సిద్ధు జొన్నలగడ్డ (Siddu Jonnalagadda), అనుపమ పరమేశ్వరన్(Anupama Parameswaran) ప్రధాన పాత్రల్లో మల్లిక్ రామ్ తెరకెక్కించిన టిల్లు స్కేర్ పట్ల అన్ని వర్గాల ప్రేక్షకులు బ్రహ్మరథం పడుతున్నారు. DJ టిల్లు హిట్ తర్వాత ఏర్పడిన అంచనాలను మించి ఈ సినిమా చొచ్చుకెళ్తోంది. ఈ మూవీ ప్రస్తుతం సూపర్ డూపర్ రెస్పాన్స్‌తో ముందుకెళ్తోంది. ఈ సినిమాను పలువురు సెలబ్రెటీలు ప్రశంసిస్తున్నారు.
తాజాగా టిల్లు స్కేర్(Tillu square) చిత్రంపై మెగాస్టార్ చిరంజీవి(megastar chiranjeevi) స్పందించారు. టిల్లు స్కేర్ చిత్రం తాను చూశానని చాలా బాగుందని ప్రశంసల వర్షం కురిపించారు. అందరూ అనుకుంటున్నట్లు అడల్ట్ సినిమాగా ఈ చిత్రాన్ని చూడవద్దని యూనివర్సిల్‌గా యాక్సెప్ట్‌డ్ కంటెంట్ ఈ చిత్రంలో ఉందని వెళ్లడించారు. ఈక్రమంలో టిల్లు స్కేర్ చిత్ర బృందాన్ని ఇంటికి పిలిపించుకుని చిరంజీవి వారిని సన్మానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..” టిల్లు స్కేర్ సినిమా చూశాను. టిల్లు వన్ నాకు బాగా నచ్చిన సినిమా. ఆ సినిమా తర్వాత ముచ్చటేసి రా అని ఇంటికి పిలిపించుకున్నాను. సిద్ధు అంటే ఇంట్లో అందరికి ఫేవర్. మళ్లీ ఇన్నాళ్ల తర్వాత టిల్లు స్కేర్ చేశాడు చూశాను. వావ్ చాలా బాగుంది. చాలా బాగా నచ్చింది నాకు. ఫస్ట్ సినిమా చేసిన తర్వాత సెకండ్ సినిమా ఆ అంచనాలను మీట్ అవడమనేది రేర్ ఫీట్. ఆ అంచనాలను డైరెక్టర్ మల్లిక్ అండ్ హోల్ టీమ్ సక్సెస్‌ఫుల్‌గా చేయగలిగారు. ఉత్కంఠతోటి అదే సరదా తోటి ఈ టిల్లు స్కేర్ అంత ఎంజాయ్ చేశాను. ఇప్పుడు చెబుతున్నాను.. దీనికోసం ఎంత కష్టపడ్డాడో, ఎన్ని నిద్రలేని రాత్రులు గడిపాడో సినిమాను చూస్తే అర్థం అవుతుంది. దీని వెనుకాలా ఒక్కడై ఉండి, ఈ స్క్రిఫ్ట్ ఇంత బాగా రావడానికి ప్రయత్నించిన మా సిద్ధు జొన్నలగడ్డకు మనస్ఫూర్తిగా అభినందనలు తెలుపుతున్నాను. ఈ సినిమాలో చాలా మంది ఏదో అడల్ట్ అని యూత్ అని ఏవెవో అంటున్నారు. ఇది యూనివర్సల్‌గా అంగీకరించదగిన కంటెంట్ ఉన్నా సినిమా ఇది. కాబట్టి నేనైతే ఎంజాయ్ చేశాను. అందరు తప్పక చూడండి” అంటూ చెప్పుకొచ్చారు.
మరోవైపు టిల్లు స్కేర్ కలెక్షన్ల పరంగా బాలీవుడ్ చిత్రం ‘క్రూ'(CREW)ని బీట్ చేసింది. టబు, కరీనా కపూర్, కృతిసనన్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ చిత్రం ఇటీవల విడుదలైంది. ఈ సినిమాకు బాలీవుడ్ ప్రేక్షకుల నుంచి పాజిటివ్ రెస్పాన్స్ లభించింది. మూడు రోజుల్లో ఈ చిత్రం రూ.62.53 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసింది. టిల్లు స్కేర్ మూడు రోజుల్లో రూ.68.1కోట్లు కలెక్ట్ చేసిన విషయం తెలిసిందే. ఈ రెండు సినిమాలు ఆయా భాషల ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్‌తో దూసుకెళ్తున్నాయి.
అటు టిల్లు స్కేర్‌కు సీక్వేల్‌గా ‘టిల్లు క్యూబ్’ ఉంటుందని మేకర్స్ ప్రకటించారు. థియేటర్లలో అల్రెడీ క్లైమాక్స్ సీన్‌లో దీనికి సంబంధించిన ప్రకటన వస్తోంది. తొలుత టిల్లు స్కేర్‌తో సీక్వెల్ ముగించాలని మేకర్స్ అనుకున్నప్పటికీ… ప్రేక్షకుల నుంచి వచ్చిన డిమాండ్ దృష్ట్యా సీక్వెల్ ఉంటుందని నిర్మాత నాగవంశీ స్పష్టం చేశారు.
మరిన్ని వార్తల కోసం YouSay యాప్‌ను ఇన్స్టాల్ చేయండి