• Cricket
 • Lifestyle
 • Health
 • Relationships
 • People
 • Recommended
 • Technology
 • Apps
 • Gadgets
 • Tech News
 • Telugu Movies
 • Hot Actress
 • Movie News
 • Reviews
 • ఓటీటీకి రూ.1000 కోట్ల సినిమా

  షారుక్‌ ఖాన్‌ హీరోగా నటించిన ‘జవాన్‌’ చిత్రం ఓటీటీ విడుదలకు సిద్ధమైంది. షారుక్‌ పుట్టిన రోజు సందర్భంగా నవంబరు 2వ నెట్‌ఫ్లిక్స్‌ వేదికగా ‘జవాన్’ చిత్రం స్ట్రీమింగ్‌ కానుంది. హిందీ, తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో అందుబాటులోకి రానుంది. ఈ మేరకు సదరు ఓటీటీ అధికారికంగా ప్రకటించింది. సెప్టెంబరు 7న ప్రేక్షకుల ముందుకు వచ్చిన జవాన్ చిత్రం బాక్సాఫీస్‌ వద్ద రూ.1,100 కోట్లు వసూలు చేసింది.

  ఓటీటీలోకి వచ్చేసిన ‘పెద్దకాపు-1’

  పెద్దకాపు-1 సినిమా ఓటీటీలోకి వచ్చేసింది. అమెజాన్ వేదికగా ఈ మూవీ స్ట్రీమింగ్ అవుతోంది. థియేటర్లలో మిస్‌ అయిన ఆడియన్స్‌ ఓటీటీలో సినిమాను చూసి ఎంజాయ్‌ చేయాలని చిత్ర యూనిట్‌ సూచించింది. శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వం వహించిన ఈ మూవీతో విరాట్‌ కర్ణ హీరోగా పరిచయం అయ్యాడు. ఈ మూవీ కంటెంట్‌ బాగున్నప్పటికీ అనుకున్న స్థాయిలో సినిమా సక్సెస్‌ కాలేకపోయింది. ఈ చిత్రానికి మిక్కీ జే. మేయర్ సంగీతం అందించారు. ద్వారకా క్రియేషన్స్‌ వారు నిర్మించారు.

  యూజర్లు వీఐ గుడ్‌న్యూస్

  తమ యూజర్లకు ప్రముఖ టెలికాం కంపెనీ వొడాఫోన్‌ ఐడియా గుడ్‌న్యూస్ చెప్పింది. ఓటీటీ సబ్‌స్క్రిప్షన్‌ను ఎంచుకునేందుకు అవకాశం కల్పిస్తోంది. రీఛార్జి ప్లాన్‌ అనుగుణంగా వీఐ అందించే ఎంపికల్లో నచ్చిన ఓటీటీ ప్లాట్‌ఫామ్‌ను ఎంచుకొనే సదుపాయాన్ని కల్పిస్తోంది. అయితే, కేవలం ఇది పోస్ట్‌ పెయిడ్‌ కస్టమర్లు మాత్రమే ఈ అవకాశం కల్పించింది. వీఐ మ్యాక్స్‌ పోస్ట్‌పెయిడ్‌ ప్లాన్లు రూ.401 నుంచి ప్రారంభమవుతున్నాయి.

  ఈ వారంలో వ‌స్తున్న‌ తెలుగు సినిమాలివే

  ఈ వారం తెలుగులో 5 సినిమాలు థియేట‌ర్ల‌లో రిలీజ్ కాబోతున్నాయి. ముఖ్యంగా ఇప్పుడు అన్ని ఇండ‌స్ట్రీల దృష్టి బ్ర‌హ్మాస్త్ర‌పై ఉంది. దాంతో పాటు సెప్టెంబ‌ర్ 9న రిలీజ్ కాబోతున్న సినిమాలు.. బ్ర‌హ్మాస్త్ర: సెప్టెంబ‌ర్ 9 అయాన్ ముఖ‌ర్జీ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కిన మూవీ బ్ర‌హ్మాస్త్ర. ర‌ణ్‌బీర్ క‌పూర్, ఆలియా భ‌ట్, నాగార్జున‌, అమితాబ్ బ‌చ్చ‌న్, మౌనిరాయ్ ప్ర‌ధాన పాత్ర‌లు పోషించారు. గ‌త ప‌దేళ్లుగా ద‌ర్శ‌కుడు దీనిపై ప‌నిచేస్తున్నాన‌ని చెప్ప‌డం ఆస‌క్తిక‌రంగా మారింది. ఇప్ప‌టికే విడుద‌లైన ట్రైల‌ర్‌, పాట‌లు సినిమాపై అంచ‌నాల‌ను పెంచాయి.  ఒకే ఒక జీవితం: … Read more

  ఫిల్మ్‌ చాంబర్‌ కీలక నిర్ణయాలు

  సినిమా పరిశ్రమ విషయంలో చర్చలు జరుపుతున్న ఫిిల్మ్‌ చాంబర్ పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. ఇకపై సినిమా విడుదలైన 8 వారాల తర్వాతనే ఓటీటీ ఇచ్చేలా నిర్మాతలంతా కలిసి నిర్ణయించారు. థియేటర్‌, మల్టీప్లెక్స్‌లలో టికెట్లు, తిను బండారాల ధరలు ప్రేక్షకులకు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని కోరామని చెప్పారు. అందుకు వారు అంగీకరించారని వెల్లడించారు. వీపీఎఫ్‌ ఛార్జీలపై ఇంకా నిర్ణయం తీసుకోలేదన్నారు. వేతన సమస్యలపైనా దాదాపుగా తుది నిర్ణయం తీసుకున్నామని వెల్లడించారు. నాలుగైదు రోజుల్లో షూటింగులు తిరిగి ప్రారంభిస్తామని తెలిపారు.

  ‘థ్యాంక్యూ’ మూవీ ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్‌

  నాగ‌చైత‌న్య హీరోగా న‌టించిన ‘థ్యాంక్యూ’ మూవీ ఆశించ‌న ఫ‌లితాన్ని అందించ‌లేక‌పోయింది. జులై 22న థియేట‌ర్ల‌లో విడుద‌లైన ఈ సినిమా బాక్సాఫీస్ వ‌ద్ద నిరాశ‌ప‌రిచింది. అయితే తాజాగా మూవీ ఓటీటీ రిలీజ్ డేట్‌ను ప్ర‌క‌టించారు. ఆగ‌స్ట్ 11నుంచి అమెజాన్ ప్రైమ్ వీడియో ఓటీటీలో థ్యాంక్యూ స్ట్రీమింగ్ కానుంది. విక్ర‌మ్ కె.కుమార్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన ఈ సినిమాలో రాశిఖ‌న్నా హీరోయిన్‌గా న‌టించింది. అవిగా గోర్, మాళ‌వికా నాయ‌ర్ కీల‌క పాత్ర‌ల్లో క‌నిపించారు. త‌మ‌న్ మ్యూజిక్ అందించాడు.

  ఆగ‌స్ట్ 5న థియేట‌ర్/ ఓటీటీలో రిలీజ్ కాబోతున్న సినిమాలు

  ఆగ‌స్ట్ నెల‌లో చాలా తెలుగు సినిమాలు విడుద‌ల‌కు సిద్ధంగా ఉన్నాయి. చాలాకాలంగా వాయిదా ప‌డుతూ వ‌స్తున్న సినిమాల‌న్ని ఈ నెల‌లోనే రిలీజ్ కాబోతున్నాయి. ఆగ‌స్ట్ 5న సీతా రామం, బింబిసార బాక్సాఫీస్ వ‌ద్ద పోటీప‌డ‌బోతున్నాయి. మ‌రి ఓటీటీలో రిలీజ్ అవుతున్న సినిమాలేంటో చూద్దాం. బింబిసార: ఆగ‌స్ట్ 5 నంద‌మూరి క‌ళ్యాణ్ రామ్ న‌టించి ‘బింబిసార’ చిత్రం ట్రైల‌ర్, పాట‌ల‌తో అంచ‌నాల‌ను పెంచింది. ఈ సినిమా కోసం ప్రేక్ష‌కులు ఆస‌క్తిగా ఎదురుచూస్తున్నారు. గురువారం రాత్రి నుంచే ప్ర‌పంచ‌వ్యాప్తంగా బింబిసార ప్రీమియ‌ర్స్ ప్రారంభంకానున్నాయి. ఈ సినిమాతో క‌ళ్యాణ్‌రామ్ … Read more

  టాలీవుడ్ 2.0 : మనుగడ కోసం మార్పు

  కరోనా తర్వాత సినీరంగ స్వరూపమే మారిపోయింది. సినిమాలు  లాభాల కన్నా నష్టాలే ఎక్కువ తెచ్చిపెడుతున్నాయి. పాజిటివ్ టాక్ తెచ్చుకున్న అంటే సుందరానికి, థ్యాంక్యూ లాంటి సినిమాలు కూడా డిజాస్టర్లుగా మిగిలాయి. ఆర్ఆర్ఆర్ లాంటి హిట్ చిత్రాలకు కూడా కొన్నిచోట్ల డిస్ట్రిబ్యూటర్లు నష్టపోయారంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. దీనికి చాలా కారణాలు ఉన్నాయి. ఓటీటీల్లో సినిమాల విడుదల, పాన్ ఇండియా సినిమాల కాన్సెప్ట్ కారణంగా భారీగా పెరిగిన హీరోల రెమ్యూనరేషన్లు, పెరిగిన టికెట్ల ధరలు ఇలా చెప్పుకుంటూ పోతే అనేక సమస్యలు. అయితే ఉన్నఫళంగా దిద్దుబాటు … Read more

  ‘త‌మిళ్ రాక‌ర్స్‌’ పైర‌సీ మాఫియాపై వెబ్‌సిరీస్‌

  సినిమా ఇండ‌స్ట్రీకి త‌మిళ్ రాక‌ర్స్ పెద్ద భూతం లాంటిది. సినిమా విడుద‌లై ఫ‌స్ట్ షో పూర్త‌వ‌గానే త‌మిళ్ రాక‌ర్స్‌లో క‌నిపిస్తుంది. ఒక్కోసారి విడుద‌ల‌కు ముందే ఈ వెబ్‌సైట్‌లో డౌన్‌లోడ్ చేసుకునేందుకు అందుబాటులో ఉంటుంది. మొత్తం భార‌త సినీ ప‌రిశ్ర‌మ‌నే వ‌ణికిస్తున్న‌ ఈ త‌మిళ్ రాక‌ర్స్‌పై ఒక వెబ్‌సిరీస్ తెర‌కెక్కింది. సోనీలివ్ ఓటీటీలో త్వ‌ర‌లో ఇది స్ట్రీమింగ్ కానుంది. వారి నెట్‌వ‌ర్క్ ఎలా ప‌నిచేస్తుంది. పైర‌సీ వ‌ల్ల సినీ ప‌రిశ్ర‌మ ఎలా న‌ష్ట‌ప‌నోతుంది అని ఇందులో చూపించ‌నున్నారు. త‌మిళ రాక‌ర్స్ వెబ్‌సిరీస్‌కు అరివ‌ళ‌గ‌న్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నాడు. … Read more

  హాట్ ఫోటోల‌తో హీట్ పెంచుతున్న బిగ్‌బాస్ బ్యూటీ హెహ‌నాజ్ గిల్

  హిందీ బిగ్‌బాస్ సీజ‌న్‌13తో ఫేమ‌స్ అయింది షెహ‌నాజ్ గిల్. ఆమె మాట‌లు, ఎక్స్‌ప్రెష‌న్స్‌తో సోష‌ల్‌మీడియాలో రీల్స్, వీడియోలు హ‌ల్‌చ‌ల్ చేశాయి. షెహ‌నాజ్ ఒక మోడ‌ల్, సింగ‌ర్, న‌టి. ఆమె బిగ్‌బాస్‌లో పాల్గొన్న స‌మ‌యంలో బొద్దుగా ఉండే. షో నుంచి బ‌య‌ట‌కు వ‌చ్చిన త‌ర్వాత నాజూగ్గా మారిపోయిన ఈ అమ్మ‌డు సోష‌ల్‌మీడియ‌లో హాట్ ఫోటోషూట్‌ల‌తో కాక రేపుతోంది. Courtesy Instagram: Shehnaaz Gill Courtesy Instagram: Shehnaaz Gill Courtesy Instagram: Shehnaaz Gill Courtesy Instagram: Shehnaaz Gill Courtesy Instagram: Shehnaaz Gill … Read more