ఈ వారం తెలుగులో 5 సినిమాలు థియేటర్లలో రిలీజ్ కాబోతున్నాయి. ముఖ్యంగా ఇప్పుడు అన్ని ఇండస్ట్రీల దృష్టి బ్రహ్మాస్త్రపై ఉంది. దాంతో పాటు సెప్టెంబర్ 9న రిలీజ్ కాబోతున్న సినిమాలు..
బ్రహ్మాస్త్ర: సెప్టెంబర్ 9
అయాన్ ముఖర్జీ దర్శకత్వంలో తెరకెక్కిన మూవీ బ్రహ్మాస్త్ర. రణ్‌బీర్ కపూర్, ఆలియా భట్, నాగార్జున, అమితాబ్ బచ్చన్, మౌనిరాయ్ ప్రధాన పాత్రలు పోషించారు. గత పదేళ్లుగా దర్శకుడు దీనిపై పనిచేస్తున్నానని చెప్పడం ఆసక్తికరంగా మారింది. ఇప్పటికే విడుదలైన ట్రైలర్, పాటలు సినిమాపై అంచనాలను పెంచాయి.
ఒకే ఒక జీవితం: సెప్టెంబర్ 9
శర్వానంద్ హీరోగా నటిస్తున్న మూవీ ఒకే ఒక జీవితం. శ్రీ కార్తిక్ దర్శకత్వం వహించాడు. రీతూ వర్మ హీరోయిన్. టైమ్ ట్రావెల్ కథాంశంతో ఇది తెరకెక్కింది. అమల అక్కినేని కీలక పాత్రలో కనిపించనున్నారు.
గాలోడు: సెప్టెంబర్ 9
జబర్థస్త్ కమెడియన్‌గా ఫేమస్ అయిన సుడిగాలి సుధీర్ హీరోగా నటించిన చిత్రం గాలోడు. గెహ్నా సిప్పి హీరోయిన్‌గా నటిస్తుంది. ఈ సినిమా ట్రైలర్‌కు మంచి స్పందన వచ్చింది. రాజశేఖర్ రెడ్డి దీనికి దర్శకత్వం వహించాడు. భీమ్స్ సంగీతం అందించాడు.
కొత్త కొత్తగా: సెప్టెంబర్ 9
అజయ్ అమన్, వృతి వగాని జంటగా నటించిన చిత్రం కొత్త కొత్తగా. ఈ సినిమా ఇండస్ట్రీలో మంచి బజ్‌ను క్రియేట్ చేసింది. హనుమాన్ వాసంశెట్టి దర్శకత్వం వహించాడు. మురళిధర్ రెడ్డి ముక్కర ప్రొడ్యూసర్.
కెప్టెన్: సెప్టెంబర్ 8
తమిళ హీరో ఆర్య నటించిన తాజా చిత్రం కెప్టెన్. తెలుగులో కూడా అదే పేరుతో విడుదల కాబోతుంది. ఐశ్వర్య లక్ష్మీ హీరోయిన్. ఈ యాక్షన్ థ్రిల్లర్ సెప్టెంబర్ 8న థియేటర్లలో విడుదల కాబోతుంది. శక్తి సౌందర రాజన్ దర్శకత్వం వహించాడు.
ఓటీటీలో రిలీజ్ కాబోయే సినిమాలు:
సినిమా | భాష | ఓటీటీ | విడుదల తేదీ |
సయన్న వార్తకల్ | మలయాళం | సన్నెక్స్ట్ | సెప్టెంబర్ 5 |
పప్పాన్ | మలయాళం | జీ5 | సెప్టెంబర్ 7 |
విక్రమ్ | పాన్ ఇండియా | జీ5 | సెప్టెంబర్ 7 |
పినూచియో | ఇంగ్లీష్, హిందీ | హాట్స్టార్ | సెప్టెంబర్ 8 |
థార్: లవ్ అండ్ థండర్ | పాన్ ఇండియా | హాట్స్టార్ | సెప్టెంబర్ 8 |
భీమ్లా నాయక్ | తమిళ్ | ఆహా తమిళ్ | సెప్టెంబర్ 9 |
ఏక్ విలన్ రిటర్న్స్ | హిందీ | నెట్ఫ్లిక్స్ | సెప్టెంబర్ 9 |