
.jpeg)
టబు వయసు ఎంత?
టబు ఎత్తు ఎంత?
టబు అభిరుచులు ఏంటి?
టబు ఏం చదువుకున్నారు?
టబు ఏ విద్యాసంస్థల్లో చదువుకున్నారు?
టబు రిలేషన్‌లో ఉంది ఎవరు?
టబు బెస్ట్ ఫ్రెండ్స్ ఎవరు?
టబు ఫిగర్ మెజర్‌మెంట్స్?
టబు ఇప్పటివరకూ చేసిన తెలుగు చిత్రాలు ఏవి?
టబు Hot Pics
టబు In Ethnic Dress
టబు Childhood Images
టబు అన్ కేటగిరైజ్డ్ ఇమేజెస్
- Vikrant Massey Net worth: సినిమా కెరీర్‌లో విక్రాంత్ మెస్సే ఎంత సంపాదించాడో తెలుసా? బాలీవుడ్ యంగ్ హీరో విక్రాంత్ మాస్సే (Vikrant Massey) సినిమాల నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించారు. 37 ఏళ్ల ఈ టాలెంటెడ్ నటుడు తీసుకున్న నిర్ణయం ప్రస్తుతం బాలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారింది. ఇటీవలే ‘12th ఫెయిల్’ చిత్రంతో విక్రాంత్ మాస్సే పేరు మార్మోగింది. ఈ చిత్రం పలు అవార్డులను సైతం కొల్లగొట్టింది. దీంతో బాలీవుడ్‌లో విక్రాంత్‌కు ఒక్కసారిగా ఆఫర్లు పెరిగాయి. చేతినిండా ప్రాజెక్ట్స్‌తో అతడు బిజీగా మారిపోయారు. అలాంటి సమయంలో సినిమాలకు బిగ్ బ్రేక్ ఇవ్వడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది. కారణం ఏంటంటే? సినిమాలకు కొంత కాలం బ్రేక్ ఇస్తున్నట్లు ఇన్‌స్టాగ్రామ్ వేదికగా విక్రామ్ మాస్సే (Vikrant Massey Net worth) ప్రకటించాడు. ఇందుకు గల కారణాలను వివరిస్తూ సుదీర్ఘ పోస్టు పెట్టాడు. కొన్నేళ్ల నుంచి ప్రేక్షకులు చూపిస్తున్న అసాధారణ ప్రేమ, అభిమానానికి విక్రాంత్ థ్యాంక్స్ చెప్పారు. ఇకపై కుటుంబ సభ్యులకు టైమ్ ఇవ్వాల్సిన సమయం వచ్చిందని చెప్పారు. అందుకే ఇకపై కొత్త ప్రాజెక్ట్స్ అంగీకరించనని స్పష్టం చేశారు. 2025లో విడుదలయ్యే చిత్రమే తన చివరిదని స్పష్టం చేశాడు. ఎన్నో అందమైన జ్ఞాపకాలు ఇచ్చిన ప్రతీ ఒక్కరికీ ధన్యవాదాలంటూ తన నోట్‌ను ముగించాడు. అయితే విక్రాంత్ నిర్ణయాన్ని ఆయన అభిమానులు తీసుకోలేకపోతున్నారు. మరోసారి ఆలోచించుకోవాలని రిక్వెస్ట్ చేస్తున్నారు. ఫ్యామిలీ, ప్రొఫెషనల్ లైఫ్‌ను బ్యాలెన్స్ చేస్తూ ముందుకు సాగమని సూచిస్తున్నారు. విక్రాంత్ సినీ నేపథ్యం సినిమాలకు బ్రేక్ ఇవ్వడంతో విక్రాంత్ మాస్సే (Vikrant Massey Net worth) పేరు ప్రస్తుతం దేశవ్యాప్తంగా మార్మోగుతోంది. అతడి గురించి తెలుసుకునేందుకు చాలా మంది ఆసక్తి కనబరుస్తున్నారు. విక్రాంత్ (Vikrant Massey) 1987 ఏప్రిల్ 3న ముంబయిలో జన్మించాడు. అక్కడి ఆర్.డి. నేషనల్ కాలేజీలో గ్రాడ్యుయేట్ పూర్తి చేశాడు. 2007లో వచ్చిన 'ధూమ్ మచావో ధూమ్' సీరియల్‌తో నటుడిగా ఎంట్రీ ఇచ్చాడు. ఆ తర్వాత ధరమ్ వీర్ (2008), ‘బాలిక వధు’, ‘కుతుబ్ హై’ సీరియల్స్‌లో చేశాడు. 2013లో వచ్చిన ‘లూతేరా’ ఫిల్మ్‌తో బాలీవుడ్‌లో అడుగుపెట్టాడు. ఆ తర్వాత పదుల సంఖ్యలో సినిమాలు చేసినప్పటికీ పెద్దగా బ్రేక్ రాలేదు. 2018లో వచ్చిన 'మీర్జాపుర్' సిరీస్ నటుడిగా అతడికి గుర్తింపు తెచ్చిపెట్టింది. గతేడాది చేసిన '12th ఫెయిల్' మూవీ విక్రాంత్ కెరీర్‌ను మరో స్థాయికి తీసుకెళ్లింది. ఈ ఏడాది వచ్చిన 'సెక్టార్ 36' ఫిల్మ్ సైతం నటుడిగా విక్రాంత్‌ను మరో మెట్టు ఎక్కించింది. ఈ ఏడాదే వచ్చిన 'ది సబర్మతి రిపోర్ట్' సైతం విక్రాంత్‌కు మంచి మార్కులు పడేలా చేసింది. ప్రస్తుతం విక్రాంత్ చేతిలో 'యార్ జిగ్రి', 'టీఎంఈ', 'అన్‌కౌన్ కి గుస్తాఖియాన్' ప్రాజెక్ట్స్ ఉన్నాయి. కొడుకు కోసం స్పెషల్ టాటూ! విక్రాంత్ మాస్సే (Vikrant Massey Net worth) కుటుంబానికి చాలా విలువ ఇస్తాడు. బాలీవుడ్ నటి షీతల్ థాకూర్ (Sheetal Thakur) ను ప్రేమ వివాహం చేసుకున్నాడు. 2022 ఫిబ్రవరి 14న ప్రేమికుల దినోత్సవం రోజున తొలుత రిజిస్టర్ మ్యారేజ్ చేసుకున్నాడు. నాలుగు రోజుల తర్వాత ఫిబ్రవరి 18న కుటుంబ సభ్యుల సమక్షంలో హిందూ సంప్రదాయల ప్రకారం పెళ్లి చేసుకున్నాడు. విక్రాంత్‌కు ఈ ఏడాది ఫిబ్రవరిలో బాబు పుట్టాడు. అతడికి వర్ధన్ పేరు పెట్టాడు. కొడుకుపై ప్రేమకు గుర్తుగా చేతిపై పుట్టిన తేదీతో సహా వర్ధన్ అనే పేరును టాటూ వేసుకున్నాడు. దీన్ని బట్టి కుటుంబానికి, కుమారుడికి విక్రాంత్ ఎంత ప్రాధాన్యత ఇస్తాడో అర్థమవుతుంది. ప్రస్తుతం చేతినిండా ప్రాజెక్ట్స్ ఉండటంతో వారితో సమయం గడపడం కుదరట్లేదని సినిమాలకు లాంగ్ బ్రేక్ ఇస్తున్నట్లు ప్రకటించాడు. ఆ హీరోయిన్‌కు బిగ్ ఫ్యాన్ విక్రాంత్ మాస్సే (Vikrant Massey) ఇష్టా ఇష్టాలకు వస్తే బాలీవుడ్‌లో అతడికి చాలా మంది ఫేవరేట్ హీరోలు ఉన్నారు. అజయ్ దేవగన్, కె.కె. మీనన్, ఇర్ఫాన్ ఖాన్, పంకజ్ కపూర్ తన అభిమాన నటులని విక్రాంత్ చెబుతుంటాడు. అయితే హీరోయిన్ విషయంలో మాత్రం విక్రాంత్‌కు చాలా స్పష్టత ఉంది. ప్రముఖ నటి టబు విక్రాంత్‌కు ఫేవరేట్ యాక్ట్రెస్. అటు ‘హమ్ దిల్ దే చుకే సనమ్’ (1999), ‘వాస్తవ్’ (1999), ‘యువ’ (2004) చిత్రాలు విక్రాంత్‌కు ఆల్‌టైమ్ ఫేవరేట్ అని చెప్పవచ్చు. స్పోర్ట్స్ విషయానికి వస్తే క్రికెట్‌ను విక్రాంత్ బాగా ఇష్టపడతాడు. ఫుడ్ విషయానికి వస్తే రాజ్మా చావల్, పాలక్ పన్నీర్‌ను ఎంతో ఇష్టంగా విక్రాంత్ తింటాడు. డ్యాన్సింగ్, ట్రావెలింగ్, క్రికెట్ ఆడటం, పర్‌ఫ్యూమ్స్‌ను కలెక్ట్ చేయడం వంటివి విక్రాంత్ హాబీలుగా చెప్పవచ్చు. ఫుడ్ విషయానికి వస్తే రాజ్మా చావల్, పాలక్ పన్నీర్‌ను ఎంతో ఇష్టంగా విక్రాంత్ తింటాడు. డ్యాన్సింగ్, ట్రావెలింగ్, క్రికెట్ ఆడటం, పర్‌ఫ్యూమ్స్‌ను కలెక్ట్ చేయడం విక్రాంత్ హాబీలుగా చెప్పవచ్చు. విక్రాంత్ ఆస్తుల విలువ ఎంతంటే? విక్రాంత్ మాస్సే (Vikrant Massey Net worth) 2007 నుంచే నటన జీవితాన్ని ప్రారంభించినప్పటికీ చెప్పుకోతగ్గ స్థాయిలో మాత్రం ఆస్తులు కూడబెట్టలేకపోయాడు. వాస్తవానికి ‘12th ఫెయిల్’ (2023) చిత్రం తర్వాతే రెమ్యూనరేషన్ భారీగా పెరిగిందని చెప్పవచ్చు. ఆ సినిమాకు ముందు వరకూ రూ.30-40 లక్షలు మాత్రమే తీసుకున్న విక్రాంత్, ప్రస్తుతం రూ.2 కోట్ల వరకూ రెమ్యూనరేషన్ అందుకుంటున్నట్లు సమాచారం. ఇదిలా ఉంటే ప్రస్తుతం అతడి నెట్ వర్త్ రూ.20-26 కోట్ల వరకూ ఉండొచ్చని బాలీవుడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. అతడికి రూ.60 లక్షలు విలువైన Volvo S90 కారు, డుకాటి మాన్‌స్టర్ (రూ.12 లక్షలు), మారుతీ సుజుకీ డిజైర్ (రూ.8.4లక్షలు) ఉన్నాయి. అలాగే ముంబయిలో సొంతిల్లు కూడా ఉన్నట్లు సమాచారం. డిసెంబర్ 02 , 2024
- HBD Tabu: టబు లైఫ్‌లో నాగార్జునతో పాటు ఇంతమంది హీరోలు ఉన్నారా?తెలుగు సినీ ప్రియులకు ఎంతో సుపరిచితురాలైన నటి టబు (Tabu). ప్రస్తుతం బాలీవుడ్‌లో వరుసగా సినిమాలు చేస్తోన్న టబు ఒకప్పుడు తెలుగులో ఎన్నో సూపర్ హిట్ చిత్రాలు చేసింది. ‘కూలి నెంబర్ 1’, ‘నిన్నే పెళ్లాడతా’, ‘ఆవిడా మా ఆవిడే’, ‘ప్రేమ దేశం’, ‘చెన్నకేశవరెడ్డి’ తదితర హిట్ చిత్రాల్లో ఆమె నటించింది. తద్వారా తెలుగు ప్రేక్షకుల అభిమానాన్ని సంపాదించింది. ఇవాళ (నవంబర్ 4) టబు పుట్టిన రోజు. ఆమె 54వ సంవత్సరంలోకి అడుగుపెట్టింది. ఈ సందర్భంగా టబు లైఫ్‌లోని ఆసక్తికర విషయాల గురించి తెలుసుకుందాం. 1971లో జన్మించిన టబు అసలు పేరు తబస్సుమ్ ఫాతిమా హష్మీ. హైదరాబాద్‌లోనే పెరిగింది. తల్లి టబును ఒంటరి తల్లిగా పెంచింది. టబుకు 3 సంవత్సరాల వయస్సు ఉన్నప్పుడు ఆమె తల్లిదండ్రులు విడాకులు తీసుకున్నారు. టబు చైల్డ్ ఆర్టిస్ట్‌గా కెరీర్ ప్రారంభించింది. కేవలం 10 సంవత్సరాల వయస్సులోనే యాక్టింగ్ రంగంలోకి అడుగుపెట్టింది. 1982లో హిందీలో రిలీజైన 'బజార్' చిత్రం ఆమె ఫస్ట్ ఫిల్మ్. https://twitter.com/mimansashekhar/status/1710632340022591556 సాధారణంగా ఏ వ్యక్తికైనా ఒకటి లేదా రెండు నిక్ నేమ్స్ ఉంటాయి. కానీ టబూకి అలా కాదట. ట్యాబ్స్, టబ్స్, టబ్బీ, టోబ్లర్, టోబ్లెరోన్ ఇలా 100కు పైగాా ముద్దుపేర్లు ఉన్నాయట. తెలుగులో చిరంజీవి, బాలకృష్ణ, వెంకటేష్, నాగార్జున వంటి స్టార్ హీరోలతో టబు సూపర్ హిట్ చిత్రాలు చేసింది. ముఖ్యంగా నాగార్జున-టబు కాంబినేషన్ సూపర్ సక్సెస్ అయ్యింది. వారు నటించిన ‘నిన్నే పెళ్లడతా’, ‘సిసింద్రీ’, ‘ఆవిడే మా ఆవిడా’ చిత్రాలు మంచి విజయాలు సాధించాయి. హిందీ వచ్చిన ప్రేమ్ చిత్రం కోసం టబు 8 ఏళ్ల పాటు నిరీక్షించారు. శ్రీదేవి భర్త, నిర్మాత అయిన బోనీ కపూర్ తమ్ముడు సంజయ్ కపూర్ ఇందులో హీరోగా చేశాడు. 1987లోనే ఈ మూవీ షూట్ స్టార్ట్ కాగా అనేక వాయిదాలు పడుతూ 1995లో ఆ సినిమా రిలీజ్ అయ్యింది. ప్రేమ్ సినిమా సెట్స్‌లోనే నటుడు సంజయ్ కపూర్‌తో టబు ప్రేమలో పడింది. ఈ విషయాన్ని ఆమెనే స్వయంగా వెల్లడించింది. అయితే ఈ బంధం ఎక్కువ రోజులు నిలవలేదు. తెలుగు స్టార్ హీరో నాగార్జునతో టబు చాలా కాలం పాటు రిలేషన్‌లో ఉన్నట్లు ప్రచారం జరిగింది. పదేళ్ల పాటు వీరు డేటింగ్‌లో ఉన్నట్లు కథనాలు వచ్చాయి. తాము మంచి స్నేహితులమని పలుమార్లు చెప్పినప్పటికీ ఎవరూ విశ్వసించలేదు. ఆ తర్వాత నిర్మాత సాజిద్ నడియాద్వాలాతో టబు ప్రేమాయణం సాగించింది. అతడి భార్య, నటి దివ్య భారతి మరణం తర్వాత వీరిద్దరు దగ్గరయ్యారు. కానీ ఆ బంధం కూడా ఎక్కువ కాలం నిలబడలేదు. బాలీవుడ్ స్టార్ అజయ్ దేవ్‌గన్‌తోనూ టబు గాఢంగా ప్రేమాయణం నడిపినట్లు అప్పట్లో పెద్ద ఎత్తున వార్తలు వచ్చాయి. అయితే తాము 25 ఏళ్లుగా మంచి స్నేహితులమని, ఎలాంటి విషయాలనైనా షేర్ చేసుకునేంత చనువు తమ మధ్య ఉందని టబు వాటిని కొట్టిపారేసింది. అయితే అజయ్‌తో ఉన్న రిలేషన్ వల్లే టబు ఇప్పటివరకూ పెళ్లి చేసుకోకుండా ఉండిపోయిందని బీటౌన్‌లో రూమర్లు ఉన్నాయి. 'భోలా' సినిమా ప్రమోషన్స్ సమయంలో టబుతో రిలేషన్‌పై అజయ్ దేవ్‌గన్ కూడా మాట్లాడారు. టీనేజ్ నుంచి ఒకరికొకరం తెలుసని, తమ మధ్య కంఫర్టబుల్ ఫ్రెండ్‌షిప్ ఉందని, ఒక్కోసారి తిట్టుకుంటామని కూడా వెల్లడించారు. బాలీవుడ్ స్టార్ సల్మాన్ ఖాన్ జింకను వేటాడిన కేసులో టబు పేరు కూడా వినిపించింది. 1998లో 'హమ్ సాథ్ సాథ్' షూటింగ్ సమయంలో ఈ ఘటన జరగ్గా ఆ సమయంలో టబు కూడా ఉన్నట్లు ఆరోపణలు వచ్చాయి. అయితే విచారణ అనంతరం టబును నిర్దోషిగా పోలీసులు విడుదల చేశారు. తెరపై నిజమైన కన్నీళ్లు పెట్టే నటీమణులు చాలా మంది ఉన్నారు. కానీ టబు అలా కాదట. కెమెరా ముందు తాను నిజమైన కన్నీళ్లు పెట్టలేనని ఓ ఇంటర్వ్యూలో టబు చెప్పింది. అందుకే సెంటిమెంట్ సీన్స్‌లో తప్పనిసరిగా గ్లిజరిన్ వాడతానని తెలిపింది. ప్రస్తుతం టబు సినిమాలతో పాటు వెబ్ సిరీస్‌లలోనూ నటిస్తూ ట్రెండ్‌కు తగ్గట్లు దూసుకెళ్తోంది. 54 ఏళ్ల వయసులోనూ 30 ఏళ్ల హీరోయిన్‌గా కనిపిస్తూ మెపిస్తోంది.నవంబర్ 04 , 2024
- Prabhas New Projects: మాట నిలబెట్టుకుంటున్న ప్రభాస్.. సెట్స్‌పైకి ఒకేసారి మూడు చిత్రాలు!పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ (Prabhas) వరుస చిత్రాలతో దూసుకుపోతున్నాడు. బ్యాక్ టు బ్యాక్ హిట్స్‌తో దేశంలో ఏ స్టార్ హీరోకు అందనంత ఎత్తులో నిలుస్తున్నాడు. రీసెంట్గా కల్కితో రూ.1200 కోట్ల మార్క్ అందుకున్న ప్రభాస్ బాక్సాఫీస్ వద్ద తనకు తిరుగులేదని మరోమారు నిరూపించాడు. అంతేకాదు వరుసగా పాన్ ఇండియా ప్రాజెక్ట్స్ అనౌన్స్ చేస్తూ ఫుల్ దూకుడు మీద ఉన్నాడు. ఈ క్రమంలోనే సూపర్ స్టార్ కృష్ణ అనుసరించిన వ్యూహాన్ని అమలు చేస్తూ ఫుల్ ఫోకస్‌తో సినిమాలు చేస్తున్నాడు. ఒకేసారి మూడు సినిమాలు పట్టాలెక్కించి ఫ్యాన్స్‌కు ఇచ్చిన మాటను నిలబెట్టుకోబోతున్నాడు. ఆ విశేషాలేంటో ఈ ప్రత్యేక కథనంలో పరిశీలిద్దాం. ప్రభాస్ ఇచ్చిన మాట ఇదే! హీరో ప్రభాస్ పాన్ ఇండియా చిత్రాలకు చిరునామాగా మారిపోయాడు. అతడు ఏ సినిమా పట్టుకున్న అది జాతీయ స్థాయి ప్రాజెక్టుగా మారిపోతోంది. ఆదిపురుష్ (2023) ముందు వరకూ ప్రభాస్ ఒక్కో చిత్రానికి కనీసం రెండేళ్లు సమయం తీసుకున్నాడు. 2015 బాహుబలి నుంచి ఈ తంతు మెుదలైంది. బాహుబలి నుంచి బాహుబలి 2 మధ్య గ్యాప్ రెండేళ్లు రాగా, ఆ తర్వాత వచ్చిన సాహో (2019), రాధే శ్యామ్ (2022) మధ్య ఏకంగా మూడేళ్ల సమయం పట్టింది. దీంతో అప్పట్లో ఫ్యాన్స్ తీవ్ర నిరాశకు గురయ్యారు. ఒక్కో సినిమాకు ఇంత గ్యాప్ తీసుకుంటే ఎలా అంటూ డార్లింగ్‌పై సున్నితంగా అసంతృప్తి వ్యక్తం చేశారు. ఫ్యాన్స్ బాధను అర్థం చేసుకున్న ప్రభాస్ ఇకపై ఏడాదికి కనీసం ఒక సినిమా రిలీజ్ చేస్తానని మాటిచ్చారు. ఆ మాటను నిలబెట్టుకుంటూ వరుసగా ప్రాజెక్ట్స్ అనౌన్స్ చూస్తూ దూసుకెళ్తున్నాడు. సూపర్ స్టార్ కృష్ణ వ్యూహం! ప్రభాస్ తన ప్రాజెక్టుల విషయంలో గతంతో పోలిస్తే చాలా ఫోకస్డ్గా ఉన్నాడు. ఒకప్పటిలాగా ప్రాజెక్ట్ తర్వాత ప్రాజెక్ట్ అనే విధానాన్ని స్వస్థి పలికి సూపర్ కృష్ణ అనుసరించిన వ్యూహాన్ని అమలు చేస్తున్నారు. ఒకప్పుడు కృష్ణ ఏక కాలంలో మూడు లేదా అంతకంటే ఎక్కువ సినిమాల్లో నటించేవారు. ఇప్పుడు ప్రభాస్ కూడా ఆయన తరహాలోనే ఒకేసారి మూడు ప్రాజెక్ట్స్‌ను సెట్స్‌పైకి తీసుకెళ్లేందుకు రంగం సిద్ధం చేస్తున్నాడు. వాస్తవానికి ‘సలార్’ సమయంలోనే ‘కల్కి 2898 ఏడీ’ షూటింగ్‌లోనూ పాల్గొంటూ రెండు చిత్రాలను 6 నెలల వ్యవధిలోనే రిలీజ్ చేశాడు. ప్రస్తుతం డైరెక్టర్ మారుతీతో 'రాజాసాబ్' అనే చిత్రంలో ప్రభాస్ నటిస్తున్నాడు. ఈ క్రమంలోనే ఇటీవల హను రాఘవపూడితో కొత్త ప్రాజెక్ట్‌ను లాంఛనంగా ప్రారంభించాడు. నవంబర్ కల్లా సందీప్ రెడ్డి వంగా డైరెక్షన్‌లోని 'స్పిరిట్'ను కూడా సెట్స్‌పైకి తీసుకెళ్లే ప్లాన్‌లో డార్లింగ్ ఉన్నాడు. తద్వారా ఏక కాలంలో ఈ మూడు చిత్రాల షూటింగ్స్‌లో పాల్గొని ఒక్కో సినిమాను ఏడాది కంటే తక్కువ వ్యవధిలోనే రిలీజ్ చేయాలని సన్నాహాలు చేస్తున్నాడు. మరోవైపు ‘సలార్ 2’, ‘కల్కి 2’ చిత్రాలను కూడా వచ్చే ఏడాది పట్టాలెక్కించే ఛాన్స్ ఉంది. దేశంలోనే నెం.1 హీరోగా ప్రభాస్ బాలీవుడ్‌కు చెందిన మీడియా సంస్థ ఆర్మాక్స్ తాజాగా జులై నెలకు సంబంధించి అత్యంత ప్రజాదరణ పొందిన హీరోల జాబితాలను ప్రకటించింది. ఈ జాబితాలో నెంబర్ వన్ స్థానంలో ప్రభాస్ నిలిచాడు. ప్రభాస్ తర్వాత రెండో స్థానంలో తమిళ స్టార్ విజయ్ నిలవగా మూడో స్థానంలో షారుక్ ఖాన్, నాలుగో స్థానంలో సూపర్ స్టార్ మహేష్ బాబు, ఐదో స్థానంలో జూనియర్ ఎన్టీఆర్, ఆరో స్థానంలో అక్షయ్ కుమార్, ఏడో స్థానంలో అల్లు అర్జున్, ఎనిమిదో స్థానంలో సల్మాన్ ఖాన్, తొమ్మిదో స్థానంలో రామ్ చరణ్, పదో స్థానంలో తమిళ స్టార్ హీరో అజిత్ నిలిచారు. మే, జూన్ నెలల్లో ఆర్మాక్స్ ప్రకటించిన జాబితాల్లో కూడా ప్రభాస్ మొదటిస్థానంలోనే నిలవడం విశేషం. దీనిపై అభిమానులు, సినీ ప్రియులు సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. బాలీవుడ్ హీరోలను వెనక్కినెట్టి ప్రభాస్ నెంబర్ వన్‌గా అవతరించాడంటూ నెట్టింట కామెంట్లు పెడుతున్నారు.ఆగస్టు 31 , 2024




.jpeg)
.jpeg)


.jpeg)

.jpeg)


టబు తల్లిదండ్రులు / పిల్లలు / భార్య/ భర్తకు సంబంధించిన మరింత సమాచారం
టబు సోదరుడు/సోదరి పేరు ఏంటి?
టబు పెళ్లి ఎప్పుడు అయింది?
టబు ఫేమస్ అవ్వడానికి రీజన్ ఏంటి?
టబు లీడ్ రోల్‌లో చేసిన తొలి తెలుగు చిత్రం ఏది?
తెలుగులో టబు ఫస్ట్ హిట్ మూవీ ఏది?
రూ.100 కోట్ల క్లబ్‌లో చేరిన టబు తొలి చిత్రం ఏది?
టబు కెరీర్‌లో అత్యత్తుమ పాత్ర ఏది?
టబు బెస్ట్ స్టేజ్ పర్‌ఫార్మెన్స్ వీడియోలు?
టబు బెస్ట్ డైలాగ్స్ వీడియోలు ఏవి?
టబు రెమ్యూనరేషన్ ఎంత?
టబు కు ఇష్టమైన ఆహారం ఏంటి?
టబు కు ఇష్టమైన నటుడు ఎవరు?
టబు కు ఇష్టమైన నటి ఎవరు?
టబు ఎన్ని భాషలు మాట్లాడగలరు?
టబు ఫెవరెట్ సినిమా ఏది?
టబు ఫేవరేట్ క్రీడ ఏది?
టబు వద్ద ఉన్న లగ్జరీ కార్లు ఏవి?
టబు ఆస్తుల విలువ (నెట్‌వర్త్) ఎంత?
టబు ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో ఫాలోవర్ల సంఖ్య?
టబు సోషల్ మీడియా లింక్స్
టబు కి ఎన్ని అవార్డులు వచ్చాయి?
నేషనల్ అవార్డ్ - 1996
మాచిస్ (1996) - ఉత్తమ నటి
నేషనల్ అవార్డ్ - 2001
చాందిని బార్ (2001) - ఉత్తమ నటి
ఫిల్మ్ ఫేర్ అవార్డ్స్ - 1994
విజయ్‌పత్ (1994) - ఉత్తమ తెరంగేట్ర నటి
ఫిల్మ్ ఫేర్ అవార్డ్స్ - 1997
విరసత్ (1997) - ఉత్తమ నటి (క్రిటిక్స్)
ఫిల్మ్ ఫేర్ అవార్డ్స్ - 1997
నిన్నే పెళ్లాడతా (1997) - ఉత్తమ నటి
ఫిల్మ్ ఫేర్ అవార్డ్స్ - 1999
హు టు టు (1999) - ఉత్తమ నటి (క్రిటిక్స్)
ఫిల్మ్ ఫేర్ అవార్డ్స్ - 2000
అస్థిత్వ (2000) - ఉత్తమ నటి (క్రిటిక్స్)
ఫిల్మ్ ఫేర్ అవార్డ్స్ - 2007
చీని కుమ్ (2007) - ఉత్తమ నటి (క్రిటిక్స్)
ఫిల్మ్ ఫేర్ అవార్డ్స్ - 2014
హైదర్ (2014) - ఉత్తమ సహాయ నటి
ఫిల్మ్ ఫేర్ అవార్డ్స్ - 2022
అలా వైకుంఠపురంలో (2022) - ఉత్తమ సహాయ నటి
ఫిల్మ్ ఫేర్ అవార్డ్స్ - 2023
భూల్ భూలయ్య 2 (2023) - ఉత్తమ నటి (క్రిటిక్స్)
పద్మశ్రీ - 2011
2011లో రాష్ట్రపతి చేతుల మీదుగా పద్మశ్రీ పురస్కారాన్ని అందుకున్నారు.