యంగ్ బ్యూటీ అయేషా ఖాన్.. తాజాగా విడుదలైన ‘ఓం భీమ్ బుష్’ సినిమాతో అందరి దృష్టిని ఆకర్షించింది. ఇందులో హాస్యనటుడు ప్రియదర్శికి జోడీగా నటించి తన గ్లామర్‌తో తెలుగు ఆడియన్స్‌ను కట్టిపడేసింది. అటు సోషల్ మీడియాలోనూ ఈ భామ తన అందచందాలను ఆరబోస్తుండటంతో టాలీవుడ్‌కు మరో గ్లామర్ హీరోయిన్ దొరికేసిందని నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు. అయేషా ఖాన్ (Ayesha Khan) పేరును నెట్టింట ట్రెండింగ్ చేస్తున్నారు. ఇంతకీ ఈ అయేషాఖాన్ ఎవరు? ఆమె చేసిన చిత్రాలు ఎన్ని? అయేషా ఇష్టా ఇష్టాలు ఏంటి? ఈ ప్రత్యేక కథనంలో తెలుసుకుందాం.
అయేషా ఖాన్ ఎవరు?
టాలీవుడ్‌కు చెందిన యువ నటి. హీరోయిన్‌గా ఇప్పుడిప్పుడే ఆమె ఎదుగుతోంది.
అయేషా ఖాన్ ఎక్కడ పుట్టింది?
మహారాష్ట్రలోని ముంబయిలో అయేషా పుట్టింది.
అయేషా ఖాన్ పుట్టిన తేదీ?
13 సెప్టెంబర్, 1992
అయేషా ఖాన్ తల్లిదండ్రులు ఎవరు?
అయేషా మధ్యతరగతి కుటుంబం నుంచి వచ్చింది. ఆమె తల్లిదండ్రులు షాదబ్ ఖాన్ & Mrs ఖాన్
అయేషా ఖాన్‌కు సోదరులు ఉన్నారా?
ఈ బ్యూటీకి ఇద్దరు సోదరులు ఉన్నారు. అన్న షాదబ్ ఖాన్ ఓ ప్రైవేటు కంపెనీ పని చేస్తున్నాడు. తమ్ముడు షాబజ్ ఖాన్ నేవీలో ఉద్యోగం చేస్తున్నాడు.
అయేషా ఖాన్ ఎత్తు ఎంత?
162 సెం.మీ
అయేషా ఖాన్ ఏం చదివారు?
ఈ భామ ఇంటర్ వరకూ చదువుకుంది.
అయేషా ఖాన్ ఎక్కడ చదివారు?
ఈ బ్యూటీ విద్యాభ్యాసం అంతా ముంబయిలోనే జరిగింది.
అయేషా ఖాన్ కెరీర్ ఎలా మెుదలైంది?
కెరీర్ ప్రారంభంలో అయేషా మోడల్‌గా చేసింది. సోషల్ మీడియా ఇన్‌ఫ్లూయెన్సర్‌గానూ ఆమెకు గుర్తింపు ఉంది.
అయేషా ఖాన్ కెరీర్‌ను మలుపు తిప్పిన ఘటన?
హిందీలో ‘బిగ్ బాస్ 17’ సీజన్‌లో పాల్గొనడం అయేషా ఖాన్ కెరీర్‌ను మలుపు తిప్పింది. ఈ రియాలిటీ షో ద్వారా అయేషా అందరి దృష్టిలో పడింది.
అయేషా ఖాన్ నటనా ప్రవేశం ఎలా జరిగింది?
హిందీలో స్టార్‌ప్లస్ ఛానెల్‌లో వచ్చిన ‘కసౌతి జిందగీ కే’ సీరియల్‌తో అయేషా ఖాన్ తన నటనా జీవితాన్ని ప్రారంభించింది. ఆ తర్వాత సోనీలో ‘బల్‌వీర్ రిటర్న్స్’ అనే సీరియల్‌లోనూ కనిపించింది.
అయేషా ఖాన్ తొలి చిత్రం?
తెలుగులో వచ్చిన ముఖచిత్రం (2022) ద్వారా ఆమె తెరంగేట్రం చేసింది.
అయేషా ఖాన్ లేటెస్ట్ చిత్రం?
అయేషా నటించిన తాజా చిత్రం ‘ఓం భీమ్ బుష్’. ఇది ఆమెకు రెండో సినిమా. ఇందులో రత్తాలు పాత్రలో అయేషా గ్లామర్ షో చేసింది.
అయేషా ఖాన్ ఫ్యూచర్ ప్రాజెక్ట్స్?
ప్రస్తుతం అయేషా.. ‘గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి’, ‘లక్కీ భాస్కర్’ చిత్రాల్లో నటిస్తోంది. ఈ సినిమాలు త్వరలోనే రిలీజ్ కానున్నాయి.
అయేషా ఖాన్ ఇష్టమైన ఆహారం?
నాన్ వెజ్ అంటే ఈ భామకు చాలా ఇష్టం. చికెన్, మటన్, ఫిష్ ఇలా ఏదైనా ఇష్టంగా తింటుందట.
అయేషా ఖాన్ ఫేవరేట్ నటుడు?
ఈ భామకు అక్షయ్ కుమార్ నటన అంటే చాలా ఇష్టమట.
అయేషా ఖాన్ ఫేవరేట్ హీరోయిన్?
ప్రియాంక చోప్రా తన ఫేవరేట్ అని అయేషా ఓ సందర్భంలో తెలిపింది.
అయేషా ఖాన్ ఇష్టమైన కలర్?
నలుపు, తెలుపు
అయేషా ఖాన్ ఫేవరేట్ రియాలిటీ షో?
బిగ్‌బాస్
అయేషా ఖాన్‌కు బాయ్ ఫ్రెండ్ ఉన్నాడా?
మునావర్ ఫారుఖీతో ఆమె రిలేషన్‌లో ఉన్నట్లు రూమర్స్ ఉన్నాయి. దీనిపై ఆమె ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు.
అయేషా ఖాన్ ఇన్‌స్టాగ్రామ్ ఐడీ?
Featured Articles Movie News
Dil Raju: అన్ని చేస్తాం.. అన్నింటికీ చెక్ పెడతాం