ప్రతీ శుక్రవారం టాలీవుడ్‌లో కొత్త సినిమాలు రిలీజ్ అవుతూ ప్రేక్షకులను అలరిస్తుంటాయి. అయితే గత కొన్ని వారాలుగా పెద్ద హీరోల సినిమాలు ఒక్కటి కూడా విడుదల కాలేదు. ఈ వారం కూడా అదే రిపీట్ కానుంది. ఈ వీకెండ్ కూడా ప్రేక్షకులను అలరించేందుకు చిన్న చిత్రాలు, తమిళ డబ్బింగ్ మూవీస్ రాబోతున్నాయి. అటు ఓటీటీలోనూ కొత్త చిత్రాలు, సిరీస్‌లు మిమ్మల్ని ఎంటర్‌టైన్ చేసేందుకు సిద్ధమవుతున్నాయి. ఆ విశేషాలేంటో ఇప్పుడు చూద్దాం.
థియేటర్లలో రిలీజయ్యే చిత్రాలు
హరోం హర
సుధీర్‌బాబు హీరోగా జ్ఞానసాగర్ ద్వారక దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘హరోం హర’ (Harom Hara). మాళవిక శర్మ హీరోయిన్. సునీల్, రవి కాలే, కేశవ్ దీపక్, రాజశేఖర్ అనింగి ముఖ్య పాత్రలు పోషించారు. జూన్ 14న ఈ చిత్రం థియేటర్లలోకి రానుంది. 1989 నేపథ్యంలో జరిగే కథ ఇదని, అప్పటి వాతావరణాన్ని కళ్లకు కట్టినట్లుగా ప్రెజెంట్ చేసినట్లు చిత్ర యూనిట్ తెలిపింది. ఇప్పటికే విడుదలై ట్రైలర్, టీజర్ ఆకట్టుకుంటున్నాయి.
రాయణ్
తమిళ స్టార్ హీరో ధనుష్ (New OTT Releases Telugu) నటించిన లేటెస్ట్ చిత్ర ‘రాయణ్’ (Raayan). ధనుష్ స్వీయ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రంలో దుషారా విజయన్ హీరోయిన్‌గా చేసింది. సందీప్ కిషన్, ఎస్.జే. సూర్య, అపర్ణ బాలమురళి, నిత్యా మీనన్, కాళిదాస్ జయరామ్ ముఖ్య పాత్రలు పోషించారు. జూన్ 13న ఈ చిత్రం థియేటర్లలోకి రానుంది.
ఇంద్రాణి
యానీయా, అంకిత, అజయ్ ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘ఇంద్రాణి’ (Indrani). ఈ చిత్రం స్టీఫెన్ పల్లం స్వీయ దర్శక నిర్మాణంలో రూపొందింది. జూన్ 14న ఈ చిత్రం ధియేటర్లలో రిలీజ్ కాబోతోంది. టైం ట్రావెల్ కాన్సెప్ట్‌తో ఈ మూవీని రూపొందించినట్లు చిత్ర యూనిట్ తెలిపింది. వందేళ్ల తర్వాత టెక్నాలజీ పరంగా వచ్చే మార్పులేంటి? అన్నది ఇందులో చూడవచ్చని చెప్పింది.
మ్యూజిక్ షాప్ మూర్తి
టాలీవుడ్ విలక్షణ నటుడు అజయ్ ఘోష్, క్యూట్ హీరోయిన్ చాందిని చౌదరి ప్రధాన పాత్రలలో నటించిన లేటెస్ట్ మూవీ ‘మ్యూజిక్ షాప్ మూర్తి’ (Music Shop Murthy). శివ పాలడుగు దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాను ఫ్లై హై సినిమాస్ బ్యానర్‌పై హర్ష గారపాటి, రంగారావు గారపాటి గ్రాండ్‌గా నిర్మించారు. జూన్ 14న (New OTT Releases Telugu) గ్రాండ్ ఈ సినిమా విడుదల కానుంది. ‘ఓ మిడిల్ క్లాస్ వ్యక్తి తన కలను నెరవేర్చుకోవడానికి వయసుతో సంబంధం లేదు’ అనే కాన్సెప్ట్‌తో ఈ మూవీ రూపొందింది.
మహారాజా (తెలుగు డబ్)
తమిళ స్టార్ హీరో విజయ్ సేతుపతి నటించిన ‘మహా రాజా’ (Maha Raja).. ఈ వారమే విడుదల కానుంది. నిథిలాన్ స్వామినాథన్ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రంలో మమతా మోహన్ దాస్, అనురాగ్ కశ్యప్, మునీశ్ కాంత్ ముఖ్య పాత్రలు పోషించారు. అజనీష్ లోక్‌నాథ్ సంగీతం సమకూర్చారు. జూన్ 14న తమిళంతో పాటు తెలుగులోనూ ఈ సినిమా రిలీజ్ కానుంది.
ఓటీటీలో విడుదలయ్యే చిత్రాలు
గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి
విష్వక్ సేన్ హీరోగా నటించిన ‘గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి’ (Gangs Of Godavari) చిత్రం ఈ వారమే ఓటీటీలోకి రానుంది. నెట్‌ఫ్లిక్స్ వేదికగా జూన్ 14 నుంచి స్ట్రీమింగ్ కానుంది. ఈ మేరకు సదరు ఓటీటీ సంస్థ (OTT Releases This Week Telugu) పోస్టర్ విడుదల చేసింది. తెలుగుతో పాటు తమిళ్, మలయాళం, కన్నడ భాషల్లో ఈ సినిమా అందుబాటులో ఉండనుంది. కృష్ణ చైతన్య దర్శకత్వం వహించిన ఈ సినిమా మే 31 థియేటర్లలో విడుదలై ప్రేక్షకులను ఆకట్టుకుంది.
పారిజాత పర్వం
చైతన్య రావు, శ్రద్ధా దాస్ నటించిన క్రైమ్ కామెడీ చిత్రం ‘పారిజాత పర్వం’ (Paarijatha Parvam) ఓటీటీలోకి వస్తోంది. ఏప్రిల్ 19న థియేటర్లలో రిలీజై.. మిక్స్‌డ్ టాక్ తెచ్చుకున్న ఈ మూవీని రెండు నెలల తర్వాత ఈ వారం ఓటీటీలోకి తీసుకొస్తున్నారు. జూన్ 12 నుంచి ఈ చిత్రాన్ని స్ట్రీమింగ్ చేయనున్నట్లు ‘ఆహా’ (OTT Releases This Week Telugu) అధికారికంగా ప్రకటించింది. కంభంపాటి సంతోష్ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రంలో సునీల్, హర్ష కీలక పాత్రలు చేశారు.
Title | Category | Language | Platform | Release Date |
Tour Day France Unchained S2 | Series | English | Netflix | June 11 |
My Next Guest S2 | Series | English | Netflix | June 12 |
Mysteries Of The Terracotta Warriors | Movie | English | Netflix | June 12 |
Doctor Climax | Series | English | Netflix | June 13 |
Gangs Of Godavari | Movie | Telugu | Netflix | June 14 |
Maha Raj | Movie | Hindi | Netflix | June 14 |
Protecting Paradise | Movie | English | Disney + Hotstar | June 10 |
The Colour Of Victory | Series | English | Disney + Hotstar | June 10 |
Not Dead At S2 | Series | English | Disney + Hotstar | June 12 |
Gaanth Chapter 1 | Series | Hindi | Jio Cinema | June 11 |
Ground | Movie | Telugu | Amazon | June 10 |
The Boys Season 4 | Series | Telugu | Amazon | June 13 |
Paarijatha Parvam | Movie | Telugu | Aha | June 12 |
Kurangu Pedal | Series | Tamil | Aha | June 14 |
Love Ki Arrange Marriage | Movie | Hindi | Zee 5 | June 14 |
Paruvu | Series | Telugu | Zee 5 | June 14 |