• TFIDB EN
  • జాన్ అబ్రహం
    జననం : డిసెంబర్ 17 , 1972
    ప్రదేశం: బొంబాయి (ప్రస్తుతం ముంబై), మహారాష్ట్ర, భారతదేశం
    జాన్ అబ్రహం.. బాలీవుడ్‌కు చెందిన ప్రముఖ హీరో. పలు సూపర్‌ హిట్‌ చిత్రాల్లో నటించాడు. పఠాన్‌ చిత్రంలో విలన్‌ పాత్ర పోషించి ఆకట్టుకున్నాడు.
    కథనాలు
    War 2 Movie Story: సోషల్‌ మీడియాలో ‘వార్‌ 2’ స్టోరీ లీక్‌.. గూస్‌ బంప్స్‌ తెప్పిస్తున్న కథ!
    War 2 Movie Story: సోషల్‌ మీడియాలో ‘వార్‌ 2’ స్టోరీ లీక్‌.. గూస్‌ బంప్స్‌ తెప్పిస్తున్న కథ! టాలీవుడ్‌, బాలీవుడ్‌కు చెందిన అగ్రకథానాయకులు ఎన్టీఆర్‌ (NTR), హృతిక్‌ రోషన్‌ (Hrithik Roshan) కలిసి నటిస్తోన్న చిత్రం ‘వార్‌ 2’ (War 2). అయాన్‌ ముఖర్జీ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రాన్ని యశ్‌రాజ్‌ స్పై యూనివర్స్‌ నిర్మిస్తోంది. ఈ చిత్రంపై దేశంలోని సగటు అభిమానుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. ఇద్దరు స్టార్‌ హీరోలు నటిస్తున్న ఈ సినిమా అప్‌డేట్‌ కోసం సినీప్రియులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా సినిమాకు సంబంధించిన ఓ వార్త నెట్టింట హల్‌చల్‌ చేస్తోంది. ఈ సినిమా కథ ఇదేనంటూ ఓ ప్లాట్‌ (War 2 Movie Story Leak) నెట్టింట చక్కర్లు కొడుతోంది. మరోవైపు తారక్‌ షూటింగ్‌కు సంబంధించి కూడా ఓ అప్‌డేట్‌ బయటకొచ్చింది. ఆ విశేషాలేంటో ఇప్పుడు చూద్దాం.  ‘వార్‌ 2’ కథ అదేనా? 2019లో వచ్చిన బాలీవుడ్‌ చిత్రం 'వార్‌' (War)కు సీక్వెల్‌గా ఈ సినిమా తెరకెక్కుతోంది. గతంలో హృతిక్‌కు కోస్టార్‌గా యంగ్‌ హీరో టైగర్ ష్రాఫ్‌ (Tiger Shroff) నటించగా.. పార్ట్‌ 2లో తారక్‌ కనిపించబోతున్నాడు. లేటెస్ట్‌ బజ్‌ ప్రకారం ఈ సినిమా కథ ఇదేనంటూ నెట్టింట ఓ ప్లాట్‌ వైరల్ అవుతోంది. దాని ప్రకారం ‘వార్‌ 2’ అనేది ఇద్దరు స్నేహితుల కథ. అర్జునుడు - కృష్ణుడిలా కలిసి మెలిసి ఉండే ఇద్దరు స్నేహితులు.. చివరికీ శత్రువులుగా మారితే ఎలా ఉంటుంది? అన్న కాన్సెప్ట్‌తో ఈ సినిమా రానుందట. అయితే దీనిపై చిత్ర యూనిట్ ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. ఇదిలా ఉంటే ఇందులో తారక్‌, హృతిక్‌ మధ్య వచ్చే యాక్షన్‌ సీక్వెన్స్‌ నెవర్‌ బీఫోర్‌గా ఉంటాయని బాలీవుడ్‌ వర్గాలు చర్చించుకుంటున్నాయి.  తారక్‌ షూట్‌ హైదరాబాద్‌లోనే! 'వార్‌ 2'లో హృతిక్‌ రోషన్‌ పాత్రకు సంబంధించి కొన్ని యాక్షన్స్‌ సీక్వెన్స్‌ను ఇటీవల తెరకెక్కించారు. సినిమాకు సంబంధించిన గత షెడ్యూల్‌లో వీటిని ఫినిష్‌ చేశారు. ప్రస్తుతం తారక్‌ రోల్‌కు సంబంధించిన యాక్షన్‌ సీన్స్‌ను తెరకెక్కించేందుకు మేకర్స్‌ సన్నాహాలు చేస్తున్నారట. ఈసారి షెడ్యూల్‌లో ఎన్టీఆర్‌ కూడా పాల్గొంటారని బాలీవుడ్‌ వర్గాల్లో జోరుగా చర్చ జరుగుతోంది. ఏప్రిల్‌ ఫస్ట్‌ వీక్‌ నుంచే తారక్‌కు సంబంధించిన షూటింగ్‌ మెుదలయ్యే అవకాశముందని సమాచారం. అది కూడా హైదరాబాద్‌లోని రామోజీ ఫిల్మ్‌ సిటీలో ఈ షెడ్యూల్‌ జరగనుందని తెలుస్తోంది. మరి ఈ షూటింగ్‌లో ఎన్టీఆర్‌ ఏ రేంజ్‌ నటనతో ఆకట్టుకుంటాడో చూడాలి.  మ్యూజిక్‌ డైరెక్టర్‌ అతడే? 'వార్‌ 2' చిత్రానికి సంబంధించి (War 2 Movie Story Leak) మరో వార్త కూడా తెరపైకి వచ్చింది. ఈ మూవీకి బాలీవుడ్ స్టార్‌ మ్యూజిక్‌ డైరెక్టర్‌ ప్రీతమ్‌ స్వరాలు అందించనున్నట్లు సమాచారం. దీనిపై త్వరలోనే అధికారిక ప్రకటన కూడా రానుందట. సూపర్‌ హిట్‌ ఆల్బమ్స్‌ ఇచ్చే సంగీత దర్శకుడిగా ప్రీతమ్‌కు బాలీవుడ్‌లో పేరుంది. ఆయన కూడా ఈ చిత్రంలో భాగమైతే సినిమాపై అంచనాలు మరింత పెరగనున్నాయి. ఇకపోతే ఈ మూవీలో హృతిక్‌ రోషన్‌ పోషించబోయే పాత్ర పేరు కబీర్ అని తెలుస్తోంది. వచ్చే ఏడాది ఆగస్టు 15న విడుదల ‘వార్‌ 2’ను విడుదల చేసేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి.  'వార్‌ 2'లో మరో స్టార్‌ హీరో! ఈ సినిమాలో మరో బాలీవుడ్ స్టార్ జాన్ అబ్రహం (John Abraham) నటించనున్నారు. ఇతడిది కూడా ప్రతినాయకుడి పాత్రేనని అంటున్నారు. భారీ యాక్షన్ ఎంటర్టైనర్‌గా తెరకెక్కుతున్న ఈ సినిమాలో.. హృతిక్ రోషన్‌కు జోడీగా కియారా అద్వానీ (Kiara Advani) కనిపించనుంది. కానీ, ఎన్టీఆర్‌కి జోడీగా చేయబోయే హీరోయిన్ గురించి ఇంకా క్లారిటీ రాలేదు. మరి భారీ అంచనాల మధ్య వస్తున్న ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర ఎలాంటి విజయాన్ని సాధిస్తుందో చూడాలి.
    మార్చి 25 , 2024
    Mrunal Thakur: మృణాల్ లేత అందాలు.. టైట్ డ్రెస్‌లో హాట్ బంప్స్ యంగ్‌ బ్యూటీ మృణాల్‌ ఠాకూర్‌.. మరోమారు మత్తెక్కించే అందాలతో సోషల్‌ మీడియాను హీటెక్కించింది. కళ్లు చెదిరే స్కిన్‌ షోతో నెటిజన్లను ఉక్కిరిబిక్కిరి చేస్తోంది.  తాజాగా ‘69వ ఫిల్మ్‌ఫేర్‌ అవార్డు’ (69th Filmfare Awards)వేడుకల్లో పాల్గొన్న మృణాల్‌.. అక్కడ తన గ్లామర్‌తో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. టైట్‌ఫిట్‌ డ్రెస్‌లో ఎద అందాలను చూపిస్తూ వీక్షకులను ఫిదా చేసింది. ప్రస్తుతం మృణాల్‌కు సంబంధించిన ఫొటోలు, వీడియోలు నెట్టింట విపరీతంగా ట్రెండ్ అవుతున్నాయి. #MrunalThakur హ్యాష్‌టాగ్‌తో అవి వైరల్‌ అవుతున్నాయి. https://twitter.com/i/status/1751880621524484350 ‘సీతారామం’ (Sitaramam) సినిమాతో సూపర్‌ క్రేజ్‌ తెచ్చుకున్న మృణాల్‌ ఠాకూర్‌ (Mrunal Thakur).. ప్రస్తుతం వరుసగా అవకాశాలు దక్కించుకుంటూ బిజీ బిజీగా ఉంటోంది. ఇటీవల బాలీవుడ్‌ మీడియాతో మాట్లాడిన మృణాల్‌ (69th Filmfare Awards) ఆసక్తికర కామెంట్స్‌ చేసింది. కెరీర్ పరంగా ఎదుగుతున్నా హిందీలో మాత్రం పెద్ద సినిమాలలో అవకాశాలు రావడం లేదని వాపోయింది. ముఖ్యంగా రొమాంటిక్‌ సినిమాల్లో ఆఫర్లు రావట్లేదని మృణాల్‌ స్పష్టం చేసింది. కొందరు రొమాంటిక్‌ సినిమాలంటే ఇష్టం లేదని అంటారని.. కానీ అవే చూస్తారని పేర్కొంది.  ఇక ఈ భామ తెలుగు లేటెస్ట్‌ మూవీ 'హాయ్‌ నాన్న' మంచి విజయాన్ని అందుకుంది. ఈ సినిమా కోసం ఆమె దాదాపు రూ.3 కోట్ల రెమ్యూనరేషన్‌ తీసుకున్నట్లు ఇండస్ట్రీలో టాక్‌.  ప్రస్తుతం తెలుగులో విజయ్‌ దేవరకొండ సరసన మృణాల్‌ నటిస్తోంది. పరుశురామ్‌ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రానికి విజయ్‌నే మృణాల్‌ను రిఫర్ చేశాడని సమాచారం.  ఇక తమిళ్‌ స్టార్‌ శివ కార్తికేయన్‌ మూవీలోనూ ఈ బ్యూటీకి అవకాశం దక్కిందట. దర్శకుడు మురగదాస్‌ ఈ సినిమా రూపొందనున్నట్లు తెలుస్తోంది. అనిరుధ్‌ రవిచందర్‌ ఈ సినిమాకు సంగీతం అందిస్తారని టాక్. ఇక మృణాల్ వ్యక్తిగత విషయాలకు వస్తే.. ఆమె 1 ఆగస్టు 1992న మహారాష్ట్రలోని ధూలేలో జన్మించింది.  మృణాల్.. ముంబైలోని KC కాలేజీ డిగ్రీ చేస్తుండగానే టెలివిజన్‌ రంగం వైపు అడుగులు వేశారు. ఈ క్రమంలో ‘కుంకుమ్ భాగ్య’ సీరియల్‌లో నటించి మృణాల్‌ పాపులర్ అయ్యింది. 2014లో విడుదలైన మరాఠీ చిత్రం ‘విట్టి దండు’తో సినీ రంగ ప్రవేశం చేసింది. 2019లో వికాస్ బహ్ల్ బయోపిక్ ‘సూపర్ 30’ నటించి బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చింది. 2020లో నెట్‌ఫ్లిక్స్‌లో వచ్చిన ‘ఆంథాలజీ ఘోస్ట్ స్టోరీస్‌’లోనూ మృణాలు మెరిసింది. ఇందులో ఆమె నటనకు మంచి మార్కులే పడ్డాయి. అదే సంవత్సరం జాన్ అబ్రహంతో కలిసి 'గల్లన్ గోరియా' అనే మ్యూజిక్ వీడియోలోనూ ఈ బ్యూటీ తళుక్కుమంది. 2021లో రాకేష్ ఓంప్రకాష్ మెహ్రా దర్శకత్వం వహించిన ‘తూఫాన్’ అనే స్పోర్ట్స్ డ్రామాలో మృణాల్‌ నటించింది.  ఆ తర్వాత షాహిద్‌ కపూర్‌తో కలిసి ‘జెర్సీ’ సినిమా రీమేక్‌లో ఆమె కనిపించింది. అయితే ఈ చిత్రం ఫ్లాప్‌ టాక్ తెచ్చుకుంది. 
    జనవరి 29 , 2024
    రియల్‌ లైఫ్‌ క్రైమ్స్‌కు స్ఫూర్తినిచ్చిన 10 సినిమాలు/వెబ్‌ సిరీస్‌లు]జాన్‌ అబ్రహం, అభిషేక్ బచ్చన్‌ ‘ధూమ్‌’ సినిమా స్ఫూర్తితో కేరళలో నలుగురు యువకులు బ్యాంక్‌ చోరీకి ప్లాన్‌ చేశారు. ఈ నలుగురు బైకర్స్‌ను పోలీసులు చేజ్‌ చేసి పట్టుకున్నారు.ధూమ్‌
    ఫిబ్రవరి 14 , 2023
    Sharvari Wagh Hot: ఫిట్‌నెస్‌ మాటున శార్వరీ అందాల జాతర.. చూసి తట్టుకోగలరా!  బాలీవుడ్‌ అందాల తార శార్వరీ వాఘ్‌ (Sharvari Wagh) తన అందచందాలతో సోషల్ మీడియాను షేక్‌ చేస్తోంది.  ఫిట్‌నెస్‌కు అధిక ప్రాధాన్యత ఇచ్చే ఈ భామ వ్యాయామం చేస్తూ కష్టపడుతున్న ఫొటోలను తాజాగా షేర్‌ చేసింది.  మెస్మరైజింగ్‌ ఫిట్‌నెస్‌తో పాటు కళ్లు చెదిరే అందాలతో శార్వరీ ఈ ఫొటోల్లో కనిపించింది. ఎద, నడుము, థైస్‌ అందాలు చూపిస్తూ రచ్చ రచ్చ చేసింది.  శార్వరీ లేటెస్ట్ అందాలు చూసి నెటిజన్లు ఫిదా అవుతున్నారు. ఆమె అందాలను ఎంత పొగిడినా తక్కువేనని ప్రశంసిస్తున్నారు.  పదహారేళ్ల వయసులోనే మోడల్‌గా కెరీర్‌ను ప్రారంభించింది. 2013లో క్లీన్‌ అండ్‌ క్లియర్‌ ఫేస్‌ వాష్‌ కాంటెస్ట్‌లో పాల్గొని టైటిల్‌ గెలుచుకుంది.  ఆ తర్వాత యాక్టింగ్‌లో శిక్షణ తీసుకుంది. పలు బ్రాండ్లకు మోడల్‌గా వ్యవహిరించింది. అప్పడే తనకు దర్శకత్వంపై ఆసక్తి కలిగింది.  అలా 2015లో 'ప్యార్‌ కా పంచ్‌నామా 2', బాజీరావ్‌ మస్తానీ, 'సోను కే టిటు కి స్వీటీ' తదితర చిత్రాలకు అసిస్టెంట్‌ డైరెక్టర్‌గా చేసింది.  'ద ఫర్‌గాటెన్‌ అర్మీ - ఆజాదీ కే లియే' వెబ్‌సిరీస్‌తో శార్వరీ నటిగా మారింది. ఆ తర్వాతే సినిమాల్లో నటించే అవకాశాలు దక్కాయి.  తన తొలి చిత్రం 'బంటీ ఔర్‌ బబ్లీ 2'తోనే 2022లో ఐఫా, ఫిల్మ్‌ఫేర్‌ ఉత్తమ నటిగా అవార్డులు గెలుచుకుంది.  ఆ తర్వాత 'ముంజ్యా', మహారాజ్‌ వంటి చిత్రాల్లో శార్వరీకి ఫీమేల్‌ లీడ్‌గా అవకాశాలు దక్కాయి. ‘మహారాజ్‌’ ఈ ఏడాదే విడుదలై పాజిటివ్‌ టాక్‌ తెచ్చుకుంది.  రీసెంట్‌గా జాన్‌ అబ్రహం చేసిన 'వేదా' చిత్రంలోనూ శార్వరీ నటించింది. ఆగస్టు 15న విడుదలైన ఈ చిత్రం నెగిటివ్‌ టాక్‌ తెచ్చుకుంది. అయితే ఇందులో శార్వరీ నటనకు మంచి మార్కులు పడ్డాయి.  ప్రస్తుతం 'ఆల్ఫా' అనే చిత్రంలో శార్వరీ నటిస్తోంది. అలియా భట్ గుడాఛారిగా కనిపించనున్న ఈ చిత్రంలో శార్వరీ కీలక పాత్రలో కనిపించనుంది.  రణ్‌వీర్‌ సింగ్‌, రణ్‌బీర్‌ కపూర్‌లకు తాను వీరాభిమానినని శార్వరీ ఓ సందర్భంలో తెలిపింది. ఖాళీ సమయంలో పెంపుడు జంతువులతో ఆడుకుంటానని తెలిపింది.  ఒత్తిడిగా, చికాకుగా ఉన్న సమయాల్లో పుస్తకాలు చదువుతుంటానని శార్వరీ చెప్పింది. అలా చేయడం ద్వారా వెంటనే వాటి నుంచి బయటపడతానిని పేర్కొంది.
    ఆగస్టు 26 , 2024

    జాన్ అబ్రహం వ్యక్తిగత వివరాలు, ఎత్తు, పుట్టిన ప్రదేశం, బర్త్‌ డేట్‌, వయస్సు, సాధించిన విజయాలు, అవార్డులు, వ్యాపారాలు, ఇష్టాఇష్టాలు, అభిరుచులు తెలుసుకోండి. అలాగే జాన్ అబ్రహం కుటుంబ నేపథ్యం, తల్లిదండ్రులు, తోబుట్టువులు, రిలేషన్స్‌, విద్యా నేపథ్యం, కెరీర్ మైలురాళ్లు, తాజా ప్రాజెక్ట్‌లు, అధికారిక సోషల్ మీడియా అకౌంట్స్, లేటెస్ట్‌ చిత్రాలను ఒక్క క్లిక్‌తో ఇక్కడ తెలుసుకోండి.

    @2021 KTree