• TFIDB EN
  • అయేషా ఖాన్
    అయేషా ఖాన్‌.. టాలీవుడ్‌ యంగ్ హీరోయిన్. తెలుగులో వచ్చిన ముఖచిత్రం (2022) ద్వారా తెరంగేట్రం చేసింది. సినిమాల్లోకి రాకముందు ఆమె మోడల్‌, సోషల్‌ మీడియా ఇన్‌ఫ్లెయన్సర్‌గా గుర్తింపు పొందింది. హిందీ బిగ్‌బాస్‌లో పాల్గొని చాలా ఫేమస్‌ అయ్యింది. తద్వారా హిందీలో 'కసౌతి జిందగీ కే', 'బల్‌వీర్‌ రిటర్న్స్‌' సీరియల్స్‌లో చేసి అందరి దృష్టిని ఆకర్షించింది. టాలీవుడ్‌లో ఆమె నటించిన ‘గ్యాంగ్స్‌ ఆఫ్‌ గోదావరి’, ‘లక్కీ భాస్కర్‌’ మంచి విజయం సాధించాయి.

    అయేషా ఖాన్ వయసు ఎంత?

    22 సంవత్సరాలు

    అయేషా ఖాన్ ఎత్తు ఎంత?

    5' 9'' (175cm)

    అయేషా ఖాన్ అభిరుచులు ఏంటి?

    ట్రావెల్‌, గిటార్, మెుబైల్‌ గేమ్స్‌, డ్యాన్సింగ్

    అయేషా ఖాన్ ఏం చదువుకున్నారు?

    ఈ భామ ఇంటర్‌ వరకూ చదువుకుంది.

    అయేషా ఖాన్ సినిమాల్లోకి రాకముందు ఏం చేశారు?

    కెరీర్‌ ప్రారంభంలో అయేషా మోడల్‌గా చేసింది. సోషల్‌ మీడియా ఇన్‌ఫ్లూయెన్సర్‌గానూ ఆమెకు గుర్తింపు ఉంది.

    అయేషా ఖాన్ Hot Pics

    Images

    Ayesha Khan Hot Looks

    Images

    Ayesha Khan Hot Images

    అయేషా ఖాన్ In Saree

    Images

    Ayesha Khan Images in Saree

    Images

    Ayesha Khan In Saree

    అయేషా ఖాన్ In Half Saree

    Images

    Ayesha Khan In Half Saree

    Images

    Ayesha Khan Images in Half Saree

    అయేషా ఖాన్ In Ethnic Dress

    Images

    Ayesha Khan Hot Images

    Images

    Ayesha Khan Latest Images

    అయేషా ఖాన్ అన్‌ కేటగిరైజ్డ్ ఇమేజెస్‌

    Images

    Ayesha Khan

    Images

    Ayesha Khan

    Ayesha Khan: ‘ఓం భీమ్‌ బుష్‌’ భామ అయేషా ఖాన్‌ గురించి ఈ సీక్రెట్స్‌ తెలుసా?
    Ayesha Khan: ‘ఓం భీమ్‌ బుష్‌’ భామ అయేషా ఖాన్‌ గురించి ఈ సీక్రెట్స్‌ తెలుసా? యంగ్‌ బ్యూటీ అయేషా ఖాన్‌.. తాజాగా విడుదలైన 'ఓం భీమ్‌ బుష్‌' సినిమాతో అందరి దృష్టిని ఆకర్షించింది. ఇందులో హాస్యనటుడు ప్రియదర్శికి జోడీగా నటించి తన గ్లామర్‌తో తెలుగు ఆడియన్స్‌ను కట్టిపడేసింది. అటు సోషల్‌ మీడియాలోనూ ఈ భామ తన అందచందాలను ఆరబోస్తుండటంతో టాలీవుడ్‌కు మరో గ్లామర్‌ హీరోయిన్ దొరికేసిందని నెటిజన్లు కామెంట్‌ చేస్తున్నారు. అయేషా ఖాన్‌ (Ayesha Khan) పేరును నెట్టింట ట్రెండింగ్ చేస్తున్నారు. ఇంతకీ ఈ అయేషాఖాన్ ఎవరు? ఆమె చేసిన చిత్రాలు ఎన్ని? అయేషా ఇష్టా ఇష్టాలు ఏంటి? ఈ ప్రత్యేక కథనంలో తెలుసుకుందాం. అయేషా ఖాన్‌‌ ఎవరు? టాలీవుడ్‌కు చెందిన యువ నటి. హీరోయిన్‌గా ఇప్పుడిప్పుడే ఆమె ఎదుగుతోంది. అయేషా ఖాన్‌‌ ఎక్కడ పుట్టింది? మహారాష్ట్రలోని ముంబయిలో అయేషా పుట్టింది. అయేషా ఖాన్‌‌ పుట్టిన తేదీ? 13 సెప్టెంబర్‌, 1992 అయేషా ఖాన్‌‌ తల్లిదండ్రులు ఎవరు? అయేషా మధ్యతరగతి కుటుంబం నుంచి వచ్చింది. ఆమె తల్లిదండ్రులు షాదబ్‌ ఖాన్‌ & Mrs ఖాన్‌  అయేషా ఖాన్‌‌కు సోదరులు ఉన్నారా? ఈ బ్యూటీకి ఇద్దరు సోదరులు ఉన్నారు. అన్న షాదబ్‌ ఖాన్‌ ఓ ప్రైవేటు కంపెనీ పని చేస్తున్నాడు. తమ్ముడు షాబజ్‌ ఖాన్‌ నేవీలో ఉద్యోగం చేస్తున్నాడు. అయేషా ఖాన్‌ ఎత్తు ఎంత? 162 సెం.మీ అయేషా ఖాన్‌‌ ఏం చదివారు? ఈ భామ ఇంటర్‌ వరకూ చదువుకుంది.  అయేషా ఖాన్‌‌ ఎక్కడ చదివారు? ఈ బ్యూటీ విద్యాభ్యాసం అంతా ముంబయిలోనే జరిగింది. అయేషా ఖాన్‌‌ కెరీర్‌ ఎలా మెుదలైంది? కెరీర్‌ ప్రారంభంలో అయేషా మోడల్‌గా చేసింది. సోషల్‌ మీడియా ఇన్‌ఫ్లూయెన్సర్‌గానూ ఆమెకు గుర్తింపు ఉంది. అయేషా ఖాన్‌‌ కెరీర్‌ను మలుపు తిప్పిన ఘటన? హిందీలో 'బిగ్‌ బాస్ 17' సీజన్‌లో పాల్గొనడం అయేషా ఖాన్‌ కెరీర్‌ను మలుపు తిప్పింది. ఈ రియాలిటీ షో ద్వారా అయేషా అందరి దృష్టిలో పడింది.  అయేషా ఖాన్‌ నటనా ప్రవేశం ఎలా జరిగింది? హిందీలో స్టార్‌ప్లస్‌ ఛానెల్‌లో వచ్చిన 'కసౌతి జిందగీ కే' సీరియల్‌తో అయేషా ఖాన్‌ తన నటనా జీవితాన్ని ప్రారంభించింది. ఆ తర్వాత సోనీలో 'బల్‌వీర్‌ రిటర్న్స్‌' అనే సీరియల్‌లోనూ కనిపించింది.  అయేషా ఖాన్‌ తొలి చిత్రం? తెలుగులో వచ్చిన ముఖచిత్రం (2022) ద్వారా ఆమె తెరంగేట్రం చేసింది.  అయేషా ఖాన్‌ లేటెస్ట్‌ చిత్రం? అయేషా నటించిన తాజా చిత్రం ‘ఓం భీమ్‌ బుష్‌’. ఇది ఆమెకు రెండో సినిమా. ఇందులో రత్తాలు పాత్రలో అయేషా గ్లామర్‌ షో చేసింది.  అయేషా ఖాన్‌ ఫ్యూచర్‌ ప్రాజెక్ట్స్‌? ప్రస్తుతం అయేషా.. ‘గ్యాంగ్స్‌ ఆఫ్‌ గోదావరి’, ‘లక్కీ భాస్కర్‌’ చిత్రాల్లో నటిస్తోంది. ఈ సినిమాలు త్వరలోనే రిలీజ్ కానున్నాయి.  అయేషా ఖాన్‌ ఇష్టమైన ఆహారం? నాన్‌ వెజ్‌ అంటే ఈ భామకు చాలా ఇష్టం. చికెన్‌, మటన్, ఫిష్ ఇలా ఏదైనా ఇష్టంగా తింటుందట.  అయేషా ఖాన్‌ ఫేవరేట్‌ నటుడు? ఈ భామకు అక్షయ్‌ కుమార్‌ నటన అంటే చాలా ఇష్టమట. అయేషా ఖాన్‌ ఫేవరేట్‌ హీరోయిన్‌? ప్రియాంక చోప్రా తన ఫేవరేట్ అని అయేషా ఓ సందర్భంలో తెలిపింది.  అయేషా ఖాన్‌ ఇష్టమైన కలర్‌? నలుపు, తెలుపు అయేషా ఖాన్‌ ఫేవరేట్‌ రియాలిటీ షో? బిగ్‌బాస్‌ అయేషా ఖాన్‌కు బాయ్ ఫ్రెండ్ ఉన్నాడా? మునావర్‌ ఫారుఖీతో ఆమె రిలేషన్‌లో ఉన్నట్లు రూమర్స్ ఉన్నాయి. దీనిపై ఆమె ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు.  అయేషా ఖాన్‌ ఇన్‌స్టాగ్రామ్‌ ఐడీ? https://www.instagram.com/ayeshaakhan_official/?hl=en
    మార్చి 23 , 2024
    ‘ముఖచిత్రం’తో ఎంట్రీ ఇచ్చిన అయేషా ఖాన్ అందాల విందు]నటుడు రాహుల్ రామకృష్ణను, రచయిత సందీప్ రాజ్‌ని అయేషా ఖాన్ ఫాలో అవుతోంది. మరికొంత మంది టాలీవుడ్, బాలీవుడ్ తారలను అనుసరిస్తోంది.
    ఫిబ్రవరి 13 , 2023
    Manamey Movie Review: శర్వానంద్‌, కృతి శెట్టి వరుస ఫెయిల్యూర్స్‌కు ‘మనమే’ చెక్‌ పెట్టిందా? నటీనటులు : శర్వానంద్‌, కృతి శెట్టి, సీరత్ కపూర్‌, అయేషా ఖాన్‌, రాహుల్‌, రామకృష్ణ, రాహుల్‌ రవీంద్రన్‌, వెన్నెల కిషోర్‌ తదితరులు రచన, దర్శకత్వం : శ్రీరామ్‌ ఆదిత్య సంగీతం : హీషం అబ్దుల్‌ వహాబ్‌ సినిమాటోగ్రాఫర్‌ : విష్ణు శర్మ నిర్మాతలు : వివేక్‌ కుచిబొట్ల, కృతి ప్రసాద్‌ విడుదల తేదీ: 07 జూన్‌, 2024 యంగ్‌ హీరో శర్వానంద్‌ చేసిన చిత్రాలకు టాలీవుడ్‌లో ప్రత్యేకంగా నిలుస్తాయి. పక్కింటి అబ్బాయిలా కనిపించే చిత్రాల్లో నటించి చాలా సార్లు ఆడియన్స్‌ను మెప్పించాడు. ఇప్పుడు కూడా అలాంటి కథతోనే శర్వానంద్‌ ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. శర్వానంద్‌, హీరోయిన్‌ కృతిశెట్టి జంటగా నటించిన లేటెస్ట్‌ చిత్రం ‘మనమే’ (Manamey). శ్రీరామ్‌ ఆదిత్య దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రంలో మాస్టర్‌ విక్రమ్‌ ఆదిత్య ముఖ్య పాత్ర పోషించారు. జూన్‌ 7న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం ఎలా ఉంది? ఎంతో కాలంగా హిట్‌ కోసం ఎదురుచూస్తున్న శర్వానంద్‌కు విజయాన్ని అందించిందా? ఈ రివ్యూలో చూద్దాం.  కథేంటి విక్రమ్ (శర్వానంద్) పని పాట లేకుండా తాగుతూ తిరుగుతుంటాడు. కనిపించిన అమ్మాయిని ఫ్లర్ట్‌ చేస్తూ ప్లే బాయ్‌గా వ్యవహరిస్తుంటాడు. ఈ క్రమంలో ఓ రోజు విక్రమ్‌ బెస్ట్‌ ఫ్రెండ్‌ అనురాగ్‌ (త్రిగుణ్‌), అతని భార్య శాంతి ప్రమాదంలో చనిపోతారు. దీంతో అనురాగ్‌ కొడుకు ఖుషీ (మాస్టర్‌ విక్రమ్‌ ఆదిత్య)ని పెంచాల్సిన బాధ్యత విక్రమ్‌, సుభద్ర (కృతిశెట్టి)లపై పడుతుంది. వారిద్దరు పిల్లాడిని ఎలా పెంచారు? అసలు సుభద్ర ఎవరు? ఖుషీతో ఆమెకున్న సంబంధం ఏంటి? ఖుషీని పెంచే క్రమంలో సుభద్ర - విక్రమ్‌ ఎలా దగ్గరయ్యారు? అప్పటికే పెళ్లి నిశ్చయమైన సుభద్ర.. విక్రమ్‌తో రిలేషన్‌కు ఒప్పుకుందా? లేదా? అన్నది కథ.  ఎవరెలా చేశారంటే నటుడు శర్వానంద్‌.. విక్రమ్‌ పాత్రలో చాలా సెటిల్డ్‌గా నటించాడు. ఫుల్‌ ఎనర్జీతో కనిపించి ఆకట్టున్నాడు. కామెడీ, లవ్‌, ఎమోషన్‌తూ కూడిన సన్నివేశాల్లో తనదైన మార్క్‌తో అలరించాడు. హీరోయిన్‌ కృతి శెట్టికి ఇందులో ప్రాధాన్యం ఉన్న పాత్రనే లభించింది. శర్వానంద్‌ - కృతిశెట్టి కెమెస్ట్రీ ఆకట్టుకుంది. అటు మాస్టర్‌ విక్రమ్‌ ఆదిత్య.. ఖుషీ పాత్రలో ఆకట్టుకున్నాడు. ఈ సినిమాలో ఆ బాలుడి పాత్రే ఎంతో కీలకం. ఇక రాజ్‌ కందుకూరి, త్రిగుణ్‌ పాత్రలు కథకు ఎంతో బలాన్ని అందించాయి. వెన్నెల కిషోర్ తనదైన కామెడీ టైమింగ్‌తో నవ్వించాడు. విలన్‌ షేడ్స్‌ ఉన్న పాత్రలో రాహుల్‌ రవీంద్రన్‌ మెప్పించాడు. సచిన్‌ ఖేదెకర్‌, సీత, ముఖేష్‌ రిషి, తులసి, సీరత్‌ కపూర్‌ తమదైన నటనతో ఆకట్టుకున్నారు. డైరెక్షన్‌ ఎలా ఉందంటే  తల్లిదండ్రులు - పిల్లల మధ్య బాండింగ్‌ ఎలా ఉండాలన్న కాన్సెప్ట్‌తో దర్శకుడు శ్రీరామ్‌ ఆదిత్య 'మనమే' సినిమాను తెరకెక్కించారు. ఫీల్ గుడ్ ఎంటర్‌టైనర్‌గా ఆడియన్స్‌ను ఆకట్టుకునే ప్రయత్నంలో కొద్దిమేర సక్సెస్‌ అయ్యారు. జాలీగా తిరిగే హీరో.. ఫ్రెండ్‌ కొడుకు బాధ్యతను మోయాల్సి రావడం, ఇందుకు హీరోయిన్‌ సహకరించడం, వాటి తాలుకా వచ్చే సన్నివేశాలతో ఫస్ట్‌ హాఫ్‌ ఓ మాదిరిగా గడిచిపోయింది. ఇక సెకండాఫ్‌కు వచ్చేసరికి దర్శకుడు కథ నుంచి పూర్తిగా బయటకు వచ్చేసినట్లు అనిపిస్తుంది. కథతో సంబంధం లేని సన్నివేశాలు తెరపై జరుగుతుండటం కన్ఫ్యూజన్‌ను క్రియేట్ చేస్తాయి. ఇక క్లైమాక్స్‌ను మంచి ఎమోషనల్‌ సీన్స్‌తో ముగించడం సినిమాకు ప్లస్‌ అయ్యింది. అయితే విలన్‌ ట్రాక్‌ను ఇంకాస్త బెటర్‌గా రాసుకుంటే బాగుండేది. సినిమాలో చాలా చోట్ల ఎమోషనల్‌ మిస్ అయ్యింది. మెుత్తంగా దర్శకుడు శ్రీరామ్ ఆదిత్య అనుకున్న పాయింట్ బాగానే ఉంది కానీ దాన్ని తెరకెక్కించే క్రమంలోనే కాస్త తడబడ్డాడు.  టెక్నికల్‌గా  టెక్నికల్ విషయాలకొస్తే.. సినిమాటోగ్రఫీ కలర్‌ఫుల్‌గా ఉంది. లండన్‌ లొకేషన్స్‌ని బాగానే క్యాప్చర్ చేశారు. పాటలు పెద్దగా గుర్తుండవు గానీ బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ మాత్రం మూవీకి తగ్గట్లు ఉంది. ఎడిటర్‌ తన కత్తెరకు ఇంకాస్త పని పెట్టి ఉంటే బాగుండేది. నిర్మాతలు పెట్టిన ఖర్చు ప్రతి ఫ్రేమ్‌లోనూ కనిపిస్తుంది. ప్లస్‌ పాయింట్స్‌ శర్వానంద్‌, మాస్టర్‌ విక్రమ్‌ ఆదిత్య నటనఎమోషనల్‌ సీన్స్‌సినిమాటోగ్రఫీ మైనస్‌ పాయింట్స్‌ సాగదీత సీన్స్‌విలన్ ట్రాక్‌ఎడిటింగ్‌ Telugu.yousay.tv Rating : 3/5  https://telugu.yousay.tv/do-you-know-these-top-secrets-about-kriti-shetty.html
    జూన్ 07 , 2024
    Om Bheem Bush Review: కడుపుబ్బా నవ్వించిన ‘ఓం భీమ్‌ బుష్‌’.. మరి సినిమా హిట్టా? ఫట్టా? న‌టీనటులు: శ్రీవిష్ణు, ప్రియదర్శి, రాహుల్ రామకృష్ణ, ప్రీతి ముకుందన్, అయేషా ఖాన్, శ్రీకాంత్ అయ్యంగార్, ఆదిత్య మీనన్, రచ్చ రవి తదితరులు రచన, దర్శకత్వం: శ్రీ హర్ష కొనుగంటి ఛాయాగ్ర‌హ‌ణం: రాజ్ తోట సంగీతం: సన్నీ MR ఎడిటర్‌ : విజయ్ వర్ధన్ నిర్మాతలు: వి సెల్యులాయిడ్, సునీల్ బలుసు స‌మ‌ర్ప‌ణ‌: యు.వి.క్రియేష‌న్స్‌ విడుద‌ల‌ తేదీ: 22-03-2024 శ్రీవిష్ణు (Sree Vishnu), ప్రియదర్శి (Priyadarsi), రాహుల్ రామకృష్ణ (Rahul Ramakrishna) ప్రధాన పాత్రల్లో చేసిన తాజా చిత్రం ‘ఓం భీమ్ బుష్‌’ (Om Bheem Bush Review). శ్రీహర్ష కొనుగంటి దర్శకత్వంలో కామెడీ ఎంటర్‌టైనర్‌గా రూపొందిన ఈ చిత్రం ఎన్నో అంచనాల మధ్య ప్రేక్షకుల ముందుకు వచ్చింది మరి ఈ చిత్రం ప్రేక్షకులను మెప్పించిందా? వీరు ముగ్గురూ కలిసి చేసిన హంగామా ఏంటి? ఈ రివ్యూలో తెలుసుకుందాం.  కథేంటి క్రిష్ (శ్రీవిష్ణు), వినయ్ (ప్రియదర్శి), మాధవ్ (రాహుల్ రామకృష్ణ) మంచి స్నేహితులు. జీవితంపై శ్రద్ద లేకుండా సిల్లీ పనులు చేస్తూ కాలాన్ని గడుపుతుంటారు. ఈ క్రమంలో చోటుచేసుకున్న కొన్ని నాటకీయ పరిణామాల మధ్య ఈ ముగ్గురు భైరవపురం అనే గ్రామంలో అడుగుపెడతారు. మరి ఈ ముగ్గురు సైంటిస్టులుగా ఎలా మారారు? అక్కడి పరిస్థితులు వీరిని ఎలా మార్చాయి? ఆ ఊరిలోని సంపంగి దెయ్యం ఉన్న కోటలో ముగ్గురు ఎందుకు అడుగుపెట్టారు? ఆ దెయ్యానికి క్రిష్‌కి ఉన్న సంబంధం ఏంటి? కోటలోకి అడుగు పెట్టిన ఈ బిగ్‌బ్యాంగ్‌ బ్రదర్స్‌కు ఎలాంటి అనుభవాలు ఎదురయ్యాయి? ఈ మధ్యలో జలజాక్షి (ప్రీతి ముకుంద్)తో క్రిష్ లవ్ స్టోరీ ఎలా సాగింది? అనేది మిగిలిన కథ. ఎవరెలా చేశారంటే? శ్రీవిష్ణు, రాహుల్ రామ‌కృష్ణ‌, ప్రియ‌ద‌ర్శి క‌లిసి పండించిన కామెడీ సినిమాకి ప్ర‌ధాన‌బ‌లం. వీళ్ల మ‌ధ్య కామెడీ టైమింగ్ చాలా స‌న్నివేశాల‌కి బ‌లం తీసుకొచ్చింది. క‌థానాయిక‌లు ప్రీతిముకుంద‌న్‌, ఆయేషాఖాన్‌లకు క‌థ‌లో ప్రాధాన్యం త‌క్కువే. అయితే ప్రియదర్శికి జోడిగా నటించిన అయేషా ఖాన్ తన గ్లామర్‌తో ఆకట్టుకుంది. ఓ స్పెషల్ సాంగ్‌లో మెరిసిన ప్రియా వడ్లమాని కూడా అందాలు ఆరబోసింది. ర‌చ్చ ర‌వి, ఆదిత్య మేన‌న్‌, శ్రీకాంత్ అయ్యంగార్  పాత్ర‌ల ప‌రిధి మేరకు న‌టించారు. ఇక ఇతర పాత్రల్లో కనిపించిన మిగిలిన నటీనటులు కూడా తమ నటనతో ఆకట్టుకున్నారు. డైరెక్షన్‌ ఎలా ఉందంటే ‘జాతిర‌త్నాలు’ (Om Bheem Bush Review) త‌ర‌హాలో ముగ్గురు స్నేహితుల క్రేజీ ప్ర‌యాణానికి హార‌ర్ కామెడీతో కూడిన ఓ  కాన్సెప్ట్‌ని జోడించాడు దర్శకుడు శ్రీహర్ష కొనుగంటి. శ్రీవిష్ణు, ప్రియదర్శి, రాహుల్‌ రామకృష్ణ మధ్య వచ్చే సన్నివేశాలు కితకితలు పెట్టేలా రూపొందించారు. ప్రథమార్థం మెుత్తాన్ని ఊరిలో వీరు చేపట్టిన ఏ టూ జెడ్‌ సర్వీసులు, దాని చుట్టూ అల్లుకున్న కామెడీతో డైరెక్టర్‌ నడిపించాడు. ఇక ద్వితియార్థాన్ని సంపంగి మహల్‌ చుట్టూ తిప్పాడు డైరెక్టర్‌. సంపంగి దెయ్యం క‌థ‌తోపాటు, ప‌తాక స‌న్నివేశాలను తెరకెక్కించిన తీరు మెప్పిస్తుంది. అయితే ఆరంభ సన్నివేశాలు, ద్వితీయార్ధంలో దెయ్యంతో డేటింగ్ వంటి స‌న్నివేశాలు అంత‌గా ప్ర‌భావం చూపించ‌వు. మెుత్తానికి బంగ్లా, దెయ్యం, తీర‌ని కోరిక తదిత‌ర అంశాల‌న్నీ పాత‌వే అయినా క‌థ‌కి కొత్త‌గా హాస్యాన్ని మేళ‌వించడంలో ద‌ర్శ‌కుడు విజ‌య‌వంత‌మ‌య్యాడు సాంకేతికంగా   టెక్నికల్‌ అంశాలకు వస్తే (Om Bheem Bush).. సినిమాలో సాంకేతిక విభాగం వర్క్ బాగానే ఉంది. ముఖ్యంగా స‌న్నీ ఎం.ఆర్ సంగీతం సినిమాకు బాగా ప్లస్ అయింది. అదే విధంగా రాజ్ తోట సినిమాటోగ్రఫీ వర్క్ కూడా సినిమాకి హైలైట్‌గా నిలిచింది. ఎడిటర్ విష్ణు వర్షన్ కావూరి ఎడిటింగ్ సినిమాకి తగ్గట్టు ఉంది. ఇక ఈ సినిమాలో నిర్మాతలు సునీల్ బలుసు, వి సెల్యులాయిడ్స్ పాటించిన ప్రొడక్షన్ వాల్యూస్ చాలా బాగున్నాయి. ప్లస్‌ పాయింట్స్‌ శ్రీవిష్ణు, ప్రియ‌ద‌ర్శి, రాహుల్ రామ‌కృష్ణ  న‌ట‌నకామెడీప‌తాక స‌న్నివేశాలు మైనస్ పాయింట్స్‌ రొటిన్‌ స్టోరీప్రథమార్ధంలోని ప్రారంభ సీన్లు Telugu.yousay.tv Rating : 3.5/5
    మార్చి 22 , 2024

    అయేషా ఖాన్ తల్లిదండ్రులు / పిల్లలు / భార్య/ భర్తకు సంబంధించిన మరింత సమాచారం

    అయేషా మధ్యతరగతి కుటుంబం నుంచి వచ్చింది. ఆమె తల్లిదండ్రులు షాదబ్‌ ఖాన్‌ & Mrs ఖాన్‌

    అయేషా ఖాన్ ఫేమస్‌ అవ్వడానికి రీజన్‌ ఏంటి?

    "హిందీలో ‘బిగ్‌ బాస్ 17’ సీజన్‌లో పాల్గొనడం అయేషా ఖాన్‌ కెరీర్‌ను మలుపు తిప్పింది. ఈ రియాలిటీ షో ద్వారా అయేషా అందరి దృష్టిలో పడింది. "

    అయేషా ఖాన్ లీడ్‌ రోల్‌లో చేసిన తొలి తెలుగు చిత్రం ఏది?

    తెలుగులో వచ్చిన ముఖచిత్రం (2022) ద్వారా ఆమె తెరంగేట్రం చేసింది.

    తెలుగులో అయేషా ఖాన్ ఫస్ట్‌ హిట్‌ మూవీ ఏది?

    ఓం భీమ్ బుష్

    అయేషా ఖాన్ కెరీర్‌లో అత్యత్తుమ పాత్ర ఏది?

    ఓం భీమ్‌ బుష్‌'లో రత్తాలు పాత్ర

    అయేషా ఖాన్ బెస్ట్‌ స్టేజ్‌ పర్‌ఫార్మెన్స్‌ వీడియోలు?

    Best Stage Performance

    అయేషా ఖాన్ కు ఇష్టమైన ఆహారం ఏంటి?

    మండి బిర్యానీ, రసం అన్నంతో చికెన్‌ ఫ్రై

    అయేషా ఖాన్ కు ఇష్టమైన నటుడు ఎవరు?

    ఈ భామకు అక్షయ్‌ కుమార్‌ నటన అంటే చాలా ఇష్టమట.

    అయేషా ఖాన్ కు ఇష్టమైన నటి ఎవరు?

    ప్రియాంక చోప్రా తన ఫేవరేట్ అని అయేషా ఓ సందర్భంలో తెలిపింది.

    అయేషా ఖాన్ ఎన్ని భాషలు మాట్లాడగలరు?

    హిందీ, ఇంగ్లీష్‌, మరాఠీ

    అయేషా ఖాన్ ఫేవరేట్‌ కలర్ ఏంటి?

    నలుపు, తెలుపు

    అయేషా ఖాన్ కు ఇష్టమైన సింగర్స్ ఎవరు?

    అర్జిత్‌ సింగ్‌, శ్రేయా ఘోషల్‌

    అయేషా ఖాన్ ఫేవరేట్‌ క్రీడ ఏది?

    క్రికెట్‌, బాడ్మింటన్‌

    అయేషా ఖాన్ ఫేవరేట్‌ క్రికెట్‌ ప్లేయర్లు ఎవరు?

    ధోని, కోహ్లీ

    అయేషా ఖాన్ కు ఇష్టమైన పర్యాటక ప్రాంతాలు ఏవి?

    లండన్‌

    అయేషా ఖాన్ ఇన్‌స్టాగ్రామ్‌ ఖాతాలో ఫాలోవర్ల సంఖ్య?

    4.7 మిలియన్లు

    అయేషా ఖాన్ సోషల్‌ మీడియా లింక్స్‌

    అయేషా ఖాన్ కు సంబంధించిన వివాదాలు?

    బిగ్‌బాస్‌ 17 హిందీ సీజన్‌ సమయంలో అయేషా ఖాన్‌.. మున్వర్‌ ఫారుఖీతో చాలా క్లోజ్‌గా మెలిగింది. దీనిపై అప్పట్లో చాలా ట్రోల్స్‌, వివాదాస్పద పోస్టులు వచ్చాయి.
    అయేషా ఖాన్ వ్యక్తిగత వివరాలు, ఎత్తు, పుట్టిన ప్రదేశం, బర్త్‌ డేట్‌, వయస్సు, సాధించిన విజయాలు, అవార్డులు, వ్యాపారాలు, ఇష్టాఇష్టాలు, అభిరుచులు తెలుసుకోండి. అలాగే అయేషా ఖాన్ కుటుంబ నేపథ్యం, తల్లిదండ్రులు, తోబుట్టువులు, రిలేషన్స్‌, విద్యా నేపథ్యం, కెరీర్ మైలురాళ్లు, తాజా ప్రాజెక్ట్‌లు, అధికారిక సోషల్ మీడియా అకౌంట్స్, లేటెస్ట్‌ చిత్రాలను ఒక్క క్లిక్‌తో ఇక్కడ తెలుసుకోండి.

    @2021 KTree