దేశం మెచ్చిన నటుల్లో రెబల్ స్టార్ ప్రభాస్ (Prabhas) ఒకరు. ఈ హీరో పేరు చెబితే బాక్సాఫీస్ రికార్డులు, పాన్ ఇండియా స్థాయి చిత్రాలే గుర్తుకువస్తాయి. అయితే ప్రభాస్‌కు మంచి మనసున్న వ్యక్తిగానూ గుర్తింపు ఉంది. ప్రభాస్ ఇప్పటివరకూ ఎన్నో సినిమాల్లో నటించినప్పటికీ ఎన్నడూ కాంట్రవర్సీల జోలికి పోలేదు. ఏ స్టేజీ మీద వివాదస్పద వ్యాఖ్యలు చేయలేదు. పైగా తన వద్దకు వచ్చిన వారికి పసందైన భోజనాన్ని పెట్టి వారి మన్ననలు పొందుతుంటాడు. అంతే కాకుండా పలు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ అందరిచేత శభాష్ అనిపించుకుంటున్నాడు. ఈ క్రమంలోనే ప్రభాస్ మరోమారు తన మంచి మనసును చాటుకున్నాడు.
డైరెక్టర్స్‌కు భారీ విరాళం
లెజండరీ డైరెక్టర్ దాసరి నారాయణరావు (Dasari Narayana Rao Birthday) పుట్టిన రోజును పురస్కరించుకొని ఏటా మే 4న ‘డైరెక్టర్స్ డే’ (Directors Day)ను జరుపుకుంటున్నారు. ఈసారి వేడుకలను హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో ఘనంగా నిర్వహించాలని ఫిల్మ్ డైరెక్టర్ అసోసియేషన్ నిర్ణయించింది. ఈ కార్యక్రమానికి అహ్వానించేందుకు అసోసియేషన్ సభ్యులు తాజాగా ప్రభాస్‌ను కలిశారు. ఈ సందర్భంగా వేడుకలు గ్రాండ్ చేయాలంటూ ప్రభాస్ వారికి రూ.35 లక్షలు విరాళంగా అందజేశారు. ఈ విషయాన్ని అసోసియేషన్ ప్రెసిడెంట్ స్వయంగా వెల్లడించారు. దీంతో హీరో ప్రభాస్‌పై సర్వత్రా ప్రశంసల వర్షం కురుస్తోంది.
ఫుల్ స్వింగ్‌లో ప్రభాస్!
ప్రస్తుతం దేశంలో ఏ స్టార్ హీరో చేతిలో లేనన్ని పాన్ ఇండియా చిత్రాలు ప్రభాస్ లిస్ట్‌లో ఉన్నాయి. ప్రభాస్ ఏ డైరెక్టర్‌కైనా ఓకే చెప్తే ఆ ప్రాజెక్ట్ మెుదలయ్యేది 2026 తర్వాతనే. ప్రభాస్ ప్రాజెక్టుల విషయానికి వస్తే.. ప్రస్తుతం అతడు ‘కల్కీ 2898 ఏడీ‘ సినిమాలో బిజీగా ఉన్నాడు. ఈ చిత్రం ఈ ఏడాదిలోనే రిలీజ్ కానుంది. దీంతో పాటు మారుతి దర్శకత్వంలో ‘రాజా సాబ్’ (Raja Saab) చిత్రం చేస్తున్నాడు. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. తర్వాత సందీప్ రెడ్డి వంగా (Sandeep Reddy Vanga)తో ఓ సినిమా చేయనున్నాడు. ఈ చిత్రానికి స్పిరిట్ (Spirit) అనే టైటిల్ ఖరారు చేశారు. వీటితో పాటు ‘సలార్ సీక్వెల్’ ఉంది. ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహించే ఈ చిత్రం షూటింగ్ ఈ ఏడాదిలోనే ప్రారంభమయ్యే అవకాశం ఉంది. వీటితో పాటు మంచు విష్ణు హీరోగా తెరకెక్కుతున్న ‘కన్నప్ప’లోనూ ప్రభాస్ శివుడి పాత్ర పోషించనున్నాడు. అలాగే హను రాఘవపూడితో ఓ సినిమా చేయబోతున్నాడు. ఈ చిత్రాలన్నీ పూర్తవ్వడానికి కనీసం రెండేళ్ల సమయం పడుతుంది.
Celebrities Featured Articles Movie News Telugu Movies
Allu Arjun: థ్యాంక్యూ పవన్ కళ్యాణ్ మామయ్య.. వివదానికి పుల్ స్టాప్ పెట్టిన బన్నీ