• TFIDB EN
  • శ్రద్ధా దాస్
    జననం : మార్చి 04 , 1987
    ప్రదేశం: బాంబే, మహారాష్ట్ర, భారతదేశం
    శ్రద్ధా దాస్‌.. టాలీవుడ్‌కు చెందిన ప్రముఖ నటి. ముంబయిలో పుట్టి పెరిగిన ఆమె.. 'సిద్ధూ ఫ్రమ్‌ శ్రీకాకుళం' సినిమాతో టాలీవుడ్‌లో అడుగుపెట్టింది. 'ఆర్య 2' మూవీతో గుర్తింపు తెచ్చుకుంది. డార్లింగ్‌, గుంటూరు టాకీస్‌, ఏక్‌ మినీ కథ.. తెలుగులో శ్రద్ధా చేసిన హిట్‌ చిత్రాలు. టాలీవుడ్‌లో 2024 వరకు 21 చిత్రాల్లో శ్రద్ధా నటించింది. కన్నడ, బెంగాలి, హిందీ భాషలు కలిపి మెుత్తం 41 సినిమాల్లో ఆమె కనిపించింది.

    శ్రద్ధా దాస్ వయసు ఎంత?

    శ్రద్ధా దాస్‌ వయసు 38 సంవత్సరాలు

    శ్రద్ధా దాస్ ముద్దు పేరు ఏంటి?

    శ్రద్ధా

    శ్రద్ధా దాస్ ఎత్తు ఎంత?

    5'6'' (168cm)

    శ్రద్ధా దాస్ అభిరుచులు ఏంటి?

    ట్రావెలింగ్‌, రీడింగ్‌, స్విమ్మింగ్‌, డ్యాన్సింగ్‌

    శ్రద్ధా దాస్ ఏం చదువుకున్నారు?

    మాస్‌ కమ్యూనికేషన్స్‌ (జర్నలిజం)

    శ్రద్ధా దాస్ ఏ విద్యాసంస్థల్లో చదువుకున్నారు?

    SIES కాలేజ్‌ ఆఫ్‌ ఆర్ట్స్‌ & సైన్స్‌, ముంబయి

    శ్రద్ధా దాస్ ఫిగర్ మెజర్‌మెంట్స్?

    34-26-34

    శ్రద్ధా దాస్‌ ఇప్పటివరకూ చేసిన తెలుగు చిత్రాలు ఏవి?

    తెలుగులో 2024 వరకు 21 చిత్రాల్లో శ్రద్ధా నటించింది. కన్నడ, బెంగాలి, హిందీ భాషలు కలిపి మెుత్తం 41 సినిమాల్లో ఆమె చేసింది.

    శ్రద్ధా దాస్ In Saree

    Images

    Shraddha Das Hot images

    Images

    Shraddha Das Hot images

    శ్రద్ధా దాస్ Hot Pics

    Images

    Shraddha Das Hot images

    Images

    Shraddha Das Hot images

    శ్రద్ధా దాస్ In Bikini

    Images

    Shraddha Das Hot Images

    Images

    Actress Shraddha Das Images

    శ్రద్ధా దాస్ In Half Saree

    Images

    Shraddha Das Waist Show In Half Saree

    Images

    Shraddha Das Images in half Saree

    శ్రద్ధా దాస్ In Ethnic Dress

    Images

    Shraddha Das in Traditional Dress

    Images

    Shraddha Das Hot

    శ్రద్ధా దాస్ అన్‌ కేటగిరైజ్డ్ ఇమేజెస్‌

    Images

    Shraddha Das

    Insta Hot Reels

    View post on Instagram
     

    Shraddha Das Insta Hot Reel

    View post on Instagram
     

    Actress Shraddha Das Insta Hot Reel

    Shraddha Das: మత్తెక్కించే అందాలతో కాకరేపుతున్న శ్రద్ధా దాస్‌..!
    Shraddha Das: మత్తెక్కించే అందాలతో కాకరేపుతున్న శ్రద్ధా దాస్‌..!]మరిన్ని కథనాల కోసం  మా వెబ్‌సైట్‌ చూడండి.  YouSay యాప్‌ డౌన్‌లోడ్‌ చేసుకోండి.Anupama ParameswaranDownload Our App
    మే 26 , 2023
    Paarijatha Parvam Review: సినిమా వాళ్ల కిడ్నాప్‌ సక్సెస్‌ అయ్యిందా! ‘పారిజాత పర్వం’ హిట్టా? ఫట్టా? నటీనటులు : చైతన్యరావు, సునీల్‌, హర్ష చెముడు, శ్రద్ధా దాస్‌, మాళవికా సతీశన్‌, శ్రీకాంత్ అయ్యంగార్‌, సమీర్‌ తదితరులు దర్శకుడు : సంతోష్‌ కంభంపాటి సంగీతం : రీ సినిమాటోగ్రాఫర్‌ : బాల సరస్వతి ఎడిటర్‌ : శశాంక్‌ ఉప్పుటూరి నిర్మాతలు : మహిధర్‌ రెడ్డి, దేవేష్‌ శ్రీనివాసన్‌ సునీల్‌, శ్రద్ధాదాస్‌, చైతన్య రావు, మాళవిక సతీశన్‌ ప్రధాన పాత్రల్లో చేసిన చిత్రం 'పారిజాత పర్వం' (Paarijatha Parvam). సంతోష్‌ కంభంపాటి దర్శకత్వం వహించిన ఈ చిత్రానికి 'కిడ్నాప్‌ ఈజ్‌ ఏన్‌ ఆర్ట్‌' అని ఉపశీర్షిక పెట్టారు. ఇప్పటికే విడుదలైన ట్రైలర్, టీజర్‌.. ప్రేక్షకుల్లో అంచనాలు పెంచాయి. కాగా, శుక్రవారం (ఏప్రిల్ 19న) థియేటర్లలో విడుదలైన ఈ సినిమా ఎలా ఉందో రివ్యూలో తెలుసుకుందాం.  కథేంటి చైత‌న్య (చైత‌న్య‌రావు) డైరెక్టర్ కావాలని క‌ల‌లు కంటుంటాడు. స్నేహితుడ్ని (హ‌ర్ష‌) హీరోగా పెట్టి ఓ కథతో నిర్మాత‌ల చుట్టూ కాళ్లు అరిగేలా తిరుగుతాడు. ఆ ప్రయత్నాలు సక్సెస్‌ కాకపోవడంతో చివ‌రికి తానే నిర్మాత‌గా మారి సినిమా తీయాల‌ని ఫిక్స‌వుతాడు. డ‌బ్బు కోసం శెట్టి (శ్రీ‌కాంత్ అయ్యంగార్‌) సెకండ్ సెట‌ప్‌ని కిడ్నాప్ చేయాల‌ని ప్లాన్‌ వేస్తాడు. మ‌రోవైపు బారు శ్రీ‌ను (సునీల్‌), పారు (శ్ర‌ద్దా దాస్‌) కూడా ఆమెను కిడ్నాప్‌ చేసేందుకు స్కెచ్ వేస్తారు. మ‌రి ఈ ఇద్ద‌రిలో శెట్టి భార్య‌ని ఎవ‌రు కిడ్నాప్ చేశారు? అస‌లు బారు శ్రీ‌ను ఎవ‌రు? అతడి క‌థేంటి? చైతన్య డైరెక్టర్‌ అయ్యాడా? లేదా? అన్నది కథ.  ఎవరెలా చేశారంటే కథానాయకుడు చైతన్యరావు హ్యాండ్సమ్ లుక్స్‌తో ఆకట్టుకున్నాడు. ఎప్పటిలాగే చక్కటి నటన కనబరిచాడు. అయితే ఈ సినిమాకు హీరో కంటే హర్ష చెముడు, సునీల్‌ పాత్రలే కీలకమని చెప్పవచ్చు. ముఖ్యంగా హర్ష.. తన కమెడీ టైమింగ్‌తో అదరగొట్టాడు. అటు సునీల్‌ సైతం తన కామెడీతో మెప్పించాడు. వింటేజ్‌ సునీల్‌ను మరోమారు ప్రేక్షకులకు పరిచయం చేశాడు. హీరోయిన్‌గా మాళవిక రావు నటన పర్వాలేదు. హర్ష, మాళవిక మధ్య వచ్చే కామెడీ ట్రాక్‌ నవ్విస్తుంది. బార్‌ డ్యాన్సర్‌గా శ్రద్ధా దాస్ నటన ఓకే. శ్రీకాంత్‌ అయ్యంగార్‌, సురేఖ వాణి చాలా రోజుల తర్వాత ప్రాధాన్యత ఉన్న పాత్రల్లో కనిపించారు.  డైరెక్షన్ ఎలా ఉందంటే దర్శకుడు సంతోష్‌ కంభంపాటి.. సినిమా బ్యాక్‌డ్రాప్‌లో ఈ ఫన్‌ ఎంటర్‌టైనర్‌ను తెరకెక్కించారు. సినిమాలు తీసేవాళ్లకు తమ జీవితాల్లో ఎదురయ్యే కష్టాలను చూపించారు. వైవా హర్షను హీరోగా పెట్టి సినిమా తీస్తానని చైతన్య చెప్పడం, నిర్మాతలు ఇచ్చే సమాధానాలు నవ్విస్తాయి. హర్ష, సునీల్‌లోని కామెడీ టైమింగ్‌ను డైరెక్టర్ చాలా బాగా వాడుకున్నారు. అయితే చైతన్యరావులోని నటుడ్ని సరిగా వాడుకోలేదని అనిపిస్తుంది. కథ కూడా సాదా సీదాగా సాగడం, పేలవమైన స్క్రీన్‌ప్లే, రొటీన్‌ ట్విస్టులు సినిమాకు మైనస్‌గా మారాయి. సినిమాలో చాలా చోట్ల లాజిక్కులు మిస్‌ అయ్యాయి. కిడ్నాప్ డ్రామా తెరపైకి వచ్చి ట్విస్టులు రివీల్ అయ్యాక కామెడీ డైల్యూట్ అయ్యింది. ఫలితంగా ప్రేక్షకుల్లో కథపై క్యూరియాసిటీ తగ్గిపోయింది. అప్పటి వరకు సినిమా బ్యాక్‌డ్రాప్‌తో కొత్తగా అనిపించిన 'పారిజాత పర్వం'.. డైరెక్టర్‌ చేసిన కొన్ని తప్పిదాల వల్ల రొటీన్‌ మూవీగా మారిపోయింది.  టెక్నికల్‌గా సాంకేతిక అంశాల విషయానికి వస్తే.. కెమెరా, ప్రొడక్షన్ వేల్యూస్ బావున్నాయి. సంగీత దర్శకుడు 'రీ' బాణీల్లో పెప్పీ, మోడ్రన్ స్టైల్ వినిపించింది. నేపథ్య సంగీతం సోసోగా ఉంది. నిర్మాతలు ఎక్కడా రాజీపడినట్లు కనిపించలేదు.  ప్లస్‌ పాయింట్స్‌ కథకామెడీ సన్నివేశాలు మైనస్‌ పాయింట్స్‌ రొటీన్‌ సన్నివేశాలుపేలవమైన స్క్రీన్‌ప్లేలాజిక్స్‌కు అందని సీన్స్‌ Telugu.yousay.tv Rating : 2.5/5 
    ఏప్రిల్ 19 , 2024
    New OTT Releases Telugu: ఈ వారం థియేటర్లు, ఓటీటీల్లో విడుదలయ్యే చిత్రాలు, సిరీస్‌లు ఇవే! ప్రతీ శుక్రవారం టాలీవుడ్‌లో కొత్త సినిమాలు రిలీజ్‌ అవుతూ ప్రేక్షకులను అలరిస్తుంటాయి. అయితే గత కొన్ని వారాలుగా పెద్ద హీరోల సినిమాలు ఒక్కటి కూడా విడుదల కాలేదు. ఈ వారం కూడా అదే రిపీట్‌ కానుంది. ఈ వీకెండ్‌ కూడా ప్రేక్షకులను అలరించేందుకు చిన్న చిత్రాలు, తమిళ డబ్బింగ్‌ మూవీస్‌ రాబోతున్నాయి. అటు ఓటీటీలోనూ కొత్త చిత్రాలు, సిరీస్‌లు మిమ్మల్ని ఎంటర్‌టైన్‌ చేసేందుకు సిద్ధమవుతున్నాయి. ఆ విశేషాలేంటో ఇప్పుడు చూద్దాం. థియేటర్లలో రిలీజయ్యే చిత్రాలు హరోం హర సుధీర్‌బాబు హీరోగా జ్ఞానసాగర్‌ ద్వారక దర్శకత్వంలో రూపొందిన చిత్రం 'హరోం హర' (Harom Hara). మాళవిక శర్మ హీరోయిన్‌. సునీల్‌, రవి కాలే, కేశవ్‌ దీపక్, రాజశేఖర్‌ అనింగి ముఖ్య పాత్రలు పోషించారు. జూన్‌ 14న ఈ చిత్రం థియేటర్లలోకి రానుంది. 1989 నేపథ్యంలో జరిగే కథ ఇదని, అప్పటి వాతావరణాన్ని కళ్లకు కట్టినట్లుగా ప్రెజెంట్‌ చేసినట్లు చిత్ర యూనిట్‌ తెలిపింది. ఇప్పటికే విడుదలై ట్రైలర్‌, టీజర్ ఆకట్టుకుంటున్నాయి. రాయణ్‌  తమిళ స్టార్‌ హీరో ధనుష్‌ (New OTT Releases Telugu) నటించిన లేటెస్ట్‌ చిత్ర 'రాయణ్‌' (Raayan). ధనుష్‌ స్వీయ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రంలో దుషారా విజయన్‌ హీరోయిన్‌గా చేసింది. సందీప్‌ కిషన్‌, ఎస్‌.జే. సూర్య, అపర్ణ బాలమురళి, నిత్యా మీనన్‌, కాళిదాస్‌ జయరామ్ ముఖ్య పాత్రలు పోషించారు. జూన్‌ 13న ఈ చిత్రం థియేటర్లలోకి రానుంది.  ఇంద్రాణి  యానీయా, అంకిత, అజయ్‌ ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం 'ఇంద్రాణి' (Indrani). ఈ చిత్రం స్టీఫెన్‌ పల్లం స్వీయ దర్శక నిర్మాణంలో రూపొందింది. జూన్‌ 14న ఈ చిత్రం ధియేటర్లలో రిలీజ్‌ కాబోతోంది. టైం ట్రావెల్‌ కాన్సెప్ట్‌తో ఈ మూవీని రూపొందించినట్లు చిత్ర యూనిట్‌ తెలిపింది. వందేళ్ల తర్వాత టెక్నాలజీ పరంగా వచ్చే మార్పులేంటి? అన్నది ఇందులో చూడవచ్చని చెప్పింది.  మ్యూజిక్‌ షాప్‌ మూర్తి టాలీవుడ్ విలక్షణ నటుడు అజయ్ ఘోష్, క్యూట్ హీరోయిన్ చాందిని చౌదరి ప్రధాన పాత్రలలో నటించిన లేటెస్ట్ మూవీ 'మ్యూజిక్ షాప్ మూర్తి' (Music Shop Murthy). శివ పాలడుగు దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాను ఫ్లై హై సినిమాస్ బ్యానర్‌పై హర్ష గారపాటి, రంగారావు గారపాటి గ్రాండ్‌గా నిర్మించారు. జూన్ 14న (New OTT Releases Telugu) గ్రాండ్‌ ఈ సినిమా విడుదల కానుంది. 'ఓ మిడిల్ క్లాస్ వ్యక్తి తన కలను నెరవేర్చుకోవడానికి వయసుతో సంబంధం లేదు' అనే కాన్సెప్ట్‌తో ఈ మూవీ రూపొందింది. మహారాజా (తెలుగు డబ్‌) తమిళ స్టార్ హీరో విజయ్‌ సేతుపతి నటించిన 'మహా రాజా' (Maha Raja).. ఈ వారమే విడుదల కానుంది. నిథిలాన్‌ స్వామినాథన్‌ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రంలో మమతా మోహన్‌ దాస్‌, అనురాగ్‌ కశ్యప్‌, మునీశ్‌ కాంత్‌ ముఖ్య పాత్రలు పోషించారు. అజనీష్‌ లోక్‌నాథ్‌ సంగీతం సమకూర్చారు. జూన్‌ 14న తమిళంతో పాటు తెలుగులోనూ ఈ సినిమా రిలీజ్‌ కానుంది.  ఓటీటీలో విడుదలయ్యే చిత్రాలు గ్యాంగ్స్‌ ఆఫ్‌ గోదావరి విష్వక్‌ సేన్‌ హీరోగా నటించిన ‘గ్యాంగ్స్‌ ఆఫ్‌ గోదావరి’ (Gangs Of Godavari) చిత్రం ఈ వారమే ఓటీటీలోకి రానుంది. నెట్‌ఫ్లిక్స్‌ వేదికగా జూన్‌ 14 నుంచి స్ట్రీమింగ్‌ కానుంది. ఈ మేరకు సదరు ఓటీటీ సంస్థ (OTT Releases This Week Telugu) పోస్టర్‌ విడుదల చేసింది. తెలుగుతో పాటు తమిళ్‌, మలయాళం, కన్నడ భాషల్లో ఈ సినిమా అందుబాటులో ఉండనుంది. కృష్ణ చైతన్య దర్శకత్వం వహించిన ఈ సినిమా మే 31 థియేటర్లలో విడుదలై ప్రేక్షకులను ఆకట్టుకుంది.  పారిజాత పర్వం చైతన్య రావు, శ్రద్ధా దాస్ నటించిన క్రైమ్ కామెడీ చిత్రం ‘పారిజాత పర్వం’ (Paarijatha Parvam) ఓటీటీలోకి వస్తోంది. ఏప్రిల్ 19న థియేటర్లలో రిలీజై.. మిక్స్‌డ్ టాక్ తెచ్చుకున్న ఈ మూవీని రెండు నెలల తర్వాత ఈ వారం ఓటీటీలోకి తీసుకొస్తున్నారు. జూన్ 12 నుంచి ఈ చిత్రాన్ని స్ట్రీమింగ్‌ చేయనున్నట్లు 'ఆహా' (OTT Releases This Week Telugu) అధికారికంగా ప్రకటించింది. కంభంపాటి సంతోష్‌ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రంలో సునీల్‌, హర్ష కీలక పాత్రలు చేశారు.  TitleCategoryLanguagePlatformRelease DateTour Day France Unchained S2SeriesEnglishNetflixJune 11My Next Guest S2SeriesEnglishNetflixJune 12Mysteries Of The Terracotta WarriorsMovieEnglishNetflixJune 12Doctor ClimaxSeriesEnglishNetflixJune 13Gangs Of GodavariMovieTeluguNetflixJune 14Maha RajMovieHindiNetflixJune 14Protecting ParadiseMovieEnglishDisney + HotstarJune 10The Colour Of VictorySeriesEnglishDisney + HotstarJune 10Not Dead At S2SeriesEnglishDisney + HotstarJune 12Gaanth Chapter 1SeriesHindiJio CinemaJune 11GroundMovieTeluguAmazonJune 10The Boys Season 4SeriesTeluguAmazonJune 13Paarijatha ParvamMovieTeluguAhaJune 12Kurangu PedalSeriesTamilAhaJune 14Love Ki Arrange MarriageMovieHindiZee 5June 14ParuvuSeriesTeluguZee 5June 14
    జూన్ 10 , 2024
    Tollywood Box office: 75% పడిపోయిన విష్వక్‌ సేన్‌ మార్కెట్‌.. సత్యదేవ్‌, ఆశోక్‌ గల్లా పరిస్థితి మరీ దారుణం! ఈ వారం టాలీవడ్ నుంచి మూడు కీలక చిత్రాలు బాక్సాఫీస్‌ వద్ద రిలీజ్‌ అయ్యాయి. మాస్‌ కా దాస్‌ విష్వక్‌ సేన్‌ (Vishwak Sen) నటించిన ‘మెకానిక్‌ రాకీ’ (Mechanik Rocky) శుక్రవారం (నవంబర్‌ 22)న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. దాంతో పాటు విలక్షణ నటుడు సత్యదేవ్‌(Sathyadev) హీరోగా చేసిన ‘జిబ్రా’ (Zebra) కూడా ఆడియన్స్‌ను పలకరించింది. అలాగే ‘హనుమాన్‌’ ఫేమ్‌ ప్రశాంత్‌ వర్మ (Prasanth Varma) కథ ఇచ్చిన కథతో ‘దేవకీ నందన వాసుదేవ’ (Devaki Nandana Vasudeva)బాక్సాఫీస్‌ బరిలో నిలిచింది. అయితే విష్వక్‌, సత్యదేవ్‌ చిత్రాలు యావరేజ్‌ టాక్‌ తెచ్చుకోగా అశోక్‌ గల్ల (Ashok Galla) నటించిన ‘దేవకీ నందన వాసుదేవ’ (Devaki Nandana Vasudeva) డిజాస్టర్‌ టాక్ సొంతం చేసుకుంది. మరీ తొలి రోజు ఈ చిత్రాల కలెక్షన్స్ ఎలా ఉన్నాయి. తీవ్రంగా దెబ్బతిన్నాయా? లేదా మంచి వసూళ్లనే సాధించాయా? ఇప్పుడు పరిశీలిద్దాం.  ‘మెకానిక్‌ రాకీ’ కలెక్షన్స్‌ ఎంతంటే విష్వక్‌ సేన్‌ (Vishwaksen) హీరోగా మీనాక్షి చౌదరి, శ్రద్ధా శ్రీనాథ్‌ కథానాయికలుగా చేసిన చిత్రం ‘మెకానిక్‌ రాకీ’ (Mechanik Rocky Day 1 Collections). రవితేజ ముళ్లపూడి (Raviteja Mullapudi) దర్శత్వం వహించారు. శుక్రవారం (నవంబర్‌ 22) ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ ఏడాది ఇప్పటికే ‘గామి’, ‘గ్యాంగ్స్ ఆఫ్‌ గోదావరి’ చిత్రాలతో విష్వక్‌ ప్రేక్షకులను పలకరించాడు. మంచి హిట్‌ టాక్‌ కూడా సొంతం చేసుకున్నాడు. ‘మెకానిక్‌ రాకీ’తో ఎలాగైన హ్యాట్రిక్‌ హిట్‌ కొట్టాలని భావించిన విష్వక్‌కు ఈ మూవీ ఝలక్‌ ఇచ్చారు. యావరేజ్‌ టాక్‌ మాత్రమే తెచ్చుకుంది. ఈ ప్రభావం తొలి రోజు కలెక్షన్స్‌పై స్పష్టంగా కనిపించింది. మెకానిక్‌ రాకీ తొలి రోజు వరల్డ్‌ వైడ్‌గా రూ. 2.3 కోట్ల గ్రాస్‌ మాత్రమే రాబట్టగలిగింది. ఇది విష్వక్‌ స్థాయికి చాలా తక్కువనే చెప్పాలి. ఆయన గత చిత్రాలు ‘గ్యాంగ్స్ ఆఫ్‌ గోదావరి’, ‘గామి’ తొలి రోజున వరుసగా రూ.8 కోట్లు, రూ.8.6 కోట్ల గ్రాస్‌ సాధించింది. అంతకుముందు వచ్చిన ‘దాస్‌ కా ధమ్కీ’ కూడా రూ.8.88 కోట్లు వసూలు చేసింది. ఆ చిత్రాలతో పోలిస్తే మెకానిక్‌ రాకీ డే 1 కలెక్షన్స్‌ 75% మేర పడిపోయాయని చెప్పవచ్చు.  ‘జిబ్రా’ కలెక్షన్స్‌ ఎంతంటే సత్యదేవ్ (Satya Dev), డాలి ధనంజయ్ (daali dhananjaya) ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘జీబ్రా’ (Zebra Movie Review). ‘పెంగ్విన్‌’ సినిమాను డైరెక్ట్‌ చేసిన ఈశ్వర్‌ కార్తీక్‌ ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. ప్రియా భవానీ శంకర్‌, అమృత అయ్యంగార్‌ కథానాయికలుగా చేశారు. వైట్ కాలర్‌ క్రైమ్‌ డ్రామాలో దీనిని రూపొందించారు. మెగాస్టార్‌ చిరు (Chiranjeevi) ఈ మూవీ ప్రమోషన్స్‌లో స్వయంగా పాల్గొనడంతో సినిమాపై భారీగా అంచనాలు ఏర్పడ్డాయి. నవంబర్‌ 22న విడుదలైన ఈ చిత్రం ప్రేక్షకులను ఆకట్టుకోవడంలో తడబడింది. యావరేజ్ టాక్‌తో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. ఫలితంగా తొలి రోజు ఈ చిత్రం వరల్డ్‌ వైడ్‌గా రూ.65.8 లక్షలు మాత్రమే రాబట్టినట్లు ట్రేడ్‌ వర్గాలు ప్రకటించాయి. తెలుగు రాష్ట్రాల్లో రూ.55.5 లక్షలు వసూలు చేసినట్లు పేర్కొన్నాయి. శని, ఆది వారాల్లో సినిమా కలెక్షన్స్‌ పెరిగే ఛాన్స్ లేకపోలేదని తెలిపాయి. దేవకీ నందన వాసుదేవ కలెక్షన్స్‌ ఎంతంటే ప్రముఖ వ్యాపారవేత్త గల్లా జయదేవ్‌ కుమారుడు, మహేష్‌ బాబు మేనల్లుడు అశోక్‌ (Ashok Galla) హీరోగా రూపొందిన తాజా చిత్రం 'దేవకీ నందన వాసుదేవ' (Devaki Nandana Vasudeva Review). హనుమాన్‌ ఫేమ్‌ ప్రశాంత్ వర్మ ఈ మూవీకి కథ అందించగా అర్జున్‌ జంద్యాల దర్శకత్వం వహించారు. ఇందులో ఆధ్యాత్మిక, వాణిజ్య అంశాలతో పాటు థ్రిల్లింగ్ ఎలిమెంట్స్‌ కూడా ఉంటాయని చిత్ర యూనిట్‌ మెుదటి నుంచి చెబుతూ వచ్చింది. ఈ క్రమంలో శుక్రవారం (నవంబర్‌ 22) రిలీజైన ఈ చిత్రం డిజాస్టర్‌ టాక్ తెచ్చుకొని అందరినీ షాక్‌కు గురించేసింది. మూవీ టాక్‌కు తగ్గట్లే కలెక్షన్స్‌ కూడా దారుణంగా నమోదయ్యాయి. తొలి రోజు ఈ చిత్రం వరల్డ్‌వైడ్‌గా రూ.15.5 లక్షలు మాత్రమే దక్కించుకుందని ట్రేడ్‌ వర్గాలు వెల్లడించాయి. ఈ మూవీకి వచ్చిన నెగిటివ్‌ టాక్‌ వల్ల రానున్న రోజుల్లో కలెక్షన్స్ ఇంకా తగ్గే ఛాన్స్ ఉందని అంటున్నారు. మరీ ఏం జరుగుతుందో చూడాలి. 
    నవంబర్ 23 , 2024

    శ్రద్ధా దాస్ తల్లిదండ్రులు / పిల్లలు / భార్య/ భర్తకు సంబంధించిన మరింత సమాచారం

    సునీల్‌ దాస్‌, సప్న దాస్‌ దంపతులకు 1987 మార్చి 4న శ్రద్ధా దాస్‌ జన్మించింది. ఆమె తండ్రి బిజినెస్‌మెన్‌. తల్లి డాక్టర్‌.

    శ్రద్ధా దాస్‌ సోదరుడు/సోదరి పేరు ఏంటి?

    శ్రద్ధా దాస్‌కు ఒక తమ్ముడు ఉన్నాడు.

    శ్రద్ధా దాస్ ఫేమస్‌ అవ్వడానికి రీజన్‌ ఏంటి?

    ఆర్య 2' (2009) సినిమాతో శ్రద్ధా దాస్‌ పాపులర్‌ అయ్యింది.

    శ్రద్ధా దాస్ లీడ్‌ రోల్‌లో చేసిన తొలి తెలుగు చిత్రం ఏది?

    సిద్ధు ఫ్రమ్‌ శ్రీకాకుళం (2008) సినిమాతో శ్రద్ధా తెరంగేట్రం చేసింది. 2009లో వచ్చిన డైరీ మూవీలో లీడ్‌రోల్‌లో కనిపించింది.

    తెలుగులో శ్రద్ధా దాస్ ఫస్ట్‌ హిట్‌ మూవీ ఏది?

    శ్రద్ధా దాస్ కెరీర్‌లో అత్యత్తుమ పాత్ర ఏది?

    గంటూరు టాకీస్‌ (2016) చిత్రంలో రివాల్వర్‌ రాణి పాత్ర

    శ్రద్ధా దాస్ బెస్ట్‌ స్టేజ్‌ పర్‌ఫార్మెన్స్‌ వీడియోలు?

    శ్రద్ధా దాస్ బెస్ట్‌ డైలాగ్స్‌ వీడియోలు ఏవి?

    శ్రద్ధా దాస్ రెమ్యూనరేషన్ ఎంత?

    ఒక్కో సినిమాకు రూ.కోటి వరకూ తీసుకుంటున్నట్లు సమాచారం.

    శ్రద్ధా దాస్ కు ఇష్టమైన ఆహారం ఏంటి?

    రొయ్యలు

    శ్రద్ధా దాస్ కు ఇష్టమైన నటుడు ఎవరు?

    శ్రద్ధా దాస్ కు ఇష్టమైన నటి ఎవరు?

    శ్రద్ధా దాస్ ఎన్ని భాషలు మాట్లాడగలరు?

    తెలుగు, హిందీ, మరాఠీ, ఇంగ్లీషు

    శ్రద్ధా దాస్ ఫేవరేట్‌ కలర్ ఏంటి?

    ఫ్యాషన్‌, బ్లాక్‌, జబ్‌ వి మెట్‌

    శ్రద్ధా దాస్ ఫేవరేట్‌ క్రీడ ఏది?

    క్రికెట్‌

    శ్రద్ధా దాస్ ఆస్తుల విలువ (నెట్‌వర్త్‌) ఎంత?

    శ్రద్ధా దాస్‌.. ఆస్తుల విలువ రూ.50 కోట్లు పైనే ఉంటుందని సమాచారం.

    శ్రద్ధా దాస్ ఇన్‌స్టాగ్రామ్‌ ఖాతాలో ఫాలోవర్ల సంఖ్య?

    2.9 మిలియన్ల ఫాలోవర్లు ఉన్నారు.

    శ్రద్ధా దాస్ సోషల్‌ మీడియా లింక్స్‌

    శ్రద్ధా దాస్ కు సంబంధించిన వివాదాలు?

    జిద్‌' షూటింగ్‌ సమయంలో మన్నారా చోప్రా తనను నిజంగానే కొట్టిందని శ్రద్ధా దాస్‌ పేర్కొనడం వివాదానికి దారి తీసింది. చిన్నగా కొట్టాలని సూచించినప్పటికీ ఆమె వినలేదంటూ మండిపడింది.
    శ్రద్ధా దాస్ వ్యక్తిగత వివరాలు, ఎత్తు, పుట్టిన ప్రదేశం, బర్త్‌ డేట్‌, వయస్సు, సాధించిన విజయాలు, అవార్డులు, వ్యాపారాలు, ఇష్టాఇష్టాలు, అభిరుచులు తెలుసుకోండి. అలాగే శ్రద్ధా దాస్ కుటుంబ నేపథ్యం, తల్లిదండ్రులు, తోబుట్టువులు, రిలేషన్స్‌, విద్యా నేపథ్యం, కెరీర్ మైలురాళ్లు, తాజా ప్రాజెక్ట్‌లు, అధికారిక సోషల్ మీడియా అకౌంట్స్, లేటెస్ట్‌ చిత్రాలను ఒక్క క్లిక్‌తో ఇక్కడ తెలుసుకోండి.

    @2021 KTree