నటీనటులు : శర్వానంద్, కృతి శెట్టి, సీరత్ కపూర్, అయేషా ఖాన్, రాహుల్, రామకృష్ణ, రాహుల్ రవీంద్రన్, వెన్నెల కిషోర్ తదితరులు
రచన, దర్శకత్వం : శ్రీరామ్ ఆదిత్య
సంగీతం : హీషం అబ్దుల్ వహాబ్
సినిమాటోగ్రాఫర్ : విష్ణు శర్మ
నిర్మాతలు : వివేక్ కుచిబొట్ల, కృతి ప్రసాద్
విడుదల తేదీ: 07 జూన్, 2024
యంగ్ హీరో శర్వానంద్ చేసిన చిత్రాలకు టాలీవుడ్‌లో ప్రత్యేకంగా నిలుస్తాయి. పక్కింటి అబ్బాయిలా కనిపించే చిత్రాల్లో నటించి చాలా సార్లు ఆడియన్స్‌ను మెప్పించాడు. ఇప్పుడు కూడా అలాంటి కథతోనే శర్వానంద్ ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. శర్వానంద్, హీరోయిన్ కృతిశెట్టి జంటగా నటించిన లేటెస్ట్ చిత్రం ‘మనమే’ (Manamey). శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రంలో మాస్టర్ విక్రమ్ ఆదిత్య ముఖ్య పాత్ర పోషించారు. జూన్ 7న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం ఎలా ఉంది? ఎంతో కాలంగా హిట్ కోసం ఎదురుచూస్తున్న శర్వానంద్‌కు విజయాన్ని అందించిందా? ఈ రివ్యూలో చూద్దాం.
కథేంటి
విక్రమ్ (శర్వానంద్) పని పాట లేకుండా తాగుతూ తిరుగుతుంటాడు. కనిపించిన అమ్మాయిని ఫ్లర్ట్ చేస్తూ ప్లే బాయ్‌గా వ్యవహరిస్తుంటాడు. ఈ క్రమంలో ఓ రోజు విక్రమ్ బెస్ట్ ఫ్రెండ్ అనురాగ్ (త్రిగుణ్), అతని భార్య శాంతి ప్రమాదంలో చనిపోతారు. దీంతో అనురాగ్ కొడుకు ఖుషీ (మాస్టర్ విక్రమ్ ఆదిత్య)ని పెంచాల్సిన బాధ్యత విక్రమ్, సుభద్ర (కృతిశెట్టి)లపై పడుతుంది. వారిద్దరు పిల్లాడిని ఎలా పెంచారు? అసలు సుభద్ర ఎవరు? ఖుషీతో ఆమెకున్న సంబంధం ఏంటి? ఖుషీని పెంచే క్రమంలో సుభద్ర – విక్రమ్ ఎలా దగ్గరయ్యారు? అప్పటికే పెళ్లి నిశ్చయమైన సుభద్ర.. విక్రమ్‌తో రిలేషన్‌కు ఒప్పుకుందా? లేదా? అన్నది కథ.
ఎవరెలా చేశారంటే
నటుడు శర్వానంద్.. విక్రమ్ పాత్రలో చాలా సెటిల్డ్‌గా నటించాడు. ఫుల్ ఎనర్జీతో కనిపించి ఆకట్టున్నాడు. కామెడీ, లవ్, ఎమోషన్‌తూ కూడిన సన్నివేశాల్లో తనదైన మార్క్‌తో అలరించాడు. హీరోయిన్ కృతి శెట్టికి ఇందులో ప్రాధాన్యం ఉన్న పాత్రనే లభించింది. శర్వానంద్ – కృతిశెట్టి కెమెస్ట్రీ ఆకట్టుకుంది. అటు మాస్టర్ విక్రమ్ ఆదిత్య.. ఖుషీ పాత్రలో ఆకట్టుకున్నాడు. ఈ సినిమాలో ఆ బాలుడి పాత్రే ఎంతో కీలకం. ఇక రాజ్ కందుకూరి, త్రిగుణ్ పాత్రలు కథకు ఎంతో బలాన్ని అందించాయి. వెన్నెల కిషోర్ తనదైన కామెడీ టైమింగ్‌తో నవ్వించాడు. విలన్ షేడ్స్ ఉన్న పాత్రలో రాహుల్ రవీంద్రన్ మెప్పించాడు. సచిన్ ఖేదెకర్, సీత, ముఖేష్ రిషి, తులసి, సీరత్ కపూర్ తమదైన నటనతో ఆకట్టుకున్నారు.
డైరెక్షన్ ఎలా ఉందంటే
తల్లిదండ్రులు – పిల్లల మధ్య బాండింగ్ ఎలా ఉండాలన్న కాన్సెప్ట్‌తో దర్శకుడు శ్రీరామ్ ఆదిత్య ‘మనమే’ సినిమాను తెరకెక్కించారు. ఫీల్ గుడ్ ఎంటర్‌టైనర్‌గా ఆడియన్స్‌ను ఆకట్టుకునే ప్రయత్నంలో కొద్దిమేర సక్సెస్ అయ్యారు. జాలీగా తిరిగే హీరో.. ఫ్రెండ్ కొడుకు బాధ్యతను మోయాల్సి రావడం, ఇందుకు హీరోయిన్ సహకరించడం, వాటి తాలుకా వచ్చే సన్నివేశాలతో ఫస్ట్ హాఫ్ ఓ మాదిరిగా గడిచిపోయింది. ఇక సెకండాఫ్‌కు వచ్చేసరికి దర్శకుడు కథ నుంచి పూర్తిగా బయటకు వచ్చేసినట్లు అనిపిస్తుంది. కథతో సంబంధం లేని సన్నివేశాలు తెరపై జరుగుతుండటం కన్ఫ్యూజన్‌ను క్రియేట్ చేస్తాయి. ఇక క్లైమాక్స్‌ను మంచి ఎమోషనల్ సీన్స్‌తో ముగించడం సినిమాకు ప్లస్ అయ్యింది. అయితే విలన్ ట్రాక్‌ను ఇంకాస్త బెటర్‌గా రాసుకుంటే బాగుండేది. సినిమాలో చాలా చోట్ల ఎమోషనల్ మిస్ అయ్యింది. మెుత్తంగా దర్శకుడు శ్రీరామ్ ఆదిత్య అనుకున్న పాయింట్ బాగానే ఉంది కానీ దాన్ని తెరకెక్కించే క్రమంలోనే కాస్త తడబడ్డాడు.
టెక్నికల్‌గా
టెక్నికల్ విషయాలకొస్తే.. సినిమాటోగ్రఫీ కలర్‌ఫుల్‌గా ఉంది. లండన్ లొకేషన్స్‌ని బాగానే క్యాప్చర్ చేశారు. పాటలు పెద్దగా గుర్తుండవు గానీ బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ మాత్రం మూవీకి తగ్గట్లు ఉంది. ఎడిటర్ తన కత్తెరకు ఇంకాస్త పని పెట్టి ఉంటే బాగుండేది. నిర్మాతలు పెట్టిన ఖర్చు ప్రతి ఫ్రేమ్‌లోనూ కనిపిస్తుంది.
ప్లస్ పాయింట్స్
- శర్వానంద్, మాస్టర్ విక్రమ్ ఆదిత్య నటన
- ఎమోషనల్ సీన్స్
- సినిమాటోగ్రఫీ
మైనస్ పాయింట్స్
- సాగదీత సీన్స్
- విలన్ ట్రాక్
- ఎడిటింగ్
Celebrities Entertainment(Telugu) Featured Articles
Rajendra Prasad: అల్లు అర్జున్‌ని.. “పిచ్చోడా అని అన్నాను”: రాజేంద్ర ప్రసాద్