

వాణి భోజన్
జననం : అక్టోబర్ 28 , 1988
ప్రదేశం: ఊటీ, తమిళనాడు, భారతదేశం
"వాణి భోజన్ ప్రముఖ తమిళ్ నటి. సినిమాల్లోకి రాకముందు మోడలింగ్‌తో పాటు సీరియళ్లలో నటించేది. మాయ అనే సిరియల్ ద్వారా యాక్టింగ్ కెరీర్‌ను ప్రారంభించింది. ఓర్ ఎరావు అనే తమిళ్ చిత్రం ద్వారా సినిమాల్లోకి వచ్చింది. తెలుగులో మీకు మాత్రమే చెప్తా(2019) సినిమాతో పరిచయమైంది. ఆమె ప్రధాన ఉత్తమ నటిగా సన్ కుడుంబం విరుతుగల్ అవార్డును అందుకుంది.
వాణి భోజన్ వయసు ఎంత?
వాణీ భోజన్ వయసు 36 సంవత్సరాలు
వాణి భోజన్ ఎత్తు ఎంత?
5' 6'' (168cm)
వాణి భోజన్ అభిరుచులు ఏంటి?
డ్యాన్సింగ్, ట్రావెలింగ్
వాణి భోజన్ ఏం చదువుకున్నారు?
బీఏలో ఇంగ్లీష్ లిటరేచర్ చదివింది.
వాణి భోజన్ ఏ విద్యాసంస్థల్లో చదువుకున్నారు?
గవర్నమెంట్ ఆర్ట్స్ కాలేజీ, ఊటీ
వాణి భోజన్ రిలేషన్‌లో ఉంది ఎవరు?
వాణి భోజన్ నటుడు జైతో రిలేషన్‌లో ఉన్నట్లు రూమర్స్ వచ్చాయి. అలాంటి రూమర్స్‌ను తాను పట్టించుకోనని వాణి స్పష్టం చేసింది.
వాణి భోజన్ ఫిగర్ మెజర్‌మెంట్స్?
34-26-34
వాణి భోజన్ ఇప్పటివరకూ చేసిన తెలుగు చిత్రాలు ఏవి?
వాణి భోజన్.. తెలుగులో 'ప్రేమ', 'మీకు మాత్రమే చెప్తా', మిరల్(తమిళ డబ్బింగ్) చిత్రాల్లో నటించింది. తమిళ చిత్రాలు కూడా కలుపుకుంటే 2024 వరకూ 12 చిత్రాల్లో ఆమె చేసింది.
వాణి భోజన్ ఇప్పటివరకూ చేసిన వెబ్ సిరీస్‌లు?
ట్రిపుల్స్', 'తమిళ రాకర్స్', 'సెంగలం' వెబ్‌సిరీస్‌లలో వాణి భోజన్ నటించింది.
వాణి భోజన్ In Saree
వాణి భోజన్ Hot Pics
వాణి భోజన్ In Ethnic Dress
వాణి భోజన్ In Half Saree
వాణి భోజన్ అన్ కేటగిరైజ్డ్ ఇమేజెస్
Insta Hot Reels
Vani Bhojan Hot insta Reel
- Amaran Movie Review: హృదయాన్ని హత్తుకునే ఓ వీర సైనికుడి గాథచిత్రం: అమరన్నటీనటులు: శివ కార్తికేయన్, సాయి పల్లవి, భువన్ అరోడ, రాహుల్ బోస్, లల్లు, శ్రీకుమార్, శ్యామ్ మోహన్సినిమాటోగ్రఫీ: సీహెచ్ సాయిఎడిటింగ్: ఆర్. కలైవానన్నిర్మాతలు: కమల్‌హాసన్, ఆర్.మహేంద్రన్, వివేక్ కృష్ణానిదర్శకత్వం: రాజ్‌కుమార్ పెరియసామివిడుదల తేదీ: 31-10-2024 భారత సైనికుల త్యాగాలు, ధైర్యసాహసాలు కళ్లకు కట్టినట్టు చూపించిన చిత్రాల్లో అమరన్ ఒకటి. ఈ చిత్రం జమ్ము కశ్మీర్‌లోని ఉగ్రవాదులతో పోరాడుతూ వీర మరణం పొందిన మేజర్ ముకుంద్ వరదరాజన్ జీవితాన్ని ఆధారంగా(Amaran Movie Review) తీసుకుని చిత్రీకరించారు. ముకుంద్‌గా శివ కార్తికేయన్, ఆయన భార్య ఇందుగా సాయి పల్లవి నటించారు. తమిళంలో సోనీ పిక్చర్స్‌తో కలసి కమల్‌హాసన్ నిర్మించిన ఈ చిత్రం దీపావళి పండుగ వేళ పలు భాషల్లో విడుదలైంది. మరి ఈ చిత్రం తెలుగు ప్రేక్షకులను మెప్పించిందా? ఓసారి చూద్దాం. కథ ముకుంద్ వరదరాజన్ (శివ కార్తికేయన్) బాల్యం నుంచే సైనికుడిగా జీవితాన్ని గడపాలని కలగంటాడు. మద్రాస్ క్రిస్టియన్ కళాశాలలో చదువుతున్నప్పుడు తన జూనియర్ అయిన కేరళ అమ్మాయి ఇందు (సాయి పల్లవి)తో ప్రేమలో పడతాడు. ఆయన భారతీయ సైన్యంలో లెఫ్టినెంట్‌గా ఎంపికవుతాడు. విధుల్లో చేరిన తర్వాత వారి ప్రేమను ఇందు కుటుంబం తిరస్కరిస్తుంది. తల్లిదండ్రులను ఒప్పించి, వివాహం చేసుకుని కొత్త జీవితాన్ని మొదలుపెట్టిన ఈ జంట తర్వాత ఎదురైన సవాళ్లను ఎలా అధిగమించారనేది ఆసక్తికరంగా సాగుతుంది. మరి ముకుంద్ వరదరాజన్ దేశం కోసం ఎలాంటి త్యాగం చేశాడు? దేశం కోసం ఎలాంటి సాహసాలు చేశాడు అనేది మిగతా కథ. సినిమా ఎలా ఉందంటే? అమరన్ చిత్రం ఒక దేశభక్తి, ప్రేమ, త్యాగం కలబోతైన సినిమా. సైనికుడు కష్టాల్లో ఉండగా ఆయన కుటుంబం ఎలా మానసిక ఒత్తిడిని ఎదుర్కుంటుందో, కుటుంబం ఎంతటి త్యాగాలను చేస్తుందో ఈ చిత్రం హృదయానికి హత్తుకునేలా చూపించింది.(Amaran Movie Review) మాదెప్పటికీ లాంగ్ డిస్టెన్స్ రిలేషన్‌షిప్పే... ఇప్పుడూ అంతే" అనే ఇందు మాటలు ప్రేక్షకున్ని ప్రతి సన్నివేశంలో మమేకం చేస్తాయి. ముఖ్యంగా ముకుంద్, ఇందుల ప్రేమకథ ఒక అందమైన దృశ్యకావ్యంగా నిలుస్తుంది. వారి ప్రేమాయణం, సైనిక బాధ్యతలు వేర్వేరు ప్రపంచాలుగా ఉన్నా, ఆ పాత్రలను చాలా సహజంగా తెరపై ఆవిష్కరించారు. ముకుంద్ వ్యక్తిగత జీవితంలో భార్య, కుటుంబ సభ్యుల మధ్య ఉన్న సన్నివేశాలు ప్రేక్షకులను భావోద్వేగాలతో కట్టిపడేస్తాయి. అలాగే కశ్మీర్లో ప్రజలు- సైనికుల మధ్య సంబంధాలు ఎలా ఉంటాయి, ఉగ్రవాదులను పట్టుకునేందుకు సైనికులు ఎలాంటి ఆపరేషన్లు చేస్తారు, వారి ప్రణాళికలు ఎలా ఉంటాయి, ఉగ్రవాద సానుభూతిపరుల నుంచి సైనికులు ఎలాంటి ప్రతిఘటనలు ఎదుర్కొంటారు అనే అంశాలను తెరపై చక్కగా ఆవిష్కరించారు. ఇక క్లైమాక్స్‌లో అల్తాప్ వానీని హతం చేయడానికి ఖాజీపత్రి ఆపరేషన్ ప్రేక్షకులకు గూస్బంప్స్ తెప్పిస్తుంది. ఎవరెలా చేశారంటే? ఇప్పటి వరకు చేయని ఓ కొత్త పాత్రలో శివ కార్తికేయన్ అద్భుతంగా నటించాడు. ఆయన కెరీర్‌లో సరదా పాత్రల్లో ఎక్కువగా కనిపించే శివ కార్తికేయన్ ఈ సినిమాలో పూర్తిగా కొత్తగా, సీరియస్‌గా, సైనికుడి గంభీరతను చూపిస్తూ ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు. సాయి పల్లవి, తన పాత్రలో సహజత్వాన్ని తెరపై ప్రదర్శిస్తూ, తల్లి, భార్యగా త్యాగపూరిత పాత్రలో తన ప్రతిభను చాటారు. ముకుంద్ పాత్రలో శివ కార్తికేయన్, సాయి పల్లవి మధ్య కెమిస్ట్రీ ప్రతి సన్నివేశాన్ని మరింత అద్భుతంగా మార్చుతుంది. సాంకేతికత ఈ సినిమా టెక్నికల్‌గా చాలా ఉన్నతంగా ఉంది. సీహెచ్ సాయి తీసిన విజువల్స్ కశ్మీర్‌లోని సైనిక భౌగోళిక పరిస్థితులను ప్రతిబింబింపజేస్తాయి.(Amaran Movie Review) జీవీ ప్రకాశ్ అందించిన సంగీతం భావోద్వేగాలను హైలెట్ చేస్తుంది. ఎడిటింగ్, యాక్షన్ సన్నివేశాలు అన్నీ సినిమాకు అనువుగా ఉండటమే కాకుండా ప్రేక్షకులను మరింత బలంగా కనెక్ట్ చేస్తాయి. బలాలు బలమైన కథ సెకాండాఫ్ బలమైన ఎమోషన్స్ శివకార్తికేయన్- సాయిపల్లవి మధ్య కెమిస్ట్రీ బలహీనతలు పస్టాఫ్‌లో కొన్ని సాగదీత సీన్లు చిరవగా మేజర్ ముకుంద్ వరదరాజన్‌కి నివాళిగా, ఆయన ధైర్యసాహసాలను, కుటుంబం త్యాగాన్ని చూపించిన ఈ చిత్రం హృదయాలను హత్తుకుంటుంది. రేటింగ్: 4/5నవంబర్ 01 , 2024
- EXCLUSIVE: ఈ సీన్స్ చాలా ఎమోషనల్.. అయినా నవ్విస్తాయి.. ఎలాగంటే? సాధారణంగా ఇతర ఇండస్ట్రీలతో పోలిస్తే టాలీవుడ్‌కు ఓ ప్రత్యేకత ఉంది. ఇక్కడి డైరెక్టర్లు ఎమోషనల్ సన్నివేశాలకు పెద్ద పీట వేస్తుంటారు. కథకు సెంటిమెంట్, భావోద్వేగ సన్నివేశాలను జోడించడం ద్వారా ఫ్యామిలీ ఆడియన్స్‌ను అట్రాక్ట్ చేస్తుంటారు. అయితే ఆ ఎమోషనల్ సీన్సే కొన్నిసార్లు మిస్ ఫైర్ అయ్యే ఛాన్స్ ఉంది. వాస్తవానికి దూరంగా ఉండటం వల్ల అటువంటి సన్నివేశాలు ఎక్కువగా ట్రోల్స్‌కు గురవుతుంటాయి. అటువంటి సందర్భాలు టాలీవుడ్లో చాలానే ఉన్నాయి. సినిమా రిలీజ్ తర్వాత వాటిపై విపరీతంగా మీమ్స్, ట్రోల్స్ వచ్చాయి. అవేంటో ఈ ప్రత్యేక కథనంలో చూద్దాం. [toc] సరైనోడు (Sarrainodu) అల్లు అర్జున్, బోయపాటి శ్రీను దర్శకత్వంలో రూపొందిన ‘సరైనోడు’ చిత్రం అప్పట్లో బ్లాక్బాస్టర్ విజయాన్ని అందుకుంది. అయితే ఇందులోని ఓ సీన్‌పై అప్పట్లో విపరీతంగా ట్రోల్స్ వచ్చాయి. ఆ ఏమోషనల్ సీన్ చూస్తే నవ్వు వచ్చిందని అప్పట్లో నెటిజన్లు కామెంట్లు చేశారు. ఇంతకీ ఆ సీన్ ఏంటంటే.. హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్‌ను రౌడీలు వెంటాడుతారు. నాలుగు రోజుల నుండి తాను పరిగెడుతూనే ఉన్నానంటూ ఆమె వెక్కి వెక్కి ఏడుస్తూ చెప్తుంది. ఇందులో లాజిక్ ఎక్కడ ఉందంటూ ఆడియన్స్ ప్రశ్నించారు. https://youtu.be/BTG1U_-sl-o?si=8SMhJezyIsBEMKG- వినయ విధేయ రామ (Vinaya Vidheya Rama) రామ్‌చరణ్, బోయపాటి కాంబోలో వచ్చిన ‘వినయ విధేయ రామ’ సినిమాపై అప్పట్లో పెద్ద ఎత్తున ట్రోల్స్ జరిగాయి. ఇందులో చరణ్ ట్రైన్‌పై నిలబడి బీహార్ వెళ్లే సీన్‌పై అప్పట్లో విమర్శలు వచ్చాయి. అలాగే ఈ సినిమాలోని ‘తందానే తందానే’ పాటలో వచ్చే ఎమోషనల్ సన్నివేశంపైనా నెటిజన్లు ట్రోల్స్ చేశారు. పాట మధ్యలో హీరో అన్న ప్రశాంత్‌కు భోజనం సమయంలో పొలమారుతుంది. అయితే భార్య స్నేహా నీళ్లు ఇవ్వడానికి బదులు అతడ్ని గట్టిగా పట్టుకొని ఏడుస్తుంది. ఇదేమి లాజిక్ అంటూ నెటిజన్లు ప్రశ్నించారు. https://youtu.be/GKrpi9NX6LY?si=78kGcH01QiUR6oej అరవింద సమేత (Aravinda Sametha) తారక్, త్రివిక్రమ్ కాంబోలో వచ్చిన ‘అరవింద సమేత’ చిత్రంలో పూజా హెగ్డే హీరోయిన్గా చేసింది. ఈ సినిమా తర్వాతే పూజా హెగ్డేపై సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ట్రోల్స్ మెుదలయ్యాయి. ఇందులో ఓ సీన్లో విలన్ మనుషులు పూజా హెగ్డేతో పాటు ఆమె సోదరుడ్ని కిడ్నాప్ చేస్తారు. అప్పుడు తారక్‌కు పూజా సీక్రెట్‌గా కాల్ చేస్తుంది. అప్పుడు తారక్ నిన్ను విలన్లు చంపేయచ్చు అనగానే ఆమె ఏడుస్తూ ఇచ్చే ఎక్స్‌ప్రెషన్స్‌పై నెట్టింట తెగ ట్రోల్స్ వచ్చాయి. ఈ సీన్లో ఆమెను చూసి నవ్వు ఆగలేదని చాలా మంది ఆడియన్స్ పోస్టు చేశారు. https://youtu.be/uOTclNEcCAE?si=VaLMevP8Ir2yaLA1 మెుగుడు (Mogudu) కృష్ణవంశీ దర్శకత్వంలో గోపిచంద్, తాప్సీ జంటగా చేసిన చిత్రం ‘మెుగుడు’. ఈ సినిమాలో ఇంటర్వెల్‌కు ముందు వచ్చే సీన్ హైలెట్‌గా ఉంటుంది. అదే సమయంలో ఈ ఏమోషనల్ సీన్ గందరగోళంగా ఉందంటూ ట్రోల్స్ వచ్చాయి. ఇందులో హీరో హీరోయిన్లకు పెళ్లి జరుగుతుంది. అప్పగింతల సమయంలో ఓ విషయం దగ్గర హీరోయిన్ తల్లి రోజా.. హీరో తరుపు బంధువు చెంప పగలగొడుతుంది. ఆ గొడవ పెద్దదై రోజా, హీరో తండ్రి రాజేంద్ర ప్రసాద్, గోపిచంద్, తాప్సీ ఒకరినొకరు చేయిచేసుకుంటారు. ఆ తర్వాత ఇద్దరూ విడాకులకు అప్లై చేస్తారు. అయితే ఈ సీన్ మరీ నాటకీయంగా ఉందని చాలా మంది విమర్శించారు. తమకు కామెడీ సీన్‌లాగా అనిపించదని అప్పట్లో పోస్టులు పెట్టారు. https://youtu.be/tSph1y0x9BA?si=PQvdooUFVQPxvKpX అత్తారింటికి దారేది (Attarintiki Daredi) పవన్ కల్యాణ్, త్రివిక్రమ్ కాంబోలో వచ్చిన అత్తారింటికి దారేది సినిమా ఎంత పెద్ద విజయాన్ని సాధించిందో అందరికీ తెలిసిందే. ఈ మూవీ క్లైమాక్స్ సీన్‌ను చాలా ఏమోషనల్‌గా తీర్చిదిద్దాడు దర్శకుడు. తన చిన్నప్పుడే ఇల్లు వదిలి వెళ్లిపోయిన అత్తపై తమ కుటుంబానికి ఎంత ప్రేమ ఉందో పవన్ చెప్పే ప్రయత్నం చేస్తాడు. ఈ క్రమంలో కంట నీరు పెడుతూ ఆయన చెప్పే డైలాగ్స్ చాలా మందికి రుచించలేదు. పవన్ ఏడుస్తూ డైలాగ్స్ చెబుతుంటే తమకు విపరీతంగా నవ్వు వచ్చిందని కొందరు కామెంట్స్ చేశారు. పవన్ ఏడుపుకు సంబంధించిన ఫొటోను సోషల్‌మీడియాలో వైరల్ చేశారు. https://youtu.be/HsV7k8m0QU0?si=B2YwpApzSRLAHGDO శ్రీమంతుడు (Srimanthudu) మహేష్, కొరటాల శివ కాంబోలో వచ్చిన శ్రీమంతుడు చిత్రం టాలీవుడ్లో కలెక్షన్ల సునామీ సృష్టించింది. ఇందులో హీరో తన తండ్రి పుట్టిన ఊరికి వచ్చి అభివృద్ధి చేస్తుంటాడు. ఈ క్రమంలో గ్రామస్తుడు తమ కష్టాలను తీర్చాలని మరిన్ని సమస్యలు మహేష్‌తో చెప్పుకోబోతాడు. అప్పుడు సీనియర్ నటుడు రాజేంద్ర ప్రసాద్.. అతడ్ని అడ్డుకుంటాడు. అలిసిన బతుకులు కదా ఏదో ఆశగా కనిపించే సరికి అడిగేశాడు అని అంటాడు. ఈ ఏమోషనల్ సీన్‌పై కొన్ని సోషల్ మీడియా పేజ్‌లు విపరీతంగా మీమ్స్ చేశాయి. ఇప్పటికీ ఆ సీన్‌కు సంబంధించిన మీమ్ నెట్టింట కనిపిస్తూనే ఉంటుంది. https://youtu.be/V_52TOrTqKI?si=xJkICf7HF-JiFikn హ్యాపీ (Happy) అల్లు అర్జున్, జెనీలియా జంటగా చేసిన హ్యాపీ చిత్రం బాక్సాఫీస్ వద్ద విజయం సాధించలేకపోయింది. ఈ మూవీ క్లైమాక్స్‌లో బన్నీ చాలా ఏమోషనల్ అవుతాడు. పోలీసు స్టేషన్లో గుండెలు బాదుకుంటూ లాకప్‌లో ఉన్న హీరోయిన్‌పై తనకున్న ప్రేమను వ్యక్తం చేస్తుంటాడు. వారి ప్రేమ గొప్పతనం గుర్తించిన పోలీసు ఆఫీసర్ ఆమెను విడిపెడతాడు. అయితే ఈ సీన్లో బన్నీ నటన చూసి అతడి యాంటీ ఫ్యాన్స్ పెద్ద ఎత్తున ట్రోల్స్ చేశారు. బన్నీని ఈ సెంటిమెంట్ సీన్లో అసలు చూడలేకపోయామని, పైగా నవ్వు వచ్చిందని కామెంట్స్ చేశారు. https://youtu.be/H3h5fkT5wG4?si=sufvXBa7KErXPRM7 మిర్చి (Mirchi) ప్రభాస్, కొరటాల కాంబోలో వచ్చిన ఈ సినిమాలో హీరో విలన్ ఇంటికి వెళ్లి వారిలో మార్పు తీసుకురావాలని ప్రయత్నిస్తాడు. ఈ క్రమంలో విలన్ ఇంటి పెద్ద నాగినీడు ఊరి ప్రజలు అతడ్ని ఎంతగా గౌరవిస్తున్నారో తెలియజేస్తారు. దీంతో చదువుకు ఎందుకు అని పంపేసిన అమ్మాయిని స్కూల్లో జాయిన్ చేయించడానికి హీరోతో కలిసి నాగినీడు వెళ్తాడు. ఆ యువతి ఇంటి ముందు కారు ఆపి రా బండెక్కు అని పిలుస్తాడు. ఈ సీన్‌పై కూడా అప్పట్లో ట్రోల్స్ వచ్చాయి. మీమర్స్ దీనిని తమకు అనుకూలంగా నెటిజన్లకు నవ్వు తెప్పించేలా వాడుకున్నారు. ఆ తర్వాత కాలేజీ ప్రిన్సిపల్‌తో జరిగే సంభాషణపై కూడా పెద్ద ఎత్తున మీమ్స్ వచ్చాయి. https://youtu.be/8hbZeVdLOKU?si=njdIZGjrVoE55Iv1అక్టోబర్ 22 , 2024
- Miral Movie Review: రెండేళ్ల తర్వాత తెలుగులో వచ్చిన తమిళ హార్రర్ థ్రిల్లర్.. ‘మిరల్’ ఎలా ఉందంటే?నటీనటులు: భరత్, వాణి భోజన్, కేఎస్ రవికుమార్, మీరా కృష్ణన్, రాజ్‌కుమార్, కావ్య అరివుమణి తదితరులు దర్శకత్వం: ఎం. శక్తివేల్ మ్యూజిక్ డైరెక్టర్: ప్రసాద్ ఎస్ఎన్ సినిమాటోగ్రాఫర్: సురేష్ బాలా ఎడిటర్: కలైవనన్.ఆర్ నిర్మాత: సీహెచ్ సతీష్ కుమార్ విడుదల తేదీ: 17-05-2024 ప్రేమిస్తే ఫేమ్ భరత్ హీరోగా నటించిన చిత్రం 'మిరల్'. రెండేళ్ల క్రితం తమిళనాట విడుదలైన ఈ చిత్రం పాజిటివ్ టాక్ సొంతం చేసుకుంది. ప్రస్తుతం ఈ సినిమాను తెలుగులో డబ్ చేసి థియేటర్లలోకి తీసుకొచ్చారు. ఎం. శక్తివేల్ దర్శకత్వంలో హార్రర్ థ్రిల్లర్‌గా రూపొందిన ఈ చిత్రం మే 17న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ఈ సినిమా ఎలా ఉంది? తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకుందా? లేదా? ఈ రివ్యూలో తెలుసుకుందాం. కథేంటి హరి (భరత్), రమ (వాణీ భోజన్) ప్రేమ వివాహం చేసుకొని కొడుకుతో సంతోషంగా జీవిస్తుంటారు. ఓ రోజు రమకు పీడ కల రావడంతో ఊరులో ఉన్న కుల దైవానికి పూజా చేయించమని ఆమె తల్లి చెబుతుంది. దీంతో ఊరికి వెళ్లి పూజలు చేయిస్తారు. ఈ క్రమంలో హరి డ్రీమ్ ప్రాజెక్ట్ ఓకే కావడంతో అర్ధరాత్రి ఫ్యామిలీతో కలిసి బయలుదేరతాడు. మెయిన్ రోడ్డులో వెళ్లాల్సిన వారి కారు ఓ కారణం చేత మరో రూట్‌లోకి వెళ్తుంది. అయితే ఆ రూట్‌లో ఆత్మ తిరుగుతుందని ఊరి ప్రజల నమ్మకం. అందుకని రాత్రి వేళ్లలో ఆ దారిలో ఎవరూ ప్రయాణించరు. అటువంటి మార్గంలో వెళ్లిన హరి ఫ్యామిలీకి ఎలాంటి పరిస్థితులు ఎదురయ్యాయి? వాళ్లు ప్రాణాలతో బయటపడ్డారా? లేదా? నిజంగానే ఆ మార్గంలో అతీత శక్తి ఉందా? అన్నది కథ. ఎవరెలా చేశారంటే హీరో భరత్ ఎప్పటి లాగే తన నటనతో అదరగొట్టాడు. హరి పాత్రలో పరకాయ ప్రవేశం చేసి మరి నటించాడు. అటు నటి వాణి భోజన్.. భరత్‌తో పాటు సినిమాను తన భుజాలపై మోసింది. ఈ ఇద్దరు తమ నటనతో అదరగొట్టారు. తమ హావ భావాలతో ఎమోషనల్ సన్నివేశాలను చక్కగా పండించారు. KS రవికుమార్, రాజ్ కుమార్ కీలక పాత్రల్లో కనిపించి అలరించారు. మిగిలిన పాత్రదారులు తమ పరిధిలో పర్వాలేదనిపించారు. డైరెక్షన్ ఎలా ఉందంటే దర్శకుడు ఎం. శక్తివేల్.. ఓ కుటుంబం చుట్టూ సాగే హార్రర్ థ్రిల్లర్‌గా ఈ సినిమాను తెరకెక్కించారు. సినిమా ప్రారంభం నుంచి క్లైమాక్స్ ముందు వరకూ ఏదో జరుగుతోందన్న సస్పెన్స్‌ను మెయిన్‌టెన్ చేయడంలో డైరెక్టర్ సక్సెస్ అయ్యాడు. కథ పరంగా చూస్తే రొటిన్ స్టోరీ అయినప్పటికీ స్క్రీన్ ప్లే విషయంలో మాత్రం చక్కటి పనితీరును కనబరిచాడు దర్శకుడు. అయితే క్లైమాక్స్‌లో ఏదో జరిగిపోతుందని భావించిన ప్రేక్షకులకు చివర్లో వచ్చే ట్విస్ట్ ఊసూరుమనిపిస్తుంది. అప్పటివరకూ మెయిన్‌టెన్ చేసిన ఆసక్తి మెుత్తం ఒక్కసారిగా ఆవిరైపోతుంది. క్లైమాక్స్‌ను ఇంకాస్త బెటర్‌గా రాసుకొని ఉంటే బాగుండేంది. మధ్య మధ్యలో వచ్చే కొన్ని సీన్లు మరీ సాగదీతగా అనిపిస్తాయి. టెక్నికల్‌గా సాంకేతిక అంశాల విషయానికి వస్తే.. సినిమాటోగ్రఫీ విజువల్స్ బాగున్నాయి. ఈ సినిమాకు బ్యాక్ గ్రౌండ్ స్కోర్ చాలా ప్లస్ అయింది. చాలా సన్నివేశాల్లో నేపథ్యం సంగీతం భయపెడుతుంది. ఎడిటింగ్ ఓకే. నిర్మాణ విలువలు కూడా సినిమాకు తగ్గట్లు ఉన్నతంగా ఉన్నాయి. ప్లస్ పాయింట్స్ భరత్, వాణీ భోజన్ నటనఆసక్తికరంగా సాగే కథనంనేపథ్య సంగీతం మైనస్ పాయింట్స్ కథలో కొత్తదనం లేకపోవడంపేలవమైన క్లైమాక్స్ Telugu.yousay.tv Rating : 2.5/5 మే 17 , 2024

Miral Movie Review: రెండేళ్ల తర్వాత తెలుగులో వచ్చిన తమిళ హార్రర్ థ్రిల్లర్.. ‘మిరల్’ ఎలా ఉందంటే?
నటీనటులు: భరత్, వాణి భోజన్, కేఎస్ రవికుమార్, మీరా కృష్ణన్, రాజ్‌కుమార్, కావ్య అరివుమణి తదితరులు
దర్శకత్వం: ఎం. శక్తివేల్
మ్యూజిక్ డైరెక్టర్: ప్రసాద్ ఎస్ఎన్
సినిమాటోగ్రాఫర్: సురేష్ బాలా
ఎడిటర్: కలైవనన్.ఆర్
నిర్మాత: సీహెచ్ సతీష్ కుమార్
విడుదల తేదీ: 17-05-2024
ప్రేమిస్తే ఫేమ్ భరత్ హీరోగా నటించిన చిత్రం 'మిరల్'. రెండేళ్ల క్రితం తమిళనాట విడుదలైన ఈ చిత్రం పాజిటివ్ టాక్ సొంతం చేసుకుంది. ప్రస్తుతం ఈ సినిమాను తెలుగులో డబ్ చేసి థియేటర్లలోకి తీసుకొచ్చారు. ఎం. శక్తివేల్ దర్శకత్వంలో హార్రర్ థ్రిల్లర్‌గా రూపొందిన ఈ చిత్రం మే 17న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ఈ సినిమా ఎలా ఉంది? తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకుందా? లేదా? ఈ రివ్యూలో తెలుసుకుందాం.
కథేంటి
హరి (భరత్), రమ (వాణీ భోజన్) ప్రేమ వివాహం చేసుకొని కొడుకుతో సంతోషంగా జీవిస్తుంటారు. ఓ రోజు రమకు పీడ కల రావడంతో ఊరులో ఉన్న కుల దైవానికి పూజా చేయించమని ఆమె తల్లి చెబుతుంది. దీంతో ఊరికి వెళ్లి పూజలు చేయిస్తారు. ఈ క్రమంలో హరి డ్రీమ్ ప్రాజెక్ట్ ఓకే కావడంతో అర్ధరాత్రి ఫ్యామిలీతో కలిసి బయలుదేరతాడు. మెయిన్ రోడ్డులో వెళ్లాల్సిన వారి కారు ఓ కారణం చేత మరో రూట్‌లోకి వెళ్తుంది. అయితే ఆ రూట్‌లో ఆత్మ తిరుగుతుందని ఊరి ప్రజల నమ్మకం. అందుకని రాత్రి వేళ్లలో ఆ దారిలో ఎవరూ ప్రయాణించరు. అటువంటి మార్గంలో వెళ్లిన హరి ఫ్యామిలీకి ఎలాంటి పరిస్థితులు ఎదురయ్యాయి? వాళ్లు ప్రాణాలతో బయటపడ్డారా? లేదా? నిజంగానే ఆ మార్గంలో అతీత శక్తి ఉందా? అన్నది కథ.
ఎవరెలా చేశారంటే
హీరో భరత్ ఎప్పటి లాగే తన నటనతో అదరగొట్టాడు. హరి పాత్రలో పరకాయ ప్రవేశం చేసి మరి నటించాడు. అటు నటి వాణి భోజన్.. భరత్‌తో పాటు సినిమాను తన భుజాలపై మోసింది. ఈ ఇద్దరు తమ నటనతో అదరగొట్టారు. తమ హావ భావాలతో ఎమోషనల్ సన్నివేశాలను చక్కగా పండించారు. KS రవికుమార్, రాజ్ కుమార్ కీలక పాత్రల్లో కనిపించి అలరించారు. మిగిలిన పాత్రదారులు తమ పరిధిలో పర్వాలేదనిపించారు.
డైరెక్షన్ ఎలా ఉందంటే
దర్శకుడు ఎం. శక్తివేల్.. ఓ కుటుంబం చుట్టూ సాగే హార్రర్ థ్రిల్లర్‌గా ఈ సినిమాను తెరకెక్కించారు. సినిమా ప్రారంభం నుంచి క్లైమాక్స్ ముందు వరకూ ఏదో జరుగుతోందన్న సస్పెన్స్‌ను మెయిన్‌టెన్ చేయడంలో డైరెక్టర్ సక్సెస్ అయ్యాడు. కథ పరంగా చూస్తే రొటిన్ స్టోరీ అయినప్పటికీ స్క్రీన్ ప్లే విషయంలో మాత్రం చక్కటి పనితీరును కనబరిచాడు దర్శకుడు. అయితే క్లైమాక్స్‌లో ఏదో జరిగిపోతుందని భావించిన ప్రేక్షకులకు చివర్లో వచ్చే ట్విస్ట్ ఊసూరుమనిపిస్తుంది. అప్పటివరకూ మెయిన్‌టెన్ చేసిన ఆసక్తి మెుత్తం ఒక్కసారిగా ఆవిరైపోతుంది. క్లైమాక్స్‌ను ఇంకాస్త బెటర్‌గా రాసుకొని ఉంటే బాగుండేంది. మధ్య మధ్యలో వచ్చే కొన్ని సీన్లు మరీ సాగదీతగా అనిపిస్తాయి.
టెక్నికల్‌గా
సాంకేతిక అంశాల విషయానికి వస్తే.. సినిమాటోగ్రఫీ విజువల్స్ బాగున్నాయి. ఈ సినిమాకు బ్యాక్ గ్రౌండ్ స్కోర్ చాలా ప్లస్ అయింది. చాలా సన్నివేశాల్లో నేపథ్యం సంగీతం భయపెడుతుంది. ఎడిటింగ్ ఓకే. నిర్మాణ విలువలు కూడా సినిమాకు తగ్గట్లు ఉన్నతంగా ఉన్నాయి.
ప్లస్ పాయింట్స్
భరత్, వాణీ భోజన్ నటనఆసక్తికరంగా సాగే కథనంనేపథ్య సంగీతం
మైనస్ పాయింట్స్
కథలో కొత్తదనం లేకపోవడంపేలవమైన క్లైమాక్స్
Telugu.yousay.tv Rating : 2.5/5
మే 17 , 2024
Serial Actress: మాకేం తక్కువ.. అందం లేదా.. యాక్టింగ్ రాదా.. బుల్లితెరను ఏలుతున్న బ్యూటీలు వీరే..!
ఈ తరం యువత సినిమాలు, వెబ్‌సిరీస్‌లు, క్రికెట్‌పై చూపిన శ్రద్ధ సీరియళ్లపై చూపించరు. సీరియళ్లలో ఉండే సాగదీత, సెంటిమెంట్ యువతరానికి ఏమాత్రం రుచించడం లేదు. దీంతో ఇంట్లో ఎవరైనా సీరియల్స్ పెడితే వెంటనే ముఖం చిట్లిస్తుంటారు. రిమోట్ తీసుకొని ఛానెల్ మార్చేస్తుంటారు. అయితే వారికి తెలియని విషయం ఏంటంటే ఇప్పుడు సీరియళ్లలోనూ అందమైన భామలు తళుక్కుమంటున్నారు. హీరోయిన్లకు ఏ మాత్రం తగ్గని గ్లామర్‌తో బుల్లితెర ప్రేక్షకులను అలరిస్తున్నారు. అందం, అభినయంతో వీక్షకులను కట్టిపడేస్తున్నారు. మరీ ఆ నటీమణులు ఎవరు? వారు చేసిన సీరియల్స్ ఏంటో తెలుసుకుందాం..
సుహాసిని
బుల్లితెర ప్రేక్షకులను అలరిస్తున్న అందమైన నటీమణుల్లో సుహాసినీ ముందు వరుసలో ఉంటుంది. చంటిగాడు సినిమాతో మెుదట టాలీవుడ్‌లోకి అడుగుపెట్టిన ఈ భామ వెండితెర ప్రేక్షకులను పెద్దగా ఆకట్టుకోలేకపోయింది. దీంతో సీరియళ్లపై తన దృష్టిని కేంద్రీకరించి సూపర్ సక్సెస్ అయింది. శివశంకరి, అపరంజి, అనుబంధాలు, అష్టాచమ్మా, ఇద్దరు అమ్మాయిలు, నా కోడలు బంగారం, గిరిజా కల్యాణం, దేవత, అనుబంధ ఆలయం వంటి సీరియళ్లలో నటించి మెప్పించింది. తెలుగు, తమిళం, భోజ్‌పూరి సినిమాల్లోనూ అడపాదడపా నటిస్తూ సుహాసిని అలరిస్తోంది.
ప్రీతి అస్రాని
బుల్లితెరపై అలరిస్తున్న అందాల భామల్లో ప్రీతి అస్రాని కూడా ఒకరు. చైల్డ్ ఆర్టిస్టుగా సినిమాల్లో తన కెరీర్ ప్రారంభించిన ఈ భామ టెలివిజన్ రంగంలోనూ నటిస్తూ అలరిస్తోంది. పక్కింటి అమ్మాయి సీరియల్ ద్వారా బుల్లితెరపై అడుగుపెట్టిన ప్రీతి.. సోషల్, మిన్నాలే 9 ఆవర్స్ వంటి ప్రముఖ షోలలో కనిపించింది. అంతేగాక మళ్లీరావా, హ్యాపీ వెడ్డింగ్, సీటీమార్, దొంగలున్నారు జాగ్రత్త, యశోధ సినిమాల్లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది.
నవ్య స్వామి
నటి నవ్య స్వామి కూడా అందమైన బుల్లితెర నటిగా గుర్తింపు తెచ్చుకుంది. కర్ణాటకలోని మైసూరుకు చెందిన ఈ భామ ఓ కన్నడ టీవీ షో ద్వారా కెరీర్ ప్రారంభించింది. ఆ తర్వాత వాణి-రాణి, నా పేరు మీనాక్షి, ఆమె కథ, కంటే కూతుర్నే కనాలి వంటి తెలుగు సీరియళ్లలో నటించి పాపులర్ అయింది. ప్రస్తుతం పలు టెలివిజన్ షోలలోనూ కనిపిస్తూ నవ్య అలరిస్తోంది.
ఐశ్వర్య పిస్సే
33 ఏళ్ల ఐశ్వర్య పిస్సే బుల్లితెల నటిగా రాణిస్తోంది. తన గ్లామర్‌తో టెలివిజన్ ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. ఈ భామ తెలుగు, తమిళం, కన్నడ సీరియళ్లలో నటించి చాలా బాగా పాపులర్ అయింది. సర్వమాంగళ మాంగల్యే, అగ్నిసాక్షి, ముక్కు పుడక వంటి తెలుగు సీరియళ్లలో ఐశ్వర్య నటించింది.
శోభా శెట్టి
కన్నడ నటి శోభా శెట్టి బుల్లితెరపై పాపులర్ యాక్టర్‌గా పేరు తెచ్చుకుంది. ముఖ్యంగా కార్తీక దీపం సీరియల్‌తో ఈ భామ ఒక్కసారిగా అందరి దృష్టిని ఆకర్షించింది. అందులో ఆమె చేసిన ప్రతినాయిక పాత్రకు ‘మా పరివార్’ అవార్డు వరించింది. అష్టా-చమ్మా సీరియల్‌లోనూ చేసిన ఈ భామ తన నటన ద్వారా ఎంతోమంది ప్రేక్షకులను అలరించింది.
ప్రియాంక జైన్
నటి ప్రియాంక జైన్ కూడా తన అందం అభినయంతో బుల్లితెర ప్రేక్షుకలను అలరిస్తోంది. \రంగీ తరంగా అనే తమిళ చిత్రం ద్వారా నటనా రంగంలోకి అడుగుపెట్టిన ఈ భామ తెలుగు, తమిళ సిరీయళ్ల ద్వారా మంచి గుర్తింపు తెచ్చుకుంది. ముఖ్యంగా తెలుగులో చేసిన మౌన రాగం సీరియల్ ఈ భామను అందరూ గుర్తుపట్టేలా చేసింది. ఇందులో అమ్ములు పాత్రలో ప్రియాంక జైన్ అద్భుతంగా నటించింది.
ఏప్రిల్ 13 , 2023
Prabhas: మంచి మనసు చాటుకున్న ప్రభాస్.. ఆహ్వానానికి వెళ్తే భారీ విరాళం!
దేశం మెచ్చిన నటుల్లో రెబల్ స్టార్ ప్రభాస్ (Prabhas) ఒకరు. ఈ హీరో పేరు చెబితే బాక్సాఫీస్ రికార్డులు, పాన్ ఇండియా స్థాయి చిత్రాలే గుర్తుకువస్తాయి. అయితే ప్రభాస్‌కు మంచి మనసున్న వ్యక్తిగానూ గుర్తింపు ఉంది. ప్రభాస్ ఇప్పటివరకూ ఎన్నో సినిమాల్లో నటించినప్పటికీ ఎన్నడూ కాంట్రవర్సీల జోలికి పోలేదు. ఏ స్టేజీ మీద వివాదస్పద వ్యాఖ్యలు చేయలేదు. పైగా తన వద్దకు వచ్చిన వారికి పసందైన భోజనాన్ని పెట్టి వారి మన్ననలు పొందుతుంటాడు. అంతే కాకుండా పలు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ అందరిచేత శభాష్ అనిపించుకుంటున్నాడు. ఈ క్రమంలోనే ప్రభాస్ మరోమారు తన మంచి మనసును చాటుకున్నాడు.
డైరెక్టర్స్‌కు భారీ విరాళం
లెజండరీ డైరెక్టర్ దాసరి నారాయణరావు (Dasari Narayana Rao Birthday) పుట్టిన రోజును పురస్కరించుకొని ఏటా మే 4న ‘డైరెక్టర్స్ డే’ (Directors Day)ను జరుపుకుంటున్నారు. ఈసారి వేడుకలను హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో ఘనంగా నిర్వహించాలని ఫిల్మ్ డైరెక్టర్ అసోసియేషన్ నిర్ణయించింది. ఈ కార్యక్రమానికి అహ్వానించేందుకు అసోసియేషన్ సభ్యులు తాజాగా ప్రభాస్‌ను కలిశారు. ఈ సందర్భంగా వేడుకలు గ్రాండ్ చేయాలంటూ ప్రభాస్ వారికి రూ.35 లక్షలు విరాళంగా అందజేశారు. ఈ విషయాన్ని అసోసియేషన్ ప్రెసిడెంట్ స్వయంగా వెల్లడించారు. దీంతో హీరో ప్రభాస్‌పై సర్వత్రా ప్రశంసల వర్షం కురుస్తోంది.
ఫుల్ స్వింగ్‌లో ప్రభాస్!
ప్రస్తుతం దేశంలో ఏ స్టార్ హీరో చేతిలో లేనన్ని పాన్ ఇండియా చిత్రాలు ప్రభాస్ లిస్ట్‌లో ఉన్నాయి. ప్రభాస్ ఏ డైరెక్టర్‌కైనా ఓకే చెప్తే ఆ ప్రాజెక్ట్ మెుదలయ్యేది 2026 తర్వాతనే. ప్రభాస్ ప్రాజెక్టుల విషయానికి వస్తే.. ప్రస్తుతం అతడు 'కల్కీ 2898 ఏడీ' సినిమాలో బిజీగా ఉన్నాడు. ఈ చిత్రం ఈ ఏడాదిలోనే రిలీజ్ కానుంది. దీంతో పాటు మారుతి దర్శకత్వంలో ‘రాజా సాబ్’ (Raja Saab) చిత్రం చేస్తున్నాడు. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. తర్వాత సందీప్ రెడ్డి వంగా (Sandeep Reddy Vanga)తో ఓ సినిమా చేయనున్నాడు. ఈ చిత్రానికి స్పిరిట్ (Spirit) అనే టైటిల్ ఖరారు చేశారు. వీటితో పాటు ‘సలార్ సీక్వెల్’ ఉంది. ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహించే ఈ చిత్రం షూటింగ్ ఈ ఏడాదిలోనే ప్రారంభమయ్యే అవకాశం ఉంది. వీటితో పాటు మంచు విష్ణు హీరోగా తెరకెక్కుతున్న ‘కన్నప్ప’లోనూ ప్రభాస్ శివుడి పాత్ర పోషించనున్నాడు. అలాగే హను రాఘవపూడితో ఓ సినిమా చేయబోతున్నాడు. ఈ చిత్రాలన్నీ పూర్తవ్వడానికి కనీసం రెండేళ్ల సమయం పడుతుంది.
ఏప్రిల్ 23 , 2024
Maleesha Kharwa: మట్టిలో మాణిక్యం.. మురికివాడ నుంచి స్టార్ మోడల్ దాకా.. ఎవరీ మలీషా ఖర్వా?
ముంబయిలోని ప్రముఖ మురికివాడ ధారావికి చెందిన 14 ఏళ్ల మలీషా ఖర్వా.. సోషల్ మీడియాలో మరోమారు సంచలనంగా మారిపోయింది. ప్రముఖ స్కిన్ కేర్ కంపెనీ ‘ఫారెస్ట్ ఎసెన్షియల్’ తన లగ్జరీ కలెక్షన్స్‌కు బాలికను బ్రాండ్ అంబాసిడర్‌గా చేయడమే ఇందుకు కారణం.
తమ బ్యూటీ ప్రొడక్ట్స్‌ను మలీషా ప్రమోట్ చేస్తున్న ఓ వీడియోను ‘ఫారెస్ట్ ఎసెన్షియల్’ తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్టు చేసింది. ప్రతీ ప్రయాణంలోనూ బ్యూటీ ఉంటుందని క్యాప్షన్ ఇచ్చింది.
ప్రస్తుతం ఈ వీడియో తెగ వైరల్ అవుతోంది. మలీషాపై నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు.
View this post on Instagram A post shared by @forestessentials
'లైవ్ యువర్ ఫెయిరీ టేల్' అనే షార్ట్‌ఫిల్మ్ ద్వారా తొలిసారి మలీషా ఫేమస్ అయింది. మురికివాడల్లో బతికే ఐదుగురు చిన్నారులను స్టార్ రెస్టారెంట్‌లో భోజనం చేయించి వారి అనుభవాలను తెలుసుకోవడం లక్ష్యంగా ఈ షార్ట్ ఫిల్మ్ రూపొందించారు. ఈ ఐదుగురు చిన్నారుల్లో మలీషా కూడా ఉంది.
2020లో హాలీవుడ్ యాక్టర్ ‘రాబర్ట్ హాఫ్‌మన్’ ఓ మ్యూజిక్ వీడియో షూటింగ్ కోసం ముంబయికి వచ్చాడు. ఈ క్రమంలో మలీషాను చూసి రాబర్ట్ ఎంతగానో ఇంప్రెస్ అయ్యాడు. మోడల్ అవ్వాలన్న మలీషా కలను తెలుసుకొని ఆమె పేరున స్వయంగా ఓ ఇన్‌స్టాగ్రామ్ పేజ్‌ను క్రియేట్ చేశాడు.
మలీషా కోసం ‘గో ఫండ్ మీ‘ అనే పేరుతో రాబర్ట్ ఓ పేజ్‌ను కూడా క్రియేట్ చేశాడు. బాలికకు సాయం చేయాలని నెటిజన్లకు పిలుపునిచ్చాడు. దీంతో చాలా మంది మనీషాకు ఆర్థిక సాయం చేశారు.
సోషల్ మీడియాలో మలీషా పేరు మారుమోగడంతో చిన్న చిన్న కంపెనీలు ప్రమోషన్స్ కోసం మలీషా వెంటపడ్డాయి. ఆ అవకాశాలను అందిపుచ్చుకున్న మలీషా.. మోడలింగ్ చేస్తూ సెలబ్రిటీగా మారిపోయింది. తనను తాను ఇన్‌స్ట్రాగ్రామ్‌లో ‘princess from the slum' గా ప్రెజెంట్ చేసుకుంది.
మలీషాకు పాపులారిటీని గమనించిన ‘ది పికాక్’ అనే మ్యాగజైన్ బాలిక ఫొటోను ఏకంగా తన కవర్ పేజ్ మీద ప్రింట్ చేసింది. బీబీసీ వంటి అంతర్జాతీయ మీడియా సంస్థలతో పాటు జాతీయ మీడియా కూడా మలీషా స్టోరీని పబ్లిష్ చేశాయి.
మురికి వాడల్లో అందరు చిన్నారుల్లానే బతికిన మలీషాకు ఇప్పుడు ఇన్‌స్టాగ్రామ్‌లో 2 లక్షల 35 వేల మంది ఫాలోవర్స్ ఉన్నారు. సెలబ్రెటీస్‌కు ఇచ్చినట్టే మలీషాకు కూడా ఇన్‌స్టాగ్రామ్ వెరిఫైడ్ బ్లూ టిక్ ఇచ్చింది.
‘ప్రిన్సెస్ ఆఫ్ స్లమ్’గా అందరూ తనను పిలుస్తుండటంపై మలీషా సంతోషం వ్యక్తం చేస్తోంది. ఎవరీ జీవితం ఎలాంటి మలుపుతీసుకుంటుందో తెలియదని పేర్కొంది. కాబట్టి అందివచ్చిన అవకాశాన్ని సమర్థవంతంగా ఉపయోగించుకోవాలని సూచిస్తోంది.
మురికివాడలో పుట్టి, పెరగడం కష్టంగా లేదా? అని తరుచూ ఎదురయ్యే ప్రశ్నపైనా మలీషా స్పందించింది. తన ఇంటిని ఎప్పుడూ ప్రేమిస్తూనే ఉంటానని చెప్పుకొచ్చింది. అందుకే ఆ ప్రశ్న ఎదురైనప్పుడల్లా తికమకపడుతూ ఉంటాని తెలిపింది. అయితే సోదరుడితో పాటు చాలాసార్లు పస్తులు ఉండాల్సి రావడం తనకు నచ్చలేదని మలీషా అన్నది.
చిన్నప్పుడు ధారావిలో ఏదైనా సినిమా షూటింగ్ జరుగుతుంటే తన సోదరుడితో కలిసి అక్కడి వెళ్లేదానినని మలీషా తెలిపింది. తనకు బ్యాగ్రౌండ్ ఆర్టిస్టుగా అవకాశమిస్తారేమోనని ఎదురు చూసేదానిని చెప్పుకొచ్చింది.
గ్లోబల్ స్టార్ ప్రియాంక చోప్రా తనకు ఎంతో ప్రేరణ అని మలీషా ఓ సందర్భంలో చెప్పింది. ఎప్పటికైనా స్టార్ మోడల్‌గా ఎదిగి మెరుగైన జీవితంతో పాటు, తమ తల్లిదండ్రులకు ఆర్థికంగా సాయపడాలని కోరుకుంటున్నట్లు వివరించింది.
మే 24 , 2023

చట్నీ సాంబార్
26 జూలై 2024 న విడుదలైంది

మిరల్
17 మే 2024 న విడుదలైంది

సెంగలం
24 మార్చి 2023 న విడుదలైంది

తమిళరాకర్స్
19 ఆగస్టు 2022 న విడుదలైంది

ట్రిపుల్స్
11 డిసెంబర్ 2020 న విడుదలైంది

మీకు మాత్రమే చెప్తా
01 నవంబర్ 2019 న విడుదలైంది
వాణి భోజన్ తల్లిదండ్రులు ఎవరు?
భోజన్, పార్వతి
వాణి భోజన్ తల్లిదండ్రులు ఏం చేస్తారు?
వాణి భోజన్ తండ్రి.. భోజన్ వైల్డ్‌లైఫ్ ఫొటోగ్రాఫర్‌గా పనిచేశారు. తల్లి హౌస్ వైఫ్‌గా ఉంది.
వాణి భోజన్ సోదరుడు/సోదరి పేరు ఏంటి?
వాణీకి ఒక బ్రదర్, ఒక సిస్టర్ ఉన్నారు.
వాణి భోజన్ పెళ్లి ఎప్పుడు అయింది?
వాణి భోజన్‌కు కృష్ణ దేవతో వివాహం జరిగింది.
వాణి భోజన్ ఫేమస్ అవ్వడానికి రీజన్ ఏంటి?
వాణి భోజన్ కెరీర్ ప్రారంభంలో కింగ్‌ఫిషర్ ఎయిర్‌లైన్స్‌లో ఎయిర్‌హోస్టెస్‌గా పని చేసింది. 2013లో సన్ టీవీలో వచ్చిన 'దీవమగల్' సీరియల్ ద్వారా పాపులర్ అయ్యింది. తెలుగులో 'మీకు మాత్రమే చెప్తా' సినిమాతో అందరి దృష్టిని ఆకర్షించింది.
వాణి భోజన్ లీడ్ రోల్‌లో చేసిన తొలి తెలుగు చిత్రం ఏది?
ఒర్ ఎరవు' (Orr Eravuu) అనే తమిళ చిత్రం ద్వారా తెరంగేట్రం చేసింది.
వాణి భోజన్ కెరీర్‌లో అత్యత్తుమ పాత్ర ఏది?
మీకు మాత్రమే చెప్తా' చిత్రంలో స్టెఫి పాత్ర
వాణి భోజన్ బెస్ట్ స్టేజ్ పర్‌ఫార్మెన్స్ వీడియోలు?
వాణి భోజన్ రెమ్యూనరేషన్ ఎంత?
వాణి భోజన్ ఒక్కో సినిమాకు రూ.7-10 కోట్లు తీసుకుంటోంది.
వాణి భోజన్ కు ఇష్టమైన ఆహారం ఏంటి?
ఇండియన్ ఫుడ్
వాణి భోజన్ కు ఇష్టమైన నటుడు ఎవరు?
వాణి భోజన్ కు ఇష్టమైన నటి ఎవరు?
సీనియర్ నటి రాధిక
వాణి భోజన్ ఎన్ని భాషలు మాట్లాడగలరు?
తమిళం, హిందీ, ఇంగ్లీషు
వాణి భోజన్ ఫెవరెట్ డైరెక్టర్ ఎవరు?
వాణి భోజన్ ఫేవరేట్ కలర్ ఏంటి?
వైట్, బ్లూ
వాణి భోజన్ ఫేవరేట్ క్రీడ ఏది?
క్రికెట్
వాణి భోజన్ ఫేవరేట్ క్రికెట్ ప్లేయర్లు ఎవరు?
ఎం.ఎస్. ధోనీ
వాణి భోజన్ కు ఇష్టమైన పర్యాటక ప్రాంతాలు ఏవి?
లండన్
వాణి భోజన్ ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో ఫాలోవర్ల సంఖ్య?
2.4 మిలియన్లకు పైగా ఫాలోవర్లు ఉన్నారు.
వాణి భోజన్ సోషల్ మీడియా లింక్స్
వాణి భోజన్ కి ఎన్ని అవార్డులు వచ్చాయి?
2021లో 'ఓ మై కడవులే' అనే తమిళ చిత్రానికి గాను ఉత్తమ నటిగా ఆనంద విటకన్ సినిమా అవార్డ్ అందుకుంది.
వాణి భోజన్ ఎలాంటి వ్యాపార ప్రకటనల్లో నటిస్తున్నారు?
పియర్స్ సోప్, ఆర్‌కేజీ ఘీ, టీవీసీ, కేసరీస్ పూజా తదితర కంపెనీలకు చెందిన వ్యాపార ప్రకటనల్లో వాణీ నటించింది.
వాణి భోజన్ వ్యక్తిగత వివరాలు, ఎత్తు, పుట్టిన ప్రదేశం, బర్త్ డేట్, వయస్సు, సాధించిన విజయాలు, అవార్డులు, వ్యాపారాలు, ఇష్టాఇష్టాలు, అభిరుచులు తెలుసుకోండి. అలాగే వాణి భోజన్ కుటుంబ నేపథ్యం, తల్లిదండ్రులు, తోబుట్టువులు, రిలేషన్స్, విద్యా నేపథ్యం, కెరీర్ మైలురాళ్లు, తాజా ప్రాజెక్ట్‌లు, అధికారిక సోషల్ మీడియా అకౌంట్స్, లేటెస్ట్ చిత్రాలను ఒక్క క్లిక్‌తో ఇక్కడ తెలుసుకోండి.