• TFIDB EN
  • రాజేంద్ర ప్రసాద్
    జననం : జూలై 19 , 1956
    ప్రదేశం: నిమ్మకూరు, ఆంధ్ర రాష్ట్రం, భారతదేశం
    తెలుగు ప్రేక్షకుల హృదయాల్లో నటకిరిటీగా ప్రఖ్యాతి గాంచిన రాజేంద్ర ప్రసాద్.. బాపు డైరెక్షన్‌లో వచ్చిన స్నేహం(1977) చిత్రం ద్వారా తెలుగు తెరకు పరిచయం అయ్యాడు. 'అహ నా పెళ్లంట', లేడీస్ టైలర్, అప్పుల అప్పారావు, ఏప్రిల్ 1 విడుదల, మాయలోడు, 'ఆ నలుగుగురు' చిత్రాలు మంచిపేరు తెచ్చిపెట్టాయి. ఎక్కువగా హాస్య ప్రధానమైన చిత్రాల్లో నటించాడు. కారెక్టర్ నటులు మాత్రమే కామెడీని పండిస్తున్న ఆరోజుల్లో హీరో కూడా నవ్వుల్ని పూయించగలడు అని నిరూపించాడు రాజేంద్రప్రసాద్. జంధ్యాల, రేలంగి నరసింహారావు, ఈవీవీ సత్యనారాయణ, బాపు లాంటి దిగ్గజ దర్శకులతో పనిచేసిన ఘనత రాజేంద్రప్రసాదుది. 45 సంవత్సరాలకు పైగా తన సినీ కెరీర్‌లో రాజేంద్రప్రసాద్ 200కు పైగా సినిమాలలో నటించారు. ప్రస్తుతం క్యారెక్టర్ ఆర్టిస్టుగా రాణిస్తున్నారు. సహాయ నటుడిగా శ్రీమంతుడు, కౌసల్యకృష్ణమూర్తి, నాన్నకు ప్రేమతో, మహానటి వంటి హిట్ చిత్రాల్లో నటించారు.
    Read More
    Description of the image
    Editorial List
    రాజేంద్ర ప్రసాద్ నటించిన బెస్ట్ కామెడీ చిత్రాల లిస్ట్ ఇదే
    రాజేంద్ర ప్రసాద్ టాప్ బెస్ట్ 15 సినిమాల లిస్ట్ ఇదే!Editorial List
    రాజేంద్ర ప్రసాద్ టాప్ బెస్ట్ 15 సినిమాల లిస్ట్ ఇదే!
    తేజ సజ్జా 'హనుమాన్' మాదిరి తెలుగులో ఇప్పటి వరకు వచ్చిన  ఈ సినిమాల గురించి మీకు తెలుసా?Editorial List
    తేజ సజ్జా 'హనుమాన్' మాదిరి తెలుగులో ఇప్పటి వరకు వచ్చిన ఈ సినిమాల గురించి మీకు తెలుసా?
    తెలుగులో టాప్ స్పోర్ట్స్ డ్రామా చిత్రాలు ఇవే!Editorial List
    తెలుగులో టాప్ స్పోర్ట్స్ డ్రామా చిత్రాలు ఇవే!
    కథనాలు
    Rajendra Prasad: అల్లు అర్జున్‌ని.. “పిచ్చోడా అని అన్నాను”: రాజేంద్ర ప్రసాద్
    Rajendra Prasad: అల్లు అర్జున్‌ని.. “పిచ్చోడా అని అన్నాను”: రాజేంద్ర ప్రసాద్ సీనియర్ నటుడు రాజేంద్ర ప్రసాద్ తన వ్యంగ్యంతో, హాస్యంతో స్టేజ్‌పై సరికొత్త ఉత్సాహాన్ని నింపుతారని అందరికీ తెలిసిందే. అయితే, ఇటీవల ఓ సినిమా ప్రమోషన్ ఈవెంట్‌లో ఆయన చేసిన వ్యాఖ్యలు పెద్ద దుమారమే రేపాయి. ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారి వివాదానికి దారి తీశాయి. తాజాగా ఆ వ్యాఖ్యలు ఏ సందర్భంలో ఎందుకు అనాల్సి వచ్చిందో వివరణ ఇచ్చారు. వివాదానికి కారణమైన వ్యాఖ్యలు ఒక ఈవెంట్‌లో రాజేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ, “ఇప్పుడు సినిమాల కథలు పూర్తిగా మారిపోయాయి. వాడెవడో ఎర్ర చందనం దొంగ... వాడు హీరో!” అన్నారు. ఈ వ్యాఖ్యలు బన్నీని ఉద్దేశించి అన్నట్లుగా అనిపించడంతో, పుష్ప 2 ఫ్యాన్స్ బాగా ఆగ్రహం వ్యక్తం చేశారు. సోషల్ మీడియాలో అల్లు అర్జున్‌ను అవమానించారని ప్రచారం ఎక్కువైంది. దీనిపై పెద్ద ఎత్తున అల్లు అర్జున్ ఫ్యాన్స్ ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజేంద్ర ప్రసాద్ క్షమాపణలు చెప్పాలని డిమాండ్ కూడా చేశారు. అల్లు అర్జున్‌కి క్లారిటీ తాజాగా, ఓ ఇంటర్వ్యూలో రాజేంద్ర ప్రసాద్ ఈ విషయంపై స్పందిస్తూ, "ఇటీవల అల్లు అర్జున్‌తో మాట్లాడాను. ఆయనే నాకు సర్దిచెప్పాడు. ‘అంకుల్, మీరు అలా అనలేదని నాకు తెలుసు. పిచ్చోడా నేనే అన్నాను’ అని వివరణ ఇచ్చాను.  మీరు అన్నది ఆ ఉద్దేశ్యంతో అయ్యి ఉండదు అని బన్నీ అన్నాడు. నేను ఆ ఉద్దేశ్యంతో అనలేదు అని చెప్పాను.  https://twitter.com/Theteluguone/status/1876904465107726713 అసలు ఉద్దేశం రాజేంద్ర ప్రసాద్ వ్యాఖ్యలు కేవలం ప్రస్తుత సినీ కథా ప్రక్రియల మార్పులను ప్రతిబింబించడానికేనని తెలుస్తోంది. ఆయన పుష్ప సినిమా గురించి కాకుండా, జనరల్‌గా నేటి కథలపై వ్యాఖ్యానించినట్లు చెబుతున్నారు. కానీ అప్పట్లో పుష్ప 2 మేనియా నడుస్తుండటంతో ఆయన వ్యాఖ్యలు సెన్సేషన్ అయ్యాయి. తప్పుడు కథనాలపై ఫైర్ రాజేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ, “సోషల్ మీడియాలో మనం చెప్పింది వేరే, వాళ్లు రాస్తోంది వేరే. ప్రతి విషయాన్ని నెగెటివ్‌గా చూపిస్తున్నారు. ఒకసారి నాకు తెలిసిన వ్యక్తిని ప్రశ్నించాను. నేను చెప్పింది వేరే, ఆయన రాసింది వేరే. టైటిల్ నెగెటివ్‌గా పెడితేనే క్లిక్స్ వస్తాయని వాళ్లు చెబుతున్నారు. దాంతో అసలు కంటెంట్‌ను అందరూ తప్పుగా అర్థం చేసుకుంటున్నారు,” అంటూ తన అసహనాన్ని వ్యక్తం చేశారు. ఫ్యాన్స్‌కు పిలుపు రాజేంద్ర ప్రసాద్ పుష్ప ఫ్యాన్స్‌ను ఉద్దేశించి, "నేను ఎప్పుడూ ఎవ్వరిని అవమానించను. నా వ్యాఖ్యల ఉద్దేశం కేవలం కథల దిశ మార్పుల గురించే. దయచేసి నాపై వచ్చిన తప్పుడు వార్తల్ని నమ్మకండి," అంటూ స్పష్టం చేశారు. తాజా సినిమా 'షష్ఠిపూర్తి' ఇదిలా ఉంటే, రాజేంద్ర ప్రసాద్ నటించిన కొత్త సినిమా షష్ఠిపూర్తి విడుదలకు సిద్ధమవుతోంది. ఈ సినిమా ప్రమోషన్‌లో భాగంగానే ఈ వివాదంపై మాట్లాడిన ఆయన, తన వైఖరిని స్పష్టంగా చెప్పే ప్రయత్నం చేశారు. రాజేంద్ర ప్రసాద్ చేసిన వ్యాఖ్యలు అనాలోచితమైనవిగా అభిప్రాయపడినా, ఆయన ఉద్దేశ్యం పూర్తిగా అపార్థం అయ్యిందని స్పష్టమవుతోంది. అల్లు అర్జున్ కూడా వ్యక్తిగతంగా స్పందించి ఈ వివాదాన్ని సద్దుమణిగేలా చేశారు.
    జనవరి 09 , 2025
    Rajendra Prasad: రాజేంద్ర ప్రసాద్ ఇంట్లో విషాదం.. కంటతడి పెట్టిస్తున్న పాత వీడియో సినీ నటుడు రాజేంద్ర ప్రసాద్ ఇంట్లో తీవ్ర విషాదం నెలకొంది. ఆయన కూతూరు గాయత్రి(38) గుండె పొటుతో శనివారం తెల్లవారుజామున తుది శ్వాస విడిచారు. ఈ సంఘటనతో యావత్తు తెలుగు సినీలోకం దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది. రాజేంద్ర ప్రసాద్‌కు ప్రగాఢ సానుభూతి తెలిపింది. ఈ సమాచారం తెలిసి సినీ నటులు శివాజీ రాజా, సాయికుమార్, విక్టరీ వెంకటేష్, మాజీ ఎమ్మెల్యే ఎర్రబెల్లి దయాకర్‌ రావు, డైరెక్టర్ అనిల్ రావుపూడి ఆయన్ను పరామర్శించారు. రాజేంద్ర ప్రసాద్‌కు ఏకైక కూతురు కావడంతో ఆయన తీవ్ర మనోవేదనకు గురవుతున్నారు. https://twitter.com/Theteluguone/status/1842470053838524558 రాజేంద్ర ప్రసాద్ తన కూతురు గాయత్రి అంటే ఎంత ఇష్టమో పలు వేదికలపై చర్చించారు. ప్రస్తుతం ఆ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. తన ఒక్కగానొక్క కూతురు గాయత్రి ప్రేమ వివాహం చేసుకుందని ఆమెతో కొన్నేళ్లు మాట్లాడలేదని ఆ వీడియోలో చెప్పుకొచ్చారు. ఒక తల్లిలేని వాడు తన తల్లిని చూసుకోవాలంటే కూతురులో చూసుకుంటాడు అని తెలిపారు. తనలో తన చనిపోయిన అమ్మను చూసుకున్నానని భావోద్వేగానికి లోనయ్యారు. తనకు తన బిడ్డ రెండో తల్లి లాంటిది అని చెప్పుకొచ్చారు. తన తల్లి చనిపోయినప్పుడు కూడా తను ఏడవలేదని కానీ తన కూతురుకు ఏమైన అయితే మాత్రం తట్టుకోలేనని వెల్లడించారు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ అవుతోంది. https://twitter.com/Marx2PointO/status/1842423836060406267 సినీలోకం సంతాప సందేశం ‘‘రాజేంద్రప్రసాద్ గారి కుమార్తె గాయత్రి మరణం ఎంతో విచారకరం. ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని దేవుడిని ప్రార్థిస్తున్నాను. వారి కుటుంబసభ్యులకు నా ప్రగాఢ సానుభూతి’’ - ఏపీ మంత్రి లోకేశ్‌ ‘‘ప్రముఖ నటుడు రాజేంద్రప్రసాద్ గారి కుమార్తె గాయత్రి హఠాన్మరణం తెలిసి మనసు తీవ్రంగా కలచివేసింది. ఆమె ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటున్నాను. వారి కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నాను. పుత్రికను కోల్పోవడం ఎంతటి పెద్ద విషాదమో, ఈ కష్టాన్ని అధిగమించే శక్తిని భగవంతుడు వారికి ప్రసాదించాలని ప్రార్థిస్తున్నాను’’ - ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్‌ ‘‘కుమార్తెలో అమ్మను చూసుకున్న రాజేంద్రప్రసాద్ గారికి పుత్రిక వియోగం కావడం నిజంగా అంతులేని బాధ. వారి కుటుంబానికి నా ప్రగాఢ సంతాపం తెలియజేస్తున్నాను. ఈ కష్ట సమయంలో దేవుడు వారిని ధైర్యంగా ఉండేలా ఆశీర్వదించాలని ప్రార్థిస్తున్నాను’’ - సాయి ధరమ్ తేజ్‌ ‘‘రాజేంద్రప్రసాద్ గారి కుటుంబానికి అత్యంత ఆప్తులైన గాయత్రి మరణం వ్యక్తిగతంగా ఎంతో బాధను కలిగించింది. ఆమె ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటున్నాను. వారి కుటుంబానికి నా హృదయపూర్వక సానుభూతి’’ - జూ.ఎన్టీఆర్‌ ‘‘రాజేంద్రప్రసాద్ గారి కుటుంబానికి నా గాఢ సానుభూతి. ఈ కష్టాన్ని వారికి ఎప్పటికీ తలచుకునే విషాదం. దేవుడు వారికి ధైర్యం ఇవ్వాలని కోరుకుంటున్నాను’’ - వరుణ్ తేజ్‌ ‘‘గాయత్రి మరణం నిజంగా చాలా బాధాకరం. ఈ సమయంలో రాజేంద్రప్రసాద్ గారికి, వారి కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను. ఆమె ఆత్మకు శాంతి’’ - నవదీప్‌ ‘‘రాజేంద్రప్రసాద్ గారి కుటుంబానికి నా సానుభూతి. వారి బాధకు మాటలు సరిపోవు. చాలా బాధగా ఉంది’’ - కీర్తి సురేశ్‌ ‘‘నా సోదరుడు రాజేంద్రప్రసాద్ గారికి సానుభూతి తెలుపుతున్నాను. వారి కుటుంబం ఈ విపత్కర సమయాన్ని ధైర్యంగా ఎదుర్కొనే శక్తిని పొందాలని ప్రార్థిస్తున్నాను’’ - నరేశ్ తెలుగు ప్రేక్షకుల హృదయాల్లో నటకిరిటీగా ప్రఖ్యాతి గాంచిన రాజేంద్ర ప్రసాద్.. బాపు డైరెక్షన్‌లో వచ్చిన స్నేహం(1977) చిత్రం ద్వారా తెలుగు తెరకు పరిచయం అయ్యాడు. 'అహ నా పెళ్లంట', లేడీస్ టైలర్, అప్పుల అప్పారావు, ఏప్రిల్ 1 విడుదల, మాయలోడు, 'ఆ నలుగుగురు' చిత్రాలు మంచిపేరు తెచ్చిపెట్టాయి. ఎక్కువగా హాస్య ప్రధానమైన చిత్రాల్లో నటించాడు. కారెక్టర్ నటులు మాత్రమే కామెడీని పండిస్తున్న ఆరోజుల్లో హీరో కూడా నవ్వుల్ని పూయించగలడు అని నిరూపించాడు రాజేంద్రప్రసాద్. జంధ్యాల, రేలంగి నరసింహారావు, ఈవీవీ సత్యనారాయణ, బాపు లాంటి దిగ్గజ దర్శకులతో పనిచేసిన ఘనత రాజేంద్రప్రసాదుది. 45 సంవత్సరాలకు పైగా తన సినీ కెరీర్‌లో రాజేంద్రప్రసాద్ 200కు పైగా సినిమాలలో నటించారు. ప్రస్తుతం క్యారెక్టర్ ఆర్టిస్టుగా రాణిస్తున్నారు. సహాయ నటుడిగా శ్రీమంతుడు, కౌసల్యకృష్ణమూర్తి, నాన్నకు ప్రేమతో, మహానటి వంటి హిట్ చిత్రాల్లో నటించారు. రాజేంద్ర ప్రసాద్ తెలుగు సినీ పరిశ్రమలోనే కాకుండా క్విక్ గన్ మురుగన్ అనే సినిమాతో హాలీవుడ్లో కూడా నటించారు. నటుడిగా, నిర్మాతగా, సంగీత దర్శకునిగా సత్తా చాటారు. మేడమ్ సినిమాలో ప్రయోగాత్మకంగా మహిళ పాత్ర పోషించి తన ప్రత్యేకతను చాటుకున్నారు. రాజేంద్ర ప్రసాద్ ప్రముఖ నటి రమాప్రభ కూతురు విజయ చాముండేశ్వరిని వివాహం చేసుకున్నారు.
    అక్టోబర్ 05 , 2024
    Rajendra Prasad: ‘ఎర్ర చందనం దొంగ హీరోనా’.. రాజేంద్ర ప్రసాద్‌ షాకింగ్‌ కామెంట్స్‌! ప్రస్తుతం యావత్‌ దేశం ‘పుష్ప 2’ (Pushpa 2) సినిమా గురించి మాట్లాడుకుంటోంది. రోజు రోజుకి కలెక్షన్స్‌ పరంగా పుష్పరాజ్‌ సృష్టిస్తున్న రికార్డ్స్‌ చూసి సినీ లవర్స్‌ ఆశ్చర్యపోతున్నారు. ఈ స్థాయి విజయం భారత సినీ చరిత్రలో అల్లు అర్జున్‌కు తప్ప ఏ నటుడికి సాధ్యం కాలేదని ప్రశంసిస్తున్నారు. ‘పుష్ప 2’తో బన్నీకి మరో నేషనల్ అవార్డు రావడం ఖాయమని నెట్టింట పోస్టులు పెడుతున్నారు. ప్రస్తుతం దేశం మెుత్తం పుష్ప 2 ఫీవర్‌ నడుస్తున్న సమయంలో సీనియర్‌ నటుడు రాజేంద్ర ప్రసాద్‌ (Harikatha Prerelease Event) ఈ సినిమాపై స్టన్నింగ్‌ కామెంట్స్‌ చేశారు. సినిమా పేరు ప్రస్తావించకుండా ‘ఎర్ర చందనం దొంగిలించేవాడు హీరోనా’ అని మాట్లాడారు. అంతటి సీనియర్‌ యాక్టర్‌ ఇలా ఎందుకు మాట్లాడారని నెటిజన్లు చర్చించుకుంటున్నారు.  హరికథ ప్రీరిలీజ్‌ ఈవెంట్‌.. రాజేంద్ర ప్రసాద్‌ (Rajendra Prasad) కీలక పాత్రలో నటించిన మిస్టరీ థ్రిల్లర్‌ హరికథ వెబ్‌ సిరీస్ ఈ వారమే ఓటీటీలో స్ట్రీమింగ్‌ కానుంది. పలు సూపర్‌ హిట్‌ చిత్రాలు నిర్మించిన ప్రముఖ ప్రొడక్షన్ సంస్థ పీపుల్స్‌ మీడియా ఫ్యాక్టరీ తొలిసారి ఈ సిరీస్‌ ద్వారా ఓటీటీలో అడుగుపెడుతోంది. ఇందులో రాజేంద్ర ప్రసాద్‌, శ్రీరామ్‌, దివి, అంబటి అర్జున్‌ కీలక పాత్రలు పోషించారు. మగ్గీ దర్శకత్వం వహించారు. డిసెంబర్‌ 13 నుంచి ఈ సిరీస్‌ స్ట్రీమింగ్‌కు రానుంది. ఈ నేపథ్యంలో మేకర్స్‌ తాజాగా ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ను నిర్వహించారు. హైదరాబాద్‌లో జరిగిన ఈ ఈవెంట్‌లో సిరీస్‌ బృందమంతా పాల్గొంది.  రాజేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ.. ‘హరికథ’ సిరీస్ గురించి మాట్లాడుతూ రాజేంద్ర ప్రసాద్‌ (Harikatha Prerelease Event) ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. త్రేతాయుగం, ద్వాపరయుగం, కలియుగం గురించి ఆయన ప్రస్తావించారు. ప్రస్తుత కలియుగంలో కథలు ఎలా వస్తున్నాయో మనం చూస్తూనే ఉన్నామని అన్నారు. ‘నిన్న గాక మెున్న చూశాం. వాడెవడో చందనం దొంగిలించే దొంగ.. వాడు హీరో. హీరోల మీనింగ్‌లు మారిపోయాయి’ అంటూ చెప్పుకొచ్చారు. తన 48 ఏళ్ల సినీ జీవితంలో మన చుట్టూ ఉండే పాత్రలు చేసే అదృష్టం లభించిందన్నారు. ‘లేడీస్‌ టైలర్’, ‘అప్పుల అప్పారావు’, ‘పేకాట పాపారావు’ వంటి సినిమాలను ప్రస్తావించారు.  https://www.youtube.com/watch?v=N-eSYXCH7KM ‘రూ.1000 టికెట్‌ పెట్టి వెళ్లక్కర్లా’ ‘హరికథ’ (Harikatha Prerelease Event) సిరీస్‌లో దేవుడే దుష్టసంహారం చేస్తున్నట్లు చూపించనున్నారు. దీనిపై రాజేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ దేవుడు ఎందుకు చంపుతాడు? అనుకునే వారు సిరీస్‌ చూడాల్సిందేనన్నారు. ‘ఇది పెద్ద కష్టమేమి కాదు. థియేటర్లకు రూ.1000 ఖర్చు పెట్టిమరీ వెళ్లేంత పని లేదు. హ్యాపీగా ఇంట్లోనే చూడొచ్చు’ అని చెప్పారు. అయితే ‘పుష్ప 2’ ప్రీమియర్స్‌ సందర్భంగా ఒక్కో టికెట్‌ రూ.1000కి పైగా అమ్మారు. ఈ నేపథ్యంలోనే రాజేంద్ర ప్రసాద్ సెటైర్లు వేసి ఉండొచ్చని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు.  https://twitter.com/peoplemediafcy/status/1866082101659070546 తొడ కొట్టిన రాజేంద్ర ప్రసాద్‌.. ‘హరికథ’ సిరీస్‌ గురించి మాట్లాడుతూ రాజేంద్ర ప్రసాద్ తొడగొట్టి అందరికీ ఛాలెంజ్‌ చేశారు. ఈ సిరీస్‌ చూశాక మీరందరూ థియేటర్‌లో ఎందుకు రిలీజ్‌ చేయలేదని తనను తిడతారని అన్నారు. అలా జరగకపోతే తన పేరు మార్చి మరొకటి పెట్టుకుంటానని అన్నారు. సత్యంగా చెబుతున్నానని అన్నారు. ఈ మాటలతో ఈవెంట్ ప్రాంగణం మెుత్తం చప్పట్లు, విజిల్స్‌తో మారు మోగింది. అటు ఓటీటీల గురించి సైతం రాజేంద్ర ప్రసాద్‌ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. థియేటర్ల నుంచి సినిమా ఇంటికి వచ్చేసిందని, ఈ రోజుల్లో సినిమా ఇంట్లోనే ఉందని అన్నారు.  https://twitter.com/peoplemediafcy/status/1866091296110318029
    డిసెంబర్ 09 , 2024
    Laggam Movie Review: తెలంగాణ పెళ్లి ఆచారాలకు అద్దం పట్టిన ‘లగ్గం’.. సినిమా మెప్పించిందా? నటీనటులు: సాయి రోనక్, రాజేంద్ర ప్రసాద్,  ప్రగ్యా నగ్రా, రాజేంద్ర ప్రసాద్, రఘుబాబు, సప్తగిరి, కృష్ణుడు, రోహిణి తదితరులు రచన, దర్శకత్వం : రమేశ్ చెప్పాల సంగీతం: చరణ్‌ అర్జున్ నేపథ్య సంగీతం: మణిశర్మ సినిమాటోగ్రఫీ: ఎం.ఎన్. బాల్ రెడ్డి ఎడిటర్: బొంతల నాగేశ్వరరావు నిర్మాత: వేణు గోపాల్ రెడ్డి విడుదల తేది: 25-10-2024 సాయిరోనక్ (Sai Ronak), ప్రగ్యా నగ్రా (Pragya Nagra) జంటగా చేసిన చిత్రం ‘లగ్గం’ (Laggam Movie Review). ఈ చిత్రానికి రమేశ్‌ చెప్పాల దర్శకత్వం వహించారు. వేణుగోపాల్‌ రెడ్డి నిర్మాత. రాజేంద్రప్రసాద్, ఎల్బీ శ్రీరామ్, రోహిణి, సప్తగిరి, కృష్ణుడు, రఘుబాబు తదితరులు కీలక పాత్రలు పోషించారు. అక్టోబర్‌ 25న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ప్రేక్షకులను మెప్పించిందా? లేదా? ఈ రివ్యూలో తెలుసుకుందాం.  కథేంటి తెలంగాణలోని ఓ పల్లెటూరికి చెందిన సదానందం (రాజేంద్రప్రసాద్‌) పనిమీద హైదరాబాద్‌ వస్తాడు. చెల్లెలు (రోహిణి) నగరంలోనే ఉండటంతో ఆమెను చూసేందుకు ఇంటికి వెళ్తాడు. సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్‌గా పనిచేస్తున్న చెల్లెలు కొడుకు చైతన్య (సాయి రోనక్‌) లైఫ్‌ స్టైల్‌ చూసి కూతురు మానస (ప్రగ్యా )ను అతడికిచ్చి పెళ్లి చేయాలని నిర్ణయించుకుంటాడు. మానసకు పెళ్లి ఇష్టం లేకపోయినా ఒప్పుకుంటుంది. దీంతో ఇరుకుటుంబాలు లగ్గం కుదుర్చుకుంటారు. అయితే ఓ కారణం చేత ఉద్యోగానికి చైతన్య రిజైన్ చేస్తాడు. ఆ విషయాన్ని సదానందం దగ్గర దాస్తాడు. దీంతో సదానందం పెళ్లి ఆపేందుకు స్కెచ్‌ వేస్తాడు. మరోవైపు చైతన్య కూడా పెళ్లి ఆపాలని నిర్ణయించుకుంటాడు. అయితే అప్పటివరకూ పెళ్లి ఇష్టం లేని మానస కొన్ని కారణాల వల్ల చైతన్యపై మనసు పారేసుకుంటుంది. ఆ తర్వాత ఏం జరిగింది? ఉద్యోగానికి చైతన్య ఎందుకు రిజైన్‌ చేశాడు? చైతన్య-మానస పెళ్లి జరిగిందా లేదా? అన్నది తెలియాలంటే సినిమా చూడాల్సిందే.  ఎవరెలా చేశారంటే చైతన్య పాత్రలో సాయి రోనాక్ ఆకట్టుకున్నాడు. సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగిగా, కుటుంబ సభ్యుల సంతోషానికి విలువ ఇచ్చే యువకుడి పాత్రలో చక్కగా ఒదిగిపోయాడు. హీరోయిన్‌ మానస పాత్రలో ప్రగ్యా నగారా మెప్పించింది. నటనకు ప్రాధాన్యం ఉన్న పాత్రలో ఆమె మెస్మరైజ్‌ చేసింది. సాయి రోనాక్‌, ప్రగ్యా మధ్య కెమెస్ట్రీ చక్కగా పండింది. తెరపై ఇద్దరూ పోటీపడి మరి నటించారు. హీరోయిన్‌ తండ్రి సదానందం పాత్రలో దిగ్గజ నటుడు రాజేంద్ర ప్రసాద్‌ ఎప్పటిలాగే చెరగని ముద్ర వేశారు. హీరో తల్లి పాత్రలో రోహిణి చక్కగా చేసింది. రఘుబాబు, కృష్ణుడు, ఎల్బీ శ్రీరామ్, కిరీటి వంటి వాళ్ళు తమ పాత్రల పరిధి మేరకు ఆకట్టుకున్నారు. మిగిలిన నటీనటులు పర్వాలేదనిపించారు. డైరెక్షన్ ఎలా ఉందంటే తెలంగాణలోని పెళ్లి ఆచార వ్యవహారాలు, పద్దతులను చూపిస్తూ ఈ సినిమాను తెరకెక్కించాడు దర్శకుడు. పెళ్లంటే మూడు ముళ్లే కాదని రెండు తరాల ఆత్మీయ కలయిక అని చాటి చెప్పే ప్రయత్నం చేశాడు. తొలిభాగంలో హీరో పరిచయం, సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగుల కలర్‌ఫుల్‌ లైఫ్‌ను చూపించారు డైరెక్టర్‌. లగ్గం కుదిరినప్పటి నుంచి తెలంగాణ సంప్రదాయాలను, ఆచారాలను కళ్లకు కట్టారు. ఇంటర్వెల్‌ సమయానికి అసలు పెళ్లి జరుగుతుందా లేదా అన్న సస్పెన్స్‌ క్రియేట్‌ చేసి సెకండాఫ్‌పై ఆసక్తి కలిగించాడు. మానస ఎందుకు మనసు మార్చుకుంది? చైతన్య ఎందుకు పెళ్లి చేసుకోవద్దు? అనుకున్నాడు వంటి సీన్స్‌ను బాగా చూపించారు. అయితే కొన్ని సీన్స్‌లో కనెక్టివిటి మిస్‌ కావడం మైనస్‌గా చెప్పవచ్చు. సాగదీత సన్నివేశాలు సైతం ప్రేక్షకుల సహనానికి పరీక్ష పెడతాయి. క్లైమాక్స్‌లో వచ్చే అప్పగింతల సీన్‌ ప్రతీ యువతికి, తల్లిదండ్రులకు కనెక్ట్ అయ్యేలా తీర్చిదిద్డడంలో డైరెక్టర్ సక్సెస్ అయ్యాడు.  సాంకేతికంగా.. టెక్నికల్ అంశాల విషయానికి వస్తే మణిశర్మ అందించిన బ్యాక్‌గ్రౌండ్‌ స్కోర్ బాగా వర్కౌట్ అయింది. చాలా సన్నివేశాలను ఈ బ్యాగ్రౌండ్ స్కోర్ ఎలివేట్ చేసింది. అలాగే సినిమాటోగ్రఫీ కూడా సినిమాకి మరొక అదనపు ఆకర్షణ. చరణ్ అర్జున్ పాటలు బాగున్నాయి. నాగేశ్వర్ రెడ్డి బొంతల ఎడిటింగ్ సినిమాకి కరెక్ట్‌గా సెట్ అయింది. నిర్మాణ విలువలు కూడా బాగున్నాయి. ప్లస్ పాయింట్స్ కథ, కథనంప్రధాన తారాగణం నటనసంగీతం మైనస్‌ పాయింట్స్‌ సాగదీత సన్నివేశాలుమాస్‌ ఎలిమెంట్స్ లేకపోవడం Telugu.yousay.tv Rating : 3/5 
    అక్టోబర్ 25 , 2024

    రాజేంద్ర ప్రసాద్ వ్యక్తిగత వివరాలు, ఎత్తు, పుట్టిన ప్రదేశం, బర్త్‌ డేట్‌, వయస్సు, సాధించిన విజయాలు, అవార్డులు, వ్యాపారాలు, ఇష్టాఇష్టాలు, అభిరుచులు తెలుసుకోండి. అలాగే రాజేంద్ర ప్రసాద్ కుటుంబ నేపథ్యం, తల్లిదండ్రులు, తోబుట్టువులు, రిలేషన్స్‌, విద్యా నేపథ్యం, కెరీర్ మైలురాళ్లు, తాజా ప్రాజెక్ట్‌లు, అధికారిక సోషల్ మీడియా అకౌంట్స్, లేటెస్ట్‌ చిత్రాలను ఒక్క క్లిక్‌తో ఇక్కడ తెలుసుకోండి.

    @2021 KTree