• TFIDB EN
  • విరాన్ ముత్తంశెట్టి
    విరాన్ ముత్తంశెట్టి.. ముఖ్య గమనిక (2024) చిత్రంతో పరిచయమైన తెలుగు నటుడు.
    కథనాలు
    This Week OTT Movies: ఈ వారం తెలుగులో సందడి చేసే OTT సినిమాలు ఇవే..!
    This Week OTT Movies: ఈ వారం తెలుగులో సందడి చేసే OTT సినిమాలు ఇవే..! ఎప్పటిలాగే ఈ వారం (This Week Movies) కూడా పలు సినిమాలు థియేటర్ల వద్ద హంగామా సృష్టించేందుకు సిద్ధంగా ఉన్నాయి. ఆహ్లాదకరమైన వినోదాన్ని పంచేందుకు ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాయి. అటు OTT సైతం పలు ఆసక్తికర చిత్రాలతో ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ఈ నేపథ్యంలో ఈ వారం విడుదలకు సిద్ధంగా ఉన్న చిత్రాలు, వెబ్‌సిరీస్‌లు ఎంటో ఇప్పుడు చూద్దాం. థియేటర్‌లో విడుదలయ్యే చిత్రాలు సుందరం మాస్టర్‌ హాస్య నటుడు హర్ష చెముడు ప్రధాన పాత్రలో నటించిన చిత్రం ‘సుందరం మాస్టర్‌’గా (Sundaram Master). దివ్య శ్రీపాద కథానాయిక. ఈ చిత్రాన్ని హీరో రవితేజ (RaviTeja), సుధీర్‌ కుమార్‌ కుర్రు సంయుక్తంగా నిర్మించారు. కల్యాణ్‌ సంతోష్‌ దర్శకత్వం వహించారు. ఇప్పటికే చిత్రీకరణ పూర్తి చేసుకున్న ‘సుందరం మాస్టర్‌’.. ఫిబ్రవరి 23న ప్రేక్షకుల ముందుకు రానుంది. మస్తు షేడ్స్‌ ఉన్నయ్‌రా! హాస్యనటుడు అభినవ్‌ గోమఠం లీడ్‌ రోల్‌లో చేసిన చిత్రం ‘మస్తు షేడ్స్‌ ఉన్నయ్‌రా!’ (Masthu Shades Unnai Ra). తిరుపతి రావు ఇండ్ల దర్శకుడు. తరుణ్‌ భాస్కర్‌, అలీ రెజా, వైశాలి ప్రధాన పాత్రల్లో నటించిన ఈ చిత్రాన్ని భవాని కాసుల, ఆరెమ్‌ రెడ్డి, ప్రశాంత్‌.వి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. భావోద్వేగాల మేళవింపుతో మంచి కామెడీ ఎంటర్‌టైనర్‌గా దీన్ని రూపొందించినట్లు చిత్ర బృందం తెలిపింది. ఫిబ్రవరి 23న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. సిద్ధార్థ్‌ రాయ్‌ బాల నటుడిగా పలు చిత్రాలతో (This Week Movies) అలరించిన దీపక్‌ సరోజ్‌ హీరోగా తెలుగు ఇండస్ట్రీకి పరిచయం అవుతున్నారు. అతడు నటించిన ‘సిద్ధార్థ్‌ రాయ్‌’ (Siddharth Roy) చిత్రం ఈ వారమే విడుదల కాబోతోంది. ఇందులో తన్వి నేగి కథానాయిక. వి.యశస్వి దర్శకుడు.  కొత్తతరం ప్రేమకథతో రూపొందిన ఈ సినిమా ప్రచార చిత్రాలు యువతను ఆకట్టుకుంటున్నాయి. ఫిబ్రవరి 23న సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ముఖ్య గమనిక విరాన్‌ ముత్తంశెట్టి హీరోగా.. కెమెరామెన్‌ వేణు మురళీధర్‌ తెరకెక్కించిన చిత్రం ‘ముఖ్య గమనిక’ (Mukhya Gamanika). లావణ్య కథానాయిక.  రాజశేఖర్‌, సాయికృష్ణ సంయుక్తంగా నిర్మించారు. ‘థ్రిల్లింగ్‌ అంశాలతో సాగే ఫ్యామిలీ ఎమోషనల్‌ డ్రామాగా ఈ చిత్రాన్ని రూపొందించినట్లు చిత్ర బృందం తెలిపింది. ఈ మూవీ కూడా ఫిబ్రవరి 23నే విడుదల కానుంది. సైరెన్‌ జయం రవి, అనుపమ పరమేశర్వన్‌, కీర్తి సురేశ్‌ ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన యాక్షన్‌ డ్రామా ‘సైరెన్‌’ (Siren). ఆంటోని భాగ్యరాజ్‌ దర్శకత్వంలో వచ్చిన ఈ తమిళ చిత్రాన్ని తెలుగులో గంగ ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పతాకంపై మహేశ్వర్‌ రెడ్డి మూలి విడుదల చేస్తున్నారు. ఫిబ్రవరి 23న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. కీర్తిసురేష్‌ పోలీసు ఆఫీసర్‌గా నటిస్తున్న ఈ చిత్రంలో జయం రవి రెండు విభిన్నమైన పాత్రలు పోషించారు. ఆర్టికల్‌ 370 అందాల తార యామీ గౌతమ్‌ (Yami Gautam) ప్రధాన పాత్రలో నటించిన లేటెస్ట్‌ చిత్రం ‘ఆర్టికల్‌ 370’ (article 370). ఆదిత్య సుహాస్‌ ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. ఆర్టికల్‌ 370 నేపథ్యంలో కశ్మీర్‌లో జరిగిన పరిస్థితుల ఆధారంగా ఈ సినిమాను రూపొందించారు. ఫిబ్రవరి 23న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. ఓటీటీలో వచ్చే చిత్రాలు/సిరీస్‌లు ఇవే మరిన్ని OTT చిత్రాలు & వెబ్ సిరీస్‌ల విడుదలల కోసం ఇక్కడ క్లిక్ చేయండి https://telugu.yousay.tv/tfidb/ott Title CategoryLanguagePlatformRelease DateApartment 404Series English/KoreanAmazon PrimeFeb 23PoacherMovieTelugu Amazon PrimeFeb 23Will Trent Series EnglishDisney+hotstarFeb 21Malaikottai VaalibanMovie MalayalamDisney+hotstarFeb 23The Buried TruthAvatar the Last AirbenderSeriesEnglish Netflix Feb 23 The Buried TruthSeries HindiNetflix March 17
    ఫిబ్రవరి 19 , 2024
    Pedda Kapu 1 Review: డైరెక్టర్‌ శ్రీకాంత్‌ అడ్డాల గ్రేట్ కమ్‌బ్యాక్‌ ఇచ్చినట్లేనా? సినిమా ఎలా ఉందంటే! నటీనటులు: విరాట్ కర్ణ, ప్రగతి శ్రీ వాస్తవ, శ్రీకాంత్ అడ్డాల, రావు రమేష్‌, నాగ బాబు, రాజీవ్‌ కనకాల, ఈశ్వరి రావు, ఆడుకలం నరేన్‌ డైరెక్టర్‌: శ్రీకాంత్ అడ్దాల సంగీతం: మిక్కీ జే. మేయర్‌ సినిమాటోగ్రఫీ: ఛోటా కే. నాయుడు నిర్మాత: మిర్యాల రమేష్‌, మిర్యాల సత్యనారాయణ క్లాస్‌ దర్శకుడిగా పేరొందిన శ్రీకాంత్‌ అడ్డాల (Srikanth Addala) తెరకెక్కించిన పొలిటికల్‌ యాక్షన్‌ ఫిల్మ్‌ ‘పెదకాపు 1’ (Peda Kapu 1). టైటిల్‌ని బట్టి చాలామంది ఈ సినిమా ఓ సామాజిక వర్గం నేపథ్యంలో రూపొందిందని అనుకుంటున్నారు. కానీ, ఇది క్యాస్ట్‌కు సంబంధించి కాదు ఓ సామాన్యుడి సంతకం అని దర్శకుడు స్పష్టం చేశారు. నిర్మాత మిర్యాల రవీందర్‌ రెడ్డి కుటుంబ సభ్యుడు విరాట్‌ కర్ణ ఈ సినిమాతో హీరోగా పరిచయం అవుతున్నాడు. ప్రగతి శ్రీవాస్తవ కథానాయిక. ఈ సినిమాతో శ్రీకాంత్‌ అడ్డాల తన పంథా మార్చడం ఓ విశేషమైతే ఇందులో నెగెటివ్‌ ఛాయలున్న పాత్రలో ఆయన నటించడం మరో విశేషం. అయితే ఈ చిత్రం ఇవాళ (సెప్టెంబర్‌ 29) ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ నేపథ్యంలో ఈ సినిమా పూర్తి రివ్యూ మీకోసం. కథ: 1980లో ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీ పెట్టిన సందర్భం అది. లంక గ్రామాన్ని సత్యరంగయ్య (రావు రమేష్), బయన్న (నరేన్) అనే ఇద్దరు వ్యక్తులు శాసిస్తుంటారు. హింసని ప్రేరేపిస్తూ తమ అధికారం కోసం మిగతా జనాల్ని బలిపశువులుగా మారుస్తుంటారు. పెదకాపు (విరాట్ కర్ణ) తన అన్నతో కలిసి సత్యరంగయ్య వద్ద పని చేస్తుంటారు. అనుకోని పరిస్థితిలో సత్యరంగయ్య తరపున పెదకాపు అన్న జైలుకి వెళ్ళాల్సివస్తుంది. అలా జైలుకి వెళ్ళిన పెదకాపు అన్న కనిపించకుండా పోతాడు. ఈ క్రమంలోనే 1983 సంవత్సరంలో ఎన్టీఆర్‌ తెలుగుదేశం పార్టీని ప్రారంభిస్తాడు. బడుగు, బలహీన వర్గాలు సంక్షేమం కోసం సరైన వ్యక్తులను పార్టీలోకి ఆహ్వానించేందుకు ప్లాన్ చేస్తారు. ఈ పరిస్థితుల్లో ఆ గ్రామంలో ఆవేశంతోపాటు ఆలోచన ఉన్న పెద్దకాపు (విరాట్ కర్ణ) తెలుగుదేశం జెండాను గ్రామంలోని నడిబొడ్డున పాతి సత్య రంగయ్య, బయన్నకు సవాల్ విసురుతాడు. పెదకాపు.. వారిని ఎలా ఎదిరించాడు? లంక గ్రామాల్లో అల్లర్లు చేలరగడానికి కారణం ఏమిటి? ఈ కథలో కన్నబాబు ( శ్రీకాంత్ అడ్డాల), అక్కమ్మ (అనసూయ), పార్టీ ఇంచార్జ్ (నాగబాబు) పాత్రల స్వభావం ఏమిటి?  తెలియాలంటే సినిమా చూడాల్సిందే.  ఎలా సాగిందంటే? ఫస్టాఫ్‌లోని ప్రథమ భాగమంతా గోదావరి జిల్లాలో కులాల కొట్లాటల చుట్టే తిరుగుతుంది. ఆ తర్వాత ఎన్టీఆర్ పార్టీ పెట్టడంతో బడుగు, బలహీన వర్గాల తరపున హీరో టీడీపీ జెండాను పాతే ఎపిసోడ్ సినిమాకు హైలెట్‌గా నిలుస్తుంది. ఆ సీన్‌ కథలోని ఇంటెన్సిటీ ఏమిటో చెబుతుంది. ఇక సత్య రంగయ్య, బయన్న అరాచకాలు, వాటి మధ్య నలిగే గ్రామీణ ప్రజలు, పెద్దకాపు నేతగా ఎదిగే తీరును ఫస్టాఫ్‌లో డైరెక్టర్‌ చాలా ఇంట్రెస్టింగ్‌గా చూపించారు. అయితే కొన్ని సీన్లు మరి సాగదీతల అనిపిస్తాయి. ఇక సెకండాఫ్‌లో కథ ఊపందుకుంటుంది. సత్య రంగయ్య హఠాన్మరణం, పెద్దకాపు అన్నయ్య కిడ్నాప్, పెద్దకాపు కాబోయే వదిన హత్య, అనసూయ ఎంట్రీ సినిమాను మరో రేంజ్‌కు తీసుకెళ్తాయి. ప్రీ క్లైమాక్స్ నుంచి చివరి సీన్ వరకు కథలో ఎమోషన్స్, యాక్షన్ దట్టించిన విధానం సినిమాలోని ఇంటెన్సిటీని ఎలివేట్ చేసేందుకు దోహదపడ్డాయి. అనసూయ పాత్ర సినిమాకు మరింత బలాన్ని ఇచ్చిందని చెప్పవచ్చు. ఎవరేలా చేశారంటే పెదకాపు పాత్ర చేసిన విరాట్‌ కర్ణకు ఇదే తొలి సినిమా అయినప్పటికీ నటుడిగా తనకు మంచి భవిష్యత్‌ ఉందని ‌అతడు నిరూపించుకున్నాడు. యాక్షన్‌ సీన్స్‌లో బాగా నటించాడు. చాలా సహజంగా కనిపించే ప్రయత్నం చేశాడు. అయితే ఎమోషన్ సీన్స్‌, భారీ డైలాగులు చెప్పేటప్పుడు మాత్రం కాస్త తడబడినట్లు కనిపించింది. హీరోయిన్‌ ప్రగతి పాత్రకు యాక్టింగ్‌ స్కోప్‌ లేకపోవడంతో తెరపై ఆమె కంట్రీబ్యూషన్‌ తక్కువే. ఇక సినిమాకు అనసూయ నటనే హైలెట్‌ అని చెప్పవచ్చు. అక్కమ్మ పాత్రలో ఆమె ఇరగదీసింది. అయితే రంగమ్మత్తలా ఓన్ చేసుకునే పాత్ర ఐతే కాదు. సత్యరంగయ్య పాత్రలో రావు రమేష్‌ అదరగొట్టాడు. బయన్న పాత్రలో నరేన్ కూడా మంచి నటన కనబరిచారు. కన్నబాబు పాత్రలో శ్రీకాంత్ అడ్దాల నిజంగానే సర్ప్రైజ్ చేశారు. తనికెళ్ల భరణి, నాగబాబు, రాజీవ్‌ కనకాల ఎప్పటిలాగే తమ నటనతో మెప్పించారు.  టెక్నికల్‌గా.. సాంకేతిక అంశాల విషయానికి వస్తే ముందుగా చెప్పుకోవాల్సి ఛోటా కె. నాయుడు కెమెరా పనితనం. ఆయన తన నైపుణ్యంతో సినిమాకు కలర్‌ఫుల్‌ రంగులు అద్దారు. నిజంగా కొత్త గోదావరిని చూపించారు. జెండాపాతే సన్నివేశం, గౌరీ ఉరి సన్నివేశం, జాతర పాటని చిత్రీకరించిన తీరు చాలా బావుంది. మిక్కీ జె. మేయర్‌ పాటలు సినిమాకి కలిసిరాలేదు. నేపథ్య సంగీతం మాత్రం బావుంది. మాటలు, పాటలతో కథ చెప్పే శ్రీకాంత్‌ అడ్డాల ఆ విషయంలో కాస్త గతి తప్పినట్లు కనిపించింది. ఒకట్రెండు మినహా సినిమాలో గుర్తుండిపోయే డైలాగులు పెద్దగా కనిపించవు. నిర్మాణ విలువలు బాగున్నాయి. నాణ్యత విషయంలో నిర్మాతలు రాజీపడినట్లు ఎక్కడా కనిపించదు.  ప్లస్‌ పాయింట్స్‌ స్క్రీన్‌ ప్లేవిరాట్‌, అనసూయ నటననేపథ్య సంగీతంసినిమాటోగ్రఫీ మైనస్‌ పాయింట్స్‌ సాగదీత సీన్స్పాటలు రేటింగ్‌ : 3/5
    సెప్టెంబర్ 29 , 2023
    Baby Movie Review: యూత్‌ని కట్టిపడేసిన బేబీ.. ట్రయాంగిల్ లవ్ స్టోరీకి ప్రేక్షకుడు ఫిదా అయ్యాడా? నటీనటులు: ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య, విరాజ్ అశ్విన్, నాగబాబు, సాత్విక్ ఆనంద్, తదితరులు డైరెక్టర్: సాయి రాజేశ్ నిర్మాత: శ్రీనివాస కుమార్(ఎస్కేఎన్) మ్యూజిక్: విజయ్ బుల్గానిన్ సినిమాటోగ్రఫీ: ఎం.ఎన్. బాల్ రెడ్డి కలర్ ఫొటో వంటి సినిమాకు కథ అందించి అందరి ప్రశంసలు అందుకున్నాడు డైరెక్టర్ సాయి రాజేశ్. ఈ సినిమా తర్వాత స్వయంగా కథ రాసుకుని డైరెక్షన్ వహించిన సినిమా ‘బేబీ’. ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య, విరాజ్ అశ్విన్ ప్రధాన పాత్రల్లో నటించారు. ట్రైలర్, మ్యూజిక్‌తో సినిమాపై అంచనాలు పెరిగాయి. చిత్రబృందం కూడా పూర్తి నమ్మకంతో ఉంది. మరి, ఈ మూవీ ప్రేక్షకుడిని మెప్పించిందా? ట్రయాంగిల్ లవ్ స్టోరీకి కనెక్ట్ అయ్యాడా? అనే విషయాలను ఈ రివ్యూలో చూద్దాం.  కథేంటంటే? ఆనంద్(ఆనంద్ దేవరకొండ), వైషూ(వైష్ణవి చైతన్య) చిన్నప్పటి నుంచి కలిసి పెరుగుతారు. ఈ క్రమంలో ఆనంద్‌ని వైషూ ప్రేమిస్తుంది. ఆనంద్ కూడా వైషూ ప్రేమను అంగీకరిస్తాడు. అయితే, ఆనంద్ పదో తరగతి తప్పడంతో ఆటో డ్రైవర్‌గా మారతాడు. అదే సమయంలో వైషూ ఇంటర్ పూర్తి చేసి ఇంజినీరింగ్ చదువులకు వెళ్తుంది. అక్కడ ఆమెకు విరాజ్(విరాజ్ అశ్విన్) పరిచయం అవుతాడు. ఈ క్రమంలో అక్కడి కల్చర్‌కు వైషూ అలవాటు పడి క్రమంగా ఆనంద్‌ని దూరం పెడుతుంది. మరోవైపు, విరాజ్‌కి దగ్గరవుతుంది. శారీరకంగానూ ఒకటవ్వాల్సి వస్తుంది. మరి, వైష్ణవి ఎవరిని ప్రేమించింది? ఆనంద్ ఏమయ్యాడు? అనేది తెరపై చూడాల్సిందే.  ఎలా ఉంది? ప్రచార చిత్రాలను బట్టే సినిమా ట్రయాంగిల్ లవ్ స్టోరీ అని అర్థమైపోయింది. సినిమా చివరికి విషాదాంతమవుతుందని సూచిస్తూ డైరెక్టర్ సినిమాని మొదలు పెట్టాడు.  తొలుత ఆనంద్, వైషూల మధ్య వచ్చే స్కూల్ డేస్ సన్నివేశాలు ఆకట్టుకుంటాయి. పెద్దగా డైలాగులు లేకుండా కేవలం హావభావాలు, బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్‌తో సాగే ఈ సీక్వెన్స్ ప్రేక్షకుడిని మెప్పిస్తుంది. ఇంటర్వెల్ ముందు వచ్చే సీన్లు చప్పట్లు కొట్టిస్తాయి. ఇక సెకండాఫ్‌లో కథలో వేగం పెరుగుతుంది. ఆనంద్‌కి తెలియకుండా విరాజ్‌తో వైష్ణవి బంధాన్ని కొనసాగించడం, విరాజ్ అసలు వ్యక్తిత్వాన్ని ఆలస్యంగా తెలుసుకోవడం వంటి సీన్లు ఆకట్టుకుంటాయి. ఇక క్లైమాక్స్ ఎమోషనల్‌గా సాగుతుంది. యూత్ ఆలోచనకు తగ్గట్టు సన్నివేశాలు సాగడంతో ఎక్కువ మందికి రీచ్ అవుతుంది.  ఎవరెలా చేశారంటే? సినిమాకు ఆనంద్, వైష్ణవి ప్రాణం పోశారు. ఇద్దరూ తమ తమ పాత్రల్లో పోటీ పడి మరీ నటించారు. ఆటోడ్రైవర్‌గా ఆనంద్ చక్కటి అభినయం ప్రదర్శించాడు. ఎమోషనల్ సన్నివేశాలు బాగా చేసినా చివర్లో కాస్త తడబడినట్లు అనిపించింది. ఇక బస్తీ అమ్మాయిగా, గ్లామర్ గర్ల్‌గా వైష్ణవి చక్కగా చేసింది.  లుక్స్ పరంగా, నటన పరంగా ఆకట్టుకుంది. ఒక రకంగా వైష్ణవి పాత్రే సినిమాకు ప్రధాన ఆకర్షణ. బోల్డ్ సన్నివేశాల్లో అందాలు ఒలికించి.. భావోద్వేగ భరిత సీన్లకు న్యాయం చేసింది. ఇక విరాజ్ అశ్విన్, నాగబాబు, తదితరులు తమ పాత్ర పరిధి మేరకు నటించారు.  టెక్నికల్‌గా.. తెలిసిన కథే అయినప్పటికీ సినిమాను చక్కగా, ఆసక్తికరంగా మలిచాడు డైరెక్టర్ సాయిరాజేశ్. డైలాగ్స్‌తో ప్రేక్షకుడ‌్ని మెప్పించడంలో సక్సెస్ అయ్యాడు. నేటి యూత్‌కి కనెక్ట్ అయ్యే విధంగా స్క్రీన్ ప్లేను ప్రజెంట్‌ చేశాడు. ఎమోషనల్ సీన్లను చక్కగా తీశాడు. అయితే, క్లైమాక్స్‌లో కాస్త తడబడినట్లు అనిపిస్తుంది. క్యారెక్టర్లను పేలవంగా ముగించినట్లు అనిపిస్తుంది. అక్కడక్కడా సీన్లను సాగదీసినట్లు ఉంటుంది. ఇక, విజయ్ బుల్గానిని మ్యూజిక్ ఆకట్టుకుంటుంది. నేపథ్య సంగీతం బాగుంది. నిర్మాణ విలువలు బాగున్నాయి. బాల్ రెడ్డి అందించిన విజువల్స్ సహజంగా ఉన్నాయి.  ప్లస్ పాయింట్స్ కథనం, డైలాగ్స్ నిర్మాణ విలువలు యూత్ ఎలిమెంట్స్ సంగీతం మైనస్ పాయింట్స్ సాగతీత సన్నివేశాలు క్లైమాక్స్ చివరగా.. యూత్‌ మనసును కట్టిపడేసే చిత్రమే ‘బేబీ’ రేటింగ్: 3/5 https://www.youtube.com/watch?v=_npN4uwDMLk
    జూలై 14 , 2023
    OTT MOVIES: ఈ వారం థియేటర్లు/OTTల్లో రిలీజ్ కానున్న సినిమాల లిస్ట్ ఇదే! గతవారం రోజుల నుంచి సరైన హిట్‌ లేక థియేటర్లు చిన్నబోతున్నాయి. చిన్న చిన్న సినిమాలు సందడి చేసినప్పటికీ.. వాటికి ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయాయి.  గతవారం విడుదలైన సినిమాలన్నీ బాక్సాఫీస్ వద్ద బోల్తా పడ్డాయి. భారీ అంచనాల మధ్య విడుదలైన నిఖిల్ నటించిన 'స్పై' డిజాస్టర్‌గా నిలిచింది. సామజవరగమణ సినిమా  ఒక్కటే కాస్త పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. మరి ఈ వారం ఏయే సినిమాలు థియేటర్‌లో సందడి చేయనున్నాయి. ఏయే వెబ్‌ సిరీస్‌లు, సినిమాలు ఓటీటీలోకి స్ట్రీమింగ్ కానున్నాయో ఓసారి చూద్దాం.  బేబీ ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య, విరాజ్ అశ్విన్ కీలక పాత్రలు పోషించిన సినిమా 'బేబీ'.  ఈ చిత్రం జులై 14న థియేటర్లలో విడుదల కానుంది. ఇప్పటికే ప్రమోషన్ స్టార్ట్ చేసిన చిత్ర బృందం సినిమాపై చాలా కన్ఫడెంట్‌గా ఉంది. ఇప్పటిటికే విడుదలైన ట్రైలర్ సినిమాపై మంచి బజ్‌ ఏర్పడింది. ట్రయాంగిల్ లవ్ స్టోరీగా చిత్రం తెరకెక్కినట్లు తెలిసింది.  ఇద్దరి యువకుల ప్రేమ మధ్య నగిలే అమ్మాయిలా వైష్ణవి, చిన్నతనం గాఢంగా ఆమెను లవ్ చేసే పాత్రలో ఆనంద్ దేవరకొండ అద్భుతంగా నటించినట్లు ట్రైలర్‌ను బట్టి అర్థమవుతోంది. నాయకుడు  ఉద‌య‌నిధి స్టాలిన్‌, ఫ‌హాద్ ఫాజిల్ ప్రధాన పాత్రల్లో న‌టించిన తాజా తమిళ్  హిట్ చిత్రం 'మామ‌న్నన్'. ఈ సినిమా తెలుగులో నాయకుడుగా జులై 14న రిలీజ్ కానుంది. జూన్ 29న తమిళ్‌లో రిలీజైన ఈ మూవీ రూ.40కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసింది. రూలింగ్ పార్టీ లీడ‌ర్‌తో ఓ తండ్రీకొడుకులు సాగించిన‌ పోరాటం నేప‌థ్యంలో ఈ చిత్రాన్ని సెల్వరాజ్ తెరకెక్కించారు. ఈ సినిమాలో కీర్తి సురేష్ హీరోయిన్‌గా నటించింది. తొలిసారి కమెడియన్ వడివేలు ఎమ్మెల్యే పాత్రలో సీరియస్‌ రోల్ చేశాడు.  మహావీరుడు శివ కార్తికేయన్‌ లీడ్‌ రోల్‌లో మడోన్‌ అశ్విన్‌ డైరెక్ట్ చేసిన యాక్షన్‌ చిత్రం మహావీరుడు (Mahaveerudu).  ఈ మూవీ జులై 14న థియేటర్లలో రిలీజ్ కానుంది.  అదితి శంకర్‌ హీరోయిన్‌గా నటించింది. ఇప్పటికే ఈ చిత్రంపై ప్రచారాన్ని మూవీ యూనిట్ ప్రారంభించింది. శివ కార్తికేయన్‌ను మునుపెన్నడు చూడని పవర్‌ఫుల్ రోల్‌లో కనిపించనున్నట్లు మూవీ మేకర్స్ తెలిపారు. భారతీయన్స్‌: ది న్యూ బ్లడ్‌  ప్రముఖ రచయిత ధీన్ రాజ్ డైరెక్టర్‌గా మారి తీసిన చిత్రం 'భారతీయన్స్'.  ఈ సినిమా జులై 14న ప్రేక్షకుల ముందుకు రానుంది. భారత్- చైనా సరిహద్దుల్లో గల్వాన్ లోయ ఘర్షణల్లో  చైనా సైన్యానికి ఎదురొడ్డి నిలిచిన భారతీయ సైనికుల పోరాట పటిమ ఆధారంగా సినిమాను తెరకెక్కించారు. ఈ సినిమాలో నీరోజ్ పుచ్చా, సోనమ్ టెండప్, సుభా రంజన్, మహేందర్ బర్కాస్ హీరోలు. సమైరా సందు, రాజేశ్వరి చక్రవర్తి, పెడెన్ నాంగ్యాల్  ప్రధాన పాత్రల్లో నటించారు. ప్రేమంటే ఇదేరా, ప్రేమించుకుందాంరా, ఈశ్వర్, కలిసుందాంరా వంటి హిట్‌ చిత్రాలకు ధీన్‌ రాజ్ కథ అందించిన సంగతి తెలిసిందే.  మిషన్‌ ఇంపాజిబుల్‌: డెడ్‌ రికరింగ్‌ పార్ట్‌ 1 మిషన్‌ ఇంపాసిబుల్‌ సిరీస్‌తో ప్రేక్షకులను అలరించిన హాలీవుడ్‌ హీరో టామ్‌ క్రూజ్‌ కీలక పాత్రలో వస్తున్న చిత్రం మిషన్ ఇంపాసిబుల్: డెడ్ రెకనింగ్ (Mission Impossible Dead Reckoning)  క్రిస్టోఫర్‌, మెక్‌ క్యూరీ ఈ చిత్రాన్ని యాక్షన్‌ స్పై థ్రిల్లర్‌గా తెరకెక్కించారు. ఈ సినిమా రెండు భాగాలుగా విడుదల కానుంది. పార్ట్‌-1 జులై 12న రిలీజ్ కానుంది. ఇంగ్లీష్‌తో పాటు ఇతర ప్రాంతీయ భాషల్లో సినిమా సందడి చేయనుంది. ఈ వారంలో OTTల్లో రిలీజ్ కానున్న మరికొన్ని చిత్రాలు TitleCategoryLanguagePlatformRelease DateBird Box BarcelonaMovieEnglishNetflixJuly 14KoharaWeb SeriesHindiNetflixJuly 15Transformers: Rise of the Beasts movieEnglishPrimeJuly 11Mayabazaar For Sale Web SeriesteluguZEE5July 14Janaki Johnny Web SeriesMalayalamDisney + HotstarJuly 11The Trial Web seriesHindiDisney + HotstarJuly 14Crime Patrol – 48 HoursMovieHindiSony LivJuly 10College Romance July 25Web seriesHindiSony LivJuly 25
    జూలై 10 , 2023
    విరాన్ ముత్తంశెట్టి వ్యక్తిగత వివరాలు, ఎత్తు, పుట్టిన ప్రదేశం, బర్త్‌ డేట్‌, వయస్సు, సాధించిన విజయాలు, అవార్డులు, వ్యాపారాలు, ఇష్టాఇష్టాలు, అభిరుచులు తెలుసుకోండి. అలాగే విరాన్ ముత్తంశెట్టి కుటుంబ నేపథ్యం, తల్లిదండ్రులు, తోబుట్టువులు, రిలేషన్స్‌, విద్యా నేపథ్యం, కెరీర్ మైలురాళ్లు, తాజా ప్రాజెక్ట్‌లు, అధికారిక సోషల్ మీడియా అకౌంట్స్, లేటెస్ట్‌ చిత్రాలను ఒక్క క్లిక్‌తో ఇక్కడ తెలుసుకోండి.

    @2021 KTree