తెలుగు సినీ ప్రియులకు ఎంతో సుపరిచితురాలైన నటి టబు (Tabu). ప్రస్తుతం బాలీవుడ్‌లో వరుసగా సినిమాలు చేస్తోన్న టబు ఒకప్పుడు తెలుగులో ఎన్నో సూపర్ హిట్ చిత్రాలు చేసింది. ‘కూలి నెంబర్ 1’, ‘నిన్నే పెళ్లాడతా’, ‘ఆవిడా మా ఆవిడే’, ‘ప్రేమ దేశం’, ‘చెన్నకేశవరెడ్డి’ తదితర హిట్ చిత్రాల్లో ఆమె నటించింది. తద్వారా తెలుగు ప్రేక్షకుల అభిమానాన్ని సంపాదించింది. ఇవాళ (నవంబర్ 4) టబు పుట్టిన రోజు. ఆమె 54వ సంవత్సరంలోకి అడుగుపెట్టింది. ఈ సందర్భంగా టబు లైఫ్‌లోని ఆసక్తికర విషయాల గురించి తెలుసుకుందాం.
1971లో జన్మించిన టబు అసలు పేరు తబస్సుమ్ ఫాతిమా హష్మీ. హైదరాబాద్‌లోనే పెరిగింది. తల్లి టబును ఒంటరి తల్లిగా పెంచింది. టబుకు 3 సంవత్సరాల వయస్సు ఉన్నప్పుడు ఆమె తల్లిదండ్రులు విడాకులు తీసుకున్నారు.
టబు చైల్డ్ ఆర్టిస్ట్‌గా కెరీర్ ప్రారంభించింది. కేవలం 10 సంవత్సరాల వయస్సులోనే యాక్టింగ్ రంగంలోకి అడుగుపెట్టింది. 1982లో హిందీలో రిలీజైన ‘బజార్’ చిత్రం ఆమె ఫస్ట్ ఫిల్మ్.
సాధారణంగా ఏ వ్యక్తికైనా ఒకటి లేదా రెండు నిక్ నేమ్స్ ఉంటాయి. కానీ టబూకి అలా కాదట. ట్యాబ్స్, టబ్స్, టబ్బీ, టోబ్లర్, టోబ్లెరోన్ ఇలా 100కు పైగాా ముద్దుపేర్లు ఉన్నాయట.
తెలుగులో చిరంజీవి, బాలకృష్ణ, వెంకటేష్, నాగార్జున వంటి స్టార్ హీరోలతో టబు సూపర్ హిట్ చిత్రాలు చేసింది.
ముఖ్యంగా నాగార్జున-టబు కాంబినేషన్ సూపర్ సక్సెస్ అయ్యింది. వారు నటించిన ‘నిన్నే పెళ్లడతా’, ‘సిసింద్రీ’, ‘ఆవిడే మా ఆవిడా’ చిత్రాలు మంచి విజయాలు సాధించాయి.
హిందీ వచ్చిన ప్రేమ్ చిత్రం కోసం టబు 8 ఏళ్ల పాటు నిరీక్షించారు. శ్రీదేవి భర్త, నిర్మాత అయిన బోనీ కపూర్ తమ్ముడు సంజయ్ కపూర్ ఇందులో హీరోగా చేశాడు. 1987లోనే ఈ మూవీ షూట్ స్టార్ట్ కాగా అనేక వాయిదాలు పడుతూ 1995లో ఆ సినిమా రిలీజ్ అయ్యింది.
ప్రేమ్ సినిమా సెట్స్‌లోనే నటుడు సంజయ్ కపూర్‌తో టబు ప్రేమలో పడింది. ఈ విషయాన్ని ఆమెనే స్వయంగా వెల్లడించింది. అయితే ఈ బంధం ఎక్కువ రోజులు నిలవలేదు.
తెలుగు స్టార్ హీరో నాగార్జునతో టబు చాలా కాలం పాటు రిలేషన్‌లో ఉన్నట్లు ప్రచారం జరిగింది. పదేళ్ల పాటు వీరు డేటింగ్‌లో ఉన్నట్లు కథనాలు వచ్చాయి. తాము మంచి స్నేహితులమని పలుమార్లు చెప్పినప్పటికీ ఎవరూ విశ్వసించలేదు.
ఆ తర్వాత నిర్మాత సాజిద్ నడియాద్వాలాతో టబు ప్రేమాయణం సాగించింది. అతడి భార్య, నటి దివ్య భారతి మరణం తర్వాత వీరిద్దరు దగ్గరయ్యారు. కానీ ఆ బంధం కూడా ఎక్కువ కాలం నిలబడలేదు.
బాలీవుడ్ స్టార్ అజయ్ దేవ్‌గన్‌తోనూ టబు గాఢంగా ప్రేమాయణం నడిపినట్లు అప్పట్లో పెద్ద ఎత్తున వార్తలు వచ్చాయి. అయితే తాము 25 ఏళ్లుగా మంచి స్నేహితులమని, ఎలాంటి విషయాలనైనా షేర్ చేసుకునేంత చనువు తమ మధ్య ఉందని టబు వాటిని కొట్టిపారేసింది.
అయితే అజయ్‌తో ఉన్న రిలేషన్ వల్లే టబు ఇప్పటివరకూ పెళ్లి చేసుకోకుండా ఉండిపోయిందని బీటౌన్‌లో రూమర్లు ఉన్నాయి. ‘భోలా’ సినిమా ప్రమోషన్స్ సమయంలో టబుతో రిలేషన్‌పై అజయ్ దేవ్‌గన్ కూడా మాట్లాడారు. టీనేజ్ నుంచి ఒకరికొకరం తెలుసని, తమ మధ్య కంఫర్టబుల్ ఫ్రెండ్‌షిప్ ఉందని, ఒక్కోసారి తిట్టుకుంటామని కూడా వెల్లడించారు.
బాలీవుడ్ స్టార్ సల్మాన్ ఖాన్ జింకను వేటాడిన కేసులో టబు పేరు కూడా వినిపించింది. 1998లో ‘హమ్ సాథ్ సాథ్’ షూటింగ్ సమయంలో ఈ ఘటన జరగ్గా ఆ సమయంలో టబు కూడా ఉన్నట్లు ఆరోపణలు వచ్చాయి. అయితే విచారణ అనంతరం టబును నిర్దోషిగా పోలీసులు విడుదల చేశారు.
తెరపై నిజమైన కన్నీళ్లు పెట్టే నటీమణులు చాలా మంది ఉన్నారు. కానీ టబు అలా కాదట. కెమెరా ముందు తాను నిజమైన కన్నీళ్లు పెట్టలేనని ఓ ఇంటర్వ్యూలో టబు చెప్పింది. అందుకే సెంటిమెంట్ సీన్స్‌లో తప్పనిసరిగా గ్లిజరిన్ వాడతానని తెలిపింది.
ప్రస్తుతం టబు సినిమాలతో పాటు వెబ్ సిరీస్‌లలోనూ నటిస్తూ ట్రెండ్‌కు తగ్గట్లు దూసుకెళ్తోంది. 54 ఏళ్ల వయసులోనూ 30 ఏళ్ల హీరోయిన్‌గా కనిపిస్తూ మెపిస్తోంది.
Celebrities Featured Articles Movie News
Allu Arjun: సీఎం రేవంత్ రెడ్డికి.. బన్నీ స్ట్రాంగ్ కౌంటర్!