• TFIDB EN
  • ధనుష్
    జననం : జూలై 28 , 1983
    ప్రదేశం: మద్రాసు, తమిళనాడు, భారతదేశం
    ధనుష్‌ దక్షిణాదికి చెందిన ప్రముఖ హీరో. 1983 జనవరి 28న చెన్నైలో జన్మించాడు. ప్రముఖ తమిళ దర్శకుడు కస్తూరి రాజా కుమారుడిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టారు. 'తుళ్లువదో ఇలామై' (2002)తో తెరంగేట్రం చేశారు. నవమన్మధుడు, రఘువరన్ బి.టెక్, అసురన్‌ చిత్రాలతో తెలుగుతో పాటు తమిళంలో పాపులారిటీ సంపాదించారు. కెరీర్‌లో 50కి పైగా చిత్రాల్లో హీరోగా చేశారు. నిర్మాతగా మారి 16 చిత్రాలను నిర్మించారు.

    ధనుష్ వయసు ఎంత?

    ధనుష్‌ వయసు 41 సంవత్సరాలు

    ధనుష్ ముద్దు పేరు ఏంటి?

    ధనుష్‌ అసలు పేరు వెంకటేష్‌ ప్రభు కస్తూరి రాజా. ఇండస్ట్రీలోకి వచ్చాక ముద్దుగా ధనుష్‌ అని మార్చుకున్నాడు.

    ధనుష్ ఎత్తు ఎంత?

    5' 9'' (175 cm)

    ధనుష్ అభిరుచులు ఏంటి?

    ట్రావెలింగ్‌, సింగింగ్‌

    ధనుష్ ఏం చదువుకున్నారు?

    బ్యాచిలర్‌ ఆఫ్‌ కంప్యూటర్‌ అప్లికేషన్స్‌

    ధనుష్ ఏ విద్యాసంస్థల్లో చదువుకున్నారు?

    థాయ్‌ సత్య మెట్రిక్యులేషన్‌ హై స్కూల్‌, చెన్నై మధురై కామరాజ్ విశ్వవిద్యాలయం

    ధనుష్ రిలేషన్‌లో ఉంది ఎవరు?

    స్టార్‌ హీరోయిన్స్‌ శ్రుతి హాసన్‌, త్రిషతోరిలేషన్‌లో ఉన్నట్లు గతంలో వార్తలు వచ్చాయి.

    ధనుష్ బెస్ట్ ఫ్రెండ్స్ ఎవరు?

    ధనుష్‌ ఇప్పటివరకూ చేసిన తెలుగు చిత్రాలు ఏవి?

    ధనుష్‌ నేరుగా చేసిన ఒకే ఒక్క తెలుగు ఫిల్మ్‌ 'సార్‌'. అయితే తమిళంలో అతడు చేసిన చాలా వరకూ చిత్రాలు తెలుగులో డబ్బింగ్ అయ్యి విడుదలయ్యాయి.

    ధనుష్ In Sun Glasses

    Images

    Dhanush In Sunglasses

    ధనుష్ With Pet Dogs

    Images

    Hero Dhanush With Pet Dogs

    Images

    Dhanush

    ధనుష్ అన్‌ కేటగిరైజ్డ్ ఇమేజెస్‌

    Images

    Dhanush

    2023- తెలుగులో టాప్ 10 మ్యూజికల్ హిట్ సినిమాలుEditorial List
    2023- తెలుగులో టాప్ 10 మ్యూజికల్ హిట్ సినిమాలు
    ఆహాలో ఈ టాప్ 25 హిట్ చిత్రాలను ఫ్రీగా చూడొచ్చు.. తెలుసా?Editorial List
    ఆహాలో ఈ టాప్ 25 హిట్ చిత్రాలను ఫ్రీగా చూడొచ్చు.. తెలుసా?

    ధనుష్ తల్లిదండ్రులు ఎవరు?

    కస్తూరి రాజా, విజయలక్ష్మీ దంపతులకు 1983 జులై 28న ధనుష్‌ జన్మించాడు.

    ధనుష్ తల్లిదండ్రులు ఏం చేస్తారు?

    ధనుష్‌ తండ్రి కస్తూరి రాజా తమిళ ఇండస్ట్రీలో ప్రముఖ డైరెక్టర్‌గా పనిచేశారు. 28 చిత్రాలకు దర్శకత్వం వహించారు.

    ధనుష్‌ సోదరుడు/సోదరి పేరు ఏంటి?

    ప్రముఖ తమిళ దర్శకుడు సెల్వరాఘవన్‌ ధనుష్‌కు సోదరుడు అవుతాడు. డా. విమల గీత అనే సోదరి కూడా ధనుష్‌కు ఉంది.

    ధనుష్ పెళ్లి ఎప్పుడు అయింది?

    తమిళ సూపర్‌స్టార్‌ హీరో రజనీకాంత్‌ కుమార్తె ఐశ్వర్యనుధనుష్‌ 2004 నవంబర్‌ 18న వివాహం చేసుకున్నాడు. అనివార్య కారణాలతో వారు విడిపోయారు. తాము విడాకులు తీసుకున్నట్లు 17 జనవరి 2022న ధనుష్‌ ఎక్స్‌ వేదికగా ప్రకటించారు.

    ధనుష్ కు పిల్లలు ఎంత మంది?

    ధనుష్‌కు ఇద్దరు కుమారులు ఉన్నారు. వారి పేర్లు యాత్ర, లింగా.

    ధనుష్ Family Pictures

    Images

    Dhanush With His Sons

    Images

    Dhanush With His Mother

    ధనుష్ ఫేమస్‌ అవ్వడానికి రీజన్‌ ఏంటి?

    నవ మన్మథుడు, రఘువరన్‌ బి.టెక్‌, అసురన్‌ చిత్రాలతో తమిళంతోపాటు తెలుగులోనూ ధనుష్‌ పాపులర్ అయ్యాడు.

    ధనుష్ లీడ్‌ రోల్‌లో చేసిన తొలి తెలుగు చిత్రం ఏది?

    తుళ్లువదో ఇలామై' (2002) అనే తమిళ చిత్రంతో ధనుష్‌ తొలిసారి తెరంగేట్రం చేశాడు. ఈ సినిమాకు ఆయన తండ్రి కస్తూరి రాజా దర్శకత్వం వహించడం విశేషం.

    రూ.100 కోట్ల క్లబ్‌లో చేరిన ధనుష్ తొలి చిత్రం ఏది?

    ధనుష్‌ నటించిన 'సార్‌', కెప్టెన్‌ మిల్లర్‌ చిత్రాలు రూ.100 కోట్ల క్లబ్‌లో చేరాయి.

    ధనుష్ కెరీర్‌లో అత్యత్తుమ పాత్ర ఏది?

    అసురన్‌ చిత్రంలోని శివస్వామి పాత్ర

    ధనుష్ బెస్ట్‌ స్టేజ్‌ పర్‌ఫార్మెన్స్‌ వీడియోలు?

    Watch on YouTube

    Watch on YouTube

    ధనుష్ బెస్ట్‌ డైలాగ్స్‌ వీడియోలు ఏవి?

    Watch on YouTube

    Watch on YouTube

    Watch on YouTube

    ధనుష్ రెమ్యూనరేషన్ ఎంత?

    ఒక్కో సినిమాకు రూ.35-50 కోట్ల వరకూ తీసుకుంటున్నట్లు సమాచారం.

    ధనుష్ కు ఇష్టమైన ఆహారం ఏంటి?

    ఇడియప్పం, కడల కర్రీ

    ధనుష్ కు ఇష్టమైన నటుడు ఎవరు?

    ధనుష్ కు ఇష్టమైన నటి ఎవరు?

    ధనుష్ ఎన్ని భాషలు మాట్లాడగలరు?

    తెలుగు, హిందీ, తమిళం, ఇంగ్లీషు

    ధనుష్ ఫెవరెట్ సినిమా ఏది?

    నెట్రి కన్న్‌ (1981), బాషా(1995)

    ధనుష్ ఫేవరేట్‌ కలర్ ఏంటి?

    బ్లాక్‌

    ధనుష్ ఫేవరేట్‌ క్రీడ ఏది?

    టెన్నిస్‌, ఫుట్‌బాల్‌

    ధనుష్ వద్ద ఉన్న లగ్జరీ కార్లు ఏవి?

    • Audi A8 • Bentley Continental Flying Spur • Rolls Royce Ghost Series 2 • Jaguar XE

    ధనుష్ ఆస్తుల విలువ (నెట్‌వర్త్‌) ఎంత?

    ధనుష్ ఆస్తుల విలువ రూ.160 కోట్ల వరకూ ఉంటుందని సమాచారం.

    ధనుష్ ఇన్‌స్టాగ్రామ్‌ ఖాతాలో ఫాలోవర్ల సంఖ్య?

    7.3 మిలియన్లు

    ధనుష్ సోషల్‌ మీడియా లింక్స్‌

    ధనుష్ కి ఎన్ని అవార్డులు వచ్చాయి?

    • నేషనల్‌ అవార్డ్‌ - 2011

      'ఆడుకలం చిత్రానికి ఉత్తమ నటుడిగా ఎంపికయ్యాడు

    • నేషనల్‌ అవార్డ్‌ - 2019

      'అసురన్‌' చిత్రానికి గాను బెస్ట్‌ యాక్టర్‌గా అవార్డు అందుకున్నాడు

    • ఫిల్మ్‌ఫేర్ అవార్డ్‌ - 2014

      'రాంఝనా' చిత్రానికి ఉత్తమ తెరంగేట్ర నటుడిగా హిందీలో అవార్డ్‌ తీసుకున్నాడు

    • ఫిల్మ్‌ఫేర్ అవార్డ్‌ సౌత్‌ - 2011

      'ఆడుకలం చిత్రానికి ఉత్తమ నటుడిగా ఎంపికయ్యాడు

    • ఫిల్మ్‌ఫేర్ అవార్డ్‌ సౌత్‌ - 2012

      '3' సినిమాలో పాడిన 'వై దిస్‌ కొలవరి' పాటకు ఉత్తమ ప్లే బ్యాక్‌ సింగర్‌గా అవార్డు అందుకున్నాడు

    • ఫిల్మ్‌ఫేర్ అవార్డ్‌ సౌత్‌ - 2013

      'మర్యన్‌' చిత్రానికి గాను ఉత్తమ నటుడిగా క్రిటిక్స్‌ విభాగంలో అవార్డు అందుకున్నాడు

    • ఫిల్మ్‌ఫేర్ అవార్డ్‌ సౌత్‌ - 2014

      'వేలైయిల్లా పట్టతారి' చిత్రానికి ఉత్తమ నటుడిగా అవార్డు తీసుకున్నాడు

    • ఫిల్మ్‌ఫేర్ అవార్డ్‌ సౌత్‌ - 2018

      'వడ చెన్నై' చిత్రానికి గాను ఉత్తమ నటుడిగా ఎంపికయ్యాడు

    • సైమా అవార్డ్స్‌ - 2011

      'ఆడుకలం చిత్రానికి ఉత్తమ నటుడిగా ఎంపికయ్యాడు

    • సైమా అవార్డ్స్‌ - 2012

      '3' సినిమాకు గాను ఉత్తమ నటుడిగా అవార్డ్‌ తీసుకున్నాడు

    • సైమా అవార్డ్స్ - 2012

      '3' సినిమాలో పాడిన 'వై దిస్‌ కొలవరి' పాటకు ఉత్తమ ప్లే బ్యాక్‌ సింగర్‌గా అవార్డు అందుకున్నాడు

    • సైమా అవార్డ్స్ - 2013

      'మర్యన్‌' చిత్రానికి గాను ఉత్తమ నటుడిగా క్రిటిక్స్‌ విభాగంలో అవార్డు అందుకున్నాడు

    • సైమా అవార్డ్స్‌ - 2014

      'వేలైయిల్లా పట్టతారి' చిత్రానికి ఉత్తమ నటుడిగా అవార్డు తీసుకున్నాడు

    • సైమా అవార్డ్స్‌ - 2018

      'వడ చెన్నై' చిత్రానికి గాను ఉత్తమ నటుడిగా ఎంపికయ్యాడు

    • సైమా అవార్డ్స్‌ - 2019

      'అసురన్‌' చిత్రానికి గాను బెస్ట్‌ యాక్టర్‌గా అవార్డు అందుకున్నాడు

    ధనుష్ కు సంబంధించిన వివాదాలు?

    - 2014లో ధనుష్‌ నటించిన 'విఐపీ' చిత్రంపై టొబాకో నియంత్రణ కమిటి తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేయడం వివాదానికి దారితీసింది. - 2022లో భార్య ఐశ్వర్యతో విడిపోతున్నట్లు సోషల్‌ మీడియా వేదికగా ధనుష్‌ ప్రకటించడం చర్చనీయాంశంగా మారింది.

    ధనుష్ కు ఎలాంటి వ్యాపారాలు ఉన్నాయి?

    ధనుష్‌ నటుడిగానే కాకుండా నిర్మాతగాను వ్యవహరిస్తున్నారు. ఇప్పటివరకూ 16 చిత్రాలను నిర్మించారు. అటు డైరెక్టర్‌ గాను పా పాండి (Pa Paandi) అనే ఫిల్మ్‌ను ధనుష్‌ తెరకెక్కించారు. ప్రస్తుతం 'రాయన్‌' అనే సినిమాలో హీరోగా చేస్తూ దర్శకత్వం వహిస్తున్నారు.

    ధనుష్ ఎలాంటి వ్యాపార ప్రకటనల్లో నటిస్తున్నారు?

    OLX, సెంటర్ ఫ్రెష్‌, 7up తదితర వ్యాపార ప్రకటనల్లో ధనుష్‌ నటించారు.
    ధనుష్ వ్యక్తిగత వివరాలు, ఎత్తు, పుట్టిన ప్రదేశం, బర్త్‌ డేట్‌, వయస్సు, సాధించిన విజయాలు, అవార్డులు, వ్యాపారాలు, ఇష్టాఇష్టాలు, అభిరుచులు తెలుసుకోండి. అలాగే ధనుష్ కుటుంబ నేపథ్యం, తల్లిదండ్రులు, తోబుట్టువులు, రిలేషన్స్‌, విద్యా నేపథ్యం, కెరీర్ మైలురాళ్లు, తాజా ప్రాజెక్ట్‌లు, అధికారిక సోషల్ మీడియా అకౌంట్స్, లేటెస్ట్‌ చిత్రాలను ఒక్క క్లిక్‌తో ఇక్కడ తెలుసుకోండి.

    @2021 KTree