యంగ్ బ్యూటీ మృణాల్ ఠాకూర్.. మరోమారు మత్తెక్కించే అందాలతో సోషల్ మీడియాను హీటెక్కించింది. కళ్లు చెదిరే స్కిన్ షోతో నెటిజన్లను ఉక్కిరిబిక్కిరి చేస్తోంది.
తాజాగా ‘69వ ఫిల్మ్‌ఫేర్ అవార్డు’ (69th Filmfare Awards)వేడుకల్లో పాల్గొన్న మృణాల్.. అక్కడ తన గ్లామర్‌తో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. టైట్‌ఫిట్ డ్రెస్‌లో ఎద అందాలను చూపిస్తూ వీక్షకులను ఫిదా చేసింది.
ప్రస్తుతం మృణాల్‌కు సంబంధించిన ఫొటోలు, వీడియోలు నెట్టింట విపరీతంగా ట్రెండ్ అవుతున్నాయి. #MrunalThakur హ్యాష్‌టాగ్‌తో అవి వైరల్ అవుతున్నాయి.
‘సీతారామం’ (Sitaramam) సినిమాతో సూపర్ క్రేజ్ తెచ్చుకున్న మృణాల్ ఠాకూర్ (Mrunal Thakur).. ప్రస్తుతం వరుసగా అవకాశాలు దక్కించుకుంటూ బిజీ బిజీగా ఉంటోంది.
ఇటీవల బాలీవుడ్ మీడియాతో మాట్లాడిన మృణాల్ (69th Filmfare Awards) ఆసక్తికర కామెంట్స్ చేసింది. కెరీర్ పరంగా ఎదుగుతున్నా హిందీలో మాత్రం పెద్ద సినిమాలలో అవకాశాలు రావడం లేదని వాపోయింది.
ముఖ్యంగా రొమాంటిక్ సినిమాల్లో ఆఫర్లు రావట్లేదని మృణాల్ స్పష్టం చేసింది. కొందరు రొమాంటిక్ సినిమాలంటే ఇష్టం లేదని అంటారని.. కానీ అవే చూస్తారని పేర్కొంది.
ఇక ఈ భామ తెలుగు లేటెస్ట్ మూవీ ‘హాయ్ నాన్న’ మంచి విజయాన్ని అందుకుంది. ఈ సినిమా కోసం ఆమె దాదాపు రూ.3 కోట్ల రెమ్యూనరేషన్ తీసుకున్నట్లు ఇండస్ట్రీలో టాక్.
ప్రస్తుతం తెలుగులో విజయ్ దేవరకొండ సరసన మృణాల్ నటిస్తోంది. పరుశురామ్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రానికి విజయ్‌నే మృణాల్‌ను రిఫర్ చేశాడని సమాచారం.
ఇక తమిళ్ స్టార్ శివ కార్తికేయన్ మూవీలోనూ ఈ బ్యూటీకి అవకాశం దక్కిందట. దర్శకుడు మురగదాస్ ఈ సినిమా రూపొందనున్నట్లు తెలుస్తోంది. అనిరుధ్ రవిచందర్ ఈ సినిమాకు సంగీతం అందిస్తారని టాక్.
ఇక మృణాల్ వ్యక్తిగత విషయాలకు వస్తే.. ఆమె 1 ఆగస్టు 1992న మహారాష్ట్రలోని ధూలేలో జన్మించింది.
మృణాల్.. ముంబైలోని KC కాలేజీ డిగ్రీ చేస్తుండగానే టెలివిజన్ రంగం వైపు అడుగులు వేశారు. ఈ క్రమంలో ‘కుంకుమ్ భాగ్య’ సీరియల్‌లో నటించి మృణాల్ పాపులర్ అయ్యింది.
2014లో విడుదలైన మరాఠీ చిత్రం ‘విట్టి దండు’తో సినీ రంగ ప్రవేశం చేసింది. 2019లో వికాస్ బహ్ల్ బయోపిక్ ‘సూపర్ 30’ నటించి బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చింది.
2020లో నెట్‌ఫ్లిక్స్‌లో వచ్చిన ‘ఆంథాలజీ ఘోస్ట్ స్టోరీస్’లోనూ మృణాలు మెరిసింది. ఇందులో ఆమె నటనకు మంచి మార్కులే పడ్డాయి.
అదే సంవత్సరం జాన్ అబ్రహంతో కలిసి ‘గల్లన్ గోరియా’ అనే మ్యూజిక్ వీడియోలోనూ ఈ బ్యూటీ తళుక్కుమంది.
2021లో రాకేష్ ఓంప్రకాష్ మెహ్రా దర్శకత్వం వహించిన ‘తూఫాన్’ అనే స్పోర్ట్స్ డ్రామాలో మృణాల్ నటించింది.
ఆ తర్వాత షాహిద్ కపూర్‌తో కలిసి ‘జెర్సీ’ సినిమా రీమేక్‌లో ఆమె కనిపించింది. అయితే ఈ చిత్రం ఫ్లాప్ టాక్ తెచ్చుకుంది.