• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • Vikrant Massey Net worth: సినిమా కెరీర్‌లో విక్రాంత్‌ మెస్సే ఎంత సంపాదించాడో తెలుసా? 

    బాలీవుడ్‌ యంగ్‌ హీరో విక్రాంత్ మాస్సే (Vikrant Massey) సినిమాల నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించారు. 37 ఏళ్ల ఈ టాలెంటెడ్‌ నటుడు తీసుకున్న నిర్ణయం ప్రస్తుతం బాలీవుడ్‌లో హాట్‌ టాపిక్‌గా మారింది. ఇటీవలే ‘12th ఫెయిల్‌’ చిత్రంతో విక్రాంత్‌ మాస్సే పేరు మార్మోగింది. ఈ చిత్రం పలు అవార్డులను సైతం కొల్లగొట్టింది. దీంతో బాలీవుడ్‌లో విక్రాంత్‌కు ఒక్కసారిగా ఆఫర్లు పెరిగాయి. చేతినిండా ప్రాజెక్ట్స్‌తో అతడు బిజీగా మారిపోయారు. అలాంటి సమయంలో సినిమాలకు బిగ్‌ బ్రేక్ ఇవ్వడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది. 

    కారణం ఏంటంటే?

    సినిమాలకు కొంత కాలం బ్రేక్‌ ఇస్తున్నట్లు ఇన్‌స్టాగ్రామ్‌ వేదికగా విక్రామ్‌ మాస్సే (Vikrant Massey Net worth) ప్రకటించాడు. ఇందుకు గల కారణాలను వివరిస్తూ సుదీర్ఘ పోస్టు పెట్టాడు. కొన్నేళ్ల నుంచి ప్రేక్షకులు చూపిస్తున్న అసాధారణ ప్రేమ, అభిమానానికి విక్రాంత్‌ థ్యాంక్స్‌ చెప్పారు. ఇకపై కుటుంబ సభ్యులకు టైమ్‌ ఇవ్వాల్సిన సమయం వచ్చిందని చెప్పారు. అందుకే ఇకపై కొత్త ప్రాజెక్ట్స్‌ అంగీకరించనని స్పష్టం చేశారు. 2025లో విడుదలయ్యే చిత్రమే తన చివరిదని స్పష్టం చేశాడు. ఎన్నో అందమైన జ్ఞాపకాలు ఇచ్చిన ప్రతీ ఒక్కరికీ ధన్యవాదాలంటూ తన నోట్‌ను ముగించాడు. అయితే విక్రాంత్‌ నిర్ణయాన్ని ఆయన అభిమానులు తీసుకోలేకపోతున్నారు. మరోసారి ఆలోచించుకోవాలని రిక్వెస్ట్‌ చేస్తున్నారు. ఫ్యామిలీ, ప్రొఫెషనల్‌ లైఫ్‌ను బ్యాలెన్స్‌ చేస్తూ ముందుకు సాగమని సూచిస్తున్నారు. 

    విక్రాంత్‌ సినీ నేపథ్యం

    సినిమాలకు బ్రేక్‌ ఇవ్వడంతో విక్రాంత్‌ మాస్సే (Vikrant Massey Net worth) పేరు ప్రస్తుతం దేశవ్యాప్తంగా మార్మోగుతోంది. అతడి గురించి తెలుసుకునేందుకు చాలా మంది ఆసక్తి కనబరుస్తున్నారు. విక్రాంత్‌ (Vikrant Massey) 1987 ఏప్రిల్‌ 3న ముంబయిలో జన్మించాడు. అక్కడి ఆర్‌.డి. నేషనల్‌ కాలేజీలో గ్రాడ్యుయేట్‌ పూర్తి చేశాడు. 2007లో వచ్చిన ‘ధూమ్‌ మచావో ధూమ్‌’ సీరియల్‌తో నటుడిగా ఎంట్రీ ఇచ్చాడు. ఆ తర్వాత ధరమ్‌ వీర్‌ (2008), ‘బాలిక వధు’, ‘కుతుబ్‌ హై’ సీరియల్స్‌లో చేశాడు. 2013లో వచ్చిన ‘లూతేరా’ ఫిల్మ్‌తో బాలీవుడ్‌లో అడుగుపెట్టాడు. ఆ తర్వాత పదుల సంఖ్యలో సినిమాలు చేసినప్పటికీ పెద్దగా బ్రేక్‌ రాలేదు. 2018లో వచ్చిన ‘మీర్జాపుర్‌’ సిరీస్‌ నటుడిగా అతడికి గుర్తింపు తెచ్చిపెట్టింది. గతేడాది చేసిన ’12th ఫెయిల్‌’ మూవీ విక్రాంత్‌ కెరీర్‌ను మరో స్థాయికి తీసుకెళ్లింది. ఈ ఏడాది వచ్చిన ‘సెక్టార్‌ 36’ ఫిల్మ్‌ సైతం నటుడిగా విక్రాంత్‌ను మరో మెట్టు ఎక్కించింది. ఈ ఏడాదే వచ్చిన ‘ది సబర్మతి రిపోర్ట్‌’ సైతం విక్రాంత్‌కు మంచి మార్కులు పడేలా చేసింది. ప్రస్తుతం విక్రాంత్ చేతిలో ‘యార్‌ జిగ్రి’, ‘టీఎంఈ’, ‘అన్‌కౌన్‌ కి గుస్తాఖియాన్‌’ ప్రాజెక్ట్స్‌ ఉన్నాయి.

    కొడుకు కోసం స్పెషల్ టాటూ!

    విక్రాంత్‌ మాస్సే (Vikrant Massey Net worth) కుటుంబానికి చాలా విలువ ఇస్తాడు. బాలీవుడ్‌ నటి షీతల్‌ థాకూర్‌ (Sheetal Thakur) ను ప్రేమ వివాహం చేసుకున్నాడు. 2022 ఫిబ్రవరి 14న ప్రేమికుల దినోత్సవం రోజున తొలుత రిజిస్టర్‌ మ్యారేజ్‌ చేసుకున్నాడు. నాలుగు రోజుల తర్వాత ఫిబ్రవరి 18న కుటుంబ సభ్యుల సమక్షంలో హిందూ సంప్రదాయల ప్రకారం పెళ్లి చేసుకున్నాడు. విక్రాంత్‌కు ఈ ఏడాది ఫిబ్రవరిలో బాబు పుట్టాడు. అతడికి వర్ధన్ పేరు పెట్టాడు. కొడుకుపై ప్రేమకు గుర్తుగా చేతిపై పుట్టిన తేదీతో సహా వర్ధన్‌ అనే పేరును టాటూ వేసుకున్నాడు. దీన్ని బట్టి కుటుంబానికి, కుమారుడికి విక్రాంత్ ఎంత ప్రాధాన్యత ఇస్తాడో అర్థమవుతుంది. ప్రస్తుతం చేతినిండా ప్రాజెక్ట్స్‌ ఉండటంతో వారితో సమయం గడపడం కుదరట్లేదని సినిమాలకు లాంగ్‌ బ్రేక్ ఇస్తున్నట్లు ప్రకటించాడు.

    ఆ హీరోయిన్‌కు బిగ్‌ ఫ్యాన్‌

    విక్రాంత్‌ మాస్సే (Vikrant Massey) ఇష్టా ఇష్టాలకు వస్తే బాలీవుడ్‌లో అతడికి చాలా మంది ఫేవరేట్ హీరోలు ఉన్నారు. అజయ్‌ దేవగన్‌, కె.కె. మీనన్‌, ఇర్ఫాన్‌ ఖాన్‌, పంకజ్‌ కపూర్‌ తన అభిమాన నటులని విక్రాంత్‌ చెబుతుంటాడు. అయితే హీరోయిన్‌ విషయంలో మాత్రం విక్రాంత్‌కు చాలా స్పష్టత ఉంది. ప్రముఖ నటి టబు విక్రాంత్‌కు ఫేవరేట్ యాక్ట్రెస్‌. అటు ‘హమ్‌ దిల్‌ దే చుకే సనమ్‌’ (1999), ‘వాస్తవ్‌’ (1999), ‘యువ’ (2004) చిత్రాలు విక్రాంత్‌కు ఆల్‌టైమ్‌ ఫేవరేట్ అని చెప్పవచ్చు. స్పోర్ట్స్‌ విషయానికి వస్తే క్రికెట్‌ను విక్రాంత్‌ బాగా ఇష్టపడతాడు. ఫుడ్‌ విషయానికి వస్తే రాజ్మా చావల్‌, పాలక్ పన్నీర్‌ను ఎంతో ఇష్టంగా విక్రాంత్‌ తింటాడు. డ్యాన్సింగ్‌, ట్రావెలింగ్‌, క్రికెట్‌ ఆడటం, పర్‌ఫ్యూమ్స్‌ను కలెక్ట్‌ చేయడం వంటివి విక్రాంత్ హాబీలుగా చెప్పవచ్చు. ఫుడ్‌ విషయానికి వస్తే రాజ్మా చావల్‌, పాలక్ పన్నీర్‌ను ఎంతో ఇష్టంగా విక్రాంత్‌ తింటాడు. డ్యాన్సింగ్‌, ట్రావెలింగ్‌, క్రికెట్‌ ఆడటం, పర్‌ఫ్యూమ్స్‌ను కలెక్ట్‌ చేయడం విక్రాంత్ హాబీలుగా చెప్పవచ్చు. 

    విక్రాంత్‌ ఆస్తుల విలువ ఎంతంటే?

    విక్రాంత్‌ మాస్సే (Vikrant Massey Net worth) 2007 నుంచే నటన జీవితాన్ని ప్రారంభించినప్పటికీ చెప్పుకోతగ్గ స్థాయిలో మాత్రం ఆస్తులు కూడబెట్టలేకపోయాడు. వాస్తవానికి ‘12th ఫెయిల్‌’ (2023) చిత్రం తర్వాతే రెమ్యూనరేషన్‌ భారీగా పెరిగిందని చెప్పవచ్చు. ఆ సినిమాకు ముందు వరకూ రూ.30-40 లక్షలు మాత్రమే తీసుకున్న విక్రాంత్‌, ప్రస్తుతం రూ.2 కోట్ల వరకూ రెమ్యూనరేషన్ అందుకుంటున్నట్లు సమాచారం. ఇదిలా ఉంటే ప్రస్తుతం అతడి నెట్‌ వర్త్‌ రూ.20-26 కోట్ల వరకూ ఉండొచ్చని బాలీవుడ్‌ వర్గాలు అంచనా వేస్తున్నాయి. అతడికి రూ.60 లక్షలు విలువైన Volvo S90 కారు, డుకాటి మాన్‌స్టర్ (రూ.12 లక్షలు), మారుతీ సుజుకీ డిజైర్‌ (రూ.8.4లక్షలు) ఉన్నాయి. అలాగే ముంబయిలో సొంతిల్లు కూడా ఉన్నట్లు సమాచారం. 

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv