దశాబ్దాల కాలంగా వేలాది సినిమాలు ప్రజలను అలరిస్తున్నాయి. సినీ ప్రియులు కూడా తమ ప్రధాన వినోద మార్గంగా సినిమాలను చూస్తున్నారు. అయితే థియేటర్లకు వచ్చే ఆడియన్స్‌ను కడుప్పుబ్బా నవ్వించి ఇంటికి పంపడంలో హాస్యనటులు కీలకపాత్ర పోషిస్తారు. గత కొన్నేళ్లుగా ఎంతో మంది హాస్యనటులు ప్రేక్షకులను నవ్వించి వారి మన్ననలు పొందారు. ఈతరంలోనూ కొందరు కమెడియన్లు కడుపుబ్బా నవ్విస్తూ విశేష ఆదరణ పొందుతున్నారు. తెలుగు ఇండస్ట్రీలో మంచి హాస్యనటులుగా గుర్తింపు పొందిన 10 మంది నటుల గురించి ఇప్పుడు తెలుసుకుందా.
బ్రహ్మానందం
టాలీవుడ్ దిగ్గజ కమెడియన్లలో బ్రహ్మానందం ఒకరు. తన కామెడితో హాస్య బ్రహ్మగా బ్రహ్మీ గుర్తింపు పొందారు. వెయ్యికి పైగా చిత్రాల్లో కమెడియన్‌గా చేసి గిన్నిస్ వరల్డ్ రికార్డ్ సాధించారు. ఇటీవల రంగమార్తండ సినిమాలో నటించిన బ్రహ్మనందం ఇప్పటివరకూ చేసిన పాత్రలకు పూర్తిగా భిన్నంగా నటించారు. ఎప్పుడు నవ్వుతూ, నవ్విస్తూ ఉండే బ్రహ్మీ.. ఈ సినిమాతో ప్రేక్షకులను కంటతడి పెట్టించారు.
ఆలీ
టాలీవుడ్ దిగ్గజ నటుల్లో ఆలీ కూడా ఒకరు. ఆలీ కూడా బ్రహ్మీ లాగే 1000కి పైగా చిత్రాల్లో నటించి ప్రేక్షకులను అలరించాడు. యాంకర్‌గా, బుల్లితెర వ్యాఖ్యాతగా కూడా ఆలీ రాణించాడు. కామెడి అంటే ఆలీదే అనే స్థాయికి ఎదిగాడు. ఓవైపు సినిమాల్లో నటిస్తూనే పలు సేవా కార్యక్రమాల్లోనూ ఆలీ చురుగ్గా వ్యవహిస్తున్నాడు. తన తండ్రి మహ్మద్ బాషా పేరుమీద ట్రస్టు ఏర్పాటు చేసి పేదలకు సేవ చేస్తున్నాడు. ఇటీవల ఆలీని ఎలక్ట్రానిక్ మీడియా సలహాదారుడిగా ఏపీ ప్రభుత్వం నియమించింది.
వెన్నెల కిషోర్
వెన్నెల చిత్రంతో టాలీవుడ్‌లోకి అడుగుపెట్టిన వెన్నెల కిషోర్ ఆ సినిమాతోనే స్టార్ కమెడియన్‌గా మారిపోయారు. కోపిష్టిగా ఎన్నో పాత్రల్లో నటించి ప్రేక్షకులకు కితకితలు పెట్టాడు. వెన్నెల కిషోర్ ఉంటే ఇక ఆ సినిమా హిట్టే అన్నంత రేంజ్‌కు ఎదిగాడు. దూకుడు, దేనికైనా రెడి, బిందాస్ వంటి చిత్రాల్లో వెన్నెల కిషోర్ కామెడీ ఆకట్టుకుంటుంది.
సునీల్
టాలీవుడ్ టాప్ కమెడియన్స్‌లో సునీల్ కూడా ఒకరు. తన విభిన్నమైన భాష, నటనతో సునీల్ ఎంతో పేరు సంపాదించాడు. కెరీర్ పీక్స్‌లో ఉండగా సునీల్ హీరోగా మారి అందరికీ షాక్ ఇచ్చాడు. హీరోగా పెద్దగా సక్సెస్ కాకపోవడంతో ప్రస్తుతం మళ్లీ సపోర్టింగ్ రోల్స్‌లో సునీల్ కనిపిస్తున్నాడు. తన సెకండ్ ఇన్నింగ్స్‌లో విలన్ పాత్రల్లో కూడా నటిస్తూ ఆదరణ పొందుతున్నాడు. ఇటీవల పుష్ప సినిమాలో విలన్‌గా కనిపించి మెప్పించాడు.
పృథ్వీ
థర్టీ ఇయర్స్ అనగానే నటుడు పృథ్వీ ఠక్కున గుర్తుకువస్తాడు. తనదైన కామెడి టైమింగ్‌తో ఎన్నో సినిమాల్లో పృథ్వీ మెప్పించాడు. ముఖ్యంగా బాలయ్యను ఇమిటేట్ చేస్తూ ఆయన చేసి కామెడీ థియేటర్లలో నవ్వులు పూయిస్తుంది.
ప్రియదర్శి
పెళ్లిచూపులు చిత్రం ద్వారా నటుడు ప్రియదర్శి అందరి దృష్టిని ఆకర్షించాడు. తనదైన కామెడీతో ప్రేక్షకులను మెప్పించాడు. ఆ తర్వాత పలు సినిమాల్లో నటించిన ప్రియదర్శి జాతిరత్నాలు చిత్రంతో మంచి కమెడియన్‌గా ఇండస్ట్రీలో స్థిరపడ్డాడు. ఓ వైపు హాస్యనటుడిగా చేస్తూనే మధ్య మధ్యలో హీరోగా కనిపించి మెప్పిస్తున్నాడు. ఇటీవల ప్రియదర్శి చేసిన బలగం సినిమా ఘన విజయం సాధించింది.
సప్తగిరి
పరుగు సినిమా ద్వారా సప్తగిరి టాలీవుడ్‌కు పరిచయమయ్యాడు. ఆ తర్వాత గణేష్, సాధ్యం, కందిరీగ, నిప్పు సినిమాల్లో నటించి గుర్తింపు తెచ్చుకున్నాడు. వెంకటాద్రి సినిమాలో సప్తగిరి కామెడీనే హైలెట్ అని చెప్పాలి. ఆ తర్వాత వచ్చిన ప్రేమకథా చిత్రంతో సప్తగిరి స్టార్ కమెడియన్లలో ఒకరిగా మారిపోయాడు. అప్పటి నుంచి ఇప్పటివరకు పలు సినిమాల్లో నటించిన సప్తగిరి ప్రేక్షకులను తనదైన కామెడితో అలరిస్తున్నాడు.
సత్య అక్కల
టాలీవుడ్‌లో మంచి కమెడియన్‌గా సత్య అక్కాల ఎదుగుతున్నాడు. హీరో ఫ్రెండ్ పాత్రల్లో నటిస్తూ మెప్పిస్తున్నాడు. పల్లెటూరు నేపథ్యంలో సాగే సినిమాల్లో సత్యం అక్కాల తప్పనిసరిగా ఉండాల్సిందే. పల్లెటూరు వ్యక్తిగా, కోపిష్టిగా సత్యం చేసే కామెడి ప్రేక్షకులను ఫిదా చేస్తుంది.
శ్రీనివాస రెడ్డి
హాస్యనటుడిగా తెలుగు ప్రేక్షకుల మన్ననలు పొందిన నటుల్లో శ్రీనివాస రెడ్డి ఒకరు. ఇష్టం సినిమాతో టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చిన ఆయన ఇడియట్ సినిమాతో గొప్ప కమెడియన్‌గా పేరు తెచ్చుకున్నాడు. హాస్యనటుడిగా చేస్తూనే పలు సినిమాల్లో హీరోగా కూడా శ్రీనివాసరెడ్డి కనిపించాడు. గీతాంజలి, జంబలకిడిపంబ, జయమ్ము నిశ్చయమ్మురా చిత్రాల్లో కథానాయకుడిగా నటించి అలరించాడు.
షకలక శంకర్
జబర్దస్త్ షో ద్వారా కెరీర్ ఆరంభించిన షకలక శంకర్ సినిమాల్లోకి కమెడియన్‌గా ఎంట్రీ ఇచ్చాడు. శ్రీకాకుళం యాసలో మాట్లాడుతూ చేసే శంకర్ కామెడీ తెలుగు ప్రేక్షకులను మెప్పించింది. దీంతో కమెడియన్‌గా శంకర్‌కు వరుస అవకాశాలు వస్తున్నాయి. రాజుగారి గది సినిమాలో తన అద్భుతమైన కామెడితో శంకర్ ఆకట్టుకున్నాడు.
Celebrities Featured Articles Movie News
Allu Arjun: సీఎం రేవంత్ రెడ్డికి.. బన్నీ స్ట్రాంగ్ కౌంటర్!