• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • Jigra Movie Review: తమ్ముడి కోసం అక్క చేసే విరోచిత పోరాటం.. ‘జిగ్రా’ ఎలా ఉందంటే?

    నటీనటులు : అలియా భట్‌, రాహుల్‌ రవీంద్రన్‌, వేదాంగ్‌ రైనా, అకాంక్ష రంజన్‌ కపూర్‌, మనోజ్‌ పహ్వా, యువరాజ్‌ విజయన్‌, జసన్ షా, ధీర్‌ హిరా, ఆదిత్య నంద తదితరులు

    దర్శకత్వం : వాసన్‌ బాల

    సంగీతం : అచింత్‌ థక్కర్‌

    సినిమాటోగ్రఫీ : స్వప్నిల్‌ ఎస్‌. సోనావానే

    ఎడిటింగ్‌ : ప్రేర్నా సైగల్

    నిర్మాతలు : కరణ్‌ జోహార్‌, అలియా భట్‌, షాహీన్‌ భట్‌, అపూర్వ మెహతా

    విడుదల తేదీ : 11-10-2024

    బాలీవుడ్‌ బ్యూటీ అలియా భట్‌RRR’ చిత్రంతో తెలుగులోనూ మంచి గుర్తింపు సంపాదించింది. హిందీ ‘దేవర’ ప్రమోషన్స్‌లోనూ పాల్గొని తెలుగు ప్రేక్షకుల మనసు గెలుచుకుంది. అటువంటి అలియా భట్ లీడ్‌రోల్‌ చేసిన లేటెస్ట్‌ యాక్షన్‌ థ్రిల్లర్ చిత్రం ‘జిగ్రా’ (Jigra Movie Review). వాసన్‌ బాలా దర్శకుడు. తెలుగు నటుడు రాహుల్‌ రవీంద్రన్‌ ముఖ్య పాత్ర పోషించాడు. అక్టోబరు 11న (Jigra Release Date) ఈ చిత్రం పాన్‌ ఇండియా స్థాయిలో థియేటర్లలోకి వచ్చింది. తెలుగులో ఏషియన్‌ సురేశ్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ పతాకంపై హీరో రానా దగ్గుబాటి (Rana Daggubati) విడుదల చేశారు. మరి ఈ చిత్రం ఎలా ఉంది? తెలుగు ఆడియన్స్‌ను మెప్పించిందా? ఇప్పుడు తెలుసుకుందాం. 

    కథేంటి

    సత్యభామ (ఆలియా భట్) ఓ డబ్బున్న ఇంట్లో హోటల్‌ మేనేజ్‌మెంట్‌ స్టాఫ్‌గా చేస్తుంటుంది. చిన్నప్పుడే తల్లిదండ్రులు చనిపోవడంతో తమ్ముడు అంకుర్ ఆనంద్ (వేదాంగ్ రైనా)ను తనే పెంచి పెద్దవాడ్ని చేస్తుంది. మంచి బిజినెస్ ఐడియాతో ఉన్న అంకుర్‌ ఇన్వెస్టర్లను కలిసేందుకు మలేషియా దగ్గర్లో ఉన్న హన్షి దావో దేశానికి వెళ్తాడు. అక్కడ పార్టీలో డ్రగ్స్‌ తీసుకొని పోలీసులకు దొరికిపోతాడు. అక్కడి చట్టాల ప్రకారం అతడికి మరణశిక్ష విధిస్తారు. దీంతో తమ్ముడిని కాపాడటానికి సత్యభామ తనకు కుదిరిన ప్రయత్నాలన్నీ చేస్తుంది. కానీ ఫలితం ఉండదు. దీంతో జైలు నుంచి తప్పించడం తప్ప మరో మార్గం లేదని సత్య నిర్ణయిస్తుంది. మరి ఈ ప్రయత్నంలో సత్య విజయం సాధించిందా? ముత్తు (రాహుల్ రవీంద్రన్), భాటియా (మనోజ్ పహ్వా) ఎవరు? సత్యకు వారు ఏ విధంగా సాయపడ్డారు? తెలియాలంటే సినిమా చూడాల్సిందే. 

    ఎవరెలా చేశారంటే

    సత్యభామగా ఆలియా భట్ అద్భుతంగా నటించింది. ఎమోషనల్ సన్నివేశాల్లో ఆమె నటన ఆకట్టుకుంటుంది. తమ్ముడిని కాపాడుకునే అక్క పాత్రలో అలియాను తప్ప మరొకరిని ఊహించలేనంత బాగా నటించింది. యాక్షన్‌ సీక్వెన్స్‌లోనూ దుమ్మురేపింది. తమ్ముడు అంకుర్‌ పాత్రలో వేదాంగ్‌ రైనా మంచి నటన కనబరిచాడు. అటు ముత్తు రూపంలో తెలుగు నటుడు రాహుల్‌ రవీంద్రన్‌కు మంచి పాత్ర దక్కింది. కథలో అతడి రోల్‌ ఎంతో కీలకం. మిగతా నటీనటులు తమ పాత్ర పరిధి మేరకు మెప్పించారు. 

    డైరెక్షన్ ఎలా ఉందంటే

    దర్శకుడు వాసన్‌ బాలా జైల్‌ బ్రేక్‌ జానర్‌లో ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. సినిమా ప్రారంభమైన వెంటనే నేరుగా కథలోకి వెళ్లి అక్క, తమ్ముళ్ల బాండింగ్‌ను చక్కగా ఎస్టాబ్లిష్‌ చేశారు. వారి మధ్య ఉన్న స్ట్రాంగ్‌ రిలేషన్‌ను ఆడియన్స్‌ ఫీలయ్యేలా చేయడంలో డైరెక్టర్ సక్సెస్ అయ్యారు. అయితే అంకుర్‌ అరెస్టు వరకూ కథను అక్కడక్కడే తిప్పిన ఫీలింగ్‌ కలుగుతుంది. అరెస్టు తర్వాత నుంచి కథలో వేగం పెరుగుతుంది. జైలులో అతడు పడే తిప్పలు, తమ్ముడ్ని బయటకు తీసుకొచ్చేందుకు సత్య చేసే ప్రయత్నాలు ఆసక్తికరంగా అనిపిస్తాయి. తమ్ముడ్ని జైలు నుంచి తప్పించాలని సత్య నిర్ణయించుకోవడంతో కథ మలుపు తిరుగుతుంది. అందుకు ఆమె చేసే సాహాసోపేత ప్రయాణాన్ని చక్కగా తెరకెక్కించారు డైరెక్టర్. క్లైమాక్స్‌ వచ్చే యాక్షన్‌ ఎపిసోడ్‌ సినిమాకే హైలెట్‌గా నిలుస్తుంది. అయితే సాగదీత సన్నివేశాలు, ఊహజనీతంగా కథనం, ట్విస్టులు లేకపోవడం మైనస్‌గా చెప్పవచ్చు. 

    టెక్నికల్‌గా

    సాంకేతిక విభాగాలకు వస్తే సినిమాటోగ్రఫీ బాగుంది. జైలు వాతావరణాన్ని సినిమాటోగ్రాఫర్‌ చక్కగా ప్రజెంట్‌ చేశారు. ముఖ్యంగా క్లైమ్యాక్స్‌లో కొన్ని షాట్లు విజువల్ ఫీస్ట్‌లా అనిపిస్తాయి. సంగీతం కూడా పర్వాలేదు. నేపథ్య సంగీతం సినిమాకు తగ్గట్లు ఉంది. ఎడిటర్‌ మూవీని ఇంకాస్త ట్రిమ్‌ చేసి ఉంటే బాగుండేది. నిర్మాణ విలువలు ఉన్నతంగా ఉన్నాయి. 

     ప్లస్‌ పాయింట్స్‌

    • అలియా భట్‌ నటన
    • అక్కా-తమ్ముడి సెంటిమెంట్‌
    • యాక్షన్‌ సీక్వెన్స్‌
    • సినిమాటోగ్రఫీ

    మైనస్‌ పాయింట్స్‌

    • సాగదీత సీన్స్‌
    • ఊహాజనీత కథనం

    Telugu.yousay.tv Rating : 2.5/5 

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv