ఈ తరం యువత సినిమాలు, వెబ్‌సిరీస్‌లు, క్రికెట్‌పై చూపిన శ్రద్ధ సీరియళ్లపై చూపించరు. సీరియళ్లలో ఉండే సాగదీత, సెంటిమెంట్ యువతరానికి ఏమాత్రం రుచించడం లేదు. దీంతో ఇంట్లో ఎవరైనా సీరియల్స్ పెడితే వెంటనే ముఖం చిట్లిస్తుంటారు. రిమోట్ తీసుకొని ఛానెల్ మార్చేస్తుంటారు. అయితే వారికి తెలియని విషయం ఏంటంటే ఇప్పుడు సీరియళ్లలోనూ అందమైన భామలు తళుక్కుమంటున్నారు. హీరోయిన్లకు ఏ మాత్రం తగ్గని గ్లామర్‌తో బుల్లితెర ప్రేక్షకులను అలరిస్తున్నారు. అందం, అభినయంతో వీక్షకులను కట్టిపడేస్తున్నారు. మరీ ఆ నటీమణులు ఎవరు? వారు చేసిన సీరియల్స్ ఏంటో తెలుసుకుందాం..
సుహాసిని
బుల్లితెర ప్రేక్షకులను అలరిస్తున్న అందమైన నటీమణుల్లో సుహాసినీ ముందు వరుసలో ఉంటుంది. చంటిగాడు సినిమాతో మెుదట టాలీవుడ్‌లోకి అడుగుపెట్టిన ఈ భామ వెండితెర ప్రేక్షకులను పెద్దగా ఆకట్టుకోలేకపోయింది. దీంతో సీరియళ్లపై తన దృష్టిని కేంద్రీకరించి సూపర్ సక్సెస్ అయింది. శివశంకరి, అపరంజి, అనుబంధాలు, అష్టాచమ్మా, ఇద్దరు అమ్మాయిలు, నా కోడలు బంగారం, గిరిజా కల్యాణం, దేవత, అనుబంధ ఆలయం వంటి సీరియళ్లలో నటించి మెప్పించింది. తెలుగు, తమిళం, భోజ్‌పూరి సినిమాల్లోనూ అడపాదడపా నటిస్తూ సుహాసిని అలరిస్తోంది.
ప్రీతి అస్రాని
బుల్లితెరపై అలరిస్తున్న అందాల భామల్లో ప్రీతి అస్రాని కూడా ఒకరు. చైల్డ్ ఆర్టిస్టుగా సినిమాల్లో తన కెరీర్ ప్రారంభించిన ఈ భామ టెలివిజన్ రంగంలోనూ నటిస్తూ అలరిస్తోంది. పక్కింటి అమ్మాయి సీరియల్ ద్వారా బుల్లితెరపై అడుగుపెట్టిన ప్రీతి.. సోషల్, మిన్నాలే 9 ఆవర్స్ వంటి ప్రముఖ షోలలో కనిపించింది. అంతేగాక మళ్లీరావా, హ్యాపీ వెడ్డింగ్, సీటీమార్, దొంగలున్నారు జాగ్రత్త, యశోధ సినిమాల్లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది.
నవ్య స్వామి
నటి నవ్య స్వామి కూడా అందమైన బుల్లితెర నటిగా గుర్తింపు తెచ్చుకుంది. కర్ణాటకలోని మైసూరుకు చెందిన ఈ భామ ఓ కన్నడ టీవీ షో ద్వారా కెరీర్ ప్రారంభించింది. ఆ తర్వాత వాణి-రాణి, నా పేరు మీనాక్షి, ఆమె కథ, కంటే కూతుర్నే కనాలి వంటి తెలుగు సీరియళ్లలో నటించి పాపులర్ అయింది. ప్రస్తుతం పలు టెలివిజన్ షోలలోనూ కనిపిస్తూ నవ్య అలరిస్తోంది.
ఐశ్వర్య పిస్సే
33 ఏళ్ల ఐశ్వర్య పిస్సే బుల్లితెల నటిగా రాణిస్తోంది. తన గ్లామర్‌తో టెలివిజన్ ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. ఈ భామ తెలుగు, తమిళం, కన్నడ సీరియళ్లలో నటించి చాలా బాగా పాపులర్ అయింది. సర్వమాంగళ మాంగల్యే, అగ్నిసాక్షి, ముక్కు పుడక వంటి తెలుగు సీరియళ్లలో ఐశ్వర్య నటించింది.
శోభా శెట్టి
కన్నడ నటి శోభా శెట్టి బుల్లితెరపై పాపులర్ యాక్టర్‌గా పేరు తెచ్చుకుంది. ముఖ్యంగా కార్తీక దీపం సీరియల్‌తో ఈ భామ ఒక్కసారిగా అందరి దృష్టిని ఆకర్షించింది. అందులో ఆమె చేసిన ప్రతినాయిక పాత్రకు ‘మా పరివార్’ అవార్డు వరించింది. అష్టా-చమ్మా సీరియల్‌లోనూ చేసిన ఈ భామ తన నటన ద్వారా ఎంతోమంది ప్రేక్షకులను అలరించింది.
ప్రియాంక జైన్
నటి ప్రియాంక జైన్ కూడా తన అందం అభినయంతో బుల్లితెర ప్రేక్షుకలను అలరిస్తోంది. \రంగీ తరంగా అనే తమిళ చిత్రం ద్వారా నటనా రంగంలోకి అడుగుపెట్టిన ఈ భామ తెలుగు, తమిళ సిరీయళ్ల ద్వారా మంచి గుర్తింపు తెచ్చుకుంది. ముఖ్యంగా తెలుగులో చేసిన మౌన రాగం సీరియల్ ఈ భామను అందరూ గుర్తుపట్టేలా చేసింది. ఇందులో అమ్ములు పాత్రలో ప్రియాంక జైన్ అద్భుతంగా నటించింది.
Featured Articles Movie News
Dil Raju: అన్ని చేస్తాం.. అన్నింటికీ చెక్ పెడతాం