• Cricket
 • Lifestyle
 • Health
 • Relationships
 • People
 • Recommended
 • Technology
 • Apps
 • Gadgets
 • Tech News
 • Telugu Movies
 • Hot Actress
 • Movie News
 • Reviews
 • Om Bheem Bush Review: కడుపుబ్బా నవ్వించిన ‘ఓం భీమ్‌ బుష్‌’.. మరి సినిమా హిట్టా? ఫట్టా?

  న‌టీనటులు: శ్రీవిష్ణు, ప్రియదర్శి, రాహుల్ రామకృష్ణ, ప్రీతి ముకుందన్, అయేషా ఖాన్, శ్రీకాంత్ అయ్యంగార్, ఆదిత్య మీనన్, రచ్చ రవి తదితరులు

  రచన, దర్శకత్వం: శ్రీ హర్ష కొనుగంటి

  ఛాయాగ్ర‌హ‌ణం: రాజ్ తోట

  సంగీతం: సన్నీ MR

  ఎడిటర్‌ : విజయ్ వర్ధన్

  నిర్మాతలు: వి సెల్యులాయిడ్, సునీల్ బలుసు

  స‌మ‌ర్ప‌ణ‌: యు.వి.క్రియేష‌న్స్‌

  విడుద‌ల‌ తేదీ: 22-03-2024

  శ్రీవిష్ణు (Sree Vishnu), ప్రియదర్శి (Priyadarsi), రాహుల్ రామకృష్ణ (Rahul Ramakrishna) ప్రధాన పాత్రల్లో చేసిన తాజా చిత్రం ‘ఓం భీమ్ బుష్‌’ (Om Bheem Bush Review). శ్రీహర్ష కొనుగంటి దర్శకత్వంలో కామెడీ ఎంటర్‌టైనర్‌గా రూపొందిన ఈ చిత్రం ఎన్నో అంచనాల మధ్య ప్రేక్షకుల ముందుకు వచ్చింది మరి ఈ చిత్రం ప్రేక్షకులను మెప్పించిందా? వీరు ముగ్గురూ కలిసి చేసిన హంగామా ఏంటి? ఈ రివ్యూలో తెలుసుకుందాం. 

  కథేంటి

  క్రిష్ (శ్రీవిష్ణు), వినయ్ (ప్రియదర్శి), మాధవ్ (రాహుల్ రామకృష్ణ) మంచి స్నేహితులు. జీవితంపై శ్రద్ద లేకుండా సిల్లీ పనులు చేస్తూ కాలాన్ని గడుపుతుంటారు. ఈ క్రమంలో చోటుచేసుకున్న కొన్ని నాటకీయ పరిణామాల మధ్య ఈ ముగ్గురు భైరవపురం అనే గ్రామంలో అడుగుపెడతారు. మరి ఈ ముగ్గురు సైంటిస్టులుగా ఎలా మారారు? అక్కడి పరిస్థితులు వీరిని ఎలా మార్చాయి? ఆ ఊరిలోని సంపంగి దెయ్యం ఉన్న కోటలో ముగ్గురు ఎందుకు అడుగుపెట్టారు? ఆ దెయ్యానికి క్రిష్‌కి ఉన్న సంబంధం ఏంటి? కోటలోకి అడుగు పెట్టిన ఈ బిగ్‌బ్యాంగ్‌ బ్రదర్స్‌కు ఎలాంటి అనుభవాలు ఎదురయ్యాయి? ఈ మధ్యలో జలజాక్షి (ప్రీతి ముకుంద్)తో క్రిష్ లవ్ స్టోరీ ఎలా సాగింది? అనేది మిగిలిన కథ.

  ఎవరెలా చేశారంటే?

  శ్రీవిష్ణు, రాహుల్ రామ‌కృష్ణ‌, ప్రియ‌ద‌ర్శి క‌లిసి పండించిన కామెడీ సినిమాకి ప్ర‌ధాన‌బ‌లం. వీళ్ల మ‌ధ్య కామెడీ టైమింగ్ చాలా స‌న్నివేశాల‌కి బ‌లం తీసుకొచ్చింది. క‌థానాయిక‌లు ప్రీతిముకుంద‌న్‌, ఆయేషాఖాన్‌లకు క‌థ‌లో ప్రాధాన్యం త‌క్కువే. అయితే ప్రియదర్శికి జోడిగా నటించిన అయేషా ఖాన్ తన గ్లామర్‌తో ఆకట్టుకుంది. ఓ స్పెషల్ సాంగ్‌లో మెరిసిన ప్రియా వడ్లమాని కూడా అందాలు ఆరబోసింది. ర‌చ్చ ర‌వి, ఆదిత్య మేన‌న్‌, శ్రీకాంత్ అయ్యంగార్  పాత్ర‌ల ప‌రిధి మేరకు న‌టించారు. ఇక ఇతర పాత్రల్లో కనిపించిన మిగిలిన నటీనటులు కూడా తమ నటనతో ఆకట్టుకున్నారు.

  డైరెక్షన్‌ ఎలా ఉందంటే

  జాతిర‌త్నాలు’ (Om Bheem Bush Review) త‌ర‌హాలో ముగ్గురు స్నేహితుల క్రేజీ ప్ర‌యాణానికి హార‌ర్ కామెడీతో కూడిన ఓ  కాన్సెప్ట్‌ని జోడించాడు దర్శకుడు శ్రీహర్ష కొనుగంటి. శ్రీవిష్ణు, ప్రియదర్శి, రాహుల్‌ రామకృష్ణ మధ్య వచ్చే సన్నివేశాలు కితకితలు పెట్టేలా రూపొందించారు. ప్రథమార్థం మెుత్తాన్ని ఊరిలో వీరు చేపట్టిన ఏ టూ జెడ్‌ సర్వీసులు, దాని చుట్టూ అల్లుకున్న కామెడీతో డైరెక్టర్‌ నడిపించాడు. ఇక ద్వితియార్థాన్ని సంపంగి మహల్‌ చుట్టూ తిప్పాడు డైరెక్టర్‌. సంపంగి దెయ్యం క‌థ‌తోపాటు, ప‌తాక స‌న్నివేశాలను తెరకెక్కించిన తీరు మెప్పిస్తుంది. అయితే ఆరంభ సన్నివేశాలు, ద్వితీయార్ధంలో దెయ్యంతో డేటింగ్ వంటి స‌న్నివేశాలు అంత‌గా ప్ర‌భావం చూపించ‌వు. మెుత్తానికి బంగ్లా, దెయ్యం, తీర‌ని కోరిక తదిత‌ర అంశాల‌న్నీ పాత‌వే అయినా క‌థ‌కి కొత్త‌గా హాస్యాన్ని మేళ‌వించడంలో ద‌ర్శ‌కుడు విజ‌య‌వంత‌మ‌య్యాడు

  సాంకేతికంగా  

  టెక్నికల్‌ అంశాలకు వస్తే (Om Bheem Bush).. సినిమాలో సాంకేతిక విభాగం వర్క్ బాగానే ఉంది. ముఖ్యంగా స‌న్నీ ఎం.ఆర్ సంగీతం సినిమాకు బాగా ప్లస్ అయింది. అదే విధంగా రాజ్ తోట సినిమాటోగ్రఫీ వర్క్ కూడా సినిమాకి హైలైట్‌గా నిలిచింది. ఎడిటర్ విష్ణు వర్షన్ కావూరి ఎడిటింగ్ సినిమాకి తగ్గట్టు ఉంది. ఇక ఈ సినిమాలో నిర్మాతలు సునీల్ బలుసు, వి సెల్యులాయిడ్స్ పాటించిన ప్రొడక్షన్ వాల్యూస్ చాలా బాగున్నాయి.

  ప్లస్‌ పాయింట్స్‌

  • శ్రీవిష్ణు, ప్రియ‌ద‌ర్శి, రాహుల్ రామ‌కృష్ణ  న‌ట‌న
  • కామెడీ
  • ప‌తాక స‌న్నివేశాలు

  మైనస్ పాయింట్స్‌

  • రొటిన్‌ స్టోరీ
  • ప్రథమార్ధంలోని ప్రారంభ సీన్లు

  Telugu.yousay.tv Rating : 3.5/5

  YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv