• TFIDB EN
  • పుష్ప 2: ది రూల్
    UATelugu
    పుష్పరాజ్‌ (అల్లు అర్జున్‌) స్మగ్లింగ్‌ సిండికేట్‌ను ఇంటర్నేషనల్‌ స్థాయికి తీసుకెళ్తాడు. అధికార పార్టీకి ఫండ్‌ ఇచ్చి రాజకీయాలను శాసించే స్థాయికి ఎదుగుతాడు. ఓ రోజు సీఎంతో ఫొటో దిగమని శ్రీవల్లి (రష్మిక) ఆశగా అడుగుతుంది. పుష్ప ఇందుకు యత్నించగా సీఎం హేళన చేస్తాడు. దీంతో ఎంపీ సిద్ధప్ప (రావు రమేష్‌)ను సీఎం చేస్తానని సవాలు విసురుతాడు. ఇందుకోసం పుష్ప ఏం చేశాడు? కేంద్ర మంత్రి వీర ప్రతాప్‌ రెడ్డి (జగపతిబాబు)తో వైరం ఏంటి? పుష్పను అడ్డుకునేందుకు ఎస్పీ షెకావత్‌ (ఫహాద్‌ ఫాజిల్‌) ఎలాంటి ప్లాన్స్‌ వేశాడు? శ్రీవల్లికి ఇచ్చిన మాట పుష్ప నిలబెట్టుకున్నాడా? లేదా? అన్నది స్టోరీ.
    ఇంగ్లీష్‌లో చదవండి
    మూవీ & ఓటీటీ అప్‌డేట్స్‌
    2024 Dec 918 hours ago
    "పుష్ప 2" చిత్రం విడుదలైన ఐదురోజుల్లో రూ.829 కోట్ల గ్రాస్ కలెక్షన్లు సాధించింది.
    2024 Dec 72 days ago
    పుష్ప 2 చిత్రం విడుదలైన రెండు రోజుల్లో రూ.417 కోట్లు గ్రాస్ వసూలు చేసింది.
    2024 May 296 months ago
    పుష్ప 2 చిత్రం నుంచి 'సూసెకి అగ్గిరవ్వ మాదిరి' లిరికల్ సాంగ్ విడుదలైంది
    మరింత చూపించు
    రివ్యూస్
    YouSay Review

    Pushpa 2 Review: అల్లు అర్జున్‌ మాస్‌ తాండవం.. ‘పుష్ప 2’ బ్లాక్ బాస్టర్‌ కొట్టినట్లేనా?

    అల్లు అర్జున్‌ హీరోగా సుకుమార్‌ దర్శకత్వంలో రూపొందిన 'పుష్ప' చిత్రం 2021లో విడుదలై ఎంత పెద్ద సెన్సేషన్‌ క్రియేట్‌ చేసిందో అందరికీ తెలిసిందే. దీంతో దాన...read more

    How was the movie?

    తారాగణం
    అల్లు అర్జున్
    పుష్ప రాజు మొల్లేటి
    ఫహద్ ఫాసిల్
    ఎస్పీ భన్వర్ సింగ్ షెకావత్ ఐపీఎస్
    రష్మిక మందన్న
    శ్రీవల్లి
    జగపతి బాబు
    ప్రకాష్ రాజ్
    మంగళం ప్రకాష్
    సునీల్
    మంగళం శ్రీను
    అనసూయ భరద్వాజ్
    మంగళం శ్రీను భార్య మంగళం దాక్షాయణి
    రావు రమేష్
    ఎంపీ భూమిరెడ్డి సిద్దప్ప నాయుడు
    ధనంజయ
    జాలి రెడ్డి
    సిబ్బంది
    సుకుమార్
    దర్శకుడు
    నవీన్ యెర్నేనినిర్మాత
    యలమంచిలి రవిశంకర్నిర్మాత
    సుకుమార్
    రచయిత
    ఎడిటోరియల్ లిస్ట్
    కథనాలు
    <strong>Pushpa 2 Climax:&nbsp; పుష్ప 2లో క్లైమాక్స్ వైల్డ్ ఫైర్.. కనివినీ ఎరుగని రేంజ్‌లో ఫైట్ సీక్వెన్స్!</strong>
    Pushpa 2 Climax:&nbsp; పుష్ప 2లో క్లైమాక్స్ వైల్డ్ ఫైర్.. కనివినీ ఎరుగని రేంజ్‌లో ఫైట్ సీక్వెన్స్!
    సుకుమార్‌ దర్శకత్వంలో అల్లు అర్జున్‌ హీరోగా ‘పుష్ప 2: ది రూల్‌’ భారీ అంచనాలతో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమా ట్రైలర్‌ నవంబర్ 17న&nbsp; విడుదలైన తర్వాత అల్లు అర్జున్ అభిమానుల్లో ఉత్సాహం మరింత పెరిగింది. ఇప్పటివరకు ప్రచారంలో ఉన్న కంటెంట్‌ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది. ముఖ్యంగా క్లైమాక్స్‌ సన్నివేశంపై తాజాగా ఆసక్తికర వార్తలు వెలువడుతున్నాయి. పుష్ప రాజ్‌ ఊచకోత సన్నివేశం యాక్షన్‌ ప్రేక్షకులకు వెన్నులో వణుకు పుట్టిస్తుందని సమాచారం. ఈ సన్నివేశం ఊహించని విధంగా ఉంటుందని, యాక్షన్‌ ప్రేమికులకు ఇది నిజమైన పండగగా మారుతుందని టాక్‌ వినిపిస్తోంది. ఈ చిత్రంలో నేషనల్‌ క్రష్‌ రష్మిక మందన్న మరోసారి శ్రీవల్లి పాత్రలో కనిపించనుంది. ‘పుష్ప: ది రైజ్‌’లో వీరి జంటకు అందరూ ఫిదా కాగా, ఈసారి ఈ కాంబినేషన్‌ మరింత ఎమోషనల్‌గా ఉంటుందని చెబుతున్నారు. భారీ బడ్జెట్‌ నిర్మాణం మైత్రి మూవీ మేకర్స్‌ సంస్థపై నవీన్‌ ఎర్నేని, వై. రవిశంకర్‌ ఈ చిత్రాన్ని పాన్‌ ఇండియన్‌ స్థాయిలో నిర్మిస్తున్నారు. దాదాపు ఈ సినిమా కోసం రూ.400 కోట్ల నుంచి రూ.500 కోట్ల వరకు ఖర్చు చేసినట్లు సమాచారం. సుకుమార్‌ తెరకెక్కిస్తున్న ఈ చిత్రానికి దేవి శ్రీ ప్రసాద్‌, తమన్‌ ఇద్దరూ కలిసి సంగీతం అందిస్తున్నారు. వీరి కాంబినేషన్‌ అందరికీ అద్భుతమైన అనుభూతిని కలిగించనుందని సినీ వర్గాలు అంటున్నాయి. https://twitter.com/resulp/status/1858089345464279297 సోషల్ మీడియాలో ‘వైల్డ్ ఫైర్’ ‘పుష్ప 2: ది రూల్‌’ ట్రైలర్‌ సోషల్‌ మీడియాను షేక్‌ చేస్తోంది. భారీ వ్యూస్‌ను సాధించి, ట్రెండింగ్‌లో నిలిచిన ఈ ట్రైలర్‌పై ప్రేక్షకులతో పాటు ప్రముఖుల ప్రశంసలు కురుస్తున్నాయి. “ఇది నిజంగానే వైల్డ్‌ ఫైర్‌” అని రాజమౌళి వంటి దిగ్గజ దర్శకులు ప్రశంసలు అందజేశారు. క్లైమాక్స్ గురించి ఆసక్తికర సమాచారం తాజా సమాచారం ప్రకారం, ఈ సినిమా క్లైమాక్స్ ప్రేక్షకులకు హై ఓల్టేజ్‌ ఎనర్జీ అందించనుందని తెలిసింది. క్లైమాక్ యాక్షన్ సీన్ల కోసం భారీ స్థాయిలో సెట్స్ వేశారని తెలిసింది. గతంలో అల్లు అర్జున్ ఎప్పుడూ చేయని యాక్షన్ ఫీట్స్ ఈ చిత్రంలో చేశాడని సమాచారం. అభిమానులకు క్లైమాక్స్ సీన్లు మంచి థ్రిల్‌ను పక్కాగా అందిస్తాయని ట్రైలర్‌ లోనే హింట్స్ ఉన్నాయి.&nbsp; ముఖ్యంగా పుష్ప రాజ్ పాత్ర క్లైమాక్స్‌లో చూపించే ఊచకోత సీక్వెన్స్ వెన్నులో వణుకు పుట్టిస్తుందని సమాచారం. కేవలం సెట్స్‌కే రూ.10 కోట్ల మేర ఖర్చు పెట్టినట్లు తెలిసింది.&nbsp; ఈ క్లైమాక్స్ సీన్ సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలుస్తుందని భావిస్తున్నారు. ప్రముఖుల స్పందన ఈ చిత్ర ట్రైలర్‌పై పలువురు ప్రముఖులు తమ అభిప్రాయాలను వెల్లడించారు: రాజమౌళి: "పుష్పగాడి వైల్డ్‌ ఫైర్‌ దేశమంతటా విస్తరిస్తోంది. డిసెంబర్‌ 5న ఈ అగ్ని మరింత ఎత్తుకు చేరనుంది."అనిల్‌ రావిపూడి: "ఇది పవర్‌ ప్యాక్డ్‌ ట్రైలర్‌. బిగ్‌ స్క్రీన్‌పై చూసేందుకు ఎదురుచూస్తున్నా."హరీశ్‌ శంకర్‌: "పుష్పరాజ్ పాత్రలో అల్లు అర్జున్ తపన స్పష్టంగా కనిపిస్తోంది. ఈ సినిమాపై మీ ప్రేమకు హ్యాట్సాఫ్‌."రిషబ్‌ శెట్టి: "ట్రైలర్‌లో మాస్‌ ఎలిమెంట్స్‌ అద్భుతంగా ఉన్నాయి. మరో బ్లాక్‌బస్టర్‌ సిద్ధమవుతోంది."ప్రశాంత్ వర్మ: "పుష్పరాజ్ తిరుగుబాటును విప్లవంగా మార్చాడు. ఈసారి మరింత ఘోరంగా రాబోతున్నాడు." ఫ్యాన్స్ కోసం బన్నీ రిప్లై నటుడు కిరణ్‌ అబ్బవరం చేసిన ట్వీట్‌కు అల్లు అర్జున్ స్పందిస్తూ, "థ్యాంక్యూ మై బ్రదర్‌. నీ సినిమా ‘క’ చూసి త్వరలో కాల్‌ చేస్తాను" అంటూ ప్రేమతో రిప్లై ఇచ్చారు. డిసెంబర్ 5 - పుష్ప పండుగ ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఈ చిత్రం డిసెంబర్‌ 5న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. పుష్పరాజ్‌ యాక్షన్‌ సీక్వెన్స్‌లు, క్లైమాక్స్‌ విజువల్స్‌ థియేటర్లలో ఓ పండుగలా ఉంటాయని సినీ విశ్లేషకులు చెబుతున్నారు. ‘పుష్ప’ ఎప్పుడు తగ్గడు, ఈసారి మరింత శక్తివంతమైన ఫిల్మ్‌తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. "నేషనల్‌ అనుకుంటారా, ఇంటర్నేషనల్‌ అనుకుంటారా..?" అంటూ డైరెక్టర్‌ బుచ్చిబాబు చేసిన కామెంట్‌ ఇప్పుడు ట్రెండ్ అవుతోంది. ఇంతకు మించి ఫ్యాన్స్‌ ఈ సినిమా కోసం మరెంత ఆసక్తిగా ఎదురుచూస్తారో మాటల్లో చెప్పలేం! డిసెంబర్‌ 5న పుష్ప 2 ప్రేక్షకులకు ఎలా సర్‌ప్రైజ్‌ ఇస్తుందో చూడాలి!
    నవంబర్ 18 , 2024
    Pushpa 2 Latest Song: ‘పుష్ప 2’ ఐటెం సాంగ్‌పై ఊహించని ట్విస్ట్‌.. తెరపైకి ‘యానిమల్‌’ బ్యూటీ!
    Pushpa 2 Latest Song: ‘పుష్ప 2’ ఐటెం సాంగ్‌పై ఊహించని ట్విస్ట్‌.. తెరపైకి ‘యానిమల్‌’ బ్యూటీ!
    అల్లు అర్జున్‌ (Allu Arjun) హీరోగా సుకుమార్‌ (Sukumar) దర్శకత్వంలో రూపొందుతున్న పాన్‌ ఇండియా చిత్రం ‘పుష్ప 2 : ది రూల్‌’ (Pushpa 2: The Rule). గతంలో వచ్చిన బ్లాక్‌ బాస్టర్‌ చిత్రం 'పుష్ప: ది రైజ్‌' కి సీక్వెల్‌గా ఈ మూవీ రూపొందుతోంది. ఇప్పటికే విడుదలైన గ్లింప్స్‌ సినిమాపై భారీగా అంచనాలు పెంచగా.. ఇటీవల వచ్చిన ఫస్ట్‌ సింగిల్‌ వాటిని రెట్టింపు చేసింది. తాజాగా రెండో సాంగ్ ప్రోమోను మేకర్స్‌ రిలీజ్‌ చేశారు. ప్రస్తుతం ఇది సోషల్‌ మీడియాను షేక్‌ చేస్తోంది. మరోవైపు ‘పుష్ప 2’కి సంబంధించిన ఓ వార్త నెట్టింట తెగ వైరల్‌ అవుతోంది. ఇది విన్న ఫ్యాన్స్‌ తెగ ఖుషి అవుతున్నారు.&nbsp; తృప్తి దిమ్రితో ఐటెం సాంగ్‌! బాలీవుడ్‌ స్టార్ రణ్‌బీర్‌ కపూర్‌, సందీప్‌ రెడ్డి వంగా కాంబోలో వచ్చిన ‘యానిమల్‌’.. ఇండియన్‌ బాక్సాఫీస్‌ వద్ద ఎంత సెన్సేషన్‌ క్రియేట్ చేసిందో అందరికీ తెలిసిందే. ముఖ్యంగా ఇందులో నటించిన బాలీవుడ్‌ నటి తృప్తి దిమ్రీ.. తన గ్లామర్‌తో యావత్‌ దేశం దృష్టిని ఆకర్షించింది. లేటెస్ట్‌ బజ్‌ ప్రకారం.. ‘పుష్ప 2’లో ఈ భామ ఐటెం సాంగ్‌ చేయబోతున్నట్లు ప్రచారం జరుగుతోంది. సాంగ్‌ కోసం చిత్ర యూనిట్‌ ఆమెను సంప్రదించగా తృప్తి గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చినట్లు తెలుస్తోంది. దీనిపై చిత్ర యూనిట్‌ త్వరలోనే అధికారిక ప్రకటన కూడా చేస్తుందని అంటున్నారు. పుష్పలో ‘ఊ అంటావా మావా.. ఊఊ అంటావా మావా’ అంటూ సమంత చేసిన మ్యాజిక్‌ను తృప్తి రిపీట్‌ చేస్తుందని ఫ్యాన్స్ నమ్ముతున్నారు. బన్నీ, తృప్తి కలిసి స్టెప్పులేస్తే థియేటర్లు దద్దరిల్లిపోతాయని కామెంట్స్ చేస్తున్నారు.&nbsp; ప్రోమోలో ఏముందంటే? సెకండ్‌ సాంగ్‌ ప్రోమోలో పూర్తిగా హీరోయిన్‌ రష్మిక మందన్ననే కనిపించింది. సాంగ్‌ సెట్‌లో రష్మిక మేకప్‌ వేసుకుంటూ కనిపించింది. ఈ క్రమంలో కేశవ వచ్చి.. శ్రీవల్లి వదిన పుష్ప 2 నుంచి రెండో సాంగ్‌ రిలీజ్‌ చేస్తున్నారంటగా కదా ఆ పాటేందో చెప్తావా అని అడుగుతాడు. అప్పుడు రష్మిక ‘సూసేటి అగ్గిరవ్వ మాదిరి ఉంటాడే నా సామి’ అంటూ పాట పాడుతుంది. మీరు కూడా ఈ ప్రోమోను ఓసారి చూసేయండి.&nbsp; https://www.youtube.com/watch?v=sbp9M95-2rQ&amp;t=19sv పూర్తి సాంగ్‌ ఎప్పుడంటే? పుష్ప 2లోని రెండో పాటను మే 29న రిలీజ్‌ చేయనున్నట్లు మేకర్స్‌ తాజా ప్రోమోలో స్పష్టం చేశారు. ఆ రోజు ఉ.11.07 గం.లకు పూర్తి లిరికల్‌ వీడియోను విడుదల చేయబోతున్నట్లు స్పష్టం చేశారు. ఇది బన్నీ, రష్మిక మధ్య సాగే మెలోడీ సాంగ్ అంటూ వివరించారు. గతంలో పుష్ప సినిమాలో వచ్చిన ‘సామి.. సామి’ సాంగ్‌ ఎంత పెద్ద హిట్‌ అయ్యిందో అందరికీ తెలిసిందే. దీంతో ‘సూసేటి అగ్గిరవ్వ మాదిరి ఉంటాడే నా సామి’ పాట కూడా ఆ స్థాయిలోనే అలరిస్తుందని ఫ్యాన్స్‌ నమ్ముతున్నారు. ఆ పాట కోసం బన్నీ అభిమానులు ఆతృతగా ఎదురు చూస్తున్నారు.&nbsp; ఆ రోజున ఫ్యాన్స్‌కు పండగే భారీ ఎత్తున నిర్మిస్తున్న ఈ చిత్రంలో అల్లు అర్జున్‌కు ప్రత్యర్థిగా మలయాళ నటుడు ఫహాద్‌ ఫాజిల్‌ (Fahad Faasil) నటిస్తున్నారు. అనసూయ, ధనుంజయ్, సునీల్, రావు రమేశ్‌, షణ్ముఖ్‌, అజయ్‌, శ్రీతేజ్‌ ఇతర ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు. మైత్రి మూవీ మేకర్స్ అసోసియేషన్ విత్ సుకుమార్ రైటింగ్స్ రూపొందిస్తున్న ఈ సినిమాకు దేవి శ్రీ ప్రసాద్ సంగీతం సమకూరుస్తున్నారు. 2024 ఆగస్టు 15న స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా ఈ చిత్రం వరల్డ్ వైడ్‌ రిలీజ్‌ కానుంది. ఇప్పటికే వదిలిన అప్ డేట్స్ అన్నీ కూడా సినిమాపై ఓ రేంజ్‌లో హైప్ క్రియేట్ చేశాయి. ఈ మూవీ రిలీజ్ కోసం బన్నీ ఫ్యాన్స్ ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారు. ఆగస్టు 15 ఫ్యాన్స్‌కు పండగే అని చెప్పొచ్చు.&nbsp;
    మే 23 , 2024
    <strong>Pushpa 2 Item Song: త్రిప్తి దిమ్రికి షాకిచ్చిన ‘పుష్ప 2’ టీమ్‌.. రంగంలోకి మరో బాలీవుడ్‌ హాట్‌ బ్యూటీ!&nbsp;</strong>
    Pushpa 2 Item Song: త్రిప్తి దిమ్రికి షాకిచ్చిన ‘పుష్ప 2’ టీమ్‌.. రంగంలోకి మరో బాలీవుడ్‌ హాట్‌ బ్యూటీ!&nbsp;
    అల్లు అర్జున్‌ (Allu Arjun) హీరోగా సుకుమార్‌ (Sukumar) దర్శకత్వంలో రూపొందుతున్న పాన్‌ ఇండియా చిత్రం ‘పుష్ప 2: ది రూల్‌’ (Pushpa 2: The Rule). గతంలో వచ్చిన బ్లాక్‌ బాస్టర్‌ చిత్రం 'పుష్ప: ది రైజ్‌' కి సీక్వెల్‌గా ఈ మూవీ రూపొందుతోంది. అయితే పుష్పలో ఐటెం సాంగ్ ఎంత పెద్ద హిట్ అయిందో తెలిసిందే. సమంత చేసిన ‘ఊ అంటావా ఊ ఊ అంటావా’ పాటకి థియేటర్లు దద్దరిల్లిపోయాయి. దీంతో ఇప్పుడు పార్ట్ 2లో ఐటెం సాంగ్ కూడా అంతకంటే ఎక్కువగా ఉండాలని ఫ్యాన్స్ ఆశిస్తున్నారు. అయితే యానిమల్‌ బ్యూటీ త్రిప్తి దిమ్రి ‘పుష్ప 2’ ఐటెం సాంగ్‌ చేస్తుందని అంతా భావిస్తుండగా చిత్ర యూనిట్ ఆమెకు షాకిచ్చినట్లు తెలుస్తోంది. మరో బాలీవుడ్‌ బ్యూటీని తెరపైకి తీసుకొచ్చినట్లు జోరుగా ప్రచారం జరుగుతోంది. ఆ విశేషాలేంటో ఇప్పుడు చూద్దాం.&nbsp; త్రిప్తి దిమ్రిపై అసంతృప్తి! ‘పుష్ప’ మూవీ పాటలు ఎంత పెద్ద హిట్‌ అయ్యాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ముఖ్యంగా సినిమాలోని ‘ఊ అంటావా ఊ ఊ&nbsp; అంటావా’ అనే ఐటెం సాంగ్‌ దేశవ్యాప్తంగా మార్మోగింది. ఈ పాటలో సమంత తన అందంతో మెస్మరైజ్‌ చేసింది. బన్నీ-సామ్‌ కలిసి వేసిన స్టెప్స్‌ యువతరాన్ని ఉర్రూతలూగించాయి. దీంతో ‘పుష్ప2’ లోనూ ఆ తరహా ఐటెం సాంగ్ ఉండాలని డైరెక్టర్‌ సుకుమార్‌ ప్లాన్‌ చేస్తున్నారు. ఈ పాట కోసం ఇప్పటికే ఎంతో మంది హీరోయిన్‌ల పేర్లు బయటకు వచ్చినప్పటికి చివరకు యానిమల్‌ బ్యూటీ త్రిప్తి దిమ్రిని ఫైనల్‌ చేశారని వార్తలు వచ్చాయి. అయితే లేటెస్ట్ బజ్‌ ప్రకారం త్రిప్తి దిమ్రిని ఈ సాంగ్‌ నుంచి రిజెక్ట్‌ చేసినట్లు తెలుస్తోంది. ఇటీవల త్రిప్తి దిమ్రితో ఆడిషన్‌ నిర్వహించిన పుష్ప టీమ్‌ దానిపై సంతృప్తి చెందలేదని సమాచారం. దీంతో ఆమె ప్లేసులో మరో బాలీవుడ్‌ బ్యూటీ దిశా పటానీని ఎంపిక చేసుకున్నట్లు ఇండస్ట్రీ వర్గాల్లో టాక్‌ వినిపిస్తోంది. దీనిపై త్వరలోనే అధికారిక ప్రకటన రానున్నట్లు సమాచారం.&nbsp; ఇద్దరు హీరోయిన్స్‌తో బన్నీ స్టెప్పులు! 'పుష్ప 2'లో రష్మిక మందన్న హీరోయిన్‌గా నటిస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఇందులోని ఐటెం సాంగ్‌లో బాలీవుడ్‌ బ్యూటీ దిశా పటానీతో పాటు రష్మిక కూడా స్టెప్పులు వేయబోతున్నట్లు సమాచారం. ఐటెం గార్ల్‌తో పాటు రష్మిక కూడా ఆడియన్స్‌ను ఓ ఊపు ఊపనుందని ఫిల్మ్‌ వర్గాల్లో చర్చ జరుగుతోంది. పార్ట్‌ 1లో రష్మిక ఉన్నప్పటికీ ఐటెం సాంగ్‌లో ఆమె కనిపించలేదు. ‘ఊ అంటావా.. ఊ ఊ అంటావా’ అంటూ బన్నీ- సమంత ఇద్దరే స్టెప్పులు ఇరగదీశారు. ఈసారి రష్మికతో కలిసి ఇద్దరు భామలు ఐటెం సాంగ్‌లో కనిపించనుండటంతో మూవీ లవర్స్‌లో అంచనాలు భారీగా పెరిగిపోయాయి. ఈ ఇద్దరి భామాలతో కలిసి బన్నీ ఏ స్థాయిలో అలరిస్తాడో మరి చూడాలి.&nbsp; కీలకంగా 'పుష్ప 2' క్లైమాక్స్‌! 'పుష్ప 2' చిత్రానికి సంబంధించి ప్రస్తుతం రామోజీ ఫిల్మ్‌ సిటీలో షూటింగ్‌ జరుగుతోంది. హీరో అల్లు అర్జున్‌, విలన్‌ ఫహాద్‌ పాజిల్‌పై పతాక సన్నివేశాలను సుకుమార్‌ తెరకెక్కిస్తున్నారు. ఫహాద్‌ ఫాజిల్‌, అల్లు అర్జున్‌ల నటన, సంభాషణలతో పాటు యాక్షన్‌ సన్నివేశాలు ఈ క్లైమాక్స్‌లో కీలకంగా ఉండబోతున్నాయని అంటున్నారు. తొలి పార్ట్‌లో తరహాలోనే ‘పుష్ప 2’లోనూ క్లైమాక్స్‌ కీలకంగా మారుతుందని పేర్కొంటున్నారు. పైగా మూడో పార్ట్‌కు సంబంధించిన లింక్‌ను కూడా ఈ క్లైమాక్స్‌లో షూట్‌ చేస్తారని సమాచారం. వచ్చే నెలాఖరు వరకు ఈ చిత్రీకరణ సుదీర్ఘంగా కొనసాగుతుందని టాక్‌ వినిపిస్తోంది.&nbsp; సర్‌ప్రైజ్‌ చేసిన రాజమౌళి ‘పుష్ప 2’ టీమ్‌ను దర్శకధీరుడు రాజమౌళి సర్‌ప్రైజ్‌ చేసినట్లు తెలుస్తోంది. రామోజీ ఫిల్మ్‌ సిటీలో సినిమా చిత్రీకరణ జరుగుతున్న విషయం తెలిసిన రాజమౌళి అక్కడకు వెళ్లినట్లు సమాచారం. సుకుమార్‌ను కలిసి కొద్దిసేపు ముచ్చటించారట. ఈ క్రమంలో సుకుమార్‌ ఒక సన్నివేశాన్ని చిత్రీకరిస్తూ ఉంటే జక్కన్న అంతే చూస్తూ ఉండిపోయారట. అదిరిపోయిందని మెచ్చుకున్నారట. దాదాపు 30 నిమిషాల పాటు రాజమౌళి అక్కడే ఉన్నారని సమాచారం. చిత్ర యూనిట్‌ సభ్యుల్లో కీలక వ్యక్తులను రాజమౌళికి సుకుమార్‌ పరిచయం చేశారని తెలుస్తోంది. ‘పుష్ప 2’ కి సంబంధించిన పలు విషయాలను దర్శకుడు సుకుమార్‌తో రాజమౌళి చర్చించారట. పుష్ప 2 సెట్‌ కి రాజమౌళి వచ్చిన సందర్భంగా తీసిన వీడియోను త్వరలోనే ఫ్యాన్స్ కోసం విడుదల చేసే అవకాశాలు ఉన్నాయి.&nbsp;
    సెప్టెంబర్ 26 , 2024
    Pushpa 2: బాలీవుడ్‌లో పుష్ప గాడి మేనియా.. టైటిల్‌ సాంగ్‌కు అదిరిపోయే రెస్పాన్స్‌!
    Pushpa 2: బాలీవుడ్‌లో పుష్ప గాడి మేనియా.. టైటిల్‌ సాంగ్‌కు అదిరిపోయే రెస్పాన్స్‌!
    ఐకాన్ స్టార్‌ అల్లు అర్జున్‌ (Allu Arjun) హీరోగా పుష్ప 2 (Pushpa 2) తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. భారీ అంచనాల నడుమ ఈ చిత్రాన్ని దర్శకుడు సుకుమార్‌ (Sukumar) తెరకెక్కిస్తున్నారు. రష్మిక మందన్న హీరోయిన్‌గా చేస్తోంది. చెప్పిన తేదీకి సినిమాను విడుదల చేసేందుకు చిత్ర యూనిట్ తీవ్రంగా శ్రమిస్తోంది. ఓ వైపు మిగిలిన షూటింగ్‌ను శరవేగంగా నిర్వహిస్తూనే మరోవైపు మూవీ ప్రమోషన్స్‌పై ఫోకస్‌ పెట్టింది. ఈ క్రమంలోనే బుధవారం (మే 1) ఫస్ట్‌ లిరికల్‌ వీడియో సాంగ్‌ను మేకర్స్‌ రిలీజ్‌ చేశారు. ‘పుష్ప.. పుష్ప..’ అంటూ సాగే ఈ టైటిల్‌ సాంగ్ ప్రస్తుతం యూట్యూబ్‌లో దూసుకెళ్తోంది. తెలుగులో కంటే హిందీలో ఎక్కువ వ్యూస్‌ సాధించి అదరగొడుతోంది.&nbsp; హిందీలో తగ్గేదేలే! గతంలో వచ్చిన ‘పుష్ప’ చిత్రానికి తెలుగులో కంటే హిందీలోనే ఎక్కువ ఆదరణ లభించింది. బన్నీ అద్భుతమైన నటనకు బాలీవుడ్‌ ప్రేక్షకులు ఫిదా అయ్యారు. దీంతో ‘పుష్ప 2’ కోసం వారు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలో విడుదలైన ‘పుష్ప 2’ టైటిల్‌ సాంగ్‌ నార్త్‌ ఆడియన్స్‌ను విపరీతంగా ఆకర్షించింది. తెలుగులో ఈ సాంగ్‌ 20 గంటల వ్యవధిలో 84 లక్షల వ్యూస్‌ సాధిస్తే.. హిందీలో ఏకంగా కోటి వ్యూస్‌ రాబట్టడం విశేషం. ఈ లిరికల్‌ సాంగ్‌ను తెలుగులో 4.8 లక్షల మంది లైక్‌ చేయగా.. హిందీలో 5.2 లక్షలుగా ఉంది. కాగా, విడుదలైన ఆరు భాషల్లోనూ ఈ చిత్రం మంచి వ్యూస్‌తో దూసుకెళ్తుండటంతో మేకర్స్‌ సంతోషం వ్యక్తం చేస్తున్నారు. అటు బన్నీ ఫ్యాన్స్‌ కూడా పుష్పగాడి హవా మెుదలైందంటూ నెట్టింట కామెంట్స్‌ చేస్తున్నారు.&nbsp; టైటిల్‌ సాంగ్ అదరహో.. బుధవారం సాయంత్రం పుష్ప 2 సాంగ్‌ను మేకర్స్‌ విడుదల చేశారు. 'పుష్ప.. పుష్ప.. పుష్ప., పుష్ప రాజ్'&nbsp; అంటూ సాగే ఈ పాటకు చంద్రబోస్‌ అద్భుతమైన లిరిక్స్‌ను అందించారు. బన్నీ పాత్ర ఎంత పవర్‌ఫుల్‌గా ఉంటుందో ఈ లిరిక్స్‌ ద్వారా చెప్పకనే చెప్పారు. ముఖ్యంగా దేవిశ్రీ ప్రసాద్‌ అందించిన మ్యూజిక్‌తో ఈ సాంగ్‌ చాలా క్యాచీగా మారిపోయింది. ఇందులో అల్లుఅర్జున్‌ తన స్టెప్పులతో అదరకొట్టాడు. ముఖ్యంగా సింగిల్‌ లెగ్‌పై వేసే హుక్‌ స్టెప్‌ ట్రెండ్‌ సెట్‌ చేసేలా కనిపిస్తోంది. కుడి కాలి చెప్పు విప్పి కాలిని ఎడమ కాలు మోకాలికి దిగువున పెట్టి వెసే స్వింగ్‌ స్టెప్‌ ఫ్యాన్స్‌ విపరీతంగా ఆకర్షించే అవకాశముంది. అంతేకాదు వీడియో చివర్లో గాజు గ్లాస్‌ చేతిలో పట్టుకుని వేసే మూమెంట్స్‌ కూడా అదరహో అనిపిస్తున్నాయి. పుష్ప 2 నుంచి వచ్చిన ఈ ఫస్ట్ లిరికల్‌ సాంగ్‌ సినిమాపై అంచనాలను మరింత పెంచింది.&nbsp; https://youtu.be/EdvydlHCViY?si=JqZTyOOLXxhGR8nr రిలీజ్ ఎప్పుడంటే? పుష్ప 2: ది రూల్ సినిమా.. ఈ ఏడాది ఆగస్టు 15వ తేదీన థియేటర్లలో రిలీజ్ కానుంది. తెలుగుతో పాటు హిందీ, తమిళం, కన్నడ, మలయాళం, బెంగాలీ భాషల్లో విడుదలవుతుంది. ఈ చిత్రానికి రికార్డు స్థాయిలో ప్రీ-రిలీజ్ బిజినెస్ జరుగుతోంది. నార్త్ ఇండియా హిందీ హక్కుల్లోనూ ఇప్పటికే ఈ మూవీ రికార్డు సృష్టించింది. బాలీవుడ్ చిత్రాలను వెనక్కి తోసింది. కాగా, ఈ సినిమాలో ఫహద్‌ ఫాసిల్‌, జగపతిబాబు, సునీల్‌, అనసూయ, రావు రమేష్‌ కీలక పాత్రలు పోషిస్తున్నారు.&nbsp;
    మే 02 , 2024
    <strong>Pushpa 2 Item Song:&nbsp; పుష్ప 2 ఐటెం సాంగ్‌లో శ్రీలీల, శ్రద్ధా కపూర్?.. రొమాన్స్‌తో రెచ్చిపోనున్న బన్నీ!</strong>
    Pushpa 2 Item Song:&nbsp; పుష్ప 2 ఐటెం సాంగ్‌లో శ్రీలీల, శ్రద్ధా కపూర్?.. రొమాన్స్‌తో రెచ్చిపోనున్న బన్నీ!
    అల్లు అర్జున్‌ (Allu Arjun) హీరోగా సుకుమార్‌ (Sukumar) దర్శకత్వంలో రూపొందుతున్న పాన్‌ ఇండియా చిత్రం ‘పుష్ప 2: ది రూల్‌’ (Pushpa 2: The Rule). గతంలో వచ్చిన బ్లాక్‌ బాస్టర్‌ చిత్రం 'పుష్ప: ది రైజ్‌' కి సీక్వెల్‌గా ఈ మూవీ రూపొందుతోంది. పుష్ప ది రైజ్‌లో ఐటెం సాంగ్ ఎంత పెద్ద హిట్ అయిందో  అందరికి తెలిసిందే. సమంత చేసిన ‘ఊ అంటావా ఊ ఊ అంటావా’ పాటకి థియేటర్లు మార్మోగాయి. తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా దేశవ్యాప్తంగా (Pushpa 2 Item Song)ఈ సాంగ్‌కు విపరీతమైన క్రేజ్ వచ్చింది. దీంతో ఇప్పుడు పార్ట్ 2లో ఐటెం సాంగ్ కూడా అంతకంటే ఎక్కువగా ఉండాలని ఫ్యాన్స్ ఆశిస్తున్నారు. అయితే పుష్ప 2లో రానున్న ఐటెం సాంగ్‌లో ఎవరు నటిస్తారన్నది ఇప్పటికీ సస్పెన్స్‌గానే ఉంది.  తొలుత యానిమల్‌ బ్యూటీ త్రిప్తి దిమ్రి ‘పుష్ప 2’ ఐటెం సాంగ్‌ చేస్తుందని అంతా భావిస్తుండగా చిత్ర యూనిట్ ఆమెకు షాకిచ్చినట్లు తెలుస్తోంది. తృప్తి దిమ్రి చేత రిహార్సల్స్ చేయించగా వచ్చిన అవుట్‌పుట్ పట్ల మేకర్స్ సంతృప్తి చెందలేదని తెలుస్తోంది. దీంతో ఆమెను పక్కకు పెట్టారని టాక్ నడుస్తోంది. ఆమె స్థానంలో టాలీవుడ్, బాలీవుడ్‌కు చెందిన ఇద్దరు యువ హీరోయిన్ల పేర్లను పరిశీలిస్తున్నట్లు తెలిసింది. ‘పుష్ప’ మూవీపై దేశవ్యాప్తంగా విపరీతమైన బజ్ ఏర్పడింది. ప్రీ రిలీజ్ బిజినెస్‌ ఏకంగా రూ.1000 కోట్లు దాటింది. దీంతో మేకర్స్ ప్రతి అంశంపై ఆచితూచి వ్యవహరిస్తున్నారు. పార్ట్ 1 కన్న ఘనంగా ఉండేలా చర్యలు తీసుకుంటున్నారు. పార్ట్‌ 1 ఫీల్‌ ఏమాత్రం తగ్గినా పుష్ప 2 విజయం సాధించదు అనే భావనలో జాగ్రత్త వహిస్తున్నారు. ముఖ్యంగా పుష్పలో పాటలు ఎంత పెద్ద హిట్‌ అయ్యాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ముఖ్యంగా సినిమాలోని ‘ఊ అంటావా ఊ ఊ&nbsp; అంటావా’ అనే ఐటెం సాంగ్‌ దేశవ్యాప్తంగా మార్మోగింది. ఈ పాటలో సమంత తన అందంతో మెస్మరైజ్‌ చేసింది. బన్నీ-సామ్‌ కలిసి వేసిన స్టెప్స్‌&nbsp; ఉర్రూతలూగించాయి. దీంతో ‘పుష్ప2’ లోనూ ఆ తరహా ఐటెం సాంగ్ ఉండాలని డైరెక్టర్‌ సుకుమార్‌ ప్లాన్‌ చేస్తున్నారు. ఐటెం సాంగ్‌లో శ్రీలీల పుష్ప 2లో ఐటెం సాంగ్‌లో బన్నీ సరసన నర్తించేందుకు చిత్ర బృందం శ్రీలీలను సంప్రదించినట్లు ప్రచారం జరుగుతుంది. ఇప్పటికే ఈ ముద్దుగుమ్మ గ్లామర్‌పై యూత్‌లో మంచి క్రేజ్ ఉంది. గుంటూరుకారం సినిమాలో సూపర్ స్టార్ మహేష్‌ బాబుతో కలిసి చేసిన ఐటెం సాంగ్ ఎంత ప్రజాదారణ పొందిందో అందరికి తెలిసిందే. ఈ సినిమాలో "ఆ కుర్చి మడతపెట్టి" సాంగ్‌లో శ్రీలీల డ్యాన్స్ ఇరగదీసింది. అందాల ప్రదర్శనతో పాటు (Pushpa 2 Item Song)డ్యాన్స్‌తోనూ అదరగొట్టింది. మహేష్‌తో పోటీపడి మరి స్టెప్పులేసింది. లుక్స్, గ్లామర్‌ షో పరంగా ఆకట్టుకుంది. దీంతో శ్రీలీలను ఐటెం సాంగ్‌లో తీసుకోవాలనే ప్రయత్నాలను మూవీ మేకర్స్ ముమ్మరం చేశారు. ఇందుకు సుకుమార్, బన్నీ కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలిసింది. ఇక ఈ ఇద్దరి కలయిక ఎలా ఉంటోందో అని ప్రేక్షకులు సోషల్ మీడియాలో చర్చిస్తున్నారు. స్వతహాగా మంచి డ్యాన్సర్ అయిన బన్నీ, ఈ కుర్ర హీరోయిన్‌తో స్టెప్పులు ఇరగదీయనున్నాడు. బన్నీతో శ్రద్ధా కపూర్‌ రొమాన్స్ పుష్ప 2 ఐటెం సాంగ్‌ కోసం వినిపిస్తున్న మరో పేరు బాలీవుడ్ అందాల తార శ్రద్దా కపూర్. రీసెంట్‌గా ఆమె నటించిన స్త్రీ-2 ఎంత పెద్ద హిట్ అయిందో అందరికీ తెలిసిందే. ఈ చిత్రంలో ఆమె గ్లామర్ షోక్ యూత్ ఫిదా అయిపోయింది. దీంతో శ్రద్ధా కపూర్‌ పేరును కూడా (Pushpa 2 Item Song)ఐటెం సాంగ్‌ కోసం పరిశీలిస్తున్నట్లు తెలిసింది. ఇప్పటికే ఆమెతో మూవీ యూనిట్ మాట్లాడినట్లు సమాచారం. ఒక వేళ శ్రద్ధా కపూర్ ఒకే చెబితే.. పాన్‌ ఇండియా రేంజ్‌లో పుష్ప బజ్ మరింత పెరిగే ఛాన్స్ ఉంది. అయితే పుష్ప2 ఐటెం సాంగ్‌లో ఎవరు నటిస్తారనేదానిపై గత వారం ఆ చిత్ర నిర్మాత ఓ ప్రకటన చేశారు. నవంబర్‌లో ఐటెం సాంగ్ షూట్‌ ఉంటుందని అప్పుడే అల్లు అర్జున్ సరసన నర్తించే హీరోయిన్ పేరు వెల్లడిస్తామని తెలిపారు. సో, త్వరలోనే ఆ వ్యక్తి పేరు అధికారికంగా బయటకు రానుంది. బన్నీ సరసన ఇద్దరు హీరోయిన్లు 'పుష్ప 2'లో రష్మిక మందన్న హీరోయిన్‌గా నటిస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఇందులోని ఐటెం సాంగ్‌లో రష్మిక మంధాన కూడా స్టెప్పులు వేయబోతున్నట్లు సమాచారం. ఐటెం గార్ల్‌తో పాటు రష్మిక కూడా ఆడియన్స్‌ను ఓ ఊపు ఊపనుందని ఫిల్మ్‌ వర్గాల్లో చర్చ జరుగుతోంది. పార్ట్‌ 1లో రష్మిక ఉన్నప్పటికీ ఐటెం సాంగ్‌లో ఆమె కనిపించలేదు. ‘ఊ అంటావా.. ఊ ఊ అంటావా’ అంటూ బన్నీ- సమంత ఇద్దరే స్టెప్పులు ఇరగదీశారు. ఈసారి రష్మికతో కలిసి ఇద్దరు భామలు ఐటెం సాంగ్‌లో కనిపించనుండటంతో మూవీ లవర్స్‌లో అంచనాలు భారీగా పెరిగిపోయాయి. ఈ ఇద్దరి భామాలతో కలిసి బన్నీ ఏ స్థాయిలో అలరిస్తాడో మరి చూడాలి.&nbsp; నవంబర్‌లో పుష్ప మేనియా నవంబర్ నెలను పుష్ప నెల అంటూ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ప్రకటించారు. మూవీ విడుదలకు మరో నెల మాత్రమే మిగిలి ఉండటంతో ప్రమోషన్లు షూరు చేస్తున్నట్లు చెప్పకనే చెప్పారు. నవంబర్‌లో దేశవ్యాప్తంగా పర్యటించనున్నట్లు హింట్ ఇచ్చారు. అన్ని భాషల్లో ప్రచారాన్ని త్వరలో మొదలపెట్టనున్నట్లు తెలుస్తోంది. నవంబర్ 15 నుంచి ఈ ప్రక్రియ మొదలు కానున్నట్లు టాక్. ఈ ప్రమోషన్లలో అల్లు అర్జున్‌తో పాటు మూవీ యూనిట్‌ పాల్గొననుంది. చివరి దశకు 'పుష్ప 2' షూటింగ్ 'పుష్ప 2' చిత్రానికి సంబంధించి షూటింగ్ దాదాపు కంప్లీట్ అయినట్లు తెలుస్తోంది. ఒక్క ఐటెం సాంగ్ మినహా మొత్తం వర్క్ ఫినిష్ చేశారని సమాచారు. గత నెలలో&nbsp; రామోజీ ఫిల్మ్‌ సిటీలో&nbsp; హీరో అల్లు అర్జున్‌, విలన్‌ ఫహాద్‌ పాజిల్‌పై క్లైమాక్స్&nbsp; సన్నివేశాలను సుకుమార్‌ తెరకెక్కించారు. ఫహాద్‌ ఫాజిల్‌, అల్లు అర్జున్‌ల నటన, సంభాషణలతో పాటు యాక్షన్‌ సన్నివేశాలు ఈ క్లైమాక్స్‌లో కీలకంగా ఉండబోతున్నాయని టాక్. తొలి పార్ట్‌లో తరహాలోనే ‘పుష్ప 2’లోనూ క్లైమాక్స్‌ కీలకంగా మారుతుందని పేర్కొంటున్నారు. పైగా మూడో పార్ట్‌కు సంబంధించిన లింక్‌ను కూడా ఈ క్లైమాక్స్‌లో షూట్‌ చేసారని సమాచారం.&nbsp;
    నవంబర్ 02 , 2024
    Pushpa 2 Steps Viral: ముంబయి లోకల్‌ ట్రైన్‌లో ‘పుష్ప 2’ స్టెప్‌ వేసిన నైజీరియన్‌.. వీడియో వైరల్!
    Pushpa 2 Steps Viral: ముంబయి లోకల్‌ ట్రైన్‌లో ‘పుష్ప 2’ స్టెప్‌ వేసిన నైజీరియన్‌.. వీడియో వైరల్!
    ఐకాన్‌ స్టార్‌ అల్లు అర్జున్‌ (Allu Arjun) హీరోగా సుకుమార్‌ (Sukumar) దర్శకత్వంలో వచ్చిన బ్లాక్‌ బాస్టర్‌ చిత్రం ‘పుష్ప’ (Pushpa). పాన్‌ ఇండియా స్థాయిలో విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురిపించింది. అంతేకాకుండా బన్నీని జాతీయ స్థాయి నటుడిగా తీర్చిదిద్దింది. ఈ సినిమాకు గాను జాతీయ ఉత్తమ నటుడి పురస్కారాన్ని సైతం అల్లు అర్జున్‌ అందుకున్నాడు. ఇదిలా ఉంటే ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించి సీక్వెల్‌ రూపొందుతోంది. ‘పుష్ప 2’లోని టైటిల్‌ సాంగ్‌ను ఇటీవల మేకర్స్‌ రిలీజ్‌ చేశారు. అందులోని హుక్‌ స్టెప్‌ బాగా వైరల్ అవుతోంది. చాలా మంది ఈ స్టెప్‌పై రీల్స్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే ఓ నైజిరియన్‌ చేసిన వీడియో నెట్టింట ట్రెండ్ అవుతోంది.&nbsp; పుష్ప 2 మేనియా! నోయల్‌ రాబిన్‌సన్‌ (Noel Robinson) అనే నైజీరియన్‌.. జర్మన్‌లో ఉంటూ డ్యాన్స్‌ రీల్స్‌ చేస్తూ ఉంటాడు. తద్వార మిలియన్లలో ఫాలోవర్లను సంపాదించాడు. రీసెంట్‌గా భారత్‌ పర్యటనకు వచ్చిన నోయల్‌.. ముంబయి లోకల్‌ ట్రైన్‌లో ప్రయాణించాడు. ఈ సందర్భంగా 'పుష్ప2' టైటిల్‌ సాంగ్‌లోని సింగిల్‌ లెగ్‌ స్టెప్‌ వేసి తోటి ప్రయాణికులను ఉర్రూతలూగించాడు. అటు స్థానికులు కూడా నోయల్‌ను ప్రోత్సహిస్తూ మూమెంట్స్‌ చేశారు. ఇందుకు సంబంధించిన వీడియోను నోయల్‌ సోషల్‌ మీడియాలో షేర్‌ చేయగా.. ప్రస్తుతం అది వైరల్‌ అవుతోంది. ఇది చూసి బన్నీ ఫ్యాన్స్‌ ఫిదా అవుతున్నారు. అల్లు అర్జున్‌ క్రేజ్‌ దేశ సరిహద్దులు దాటి ఎక్కడికో వెళ్లిపోయిందంటూ కామెంట్స్‌ చేస్తున్నారు.&nbsp; View this post on Instagram A post shared by Noel Robinson (@noelgoescrazy) మెలోడి సాంగ్‌ వచ్చేస్తోంది! 'పుష్ప 2' టైటిల్ సాంగ్‌ ఊహించిన దానికంటే పెద్ద సక్సెస్‌ కావడంతో చిత్ర యూనిట్‌ ఎంతో సంతోషంగా ఉంది. అయితే ఈ సారి సెకండ్‌ సాంగ్‌ కింద మెలోడీ పాటను రిలీజ్‌ చేయాలని మేకర్స్ భావిస్తున్నారట. గతంలో పుష్ప మూవీలో చేసిన ‘శ్రీవల్లీ’ సాంగ్‌.. ఎంతటి ఆదరణ సంపాదించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇప్పుడు సీక్వెల్‌లోనూ అలాంటి మ్యాజిక్‌నే రిపీట్‌ చేయాలని మేకర్స్‌ యోచిస్తున్నారట. ఈ మెలోడీ పాటను త్వరలో రిలీజ్‌ చేసేందుకు ఏర్పాట్లు కూడా జరుగుతున్నట్లు ఫిల్మ్‌ వర్గాల్లో చర్చ జరుగుతోంది. దీంతో సాంగ్‌ కోసం ఇప్పటి నుంచే బన్నీ ఫ్యాన్స్‌ ఎదురు చూడటం మెుదలుపెట్టారు. కాగా, ఈ చిత్రానికి దేవి శ్రీ ప్రసాద్‌ సంగీతం అందిస్తున్నాడు.&nbsp; రిలీజ్ ఎప్పుడంటే? పుష్ప 2: ది రూల్ సినిమా.. ఈ ఏడాది ఆగస్టు 15వ తేదీన థియేటర్లలో రిలీజ్ కానుంది. తెలుగుతో పాటు హిందీ, తమిళం, కన్నడ, మలయాళం, బెంగాలీ భాషల్లో విడుదలవుతుంది. ఈ చిత్రానికి రికార్డు స్థాయిలో ప్రీ-రిలీజ్ బిజినెస్ జరిగింది. నార్త్ ఇండియా హిందీ హక్కుల్లోనూ ఇప్పటికే ఈ మూవీ రికార్డు సృష్టించింది. బాలీవుడ్ చిత్రాలను వెనక్కి తోసింది. కాగా, ఈ సినిమాలో ఫహద్‌ ఫాసిల్‌, జగపతిబాబు, సునీల్‌, అనసూయ, రావు రమేష్‌ కీలక పాత్రలు పోషిస్తున్నారు.&nbsp;
    మే 16 , 2024
    Pushpa 2 Full HD Movie Leaked: ఆన్‌లైన్‌ పైరసీ వెబ్‌సైట్లలో ఫ్రీగా పుష్ప2 డౌన్‌లోడ్ లింక్స్
    Pushpa 2 Full HD Movie Leaked: ఆన్‌లైన్‌ పైరసీ వెబ్‌సైట్లలో ఫ్రీగా పుష్ప2 డౌన్‌లోడ్ లింక్స్
    అల్లు అర్జున్ నటించిన పుష్ప 2: ది రూల్ డిసెంబర్ 5న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదలైంది. సుకుమార్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం (Pushpa 2 Full HD Movie Leaked)అభిమానులకు మూడు సంవత్సరాల తర్వాత పుష్పరాజ్ పాత్రను మళ్లీ తెరపైకి తీసుకొచ్చింది. రష్మిక మందన్న, ఫహద్ ఫాజిల్ తదితరులు తమ అద్భుత నటనతో సినిమాలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. అటు సినీ విమర్శకులు, అభిమానులు ఈ సినిమాకు బ్రహ్మరథం పడుతున్న ఈక్రమంలో పుష్ప 2 చిత్రం  పైరసీ బారిన పడటంతో పరిశ్రమలో కలకలం రేగింది. పైరసీ బారిన పుష్ప 2 &nbsp;పుష్ప 2 చిత్రం థియేటర్లలో విడుదలైన కొన్ని గంటల్లోనే ఐబొమ్మ, మూవీరూల్స్, తమిళ్ రాకర్స్, ఫిల్మిజిల్లా, తమిళ్ యోగి, బప్పమ్ టీవీ, మూవీస్‌డా వంటి పలు పైరసీ వెబ్‌సైట్లలో లీకైంది. ఇది 1080p నుంచి 240p వరకు అనేక ఫార్మాట్‌లలో అందుబాటులోకి వచ్చింది. ఈ లీక్ వల్ల సినిమాను ఉచితంగా డౌన్‌లోడ్ చేసుకునే వారికి మరింత వీలైంది. "పుష్ప 2 డౌన్‌లోడ్" కోసం ఆన్‌లైన్‌లో హడావుడి సినిమా విడుదల తరువాత "Pushpa 2 The Rule Movie Download," "Pushpa 2 Tamilrockers," "Pushpa 2 Telegram Links", Pushpa 2 The Rule Movie Free Download &nbsp;వంటి పదాలు ఆన్‌లైన్‌లో ట్రెండింగ్‌గా మారాయి. ఈ చిత్రాన్ని పైరసీలో చూసేందుకు వెతుకులాట ఎక్కువైంది. ఈ పెరుగుదల పైరసీని మరింతగా ప్రోత్సహించిందని పరిశ్రమ వర్గాలు భావిస్తున్నాయి. సినిమాపై అభిమానుల స్పందన మైత్రి మూవీ మేకర్స్ నిర్మించిన ఈ చిత్రాన్ని ప్రేక్షకులు విశేషంగా ఆదరిస్తున్నారు. చాలా రివ్యూ సంస్థలు మంచి రేటింగ్‌ అందించాయి. కొన్ని మీడియా సంస్థలు ఈ సినిమాకు ఏకంగా&nbsp; 5/5 రేటింగ్ ఇచ్చాయి. ప్రత్యేకంగా అల్లు అర్జున్ స్క్రీన్ ప్రెజెన్స్, కథనం, పవర్ ఫుల్ డైలాగ్స్‌పై ప్రశంసలు కురుస్తున్నాయి. సుకుమార్ దర్శకత్వం ఈ చిత్రానికి ప్రధాన బలంగా చెప్పవచ్చు. చిత్తూరు నేపథ్యంలో పుష్పరాజ్ స్మగ్లింగ్ కార్యకలాపాలు, అతని ఎర్రచందనం వ్యాపారాన్ని (Pushpa 2 Full HD Movie Leaked) అంతర్జాతీయ స్థాయికి ఎలా తీసుకెళ్లాడన్నదే ఈ కథాంశం. అల్లు అర్జున్ నెమ్మదిగా నడిచే సన్నివేశాలు, ఆయన ప్రతిసారి స్క్రీన్‌పై కనిపించినప్పుడు ప్రేక్షకుల స్పందన సినిమాకు ప్రత్యేకతను తీసుకొచ్చాయి. ఫహద్ ఫాజిల్- రష్మిక మందన్న పాత్రలు ఫహద్ ఫాజిల్ SP శేఖావత్ పాత్రలో తన నటనతో ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. ఆయన పాత్ర కథానాయకుడి ప్రయాణానికి కొత్త కోణాన్ని అందించింది. రష్మిక మందన్న, శ్రీవల్లి పాత్రలో, ఈసారి మరింత బలమైన పాత్రతో కనిపించి, శక్తివంతమైన డైలాగ్స్ ద్వారా ప్రేక్షకులను ఆకట్టుకుంది మహమ్మారిలా పైరసీ పుష్ప 2 సినిమాపై సానుకూల రివ్యూలు ఉన్నప్పటికీ, పైరసీ వల్ల ఈ సినిమా బాక్సాఫీస్ వసూళ్లపై ప్రతికూల ప్రభావం చూపే అవకాశం ఉంది. పైరసీ ఒకటి కాదు, రెండు కాదు, సినీ పరిశ్రమ మొత్తానికి ఒక మహమ్మారిలా మారింది. &nbsp;పుష్ప 2: ది రూల్ చిత్రం అభిమానుల హృదయాలను గెలుచుకుంటూ ముందుకు సాగుతోంది. కానీ ఈ సినిమాను థియేటర్లకు వెళ్లకుండా పైరసీ ద్వారా చూసే వారిని అడ్డుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరికీ ఉంది. మనం సినిమా ప్రదర్శనను థియేటర్లలో ఆనందించడం ద్వారా చిత్రబృందానికి మద్దతు అందించాలి. పుష్ప 2 సినిమా రివ్యూ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
    డిసెంబర్ 05 , 2024
    <strong>Pushpa 2 Review Out: పక్కా పైసా వసూల్‌.. సెకండాఫ్‌లో ఫహాద్ ఫాజిల్ డామినేషన్</strong>
    Pushpa 2 Review Out: పక్కా పైసా వసూల్‌.. సెకండాఫ్‌లో ఫహాద్ ఫాజిల్ డామినేషన్
    ఇండియన్ సినిమా ప్రేమికులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న చిత్రం ‘పుష్ప-2 ది రూల్’. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా, నేషన్ క్రష్ రష్మిక మంధాన హీరోయిన్‌గా సుకుమార్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ భారీ పాన్ ఇండియా ప్రాజెక్ట్ డిసెంబర్ 5న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల కాబోతోంది. ఈక్రమంలో ఈ సినిమాపై ప్రముఖ ఫిల్మ్ క‌్రిటిక్ ఉమెర్ సంధు ఇచ్చిన రివ్యూ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. సినిమా పైసా వసూల్ అంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు.. బన్నీ ఫ్యాన్స్‌ను జోష్‌లో ముంచేసింది. పుష్ప ఫస్ట్ పార్ట్ ఘనవిజయం సాధించడంతో, పుష్ప-2 పై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. అల్లు అర్జున్ ఈ సీక్వెల్ లో తన మాస్ పెర్ఫార్మెన్స్ తో ప్రేక్షకులను మంత్ర ముగ్ధులను చేయనున్నారు. ఈ చిత్ర ట్రైలర్ రిలీజ్ అయ్యాక అభిమానుల ఉత్సాహం రెట్టింపైంది. అల్లు అర్జున్ ‘పుష్ప: ది రైజ్’లో నటనకు గానూ ఉత్తమ నటుడిగా జాతీయ అవార్డును గెలుచుకున్నాడు. ఈ ఘనత సాధించిన తొలి తెలుగు నటుడిగా నిలిచాడు. బన్నీ పుష్పలో తన మేనరిజంతో, మాస్ యాక్టింగ్‌తో పాన్ ఇండియా స్థాయిలో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. పుష్ప-2 పై ప్రేక్షకుల అంచనాలు ఫస్ట్ పార్ట్‌కు ఉత్తరాది ప్రేక్షకులు విపరీతంగా స్పందించడంతో, సీక్వెల్ పై మరింత భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ‘పుష్ప-2’ కోసం నార్త్ ఆడియన్స్ ప్రత్యేకంగా ఎదురుచూస్తున్నారు. ఫస్ట్ పార్ట్ విడుదల సమయంలోనే పుష్ప హిందీలో రూ.100 కోట్లు వసూలు చేసింది. ఈ సీక్వెల్ అయితే బాక్సాఫీస్ వద్ద రికార్డులు సృష్టించడం ఖాయమని ట్రేడ్ వర్గాలు అంటున్నాయి. ప్రీమియర్ షోల హైప్– అల్లు అర్జున్ అటెండ్ డిసెంబర్ 4న రాత్రి 9:30 గంటలకు తెలుగు రాష్ట్రాల్లో ప్రత్యేక ప్రదర్శనలు ఏర్పాటు చేస్తున్నారు. ఇది అభిమానుల్లో భారీ అంచనాలను కలిగిస్తోంది. టిక్కెట్లు ముందుగానే హాట్ కేక్‌లా అమ్ముడయ్యాయి. హైదరాబాద్‌లోని సుదర్శన్ 70MM థియేటర్‌లో అల్లు అర్జున్ ఈ చిత్రాన్ని స్వయంగా అభిమానులతో కలిసి చూడనున్నారు. ఉమేర్ సందు ఫస్ట్ రివ్యూ ప్రపంచ ప్రఖ్యాత సినీ విమర్శకుడు ఉమేర్ సందు ‘పుష్ప-2’ పై ఫస్ట్ రివ్యూ ఇచ్చాడు. ఈ మూవీని “బ్లాక్ బస్టర్ పైసా వసూల్ ఎంటర్టైనర్”గా అభివర్ణించాడు. సినిమాలో ఇంటర్వెల్ సీన్, క్లైమాక్స్ హైలైట్ అని, అల్లు అర్జున్ మళ్లీ నేషనల్ అవార్డు గెలవడం ఖాయమని తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశాడు. https://twitter.com/UmairSandu/status/1863865410421960724 అల్లు అర్జున్ మాస్ అవతార్ ఉమేర్ సందు ట్వీట్ చేస్తూ, “అల్లు అర్జున్ తన నటనతో ప్రేక్షకులను అలరించాడు. అతని మాస్ అవతారం ఈ సినిమా కీలక ఆకర్షణ. కామెడీ టైమింగ్, ఎమోషనల్ సీన్లలోనూ అదరగొట్టాడు” అని అభినందించారు. ముఖ్యంగా క్లైమాక్స్, ఇంటర్వెల్‌&nbsp; సీన్లలో అల్లు అర్జున్‌ అదరగొట్టాడని పేర్కొన్నారు.&nbsp; రష్మిక, ఫహాద్ ఫాజిల్ మెస్మరైజింగ్ రష్మిక మందన్నా సీక్వెల్లో తన పాత్రకు న్యాయం చేస్తూ, అభిమానుల మన్ననలు పొందిందని ఉమేర్ పేర్కొన్నాడు. రష్మిక- అల్లు అర్జున్ మధ్య కెమిస్ట్రీ అభిమానులను అలరిస్తుందని పేర్కొన్నారు.&nbsp; అలాగే, ఫహాద్ ఫాజిల్ సెకండ్ పార్ట్‌లో పూర్తి స్థాయిలో డామినేట్ చేస్తాడని పేర్కొన్నాడు. తన నటనతో ప్రత్యేకమైన ముద్రవేసాడని అభినందించారు. బాహుబలి, కేజీఎఫ్ లాంటి రికార్డులను బద్దలు కొడుతున్న పుష్ప-2 ఈ చిత్రం అడ్వాన్స్ బుకింగ్స్‌లోనే బాహుబలి-2, కేజీఎఫ్-2, ఆర్ఆర్ఆర్ లాంటి సినిమాల రికార్డులను అధిగమించింది. తొలి రోజే రూ.100 కోట్లకు పైగా వసూలు చేయడం ఖాయమని ట్రేడ్ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. Screengrab Twitter: #pushpa2therule ప్రత్యేకమైన మసాలా మూవీగా గుర్తింపు ‘పుష్ప-2’ ని ఇండియన్ సినిమా చరిత్రలో విభిన్నమైన మసాలా మూవీగా ఉమేర్ పేర్కొన్నారు. ఇంటర్వెల్ బ్లాక్, క్లైమాక్స్ సీన్స్ ప్రేక్షకులకు విందుగా ఉంటాయని తెలిపారు. మూడేళ్లుగా అభిమానులు ఎదురు చూస్తున్న ‘పుష్ప-2’ భారీ విజయం సాధించడం ఖాయం. బాక్సాఫీస్ వద్ద ఈ చిత్రం ఎన్ని మైలురాళ్లను దాటుతుందో చూడాలి. 'పుష్ప-2 ది రూల్'తో అల్లు అర్జున్ మరోసారి తన మ్యాజిక్ చూపించనున్నాడు. మరి కాసేపట్లో పుష్ప 2 పూర్తి రివ్యూ రానుంది.. అప్‌డేట్స్‌ కోసం YouSay Telugu వెబ్‌సైట్ ఫాలో అవ్వండి.
    డిసెంబర్ 04 , 2024
    Pushpa 2 songs lyrics Telugu: ఒక్క క్లిక్‌తో  పుష్ప2లోని అన్ని సాంగ్స్ లిరిక్స్
    Pushpa 2 songs lyrics Telugu: ఒక్క క్లిక్‌తో  పుష్ప2లోని అన్ని సాంగ్స్ లిరిక్స్
    "పుష్ప 2" క్రేజీ బజ్‌తో సినీప్రపంచంలో తనదైన ముద్ర వేస్తోంది.&nbsp; ఈ చిత్రంలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తన పవర్‌ఫుల్‌ పాత్రతో ప్రేక్షకుల హృదయాలను గెలుచుకోవడానికి సిద్ధంగా ఉన్నాడు. హీరోయిన్ రష్మిక మందన్నా స్ఫూర్తిదాయకమైన నటనతో మరోసారి అందరినీ ఆకట్టుకోనుంది. ఇప్పటికే దేవీ శ్రీ ప్రసాద్&nbsp; అందించిన సంగీతం అభిమానులను అలరిస్తోంది. ఈ చిత్రంలోని పాటలు ప్రతీ సీన్‌లోని భావోద్వేగాలను, కథలోని ప్రధాన అంశాలను దృశ్యమాలికగా మన కళ్ల ముందు కదిలేలా చేస్తున్నాయి. బిగ్గెస్ట్ బ్లాక్‌బస్టర్ అయిన "పుష్ప: ది రైజ్" చిత్రానికి కొనసాగింపుగా, "పుష్ప 2: ది రూల్"లో పాటలు కథనానికి మరింత జీవం పోసేలా ఉంటాయని ప్రేక్షకులు అంచనా వేస్తున్నారు. ఇప్పటి వరకు విడుదలైన పుష్ప: ది రూల్ చిత్రంలోని పాటల లిరిక్స్‌ను ఇక్కడ అందిస్తున్నాం. మీరు ఓ లుక్ వేయండి. Peelings Song Lyrics in Telugu మల్లిక బన్నంటే అంబుకలా కన్మున తుముకలో అంబిలి పూనిలా నముకలో పుంచిరి తుంబికలో ముళ్ల మలార్ మని చుండుకలో నిన్ మని చుండుకలో తేన్ తెరేంజెతున్న వండుకలో పూన్కినా తుండుకలో ఆరుంటికోసారి యేడింటికోసారి పావు తక్కువ పదింటికోసారి పడుకుంటే ఓసారి మేల్కుంటే ఓసారి యేమి తోసక కూసుంటే ఓసారి యేలు నొక్కుతుంటే ఓసారి ఓసారి కాలు తొక్కుతుంటే ఓసారి ఓసారి నువ్వు పక్కనుంటే ప్రతొక్కసారి వచుండాయ్ పీలింగ్స్ ఊఁ వచుండాయ్ పీలింగ్స్ ఊఁ వచ్చి వచ్చి చంపేస్తుండాయ్ పీలింగ్స్ పీలింగ్స్ ఊఁ వచుండాయ్ పీలింగ్స్ ఊఁ వచుండాయ్ పీలింగ్స్ ఊఁ వచ్చి వచ్చి చంపేస్తుండాయ్ పీలింగ్స్ పీలింగ్స్ ఊఁ ఛీ అంటే ఓసారి పో అంటే ఓసారి చాటు మాటుగా సై అంటే ఓసారి పూలెడ్తే ఓసారి నాగలెడ్తే ఓసారి సాదా సీదా చీర కట్టెత్తే ఓసారి ఒళ్ళు ఇర్సుకుంటే ఓసారి ఓసారి యిల్లు చిమ్ముతుంటే ఓసారి ఓసారి నీళ్లు తోడుతుంటే నిజంగ ఓసారి వచుండాయ్ పీలింగ్స్ ఊఁ వచుండాయ్ పీలింగ్స్ ఊఁ వచ్చి వచ్చి చంపేస్తుండాయ్ పీలింగ్స్ పీలింగ్స్ ఊఁ వచుండాయ్ పీలింగ్స్ ఊఁ వచుండాయ్ పీలింగ్స్ ఊఁ వచ్చి వచ్చి చంపేస్తుండాయ్ పీలింగ్స్ పీలింగ్స్ ఊఁ మల్లిక బన్నంటే అంబుకలా కన్మున తుముకలో అంబిలి పూనిలా నముకలో పుంచిరి తుంబికలో ముళ్ల మలార్ మని చుండుకలో నిన్ మని చుండుకలో తేన్ తెరేంజెతున్న వండుకలో పూన్కినా తుండుకలో రోటి పచ్చడి నువ్వు నూరుతున్నప్పుడు ఆఁ పైటతోటి సెమట నువ్వు తుడుసుకున్నప్పుడు దండాన నీ సొక్క ఆరేస్తున్నప్పుడు నీ వొంటి వాసన తెగ గుర్తొచ్చినప్పుడు రెండు సేతుల నీ జుట్టు ముడిసినప్పుడు దిండు కత్తుకొని పడుకున్నప్పుడు అలసిపోయి నువ్వు ఆవలించినప్పుడు వచుండాయ్ పీలింగ్స్ ఊఁ వచుండాయ్ పీలింగ్స్ ఊఁ వచ్చి వచ్చి చంపేస్తుండాయ్ పీలింగ్స్ పీలింగ్స్ ఊఁ వచుండాయ్ పీలింగ్స్ ఊఁ వచుండాయ్ పీలింగ్స్ ఊఁ వచ్చి వచ్చి చంపేస్తుండాయ్ పీలింగ్స్ పీలింగ్స్ ఊఁ మల్లిక బన్నంటే అంబుకలా అంబిలి పూనిలా నముకలో ముళ్ల మలార్ మని చుండుకలో తేన్ తెరేంజెతున్న వండుకలో తువ్వాలు తో నా తలను తుడిసినప్పుడు నడుమ నడుమ నువ్వు నా నడుము తురిమినప్పుడు అన్నం కలిపి నోట్లో ముద్ద పెట్టినప్పుడు యెంగిలి మూఁతితో నువ్వు ముద్దు పెట్టినప్పుడు సీర సెంగుని నువ్వు సవరించినప్పుడు సాయం సేత్తో సెయ్యేసినప్పుడు సొంత మొగుడు సెంత సిగ్గు పడినప్పుడు వచుండాయ్ పీలింగ్స్ ఊఁ వచుండాయ్ పీలింగ్స్ ఊఁ వచ్చి వచ్చి చంపేస్తుండాయ్ పీలింగ్స్ పీలింగ్స్ ఊఁ వచుండాయ్ పీలింగ్స్ ఊఁ వచుండాయ్ పీలింగ్స్ ఊఁ వచ్చి వచ్చి చంపేస్తుండాయ్ పీలింగ్స్ పీలింగ్స్ ఊఁ మల్లిక బన్నంటే అంబుకలా కన్మున తుముకలో అంబిలి పూనిలా నముకలో పుంచిరి తుంబికలో ముళ్ల మలార్ మని చుండుకలో నిన్ మని చుండుకలో తేన్ తెరేంజెతున్న వండుకలో పూన్కినా తుండుకలో https://www.youtube.com/watch?v=8RAd-_Qj_ac&amp;ab_channel=T-SeriesTelugu Kissik Song Lyrics in Telugu కిస్ కిస్ కిస్ కిస్సిక్ కిస్సా కిస్సా కిస్ కిస్సిక్ కిస్ కిస్ కిస్ కిస్సిక్ కిస్సా కిస్సా కిస్ కిస్సిక్ కిస్ కిస్ కిస్ కిస్సిక్ కిస్సా కిస్సా కిస్ కిస్సిక్ కిస్ కిస్ కిస్ కిస్సిక్ కిస్సా కిస్సా కిస్ కిస్సిక్ దించర దించర దించు మావయ్యోచ్చాడు దించు కిస్ కిస్ కిస్ కిస్సిక్ కిస్సా కిస్సా కిస్ కిస్సిక్ దించర దించర దించు బావయ్యోచాడు దించు కిస్ కిస్ కిస్ కిస్సిక్ కిస్సా కిస్సా కిస్ కిస్సిక్ చిచ్చా వచ్చాడు దించు కిస్సిక్ మచ్చా వచ్చాడు దించు కిస్సిక్ పిలిసినోడొచ్చాడు దించు కిస్సిక్ పిలవనోడొచ్చాడు దించు కిస్సిక్ మావోడొచ్చాడు మీవోడొచ్చాడు మనోడొచ్చాడు దించు ఆళ్లతో ఫోటో ఈళ్లతో ఫోటో ఆల్బం లో అంటించు మరి నాతో దిగిన బొమ్మను లోకర్లో దాచుంచు హే పుసుక్కున ఈ కిస్సిక్కులు బైటికి వచ్చాయో దెబ్బలు పడతయి రాజా దెబ్బలు పడతయి రో దెబ దెబ దెబ్బలు పడతయి రో కిస్ కిస్ కిస్ కిస్సిక్ కిస్సా కిస్సా కిస్ కిస్సిక్ దెబ్బలు పడతయి రాజా దెబ్బలు పడతయి రో దెబ దెబ దెబ్బలు పడతయి రో కిస్ కిస్ కిస్ కిస్సిక్ కిస్సా కిస్సా కిస్ కిస్సిక్ పక్కన నిలబడి ఫోటో తీసుకో భుజాలు గాని రాసుకుంటే దెబ్బలు పడతయి రో కిస్సిక్ దెబ్బలు పడతయి రో కిస్సిక్ సర్లే భుజం పైన సెయ్యేసి తీసుకో సేతులు తిన్నగా వుండకపోతే దెబ్బలు పడతయి రో కిస్సిక్ దెబ్బలు పడతయి రో కిస్సిక్ సింగల్ ఫోటో పర్లేదు రంగుల ఫోటో పర్లేదు గ్రూప్ ఫోటో తీసుకుందాం తప్పేమి లేదు కానీ పబ్లిక్ లో నా ఫోటో పెట్టి పచ్చి పచ్చి కామెంట్స్ సేసారో దెబ్బలు పడతయి రాజా దెబ్బలు పడతయి రో దెబ దెబ దెబ్బలు పడతయి రో కిస్ కిస్ కిస్ కిస్సిక్ కిస్సా కిస్సా కిస్ కిస్సిక్ దెబ్బలు పడతయి రాజా దెబ్బలు పడతయి రో దెబ దెబ దెబ్బలు పడతయి రో కిస్ కిస్ కిస్ కిస్సిక్ కిస్సా కిస్సా కిస్ కిస్సిక్ ఏ పోసైన ఫోటో తీస్కో ఎక్సపోసింగ్ ల ఉన్నాదంటే దెబ్బలు పడతయి రో కిస్సిక్ దెబ్బలు పడతయి రో కిస్సిక్ అంగెల్ ఏదైనా ఫోటో తీస్కో బాడ్ అంగెల్లో చూసావంటే దెబ్బలు పడతయి రో కిస్సిక్ దెబ్బలు పడతయి రో కిస్సిక్ తీసిన ఫోటో దాసుకో తీరుబడిగా సూసుకో కళ్ళకు పండగ సేసుకో కాదనేది లేదు కానీ ఫేసులు గీసులు మార్ఫింగ్ సేసి పిచ్చి పిచ్చి వేషాలు ఏసారొ దెబ్బలు పడతయి రాజా దెబ్బలు పడతయి రో దెబ దెబ దెబ్బలు పడతయి రో కిస్ కిస్ కిస్ కిస్సిక్ కిస్సా కిస్సా కిస్ కిస్సిక్ దెబ్బలు పడతయి రాజా దెబ్బలు పడతయి రో దెబ దెబ దెబ్బలు పడతయి రో కిస్ కిస్ కిస్ కిస్సిక్ కిస్సా కిస్సా కిస్ కిస్సిక్ కిస్ కిస్ కిస్ కిస్సిక్ Pushpa Title Song Lyrics In Telugu పుష్ప పుష్ప పుష్ప పుష్ప పుష్ప పుష్ప పుష్ప పుష్ప పుష్ప పుష్ప పుష్ప పుష్ప పుష్ప పుష్ప పుష్ప పుష్ప పుష్ప పుష్ప పుష్ప పుష్ప పుష్ప పుష్ప పుష్ప రాజ్ పుష్ప పుష్ప పుష్ప పుష్ప పుష్ప పుష్ప పుష్ప రాజ్ నువ్వు గడ్డం అట్టా సవరిస్తుంటే దేశం దద్దరిల్లే పుష్ప పుష్ప పుష్ప పుష్ప పుష్ప పుష్ప పుష్ప నువ్వు భుజమే ఎత్తి నడిచొస్తుంటే భూమే బద్దలయ్యే పుష్ప పుష్ప పుష్ప పుష్ప పుష్ప పుష్ప పుష్ప నువ్వు నిలవాలంటే ఆకాశం ఎత్తే పెంచాలే పుష్ప పుష్ప పుష్ప పుష్ప పుష్ప పుష్ప పుష్ప నిన్ను కొలవాలంటే సంద్రం ఇంకా లోతే తవ్వాలే పుష్ప పుష్ప పుష్ప పుష్ప పుష్ప పుష్ప పుష్ప హే గువ్వపిట్ట లాగ వానకు తడిసి బిక్కుమంటు రెక్కలు ముడిసి వణుకుతు వుంటే నీదే తప్పవదా పెద్ద గద్దలాగమబ్బులపైన హద్దు దాటి ఎగిరావంటే వర్షమైనా తలనే వంచి కాళ్ళ కింద కురిసెయ్‍దా పుష్ప పుష్ప పుష్ప పుష్ప పుష్ప పుష్ప పుష్ప రాజ్ పుష్ప పుష్ప పుష్ప పుష్ప పుష్ప పుష్ప పుష్ప రాజ్ పుష్ప పుష్ప పుష్ప పుష్ప పుష్ప పుష్ప పుష్ప రాజ్ పుష్ప పుష్ప పుష్ప పుష్ప పుష్ప పుష్ప పుష్ప రాజ్ ఎన్నో వచ్చిన పుష్పాకి పాపం కొన్ని రావంటా వణుకే రాదు ఓటమి రాదు వెనకడుగు ఆగడము అస్సలు రానే రాదు అన్నీ ఉన్న పుష్పాకి పాపం కొన్ని లేవంటా భయమే లేదు బెంగే లేదు బెదురు ఎదురు తిరిగే లేదు తగ్గేదే లేదు ఎయ్ దండమెడితే దేవుడికే సలాము కొడితే గురువులకే కాళ్ళు మొక్కితే అమ్మకే రా తల దించినావా బానిసవి ఎత్తినావా బాద్‍షావి తలపొగరే నీ కిరీటమైతే భూతలమంతా నీదేరా పుష్ప పుష్ప పుష్ప పుష్ప పుష్ప పుష్ప పుష్ప రాజ్ పుష్ప పుష్ప పుష్ప పుష్ప పుష్ప పుష్ప పుష్ప రాజ్ పుష్ప పుష్ప పుష్ప పుష్ప పుష్ప పుష్ప పుష్ప రాజ్ పుష్ప పుష్ప పుష్ప పుష్ప పుష్ప పుష్ప పుష్ప రాజ్ ఆడు కాలుమీద కాలేసి కూసున్నాడంటే బండరాయి కూడా బంగారు సింహాసనమంటా వేరే సింహాసనమేదైనా వట్టి బండరాయంటా ఆడు సేతిలోన సెయ్యేసి మాటిచ్చాడంటే తుఫాకిలోంచి తూటా దూసుకెళ్ళినట్టే ఆ తూటాలాగే మాట కూడా ఎనక్కి రానట్టే హే వాడు నీకు గొప్పే కాదు వీడు నీకు ఎక్కువ కాదు నీకు నువ్వే బాసులా ఉండు హే ఎవడో విలువ ఇచ్చేదేంది ఎవడో నిను గుర్తించేదేంది ఒంటి నిండా తిమ్మిరి ఉంటె నీ పేరే నీ బ్రాండు పుష్ప పుష్ప పుష్ప పుష్ప పుష్ప పుష్ప పుష్ప పుష్ప పుష్ప పుష్ప పుష్ప పుష్ప పుష్ప పుష్ప పుష్ప రాజ్ పుష్ప పుష్ప పుష్ప పుష్ప పుష్ప పుష్ప పుష్ప రాజ్ పుష్ప పుష్ప పుష్ప పుష్ప పుష్ప పుష్ప పుష్ప రాజ్ పుష్ప పుష్ప పుష్ప పుష్ప పుష్ప పుష్ప పుష్ప రాజ్ పుష్ప పుష్ప పుష్ప పుష్ప పుష్ప పుష్ప పుష్ప రాజ్ పుష్ప పుష్ప పుష్ప పుష్ప పుష్ప పుష్ప పుష్ప రాజ్ అస్సలు తగ్గేదెలే Suseki Song lyrics In Telugu వీడు మొరటోడు అని వాళ్ళు వీళ్ళు ఎన్నెన్ని అన్నా పసిపిల్లవాడు నా వాడు వీడు మొండోడు అని ఊరు వాడ అనుకున్న గాని మహారాజు నాకు నా వాడు ఓ ఓ మాట పెళుసైనా మనసులో వెన్న రాయిలా ఉన్న వాడిలోన దేవుడెవరికి తెలుసును నా కన్నా సూసేకి అగ్గిరవ్వ మాదిరే ఉంటాడే నా సామి మెత్తాని పత్తి పువ్వులా మరి సంటోడే నా సామి హో ఎర్రబడ్డ కళ్ళలోన కోపమే మీకు తెలుసు కళ్ళలోన దాచుకున్న చెమ్మ నాకే తెలుసు కోరమీసం రువ్వుతున్న రోషమే మీకు తెలుసు మీసమెనక ముసురుకున్న ముసినవ్వు నాకు తెలుసు అడవిలో పులిలా సరసర సరసర చెలరేగడమే నీకు తెలుసు అలసిన రాతిరి ఒడిలో చేరి తల వాల్చడమే శ్రీవల్లికి తెలుసు సూసేకి అగ్గిరవ్వ మాదిరే ఉంటాడే నా సామి మెత్తాని పత్తి పువ్వులా మరి సంటోడే నా సామి హో ఓ ఓ గొప్ప గొప్ప ఇనాములనే ఇచ్చివేసే నవాబు నన్ను మాత్రం చిన్ని చిన్ని ముద్దులడిగే గరీబు పెద్ద పెద్ద పనులు ఇట్టే చక్కబెట్టే మగాడు వాడి చొక్కా ఎక్కడుందో వెతకమంటాడు సూడు బయటికి వెళ్లి ఎందరెందరినో ఎదిరించేటి దొరగారు నేనే తనకి ఎదురెళ్ళకుండా బయటికి వెళ్ళరు శ్రీవారు సూసేకి అగ్గిరవ్వ మాదిరే ఉంటాడే నా సామే ఇట్టాంటి మంచి మొగుడుంటే ఏ పిళ్ళైనా మహారాణీ
    డిసెంబర్ 03 , 2024
    Pushpa 2 OTT Record: విడుదలకు ముందే RRR రికార్డు బ్రేక్‌.. ఇది పుష్పగాడి రూలు..!
    Pushpa 2 OTT Record: విడుదలకు ముందే RRR రికార్డు బ్రేక్‌.. ఇది పుష్పగాడి రూలు..!
    ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ (Allu Arjun) హీరోగా రష్మిక మంధాన హీరోయిన్‌గా నటిస్తున్న చిత్రం పుప్ప2. తొలి పార్ట్‌ సూపర్ హిట్ కావడంతో ఈచిత్రాన్ని  పాన్‌ ఇండియా రేంజ్‌లో  దర్శకుడు సుకుమార్ తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఈ చిత్రం విడుదలకు ముందే ప్రీరిలీజ్ బిజినెస్‌పరంగా సరికొత్త రికార్డులను సృష్టిస్తోంది. ఈ చిత్రం గురించి వినిపిస్తున్న లెటెస్ట్ బజ్‌ ప్రకారం.. ఈ సినిమా నార్త్ హక్కులే సుమారు 200 కోట్లకి అమ్ముడుపోయినట్లు తెలిసింది. ఈ విషయంలో కల్కి, దేవర.. పుష్ప  తరువాతే ఉన్నారని చెప్పవచ్చు. కల్కి నార్త్ రైట్స్ 100 కోట్లకు కొనుగోలు అయితే.. దేవర 50 కోట్లకు అమ్ముడు పోయినట్లు సమాచారం. ఇక ఈ ప్రీ రిలీజ్ బిజినెస్ చూస్తుంటే.. రిలీజ్ తరువాత నార్త్ లో పుష్ప రూల్ ఎలా ఉండబోతుందో కళ్లకు కడుతోంది. మరోవైపు పుష్ప 2 ఓటిటి (Pushpa 2 OTT Rights) హక్కుల కొనుగోలుపై కూడా రూమర్స్ అయితే చక్కర్లు కొడుతున్నాయి. RRR రికార్డు బ్రేక్ తాజాగా వస్తున్న వార్తల ప్రకారం పుష్ప 2 ది రూల్ చిత్రం ఓటీటీ హక్కులను నెట్‌ఫిక్స్‌ భారీ ధరకు దక్కించుకున్నట్లు సమాచారం. ఏకంగా ఈ సినిమా ఓటీటీ ప్రసార హక్కుల కోసం రూ.275 కోట్ల భారీ డీల్‌ను మూవీ మేకర్స్‌తో కుదుర్చుకున్నట్లు తెలిసింది. ఇది ఇండియాలోనే అత్యధికమైన డీల్ అని క్రిటిక్స్ అభిప్రాయపడుతున్నారు. గతంలో మరే చిత్రం ఈ స్థాయిలో అమ్ముడుపోలేదని చెబుతున్నారు. పుష్ప2కు ముందు.. RRR చిత్రం ఓటీటీ ప్రసార హక్కులు భారీ ధరకు అమ్ముడు పోయాయి. దీంతో అల్లు అర్జున్ RRR రికార్డును బ్రేక్ చేసినట్లుగా తెలుస్తుంది. ఈ చిత్రం ఓటీటీ స్ట్రీమింగ్ హక్కులను జీ5, నెట్‌ఫ్లిక్స్ కలిసి రూ.350 కోట్లకు దక్కించుకున్నాయి. అయితే నెట్‌ఫ్లిక్స్‌ ఇందులో మెజార్టీ వాటను నెట్‌ ఫ్లిక్స్ చెల్లించింది. అయితే మొత్తం పుష్ప 2 డీల్ కంటే తక్కువ అని తెలిసింది. RRR చిత్రాన్ని కన్నడ మినహా అన్ని భాషల్లో స్ట్రీమింగ్ కోసం నెట్‌ఫ్లిక్స్ ప్రసార హక్కులను సొంతం చేసుకుంది. జీ5 కన్నడ భాష ప్రసార హక్కులను దక్కించుకుంది. అయితే పుష్ప 2 ఓటీటీ ప్రసార హక్కులను నెట్‌ఫ్లిక్స్ ఎన్ని భాషాల్లో స్ట్రీమింగ్ చేయనుందో తెలియాల్సి ఉంది. RRR సినిమా మాదిరి మెజారిటీ భాషల్లో ప్రసారం చేస్తుందా? లేక అన్ని భాషల్లో ప్రసార హక్కులను దక్కించుకుందో తెలియాల్సి ఉంది. తెలుగు రాష్ట్రాల్లో ఎంతంటే? మరోవైపు పుష్ప 2 థియేట్రికల్ ప్రి రిలీజ్ బిజినెస్ సైతం భారీగానే జరుగుతోంది. తెలుగు రాష్ట్రాల్లో ఈ చిత్రం థియేట్రికల్ రైట్స్‌ కోసం దాదాపు రూ.200కోట్లకు బయ్యర్లు కోట్ చేసినట్లు తెలుస్తోంది. టీజర్‌తో భారీ హైప్  పుష్ప 2 పై ఉన్న క్రేజ్ అభిమానుల్లో మాములు లెవల్లో అయితే లేదనే చెప్పాలి. ఇప్పటికే విడుదలైన పుష్ప 2 టీజర్ సినిమా ఎలా ఉండబోతుందో అన్న ఆసక్తిని సర్వత్రా కలిగించింది. టీజర్‌లో బన్నీ చాలా పవర్‌ఫుల్‌గా, ఫెరోషియస్‌గా కనిపించాడు. అమ్మవారి గెటప్‌లో మాస్‌ అవతారంతో గూప్‌బంప్స్‌ తెప్పించాడు. జాతరలో ఫైట్‌కు సంబంధించిన సీన్‌ను మేకర్స్‌ ఫ్యాన్స్‌ కోసం ప్రత్యేకంగా రిలీజ్ చేశారు. ఇందులో బన్నీ నడిచే స్టైల్, స్వాగ్ అదిరిపోయాయి. కాళ్లకు గజ్జెలు, చెవులకు రింగ్స్, కళ్లకు కాటుకతో ‘పుష్ప రాజ్‌’ లుక్ అదిరిపోయింది. టీజర్‌లో రివీల్‌ చేసిన ఫైట్ సీక్వెన్స్ థియేటర్లను మోత మోగించేలా కనిపిస్తోంది. ఇక టీజర్‌లో దేవిశ్రీ ప్రసాద్‌ అందించిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ నెక్ట్స్ లెవెల్ అనేలా ఉంది. ఓవరాల్‌గా ఈ టీజర్‌ ఫ్యాన్స్‌కు విపరీతంగా నచ్చేసింది.  పుష్ప 2 రిలీజ్ ఎప్పుడంటే? పుష్ప 2 సినిమాను ఈ ఏడాది ఆగస్టు 15న విడుదల చేయనున్నట్లు మేకర్స్‌ ఇప్పటికే ప్రకటించారు.&nbsp; స్వాతంత్ర దినోత్సవ సందర్భంగా వరల్డ్ వైడ్‌గా ఈ చిత్రం విడుదల కానుంది. ఈ సినిమాలో అల్లు అర్జున్‌తోపాటు రష్మిక మందన్న, ఫహాద్ ఫాజిల్, ధనుంజయ్, సునీల్, అనసూయ భరద్వాజ్ తదితరులు కీలక పాత్రలు పోషించనున్నారు. ఎర్రచందనం స్మగ్లింగ్‌ నేపథ్యంలో వచ్చిన ‘పుష్ప ది రైజ్‌’ 2021లో విడుదలై సెన్సేషన్‌ క్రియేట్ చేసింది. దీంతో దీనికి సీక్వెల్‌గా వస్తున్న 'పుష్ప 2'పై భారీగా అంచనాలు ఏర్పడ్డాయి. ఇక ఈ సినిమాలో రష్మికా హీరోయిన్‌గా నటిస్తుండగా సునీల్, రావు రమేష్, ఫహద్ పాసిల్ అలాగే అనసూయ ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు.&nbsp; దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రాన్ని మైత్రి మూవీ మేకర్స్ తెరకెక్కిస్తోంది.
    ఏప్రిల్ 18 , 2024
    Allu Arjun: అంతర్జాతీయ ఫిల్మ్‌ ఫెస్టివల్‌లో ‘అల్లు అర్జున్‌’.. ఫొటోలు, వీడియోలు వైరల్‌!
    Allu Arjun: అంతర్జాతీయ ఫిల్మ్‌ ఫెస్టివల్‌లో ‘అల్లు అర్జున్‌’.. ఫొటోలు, వీడియోలు వైరల్‌!
    ‘పుష్ప’ (Pushpa) సినిమాతో జాతీయ ఉత్తమ నటుడిగా ఐకాన్‌ స్టార్‌ ‘అల్లు అర్జున్‌’ (Allu Arjun) సత్తా చాటాడు. ఈ క్రమంలోనే తాజాగా మరో అరుదైన గౌరవాన్ని బన్నీ దక్కించుకున్నాడు.&nbsp; ప్రతిష్ఠాత్మకంగా భావించే బెర్లిన్‌ అంతర్జాతీయ చలన చిత్రోత్సవాల్లో (74th Berlin International Film Festival) భారతీయ సినిమా తరఫున ప్రాతినిధ్యం వహించే అవకాశం బన్నీని వరించింది. జర్మనీలోని బెర్లిన్‌లో గురువారం (ఫిబ్రవరి 15) నుంచి మొదలైన ఈ 74వ బెర్లిన్‌ చిత్రోత్సవాలు ఈ నెల 25వరకు జరగనున్నాయి. ఇందులో పాల్గొనేందుకు అల్లు అర్జున్‌ గురువారమే జర్మనీకి బయలుదేరారు. https://twitter.com/i/status/1758386967111495928 ప్రస్తుతం జర్మనీలో ఉన్న బన్నీ (#AlluArjun).. అక్కడ బెర్లిన్‌ చిత్రోత్సవాల్లో పాల్గొన్నాడు. ఇందుకు సంబంధించిన దృశ్యాలు నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి.&nbsp; https://twitter.com/i/status/1758387367122190654 కాగా, ఈ అంతర్జాతీయ ఫిల్మ్ ఫెస్టివల్‌లో అల్లు అర్జున్ నటించిన బ్లాక్ బాస్టర్ మూవీ ‘పుప్ప: ది రైజ్’ (Pushpa: The Rise - Part 1)ని ప్రత్యేకంగా ప్రదర్శించారు. ఈ పర్యటనలో భాగంగా ఇంటర్నేషనల్ దర్శకులు, చిత్ర నిర్మాతలు, పలువురు అంతర్జాతీయ సినీ దిగ్గజాలతో బన్నీ (#AlluArjun) మాట్లాడనున్నాడు. పుష్ప సినిమాతో జాతీయ స్థాయిలో తెలుగు సినిమా సత్తా ఏంటో చూపించిన బన్నీ (#AlluArjun)..&nbsp; బెర్లిన్‌ ఫిల్మ్‌ ఫెస్టివల్‌ ద్వారా భారతీయ సినిమా గొప్పతనాన్ని అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లాడు.&nbsp; మరోవైపు బెర్లిన్‌ ఎయిర్‌పోర్టు బయట బన్నీ ఎంతో స్టైలిష్‌గా కనిపించాడు. ఇందుకు సంబంధించిన ఫొటోలు సైతం నెట్టింట వైరల్ అవుతున్నాయి. https://twitter.com/NaviFilmyOffl/status/1758328751287570438 ఈ ఫొటోల్లో అల్లు అర్జున్‌ బ్లాక్‌ అండ్‌ బ్లాక్‌ లుక్‌తో హ్యాండ్సమ్‌గా కనిపించాడు. తలపైన టోపీతో లాంగ్‌ హెయిర్‌తో హాలీవుడ్‌ హీరోను తలపించాడు.&nbsp; అంతర్జాతీయ ఫిల్మ్‌ వేడుకల్లో పాల్గొన్న బన్నీని చూసి ఫ్యాన్స్‌ తెగ ఖుషి అవుతున్నారు. తొలి పార్ట్‌ కంటే రాబోయే ‘పుష్ప 2’ మరింత సక్సెస్ అవుతుందని కామెంట్స్ చేస్తున్నారు. &nbsp; ఇదిలా ఉంటే 'పుష్ప' చిత్రం ఇండియాలోనే కాకుండా అంతర్జాతీయ స్థాయిలో సినీ ప్రేక్షకుల్ని అలరించింది. రష్యా, అమెరికా, గల్ఫ్ దేశాలు, ఆస్ట్రేలియా, యూకేతో పాటు ఇతర దేశాల్లోనూ సూపర్‌ హిట్ అయ్యింది.&nbsp; https://twitter.com/GlobalTrendng24/status/1758203567880749336?s=20 ఇక ఈ ఉత్సాహంతో ‘పుష్ప 2’ను అంతకు మించి తెరకెక్కిస్తున్నారు టీమ్. ఈసినిమా కోసం అల్లు అర్జున్ చాలా కష్టపడుతున్నాడు.&nbsp; ‘పుష్ప-2: ది రూల్’ (Pushpa 2: The Rule) మూవీ ఈ ఏడాది ఆగస్టు 15న విడుదల కానుంది. ఈ విషయాన్ని చిత్ర నిర్మాణ సంస్థ ‘మైత్రీ మూవీస్’ ఈ మధ్యే అధికారికంగా ప్రకటించింది.&nbsp; 200 రోజుల్లో పుష్ప రాజ్ పాలన ఆరంభం అని ఓ ఇంట్రెస్టింగ్ పోస్టర్ కూడా ఇటీవల మూవీ యూనిట్ రిలీజ్‌ చేసింది. ఆ ఫొటో ఫ్యాన్స్‌ విపరీతంగా ఆకట్టుకుంది.&nbsp; ఇక టాలీవుడ్ లెక్కల మాస్టారు.. జీనియస్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో అల్లు అర్జున్‌తో పాటు రష్మిక మందన్న, ఫహద్ ఫాసిల్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు.&nbsp;
    ఫిబ్రవరి 16 , 2024
    Pushpa Pushpa Song: అల్లు అర్జున్‌ చేతిలో పవన్‌ కల్యాణ్‌ పార్టీ సింబల్‌!&nbsp;
    Pushpa Pushpa Song: అల్లు అర్జున్‌ చేతిలో పవన్‌ కల్యాణ్‌ పార్టీ సింబల్‌!&nbsp;
    తెలుగు చిత్ర పరిశ్రమలో పుష్ప (Pushpa) సినిమా సృష్టించిన ప్రభంజనం అంతా ఇంతా కాదు. సుకుమార్‌ దర్శకత్వంలో రూపొందిన చిత్రంతో అల్లు అర్జున్‌ (Allu Arjun) ప్యాన్‌ ఇండియా స్థాయికి ఎదిగాడు. జాతీయ ఉత్తమ నటుడు పురస్కారంతో పాటు గ్లోబల్ ఇమేజ్‌ను సొంతం చేసుకున్నాడు. అటు హీరోయిన్‌ రష్మిక మందన్న (Rashmika Mandanna)కు కూడా ‘పుష్ప’తో మంచి పేరు తీసుకొచ్చింది. ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన సీక్వెల్‌ కూడా శరవేగంగా షూటింగ్‌ జరుపుకుంటోంది. అయితే తాజాగా ఈ సినిమాకు సంబంధించిన టైటిల్‌ సాంగ్‌ను మేకర్స్‌ రిలీజ్‌ చేశారు.&nbsp; పవర్‌ఫుల్‌ టైటిల్‌ సాంగ్‌! పుష్ప చిత్రం సూపర్ సక్సెక్‌ కావడంతో త్వరలో రానున్న ఈ సినిమా సీక్వెల్‌పై అందరి దృష్టి పడింది. ఇటీవలే ఈ సినిమాకు సంబంధించి టీజర్‌ రిలీజ్‌ కాగా ఆడియన్స్‌ నుంచి అదిరిపోయే రెస్పాన్స్‌ వచ్చింది. ఈ క్రమంలో చిత్ర యూనిట్‌ టైటిల్‌ సాంగ్‌కు సంబంధించిన లిరికల్‌ వీడియోను రిలీజ్‌ చేసి ఫ్యాన్స్‌కు అదిరిపోయే ట్రీట్‌ ఇచ్చింది. పుష్పలో టైటిల్ సాంగ్ ఎంత పెద్ద హిట్ అయిందో అదే రేంజ్‌లో ఈ సాంగ్‌ను రూపొందించారు. 'పుష్ప.. పుష్ప.. పుష్ప., పుష్ప రాజ్'&nbsp; అంటూ సాగే ఈ పాటకు చంద్రబోస్‌ అద్భుతమైన లిరిక్స్‌ను అందించారు. బన్నీ పాత్ర ఎంత పవర్‌ఫుల్‌గా ఉంటుందో ఈ లిరిక్స్‌ ద్వారా చెప్పకనే చెప్పారు. ముఖ్యంగా దేవిశ్రీ ప్రసాద్‌ అందించిన మ్యూజిక్‌తో ఈ సాంగ్‌ చాలా క్యాచీగా మారిపోయింది.&nbsp; https://youtu.be/EdvydlHCViY?si=JqZTyOOLXxhGR8nr గాజు గ్లాస్‌తో స్టెప్పులు పుష్ప 2 నుంచి రిలీజైన ఫస్ట్‌ లిరికల్‌ సాంగ్‌ ఆకట్టుకుంటోంది. ఇందులో అల్లుఅర్జున్‌ తన స్టెప్పులతో అదరకొట్టాడు. ముఖ్యంగా సింగిల్‌ లెగ్‌పై వేసే హుక్‌ స్టెప్‌ ట్రెండ్‌ సెట్‌ చేసేలా కనిపిస్తోంది. కుడి కాలి చెప్పు విప్పి కాలిని ఎడమ కాలు మోకాలికి దిగువున పెట్టి వెసే స్వింగ్‌ స్టెప్‌ ఫ్యాన్స్‌ విపరీతంగా ఆకర్షించే అవకాశముంది. అంతేకాదు వీడియో చివర్లో గాజు గ్లాస్‌ చేతిలో పట్టుకుని వేసే మూమెంట్స్‌ కూడా అదరహో అనిపిస్తున్నాయి. జనసేన పార్టీ గుర్తు అయిన గాజు గ్లాస్‌తో కావాలనే ఈ స్టెప్స్‌ క్రియేట్‌ చేశారా? అన్న అనుమానాలు కలుగుతున్నాయి. ఏది ఏమైనా పుష్ప 2 నుంచి వచ్చిన ఫస్ట్ లిరికల్‌ సాంగ్‌ మాత్రం సినిమాపై మరిన్ని అంచనాలు పెంచేలానే ఉంది. రిలీజ్ ఎప్పుడంటే? పుష్ప 2: ది రూల్ సినిమా.. ఈ ఏడాది ఆగస్టు 15వ తేదీన థియేటర్లలో రిలీజ్ కానుంది. తెలుగుతో పాటు హిందీ, తమిళం, కన్నడ, మలయాళం, బెంగాలీ భాషల్లో విడుదలవుతుంది. ఈ చిత్రానికి రికార్డు స్థాయిలో ప్రీ-రిలీజ్ బిజినెస్ జరుగుతోంది. నార్త్ ఇండియా హిందీ హక్కుల్లోనూ ఇప్పటికే ఈ మూవీ రికార్డు సృష్టించింది. బాలీవుడ్ చిత్రాలను వెనక్కి తోసింది. కాగా, ఈ సినిమాలో ఫహద్‌ ఫాసిల్‌, జగపతిబాబు, సునీల్‌, అనసూయ, రావు రమేష్‌ కీలక పాత్రలు పోషిస్తున్నారు.&nbsp;
    మే 01 , 2024
    <strong>IMDB 2024 Report: ఐఎండీబీ రిపోర్టులో టాలీవుడ్‌ హవా.. ఆ మూవీస్‌ కోసం దేశం మెుత్తం ఎదురుచూస్తోందట!</strong>
    IMDB 2024 Report: ఐఎండీబీ రిపోర్టులో టాలీవుడ్‌ హవా.. ఆ మూవీస్‌ కోసం దేశం మెుత్తం ఎదురుచూస్తోందట!
    ప్రముఖ మూవీ రేటింగ్​ సంస్థ ఐఎండీబీ (ఇంటర్నెట్ మూవీ డేటాబేస్) ప్రతీ ఏడాది లాగే ఈ సంవత్సరం కూడా మోస్ట్ పాపులర్ ఇండియన్ సినిమాలు, మోస్ట్ అవైటెడ్ భారతీయ చిత్రాల జాబితాలను సోషల్ మీడియాలో విడుదల చేసింది. ఈ జాబితాలను ప్రపంచవ్యాప్తంగా IMDBకి ఉన్న 250 మిలియన్లకు పైగా నెలవారీ విజిటర్స్ రియల్ పేజ్ వ్యూస్ ఆధారంగా రూపొందించారు. 2024లో అత్యంత ప్రజాదరణ పొందిన ఇండియన్ మూవీగా 'కల్కి 2898 AD' నిలవగా, అత్యంత ఆసక్తిగా ఎదురుచూస్తున్న భారతీయ చిత్రంగా 'పుష్ప 2: ది రూల్' నిలిచాయి. ఐఎండీబీ రిపోర్టుకు సంబంధించిన పూర్తి విశేషాలేంటో ఇప్పుడు చూద్దాం.&nbsp; 2024లో మోస్ట్ పాపులర్ చిత్రాలు ఇవే! ఐఎండీబీ మోస్ట్‌ పాపులర్‌ మూవీస్‌ - 2024 జాబితాలో ప్రభాస్‌ హీరోగా నటించిన 'కల్కి 2898 ఏడీ' (Kalki 2898 AD) అగ్రస్థానంలో నిలిచింది. మలయాళ ఇండస్ట్రీలో అత్యధిక కలెక్షన్లు రాబట్టిన 'మంజుమ్మెల్ బాయ్స్' (Manjummel Boys) మూవీ ఈ జాబితాలో రెండో స్థానం కైవసం చేసుకుంది. హృతిక్ రోషన్, దీపికా పదుకునే కలిసి నటించిన 'ఫైటర్' (Fighter) మూవీ 3వ స్థానంలో నిలవగా, ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో తేజ సజ్జా హీరోగా నటించిన 'హనుమాన్' (Hanuman) సినిమా నాలుగో స్థానం సంపాదించింది. అజయ్ దేవగన్, ఆర్.మాధవన్, జ్యోతిక కలిసి నటించిన 'సైతాన్' (Shaitaan) ఆ తర్వాతి ప్లేస్ లో ఉంది. కిరణ్ రావు దర్శకత్వం వహించిన ‘లాపతా లేడీస్' (Laapataa Ladies) 6వ స్థానం, యామీ గౌత‌మ్, ప్రియమణి ప్ర‌ధాన పాత్ర‌ల్లో న‌టించిన‌ 'ఆర్టికల్ 370' (Article 370) 7వ స్థానం, నస్లేన్ కె. గఫూర్, మమితా బైజు జంటగా నటించిన మలయాళ మూవీ 'ప్రేమలు' (Premalu) 8వ స్థానంలో నిలిచాయి. మలయాళ నటుడు ఫహద్‌ ఫాసిల్‌ హీరోగా చేసిన 'ఆవేశం' (Aavesham), హీందీలో మంచి విజయం సాధించిన 'ముంజ్య' (Munjya)చిత్రాలు 9, 10 స్థానాల్లో చోటు దక్కించుకున్నాయి.&nbsp; https://twitter.com/IMDb_in/status/1815619130948771914 2024లో అత్యంత ఆసక్తిగా ఎదురుచూస్తున్న చిత్రాలు IMDB రిలీజ్‌ చేసిన ‘మోస్ట్ యాంటిసిపేటెడ్ అప్ కమింగ్ ఇండియన్ మూవీస్’ (Most Anticipated Upcoming Indian Movies Of 2024) జాబితాలో ఐకాన్‌ స్టార్‌ అల్లు అర్జున్‌ నటిస్తున్న ‘పుష్ప 2’ (Pushpa 2) చిత్రం టాప్‌లో నిలిచింది. యంగ్ టైగర్ ఎన్టీఆర్, కొరటాల శివ కాంబినేషన్‌లో రూపొందుతోన్న 'దేవర' (Devara) చిత్రం సెకండ్ ప్లేస్‌ దక్కించుకుంది. అక్షయ్ కుమార్ నటిస్తున్న 'వెల్ కమ్ టూ ది జంగిల్' (Welcome To The Jungle), కోలీవుడ్ స్టార్ దళపతి విజయ్ (Vijay) హీరోగా నటిస్తున్న 'ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్' (The Greatest Of All Time) సినిమాలు వరుసగా 3, 4 స్థానాల్లో ఉన్నాయి.&nbsp; తమిళ హీరో సూర్య నటిస్తున్న సైన్స్ ఫిక్షన్ మూవీ 'కంగువ' (Kanguva) ఐదో స్థానంలో నిలవగా, అజయ్‌ దేవగన్‌ నటిస్తున్న ‘సింగం అగైన్‌’ (Singam Again) ఆరో స్థానంలో ఉంది. కార్తీక్ ఆర్యన్ నటిస్తున్న 'భూల్ భూలయ్యా 3', చియాన్ విక్రమ్ 'తంగలాన్', 'ఔరోన్ మే కహన్ దమ్ థా',&nbsp; 'స్త్రీ 2' ఆ తర్వాతి స్థానాల్లో చోటు దక్కించుకున్నాయి.&nbsp; https://twitter.com/IMDb_in/status/1815645100988379418
    జూలై 24 , 2024
    Allu Arjun Viral Photo: భార్యతో రోడ్డు పక్కన దాబాలో కనిపించిన అల్లు అర్జున్‌.. ఫొటో వైరల్‌!
    Allu Arjun Viral Photo: భార్యతో రోడ్డు పక్కన దాబాలో కనిపించిన అల్లు అర్జున్‌.. ఫొటో వైరల్‌!
    టాలీవుడ్‌లో మంచి క్రేజ్ ఉన్న కథానాయకుల్లో అల్లు అర్జున్‌ (Allu Arjun) ఒకరు. ‘పుష్ప’ (Pushpa) సినిమాతో బన్నీ ఫ్యాన్‌ ఫాలోయింగ్‌ పాన్‌ ఇండియా స్థాయికి చేరింది. ఎంతటి పేరు ప్రఖ్యాతలు సాధించినా బన్నీ మాత్రం చాలా సింపుల్‌గా ఉండేందుకే ఇష్టపడుతుంటాడు. సామాన్యుడిగా జీవించేందుకు ఏమాత్రం సంకోచించడు. వివాదంలో చిక్కుకుంటానని తెలిసినా స్నేహం కోసం ఇటీవల వైకాపా నాయకుడి ఇంటికి వెళ్లి మరి బన్నీ మద్దతు ప్రకటించాడు. ఇటువంటి సందర్భాలు బన్నీ లైఫ్‌లో చాలానే ఉన్నాయి. ఇదిలా ఉంటే తాజాగా బన్నీకి సంబంధించి ఓ ఫొటో బయటకొచ్చింది. ప్రస్తుతం అది సోషల్‌ మీడియాలో తెగ వైరల్‌ అవుతోంది.&nbsp; బన్నీ.. సింప్లిసిటీ..! ఐకాన్‌ స్టార్‌ అల్లు అర్జున్‌.. తన భార్య స్నేహా రెడ్డితో కలిసి రోడ్డు పక్కన దాబాలో ఉన్న ఫొటో ఒకటి నెట్టింట వైరల్ అవుతోంది. ఇందులో అల్లు అర్జున్‌, అతని భార్య ఓ సాధారణ హోటల్‌లో టేబుల్‌పై కూర్చొని భోజనం చేస్తూ కనిపించారు. దీనిని అక్కడ ఉన్న ఓ వ్యక్తి రహాస్యంగా ఫొటో తీసి సోషల్‌ మీడియాలో పెట్టాడు. ఇది చూసిన బన్నీ ఫ్యాన్స్‌.. తమ హీరో సింప్లిసిటీకి ఫిదా అవుతున్నారు. లైఫ్‌లో ఎంత ఎత్తు ఎదిగిన ఒదిగి ఉండాలన్న జీవిత పాఠాన్ని బన్నీ పాటిస్తున్నాడని ప్రశంసిస్తున్నారు. అంతేకాకుండా ఈ ఫొటోను షేర్‌ చేస్తూ ట్రెండింగ్‌లో చేస్తున్నారు.&nbsp; .@alluarjun anna &amp; sneha garu🤨😯❤️❤️Spotted at road side dhaba SIMPLICITY LEVEL. Man 🫡 pic.twitter.com/KoI7NOLfmF— Trend_AlluArjun_FC™ (@Trend_AA_FC) May 21, 2024 ఎక్కడ జరిగిందంటే? ఇటీవల ఏపీ ఎన్నికల సమయంలో బన్నీ తన భార్య స్నేహా రెడ్డితో కలిసి నంద్యాల జిల్లాలో పర్యటించాడు. అక్కడ వైకాపా అభ్యర్థి శిల్పా రవిచంద్ర కిషోర్‌ రెడ్డికి మద్దతు తెలిపాడు. భారీగా తరలివచ్చిన ఫ్యాన్స్‌కు అభివాదం చేసి.. కొద్ది సేపటికే బన్నీ తిరిగి హైదరాబాద్‌ బయలుదేరాడు. ఈ సందర్భంగా దారిలో ఓ దాబా వద్ద బన్నీ ఆగినట్లు తెలుస్తోంది. అక్కడ తన భార్యతో కలిసి భోజనం చేశారని సన్నిహిత వర్గాలు తెలిపాయి. అప్పుడు తీసిన ఫొటోనే ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌ అవుతున్నట్లు సమాచారం. గతంలోనూ ఇలాగే..! గతంలో ‘పుష్ప’ సినిమా షూటింగ్‌ సందర్భంలోనూ బన్నీ రోడ్డు పక్కన టిఫిన్‌ చేసి అందర్నీ ఆశ్చర్యపరిచాడు. రంపచోడవరంలో తెల్లవారు జామున షూటింగ్‌కు వెళ్తూ బన్నీ మార్గం మధ్యలో ఓ కాకా హోటల్‌ దగ్గర కారు ఆపాడు. ఎంచక్కా పాకలోకి వెళ్లి టిఫిన్‌ చేశాడు. బయటకొచ్చి తన అసిస్టెంట్‌ను డబ్బులు అడిగి హోటల్‌ యజమాని చేతికి ఇచ్చాడు. ఇందుకు సంబంధించిన వీడియో అప్పట్లో తెగ వైరల్ అయ్యింది. ఆ వీడియో మళ్లీ ఓసారి చూసేయండి. Icon Star #AlluArjun was having breakfast at road side tiffin centre near gokavaram.@alluarjun ❤️ #Pushpa pic.twitter.com/25OCuNGRB4— Allu Arjun Fan™ (@IamVenkateshRam) September 13, 2021 ‘పుష్ప 2’తో బిజీ బిజీ.. ప్రస్తుతం బన్నీ.. ‘పుష్ప 2: ది రూల్’ షూటింగ్‌లో పాల్గొంటూ బిజీ బిజీగా గడుపుతున్నాడు. డైరెక్టర్‌ సుకుమార్‌ ఈ సినిమాను ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపొందిస్తున్నారు. ‘పుష్ప 2’ ఆగస్టు 15న రిలీజ్ చేయనున్నట్లు మేకర్స్‌ ఇప్పటికే ప్రకటించారు. తెలుగుతో పాటు హిందీ, తమిళం, కన్నడ, మలయాళం, బెంగాలీ భాషల్లో ఈ సినిమా రానుంది. ఇందులో రష్మిక మందన్న హీరోయిన్‌గా చేస్తుండగా.. ఫహద్‌ ఫాసిల్‌, జగపతిబాబు, సునీల్‌, అనసూయ, రావు రమేష్‌ కీలక పాత్రలు పోషిస్తున్నారు. దేవిశ్రీప్రసాద్‌ సంగీతం సమకూరుస్తున్నాడు.&nbsp;
    మే 21 , 2024
    <strong>Telugu Directors: రాజమౌళిని బీట్ చేసే సత్తా ఈ తెలుగు డైరెక్టర్లకు ఉందా?</strong>
    Telugu Directors: రాజమౌళిని బీట్ చేసే సత్తా ఈ తెలుగు డైరెక్టర్లకు ఉందా?
    దేశం గర్వించతగ్గ దర్శకుల్లో ఎస్‌.ఎస్‌. రాజమౌళి (SS Rajamouli) ఒకరు. అపజయం ఎరుగని డైరెక్టర్‌గా ఆయన తన జైత్ర యాత్రను కొనసాగిస్తున్నారు. ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ (RRR) మూవీతో తెలుగు సినిమా స్థాయిని ప్రపంచ స్థాయికి చేర్చిన ఆయన.. మహేష్‌తో SSMB29తో గ్లోబల్‌ మార్కెట్‌ను శాంసించేందుకు సిద్ధమవుతున్నారు. అయితే రాజమౌళి తర్వాత ఆ స్థాయిలో రాణించగల డైరెక్టర్లు తెలుగులో ఉన్నారా అన్న సందేహాన్ని నార్త్‌ ఆడియన్స్‌ వ్యక్తం చేస్తున్నాయి. ఈ ప్రశ్నకు సమాధానంగా పలువురు డైనమిక్‌ డైరెక్టర్స్‌ కనిపిస్తున్నారు. రాజమౌళి బాటలోనే నడుస్తూ.. ఇండియన్‌ బాక్సాఫీస్‌ను షేక్‌ చేసేందుకు రెడీ అవుతున్నారు. ఇంతకీ ఆ డైరెక్టర్లు ఎవరు? వారి ముందున్న అవకాశాలు ఏంటి? ఇప్పుడు పరిశీలిద్దాం.&nbsp; [toc] నాగ్ అశ్విన్‌ (Nag Ashwin) &nbsp; ప్రస్తుతం టాలీవుడ్‌లో బాగా వినిపిస్తున్న డైరెక్టర్‌ పేరు ‘నాగ్‌ అశ్విన్‌’. ప్రభాస్‌ హీరోగా అతడు తెరకెక్కిస్తున్న ‘కల్కి 2898 ఏడీ’ చిత్రంపై గ్లోబల్‌ స్థాయిలో బజ్ ఉంది. భారతీయ పురాణాలు స్ఫూర్తిగా సైన్స్ ఫిక్షన్ జానర్‌లో వస్తోన్న ఈ సినిమా.. జూన్‌ 27న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ఈ సినిమా సక్సెస్‌ అయితే నాగ్‌ అశ్విన్‌కు కెరీర్‌ పరంగా తిరుగుండదని సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఈ సినిమా టాలీవుడ్‌ స్థాయిని మరో రేంజ్‌కు తీసుకెళ్లి.. నాగ్‌ అశ్విన్‌కు ఎనలేని ఫేమ్‌ను తీసుకొచ్చే అవకాశం ఉంది. పైగా నాగ్‌ అశ్విన్‌.. విజన్‌, ఎగ్జిక్యూషన్‌, యునిక్‌ ప్రమోషన్స్ చూస్తే అచ్చం రాజమౌళి గుర్తుకు రాక మానడు.&nbsp;&nbsp; టెక్నాలజీని సినిమాకు అన్వయించడంలో దర్శక ధీరుడు రాజమౌళి ఎప్పుడు ముందుంటాడు. ప్రపంచస్థాయి గ్రాఫిక్స్‌, కొత్త తరహా ఆయుధాలు, వినూత్నమైన కాస్ట్యూమ్స్‌, వైవిధ్యమైన డైలాగ్స్‌, నెవర్‌బీఫోర్‌ హీరో ఎలివేషన్స్‌ ఇలా ప్రతీ అంశంలోనూ తన మార్క్‌ చూపిస్తుంటాడు. అయితే కల్కి డైరెక్టర్‌ నాగ్‌ అశ్విన్‌ కూడా ఈ విషయంలో రాజమౌళిని గుర్తు చేస్తున్నాడు. కల్కి కోసం లేటెస్ట్ టెక్నాలజీని ఉపయోగించుకుంటున్నాడు. ముఖ్యంగా ఈ మూవీ కోసం ఓ స్పెషల్‌ వెహికల్‌ను చిత్ర యూనిట్‌ తయారు చేయించింది. సినిమాలో ‘బుజ్జి’ అని పిలిచే ఈ రోబోటిక్‌ వాహనంతోనే హీరో ప్రభాస్‌ అడ్వెంచర్స్ చేశాడు. బుజ్జికి సంబంధించి బుధవారం (మే 22) స్పెషల్‌ గ్లింప్స్‌ను రిలీజ్‌ చేయగా అది యూట్యూబ్‌లో అత్యధిక వ్యూస్‌తో దూసుకెళ్తోంది.&nbsp; https://twitter.com/i/status/1793606030703927405 బుజ్జి అనే స్పెషల్‌ వెహికల్‌ని మూవీ టీమ్ మహీంద్రా కంపెనీతో కలిసి తయారు చేసింది. దీన్ని తయారు చేయడానికి దాదాపు 7 కోట్లు ఖర్చు అయిందని సమాచారం. సాధారణంగా ఏదైనా కొత్త వెహికల్‌ను తయారు చేయడానికి ఐదు నుంచి పదేళ్ల సమయం పడుతుంది. డైరెక్టర్‌ నాగ్‌ అశ్విన్‌.. మహీంద్రా టీమ్‌ను సినిమాలో భాగంగా చేసుకొని తమ ఆలోచనలకు అనుగుణంగా వారిని డైరెక్ట్‌ చేస్తూ వెహికల్‌ను తయారు చేయించుకున్నారు. ఈ సినిమాలో బుజ్జికి చాలా ఇంపార్టెంట్‌ రోల్ ఉందని నాగ్ అశ్విన్‌.. గ్లింప్స్‌ రిలీజ్‌ ఈవెంట్‌లో అన్నారు. వెహికల్‌ తయారీకి సహకరించిన ఆనంద్‌ మహీంద్ర టీమ్‌కు థ్యాంక్స్ చెప్పారు.&nbsp; https://twitter.com/i/status/1793303611583418579 సుకుమార్‌ (Sukumar) ‘పుష్ప’ (Pushpa : The Rise) సినిమా ముందు వరకూ టాలీవుడ్‌కే పరిమితమైన సుకుమార్‌.. ఆ మూవీ తర్వాత ప్యాన్‌ ఇండియా డైరెక్టర్‌గా మారిపోయాడు. ఇందులో సుకుమార్‌ దర్శకత్వ నైపుణ్యం చూసి ప్రతీ ఒక్కరు ఇంప్రెస్ అయ్యారు. ముఖ్యంగా అల్లు అర్జున్ లాంటి స్టైలిష్‌ హీరోను.. ఎలాంటి మేకప్‌ లేకుండా మాసిన జుట్టు, గడ్డంతో చూపించడం ఆశ్చర్యం కలిగించింది. అయితే కథకు తగ్గట్లు బన్నీ రూపురేఖలు మార్చి అక్కడే సినిమా విజయానికి పునాది వేశారు సుకుమార్. సాధారణంగా రాజమౌళి తన సినిమాల్లో ఇంటర్వెల్‌, క్లైమాక్స్‌ సీన్లకు ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తాడు. సాలిడ్‌ ఇంటర్వెల్‌ ద్వారా సెకండాఫ్‌పై ఆసక్తి రేకెత్తిస్తాడు. అటు సినిమా ముగింపును కూడా ఆడియన్స్‌కు చాలా సంతృప్తి కలిగేలా రాజమౌళి తీర్చిదిద్దుతాడు. అయితే డైరెక్టర్ సుకుమార్‌ దీనికి పూర్తి డిఫరెంట్‌ ఫార్మూలను పుష్ప విషయంలో అనుసరించారు. ఇందులో ఎలాంటి రక్తపాతం లేకుండా ఇంటర్వెల్‌, క్లైమాక్స్‌ సీన్లను డిజైన్‌ చేశారు. పుష్ప.. మంగళం శీను (సునీల్‌) ఇంటికి వెళ్లి వార్నింగ్ ఇచ్చే సీన్‌తో సెకండాఫ్‌పై హైప్‌ క్రియేట్‌ చేశారు సుకుమార్‌. ‌అటు క్లైమాక్స్‌లో ఎస్పీ భన్వర్‌ సింగ్‌ షెకావత్‌ (ఫహాద్‌ ఫాజిల్‌)కు పుష్ప చేత సవాలు విసిరించి.. రెండో పార్ట్‌పై ఆసక్తిని రగిలించారు.&nbsp; ప్రస్తుతం సుకుమార్‌ రూపొందిస్తున్న పుష్ప సీక్వెల్‌ ‘పుష్ప 2 : ది రూల్‌’ కోసం యావత్‌ దేశం ఎదురుచూస్తోంది. ఆగస్టు 15న ఈ సినిమా విడుదల కానుండగా.. మేకర్స్‌ ఇప్పటికే ప్రమోషన్స్‌ షూరు చేశారు. ఈ సినిమా విజయం సాధిస్తే సుకుమార్‌ స్థాయి మరింత పెరగనుంది. పైగా తన తర్వాతి చిత్రాన్ని రామ్‌చరణ్‌తో చేయనున్నట్లు సుకుమార్ ప్రకటించారు. అటు ‘పుష్ప 3’ కూడా ఉంటుందని ప్రచారం జరుగుతోంది. కాబట్టి నెక్స్ట్‌ 2, 3 ఏళ్లలో సుకుమార్‌.. రాజమౌళి రేంజ్‌లో పాపులర్ అయ్యే పరిస్థితులు కనిపిస్తున్నాయి.&nbsp; సందీప్‌ రెడ్డి వంగా (Sandeep Reddy Vanga) టాలీవుడ్‌ సెన్సేషన్‌ డైరెక్టర్‌ సందీప్‌ రెడ్డి వంగా.. ‘యానిమల్‌’ (Animal) సినిమా ద్వారా తన సత్తా ఏంటో చూపించాడు. డిఫరెంట్‌ కాన్సెప్ట్‌తో సినిమాలు తెరకెక్కిస్తూ తన కంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నాడు. అయితే సందీప్‌.. రాజమౌళిలాగా సినిమా మేకింగ్‌ స్టైల్‌నే మార్చేశాడు. ఇప్పటివరకూ ఏ డైరెక్టర్‌ సాహించని విధంగా సినిమాలు తీస్తూ అలరిస్తున్నాడు. సందీప్‌ తన తర్వాతి చిత్రాన్ని ప్రభాస్‌తో తీయనున్నాడు. దీనికి స్పిరిట్‌ అనే టైటిల్‌ కూడా ఖరారు చేశారు.&nbsp; స్పిరిట్‌ సినిమాలో ప్రభాస్‌ తొలిసారి పోలీసు ఆఫీసర్‌గా కనిపించనున్నాడు. అతడి పాత్ర చాలా పవర్‌ఫుల్‌గా ఉండనున్నట్లు సమాచారం. ఇప్పటికే ప్రభాస్‌ పాత్రకు సంబంధించిన ఓ పోస్టర్‌ను సైతం చిత్ర యూనిట్‌ రిలీజ్‌ చేసింది. ఇందులో ప్రభాస్‌ వేసుకున్న పోలీసు డ్రెస్‌ చాలా డిఫరెంట్‌గా ఉంది. ఇంటర్‌నేషనల్‌ కాప్‌ లుక్‌ను తలపిస్తోంది. యానిమల్‌ కంటే స్ట్రాంగ్‌ కంటెంట్‌తో స్పిరిట్‌ రానుంది ఇప్పటికే సందీప్‌ ప్రకటించాడు. తొలి రోజే రూ.150 కోట్ల వసూళ్లను రాబడుతుందని ధీమా వ్యక్తం చేశారు. మూవీ హిట్‌ టాక్‌ వస్తే.. వారం రోజుల్లోనే రూ.1500 కలెక్షన్లు సాధిస్తుందని సందీప్‌ వంగా నమ్మకంగా ఉన్నట్లు తెలిసింది.&nbsp; ఇక స్పిరిట్‌ తర్వాత సందీప్‌ రెడ్డి.. రణ్‌బీర్‌ కపూర్‌ (Ranbir Kapoor)తోనే ‘యానిమల్‌ 2’ చేయనున్నాడు. ఈ రెండు సినిమాలు సక్సెస్‌ అయితే సందీప్‌కు రాజమౌళి స్థాయిలో ఫేమ్‌ రావడం ఖాయమని సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.&nbsp; ప్రశాంత్‌ వర్మ (Prasanth Varma) యంగ్‌ డైరెక్టర్‌ ప్రశాంత్‌ వర్మ.. తన టాలెంట్‌ ఏంటో ‘హనుమాన్‌’ (HanuMan) ద్వారా యావత్‌ దేశానికి తెలియజేశాడు. తన మూడో సినిమాతోనే స్టార్‌ డైరెక్టర్ల సరసన నిలబడ్డాడు. ఈ ఏడాది ఇప్పటివరకూ అత్యధిక వసూళ్లు రాబట్టిన చిత్రంగా హనుమాన్‌ నిలిచింది. బాక్సాఫీస్‌ వద్ద రూ. 350 కోట్లకు పైగా కలెక్షన్స్‌ కొలగొట్టి అందర్నీ ఆశ్చర్య పరిచింది. ప్రస్తుతం ప్రశాంత్‌ వర్మ..&nbsp; ‘హనుమాన్‌ 2’ చిత్రాన్ని తెరకెక్కించే పనిలో ఉన్నాడు. అటు బాలీవుడ్‌ స్టార్ హీరో రణ్‌వీర్‌ సింగ్‌ (Ranveer Singh)తో ఓ పీరియాడికల్‌ సినిమా చేసే ఛాన్స్ ప్రశాంత్‌కు దక్కినట్లు ప్రచారం జరుగుతోంది. ఈ రెండు ప్రాజెక్ట్స్‌ కూడా సక్సెస్‌ అయితే ప్రశాంత్‌ పేరు జాతీయ స్థాయిలో మారుమోగడం ఖాయం.&nbsp; ప్రశాంత్‌ నీల్‌ (Prashanth Neel) కన్నడ డైరెక్టర్‌ ప్రశాంత్‌ నీల్‌.. టాలీవుడ్‌ స్టార్‌ ప్రభాస్‌తో ‘సలార్‌’ (Salaar) రూపొందించి సాలిడ్‌ విజయాన్ని అందుకున్నాడు. ఈ దర్శకుడి మేకింగ్‌ స్టైల్‌ రాజమౌళిని సైతం ఎంతగానో ఇంప్రెస్‌ చేసింది. ప్రభాస్‌ కటౌట్‌కు తగ్గ ఎలివేషన్స్‌ ఇచ్చి.. ప్రతీ ఒక్కరినీ ప్రశాంత్‌ నీల్ ఆకట్టుకున్నారు. హీరో ప్రభాస్‌ను చాలా స్ట్రాంగ్‌ పర్సనాలిటీగా సలార్‌లో ప్రొజెక్ట్‌ చేశాడు డైరెక్టర్‌. రాజమౌళి తరహాలోనే అద్భుతంగా ఇంటర్వెల్‌ను డిజైన్‌ చేశాడు. ప్రభాస్‌ను స్క్రీన్‌పై కనిపించిన ప్రతీసారి ఫ్యాన్స్‌కు గూస్‌బంప్స్‌ వచ్చాయి.&nbsp; ప్రస్తుతం ప్రశాంత్ నీల్ ఫోకస్‌ మెుత్తం ‘సలార్‌ 2’ (Salaar: Part 2 - Shouryanga Parvam)పై ఉంది. ఈ మూవీ కూడా విజయం సాధిస్తే ప్రశాంత్‌ నీల్‌ జాతీయ స్థాయిలో టాప్‌ డైరెక్టర్లలో ఒకరిగా మారిపోవడం ఖాయం. అటు తారక్‌తోనూ ప్రశాంత్‌.. ఓ సినిమాను ప్రకటించాడు. ‘NTR31’ ప్రొడక్షన్‌ టైటిల్‌తో ఈ మూవీ సెట్స్‌పైకి వెళ్లనుంది. అటు ‘కేజీఎఫ్‌ 3’ రూపొందనున్నట్లు సదరు నిర్మాణ సంస్థ ప్రకటించింది. ఈ మూడు ప్రాజెక్టులు సక్సెస్‌ అయితే ప్రశాంత్‌ క్రేజ్‌ రాజమౌళి స్థాయికి చేరే అవకాశముంది.&nbsp; కొరటాల శివ (Koratala Siva) టాలీవుడ్‌ టాలెంటెడ్‌ డైెరెక్టర్లలో కొరటాల శివ ఒకరు. ఆచార్య మినహా ఇప్పటివరకూ అతడు డైరెక్ట్‌ చేసిన చిత్రాలన్నీ బాక్సాఫీస్‌ వద్ద కలెక్షన్ల వర్షం కురిపించాయి. అతడు కెరీర్‌లో తొలిసారి ఓ పాన్‌ ఇండియా చిత్రాన్ని రూపొందిస్తున్నారు. తారక్‌తో ‘దేవర’ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఈ మూవీపై దేశవ్యాప్తంగా బజ్ ఉంది. తీర ప్రాంత నేపథ్యంలో ఈ సినిమా వస్తోంది. మెుత్తం రెండు పార్ట్స్‌గా ఈ మూవీ రానుండగా తొలి భాగం.. అక్టోబర్‌ 10న ప్రేక్షకుల ముందుకు రానుంది. తారక్‌తో పాటు బాలీవుడ్‌ నటుడు సైఫ్‌ అలీఖాన్‌, మ్యూజిక్ సెన్సేషన్‌ అనిరుధ్‌ ఈ ప్రాజెక్టులో భాగం కావడంతో సినిమాపై భారీగా అంచనాలు ఉన్నాయి. గతంలో రిలీజ్‌ చేసిన దేవర గ్లింప్స్‌ ఈ సినిమాపై అంచనాలను మరింత పెంచింది. ఈ గ్లింప్‌లో తారక్‌.. కత్తితో శత్రువులను తెగనరకడం చూపించాడు డైరెక్టర్‌. ఓ సీన్‌లో తారక్‌ శత్రువుని నరకగా అతడి రక్తం.. హాఫ్‌ మూన్‌ను కింద వైపు నుంచి ఈక్వెల్‌గా రౌండ్‌ చేయడం గూస్‌బంప్స్‌ తెప్పిస్తుంది. అలాగే ఇటీవల తారక్‌ బర్త్‌డేను పురస్కరించుకొని రిలీజ్‌ చేసిన ఫస్ట్‌ సింగిల్‌ కూడా సినిమాపై మరింత హైప్‌ను పెంచింది. ముఖ్యంగా తారక్‌ పాత్రను ఎలివేట్‌ చేస్తూ రాసుకున్న లిరిక్స్‌ హైలెట్‌గా నిలిచాయి. ఈ మూవీ సక్సెస్‌ అయితే కొరటాల శివ క్రేజ్‌ జాతీయ స్థాయికి చేరనుంది. ఇక దేవర రెండు పార్ట్స్‌ కూడా విజయం సాధిస్తే.. దేశంలోని ప్రముఖ డైరెక్టర్ల జాబితాలో అతడు చేరడం ఖాయం.&nbsp; సుజీత్‌ (Sujeeth) యంగ్‌ డైరెక్టర్‌ సుజీత్‌.. స్టైలిష్‌ డైరెక్టర్‌గా ఇండస్ట్రీలో పేరుంది. అతడి డైరెక్షన్‌ స్కిల్స్‌ రాజమౌళి తరహాలోనే హాలీవుడ్‌ డైరెక్టర్లను తలపిస్తాయి. బాహుబలి తర్వాత ప్రభాస్‌ చేసిన ‘సాహో’ చిత్రానికి&nbsp; సుజీత్‌ దర్శకత్వం వహించాడు. ఈ మూవీ ఫ్లాప్‌ టాక్‌ తెచ్చుకున్నప్పటికీ.. సుజీత్‌ మేకింగ్‌ నైపుణ్యం, స్క్రీన్‌ప్లే, ఐడియాలజీకి ఆడియన్స్ ఇంప్రెస్ అయ్యారు. ముఖ్యంగా యాక్షన్స్‌ సీక్వెన్స్‌ను ఆయన తెరకెక్కించిన విధానం ఎంతగానో ఆకట్టుకుంది. ప్రభాస్‌ను చాలా స్టైలిష్‌గా చూపించాడు. సరైన హిట్‌ లభిస్తే సుజీత్‌ వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం లేదని అప్పట్లో వార్తలు వచ్చాయి. ప్రస్తుతం అతడు పవన్‌ కల్యాణ్‌ (Pawan Kalyan)తో ‘ఓజీ’ (OG) సినిమా చేస్తున్నాడు. ఈ మూవీ పాన్ ఇండియా స్థాయిలో విడుదల కానుంది. ఇప్పటికే విడుదలైన ఈ మూవీ గ్లింప్స్‌ పవన్‌ ఫ్యాన్స్‌ను ఎంతగానో ఇంప్రెస్ చేసింది. ఇందులో పవన్‌ గ్యాంగ్‌ స్టర్‌గా కనిపించనున్నాడు. ఈ మూవీ సక్సెస్‌ అయితే సుజీత్ కెరీర్‌ మరోలా ఉంటుందని సినీ విశ్లేషకుల అంచనా. రెండు సాలిడ్ హిట్స్ పడితే అతడి క్రేజ్‌ రాజమౌళి స్థాయికి చేరే అవకాశముందని విశ్లేషణలు ఉన్నాయి.&nbsp; బుచ్చిబాబు (Buchi Babu) తొలి సినిమాతోనే సాలిడ్‌ హిట్‌ అందుకున్న అతికొద్ది దర్శకుల్లో బుచ్చిబాబు ఒకరు. ‘ఉప్పెన’ (Uppena) సినిమాతో స్వచ్ఛమైన ప్రేమ కథను ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చిన అతడు.. తనలో ఎంతో టాలెంట్‌ ఉందని ఇండస్ట్రీకి తెలిసేలా చేశాడు. తన తర్వాతి చిత్రాన్ని టాలీవుడ్‌ స్టార్‌ హీరో రామ్‌చరణ్‌తో చేసే స్థాయికి ఎదిగాడు. స్పోర్ట్స్‌ డ్రామాగా రానున్న ఈ చిత్రం కూడా పాన్‌ ఇండియా స్థాయిలో రూపొందనుంది. రామ్‌చరణ్‌ క్రేజ్‌కు బుచ్చిబాబు టాలెంట్‌ తోడైతే ఈ సినిమా కచ్చితంగా విజయం సాధిస్తుందని సినీ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. జాతీయ స్థాయిలో అతడి పేరు మార్మోగుతుందని అభిప్రాయపడుతున్నారు.&nbsp;
    అక్టోబర్ 22 , 2024
    Pushpa 2 Second Single: శ్రీవల్లితో పుష్ప గాడి డ్యూయెట్‌.. రేపు ఎప్పుడంటే?
    Pushpa 2 Second Single: శ్రీవల్లితో పుష్ప గాడి డ్యూయెట్‌.. రేపు ఎప్పుడంటే?
    టాలీవుడ్‌లో రానున్న మోస్ట్‌ అవెయిటెడ్‌ చిత్రాల్లో ‘పుష్ప: ది రూల్‌’ (Pushpa : The Rule) ఒకటి. 2021లో విడుదలైన ‘పుష్ప ది రైజ్‌’కు కొనసాగింపుగా రానున్న దీని కోసం సినీప్రియులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని ఆగస్టు 15న ఈ సినిమా గ్రాండ్‌గా రిలీజ్‌ కానుంది. రిలీజ్‌ డేట్‌ దగ్గరపడుతుండటంతో చిత్ర యూనిట్‌ ప్రమోషన్స్ షురూ చేసింది. ఇటీవలే ‘పుష్ప 2 ‘టైటిల్‌ సాంగ్‌ రిలీజ్‌ చేయగా అది పాన్‌ ఇండియా స్థాయిలో అందర్నీ ఆకట్టుకుంటుంది. ఇదే ఊపులో రెండో సింగిల్‌కు కూడా చిత్ర యూనిట్‌ ముహోర్తం ఖరారు చేసింది.&nbsp; రిలీజ్‌ ఎప్పుడంటే! ‘పుష్ప 2’ సెకండ్ సింగిల్‌ను రేపు (మే 23) ఉదయం 11:07 నిమిషాలకి రిలీజ్ చేయబోతున్నట్లు నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ ప్రకటించింది. ఇందులో రష్మిక మందనతో బన్నీ చిందేయబోతున్నట్లు చెప్పింది. ఈ రొమాంటిక్ సాంగ్ ఆడియన్స్‌ను ఫిదా చేస్తుందని చెప్పుకొచ్చింది. ‘పుష్ప పుష్ప..' సాంగ్‌తో ఇటీవల పుష్ప రాజ్ దుమ్మురేపాడు. ఇప్పుడు శ్రీవల్లి తన సామితో కలిసి మన మనసులు కొల్లగొట్టబోతుంది అంటూ మేకర్స్‌ సోషల్ మీడియాలో ఓ పోస్ట్ పెట్టారు. ప్రస్తుతం ఈ పోస్టు నెట్టింట వైరల్‌గా మారింది. #Pushpa2SecondSingle హ్యాష్‌ట్యాగ్‌తో సోషల్‌ మీడియాలో ట్రెండింగ్ అవుతోంది.&nbsp; ఆ పాటను మరిపిస్తుందా! పుష్ప సినిమాలోని 'నా సామీ రారా సామీ' సాంగ్ ఎంత పెద్ద హిట్ అయిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. రొమాంటిక్‌ మెలోడీగా వచ్చిన ఈ పాట అప్పట్లో యూత్‌ను విశేషంగా ఆకట్టుకుంది. ఇందులో రష్మిక నడుమును బెండ్‌ చేసి వేసే హుక్‌ స్టెప్‌ కూడా సెన్సేషన్‌ క్రియేట్‌ చేసింది. ఈ స్టెప్‌ను అప్పట్లో యూత్‌ రీల్స్‌ చేసి తెగ ట్రెండ్‌ చేశారు. ఇప్పుడు ‘పుష్ప 2’ నుంచి రాబోతున్న సెకండ్‌ సింగిల్‌.. రొమాంటిక్‌ సాంగ్‌ కావడంతో ఇప్పటినుంచే అంచనాలు మెుదలయ్యాయి. ‘నా సామి రారా సామీ’ రేంజ్‌లోనే ఈ పాట ఆకట్టుకుంటుందని ఫ్యాన్స్‌ నమ్మకంగా ఉన్నారు.&nbsp; https://www.youtube.com/watch?v=vdY5SFZBgnk ఐటెం సాంగ్‌పై ఫోకస్‌! (Pushpa 2 Item Song) ‘పుష్ప 2’ టైటిల్‌ సాంగ్‌ ఇప్పటికే విడుదలవ్వగా.. రొమాంటిక్‌ పాట రేపు (మే 23) ఫ్యాన్స్‌ను అలరించనుంది. దీంతో ప్రస్తుతం ఫ్యాన్స్‌ దృష్టి ఐటెం సాంగ్‌ వైపు మళ్లింది. పుష్ప సినిమాలోని 'ఊ అంటావా మావా ఊఊ అంటావా మావా' సాంగ్‌ ఏ స్థాయిలో సెన్సేషన్‌ క్రియేట్‌ చేసిందే అందరికీ తెలిసిందే. ఇందులో సమంత (Samantha)తో అల్లు అర్జున్‌ వేసిన స్టెప్పులకు థియేటర్లు దద్దరిల్లిపోయాయి. దీంతో 'పుష్ప 2' అదే రేంజ్‌లో ఉంటుందని ఫ్యాన్స్ ఆశిస్తున్నారు. బాలీవుడ్‌ బ్యూటీ దిశా పటానీ ఈ మూవీలో ఐటెం సాంగ్‌ చేస్తున్నట్లు అప్పట్లో వార్తలు వచ్చాయి. కానీ, ఈ విషయాన్ని చిత్ర యూనిట్‌ ఇప్పటివరకూ ధ్రువీకరించలేదు. అదే సమయంలో మరో నటిని తీసుకుంటున్నట్లు కూడా ప్రకటించలేదు. అయితే ఆగస్టు 15న సినిమా రిలీజ్‌ కానుండటంతో త్వరగా సాంగ్‌ను రూపొందించాలని మేకర్స్‌ భావిస్తున్నట్లు తెలిసింది.&nbsp;
    మే 22 , 2024
    <strong>Pushpa 2 Record: రిలీజ్‌కు ముందే ‘పుష్ప 2’ ఆల్‌టైమ్‌ రికార్డు.. ఫ్యాన్స్‌ కాలర్ ఎగరేయాల్సిందే!</strong>
    Pushpa 2 Record: రిలీజ్‌కు ముందే ‘పుష్ప 2’ ఆల్‌టైమ్‌ రికార్డు.. ఫ్యాన్స్‌ కాలర్ ఎగరేయాల్సిందే!
    'పుష్ప 2' (Pushpa 2) చిత్రం కోసం బన్నీ (Allu Arjun) ఫ్యాన్స్‌తో పాటు యావత్‌ సినీ లోకం ఎదురుచూస్తోంది. 'పుష్ప: ది రూల్‌' పేరుతో వస్తోన్న ఈ చిత్రానికి స్టార్‌ డైరెక్టర్‌ సుకుమార్‌ దర్శకత్వం వహిస్తున్నారు. డిసెంబర్‌ 5న రిలీజ్‌ చేయనున్నట్లు ఇటీవల మేకర్స్‌ అధికారికంగా ప్రకటించారు. వాస్తవానికి ఈ మూవీ డిసెంబర్‌ 6న రిలీజ్‌ కావాల్సి ఉంది. ఓవర్సీస్‌లో లాంగ్‌ వీకెండ్‌ను దృష్టిలో ఉంచుకొని ఒక రోజు ముందే దీన్ని విడుదల చేస్తున్నట్లు ప్రకటించారు. రిలీజ్‌కు ముందే పలు రికార్డులు కొల్లగొట్టిన ఈ చిత్రం తాజాగా మరో ఫీట్‌ సాధించింది. భారతీయ సినీ చరిత్రలో ఏ సినిమాకు సాధ్యంకాని అల్‌టైమ్‌ రికార్డు (Pushpa 2 Record)ను సొంతం చేసుకుంది. ‘పుష్ప 2’ అరుదైన ఘనత పుష్పకి ముందు వరకూ కేవలం టాలీవుడ్‌కు మాత్రమే పరిచయమైన అల్లుఅర్జున్‌ ఆ సినిమా సక్సెస్‌తో వరల్డ్‌వైడ్‌గా ఫ్యాన్స్‌ను సంపాదించుకున్నాడు. పాన్‌ ఇండియా స్థాయితో పాటు ఓవర్సీస్‌లోనూ పుష్ప’ (2021) సక్సెస్‌ కావడంతో ‘పుష్ప 2’పై విదేశీ ఆడియన్స్‌లోనూ భారీగా హైప్‌ ఏర్పడింది. ఈ క్రమంలో తాజాగా ఓవర్సీస్‌లో ప్రీసేల్‌ బుకింగ్స్‌ను ఓపెన్‌ చేశారు. దీంతో ‘పుష్ప 2’ కోసం ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న ప్రేక్షకులంతా ప్రీసేల్‌ టికెట్స్‌ కోసం ఎగబడ్డారు. ఫలితంగా క్షణాల వ్యవధిలో అత్యంత వేగంగా తొలి 15 వేల టికెట్స్‌ (Pushpa 2 Record) అమ్ముడుపోయాయి. అమెరికాలో భారతీయ చిత్రానికి ఇంతవేగంగా టికెట్స్‌ అమ్ముడుపోవడం ఇదే తొలిసారి. ఈ విషయాన్ని తెలియజేస్తూ పుష్ప టీమ్‌ స్పెషల్‌ పోస్టర్‌ను సైతం రిలీజ్‌ చేసింది. దీంతో బన్నీ ఫ్యాన్స్‌ ఆనందానికి అవదులు లేకుండా పోతోంది. విడుదలకు ముందే ఈ స్థాయిలో రికార్డులు గల్లంతైతే రిలీజ్‌ తర్వాత పరిస్థితి ఇంకెలా ఉంటుందోనని ఫ్యాన్స్ లెక్కలు వేసుకుంటున్నారు.&nbsp; https://twitter.com/PushpaMovie/status/1854036371146695000 రాజమౌళి తరహాలో ప్రమోషన్స్‌! 'బాహుబలి-2', 'RRR' సినిమాలకు రాజమౌళి టీమ్‌ దేశవ్యాప్తంగా ప్రమోషన్స్ నిర్వహించిన సంగతి తెలిసిందే. ఇటీవల 'కల్కి 2898 ఏడీ' చిత్రానికి సైతం బుజ్జి వెహికల్‌తో దేశంలోని ప్రధాన నగరాల్లో ప్రమోట్ చేయించారు. ఇప్పుడు అదే ఫార్మూలాను పుష్ప టీమ్ (Pushpa 2 Record) కూడా ఉపయోగించనున్నట్లు తెలుస్తోంది. ప్రమోషన్స్‌ కోసం నెల రోజుల సమయాన్ని కూడా కేటాయించినట్లు సన్నిహిత వర్గాలు చెబుతున్నాయి. ఇందులో భాగంగా హైదరాబాద్‌, బెంగళూరు, ముంబయి, చెన్నై, కొచ్చి వంటి ప్రధాన నగరాల్లో 'పుష్ప 2' ప్రమోషన్ ఈవెంట్స్‌ నిర్వహించాలని మేకర్స్ భావిస్తున్నారట. బిహార్ రాజధాని పాట్నాలో సైతం ప్రమోషన్‌ ఈవెంట్‌ నిర్వహించాలని యోచిస్తున్నారట. బాలీవుడ్‌లోనూ ప్రమోషన్స్‌ చేసి నార్త్‌ ఆడియన్స్‌ను అట్రాక్ట్‌ చేసే యోచనలో పుష్ప టీమ్ ఉన్నట్లు తెలుస్తోంది.&nbsp; ఇంకా రెండు పాటలు పెండింగ్‌! పుష్ప 2 (Pushpa 2 Record) రిలీజ్‌కు ఇంకా నెల రోజుల సమయం మాత్రమే ఉంది. అయినప్పటికీ మూవీ షూటింగ్‌ ఇంకా పూర్తికాలేదని సమాచారం. ఇంకా రెండు పాటలు, ఓ సీన్ చిత్రీకరించాల్సి ఉందని చిత్ర వర్గాలు చెబుతున్నాయి. అయితే ఇందులో ఎంతో కీలకమైన ఐటెం సాంగ్ కూడా ఉంది. ఈ స్పెషల్ సాంగ్‌ కోసం చాలా మంది బాలీవుడ్‌ హీరోయిన్స్‌ పేర్లు వినిపించగా చివరకూ శ్రీలీలను ఫైనల్‌ చేసినట్లు సమాచారం. ఇవాళ్టి నుంచే ఈ సాంగ్‌ షూట్‌ మెుదలైనట్లు ఫిల్మ్‌ వర్గాల్లో టాక్‌ ఉంది. మరి ఈ షార్ట్‌ టైమ్‌లో ఐటెం సాంగ్‌తో పాటు మరో పాట, పెండింగ్‌ సీన్‌ను సుకుమార్‌ ఎలా ఫినిష్‌ చేస్తారన్నది ఆసక్తికరం. ఇదిలా ఉంటే డబ్బింగ్‌ పనులు అన్ని భాషల్లో ఏకకాలంలో జరుగుతున్నట్లు తెలుస్తోంది. బన్నీ కూడా తన పాత్రకు సంబంధించి ఫస్టాఫ్‌ డబ్బింగ్‌ను పూర్తిచేశాడట. మిగిలినది కూడా త్వరగా పూర్తిచేసేందుకు ప్రయత్నిస్తున్నాడట.&nbsp; నవంబర్‌ 15న ట్రైలర్‌ లాంచ్‌! ‘పుష్ప అంటే ఫ్లవర్‌ అనుకుంటివా.. ఫైరు’ అంటూ వచ్చిన పుష్ప ట్రైలర్‌ (Pushpa 2 Record) అప్పట్లో ఎంత ట్రెండ్‌ అయిందో అందరికీ తెలిసిందే. ఇప్పుడు అంతకుమించిన స్థాయిలో ట్రైలర్‌ కట్‌ను సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తోంది. మరో వారం, పది రోజుల్లోనే ట్రైలర్‌ను తీసుకొచ్చేలా కసరత్తులు చేస్తున్నట్లు సమాచారం. దేశంలోని ప్రధాన నగరాల్లో ట్రైలర్ విడుదల చేసేందుకు మేకర్స్‌ ప్లాన్‌ చేస్తున్నట్లు తెలిసింది. ఈనెల 15న ట్రైలర్‌ను విడుదల చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నట్లు టాలీవుడ్‌లో టాక్ వినిపిస్తోంది. సినిమా విడుదలకు కనీసం రెండు వారాల ముందు ట్రైలర్‌ విడుదల చేస్తే ప్రేక్షకుల్లో మరింత హైప్‌ను క్రియేట్‌ చేయోచ్చని మేకర్స్‌ భావిస్తున్నట్లు తెలిసింది.
    నవంబర్ 06 , 2024
    <strong>Pushpa 2 Trailer: బిహార్‌లోనే పుష్ప ట్రైలర్ రిలీజ్ ఎందుకంటే?</strong>
    Pushpa 2 Trailer: బిహార్‌లోనే పుష్ప ట్రైలర్ రిలీజ్ ఎందుకంటే?
    అల్లు అర్జున్‌ (Allu Arjun) హీరోగా సుకుమార్‌ (Sukumar) దర్శకత్వంలో రూపొందిన ‘పుష్ప 2’ (Pushpa 2)పై దేశవ్యాప్తంగా బజ్‌ ఉంది. డిసెంబర్‌ 5న వరల్డ్‌ వైడ్‌గా ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. విడుదల తేదీ దగ్గర పడుతుండటంతో ‘పుష్ప 2’ సంబంధించి రోజుకో అప్‌డేట్‌ నెట్టింట హల్‌చల్‌ చేస్తోంది. దీంతో ట్రైలర్‌ (Pushpa 2 Trailer) రిలీజ్‌ అప్‌డేట్‌ కోసం ఫ్యాన్స్ ఎంతగానో ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలోనే వారి నిరీక్షణనను పటాపంచలు చేస్తూ మేకర్స్ అదిరిపోయే అప్‌డేట్‌ తీసుకొచ్చారు. పుష్ప 2 ట్రైలర్ రిలీజ్‌పై ఓ స్పెషల్‌ పోస్టర్‌ ద్వారా స్పష్టత ఇచ్చారు.&nbsp; పాట్నాలో గ్రాండ్ రిలీజ్ దేశ విదేశాల్లో ఉన్న సినీ ప్రియులందరూ ఆసక్తిగా ఎదురుచూస్తోన్న చిత్రం ‘పుష్ప ది రూల్‌’ (Pushpa The Rule). మూవీ రిలీజ్‌కు నెల రోజులు కూడా లేకపోవడంతో ట్రైలర్ ఎప్పుడు వస్తుందా అని అందరూ ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలో ట్రైలర్ రిలీజ్‌పై మూవీ టీమ్‌ అదిరిపోయే అప్‌డేట్ ఇచ్చింది. నవంబర్‌ 17న సాయంత్రం 6.03 గంటలకు పాట్నాలో ట్రైలర్‌ (Pushpa 2 Trailer)ను విడుదల చేయనున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు బన్నీకి సంబంధించిన కొత్త పోస్టర్‌ను సైతం రిలీజ్‌ చేసింది. ఇందులో గన్‌ భుజాన పెట్టుకొని పుష్పగాడు ఎంతో అగ్రెసివ్‌గా కనిపించాడు. ఇది చూసిన సినీ లవర్స్ తెగ ఖుషీ అవుతున్నారు. పుష్ప 2 ట్రైలర్ దెబ్బకు సోషల్ మీడియా మోతమోగడం ఖాయమని అంటున్నారు.&nbsp; https://twitter.com/PushpaMovie/status/1855922382181134676 బిహార్‌లోనే ఎందుకంటే? తెలుగు స్టేట్స్‌తో పాటు నార్త్‌లో ఇన్ని రాష్టాలు ఉండాలుగా ‘పుష్ప 2’ టీమ్‌ ట్రైలర్‌ రిలీజ్‌కు బిహార్‌నే ఎంచుకోవడం వెనక ఓ బలమైన కారణమే ఉంది. 2021లో విడుదలైన ‘పుష్ప’ చిత్రం ఎవరూ ఊహించని విధంగా నార్త్‌లో ఘన విజయం సాధించింది. ముఖ్యంగా బిహార్‌ స్టేట్‌లో ‘పుష్ప’ సినిమాకు బ్రహ్మరథం పట్టారు. పుష్పగాడి మాస్ క్యారెక్టర్‌ను బిహార్ ఆడియన్స్ బాగా ఓన్‌ చేసుకున్నారు. అప్పట్లో బన్నీని ఇమిటేట్‌ చేస్తూ పెద్ద ఎత్తున రీల్స్ సైతం చేశారు. ఇటీవల ‘పుష్ప 2’ టైటిల్‌ సాంగ్‌ రిలీజవ్వగా దానిపైనా బిహారి యూత్‌ రీల్స్‌ చేసింది. బిహార్‌ సరిహద్దు రాష్ట్రం యూపీలోనూ ‘పుష్ప’కు మంచి ఆదరణ ఉంది. 2022 యూపీ ఎలక్షన్స్‌ సందర్భంగా 'పుష్ప'లోని శ్రీవల్లి సాంగ్‌ ప్రముఖంగా వినిపించింది. విపక్ష కాంగ్రెస్‌ పార్టీ శ్రీవల్లి ట్యూన్‌ను కాపీ చేసి 'తూ హై గజాబ్‌ యూపీ.. తేరి కసం యూపీ' అంటూ లిరిక్స్‌ మార్చి పాటను ప్రచారానికి వాడుకుంది. ఇలా చెప్పుకుంటే బిహార్‌, యూపీలో పుష్పగాడి క్రేజ్‌కు నిదర్శనమైన ఎన్నో ఘటనలు ఉన్నాయి. ప్రస్తుతం పాన్‌ ఇండియా మార్కెట్‌ను టార్గెట్‌ చేసిన ‘పుష్ప 2’ టీమ్ బిహార్‌ రాజధాని పాట్నాలో ట్రైలర్ రిలీజ్‌ చేయడం ద్వారా మంచి మైలేజ్‌ సాధించవచ్చని అంచనా వేస్తోంది. ‘కిస్సిక్‌’ శ్రీలీల అదుర్స్‌ స్టార్ హీరోయిన్ శ్రీలీల 'పుష్ప 2'లో ఐటెం సాంగ్‌ చేస్తున్న సంగతి తెలిసిందే. ఇటీవల సెట్‌లో బన్నీతో ఆమె ఉన్న పిక్‌ నెట్టింట వైరల్ అయ్యింది. ఇదిలా ఉంటే శ్రీలీల తమ ప్రాజెక్టులో భాగమైనట్లు 'పుష్ప 2' టీమ్ ఆదివారం (నవంబర్‌ 11) అధికారికంగా ప్రకటించింది. ఇందులో ఆమె స్పెషల్‌ సాంగ్‌ చేయనున్నట్లు తెలిపింది. ‘కిస్సిక్‌’ అంటూ సాగే ఈ పాట సాంగ్‌ ఆఫ్‌ ది ఇయర్‌ కానుందని పేర్కొంది. సినీ ప్రియులను ఇది తప్పక అలరిస్తుందని తెలిపింది. ‘ది డ్యాన్సింగ్‌ క్వీన్ శ్రీలీల’అంటూ ఈ పోస్టర్‌కు క్యాప్షన్‌ సైతం ఇచ్చింది. ప్రస్తుతం ఈ పాట చిత్రీకరణ జరుగుతోంది.&nbsp; https://twitter.com/PushpaMovie/status/1855559794985426988 డ్యాన్స్‌ అదిరిపోవాల్సిందే! ‘పుష్ప 2’ ఐటెం సాంగ్‌లో శ్రీలీల డ్యాన్స్ (Pushpa 2 Trailer) అదిరిపోతుందని చెప్పవచ్చు. ప్రస్తుత తరం కథానాయికల్లో డ్యాన్స్‌లో శ్రీలీలను కొట్టేవారే లేరనడంతో అతిశయోక్తి లేదు. ఈ భామ తన నటన కంటే డ్యాన్స్ పరంగానే ఎక్కువ మంది అభిమానులను సంపాదించుకుంది. రవితేజ 'ధమాకా' చిత్రంలో పల్సర్ బైక్‌ సాంగ్‌లో ఈ అమ్మడు ఏవిధంగా అదరగొట్టిందో అందరికీ తెలిసిందే. రీసెంట్‌గా మహేష్‌ బాబుతో 'కుర్చీని మడతపెట్టి' సాంగ్‌లో ఏకంగా తన స్టెప్పులతో విధ్వంసం సృష్టించింది. శ్రీలీలతో డ్యాన్స్ అంటే హేమా హేమీ డ్యాన్సర్లు సైతం కాస్త వెనక్కి తగ్గుతుంటారు. అటువంటి శ్రీలీలతో డ్యాన్స్‌కు కేరాఫ్‌గా నిలిచే బన్నీ జతకలిస్తే ఇక ఐటెం సాంగ్ ఏ స్థాయిలో ఉంటుందో అభిమానుల ఊహకే వదిలేయవచ్చు.&nbsp; ప్రమోషన్స్‌కు టీమిండియా! ‘పుష్ప 2’ (Pushpa 2) రిలీజ్‌కు నెల రోజులు కూడా లేకపోవడంతో ప్రమోషన్స్‌పై చిత్ర బృందం ఫోకస్‌ పెట్టినట్లు తెలుస్తోంది. నార్త్‌ ఇండియాలోని అన్ని ప్రధాన నగరాల్లో ఈవెంట్స్‌ (Pushpa 2 Trailer)ను ప్లాన్‌ చేస్తున్నారట. అక్కడ జరిగే ఈవెంట్స్‌కు టీమిండియా స్టార్‌ క్రికెటర్స్‌ సూర్యకుమార్‌ యాదవ్‌, రింకు సింగ్‌, అర్షదీప్‌ సింగ్‌ సహా పలువురు క్రికెటర్స్‌ను ఆహ్వానించనున్నట్లు సమాచారం. దీనిపై నెక్స్ట్‌వీక్‌లో అధికారిక ప్రకటన సైతం రానున్నట్లు చెబుతున్నారు. ఇదే నిజమైతే ‘పుష్ప 2’ కొత్త ట్రెండ్‌ను సృష్టించనున్నాయి. ఇప్పటివరకూ మూవీ ప్రమోషన్స్‌లో క్రికెటర్లు పాల్గొన్న సందర్భాలు లేవు. ‘పుష్ప 2’ ప్రమోషన్స్‌లో వారు గనుక భాగం అయితే ఇండియన్‌ మూవీ హిస్టరీలో ఇదొక కొత్త అధ్యాయం కానుంది.&nbsp;
    నవంబర్ 11 , 2024
    Pushpa 2 The Rule: పుష్ప2 నుంచి బిగ్ అప్‌డేట్.. ఆ బాలీవుడ్ బ్యూటీతో ఐటెం సాంగ్!
    Pushpa 2 The Rule: పుష్ప2 నుంచి బిగ్ అప్‌డేట్.. ఆ బాలీవుడ్ బ్యూటీతో ఐటెం సాంగ్!
    ఐకాన్‌ స్టార్‌ అల్లు అర్జున్‌ (Allu Arjun) హీరోగా సుకుమార్‌ (Sukumar) దర్శకత్వంలో వచ్చిన బ్లాక్‌ బాస్టర్‌ చిత్రం ‘పుష్ప’ (Pushpa). పాన్‌ ఇండియా స్థాయిలో విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురిపించింది. అంతేకాకుండా బన్నీని జాతీయ స్థాయి నటుడుగా నిలబెట్టింది. ఈ సినిమాకు గాను జాతీయ ఉత్తమ నటుడి పురస్కారాన్ని అల్లు అర్జున్‌ అందుకున్నారు. ఇదిలా ఉంటే ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించి సీక్వెల్‌ రూపొందుతోంది. ‘పుష్ప 2’ పేరుతో ఇది రాబోతోంది. టైటిల్‌ కింద ‘ది రూల్‌’ అని క్యాప్షన్‌ ఇచ్చారు. అయితే ఈ సీక్వెల్‌కు సంబంధించి క్రేజీ అప్‌డేట్‌ బయటకొచ్చింది. ప్రస్తుతం ఆ వార్త సోషల్‌ మీడియాను షేక్ చేస్తోంది.&nbsp; బాలీవుడ్‌ బ్యూటీతో ఐటెం సాంగ్‌ ‘పుష్ప’ మూవీ పాటలు ఎంత పెద్ద హిట్‌ అయ్యాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ముఖ్యంగా సినిమాలోని ‘ఊ అంటావా మావా.. ఉ.. ఉ.. అంటావా’ అనే ఐటెం సాంగ్‌ దేశవ్యాప్తంగా మార్మోగింది. ఈ పాటలో సమంత తన అందంతో మెస్మరైజ్‌ చేసింది. బన్నీ-సామ్‌ కలిసి వేసిన స్టెప్స్‌ యువతరాన్ని ఉర్రూతలూగించాయి. దీంతో ‘పుష్ప2’ లోనూ ఆ తరహా ఐటెం సాంగ్ ఉండాలని డైరెక్టర్‌ సుకుమార్‌ ప్లాన్‌ చేస్తున్నారు. ఈ పాట కోసం ఇప్పటికే ఎంతో మంది హీరోయిన్‌ల పేర్లు బయటకు వచ్చినప్పటికి చివరకు ఈ అవకాశం బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దిశ పటానీ (Disha Patani)కి దక్కింది. అంతేకాదు ఈ వారంలోనే దిశాతో ఐటమ్‌సాంగ్‌ చిత్రీకరించనున్నట్లు సమాచారం.&nbsp; శరవేగంగా షూటింగ్‌ ఆగస్టు 15న 'పుష్ప 2'ను రిలీజ్‌ చేయనున్నట్లు మేకర్స్ ఇప్పటికే ప్రకటించారు. అందుకు అనుగుణంగా శరవేగంగా షూటింగ్‌ జరుపుతున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్‌ 'రామోజీ ఫిల్మ్‌ సిటీ'లో చురుగ్గా సాగుతున్నట్లు సమాచారం. ఇదిలా ఉంటే నిన్న (ఫిబ్రవరి 12) ‘పుష్ప2’ హీరోయిన్‌ రష్మిక మందన్న సెట్‌లో డైరెక్టర్‌ సుకుమార్‌ను క్యాప్చర్‌ చేసింది. ఓ సింహం బొమ్మపై సుకుమార్ నవ్వుతూ కనిపించారు. ఈ ఫొటోను షేర్‌ చేసిన చిత్ర యూనిట్‌.. శ్రీవల్లి (రష్మిక) ఈ ఫోటో తీసినట్లు స్పష్టం చేశారు. చకా చకా షూటింగ్ పనులు జరుగుతున్నట్లు చెప్పారు.&nbsp; https://twitter.com/PushpaMovie/status/1756931867146907757? ఒకే ఒక్క మార్పు పుష్ప చిత్రం సౌత్‌లో కంటే.. నార్త్‌లోనే ఎక్కువ అభిమానుల్ని సంపాదించుకుంది. దాంతో ‘పుష్ప 2’ పై విప‌రీత‌మైన అంచ‌నాలు పెరిగాయి. పెరిగిన అంచ‌నాల్ని దృష్టిలో ఉంచుకొని, స్క్రిప్టు ప‌రంగా సుకుమార్ అన్ని ర‌కాల జాగ్ర‌త్త‌లూ తీసుకున్నారు. ఈ క్రమంలోనే ‘పుష్ప 2’లో కొత్త స్టార్లు ద‌ర్శ‌న‌మిస్తార‌ని గత కొంత కాలం నుంచి ప్రచారం జరుగుతోంది. అయితే అందులో ఏమాత్రం నిజం లేదని సమాచారం. ‘పుష్ప 1’లో ఉన్న‌వారే.. పార్ట్ 2లోనూ క‌నిపిస్తారట. ఒక్క జ‌గ‌ప‌తిబాబు పాత్ర మాత్రమే కొత్తగా ఎంట్రీ ఇవ్వనున్నట్లు తెలిసింది. కాగా, ఈ చిత్రంలో బన్నీతో పాటు సునీల్‌, అనసూయ, ఫహద్‌ ఫాసిల్‌ ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు.&nbsp; పుష్ప2 డైలాగ్ లీక్‌..! ఇక పుష్ప2 నుంచి రిలీజైన ఓ పోస్టర్‌లో బన్నీ.. గంగమ్మ జాతర గెటప్‌లో కనిపిస్తాడు. ఈ పోస్టర్‌కు ప్రేక్షకుల నుంచి భారీ స్పందన వచ్చింది. ఇకపోతే తాజాగా ఈ మూవీ నుంచి ఓ డైలాగ్ లీకైదంటూ నెట్టింట వార్తలు వచ్చాయి. మంగళం శీను (సునీల్‌)కు పుష్ప(బన్నీ) వార్నింగ్ ఇచ్చే క్రమంలో ఈ డైలాగ్‌ ఉంటుందని అంటున్నారు. అదేంటంటే.. ‘చూడు శీనప్ప పుష్ప గుండెల్లో గుండు దింపాలంటే గన్ను ఒకటే పట్టుకుంటే సరిపోదప్ప దాన్ని పట్టుకున్నోడి గుండె కూడా గన్నులా ఉండాలి’ అని సునీల్‌తో బన్నీ అంటాడట. అయితే ఈ ప్రచారంపై చిత్ర యూనిట్‌ ఎలాంటి క్లారిటీ ఇవ్వలేదు.&nbsp; లీకుల బెడద..! 'పుష్ప 2' చిత్రాన్ని లీకుల బెడద వెంటాడుతోంది. ఇటీవల షూటింగ్ స్పాట్‌ నుంచి అల్లు అర్జున్‌ చీరలో ఉన్న ఫొటో లీక్‌ అయ్యింది. దీంతో సుకుమార్‌ యూనిట్‌పై సీరియస్ అయ్యాడట. తాజాగా షూటింగ్‌ స్పాట్‌ నుంచి రావు రమేష్‌ ‘ప్రజా చైతన్య పార్టీ’ అనే ఫ్లెక్సీలు కూడా బయటకు వచ్చాయి. ఈ లీకులను ఆపేందుకు సుకుమార్‌ స్వయంగా రంగంలోకి దిగినట్లు తెలుస్తోంది. మున్ముందు మూవీకి సంబంధించిన మరిన్ని ముఖ్యమైన విషయాలు లీక్‌ కాకుండా అడ్డుకోవాలని యూనిట్‌ను హెచ్చరించినట్లు సమాచారం.&nbsp; https://twitter.com/SrikanthAnu2/status/1751986145318314415
    ఫిబ్రవరి 13 , 2024
    <strong>Pushpa 2 Item Song: సమంతతో పోలిస్తే శ్రీలీలకు అన్యాయం? మరీ అంత తేడానా?&nbsp;</strong>
    Pushpa 2 Item Song: సమంతతో పోలిస్తే శ్రీలీలకు అన్యాయం? మరీ అంత తేడానా?&nbsp;
    ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ (Allu Arjun), క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ (Director Sukumar) కాంబినేషన్‌లో వచ్చిన ‘పుష్ప’ చిత్రం ఎంతపెద్ద హిట్ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ముఖ్యంగా ఇందులో సమంత చేసిన ‘ఊ అంటావా ఊఊ అంటావా’ ఐటెం సాంగ్‌ యావత్‌ దేశాన్ని ఉర్రూతలూగించింది. ఈ నేపథ్యంలో ప్రస్తుతం తెరకెక్కుతున్న ‘పుష్ప 2’ ఈ తరహా ఐటెంగ్‌ సాంగ్‌ (Pushpa 2 Item Song)ను సుకుమార్‌ ఏర్పాటు చేశాడు. ఈసారి సమంత ప్లేసులో శ్రీలీల ఈ స్పెషల్‌ సాంగ్‌ చేస్తోంది. ఇటీవల సాంగ్‌ షూటింగ్‌ సెట్‌ నుంచి శ్రీలీల ఫొటోలు సైతం బయటకొచ్చాయి. ఇదిలాఉంటే శ్రీలీల పారితోషికంకు సంబంధించి ఓ వార్త బయటకొచ్చింది. దీంతో ఆమెకు అన్యాయం జరిగిందన్న వాదనలు ఊపందుకున్నాయి. శ్రీలీల పారితోషికం ఎంతంటే? అల్లుఅర్జున్‌ - సుకుమార్‌ కాంబోలో రూపొందుతున్న ‘పుష్ప 2’ చిత్రం డిసెంబర్‌ 5న వరల్డ్ వైడ్‌గా రిలీజ్‌ కాబోతోంది. ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్‌ దాదాపు రూ.500 కోట్ల బడ్జెట్‌తో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఖర్చు విషయంలో ఏమాత్రం వెనకాడకుండా సుకుమార్‌గా తమవంతు తోడ్పాటు అందిస్తున్నారు. ఈ క్రమంలో ఐటెం సాంగ్‌ (Pushpa 2 Item Song)లో చేసిన హీరోయిన్ శ్రీలీలకు భారీ మెుత్తంలో పారితోషికం ముట్టచెప్పినట్లు నెట్టింట టాక్ వినిపిస్తోంది. ‘కిస్సిక్కి’ అంటూ సాగే ఈ పాట కోసం ఆమె ఏకంగా రూ.2 కోట్ల రెమ్యూనరేషన్‌ తీసుకుందని ఫిల్మ్‌ వర్గాల్లో చర్చ జరుగుతోంది. సెట్‌, హీరోయిన్‌ పారితోషికం ఇతర మొత్తం కలిపి రూ.5 కోట్లు ఖర్చు అయినట్లు అంచనా వేస్తున్నాయి.&nbsp; సమంతతో పోలిస్తే అన్యాయం! 2021లో వచ్చిన ‘పుష్ప’ సినిమాలో సమంత ఐటెం సాంగ్ చేసింది. ఇందుకు గాను సామ్ అప్పట్లోనే రూ.5 కోట్ల రెమ్యూనరేషన్ అందుకున్నట్లు వార్తలు వచ్చాయి. అయితే తాజాగా శ్రీలీలకు రూ.2 కోట్ల పారితోషికం ఇవ్వడంపై ఆమె అభిమానులు పెదవి విరుస్తున్నారు. శ్రీలీలకు అన్యాయం జరిగిందంటూ సోషల్‌ మీడియాలో పోస్టులు చేస్తున్నారు. సమంతకు ఇచ్చిన దానిలో సగం కూడా ఇవ్వలేదని అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. శ్రీలీలకు ఏం తక్కువ అని ప్రశ్నిస్తున్నారు. అయితే దీనిని ఫిల్మ్‌ వర్గాలు ఖండిస్తున్నాయి. శ్రీలీలకు ఎలాంటి అన్యాయం జరగలేదని స్పష్టం చేస్తున్నాయి. ప్రస్తుతం శ్రీలీల మూడు గంటల సినిమా చేస్తే రూ.4-5 కోట్ల పారితోషికం తీసుకుంటున్నట్లు సమాచారం. అయితే ‘పుష్ప 2’లో 3 నిమిషాల పాటకే ఆమెకు రూ. 2 కోట్లు ఇస్తున్నారని చెబుతున్నారు. ఈ లెక్కన చూస్తే ఆమెకు తన మార్కెట్‌ విలువ కంటే ఎక్కువ రెమ్యూనరేషన్‌ను అందిందని పేర్కొంటున్నారు.&nbsp; శ్రీలీల.. బన్నీ ఛాయిస్‌! పుష్ప 2 ఐటెం సాంగ్‌ (Pushpa 2 Item Song)కు శ్రీలీలను ఎంచుకోవాలన్నది డైరెక్టర్‌ సుకుమార్ ఆలోచన కాదని సమాచారం. ఐకాన్‌ స్టార్‌ అల్లు అర్జునే శ్రీలీలను సజెస్ట్ చేసినట్లు తెలుస్తోంది. బన్నీ ఇంతకుముందే శ్రీలీలతో కలిసి ప్రముఖ ఓటీటీ ‘ఆహా’ కోసం ఒక యాడ్ చేశాడు. వీరిద్దరి కెమెస్ట్రీ బాగుందంటూ అప్పట్లోనే సోషల్‌ మీడియాలో కామెంట్స్‌ వచ్చాయి. మరోవైపు ఈ జనరేషన్‌ హీరోయిన్లలో శ్రీలీల బెస్ట్ డ్యాన్సర్ కీర్తింప బడుతోంది. ఈ నేపథ్యంలో బన్నీ-శ్రీలీల ఒకే వేదికపై ఆడి పాడితే ఆడియన్స్‌లో పూనకాలు రావడం పక్కా. ఇవన్నీ ఆలోచించే శ్రీలీలపై బన్నీ మెుగ్గు చూపినట్లు సమాచారం. అంతకుముందు బాలీవుడ్‌ స్టార్ హీరోయిన్స్‌ శ్రద్ధా కపూర్‌, దిశా పటానీ, త్రిప్తి దిమ్రి పేర్లు ఈ ఐటెం సాంగ్‌ పరిశీలనలోకి వచ్చినట్లు వార్తలు వచ్చాయి. పాట్నాలో ట్రైలర్‌ రిలీజ్ దేశ విదేశాల్లో ఉన్న సినీ ప్రియులందరూ ఆసక్తిగా ఎదురుచూస్తోన్న చిత్రం ‘పుష్ప ది రూల్‌’ (Pushpa The Rule). మూవీ రిలీజ్‌ దగ్గరపడుతుండటంతో ట్రైలర్ రిలీజ్‌పై మూవీ టీమ్‌ అదిరిపోయే అప్‌డేట్ ఇచ్చింది. నవంబర్‌ 17న సాయంత్రం 6.03 గంటలకు పాట్నాలో ట్రైలర్‌ (Pushpa 2 Trailer)ను విడుదల చేయనున్నట్లు రీసెంట్‌గా ప్రకటించింది. ఈ మేరకు బన్నీకి సంబంధించిన కొత్త పోస్టర్‌ను సైతం రిలీజ్‌ చేసింది. ఇందులో గన్‌ భుజాన పెట్టుకొని పుష్పగాడు ఎంతో అగ్రెసివ్‌గా కనిపించాడు. ఇది చూసిన సినీ లవర్స్ తెగ ఖుషీ అవుతున్నారు. పుష్ప 2 ట్రైలర్ దెబ్బకు సోషల్ మీడియా మోతమోగడం ఖాయమని అంటున్నారు.&nbsp; https://twitter.com/PushpaMovie/status/1855922382181134676
    నవంబర్ 13 , 2024

    @2021 KTree