Trilogy (1995 – 2013) నటీనటులు : ఈథన్‌ హావ్‌కే,&nbsp; జూలీ డెల్పీ డైరెక్టర్‌ : రిచర్డ్‌ లింక్‌లేటర్‌ ‘బిఫోర్ ట్రయాలజీ’.. హాలీవుడ్‌లోని ఉత్తమ రొమాన్స్ ఫిల్మ్ ఫ్రాంచైజీ. ఆ సంస్థ నుంచి వచ్చిన&nbsp; ‘బిఫోర్ సన్‌రైజ్’ (Before Sunset), ‘బిఫోర్ సన్‌సెట్’ (Before Midnight), ‘బిఫోర్ మిడ్‌నైట్’ (Before Midnight) మూవీస్‌ అద్భుతమైన రొమాంటిక్‌ చిత్రాలుగా గుర్తింపు పొందాయి. ఈ మూడు సినిమాలు జెస్సీ, సెలిన్ ప్రేమకథల చుట్టు తిరుగుతుంది.&nbsp; Never Let me go (2010) నటీనటులు : క్యారి ముల్లీగన్‌, ఆండ్రూ గర్‌ఫీల్డ్‌, కియారా నైట్లీ, ఎల్లా పుర్నెల్‌ డైరెక్టర్‌: మార్క్‌ రోమనెక్‌ రూత్, కాథీ, టామీ ఓ ఇంగ్లీష్ బోర్డింగ్ స్కూల్‌లో చదువుకుంటారు. లవ్‌కు సంబంధించిన బాధాలను ఎదుర్కొంటారు. పరిస్థితులు ఆ ముగ్గురి జీవితాలను ఎలా ప్రభావితం చేసిందన్నది కథ.&nbsp; Pride &amp; Prejudice (2005) నటీనటులు: కీరా నైట్లీ, మ్యాథ్యూ, కారే ముల్లిగన్‌, రోసముండ్‌ పైక్‌, సిమన్‌ వుడ్స్‌ తదితరులు డైరెక్టర్‌ : జో వ్రైట్ ఇది బెన్నెట్ అనే మహిళకు పుట్టిన నలుగురు కుమార్తెల కథ. ధనవంతులైన భర్తలు కావాలని ఆమె కూతుర్లు పట్టుబడతారు. మరి వారి కలలు ఎలా నెరవేరాయి? వారు ఎలాంటి భర్తలను పొందారు? అన్నది కథ.&nbsp; Broke back mountain (2005) నటీనటులు : హీత్‌ లెడ్జర్‌, జేక్‌ గైలెన్‌హాల్‌, మిచెల్లె విలియమ్స్‌, అన్ని హాథ్‌వే డైరెక్టర్‌ : ఆంగ్‌ లీ ఇద్దరు గొర్రెల కాపరులు.. ఎన్నిస్, జాక్ ఒకరినొకరు ఇష్టపడతారు. లైంగిక, భావోద్వేగ సంబంధాన్ని కలిగి ఉంటారు. వారిద్దరూ తమ స్నేహితులను వివాహం చేసుకోవడంతో బంధం క్లిష్టంగా మారుతుంది. Dirty Dancing (1987) నటీ నటులు : పాట్రిక్‌ స్వేజీ, జెన్నిఫర్ గ్రే డైరెక్టర్‌ : ఎమిలీ ఆర్డొలినో ఫ్రాన్సిస్‌ తన తల్లిదండ్రులతో విహార యాత్రకు వెళ్లినప్పుడు అక్కడ ఓ రిసార్టులోని డ్యాన్స్‌ మాస్టర్‌తో ప్రేమలో పడుతుంది. వారి ప్రేమను యువతి తండ్రి తిరస్కరిస్తాడు. మరి వారు ఒక్కటయ్యారా? Call Me By Your Name (2017) నటీనటులు : టైమోథీ చలామెట్‌, అర్మీ హామర్‌ డైరెక్టర్‌ : లుకా గ్వాడాగ్నినో 1983 వేసవి కాలంలో కథ జరుగుతుంది. 17 ఏళ్ల ఎలియో పెర్ల్‌మాన్.. తన తండ్రి సహాయకుడు ఆలివర్‌ను ఇష్టపడుతుంది. వారు ఆ వేసవిలో ఎంతో సంతోషంగా గడుపుతారు. అయితే, ఓ ఘటన వారి జీవితాలను తలకిందులు చేస్తుంది.&nbsp; Shakespeare in Love (1998) నటీనటులు : జోసెఫ్‌ ఫ్లెన్నస్‌, గ్వినేత్ పాల్ట్రో డైరెక్టర్‌ :&nbsp; జాన్‌ మాడెన్‌ విలియం షేక్‌ స్పియర్‌.. థియేటర్ ఆర్టిస్ట్ అయిన ఒక అందమైన యువతిని చూసి ప్రేరణ పొందుతాడు. ఓ నాటకం రాయడానికి సిద్ధమవుతాడు. ఈ క్రమంలో వారు శరీరకంగా దగ్గరవుతారు. అయితే యువతి చేసిన పని వల్ల వారి జీవితాలు తలకిందులవుతాయి.&nbsp; The fault in our Star (2014) నటీనటులు : షాయ్‌లెనె వూడ్లీ, అన్సెల్‌ ఎల్గర్ట్‌ డైరెక్టర్‌ : జోష్‌ బూన్‌ హాజెల్, అగస్టస్ అనే ఇద్దరు క్యాన్సర్ బాధితులు.. క్యాన్సర్ సపోర్టు గ్రూప్‌ ద్వారా కలుసుకుంటారు.&nbsp; త్వరలోనే వారు ప్రేమలో పడతారు. కష్టకాలంలో వారు ఒకరికొకరు బాసటగా నిలుస్తారు. అయితే విధి వారిపై కన్నెర్ర చేస్తుంది. . Four Weddings and a Funeral (1994) నటీనటులు : హ్యూజ్‌ గ్రాన్ట్‌, ఆండీ మెక్‌డొవెల్‌ డైరెక్టర్‌ : మైక్‌ నెవెల్‌ ఇంట్రోవర్ట్‌ అయిన చార్లెస్‌.. అమ్మాయిలను దురదృష్టంగా భావిస్తుంటాడు. ఒక పెళ్లిలో క్యారీ అనే అందమైన యువతిని చార్లెస్‌ చూస్తాడు. ఆ అమ్మాయి తనకు అదృష్ట దేవత కాగలదని విశ్వసిస్తాడు. మరి వారిద్దరు ఎలా ఒక్కటయ్యారు? ఈ క్రమంలో చార్లెస్‌కు ఎలాంటి సమస్యలు ఎదురయ్యాయి? అన్నది స్టోరీ.&nbsp;
    ఫిబ్రవరి 10 , 2024
    Jhanvi Kapoor: నా కళ్లు కాదు.. అబ్బాయిలు ఇంకేదో చూస్తారు.. జాన్వీ అఫిషియల్‌ లీక్‌!
    Jhanvi Kapoor: నా కళ్లు కాదు.. అబ్బాయిలు ఇంకేదో చూస్తారు.. జాన్వీ అఫిషియల్‌ లీక్‌!
    బాలీవుడ్‌ బ్యూటీ జాన్వీ కపూర్‌ లేటెస్ట్‌ గ్లామర్‌ ఫొటోలు నెట్టింట తెగ వైరల్‌ అవుతున్నాయి. తాజాగా కాఫీ విత్ కరణ్ షోలో సోదరి ఖుషీతో కలిసి పాల్గొన్న ఆమె రెడ్‌ డ్రెస్‌లో మెరిసిపోయింది. ఎద అందాలను చూపిస్తూ కుర్రకారుని అలరించింది. ఈ షోలో జాన్వీ పలు ఆసక్తికర ప్రశ్నలకు సమాధానం ఇచ్చారు. ఏ హీరో అయినా కొంటెగా మెసేజ్‌ చేశాడా? అని కరణ్‌ జోహర్‌ ప్రశ్నించగా.. నీ బాడీలోని బ్యూటీ స్పాట్స్‌ చెప్తావా అంటూ ఓ హీరో తనకు టెక్స్ట్‌ చేసినట్లు జాన్వీ సమాధానం ఇచ్చింది.&nbsp; మరో ప్రశ్న కింద అబ్బాయిలు నీలో మెుదట చూసేది ఏంటని కరణ్‌ జోహార్‌ అడగ్గా.. తన కళ్లు బాగుంటాయని, చాలామంది వాటికి ఆకర్షితులవుతారని జాన్వీ చెప్పింది. అదేంటో వాళ్ల చూపులు మాత్రం కళ్ల మీదకు కాకుండా ఇంకెక్కడికో వెళ్తుంటాయని నవ్వుతూ తెలిపింది.&nbsp; ఈ ఎపిసోడ్‌లో జాన్వీ తన ప్రియుడు శిఖర్ పహారియా గురించి మాట్లాడారు. శిఖర్‌తో డేటింగ్ నిజమా? అబద్ధమా? అన్న కరణ్ జోహార్ ప్రశ్నకు శిఖర్ తన ఫ్యామిలీలో అందరికీ ఇష్టమని జాన్వీ సమాధానం ఇచ్చింది. శిఖర్ చాలా నిస్వార్థంగా, గౌరవప్రదంగా ఉండే వ్యక్తి అని.. తనలాంటి వ్యక్తిత్వం ఉన్న మగవారిని తాను ఇప్పటివరకు చూడలేదని జాన్వీ చెప్పారు. తన తండ్రి బోనీ కపూర్, చెల్లెలు (ఖుషి) అందరికీ మంచి స్నేహితుడిలా ఉన్నాడని పేర్కొంది. ప్రస్తుతం జాన్వీ తెలుగులో 'దేవర' చిత్రంలో నటిస్తోంది. న్యూయర్‌ సందర్భంగా దేవర పోస్టర్‌ రిలీజ్‌ చేసిన చిత్ర యూనిట్‌.. జనవరి 8న సినిమా గ్లింప్స్‌ విడుదల చేయబోతున్నట్లు ప్రకటించింది. దీంతో ఫ్యాన్స్‌ గ్లింప్స్‌ కోసం తెగ ఎదురు చూస్తున్నారు. ఈ సినిమాలో జాన్వీ కపూర్ మత్స్యకారుని కూతురిగా కనిపించనున్నట్లు ఆమె పోస్టర్లను బట్టి అర్థమవుతోంది. జాన్వీ లుక్‌ చాలా వరకూ లంగా ఓణీలో ఉంటుందని టాక్‌. ఇక తారక్ ఈ మూవీలో ట్రైబల్‌ లుక్‌లో కనిపించనున్నారని, ఈ సినిమాలో అతడి పాత్ర పేరు తంగం అని తెలుస్తోంది. ఇక దేవర సినిమాను రెండు పార్ట్‌లుగా ప్రకటించగా తొలి భాగం ఏప్రిల్‌ 5న విడుదల చేస్తామని మేకర్స్ ఇప్పటికే తెలిపారు. ఇందులో బాలీవుడ్‌ స్టార్‌ హీరో సైఫ్‌ అలీఖాన్‌, మలయాళం స్టార్‌ టామ్‌ చాకోలు విలన్స్‌గా కనపడబోతున్నారు. ఇక జాన్వీ సినిమాల విషయానికి వస్తే.. దేవరతో పాటు ఆమెకు మరో తెలుగు సినిమాలో అవకాశం వచ్చినట్లు లేటెస్ట్ టాక్. ఏజెంట్‌ తర్వాత అఖిల్‌ చేయబోతున్న మూవీలో ఆమెకు అవకాశం ఇవ్వాలని మేకర్స్‌ భావిస్తున్నారట. త్వరలోనే దీనిపై అధికారిక ప్రకటన కూడా వచ్చే అవకాశముందని తెలుస్తోంది. ఈ సినిమాలతో పాటు జాన్వీకి తెలుగులో మరో ఆఫర్ వచ్చినట్లు తెలుస్తోంది. మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా దర్శకుడు బుచ్చిబాబు సానా దర్శకత్వంలో ఓ సినిమా రాబోతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో హీరోయిన్‌గా జాన్వీ కపూర్‌‌ను ఖరారు చేసినట్లు తెలుస్తోంది. చాలా పేర్లు పరిశీలించిన టీమ్ చివరకు జాన్వీని ఓకే చేసినట్లు టాక్. ఇక జాన్వీ రెమ్యూనరేషన్‌ విషయానికి వస్తే.. ఆమె హిందీలో ఒక్కో సినిమాకు రూ.3.5 కోట్ల వరకూ తీసుకుంటుందట. అయితే తెలుగులో మాత్రం రూ.5 కోట్లు డిమాండ్‌ చేస్తుందని అంటున్నారు. జాన్వీ ముంబైలోని జుహు ప్రాంతంలో రూ.39 కోట్ల రూపాయలతో ఓ ఖరీదైన ఇంటిని సొంతం చేసుకుందని బాలీవుడ్ వర్గాల్లో టాక్.
    జనవరి 04 , 2024
    Adipurush: పెళ్లిపై క్లారిటీ.. ప్రభాస్ మీరు అనుకున్నంత కామ్ ఏమీ కాదు.. కృతి సనన్ క్రేజీ కామెంట్స్&nbsp;
    Adipurush: పెళ్లిపై క్లారిటీ.. ప్రభాస్ మీరు అనుకున్నంత కామ్ ఏమీ కాదు.. కృతి సనన్ క్రేజీ కామెంట్స్&nbsp;
    ‘ఆదిపురుష్’ ప్రీ రిలీజ్ ఈవెంట్ గ్రాండ్‌గా జరిగింది. అడుగడుగునా ఆధ్యాత్మికత ఫరిడవిల్లేలా సభా ప్రాంగణాన్ని నిర్వహకులు తీర్చిదిద్దారు. దాదాపు లక్షకు పైగా పాసులు మంజూరు చేయగా అంతకుమించి అభిమానులు వేడుకకు వచ్చారు. ఎటు చూసినా రాముడి స్వరూపమే. జై శ్రీరామ్ నినాదమే. అట్టహాసంగా నిర్వహించిన ఈ వేడుకలో ముఖ్య అతిథులతో పాటు ప్రభాస్, కృతి సనన్, డైరెక్టర్ ఓం రౌత్, నిర్మాత భూషణ్ కుమార్ సహా సినిమాకు పనిచేసిన నటీనటులు ఇతర టెక్నిషియన్లు పాల్గొన్నారు. కార్యక్రమంలో భాగంగా ప్రభాస్, కృతి సనన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. పెళ్లిపై ప్రకటన.. ప్రభాస్ ప్రస్తుత వయసు 43. టాలీవుడ్ ఇండస్ట్రీలో మోస్ట్ ఎలిజిబిల్ బ్యాచ్‌లర్ ప్రభాసే. దీంతో ఎక్కడ కనిపించినా డార్లింగ్‌కు ఈ ప్రశ్న ఎదురవుతూ ఉంటుంది. కానీ, ఏనాడూ పూర్తి క్లారిటీ ఇవ్వలేదు. ‘త్వరలో.. త్వరలో’ అంటూ సమాధానాన్ని దాటవేసేవాడు. ‘ఆదిపురుష్ ప్రీ రిలీజ్ ఈవెంట్’ పుణ్యమా అని ప్రభాస్ పెళ్లిపై కొద్దోగొప్పో క్లారిటీ వచ్చేసింది. ఎప్పుడు పెళ్లి చేసుకున్నా.. అది తిరుపతిలోనే జరుగుతుందని తేల్చేశాడు. అభిమానుల నుంచి వచ్చిన ప్రశ్నకు సమాధానంగా ప్రభాస్ ఈ రిప్లై ఇచ్చాడు. దీంతో ఫ్యాన్స్ ఖుషీ అయ్యారు.&nbsp; https://twitter.com/DailyCultureYT/status/1666291610722930689?s=20 ఇక సినిమాల జాతరే.. బాహుబలి సినిమాల తర్వాత ప్రభాస్ కెరీర్‌లో వేగం మందగించింది. గత ఐదేళ్లలో ప్రభాస్ చేసింది 2 సినిమాలు మాత్రమే. 2017లో బాహుబలి2 సినిమా విడుదలయ్యాక 2019లో సాహో రిలీజ్ చేశాడు. మళ్ళీ 2022లో రాధేశ్యామ్‌ సినిమాతో వచ్చాడు. ఇవి రెండూ పెద్దగా రాణించకపోవడంతో ఆదిపురుష్‌పైనే అంచనాలు పెట్టుకున్నారు. అయితే, సినిమాల విషయంలోనూ ప్రభాస్ క్లారిటీ ఇచ్చాడు. ఇక నుంచి ఏడాదికి 2, 3 సినిమాలు చేస్తానని ఫ్యాన్స్‌కి మాటిచ్చాడు. ఎక్కువ సినిమాలు చేస్తూ తక్కువ మాట్లాడతానని చెప్పాడు.&nbsp; https://twitter.com/TheAakashavaani/status/1666136550361673728?s=20 ఆదిపురుష్ సినిమా.. ఆదిపురుష్ మూవీ తొలి ట్రైలర్ గతేడాది రిలీజ్ అయినప్పుడు తీవ్ర విమర్శలు ఎదురయ్యాయి. దీంతో ఓం రౌత్ పనితీరుపై ప్రభాస్ అసంతృప్తి వ్యక్తం చేసినట్లు వార్తలొచ్చాయి. కానీ, అవేవీ నిజం కాదని ప్రభాస్ పరోక్షంగా కొట్టి పారేశాడు. ఆదిపురుష్ సినిమా వెనకాల ఉన్న కష్టాన్ని వివరించే ప్రయత్నం చేశాడు. సినిమా కోసం రోజుకు 20 గంటలు పనిచేశారని గుర్తు చేశారు. దర్శకుడు ఓం రౌత్ పెద్ద యుద్ధమే చేసినట్లు వివరించాడు. తన జీవితంలోనే ఓం రౌత్ లాంటి వ్యక్తులను చూడలేదని ప్రశంసించాడు.&nbsp; చిరంజీవి కామెంట్స్‌.. ఆదిపురుష్ సినిమా చేయడం నిజంగా తన అదృష్టమని ప్రభాస్ చెప్పాడు. గతంలో చిరంజీవితో జరిగిన సంభాషణను ప్రీ రిలీజ్ ఈవెంట్ వేదికగా పంచుకున్నాడు. ‘రామాయణం సినిమా చేస్తున్నావా? అని చిరంజీవి సర్ అడిగారు. అవునని చెప్పా. ఇలాంటి అవకాశం అందరికీ దొరకదు. నీకు దొరికింది అని చెప్పారు’ అంటూ ప్రభాస్ గుర్తు చేసుకున్నాడు.&nbsp; https://www.youtube.com/watch?v=A8NS3vSJ1Gc కృతి సనన్.. ప్రభాస్‌కు జంటగా కృతిసనన్ ఈ సినిమాలో నటించింది. సీత పాత్ర పోషించింది. అయితే, వీరిద్దరి మధ్య ఏదో ఉందని బాలీవుడ్ వర్గాలు అప్పట్లో కోడై కూశాయి. కానీ, అలాంటిదేమీ లేదని కృతిసనన్ గతంలో ఖండించింది. అన్‌స్టాపబుల్ షోలోనూ ప్రభాస్‌ను బాలయ్య ఈ ప్రశ్న అడిగాడు. దీంతో ‘మేడం అంతా క్లారిటీ ఇచ్చేసిందిగా సర్’ అంటూ డార్లింగ్ జవాబు చెప్పడం ఆశ్చర్యానికి గురిచేసింది. అయితే, ఈ సినిమాలో నటించిన కృతిసనన్ ప్రభాస్ అభినందించాడు. ఒక్క ఎక్స్‌ప్రెషన్‌తో అభిమానులను ఫిదా చేసిందని కొనియాడాడు.&nbsp; ప్రభాస్‌పై కృతి సనన్.. ప్రభాస్‌పై కృతిసనన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. ఆన్‌స్క్రీన్‌, ఆఫ్‌స్క్రీన్ ప్రభాస్ గురించి చెప్పింది.&nbsp; ‘ఆన్‌స్క్రీన్‌లో యాక్టీవ్‌గా, ఆఫ్ స్క్రీన్‌లో ప్రభాస్ కామ్‌గా ఉంటారని అనుకుంటారు. కానీ ప్రభాస్ మీరు అనుకున్నంత కామ్ ఏమీ కాదు. ప్రభాస్‌లోని కామ్‌నెస్ ఎవరిలోను చూడలేదు. రాముడిగా ప్రభాస్‌ను తప్ప ఎవరిని ఉహించుకోలేం. ఈ సినిమాలో జానకి పాత్ర ఎంతో ప్రత్యేకం’ అని కృతి చెప్పుకొచ్చింది. https://www.youtube.com/watch?v=fmbZE7J9IMA ప్రభాస్ లేకుండా ఈ సినిమా చేసి ఉండే వాడిని కాదని డైరెక్టర్ ఓం రౌత్ చెప్పుకొచ్చాడు. ఈ సినిమా ఏ ఒక్కరికో సొంతం కాదని, భారత దేశంలో ఉన్న ప్రతి వ్యక్తికి చెందిన సినిమా అంటూ వెల్లడించాడు. ఇది ఇండియన్ ఫిల్మ్ అని ప్రకటించాడు. సినిమా నిర్మాణానికి సహకరించిన నిర్మాత భూషణ్‌కుమార్‌కు ఓం రౌత్ ధన్యవాదాలు చెప్పాడు.&nbsp;&nbsp;&nbsp; https://www.youtube.com/watch?v=JopeURxPZmE హైలెట్స్.. ఆదిపురుష్ ప్రీ రిలీజ్ ఈవెంట్‌ని యువ దర్శకుడు ప్రశాంత్ వర్మ డిజైన్ చేశాడు. అయోధ్య సెట్‌ని అందంగా తీర్చిదిద్దాడు. స్టేజిపై వచ్చాక ప్రభాస్ విల్లును ఎక్కుపెట్టడం ఈవెంట్‌కే హైలైట్‌గా నిలిచింది.&nbsp; ముఖ్య అతిథులు.. ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్‌కి చీఫ్ గెస్ట్‌గా చినజీయర్ స్వామి హాజరయ్యారు. టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి కూడా వేడుకలో పాల్గొన్నారు. జూన్ 16న సినిమా విడుదల కానుంది. https://www.youtube.com/watch?v=qkD5juVLDgM
    జూన్ 07 , 2023
    Anchor Anasuya: రంగమ్మత్త అంటేనే మాకిష్టం..ఆ డైరెక్టర్‌తో గొడవ అయిందా?..ట్విట్టర్‌లో అనసూయ చిట్‌చాట్‌
    Anchor Anasuya: రంగమ్మత్త అంటేనే మాకిష్టం..ఆ డైరెక్టర్‌తో గొడవ అయిందా?..ట్విట్టర్‌లో అనసూయ చిట్‌చాట్‌
    యాంకర్‌ అనసూయ బుల్లితెరపై ఎంత ఫేమస్సో… సోషల్‌ మీడియాలో అంతకంటే ఎక్కువ ఫేమస్‌. నెటిజన్లు వేసే ట్రోలింగ్ పోస్టులకు తనదైన శైలిలో సమాధానమిస్తూ అనసూయ ఎప్పుడు వార్తల్లో నిలుస్తుంటుంది. ఇవాళ కూడా మరోమారు అనసూయ నెట్టింట ట్రెండింగ్‌లోకి వచ్చింది. అయితే ఎప్పటిలా నెటిజన్లను తిడుతూనే, విమర్శిస్తూనో కాదు. ట్విటర్‌లో నెటిజన్లు అడిగిన కొంటె ప్రశ్నలకు సరదాగా సమాధానాలిచ్చి ఆశ్యర్యపరిచింది. ఇంతకీ అనసూయను నెటిజన్లు ఏ ప్రశ్నలు అడిగారు?. అందుకు ఆమె ఇచ్చిన ఆన్సర్‌ ఏంటి? ఇప్పుడు చూద్దాం. ప్రశ్న: మీపై వచ్చే ట్రోల్స్‌, జీవితంలో తగిలే ఎదురు దెబ్బల నుంచి బయటిపడేలా మిమ్మల్ని&nbsp; మోటివేట్ చేసే అంశం? అను: జీవితంలో తగిలే ఎదురుదెబ్బలను నేను అసలు పట్టించుకోను. ఇక ట్రోలర్స్‌ నన్ను ఎప్పటికీ కిందకు లాగలేరు. పైగా ట్రోల్స్‌ నన్ను బలమైన శక్తిగా చేస్తాయి.&nbsp; https://twitter.com/anusuyakhasba/status/1646470630639034368 ప్రశ్న: ఇప్పటివరకూ చూసిన వాటిలో మీకు బాగా సంతృప్తి ఇచ్చిన పాత్ర? అను: నేను చేసిన పాత్రలు అన్ని నాకు ఇష్టమే. ఎందుకంటే చేసింది నేను కదా.. https://twitter.com/anusuyakhasba/status/1646469527897800706 ప్రశ్న: రంగ మార్తండలో మీ పాత్ర బాగుంది. కానీ రంగస్థలంలోని రోల్‌ అంటేనే ఇప్పటికీ ఇష్టం. మీరేమంటారు? అను: ఒక నటిగా ప్రతీ పాత్రకు పూర్తిగా న్యాయం చేయడానికే ప్రయత్నిస్తా. నేను ఎంచుకునే పాత్రలు ఆడియన్స్‌ను ఎంటర్‌టైన్‌ చేయాలనేదే నా తాపత్రయం.&nbsp; https://twitter.com/anusuyakhasba/status/1646463701757878274 ప్రశ్న. మీకు ఇష్టమైన దేవుడు ఎవరు?. ఇటీవల వెళ్లిన పుణ్య క్షేత్రం? ఏమైనా మెుక్కుకున్నారా? అను: హనుమంతుడు నా ఫేవరెట్‌. ఇటీవల శ్రీకాళహస్తి వెళ్లా. మెుక్కు చెప్తే తీరదంటారు. https://twitter.com/anusuyakhasba/status/1646461240250896389 https://telugu.yousay.tv/trolls-on-anasuya-they-dont-understand.html ప్రశ్న: ఫ్యాన్స్‌కు ఫొటోస్ ఎందుకు ఇవ్వరు.. ఫ్యాన్స్ వల్లే ఈ స్టేజీలో ఉన్నారు. అను: మనుషులు అన్నాక కొన్ని మూడ్స్ ఉంటాయి. సెలబ్రెటీలు అయినంత మాత్రానా మేము మనషులు కాదనుకుంటే ఎలా. చాలా మందికి సెల్ఫీ ఇచ్చిన సందర్భాలు ఉన్నాయి. నన్ను ఇలా జడ్జ్‌ చేయడం కరెంట్ కాదు.&nbsp; https://twitter.com/anusuyakhasba/status/1646458862214733824 ప్రశ్న: మీపై జరిగిన ట్రోలింగ్స్‌, సినిమా ప్రమోషన్స్‌లో అసభ్య పదజాలంపై మీరు చాలా ధైర్యంగా మాట్లాడారు. ఆ తర్వాత జరిగే పర్యవసానాలపైన మీకు&nbsp; భయం వేయలేదా? అను: నీ తప్పు లేనప్పుడు దేనికి భయపడాల్సిన అవసరం లేదని మా అమ్మ చెప్పింది. చేయాల్సింది చేయ్‌ మిగతాది పైవాడు చూసుకుంటాడని అన్నది.&nbsp; https://twitter.com/anusuyakhasba/status/1646456898613579776 ప్రశ్న: ఇవాళ గురువారం రెండు ఫోటోలు పెట్టొచ్చుగా? అను: అయ్యో.. త్వరలో దీనికి పరిష్కారం ఇద్దాం. https://twitter.com/anusuyakhasba/status/1646455609506816001 ప్రశ్న: పుష్ప సినిమాలో మీకున్న మంచి ఎక్స్‌పీరియెన్స్‌ చెప్పిండి? అను: పుష్ప సెట్‌లో పాలుపంచుకోవడమే ఒక మంచి ఎక్స్‌పీరియెన్స్‌. ఆ సినిమాలో భాగమైనందుకు గర్వంగా ఉంది. https://twitter.com/anusuyakhasba/status/1646455293927374851 ప్రశ్న: జబర్దస్త్‌లో ఒక టీమ్‌/ డైరెక్టర్‌తో గొడవ జరిగి వెళ్లి పోయారంటా నిజమేనా? అను: అది నిజం కాదు.&nbsp; https://twitter.com/anusuyakhasba/status/1646438774950477826 ప్రశ్న: మీపై ఆన్‌లైన్‌లో జరిగే ట్రోల్స్‌పై ఏమంటారు? అను: నథింగ్‌.. ప్రతీ ఒక్కరినీ సరిదిద్దాలని అనుకోవడం నా పని కాదు. https://twitter.com/anusuyakhasba/status/1646437957228965889 https://telugu.yousay.tv/anasuyas-romance-with-sunflowers.html
    ఏప్రిల్ 14 , 2023
    Actress Samantha : ఫ్యాన్స్‌ కొంటె ప్రశ్నలకు.. క్రేజీ ఆన్సర్స్‌ ఇచ్చిన సమంత
    Actress Samantha : ఫ్యాన్స్‌ కొంటె ప్రశ్నలకు.. క్రేజీ ఆన్సర్స్‌ ఇచ్చిన సమంత
    టాలీవుడ్‌ టాప్‌ హీరోయిన్‌ సమంత తన లేటెస్ట్‌ మూవీ శాకుంతలం సినిమా ప్రమోషన్స్‌లో బిజీ బిజీగా గడుపుతోంది. ప్రచార కార్యక్రమాల్లో చురుగ్గా వ్యవహరిస్తూ మూవీపై అంచనాలను మరింత పెంచేస్తోంది. ఈ క్రమంలో సమంత ట్విటర్‌ వేదికగా నెటిజన్లతో ముచ్చటించింది. శాకుంతలం సినిమాతో పాటు వ్యక్తిగత జీవితానికి సంబంధించిన నెటిజన్ల ప్రశ్నలకు సమాధానం ఇచ్చింది. అలాగే నటి మృణాల్‌ ఠాకూర్‌ అడిగిన దానికి కూడా సమంత ఆన్సర్‌ ఇచ్చింది. ఇందుకు సంబంధించిన పోస్టులను సామ్‌ ట్విటర్‌లో పంచుకుంది. అసలు నెటిజన్లు సామ్‌ను ఏం అడిగారు?. అందుకు సమంత ఇచ్చి క్రేజీ ఆన్సర్స్‌ ఏంటీ? ఇప్పుడు చూద్దాం.&nbsp; మృణాల్‌ ఠాకూర్‌: శాకుంతలం సినిమా కోసం ఎంతగానో ఎదురు చూస్తున్నా. నువ్వు చాలా ఇన్‌స్పైరింగ్‌. నా ప్రశ్న ఏంటంటే మనం కలిసి ఎప్పుడు సినిమా చేయబోతున్నాం? సామ్‌: కాంగ్రాట్యూలేషన్స్‌.... ‘గుమ్రా’ బ్యూటిఫుల్‌ మృణాల్‌ ఠాకూర్‌. నీ ఆలోచన చాలా నచ్చింది. మనం చేద్దాం. https://twitter.com/Samanthaprabhu2/status/1645087094765932545 నెటిజన్‌: మీ నిజమైన అభిమాని కోసం ఒక్క మాటలో ఏం చెబుతారు?&nbsp; సామ్‌: నిన్నటి వరకు స్ట్రేంజర్.. ఇవాళ కుటుంబ సభ్యుడు https://twitter.com/Samanthaprabhu2/status/1645082714532642816 నెటిజన్: మీకు ధైర్యం ఎక్కడ నుంచి వస్తోంది? ఎన్నో సమస్యలు ఉన్నా మీరు ఎలా మూవ్‌ ఆన్‌ అవుతున్నారు.&nbsp; సామ్: ఎందుకంటే నా కథ ఎలా ముగియాలో నేను నిర్ణయిస్తాను కాబట్టి. https://twitter.com/Samanthaprabhu2/status/1645082177414246401 నెటిజన్‌: మీరు శాకుంతలం రిలీజ్‌ రోజు ఫ్యాన్స్‌ షో చూసేందుకు దేవి 70MM థియేటర్‌కు వస్తారా? సామ్: రావొచ్చేమో? రావాలా..! https://twitter.com/Samanthaprabhu2/status/1645080239582871552 నెటిజన్‌: శాకుంతలం, ఖుషి, బాలీవుడ్‌ ప్రాజెక్ట్స్‌తో&nbsp; శామ్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ మాముల్గా ఉండదు సామ్‌: ఈ ఏడాది కూడా చాలా క్రేజీగా గడవబోతోంది. https://twitter.com/Samanthaprabhu2/status/1645080067968749568 నెటిజన్‌ : నువ్వు టీనేజ్ అమ్మాయిగా ఎంతో క్యూట్‌గా ఉన్నావు. ఈ లుక్‌ను ఇలాగే కొంత కాలం కొనసాగించాలని భావిస్తున్నారా? సామ్‌: గ్లాసెస్‌.. నా కొత్త బెస్ట్‌ ఫ్రెండ్‌ https://twitter.com/Samanthaprabhu2/status/1645079008026189828 నెటిజన్‌: మీ ఉద్దేశంలో ఆత్మగౌరవం, సెల్ఫ్‌ లవ్‌ అంటే ఏంటి? సామ్‌ : మీ గురించి తెలుసుకోవడానికి ఇతరులపై ఆధారపడనప్పుడు..మీరు మీతోనే సంతోషంగా ఉండగలిగినప్పుడు.. https://twitter.com/Samanthaprabhu2/status/1645078774957088774 నెజిజన్‌: మీరు వృత్తి, వ్యక్తిగత జీవితాల్లో జయపజయాలను ఎలా తీసుకుంటారు. మీ హార్ట్‌ అండ్ మైండ్‌లో ఎమోషన్స్‌ను ఎలా బ్యాలెన్స్ చేసుకుంటారు? సామ్‌: విజయాల కంటే అపజయాలే మీకు ఎక్కువ గుణపాఠాలు నేర్పుతాయి. ఓటములే మిమ్మల్ని మంచి వ్యక్తిగా మారుస్తాయి. https://twitter.com/Samanthaprabhu2/status/1645075968133050369 నెటిజన్‌ : మీరు ఓ బేబి సినిమా అప్పుడు నాకు రిప్లై ఇచ్చారు. అది హిట్ అయింది. ఇప్పుడు కూడా ఒక రిప్లై ఇవ్వండి.. శాకుంతలం బ్లాక్‌ బస్టర్ అవుద్ది. సామ్‌: వామ్మో... అలాంటప్పుడు నీతో గొడవ పెట్టుకోకూడదు(నవ్వుతూ) https://twitter.com/Samanthaprabhu2/status/1645074391871668230
    ఏప్రిల్ 10 , 2023
    Mrunal Thakur : నెటిజన్లతో మృణాల్‌ ముచ్చట్లు… సీతారామం 2 సినిమాపై క్లారిటీ..!
    Mrunal Thakur : నెటిజన్లతో మృణాల్‌ ముచ్చట్లు… సీతారామం 2 సినిమాపై క్లారిటీ..!
    సీతారామం చిత్రంలో సీతగా నటించిన మృణాల్‌ ఠాకూర్‌ తెలుగు ప్రేక్షకుల హృదయాల్లో చెరగని ముద్ర వేశారు. ఈ భామ అందం, అభినయం, నటన.. సినిమా విజయంలో కీలకపాత్ర పోషించింది. సీతారామంలో ఎంతో ట్రెడిషనల్‌గా కనిపించిన ఈ ముద్దుగుమ్మ గత కొంత కాలంగా తన హాట్‌ ఫొటోలతో సోషల్‌ మీడియాలో రచ్చ రచ్చ చేస్తోంది. బోల్డ్‌ లుక్‌లో ఉన్న మృణాల్‌ను చూసి ఆమె ఫ్యాన్స్‌ ఆశ్చర్యపోతున్నారు. ఇదిలా ఉంటే తాజాాగా మృణాల్‌ ట్విటర్‌ వేదికగా ఫ్యాన్స్‌తో ముచ్చటించింది. #askmrunal పేరుతో నెటిజన్ల ప్రశ్నలను ఆహ్వానించింది. ఈ క్రమంలో నెటిజన్లు అడిగిన ప్రతీ ప్రశ్నకు మృణాల్‌ తనదైన శైలిలో సమాధానం ఇచ్చారు. ఆ ప్రశ్నలు, సమాధానాలు ఏంటో ఇప్పుడు చూద్దాం.&nbsp; ప్రశ్న: మీకు కెనడియన్‌ యాక్టర్‌ కీను రీవ్స్‌తో నటించే అవకాశం వస్తే ఎలా ఫీలవుతారు? మృణాల్‌: సంతోషం, ఆనందం, ఆశ్చర్యాన్ని తెలియజేసే ఎమోజీస్‌&nbsp; https://twitter.com/mrunal0801/status/1645117683267170306 భారత్‌లో బ్రిటన్ రాయబారి: మనం రెండేళ్ల క్రితం కలిసి విమాన ప్రయాణం చేశాం. మీరు సాధించిన విజయాలకు నా అభినందనలు. మృణాల్‌: మీ నుంచి ఈ మాటలు వినడం చాలా సంతోషం. ఆ రోజు సినిమాలపై మన మధ్య జరిగిన సంభాషణ ఇప్పటికీ నాకు గుర్తింది. https://twitter.com/mrunal0801/status/1645084379264237570 ప్రశ్న: హైదరాబాద్‌లో నాని 30 సినిమా షూటింగ్‌లో మిమ్మల్ని కలిశాను. మీరు చాలా బాగా మాట్లాడారు. ఇంతపెద్ద స్టార్‌గా ఎదగడానికి మీ వినయమే కారణం అనుకుంటా. మృణాల్‌: థ్యాంక్యూ https://twitter.com/mrunal0801/status/1645078658900525056 ప్రశ్న: సీతారామంలో సీతా మహాలక్ష్మీగా మీ నటన చూసి ఫ్యాన్‌ అయిపోయా. ఆ సినిమా గురించి ఏమైన చెప్పండి. మృణాల్‌: సీతారామం నిజంగా ఓ అద్భుతం. https://twitter.com/mrunal0801/status/1645067329078804482 ప్రశ్న: బాలీవుడ్ or సౌత్‌&nbsp; మృణాల్‌: ఇండియన్ సినిమా. https://twitter.com/mrunal0801/status/1645062867035496451 ప్రశ్న: తెలుగులో ఒక మాట మాట్లాడండి? మృణాల్‌: మళ్లీ మెుదలు https://twitter.com/mrunal0801/status/1645062753697103875 ప్రశ్న: సీతారామం 2 కు అవకాశం ఉందా? మృణాల్: నాకూ తెలీదు. కానీ ఉండాలని కోరుకుంటున్నా https://twitter.com/mrunal0801/status/1645028690697519104 ప్రశ్న: మీరు నటించిన గుమ్రా మూవీ చూశా. యాక్షన్‌ మూవీలో నిన్ను చూడటం చాలా ఎక్జైటింగ్‌గా అనిపించింది. కేవలం నీ కోసమే మా పేరెంట్స్‌ను సినిమాకు తెసుకెళ్లాలని అనుకుంటున్నా. మృణాల్‌: మీ తల్లిదండ్రులకు నా ప్రేమను తెలియజేయండి. వారు సినిమాను ఆస్వాదిస్తారని ఆశిస్తున్నా. https://twitter.com/mrunal0801/status/1645060359915556864 బాలీవుడ్‌లో మృణాల్‌ నటించిన గుమ్రా మూవీ ఏప్రిల్‌ 7న విడుదలై మంచి హిట్‌ టాక్‌ తెచ్చుకుంది. ఇందులో పోలీసు ఆఫీసర్‌గా మృణాల్‌ నటన ఆకట్టుకుంది. హీరో ఆదిత్య రాయ్‌ కపూర్‌కు పోటీగా నటించి మృణాల్‌ మెప్పించింది. తొలి మూడు రోజుల్లో గుమ్రా మూవీ రూ.15కోట్ల గ్రాస్‌ సాధించినట్లు మేకర్స్‌ ప్రకటించారు.&nbsp;
    ఏప్రిల్ 10 , 2023

    @2021 KTree