• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • Tollywood Box office: 75% పడిపోయిన విష్వక్‌ సేన్‌ మార్కెట్‌.. సత్యదేవ్‌, ఆశోక్‌ గల్లా పరిస్థితి మరీ దారుణం!

    ఈ వారం టాలీవడ్ నుంచి మూడు కీలక చిత్రాలు బాక్సాఫీస్‌ వద్ద రిలీజ్‌ అయ్యాయి. మాస్‌ కా దాస్‌ విష్వక్‌ సేన్‌ (Vishwak Sen) నటించిన ‘మెకానిక్‌ రాకీ’ (Mechanik Rocky) శుక్రవారం (నవంబర్‌ 22)న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. దాంతో పాటు విలక్షణ నటుడు సత్యదేవ్‌(Sathyadev) హీరోగా చేసిన ‘జిబ్రా’ (Zebra) కూడా ఆడియన్స్‌ను పలకరించింది. అలాగే ‘హనుమాన్‌’ ఫేమ్‌ ప్రశాంత్‌ వర్మ (Prasanth Varma) కథ ఇచ్చిన కథతో ‘దేవకీ నందన వాసుదేవ’ (Devaki Nandana Vasudeva)బాక్సాఫీస్‌ బరిలో నిలిచింది. అయితే విష్వక్‌, సత్యదేవ్‌ చిత్రాలు యావరేజ్‌ టాక్‌ తెచ్చుకోగా అశోక్‌ గల్ల (Ashok Galla) నటించిన ‘దేవకీ నందన వాసుదేవ’ (Devaki Nandana Vasudeva) డిజాస్టర్‌ టాక్ సొంతం చేసుకుంది. మరీ తొలి రోజు ఈ చిత్రాల కలెక్షన్స్ ఎలా ఉన్నాయి. తీవ్రంగా దెబ్బతిన్నాయా? లేదా మంచి వసూళ్లనే సాధించాయా? ఇప్పుడు పరిశీలిద్దాం. 

    ‘మెకానిక్‌ రాకీ’ కలెక్షన్స్‌ ఎంతంటే

    విష్వక్‌ సేన్‌ (Vishwaksen) హీరోగా మీనాక్షి చౌదరి, శ్రద్ధా శ్రీనాథ్‌ కథానాయికలుగా చేసిన చిత్రం ‘మెకానిక్‌ రాకీ’ (Mechanik Rocky Day 1 Collections). రవితేజ ముళ్లపూడి (Raviteja Mullapudi) దర్శత్వం వహించారు. శుక్రవారం (నవంబర్‌ 22) ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ ఏడాది ఇప్పటికే ‘గామి’, ‘గ్యాంగ్స్ ఆఫ్‌ గోదావరి’ చిత్రాలతో విష్వక్‌ ప్రేక్షకులను పలకరించాడు. మంచి హిట్‌ టాక్‌ కూడా సొంతం చేసుకున్నాడు. ‘మెకానిక్‌ రాకీ’తో ఎలాగైన హ్యాట్రిక్‌ హిట్‌ కొట్టాలని భావించిన విష్వక్‌కు ఈ మూవీ ఝలక్‌ ఇచ్చారు. యావరేజ్‌ టాక్‌ మాత్రమే తెచ్చుకుంది. ఈ ప్రభావం తొలి రోజు కలెక్షన్స్‌పై స్పష్టంగా కనిపించింది. మెకానిక్‌ రాకీ తొలి రోజు వరల్డ్‌ వైడ్‌గా రూ. 2.3 కోట్ల గ్రాస్‌ మాత్రమే రాబట్టగలిగింది. ఇది విష్వక్‌ స్థాయికి చాలా తక్కువనే చెప్పాలి. ఆయన గత చిత్రాలు ‘గ్యాంగ్స్ ఆఫ్‌ గోదావరి’, ‘గామి’ తొలి రోజున వరుసగా రూ.8 కోట్లు, రూ.8.6 కోట్ల గ్రాస్‌ సాధించింది. అంతకుముందు వచ్చిన ‘దాస్‌ కా ధమ్కీ’ కూడా రూ.8.88 కోట్లు వసూలు చేసింది. ఆ చిత్రాలతో పోలిస్తే మెకానిక్‌ రాకీ డే 1 కలెక్షన్స్‌ 75% మేర పడిపోయాయని చెప్పవచ్చు. 

    ‘జిబ్రా’ కలెక్షన్స్‌ ఎంతంటే

    సత్యదేవ్ (Satya Dev), డాలి ధనంజయ్ (daali dhananjaya) ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘జీబ్రా’ (Zebra Movie Review). ‘పెంగ్విన్‌’ సినిమాను డైరెక్ట్‌ చేసిన ఈశ్వర్‌ కార్తీక్‌ ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. ప్రియా భవానీ శంకర్‌, అమృత అయ్యంగార్‌ కథానాయికలుగా చేశారు. వైట్ కాలర్‌ క్రైమ్‌ డ్రామాలో దీనిని రూపొందించారు. మెగాస్టార్‌ చిరు (Chiranjeevi) ఈ మూవీ ప్రమోషన్స్‌లో స్వయంగా పాల్గొనడంతో సినిమాపై భారీగా అంచనాలు ఏర్పడ్డాయి. నవంబర్‌ 22న విడుదలైన ఈ చిత్రం ప్రేక్షకులను ఆకట్టుకోవడంలో తడబడింది. యావరేజ్ టాక్‌తో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. ఫలితంగా తొలి రోజు ఈ చిత్రం వరల్డ్‌ వైడ్‌గా రూ.65.8 లక్షలు మాత్రమే రాబట్టినట్లు ట్రేడ్‌ వర్గాలు ప్రకటించాయి. తెలుగు రాష్ట్రాల్లో రూ.55.5 లక్షలు వసూలు చేసినట్లు పేర్కొన్నాయి. శని, ఆది వారాల్లో సినిమా కలెక్షన్స్‌ పెరిగే ఛాన్స్ లేకపోలేదని తెలిపాయి.

    దేవకీ నందన వాసుదేవ కలెక్షన్స్‌ ఎంతంటే

    ప్రముఖ వ్యాపారవేత్త గల్లా జయదేవ్‌ కుమారుడు, మహేష్‌ బాబు మేనల్లుడు అశోక్‌ (Ashok Galla) హీరోగా రూపొందిన తాజా చిత్రం ‘దేవకీ నందన వాసుదేవ’ (Devaki Nandana Vasudeva Review). హనుమాన్‌ ఫేమ్‌ ప్రశాంత్ వర్మ ఈ మూవీకి కథ అందించగా అర్జున్‌ జంద్యాల దర్శకత్వం వహించారు. ఇందులో ఆధ్యాత్మిక, వాణిజ్య అంశాలతో పాటు థ్రిల్లింగ్ ఎలిమెంట్స్‌ కూడా ఉంటాయని చిత్ర యూనిట్‌ మెుదటి నుంచి చెబుతూ వచ్చింది. ఈ క్రమంలో శుక్రవారం (నవంబర్‌ 22) రిలీజైన ఈ చిత్రం డిజాస్టర్‌ టాక్ తెచ్చుకొని అందరినీ షాక్‌కు గురించేసింది. మూవీ టాక్‌కు తగ్గట్లే కలెక్షన్స్‌ కూడా దారుణంగా నమోదయ్యాయి. తొలి రోజు ఈ చిత్రం వరల్డ్‌వైడ్‌గా రూ.15.5 లక్షలు మాత్రమే దక్కించుకుందని ట్రేడ్‌ వర్గాలు వెల్లడించాయి. ఈ మూవీకి వచ్చిన నెగిటివ్‌ టాక్‌ వల్ల రానున్న రోజుల్లో కలెక్షన్స్ ఇంకా తగ్గే ఛాన్స్ ఉందని అంటున్నారు. మరీ ఏం జరుగుతుందో చూడాలి. 

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv