• TFIDB EN
  • సత్య అక్కల
    జననం : జనవరి 01 , 1988
    ప్రదేశం: అమలాపురం, ఆంధ్ర ప్రదేశ్, భారతదేశం
    సత్య అక్కల.. టాలీవుడ్‌కు చెందిన ప్రముఖ హాస్యనటుడు. అసిస్టెంట్ డైరెక్టర్‌ నుంచి స్టార్‌ కమెడియన్‌ స్థాయికి ఎదిగాడు. కెరీర్‌ తొలినాళ్లలో 'జబర్దస్త్' కామెడీ షోలో ధన్‌రాజ్ టీంలో పనిచేశారు. పిల్లజమీందార్‌ (2011) చిత్రంతో తెరంగేట్రం చేశారు. 'స్వామిరారా', 'ఛలో', 'భాగ్యనగర వీధుల్లో', 'రంబలి' తదితర చిత్రాల అత్యుత్తమ కామెడీని పండించారు. సత్య.. 95 పైగా చిత్రాల్లో హాస్య పాత్రలు పోషించారు. 'వివాహభోజనంబు' (2021) సినిమాలో కథానాయకుడిగానూ చేశారు.

    సత్య అక్కల వయసు ఎంత?

    సత్య అక్కల వయసు 37 సంవత్సరాలు

    సత్య అక్కల అభిరుచులు ఏంటి?

    సినిమాలు చూడటం, ట్రావెలింగ్‌

    సత్య అక్కల ఏం చదువుకున్నారు?

    బీటెక్‌

    సత్య అక్కల సినిమాల్లోకి రాకముందు ఏం చేశారు?

    హాస్యనటుడు కాకముందు అసిస్టెంట్‌ డైరెక్టర్‌గా పనిచేశాడు.

    సత్య అక్కల ఏ విద్యాసంస్థల్లో చదువుకున్నారు?

    బి.వి.సి ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ అండ్‌ సైన్స్‌, అమలాపురం

    సత్య అక్కల‌ ఇప్పటివరకూ చేసిన తెలుగు చిత్రాలు ఏవి?

    తెలుగులో 2024 వరకూ 95 పైగా చిత్రాల్లో హాస్య నటుడి పాత్రలు పోషించారు.

    సత్య అక్కల అన్‌ కేటగిరైజ్డ్ ఇమేజెస్‌

    Images

    Satya Akkala

    Tollywood comedians: వీరు మాట్లాడితే నవ్వులే.. తెలుగులో హాస్యాన్ని పండిస్తున్న కామెడీ స్టార్స్‌..!
    Tollywood comedians: వీరు మాట్లాడితే నవ్వులే.. తెలుగులో హాస్యాన్ని పండిస్తున్న కామెడీ స్టార్స్‌..! దశాబ్దాల కాలంగా వేలాది సినిమాలు ప్రజలను అలరిస్తున్నాయి. సినీ ప్రియులు కూడా తమ ప్రధాన వినోద మార్గంగా సినిమాలను చూస్తున్నారు. అయితే థియేటర్లకు వచ్చే ఆడియన్స్‌ను కడుప్పుబ్బా నవ్వించి ఇంటికి పంపడంలో హాస్యనటులు కీలకపాత్ర పోషిస్తారు. గత కొన్నేళ్లుగా ఎంతో మంది హాస్యనటులు ప్రేక్షకులను నవ్వించి వారి మన్ననలు పొందారు. ఈతరంలోనూ కొందరు కమెడియన్లు కడుపుబ్బా నవ్విస్తూ విశేష ఆదరణ పొందుతున్నారు. తెలుగు ఇండస్ట్రీలో మంచి హాస్యనటులుగా గుర్తింపు పొందిన 10 మంది నటుల గురించి ఇప్పుడు తెలుసుకుందా.  బ్రహ్మానందం టాలీవుడ్‌ దిగ్గజ కమెడియన్లలో బ్రహ్మానందం ఒకరు. తన కామెడితో హాస్య బ్రహ్మగా బ్రహ్మీ గుర్తింపు పొందారు. వెయ్యికి పైగా చిత్రాల్లో కమెడియన్‌గా చేసి గిన్నిస్ వరల్డ్ రికార్డ్ సాధించారు. ఇటీవల రంగమార్తండ సినిమాలో నటించిన బ్రహ్మనందం ఇప్పటివరకూ చేసిన పాత్రలకు పూర్తిగా భిన్నంగా నటించారు. ఎప్పుడు నవ్వుతూ, నవ్విస్తూ ఉండే బ్రహ్మీ.. ఈ సినిమాతో ప్రేక్షకులను కంటతడి పెట్టించారు.  ఆలీ టాలీవుడ్‌ దిగ్గజ నటుల్లో ఆలీ కూడా ఒకరు. ఆలీ కూడా బ్రహ్మీ లాగే 1000కి పైగా చిత్రాల్లో నటించి ప్రేక్షకులను అలరించాడు. యాంకర్‌గా, బుల్లితెర వ్యాఖ్యాతగా కూడా ఆలీ రాణించాడు. కామెడి అంటే ఆలీదే అనే స్థాయికి ఎదిగాడు. ఓవైపు సినిమాల్లో నటిస్తూనే పలు సేవా కార్యక్రమాల్లోనూ ఆలీ చురుగ్గా వ్యవహిస్తున్నాడు. తన తండ్రి మహ్మద్‌ బాషా పేరుమీద ట్రస్టు ఏర్పాటు చేసి పేదలకు సేవ చేస్తున్నాడు. ఇటీవల ఆలీని ఎలక్ట్రానిక్‌ మీడియా సలహాదారుడిగా ఏపీ ప్రభుత్వం నియమించింది.  వెన్నెల కిషోర్‌ వెన్నెల చిత్రంతో టాలీవుడ్‌లోకి అడుగుపెట్టిన వెన్నెల కిషోర్‌ ఆ సినిమాతోనే స్టార్‌ కమెడియన్‌గా మారిపోయారు. కోపిష్టిగా ఎన్నో పాత్రల్లో నటించి ప్రేక్షకులకు కితకితలు పెట్టాడు. వెన్నెల కిషోర్‌ ఉంటే ఇక ఆ సినిమా హిట్టే అన్నంత రేంజ్‌కు ఎదిగాడు. దూకుడు, దేనికైనా రెడి, బిందాస్‌ వంటి చిత్రాల్లో వెన్నెల కిషోర్‌ కామెడీ ఆకట్టుకుంటుంది.  సునీల్‌ టాలీవుడ్‌ టాప్‌ కమెడియన్స్‌లో సునీల్‌ కూడా ఒకరు. తన విభిన్నమైన భాష, నటనతో సునీల్‌ ఎంతో పేరు సంపాదించాడు. కెరీర్‌ పీక్స్‌లో ఉండగా సునీల్‌ హీరోగా మారి అందరికీ షాక్ ఇచ్చాడు. హీరోగా పెద్దగా సక్సెస్ కాకపోవడంతో ప్రస్తుతం మళ్లీ సపోర్టింగ్ రోల్స్‌లో సునీల్‌ కనిపిస్తున్నాడు. తన సెకండ్‌ ఇన్నింగ్స్‌లో విలన్‌ పాత్రల్లో కూడా నటిస్తూ ఆదరణ పొందుతున్నాడు. ఇటీవల పుష్ప సినిమాలో విలన్‌గా కనిపించి మెప్పించాడు.  పృథ్వీ థర్టీ ఇయర్స్‌ అనగానే నటుడు పృథ్వీ ఠక్కున గుర్తుకువస్తాడు. తనదైన కామెడి టైమింగ్‌తో ఎన్నో సినిమాల్లో పృథ్వీ మెప్పించాడు. ముఖ్యంగా బాలయ్యను ఇమిటేట్‌ చేస్తూ ఆయన చేసి కామెడీ థియేటర్లలో నవ్వులు పూయిస్తుంది.  ప్రియదర్శి పెళ్లిచూపులు చిత్రం ద్వారా నటుడు ప్రియదర్శి అందరి దృష్టిని ఆకర్షించాడు. తనదైన కామెడీతో ప్రేక్షకులను మెప్పించాడు. ఆ తర్వాత పలు సినిమాల్లో నటించిన ప్రియదర్శి జాతిరత్నాలు చిత్రంతో మంచి కమెడియన్‌గా ఇండస్ట్రీలో స్థిరపడ్డాడు. ఓ వైపు హాస్యనటుడిగా చేస్తూనే మధ్య మధ్యలో హీరోగా కనిపించి మెప్పిస్తున్నాడు. ఇటీవల ప్రియదర్శి చేసిన బలగం సినిమా ఘన విజయం సాధించింది.  సప్తగిరి పరుగు సినిమా ద్వారా సప్తగిరి టాలీవుడ్‌కు పరిచయమయ్యాడు. ఆ తర్వాత గణేష్, సాధ్యం, కందిరీగ, నిప్పు సినిమాల్లో నటించి గుర్తింపు తెచ్చుకున్నాడు. వెంకటాద్రి సినిమాలో సప్తగిరి కామెడీనే హైలెట్‌ అని చెప్పాలి. ఆ తర్వాత వచ్చిన ప్రేమకథా చిత్రంతో సప్తగిరి స్టార్‌ కమెడియన్లలో ఒకరిగా మారిపోయాడు. అప్పటి నుంచి ఇప్పటివరకు పలు సినిమాల్లో నటించిన సప్తగిరి ప్రేక్షకులను తనదైన కామెడితో అలరిస్తున్నాడు.  సత్య అక్కల టాలీవుడ్‌లో మంచి కమెడియన్‌గా సత్య అక్కాల ఎదుగుతున్నాడు. హీరో ఫ్రెండ్ పాత్రల్లో నటిస్తూ మెప్పిస్తున్నాడు. పల్లెటూరు నేపథ్యంలో సాగే సినిమాల్లో సత్యం అక్కాల తప్పనిసరిగా ఉండాల్సిందే. పల్లెటూరు వ్యక్తిగా, కోపిష్టిగా  సత్యం చేసే కామెడి ప్రేక్షకులను ఫిదా చేస్తుంది.  శ్రీనివాస రెడ్డి హాస్యనటుడిగా తెలుగు ప్రేక్షకుల మన్ననలు పొందిన నటుల్లో శ్రీనివాస రెడ్డి ఒకరు. ఇష్టం సినిమాతో టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చిన ఆయన ఇడియట్‌ సినిమాతో గొప్ప కమెడియన్‌గా పేరు తెచ్చుకున్నాడు. హాస్యనటుడిగా చేస్తూనే పలు సినిమాల్లో హీరోగా కూడా శ్రీనివాసరెడ్డి కనిపించాడు. గీతాంజలి, జంబలకిడిపంబ, జయమ్ము నిశ్చయమ్మురా చిత్రాల్లో కథానాయకుడిగా నటించి అలరించాడు.  షకలక శంకర్‌ జబర్దస్త్‌ షో ద్వారా కెరీర్‌ ఆరంభించిన షకలక శంకర్‌ సినిమాల్లోకి కమెడియన్‌గా ఎంట్రీ ఇచ్చాడు. శ్రీకాకుళం యాసలో మాట్లాడుతూ చేసే శంకర్‌ కామెడీ తెలుగు ప్రేక్షకులను మెప్పించింది. దీంతో కమెడియన్‌గా శంకర్‌కు వరుస అవకాశాలు వస్తున్నాయి. రాజుగారి గది సినిమాలో తన అద్భుతమైన కామెడితో శంకర్‌ ఆకట్టుకున్నాడు. 
    ఏప్రిల్ 07 , 2023
    Jigra Movie Review: తమ్ముడి కోసం అక్క చేసే విరోచిత పోరాటం.. ‘జిగ్రా’ ఎలా ఉందంటే? నటీనటులు : అలియా భట్‌, రాహుల్‌ రవీంద్రన్‌, వేదాంగ్‌ రైనా, అకాంక్ష రంజన్‌ కపూర్‌, మనోజ్‌ పహ్వా, యువరాజ్‌ విజయన్‌, జసన్ షా, ధీర్‌ హిరా, ఆదిత్య నంద తదితరులు దర్శకత్వం : వాసన్‌ బాల సంగీతం : అచింత్‌ థక్కర్‌ సినిమాటోగ్రఫీ : స్వప్నిల్‌ ఎస్‌. సోనావానే ఎడిటింగ్‌ : ప్రేర్నా సైగల్ నిర్మాతలు : కరణ్‌ జోహార్‌, అలియా భట్‌, షాహీన్‌ భట్‌, అపూర్వ మెహతా విడుదల తేదీ : 11-10-2024 బాలీవుడ్‌ బ్యూటీ అలియా భట్‌ ‘RRR’ చిత్రంతో తెలుగులోనూ మంచి గుర్తింపు సంపాదించింది. హిందీ ‘దేవర’ ప్రమోషన్స్‌లోనూ పాల్గొని తెలుగు ప్రేక్షకుల మనసు గెలుచుకుంది. అటువంటి అలియా భట్ లీడ్‌రోల్‌ చేసిన లేటెస్ట్‌ యాక్షన్‌ థ్రిల్లర్ చిత్రం ‘జిగ్రా’ (Jigra Movie Review). వాసన్‌ బాలా దర్శకుడు. తెలుగు నటుడు రాహుల్‌ రవీంద్రన్‌ ముఖ్య పాత్ర పోషించాడు. అక్టోబరు 11న (Jigra Release Date) ఈ చిత్రం పాన్‌ ఇండియా స్థాయిలో థియేటర్లలోకి వచ్చింది. తెలుగులో ఏషియన్‌ సురేశ్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ పతాకంపై హీరో రానా దగ్గుబాటి (Rana Daggubati) విడుదల చేశారు. మరి ఈ చిత్రం ఎలా ఉంది? తెలుగు ఆడియన్స్‌ను మెప్పించిందా? ఇప్పుడు తెలుసుకుందాం.  కథేంటి సత్యభామ (ఆలియా భట్) ఓ డబ్బున్న ఇంట్లో హోటల్‌ మేనేజ్‌మెంట్‌ స్టాఫ్‌గా చేస్తుంటుంది. చిన్నప్పుడే తల్లిదండ్రులు చనిపోవడంతో తమ్ముడు అంకుర్ ఆనంద్ (వేదాంగ్ రైనా)ను తనే పెంచి పెద్దవాడ్ని చేస్తుంది. మంచి బిజినెస్ ఐడియాతో ఉన్న అంకుర్‌ ఇన్వెస్టర్లను కలిసేందుకు మలేషియా దగ్గర్లో ఉన్న హన్షి దావో దేశానికి వెళ్తాడు. అక్కడ పార్టీలో డ్రగ్స్‌ తీసుకొని పోలీసులకు దొరికిపోతాడు. అక్కడి చట్టాల ప్రకారం అతడికి మరణశిక్ష విధిస్తారు. దీంతో తమ్ముడిని కాపాడటానికి సత్యభామ తనకు కుదిరిన ప్రయత్నాలన్నీ చేస్తుంది. కానీ ఫలితం ఉండదు. దీంతో జైలు నుంచి తప్పించడం తప్ప మరో మార్గం లేదని సత్య నిర్ణయిస్తుంది. మరి ఈ ప్రయత్నంలో సత్య విజయం సాధించిందా? ముత్తు (రాహుల్ రవీంద్రన్), భాటియా (మనోజ్ పహ్వా) ఎవరు? సత్యకు వారు ఏ విధంగా సాయపడ్డారు? తెలియాలంటే సినిమా చూడాల్సిందే.  ఎవరెలా చేశారంటే సత్యభామగా ఆలియా భట్ అద్భుతంగా నటించింది. ఎమోషనల్ సన్నివేశాల్లో ఆమె నటన ఆకట్టుకుంటుంది. తమ్ముడిని కాపాడుకునే అక్క పాత్రలో అలియాను తప్ప మరొకరిని ఊహించలేనంత బాగా నటించింది. యాక్షన్‌ సీక్వెన్స్‌లోనూ దుమ్మురేపింది. తమ్ముడు అంకుర్‌ పాత్రలో వేదాంగ్‌ రైనా మంచి నటన కనబరిచాడు. అటు ముత్తు రూపంలో తెలుగు నటుడు రాహుల్‌ రవీంద్రన్‌కు మంచి పాత్ర దక్కింది. కథలో అతడి రోల్‌ ఎంతో కీలకం. మిగతా నటీనటులు తమ పాత్ర పరిధి మేరకు మెప్పించారు.  డైరెక్షన్ ఎలా ఉందంటే దర్శకుడు వాసన్‌ బాలా జైల్‌ బ్రేక్‌ జానర్‌లో ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. సినిమా ప్రారంభమైన వెంటనే నేరుగా కథలోకి వెళ్లి అక్క, తమ్ముళ్ల బాండింగ్‌ను చక్కగా ఎస్టాబ్లిష్‌ చేశారు. వారి మధ్య ఉన్న స్ట్రాంగ్‌ రిలేషన్‌ను ఆడియన్స్‌ ఫీలయ్యేలా చేయడంలో డైరెక్టర్ సక్సెస్ అయ్యారు. అయితే అంకుర్‌ అరెస్టు వరకూ కథను అక్కడక్కడే తిప్పిన ఫీలింగ్‌ కలుగుతుంది. అరెస్టు తర్వాత నుంచి కథలో వేగం పెరుగుతుంది. జైలులో అతడు పడే తిప్పలు, తమ్ముడ్ని బయటకు తీసుకొచ్చేందుకు సత్య చేసే ప్రయత్నాలు ఆసక్తికరంగా అనిపిస్తాయి. తమ్ముడ్ని జైలు నుంచి తప్పించాలని సత్య నిర్ణయించుకోవడంతో కథ మలుపు తిరుగుతుంది. అందుకు ఆమె చేసే సాహాసోపేత ప్రయాణాన్ని చక్కగా తెరకెక్కించారు డైరెక్టర్. క్లైమాక్స్‌ వచ్చే యాక్షన్‌ ఎపిసోడ్‌ సినిమాకే హైలెట్‌గా నిలుస్తుంది. అయితే సాగదీత సన్నివేశాలు, ఊహజనీతంగా కథనం, ట్విస్టులు లేకపోవడం మైనస్‌గా చెప్పవచ్చు.  టెక్నికల్‌గా సాంకేతిక విభాగాలకు వస్తే సినిమాటోగ్రఫీ బాగుంది. జైలు వాతావరణాన్ని సినిమాటోగ్రాఫర్‌ చక్కగా ప్రజెంట్‌ చేశారు. ముఖ్యంగా క్లైమ్యాక్స్‌లో కొన్ని షాట్లు విజువల్ ఫీస్ట్‌లా అనిపిస్తాయి. సంగీతం కూడా పర్వాలేదు. నేపథ్య సంగీతం సినిమాకు తగ్గట్లు ఉంది. ఎడిటర్‌ మూవీని ఇంకాస్త ట్రిమ్‌ చేసి ఉంటే బాగుండేది. నిర్మాణ విలువలు ఉన్నతంగా ఉన్నాయి.   ప్లస్‌ పాయింట్స్‌ అలియా భట్‌ నటనఅక్కా-తమ్ముడి సెంటిమెంట్‌యాక్షన్‌ సీక్వెన్స్‌సినిమాటోగ్రఫీ మైనస్‌ పాయింట్స్‌ సాగదీత సీన్స్‌ఊహాజనీత కథనం Telugu.yousay.tv Rating : 2.5/5 
    అక్టోబర్ 11 , 2024
    Mathu Vadalara 2 Movie Review: కమెడియన్‌ సత్య వన్‌ మ్యాన్‌ షో.. ‘మత్తు వదలరా 2’ ఎలా ఉందంటే? నటీనటులు : శ్రీ సింహా, సత్య, ఫరియా అబ్దుల్లా, సునీల్‌, వెన్నెల కిషోర్‌, రోహిణి తదితరులు రచన, దర్శకత్వం : రితేష్‌ రానా సంగీతం : కాల భైరవ సినిమాటోగ్రాఫర్‌ : సురేష్‌ సారంగం ఎడిటర్‌: కార్తిక శ్రీనివాస్‌ నిర్మాత : చిరంజీవి (చెర్రీ) విడుదల తేదీ: సెప్టెంబర్‌ 13, 2024 శ్రీసింహా (Sri Simha) హీరోగా దర్శకుడు రితేశ్ రానా తెరకెక్కించిన చిత్రం ‘మత్తు వదలరా 2’ (Mathu Vadalara 2). ఫరియా అబ్దుల్లా (Faria Abdullah), సత్య, వెన్నెల కిషోర్‌, రోహిణి, సునీల్‌ కీలక పాత్రలు పోషించారు. హీరో ప్రభాస్‌ తాజాగా సినిమా ట్రైలర్‌ లాంచ్‌ చేయడంతో అందరి దృష్టి ఈ మూవీపై పడింది. ట్రైలర్ ఆద్యంతం నవ్వులు పూయిస్తూ అంచనాలను పెంచేసింది. తాజాగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం ఎలా ఉంది? తెలుగు ఆడియన్స్‌ను మెప్పించిందా? లేదా? ఈ రివ్యూలో తెలుసుకుందాం.  కథేంటి బాబు (శ్రీ సింహా), యేసుబాబు (సత్య) డెలివరీ బాయ్స్‌గా పనిచేస్తుంటారు. చాలిచాలని జీతంతో ఆర్థిక సమస్యలు ఎదుర్కొంటారు. దీంతో డబ్బులు సరిపోకా వారు స్పెషల్ ఏజెంట్స్‌గా మారతారు. ఓ కేసు విషయంలో చేసిన చిన్న పొరపాటు కారణంగా చిక్కుల్లో పడతారు. ఇంతకీ ఏంటా కేసు? వారు చేసిన పొరపాటు ఏంటి? దాని నుంచి ఎలా బయటపడ్డారు? అండర్‌ కవర్‌ ఏజెంట్‌ నిధి (ఫరియా అబ్దుల్లా) వారికి ఎలా సాయపడింది? తెలియాలంటే సినిమా చూడాల్సిందే. (Mathu Vadalara 2 Movie Review) ఎవరెలా చేశారంటే హీరోగా శ్రీ సింహా మంచి నటన కనబరిచాడు. కామెడీ, యాక్షన్‌ సీక్వెన్స్‌లో ఆకట్టుకున్నాడు. అయితే ప్రతీ సీన్‌లో సత్య పక్కన ఉండటంతో అతడే హైలెట్‌ అయ్యాడు. ఈ సినిమాకు సత్యనే మెయిన్‌ హీరో అని చెప్పవచ్చు. తన పంచ్‌ డైలాగ్స్‌తో, కామెడీ టైమింగ్‌తో సత్య అదరగొట్టాడు. ముఖ్యంగా అతడి ఎక్స్‌ప్రెషన్స్‌ ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించాయి. ‘సెక్సీ సైరన్‌’ అంటూ సినిమాలో అతడు చేసే హంగామా బాగా వర్కౌట్ అయ్యింది. హీరోయిన్‌ ఫరియా అబ్దుల్లాకు ఇందులో మంచి రోల్‌ దక్కింది. చిట్టి పాత్ర తర్వాత ఆ స్థాయిలో ఈ రోల్‌ గుర్తుండిపోతుంది. అటు వెన్నెల కిషోర్‌ సైతం తనదైన కామెడీతో గిలిగింతలు పెట్టారు. సునీల్‌, రోహిణి తదితర ముఖ్య తారాగారణం తమ పాత్రలకు పూర్తిగా న్యాయం చేశారు. ఇతర నటీనటులు కూడా పర్వాలేదనిపించారు.  డైరెక్షన్‌ ఎలా ఉందంటే దర్శకుడు రితేశ్‌ రాణా కథలన్నీ కూడా సింపుల్‌గా డ్రగ్స్‌, గన్స్‌, డబ్బు చుట్టూనే తిరుగుతుంటాయి. ఈసారి కూడా దర్శకుడు అలాంటి స్టోరీనే ఎంచుకున్నారు. ఒక కిడ్నాపింగ్‌ డ్రామాకు హాస్యాన్ని జోడించి ప్రేక్షకులను ఎంటర్‌టైన్‌ చేయడంతో దర్శకుడు పూర్తిగా సక్సెస్ అయ్యాడు. ముఖ్యంగా ఈ సినిమాలో చిరంజీవి, ప‌వ‌న్‌క‌ళ్యాణ్‌, బాల‌కృష్ణ‌, మ‌హేష్‌బాబుతో పాటు ప‌లువురు స్టార్ హీరోలను రిఫ‌రెన్స్‌లుగా తీసుకోవడం బాగా కలిసొచ్చింది. శ్రీ సింహా, సత్య పాత్రలను చాలా ఎంటర్‌టైనింగ్‌గా తీర్చిదిద్దడం మెప్పిస్తుంది. అలాగే తెరపై కనిపించే ప్రతీ క్యారెక్టర్‌ కొత్తగా, చాలా ఫన్నీగా అనిపిస్తుంది. ప్రథమార్థం మెుత్తాన్ని ఫన్‌ రైడ్‌గా నడిపించిన దర్శకుడు ద్వితియార్థంకు వచ్చేసరికి కాస్త తడబడ్డాడు. సెకండాఫ్‌లోని కొన్ని సీన్స్‌లో ల్యాగ్ ఎక్కువైనట్లు అనిపిస్తుంది. క్లైమాక్స్‌ కూడా ప్రిడిక్టబుల్‌గా ఉండటం మైనస్‌గా చెప్పవచ్చు.  టెక్నికల్‌గా  సాంకేతిక అంశాల విషయానికి వస్తే కాల భైరవ అందించిన నేపథ్య సంగీతం సినిమాకు పెద్ద ప్లస్ అయ్యింది. చాలా సన్నివేశాలను బీజీఎం బాగా ఎలివేట్‌ చేసింది. సినిమాటోగ్రఫీ బాగుంది. ఎడిటర్‌ తన కత్తెరకు ఇంకాస్త పని పెట్టాల్సింది. నిర్మాణ విలువలు ఉన్నతంగా ఉన్నాయి.  ప్లస్‌ పాయింట్స్‌ శ్రీ సింహా, సత్య కామెడీ నేపథ్య సంగీతం మైనస్‌ పాయింట్స్‌ అక్కడక్కడ సాగదీత సీన్స్‌ప్రిడిక్టబుల్‌ క్లైమాక్స్‌ Telugu.yousay.tv Rating : 3/5 
    సెప్టెంబర్ 13 , 2024
    Dhootha Review: జర్నలిస్టుగా నాగ చైతన్య అదుర్స్.. ‘ధూత’ సిరీస్ ఎలా ఉందంటే? నటీనటులు: అక్కినేని నాగ చైతన్య, ప్రియా భవానీ శంకర్, ప్రాచీ దేశాయ్, పార్వతి తిరువొతు, రవీంద్ర విజయ్, జయప్రకాశ్ తదితరులు రచన, దర్శకత్వం: విక్రమ్ కె కుమార్ ఛాయాగ్రహణం: మికొలాజ్ సైగుల సంగీతం: ఇషాన్ చబ్రా నిర్మాత: శరత్ మరార్  ఓటీటీ వేదిక: అమెజాన్ ప్రైమ్ వీడియో ఎపిసోడ్స్‌: 8 విడుదల తేదీ: డిసెంబర్ 1, 2023   సరికొత్త కథలతో సినిమాలను తెరకెక్కించడంలో డైరెక్టర్‌ విక్రమ్ కె కుమార్ శైలే వేరు. '13బి', 'ఇష్క్', 'మనం', '24' వంటి మెమరబుల్ ఫిల్మ్స్‌కు ఆయన దర్శకత్వం వహించారు. అటువంటి విక్రమ్‌ తొలిసారి దర్శకత్వం వహించిన వెబ్ సిరీస్ 'దూత'. ఇందులో అక్కినేని నాగ చైతన్య హీరోగా నటించడం విశేషం. '13బి' తర్వాత సూపర్ నేచురల్ జానర్ మరోసారి టచ్ చేశారు విక్రమ్ కె కుమార్. అతీంద్రియ శక్తుల నేపథ్యంలో ఆయన తీసిన 'దూత' ఎలా ఉంది? ఓటీటీ ప్రేక్షకులను మెప్పించిందా? ఈ రివ్యూలో చూద్దాం.  కథ సాగర్ వర్మ (నాగ చైతన్య) జర్నలిస్ట్. కొత్తగా ప్రారంభమైన సమాచార్ దిన పత్రికకు చీఫ్ ఎడిటర్‌గా వ్యవహరిస్తుంటాడు. ఓ రోజు ధాబాలోకి వెళ్లిన సాగర్‌కు ఓ పేపర్ కటింగ్ కనిపిస్తుంది. అందులో రాసినట్టు కారుకు యాక్సిడెంట్ జరిగి పెంపుడు కుక్క మరణిస్తుంది. ఆ తర్వాత మరికొన్ని పేపర్ కటింగ్స్ సాగర్ వర్మ కంట పడతాయి. వాటిలో రాసినట్టుగా ప్రమాదాలు జరుగుతూ ఉంటాయి. అందుకు కారణం ఏంటి? జరగబోయే ప్రమాదాన్ని ముందే పేపర్లలో రాస్తోంది ఎవరు? అతని ప్రయాణంలో భార్య ప్రియా (ప్రియా భవానీ శంకర్), పీఏ కమ్ జర్నలిస్ట్ అమృత (ప్రాచీ దేశాయ్), డీసీపీ క్రాంతి (పార్వతి తిరువొతు) పాత్రలు ఏమిటి? అనేది సిరీస్ చూసి తెలుసుకోవాల్సిందే.  ఎవరెలా చేశారంటే గ్రే షేడ్స్ ఉన్న పాత్రలో నాగ చైతన్య అదరగొట్టాడు. తన లుక్స్‌, ఎక్స్‌ప్రెషన్స్‌తో సిరీస్‌ ఆసాంతం నాగచైతన్య ఇంప్రెస్‌ చేస్తాడు. అతడి తర్వాత ఆ స్థాయిలో ఆకట్టుకునేది పార్వతి తిరువొతు నటన. ఎస్పీ క్రాంతిగా ఆమె ఒదిగిపోయారు. సహజంగా నటించారు. కథలో ప్రాచీ దేశాయ్, ప్రియా భవానీ శంకర్ పాత్రలు పరిమితమే. కానీ, ఉన్నంతలో తమ ఉనికి చూపించారు. జయప్రకాశ్ తనకు అలవాటైన నటనతో అలరిస్తారు. రవీంద్ర విజయ్, చైతన్య, రోహిణి, ఈశ్వరీ రావు, అనీష్ కురువిల్లా, జీవన్ కుమార్, కామాక్షీ భాస్కర్ల తదితరులు తమ పాత్ర పరిధి మేరకు నటించారు. ఫ్లాష్ బ్యాక్‌లో వచ్చే సీన్లలో పశుపతి, తరుణ్ భాస్కర్, తనికెళ్ళ భరణి, రాజా గౌతమ్, సత్య కృష్ణన్ మెప్పించారు. ఓ సన్నివేశంలో బ్రహ్మానందం తనయుడు రాజా గౌతమ్ నటన ఆశ్చర్యపరుస్తుంది. డైరెక్షన్ ఎలా ఉందంటే? విక్రమ్‌ కె కుమార్‌ దర్శకత్వ నైపుణ్యాలు ఈ సిరీస్‌లోనూ కనిపిస్తాయి. దూత కథ ఏమిటనేది ఐదారు ఎపిసోడ్స్‌ తర్వాత గానీ క్లారిటీ రాదు. అయినప్పటికీ వీక్షకులకు ఎక్కడా బోర్‌ కొట్టకుండా సిరీస్‌ను నడిపించారు డైరెక్టర్‌. చిన్న చిన్న చమక్కులు, మెరుపులతో ఆసక్తి సన్నగిల్లకుండా చూశారు. ఇక మీడియాపైనా కొన్ని చమక్కులు పేల్చారు డైరెక్టర్‌. రాజకీయ నాయకుల చేతిలో జర్నలిస్టులు పావులుగా మారుతున్న తీరును ఆయన చక్కగా చూపించారు. జర్నలిజంతో పాటు రాజీకయం, పోలీసు వ్యవస్థల్లోనే మంచి, చెడులను కళ్లకు కట్టారు. అయితే ఒక్కో ఎపిసోడ్‌ 40-50 నిమిషాల మధ్య ఉండటం వల్ల డైరెక్టర్‌ కథను సాగదీసిన ఫీలింగ్ కల్గుతుంది. ఓవరాల్‌గా విక్రమ్‌ కె కుమార్‌ డైరెక్షన్‌కు మంచి మార్కులే పడ్డాయి.  సాంకేతికంగా సాంకేతిక అంశాల పరంగా 'దూత' సిరీస్‌ ఉన్నత స్థాయిలో ఉంది. మికొలాజ్ సైగుల సినిమాటోగ్రఫీ పనితనం మెప్పిస్తుంది. సన్నివేశాలను చిత్రీకరించిన తీరు బాగుంది. ముఖ్యంగా వర్షంలో సన్నివేశాలను ఆయన బాగా తీశారు. అటు నేపథ్య సంగీతం కూడా మెప్పిస్తుంది. చెవులకు ఇబ్బంది కలిగించే శబ్దాలు లేవు. కథతో పాటు ఆర్ఆర్ ట్రావెల్ చేసింది. నిర్మాణ విలువలు సైతం బావున్నాయి. ప్లస్‌ పాయింట్స్‌ నాగ చైతన్య నటనసస్పెన్స్‌ & క్యూరియాసిటీనేపథ్య సంగీతం మైనస్‌ పాయింట్స్‌ ఫ్లాష్‌బ్యాక్ ఎపిసోడ్‌సాగదీత సీన్లు రేటింగ్‌: 3.5/5
    డిసెంబర్ 01 , 2023

    సత్య అక్కల ఫేమస్‌ అవ్వడానికి రీజన్‌ ఏంటి?

    పిల్లజమీందార్‌, కేశవ, ఛలో, భాగ్యనగర వీధుల్లో చిత్రాల ద్వారా సత్య హాస్య నటుడిగా పాపులర్ అయ్యారు.

    సత్య అక్కల లీడ్‌ రోల్‌లో చేసిన తొలి తెలుగు చిత్రం ఏది?

    తెలుగులో సత్య అక్కల ఫస్ట్‌ హిట్‌ మూవీ ఏది?

    సత్య అక్కల కెరీర్‌లో అత్యత్తుమ పాత్ర ఏది?

    ఛలోమూవీలో 'సత్య',.. రంగబలిలో 'అగాధం' పాత్రలు అత్యుత్తమమైనవి.

    సత్య అక్కల బెస్ట్‌ స్టేజ్‌ పర్‌ఫార్మెన్స్‌ వీడియోలు?

    Satya Akkala best stage performance

    సత్య అక్కల బెస్ట్‌ డైలాగ్స్‌ వీడియోలు ఏవి?

    Satya Akkala best dialogues

    Satya Akkala dialogues

    Comedian Satya dialogues

    Satya Akkala best dialogues

    సత్య అక్కల రెమ్యూనరేషన్ ఎంత?

    పాత్ర ప్రాధాన్యతను బట్టి ఒక్కో సినిమాకు రూ.20-40 లక్షల వరకూ తీసుకుంటున్నారు.

    సత్య అక్కల కు ఇష్టమైన ఆహారం ఏంటి?

    బిర్యానీ

    సత్య అక్కల కు ఇష్టమైన నటుడు ఎవరు?

    సత్య అక్కల ఎన్ని భాషలు మాట్లాడగలరు?

    తెలుగు, ఇంగ్లీషు

    సత్య అక్కల ఫేవరేట్‌ కలర్ ఏంటి?

    రెడ్, ఎల్లో

    సత్య అక్కల ఫేవరేట్‌ క్రీడ ఏది?

    క్రికెట్‌

    సత్య అక్కల కి ఎన్ని అవార్డులు వచ్చాయి?

    • సైమా అవార్డ్‌ - 2018

      2018లో 'ఛలో' చిత్రానికి గాను ఉత్తమ హాస్య నటుడిగా సైమా అవార్డ్‌ అందుకున్నారు.

    సత్య అక్కల కు సంబంధించిన వివాదాలు?

    రంగబలి' ప్రమోషన్స్‌ సందర్భంగా.. సినీ జర్నలిస్టు సురేష్‌ కొండేటిని ఇమిటేట్‌ చేస్తూ సత్య చేసిన వీడియో వివాదస్పదమైంది.
    సత్య అక్కల వ్యక్తిగత వివరాలు, ఎత్తు, పుట్టిన ప్రదేశం, బర్త్‌ డేట్‌, వయస్సు, సాధించిన విజయాలు, అవార్డులు, వ్యాపారాలు, ఇష్టాఇష్టాలు, అభిరుచులు తెలుసుకోండి. అలాగే సత్య అక్కల కుటుంబ నేపథ్యం, తల్లిదండ్రులు, తోబుట్టువులు, రిలేషన్స్‌, విద్యా నేపథ్యం, కెరీర్ మైలురాళ్లు, తాజా ప్రాజెక్ట్‌లు, అధికారిక సోషల్ మీడియా అకౌంట్స్, లేటెస్ట్‌ చిత్రాలను ఒక్క క్లిక్‌తో ఇక్కడ తెలుసుకోండి.

    @2021 KTree