నటీనటులు: సాయి రోనక్, రాజేంద్ర ప్రసాద్, ప్రగ్యా నగ్రా, రాజేంద్ర ప్రసాద్, రఘుబాబు, సప్తగిరి, కృష్ణుడు, రోహిణి తదితరులు
రచన, దర్శకత్వం : రమేశ్ చెప్పాల
సంగీతం: చరణ్ అర్జున్
నేపథ్య సంగీతం: మణిశర్మ
సినిమాటోగ్రఫీ: ఎం.ఎన్. బాల్ రెడ్డి
ఎడిటర్: బొంతల నాగేశ్వరరావు
నిర్మాత: వేణు గోపాల్ రెడ్డి
విడుదల తేది: 25-10-2024
సాయిరోనక్ (Sai Ronak), ప్రగ్యా నగ్రా (Pragya Nagra) జంటగా చేసిన చిత్రం ‘లగ్గం’ (Laggam Movie Review). ఈ చిత్రానికి రమేశ్ చెప్పాల దర్శకత్వం వహించారు. వేణుగోపాల్ రెడ్డి నిర్మాత. రాజేంద్రప్రసాద్, ఎల్బీ శ్రీరామ్, రోహిణి, సప్తగిరి, కృష్ణుడు, రఘుబాబు తదితరులు కీలక పాత్రలు పోషించారు. అక్టోబర్ 25న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ప్రేక్షకులను మెప్పించిందా? లేదా? ఈ రివ్యూలో తెలుసుకుందాం.
కథేంటి
తెలంగాణలోని ఓ పల్లెటూరికి చెందిన సదానందం (రాజేంద్రప్రసాద్) పనిమీద హైదరాబాద్ వస్తాడు. చెల్లెలు (రోహిణి) నగరంలోనే ఉండటంతో ఆమెను చూసేందుకు ఇంటికి వెళ్తాడు. సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌గా పనిచేస్తున్న చెల్లెలు కొడుకు చైతన్య (సాయి రోనక్) లైఫ్ స్టైల్ చూసి కూతురు మానస (ప్రగ్యా )ను అతడికిచ్చి పెళ్లి చేయాలని నిర్ణయించుకుంటాడు. మానసకు పెళ్లి ఇష్టం లేకపోయినా ఒప్పుకుంటుంది. దీంతో ఇరుకుటుంబాలు లగ్గం కుదుర్చుకుంటారు. అయితే ఓ కారణం చేత ఉద్యోగానికి చైతన్య రిజైన్ చేస్తాడు. ఆ విషయాన్ని సదానందం దగ్గర దాస్తాడు. దీంతో సదానందం పెళ్లి ఆపేందుకు స్కెచ్ వేస్తాడు. మరోవైపు చైతన్య కూడా పెళ్లి ఆపాలని నిర్ణయించుకుంటాడు. అయితే అప్పటివరకూ పెళ్లి ఇష్టం లేని మానస కొన్ని కారణాల వల్ల చైతన్యపై మనసు పారేసుకుంటుంది. ఆ తర్వాత ఏం జరిగింది? ఉద్యోగానికి చైతన్య ఎందుకు రిజైన్ చేశాడు? చైతన్య-మానస పెళ్లి జరిగిందా లేదా? అన్నది తెలియాలంటే సినిమా చూడాల్సిందే.
ఎవరెలా చేశారంటే
చైతన్య పాత్రలో సాయి రోనాక్ ఆకట్టుకున్నాడు. సాఫ్ట్‌వేర్ ఉద్యోగిగా, కుటుంబ సభ్యుల సంతోషానికి విలువ ఇచ్చే యువకుడి పాత్రలో చక్కగా ఒదిగిపోయాడు. హీరోయిన్ మానస పాత్రలో ప్రగ్యా నగారా మెప్పించింది. నటనకు ప్రాధాన్యం ఉన్న పాత్రలో ఆమె మెస్మరైజ్ చేసింది. సాయి రోనాక్, ప్రగ్యా మధ్య కెమెస్ట్రీ చక్కగా పండింది. తెరపై ఇద్దరూ పోటీపడి మరి నటించారు. హీరోయిన్ తండ్రి సదానందం పాత్రలో దిగ్గజ నటుడు రాజేంద్ర ప్రసాద్ ఎప్పటిలాగే చెరగని ముద్ర వేశారు. హీరో తల్లి పాత్రలో రోహిణి చక్కగా చేసింది. రఘుబాబు, కృష్ణుడు, ఎల్బీ శ్రీరామ్, కిరీటి వంటి వాళ్ళు తమ పాత్రల పరిధి మేరకు ఆకట్టుకున్నారు. మిగిలిన నటీనటులు పర్వాలేదనిపించారు.
డైరెక్షన్ ఎలా ఉందంటే
తెలంగాణలోని పెళ్లి ఆచార వ్యవహారాలు, పద్దతులను చూపిస్తూ ఈ సినిమాను తెరకెక్కించాడు దర్శకుడు. పెళ్లంటే మూడు ముళ్లే కాదని రెండు తరాల ఆత్మీయ కలయిక అని చాటి చెప్పే ప్రయత్నం చేశాడు. తొలిభాగంలో హీరో పరిచయం, సాఫ్ట్‌వేర్ ఉద్యోగుల కలర్‌ఫుల్ లైఫ్‌ను చూపించారు డైరెక్టర్. లగ్గం కుదిరినప్పటి నుంచి తెలంగాణ సంప్రదాయాలను, ఆచారాలను కళ్లకు కట్టారు. ఇంటర్వెల్ సమయానికి అసలు పెళ్లి జరుగుతుందా లేదా అన్న సస్పెన్స్ క్రియేట్ చేసి సెకండాఫ్‌పై ఆసక్తి కలిగించాడు. మానస ఎందుకు మనసు మార్చుకుంది? చైతన్య ఎందుకు పెళ్లి చేసుకోవద్దు? అనుకున్నాడు వంటి సీన్స్‌ను బాగా చూపించారు. అయితే కొన్ని సీన్స్‌లో కనెక్టివిటి మిస్ కావడం మైనస్‌గా చెప్పవచ్చు. సాగదీత సన్నివేశాలు సైతం ప్రేక్షకుల సహనానికి పరీక్ష పెడతాయి. క్లైమాక్స్‌లో వచ్చే అప్పగింతల సీన్ ప్రతీ యువతికి, తల్లిదండ్రులకు కనెక్ట్ అయ్యేలా తీర్చిదిద్డడంలో డైరెక్టర్ సక్సెస్ అయ్యాడు.
సాంకేతికంగా..
టెక్నికల్ అంశాల విషయానికి వస్తే మణిశర్మ అందించిన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ బాగా వర్కౌట్ అయింది. చాలా సన్నివేశాలను ఈ బ్యాగ్రౌండ్ స్కోర్ ఎలివేట్ చేసింది. అలాగే సినిమాటోగ్రఫీ కూడా సినిమాకి మరొక అదనపు ఆకర్షణ. చరణ్ అర్జున్ పాటలు బాగున్నాయి. నాగేశ్వర్ రెడ్డి బొంతల ఎడిటింగ్ సినిమాకి కరెక్ట్‌గా సెట్ అయింది. నిర్మాణ విలువలు కూడా బాగున్నాయి.
ప్లస్ పాయింట్స్
- కథ, కథనం
- ప్రధాన తారాగణం నటన
- సంగీతం
మైనస్ పాయింట్స్
- సాగదీత సన్నివేశాలు
- మాస్ ఎలిమెంట్స్ లేకపోవడం
Featured Articles Movie News
Dil Raju: అన్ని చేస్తాం.. అన్నింటికీ చెక్ పెడతాం