
రిష్వి తిమ్మరాజు
రిష్వి తిమ్మరాజు.. కృష్ణ గాడు అంటే ఒక రేంజ్ (2023)తో అరంగేట్రం చేసిన తెలుగు నటుడు.
కథనాలు

TABU: సోషల్ మీడియాను షేక్ చేస్తున్న టబు హాట్ ఫొటోలు, వీడియోలు! ఎందుకంటే???
‘టబు’.. పెద్దగా పరిచయం అక్కర్లేని పేరు. టాలీవుడ్ నుంచి బాలీవుడ్ వరకూ ఎన్నో చిత్రాల్లో నటించిన టబు ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక స్థానం సంపాదించారు. ఏజ్ జస్ట్ నంబర్ మాత్రమే అన్నట్లుగా నడి వయసులోనూ టబు వరుసగా సినిమాలు చేస్తూ అలరిస్తున్నారు.
ఇదిలా ఉంటే iగత వారం రోజులుగా టబు సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్నారు. టబు హాట్ లుక్స్‌లో ఉన్న ఫొటోలు, వీడియోలను నెటిజన్లు తెగ షేర్ చేస్తున్నారు. ఆహా ఏమి అందం అంటూ కామెంట్లు చేస్తున్నారు. ప్రస్తుతం టబు గ్లామర్ ఫొటోలు, వీడియోలు ట్విటర్, ఇన్‌స్టాగ్రామ్‌ను షేక్ చేస్తున్నాయి.
https://twitter.com/tabbu_rs/status/1637332351440285701
https://twitter.com/i/status/1637660529652273152
https://twitter.com/i/status/1640567457340596226
https://twitter.com/i/status/1639930741281652766
https://twitter.com/i/status/1640312378113024001
టబు నటించిన లేటెస్ట్ బాలీవుడ్ మూవీ ‘బోళా’ చిత్రం ఇవాళే విడుదలైంది. కార్తి నటించిన ఖైదీ చిత్రానికి రీమేక్‌గా ఈ సినిమా వచ్చింది. ఇందులో అజయ్ దేవగన్ హీరోగా నటించగా.. పవర్‌ఫుల్ ఐపీఎస్ అధికారిణిగా టబు కనిపించింది.
డయనా జోసెఫ్ పాత్రలో టబు నటన ఆకట్టుకున్నట్లు టాక్ వినిపిస్తోంది. ఇటీవలే ‘కుత్తే‘ వెబ్‌సిరీస్‌లోనూ టబు నటించారు. ఈ సిరీస్ నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ అవుతోంది.
గతేడాది టబు చేసిన రెండు బాలీవుడ్ సినిమాలు ‘భూల్ భులయ్యా 2’, ‘దృశ్యం 2’ సూపర్‌హిట్‌గా నిలిచాయి. భూల్ భులయ్యా 2 లో ద్విపాత్రిభినయం చేసిన టబు ప్రేక్షకుల మన్ననలు పొందారు.
దయ్యం పాత్రలో కనిపించి భయపెట్టారు. దృశ్యం 2 లోనూ అజయ్‌దేవగణ్ భార్యగా నటించి ప్రశంసలు అందుకున్నారు.
టాలీవుడ్ నిన్నటి తరం హీరోలు చిరంజీవి, నాగార్జున, బాలకృష్ణ, వెంకటేష్‌ల సూపర్ హిట్ సినిమాల్లో టబు నటించారు. ఆ తర్వాత టాలీవుడ్‌కు కొంచెం గ్యాప్ ఇచ్చారు.
మళ్లీ 2020లో అలా వైకుంఠపురం సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకులను టబు పలకరించారు. ఇందులో టబు నటన సినిమాకు చాలా బాగా ప్లస్ అయింది.
మార్చి 30 , 2023
HBD Tabu: టబు లైఫ్‌లో నాగార్జునతో పాటు ఇంతమంది హీరోలు ఉన్నారా?
తెలుగు సినీ ప్రియులకు ఎంతో సుపరిచితురాలైన నటి టబు (Tabu). ప్రస్తుతం బాలీవుడ్‌లో వరుసగా సినిమాలు చేస్తోన్న టబు ఒకప్పుడు తెలుగులో ఎన్నో సూపర్ హిట్ చిత్రాలు చేసింది. ‘కూలి నెంబర్ 1’, ‘నిన్నే పెళ్లాడతా’, ‘ఆవిడా మా ఆవిడే’, ‘ప్రేమ దేశం’, ‘చెన్నకేశవరెడ్డి’ తదితర హిట్ చిత్రాల్లో ఆమె నటించింది. తద్వారా తెలుగు ప్రేక్షకుల అభిమానాన్ని సంపాదించింది. ఇవాళ (నవంబర్ 4) టబు పుట్టిన రోజు. ఆమె 54వ సంవత్సరంలోకి అడుగుపెట్టింది. ఈ సందర్భంగా టబు లైఫ్‌లోని ఆసక్తికర విషయాల గురించి తెలుసుకుందాం.
1971లో జన్మించిన టబు అసలు పేరు తబస్సుమ్ ఫాతిమా హష్మీ. హైదరాబాద్‌లోనే పెరిగింది. తల్లి టబును ఒంటరి తల్లిగా పెంచింది. టబుకు 3 సంవత్సరాల వయస్సు ఉన్నప్పుడు ఆమె తల్లిదండ్రులు విడాకులు తీసుకున్నారు.
టబు చైల్డ్ ఆర్టిస్ట్‌గా కెరీర్ ప్రారంభించింది. కేవలం 10 సంవత్సరాల వయస్సులోనే యాక్టింగ్ రంగంలోకి అడుగుపెట్టింది. 1982లో హిందీలో రిలీజైన 'బజార్' చిత్రం ఆమె ఫస్ట్ ఫిల్మ్.
https://twitter.com/mimansashekhar/status/1710632340022591556
సాధారణంగా ఏ వ్యక్తికైనా ఒకటి లేదా రెండు నిక్ నేమ్స్ ఉంటాయి. కానీ టబూకి అలా కాదట. ట్యాబ్స్, టబ్స్, టబ్బీ, టోబ్లర్, టోబ్లెరోన్ ఇలా 100కు పైగాా ముద్దుపేర్లు ఉన్నాయట.
తెలుగులో చిరంజీవి, బాలకృష్ణ, వెంకటేష్, నాగార్జున వంటి స్టార్ హీరోలతో టబు సూపర్ హిట్ చిత్రాలు చేసింది.
ముఖ్యంగా నాగార్జున-టబు కాంబినేషన్ సూపర్ సక్సెస్ అయ్యింది. వారు నటించిన ‘నిన్నే పెళ్లడతా’, ‘సిసింద్రీ’, ‘ఆవిడే మా ఆవిడా’ చిత్రాలు మంచి విజయాలు సాధించాయి.
హిందీ వచ్చిన ప్రేమ్ చిత్రం కోసం టబు 8 ఏళ్ల పాటు నిరీక్షించారు. శ్రీదేవి భర్త, నిర్మాత అయిన బోనీ కపూర్ తమ్ముడు సంజయ్ కపూర్ ఇందులో హీరోగా చేశాడు. 1987లోనే ఈ మూవీ షూట్ స్టార్ట్ కాగా అనేక వాయిదాలు పడుతూ 1995లో ఆ సినిమా రిలీజ్ అయ్యింది.
ప్రేమ్ సినిమా సెట్స్‌లోనే నటుడు సంజయ్ కపూర్‌తో టబు ప్రేమలో పడింది. ఈ విషయాన్ని ఆమెనే స్వయంగా వెల్లడించింది. అయితే ఈ బంధం ఎక్కువ రోజులు నిలవలేదు.
తెలుగు స్టార్ హీరో నాగార్జునతో టబు చాలా కాలం పాటు రిలేషన్‌లో ఉన్నట్లు ప్రచారం జరిగింది. పదేళ్ల పాటు వీరు డేటింగ్‌లో ఉన్నట్లు కథనాలు వచ్చాయి. తాము మంచి స్నేహితులమని పలుమార్లు చెప్పినప్పటికీ ఎవరూ విశ్వసించలేదు.
ఆ తర్వాత నిర్మాత సాజిద్ నడియాద్వాలాతో టబు ప్రేమాయణం సాగించింది. అతడి భార్య, నటి దివ్య భారతి మరణం తర్వాత వీరిద్దరు దగ్గరయ్యారు. కానీ ఆ బంధం కూడా ఎక్కువ కాలం నిలబడలేదు.
బాలీవుడ్ స్టార్ అజయ్ దేవ్‌గన్‌తోనూ టబు గాఢంగా ప్రేమాయణం నడిపినట్లు అప్పట్లో పెద్ద ఎత్తున వార్తలు వచ్చాయి. అయితే తాము 25 ఏళ్లుగా మంచి స్నేహితులమని, ఎలాంటి విషయాలనైనా షేర్ చేసుకునేంత చనువు తమ మధ్య ఉందని టబు వాటిని కొట్టిపారేసింది.
అయితే అజయ్‌తో ఉన్న రిలేషన్ వల్లే టబు ఇప్పటివరకూ పెళ్లి చేసుకోకుండా ఉండిపోయిందని బీటౌన్‌లో రూమర్లు ఉన్నాయి. 'భోలా' సినిమా ప్రమోషన్స్ సమయంలో టబుతో రిలేషన్‌పై అజయ్ దేవ్‌గన్ కూడా మాట్లాడారు. టీనేజ్ నుంచి ఒకరికొకరం తెలుసని, తమ మధ్య కంఫర్టబుల్ ఫ్రెండ్‌షిప్ ఉందని, ఒక్కోసారి తిట్టుకుంటామని కూడా వెల్లడించారు.
బాలీవుడ్ స్టార్ సల్మాన్ ఖాన్ జింకను వేటాడిన కేసులో టబు పేరు కూడా వినిపించింది. 1998లో 'హమ్ సాథ్ సాథ్' షూటింగ్ సమయంలో ఈ ఘటన జరగ్గా ఆ సమయంలో టబు కూడా ఉన్నట్లు ఆరోపణలు వచ్చాయి. అయితే విచారణ అనంతరం టబును నిర్దోషిగా పోలీసులు విడుదల చేశారు.
తెరపై నిజమైన కన్నీళ్లు పెట్టే నటీమణులు చాలా మంది ఉన్నారు. కానీ టబు అలా కాదట. కెమెరా ముందు తాను నిజమైన కన్నీళ్లు పెట్టలేనని ఓ ఇంటర్వ్యూలో టబు చెప్పింది. అందుకే సెంటిమెంట్ సీన్స్‌లో తప్పనిసరిగా గ్లిజరిన్ వాడతానని తెలిపింది.
ప్రస్తుతం టబు సినిమాలతో పాటు వెబ్ సిరీస్‌లలోనూ నటిస్తూ ట్రెండ్‌కు తగ్గట్లు దూసుకెళ్తోంది. 54 ఏళ్ల వయసులోనూ 30 ఏళ్ల హీరోయిన్‌గా కనిపిస్తూ మెపిస్తోంది.
నవంబర్ 04 , 2024
Vikrant Massey Net worth: సినిమా కెరీర్‌లో విక్రాంత్ మెస్సే ఎంత సంపాదించాడో తెలుసా?
బాలీవుడ్ యంగ్ హీరో విక్రాంత్ మాస్సే (Vikrant Massey) సినిమాల నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించారు. 37 ఏళ్ల ఈ టాలెంటెడ్ నటుడు తీసుకున్న నిర్ణయం ప్రస్తుతం బాలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారింది. ఇటీవలే ‘12th ఫెయిల్’ చిత్రంతో విక్రాంత్ మాస్సే పేరు మార్మోగింది. ఈ చిత్రం పలు అవార్డులను సైతం కొల్లగొట్టింది. దీంతో బాలీవుడ్‌లో విక్రాంత్‌కు ఒక్కసారిగా ఆఫర్లు పెరిగాయి. చేతినిండా ప్రాజెక్ట్స్‌తో అతడు బిజీగా మారిపోయారు. అలాంటి సమయంలో సినిమాలకు బిగ్ బ్రేక్ ఇవ్వడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది.
కారణం ఏంటంటే?
సినిమాలకు కొంత కాలం బ్రేక్ ఇస్తున్నట్లు ఇన్‌స్టాగ్రామ్ వేదికగా విక్రామ్ మాస్సే (Vikrant Massey Net worth) ప్రకటించాడు. ఇందుకు గల కారణాలను వివరిస్తూ సుదీర్ఘ పోస్టు పెట్టాడు. కొన్నేళ్ల నుంచి ప్రేక్షకులు చూపిస్తున్న అసాధారణ ప్రేమ, అభిమానానికి విక్రాంత్ థ్యాంక్స్ చెప్పారు. ఇకపై కుటుంబ సభ్యులకు టైమ్ ఇవ్వాల్సిన సమయం వచ్చిందని చెప్పారు. అందుకే ఇకపై కొత్త ప్రాజెక్ట్స్ అంగీకరించనని స్పష్టం చేశారు. 2025లో విడుదలయ్యే చిత్రమే తన చివరిదని స్పష్టం చేశాడు. ఎన్నో అందమైన జ్ఞాపకాలు ఇచ్చిన ప్రతీ ఒక్కరికీ ధన్యవాదాలంటూ తన నోట్‌ను ముగించాడు. అయితే విక్రాంత్ నిర్ణయాన్ని ఆయన అభిమానులు తీసుకోలేకపోతున్నారు. మరోసారి ఆలోచించుకోవాలని రిక్వెస్ట్ చేస్తున్నారు. ఫ్యామిలీ, ప్రొఫెషనల్ లైఫ్‌ను బ్యాలెన్స్ చేస్తూ ముందుకు సాగమని సూచిస్తున్నారు.
విక్రాంత్ సినీ నేపథ్యం
సినిమాలకు బ్రేక్ ఇవ్వడంతో విక్రాంత్ మాస్సే (Vikrant Massey Net worth) పేరు ప్రస్తుతం దేశవ్యాప్తంగా మార్మోగుతోంది. అతడి గురించి తెలుసుకునేందుకు చాలా మంది ఆసక్తి కనబరుస్తున్నారు. విక్రాంత్ (Vikrant Massey) 1987 ఏప్రిల్ 3న ముంబయిలో జన్మించాడు. అక్కడి ఆర్.డి. నేషనల్ కాలేజీలో గ్రాడ్యుయేట్ పూర్తి చేశాడు. 2007లో వచ్చిన 'ధూమ్ మచావో ధూమ్' సీరియల్‌తో నటుడిగా ఎంట్రీ ఇచ్చాడు. ఆ తర్వాత ధరమ్ వీర్ (2008), ‘బాలిక వధు’, ‘కుతుబ్ హై’ సీరియల్స్‌లో చేశాడు. 2013లో వచ్చిన ‘లూతేరా’ ఫిల్మ్‌తో బాలీవుడ్‌లో అడుగుపెట్టాడు. ఆ తర్వాత పదుల సంఖ్యలో సినిమాలు చేసినప్పటికీ పెద్దగా బ్రేక్ రాలేదు. 2018లో వచ్చిన 'మీర్జాపుర్' సిరీస్ నటుడిగా అతడికి గుర్తింపు తెచ్చిపెట్టింది. గతేడాది చేసిన '12th ఫెయిల్' మూవీ విక్రాంత్ కెరీర్‌ను మరో స్థాయికి తీసుకెళ్లింది. ఈ ఏడాది వచ్చిన 'సెక్టార్ 36' ఫిల్మ్ సైతం నటుడిగా విక్రాంత్‌ను మరో మెట్టు ఎక్కించింది. ఈ ఏడాదే వచ్చిన 'ది సబర్మతి రిపోర్ట్' సైతం విక్రాంత్‌కు మంచి మార్కులు పడేలా చేసింది. ప్రస్తుతం విక్రాంత్ చేతిలో 'యార్ జిగ్రి', 'టీఎంఈ', 'అన్‌కౌన్ కి గుస్తాఖియాన్' ప్రాజెక్ట్స్ ఉన్నాయి.
కొడుకు కోసం స్పెషల్ టాటూ!
విక్రాంత్ మాస్సే (Vikrant Massey Net worth) కుటుంబానికి చాలా విలువ ఇస్తాడు. బాలీవుడ్ నటి షీతల్ థాకూర్ (Sheetal Thakur) ను ప్రేమ వివాహం చేసుకున్నాడు. 2022 ఫిబ్రవరి 14న ప్రేమికుల దినోత్సవం రోజున తొలుత రిజిస్టర్ మ్యారేజ్ చేసుకున్నాడు. నాలుగు రోజుల తర్వాత ఫిబ్రవరి 18న కుటుంబ సభ్యుల సమక్షంలో హిందూ సంప్రదాయల ప్రకారం పెళ్లి చేసుకున్నాడు. విక్రాంత్‌కు ఈ ఏడాది ఫిబ్రవరిలో బాబు పుట్టాడు. అతడికి వర్ధన్ పేరు పెట్టాడు. కొడుకుపై ప్రేమకు గుర్తుగా చేతిపై పుట్టిన తేదీతో సహా వర్ధన్ అనే పేరును టాటూ వేసుకున్నాడు. దీన్ని బట్టి కుటుంబానికి, కుమారుడికి విక్రాంత్ ఎంత ప్రాధాన్యత ఇస్తాడో అర్థమవుతుంది. ప్రస్తుతం చేతినిండా ప్రాజెక్ట్స్ ఉండటంతో వారితో సమయం గడపడం కుదరట్లేదని సినిమాలకు లాంగ్ బ్రేక్ ఇస్తున్నట్లు ప్రకటించాడు.
ఆ హీరోయిన్‌కు బిగ్ ఫ్యాన్
విక్రాంత్ మాస్సే (Vikrant Massey) ఇష్టా ఇష్టాలకు వస్తే బాలీవుడ్‌లో అతడికి చాలా మంది ఫేవరేట్ హీరోలు ఉన్నారు. అజయ్ దేవగన్, కె.కె. మీనన్, ఇర్ఫాన్ ఖాన్, పంకజ్ కపూర్ తన అభిమాన నటులని విక్రాంత్ చెబుతుంటాడు. అయితే హీరోయిన్ విషయంలో మాత్రం విక్రాంత్‌కు చాలా స్పష్టత ఉంది. ప్రముఖ నటి టబు విక్రాంత్‌కు ఫేవరేట్ యాక్ట్రెస్. అటు ‘హమ్ దిల్ దే చుకే సనమ్’ (1999), ‘వాస్తవ్’ (1999), ‘యువ’ (2004) చిత్రాలు విక్రాంత్‌కు ఆల్‌టైమ్ ఫేవరేట్ అని చెప్పవచ్చు. స్పోర్ట్స్ విషయానికి వస్తే క్రికెట్‌ను విక్రాంత్ బాగా ఇష్టపడతాడు. ఫుడ్ విషయానికి వస్తే రాజ్మా చావల్, పాలక్ పన్నీర్‌ను ఎంతో ఇష్టంగా విక్రాంత్ తింటాడు. డ్యాన్సింగ్, ట్రావెలింగ్, క్రికెట్ ఆడటం, పర్‌ఫ్యూమ్స్‌ను కలెక్ట్ చేయడం వంటివి విక్రాంత్ హాబీలుగా చెప్పవచ్చు. ఫుడ్ విషయానికి వస్తే రాజ్మా చావల్, పాలక్ పన్నీర్‌ను ఎంతో ఇష్టంగా విక్రాంత్ తింటాడు. డ్యాన్సింగ్, ట్రావెలింగ్, క్రికెట్ ఆడటం, పర్‌ఫ్యూమ్స్‌ను కలెక్ట్ చేయడం విక్రాంత్ హాబీలుగా చెప్పవచ్చు.
విక్రాంత్ ఆస్తుల విలువ ఎంతంటే?
విక్రాంత్ మాస్సే (Vikrant Massey Net worth) 2007 నుంచే నటన జీవితాన్ని ప్రారంభించినప్పటికీ చెప్పుకోతగ్గ స్థాయిలో మాత్రం ఆస్తులు కూడబెట్టలేకపోయాడు. వాస్తవానికి ‘12th ఫెయిల్’ (2023) చిత్రం తర్వాతే రెమ్యూనరేషన్ భారీగా పెరిగిందని చెప్పవచ్చు. ఆ సినిమాకు ముందు వరకూ రూ.30-40 లక్షలు మాత్రమే తీసుకున్న విక్రాంత్, ప్రస్తుతం రూ.2 కోట్ల వరకూ రెమ్యూనరేషన్ అందుకుంటున్నట్లు సమాచారం. ఇదిలా ఉంటే ప్రస్తుతం అతడి నెట్ వర్త్ రూ.20-26 కోట్ల వరకూ ఉండొచ్చని బాలీవుడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. అతడికి రూ.60 లక్షలు విలువైన Volvo S90 కారు, డుకాటి మాన్‌స్టర్ (రూ.12 లక్షలు), మారుతీ సుజుకీ డిజైర్ (రూ.8.4లక్షలు) ఉన్నాయి. అలాగే ముంబయిలో సొంతిల్లు కూడా ఉన్నట్లు సమాచారం.
డిసెంబర్ 02 , 2024
EXCLUSIVE: టిల్లు స్కేర్ అడల్ట్ సినిమా కాదు.. మెగాస్టార్ చిరంజీవి కామెంట్స్ వైరల్
సిద్ధు జొన్నలగడ్డ (Siddu Jonnalagadda), అనుపమ పరమేశ్వరన్(Anupama Parameswaran) ప్రధాన పాత్రల్లో మల్లిక్ రామ్ తెరకెక్కించిన టిల్లు స్కేర్ పట్ల అన్ని వర్గాల ప్రేక్షకులు బ్రహ్మరథం పడుతున్నారు. DJ టిల్లు హిట్ తర్వాత ఏర్పడిన అంచనాలను మించి ఈ సినిమా చొచ్చుకెళ్తోంది. ఈ మూవీ ప్రస్తుతం సూపర్ డూపర్ రెస్పాన్స్‌తో ముందుకెళ్తోంది. ఈ సినిమాను పలువురు సెలబ్రెటీలు ప్రశంసిస్తున్నారు.
తాజాగా టిల్లు స్కేర్(Tillu square) చిత్రంపై మెగాస్టార్ చిరంజీవి(megastar chiranjeevi) స్పందించారు. టిల్లు స్కేర్ చిత్రం తాను చూశానని చాలా బాగుందని ప్రశంసల వర్షం కురిపించారు. అందరూ అనుకుంటున్నట్లు అడల్ట్ సినిమాగా ఈ చిత్రాన్ని చూడవద్దని యూనివర్సిల్‌గా యాక్సెప్ట్‌డ్ కంటెంట్ ఈ చిత్రంలో ఉందని వెళ్లడించారు. ఈక్రమంలో టిల్లు స్కేర్ చిత్ర బృందాన్ని ఇంటికి పిలిపించుకుని చిరంజీవి వారిని సన్మానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.." టిల్లు స్కేర్ సినిమా చూశాను. టిల్లు వన్ నాకు బాగా నచ్చిన సినిమా. ఆ సినిమా తర్వాత ముచ్చటేసి రా అని ఇంటికి పిలిపించుకున్నాను. సిద్ధు అంటే ఇంట్లో అందరికి ఫేవర్. మళ్లీ ఇన్నాళ్ల తర్వాత టిల్లు స్కేర్ చేశాడు చూశాను. వావ్ చాలా బాగుంది. చాలా బాగా నచ్చింది నాకు. ఫస్ట్ సినిమా చేసిన తర్వాత సెకండ్ సినిమా ఆ అంచనాలను మీట్ అవడమనేది రేర్ ఫీట్. ఆ అంచనాలను డైరెక్టర్ మల్లిక్ అండ్ హోల్ టీమ్ సక్సెస్‌ఫుల్‌గా చేయగలిగారు. ఉత్కంఠతోటి అదే సరదా తోటి ఈ టిల్లు స్కేర్ అంత ఎంజాయ్ చేశాను. ఇప్పుడు చెబుతున్నాను.. దీనికోసం ఎంత కష్టపడ్డాడో, ఎన్ని నిద్రలేని రాత్రులు గడిపాడో సినిమాను చూస్తే అర్థం అవుతుంది. దీని వెనుకాలా ఒక్కడై ఉండి, ఈ స్క్రిఫ్ట్ ఇంత బాగా రావడానికి ప్రయత్నించిన మా సిద్ధు జొన్నలగడ్డకు మనస్ఫూర్తిగా అభినందనలు తెలుపుతున్నాను. ఈ సినిమాలో చాలా మంది ఏదో అడల్ట్ అని యూత్ అని ఏవెవో అంటున్నారు. ఇది యూనివర్సల్‌గా అంగీకరించదగిన కంటెంట్ ఉన్నా సినిమా ఇది. కాబట్టి నేనైతే ఎంజాయ్ చేశాను. అందరు తప్పక చూడండి" అంటూ చెప్పుకొచ్చారు.
https://twitter.com/AlwaysPraveen7/status/1774701740287578526?s=20
మరోవైపు టిల్లు స్కేర్ కలెక్షన్ల పరంగా బాలీవుడ్ చిత్రం 'క్రూ'(CREW)ని బీట్ చేసింది. టబు, కరీనా కపూర్, కృతిసనన్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ చిత్రం ఇటీవల విడుదలైంది. ఈ సినిమాకు బాలీవుడ్ ప్రేక్షకుల నుంచి పాజిటివ్ రెస్పాన్స్ లభించింది. మూడు రోజుల్లో ఈ చిత్రం రూ.62.53 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసింది. టిల్లు స్కేర్ మూడు రోజుల్లో రూ.68.1కోట్లు కలెక్ట్ చేసిన విషయం తెలిసిందే. ఈ రెండు సినిమాలు ఆయా భాషల ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్‌తో దూసుకెళ్తున్నాయి.
అటు టిల్లు స్కేర్‌కు సీక్వేల్‌గా 'టిల్లు క్యూబ్' ఉంటుందని మేకర్స్ ప్రకటించారు. థియేటర్లలో అల్రెడీ క్లైమాక్స్ సీన్‌లో దీనికి సంబంధించిన ప్రకటన వస్తోంది. తొలుత టిల్లు స్కేర్‌తో సీక్వెల్ ముగించాలని మేకర్స్ అనుకున్నప్పటికీ... ప్రేక్షకుల నుంచి వచ్చిన డిమాండ్ దృష్ట్యా సీక్వెల్ ఉంటుందని నిర్మాత నాగవంశీ స్పష్టం చేశారు.
ఏప్రిల్ 01 , 2024

కృష్ణ గాడు అంటే ఒక రేంజ్
04 ఆగస్టు 2023 న విడుదలైంది
రిష్వి తిమ్మరాజు వ్యక్తిగత వివరాలు, ఎత్తు, పుట్టిన ప్రదేశం, బర్త్ డేట్, వయస్సు, సాధించిన విజయాలు, అవార్డులు, వ్యాపారాలు, ఇష్టాఇష్టాలు, అభిరుచులు తెలుసుకోండి. అలాగే రిష్వి తిమ్మరాజు కుటుంబ నేపథ్యం, తల్లిదండ్రులు, తోబుట్టువులు, రిలేషన్స్, విద్యా నేపథ్యం, కెరీర్ మైలురాళ్లు, తాజా ప్రాజెక్ట్‌లు, అధికారిక సోషల్ మీడియా అకౌంట్స్, లేటెస్ట్ చిత్రాలను ఒక్క క్లిక్‌తో ఇక్కడ తెలుసుకోండి.