• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • Raayan Movie Review: ధనుష్‌ దర్శకత్వంలో వచ్చిన ‘రాయన్‌’ మెప్పించిందా?

    నటీనటులు : ధనుష్‌, సందీప్‌ కిషన్‌, ఎస్‌.జే. సూర్య, జయరామ్‌, సెల్వరాఘవన్‌, ప్రకాష్‌ రాజ్‌, దుషారా విజయన్‌, అపర్ణ బాలమురళి, వరలక్ష్మీ శరత్‌కుమార్‌ తదితరులు

    కథ & దర్శకత్వం : ధనుష్‌

    సినిమాటోగ్రఫీ : ఓం ప్రకాష్‌

    సంగీతం : ఏ.ఆర్‌. రెహమాన్‌

    ఎడిటింగ్‌ : ప్రసన్న జి.కె

    నిర్మాణ సంస్థ : సన్‌ పిక్చర్స్‌

    విడుదల తేదీ : 26 జులై, 2024

    తమిళ స్టార్‌ హీరో ధనుష్‌ (Dhanush) నటించిన లేటెస్ట్ చిత్రం ‘రాయన్‌‘ (Raayan Movie Telugu Review). ధనుష్‌ స్వీయ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో టాలీవుడ్‌ హీరో సందీప్‌ కిషన్‌ (Sundeep Kishan) కీలక పాత్ర పోషించాడు. ప్రకాష్‌ రాజ్‌(Prakash Raj), ఎస్‌. జే. సూర్య (S.J. Surya), జయరామ్‌ (Jayaram), వరలక్ష్మీ (Varalaxmi) ఇతర ప్రాధాన్యం ఉన్న పాత్రలు చేశారు. ఇప్పటికే విడుదలైన ట్రైలర్‌, టీజర్‌, ప్రచార చిత్రాలు సినిమాపై భారీగా అంచనాలు పెంచేశాయి. ఏషియన్‌ సురేష్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ పతాకంపై రూపొందిన ఈ చిత్రం జులై 26న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ఈ చిత్రం ఎలా ఉంది? ధనుష్‌కు మరో విజయాన్ని అందించిందా? ప్రేక్షకుల అంచనాలను అందుకుంటూ సక్సెస్‌ అయ్యిందా? ఈ రివ్యూలో తెలుసుకుందాం. 

    కథేంటి

    రాయన్‌ (ధనుష్‌) తన ఇద్దరు తమ్ముళ్లు ముత్తువేల్ (సందీప్ కిషన్), మాణిక్యం(కాళిదాస్ జయరామ్), చెల్లి దుర్గ (దుషారా విజయన్) దుర్గతో కలిసి జీవిస్తుంటాడు. చిన్న తమ్ముడు కాలేజీకి వెళ్లి చదువుకుంటుంటే ముత్తువేల్‌ మాత్రం ఏదో ఒక గొడవల్లో తలదూరుస్తూ గాలికి తిరుగుతూ ఉంటాడు. ఇక అదే ఊళ్ళో దొరై(శరవణన్), సీతారాం(ఎస్‌.జే. సూర్య)లు రౌడీలుగా ఒకరికొకరు వేరువేరు గ్యాంగ్స్ తో ఉంటారు. ఆ ఊరికి పోలీసాఫీసర్ (ప్రకాష్ రాజ్) అక్కడున్న రౌడీలని అంతం చేయడానికి పగతో వస్తాడు. ఈ క్రమంలో అనుకోకుండా దొరై చనిపోతాడు. దీంతో రాయన్‌ను సీతారం టార్గెట్‌ చేస్తాడు. దొరైని ఎవరు చంపారు? రాయన్‌ను సీతారాం ఎందుకు టార్గెట్‌ చేశాడు? పోలీసాఫీసర్ ఏం చేసాడు? రాయన్‌ తమ్ముళ్లు ఏం అయ్యారు? అన్నది స్టోరీ. 

    ఎవరెలా చేశారంటే

    గ్లోబల్‌ స్టార్‌ ధనుష్‌ ఎప్పటిలాగే ఈ సినిమాలో చక్కటి నటన కనబరిచాడు. రాయన్‌ పాత్రలో పరకాయ ప్రవేశం చేసి మరి నటించాడు. యాక్షన్‌ సీక్వెన్స్‌లో విశ్వరూపం చూపించాడు. అటు ఎమోషనల్‌ సీన్స్‌లోనూ తన మార్క్‌ చూపించాడు. టాలీవుడ్‌ హీరో సందీప్‌ కిషన్‌కు ఈ సినిమాలో మంచి పాత్రే దక్కింది. రాయన్‌ తర్వాత ఆ స్థాయిలో ప్రాధాన్యం ఉన్న పాత్ర అతడిది. సందీప్‌ ఇప్పటివరకూ చేసిన వాటిలో ఈ పాత్ర గుర్తుండిపోతుంది. అటు ఎస్‌.జే సూర్య, ప్రకాష్‌ రాజ్‌ తమ అద్భుత నటనతో తమ పాత్రలకు పూర్తిగా న్యాయం చేశారు. సెల్వరాఘవన్‌, దుషారా విజయన్‌, అపర్ణ బాలమురళి, వరలక్ష్మీ శరత్‌కుమార్‌ కూడా తమ నటనతో ఆకట్టుకున్నారు. ఇతర నటీనటులు కూడా తమ పరిధిమేరకు నటించి మెప్పించారు.

    డైరెక్షన్ ఎలా ఉందంటే

    తన కెరీర్‌లో 50వ చిత్రంగా వచ్చిన రాయన్‌కు ధనుష్‌ దర్శకత్వం వహించారు. స్టోరీ పరంగా చూస్తే ఓ సాధారణ రీవేంజ్‌ డ్రామాగా అనిపించినప్పటికీ ధనుష్‌ తనదైన డైరెక్షన్, స్క్రీన్‌ప్లేతో ఆకట్టుకున్నాడు. ముగ్గురు డైమన్షన్స్‌లో కథ నడిపి మెప్పించాడు. పోరాట ఘట్టాలు, ఎమోషనల్‌ సీన్స్‌ను అద్భుతంగా తెరకెక్కించాడు. తద్వారా ప్రేక్షకులను కథలో లీనమయ్యేట్టు చేశారు. అద్భుతమైన ఇంటర్వెల్‌ బ్యాంగ్‌తో సెకండాఫ్‌పై ఆసక్తిని పెంచాడు. ఇక సెకండాఫ్‌లో వచ్చే యాక్షన్ సీక్వెన్స్‌, ఎమోషన్స్‌, క్లైమాక్స్‌ సినిమాకు చాలా బాగా ప్లస్‌ అయ్యాయి. అయితే రొటిన్‌ స్టోరీ కావడం, తర్వాత జరగబోయేది ముందే ఊహించగలడం, తమిళ నేటివిటికి దగ్గరగా ఉండటం, అక్కడక్కడ కొన్ని బోరింగ్‌ సీన్స్‌ సినిమాకు మైనస్‌గా మారాయి.

    సాంకేతికంగా 

    టెక్నికల్‌ అంశాల విషయానికి వస్తే.. ఏ.ఆర్‌. రెహమాన్‌ అందించిన సంగీతం సినిమాకు అతిపెద్ద అసెట్‌గా మారింది. యాక్షన్‌ సీక్వెన్స్‌ను చాలా బాగా ఎలివేట్‌ చేసింది. అయితే పాటలు మాత్రం గుర్తుంచుకునేలా లేవు. సినిమాటోగ్రఫీ బాగుంది. ఎడిటింగ్‌ వర్క్‌ ఓకే. బోరింగ్‌ సన్నివేశాలను కాస్త ట్రిమ్‌ చేసి ఉంటే సినిమాకు మరింత వెయిటేజీ వచ్చేది. నిర్మాణ విలువలు చాలా ఉన్నతంగా ఉన్నాయి. ఖర్చు విషయంలో నిర్మాతలు ఎక్కడా రాజీ పడలేదు. 

    ప్లస్‌ పాయింట్స్‌

    • ధనుష్, సందీప్‌ కిషన్‌ నటన
    • యాక్షన్‌ సీక్వెన్స్‌
    • నేపథ్య సంగీతం

    మైనస్‌ పాయింట్స్‌

    • రొటిన్‌ స్టోరీ
    • అక్కడక్కడ బోరింగ్‌ సీన్స్‌

    Telugu.yousay.tv Rating : 3/5  

    ‘రాయన్‌’ సినిమాపై పబ్లిక్‌ టాక్‌

    ‘రాయన్‌’ చిత్రాన్ని చూసిన కొందరు నెటిజన్లు ఎక్స్‌ వేదికగా తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. మెజారిటీ మంది ఈ సినిమాపై పాజిటివ్‌గా స్పందిస్తున్నారు. ముఖ్యంగా ధనుష్‌ నటన, నేపథ్య సంగీతాన్ని హైలెట్‌ చేస్తున్నారు. ఇందుకు సంబంధించిన పోస్టులు ఏవో చూద్దాం. 

    రాయన్‌ ఫస్టాఫ్‌, సెకండాఫ్‌, ధనుష్‌ ఎంట్రీ, ఇంటర్వెల్‌, క్లైమాక్స్‌ బ్యాంగ్‌, సందీప్‌ కిషన్‌ నటన అదిపోయాయని ఓ నెటిజన్‌ కామెంట్‌ చేశాడు. ఈ సినిమాకు ఏకంగా 4.6/5 రేటింగ్‌ ఇచ్చాడు. 

    రాయన్‌ మూవీ రా అండ్‌ రస్టిక్‌గా ఉందని మరో నెటిజన్‌ పోస్టు పెట్టాడు. ధనుష్‌ మేకోవర్‌, స్క్రీన్‌ ప్రెజెన్స్‌ అదిరిపోయాయని పేర్కొన్నాడు. నేషనల్ అవార్డ్ విన్నింగ్‌ డైరెక్టర్‌ వెట్రిమారన్‌ను ధనుష్‌ తన వర్కింగ్‌ స్టైల్‌తో గుర్తు చేశారని ప్రశంసించారు. ఎస్‌.జే సూర్య నటన, ఏ.ఆర్‌. రెహమాన్‌ ఇచ్చిన నేపథ్య సంగీతం సినిమాకు వెన్నెముకగా నిలిచాయని రాసుకొచ్చాడు. 

    రాయన్‌ ఒక సాధారణ రివేంజ్‌ డ్రామా అయినప్పటికీ ధనుష్‌ టేకింగ్‌ చాలా కొత్తదనాన్ని ఇచ్చిందని ఇంకో నెటిజన్‌ పోస్టు పెట్టాడు. మ్యూజిక్‌ డైరెక్టర్‌ రెహమాన్‌ ఈ మూవీకి సెకండ్‌ హీరో అంటూ రాసుకొచ్చాడు. 

    రాయన్‌ సినిమా అద్భుతంగా ఉందంటూ ఓ వ్యక్తి పోస్టు పెట్టాడు. ‘ఆల్‌రౌండర్‌ ఆఫ్‌ ఇండియన్‌ సినిమా’ అని ధనుష్‌ను ఉద్దేశిస్తూ వ్యాఖ్యానించాడు. ఈ మూవీలో సందీప్‌ కిషన్‌ మేజర్‌ రోల్‌ పోషించాడని ఎక్కడా ల్యాగ్స్‌, బోరింగ్‌ సీన్స్‌ లేవని రాసుకొచ్చారు. 

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv